Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Sensation in Formula E Car Race: Greenko BRS Bond Out1
ఇది రేవంత్‌ టీం చేస్తున్న దుష్ప్రచారం: కేటీఆర్‌

హైదరాబాద్, సాక్షి: ఫార్ములా ఈ రేస్‌ కేసులో సంచలన విషయం వెలుగు చూసింది. రేసుకు స్పాన్సర్‌షిప్‌ చేసిన గ్రీన్‌కో కంపెనీ నుంచి అప్పటి అధికార పార్టీ బీఆర్‌ఎస్‌(BRS)కు లబ్ధిచేకూరినట్లు తెలుస్తోంది. ఆ లావాదేవీలు చందాలు, ఎన్నికల బాండ్ల రూపంలో వెళ్లినట్లు సమాచారం.ఎన్నికల బాండ్ల రూపంలో గ్రీన్‌‌కో(Greenko), దాని అనుబంధ సంస్థల నుంచి బీఆర్‌ఎస్‌కు మొత్తం రూ.49 కోట్లు ముట్టాయి. ఇందులో 2022, 8 ఏప్రిల్ నుంచి అక్టోబర్ 10 మధ్య 41 సార్లు రూ.కోటి చొప్పున ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసింది. అలాగే.. రేసుకు సంబంధించిన చర్చలు మొదలయినప్పటి నుంచే ఈ కొనుగోలు వ్యహారం నడిచినట్లు తేలింది. ఈ మేరకు ఈ విషయాన్ని తాజాగా ప్రభుత్వం బయటపెట్టింది. ఇదిలా ఉంటే.. ఫార్ములా ఈ రేస్‌ కేసును అవినీతి కోణంలో తెలంగాణ ఏసీబీ, ఫెమా ఉల్లంఘనలపై ఈడీ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే.కేటీఆర్‌ స్పందనబీఆర్‌ఎస్‌కు గ్రీన్‌కో ఎన్నికల బాండ్ల అంశంపై కేటీఆర్‌ స్పందించారు. ‘‘గ్రీన్‌కో 2022లో ఎన్నికల బాండ్లు ఇచ్చింది. 2023లో ఫార్ములా-ఈ రేసు జరిగింది. కాంగ్రెస్‌, బీజేపీకి కూడా గ్రీన్‌కో బాండ్లు ఇచ్చింది. ఫార్ములా ఈ రేసు వల్ల గ్రీన్‌కో నష్టపోయింది. అందుకే మరుసటి ఏడాది స్పాన్సర్‌షిప్‌ నుంచి నుంచి తప్పుకుంది. అది క్విడ్‌ ప్రోకో ఎలా అవుతుంది?. ఇది రేవంత్‌ టీం చేస్తున్న దుష్ప్రచారం. పార్లమెంట్‌ ఆమోదించిన బాండ్లు అవినీతి ఎలా అవుతుంది?. అన్ని పార్టీలకు వచ్చిన బాండ్లపై చర్చకు సిద్ధం. ’’ అని అన్నారాయన. హైదరాబాద్‌లో ఫార్ములాఈ రేస్‌ నిర్వహణకు సంబంధించి.. యూకేకు చెందిన ఫార్ములా ఈఆపరేషన్స్‌ (FEO)కు సుమారు రూ.45.71 కోట్లను తెలంగాణ మున్సిపల్‌ శాఖ(MAUD) తరఫున హెచ్‌ఎండీఏ చెల్లించింది. ఈ చెల్లింపుల్లో ఉల్లంఘనలు జరిగాయంటూ ఇటీవల ఎంఏయూడీ ముఖ్య కార్యదర్శి దానకిశోర్‌ ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఫైనాన్స్‌ ఆమోదం పొందకుండానే.. హెచ్‌ఎండీఏ ఛైర్మన్‌ అయిన ముఖ్యమంత్రికి ఫైల్‌ పంపకుండానే.. ఆర్‌బీఐ అనుమతి తీసుకోకుండానే ఈ చెల్లింపులు జరిగాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. లండన్‌లోని ఎఫ్‌ఈవో ఖాతాకు బ్రిటన్‌ పౌండ్ల రూపంలోకి మార్చి సొమ్ము బదిలీ చేసిన క్రమంలో ఆదాయపన్ను మినహాయించలేదని.. అందువల్ల ఆదాయపన్ను శాఖకు రూ.8.06 కోట్లను హెచ్‌ఎండీఏ చెల్లించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈ ఉల్లంఘనల వెనక ఏమైనా మతలబులున్నాయేమో తేల్చాలని కోరారు.ఈ ఘటనల్లో అప్పటి మంత్రి, ఎంఏయూడీ అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హెచ్‌ఎండీఏ అప్పటి చీఫ్‌ ఇంజినీర్ల పాత్ర ఉండటంతో అవినీతి కోణంలో ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టింది. అలాగే.. విదేశీ సంస్థకు నిధుల బదిలీ వెనక ఫెమా ఉల్లంఘనలతో పాటు నిధుల అంతిమ లబ్ధిదారులెవరనే కోణంలో ఈడీ దర్యాప్తు ఆరంభించింది.ఇదీ చదవండి: ఫార్ములా ఈ రేస్‌.. ఇదో లొట్టపీసు కేసు!

3-Month-Old And 8-Month-Old Babies Diagnosed With HMPV In Bengaluru2
భారత్‌లో రెండు HMPV వైరస్‌ కేసులు.. ధృవీకరించిన ఐసీఎంఆర్‌

బెంగళూరు: చైనా (China)లో కలకలం సృష్టిస్తున్న హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్ (HMPV) కేసులు భారత్‌లో నమోదయ్యాయి. బెంగళూరుకు చెందిన బాపిస్ట్‌ ఆస్పత్రిలో మూడు, ఎనిమిది నెలల చిన్నారుల్లో ఈ వైరస్‌ను గుర్తించినట్లు ఐసీఎంఆర్‌ (icmr) దృవీకరించింది. వీరిలో ఒక చిన్నారికి వైరస్‌ తగ్గుముఖం పట్టిందని, మరొకరికి చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది. అయితే, చిన్నారుల కుటుంబ సభ్యులు విదేశాలకు వెళ్లిన చరిత్ర లేదని కర్ణాటక ఆరోగ్యశాఖ వెల్లడించింది. అప్రమత్తమైన కేంద్రం చైనాలో పెరిగిన హెచ్‌ఎంపీవీ కేసులతో పాటు ఇతర శ్వాసకోశ వైరస్‌లను పర్యవేక్షిస్తున్నట్లు కేంద్రం ఆదివారం ప్రకటించింది. ఇప్పటికే ఆ వైరస్‌ వ్యాప్తితో దేశంలో తలెత్తే పరిస్థితులపై అంచనా వేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ,నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఇతర ఆరోగ్య సంస్థల ప్రతి నిధులు జనవరి 4న జరిగిన జాయింట్ మానిటరింగ్ గ్రూప్‌ సమావేశంలో పాల్గొన్నారు. వైరస్‌ టెస్ట్‌ల కోసంముందు జాగ్రత్తగా, కేంద్రం హెచ్‌ఎంపీవీ టెస్ట్‌ల కోసం ప్రయోగశాల సామర్థ్యాన్ని పెంచింది. ఐసీఎంఆర్‌ ఏడాది పొడవునా హెచ్‌ఎంపీవీ ధోరణులను పర్యవేక్షిస్తుంది. ఇన్ఫ్లుఎంజా, అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్లతో పాటు ఇతర శ్వాసకోశ వ్యాధులను గుర్తించేలా ఐసీఎంఆర్‌, ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ ద్వారా దేశవ్యాప్తంగా శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌లను ట్రాక్ చేసేలా సంబంధిత శాఖలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.వైరస్‌ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలుచైనాలో గుర్తించిన హ్యూమన్‌ మెటా న్యూమో వైరస్‌ (హెచ్‌ఎంపీవీ) వైరస్‌ వ్యాప్తి భారత్‌లో ఆందోళన కలిగిస్తోంది. అయితే ఈ వైరస్‌ వ్యాప్తిపై ఆందోళన చెందవద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులతో పాటు వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిపై వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వివరించారు. వైరస్‌ సోకిన వ్యక్తుల నోటి నుంచి వెలువడే తుంపర్లు, ఇతరులతో సన్నిహితంగా మెలగటం, కరచాలనం, స్పర్శ వంటి చర్యల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని పేర్కొంది. ఇక వైరస్‌ సోకిన 3–10 రోజుల్లోపు వ్యాధి లక్షణాలు బయటపడతాయని తెలిపారు. ఇప్పటివరకు ఈ వ్యాధి సోకిన వారికి నిర్దిష్టమైన యాంటీ వైరల్‌ చికిత్సలేదని.. వ్యాక్సిన్లు కూడా అభివృద్ధి చేయలేదని, ఆరోగ్య సంరక్షణ కోసం నొప్పి నివారణ మందులు, ఆక్సిజన్‌ థెరపీ చేపడుతున్నారు. The Indian Council of Medical Research (ICMR) has detected two cases of Human Metapneumovirus (HMPV) in Karnataka. Both cases were identified through routine surveillance for multiple respiratory viral pathogens, as part of ICMR's ongoing efforts to monitor respiratory illnesses… pic.twitter.com/PtKYmgztKb— ANI (@ANI) January 6, 2025వైరస్‌ వ్యాప్తితో దగ్గు, ముక్కు దిబ్బడ, ముక్కు కారడం, గొంతు నొప్పి, శ్వాస సంబంధిత సమస్యలుంటాయి. కొన్నిసార్లు న్యూమోనియా, బ్రాంకైటిస్‌ (ఆస్తమా) వంటి శ్వాసకోశ సమస్యలకు దారితీస్తుంది.తీసుకోవాల్సిన జాగ్రత్తలు» 20 సెకన్లపాటు సబ్బు నీటితో తరచూ చేతులను శుభ్రంగా చేసుకోవాలి.» తుమ్మినా, దగ్గినా నోరు, ముక్కుకు రుమాలును అడ్డుపెట్టుకోవాలి. » రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండాలి. » తగినంత పౌష్టికాహారం, మంచినీరు తీసుకోవడంతో పాటు, నిద్రపోవాలి.» వైరస్‌ లక్షణాలు కన్పించిన వెంటనే క్వారంటైన్‌లో ఉండాలి. » లక్షణాలు కన్పిస్తున్న వ్యక్తులు ఇతరులతో కరచాలనం చేయరాదు.

KSR Comments Over Talliki Vandanam Scheme And Yellow Media3
‘తల్లికి వందనం’.. బాబు సర్కార్‌కు ఎల్లో మీడియా జాకీలు!

‘నీకు పదిహేను వేలు.. నీకు పదిహేను వేలు.. చిట్టి పాపా.. నీకు కూడా పదిహేను వేలు..’ ఏపీలో ఈ మధ్య బాగా ప్రచారంలోకి వచ్చిన డైలాగు. ప్రస్తుత మంత్రి నిమ్మల రామానాయుడు సైకిల్ వేసుకుని ఇంటింటికి వెళ్లి మరీ మహిళలు, పిల్లలందరికీ ఈ వాగ్ధానమిచ్చారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రాగానే డబ్బులు తీసుకోవడమే ఆలస్యం అన్నట్లు మాట్లాడారు. యువతులు, గృహిణులు ఎవరు కనిపించినా.. ‘‘మీకు పద్దెనిమిది వేలు’’ అని, వలంటీర్ల దగ్గరకు వెళ్లి ‘‘మీకు నెలకు పదివేలు ఖాయం’’ అంటూ ఎన్నికల మేనిఫెస్టో కరపత్రం అందించి మరీ చెప్పి వచ్చేవారు.వైఎస్‌ జగన్‌ విజయవంతంగా అమలు చేసిన ‘అమ్మ ఒడి’కి నకలుగా టీడీపీ ‘తల్లికి వందనం’ పేరుతో ఓ పథకాన్ని ఎన్నికల హామీగా ప్రకటించిన విషయం తెలిసిందే. వైఎస్‌ జగన్‌ కుటుంబంలో తల్లికి మాత్రమే నగదు ఇచ్చేవాడని, తాము అధికారంలోకి వస్తే ఇంట్లో ఉన్న ప్రతీ బిడ్డకూ రూ.15 వేలు చొప్పున ఇస్తామని నమ్మబలికింది కూటమి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లతోపాటు నిమ్మల రామానాయుడు వంటి టీడీపీ నేతలు ఈ హామీకి విస్తృతంగా ప్రచారం చేశారు.చంద్రబాబు ఒక అడుగు ముందుకు వేసి ఓపిక ఉంటే ఇంకా పిల్లలను కనండని, వారికి కూడా ఆర్థిక సాయం చేస్తామని ఊదరగొట్టారు. ఇద్దరు పిల్లలు ఉంటే రూ.30 వేలు, ముగ్గురుంటే రూ.45 వేలు నలుగురుంటే రూ.60 వేలు అంటూ పేద కుటుంబాలను ఊరించారు. చివరకు కూటమి అధికారంలోకి వచ్చింది కానీ.. పేద, మధ్య తరగతి ప్రజలకు మాత్రం ఎక్కాలు చెప్పుకోవడమే తప్ప, లెక్క (డబ్బు) అందలేదు. ఈ మార్చిలోగా ఇస్తారేమోలే అని పలువురి ఆశలపై నీళ్లు చల్లుతూ చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశం ఇప్పుడు తల్లికి వందనం పెట్టడం లేదని తేల్చేసింది. వచ్చే జూన్‌లో చేస్తామని ప్రకటించింది. అంటే జనం అమాయకులు, పిచ్చోళ్లు, వారికి ఏమీ తెలియదు.. తాము ఏ అబద్దం చెబితే దానిని నమ్ముతారన్నది కూటమి పెద్దల విశ్వాసం. అందుకే ధైర్యంగా ఈ ప్రకటన చేశారనుకోవాలి.తల్లికి వందనం స్కీమ్‌ దేని కోసం ప్రకటించారు?. పేద పిల్లలు స్కూల్ మానకుండా, విద్యను ఎంకరేజ్ చేయడం కోసం గత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ అమ్మ ఒడి స్కీమ్ తెచ్చారు. దీనికి ప్రజలలో విపరీతమైన ఆదరణ లభించింది. స్కూళ్లకు వెళ్లే విద్యార్ధుల సంఖ్య పెరిగింది. ఇదే సమయంలో ప్రభుత్వ స్కూళ్లను బాగా అభివృద్ది చేయడం, ప్రైవేటు స్కూళ్లకు పోటీగా తీర్చి దిద్దడం, డిజిటల్ విద్య, గోరుముద్ద తదితర కార్యక్రమాలను వైఎస్‌ జగన్ ప్రభుత్వం అమలు చేసింది. దాంతో ఈ స్కీమ్‌ను కాపీ కొట్టి, తామైతే పిల్లలందరికీ రూ.15 వేల చొప్పున ఇస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రకటించారు. సాధారణంగా ప్రతీ ఏడాది జూన్ నెలలో ఈ మొత్తాలను తల్లుల ఖాతాలోకి వేయవలసి ఉంది.వైఎస్‌ జగన్ అమలు చేసిన అమ్మ ఒడి స్కీమ్‌కు సుమారు రూ.6000 కోట్ల వ్యయం అయితే.. టీడీపీ, జనసేనలు చెప్పిన వాగ్దానం ప్రకారం సుమారు రూ.13 వేల కోట్ల వరకు వ్యయం అవుతుంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి ఏడు నెలలు గడిచినా తల్లికి వందనం పథకాన్ని అమలు చేయలేదు. ఏదో రకంగా ఈ పథకాన్ని ఎగవేయడమో లేక బాగా కోత పెట్టి అమలు చేయడానికో కసరత్తులు చేస్తున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. కాని అదీ లేదు.. ఇదీ లేదు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్ చెప్పినట్లు తాము పలావు పెడుతుంటే, బిర్యానీ తినిపిస్తామని చంద్రబాబు, పవన్ ప్రచారం చేశారు. ఇప్పుడు పలావు పోయే.. బిర్యానీ రాకపోయే.. అని పిల్లలు, తల్లులు ఉసూరుమంటున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా కొనసాగి ఉంటే 2024 జూన్‌లోనే అమ్మ ఒడి డబ్బులు అందేవి కదా అన్నది ప్రజల భావన.తల్లికి వందనం మాత్రమే కాదు.. మరి కొన్ని స్కీములను కూడా ఇలాగే నీరు కార్చే పనిలో ప్రభుత్వం ఉందని మంత్రివర్గ నిర్ణయాలు తెలియచేస్తున్నాయి. అన్నదాత సుఖీభవ కింద రైతులకు రూ.20వేల చొప్పున ఇస్తామన్నది ఎన్నికల హామీ అయితే, ఇప్పుడు కేంద్రం ఇచ్చే రూ.10 వేలకు మరో రూ.10వేలు జత చేసి ఇస్తామని చెబుతున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రైతు భరోసా కింద రూ.12 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పి ఆ ప్రకారం ఏటా అందించింది. నాలుగేళ్లు ఇస్తామని అన్నా, ఐదేళ్లు చెల్లించింది. అప్పట్లో కూడా కేంద్రం ఇచ్చిన ఆరు వేలతో కలిపి ఈ మొత్తాన్ని ఇస్తే ఇదే చంద్రబాబు, పవన్ తీవ్ర విమర్శలు గుప్పించారు.కేంద్రం ఇచ్చేదానితో సంబంధం లేకుండా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రైతు భరోసా రూ.12 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసేవారు. ఇప్పుడు మాత్రం కేంద్రం ఇచ్చే పది వేలతో కలిపి ఇస్తామంటున్నారు. అంటే వారు గతంలో చెప్పిన దానిని పరిగణనలోకి తీసుకుంటే రైతులకు పది వేల రూపాయలు ఎగవేస్తున్నారన్నమాట. ఈ పథకాన్ని త్వరలో అమలు చేస్తామని అన్నారే తప్ప స్పష్టంగా నిర్దిష్ట తేదీని చెప్పలేకపోయారు. కూటమి ప్రభుత్వం ఈ పంటల సీజన్‌లో రైతులకు ఎలాంటి ఆర్థిక సాయం ఇవ్వలేదు. పైగా ఉన్న ఉచిత బీమా సదుపాయాన్ని కూడా ఎగవేసింది.తల్లికి వందనం, రైతు భరోసా తర్వాతే మహిళలకు ఉచిత బస్ సదుపాయం కల్పించనున్నారని కొత్త లింక్ పెడుతున్నారు. అంటే ఆ రెండు స్కీమ్‌లు ఎప్పుడు ఇస్తారో, ఈ బస్ స్కీమ్ ఎప్పటికి అమలు అవుతుందో దేవుడికే ఎరుక. కాకపోతే ఈలోగా ప్రజలను మాయ చేసే పనిలో బిల్డప్ బాబాయిలు, జాకీ మీడియాగా ఉన్న ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా దూసుకెళ్తోంది. జూన్‌లోగా తల్లికి వందనం అని శీర్షికను ఈనాడు పెడితే, తల్లికే తొలి వందనం అంటూ ఆంధ్రజ్యోతి బిల్డప్ ఇచ్చింది. అంతే తప్ప ఈ ఏడాదికి ఎగనామం పెట్టారని రాయలేదు. పైగా ఈనాడు వారు ఏం బిల్డప్ ఇచ్చారో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఎన్నికలలో ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తూ వస్తున్న ప్రభుత్వం మరో రెండు పధకాలను అమలు చేయబోతోందని నిస్సిగ్గుగా రాసింది. ఇప్పటికీ ఒక్క పెన్షన్‌లను వెయ్యి రూపాయలు పెంచడం మినహా మిగిలినవి ఏవీ అమలు చేయలేదని జనం గగ్గోలు పెడుతుంటే, ఈనాడు మీడియా రాతలు ఇలా ఉన్నాయి.ఈ ప్రభుత్వం విద్యా వ్యవస్థను గందరగోళంలోకి నెడుతోంది. డీఎస్సీని ఆరు నెలల్లో అమలు చేస్తామని గతంలో చెప్పిన చంద్రబాబు నాయుడు తాజాగా వచ్చే జూన్‌కు డీఎస్సీ పూర్తి చేస్తామని అంటున్నారు. నిజానికి అప్పటికి కూడా అది జరగకపోవచ్చని టీడీపీ మీడియానే కథనాలు ఇచ్చింది. ఎస్సీ వర్గీకరణ తదితర సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. మహిళా శక్తి కింద ప్రతి మహిళకు రూ.1500 చొప్పున ప్రతి నెల ఇవ్వాల్సి ఉంది. కానీ, ఇప్పటివరకు ప్రభుత్వం దాని జోలికి వెళ్లలేదు. నిరుద్యోగ భృతి అతీగతి లేదు.ఎన్నికల మేనిఫెస్టో దగ్గర పెట్టుకుని జాకీ మీడియా ఏయే హామీలు అమలు చేసింది చెప్పగలిగితే విశ్వసనీయత వస్తుంది. అంతే తప్ప కేవలం చంద్రబాబు ప్రభుత్వాన్ని జాకీ పెట్టి లేపడం కోసం కథనాలు ఇస్తే ప్రజలకు ప్రయోజనం ఏంటి?. ఇప్పటికే జర్నలిజాన్ని భ్రష్టు పట్టించిన ఎల్లో మీడియా రోజురోజుకు అధఃపాతాళానికి పడిపోతోంది. ఆ సంగతి పక్కనబెడితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లు తల్లికి వందనం గురించి నోరెత్తకుండా ఏవేవో మాట్లాడుతున్నారు. దీని ద్వారా తల్లిని వారు గౌరవించినట్లా? మోసం చేసినట్లా?. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

PM Modi Inaugurate Charlapalli Railway Station Terminal Live Updates4
చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ ప్రారంభించిన ప్రధాని మోదీ

Charlapalli Railway Station Terminal Inaugurate Updates..👉 చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. 👉 రైల్వే టెర్మినల్‌ ప్రారంభోత్సవానికి వర్చువల్‌గా హాజరైన ప్రధాని మోదీ‌, సీఎం రేవంత్‌. #WATCH | PM Narendra Modi inaugurates and lays the foundation stone of multiple railway projects, virtuallyThe PM inaugurates New Jammu Railway Division, Charlapalli New Terminal Station in Telangana and lays the foundation stone for the Rayagada Railway Division Building of… pic.twitter.com/0bGiOhwfj2— ANI (@ANI) January 6, 2025తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్స్‌..చర్లపల్లి టెర్మినల్ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందిరైల్వే టెర్మినల్ పూర్తి చేసినందుకు ప్రధాని మోదీకి తెలంగాణ ప్రజల తరఫున ధన్యవాదాలుబందర్ పోర్ట్ కు రైల్వే లైన్ కు అనుమతి ఇవ్వాలని కోరుతున్నాతెలంగాణ లో డ్రైపోర్ట్ ఏర్పాటు కు ఉపయోగకరంగా ఉంటుందితెలంగాణ ఫార్మా ఇండస్ట్రీకి కేరాఫ్ అడ్రస్ గా ఉందిఎలక్ట్రిక్ వెహికల్ తయారీ కి అనుమతి ఇవ్వాలిరీజనల్ రింగ్ రోడ్డు 374 కిలోమీటర్ల నిర్మాణం జరుగుతోందిరీజనల్ రైల్ అవసరం కూడా ఉందిరైల్ రింగ్ కు అనుమతి ఇవ్వాలని కోరుతున్నావికారాబాద్ నుంచి కొడంగల్ మీదుగా కర్ణాటకకు రైల్వే లైన్ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలి.ప్రధాని కోరుకుంటున్న 5ట్రిలియన్ ఎకానమీ సాకారం కావాలంటే అన్ని రాష్ట్రాల అభివృద్ధి జరగాలితెలంగాణ రాష్ట్రం కూడా ఇందులో భాగస్వామ్యం కావాలని కోరుకుంటుందిడ్రైపోర్ట్ ఏర్పాటు చేస్తే రాష్ట్రాభివృద్ధికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది1ట్రిలియన్ ఎకానమీ కాంట్రిబ్యూట్ చేసేందుకు మాకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నాను. తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్ వర్మ కామెంట్స్‌..రైళ్ల ప్రమాదాలను నివారించే కవచ్‌ను మారుమూల ప్రాంతాలకు సైతం విస్తరించారు.వందే భారత్‌తో రవాణా వ్యవస్థలో విప్లవం తీసుకొచ్చారు.రింగ్ రోడ్‌ దగ్గరలో ఉండడం వల్ల చర్లపల్లి ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది.అద్భుతమైన చర్లపల్లి టెర్మినల్ నిర్మించిన దక్షిణ మధ్య రైల్వే, భారతీయ రైల్వే, ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు.కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి కామెంట్స్‌..2021 నుంచి చర్లపల్లి అభివృద్ది పనులు జరిగాయి.తెలంగాణకు ఏది కావాలన్నా కేంద్రం సహాయం అందించింది.చర్లపల్లి అభివృద్ది పనులపై నేను దాదాపు ఆరు సార్లు వచ్చి పర్యవేక్షించానుట్రాఫిక్ సమస్య లేకుండా ఈ స్టేషన్ అందుబాటులో ఉంటుంది.ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయి.చాలా రైళ్లు ఇక్కడి నుంచి నడుస్తాయిఎంఎంటీఎస్ రైళ్లు కూడా ఇక్కడి నుంచే ఘట్ కేసర్ వరకు వెళ్తాయి.720 కోట్ల రూపాయలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ది చేస్తున్నాం1300 రైల్వే స్టేషన్ లు దేశ వ్యాప్తంగా అభివృద్ది జరుగుతుందితెలంగాణ లో సుమారు 40 స్టేషన్లు కేంద్రం ఆధునీకరణ చేస్తోంది.రైలు కూత వినిపించని ప్రాంతాలకు కూడా రైల్వే లైన్లు వేసి రైళ్ల సౌకర్యం కల్పిస్తుంది.రైలు ప్రమాదాలకు చెక్ పెట్టేలా కవచ్ తీసుకొచ్చాంతెలంగాణకు ఐదు వందే భారత్ రైళ్లు వచ్చాయివందే భారత్ స్లీపర్ రైళ్లు కూడా రాబోయే రోజుల్లో వస్తే..ఇక్కడి నుంచి బెంగళూరుకు వెళ్లే రైలు సౌకర్యం మరింత సులభం అవుతుందిలక్ష కోట్లతో జాతీయ రహదారి విస్తరిస్తున్నాంకాజీపేటలో రైల్వే మానుఫాక్చరింగ్ ఫ్యాక్టరీ పనులు జరుగుతున్నాయి.ఎంఎంటీఎస్ రైళ్ల కోసం 1000 కోట్లు గత రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని అడిగాంమేము ఎన్నో సార్లు అడిగినా ఇవ్వలేదు.అయినప్పటికీ మేము ముందడుగు వేసి రైళ్ల రాకపోకలు సాగిస్తున్నాయిఎంఎంటీఎస్ రైళ్లు యాదగిరి గుట్ట వరకు పొడిగించాం.రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించాలి.లక్షల మంది ప్రయాణీకులు యాదగిరిగుట్టకు వెళ్తారు.కాబట్టి ఎంఎంటీఎస్ రైళ్లు వేస్తే సమయం ఆదా అవుతుందికొమరవెల్లి స్టేషన్ కూడా కడుతున్నాం.చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు రావాలంటే అప్రోచ్ రోడ్లు కావాలి.రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించాలిగతంలో ఎన్నోసార్లు కేసీఆర్‌కు లేఖ రాసినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు.ఇప్పుడున్న ప్రభుత్వమైనా అప్రోచ్ రోడ్లకు కృషి చేయండి.ట్రిపుల్ ఆర్ వస్తుంది.ఎంపీ ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ..మోదీ గొప్ప మనసుతో 400కోట్లకు పైగా ఖర్చు చేసి టెర్మినల్ నిర్మించారుగత ప్రభుత్వం హయాంలో రైల్వే స్టేషన్‌లో దుర్గంధంతో ఉండేవిఇప్పుడు ప్రపంచంతో పోటీ పడేలా రైల్వే స్టేషన్లను నిర్మిస్తున్నారుఅన్ని రైల్వే లైన్లు ఎలక్ట్రికల్‌ చేసేలా కృషి చేస్తున్నారురైల్వే స్టేషన్లను ఎయిర్ పోర్టులను తలపించేలా నిర్మిస్తున్నారుచర్లపల్లి పారిశ్రామికవాడకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందిమంత్రి శ్రీధర్ బాబు కామెంట్స్‌..చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభం కావడం సంతోషంతెలంగాణ ఏర్పడ్డ తర్వాత కొత్త రైల్వే లైన్లు కావాలని ఎన్నో ఏళ్లుగా అడిగాంమేము కూడా కేంద్రానికి సాకారం అందించాంఇప్పుడు ప్రారంభించనున్న ఈ టెర్మినల్ కు రైల్వే అప్రోచ్‌కు మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటాంకేంద్రం కూడా అవసరమైన నిధులు విడుదల చేయాలి.అప్రోచ్ రోడ్లు, ప్రయాణికుల సహకారం కోసం కేంద్రం కొంత సహకరించాలి.రైల్వే నెట్‌వర్క్‌ పెంచేలా సహకారం చేయాలి.కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కామెంట్స్‌..గతంలో రైల్వే స్టేషన్‌లో కనీస సౌకర్యాలు లేకుండా రైల్వే ట్రాక్స్‌ వెంట చెత్తాచెదారం నిండిపోయి కంపుకొట్టేదికానీ, ప్రధాని నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టాక రైల్వే స్టేషన్లన్నీ క్లీన్ అండ్ గ్రీన్‌గా మారిపోయాయి.32వేల కోట్లు రైల్వే స్టేషన్‌లో అభివృద్ది చేసేందుకు కేంద్రం సహకరించింది.అమృత్ స్కీం కింద 2 వేల కోట్లు తెలంగాణలో ఉన్న స్టేషన్లు అభివృద్ది చేస్తున్నాం430 కోట్లతో చర్లపల్లి టెర్మినల్ అభివృద్ది చేసింది.రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు తెలంగాణ అభివృద్ది కలిసి పనిచేయాలి.👉కాసేపట్లో పర్యావరణ అనుకూలంగా నిర్మించిన చర్లపల్లి నూతన రైల్వే టెర్మినల్‌ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా టెర్మినల్‌ను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రులు అశ్వనీ వైష్ణవ్, కిషన్‌రెడ్డి, సహాయ మంత్రులు సోమన్న, బండి సంజయ్, మంత్రి శ్రీధర్‌బాబు, దక్షిణమధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ తదితరులు పాల్గొనే అవకాశం ఉంది.👉సుమారు రూ. 413 కోట్ల వ్యయంతో చర్లపలి టర్మినల్‌ నిర్మించారు. వాస్తవానికి గతేడాది డిసెంబర్‌ 28నే టెర్మినల్‌ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ మరణంతో వారం రోజులు సంతాప దినాలుగా కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఈ టెర్మినల్‌ అందుబాటులోకి వచ్చాక సికింద్రాబా ద్, హైదరాబాద్, కాచిగూడ స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ తగ్గుతుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు సమీపంలో ఉండటం వల్ల ప్రయాణికులు నగరంలో ఎక్కడి నుంచైనా సులువుగా ఈ స్టేషన్‌కు చేరుకునే వీలుంది.ఆధునిక హంగులు.. సదుపాయాలు.. 👉ప్రయాణికుల రాకపోకలకు అనుగుణంగా ఆధునిక హంగులతో చర్లపల్లి రెండవ ప్రవేశద్వారం, నూతన రైల్వే టెర్మినల్‌ను అభివృద్ధి చేశారు. స్టేషన్‌లో ఆరు టికెట్‌ బుకింగ్‌ కౌంటర్లను ఏర్పాటు చేశారు. స్త్రీ, పురుషులకు ప్రత్యేక విశ్రాంతి గదులు ఉన్నాయి. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఎగ్జిక్యూటివ్‌ లాంజ్‌ ఉంది. మొదటి అంతస్తులో కెఫెటేరియా, రెస్టారెంట్, విశ్రాంతి గదులు ఉన్నాయి. ఒక ప్లాట్‌ఫాం నుంచి మరో ప్లాట్‌ఫాంకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రాకపోకలు సాగించేందుకు వీలుగా 12 మీటర్ల వెడల్పుతో ఒక ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జితోపాటు 6 మీటర్ల వెడల్పుతో మరో బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. మొత్తం 9 ప్లాట్‌ఫాంలలో 7 లిఫ్టులు, 6 ఎస్కలేటర్లు ఉన్నాయి. రైళ్ల నిర్వహణ కోసం ఆధునిక కోచ్‌ డిపోను కూడా నిర్మించారు. బస్‌బే తోపాటు కార్లు, బైక్‌లను నిలిపేందుకు విశాల పార్కింగ్‌ సదుపాయం కల్పించారు. 👉:​​​​​​​ (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Pat Cummins Creates History, Becomes First Captain In World5
చ‌రిత్ర సృష్టించిన ప్యాట్ కమ్మిన్స్‌.. ప్ర‌పంచంలోనే తొలి కెప్టెన్‌గా

బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీ 2024-25ను సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా త‌మ 10 ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌దించింది. చివ‌ర‌గా 2014-15లో మైఖల్ క్లార్క్ ఆసీస్‌కు బీజీటీ టైటిల్‌ను అందించ‌గా.. మ‌ళ్లీ ఇప్పుడు ప్యాట్ క‌మ్మిన్స్ కెప్టెన్సీలో కంగారుల క‌ల‌నేర‌వేరింది.సిడ్నీ వేదిక‌గా జ‌రిగిన ఆఖ‌రి టెస్టులో 6 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యాన్ని అందుకున్న ఆస్ట్రేలియా.. 3-1 తేడాతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను కైవ‌సం చేసుకుంది. బీజీటీతో వ‌ర‌ల్డ్ టెస్టు ఛాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్ బెర్త్‌ను ఆసీస్ ఖారారు చేసుకుంది. కాగా ఈ సిరీస్ విజ‌యంలో ఆసీస్ కెప్టెన్ ప్యాట్ క‌మ్మిన్స్‌ది కీల‌క పాత్ర.సిరీస్ అసాంతం క‌మ్మిన్స్ ఆల్‌రౌండ్ ప్ర‌ద‌ర్శ‌నతో అద‌ర‌గొట్టాడు. 2021లో ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్సీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన క‌మ్మిన్స్‌.. తన జ‌ట్టును వ‌రుస‌గా రెండు సార్లు వ‌ర‌ల్డ్‌టెస్టు ఛాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్‌కు చేర్చాడు.క‌మ్మిన్స్ అరుదైన ఘ‌న‌త..ఈ క్ర‌మంలో ప్యాట్ కమ్మిన్స్ ఓ అరుదైన ఘ‌న‌త‌ను త‌న పేరిట లిఖించుకున్నాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో 20 మ్యాచ్‌లు గెలిచిన ఏకైక కెప్టెన్‌గా చ‌రిత్ర సృష్టించాడు. ఓవరాల్‌గా డబ్లూటీసీ సైకిల్స్‌(2021-23, 2023-25)లో కమ్మిన్స్‌ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా 33 మ్యాచ్‌లు ఆడగా 20 గెలిచింది.క‌మ్మిన్స్ త‌ర్వాతి స్ధానంలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఉన్నాడు. స్టోక్స్ సార‌థ్యంలో 29 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ ఆడ‌గా.. 17 మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించింది. మూడో స్ధానంలో 14 విజ‌యాల‌తో విరాట్ కోహ్లి ఉన్నాడు. జూన్ 11 నుంచి లార్డ్స్ వేదికగా ప్రారంభం కానున్న డబ్ల్యూటీసీ 2023-25 ఫైనల్‌లో దక్షిణాఫ్రికాతో ఆస్ట్రేలియా తలపడనుంది.చదవండి: CT 2025: ఛాంపియ‌న్స్ ట్రోఫీకి భార‌త జ‌ట్టు ప్ర‌క‌ట‌న ఎప్పుడంటే? స్టార్‌ ప్లేయర్‌కు ఛాన్స్‌!

Dil Raju Will Again Meet Telangana CM Revanth Reddy6
'గేమ్‌ ఛేంజర్‌' కోసం సీఎం రేవంత్‌ రెడ్డిని కలుస్తా: దిల్‌ రాజు

తెలంగాణలో 'గేమ్‌ ఛేంజర్‌' సినిమా టికెట్ల ధరల పెంపుపై ఫిల్మ్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ (టీఎఫ్‌డీసీ) ఛైర్మన్‌ దిల్‌ రాజు (Dil Raju) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానున్న గేమ్‌ ఛేంజర్‌ (Game Changer) చిత్రానికి తెలంగాణలో కూడా టికెట్‌ ధరలు పెంపు కోసం ప్రయత్నం చేస్తానని ఆయన అన్నారు. ఈమేరకు సీఎం రేవంత్‌ రెడ్డిని (Revanth Reddy) మరోసారి కలుస్తానని తెలిపారు. ఈ విషయంలో సానుకూలంగా స్పందిస్తారేమోనని ఆశిస్తున్నట్లు దిల్‌ రాజు పేర్కొన్నారు.చిత్రపరిశ్రమ అభివృద్ధికి సీఎం కూడా చాలా ముందు చూపుతో ఉన్నారు కాబట్టి ఒక నిర్మాతగా టికెట్ రేట్ల పెంపుపై తన ప్రయత్నం చేస్తానని దిల్‌ రాజు అన్నారు. టికెట్ రేటు పెంచడం వల్ల 18 శాతం ట్యాక్స్‌ రూపంలో ప్రభుత్వానికి కూడా అందుతుందని ఆయన గుర్తు చేశారు. భారీ బడ్జెట్‌తో నిర్మించిన సినిమాలకు ప్రభుత్వాల నుంచి సహాయం ఉండాలని ఆయన కోరారు. ఈ విషయంలో గత ప్రభుత్వాలు అన్నీ కూడా ఇండస్ట్రీకి సపోర్ట్ చేశాయి అన్నారు. (ఇదీ చదవండి: సీఎం రేవంత్‌ రెడ్డిని మరిచిపోయిన మరో తెలుగు హీరో)తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి కూడా సినీ ఇండస్ట్రీకి అండగా ఉంటూ అన్నీ ఇస్తాను అన్నారు. ఆ ఆశతోనే మళ్లీ ముఖ్యమంత్రిని కలుస్తానని దిల్‌ రాజు అన్నారు. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ నుంచి భారీ స్థాయిలో సినిమాలు రూపొందుతున్నాయి. అందుకోసం బడ్జెట్‌ కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. నేడు టాలీవుడ్‌ సినిమాలకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉందని ఆయన అన్నారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు దిల్‌ రాజు సాయంరాజమండ్రిలో శనివారం జరిగిన గేమ్ ఛేంజర్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కోసం వెళ్లి తిరిగి ఇంటికి చేరుకుంటున్న క్రమంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. వారిద్దరూ కాకినాడకు చెందిన తోకడ చరణ్, ఆరవ మణికంఠగా గుర్తించారు. ఈ ఘటనపై నిర్మాత దిల్‌ రాజు విచారం వ్యక్తం చేశారు. ఆ రెండు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున సహాయం చేసి ఆదుకుంటానని ఆయన ప్రకటించారు. భవిష్యత్‌లో కూడా వారికి అండగా నిలుస్తానని దిల్‌ రాజు చెప్పారు.ఏపీలో గేమ్‌ ఛేంజర్‌ టికెట్‌ ధరలు ఇలారామ్‌ చరణ్‌- శంకర్‌ కాంబినేషన్‌లో నిర్మాత దిల్‌ రాజ్‌ భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా రేంజ్‌లో ఈ చిత్రాన్ని నిర్మించారు. జనవరి 10న తెల్లవారుజామున ఒంటిగంటకు బెనిఫిట్‌ షో వేసుకోవచ్చని ఏపీ ప్రభుత్వం తెలిపింది. దీనికి ఒక్కో టికెట్‌ ధర రూ.600గా నిర్ణయించింది. అయితే, మొదటి రోజు 4గంటల ఆట నుంచి టికెట్‌ ధరలు ఇలా ఉండనున్నాయి. ప్రస్తుతం ఉన్న టికెట్‌ ధరలపై అదనంగా మల్టీప్లెక్స్‌లో రూ.175, సింగిల్‌ థియేటర్స్‌లలో రూ.135 వరకు పెంచుకోవచ్చని చెప్పింది. ఫస్ట్‌ డే నాడు ఆరు షోలకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం.. 11వ తేదీ నుంచి 23వ తేదీ వరకూ రోజుకు 5 షోలు ఉండనున్నాయి. పెంచిన ధరలు 23వ తేదీ వరకు ఉంటాయి.

gold and silver price today in main cities in india7
స్థిరంగా బంగారం ధరలు.. తులం ఎంతంటే..

ఈక్విటీ మార్కెట్లు ఇటీవల ఒడిదొడుకుల్లో కదలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో సేఫ్డ్‌ అసెట్‌గా భావించే బంగారంలో పెట్టుబడులు కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది. నిన్నటి ధరతో పోలిస్తే 2025 సోమవారం బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు గోల్డ్ రేట్లు(Gold Rate) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.72,150 (22 క్యారెట్స్), రూ.78,710 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. ఆదివారం ధరలతో పోలిస్తే ఈ రోజు బంగారం ధర స్థిరంగానే కొనసాగుతుంది. చెన్నైలో సోమవారం 10 గ్రాముల 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలు వరుసగా రూ.72,150 రూ.78,710గా ఉంది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే ఎలాంటి మార్పులేదు. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి(Gold) ధర రూ.72,300గా ఉండగా, 24 క్యారెట్‌ బంగారం ధర రూ.78,860గా ఉంది. సోమవారం బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేనట్లే వెండి ధరలు కూడా స్థిరంగానే ఉన్నాయి. ఈ రోజు వెండి ధర(Silver Price) కేజీకి రూ.99,000గా ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Canadian PM Justin Trudeau To Resign Soon8
రాజీనామా చేయనున్న కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో?

ఒట్టావా: కెనడా (canada) ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇవాళో, రేపో అధికార లిబరల్ పార్టీతో పాటు ప్రధాని పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ట్రూడ్‌ ఇప్పటి వరకు తన భవిష్యత్‌ కార్యచరణపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయినప్పటికీ బుధవారం జరిగే కీలక జాతీయ కాకస్ సమావేశానికి ముందు ట్రూడో తన పదవికి రాజీనామా చేయొచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.రాజీనామా అనంతరం ట్రూడో తక్షణమే ప్రధాని (Canadian Prime Minister) బాధ్యతల నుంచి తప్పుకుంటారా? లేదంటే కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు ప్రధానిగా కొనసాగుతారా? అన్నది ఉత్కంఠగా మారింది. ఈ తరుణంలో ట్రూడో రాజీనామాకు గల కారణాలు తెరపైకి వచ్చాయి. ఈ ఏడాది అక్టోబర్‌లో కెనడాలో పార్లమెంట్‌ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో అధికార లిబరల్స్ పార్టీ ప్రతిపక్ష కన్జర్వేటివ్‌ల చేతిలో ఘోరంగా ఓడిపోనుందంటూ పలు సర్వేలు స్పష్టం చేశాయి. దీనికి తోడు అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కెనడాపై కవ్వింపు చర్యలకు దిగారు.ఇటీవల, ట్రంప్‌ మాట్లాడుతూ.. అమెరికా 51వ రాష్ట్రంగా కెనడా అవతరించడం గొప్ప ఆలోచనని వ్యాఖ్యానించారు. కెనడాలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి కారణంగా చాలా మంది కెనడియన్లు ఈ ఆలోచనను స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. ఇదే విషయంపై ట్రూడోతో ప్రస్తావించారు. కానీ ట్రూడో మాత్రం ట్రంప్‌కు ధీటుగా బదులివ్వలేకపోయారు. ఈ వరుస పరిణామాలు ట్రూడో ఉక్కిరిబిక్కిరి అయ్యారని, ఫలితంగా బాధ్యతల నుంచి తప్పుకునేందుకు సిద్ధమయ్యారంటూ వెలుగులోకి వచ్చిన కెనడా మీడియా కథనాలు హైలెట్‌ చేస్తున్నాయి. రాజీనామా అనంతరం ట్రూడో తక్షణమే ప్రధాని బాధ్యతల నుంచి తప్పుకుంటారా? లేదంటే కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు ప్రధానిగా కొనసాగుతారా? అన్నది ఉత్కంఠగా మారింది. ఒకవేళ ట్రూడో రాజీనామా చేస్తే .. ప్రస్తుత ఆర్థిక మంత్రి డొమినిక్ లెబ్లాంక్‌తో తాత్కాలిక నాయకుడిగా, ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారా? అన్న అంశంపై చర్చలు జరిపినట్లు సమాచారం.

Nun From Brazil Tops List Of Worlds Oldest Living Person At Nearly 1179
ఏజ్‌లో సెంచరీ కొట్టిన మరో బామ్మ..హెల్త్‌ సీక్రెట్‌ ఏంటంటే..

సుదీర్ఘకాలం జీవించిన వ్యక్తులు గురించి విన్నా..ఆ వ్యక్తులు ఇంకా జీవించి ఉన్నా ఓ సెన్సెషన్‌ అవుతోంది. ప్రస్తుతం జస్ట్‌ ముప్పై దాటగానే ఏవో వ్యాధుల బారినపడుతోంది యువత. నలభై, యాభైలకే వృద్ధుల కంటే దారుణంగా అయిపోతున్నారు. కడుపు నిండా తినలేని దుస్థితి. ఇలాంటి పరిస్థితులో కొందరు ఏజ్‌లో సెంచరీ దాటి మరి జీవించి అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. మొన్నటిదాక జపాన్‌లోని బామ్మ..ఇవాళ బ్రెజిల్‌లోని మరో బామ్మ సుదీర్ఘకాలం జీవించి అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ బామ్మ వయసు ఎంతంటే..బ్రెజిల్‌కు చెందిన నన్‌ ఇనా కానబారో ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘకాలం జీవిస్తున్న వ్యక్తుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా సుదీర్ఘకాలం జీవిస్తున్న సూపర్‌సెంటెనరియన్‌లను ట్రాక్ చేసే లాంగేవిక్వెస్ట్ అనే సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. వీల్‌చైర్‌లో ఉండే ఆ బామ్మ ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా ప్రకటించింది. ప్రస్తుతం ఆమెకు 117 ఏళ్లు. ఆమె సుదీర్ఘజీవిత కాలం బతకడానికి గల కారణం తెలిస్తే విస్తుపోతారు. ఎందకంటే ఆమెకు నలుగురుని నవ్వించేలా జోక్స్‌ వేయడం అంటే ఇష్టమే. ఇదే తన హెల్త్‌ సీక్రెట్‌ అని అంటోంది బామ్మ ఇనా. ఖాళీ సమయాల్లో పూలతో సూక్ష్మ చిత్రాల తయారు చేయండం, ప్రార్థనలు చేయడం అంటే ఆమెకు ఇష్టమట. అంతేగాదు చిన్న వయసులోనే నన్‌గా మారి భక్తిమార్గంలోకి వెళ్లిపోయింది ఈ బామ్మ. పైగాభగవంతుడిపై ఉండే విశ్వాసం మనల్ని ఆయురారోగ్యాలతో బతికేలా చేస్తుందని నమ్మకంగా చెప్పింది. నిజానికి ఆమె ఇన్నేళ్లు బతుకుతుందని అస్సలు అనుకోలేదని ఆమె మేనల్లుడు క్లెబర్ కానబారో అన్నారు. ప్రస్తుతం ఈ బామ్మ రిటైర్మెంట్‌ హోమ్‌లో ఉంటుంది. ప్రతి శనివారం ఆమె మేనల్లుడు తనను చూడటానికి వస్తుంటాడు. ప్రస్తుతం ఆమె బలహీనంగా, మాట్లాడలేని స్థితిలో ఉంది. కానీ మేనల్లుడు క్లెబర్ వాయిస్‌ వినగానే ఉత్సాహంగా మాట్లాడే యత్నం చేస్తుందట. ఇదిలా ఉండగా, లాంగేవిక్వెస్ట్ పరిశోధకుల ప్రకారం, ఆమె జూన్ 8, 1908న దక్షిణ బ్రెజిల్‌లోని ఒక పెద్ద కుటుంబంలో జన్మించారు. ఆమె ముత్తాత 19వ శతాబ్దంలో బ్రెజిల్‌ స్వాతంత్ర్యం పోరాటంలో పాల్గొన్న బ్రెజిలియన్‌ జనరల్‌. ఇక ఈ బామ్మ ఉపాధ్యాయురాలిగా పనిచేసి రిటైరయ్యింది. ఆ తర్వాత రియో ​​గ్రాండే డో సుల్‌లో స్థిరపడింది. ఆమె ఆరోగ్యకరమైన అలవాట్లు, ప్రశాంతమైన జీవన విధానమే తన సుదీర్ఘకాల జీవన రహస్యమని అంటోంది బామ్మ ఇనా. డిసెంబరులో జపాన్‌కు చెందిన టోమికో ఇటూకా మరణం తర్వాత ఈ బామ్మ సుదీర్ఘకాలం జీవించిన వృద్ధురాలిగా అగ్రస్థానంలో నిలిచింది. (చదవండి: గిరి ‘గడబ’ ప్రకృతితో మమేకం)

Aarogyasri Services In The State Will Be Closed From January 6th 10
ఏపీలో నేటి నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్

సాక్షి, తాడేపల్లి : నేటి నుంచి ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు (aarogyasri) నిలిచిపోనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవల్ని నిలిపేయాలని హాస్పిటల్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం నుండి రావాల్సిన రూ. 3వేల కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తోంది.తొలివిడత కనీసం రూ.రెండు వేల కోట్లయినా రిలీజ్ చేయాలంటున్న నెట్ వర్క్ ఆస్పత్రులు (network hospitals) కోరుతున్నాయి. ఇవ్వాల్టి నుండి ఈహెచ్ఎస్ సేవలు, ఓపీని నిలిపేయాలని, 26 నుండి అత్యవసర సేవలను కూడా నిలిపేస్తామని అల్టిమేటం జారీ చేసింది. వైఎస్‌ జగన్ ప్రభుత్వంలో వైఎస్‌ జగన్ ప్రభుత్వంలో పేద, మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్యశ్రీ మేలు చేకూర్చింది. ఏకంగా 45,10,645 మందికి ఉచిత వైద్యం అందించారు. ఇందుకోసం రూ.13,421 కోట్లు ఖర్చయ్యింది. కానీ నేడు చంద్రబాబు పైసా కూడా విదల్చకపోవటంతో నెట్‌వర్క్ ఆస్పత్రులు ఉపక్రమించాయి. బకాయిలు చెల్లించాల్సిందేనెట్‌­వర్క్‌ ఆస్ప­త్రుల యాజ­మాన్యంతో సమావేశం అనంతరం అసోసి­యేషన్‌ అధ్యక్షు­డు డాక్టర్‌ విజయ్‌కుమార్, కార్య­దర్శి డాక్టర్‌ సీహెచ్‌ అవినాష్‌ మీడియాతో మాట్లా­డారు. ‘ఆరోగ్యశ్రీ ద్వారా అందిస్తున్న సేవలకు ప్రతీనెలా రూ.300 కోట్లు బిల్లులు అవు­తున్నాయి. మాకు రూ.3,000 కోట్ల వరకు బకా­యిలున్నాయి. గతేడాది ఆగస్టులో ఈ బకాయిలపై ప్రభుత్వానికి విజ్ఞప్తిచేస్తే సెప్టెంబరులో చెల్లిస్తా­మని ­హామీ ఇచ్చారు. కానీ, ఇప్పటికీ దానిపై ఎ­లాంటి ప్రక­టనా చేయలేదు. అడిగితే బడ్జెట్‌ లేదంటున్నారు. ఈ పరి­స్థితుల్లో మేం సేవలు అందించ­లేం. పాత బకా­యిలకు అదనంగా ప్రతినెలా వస్తు­న్న బిల్లు­లు తోడవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మేం ఆస్ప­త్రు­లను నిర్వహించలేం. మాకు రావాల్సిన మొత్తంలో రూ.1,500 కోట్లు వెంటనే విడుదల చేస్తే సే­వలు కొనసాగిస్తాం. లేనిపక్షంలో సోమ­వారం నుం­చి ఈహెచ్‌ఎస్‌ సేవలను నిలిపివేస్తాం. ఆరోగ్యశ్రీలో ఉచిత ఓపీ సేవలను నిలిపివేస్తాం’.బీమా ప్యాకేజీలపై తీవ్ర అభ్యంతరం..ప్రభుత్వం కొత్తగా ఇన్సూరెన్స్‌ (insurance) విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. దీనిపై మాకు అభ్యంతరాలున్నాయి. బీమా సంస్థలకు ప్యాకేజీ రేట్లతో బిడ్డింగుకు అనుమతించారో వాటిని ముందుగా నెట్‌వర్క్‌ ఆస్పత్రులతో చర్చించకపోవడం ఆందోళన కలిగించే ఆంశం. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాం.బీమా సంస్థలకు ఏ రేట్లు చెల్లిస్తారో వెల్లడించాలి. ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టిన సమయంలో నిరుపేదలకు మా­త్రమే వర్తించడంతో సేవాభావంతో వై­ద్యం చేయాలని నిర్ణయించాం. ఇప్పుడు పరిస్థితి మారింది. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన జీఓ ప్రకారం ధరలు 35 శాతం పెర­గాలి. ఇప్పటివరకు పెంచకపోగా కనీసం దీని­పై ప్రభుత్వం చర్చించలేదు. ఈనెల 25­లోగా మాకు రావాల్సిన బకాయిల్లో సగం మొత్తం రూ.1,500 కోట్లు చెల్లిస్తే సేవలు పునరుద్ధరిస్తాం. లేదంటే గడువు తర్వాత ఆరోగ్యశ్రీ సేవలూ నిలిపివేస్తాం’ అని స్పష్టం చేశారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

National View all
title
కుంభమేళాకు కొత్త వైరస్‌ ముప్పు.. అధికారులు అప్రమత్తం

ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను బలిగొన్న కరోనా వైరస్‌ను మరువక ముంద

title
అధిక ప్లాట్‌పారంలున్న రైల్వే స్టేషన్‌లివే.. చర్లపల్లి స్థానం ఎక్కడ?

తెలంగాణలోని హైదరాబాద్‌కు చర్లపల్లి రైల్వేస్టేషన్‌ మరో మణిహారంగా మారింది.

title
భారత్‌లో రెండు HMPV వైరస్‌ కేసులు.. ధృవీకరించిన ఐసీఎంఆర్‌

బెంగళూరు: చైనా (China)లో కలకలం సృష్టిస్తున్న హ్యూమన్ మెటాప్

title
పోలీసుల కర్కశం.. యాక్సిడెంట్‌ జరిగిన ప్రాంతం మాది కాదయ్యా..

భోపాల్‌ : మానవత్వం చూపించాల్సిన పోలీసులు దారుణంగా ప్రవర్తించ

title
ఛత్తీస్‌గఢ్‌లో జర్నలిస్ట్‌ ముఖేశ్‌ హత్య.. హైదరాబాద్‌లో ప్రధాన నిందితుడు అరెస్ట్‌

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లో జర్నలిస్ట్‌ ముఖేశ్‌ చంద్రాకర్‌ హత

Advertisement

వీడియోలు

Advertisement