ATM thieves
-
కాల్పుల కలకలం.. అప్జల్‌గంజ్‌లో బీదర్ ఏటీఎం దొంగలు
సాక్షి, హైదరాబాద్: అప్జల్ గంజ్(Afzal Gunj)లో కాల్పుల కలకలం రేగింది. ట్రావెల్స్ కార్యాలయంలో ఉన్న వ్యక్తిపై దుండగులు కాల్పులు జరిపారు. బీదర్ ఎటీఎం దొంగల(Bidar ATM thieves) ముఠాగా పోలీసులు తేల్చారు. బీదర్ పోలీసులను చూసి దుండగులు కాల్పులు జరిపారు. పోలీసులపై 3 రౌండ్ల కాల్పులు జరిపి పారిపోయారు. దుండుగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. బీదర్‌లో రూ.93 లక్షల నగదును ఎత్తుకెళ్లిన దొంగలు.. అక్కడ నుంచి తప్పించుకుని.. హైదరాబాద్‌కు చేరుకున్నారు. పోలీసుల నుంచి తప్పించుకుని ట్రావెల్స్ ఆఫీస్‌లోకి వెళ్లిన దుండగులు.. ఓ వ్యక్తిపై కాల్పులు జరిపారు.కర్ణాటకలోని బీదర్‌లో పట్టపగలే దోపిడీ దొంగలు రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. శివాజీ చౌక్‌లోని ఓ ఏటీఎం కేంద్రంలో డబ్బు పెట్టేందుకు వచ్చిన సిబ్బందిపై కాల్పులకు పాల్పడ్డారు. బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో భద్రతా సిబ్బంది ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో వ్యక్తి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.దుండగులు ఏటీఎం సొమ్ముతో బైక్‌పై అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చేపట్టారు. దుండుగులు.. అక్కడ నుంచి తప్పించుకుని.. హైదరాబాద్‌కు వచ్చారు. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో ట్రావెల్స్ ఆఫీస్‌లోకి వెళ్లిన దుండగులు.. ఓ వ్యక్తిపై కాల్పులు జరిపారు.ఇదీ చదవండి: కేరళ సమాధి కేసులో అదిరిపోయే ట్విస్ట్! -
చిత్తూరులో ఏటీఎమ్ దొంగల బీభత్సం
-
బాబాయ్, అబ్బాయ్‌ల చోరీ పన్నాగం
హైదరాబాద్: ఏటీఎం కేంద్రానికి సెక్యూరిటీగార్డుగా పనిచేస్తున్న వ్యక్తి అనారోగ్యంతో ఆసుపత్రిపాలు కావడంతో ఆయన కొడుకు ‘డ్యూటీ’లో చేరాడు. ఈ అబ్బాయ్.. తన బాబాయ్ సహకారంతో ఏటీఎంలోని 10లక్షలా30వేల800 రూపాయలను దోచుకెళ్లారు. ఈ సంఘటనలో పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు. శుక్రవారం కూకట్పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ కె.పురుషోత్తం వివరాలు వెల్లడించారు. కూకట్పల్లి జయానగర్‌లోని శ్రీనిధి అపార్టుమెంట్లో నివాసం ఉండే గంగి మల్లయ్యకు ఇద్దరు కుమారులు. గంగిమల్లయ్య స్థానికంగా ఉన్న ఐసిఐసిఐ బ్యాంక్ ఏటీఎంలో సెక్యూరిటీగార్డుగా పనిచేస్తున్నాడు. ఈనెల 19న అనారోగ్యంతో జీడిమెట్లలోని మల్లారెడ్డి ఆసుపత్రిలో చేరాడు. ఆసుపత్రి ఖర్చుల కోసం రూ. 80వేలు అపార్టుమెంట్ యజమాని వద్ద అప్పుగా తీసుకున్నాడు. అయితే రెండవ కుమారుడు శేఖర్ మల్లయ్య స్థానంలో సెక్యూరిటీగార్డుగా పనిచేస్తున్నాడు. అర్ధరాత్రి దాటిన తరువాత సుమారు రెండు గంటల ప్రాంతంలో ఏటీఎం కేంద్రాన్ని మూసివేసి ఇంటికి వెళ్లి పడుకోవడాన్ని గమనించిన పెద్దకొడుకు గంగి మహేశ్(28) ఏటీఎంలో చోరీకి పన్నాగాన్ని రచించాడు. ఈనెల 21న ఐడీఏ బొల్లారంలో నివాసం ఉంటూ సెంట్రింగ్ పనిచేస్తున్న గంగి కిష్టయ్య అనారోగ్యంతో ఉన్న అన్నను చూసేందుకు ఆసుపత్రికి వచ్చాడు. అనంతరం మల్లయ్య పెద్దకొడుకు మహేశ్‌ను కలిశాడు. ఇద్దరు కలిసీ భాగ్యనగర్‌కాలనీలోని కల్లుకంపౌండ్లో కల్లుతాగారు. అప్పులు దూరం కావాలంటే ఏటీఎం కేంద్రంలో చోరీచేయాలని నిర్ణయించుకున్నారు. అదేరోజు రాత్రి రెండుగంటల సమయంలో సెక్యూరిటీ గార్డు దుస్తులను ధరించిన మహేశ్ ఏటీఎం కేంద్రంలోనికి వెళ్లి కటింగ్ ప్లేయర్‌తో సీసీ కెమెరాల వైర్లను కట్‌చేశాడు. కిష్టయ్యతో కలిసి ఏటీఎంలో నగదు దాచే యంత్రాన్ని ధ్వంసం చేశారు. అందులో ఉన్న10లక్షల 30వేల 800వందల రెండువేలు, వంద రూపాయల నోట్లను తీసుకొని పరారయ్యారు. మరుసటిరోజు ఏటీఎం కేంద్రంలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడాన్ని గుర్తించిన ముంబయ్‌లోని ఐసీఐసీఐ బ్యాంక్ ప్రతినిధులు కూకట్పల్లి సిబ్బందికి సమాచారం అందించడంతో వారు వచ్చి చూసేసరికి ఏటీఎంలో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానం వచ్చిన పోలీసులు మహేశ్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో మహేశ్ తన బాబాయ్ కిష్టయ్యతో కలిసి చోరీ చేసినట్లు అంగీకరించారు. మహేశ్ ఇంట్లో నాలుగు లక్షల 40వేలు, కిష్టయ్య ఇంట్లో నాలుగు లక్షల 78వేలు దొరికాయి. చోరీ చేసిన డబ్బును నిందితులు ఇంటిలోని సిలెండ్ కింద, ఉతికి ఆరేసిన బట్టలలో, చెత్తబుట్టలలో దాచి ఉంచారు. నగదుతో పాటు నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. -
ఏటీఎం దొంగల ముఠా అరెస్టు
రణస్థలం : ఏటీఎంల్లో దొంగతనాలకు పాల్పడిన వారిని పట్టుకుని అరెస్టు చేశామని జేఆర్ పురం సీఐ రామకృష్ణ తెలిపారు. ఈ మేరకు పట్టుబడిన వారిని విలేకరుల ముందు శనివారం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఈ నెల రెండో తేదీన రాత్రి ఎస్బీఐ ఏటీఎం తాళాలను పగులగొట్టి దొంగతనానికి ప్రయత్నించిన వారిని సీసీ కెమెరాల ఆధారంగా పట్టుకున్నామని చెప్పారు. ముసుగులు వేసి దొంగతనానికి యత్నించారని తెలిపారు. పట్టుబడిన వారంతా జేఆర్‌పురం గ్రామానికి చెందని వారని, వీరిలో ఒక మైనర్‌తో పాటు దుర్గాప్రసాద్, జె.దుర్గారావు, వనుమ గౌరీశంకర్, కె.ప్రసాద్ ఉన్నట్టు చెప్పారు. వీరిలో మైనర్‌ను మినహాయించి నలుగురిని అరెస్టు చేసినట్టు తెలిపారు. వీరంతా రిటైర్డ్ ఎంపీడీవో ఇంట్లో దొంగతనం చేసేందుకు పథకం పన్నారని ఆ సమయంలో వారింటికి బంధువులు రావడంతో ఏటీఎంపై కన్నేశారని చెప్పారు. పట్టుబడిన వారు గతంలో పలు నేరాలు చేసిన వారేనని పేర్కొన్నారు. రణస్థలం, జేఆర్‌పురం, పైడిభీమవరాల్లో చాలా దొంగతనాలు చేశారన్నారు. సీఐ వెంట ఎస్ఐ సత్యనారాయణ పాల్గొన్నారు. -
పోలీసుల అదుపులో ఏటీఎం దొంగలు
-
పేట్రేగిపోతున్న ఏటీఎం దొంగలు
పార్వతీపురం: ఇంతవరకు మెట్రో నగరాలకే పరి మితమైన ఏటీఎం దొంగతనాలు తాజాగా పార్వతీపురంలోనూ మొదలయ్యాయి. జనశక్తి కాలనీకి చెందిన ఉపాధ్యాయుడు ద్వారపురెడ్డి సత్యనారాయణ గుర్తు తెలియని అగంతుకుడి మాయలో పడి ఏటీఎంలో డబ్బులు పొగొట్టుకున్నాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఈనెల 8న స్థానిక మెయిన్ రోడ్డులోని ఆంధ్రాబ్యాంకు ఏటీంలో డబ్బులు తీసేందుకు ఉపాధ్యాయుడు సత్యనారాయణ వెళ్లాడు. అయితే ఏటీఎంలో డబ్బులు తీసేందుకు ప్రయత్నించగా ఏటీఎం స్క్రీన్‌లోని అక్షరాలు సరిగ్గా కనిపించకపోవడంతో తికమక పడి బయటకు వచ్చేశాడు. ఇంతలో ఓ అపరిచితుడు డబ్బులు తీసి ఇస్తానని చెప్పి సత్యనారాయణచే ఆపరేటింగ్ చేయించారు. ఈ క్రమంలో ఒకసారి కార్డు పెట్టి రూ. 10 వేలు తీశారు. మరలా కార్డు అవసరం లేదంటూ అగంతకుడు మరో రూ. పది వేలు తీయించాడు. ఈలోపు అపరిచితుడు రోడ్డుమీదున్న తన ద్విచక్ర వాహనం పడిపోవడంతో వెళ్లి దాన్ని పెకైత్తి మరలా ఏటీఎంలోకి వచ్చాడు. మళ్లీ సత్యనారాయణచే కార్డు పెట్టించి రూ. పది వేలు తీయించాడు. ఈ నగదును బాధితుడు లెక్కబెడుతుండగా, ఏటీఎం నుంచి (లావాదేవీలు కొనసాగించి) మరో పది వేలు తీసుకుని అపరిచితుడు పరారయ్యాడు. దీంతో బాధితుడు లబోదిబోమని పోలీసులను ఆశ్రయించాడు. పార్వతీపురంలో గతంలో కూడా ఇటువంటి సంఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి. ఏటీఎంల వద్ద గార్డులను ఏర్పాటు చేయనంతవరకు ఇటువంటి దొంగతనాలను ఆపలేమని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
ఏటీఎం దొంగల కోసం విస్తృత తనిఖీలు
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో కలకలం సృష్టించిన ఏటీఎం దొంగల ముఠా కోసం బుధవారం కామారెడ్డి డివిజన్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. గాంధారీ, నిజామాబాద్ మండలాల్లో కూంబింగ్ కొనసాగుతున్నట్టు పోలీసులు తెలిపారు. ఏటీఎం దొంగల ముఠా ఆటకట్టించేందుకు స్వయంగా ఆ జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి రంగంలోకి దిగారు. మంగళవారం తెల్లవారుజాము సమయాల్లో నిజామాబాద్‌లో 4 ఏటీఎంలపై దొంగల ముఠా చోరీలకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ చోరీలో సుమారు 43 లక్షల రూపాయల వరకు దొంగలు ఎత్తుకెళ్లారు. అదే విధంగా బుధవారం వేకువజామున మెదక్ ఆటోనగర్‌లోని ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి యత్నించారు. గ్యాస్ కట్టర్‌తో ఏటీఎంను తెరిచేందుకు దుండగులు యత్నించగా ఏటీఎం నుంచి మంటలు చెలరేగాయి. దీంతో దొంగల ముఠా పరారయింది. బొలెరో వాహనంలో పారిపోతున్న దొంగలను పోలీసులు వెంబడించారు. అనంతరం లింగంపేట పోలీసులకు సమాచారం అందించారు. నాగిరెడ్డి పేట ఎస్సై దొంగల ముఠాను వెంబడించగా తప్పించుకున్నారు. -
ఇద్దరు ఏటీఎం దొంగల అరెస్టు
నోయిడా: ఏటీఎంను బద్దలు కొట్టేందుకు ప్రయత్నించిన ఇద్దరు పోలీసులకు పట్టుబడ్డారు. వివరాల్లోకెళ్తే... క్లీనర్లుగా పనిచేస్తున్న రోహతష్ చౌహాన్, గుల్షన్ తివారీలో డీఎస్సీ రోడ్డులోగల ఏటీఎంను బద్దలు కొట్టేందుకు ప్రయత్నిస్తుండగా అదే సమయంలో పెట్రోలింగ్ కోసం తిరుగుతున్న పోలీసుల కంట పడ్డారు. సెక్యూరిటీ గార్డు లేకపోవడం, ఏటీఎంలో నుంచి శబ్ధాలు వస్తుండడంతో అనుమానం వచ్చిన పోలీసులు లోపలికి వెళ్లి చూసేసరికి మెషీన్‌ను తెరిచేందుకు ప్రయత్నిస్తున్న చౌహాన్, తివారీలు కనిపించారు. దీంతో వెంటనే వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. తాము డబ్బులు డ్రా చేసుకునేందుకు వచ్చామని, తమ కార్డు అందులో ఇరుక్కుపోయిందంటూ బుకాయించే ప్రయత్నం చేశారు. దీంతో సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా మెషీన్‌ను బద్దలు కొట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు స్పష్టంగా కనిపించింది. దీంతో తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపెట్టారు. డీఎస్పీ కుమార్ మిశ్రా ఈ విషయమై మాట్లాడుతూ... సెక్టార్ 44లోగల యాక్సిస్ బ్యాంకు ఏటీఎంను కూడా బద్దలు కొట్టేందుకు గత వారం ప్రయత్నించారని, అయితే సఫలీకృతం కాలేదన్నారు. రెండో ప్రయత్నంగా స్టేట్‌బ్యాంక్ ఆఫ్ బికనర్ అండ్ జైపూర్ ఏటీఎంను బద్దలు కొట్టాలని నిర్ణయించుకొని, అందుకు డీఎస్సీ మార్గ్‌లోగల ఏటీఎంను ఎంచుకున్నారని చెప్పారు. అక్కడ సెక్యూరిటీ గార్డు లేకపోవడం, ఆ ప్రాంతం నిర్మానుష్యంగా ఉండడంతో తమ పని సులువవుతుందని భావించారని, అయితే అదే సమయంలో పోలీసులు పెట్రోలింగ్‌కు వెళ్లడం, అనుమానం రావడంతో ఏటీఎం వద్దకు వెళ్లి చూడడంతో ఈ ఇద్దరి బాగోతం బయటపడిందని చెప్పారు.