దేశీయ స్టాక్‌మార్కెట్లు ఈరోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. మంగళవారం స్వల్ప నష్టాలతో ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ బెంచ్ మార్క్ స్టాక్ సూచీలు బుధవారం నష్టాలను కాస్త పెంచుకున్నాయి.
ట్రేడింగ్ సెషన్ ప్రారంభ సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్ 284.38 పాయింట్లు లేదా 0.38 శాతం నష్టంతో 73,619.52 వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 90.45 పాయింట్లు లేదా 0.40 శాతం క్షీణతతో 22,362.85 వద్ద కొనసాగుతున్నాయి.
కొనసాగుతున్న విస్తరణలో భాగంగా వచ్చే మూడేళ్లలో రూ.32,400 కోట్ల వరకు పెట్టుబడి పెట్టనున్నట్టు ప్రకటించిన తర్వాత అల్ట్రాటెక్ సిమెంట్ దాదాపు 2 శాతం లాభపడింది. మరోవైపు భారతీ ఎయిర్‌టెల్, నెస్లే, సన్ ఫార్మా, కొన్ని సెలెక్టెడ్ బ్యాంకులు అత్యధికంగా నష్టపోయాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment