today opening
-
సాక్షి మనీ మంత్ర: నష్టాలలో మార్కెట్లు.. టాప్ లూజర్స్‌లో ఎయిర్టెల్ ఇంకా..
దేశీయ స్టాక్‌మార్కెట్లు ఈరోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. మంగళవారం స్వల్ప నష్టాలతో ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ బెంచ్ మార్క్ స్టాక్ సూచీలు బుధవారం నష్టాలను కాస్త పెంచుకున్నాయి. ట్రేడింగ్ సెషన్ ప్రారంభ సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 284.38 పాయింట్లు లేదా 0.38 శాతం నష్టంతో 73,619.52 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 90.45 పాయింట్లు లేదా 0.40 శాతం క్షీణతతో 22,362.85 వద్ద కొనసాగుతున్నాయి. కొనసాగుతున్న విస్తరణలో భాగంగా వచ్చే మూడేళ్లలో రూ.32,400 కోట్ల వరకు పెట్టుబడి పెట్టనున్నట్టు ప్రకటించిన తర్వాత అల్ట్రాటెక్ సిమెంట్ దాదాపు 2 శాతం లాభపడింది. మరోవైపు భారతీ ఎయిర్టెల్, నెస్లే, సన్ ఫార్మా, కొన్ని సెలెక్టెడ్ బ్యాంకులు అత్యధికంగా నష్టపోయాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: లాభాల్లోకి స్టాక్‌మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లోకి వచ్చాయి. క్రితం నష్టాలతో ముగిసిన బెంచ్ మార్క్ సూచీలు ఈరోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెషన్ ప్రారంభ సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 182.35 పాయింట్లు లేదా 0.25 శాతం లాభంతో 72,652.65 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 57.40 పాయింట్లు లేదా 0.26 శాతం లాభంతో 22,062.10 వద్ద కొనసాగుతున్నాయి. బీపీసీల్, రిలయన్స్, అదానీ పోర్ట్స్, మారుతీ సుజుకీ, హెచ్‌యూఎల్ షేర్లు మంచి లాభాలతో టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఐషర్ మోటర్స్, భారతీ ఎయిర్టెల్, విప్రో, కోటక్ మహీంద్ర షేర్లు టాప్ లూజర్స్ జాబితాలో ఉన్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: ఫ్లాట్‌గా స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ నోట్లో ఈ వారం సెషన్‌ను ప్రారంభించాయి. దేశీయ బెంచ్‌మార్క్ స్టాక్ సూచీలు గురువారం ఫ్లాట్‌గా ముగిశాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సూచనలు ఉన్నప్పటికీ సోమవారం ఫ్లాట్ నోట్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:45 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 118 పాయింట్ల నష్టంతో 74,001 వద్ద ట్రేడ్ అవుతుండగా మరోవైపు నిఫ్టీ 13 పాయింట్ల క్షీణతతో 22,479 వద్ద ట్రేడవుతోంది. అల్ట్రాటెక్ సిమెంట్, భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఐటీసీ, ఏషియన్ పెయింట్స్ ముందు వరుస సూచీలకు మద్దతుగా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో, బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.31 శాతం జోడించగా, బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.14 శాతం పెరిగింది. సెక్టార్లలో నిఫ్టీ రియాల్టీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ షేర్లు 1.7 శాతం వరకు పెరిగి టాప్ గెయినర్లలో ఉన్నాయి. అదే సమయంలో నిఫ్టీ మెటల్ నష్టాలకు దారితీసింది. 0.6 శాతం పడిపోయింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు.. సూచీలు ఆల్‌టైమ్ హై!
దేశీయ స్టాక్‌మార్కెట్ల లాభాల ర్యాలీ కొనసాగుతోంది. క్రితం రోజు లాభాలతో ముగిసిన దేశీయ ప్రధాన సూచీలు ఈరోజు సరికొత్త ఆల్ టైమ్ గరిష్టాలను తాకాయి. నిఫ్టీ తొలిసారిగా 21,700 మార్కును అధిగమించగా, సెన్సెక్స్ 72,300 మార్కుకు చేరుకుంది. మీడియా, రియాల్టీ మినహా చాలా రంగాల్లో కొనుగోలు చర్య కనిపించింది. ఉదయం ట్రేడింగ్ ప్రారంభ సమయానికి సెన్సెక్స్ 72,362.95 పాయింట్ల వద్ద, నిఫ్టీ 21,715 పాయింట్ల వద్ద కొనసాగుతున్నాయి. హీరో మోటర్‌కార్ప్, మహీంద్రా& మహీంద్రా, అపోలో హాస్పిటల్స్, ఎన్టీపీసీ, టైటాన్ కంపెనీల షేర్లు టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. మరోవైపు యాక్సిస్ బ్యాంక్, ఐచర్ మోటర్స్, ఇన్ఫోసిస్, అదానీ ఎంటర్‌ప్రైజస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ షేర్లు నష్టాలతో టాప్ లూజర్స్‌గా నిలిచాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
ఈ పనులతో ‘వన’గూరేదేమిటో!
నామమాత్రపు అభివృద్ధికి ప్రచార్భాటాలెన్నో.. నేడు ప్రారంభోత్సవాలకు వస్తున్న సీఎం చంద్రబాబు ‘‘రాజమహేంద్రవరం ప్రజలకు శాశ్వతంగా గుర్తుండిపోయేలా ఏదొకటి చేయాలనే ఆలోచనతో గోదావరి మహాపుష్కర వనానికి అంకురార్పణ చేస్తున్నా’’ గోదావరి మహాపుష్కరాల సమయంలో సీఎం చంద్రబాబు అన్న మాటలివి..అంతే కాదు పుష్కరాల ఆఖరిరోజు లాలాచెరువులోని రిజర్వు ఫారెస్టు ఏరియాలో సుమారు 250 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న గోదావరి మహాపుష్కర వనానికి ఆయన శంకుస్థాపన కూడా చేశారు. ఏడాది అనంతరం.. ప్రస్తుత ఈ పుష్కర వనంలో చేపట్టిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు మరోసారి సీఎం చంద్రబాబు వస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న నగర వాసులు కొందరు పుష్కర వనంలో చేసిన పనులను చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. – లాలాచెరువు(రాజానగరం) హడావిడిగా అభివృద్ధి పనులు గోదావరి మహాపుష్కర వనానికి శంకుస్థాపన చేసి ఏడాదిన్నర కావొస్తున్న తరుణంలో ప్రారంభోత్సవాలకు వస్తున్న సీఎం కోసం ఆగమేఘాలపై ముఖద్వారాన్ని భారీ వృక్షాలతో కూడిన స్వాగత ద్వారంగా నిర్మించారు. సుమారు 230 ఎకరాల్లో అభివృద్ధి చేయాల్సిన పుష్కర వనాన్ని ఇంత వరకూ పట్టించుకోని అధికారులు ప్రస్తుతం హడావిడిగా ప్రహరీ, ముఖద్వారం నిర్మాణాలు చేపట్టారు. ఈ ప్రాంగణంలో ఎప్పటి నుంచో ఉన్న బొటానికల్ గార్డె¯ŒS, ఆయుర్వేద మొక్కల పెంపకం, వివిధ రకాల వృక్షజాతుల అభివృద్ధి క్షేత్రం వంటి వాటిని కొన్నేళ్లుగా గాలికొదిలేసిన అధికారులు ఇప్పుడు వాటికి రంగులు అద్దిస్తూ పుష్కర వనంలో వాటిని కూడా కలిపేస్తున్నారు. రూ.18 లక్షల వ్యయంతో మెరై¯ŒS మ్యూజియంను అభివృద్ధి చేశారు. ఫారెస్టు అకాడమీకి సీఎం శంకుస్థాపన చేసే అవకాశాలున్నాయని అధికారులు అంటున్నారు. అభివృద్దికి నోచుకోని ’రాశి’ వనం ఈ వనంలో మీ రాశిలను బట్టి మొక్కలను నాటి మీ జాతకాన్ని మార్చుకోండంటూ సీఎం స్వయంగా శ్రీకారం చుట్టిన ’రాశి’ వనం అభివృద్ధిలో నాటికీ నేటికీ పెద్దగా వ్యత్యాసం లేదు. నాడు ’రాశి’ వనంలో సీఎంతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నాటిన మొక్కలు మినహా ఇంతవరకు అదనంగా రాశి వనాన్ని విస్తరించించలేదు. ఈ ప్రాంతంలో ఇంతవరకు ప్రత్యేక బోర్డుగాని, వచ్చిన వారికి సమాధానం చెప్పేవారుగాని లేరు. రూ.99 లక్షల నిధులు కేటాయించారు పుష్కర వనానికి ఈ సంవత్సరం బడ్జెట్లో కేవలం రూ.99 లక్షలు నిధులు కేటాయించారు. వీటిలో కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.43 లక్షలు మాత్రమే విడుదల కావడంతో వాటితోనే ప్రస్తుత అభివృద్ధి పనులు పూర్తి చేస్తున్నామని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావలసిన రూ.56 లక్షలు వస్తే మరిన్ని అభివృద్ధి పనులు జరిగే అవకాశం ఉంటుంది. అభివృద్ది పనులు జరుగుతున్నాయి గోదావరి మహాపుష్కర వనానికి ప్రభుత్వం రూ.99 లక్షల వరకు నిధులు కేటాయించింది. ఈ నిధులతో ఏయే పనులు చేయాలో హెడ్ ఆఫ్ ది డిపార్టుమెంట్ నిర్ణయించిన మేరకు కాంపౌండ్ వాల్‌తో రెండు ఆర్చ్ (ముఖద్వారాలు)లు, యోగా లా¯ŒS నిర్మిస్తున్నాం. అలాగే సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. రాశి, నక్షత్ర వనాలను అభివృద్ధి చేసి, వాకింగ్, సైకిలింగ్ పార్కులు ఏర్పాటుచేస్తాం. ఆటోనగర్ వైపు భద్రతాపరంగా ఫెన్సింగ్ వేస్తున్నాం. సోలార్ లైట్స్, టికెట్ కౌంటర్స్ ఏర్పాటుకు అనుమతి వచ్చింది. ప్రస్తుతం ఉన్న సై¯Œ్స ల్యాబ్, నేచరల్ స్టడీ సెంటర్స్‌ని పాడుచేయకుండా మరింత అభివృద్ధి చేస్తాం. అలాగే మెరై¯ŒS మ్యూజియం ఒకటి ఏర్పాటుచేస్తున్నాం. – ప్రభాకరరావు, డీఎఫ్ఓ వైల్డ్ లైఫ్, రాజమహేంద్రవరం -
రెండురాష్ట్రాల వారధిగా నిలుస్తుంది
మట్టపల్లి(మఠంపల్లి), న్యూస్‌లైన్: మట్టపల్లి వద్ద కృష్ణానదిపై *50 కోట్లతో నిర్మించనున్న హైలెవల్ వంతెన త్వరలో ఏర్పడబోయే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నడుమ వారధిగా నిలుస్తుందని రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మఠంపల్లి మండలం మట్టపల్లి వద్ద హైలెవల్ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న పైలాన్‌ను శుక్రవారం నాడాయన పరిశీలించారు. అక్కడ నుంచి కృష్ణానదిలో బల్లకట్టుపై ప్రయాణించి వంతెన నిర్మించే ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం శ్రీలక్ష్మీనర్సింహస్వామి దేవాలయ సమీపంలో ఏర్పాటు చేయనున్న సభాస్థలిని కూడా పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. శనివారం రాష్ట్ర మంత్రి గీతారెడ్డితో కలిసి ఈ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. అనంతరం బహిరంగసభ జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం మట్టపల్లి, గుంటూరు జిల్లా తంగెడ రేవుల నడుమ సరిహద్దుగా ఉన్న కృష్ణానదిపై నిర్మించనున్న ఈ వంతెన సుమారు 18 నెలల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బీఓటీ పద్ధతిన కాకుండా పూర్తిస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మాణం పూర్తి కాగలదన్నారు. మరికొద్ది రోజుల్లో తెలంగాణ- ఆంధ్ర రాష్ట్రాల నడుమ ప్రధాన వారధిగా నిలుస్తుందన్నారు. కృష్ణపట్టె ప్రాంతంలో అపారమైన సున్నపురాయి గనులు నిక్షిప్తమై సిమెంట్ పరిశ్రమలు ఏర్పాటు కావడం, మట్టపల్లి సమీపంలో మఠంపల్లి వద్ద రైల్వేస్టేషన్ ఏర్పాటు కావడం ఈ ప్రాంత అభివృద్ధికి శుభసూచికమన్నారు. తాను శక్తి వంచన లేకుండా ఈ ప్రాంతాభివృద్ధికి కృషి చేస్తున్నానని తెలిపారు. ఆయన వెంట ఏపీఎస్ఐడీసీ డెరైక్టర్ సాముల శివారెడ్డి, హుజూర్నగర్ మార్కెట్ చైర్మన్ యరగాని నాగన్నగౌడ్, బ్లాక్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు అరుణ్‌కుమార్ దేశ్‌ముఖ్, భూక్యా మంజీనాయక్, పీఏసీఎస్ చైర్మన్ గాదె ఎలియాస్‌రెడ్డి, ఏఐసీసీ నియోజకవర్గ మీడియా ఇన్చార్జ్ తన్నీరు మల్లికార్జున్, సర్పంచ్‌లు కనగాల శ్రీనివాసరావు, బుజ్జి భీముడునాయక్, మాజీ ఎంపీటీసీ దాసరి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.