
గుడిమల్కాపూర్‌లోని కింగ్స్ ప్యాలెస్‌లో నిర్వహించిన ఆనం మీర్జా ఎక్స్‌పోలో కాల్పుల కలకలం రేగింది.
సాక్షి, హైదరాబాద్: గుడిమల్కాపూర్‌లోని కింగ్స్ ప్యాలెస్‌లో నిర్వహించిన ఆనం మీర్జా ఎక్స్‌పోలో కాల్పుల కలకలం రేగింది. ఎక్స్‌పోలో ఇద్దరు షాప్ యజమానుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో వారిలో ఓ షాపు యజమాని గాలిలో కాల్పులు జరిపాడు. దీంతో ఎక్స్‌లో ఉన్నవారు భయాందోళనలకు గురయ్యారు.
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఎక్స్‌పో నిర్వాహకులు, ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరించి విచారణ చేపట్టారు. ఈ ఘటన నేపథ్యంలో ఎక్స్‌పో ప్రాంతంలో భద్రతను పెంచినట్లు పోలీసులు వెల్లడించారు.
