దేశీయ స్టాక్ మార్కెట్లు శనివారం స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:47 సమయానికి నిఫ్టీ 68 పాయింట్లు లాభపడి 23,576కు చేరింది. సెన్సెక్స్ 267 పాయింట్లు ఎగబాకి 77,755 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్ 108.5 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 76.75 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.54 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.5 శాతం నష్టపోయింది. నాస్‌డాక్ 0.28 శాతం దిగజారింది.
ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ ముఖ్యాంశాలు
పార్లమెంట్‌లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2025-26ను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో శనివారం మార్కెట్‌లో పూర్తిస్థాయిలో ఓపెన్‌లో ఉంటాయి. 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా బడ్జెట్‌లో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment