
గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, తిథి: బ.అష్టమి ఉ.8.25 వరకు, తదుపరి నవమి, నక్షత్రం: అనూరాధ ప.12.50 వరకు, తదుపరి జ్యేష్ఠ, వర్జ్యం: సా.6.51 నుండి 8.31 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.47 నుండి 9.35 వరకు, తదుపరి ప.12.39 నుండి 1.27 వరకు, అమృత ఘడియలు: తె.5.04 నుండి 6.46 వరకు (తెల్లవారితే శనివారం); రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు, యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు, సూర్యోదయం: 6.28, సూర్యాస్తమయం: 5.59.
మేషం... వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. అనుకోని ప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.
వృషభం... పరిస్థితులు అనుకూలిస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వస్తులాభాలు. పనులు చకచకా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.
మిథునం.... పాతబాకీలు వసూలవుతాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. యత్నకార్యసిద్ధి. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.
కర్కాటకం... సన్నిహితుల నుండి «ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.
సింహం... కుటుంబంలో చికాకులు. మానసిక అశాంతి. బంధువులతో తగాదాలు. శ్రమ పెరుగుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది.
కన్య.... శుభవార్తలు వింటారు. ఆస్తులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందగోళం తొలగుతుంది.
తుల.... ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యవహారాలు ముందుకు సాగవు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
వృశ్చికం... కొన్ని శుభవార్తలు వింటారు. ఆస్తి వివాదాలు తీరతాయి ఆలోచనలు స్థిరంగా ఉండవు. విచిత్రమైన సంఘటనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు.
ధనుస్సు... బంధువుల నుండి సమస్యలు. దూరప్రయాణాలు. ఆరోగ్యం మందగిస్తుంది. పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.
మకరం... ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.
కుంభం.. ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వాహనాలు కొంటారు. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.
మీనం..... కుటుంబసభ్యులతో అకారణంగా విభేదాలు. పనుల్లో జాప్యం. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చికాకులు.
Comments
Please login to add a commentAdd a comment