దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ నోట్‌లో ఈ వారం సెషన్‌ను ప్రారంభించాయి. దేశీయ బెంచ్‌మార్క్ స్టాక్ సూచీలు గురువారం ఫ్లాట్‌గా ముగిశాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సూచనలు ఉన్నప్పటికీ సోమవారం ఫ్లాట్ నోట్‌లో ప్రారంభమయ్యాయి.
ఉదయం 9:45 గంటల సమయంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 118 పాయింట్ల నష్టంతో 74,001 వద్ద ట్రేడ్ అవుతుండగా మరోవైపు నిఫ్టీ 13 పాయింట్ల క్షీణతతో 22,479 వద్ద ట్రేడవుతోంది.
అల్ట్రాటెక్ సిమెంట్, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఐటీసీ, ఏషియన్ పెయింట్స్ ముందు వరుస సూచీలకు మద్దతుగా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో, బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.31 శాతం జోడించగా, బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.14 శాతం పెరిగింది.
సెక్టార్లలో నిఫ్టీ రియాల్టీ, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ షేర్లు 1.7 శాతం వరకు పెరిగి టాప్ గెయినర్‌లలో ఉన్నాయి. అదే సమయంలో నిఫ్టీ మెటల్ నష్టాలకు దారితీసింది. 0.6 శాతం పడిపోయింది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment