ఈ రాశి వారి శ్రమ ఫలిస్తుంది.. నూతన ఉద్యోగప్రాప్తి | Today Telugu Horoscope On December 27th, 2024: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారి శ్రమ ఫలిస్తుంది. నూతన ఉద్యోగప్రాప్తి

Published Fri, Dec 27 2024 5:36 AM | Last Updated on Fri, Dec 27 2024 9:30 AM

Daily Horoscope On 27th December 2024 In Telugu

  గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం, తిథి: బ.ద్వాదశి రా.1.24 వరకు, తదుపరి త్రయోదశి, నక్షత్రం: విశాఖ రా.8.05 వరకు, తదుపరి అనూరాధ, వర్జ్యం: రా.12.26 నుండి 2.10 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.44 నుండి 9.32 వరకు తదుపరి ప.12.26 నుండి 1.14 వరకు, అమృతఘడియలు: ఉ.10.18 నుండి 12.03 వరకు.

సూర్యోదయం :    6.32
సూర్యాస్తమయం    :  5.29
రాహుకాలం : ఉ.10.30
నుండి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుండి 4.30 వరకు 

మేషం: కొన్ని పనులు వాయిదా పడతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. రుణదాతల ఒత్తిళ్లు. వ్యాపార లావాదేవీలలో ఆటంకాలు. ఉద్యోగాలలో అదనపు పనిభారం.

వృషభం: మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వస్తులాభాలు. పాతమిత్రుల నుంచి ఆహ్వానాలు. భూలాభాలు కలుగుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

మిథునం: శ్రమ ఫలిస్తుంది. నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవం లభిస్తుంది.  మిత్రులు, బంధువులతో సఖ్యత. ఇంటాబయటా ప్రోత్సాహం. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.

కర్కాటకం: సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసమస్యలు వేధిస్తాయి. అనారోగ్యం. వ్యాపారాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో పనిభారం పెరుగుతుంది.

సింహం: మిత్రుల నుంచి ఒత్తిళ్లు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. పనులు ముందుకు సాగక నిరాశ చెందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో శ్రమాధిక్యం..

కన్య: పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో ఆదరణ పొందుతారు. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనయోగం. వ్యాపారాలలో నూతనోత్సాహం. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

తుల: రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు. పనులు నెమ్మదిగా సాగుతాయి. వ్యాపారాలలో తొందరపాటు వద్దు. ఉద్యోగాలలో మార్పులు.

వృశ్చికం: కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులు పరిచయం. సత్కారాలు జరుగుతాయి. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

ధనుస్సు: శ్రమ తప్పకపోవచ్చు. అనుకోని ప్రయాణాలు. పనుల్లో ప్రతిబంధకాలు. కొత్త రుణయత్నాలు. బందువులతో తగాదాలు. వ్యాపార లావాదేవీలలో నిరాశ. ఉద్యోగాలలో కొన్ని చిక్కులు. దైవదర్శనాలు.

మకరం: కొత్త వ్యక్తుల పరిచయం. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పనుల్లో విజయం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో ప్రమోషన్లు దక్కుతాయి. విందువినోదాలు.

కుంభం: ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. పరిచయాలు పెరుగుతాయి. ఆస్తుల ఒప్పందాలు. వృత్తి, వ్యాపారాలలో ఇబ్బందులు తొలగుతాయి.

మీనం: ఆర్థిక విషయాలలో హామీలు వద్దు. ప్రయాణాలు సంభవం. పనులు ముందుకు సాగవు. శ్రమపడ్డా ఫలితం ఉండదు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement