సాక్షి, హైదరాబాద్: అప్జల్ గంజ్(Afzal Gunj)లో కాల్పుల కలకలం రేగింది. ట్రావెల్స్ కార్యాలయంలో ఉన్న వ్యక్తిపై దుండగులు కాల్పులు జరిపారు. బీదర్ ఎటీఎం దొంగల(Bidar ATM thieves) ముఠాగా పోలీసులు తేల్చారు. బీదర్ పోలీసులను చూసి దుండగులు కాల్పులు జరిపారు. పోలీసులపై 3 రౌండ్ల కాల్పులు జరిపి పారిపోయారు. దుండుగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. బీదర్‌లో రూ.93 లక్షల నగదును ఎత్తుకెళ్లిన దొంగలు.. అక్కడ నుంచి తప్పించుకుని.. హైదరాబాద్‌కు చేరుకున్నారు. పోలీసుల నుంచి తప్పించుకుని ట్రావెల్స్ ఆఫీస్‌లోకి వెళ్లిన దుండగులు.. ఓ వ్యక్తిపై కాల్పులు జరిపారు.
కర్ణాటకలోని బీదర్‌లో పట్టపగలే దోపిడీ దొంగలు రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. శివాజీ చౌక్‌లోని ఓ ఏటీఎం కేంద్రంలో డబ్బు పెట్టేందుకు వచ్చిన సిబ్బందిపై కాల్పులకు పాల్పడ్డారు. బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో భద్రతా సిబ్బంది ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో వ్యక్తి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.
దుండగులు ఏటీఎం సొమ్ముతో బైక్‌పై అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చేపట్టారు. దుండుగులు.. అక్కడ నుంచి తప్పించుకుని.. హైదరాబాద్‌కు వచ్చారు. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో ట్రావెల్స్ ఆఫీస్‌లోకి వెళ్లిన దుండగులు.. ఓ వ్యక్తిపై కాల్పులు జరిపారు.
ఇదీ చదవండి: కేరళ సమాధి కేసులో అదిరిపోయే ట్విస్ట్!
Comments
Please login to add a commentAdd a comment