దుర్వాసన రావడంతో వెలుగులోకి ఘటన
అడ్డగుట్ట: కన్నతల్లి మృతిని తట్టుకోలేక ఓ కుమారుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన లాలాగూడలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ రఘు బాబు తెలిపిన వివరాల ప్రకారం.. లాలాపేటలోని వినోభానగర్‌కు చెందిన లక్ష్మి (52), అభినయ్ (20) తల్లీకొడుకులు. వీరిద్దరు ఎనిమిదేళ్లుగా అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. లక్ష్మి కేన్సర్ పేషెంట్ కావడంతో ఇంట్లోనే ఉంటోంది. అభినయ్ డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. తల్లి మందుల ఖర్చు, కాలేజీ ఫీజు కోసం అభినయ్ ఏదో ఒక పని చేస్తుండేవాడు.
శనివారం మధ్యాహ్నం వీరు నివాసముంటున్న ఇంట్లోంచి దుర్వాసన వస్తుండడంతో ఇంటి యజమాని బ్రహ్మాజీ సదరు తలుపులు ఎంత కొట్టినా తెరవకపోవడంతో లాలాగూడ పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇంటి తలుపులు బద్దలుగొట్టి చూడగా హాల్‌లో అభినయ్ సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకొని విగతజీవిగా కనిపించాడు. లోపలికి వెళ్లి చూడగా బెడ్రూంలో తల్లి లక్ష్మి సైతం మృతి చెంది ఉంది. లక్ష్మీకి సంబంధించిన మెడికల్ రిపోర్ట్‌తో పాటు అభినయ్ రాసిన సూసైడ్ నోట్ పోలీసులకు కనిపించింది. అందులో ‘నాకు మా అమ్మకు ఆరోగ్య సమస్యలున్నాయి.
నాకు తండ్రి కూడా లేడు. మా బంధువుల కోసం వెతక్కండి. ఐ యామ్ సారీ’ అని ఇంగ్లి‹Ùలో రాసి ఉంది. తల్లి లక్ష్మి అనారోగ్యంతో చనిపోవడంతో తట్టుకోలేక కుమారుడు అభినయ్ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. వీరు మృతి చెంది రెండ్రోజులు అవుతోందని చెబుతున్నారు. తల్లీకొడుకుల మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment