ఒకే చోట మూడు ఎగ్జిబిషన్లు
200లకు పైగా రకాల పిల్లులు
70 రకాల అలంకార చేపలు
హైటెక్స్ ఎగ్జిబిషన్ కేంద్రంలో 31 నుంచి ఫిబ్రవరి 2 వరకూ ఈవెంట్స్
ఫిబ్రవరి 1న కిడ్స్ రన్
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అతిపెద్ద పెట్ ఎక్స్‌పో నిర్వహణకు హైదరాబాద్ వేదికగా నిలవనుంది. జనవరి 31 నుండి ఫిబ్రవరి 2 వరకూ మూడు రోజుల పాటు పెటెక్స్, తొలి కిడ్స్ బిజినెస్ కారి్నవాల్, కిడ్స్ ఫెయిర్‌లను ఏకకాలంలో హైటెక్స్‌లో నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన అంశాలను హైటెక్స్ వాణిజ్య ఉన్నతాధికారి టీజీ శ్రీకాంత్ శుక్రవారం వివరించారు. కారి్నవెల్ మద్దతుతో పెటెక్స్ భారత్, టర్కీ, చెక్ రిపబ్లిక్, సింగపూర్, జపాన్, జర్మనీ తదితర దేశాలకు చెందిన 60కిపైగా ఎగ్జిబిటర్లు ఉన్నారన్నారు. పెంపుడు జంతు ప్రేమికులు, ఔత్సాహికులను ఒక చోట చేర్చుతుందన్నారు.
ఈ ప్రదర్శనలో 70కిపైగా అలంకారప్రాయమైన చేపల జాతులు ఉంటాని తెలిపారు. వివిధ బ్రీడ్‌ల గుర్రాలు, పక్షులు, కుక్కల ఫ్యాషన్ షో, కే–9 స్కూల్ కుక్కల ప్రదర్శన, స్కూపీ స్క్రబ్ వారి ఉచిత బేసిక్ గ్రూమింగ్ వంటివి ప్రదర్శించనున్నారు. కిడ్స్ బిజినెస్ కార్నివాల్ తొలి ఎడిషన్‌లో 85 మంది ఔత్సాహిక విద్యార్థులు ఉన్నారన్నారు. పలు ఉత్పత్తులు, ఆవిష్కరణలను ఈ ఎక్స్‌పోలో ప్రదర్శించనున్నారని తెలిపారు. క్యాట్‌ఛాంపియన్ షిప్ ను ఇండియన్ క్యాట్ క్లబ్ నిర్వహిస్తోంది. 200 రకాల పిల్లులు, అందులోనూ కొన్ని అరుదైన జాతులను సందర్శించొచ్చని పేర్కొన్నారు.
మొదటిసారి కిడ్స్ కార్నివాల్ ..
మొట్టమొదటిసారి కిడ్స్ బిజినెస్ కార్నివాల్ నిర్వహించనున్నామని, పిల్లల్లోని వ్యవస్థాపక స్ఫూర్తిని ప్రదర్శించేందుకు ఈ ఎక్స్‌పో వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. వ్యాపార ప్రణాళిక, పోటీ, ఉత్పత్తుల ప్రదర్శన మొదలైనవి ఇందులో ఉంటాయని వివరించారు. ఎల్రక్టానిక్స్, రోబోటిక్ ప్రాజెక్ట్‌లు, పెబుల్ ఆర్ట్, అయస్కాంత బుక్ మార్క్స్, విద్యార్థులు రాసిన పుస్తకాలు, 85 మంది విద్యార్థులు తయారు చేసిన హాండీ క్రాఫ్టŠస్ మొదలైనవి ఎక్స్‌పోలో చూడొచ్చని తెలిపారు.
కిడ్స్ రన్..
ఫిబ్రవరి 1న సాయంత్రం 5 గంటలకు హైటెక్స్‌లో 4కిలో మీటర్లు, 2–కే, 1–కే వంటి మూడు విభిన్న కేటగిరీల్లో కిడ్స్ రన్ నిర్వహించనున్నారు. ఐదేళ్ల నుంచి 13 ఏళ్ల వయసు పిల్లలు ఇందులో పాల్గొన వచ్చన్నారు.
పది రెట్లు ఎక్కువగా..
పెంపుడు జంతువుల దత్తత ప్రక్రియ భారత్ కంటే పాశ్చాత్య దేశాల్లో పది రెట్లు ఎక్కువని నిర్వాహకులు చెబుతున్నారు. 12 రాష్ట్రాలు, ఐదు దేశాల ప్రదర్శనకారులు ఈ మూడు ఎక్స్‌పోలో పాల్గొంటారని, సుమారు 25 వేలకు పైగా సందర్శకులు వస్తారని అంచనా వేస్తున్నామని తెలిపారు. దేశంలో పెట్ కేర్ పరిశ్రమ ప్రారంభ దశలో ఉందని, క్రమంగా పురోగమిస్తోందని, పెంపుడు జంతువుల దత్తత క్రమంగా పెరుగుతోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment