Expo
-
రూ.20 లక్షల కోట్లకు ఈవీ మార్కెట్
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ) మార్కెట్ విలువ భారత్‌లో 2030 నాటికి రూ.20 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉందని కేంద్ర రోడ్డు, రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం తెలిపారు. ఆ సమయానికి మొత్తం ఈవీ పర్యావరణ వ్యవస్థలో దాదాపు 5 కోట్ల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని అన్నారు. ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమ సుస్థిరతపై 8వ సదస్సు ఈవీఎక్స్‌పో 2024 సందర్భంగా ఆయన మాట్లాడారు. 2030 నాటికి ఎలక్ట్రిక్ వాహనాల ఫైనాన్స్ మార్కెట్ పరిమాణం దేశంలో దాదాపు రూ.4 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనాగా వెల్లడించారు. భారత్‌లో 40 శాతం వాయు కాలుష్యం రవాణా రంగం వల్లే అని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. సౌర విద్యుత్ 44 శాతం.. భారత్ రూ. 22 లక్షల కోట్ల విలువైన శిలాజ ఇంధనాలను దిగుమతి చేసుకుంటోందని, ఇది పెద్ద ఆర్థిక సవాలుగా మారిందని గడ్కరీ అన్నారు. ఈ శిలాజ ఇంధనాల దిగుమతి మన దేశంలో చాలా సమస్యలను సృష్టిస్తోందని తెలిపారు. భారత్‌లో ఉత్పత్తి అవుతున్న మొత్తం విద్యుత్‌లో 44 శాతం సౌరవిద్యుత్ కైవసం చేసుకున్నందున ప్రభుత్వం పర్యావరణ అనుకూల శక్తి వనరులపై దృష్టి పెడుతోందని వివరించారు.లక్ష ఈ–బస్‌లు అవసరం.. ఎలక్ట్రిక్ బస్‌ల కొరతను భారత్ ఎదుర్కొంటోందని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. ‘మన దేశానికి లక్ష ఎలక్ట్రిక్ బస్‌లు అవసరం. అయితే ప్రస్తుతం మన సామర్థ్యం 50,000 ఈ–బస్‌లు. మీరు మీ ఫ్యాక్టరీని విస్తరించుకోవడానికి ఇదే సరైన సమయం. ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులు నాణ్యత విషయంలో రాజీ పడొద్దు’ అని తయారీ కంపెనీలను ఉద్దేశించి అన్నారు. -
ఆగస్టు 29 నుంచి ఎలక్ట్రిక్ ఎక్స్పో
హైదరాబాద్: సికింద్రాబాద్ ఎలక్ట్రిక్ ట్రేడర్స్ అసోసియేషన్(సెటా) ఆగస్టు 29 నుంచి 31వ తేదీ వరకు హైటెక్స్‌లో ఎలక్ట్రిక్ ఎక్స్పో నిర్వహిస్తున్నదని, జాతీయ స్థాయిలో పేరొందిన ఎలక్ట్రిక్ కంపెనీలు బ్రాండ్లు ఇందులో తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తాయని సెటా అధ్యక్షుడు సురేష్‌జైన్ తెలిపారు. బంజారాహిల్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు ఈ ఎక్స్‌పోకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఈ ఎక్స్‌పోలో సుమారు 180 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దేశంలోని ఇది అతిపెద్ద ఎక్స్పో కాబోతున్నదని తెలిపారు. -
హైదరాబాద్‌లో ‘బిర్లా ఓపస్’ ఎక్స్పో
హైదరాబాద్: పెయింట్స్ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆదిత్య బిర్లా గ్రూప్ ‘బిర్లా ఓపస్’ పేరుతో దేశంలోని వివిధ నగరాలకు తమ ఉత్పత్తులను పరిచయం చేస్తూ విస్తరించే ప్రయత్నం చేస్తోంది.దేశవ్యాప్తంగా కీలక మార్కెట్లలో విజయవంతమైన ఎక్స్పోలను అనుసరించి, బిర్లా ఓపస్ దేశవ్యాప్తంగా తన వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు 180 పైగా ప్రాంతాలకు దీన్ని మరింత విస్తరిస్తోంది. ఇందులో భాగంగా బిర్లా ఓపస్ ఎక్స్పో జూన్ 24, 25 తేదీల్లో హైదరాబాద్‌లో జరగనుంది.వ్యాపార భాగస్వాములు ముఖ్యంగా డీలర్లు, పెయింటర్లు, కాంట్రాక్టర్లు, ఆర్కిటెక్ట్‌లు, ఇంటీరియర్ డిజైనర్లతో సంబంధాలను పెంపొందించుకోవడం, బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ ఎక్స్‌పోలో బిర్లా ఓపస్ ఉత్పత్తుల శ్రేణిని ప్రదర్శిస్తారు. -
హైదరాబాద్: టైమ్స్ హోమ్ హంట్ ప్రాపర్టీ ఎక్స్ పో ప్రారంభించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (ఫొటోలు)
-
తాజ్ కృష్ణ లో ప్రీమియర్ మల్టీసిటీ ఫ్రాంచెస్ ఎక్స్పో (ఫొటో గ్యాలరీ)
-
హైదరాబాద్ తాజ్ డెక్కన్ లో బ్యూటెక్ కాస్మెటిక్ అండ్ సెలూన్ ఎక్స్పో (ఫోటోలు)
-
మెడ్‌టెక్ జోన్లో మెగా ఎక్స్పో సిటీ
సాక్షి, విశాఖపట్నం: కోవిడ్ సమయంలో ర్యాపిడ్ టెస్ట్ కిట్ల తయారీ... భారత వైద్యరంగంలో ప్రపంచస్థాయి గామా రేడియేషన్ సెంటర్... ప్రపంచంలోనే మొదటి డేటా సెంటర్ ఏర్పాటు.. ఇలా వైద్యరంగంలో విప్లవాత్మక ఆవిష్కరణలకు కేంద్రంగా మారిన విశాఖపట్నంలోని ఏపీ మెడ్ టెక్ జోన్ మరో రికార్డును సొంతం చేసుకుంది. తాజాగా ఇండియా ఎక్స్పో సిటీ పేరుతో భారీ ఎగ్జిబిషన్ సెంటర్‌ను నిర్మించింది. కేవలం 150 రోజుల్లోనే లక్షకు పైగా చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఎగ్జిబిషన్ సెంటర్‌ను ఏర్పాటుచేసి రికార్డు సృష్టించింది. ఈ ఇండియా ఎక్స్పో సిటీని శుక్రవారం ప్రారంభించారు. ఇక్కడ తొలి రోజే 5వ ఇంటర్నేషనల్ క్లినికల్ ఇంజినీరింగ్ అండ్ హెల్త్ టెక్నాలజీ మేనేజ్మెంట్ కాంగ్రెస్ ప్రారంభం కావడం విశేషం. ఇవీ ప్రత్యేకతలు... మెడ్‌టెక్ జోన్‌లోని ప్రగతి మైదాన్‌లో 1,03,951 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఇండియా ఎక్స్పో సిటీ నిర్మాణ పనులు జూన్ 14న ప్రారంభించారు. శుక్రవారం పూర్తిచేసి అందుబాటులోకి తీసుకువచ్చారు. మొత్తం 5.40లక్షల పని గంటల్లో నిర్మాణం పూర్తిచేశారు. ఈ ఎక్స్పో సిటీ నిర్మాణం కోసం 3,577 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్, 718 మెట్రిక్ టన్నుల స్టీల్ వినియోగించారు. రోజుకు 10వేల మంది సందర్శించేలా ఎక్స్పో సిటీని నిర్మించారు. లోపల భాగంలో ఒక్క కోలమ్ కూడా నిర్మించకుండా దీనిని పూర్తి చేయడం విశేషం. ఎక్స్పో సిటీలో నాలుగు కాన్ఫరెన్స్ హాల్స్, బోర్డ్‌రూమ్‌లు ఉన్నాయి. 16 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో డిస్ప్లే షాప్స్ ఏర్పాటుచేసుకోవచ్చు. తొలి రోజే అంతర్జాతీయ సదస్సు ఇండియా ఎక్స్పో సిటీ అందుబాటులోకి వచ్చిన తొలి రోజే అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ మెడికల్ ఇన్స్ట్రుమెంటేషన్(ఏఏఎంఐ), గ్లోబల్ క్లినికల్ ఇంజినీరింగ్ అలయెన్స్(జీసీఈఏ) ఆధ్వర్యంలో 5వ ఇంటర్నేషనల్ క్లినికల్ ఇంజినీరింగ్ అండ్ హెల్త్ టెక్నాలజీ మేనేజ్మెంట్ కాంగ్రెస్ (ఐసీఈహెచ్‌టీఎంసీ) ప్రారంభమైంది. ఈ నెల 13వ తేదీ వరకు నిర్వహించనున్న సదస్సులో కోవిడ్–19 అనంతర పరిణామాలతోపాటు వైద్య పరికరాల వినియోగం, అందుబాటులో ఉన్న అత్యాధునిక వైద్య పరికరాలు, హెల్త్ మేనేజ్మెంట్ తదితర అంశాలపై చర్చిస్తారు. అమెరికా, చైనా, వెనుజులా, మెక్సికో, స్కాట్లాండ్, బ్రెజిల్, స్పెయిన్, కొలంబియా తదితర దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కాంగ్రెస్‌లో భాగంగానే 14 నుంచి 16వ తేదీ వరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఆధ్వర్యంలో ఇన్నోవేషన్ ఫోరం సమావేశం కూడా మెట్‌టెక్ జోన్లో నిర్వహించనున్నట్లు ఏఏఎంఐ చీఫ్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ ఆఫీసర్ రాబర్ట్ బరోస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో 80కి పైగా దేశాలకు చెందిన జాతీయ ఆరోగ్య మంత్రిత్వ శాఖల ప్రతినిధులు హాజరవుతారని వెల్లడించారు. -
Live Stock Expo : పశు సంపద రంగానికి తగినంత గుర్తింపు రావాలి
ఎల్డిఎఫ్ ఇండియా, పశువులు, పాడి పరిశ్రమ మరియు మత్స్య పర్యావరణ వ్యవస్థలన్నింటిని ఒకే పైకప్పు కిందకు తీసుకువచ్చే భారతదేశపు మొట్టమొదటి ఎక్స్పో గురువారం హైటెక్స్‌లో ప్రారంభమైంది. ఆదివారం వరకు మూడురోజుల పాటు జరిగే ఈ ఎక్స్‌పోలో సుమారు 80 స్టాల్స్ హైలైట్‌గా నిలవనున్నాయి. ఈ కార్యక్రమాన్ని హైటెక్స్, ఆక్వా ఫార్మింగ్ టెక్నాలజీస్ అండ్ సొల్యూషన్స్ (AFTS) సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. డాక్టర్ తరుణ్ శ్రీధర్, మాజీ యూనియన్ సెక్రటరీలతో పాటు పలువురు సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఈ వేడుకలో పాల్గిన్నారు. ఈ సందర్భంగా డా. తరుణ్ శ్రీధర్ మాట్లాడుతూ.. పశుసంపద సరైన గుర్తింపుకు నోచుకోలేదని, భారత్‌లో ఇప్పటికే చాలామంది గ్రామాల్లోనే నివసిస్తున్నారని తెలిపారు. అసలు పశువులతో సంబంధం లేకుండా ఏ రైతును చూడలేరన్నారు. భారతదేశం గణనీయమైన పశువుల జనాభాను కలిగి ఉందని, ప్రపంచ చేపల ఉత్పత్తి సహా పాల ఉత్పత్తి వినియోగంలో భారత్ ముందుందని పేర్కొన్నారు. ఎల్‌డిఎఫ్‌పై అంకితమైన ఎక్స్పో చాలా అవసరం. ఇది త్వరలో ప్రపంచ స్థాయిలో బోస్టన్ సీఫుడ్స్‌తో సమానంగా ఎదుగుతుందనన్నారు.ఇలాంటి ఎక్స్‌పోలు మన బలాన్ని ప్రదర్శించడమే కాకుండా విధి విధానాలను నిర్మించే ప్రభుత్వ అధికారులను మేల్కొల్పుతాయని అన్నారు డాక్టర్ తరుణ్ శ్రీధర్. 2022-23లో రికార్డు స్థాయిలో 174 లక్షల టన్నుల చేపల ఉత్పత్తిని సాధించింది. ఇది రూ.63,960 కోట్ల సీఫుడ్ ఎగుమతులను సాధించిందని, ఇంకా, భారతదేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆక్వాకల్చర్ ఉత్పత్తిదారు అని భారతదేశంలోని చేపలలో 68% ఆక్వాకల్చర్ రంగం నుండి వస్తుందని తెలిపారు. పశువులు శక్తి. పశువులు ఎల్లప్పుడూ వ్యవసాయంలో అంతర్భాగంగా ఉంటాయి. కానీ ఇది చాలా మంచి సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ, యువతకు ఆకర్షణీయంగా కనిపించదు. అయితే ప్రపంచం మొత్తం సహజ, సేంద్రియ, పున రుత్పత్తి వ్యవసాయం గురించి మాట్లాడుతున్నందున మంచి రోజులు వచ్చాయి. పశుసంవర్ధక రంగం ఇప్పుడు ఆహార భద్రత నే కాక, పోషకాహార భద్రతగానూ గొప్ప సంభావ్యత కలిగిన చాలా పెద్ద రంగంగా పరిగణించబడుతుంది. ప్రపంచ ఆకలి సూచీలో 121 స్థానాల్లో భారతదేశం 107 స్థానాల్లో ఉన్న నేపథ్యంలో పశు సంపదకు సంబంధించిన ఉత్పత్తులకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. మాంసం తినే జనాభాలో 70% కంటే ఎక్కువ భారతదేశం. 2050లో 18.1 MT తలసరి మాంసం వినియోగం 13.8 కిలోల అంచనాగా ఉందని NABARD చీఫ్ జనరల్ మేనేజర్ సుశీల చింతల అన్నారు. గోదావరి కట్స్‌లో 25 కిలోల ఎల్లోఫిన్ ట్యూనా అనే అరుదైన చేపలను ప్రదర్శించారు. ఎల్లోఫిన్ ఆరు లేదా ఏడు సంవత్సరాల వరకు జీవించగలదు. ఇవి అధిక వలసలు, పసిఫిక్, అట్లాంటిక్ -హిందూ మహాసముద్రాల అంతటా కనిపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద జీవరాశి అయిన ఎల్లో ఫిష్ ట్యూనా అంతరించిపోతోంది. భారత ప్రభుత్వంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ అదనపు డెవలప్మెంట్ కమీషనర్ డి. చంద్ర శేఖర్ మాట్లాడుతూ.. ''భారతదేశంలో 46 (23 మంది స్థానిక, 23 మంది స్థానికేతర) సూక్ష్మ, చిన్న వ్యాపారవేత్తలు పాల్గొనేందుకు మంత్రిత్వ శాఖ వీలు కల్పించింది. రిటైర్డ్ బ్యూరోక్రాట్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అయిన డబ్ల్యువిఆర్ రెడ్డి మాట్లాడుతూ మనమందరం చిన్నతనం నుండే పశువులతో ముడిపడి ఉన్నాం. కానీ మన యువత ఇప్పుడు దానిపై ఆసక్తి చూపడం లేదు. యువతను ఆకర్షించేందుకు వీలుగా ఈ రంగాన్ని బ్లూ కాలర్ లాంటి రంగంగా మార్చాలి. మీరు సాంకేతికతపరమైన ఆవిష్కరణలను తీసుకురావాలని ఆయన పిలుపునిచారు.దళిత బంధు లబ్ధిదారులు కూడా అవకాశాలను అన్వేషించడానికి ఎక్స్పోను సందర్శించాలని ప్లాన్ చేస్తున్నారు. ఎక్స్‌పోలో కంట్రీ చికెన్ వంటి అనేక స్టాల్స్ ఉన్నాయి. దీనిని ఇద్దరు యువ పారిశ్రామికవేత్తలు సాయికేష్ గౌండ్, మొహమ్మద్ సమీ ఉద్దీన్ స్థాపించారు. ఆధునిక,పరిశుభ్రమైన మాంసం దుకాణాలు అవసరమని చాలా మంది తెలియచేశారు. కూరగాయలకు మంచి, పరిశుభ్రమైన దుకాణాలు ఉన్నప్పటికీ, పరిశుభ్రమైన మాంసం దుకాణాలు ఎక్కువగా కనిపించవు. గడ్డకట్టిన చేపలను కొనడానికి ప్రజలు నిరాకరిస్తారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు అన్నీ క్రమంగా మారుతూ వస్తున్నాయి. అందరూ తమ వ్యాపారాలకి ప్రజలను ఆకర్షించే కొత్త దారులను వెతుకుతున్నారు. -
‘యశోభూమి’కి తరలిరండి
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్లలో ఒకటైన ఇండియా ఇంటర్నేషన్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో సెంటర్ ‘యశోభూమి’ మొదటి దశను ప్రధాని మోదీ ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా ఇదే వేదికపై ‘పీఎం విశ్వకర్మ’ పథకానికి శ్రీకారం చుట్టారు. ఢిల్లీలోని భారత్ మండపం, యశోభూమిలో సకల సౌకర్యాలున్నాయని, వీటిని ఉపయోగించుకోవాలని, ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించేందుకు ముందుకు రావాలని సినిమా, టీవీ పరిశ్రమను, అంతర్జాతీయ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలను ప్రధాని ఆహా్వనించారు. పీఎం విశ్వకర్మ పథకంలో సంప్రదాయ వృత్తి కళాకారులకు, కార్మికులకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. 18 మంది లబి్ధదారులకు ‘విశ్వకర్మ సర్టిఫికెట్లు’అందజేశారు. వారు ఎలాంటి పూచీకత్తు లేకుండానే తక్కువ వడ్డీకే రూ.3 లక్షలదాకా రుణం పొందవచ్చు. కాన్ఫరెన్స్ టూరిజంకు పెద్దపీట దేశంలో సదస్సుల పర్యాటకానికి ఉజ్వలమైన భవిష్యతు ఉందని మోదీ స్పష్టం చేశారు. యశోభూమి కన్వెన్షన్ సెంటర్ ప్రారం¿ోత్సవంలో ఆయన ప్రసంగించారు. భారత్‌లో ఈ రంగం విలువ రూ.25,000 కోట్లకుపైగా ఉందన్నారు. అనంతరం ‘యశోభూమి ద్వారక సెక్టార్ 25’మెట్రో రైల్వే స్టేషన్‌ను మోదీ ప్రారంభించారు. ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షల వెల్లువ ప్రధాని మోదీ 73వ జన్మదినం సందర్భంగా ఆదివారం రాష్ట్రపతి ముర్ము, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అధికార బీజేపీ ‘సేవా పఖ్వారా’ను ప్రారంభించింది. అక్టోబర్ 2 దాకా ఇది కొనసాగుతుంది. రూ.13 వేల కోట్లతో ‘విశ్వకర్మ’ పథకానికి శ్రీకారం దేశంలో పౌరుల రోజువారీ జీవనంలో విశ్వకర్మల పాత్ర చాలా కీలకమని మోదీ ఉద్ఘాటించారు. ఎంతటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా సమాజంలో వారి స్థానం చెక్కుచెదరని ప్రశంసించారు. రూ.13,000 కోట్లతో పీఎం విశ్మకర్మ పథకాన్ని అమలు చేస్తామని, సంప్రదాయ వృత్తి కళాకారులకు, కారి్మకులకు అండగా నిలుస్తామని అన్నారు. ఈ పథకంతో వడ్రంగులు, స్వర్ణకారులు, కమ్మరులు, శిల్పకారులు, కుమ్మరులు, దర్జీలు, తాపీ మేస్త్రీలు, రజకులు, క్షురకులు తదితరులకు మేలు జరుగుతుందన్నారు. -
సెప్టెంబర్ 14 నుంచి గ్లోబల్ స్టెయిన్లెస్ స్టీల్ ఎక్స్పో
న్యూఢిల్లీ: స్టెయిన్లెస్ స్టీల్ రంగంలో ఉన్న అవకాశాలు, డిమాండ్‌పై కంపెనీలు చర్చించనున్నాయి. ముంబైలో సెప్టెంబర్ 14 నుంచి మూడు రోజుల పాటు జరగనున్న ‘గ్లోబల్ స్టెయిన్లెస్ స్టీల్ ఎక్స్పో 2023’ ఇందుకు వేదికగా నిలవనుంది. పరిశ్రమకు చెందిన 500 మందికి పైగా ఇందులో పాల్గొననున్నారు. ఈ వివరాలను విగ్రో కమ్యూనికేషన్స్ అండ్ ఎగ్జిబిషన్స్ (వీసీఈ) ప్రకటించింది. డిమాండ్‌ను సృష్టించడం, కాలుష్య ఉద్గారాల నియంత్రణ లక్ష్యాలు, కొత్త టెక్నాలజీలపై పరిశోధన, అభివృద్ధి తదితర అంశాలపై స్టెయిన్లెస్ స్టీల్ కంపెనీల ప్రతినిధులు చర్చించనున్నారు. ‘‘భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించే విషయంలో స్టెయిన్లెస్ స్టీల్ కీలక పాత్ర పోషించనుంది. గ్లోబల్ స్టెయిన్లెస్ స్టీల్ ఎక్స్‌పోలో భాగంగా సీఈవోలతో రౌండ్ టేబుల్, బిజినెస్ టు గవర్నమెంట్ సమావేశాలు జరుగుతాయి. వీటికితోడు పరిశ్రమ తరఫున సాంకేతిక సదస్సులు కూడా ఉంటాయి’’అని వీసీఈ డైరెక్టర్ అనితా రఘునాథ్ తెలిపారు. -
హైదరాబాద్‌లో అతిపెద్ద అంతర్జాతీయ ప్లాస్టిక్ ఎక్స్పో ప్రారంభం
దేశంలో మూడో అతిపెద్ద ప్లాస్టిక్ ఎక్స్పో హైప్లెక్స్-2023 హైదరాబాద్‌లో శుక్రవారం (ఆగస్ట్ 4) ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ టీఎస్ఐఐసీ ఎండీ, వైస్ చైర్మన్ వెంకట నర్సింహా రెడ్డి ఇతర ప్రముఖులతో కలిసి ప్రారంభించారు. ఆగస్టు 4 నుంచి 7వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు నగరంలోని హైటెక్స్‌లో ఈ ప్రదర్శన జరగనుంది. ఎనిమిది సంవత్సరాల తర్వాత హైప్లెక్స్ అనే పేరుతో దీన్ని ఏర్పాటు చేశారు. ఇంతకుముందు ఐప్లెక్స్గా వ్యవహరించేవారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ అండ్ ఫెసిలిటేషన్ ఆఫీస్ అడిషనల్ డెవలప్మెంట్ కమిషనర్ చంద్ర శేఖర్, హెచ్ఎంఈఎల్ ఎండీ, సీఈవో ప్రభుదాస్, గెయిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీవాస్తవ, ఇండియన్ ప్లాస్టిక్స్ ఇన్స్టిట్యూట్ నేషనల్ ప్రెసిడెంట్ అనిల్ రెడ్డి వెన్నం, ఎఫ్‌టీసీసీఐ ప్రెసిడెంట్ మీలా జయదేవ్ గౌరవ అతిథులుగా హాజరై ప్రసంగించారు. షో డైరెక్టరీ, డైలీ షో మ్యాగజైన్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీఎస్ఐఐసీ ఎండీ, వైస్ చైర్మన్ వెంకట నర్సింహా రెడ్డి మాట్లాడుతూ టీఎస్ ఐపాస్ చట్టం తెలంగాణ ప్రభుత్వ మైలురాయి నిర్ణయమని పేర్కొన్నారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన లైసెన్సుల జారీ ప్రక్రియను ఈ చట్టం వేగవంతం చేస్తోందన్నారు. దీని కింద గత ఎనిమిదిన్నర సంవత్సరాలలో 24000 పరిశ్రమ ప్రతిపాదనలను ఆమోదించినట్లు చెప్పారు. మొదటి ప్లాస్టిక్ పార్క్ విజయవంతమైందని, రెండోది కావాలన్నా భూమి ఇచ్చేందుకు టీఎస్ఐఐసీ సిద్ధంగా ఉందని తెలిపారు. దాదాపు 20,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ ఎక్స్‌పోలో ప్రపంచవ్యాప్తంగా 400 సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నాయి. తెలంగాణ అండ్ ఆంధ్రా ప్లాస్టిక్స్ మ్యాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (టాప్మా) ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న ఈ ప్రదర్శనలో రూ.500 కోట్ల మేర వ్యాపారం జరుగుతుందని అంచనా వేస్తున్నట్లు తాప్మా అధ్యక్షుడు విమలేష్ గుప్తా తెలిపారు. -
రియల్ రంగంలో హైదరాబాద్ టాప్
మాదాపూర్: రియల్ ఎస్టేట్ రంగం హైదరాబాద్‌లో శరవేగంగా అభివృద్ధి చెందుతోందని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో శనివారం రెండు రోజుల పాటు నిర్వహించనున్న టైమ్స్ ప్రాపర్టీ హైదరాబాద్ ప్రాపర్టీ ఎక్స్పో–2022ను ఆయన నిర్వాహకులతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెరా(తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ) ను ప్రారంభించినప్పటి నుంచి 5299 కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్లను తెలంగాణ ప్రభుత్వం క్లియర్ చేసిందన్నారు. ప్రస్తుతం దేశంలో ఐదవ స్థానంలో ఉన్నామని, అతి త్వరలో మరింత ఉన్నత స్థానాన్ని చేరుకుంటామని చెప్పారు. నగరంలో నిరంతరం విద్యుత్ సదుపాయం ఉండడంతో ఇన్వర్టర్లు, జనరేటర్ల వ్యాపారం అంతరించిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో నిరంతరం అభివృద్ధి పనులు జరుగుతుండటంతో రియల్ రంగంలో హైదరాబాద్ టాప్‌గా నిలవనుందని చెప్పారు. కార్యక్రమంలో ఏఎస్బీఎల్ సీఈఓ అజితేష్ కొరుపోలు, మ్యాండేట్ ఎండీ బిస్వజిత్ పట్నాయక్, రాంకీ ఎండీ నందకిషోర్, కాన్సెప్ట్ అంబెన్స్ డైరెక్టర్ ముకుల్ అగర్వాల్, క్రెడాయ్ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
శివానంద ‘యోగ’
-
80 బిలియన్ డాలర్లకు ‘బయో–ఎకానమీ’
న్యూఢిల్లీ: దేశాన్ని వృద్ధి బాటలో నడిపే క్రమంలో ప్రతీ రంగానికి తోడ్పాటు అందించాలని తమ ప్రభుత్వం విశ్వసిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. గతంలో కొన్ని రంగాలకు మాత్రమే ప్రాధాన్యం లభించేదని, తమ ప్రభుత్వ హయాంలో అన్ని పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలోనే గత ఎనిమిదేళ్లలో భారత ’బయో–ఎకానమీ’ ఎనిమిది రెట్లు పెరిగిందని, 10 బిలియన్ డాలర్ల నుంచి 80 బిలియన్ డాలర్లకు చేరిందని ప్రధాని పేర్కొన్నారు. బయోటెక్ వ్యవస్థలో టాప్ 10 దేశాల్లో భారత్ కూడా ఒకటిగా నిలిచే రోజు ఎంతో దూరం లేదన్నారు. బయోటెక్ స్టార్టప్ ఎక్స్పోను గురువారం ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. గడిచిన ఎనిమిదేళ్లలో దేశీయంగా అంకుర సంస్థల సంఖ్య వందల స్థాయి నుంచి 60 పైగా పరిశ్రమల్లో 70,000 పైచిలుకు చేరిందని మోదీ చెప్పారు. కొన్ని రంగాల ఎగుమతులు రికార్డు స్థాయికి చేరాయని పేర్కొన్నారు. ’బయోటెక్ స్టార్టప్స్ ఆవిష్కరణలు: స్వావలంబన భారత్ సాధన దిశగా’ అంశంపై ఈ ఎక్స్పో సదస్సు రెండు రోజుల పాటు (జూన్ 9, 10) జరుగుతుంది. ఔత్సాహిక వ్యాపారవేత్తలు, ఇన్వెస్టర్లు, పరిశ్రమ దిగ్గజాలు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు, తయారీదారులు మొదలైన వారం తా కలిసేందుకు ఇది వేదికగా నిలవగలదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
120 ఎగ్జిబిటర్లు..500 బ్రాండ్లు, ప్రారంభమైన ఇంటీరియర్ ఎక్స్పో!
సాక్షి, హైదరాబాద్: ప్రస్థుతం ఇంటీరియర్ డిజైనింగ్ విభాగం ఎంతో అభివృద్ధి చెందినదని, ఇందులో భాగం గా స్థానిక కళాకారుల నుంచి సేకరించిన కళాఖండాలతో డిజైన్లను రూపొందిస్తే అన్ని రకాల కళలు ప్రయోజనం పొందుతాయని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తెలిపారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ ఇంటీరియర్ డిజైనర్స్ (ఐఐఐడి) హైదరాబాద్ ప్రాంతీయ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా ‘‘ఐఐఐడి షోకేస్ ఇన్సైడర్ ఎక్స్ 2022’’ నాల్గవ ఎడిషన్‌ను ఏర్పాటు చేశారు. తెలంగాణ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇతివృత్తంతో 3 రోజుల పాటు ఈ ప్రదర్శన జరగనుంది. ఈ సందర్భంగా సీఎస్ సోమేష్ మాట్లాడుతూ., ప్రదర్శనలో ఏర్పాటు చేసిన ప్రతి స్టాల్ ఆసక్తికరంగా ఉందని, ఇంటీరియర్ డిజైనింగ్ రంగంలో జరుగుతున్న అభివృద్ధి గురించి మరింత తెలుసుకోవాలనే కుతూహలాన్ని పెంచిందని అన్నారు. ఈ ఎగ్జిబిషన్లో కళారూపాల్లో భాగంగా స్థానికంగా ప్రాచూర్యం పొందిన కళలను చేరదీయడం, ఇక్కడి ముడిసరుకు, కళాకారులను చేర్చుకోవడం అభినందనీయమని అన్నారు. హస్తకళాకారులు ఇతర కళలకు మరింత గుర్తింపు తీసుకురావడానికి ఆర్కిటెక్ట్‌లు, ఇంటీరియర్ డిజైనర్లు మరింత చొరవ చూపాలని సూచించారు. గతంలో తాను అనంతపురం జిల్లా కలెక్టర్‌గా ఉన్నప్పుడు ఆ జిల్లాలో తోలుబొమ్మలాటలో నిమగ్నమైన హస్తకళాకారుల అభివృద్ధికి కృషి చేశానని పేర్కొన్నారు. ఈ ఎక్స్‌పోలో ఫర్నిచర్, నిర్మాణాల కోసం వెదురు వంటి ప్రత్యామ్నాయ వస్తువులను ఉపయోగించడం వినూత్నంగా ఉందని అన్నారు. ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన ఆర్కిటెక్ట్‌లు, ఇంటీరియర్ డిజైనర్లు, ఎగ్జిబిటర్లకే కాకుండా సాధారణ ప్రజలకూ మరింత ఆసక్తిని పెంపొందిస్తుందని పేర్కొన్నారు. ఐఐఐడి హెచ్ఆర్సి, చెర్మైన్ మనోజ్ వాహి మాట్లాడుతూ., కరోనా మహమ్మారి ఇబ్బంది పెట్టినా ఇంటీరియర్ డిజైనింగ్ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతున్నదని అన్నారు. వినియోగదారులు, డిజైనర్ల నుంచి పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని వీరందరినీ ఒకచోటుకు చేర్చడానికి ఐఐఐడి ఈ వేదికను ఏర్పాటు చేసిందని తెలిపారు. ఇందులో 120 ఎగ్జిబిటర్లు, యైభైకు పైగా కేటగిరీల నుంచి 500 బ్రాండ్లు పాల్గొన్నాయని అన్నారు. చేర్యాల్, పోచంపల్లి, పెంబర్తి నుంచి వచ్చిన కళాకారులు వర్క్‌షాప్‌లు నిర్వహిస్తుండగా, అనంతపురం నుంచి వచ్చిన కళాకారులచే తోలుబొమ్మలాట ప్రదర్శిస్తున్నారని, ఇందులో భాగంగా ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైనింగ్ కాలేజీల భాగస్వామ్యాన్ని తీసుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఐడి–హెచ్ఆర్సి కోశాధికారి ఎఆర్. రాకేష్ వాసు, చీహైదరాబాద్ చాప్టర్ కార్యదర్శి ఎఆర్. ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ పెవిలియన్‌ను అట్టహాసంగా ప్రారంభించిన మంత్రి గౌతమ్‌రెడ్డి
-
అవకాశాలున్నాయ్.. అందిపుచ్చుకోండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్ద పీట వేస్తున్నారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చెప్పారు. ముఖ్యంగా వైద్యం, వ్యవసాయ రంగాలకు సీఎం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. పారిశ్రామిక మౌలిక వసతుల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం ముందుందని తెలిపారు. రాష్ట్రంలో మూడు పోర్టులు, 9 ఫిషింగ్ హార్బర్లు, నాలుగు లాజిస్టిక్ పార్కులను అభివృద్ధి చేస్తోందన్నారు. రాష్ట్రం నుంచి వెళుతున్న మూడు పారిశ్రామిక కారిడార్లలో పెద్ద ఎత్తున మౌలిక వసతులు కల్పిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను వివరిస్తూ దుబాయ్ ఎక్స్‌పోలో ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్‌ను యూఏఈ విదేశాంగ శాఖ మంత్రి తనిబిన్ అహ్మద్ ఆల్ జియాది, ఇండియాలో సౌదీ అరేబియా అంబాసిడర్ అహ్మద్ అబ్దుల్ రెహమాన్, యూఏఈలో భారత దౌత్యాధికారి సంజయ్ సుధీర్, రాష్ట్ర విదేశీ పెట్టుబడుల సలహాదారు జుల్ఫీలతో కలిసి మంత్రి మేకపాటి లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తూ 12 థీమ్‌లతో ఏపీ పెవిలియన్ ఏర్పాటు చేశారు. ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఇప్పటికే యూఏఈకి చెందిన అల్లానా గ్రూపు రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులు పెట్టిందని తెలిపారు. ఇదే విధంగా మరిన్ని కంపెనీలు ముందుకు రావాలని కోరారు. దుబాయ్ ఎక్స్పో సందర్భంగా ఆటోమొబైల్, టెక్స్టైల్, ఇన్ఫ్రా, స్కిల్, పెట్రోకెమికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ వంటి రంగాల్లో పెట్టుబడులపై దృష్టి సారించినట్లు తెలిపారు. ఏపీ పెవిలియన్‌కు మంచి స్పందన వస్తోందని, ఇప్పటికే 12 సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలపై చర్చించడానికి ఆసక్తిని వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఈ ఎక్స్‌పోలోనే మూడు భారీ పెట్టుబడులపై ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో ఐటీ, ఫైనాన్షియల్ సేవల రంగంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి, వైస్ చైర్మన్, ఎండీ జవ్వాది సుబ్రమణ్యం, ఏపీ మారిటైమ్ డిప్యూటీ సీఈవో రవీంద్రనాథ్ రెడ్డి, , కర్నూలు ఎమ్మల్యే హఫీజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు -
చల్లని సాయంత్రం సరదాగా కాసేపు.. రండి ఎక్స్పో పోదాం.. ఎంజాయ్ చేద్దాం
-
ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన అందాల అనన్య
-
బిజినెస్ ఉమెన్ ఎక్స్ పో
-
ఎక్స్పో.. నెక్ట్స్ షో..
-
సర్వం ‘మహిళ’మయం...
కళకళలాడే డిజైనర్ దుస్తులు, ఆభరణాలు, చేనేత కళలు, మ్యూరల్ ఆర్ట్, యాక్సెసరీస్ వెరసి మహిళల కోసం కొలువుదీరే ఎక్స్‌పోల డిమాండ్ అంతా ఇంతా కాదు. పదేళ్ల క్రితం సంపన్నులకు మాత్రమే పరిచయమున్న ఎక్స్‌పోలు ట్రెండ్జ్ పేరుతో సిటీకి చెందిన శాంతి కతిరావన్ మధ్యతరగతికి చేరువ చేశారు. నిర్వహణలో సృజనాత్మక పోకడలకు నాంది పలికి, 130 పైగా ట్రేడ్ ఎక్స్పోలను నిర్వహించిన ఏకైక తెలుగు మహిళగా నిలిచారు. ఎక్స్‌పోల నిర్వహణ కోసం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటుతో ట్రెండ్‌కు తెరతీశారు.విభిన్న కళల సమాహారమైన డిజైనర్ ఎక్స్పోట్రెండ్జ్ ప్రదర్శనతాజ్కృష్ణా హోటల్లోనిర్వహిస్తున్న సందర్భంగా ఆమె పంచుకున్నవిశేషాలు ఆమె మాటల్లోనే... సాక్షి, సిటీబ్యూరో :ఎంబీఏ కంప్లీట్ చేసి, బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తూ బాబు పుట్టాక బ్రేక్ తీసుకున్నాను. ఆ బ్రేక్‌లో సరదాగా 2010 డిసెంబరులో విశాఖలోని ఫారŠూచ్యన్ శ్రీకన్య హోటల్లో ‘ట్రెండ్జ్’ స్టార్ట్ చేశా. అది విజయవంతం అయింది. 2011 జనవరిలో సిటీలో తొలి ఎక్స్పో శ్రీనగర్‌కాలనీలోని సత్యసాయి నిగమాగమంలో చేశాను. ఏడాది పాటు హాబీగా చేసినా తర్వాత దీన్ని పూర్తిస్థాయిలో టేకప్ చేశా. అప్పట్లో స్టార్ హోటల్స్‌కి మహిళలు ఒంటరిగా రావడానికి ఇబ్బంది పడే విశాఖ, విజయవాడల్లో ఎక్స్పో పరిచయం చేసింది నేనే. సర్వం ‘మహిళ’మయం... కలలు కనడంలోనే కాదు కళలను పసిగట్టడంలోనూ మహిళలే ముందుంటారు. ఉదాహరణకు కంచి పట్టు చాలా ఫేమస్...కానీ చీరాల పట్టు కూడా అంతే నాణ్యంగా ఉంటుంది. కుప్పడం వర్క్ మరింత అందుబాటు ధరలో ఉంటుంది. దాన్ని మహిళలు చక్కగా గమనించగలరు అందుకే సిటీలో ఈ వర్క్‌కు ఆదరణ ఎక్కువ. గతంతో పోలిస్తే ఇప్పుడు చేనేత, హస్తకళాకారుల వర్క్‌కు డిమాండ్ బాగా ఉంది అయితే కళ చేతిలో ఉన్నా వీవర్స్‌కి వ్యాపార మెళకువలు తెలియడం లేదు. కంచి, చీరాల కుప్పడం, గద్వాలకు చెందిన హస్తకళాకారుల వర్క్స్‌కి బాగా డిమాండ్ ఉంది. మనం ఎంత గొప్ప వర్క్ సృష్టించామనేది ఎంత ముఖ్యమో దాన్నెంత బాగా వినియోగదారుని దగ్గరకు చేర్చగలమనేది కూడా అంతే ముఖ్యం. ఉత్తర భారతదేశం నుంచి వచ్చే డిజైనర్లు, ఆర్టిజన్స్ విక్రయశైలి వల్ల వారికి స్పందన బాగా లభిస్తుంది. ఎక్స్పో వర్సెస్ షోరూమ్ ఎగ్జిబిషన్లో ప్రతి కస్టమర్‌కి రెడ్ కార్పెట్ పరుస్తాం. షోరూమ్స్‌లో ఎవరో ఒక కస్టమర్ రిలేషన్ ఆఫీసర్ని సంప్రదిస్తాం. ఇక్కడ తయారీదారులు/కస్టమర్లు ప్రత్యక్షంగా కలుస్తారు. అంతేకాదు మార్కెట్ కన్నా ముందు ఇక్కడ అందుబాటులోకి వస్తాయి. ఇప్పుడు షోరూమ్‌ల తరహాలోనే ఎక్స్‌పోలలో కూడా రూ.1500 నుంచీ ఉత్పత్తులు లభిస్తున్నాయి. దక్షిణాది వ్యాప్తంగా... తొలుత ఏడాదికి మూడు సార్లు చేసేవాళ్లం. సిటీలో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటు చేసి ఇప్పుడు మన సిటీలోనే 20దాకా,అలాగే దక్షిణాది మొత్తం చేస్తున్నా.. కోయంబత్తూర్, కొచ్చిలో కూడా ఆఫీస్‌లు స్టార్ట్ చేశాం. భవిష్యత్తులో వైవిధ్యభరితమైన ఎక్స్‌పోలు నిర్వహించాలని ఉంది. -
షోయగం
-
‘ది హాత్’ షురూ
-
బుల్లితెర నటి నవ్య నవ్వు