pet
-
ఎయిర్‌పోర్ట్‌లో దారుణం: పెంపుడు కుక్కను చంపేసి.. విమానం ఎక్కేసింది
అమెరికాలోని ఫ్లోరిడా విమానాశ్రయంలో చోటుచేసుకున్న ఘటన జంతు ప్రేమికులను నివ్వెరపోయేలా చేసింది. జంతు రవాణాకు తగిన పత్రాల్లేవని కుక్కను విమానంలోకి సిబ్బంది అనుమతించకపోవడంతో తన పెంపుడు కుక్కని చంపి చెత్తసంచిలో పడేసి వెళ్లిపోయిందా ఆ మహిళా యజమాని..సీసీటీవీ ఫుటేజీతో వెలుగులోకి దారుణం..పెంపుడు శునకంతో విమానాశ్రయానికి వచ్చిన అలిసన్ లారెన్స్ అనే మహిళను ఎయిర్ పోర్ట్ అధికారులు అడ్డుకున్నారు. శునకాన్ని వెంట తీసుకెళ్లేందుకు ప్రత్యేక అనుమతి కావాలని, ఆ పత్రాలు ఉంటే తప్ప శునకాన్ని విమానంలోకి అనుమతిస్తామంటూ అధికారులు స్పష్టం చేశారు. దీంతో వెనుదిరిగిన ఆ మహిళ కాసేపటి తర్వాత తిరిగి వచ్చి.. ఏమీ తెలియనట్లుగా విమానం ఎక్కి వెళ్లిపోయింది. శునకాన్ని తెలిసిన వారికి అప్పగించి వచ్చి ఉంటుందని అధికారులు భావించారు.అంతలోనే ట్విస్ట్ చోటు చేసుకుంది.. విమానం బయలుదేరిన కాసేపటికి బాత్ రూయ్లు శుభ్రం చేసేందుకు వెళ్లిన సిబ్బందికి అక్కడ కుక్క చనిపోయి కనిపించింది. బాత్ రూమ్‌లో శునకం కళేబరం బయటపడటంతో మెడకు ఉన్న వివరాలు, ఫోన్ నెంబర్ ఆధారంగా దాని యజమానురాలు అలిసన్గా ఎయిర్‌పోర్టు అధికారులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా అలిసన్ చేసిన దారుణం బయటపడింది. దీంతో జంతుహింస నేరం కింద ఆమెను అరెస్టు చేశారు. -
పెంపుడు కుక్క హఠాన్మరణం.. మంత్రి కొండా సురేఖ కన్నీరుమున్నీరు
సాక్షి, వరంగల్: తెలంగాణ మంత్రి కొండా సురేఖ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తమ పెంపుడు కుక్క గుండెపోటుతో మృతి చెందడంతో భావోద్వేగానికి లోనైనా మంత్రి.. కన్నీరుమున్నీరయ్యారు. గుండెపోటుతో చనిపోయిన హ్యాపీకి మంత్రి కొండా కుటుంబం.. అంతిమ సంస్కారాలు నిర్వహించారు. హ్యాపీ హఠాన్మరణంతో సురేఖ కుటుంబీకులు, సిబ్బంది కన్నీటి పర్యంతమయ్యారు.గత కొన్నాళ్లుగా హ్యాపీతో మధుర అనుభూతులను మంత్రి సురేఖ, స్టాఫ్ పంచుకున్నారు. 2021లో కూడా కొండా సురేఖకు చెందిన ఓ పెంపుడు కుక్క మృతి చెందితే ఆ సమయంలోనూ ఆమె తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Minister Konda Surekha breaks down in tears over sudden death of pet dog ‘Happy’pic.twitter.com/f87jhedaPA— Naveena (@TheNaveena) March 6, 2025 -
పీఈటీ కొట్టారని విద్యార్థి ఆత్మహత్య
ఉప్పల్ (హైదరాబాద్): నగరంలోని ఓ పాఠశాలలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్కూల్ పీఈటీ కొట్టడమే కాకుండా తోటి విద్యార్థుల ముందు అవమానించాడంటూ ఎనిమిదో తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్కూల్ భవనం నాల్గో అంతస్తు నుంచి కిందికి దూకి బలవన్మరణం పొందిన ఘటన శనివారం ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని సిద్ద హంగిర్గా గ్రామానికి చెందిన ముంగ ధర్మారెడ్డి, సంగీత దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు లింగారెడ్డి, చిన్న కుమారుడు సంగారెడ్డి(14). వీరి కుటుంబం 15 ఏళ్ల క్రితం నగరానికి వచ్చి బోడుప్పల్ పరిధిలోని ద్వారకా నగర్లో నివాసముంటోంది. తోపుడు బండిపై వ్యాపారం చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. సంగారెడ్డి.. ఉప్పల్‌లోని న్యూ భరత్‌నగర్‌లోని సాగర్ గ్రామర్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. శుక్రవారం సాయంత్రం స్టడీ అవర్ సమయంలో సంగారెడ్డి స్కూల్లో సీసీ కెమెరాలను కదిలించాడంటూ క్లాస్ టీచర్.. పీఈటీ ఆంజనేయులుకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆంజనేయులు కొట్టడంతోపాటు మందలించారు. శనివారం ఉదయాన్నే స్కూల్‌కు వచి్చన సంగారెడ్డిని పీఈటీ పనిష్మెంట్ పేరిట మరోసారి తరగతి గదిలో కొట్టడంతోపాటు అరగంటపాటు నిలబెట్టారు. తల్లిదండ్రులను పిలిపిస్తానని, టీసీ ఇచ్చి పంపిస్తానని బెదిరించారు. తోటి విద్యార్థుల ముందు దీన్ని అవమానంగా భావించిన సంగారెడ్డి.. ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్నాడు. ముందుగా తన నోట్ బుక్‌లో ‘సారీ మదర్– ఐ విల్ డై టుడే’అని రాసి వాష్‌రూంకు వెళ్తున్నానని చెప్పి తరగతి బయటకు వచ్చాడు. వస్తూ వస్తూ స్నేహితులకు బైబై అని చెప్పాడు. మూడవ అంతస్తులో ఉన్న తరగతి గది నుంచి నాల్గో అంతస్తుకు చేరుకుని అక్కడినుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న మల్కాజిగిరి ఏసీపీ చక్రపాణి, ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డి, మేడిపల్లి సీఐ గోవింద్ రెడ్డి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పంచనామా నిర్వహించి సంగారెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ అసుపత్రికి తరలించారు. స్కూల్ యాజమాన్యం, పీఈటీ ఆంజనేయులు, క్లాస్ టీచర్‌పై కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమంటూ డీఈవో పాఠశాలను సీజ్ చేశారు. కన్నీరు మున్నీరైన తల్లి ‘ప్రయోజకుడు కావాలని రెక్కలు ముక్కలు చేసుకుని పిల్లలను ప్రైవేట్ బడిలో చదివిస్తున్నా. ఎంతకష్టమొచి్చనా ఫీజును ఆపే వాళ్లం కాదు. నా కొడుకు ఏ పాపం చేశాడని చంపేశారు? అంటూ సంగారెడ్డి తల్లి కన్నీరు మున్నీరైంది. బాధ్యులను కఠినంగా శిక్షించాలని పోలీసులను వేడుకుంది. ఆమె ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూల్ ఆవరణలో కూర్చుని రోదించడం స్థానికులను కలచివేసింది. -
ఇవన్నీ ఉంటేనే ఇల్లు కొంటాం..
నివాస సముదాయాల్లో అన్ని వసతులు ఉండాల్సిందే.. ఆ విషయంలో మాత్రం అస్సలు తగ్గేదే లే అంటున్నారు కొనుగోలుదారులు.. గతంలో కమ్యూనిటీలలో జిమ్, స్విమ్మింగ్ పూల్ వంటి నాలుగైదు వసతులు ఉంటే సరిపోయేది. కానీ.. ప్రస్తుతం భవిష్యత్తు అవసరాలతో పాటు అభిరుచులకు తగ్గట్టుగా వసతులు ఉండాల్సిందే. ఇంటి నుంచి పని కోసం కో–వర్కింగ్ స్పేస్, ఆన్లైన్ క్లాస్‌ల కోసం డిజిటల్ క్లాస్ రూమ్ నుంచి మొదలుపెడితే.. టెర్రస్, క్లబ్హౌస్పై సౌర విద్యుత్ ఏర్పాట్లు, ఔట్‌డోర్ జిమ్, ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్స్, హోమ్ థియేటర్, ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్లు, పెట్పార్క్, గోల్ఫ్‌కోర్స్ వరకూ అన్ని ఆధునిక వసతులు కావాలని గృహ కొనుగోలుదారులు భావిస్తున్నారు. –సాక్షి, సిటీబ్యూరోపెట్ పార్క్, స్పా..జంతు ప్రేమికుల కోసం కూడా డెవలపర్లు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నివాస సముదాయాల్లో వసతుల జాబితాలో పెట్ పార్కులు కూడా చేరిపోయాయి. గేటెడ్ కమ్యూనిటీలలో కొనుగోలుదారులు పెంచుకునే పెంపుడు జంతువుల కోసం పెట్పార్క్, క్లబ్‌హౌస్‌లో పెట్ స్పాలను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు పెంపుడు జంతువుల ఆహార ఉత్పత్తులు, శిక్షకులు, వ్యాయామ ఉపకరణాలు వంటివి ఆయా ప్రాజెక్ట్‌లలో అందుబాటులో ఉంటాయి.సోలార్, హోమ్ గార్డెనింగ్ సొంతిల్లు కొనుగోలు చేసే క్రమంలో గేటెడ్ కమ్యూనిటీలో కామన్ ఏరియాలు ఎంత వరకు ఉన్నాయో అడిగి మరీ తెలుసుకుంటున్నారు. గతంలో కామన్ ఎలివేటర్, కామన్ కారిడార్, గ్యారేజ్, స్టేర్‌కేస్ ఉండేవి ఇప్పుడు వాటిని ప్రైవేట్ కావాలని అడుగుతున్నారు. ఇంట్లో సొంత అవసరాల కోసం కమ్యూనిటీ గార్డెన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. చిన్నపాటి స్థలంలో ఆకు కూరలు, కూరగాయలు పండించుకునేలా వర్టికల్ గార్డెనింగ్, బాల్కనీలలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వారాంతాల్లో కమ్యూనిటీ వాసులతో ఆహ్లాదంగా గడిపేందుకు ఔట్‌డోర్ కిచెన్, డైనింగ్ ఏరియా ఏర్పాటు చేస్తున్నారు. టెర్రస్, క్లబ్హౌస్పై సౌర విద్యుత్ ఏర్పాటు చేస్తున్నారు. వీధి దీపాలు, ఇతరత్రా అవసరాల కోసం ఈ విద్యుత్‌నే వినియోగిస్తున్నారు. దీంతో నివాసిత సంఘానికి కరెంట్ బిల్లు భారం తగ్గుతుంది.ఈవీ చార్జింగ్ స్టేషన్లుపెట్రోల్, డీజిల్ వంటి వాహనాలతో పర్యావరణం కాలుష్యం అవుతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాయి. వాహన కొనుగోళ్లపై రాయితీలు అందిస్తుండటంతో పాటు చార్జింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేస్తున్నాయి. డెవలపర్లు కూడా నివాస, వాణిజ్య సముదాయాల నిర్మాణంలో ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. నగరానికి చెందిన మైహోమ్, రాజపుష్ప, ప్రణీత్ గ్రూప్, పౌలోమి ఎస్టేట్స్ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థలు కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా వసతులను కల్పిస్తున్నారు.వసతులు ఇలా..నివాస సముదాయంలో ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్లు, ప్రతి పార్కింగ్ ప్లేస్ వద్ద చార్జింగ్ పెట్టుకునేందుకు వీలుగా పాయింట్లను ఇస్తున్నారు. జంతు ప్రేమికుల కోసం నివాస సముదాయంలోనే పెట్పార్క్, క్లబ్‌హౌస్‌లో పెట్ స్పాలను ఏర్పాటు చేస్తున్నారు. పెంపుడు జంతువుల ఆహార ఉత్పత్తులు, శిక్షకులు, వ్యాయామ ఉపకరణాలు వంటివి ఆయా ప్రాజెక్ట్‌లలో అందుబాటులో ఉంటాయి.రిచ్‌మ్యాన్ గేమ్‌గా పిలిచే గోల్ఫ్ కూడా వసతుల జాబితాలో చేరిపోయింది. ఆహ్లాదకరమైన వాతావరణంలో జిమ్ చేయాలని అందరూ భావిస్తున్నారు. దీంతో ఇండోర్ జిమ్‌లు కాస్త ఔట్‌డోర్‌లో ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఓజోనైజ్డ్ మెడిటేషన్ హాల్, ఉష్ణోగ్రత నియంత్రణ స్విమ్మింగ్ పూల్స్ వచ్చేశాయి.వైద్య అవసరాల కోసం మినీ ఆస్పత్రి, మెడికల్ షాపు, అంబులెన్స్, పారా మెడికల్ సిబ్బంది ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.గతంలో మాదిరిగా సినిమాలకు వెళ్లే పరిస్థితి లేకపోవటంతో నివాస సముదాయంలోనే మల్టీప్లెక్స్ అనుభూతి కలిగేలా స్క్రీన్లు, సౌండ్ సిస్టమ్స్‌ను డెవలపర్లు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా డిజిటల్ క్లాస్ రూమ్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. -
కుక్క దొరికిందని ఠాణా మెట్లెక్కారు!
హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో నివసించే 21 ఏళ్ల సంవీత్.. తన స్నేహితులైన గౌతమ్, దీక్షిత్, తరుణ్, ధనుష్‌లతో కలిసి మంగళవారం రాత్రి కారులో వెళ్తున్న సమయంలో మాదాపూర్‌లోని బజాజ్ ఎ్రక్టానిక్స్ ఎదుట సలూకి జాతికి చెందిన పెంపుడు శునకం కనిపించింది. దాని యజమానిని గుర్తించేందుకు వారంతా ప్రయత్నించారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. ఫలితం లేకపోవడంతో చివరికి మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. శునకానికి తాడు కొని దానిని గౌతమ్ ఇంటికి తీసుకువెళ్లారు. బుధవారం ఉదయం ఉద్యోగాలకు వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చారు. శునకం యజమానిని కనుగొనేందుకు చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో వెతుకుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసం సమీపంలోకి వెళ్లారు. అక్కడ ఉన్న ఒక సెక్యూరిటీ సదరు కుక్కను గుర్తు పట్టి సమీపంలో చూశానని చెప్పారు. దీంతో యజమానిని గుర్తించేందుకు చుట్టుపక్కల ఉన్న అందరి ఇళ్లను తట్టారు. ఈ క్రమంలోనే ఓ ఇంటి వాచ్‌మన్ ఈ కుక్కను గుర్తించాడు. అంతకు కొన్ని గంటల ముందే కుక్క యజమాని వెతుక్కుంటూ వచ్చాడని, అతని సెల్ నంబర్ ఇచ్చాడు. దీంతో జూబ్లీహిల్స్‌కు చెందిన ఆ యజమానికి కుక్కను అప్పగించారు.బ్లేజ్ పేరుతో పిలుచుకునే ఈ కుక్క కనిపించగానే యజమాని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. పోలీసులు యువకులను అభినందించారు. కాగా.. తనకు రెండు పెంపుడు కుక్కలు ఉన్నాయని, తన స్నేహితుడు గౌతంకు ఆరు కుక్కలు ఉన్నాయని.. వాటితో ఉండే అనుబంధం వేరుగా ఉంటుందని సంవీత్ తెలిపారు. అందుకే రెండు రోజుల పాటు కుక్క యజమానిని గుర్తించేందుకు గల్లీ గల్లీ జల్లెడ పట్టామన్నారు. అప్పగించిన కుక్క ఖరీదు దాదాపు రూ.2 లక్షలు నుంచి రూ.3 లక్షల వరకు ఉంటుందని.. అందుకే ఎంత కష్టమైనా దాని యజమానిని గుర్తించి అప్పగించామన్నారు. -
పెట్లకు డబ్బులు కాస్తాయి!
సాక్షి, హైదరాబాద్: ‘డబ్బుల్దేముంది.. కుక్కను కొడితే రాల్తాయి..’అంటుంటారు. ఈ బడాయి మాటలకేం గానీ.. మీ కుక్కను ముద్దు చేసి, ముస్తాబు చేసి, ఆ మురిపాల ముచ్చట్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే మాత్రం నికరంగా నాలుగు రాళ్లయితే మీ బ్యాంక్ అకౌంట్లోకి వచ్చి పడతాయి. పోనీ మీకు గ్రామసింహం లేదా? మరేం ఫర్వాలేదు.. మీ పిల్లి మాతల్లి వయ్యారాలను, కళ్లు మూసుకుని ఆ మార్జాల మహారాణి వేసే దొంగ వేషాలను రీల్స్‌గా, షార్ట్స్‌గా షూట్ చేసి పోస్ట్ చేసినా మీకొచ్చేది వస్తుంది. ముందు మీ పెట్ (పెంపుడు జంతువు) నలుగురి కళ్లలో పడుతుంది. వెనకే ఫాలోవర్స్ వెంటపడతారు. వాళ్లను చూసి ప్రొడక్ట్ ప్రమోటర్స్ మిమ్మల్ని ఫాలో అయిపోతారు.కంటెంట్‌ని బట్టి పేమెంట్పెట్ అకౌంట్ ఓపెన్ చేయగానే ‘డబ్బే డబ్బు’.. ‘వద్దంటే డబ్బు’అనేంతగా వెంటనే ఏమీ వచ్చిపడదు కానీ, అంతకన్నా ఎక్కువగానే ఒక ‘పెట్ ఇన్ఫ్లుయెన్సర్’గా కొన్నాళ్లకు మీకు గుర్తింపు వస్తుంది. ఆ గుర్తింపు మీకు ఒక్కో పోస్టుకు రూ. 5,000 నుంచి రు.15,000 వరకు పెట్ కేర్ బ్రాండ్స్ నుంచి వచ్చేలా చేస్తుంది. మీ పెట్ ఎంత పాపులర్ అయితే మీకంత పేమెంట్. అబ్బా.. మూగజీవులతో ఏం చెప్పిస్తాం, ఏం మెప్పిస్తాం అనుకోకండి. మీలో కంటెంట్ ఉంటే చాలు.. వాటికి మాటలు వచ్చేసినట్లే. మరి మాలో క్రియేటివిటీ ఉండొద్దా అంటారా? ఆ సంగతి మీ పెట్స్‌కి వదిలి పెట్టండి. అవి ఇచ్చే క్యూట్ ఫీలింగ్స్‌తో మీలోంచి ఒక్క క్రియేటివిటీ ఏంటి.. మొత్తం కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, కెమెరా, స్టార్ట్, యాక్షన్ అన్నీ తన్నుకొచ్చేస్తాయి. వెయ్యికి పైగా అకౌంట్లు ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ టెక్ ప్లాట్‌ఫామ్ ‘కోరజ్’డేటా ప్రకారం సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇండియాకు చెందినవి 1,200 వరకు యాక్టివ్ పెట్ ఇన్ఫ్లుయెన్సర్ అకౌంట్లు ఉన్నాయి. వెయ్యికి పైగా ఫాలోవర్స్, 12,000కు పైగా లైకులు, ఒక పోస్టుకు సగటున 1,30,000 వ్యూస్ ఉండే ఈ అకౌంట్లు.. 100 కోట్ల డాలర్ల విలువైన భారతీయ పెట్ కేర్ మార్కెట్లో ఇప్పుడు ఒక భాగం. వీటిలో ‘ఆస్కార్’అనే అకౌంట్ పేరు కలిగిన ఐదేళ్ల వయసున్న గోల్డెన్ రిట్రీవర్ జాతి శునకానికి ఇన్‌స్ట్రాగామ్ హ్యాండిల్లో 2,49,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. రీల్‌కు రూ.15,000 వరకు! ఇండియాలోనే ఓరియో, నిక్కి, మిల్లీ, డూడిల్, పాపిన్స్, సింబా, నిఫ్టి, జోయ్ అనేవి మంచి పేరున్న పెట్ అకౌంట్లు. ‘కారా బెల్’అనే క్యాట్ (పిల్లి) ఇన్‌ఫ్లుయెన్సర్‌కు ఇన్‌స్ట్రాగామ్‌లో 15,400 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈ పర్షియన్ జాతి పిల్లి ఫ్యాషన్‌లో హొయలు ఒలికిస్తూ, అందంలో అధునాతనాన్ని చిలికేస్తూ, ఆరోగ్యానికి టిప్స్‌ని అందిస్తూ ఉంటుంది. ‘నల’, ‘మీను’అనే క్యాట్ ఇన్ఫ్లుయెన్సర్లకు కూడా మంచి గుర్తింపు ఉంది. 15,000–50,000 మధ్య ఫాలోవర్స్ ఉన్న ఏ పెట్ ఇన్ఫ్లుయెన్సర్కైనా ఒక రీల్‌కు, షార్ట్‌కు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ఆదాయం వస్తుంది. డబ్బే కాదు, ఉచితంగా పెట్ కేర్ ప్రొడక్ట్‌లు కూడా లభిస్తాయి. పెట్ కేర్ బ్రాండ్స్ తమ ప్రమోషన్ కోసం పోస్ట్‌కి ఇంత అని చెల్లిస్తాయి. పెట్ ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలంటే..!పెట్ ఇన్ఫ్లుయెన్సర్ కావాలంటే మొదట మీ పెట్‌కు (కుక్క, పిల్లి, ఇతర పెంపుడు జంతువులు ఏవైనా) కెమెరాను అలవాటు చేయండి. ఆ తర్వాత మీరనుకున్న థీమ్‌ను బట్టి పెట్‌కు అవసరమైన హంగుల్ని, ఆర్భాటాలను తగిలించండి. నిద్ర లేచినప్పుడు, ఆవలిస్తున్నప్పుడు, తింటున్నప్పుడు, స్నానం చేయిస్తున్నప్పుడు, దుస్తులు తొడిగాక, జర్నీలో మీతో పాటు ఉన్నప్పుడు.. ఇలా ప్రతి సందర్భంలోనూ వాటి ఫీలింగ్స్‌ని కెమెరాలోకి లాగేసుకోండి. కాప్షన్ పెట్టి నెట్లోకి వదిలేయండి. అందులో ఏదైనా సామాజిక సందేశం అంతర్లీనంగా ఉంటే మరీ మంచిది. ఫాలోవర్స్ పెరుగుతారు. స్పాన్సరర్లు వచ్చేస్తారు. పెట్ మూడ్ బాగోలేనప్పుడు మాత్రం షూట్ పెట్టుకోకండి. -
హైటెక్స్.. పెటెక్స్..
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అతిపెద్ద పెట్ ఎక్స్పో నిర్వహణకు హైదరాబాద్ వేదికగా నిలవనుంది. జనవరి 31 నుండి ఫిబ్రవరి 2 వరకూ మూడు రోజుల పాటు పెటెక్స్, తొలి కిడ్స్ బిజినెస్ కారి్నవాల్, కిడ్స్ ఫెయిర్లను ఏకకాలంలో హైటెక్స్‌లో నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన అంశాలను హైటెక్స్ వాణిజ్య ఉన్నతాధికారి టీజీ శ్రీకాంత్ శుక్రవారం వివరించారు. కారి్నవెల్ మద్దతుతో పెటెక్స్ భారత్, టర్కీ, చెక్ రిపబ్లిక్, సింగపూర్, జపాన్, జర్మనీ తదితర దేశాలకు చెందిన 60కిపైగా ఎగ్జిబిటర్లు ఉన్నారన్నారు. పెంపుడు జంతు ప్రేమికులు, ఔత్సాహికులను ఒక చోట చేర్చుతుందన్నారు. ఈ ప్రదర్శనలో 70కిపైగా అలంకారప్రాయమైన చేపల జాతులు ఉంటాని తెలిపారు. వివిధ బ్రీడ్ల గుర్రాలు, పక్షులు, కుక్కల ఫ్యాషన్ షో, కే–9 స్కూల్ కుక్కల ప్రదర్శన, స్కూపీ స్క్రబ్ వారి ఉచిత బేసిక్ గ్రూమింగ్ వంటివి ప్రదర్శించనున్నారు. కిడ్స్ బిజినెస్ కార్నివాల్ తొలి ఎడిషన్‌లో 85 మంది ఔత్సాహిక విద్యార్థులు ఉన్నారన్నారు. పలు ఉత్పత్తులు, ఆవిష్కరణలను ఈ ఎక్స్‌పోలో ప్రదర్శించనున్నారని తెలిపారు. క్యాట్ఛాంపియన్ షిప్ ను ఇండియన్ క్యాట్ క్లబ్ నిర్వహిస్తోంది. 200 రకాల పిల్లులు, అందులోనూ కొన్ని అరుదైన జాతులను సందర్శించొచ్చని పేర్కొన్నారు. మొదటిసారి కిడ్స్ కార్నివాల్ .. మొట్టమొదటిసారి కిడ్స్ బిజినెస్ కార్నివాల్ నిర్వహించనున్నామని, పిల్లల్లోని వ్యవస్థాపక స్ఫూర్తిని ప్రదర్శించేందుకు ఈ ఎక్స్పో వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. వ్యాపార ప్రణాళిక, పోటీ, ఉత్పత్తుల ప్రదర్శన మొదలైనవి ఇందులో ఉంటాయని వివరించారు. ఎల్రక్టానిక్స్, రోబోటిక్ ప్రాజెక్ట్‌లు, పెబుల్ ఆర్ట్, అయస్కాంత బుక్ మార్క్స్, విద్యార్థులు రాసిన పుస్తకాలు, 85 మంది విద్యార్థులు తయారు చేసిన హాండీ క్రాఫ్టŠస్ మొదలైనవి ఎక్స్‌పోలో చూడొచ్చని తెలిపారు. కిడ్స్ రన్.. ఫిబ్రవరి 1న సాయంత్రం 5 గంటలకు హైటెక్స్‌లో 4కిలో మీటర్లు, 2–కే, 1–కే వంటి మూడు విభిన్న కేటగిరీల్లో కిడ్స్ రన్ నిర్వహించనున్నారు. ఐదేళ్ల నుంచి 13 ఏళ్ల వయసు పిల్లలు ఇందులో పాల్గొన వచ్చన్నారు.పది రెట్లు ఎక్కువగా.. పెంపుడు జంతువుల దత్తత ప్రక్రియ భారత్ కంటే పాశ్చాత్య దేశాల్లో పది రెట్లు ఎక్కువని నిర్వాహకులు చెబుతున్నారు. 12 రాష్ట్రాలు, ఐదు దేశాల ప్రదర్శనకారులు ఈ మూడు ఎక్స్‌పోలో పాల్గొంటారని, సుమారు 25 వేలకు పైగా సందర్శకులు వస్తారని అంచనా వేస్తున్నామని తెలిపారు. దేశంలో పెట్ కేర్ పరిశ్రమ ప్రారంభ దశలో ఉందని, క్రమంగా పురోగమిస్తోందని, పెంపుడు జంతువుల దత్తత క్రమంగా పెరుగుతోందన్నారు. -
పిల్లల్లాగే కనిపెట్‌కోవాలి
పెట్‌ను పెంచుకునే విషయంలో భారతీయ సమాజం జపాన్ దిశగా అడుగులు వేస్తోంది. పిల్లలు పెద్దయి ఉద్యోగాలు, వ్యాపారాలతో దూరంగా వెళ్లిపోయిన తర్వాత ఇంట్లో ఆ వెలితిని భర్తీ చేయడానికి పెట్లను ఆశ్రయిస్తున్నారు. అలాగే సింగిల్ చైల్డ్ ఉన్న పేరెంట్స్ కూడా తమ బిడ్డకు తోబుట్టువులు లేని లోటు తీర్చడానికి పెట్ మీద ఆధారపడుతున్నారు. అయితే పెట్ పేరెంట్స్ ఎటికెట్స్ పాటించకపోవడం సమాజానికి ఇబ్బందిగా మారుతోంది.ఇందుకోసం యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా కొన్ని మార్గదర్శకాలను చెప్పింది కూడా. అయినా పట్టించుకోవడంలో మనవాళ్లు విఫలమవుతూనే ఉన్నారు. ఫలితం... పాదచారులు ఫుట్‌పాత్‌లు, రోడ్డు అంచున ఉన్న పెట్ మల విసర్జకాలను తప్పించుకుంటూ నడవాలి. వాహనదారులు పెట్ ఒక్కసారిగా రోడ్డు మీదకు దూకుతుందేమోననే ఆందోళనతో వాహనం నడపాలి. పెట్ని కంట్రోల్ చేయడంలో విఫలమవుతున్న కారణంగా ఎదురవుతున్న సమస్యల జాబితా పెద్దదే.ఎప్పటికీ చంటిబిడ్డే! పెట్ని పెంచుకోవడం అంటే చంటిపిల్లలను పెంచినట్లే. పిల్లలైతే పెద్దయ్యేకొద్దీ వాళ్ల పనులు వాళ్లు చేసుకుంటారు. పెట్ విషయంలో అలా కుదరదు. దాని జీవితకాలమంతా చంటిబిడ్డను సాకినట్లే చూసుకోవాలి. మన దగ్గర ఇతర జంతువులకంటే ఎక్కువగా కుక్కలనే పెంచుకుంటారు. పెట్ని పెంపకానికి ఇచ్చేటప్పుడే ఏమి చేయాలి, ఏమి చేయకూడదనే నియమావళి చెబుతాం. వ్యాక్సినేషన్, శుభ్రంగా ఉంచడం వరకే పాటిస్తుంటారు. విసర్జకాలు, మనుషుల మీదకు ఎగబాకడం వంటి విషయాలను తగినంతగా పట్టించుకోవడం లేదు.ఎక్కడ రాజీపడతారో సరిగ్గా వాటిలోనే ఇరుగుపొరుగుతో విభేదాలు తలెత్తుతుంటాయని చెప్పారు ఢిల్లీలోని యానిమల్ యాక్టివిస్ట్ కావేరి రాణా. పెట్ పేరెంటింగ్ విషయంలో పాటించాల్సిన ఎటికెట్స్ నేర్పించడానికి క్లాసులు నిర్వహిస్తున్న సృష్టి శర్మ మాట్లాడుదూ... శిక్షణ పెట్‌కి మాత్రమే అనుకుంటారు. కానీ పెట్ పేరెంట్‌కి కూడా అవసరమే. పెట్ని వాకింగ్‌కి తీసుకెళ్లినప్పుడు తప్పనిసరిగా బెల్ట్ వేసి తీసుకెళ్లాలి. అయితే బెల్డ్‌ను వదులుగా పట్టుకుంటారు.దాంతో ఆ పెట్ కొత్త మనిషి లేదా మరొక కుక్క కనిపించగానే మీదకు ఉరుకుతుంది. అలాగే ఒక్కసారిగా రోడ్డు మీదకు ఉరకడంతో వెనుక నుంచి వచ్చే వాహనాల కింద పడే ప్రమాదం ఉంటుంది. వీటితోపాటు తరచూ ఎదురయ్యే వివాదాలన్నీ పెట్ విసర్జన విషయంలోనే. పెట్ని వాకింగ్‌కి కాలనీల్లో రోడ్డు మీదకు లేదా పార్కులకు తీసుకెళ్తారు. విసర్జన కూడా రోడ్డు మీద లేదా పార్కులోనే చేయిస్తారు. వాకింగ్‌కి వచ్చిన ఇతరులకు కలిగే అసౌకర్యాన్ని ఏ మాత్రం పట్టించుకోరు. పెట్ని నియంత్రించరాదు! యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ నియమాల ప్రకారం పెట్ని నియంత్రించే ప్రయత్నం చేయరాదు. అవరడం వంటి దాని సహజసిద్ధమైన చర్యలను గౌరవించాలి. అలాగని రాత్రిళ్లు అరుస్తూ ఉంటే ఇరుగుపొరుగు వారికి అసౌకర్యం. కాబట్టి పెట్ కూడా రాత్రి నిద్రపోయేటట్లు రెగ్యులర్ స్లీప్టైమ్ని అలవాటు చేయాలి. బయటకు తీసుకెళ్లినప్పుడు ఎవరి దగ్గరైనా ఆహారపదార్థాలు కనిపిస్తే వాళ్ల మీదకు దూకి లాక్కునే ప్రమాదం ఉంటుంది. కాబట్టి బయటకు తీసుకెళ్లడానికి ముందే వాటి ఆకలి తీర్చాలి. విసర్జన విషయంలో... ఒక పేపర్ లేదా పాలిథిన్ షీట్ మీద విసర్జన చేయించి ఆ షీట్‌తో సహా తీసి డస్ట్‌బిన్‌లో వేయాలి.పెట్ పేరెంట్స్ తమ పెట్లను గారంగా చూసుకుంటారు. కాబట్టి వాటికి పాంపరింగ్ అలవాటైపోతుంది. ఇంట్లో వాళ్లతోపాటు ఇంటికి వచ్చిన అతిథులు కూడా గారం చేయాలని కోరుకుంటాయి. అతిథుల మీదకు వెళ్లిపోయి ఒడిలో కూర్చుంటాయి. వచ్చిన వాళ్లకు పెట్లను తాకడం ఇష్టంలేకపోతే వారికి ఎదురయ్యేది నరకమే. అలాగే పెట్ పేరెంట్స్ పెట్ ఒళ్లంతా నిమిరి చేతులను కడుక్కోకుండా అలాగే అతిథులకు తినుబండారాలను వడ్డించడం కూడా దాదాపు అలాంటిదే. పెట్ పేరెంట్కు శిక్షణ తరగతుల్లో అన్ని విషయాలనూ వివరిస్తారు. కానీ మన భారతీయ సమాజం కొంతవరకే ఒంటపట్టించుకుంటోంది. జపాన్, యూఎస్ వంటి దేశాల్లోనూ పెట్ లవర్స్ ఎక్కువే. అక్కడ నియమావళిని కూడా అంతే కచ్చితంగా పాటిస్తారు. ∙ -
పెడిగ్రీ ప్రో హైకాన్–24 : బుజ్జి పప్పీలు, బుల్లి కూనలు సూపర్ (ఫోటోలు)
-
రతన్ టాటా వీలునామా.. పెంపుడు శునకం ‘టిటో’కు వాటా!
రతన్ టాటా మూగజీవాలపై ఎంత ప్రేమ చూపించేవారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన చివరి శ్వాస వరకూ తన పెంపుడు జంతువుల సంరక్షణకు శ్రద్ధ చూపిన రతన్ టాటా తన మరణం తర్వాత కూడా వాటి సంరక్షణకు లోటు రాకుండా ఏర్పాట్లు చేశారు.టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. రతన్ టాటా రాసిన రూ.10,000 కోట్ల వీలునామాలో తన పెంపుడు జర్మన్ షెపర్డ్ శునకం ‘టిటో’ను చేర్చారు. ఈ శునకానికి "అపరిమిత" సంరక్షణ కోసం ప్రత్యేక నిబంధనలను రూపొందించినట్లు సమాచారం. ఐదారేళ్ల క్రితం ఇదే పేరుతో ఇంతకు ముందున్న శునకం చనిపోయిన తర్వాత ఇప్పుడున్న ‘టిటో’ను ఆయన తెచ్చుకుని సంరక్షణ బాధ్యతలు చూసేవారు.రతన్ టాటా దగ్గర చాలా ఏళ్లుగా వంటమనిషిగా పని చేస్తున్న రాజన్ షా ఇకపై ‘టిటో’ సంరక్షణ బాధ్యతలు చూసుకుంటారు. నివేదిక ప్రకారం.. టాటాతో మూడు దశాబ్ధాలుగా ఉంటున్న పనిమనిషి సుబ్బయ్యకు సంబంధించిన నిబంధనలను కూడా వీలునామాలో చేర్చారు.రూ. 10,000 కోట్లకు పైగా ఉన్న రతన్ టాటా ఆస్తులలో అలీబాగ్‌లోని 2,000 చదరపు అడుగుల బీచ్ బంగ్లా, ముంబైలోని జుహు తారా రోడ్‌లోని 2-అంతస్తుల ఇల్లు, రూ. 350 కోట్లకు పైగా ఫిక్స్డ్ డిపాజిట్లు, టాటా సన్స్‌లో 0.83% వాటా ఉన్నాయి. దీన్ని రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్ (RTEF)కి బదిలీ చేయనున్నారు. -
అట్టుడికిన కామారెడ్డి
కామారెడ్డి టౌన్ / కామారెడ్డి క్రైం: ఆరేళ్ల చిన్నారిపై పీఈటీ అసభ్యకర ప్రవర్తన కామారెడ్డిని అట్టుడికించింది. న్యాయం కావాలంటూ విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు, బంధువులు పెద్దఎత్తున పాఠశాలకు చేరుకొని ఆందోళనకు దిగారు. ఆందోళనకారుల రాళ్లదాడి, పోలీసుల లాఠీచార్జ్‌తో దాదాపు ఆరుగంటల పాటు పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జీవదాన్ పాఠశాలలో యూకేజీ చదువుతున్న ఆరేళ్ల చిన్నారి పట్ల అదే పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న నాగరాజు అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. బాధితుల ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. విషయం తెలియడంతో çపలు విద్యార్థి సంఘాల వారు మంగళవారం ఉదయం పాఠశాలకు చేరుకొని ఆందోళనకు దిగారు. స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ధర్నా చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనలో పాల్గొన్నారు. పాఠశాల ప్రిన్సిపాల్ శ్యాంకురియన్, వైస్ ప్రిన్సిపాల్ వీసీ థామస్‌లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పాఠశాల లోపలికి దూసుకెళ్లారు. ప్రిన్సిపాల్ చాంబర్లో ఫర్నిచర్ ధ్వంసం చేశారు. పీఈటీపై ఫిర్యాదు చేసినా... పలుమార్లు ఫిర్యాదు చేసినా సదరు పీఈ టీని తొలగించలేదన్నారు. ఈ విషయాన్ని గతంలోనే డీఈవో, ఎంఈవోల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోలేదని మండిపడ్డారు. అప్పటికే పాఠశాలకు చేరుకున్న పోలీసులు వారిని సముదాయిస్తున్న సమయంలోనే బయట నుంచి పెద్దఎత్తున యువకులు అక్కడకు చేరుకున్నారు. పోలీసులు వారిని అడ్డుకున్నా వినలేదు. పలుమార్లు పోలీసులకు, ఆందోళన చేస్తున్న వారితో తోపులాట జరిగింది. ఆగ్రహంతో ఉన్న కొందరు పాఠశాల భవనంపై రాళ్లు రువ్వడంతో కిటికీల అద్దాలు ధ్వంసం అయ్యాయి. పోలీసులు వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించే క్రమంలో పట్టణ సీఐ చంద్రశేఖర్ తలకు రాయి బలంగా తగలడంతో తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే సీఐని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. తోపులాటలో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ కాళ్లు విరగడంతో పాటు, పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. ఎస్ఐ రాజారాం సొమ్మసిల్లి పడిపోవడంతో ఆస్పత్రికి తరలించారు. దీంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్పీ సింధుశర్మ ఆందోళకారులను సముదాయించారు. సాయంత్రం ఆరుగంటల వరకు జిల్లా కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. -
మహిళా పీఈటీ అకృత్యం
తంగళ్లపల్లి (సిరిసిల్ల): క్రమశిక్షణ పేరుతో వ్యాయామ ఉపాధ్యాయురాలు (పీఈటీ) విద్యార్థినులపై కర్కషంగా వ్యవహరించిన ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో చోటుచేసుకుంది. తమను పీఈటీ జ్యోత్స్న బారి నుంచి రక్షించాలని కోరుతూ విద్యార్థినులు గురువారం తెల్లవారుజూమున 5 గంటలకు పాఠశాల గోడదూకి సిరిసిల్ల–సిద్దిపేట ప్రధాన రహదారిపై బైఠాయించారు. తమ ను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్న పీఈటీని వెంటనే విధుల నుంచి తొలగించాలని కోరుతూ నినాదాలు చేశారు. అనంతరం విద్యార్థినులు మీడియాకు తమగోడు వెళ్లబోసుకుంటూ.. ఐదేళ్లుగా గిరిజన గురుకులంలో పీఈటీగా పనిచేస్తున్న జ్యోత్స్న బదిలీ అయినప్పటికీ కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకుని ఇక్కడే కొనసాగుతోందన్నా రు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. విద్యార్థినులను బూతులు తిడుతూ దాడి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఇద్దరు బాలికలకు నెలసరి రావడంతో బాత్రూమ్లలో స్నానం చేస్తుండగా ప్రార్థన సమయంలో ఎందుకు స్నానాలు చేస్తున్నారని ఆగ్రహంతో బాత్రూమ్ల తలుపులు పగులగొట్టి స్నానం చేస్తుండగా తన ఫోన్లో వీడియో తీయడంతోపాటు కర్ర తో చితకబాదారని బాలికలు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థినుల ఆందోళన విషయం తెలుసుకున్న సిరిసిల్ల రూ రల్ సీఐ మొగిలి, తంగళ్లపల్లి ఎస్సై డి.సుధాకర్ అక్కడికి చేరుకొని వారితో మాట్లాడి ధర్నాను విరమింపజేయగా.. బాలికలు మరోసారి పాఠశాల గేటు ఎదుట ఆందోళనకు దిగారు. పలు విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల వద్దకు చేరుకుని బాలికలకు మద్దతుగా నిలిచారు. రంగంలోకి కలెక్టర్.. పీఈటీ సస్పెన్షన్ గిరిజన బాలికల ఆందోళన గురించి తెలుసుకున్న కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా హుటాహుటిన గురుకుల పాఠశాలకు చేరుకున్నారు. జిల్లా విద్యాధికారి రమేశ్‌కుమార్‌తో మాట్లాడి అప్పటికప్పుడు పీఈటీ జ్యోత్స్నను విధుల నుంచి తొలగించారు. పీఈటీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సీఐ మొగిలిని ఆదేశించారు. విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని స్పెషల్ ఆఫీసర్ పద్మను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో తంగళ్లపల్లి పోలీస్‌స్టేషన్‌లో పీఈటీ జ్యోత్స్నపై కేసు నమోదైంది. కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ధి కాల్వశ్రీరాంపూర్ (పెద్దపల్లి): విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువు దారితప్పడంతో దేహశుద్ధి చేసిన ఘటన గురువారం పెద్దపల్లి జిల్లాలో జరిగింది. కాల్వశ్రీరాంపూర్ మండలంలోని ఓ జెడ్పీ హైస్కూల్లో కొంతకాలంగా ఇద్దరు ఉపాధ్యాయులు బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతో వారు తమ తల్లిదండ్రులకు మొరపెట్టుకున్నారు. దీంతో కోపోద్రిక్తులైన తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి ఓ ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసి హెచ్చరించి వదిలిపెట్టారు. మరో ఉపాధ్యాయుడు విధులకు గైర్హాజరు కావడంతో దాడి నుంచి తప్పించుకోగలిగాడు. ఈ విషయమై హెచ్ఎంను వివరణ కోరగా, ఇద్దరు ఉపాధ్యాయులు అసభ్యంగా ప్రవర్తిస్తున్న విషయాన్ని విద్యార్థినులు తన దృష్టికి తీసుకురావడంతో మందలించానని, అయినా వారు ప్రవర్తన మార్చుకోకపోవడంతో విషయం తల్లిదండ్రుల దృష్టికి వెళ్లిందన్నారు. ఇద్దరు ఉపాధ్యాయుల విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. -
అంబానీ ఇంట అందగాడు
అందమైన కాలర్‌తో పింక్, గోల్డెన్ జాకెట్ ధరించి అనంత్ అంబానీ కుటుంబ వస్త్రధారణతో పోటీ పడుతూ వివాహ కార్యక్రమాల్లో తనూ విశేషంగా ఆహూతులను ఆకట్టుకుంది ‘హ్యాపీ’ అనే డాగ్. అహ్మదాబాద్‌కు చెందిన ఖ్యాతి అండ్ కరణ్ షా పంఖ్ డిజైనర్ పెట్ వేర్ దుస్తులను డిజైన్ చేసింది. స్వచ్ఛమైన సిల్క్ జాక్వర్డ్ ఫ్యాబ్రిక్‌తో ఆమె అంబానీల కోసం తయారు చేసిన పెంపుడు జంతువుల దుస్తుల్లో ఇది ఇరవై తొమ్మిదవది. వివాహ వేడుకలు జరుగుతున్నంతసేపూ హ్యాపీ హాయిగా మండపంపై తన స్థానాన్ని ఆక్రమించుకుని, చుట్టూ పరిశీలిస్తూ, చిత్ర విచిత్ర విన్యాసాలతో వీడియోల్లో సందడి చేసింది. ఇషా అంబానీ కూతురు బేబీ ఆదియుశక్తి ప్రేమతో హ్యాపీని ఆలింగనం చేసుకుంటుండగా, ఆమె తండ్రి ఆనంద్ పిరమల్ కూతురును అనుసరిస్తూ కనిపిస్తాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోని ‘అత్యంత అందగాడు’ అంటూ అభివర్ణించారు వ్యూవర్స్. అంబానీ కుటుంబం పెంపుడు జంతువు హ్యాపీ ఈ యేడాది జనవరిలో అనం –రాధికల నిశ్చితార్థంలో ఉంగరం మోసే పాత్రను పోషించింది. అప్పుడే అంబానీ కుటుంబ ఫొటోలో ఇది ప్రధాన స్థానం పోందింది. -
Charmme Kaur: ఇన్నాళ్లకు మళ్ళీ కలిశాను (ఫొటోలు)
-
Pet Last Set: డయల్ చేస్తే.. ఇంటికే అంతిమయాత్ర వాహనం!
అల్లారుముద్దుగా పెంచుకున్న పెంపుడు కుక్కలు మృతి చెందితే వాటి అంతిమ సంస్కారాలు ఎలా చేయాలా అని యజమానులు సతమతమవుతున్నారు. ముఖ్యంగా పెంపుడు శునకాలు, ఇతర పెంపుడు జంతువులను ఖననం చేయడం, దహన సంస్కారాలు చేయడానికో స్థలం లేక నగరజంతు ప్రేమికులు నరకయాతన అనుభవిస్తున్నారు.అపార్ట్మెంట్, విల్లా కల్చర్ వచ్చాక పెంపుడు శునకాలను ఖననం చేసేందుకు మరుభూమి లేక ఇబ్బందులు పడుతున్న కష్టకాలంలో జీహెచ్ఎంసీ, పీపుల్ ఫర్ ఎనిమల్స్ స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చాయి. ఎవరైనా తమ ఇంట్లో పెంపుడు కుక్క మృతి చెందితే దానికి గౌరవప్రదంగా అంతిమయాత్ర నిర్వహించడం, అంతకుమించి మర్యాదపూర్వకమైన దహన సంస్కారాలు చేయడం అందుబాటులోకి వచ్చిది. ఆ వివరాలు తెలుసుకుందాం.. – బంజారాహిల్స్నగరంలో జంతు ప్రేమికులు చాలా మందే ఉన్నారు.. వారు అల్లారు ముద్దుగా పెంచుకున్న జంతువులు మృతి చెందితే తీసుకెళ్లి ఎక్కడో పడేయకుండా సంప్రదాయబద్ధంగా శునకాలు, ఇతర జంతువులకు కూడా దహన సంస్కారాలు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ పీపుల్ ఫర్ ఎనిమల్స్(పీఎఫ్ఏ) సంయుక్తంగా డోర్ టూ టూర్ క్రిమేషన్ సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చారు. పెంపుడు జంతువుల యజమానులకు ఇదొక శుభవార్త అనే చెప్పాలి. ఇంటికే వచ్చి మృతి చెందిన శునకాన్నో, ఇతర పెంపుడు జంతువునో ప్రత్యేకంగా అలంకరించిన అంతిమయాత్ర వాహనంలో వలంటీర్లు సంప్రదాయబద్ధంగా తీసుకెళ్లే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.ఇందుకోసం పీఎఫ్ఏ ప్రత్యేక వాహనాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చి ఫోన్ చేస్తే చాలు ఇంటికే వచ్చి పెట్ మృతదేహాన్ని ఫతుల్లాగూడలోని క్రిమేషన్‌కు తీసుకెళ్లి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం రూ.2,500 దూరాన్ని బట్టి ఫీజుగా వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం ఫతుల్లాగూడలో మాత్రమే అందుబాటులో ఉన్న పెట్ క్రిమేషన్ త్వరలోనే గాజుల రామారం, గోపన్‌పల్లిలో కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు.డిసెంబర్ 2022 నుంచే..ఫతుల్లాగూడలో ఈ సౌకర్యం 2022 డిసెంబర్ నుంచే అందుబాటులోకి వచ్చిది. చాలా మంది తమ ఇంట్లో కుక్కలు చనిపోతే ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియక కన్నీరు మున్నీరవుతూ బాధపడుతుండటాన్ని గమనించిన పీఎఫ్ఏ ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం వలంటీర్లను కూడా నియమించింది.డయల్ చేయాల్సిన నంబర్లు.. జంతు ప్రేమికులు తమ ఇళ్లలో పెంపుడు శునకం మృతి చెందితే 73374 50643, 95055 37388 నంబర్‌కు ఫోన్ చేస్తే ప్రత్యేకంగా అలంకరించిన అంతిమయాత్ర వాహనంలో వలంటీర్లు క్రిమేషన్‌కు తీసుకెళ్తారు. దహన సంస్కారాల తర్వాత ఆ బూడిదను ప్రత్యేకంగా ఓ కుండీలో ఉంచి సంబంధిత యజమానులకు అందజేస్తారు. ఆ బూడిదను ఇళ్లలో ఉన్న మొక్కల వద్దకానీ, తమ స్వగ్రామాల్లో కానీ, మరే ఇతర ప్రాంతాల్లో ఉన్న మొక్కలు, చెట్ల వద్ద అయినా పూడ్చిపెడితే సరిపోతుందని సూచిస్తున్నారు. జీహెచ్ఎంసీ త్వరలోనే ఖైరతాబాద్, సికింద్రాబాద్, చార్మినార్ జోన్లలో కూడా పెట్ క్రిమటోరియంలను నిర్మించే ప్రతిపాదనకు శ్రీకారం చుట్టింది. ఒక్క ఫోన్ చేస్తే.. చాలు.. ఎక్కడైనా పెంపుడు జంతువు మృతి చెందిందని యజమానులు ఫోన్ చేయగానే ఆ వలంటీర్లు అక్కడ వాలిపోతారు. క్రిమటోరియంకు ఆ శునకాన్ని తీసుకొచ్చి పూలదండలు వేసి సంప్రదాయబద్ధంగా దహనం చేస్తాం. అనంతరం భస్మాన్ని కుండల్లో భద్రపరిచి యజమానులకు అందిస్తున్నాం. గ్యాస్‌తో నడుస్తున్న ఈ క్రిమటోరియం వల్ల ఎలాంటి కాలుష్యం వెలువడదు. ఎవరికీ ఇబ్బందులు లేని పరిస్థితుల్లో ఈ క్రిమటోరియం నిర్మించడం జరిగింది.– వాసంతి వాడి, ఫౌండర్ ప్రెసిడెంట్ పీఎఫ్ఏగ్యాస్తో నడిచే క్రిమటోరియం...ప్రస్తుతం ఫతుల్లాగూడలో అనంతయాత్ర పేరుతో పెట్ క్రిమటోరియంను నిర్వహిస్తున్నాం. త్వరలో మరిన్ని అందుబాటులోకి తీసుకురానున్నాం. ప్రతి నెలా 25 వరకూ శునకాలకు మర్యాదపూర్వకమైన, సంప్రదాయబద్ధ దహన సంస్కారాలు నిర్వహిస్తున్నాం. మా వద్ద ఇందుకోసం అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచాం. 14 మంది డ్రైవర్లు పని చేస్తున్నారు. వలంటీర్లు కూడా అంకితభావంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం గ్యాస్‌తో ఈ క్రిమటోరియం నిర్వహిస్తున్నాం. ఇకో ఫ్రెండ్లీ క్రిమటోరియంను నడిపిస్తున్నాం.– దత్తాత్రేయ జోషి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, పీఎఫ్ఏరూ.80 లక్షలతో మహదేవ్‌పురం పెట్ క్రిమటోరియం..కూకట్పల్లి సమీపంలోని మహదేవ్‌పురం సిక్ బస్తీ దగ్గర రూ.80 లక్షల వ్యయంతో పెట్ క్రిమటోరియం నిర్మించారు. ఇది ఇంకా అందుబాటులోకి రాలేదు. ఏ ఎన్జీవోకు ఇవ్వాలన్నదానిపై టెండర్ పిలుస్తారు. ఇది అందుబాటులోకి వస్తే చాలా మంది జంతు ప్రేమికులకు తమ ఇంట్లో చనిపోయే పెంపుడు కుక్కల దహన సంస్కారాలు గౌరవ ప్రదమైన వాతావరణంలో నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటుంది.– డాక్టర్ ఎ.లింగస్వామి, వెటర్నరీ ఆఫీసర్ జీహెచ్ఎంసీ -
ప్లాస్టిక్ బాటిల్స్‌తో టీ షర్ట్స్..ఏకంగా రూ. 80 కోట్లు..!
ప్లాస్టిక్ బాటిల్స్‌తో టీ షర్ట్స్ తయారు చేయడం గురించి విన్నారా?. ఔను ఇది నిజం. ఎనిమిది పెట్ బాటిల్స్ ఉంటే ఒక టీ షర్ట్ రెడీ. ఇరవై-ముప్పై బాటిల్స్ ఉంటే జాకెట్, బ్లేజర్ సిద్ధం. ఎంత ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇదే నిజం. పైగా ఎకో లైన్ బ్రాండ్‌తో దుస్తులను మార్కెట్లోకి తీసుకొచ్చి లాభాలను ఆర్జించాడు. నేడు ఏకంగా ఎనభై కోట్ల టర్నోవర్‌గా కంపెనీగా మార్చాడు. అంతేగాదు పర్యావరణాన్ని సంరక్షిస్తూ కూడా కోట్లు గడించొచ్చని చాటి చెప్పాడు. అతడెవరంటే..చెన్నైలో పెట్టి పెరిగిన సెంథిల్ శంకర్ మెకానికల్ ఇంజనీర్. తండ్రి స్థాపించిన శ్రీరంగ పాలిమర్స్‌కి ఎం.డిగా బాధ్యతలు చేపట్టాడు. పాలియెస్టర్ రీసైకిల్ చేస్తున్న సమయంలో అతడికి వచ్చిన ఆలోచనే ఎకోలైన్ దుస్తులు. ఈ ఫ్యాషన్ బ్రాండ్ ఇప్పుడు ఆన్లైన్ మార్కెట్లో దూసుకుపోతోంది. ఇంతకీ బాటిల్స్‌తో చొక్కాలు ఎలా చేస్తారంటే... ఎలాగంటే..పెట్ బాటిల్స్‌కున్న మూతలు, రేపర్లు తొలగించిన తర్వాత క్రషింగ్ మెషీన్లో వేసి చిన్న ముక్కలు చేయాలి. ఆ ముక్కలను వేడి చేసి కరగబెట్టి ఫైబర్‌గా మార్చాలి. ఈ ఫైబర్ దారాలతో వస్త్రాన్ని రూపొందించాలి. క్లాత్‌తో మనకు కావల్సినట్లు టీ షర్ట్, జాకెట్, బ్లేజర్ వంటి రకరకాలుగా కుట్టుకోవడమే. వీటి ధర కూడా తక్కువే. ఐదు వందల నుంచి ఆరు వేల వరకు ఉంటుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లోకి వెళ్లి ఎకోలైన్ అని సెర్చ్ చేయండి అంటున్నారు సెంథిల్.అయితే ఈ వస్త్రాన్ని రీసైకిల్ చేసిన పెట్ బాటిల్స్‌తో తయారు చేసినట్లు ప్రజలకు అర్థమయ్యేలా చేయడానికి తమకు చాలా సమయం పట్టిందన్నారు. దీని కోసం, కస్టమర్‌కు అవగాహన కల్పించడానికి వెబ్సైట్లో మొత్తం మేకింగ్ ప్రక్రియను వీడియో రూపంలో బహిర్గతం చేయల్సి వచ్చిందనిసెంథిల్ చెప్పారు. ఈ లోగా మిగతా కార్పొరేట్ కంపెనీలు పర్యావరణ అనుకూలంగా రూపొందుతున్న ఈ టీ షర్ట్‌లకు మద్దతు ఇవ్వడంతో అనూహ్యంగా కంపెనీ లాభాల బాట పట్టింది.ఇక ఈ ప్లాస్టిక్ బాటిల్స్ ప్రక్రియలో నీటిని ఆదా చేస్తారే గానీ వృధా కానియ్యరు. అలాగే వీళ్లు ఇందుకోసం బొగ్గును కూడా వినియోగించారు. చాలావరకు 90% సోలార్ ఎనర్జీపైనే ఆధారపడతారు. అంతేగాదు ఈ బాటిల్స్ వల్ల ఉత్పత్తి అయ్యే దాదాపు పదివేల టన్నులు కార్బన్డయాక్సైడ్ ఉద్గారాలను కూడా ఈ ప్రక్రియతో నిరోధించారు. అంతేకాదండోయ్ మనం ఈ ప్లాస్టిక్ దుస్తులను వాడి వాడి బోర్ కొట్టినట్లయితే..తిరిగి వాటిని ఈ కంపెనీకి ఇచ్చేయొచ్చు. వాటిని మళ్లీ రీసైకిల్ చేస్తుంది కూడా. అంతేగాదు ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఈ ప్లాస్టిక్ బాటిల్స్‌తో తయారు చేసిన జాకెట్లను ధరించారు కూడా.ఇలా రూపొందించడానికి రీజన్..పర్యావరణ పరిరక్షణలో తన వంతు బాధ్యతగా ఈ ప్రక్రియకు నాంది పలికానని అన్నారు సెంథిల్ శంకర్. ప్రపంచవ్యాప్తంగా మనం వాడి పారేసిన ప్లాస్టిక్ బాటిళ్ల సంఖ్య నిమిషానికి మిలియన్ ఉంటున్నట్లు ఫోర్బ్స్ చెప్తోందన్నారు. ఒక బాటిల్ డీకంపోజ్ కావాలంటే నాలుగు వందల ఏళ్లు పడుతుందని, పైగా ఆ అవశేషాలు పల్లపు ప్రదేశాలకు కొట్టుకుపోతుంటాయని చెప్పారు. దీంతో ఇవన్నీ వర్షం కారణంగా కాలువలకు అడ్డుపడి వరదలకు కారణమవుతున్నాయని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే తన వంతు బాధ్యతగా చెన్నైకి మూడు వందల కిలోమీటర్ల దూరంలో వేస్ట్‌గా పడి ఉన్న ప్లాస్టిక్ బాటిళ్లన్నింటిని సేకరిస్తున్నామని చెప్పారు. అంతేగాదు తమ ఫ్యాక్టరీలో రోజుకు 15 లక్షల బాటిళ్ల దాక రీసైకిల్ చేస్తున్నట్లు తెలిపారు. ఇక చివరిగా అందరూ పర్యావరణ సంరక్షణార్థం ఈ రీసైకిల్ ప్రక్రియలో పాలు పంచుకోండి అని పిలుపునిస్తున్నారు సెంథిల్ శంకర్.(చదవండి: నీట్ ఎగ్జామ్‌లో సత్తా చాటిన తండ్రి, కూతురు!..50 ఏళ్ల వయసులో..) -
Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
సాక్షి, వికారాబాద్: జిల్లోలోని తాండూర్‌లో దారుణం చోటుచేసుకుంది. పెంపుడు కుక్క స్వైర విహారం చేసింది. తాండూరు పట్టణం బసవేశ్వర నగర్‌కు చెందిన దత్తు, లావణ్య దంపతుల కుమారుడు ఐదు నెలల పసి కందును పెంపుడు కుక్క పీక్కుతింది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు పెంపుడు కుక్కను చంపేశారు. తాండూరు పట్టణం బసవేశ్వర నగర్లో ఘటన చోటుచేసుకుంది. -
45 కిలోల భారీ ఆకారంలో.. బుజ్జి కుక్క పిల్ల!
‘పెంపుడు కుక్క పిల్ల’.. అనగానే ముద్దుగా మన కాళ్లకు అడ్డుపడే బుజ్జి కుక్కపిల్ల మనకు గుర్తుకువస్తుంది. అయితే దీనికి భిన్నంగా 45 కిలోల బరువైన భారీ కుక్క పిల్లను మీరు ఎప్పుడైనా చూశారా? దాని ఆకారం చూసి కూడా దానిని ఒడిలోకి తీసుకుని దాని యజమాని మురిసిపోతుంటాడు. ఆరడుగుల పొడవు, దాదాపు 45 కేజీల బరువున్న ఈ బుల్ డాగ్ పేరు రోల్ఫ్. భారీ ఆకారం ఉన్నప్పటికీ అది బుజ్జి కుక్క పిల్ల మాదిరిగానే ప్రవర్తిస్తుంటుంది. దాని యజమాని క్రెయిగ్ కూడా దానిని ఒడిలో పెట్టుకుని మురిసిపోతుంటాడు. దాని చేష్టలు చూసి, దీనికి ఇంకా చిన్నతనం పోలేదని అందరికీ చెబుతుంటాడు. క్రెయిగ్ కొన్నేళ్ల క్రితం స్ట్రోక్‌తో నడవలేకపోయేవాడు. అదే సమయంలో రోల్ఫ్ను ఇంటికి తీసుకువచ్చాడు. రోల్ఫ్ రాకతో తన జీవితమే మారిపోయిందని. క్రెయిగ్ చెప్పాడు. రోల్ఫ్ అతని జీవితాన్ని తిరిగి ట్రాక్‌లోకి తీసుకువచ్చేందుకు సహాయపడిందట. తాను అనారోగ్యం నుంచి కోలుకున్నానంటే దానికి రోల్ఫ్ కారణమని క్రెయిగ్ చెబుతుంటాడు. సాధారణంగా శునకాలు వయసే పెరిగేకొద్దీ తమ చేష్టలను తగ్గిస్తుంటాయి. అదే సమయంలో తమ యజమానిపై ప్రేమను కురిపిస్తాయి. అయితే రోల్ఫ్ విషయంలో దాని వయసు, ఆకారం పెరిగినా అది పిల్ల చేష్టలను ఇంకా మానలేదట. -
రోబొటిక్ పెట్ని ఆవిష్కరించిన 12 ఏళ్ల చిన్నారి!
ఆరవ తరగతి చదువుతున్న చిన్నారి ఒంటరితనాన్ని అధిగమించేందుకు పెంపుడు జంతువును దత్తత తీసుకోలేని వారికి ప్రత్యామ్నాయంగా రోబోటిక్ పెట్‌ను ఆవిష్కరించి అందర్నీ అబ్బురపరిచింది. ప్రతి ఏడాది 6 లక్షల పెంపుడు జంతువులను దేశ వ్యాప్తంగా దత్తత తీసుకుంటున్నారు. అయితే చాలా మందికి ఆర్థిక స్థోమత ఉంది. కానీ పెంపుడు జంతువును దత్తత తీసుకుని నిర్వహించడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. పైగా ఇది అందరికీ అది సాధ్యపడక పోవచ్చు. అలాంటి వారికి 12 ఏళ్ల చిన్నారి విద్యార్థి నేత్ర సింగ్ అభివృద్ధి చేసిన ఈ రోబోటిక్ పెట్ చక్కగా ఉపకరిస్తుంది. ఈ మేరకు బోవెన్పల్లిలోని సెయింట్ పీటర్స్ హైస్కూల్లో ఆరో తరగతి చదువుతున్న నేత్ర సింగ్ పెంపుడు జంతువులకు ప్రత్యామ్నాయంగా వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చి మరీ ఈ రోబోటిక్ పెట్ని అభివృద్ధి చేసింది. ఈ ఆవిష్కరణని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, అతిథులు, సహచరులతో సహా వెయ్యి మందితో కూడిన టెడ్ సమావేశంలో ప్రదర్శించడమే దీని ఉపయోగాలు గురించి మాట్లాడింది నేత్ర. రోబోటిక్ పెంపుడు జంతువులు ఒంటరితనాన్ని నయం చేయడంలో సహాయపడటమేగాక మానసిక ఆనందాన్నిస్తాయని చెప్పింది. ఆ సమావేశంలో నేత్ర మాట్లాడుతూ..ముఖ్యంగా కోవిడ్ తర్వాత పెంపుడు జంతువుల దత్తత పెరిగింది. అదీగాక పెంపుడు జంతువుల నిర్వహణ ఖర్చు కూడా గణనీయంగా పెరిగింది. ఈ పెంపుడు జంతువులు డెలివరీ బాయ్‌లను భయపెట్టడంతో చనిపోయిన ఘటనలను కూడా చేశాం. ఇంకోవైపు వీధికుక్కలు పసిపిల్లలపై దాడి చేసి చంపిన ఘటనలను కూడా రోజుకి ఒకటి వార్తాపత్రికల్లో వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో, నేత్ర సింగ్ చెబుతున్న రోబోటిక్ పెట్ ఆలోచనను అందర్నీ ప్రేరేపించింది. తన పాఠశాల నిర్వహించిన బోవెన్పల్లిలోని దాని ప్రాంగణంలో 'స్టార్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్--యాన్ ఈవినింగ్ అండర్ ది ఓపెన్ స్కై' అనే ప్రత్యేకమైన ప్రోగ్రామ్‌లో టెడ్(TED)లాంటి చర్చలో భాగంగా నేత్ర తన ఆలోచన పంచుకుంది. ఈ ఆలోచనకు గానూ ఆమెకు అందరి నుంచి ప్రశంసలు అందాయి. "నేను ఇప్పటికీ దానిపై పని చేస్తున్నాను. ప్రస్తుతానికి, ఇది నా ఆలోచన. నేను దీన్ని వాణిజ్య ఉత్పత్తిగా మార్చడానికి ప్రొఫెషనల్ మెంటరింగ్ని కోరుకుంటున్నానని ధీమాగా చెప్పుకొచ్చింది" విద్యార్థి నేత్ర. ఆమె పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె సువర్ణ నేత్ర ఆలోచనలు తోపాటు పాఠశాలలోని మరో 50 మంది విద్యార్థుల ఆలోచనల విన సంతోషం వ్యక్తం చేశారు. ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నప్పటికీ, రోబోటిక్ పెట్ అనేది ఒక వినూత్న ఆలోచన అని డాక్టర్ కె. సువర్ణ చెప్పారు. ఈ చర్చలో 50కిపైగా విద్యార్థులు తమ కొత్త ఆలోచనలు, దృక్కోణాలను పంచుకున్నారు. విద్యార్థులు మెరుగైన పనితీరు రెండు నిమిషాల నిడివి గల సందేశాలు, రీల్స్, షార్ట్‌లు, వాట్సాప్ స్టేటస్ వీడియోల రూపంలో కనబర్చేలా టెడ్ (TED) లాంటి షార్ట్ టాక్లతో ముందుకు వచ్చింది సెయింట్ పీటర్స్ హైస్కూల్. పాఠశాలకు చెందిన వరేణ్య, ప్రీతమ్, శామ్యూల్‌లతో కూడిన ముగ్గురు సభ్యుల బృందాలు ఫైర్ అండ్ గ్యాస్ లీకేజ్ ఫిక్టర్ రోబోట్‌ను సమర్పించాయి. ఇది CBSE రీజనల్ సైన్స్ ఎగ్జిబిషన్లో ఎంపికైంది. జనవరి 2024లో న్యూఢిల్లీలో జరిగే జాతీయ ప్రదర్శనలో పాల్గొంటుంది. నమోదు చేసుకున్న 3169 విద్యార్థి జట్లలో ఎంపిక చేసిన 30 ప్రదర్శనలలో సెయింట్ పీటర్స్ జట్టు ఒకటి. టెడ్ (TED) లాంటి చర్చలు పంచుకోవడానికి విలువైన ఆలోచనల కోసం పాఠశాల స్థాయి వేదిక. ఇది కూడా కేవలం ఎలివేటర్ ప్రయాణ సమయంలో ఐడియాను పంచుకుని, ప్రభావితం చేయగలిగే విధంగా, ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం. 1979లో ప్రారంభమైన ఈ పాఠశాల 24 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో లోగొను ఆవిష్కరించి సిల్వర్ జూబ్లీ సంవత్సరాన్ని జరుపుకోనుంది. (చదవండి: మురికి వాడ నుంచి రూ. 900 కోట్ల సామ్రాజ్యానికి యజమానిగా! రియల్ స్లమ్ డాగ్ మిలియనీర్!) -
కోట్లల్లో పెరిగిపోతున్న పెట్ డాగ్స్ ఇండస్ట్రీ..
పెంపుడు జంతువుల సంరక్షణ మార్కెట్ భారత్‌లో ఏటా 13.9% పెరుగుతోంది. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెంపుడు జంతువుల సంరక్షణ మార్కెట్లలో ఒకటని ఇండియన్ పెట్ ఇండస్ట్రీ జాయింట్ అడ్వైజరీ కౌన్సిల్ (IPICA) పేర్కొంది. దీనికి సంబంధించి జస్ట్ డాగ్స్ మార్కెటింగ్ హెడ్ కషాప్ సంఘాని మాట్లాడుతూ..గతంలో వెటర్నరీ క్లినిక్‌లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. పెట్ కేర్ మార్కెట్ విస్తృతంగా అభివృద్ది చెందుతుంది. ఐదేళ్ల క్రితం భారతదేశంలో దత్తత తీసుకున్న పెంపుడు జంతువుల సంఖ్య 28 మిలియన్లు ఇప్పుడు 38 మిలియన్లకు చేరుకుందని, వచ్చే ఐదేళ్లలో అదే సంఖ్య 45 మిలియన్లకు పెరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. పెంపుడు జంతువుల పరిశ్రమ మొత్తం రూ. 8000 కోట్లని, అందులో 65% భారతదేశంలో పెంపుడు జంతువుల ఆహారమని మార్కెట్ అని పేర్కొన్నారు. భారతీయ పెంపుడు జంతువుల పరిశ్రమ ప్రకారం.. పెంపుడు పిల్లల సంరక్షణ కోసం పెట్ పేరెంట్స్ చాలా డబ్బు ఖర్చు చేస్తున్నారు. ముఖ్యంగా కోవిడ్ తర్వాత దత్తత తీసుకోవడం విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం, పెంపుడు జంతువులను ఇంట్లో పిల్లలతో సమానంగా పరిగణిస్తున్నారు. వాటి సంరక్షణ కోసం ఎంత డబ్బైనా వెచ్చిస్తున్నారు. పెంపుడు జంతువుల కోసం నెలకు సగటున రూ. 5వేల నుంచి రూ. 15 వేల వరకు ఖర్చు అవుతుంది. వాటి ఆహారం, దుస్తులు, మందులు,బొమ్మలు.. ఇలా వాటి జాతి, వయస్సు, నగరాన్ని బట్టి ఖర్చు మారుతుంది. బడ్జెట్లో దాదాపు 70%-75% ఎక్కువగా పెట్స్ కోసం ఫుడ్, ట్రీట్మెంట్ కోసమే ఖర్చవుతుంది. పెంపుడు జంతువుల దత్తత పెరగడం ప్రధాన నగరాల్లో మాత్రమే కాదు. ఇది టైర్ 2 మరియు 3 నగరాలకు కూడా విస్తరించింది. దీంతో గత రెండేళ్లలో కొత్తగా 70 పెట్ కేర్ కంపెనీలు ఆవిర్భవించాయి. పెంపుడు కుక్కలలో 6% కుక్కలకు మాత్రమే బ్రాండెడ్ ఆహారం ఇస్తారు. మిగిలినవి దాదాపు ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని మాత్రమే తింటాయి. ఇక పిల్లుల్లో 2% వాటికి మాత్రమే బ్రాండెడ్ ఆహారం తింటాయని డాగ్-ఓ-బో సహ వ్యవస్థాపకుడు ఇబాదత్ శర్మ తెలిపారు. ఆయన మాట్లాడుతూ..15 ఏళ్ల క్రితం గ్రూమింగ్ సెలూన్లు లేవు. అప్పట్లో చైనా నుంచి కొన్ని ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడం మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు పెట్ గ్రూమింగ్ సెలూన్లు చాలా ఉన్నాయి. అన్ని ఉత్పత్తులను భారత్‌లోనే తయారు చేస్తున్నారు. ఇప్పుడు పెట్ డాగ్స్ కోసం స్విమ్మింగ్ పూల్,ప్రత్యేక ఆహారం, డాగ్ ట్రైనర్లు, డాగ్ సిట్టర్లు, డాగ్ రిసార్ట్స్, డాగ్ గ్రూమింగ్ సెలూన్లు, నోబిల్ ట్రీట్మెంట్ వ్యాన్లు, పెట్ ఫుడ్ ఇలా ఎన్నో వచ్చేశాయి. అంతేకాకుండా ఇప్పుడు పెంపుడు జంతువులను రవాణా చేసే స్పెషల్ ట్రాన్స్పోర్ట్ ఏజెంట్లు ఉన్నాయి. TRASNFERET మొబిలిటీ జనరల్ మేనేజర్ బిజు వర్గీస్ ప్రకారం.. గత ఎనిమిదేళ్లలో వారు దాదాపు 8500 పెంపుడు జంతువులను రవాణా చేసినట్లు తెలిపారు. పెట్ కేర్‌లో ముంబై, ఢిల్లీతో పాటు హైదరాబాద్ కూడా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో త్వరలోనే సెవెన్ ఓక్స్ పెట్ అనే అత్యాధునిక మల్టీ స్పెషాలిటీ పెట్ క్లినిక్ ఏర్పాటు చేయనున్నట్లు మేనేజింగ్ పార్టనర్ అర్చన నాయుడు తెలిపారు. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికానికి ఇది రెడీగా ఉంటుందని ఆమె పేర్కొంది. హైదరాబాద్‌ను వెటర్నరీ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చాలనే లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేస్తున్నారని అమెరికికు చెందిన ప్రముఖ వెటర్నరీ డాక్టర్ శ్రీరెడ్డి తెలిపారు. ఇందులో యానిమల్ బ్లడ్ బ్యాంక్, ఎలక్ట్రిక్ శ్మశానవాటిక వంటి అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. -
Anjali: కుక్కపిల్లకు ఓ రేంజ్లో బర్త్‌డే సెలబ్రేట్ చేసిన అంజలి (ఫోటోలు)
-
వచ్చే రెండేళ్లలో పెంపుడు శునకాల మార్కెట్ ఎంతంటే..
ఇంటికి వెళ్లగానే బుజ్జి అడుగులతో ప్రేమగా మీదకు దూకే చిన్న కుక్కపిల్లని చూడగానే అప్పటివరకూ పడిన శ్రమ అంతా మర్చిపోతాం. అందుకే వాటికి అచ్చం మనుషుల్లానే చూసుకుంటాం. ఎంత టెన్షన్లో ఉన్నా వాటిని చూడగానే ఆంతా ఆవిరైపోతుంది. అయితే పెట్‌డాగ్స్ కొనుగోలు చేసినప్పటి నుంచి వాటి నిర్వహణ, ఫుడ్, వాటికి వేసే బట్టలు, వాటికి వాడే క్యాస్టుమ్స్, వైద్యం..ఇలా పెట్ గ్రూమింగ్ నుంచి పెట్ ఫుడ్ సేల్స్ వరకు ప్రపంచవ్యాప్తంగా కోట్ల వ్యాపారం సాగుతుంది. వచ్చే రెండేళ్లలో పెట్‌డాగ్స్ ద్వారా దేశంలో దాదాపు రూ.6వేల కోట్లు వ్యాపారం అభివృద్ధి చెందుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పెంపుడు జంతువులకు స్నానం చేయించడం, జుట్టు, గోళ్లను కత్తిరించడం, చెవులు శుభ్రం చేయడం వంటి సేవలు పెట్‌గ్రూమింగ్ సర్వీస్ కిందకు వస్తాయి. పెట్ సిట్టింగ్, డాగ్ వాకింగ్ సర్వీస్‌లో భాగంగా వాటి యజమానులు దూరంగా ఉన్నప్పుడు పెంపుడు జంతువులకు ఆహారం ఇవ్వడం, వాకింగ్ తీసుకెళ్లడం, ఆడించడం వంటివి ఉంటాయి. కొందరు ఆన్లైన్లో లేదా స్టోర్‌లో పెట్ ఫుడ్‌ను విక్రయిస్తున్నారు. స్టూడియోలో లేదా మంచి లొకేషన్లో వాటి యజమానుల కోసం పెంపుడు జంతువుల చిత్రాలను తీయడం కూడా వ్యాపారంగా మలుచుకుంటున్నారు. యజమానులు, ఇంటికి వచ్చేవారితో విధేయతతో ఎలా ఉండాలో కూడా పెట్స్‌కు శిక్షణ ఇస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. యజమానులు రోజంతా పనిలో నిమగ్నమవుతుండడంతో వాటిని సంరక్షించే సమయం దొరకదు. అందుకు వీలుగా పెంపుడు జంతువుల డేకేర్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. ఇదీ చదవండి: 25 ఏళ్లలో తొలిసారి.. చైనాలో ఏం జరుగుతుందంటే దేశవ్యాప్తంగా జరిగిన కొన్ని నివేదికల ప్రకారం.. ఇండియాలో ఏటా 6లక్షల పెంపుడు జంతువులను దత్తత తీసుకుంటున్నారు. వాటిలో ఎక్కువ భాగం కుక్కలు ఉన్నాయి. దేశంలో పెంపుడు జంతువుల మార్కెట్ రూ.2వేలకోట్లు పైగా ఉంది. పెట్ ఫుడ్ మార్కెట్ ఏటా 13.9% వృద్ధి చెందుతోంది. 2025 నాటికి దాదాపు రూ.6వేల కోట్లకు చేరుకుంటుందని అంచనా. ప్రపంచ వ్యాప్తంగా పెట్‌డాగ్స్ సంఖ్య ఈ కింది విధంగా ఉంది. Top 10 countries with the most pet dogs#PetDogs #DogLovers #CanineCompanions pic.twitter.com/YNicdDGUx7 — Global Ranking (@Top1Rating) October 13, 2023 -
భలే ముద్దుగున్నాయ్ చూడుర్రి.. పెట్ ఫ్యాన్స్‌కి పండగే!
-
పెంపుడు పాములను ఎప్పుడైనా చూసారా?
-
పెంపుడు కుక్క కోసం 20 వేల డాలర్లతో కాస్ట్లీ ఇల్లు
పెంపుడు కుక్కలను అపురూపంగా చూసుకునే వాళ్లు చాలామందే ఉంటారు గాని, పెంపుడు కుక్కకు ఏకంగా కొత్తిల్లు కట్టించిన ఘనత మాత్రం కాలిఫోర్నియాకు చెందిన యూట్యూబర్ బ్రెంట్ రివెరాకు మాత్రమే దక్కుతుంది. బ్రెంట్ కొంతకాలంగా చార్లీ అనే కుక్కను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాడు. ఈ కుక్క ఏడాది పుట్టిన రోజు మే 29న జరిగింది. ఈ సందర్భంగా బ్రెంట్ తన కుక్కకు విలాసవంతమైన కొత్త ఇంటిని బహూకరించాడు. దీని కోసం అతడికి 20 వేల డాలర్లకు (రూ.16.54 లక్షలు) పైగానే ఖర్చయింది. యూట్యూబ్‌లో బ్రెంట్ తన కుక్క ఇంటి వీడియోను పెడితే, ఏకంగా 7.9 మిలియన్వ్యూస్ వచ్చాయి. కుక్కగారి కొత్త ఇంట్లో చక్కని పడకతో పాటు టీవీ, ఫ్రిజ్ వంటి సౌకర్యాలు ఉండటం విశేషం. -
100 శాతం ఆర్‌పీఈటీ బాటిళ్లు.. దేశంలో ఫస్ట్ టైమ్!
సాక్షి, న్యూఢిల్లీ: కోకా–కోలా సంస్థ 100 శాతం రీసైకిల్డ్ ప్లాస్టిక్ మెటిరీయల్ (ఆర్‌పీఈటీ) తో రూపొందించిన కిన్లే సీసాలను తెలుగు రాష్ట్రాల మార్కెట్లోకి విడుదల చేసింది. 100శాతం ఆర్పీఈటీతో రూపొందించిన సీసాను ఆహారం/పానీయాల కోసం ఉపయోగించడం దేశంలో ఇదే మొదటిసారి అని సంస్థ ప్రతినిధులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. వ్యర్థాలు లేని ప్రపంచం సృష్టించే క్రమంలో 2030 నాటికి ప్యాకేజింగ్‌లో కనీసం 50శాతం రీసైకిల్డ్ బాటిళ్లను ఉపయోగించే లక్ష్యంతో సంస్థ ఉన్నట్లు టెక్నికల్ ఇన్నోవేషన్ వైస్ ప్రెసిడెంట్ ఎన్రిక్ అకర్మాన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో కోకా–కోలా ఫ్రాంచైజ్ భాగస్వామి సర్వారాయ సుగర్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్బీపీపీ రామ్మోహన్ మాట్లాడుతూ... సంస్థ నిర్ణయం సుస్థిరమైన ప్లాస్టిక్ వాడకంపై ప్రభుత్వ దృక్పథానికి అనుగుణంగా ఉందని పేర్కొన్నారు. -
ట్రెండ్ సెట్ చేసిన రామ్ చరణ్ పెంపుడు కుక్క రైమ్..
-
నెట్టింట సందడి చేస్తున్న రామ్ చరణ్ పెట్ డాగ్ 'రైమ్' (ఫోటోలు)
-
కుక్క పిల్ల అని పెంచితే.. రెండేళ్ల తర్వాత నిజం తెలిసి షాకయ్యారు!
చాలా మంది పెంపుడు జంతువులను పెంచుకోవడం చూస్తూనే ఉంటాం. ఇక కొందరైతే వాటిని తమ ఇళ్లలోని మనుషులులానే భావిస్తారు. ఇదంతా షరా మామూలే. చైనాలోని ఓ కుటుంబం కూడా ఓ కుక్క పిల్లను రెండేళ్లు అల్లారుముద్దుగా పెంచుకుంది. కానీ పెద్దయ్యాక దాన్ని అసలు రంగు బయటపడింది. నిజం తెలియగానే కుటుంబమంతా షాక్‌లో ఉండిపోయింది. ఇంతకీ అక్కడ ఏం జరిగింది. వివరాల్లోకి వెళితే.. యునాన్ ప్రావిన్స్‌లోని కున్మింగ్ నగరం వెలుపల ఉన్న మారుమూల గ్రామానికి చెందిన సు యున్ అనే మహిళ, 2016లో విహారయాత్రలో వెళ్లి ఓ కుక్కపిల్లని తన ఇంటికి తీసుకెళ్లింది .ఆ కుక్కపిల్ల చూసేందుకు పెద్దదిగా, కాస్త భిన్నంగా ఉన్నప్పటికీ ఆ మహిళ అవేవి పట్టించుకోలేదు. అయితే అది పెరిగేకొద్దీ, దాని ప్రవర్తన కుక్కలా కాకుండా వింతగా ప్రవర్తించేది. అలా రెండేళ్ల గడిచింది ఆ తర్వాత ఆ కుక్క పిల్ల బలంగా తయారై క్రూరంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. దీంతో ఆ మహిళకు అనుమానం రావడంతో జంతువులకు సంబంధిత అధికారులను సంప్రదించింది. ఆమె అనుమానాలను నిజం చేస్తూ, ఆ మహిళ ఇంట్లో పెంచుకుంటున్న జంతువు ఆసియాటిక్ బ్లాక్ బేర్ అని, అంతరించిపోతున్న జాబితాలో ఉన్న జాతికి చెందిన ఎలుగుబంటని తేలింది. దీంతో ఆ మహిళ షాక్‌కు గురైంది. తత్ఫలితంగా, యునాన్ వైల్డ్ లైఫ్ రెస్క్యూ విభాగం ఆ జంతువును స్వాధీనం చేసుకుంది. 2018లో తొలిసారిగా వైరల్‌గా మారిన ఈ వింత కథనం.. అయితే తాజాగా మళ్లీ ఆ వార్త వైరల్‌గా మారింది. చదవండి: టికెట్ బుకింగ్ సమయంలో షాక్.. ఐఆర్సీటీసీపై యూజర్లు ఫైర్! -
పెట్ బాటిళ్లతో దుస్తులు.. శ్రీకారం చుట్టిన ఐవోసీ
బెంగళూరు: చమురు రంగ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వాడి పడేసిన పెట్ బాటిళ్లను ఏటా రీసైకిల్ చేయాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియ ద్వారా పర్యావరణ అనుకూల వస్త్రాలను తయారు చేస్తారు. ఇందుకు ప్రతి సంవత్సరం 10 కోట్ల బాటిళ్లను రీసైకిల్ చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది. పెట్రోల్ పంపులు, ఎల్పీజీ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీల సిబ్బందికి ఈ వస్త్రంతో అన్బాటిల్డ్ పేరుతో యూనిఫాం తయారు చేస్తారు. సౌర శక్తితో సైతం పనిచేసే వంటింటి స్టవ్‌లను ఐవోసీ రూపొందించింది. సూర్యుడు లేని సమయంలో ఎల్పీజీ, పైప్డ్ గ్యాస్‌తో స్టవ్ పనిచేస్తుంది. అన్బాటిల్డ్ యూనిఫాం, స్టవ్‌ను ఇండియా ఎనర్జీ వీక్ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. సమీప భవిష్యత్తులో 3 కోట్ల గృహాలకు ఈ స్టవ్‌లు చేరతాయని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. అన్బాటిల్డ్ కార్యక్రమం ప్రపంచంలోనే అతిపెద్దది అని చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ తెలిపారు. చమురు విక్రయ కంపెనీల్లో ఫ్రంట్ లైన్ వర్కర్లకు, ఇతర సంస్థలు, రిటైల్ విక్రయాల కోసం యూనిఫాంలు తయారు చేస్తామన్నారు. యుద్ధానికి కాకుండా ఇతర సమయాల్లో వేసుకునేలా సాయుధ దళాల కోసం దుస్తులు సైతం రూపొందిస్తారు. -
‘బాధపడకమ్మా.. నేను నీ వెనకే ఉన్నా’: సమంత ఎమోషనల్ పోస్ట్
చాలా రోజుల సమంత ఇటీవల మీడియా ముందుకు వచ్చింది. కొంతకాలంగా మయోసైటిస్‌తో బాధపడుతున్నా ఆమె తన లేటెస్ట్ మూవీ శాకుంతలం ట్రైలర్ ఈవెంట్లో మెరిసింది. కాగా ఈ వ్యాధి కారణంగా కొద్ది రోజులుగా ఆమె ఇంటికే పరిమితమమైంది. మయోసైటిస్కు చికిత్స తీసుకుంటున్న సమంత మీడియాకు, సోషల్ మీడియాకు దూరంగా ఉంది. ఇక ఆమె ఆరోగ్యం మెరుగుపడటంతో మళ్లీ ఆమె యాక్టివ్ అయ్యింది. చదవండి: అఫిషియల్: ఓటీటీకి వచ్చేస్తున్న ‘18 పేజెస్’ మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే! గత వారం రోజులుగా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్స్ షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని పలకరిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె పెట్టిన పోస్ట్ సామ్ అభిమానులను కదిలిస్తోంది. స్టార్ హీరో నాగచైతన్యతో విడాకుల అనంతరం సమంత తన పెంపుడు కుక్కుల హాష్, సాషాలతో ఒంటరిగా జీవిస్తున్న సంగతి తెలిసిందే. సమంత సోఫాలో పడుకుని ఉండగా ఆమె పక్కనే హాష్, సాషాలు ఉన్నాయి. సామ్ బోర్లా పడుకుని ఉండగా హాష్ ఆమె నడుంపై కాలు పెట్టి ఉంది. చదవండి: దుమ్ములేపుతున్న వాల్తేరు వీరయ్య.. ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే! ఈ ఫొటోను సమంత షేర్ చేస్తూ.. ‘బాధపడకు అమ్మా.. నేను నీ వెనుకే ఉన్నా’ అంటూ (హ్యాష్ తనతో చెబుతున్నట్లు) రాసుకొచ్చింది సామ్. ప్రస్తుతం ఈ పోస్ట్ ఆమె ఫాలోవర్స్‌ను ఎమోషనల్‌కు గురి చేస్తుంది. కొందరు క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరు ధైరంగా ఉండు సామ్ అంటూ ఆమెను ఓదార్పు ఇస్తున్నారు. ఆమె ఫ్యాన్స్ అయితే ఈ కఠిన సమయంలో తనవెంట ఎవరూ లేరంటూ వాపోతున్నారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
దీని పనే బాగుంది, రూ.800 కోట్లు సంపాదించిన పిల్లి!
సాధారణంగా డబ్బులు సంపాదించేందుకు ప్రజలు రకరకాల పనులు చేస్తుంటారు. అయితే అందులో కొందరు మాత్రమే సంపన్నులుగా మారుతారు. ఇలా మారడానికి వారికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అయితే మనుషులు ఓకే గానీ జంతువుల కూడా వందల కోట్ల ఆస్తులు సంపాదిస్తున్నాయని తెలిస్తే షాక్ అవుతారేమో! అవునండి ఇది నిజం. ప్రస్తుతం మనం వందల కోట్ల ఆస్తులు ఉన్న ఓ పెంపుడు పిల్లి గురించి తెలుసుకోబోతున్నాం. ప్రపంచంలోని అత్యంత సంపన్న పెంపుడు జంతువుల జాబితాలో ఒలివియా బెన్సన్ అనే పెంపుడు పిల్లి మూడవ స్థానంలో ఉందట. అంత మొత్తం ఆ పిల్లి ఎలా సంపాదించిందని తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. విపరీతమైన క్రేజ్, ఒక్కో పోస్ట్‌కు లక్షలు ప్రఖ్యాత అమెరికన సింగర్ టేలర్ స్విఫ్ట్ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఆమెకు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కేవలం పాటల పరంగానే కాకుండా ఇటు సోషల్‌మీడియాలోనూ విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఆమె ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 240 మిలియన్లు ఉండడమే అందుకు నిదర్శనం. టేలర్ తన ఇన్‌స్టా అకౌంట్లో తన ఫోటోలతో పాటు తరుచు తన పెంపుడు పిల్లి ఒలివియా బెన్సన్కు సంబంధించిన పోస్ట్‌లు పెడుతూ వచ్చేది. దీంతో నెటిజన్లు పెద్ద సంఖ్యలో ఆ పిల్లి వీడియోను చూడటంతో పాటు లైక్, షేర్ చేయడం చేయడం మొదలుపెట్టారు. ఈ నేఫథ్యంలో దానికి విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. అలా కాలక్రమేణ ఆ పిల్లి ఫోటోలు, వీడియోలు చూసేందుకు నెటిజన్లు ఆసక్తి చూపారు. అలా దాని ఫోస్ట్లకు వచ్చిన వ్యూస్ బట్టి అది కోట్ల రూపాయలు సంపాదిస్తోంది. రోలింగ్ స్టోన్స్ నివేదిక ప్రకారం ఆ పిల్లి సంపద అంచనా విలువ $97 మిలియన్లు (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ. 800 కోట్లు). ఇన్స్టాగ్రామ్ డేటాను ఉపయోగించి ఒలివియా విలువను లెక్కించిన ఆల్ అబౌట్ క్యాట్స్ అనే వెబ్సైట్ ఈ జాబితాను రూపొందించింది. View this post on Instagram A post shared by Taylor Swift (@taylorswift) చదవండి: భళా బామ్మ! సాఫ్ట్‌వేర్‌ను మించిన ఆదాయం, 15 రోజులకే 7 లక్షలు! -
రాహుల్ భారత్ జోడో యాత్రలో ప్రత్యేక అతిథి.. ల్యూనా ఫొటోలు వైరల్..
చండీగఢ్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ, ఇతర రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. అయితే హరియాణలో రాహుల్ శనివారం పాదయాత్ర చేస్తున్నప్పుడు ఓ ప్రత్యేక అతిథి కన్పించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ అతిథి ఎవరో కాదు.. రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ పెంపుడు శునకం ల్యూనా. ఇదంటే రాహుల్‌కు ఎంతో ఇష్టమట. అందుకే ఆయనతో పాటు పాదయాత్రలో మెరిసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను కాంగ్రెస్, ప్రియాంక గాంధీ ట్విట్టర్లో షేర్ చేశారు. Luna has been patiently watching you pour all your love on her other canine cousins. So she decided enough is enough - and joined you herself! You see, no one wants to share your affection :) We get you Luna! (Luna, lives with Priyanka Ji - Rahul Ji adores her) pic.twitter.com/6CcpBMKUPt — Congress (@INCIndia) January 7, 2023 ఎట్టకేలకు భారత్ జోడో యాత్ర 100 రోజులు దాటిన తర్వాత ల్యూనాను ఆహ్వానించారు. అని ప్రియాంక ట్విట్టర్లో రాసుకొచ్చారు. కాంగ్రెస్ కూడా ఈ ఫొటోలను షేర్ చేసింది. భారత్ జోడో యాత్రలో రాహుల్ ఇతరులపై చూపిస్తున్న ప్రేమను చూసి ఇక తాను కూడా భాగం కావాలనుకొని ల్యూనా పాదయాత్రకు వచ్చిందని ట్వీట్ చేసింది. హర్యానాలో రాహుల్ యాత్రలో బాక్సర్, ఒలింపిక్స్ పతక విజేత విజేందర్ సింగ్ కూడా పాల్గొన్నారు. ఢిల్లీలో ఎముకలు కొరికే చలిలోనూ రాహుల్ టీ షర్టులో కన్పించిన విషయం గురించి అడిగారు. అందుకు రాహుల్ బుదిలిస్తూ.. తాను రుషి, మునిలా ఓ తపస్సులో ఉన్నట్లు పేర్కొన్నారు. చదవండి: 'ఆ విషయం తెలిస్తే రౌత్‌ను ఉద్ధవ్ థాక్రే చెప్పుతో కొడతారు' -
20 కోట్ల ఆఫర్‌ని కాదన్నాడు.. రూ.100కోట్లు ఇచ్చినా కూడా..
సాక్షి, హిమాయత్‌నగర్ (హైదరాబాద్): రూ.20 కోట్లకు బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి హైదరాబాదీ నుంచి ఖరీదైన పెట్‌ను సొంతం చేసుకున్నాడంటూ వచ్చిన కథనాలన్నీ అవాస్తవం. రష్యాకు చెందిన ‘కొకేషియన్ షెపర్డ్’ అనే జాతికి చెందిన కుక్క కోసం హైదరాబాద్‌కు చెందిన కన్స్ట్రక్టర్ బెంగళూరులోని ‘ఇండియన్ డాగ్ బ్రీడర్స్ అసొసియేషన్’ ప్రెసిడెంట్, పెట్ యజమానైన సతీష్ కెడబామ్స్‌ను సంప్రదించాడు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ పెట్‌కు రూ.20కోట్లు ఇస్తానంటూ యజమానికి ఆఫర్ ఇచ్చాడు. తాను ఈ ఆఫర్‌ను నిరాకరించానని, ఈ పెట్‌ను రూ.100కోట్లు ఇచ్చినా అమ్మేది లేదంటూ ఆయన ‘సాక్షి’కి చెప్పారు. రూ.20కోట్లకు తాను కొన్నానంటూ వచ్చిన కథనాలు అవాస్తవమని కొట్టిపారేశారు. ‘రష్యాకు చెందిన ఈ కొకేషియన్ షెపర్డ్ జాతి శునకం వయసు ఏడాదిన్నర్ర, బరువు 100కేజీలు. ఇది దక్షిణ రష్యాలోని ఆర్మేనియా, అజర్బైజాన్, జార్జియాలతోపాటు టర్కీలో కూడా లభిస్తుంది. చూడటానికిది ఆడ సింహం మాదిరిగా ఉంటుంది. ఈ జాతికి చెందిన శునకం మనదేశంలో దొరికినప్పటికీ రష్యాలో ఉన్న మాదిరిగా ఉండదు. ‘కెడబామ్స్ హైడర్’ అని ముద్దుగా పిలిచే ఈ శునకం త్రివేండ్రంలో జరిగిన ‘కెనల్ క్లబ్ కాంపిటీషన్’లో 32 మెడల్స్‌ను సొంతం చేసుకుని ది బెస్ట్ డాగ్‌గా నిలిచింది’ అని కెడబామ్స్ చెప్పారు. చదవండి: (ఒకేసారి బండి, ఈటల ప్రసంగం.. సాంకేతిక లోపమా? కావాలనే చేశారా?) -
Viral Video : సింహంతో వ్యక్తి పరాచకాలు..
-
విషాదంలో రకుల్.. మిస్ యూ అంటూ ఎమోషనల్ పోస్ట్
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ విషాదంలో ఉంది. తన ఇంట అనుకొని సంఘటన జరిగిందంటూ రకుల్ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగానికి లోనయ్యింది. తనకు ఎంతో ఇష్టమైన తన పెట్‌డాగ్ కన్నుమూయడంతో ఇంట్లో విషాదం నెలకొందని రకుల్ పేర్కొంది. ఈ మేరకు రకుల్ తన ఇన్‌స్టాగ్రామలో తన పెంపుడు కుక్కుతో దిగిన పలు ఫొటోలను షేర్ చేసింది. ‘బ్లోసమ్ 16 ఏళ్ల క్రితం నువ్వు మా జీవితాల్లోకి వచ్చావు. అప్పటి నుంటి మేమంతా ఎంతో సంతోషంగా ఉన్నాం. చదవండి: మరో కొత్త వివాదంలో రష్మిక, సౌత్ ఇండస్ట్రీపై అవమానకర వ్యాఖ్యలు మనిద్దరం కలిసే పెరిగాం. ఎలాంటి బాధ లేకుండా వెళ్లిపోయావు. రెస్ట్ ఇన్ పీస్.. ఎక్కడున్నా నువ్వు సంతోషంగా ఉండాలి’అంటూ రకుల్ పోస్ట్ చేసింది. ఆమె పోస్ట్‌పై మంచు లక్ష్మి స్పందించి. బ్లోసమ్ మృతికి ఆమె సంతాపం తెలిపింది. “రెస్ట్ ఇన్ పీస్ బ్లోసమ్.. రకుల్ నాకు తెలిసినప్పటి నుంచి బ్లోసమ్ కూడా నాకు తెలుసు” అంటూ కామెంట్ చేసింది. అలాగే పలువురు సెలబ్రెటీలు, ఆమె ఫాలోవర్స కూడా బ్లోసమ్ మృతికి సంతాపం ప్రకటిస్తున్నారు. View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) -
శునకాల స్వైర విహారం.. 11 జాతులపై నిషేధం.. ఎక్కడంటే!
న్యూఢిల్లీ: ఇంటి భద్రత కోసం చాలా మంది శునకాలను పెంచుకుంటారు. పెట్స్ ను పెంచుకోవడాన్ని కొంతమంది స్టేటస్ సింబల్‌గా భావిస్తుంటారు. ఇదంతా బాగానే ఉన్నా పెంపుడు జంతువులతో యజమానులకు పెద్దగా సమస్యలు ఉండవు. కానీ శునకాల దాడి కారణంగా ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు ఇటీవల కాలంలో పెరిగాయి. దీంతో కుక్కలంటేనే జనం వణికిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలో ఉన్న గురుగ్రామ్‌లో శునకాల బెడద పెరిగిపోవడంతో కీలక ఆదేశాలు వెలువడ్డాయి. 11 విదేశీ శునకాల జాతులను నిషేధించాలని, వాటి రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని గురుగ్రామ్ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీజీ)ని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార వేదిక ఆదేశించింది. ఆగస్టు 11న సివిల్ లైన్స్‌లో డోగో అర్జెంటీనో జాతికి చెందిన కుక్క కాటుకు గురై తీవ్ర గాయాలపాలైన మహిళ.. తమను ఆశ్రయించడంతో వినియోగదారుల ఫోరం ఈ మేరకు నవంబర్ 15న ఉత్తర్వులు వెలువరించింది. బాధిత మహిళకు రూ. 2 లక్షలు చెల్లించాలని.. పెంపుడు కుక్కల కోసం మూడు నెలల్లో పాలసీని రూపొందించాలని ఎంసీజీని ఫోరం ఆదేశించింది. ఈ 11 జాతులు ప్రమాదకరం.. ప్రమాదకరమైన వాటిగా గుర్తించిన 11 విదేశీ జాతి శునకాలను నిషేధించాలని ఫోరం ఉత్తర్వులిచ్చింది. అమెరికన్ బుల్డాగ్, అమెరికన్ పిట్ బుల్ టెర్రియర్స్, డోగో అర్జెంటీనో, రోట్వీల్లర్, బోయర్‌బోయెల్, ప్రెస్ కానరియో, నియాపోలిషియన్ మాస్టిఫ్, వోల్ఫ్డాగ్, కేన్ కోర్సో, బాండోగ్, ఫిలా బ్రసిలీరో జాతి శునకాలు నిషేధిత జాబితాలో ఉన్నాయి. వాటి బాధ్యత యజమానులదే పెంపుడు శునకాలకు సంబంధించి అమలు చేయాల్సిన అంశాలపై ఎంసీజీకి ఫోరం స్పష్టమైన సూచనలు చేసింది. ‘ప్రతి నమోదిత శునకానికి కాలర్‌ను ధరించాలి.. దానికి మెటల్ టోకెన్‌తో పాటు మెటల్ చైన్‌ను జతచేయాలి. ఒక కుటుంబం ఒక కుక్కను మాత్రమే పెంచుకునేలా చూడాలి. పెంపుడు శునకాలను బహిరంగ ప్రదేశాలకు తీసుకెళ్లినప్పుడల్లా అవి ఎవరినీ కరవకుండా ఉండేందుకు వాటి మూతిని నెట్ క్యాప్ లేదా మరేదైనా వస్త్రంతో కవర్ చేయాలి. బహిరంగ ప్రదేశాలను పాడు చేయకుండా చూడాల్సిన బాధ్యతను యజమానులదేన’ని 16 పేజీల ఉత్వర్తుల్లో పేర్కొంది. పసిపాపపై కుక్క దాడి.. విషాదం గురుగ్రామ్‌లో శునకాల స్వైర విహారంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. గత నెలలో వీధి కుక్క దాడిలో ఓ పసిపాప ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది. కాగా, పిట్ బుల్, రోట్వీలర్, డోగో అర్జెంటినో అనే మూడు జాతుల కుక్కల పెంపకంపై నిషేధం విధించే ప్రతిపాదనను ఘజియాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అక్టోబర్‌లో ఆమోదించింది. జంతు ప్రేమికుల ఆందోళన విదేశీ సంతతికి చెందిన 11 జాతి శునకాలపై నిషేధం విధించడాన్ని జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శునకాల్లో ప్రమాదకరమైనవి అంటూ ప్రత్యేకంగా ఏమీ లేవని.. పరిస్థితులను బట్టి మూగజీవాలు స్పందిస్తాయని నిహారిక కశ్యప్ అనే జంతు పరిరక్షణ కార్యకర్త తెలిపారు. కుక్కలను ఎక్కువసేపు బంధించి ఉండచం, వాటికి సమయానికి ఆహారం పెట్టకపోవడం వంటి కారణాలతోనే అవి అదుపు తప్పుతాయని వివరించారు. సమస్య పరిష్కారానికి కారణాలు గుర్తించకుండా కొన్ని జాతి శునకాలపై నిషేధం విధించడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. విదేశీ శునకాలను అధిక మొత్తానికి విక్రయించి సొమ్ములు చేసుకుంటున్న వ్యాపారులపై అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. (క్లిక్: భారతీయ రైల్వే కీలక నిర్ణయం.. వారికి భారీగా పెరగనున్న జీతాలు) -
ప్రపంచంలోనే అత్యంత పొడవైన పిల్లిగా గిన్నిస్ రికార్డు
ప్రపంచంలోనే అత్యంత పొడవైన పిల్లిగా సవన్నా జాతికి చెందిన పెంపుడు పిల్లి గిన్నిస్ రికార్డు సృష్టించింది. ఇది ఒక ఫెన్నిర్ అంటారెస్ పవర్స్ అనే హైబ్రిడ్ జాతికి చెందిన పిల్లి అని యజమాని డాక్టర్ విలియం జాన్ పవర్స్ తెలిపారు. ఈ సవన్నా జాతి పిల్లులు పెంపుడు పిల్లికి ఒక ఆఫ్రికన్ పిల్లికి పుట్టిన సంకర జాతి. ఇది సాధారణ పిల్లుల కంటే సుమారు 18.83 అంగుళాల పొడువు ఉంటుందని తెలిపారు. 2016లలో పెన్నిర్‌కి సంబంధించిన మరో జాతి సుమారు 19.05 అడుగుల ఎత్తుతో రికార్డు సృష్టించినట్లు తెలిపారు. ఐతే దురదృష్టవశాత్తు ఆ జాతి మొత్తం ఒక అగ్ని ప్రమాదం మరణించాయని తెలిపారు. అవి ఇప్పటికి చరిత్రలో అత్యంత ఎత్తైన పెంపుడు పిల్లులుగా గుర్తింపు పొందుతున్నాయని అన్నారు. అంతేగాదు ఈ సవన్నా జాతి పిల్లి తన సంతతిని పునరుద్ధరించడంలో సహాయపడుతుంతని కూడా అన్నారు. అంతేగాదు అంతర్జాతీయ క్యాట్ అసోసియేషన్ ఈ జాతిని దేశీయ జాతిగా గుర్తించిందని చెప్పారు. (చదవండి: టీచర్ అయ్యి ఉండి ఇదేం పని... పిల్లల ముందే అలా..) -
పెంపుడు కుక్క చనిపోయిందని.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: పెంపుడు కుక్క చనిపోయిందని మనో వేదనతో డిగ్రీ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు... అల్వాల్ రిట్రిట్ కాలనీకి చెందిన లక్ష్మీ నారాయణ కుమారుడు విష్ణు నారాయణ (20) డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. సోమవారం రాత్రి అతను తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం విష్ణు గదిలో నుంచి బయటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు బలవంతంగా తలుపులు తెరిచి చూడగా సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు. తన కుమారుడు కొంత కాలంగా మనోవేదనతో బాధపడుతున్నాడని ఇటీవల పెంపుడు కుక్క చనిపోవడంతో తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడని ఈ కారణంగానే ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. విష్ణు నారాయణ రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: రైల్వే ట్రాక్‌పై ఇంజినీరింగ్ విద్యార్థి.. కాలేజీకి వెళ్తున్నానని చెప్పి.. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
Allola DIVYA REDDY: గోమాత
ఆవు... అమ్మ తర్వాత అమ్మ. పిల్లలకు పాలిచ్చి పోషిస్తుంది. నేలకు సారం... మట్టికి జీవం ఇస్తుంది. పంటకు ప్రాణం... అవుతుంది. అందుకే ఆవు... ఆరాధ్యదైవం అయింది. మనిషి మనుగడకు ఆధారం అయింది. అలాంటి మన ఆవు ప్రమాదంలో ఉంది. ఇప్పుడు ఆవును కాపాడే ఒక అమ్మ కావాలి. ఆ అమ్మ... అల్లోల దివ్యారెడ్డి. పెట్ రైట్స్ కోసం పోరాటాలు జరుగుతున్నాయి. వన్యప్రాణుల సంరక్షణకు చట్టాలున్నాయి. పులుల సంఖ్యను పెంచడానికి ప్రత్యేక సంరక్షణ చర్యలు తీసుకుంది ప్రభుత్వం. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రపంచమంతా ఉద్యమాలు జరుగుతున్నాయి. మరి పర్యావరణ వ్యవస్థలో మన ఆవులు ఎందుకు స్థానాన్ని కోల్పోతున్నాయి. ఆవును మచ్చిక చేసుకుని అడవి నుంచి ఇంటికి తెచ్చుకున్నారు మన పూర్వికులు. ఇప్పుడవి ఎల్లలు దాటి వెళ్లిపోతుంటే చూస్తూ ఊరుకుంటున్నాం మనం. ఇప్పుడు కూడా మేల్కొనకపోతే ఆ తర్వాత ఉద్యమించినా ప్రయోజనం ఉండదంటారు అల్లోల దివ్యారెడ్డి. మన దేశీయ ఆవులను సంరక్షించే బాధ్యతను చేపట్టారామె. ‘ప్రమాదం అంచున ఉన్న దేశీయ ఆవులను సంరక్షించు కుందాం’... అని పిలుపునిస్తున్నారు. ఇందుకోసం సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలు చేశారు. ఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఇప్పుడు ఎకలాజికల్ ఇంజనీరింగ్ బాధ్యతను చేపట్టిన ప్రస్థానాన్ని సాక్షితో పంచుకున్నారామె. ఏటూ మిల్క్ మన ఆవులవే! ‘‘మాది తెలంగాణ, సంగారెడ్డి జిల్లా కేంద్రం. పెరిగింది మాత్రం హైదరాబాద్‌లోనే. నాన్న వాటర్ వర్క్స్‌లో ఇంజనీర్ ఇన్ చీఫ్‌గా రిటైర్ అయ్యారు. నేను ఇంజనీరింగ్ తర్వాత పెళ్లి చేసుకుని, మా వారికి వ్యాపారంలో సహాయంగా ఉన్నాను. అత్తగారిల్లు నిర్మల్. ఇద్దరు పిల్లలతో నాలోకం నాదిగా, పిల్లలను చక్కగా పెంచుకోవడమే తొలి ప్రాధాన్యంగా ఉండేది. అలాంటిది 2014 నన్ను పూర్తిగా మార్చేసింది. అప్పుడు వార్తా పత్రికల్లో, టీవీ చానెళ్లలో పాల కల్తీ గురించి వరుస కథనాలు వచ్చాయి. నా పిల్లలకు తాగిస్తున్న పాలు స్వచ్ఛమైనవి కావా, విషపూరితమైన ఆహారాన్ని పిల్లలకు ఇస్తున్నానా... అని ఎంత ఆవేదన చెందానో మాటల్లో చెప్పలేను. అప్పటి నుంచి స్వచ్ఛమైన ఏటూ (అ2) పాల గురించి అధ్యయనం మొదలుపెట్టాను. మన దేశీయ ఆవు ఇచ్చే పాలే ఏటూ మిల్క్ అని తెలిసిన తర్వాత సంతోషం వేసింది. హైదరాబాద్‌లో ఏటూ మిల్క్ కోసం అన్వేషణ మొదలు పెట్టాను. ఆశ్చర్యం... పాలు దొరకనే లేదు. మనం, మన పిల్లలు మాత్రమే కాదు, మన ఆవు కూడా ప్రమాదం అంచున ఉన్నట్లు అప్పుడు తెలిసింది. వెంటనే పది ఆవులతో సంగారెడ్డిలోని మా పొలంలోనే క్లిమామ్ గోశాల మొదలుపెట్టాను. అక్కడి నుంచి మా ఇంటికి నలభై నిమిషాల ప్రయాణం. అప్పటి నుంచి మా పిల్లలు స్వచ్ఛమైన పాలతో పెరుగుతున్నారు. మన దేశీయ గోసంతతి పెంచడానికి నేను చేస్తున్న ప్రయత్నంలో భాగంగా 2015లో పది ఆవులతో మొదలైన గోశాలలో ఇప్పుడు 250 ఉన్నాయి. మా క్లయింట్లు చాలా మంది ఇప్పుడు రెండు – మూడు ఆవులను పెంచుకుంటున్నారు. కొంతమంది ఏకంగా వంద ఆవులతో ఫార్మ్ పెట్టారు. దేశ పర్యటన మూపురం ఉన్న ఆవు మన దేశీయ ఆవు. అలాంటి దేశీయ ఆవుల సంఖ్య పెంచడానికి దాదాపుగా దేశమంతా పర్యటించాను. రైతులతో మాట్లాడాను. ఆవును పెంచడం పాలకోసం అనుకుంటారు, కానీ నిజానికి ఆవు పాలు మనకు బోనస్ మాత్రమే. అసలైన ప్రయోజనం నేలకోసం. నేలను సారవంతంగా ఉంచుకున్నంత కాలమే మనిషికి మనుగడ. వందగ్రాముల ఆవుపేడలో పదిలక్షల సూక్ష్మజీవులుంటాయి. అవి నేలను సజీవంగా ఉంచుతాయి. రసాయన ఎరువులు, పురుగుమందులతో నేలలో ఉండాల్సిన జీవజాలం అంతరించిపోతోంది. ఆవుపేడ ద్వారా వాటిని తిరిగి పొందవచ్చు. అందుకే ‘నేల పండాలంటే ఆవు ఉండాలి. అది మన దేశీయ ఆవు అయి ఉండాలి’ అంటాను. సేంద్రియం మనకు కొత్త కాదు! మన రైతులు సేంద్రియ వ్యవసాయమే చేసేవారు. యాభై – అరవై ఏళ్ల వెనక్కి వెళ్లి చూడండి. వాళ్లకు యూరియాలు, డీఏపీలు తెలియదు. ఆవులు, గేదెల ఎరువుతో సేద్యం చేసుకుంటూ రైతు రాజులాగా జీవించాడు. అలాంటి రైతును అధిక దిగుబడి అంటూ రసాయన ఎరువులతో పక్కదారి పట్టించాం. ఇప్పుడు రైతు ఉన్నంత దీనస్థితిలో మరెవరూ ఉండకపోవచ్చు, వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న ఒడిదొడుకులు మరే పరిశ్రమలోనూ కనిపించవు. ఇప్పుడు మళ్లీ రైతును సేంద్రియం వైపు మళ్లించడానికి వ్యయప్రయాసలు పడాల్సి వస్తోంది. గ్రామాల్లో ప్రతి ఇంట్లో కనీసం ఒక్క దేశీయ ఆవు ఉన్నా చాలు, దేశంలో ఆవుల సంతతి పెరుగుతుంది, వ్యవసాయం బాగుపడుతుంది. మనిషి జీవనం గాడిలో పడుతుంది. ఆవులకు కృత్రిమ గర్భధారణను తప్పనడం లేదు, కానీ విదేశీ బ్రీడ్‌తో గర్భధారణను వ్యతిరేకిస్తున్నాను. రెడ్ సింధీ, సహీవాల్, గిర్ వంటి రోజుకు పదిహేను లీటర్ల పాలిచ్చే రకాలున్నాయి. అలాంటి మనదేశీయ జాతితో గర్భధారణ చేసినప్పుడే మన ఆవు మనకు మిగులుతుంది. లేకపోతే శ్రీలంక పరిస్థితి తప్పదు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల నుంచి ఆవులను దిగుమతి చేసుకుందా దేశం. సొంత నేల ఆవు జాతులను పట్టించుకోలేదు. చివరికి దిగుమతి చేసుకున్న బ్రీడ్ నిలవలేదు, సొంత బ్రీడ్ అంతరించిపోయిందక్కడ. నేను న్యాయస్థానం మెట్లెక్కింది కూడా ఈ విషయంలోనే. కృత్రిమ గర్భధారణ హైబ్రీడ్‌తో వద్దు, మన దేశీయ జాతులతో చేయాలని న్యాయస్థానాన్ని కోరాను’’ అన్నారు అల్లోల దివ్యారెడ్డి. ఇంత పెద్ద బాధ్యతను భుజానికెత్తుకున్నప్పటికీ ఎక్కడా అవరోధాలు లేకుండా ముందుకు సాగడానికి ఇంట్లో అందరి సహకారం ఉందని, కుటుంబ సభ్యుల పట్ల కృతజ్ఞత వ్యక్తం చేశారామె. ఆవు నన్ను ఎంచుకుంది! అవుతో కలిసి సాగుతున్న నా జర్నీ అంతటినీ ఓసారి వెనక్కి చూసుకుంటే... గోసేవను ఎంచుకున్నది నేను కాదు, గోవులే నన్ను ఎంచుకున్నాయనిపిస్తోంది. నేను చేస్తున్నదేదీ ముందుగా ప్రణాళిక వేసుకుని మొదలుపెట్టింది కాదు. పాల కల్తీ గురించి తెలిసినప్పటి నుంచి ఒక్కటొక్కటిగా అడుగులు వాటంతట అవే పడుతున్నాయి. ఈ పోరాటంలో విజయం సాధించేవరకు విశ్రమించను. ఆవును నగరాల్లో ఇళ్లకు కూడా పరిచయం చేయడానికి మట్టి గణపతిలో కొద్దిగా గోమయం కలిపి చేస్తున్నాను. గోమయంతో కూడిన మట్టి గణపతి విగ్రహాన్ని చెరువులో నిమజ్జనం చేయవచ్చు లేదా కరిగించి ఇంట్లో మొక్కలకు ఎరువుగానూ వేసుకోవచ్చు. మన ఆవు కోసం ఇంకా ఏ ఆలోచన వస్తే దానిని ఆచరణలో పెడుతూ ముందుకు వెళ్తాను. మన జాతీయ చిహ్నంలో ఉన్న ఎద్దు బొమ్మను ఉదహరిస్తూ జాతి సంపదను పరిరక్షించుకుందాం... అని సమాజాన్ని చైతన్యవంతం చేసే ప్రయత్నంలో ఉన్నాను. – అల్లోల దివ్యారెడ్డి, వ్యవస్థాపకురాలు, క్లిమామ్ గోశాల – వాకా మంజులారెడ్డి ఫొటోలు : నోముల రాజేశ్ రెడ్డి -
పెంపుడు కుక్కతో ‘టెక్కీ’ లవ్ జర్నీ.. ఎందుకో తెలుసా..?
సాక్షి, విశాఖపట్నం: యువతరం.. మార్పు కోరుకుంటోంది. ఆ మార్పు తమ వద్ద నుంచే ప్రారంభం కావాలనీ.. పది మందికీ స్ఫూర్తిగా నిలిచేందుకు ఎంతటి శ్రమనైనా చిరునవ్వుతో అధిగమించాలనీ అభిలషిస్తోంది. సేవాకార్యక్రమాల నుంచి సాహసాల వరకూ ప్రతి విషయంలోనూ యువత ఇదే రీతిలో ఆలోచిస్తోంది. ఈ కోవకు చెందిన వారే సాహిత్యవర్ధన్. సాఫ్ట్వేర్ ఉద్యోగానికి స్వస్తి చెప్పి.. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ దేశాటన చేస్తున్నాడు. ఎందుకో తెలుసా..? విశ్వాసానికి ప్రతీకలైన శునకాల కోసం. అదీ ముఖ్యంగా వీధి కుక్కల కోసం. సాహిత్య వర్ధన్ ప్రయాణం. ఇదంతా ఇటీవల విడుదలై సంచలనం సృష్టించిన 777–చార్లీ సినిమా మాదిరిగా ఉంది. మరి ఈ శునకాల కోసం సాగిన ప్రయాణ విశేషాలను ఓసారి చూద్దాం. చదవండి: అఖండ గోదావరి.. ప్రాజెక్టుల గేట్లు బార్లా! అనగనగా.. ఓ ఒంటరి యువకుడు. హఠాత్తుగా ఆయన జీవితంలోకి ఓ కుక్క వస్తుంది. ఆ కుక్కకు ఇష్టమైన ప్రాంతాల్ని చూపించేందుకు ఆ యువకుడు చేసిన ప్రయాణమే 777–చార్లీ సినిమా వృత్తాంతం. కుక్కకి.. యువకుడికి మధ్య జరిగిన భావోద్వేగాలు ప్రేక్షకుల మనసుల్ని హత్తుకున్నాయి. సరిగ్గా ఇదే మాదిరి ప్రయాణం సాగింది సాహిత్యవర్ధన్.. పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన సాహిత్యవర్ధన్ కుటుంబం చిన్నతనం నుంచే విశాఖపట్నంలో నివసిస్తోంది. ప్రత్యేకంగా తయారు చేసిన వాహనంలో ప్రయాణం ఈ యువ టెక్కీకి చిన్నతనం నుంచే కుక్కలంటే చాలా ఇష్టం. ముఖ్యంగా వీధి కుక్కలంటే ఎక్కువ ఆసక్తి చూపించేవాడు. తన పరిసరాల్లోని వీధుల్లో ఆకలితో అలమటించే కుక్కల్ని చూసి చలించిపోయిన సాహిత్యవర్ధన్.. తన దగ్గరున్న పాకెట్ మనీతో వాటి ఆకలి తీర్చేవాడు. అలా వాటితో అనుబంధం బలపడింది. ఆ్రస్టేలియాలో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో మాస్టర్స్ చదివిన సాహిత్యవర్ధన్.. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవాడు. అయినా తెలియని ఆందోళనతో ఉద్యోగానికి స్వస్తి చెప్పి.. వీధి కుక్కల పరిరక్షణకు నడుం బిగించాలని నిర్ణయించుకున్నాడు. పెంపుడు కుక్కతో దేశాటన వీధి కుక్కల పట్ల అవగాహన కల్పించేందుకు ‘కన్యాకుమారి టు కాశ్మీర్’యాత్రకు గతేడాది సెప్టెంబర్ 20న శ్రీకారం చుట్టాడు. ఐదు నెలల వయసున్న ఓ వీధికుక్క లెక్సీని దత్తత తీసుకొని.. దానితో కలిసి ఈ యాత్ర మొదలుపెట్టాడు. తన సైకిల్‌కు పక్కనే.. కుక్క కోసం ప్రత్యేకంగా ఓ బెడ్ మాదిరిగా ఏర్పాటు చేసి.. ప్రత్యేక ట్రైలర్ కస్టమ్ని రూపొందించాడు. తన ప్రయాణంలో వీధి కుక్కల దత్తతలోని ప్రాముఖ్యతను ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. వాటికి ఆహారం అందిస్తూ యాత్ర చేపట్టాడు. తాను తిరిగిన ప్రాంతాలన్నింటినీ లెక్సీకి చూపిస్తూ యాత్ర కొనసాగించాడు. మొత్తం 3,700 కిలోమీటర్ల దూరాన్ని 90 రోజుల్లో పూర్తి చేశాడు. చికెన్, అన్నం, గుడ్లు ఎప్పటికప్పుడు వంట చేసుకుంటూ లెక్సీ కోసం ఆహారం అందించాడు. ఈ ప్రయాణంలో జాతికుక్కల్ని కొనుగోలు చేయకుండా... వీధికుక్కల్ని దత్తత తీసుకోవాలని ప్రతి ఊరిలోనూ ప్రతి ఇంటిలోనూ ప్రచారం నిర్వహించాడు. ఈ ప్రచారంతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో 56 వీధికుక్కల్ని దత్తత తీసుకోవడం విశేషం. అంతే కాకుండా వీధి కుక్కలకు ఆహారం అందించే అలవాటు కూడా చాలా మందిలో పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో యాత్ర వీధి కుక్కల దత్తతకు సంబంధించి.. మరింత విస్తృత ప్రచారం చేసేందుకు మరో యాత్రకు సాహిత్య వర్ధన్ శ్రీకారం చుట్టాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సైకిల్ యాత్ర ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వరకూ యాత్రను డ్రాగ్ ట్రావెలర్ సాహిత్యవర్ధన్ ఆగస్ట్ 1 నుంచి మొదలు పెట్టాడు. రోజుకు 50 నుంచి 60 కి.మీ. ప్రయాణం చేస్తూ.. నలుగురు కనిపించిన చోట వీధి కుక్కల గురించి అవగాహన కల్పిస్తున్నాడు. వీధికుక్కల్ని కాపాడాలి.. దత్తత తీసుకోవాలి.. వాటికి ఆహారం అందించాలంటూ సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పోస్ట్ చేస్తూ అవగాహన కల్పిస్తూ ప్రయాణం సాగిస్తున్నాడు. అదే విధంగా కుక్కలు రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా మెడలో రేడియం బెల్ట్‌లు కడుతున్నాడు. ఏడాదిలో 3 నెలలు వీధికుక్కల కోసం.. వీధికుక్కల పట్ల క్రూరత్వానికి వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యవంతులను చేయడమే ఈ యాత్ర వెనుక ఉన్న ప్రధాన లక్ష్యమని డాగ్ ట్రావెలర్ సాహిత్యవర్ధన్ చెబుతున్నాడు. జాతి కుక్కలతో పోలిస్తే వీధికుక్కలు స్నేహపూర్వక జీవులే కాకుండా రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండే ప్రాణులని తెలిపాడు. అందుకే జాతి కుక్కలకు బదులుగా వీధి కుక్కలను దత్తత తీసుకోవాలని ప్రతి ఊరిలోనూ ప్రజలను కోరుతున్నానని వివరించాడు. ఇటీవల బెంగళూరులోని ఓ అపార్ట్మెంట్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదాన్ని పసిగట్టిన ఓ వీధికుక్క మొరుగుతూ 150 మందిని రక్షించిందన్నాడు. వీధికుక్కల ప్రేమను పొందడమే కాకుండా.. వాటికి ప్రేమను పంచేందుకు సమాజంలోకి వాటిని తీసుకురావాలన్న మార్పు కోసం.. ఏడాదిలో 3 నెలలు కేటాయించేందుకు సిద్ధపడినట్లు సాహితీవర్థన్ వెల్లడించారు. -
ఇంటిముందున్న పెంపుడు కుక్కపై చిరుతపులి దాడి.. సీసీటీవీ దృశ్యాలు వైరల్
ముంబై: అర్దరాత్రి ఇంటి ముందు ఉన్న పెంపుడు కుక్కపై చిరుతపులి దాడి చేసిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఈ నెల 5వ తేదీన నాసిక్‌లోని ముంగ్సారే గ్రామంలో నివాస ప్రాంతంలోకి చిరుతపులి ప్రవేశించి హల్‌చల్‌చేసింది. అర్దరాత్రి ఉంటి ముందు చిన్న గోడపై పెంపుడు కుక్క కూర్చొని ఉండగా.. దూరం నుంచి చిరుతపులి అటు వైపుగా వచ్చింది. చిరుతను గమనించిన శునకం అలెర్ట్ అయి పారిపోయేందుకు ప్రయత్నించింది. చిరుత దగ్గరకు రావడంతో గోడ వైపు నుంచి అటు ఇటు దూకుతూ చిరుత దాడి నుంచి తప్పించుకునేందుకు ట్రై చేసింది. #WATCH | Leopard entered a residential area in Mungsare village of Nashik, attacked a pet dog yesterday (Source: CCTV) pic.twitter.com/OznDoeQvHR — ANI (@ANI) June 6, 2022 అయితే చిరుతపులి పట్టు వదలకుండా కుక్క వెనకాలే పరుగెత్తింది. అలా కొద్దిసేపటి తరువాత చివరకు ఆ శునకం చిరుతకు ఆహారంగా దొరికిపోయింది. చిరుతపులి తన దవడలతో కుక్కను కరచుకొని వెళ్లిపోయింది. ఈ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. కాగా జనావాసాల్లో చిరుతపులి సంచారంపై నాసిక్ ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. చిరుతపులి వస్తుండటంతో ముంగ్సారే గ్రామ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, రాత్రిపూట ఇళ్లలోనే నిద్రించాలని విజ్ఞప్తి చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. చిరుత సంచరిస్తుందని తెలిసి పెంపుడు కుక్కలను బయట ఎందుకు ఉంచుతున్నారని మండిపడుతున్నారు. చదవండి: అంత బలుపేంటి భయ్యా.. కారు ఉంటే ఇంట్లో పెట్టుకో చౌదరి సాబ్.. Maharashtra | We appeal to the people of Mungsare village to remain indoors at night as leopard activity has increased in this area. People must remain alert: Pankaj Garg, Deputy Conservator of Forest, Nashik pic.twitter.com/2nPNepXCQi — ANI (@ANI) June 6, 2022 -
Puttaparthi: ఆ ఏనుగంటే సత్యసాయికి ఎంతో ప్రేమ
పుట్టపర్తి అర్బన్(శ్రీసత్యసాయి జిల్లా): సత్యసాయి బాబాకు ఎంతో ఇష్టమైన ఓ ఏనుగు చనిపోవడంతో దానికి ఏకంగా ఆలయాన్నే నిర్మించారు. నిత్య పూజలు చేస్తున్నారు. ఈ ‘గజరాజు’ ఆలయం పుట్టపర్తిలో నక్షత్రశాల పక్కనే ఉంది. ఈ ఆలయ నేపథ్యాన్ని పరిశీలిస్తే సత్యసాయి బాబా సకల జీవుల పట్ల చూపిన అంతులేని ప్రేమ స్ఫురణకు వస్తుంది. సత్యసాయిబాబా 1962లో తమిళనాడులోని బండిపూర అడవి నుంచి ఓ గున్న ఏనుగును కొనుగోలు చేసి పుట్టపర్తికి తీసుకొచ్చారు. దానికి ‘సాయిగీత’ అని పేరు పెట్టి.. ప్రేమతో పెంచుకుంటుండేవారు. చదవండి: అరుదైన దేవాలయం... మద్యం మాన్పించే దేవుడు! ప్రశాంతినిలయంలో జరిగే ప్రతి కార్యక్రమంలోనూ, పండుగల్లోనూ, ఊరేగింపుల్లోనూ బాబా ముందర సాయిగీత నడుస్తూ ఉండేది. దాని కోసం ప్రత్యేకంగా మావటీలను ఏర్పాటు చేసి, చిన్న షెడ్డులో ఉంచి సంరక్షించేవారు. ప్రతి రోజూ మావటీలు ఏనుగును వాకింగ్‌కు తీసుకెళ్లేవారు. వయసు మీద పడడంతో 2007 మే 23న ‘సాయిగీత’ చనిపోయింది. ఆత్మ బంధువుల అంత్యక్రియలకు సైతం వెళ్లని సత్యసాయి ఆరోజు సాయిగీత అంతిమయాత్రలో పాల్గొని కన్నీటి పర్యంతమయ్యారు. స్థానిక నక్షత్రశాల పక్కనే దాన్ని సమాధి చేశారు. 10వ రోజున వైకుంఠ సమారాధన సైతం ఘనంగా నిర్వహించారు. అక్కడే ఓ ఆలయాన్ని నిర్మించారు. అనంతరం మరో గున్న ఏనుగును అప్పటి టీటీడీ చైర్మన్ ఆదికేశవుల నాయుడు సత్యసాయికి బహూకరించారు. అది అనారోగ్యంతో 2013లో మృతి చెందింది. దాన్ని సైతం సాయిగీత పక్కనే ఖననం చేశారు. నిత్య పూజలు చేస్తున్న మావటి పెద్దిరెడ్డి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి సాయిగీతకు మావటిగా దాదాపు 23 ఏళ్లపాటు సేవలందించాడు. నిత్యం మేతగా చెరుకులు, నేపియర్ గడ్డి, రావి ఆకులు, మర్రి ఆకులు, అరటి గెలలు అందించేవాడు. ప్రతి రోజూ ఏనుగును సుమారు నాలుగు కిలోమీటర్లు వాకింగ్‌కు తీసుకెళుతుండేవాడు. ఏనుగు వచ్చినప్పుడు భక్తులంతా రోడ్డుకు ఇరువైపులా నిలబడి నమస్కరించేవారు. పెద్దిరెడ్డి ఇప్పటికీ పుట్టపర్తిలో ఉంటూ సాయిగీత ఆలయంలో నిత్య పూజలు చేస్తున్నారు. సాయిగీతకు మావటిగా పని చేయడం అదృష్టం సత్యసాయి బాబా ఎంతో ప్రేమగా చూసుకున్న సాయిగీతకు రెండు దశాబ్దాలకు పైగా సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నా. నేను చెప్పిన మాటను బాగా వినేది. చుట్టూ ఎంత మంది భక్తులు ఉన్నా బెదరకుండా నడిచేది. సాయిగీత లేకున్నా బాబా ఆశీస్సులతో ఆశ్రమంలోనే ఉంటున్నా. జీవితాంతం బాబా, సాయిగీత సేవలోనే ఉండిపోతా. – పెద్దిరెడ్డి -
ఈ చిలుకను పట్టిస్తే రూ.5 వేలు.. ‘దయచేసి ఇచ్చేయండి ప్లీజ్’
చాలా మందికి పెంపెడు జంతువులు అంటే ప్రాణం. వాటిని ఇంట్లో పెంచుకోవడానికి తెగ ఇష్టపడతారు. వాటికి ఏలోటు రాకుండా మనుషులతో సమానంగా చూసుకుంటారు. ఎక్కువగా కుక్కలు, పిల్లలు, కొంతమంది చిలుకలు కూడా పెంచుకుంటారు. పెంపుడు జంతువులు కూడా తమ యజమానులపై ఎనలేని ప్రేమను చూపుతున్నాయి. తాజాగా ఓ కుటుంబం తాము ప్రేమగా పెంచుకుంటున్న చిలుక కనిపించకపోవడంతో ఊరంతా గోడలపై పోస్టర్లు అతికించారు. అంతేగాక చిలుకను పట్టించిన వారికి క్యాష్ రివార్డ్ కూడా ప్రకటించారు. ఈ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. గయాకు చెందిన శామ్‌దేవ్ గుప్తా, సంగీత గుప్తా పిప్పరపాటి రోడ్డులో నివసిస్తున్నారు. వీరు గత 12 ఏళ్లుగా ‘పోపో’ అనే చిలుకను పెంచుకుంటున్నారు. అ క్రమంలో గత నెల ఏప్రిల్ 5న ఆ చిలుక తమ ఇంటి నుంచి కనిపించకుండా పోయింది. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు చిలుక ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. చెట్ల దగ్గరికి వెళ్లి, తాము రోజూ మాట్లాడుకునే భాషలో పిలుస్తున్నామని, అయినా అది దొరకడం లేదని వాపోయారు. ఎవ్వరికీ అయినా కనిపిస్తే తమకు అప్పగించాలని కోరుతున్నారు. చిలుకను ఆచూకీ తెలిపిన వారికి రూ.5,100 రివార్డు ప్రకటించారు. ఈ దంపతులు కేవలం పోస్టర్లకు మాత్రమే పరమితం కాలేదు. ఫేస్బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేస్తున్నారు. ఎవరైనా తన పక్షిని తీసుకెళ్తే దయచేసి తమకు అప్పగించాలని కోరారు. వారికి అదనంగా మూడు పక్షలు కొనిస్తానని ఆఫర్ ఇచ్చారు. అది కేవలం పక్షి మాత్రమే కాదని తమ కుటుంబంలో ఓ సభ్యడని తెలిపారు. -
వదల బొమ్మాలి.. వదల.. పెంపుడు కుక్కపై పిట్‌బుల్ దాడి
వాషింగ్టన్: సాధారణంగా కొందరు కుక్కలను ఇష్టంగా పెంచుకుంటారు. వాటిని ఇంట్లో మనుషుల మాదిరిగా చూసుకుంటారు. వాటికి తిండిపెట్టడం, స్నానం చేయించడం లాంటి పనులు చేస్తుంటారు. వాటిని ఎక్కడికి వెళ్లిన తమతో పాటు తీసుకెళ్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కొసారి అనుకోని సంఘటనలు చోటుచేసుకుంటాయి. కొన్ని సార్లు యజమానులు తమ పెంపుడు కుక్కలను బయటకు తీసుకెళ్తున్నప్పుడు వేరే కుక్కలు వాటిపై అరుస్తూ వెంట పడటం, దాడి చేయడం మనకు తెలిసిందే. తాజాగా ఇలాంటి ఒక ఘటన యూఎస్‌లోని లాస్వేగాస్లో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియోలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 19 ఏళ్ల లారెన్ రే అనే యువతి తన పెంపుడు కుక్క మ్యాక్స్‌ను తీసుకొని ఇంటినుంచి బయటకు వచ్చింది. అప్పుడు ఆమెకు ఒక షాకింగ్ ఘటన ఎదురైంది. ఒక పిట్ బుల్ కుక్క ఆమె.. పెంపుడు కుక్కవైపు పరిగెత్తుకు వచ్చింది. అంతటితో ఆగకుండా మ్యాక్స్‌పై దాడిచేయడానికి ప్రయత్నించింది. పాపం.. లారెన్.. ఎంత తప్పించాలని చూసిన ఆ శునకం మాత్రం దాన్ని కరవడానికి విశ్వప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో అప్పుడు ఒక అమెజాన్ డ్రైవర్ యువతి అరుపులు విని వారి ఇంటి వద్దకు చేరుకున్నాడు. ఆ తర్వాత.. చాకచక్యంగా యువతిని తప్పించి ఇంటి లోపలికి పంపించి వేశాడు. వెంటనే ఆమె ఇంటికి వెళ్లిపోయి ఇంటి తలుపులు మూసేసింది. ఆ వీధి శునకం కూడా కాసేపటికి అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘వామ్మో.. ఎంత భయకరంగా దాడిచేస్తుంది..’,‘నీ తెలివికి హ్యట్సాఫ్..’, ‘పాపం.. చిన్న కుక్క దొరికితే దానిపని అంతే..’, ‘వదల బొమ్మాలి.. వదల అంటూ దాడి చేస్తోందంటూ’ కామెంట్లు పెడుతున్నారు. An #Amazon delivery driver has saved a woman and her dog from a vicious pit bull attack in #LasVegas. The heroic courier, who saved the woman and her #dog from the attack, has conquered hearts across social media.#dogs #dogattack #pitbull #anews pic.twitter.com/3f1yKZ5jLd — ANews (@anews) December 21, 2021 -
‘మా మున్ని కనిపిస్తే చెప్పండి ప్లీజ్’
బంజారాహిల్స్: దీపావళి పండుగ రోజున సాయంత్రం టపాసుల మోతకు బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్ పెంపుడు శునకం తప్పిపోయింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్–3లో నివసించే ఆండ్రూఫ్లెమింగ్ దంపతులు తన పెంపుడు కుక్కను ‘మున్ని’ అనే పేరుతో ముద్దుగా పిలుచుకుంటారు. ఈనెల 4వ తేదీన దీపావళి రోజు రాత్రి స్థానిక ప్రజలు పెద్దఎత్తున బాణాసంచా కాల్చారు. ఈ శబ్ధాలకు బెదిరి తమ పెంపుడు కుక్క ఇల్లు దాటి పారిపోయిందని చెబుతూ, ఈ మేరకు కుక్క ఫొటోను ఆయన ట్వీట్ చేశారు. ఆచూకీ తెలిసిన వారు 87909 61118 ఫోన్ నంబర్లో సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. -
అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించినా 2017 PET అభ్యర్థులు
-
పెంపుడు కుక్క విమాన ప్రయాణం.. అందుకోసం మహిళ ఏకంగా..
ఇంట్లో పెంపుడు జంతువులంటే చాలా వరకు కుక్కనే పెంచుకుంటారు. ఇక కొందరైతే వాటిని జంతువుల్లా కాకుండా తమ సొంత మనుషుల్లా ట్రీట్ చేస్తుంటారు. మరో రకంగా చెప్పాలంటే కుక్కలు మనుషులకు మంచి నేస్తాలు అంటారు. అందుకే కొందరు ఖర్చు ఎక్కువైనా విదేశి జాతి కుక్కలను ప్రత్యేకంగా దిగుమతి చేసుకుని మరీ పెంచుకుంటారు. తాజాగా ఓ మహిళ తన పెట్ డాగ్ కోసం ఏకంగా విమానంలోని బిజినెస్ క్లాస్ మొత్తం బుక్ చేసింది. ఇలా మొత్తం బిజినెస్ క్లాస్ క్యాబిన్ లగ్జరీలో ఓ పెంపుడు జంతువు ప్రయాణించడం కోసం బుక్ చేసిన మొదటి సందర్భం కూడా ఇదే. వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన ఓ మహిళ.. తన పెంపుడు కుక్క మాల్టెస్ విమాన ప్రయాణం కోసం ఎయిర్ ఇండియా విమానంలోని బిజినెస్ క్లాస్ టికెట్లన్నీ కొనేసింది. అందుకోసం ఆమె ఏకంగా 2.5 లక్షల రూపాయలు ఖర్చు చేసింది. బిజినెస్ క్లాస్‌లో ముంబై నుంచి చెన్నై వరకు వీఐపీలా మాల్టెస్ ఒక్కటే ప్రయాణించిన లక్కీ డాగ్ అనే చెప్పాలి. ఆ విమానంలో ఒక బిజినెస్ క్లాస్ సీటు కోసం వన్-వే ఛార్జీ సుమారు రూ. 20,000 ఉంటుంది. ఆ పెట్ డాగ్ గత బుధవారం ఉదయం 9 గంటలకు ఎయిర్ ఇండియా విమానం ఏఐ-671 ముంబై నుంచి బయలుదేరి 10.55 గంటలకు చెన్నైకు చేరింది. అయితే.. ఎయిర్ఇండియా పాలసీ ప్రకారం.. వారి విమానాల్లో జంతువులకు అనుమతి ఉంది. ఒక ప్రయాణీకుడు రెండు పెంపుడు జంతువులతో ప్రయాణించే వెసలుబాటు ఉంది. జంతువుల పరిమాణం ఆధారంగా, వాటిని క్యాబిన్లో లేదా కార్గో హోల్డ్‌లో ఉంచవచ్చు. అయితే బిజినెస్ క్లాస్‌లో, పెంపుడు జంతువులు చివరి వరుసలో కూర్చుంటాయి. ప్రయాణీకుల క్యాబిన్లో పెంపుడు జంతువులను అనుమతించే ఏకైక దేశీయ క్యారియర్ ఎయిర్ ఇండియా. -
నా కొడుకు పెద్దవాడయ్యాడు : నిహారిక
Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదెల సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్‌గా ఉంటారో అందరికి తెలిసిందే. సినిమా కబుర్లతో పాటు వ్యక్తిగత విషయాలను ఎప్పుటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. అలాగే ఫన్నీ వీడియోలు, కొత్తరకం వంటకాల వీడియోలు షేర్ చేస్తూ లాక్డౌన్లో తన ఫాలోవర్లకు వినోదంతో పాటు మంచి సమాచారాన్ని కూడా అందిస్తుంది. పెళ్లి తర్వాత ఈ మెగా బ్యూటీ కొత్తరకం వంటలపై దృష్టిపెట్టింది. వంటింట్లోకి దూరి కొత్తకొత్త వంటలను వండి ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. లాక్డౌన్ సమయంలో నిహారిక సోషల్ మీడియా పోస్టులు చాలా వరకు నెట్టింట వైరల్ అయ్యాయి. తాజాగా ఈ మెగా బ్యూటీ తన పెంపుడు కుక్క గురించి పెట్టిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. పెళ్లితర్వాత జరుపుకున్న తొలి పుట్టిన రోజుకి నిహారికకి భర్త చైతన్య జొన్నలగడ్డ ఓ స్పెషల్ పెట్ని గిఫ్ట్‌గా ఇచ్చిన విషయం తెలిసిందే. దాన్ని నిహారిక కొడుకుగా భావించి ముద్దుగా పెంచుకుంటుంది. ఆ పెట్‌కి బజ్ అని పేరుకూడా పెట్టారు. తమ ఇద్దరికి ఏం తోచనప్పుడు చేతులో చేయి వేసుకుని పడుకుంటామని తన పెట్ బజ్ గురించిచెప్పుకొచ్చింది నిహారిక. ‘నా బేబీ బాయ్ ఇప్పుడు పెద్దగా అవుతున్నాడు’ అని ఓ ఫోటోని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది నిహారిక. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. చదవండి: నటుడు వేణు గుర్తున్నాడా? ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా! ఓటీటీలోకి రానున్న ఉదయ్ కిరణ్ చివరి చిత్రం -
కుక్క ప్రాణాలు ముఖ్యమా..? నీ ప్రాణాలు ముఖ్యమా..?
సాక్షి, బంజారాహిల్స్: పెంపుడు కుక్క అనారోగ్యంతో బాధపడటంతో లాక్డౌన్ సమయంలో ఆస్పత్రికి తీసుకెళ్తున్న యజమానిని శ్రీనగర్‌కాలనీ టీవీ9 చౌరస్తా చెక్‌పోస్ట్ వద్ద ఉన్న బంజారాహిల్స్ పోలీసులు ఆపారు. కారులో కుక్కను తీసుకొని ఎక్కడికి వెళ్తున్నారంటూ బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ శివచంద్ర యజమానిని ప్రశ్నించారు. గత రాత్రి నుంచి తమ పెంపుడు కుక్క తీవ్ర జ్వరం, విరేచనాలతో వణికిపోతున్నదని ఆస్పత్రికి తీసుకెళ్తున్నానని యజమాని సోము చెప్పాడు. ఉదయం నుంచి డాక్టర్ కోసం ప్రయత్నిస్తుంటే 12.30 గంటలకు అపాయింట్మెంట్ దొరికిందని.. కుక్క ప్రాణాలు కాపాడటానికి బయటికి రావడం తప్పలేదని నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. లాక్డౌన్ సమయంలో బయటికి రావడమే తప్పని.. కుక్క ప్రాణాలు ముఖ్యమా? నీ ప్రాణాలు ముఖ్యమా? అని ఇన్స్పెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అనారోగ్యంతో ఉన్న కుక్కను అలాగే ఇంట్లో ఎలా వదిలేస్తాం సార్ అంటూ యజమాని ప్రశ్నించాడు. కుక్కకు ఒంట్లో బాగాలేకపోతే వీడియో కాల్ ద్వారా డాక్టర్‌ను సంప్రదించాలని కానీ బయటికి ఎలా వస్తావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. జంతు ప్రేమికులు ఇదెక్కడి చోద్యమంటూ ప్రశ్నించారు. నోరు లేని జంతువుల ఆరోగ్యం కూడా ముఖ్యమే కదా అంటూ సోషల్ మీడియా వేదికగా జంతు ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాన్ని బ్లూ క్రాస్ సొసైటీ దృష్టికి తీసుకెళ్తామని వారు తెలిపారు. చదవండి: కరోనా కాలం: మరీ 70 వేల రూపాయలా?! -
'ఆ టెస్టు నాకు ప్రత్యేకం.. అందుకే కుక్కకు ఆ పేరు'
చెన్నై: కెరీర్ తొలి టెస్టు అంటే ఏ క్రికెటర్‌కైనా ప్రత్యేకంగా నిలిచిపోతుంది. అదే ఆ మ్యాచ్‌లో చిరస్మరణీయ ప్రదర్శన చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషిస్తే ఇక ఆ మైదానం, వేదిక సహజంగానే చిరస్మరణీయంగా మారిపోతుంది. ఏదో రూపంలో దానిని రోజూ గుర్తు చేసుకునేవారు చాలా మంది. ఇప్పుడు భారత ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా అదే పని చేశాడు. తన తొలి టెస్టు ఆడిన బ్రిస్బేన్‌లోని ‘గాబా’ మైదానం పేరునే తన బుజ్జి కుక్క పిల్లకు పెట్టుకున్నాడు! మా ఇంట్లోకి కొత్త సభ్యుడి ఆగమనం అంటూ ‘గాబా’ను పరిచయం చేశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 62 పరుగులు చేసిన సుందర్... శార్దుల్‌తో కలిసి ఆరో వికెట్‌కు 123 పరుగులు జోడించాడు. భారత్ స్కోరు 186/6గా ఉన్న దశలో వచ్చిన ఈ భాగస్వామ్యం చివర్లో కీలకంగా మారి జట్టు గెలుపునకు కారణమైంది. అన్నట్లు... 1993లో ఆస్ట్రేలియాపై సిడ్నీ వేదికగా తన తొలి టెస్టు సెంచరీ (277) చేసిన దిగ్గజం బ్రియాన్ లారా తన కూతురుకు ‘సిడ్నీ’ అని పేరు పెట్టిన విషయాన్ని ఇది గుర్తు చేసింది! చదవండి: సుందర్, బెయిర్ స్టో గొడవ.. అంపైర్ జోక్యం ఇంకా రెండు, మూడేళ్లు ఆడతా: ఉమేశ్ యాదవ్ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌ను ఇంకో రెండు మూడేళ్లు కొనసాగిస్తానని భారత సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్ చెప్పాడు. జూన్‌లో న్యూజిలాండ్‌తో జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌పై దృష్టి పెట్టానని 33 ఏళ్ల ఉమేశ్ అన్నాడు. ఇప్పటివరకు 48 టెస్టులు ఆడిన ఉమేశ్‌ను గాయాలు వెంటాడుతున్నాయి. వన్డేలకు పూర్తిగా దూరమైన ఇతన్ని సెలక్టర్లు ఇప్పుడు కేవలం టెస్టు జట్టుకే పరిగణిస్తున్నారు. చదవండి: ఆ విషయంలో సుందర్ నాకంటే సమర్ధుడు -
ఇది ఏ‘కాకి’ కాదు!
సాక్షి, ఖమ్మం: ఎవరైనా కుక్కనో, చిలకనో పెంచుకుంటారు గానీ, కాకిని సాకుతారా? దానిని అందరూ అరిష్టం అంటారు. కానీ ఈమెకు మాత్రం ఇష్టం. దానిని ఎంచక్కా పెంచుకుంటోంది ఖమ్మం నగరంలోని రేవతి సెంటర్‌కు చెందిన మీనా. రెండేళ్ల క్రితం తన ఇంటి ముందు ఉన్న చెట్టుపై నుంచి కాకిగూడు కిందపడింది. దీంతో అందులోని ఐదు పిల్లల్లో ఒకటి చనిపోయింది. నాలుగు పిల్లలను మీనా చేరదీసింది. కొద్దిరోజులకు మరో రెండు చనిపోయాయి. ఇంకో కాకిపిల్ల ఎటో ఎగిరిపోయింది. చివరికి ఏ‘కాకి’గా మిగిలిన దానికి వాణి అనే పేరు పెట్టి సాదుకుం టోంది. అది కూడా కుటుంబసభ్యురాలిగా ఆ ఇంట్లో కలిసిపోయింది. ఆ కాకి బయటకు వెళ్తే వాణి అని పిలిస్తే చాలు వచ్చి మీనా దగ్గర వాలిపోతుంది. అయితే, ఈ కాకిని పెంచుకోవడం వల్ల తమకు ఎటువంటి నష్టం జరగలేదని, మంచే జరుగుతోందని మీనా ఆనందం వ్యక్తం చేస్తోంది. -
వావ్.. ఎంత క్యూట్‌గా ఉందో..!
పెంపుడు జంతువులతో మనిషికి ప్రత్యేక అనుబంధం ఉంటుంది. మన నుంచి ఎలాంటి లాభాన్ని ఆశించకుండా నిస్వార్థంగా ప్రేమిస్తాయి. అందుకే చాలా మంది ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం పెట్స్‌ని పెంచుకుంటారు. ఇంట్లో మనిషిలానే చూస్తారు. ఈ క్రమంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఓ వీడయో పెట్ లవర్స్ అందరిని తెగ ఆకర్షిస్తోంది. దీనిలో ఓ చిన్నారి తన పెంపుడు కుక్కతో కలిసి మూవీ చూస్తుంది. ఈ క్యూట్ వీడియోని బీఆర్ఎఫ్సీ హాప్కిన్స్ అనే ట్విట్టర్ యూజర్ తన అకౌంట్లో షేర్ చేశారు. 22 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో ఓ చిన్న పాప తన మంచం మీద పడుకుని దుప్పటి కప్పుకుని టాబ్లెట్‌లో మూవీ చూస్తూ ఉంటుంది. పాప పక్కనే తన పెంపుడు కుక్క కూడా ఉంటుంది. అది చిన్నారి ఒడిలో పడుకుని మూవీ చూస్తుంటే.. పాప దాన్ని నిమిరుతూ.. సినిమా చూస్తూ అలా నిద్రలోకి జారుకుంటుంది. కుక్క పట్ల ఈ చిన్నారి చూపించిన ప్రేమ, కేర్ నెటిజనుల మనసులను కదిలిస్తోంది. చాలా క్యూట్‌గా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. (వైరల్: ఆనందం పట్టలేక ఏడ్చేశాడు) How beautiful is this guys 😍😍❤️❤️ pic.twitter.com/KPUbkMdsMG — ⚽ Simon BRFC Hopkins ⚽ (@HopkinsBRFC) September 24, 2020 -
నువ్వక్కడ, నేనిక్కడ! ఎంచక్కా!!
సాక్షి, న్యూఢిల్లీ : రాఘవ్ చాబ్రా, 28 ఏళ్ల యువకుడు. ఢిల్లీలో చార్టెట్ అకౌంటెంట్‌గా పని చేస్తున్నారు. ఇంకా పెళ్లి కాలేదు. ఒంటరి వాడు. ఇంటి నుంచే ఆఫీసు పని చేస్తున్నారు. ఇంట్లో వంట పనులు, లాండ్రీ పనులు తానే చూసుకుంటున్నారు. కరోనా భయం కారణంగా బయటి నుంచి తెచ్చిన సరకుల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దాంతో పాటు సాయంత్రం ఏడయ్యే సరికి ఆయన శరీరం అలసిపోతోంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. దాన్ని తగ్గించుకుని ఉల్లాసంగా ఉండేందుకు ఆయన ప్రతి రోజు ఏడు గంటలకు ఓ గంట కాలాన్ని ఆనంద కాలక్షేపానికి కేటాయిస్తారు. ఆ తర్వాత రెట్టింపు ఉత్సాహంతో మిగిలి పనులు చక్క బెట్టుకొని నిద్రకు ఉపక్రమిస్తాడు. అయితే, ఆనందం కోసం గంట కాలాన్ని ఎలా వెచ్చిస్తున్నాడన్న అనుమానం రావొచ్చు. మద్యం సేవిస్తూ ఆయన గంటపాటు అనందంగా కాలక్షేపం చేస్తారనుకుంటే పొరపాటు. ఆ ఆనంద సమయంలో చాబ్రా తన దత్తత తీసుకున్న కుక్క పిల్లతో ఆడుకుంటారు. ముచ్చట్లు పెడతారు. అలా అని ఆ కుక్క పిల్ల ఆయనతోని ఆయన ఇంట్లో ఉంటుందనుకుంటే కూడా పొరపాటే. అది ఢిల్లీకి శివారులోని ఉత్తర్‌ప్రదేశ్ ప్రాంతంలోని జంతు సంరక్షణ కేంద్రం ఆవరణలో ఉంటోంది. దానితోని చాబ్రా తన ల్యాప్‌టాప్‌లో స్కైప్ ద్వారా ఆడుకుంటారు. మాటల ద్వారా, సైగల ద్వారా ఆ కుక్కతో ఆత్మీయ అనుబంధాన్ని ఆస్వాదిస్తారు. చాబ్రా అదష్టవశాత్తు దేశంలో లాక్డౌన్ అమల్లోకి వచ్చిన మార్చి 25వ తేదీకి కొన్ని రోజుల ముందే ఆ కుక్క పిల్లను దత్తత తీసుకున్నారు. దానికి ఫ్రన్నీ అని పేరు కూడా పెట్టుకున్నారు. అక్కడ సంరక్షణ కేంద్రంలో దాని పోషణకు అయ్యే ఖర్చును చాబ్రానే భరిస్తారు. నెలకు లేదా రెండు నెలలకోసారి ఆ ఖర్చును డిజిటల్ పేపెంట్ ద్వారా చెల్లిస్తారు. లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేశాక పెంపుడు కుక్కల సంరక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తున్న ‘ఉమ్మీద్ సోషల్ వెల్ఫేర్ సొసైటీ’ కార్యాలయానికి వెళ్లి దాన్ని ప్రత్యక్షంగా చూద్దామని, ఓ వారం రోజులపాటు దాన్ని తీసుకొని ఊళ్లు తిరుగుదామని చాబ్రా అనుకుంటున్నారు. పెంపుడు జంతువులతో మానసిక ఉల్లాసం కరోనా కష్ట కాలంలో చాబ్రా లాంటి జంతు ప్రేమికులకు, ఒంటరి వాళ్లకు పెంపుడు కుక్కలను దత్తత తీసుకోవడం అనే కొత్త ట్రెండ్ ఇప్పుడు పెరిగిపోయింది. సొంతిళ్లు లేని జంతు ప్రేమికులు కుక్కల్ని పెంచుకునేందుకు భయపడతారు. సొంతిళ్లు ఉన్న వాళ్లలో కూడా ఇంట్లోని పెద్ద వాళ్లకు భయపడి పెంచుకోరు. ఇక ఒంటిరి వాళ్లయితే ఆఫీసుకు, ఇంటికి మధ్యలో దాని ఆలనాపాలనా చూసుకోలేమని భయపడతారు. ఇక అలాంటి భయాలు లేకుండా కుక్కలను దత్తత తీసుకునే పద్ధతి ఆచరణలోకి రావడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా దానితో ఆడుకునే అవకాశం రావడం ఎంతో అదృష్టంగా జంతు ప్రేమికులు భావిస్తున్నారు. ఒంటరితనంతో బాధ పడే యువతీ, యువకులు లేదా పెద్ద వారికి పెంపుడు కుక్కలతోని ఎంతో మానసిక ఉపశమనం లభిస్తుందని గురుగ్రామ్‌లోని ‘మెంటల్ హెల్త్ అండ్ బిహేవియరల్ సైన్సెస్’ అధిపతి డాక్టర్ కామ్నా చిబ్బర్ తెలియజేస్తున్నారు. ఓ పెంపుడు కుక్క పోషణకు నెలకు కనీసం మూడు వేల రూపాయలు ఖర్చు అవుతుందని ‘పీపుల్ ఫర్ ఎనిమల్’ సభ్యులు విక్రమ్ కొచ్చార్ తెలిపారు. దేశంలోని జంతు సంక్షేమ సంఘాల్లో ఈ సంస్థ అతి పెద్దదనే విషయం తెల్సిందే. కరోనా సందర్భంగా ఊర కుక్కల వల్లనే ‘దత్తత’ అనే కొత్త ట్రెండ్ పుట్టుకొచ్చిందని ఆయన తెలిపారు. లాక్డౌన్ వల్ల ఊర కుక్కలకు తిండి దొరక్క పోవడం, వైరస్ సోకుతుందనే భయంతో కొందరు పెంపుడు కుక్కలను వీధుల్లో వదిలేశారని, వాటన్నింటిని వివిధ సంరక్షణ కేంద్రాలకు తరలించి, దత్తత ద్వారా వాటిని పోషిస్తున్నట్లు ఆయన వివరించారు. గురుగావ్‌లో మనోజ్ మీనన్ అనే జంతు ప్రేమికులు రెండు ఎకరాల గార్డెన్లో ఈ కుక్కలను పోషిస్తున్నారు. వాటి కోసం స్మిమ్మింగ్ పూల్‌ను కూడా నిర్వహిస్తున్నారు. ల్యాప్‌టాప్, సెల్ఫోన్ల ద్వారా వాటి దత్తత యజమానులతో కాలక్షేపం చేసేలా శిక్షణ కూడా ఇస్తున్నారు. ఈ కొత్త ట్రెండ్ కొంత కాలంలోనే దేశవ్యాప్తంగా విస్తరిస్తుందని విక్రమ్ కొచ్చార్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
కుక్కలకు కూడా ఖరీదైన పరుపులు
సాక్షి, న్యూఢిల్లీ : మెత్తటి పరపులపై పడుకోవడం అందరికి సాధ్యం కాకపోవచ్చుగానీ డబ్బున్న మహరాజులకు అదో లెక్కా! అయితే మనుషులు పడుకునేందుకు డబ్బుల గురించి లెక్క చేయలేకపోవచ్చుగానీ, కుక్కల కోసం పరుపులు కొనాలంటే, అందులో ఖరీదైనా పరువులు కొనాలంటే ఎంతటి మహరాజులకైనా లెక్కలెకుండా ఉంటుందా! ఇప్పుడు పెంపుడు కుక్కల పరుపులు కూడా పెద్ద బిజినెస్‌గా మారిపోయింది. అందులో రాయల్ పరుపుల సంగతి చెప్పక్కెర్లేదు. ఈ పరుపులను డిజైన్ చేయడానికి ప్రత్యేక డిజైనర్లు కూడా ముందుకు వస్తున్నారు. ఈ పరుపులు భారతీయ కరెన్సీలో 95 వేల రూపాయల వరకు పలకడం విశేషం. వీటిని రాయల్ కేటగిరీగా పేర్కొంటున్నారు. ఆస్ట్రియా రాకుమారి కటాలిన్ జూ విండిజ్గ్రేజ్ ర్యాన్ వియెన్నాలో సొంత బ్రాండ్‌తో ఈ పరుపుల అమ్మకాలను ప్రారంభించారు. ఆమె తన పేరు స్ఫురించేలా ‘కేజెడ్డబ్లూ పెట్ ఇంటీరియర్స్’ దానికి పేరు పెట్టారు. వాటికి బుల్లి మంచం పరుపు నుంచి కాస్త పెద్ద మంచం పరుపు వరకు, నేల మీద వేసుకునే పరుపులను, వాటికి అనుగుణమైన మెత్తలను కూడా డిజైన్ చేసి అమ్ముతున్నారు. ఈ పరుపులు 800 రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు ఉన్నాయి. వాటికి విడివిడి గౌషన్లు కూడా ఉన్నాయి. వాటిని ఎప్పటికప్పుడు మార్చు కోవచ్చు. ఆ తర్వాత ఆమె పెంపుడు కుక్కలు ఆడుకునే ఆట వస్తువులతో ‘డాగ్ ఫర్నీచర్’ పేరిట వ్యాపారాన్ని విస్తరించారు. మరో పరుపుల కంపెనీ ‘చార్లీ చాహు’ 800 రూపాయలకు విడుదల చేసిన ‘చార్లీ చాహు స్నగుల్ బెడ్’ పాశ్చాత్య దేశాల మార్కెట్లో పిచ్చ పిచ్చగా అమ్ముడుపోతోంది. అందుకు కారణం దాని ధర అందరికి అందుబాటులో ఉండడమే. చార్లీ చాహు కంపెనీని క్రిసై్టన్ చాహు తన సోదరి జెన్నీ చాహుతో కలసి ఏర్పాటు చేశారు. పెంపుడు కుక్కల కోసం ‘పిప్పా అండ్ కంపెనీ’ మధ్యస్థాయి లగ్జరీ పరపులను తయారీచేసి మార్కెట్లో విక్రయిస్తోంది. వీటిని వాషింగ్ మషిన్లో వేసి ఉతికే అవకాశం కూడా ఉండడం విశేషం. పరుపులోని కుషన్‌కు వాసన, నీరు అంటకుండా నిలువరించగల లైనర్లను ఈ పరపుల తయారీలో ఉపయోగించినట్లు కంపెనీ వ్యవస్థాపకుడు జెన్నీఫర్ టేలర్ తెలిపారు. ‘సిగ్నేచర్ బెడ్స్’ పిప్పా అండ్ కంపెనీ పేరిట పెంపుడు కుక్కల పరపులను సరఫరా చేస్తోంది. -
పెంపుడు కుక్కలపై 50 లక్షల కోట్ల ఖర్చు!
న్యూఢిల్లీ : పెంపుడు కుక్కల విలువెంత? అని తెలివైన వారిని అడిగితే ఏమంటారు? వెలలేని అంత లేదా అమూల్యం అంటారు! మార్కెట్లో వాటి కొనుగోలు రేట్లడిగితే అందరు కాకపోయినా కొందరైతే చెబుతారు. వాటి జీవితం విలువను డబ్బుల్లో అంచనా వేస్తే ఎంత ? అప్పుడు వాటి కొన్న రేటునే కాకుండా వాటి ఆహారానికి, మందులకు ఎంత ఖర్చు పెడుతున్నారు? అవి ఎంత కాలం జీవిస్తున్నాయి? అన్న అంశాల ఆధారంగా వాటి జీవితాల విలువను ఆర్థికంగా అంచనా వేయవచ్చు. అయితే ఈ విలువ దేశాలనుబట్టి, ప్రాంతాలనుబట్టి మారిపోయే అవకాశం ఉంది. పెంపుడు కుక్కలకు అధిక ప్రాధాన్యమిస్తోన్న అమెరికాలో వాటిపై ఎటా 70 బిలియన్ డాలర్లు (దాదాపు 50 లక్షల కోట్ల రూపాయలు) ఖర్చు పెడుతున్నారు. అదే అమెరికన్లు పిజ్జాలపై ఏటా 32 బిలియన్ డాలర్లు (దాదాపు 23 లక్షల కోట్ల రూపాయలు), చట్టబద్ధంగా దొరికే గంజాయి కోసం వారు ఏడు బిలియన్ డాలర్లు (దాదాపు ఐదు లక్షల కోట్ల రూపాయలు) చేస్తున్నారు. పెంపుడు కుక్కల కోసం ఖర్చు చేస్తున్న మొత్తంలో ఎప్పటికప్పుడు పెంపుడు కుక్కలకు యాంటి వైరస్ ఇంజెక్షన్ల ఇవ్వడానికి వెటర్నరీ డాక్టర్లకు మొత్తం 20 బిలియన్ డాలర్లు (14.5 లక్షల కోట్ల రూపాయలు), ఇతర మందుల కోసం 16 లక్షల డాలర్లు (11.5 లక్షల కోట్ల రూపాయలు), వాటి ఆహారం కోసం 32 బిలియన్ డాలర్లు (దాదాపు 23 లక్షల కోట్ల రూపాయలు) ఖర్చు చేస్తున్నారు. పెంపుడు కుక్కల యజమానుల ఇంటింటి తిరగడంతోపాటు, వెటర్నరీ డాక్టర్లను సంప్రతించడం ద్వారా శాస్త్రవేత్తలు ఈ అంచనాలను రూపొందించారు. వీటి ఆధారంగా సరాసరి ఓ పెంపుడు కుక్క జీవితం విలువను పదివేల డాలర్లు (దాదాపు 7.25 లక్షల రూపాయలు)గా నిర్ధారించారు. ఏటా అమెరికాలో రోడ్డు ప్రమాదాల కారణంగా పది లక్షల పెంపుడు కుక్కలు మరణిస్తున్నాయి. పెంపుడు కుక్కల కోసం వాటి యజమానులు ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు పెడుతున్నప్పటికీ రోడ్డు ప్రమాదాల్లో చనిపోయినప్పుడు అతి తక్కువగా నష్ట పరిహారం అభిస్తోందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. మార్కెట్లో ప్రస్తుతం పెంపుడు కుక్కల ధర ఎంత ఉందో అన్న అంశాన్ని పరిగణలోకి తీసుకొని మాత్రమే నష్ట పరిహారం చెల్లిస్తున్నారని, వాటి మందులకు, ఆహారానికి అవుతున్న ఖర్చును పరిగణలోకి తీసుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక యజమానులతో పెంపుడు కుక్కలకున్న అనుబంధాన్ని, ఆత్మీయతను ఎలా వెలగడతారని వారు ప్రశ్నించారు. పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీలోని పబ్లిక్ పాలసీ విభాగంలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ సైమన్ ఎఫ్ హీడర్, ఓక్లహామ యూనివర్శిటీలోని పొలిటికల్ సైన్స్ విభాగంలో పనిచేస్తున్న ప్రొఫెసర్ డెవెన్ కార్ల్సన్, అదే యూనివర్శిటీ రీసర్చ్ విభాగంలో పనిచేస్తున్న డిప్యూటీ డైరెక్టర్ జో రిప్బెర్గర్లు సంయుక్త ఈ అధ్యయనం చేశారు. -
వైరల్ : అమ్మో! పెద్ద ప్రమాదం తప్పింది
లూసీయానాలోని ఒక పెట్రోల్ బంకులోకి యస్‌యూవీ కారు ఒకటి వచ్చి ఆగింది. పెట్రోల్ కొట్టిద్దామని తన పెంపుడు కుక్క చువావాను కారులోనే ఉంచి యజమాని బయటకు దిగి సిబ్బందితో మాట్లాడుతున్నారు. ఈలోగా కారు ఒక్కసారిగా స్టార్ట్ అయ్యి బ్యాక్వర్డ్ డైరక్షన్లో పక్కనే ఉన్న 4- లేన్ల మెయిన్ రోడ్డుమీదకు వెళ్లింది. దీంతో అవాక్కయిన కారు యజమాని కారు వెనకాలే పరిగెత్తారు. కారు డోరు తెరిచే ప్రయత్నంలో ఆమె కిందపడిపోయారు. దేవుడి దయ వల్ల ఆ సమయంలో వాహనాలు ఏవీ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. చివరకు ఎదురుగా ఉన్న మరో గ్యాస్ స్టేషన్ బారీకేడ్లను ఆనుకొని కారు నిలిచిపోయింది. కాగా కారులో ఉన్న చుహాహా క్షేమంగానే ఉంది. ఈ ఘటన లూసీయానాలో గత శుక్రవారం చోటుచేసుకుంది. అయితే ఇదంతా అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. తాజాగా దీనికి సంబంధించిన వీడియోనూ లూసియానా పోలీసులు ఫేస్బుక్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోను చూసిన వారంతా ఫన్నీకామెంట్లు పెట్టారు. ' ఈ కుక్క మహా తెలివైనదని, కారును స్టార్ట్ చేసి నడిపిందని' పేర్కొన్నారు. మరికొందరు మాత్రం చువావా క్షేమంగా బయటపడినందుకు సంతోషిస్తున్నట్లు కామెంట్లు పెట్టారు. నెటిజన్ల కామెంట్లపై స్పందించిన పోలీసులు అసలు విషయం వెల్లడించారు. కారులో ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్ ద్వారా బ్రేక్ వేయకుండానే ఆటోమెటిక్ గేర్లను మార్చుకోగలదని, అందుకే కారు ఒక్కసారిగా బ్యాక్వర్డ్ డైరక్షన్లో మూవ్ అయిందని తెలిపారు. ఆ సమయంలో వాహనాలు ఏవి రాకపోవడం, అలాగే ఎటువంటి ప్రమాదం చోటుచేసుకోకపోవడం నిజంగా అద్బుతమని పేర్కొన్నారు. ' కార్లలో తమ పెంపుడు జంతువులను వదిలి వెళ్లేవారికి ఈ ఘటన ఒక చక్కటి ఉదాహరణ అని' పోలీసులు వెల్లడించారు. కాగా, ఇలాంటి ఘటనే గత గురువారం ఫ్లోరిడాలో జరిగింది. తన పెంపుడు కుక్క బ్లాక్ లాబ్రాడర్‌ను కారులోనే ఉంచి పార్క్ చేసి వెళ్లాడు. ఆ తర్వాత ఆటోమెటిక్ మోడ్ ఆన్ అయి కారు ఒక గంట పాటు వృత్తాకారంలో తిరగడం వైరల్‌గా మారింది. ఈ రెండు ఘటనల్లో పెంపుడు కుక్కలు ఉండడం గమనార్హం. -
ప్రేమ..పగ.. రెండు జీవాలు.. రెండు కుటుంబాలు
రెండు కుటుంబాలు.. అల్లారు ముద్దుగా పెరిగే రెండు శునకాలు..వారికి అవంటే ప్రాణం.. వాటిని కుటుంబ సభ్యుల్లా చూసుకుంటున్నారు.ఎక్కడికి వెళ్లినా అవి వారి వెంట ఉండాల్సిందే.. అయితే ఆ రెండు కుక్కలు కన్నుమూశాయి. విచిత్రమేమంటే ఓ కుటుంబంలోని కుక్క అనారోగ్యంతో మృతి చెందితే మరోకుటంబంలోని శునకం దాని యజమాని సోదరుడి చేతిలోదారుణహత్యకు గురైంది. తనపై దాడిచేసేందుకు యత్నించిందని ఓ కుక్కను కక్ష పెంచుకొని ఓ వ్యక్తి చంపేస్తే.. మరో కుటుంబం మాత్రం జ్ఞాపకాలను మరచిపోయేందుకు ఇంటిని కూడా మార్చేశారు. మరిచిపోలేక ఇల్లు ఖాళీ చేశారు బంజారాహిల్స్: అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పెంపుడుకుక్క చనిపోవడంతో ఓ కుటుంబం ఆ జ్ఞాపకాలను మరిచిపోవడానికి ఇంటినే ఖాళీ చేసి మరో చోటికి షిఫ్ట్ అయ్యారు. శ్రీనగర్‌కాలనీలోని క్రియేటివ్ సదన్ అపార్ట్‌మెంట్స్‌లో నివసించే కామిరెడ్డి సంతోష్ అనే యువకుడు ఫిలిం ఎడిటర్‌గా పనిచేస్తున్నాడు. ఆయనతోపాటు ఆయన తల్లి లక్ష్మీపద్మావతి, తండ్రి కన్నా, సోదరి ప్రియాంక పదేళ్లుగా ఓ శునకాన్ని (లక్కీ) పెంచుకుంటున్నారు. కుటుంబసభ్యులందరికీ లక్కీ అంటే మమకారమెక్కువ. ఈ నెల 6న కుక్క అనారోగ్యానికి గురైంది. చికిత్స చేయించినా కోలుకోలేకపోగా కన్నుమూసింది. దీంతో ఆ కుటుంబం తట్టుకోలేకపోయింది. కుక్కకు పంజాగుట్టలో ఖననం చేశారు. తాజాగా దశదిన ఖర్మ కూడా నిర్వహించి వివిధప్రాంతాల్లో వందకు పైగా కుక్కలకు ఆహారం అందించారు. కుక్క భారీ ఫోటోను ఏర్పాటు చేసి నివాళి కూడా అర్పించారు. అదే ఇంట్లో ఉంటే జ్ఞాపకాలను మరిచిపోలేకపోతున్నామని భావించిన సంతోష్ రెండు రోజుల క్రితం శ్రీనగర్‌కాలనీలో ఇల్లు ఖాళీ చేసి మధురానగర్‌కి షిఫ్ట్ అయ్యారు. లక్కీని తన తల్లి వీధికుక్కల్లో చూసుకుంటున్నదని, ప్రతిరోజూ తమ వీధిలోనే తిరిగే నాలుగైదు కుక్కలకు భోజనం పెడుతుందని ఆయన తెలిపారు. కిరాతకంగా చంపేశాడు తార్నాక: తనపై కుక్క దాడి చేసేందుకు యత్నించిందని కక్షపెంచుకున్న ఓ వ్యక్తి దానిని అతి కిరాతకంగా చంపేశాడు. విచిత్రమేమంటే దానిని పెంచుకుంటోంది నిందితుడి సోదరే. ఓయూ పోలీసుస్టేషన్ పరిధిలోని లాలాపేటలో ఈ ఘటన జరిగింది. ఎస్ఐ నర్సింగరావు తెలిపిన మేరకు.. ఎన్జీఆర్ఐ ఉద్యోగి రమాదేవి తన తల్లి యాదమ్మతో కలిసి లాలాపేట వినోభానగర్‌లో నివాసముంటోంది. అదే ఇంట్లో కింద పోర్షన్లో ఆమె అన్న నాగరాజు(40)తన భార్యస్వప్న నివాసముంటున్నారు. నాలుగేళ్ల క్రితం యాదమ్మ లాలాపేటలో ఉన్న 75 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన తన ఇంటిని కూతురు రమాదేవి పేరున రిజిస్ట్రేషన్ చేసింది. అప్పటినుంచి అన్నాచెల్లెళ్ల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈనెల 12న చిత్తుగా మద్యం తాగిన నాగరాజు ఇంటికివచ్చి తన చెల్లెలు, తల్లితో గొడవకు దిగాడు. వారిపై దాడికి యత్నించగా రమాదేవి పెంచుకున్న పెమేరియన్‌జాతి కుక్క అతనిపై దూకే ప్రయత్నంచేసింది. దీంతో కక్షపెంచుకున్న నాగరాజు ఈనెల 18న ఇంటిముందు కట్టేసిన కుక్క మెడపై కాలుపెట్టి నలిపి అతికిరాతంగా చంపాడు. కుక్కఅరుపులు విన్న రమాదేవి పై నుంచి వచ్చిచూడగా, నాగరాజు కుక్కను చంపిదానిపై కూర్చున్నాడు. దీంతో ఆమె కంపాసినేట్ సొసైటీ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుక్క శవాన్ని స్వాధీనంచేసుకుని పోస్టుమార్గంనిమిత్తం నారాయణగూడలోని పశువైద్యశాలకు పంపించారు. రమాదేవి ఫిర్యాదుమేరకు నాగరాజును అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నర్సింగరావు తెలిపారు. -
ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: టీఆర్టీ (టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్), పీఈటీ ఫలితాలు ప్రకటించాలంటూ అభ్యర్థులు ఆందోళనను మరింత ఉధృతం చేశారు. బుధవారం ప్రగతి భవన్‌ను ముట్టడించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీఆర్టీ, పీఈటీ ఫలితాల జాబితాను ప్రకటించి పోస్టింగులు ఇవ్వాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో బేగంపేట పరిసరాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఆందోళన చేస్తున్న అభ్యర్థులను పోలీసులు అరెస్టు చేశారు. ఇక 2017లో తెలంగాణ ప్రభుత్వం టీఆర్టీ నోటిఫికేషన్ జారీ చేయగా ఇప్పటికీ నియామక ప్రక్రియను పూర్తి చేయకపోవడంతో అభ్యర్థులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. -
ప్రగతి భవన్... కుక్క... ఓ కేసు
సీఎం కేసీఆర్ నివాసం ప్రగతి భవన్‌లోని ఓ పెంపుడు కుక్క మృతి చెందింది. ఈ నెల 10న అనారోగ్యానికి గురైన 11 నెలల హస్కీ పరిస్థితి విషమించడంతో ప్రగతి భవన్ డాగ్స్ హ్యాండ్లర్ ఆసిఫ్ అలీఖాన్ గురువారం బంజారాహిల్స్ రోడ్ నంబర్ 4లోని యానిమల్ కేర్ క్లినిక్‌కు తీసుకెళ్లాడు. అయితే వైద్యుడు ట్రీట్మెంట్ చేస్తుండగానే కుక్క మృతి చెందింది. వైద్యుడి నిర్లక్ష్యంతోనే కుక్క మృతి చెందిందని ఆసిఫ్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బంజారాహిల్స్: సీఎం కేసీఆర్ నివాసం ప్రగతి భవన్‌లోని ఓ పెంపుడు కుక్క వైద్యుల నిర్లక్ష్యంతో మృతి చెందింది. కుక్కపిల్ల మృతికి కారణమైన వైద్యుడిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ప్రగతి భవన్ డాగ్స్ హ్యాండ్లర్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు నిర్లక్ష్యం వహించిన వెటర్నరీ వైద్యుడిపై కేసు నమోదు చేసుకున్నారు. వివరాలు... బహదూర్‌పురాకు చెందిన ఆసిఫ్ అలీఖాన్ ఐదేళ్లుగా ప్రగతి భవన్ డాగ్ హ్యాండ్లర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇక్కడున్న 9 పెంపుడు కుక్కలకు సంరక్షణ చూసుకుంటూ శిక్షణనిస్తున్నాడు. ఈ నెల 10న 11 నెలల హస్కీ అనే కుక్కపిల్ల అనారోగ్యానికి గురైంది. వెంటనే ఆయన వైద్యమందించారు. కుక్క కొద్దిగా కోలుకుంది. సాయంత్రం 6గంటలకు మళ్లీ కుక్క అనారోగ్యానికి గురై తిండి మానేసింది. ఈ నెల 11న ఉదయం 7గంటలకు పాలు కూడా తాగకుండా తీవ్ర అస్వస్ధతకు గురైంది. వెంటనే ఆయన రెగ్యులర్ వెటర్నరీ డాక్టర్‌కు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. మధ్యాహ్నం 2గంటలకు అక్కడకు వచ్చిన వైద్యుడు పరీక్షలు నిర్వహించగా కుక్క 101 టెంపరేచర్ జ్వరంతో బాధపడుతుండడంతో లివర్ టానిక్ ఇచ్చాడు. దీంతో కుక్క పరిస్ధితి మరింత విషమించింది. దీంతో రాత్రి 9గంటలకు రోడ్ నంబర్ 4లోని యానిమల్ కేర్ క్లినిక్‌కు తీసుకెళ్లి డాక్టర్ రంజిత్‌కు చూపించాడు. ఆయన ట్రీట్మెంట్ ఇస్తుండగానే కుక్క చనిపోయింది. డాక్టర్ రంజిత్ నిర్లక్ష్యంతోనే కుక్క చనిపోయిందని, ఆయనపై చర్యలు తీసుకోవాలని అలీఖాన్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
మహిళ ప్రాణాలు తీసిన పెంపుడు కోడి
కాన్బెర్రా : పెంపుడు కోడి ఓ వృద్ధ మహిళ ప్రాణాలను బలిగొన్న ఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. కోడి వద్ద నుంచి గుడ్లు తీస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు స్థానిక మీడియా పేర్కొంది. మహిళ కోడి గుడ్లు తీస్తున్న క్రమంలో కోడి పుంజు ఆమెపై దాడి చేసింది. అప్పటికే కోపంతో ఉన్న కోడి.. తన పదునైన ముక్కుతో ఆమెను గాయపరించింది. పలు చోట్ల గాయాలు కావడం.. చాలా సేపటి వరకు రక్తపుధార ఆగకపోవడంతో ఆమె మరణించినట్టుగా సమాచారం. కాగా, ఈ కేసును అధ్యయనం చేసిన ఫోరెన్సిక్ నిపుణుడు రోజర్ బైర్డ్ మాట్లాడుతూ.. పెంపుడు జంతువులతో జాగ్రత్తగా ఉండాలని ఆస్ట్రేలియన్ వాసులను హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు చూసైనా వయసు పైబడినవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అయితే ఆ మహిళ పేరు, ఇతర వివరాలను మాత్రం అక్కడి మీడియా సంస్థలు వెల్లడించలేదు. -
ఓ మై డాగ్!
ఇదేదో పిల్లల వేడుకలా కాకుండా పెద్దవాళ్లు సైతం పెద్ద సంఖ్యలోనే పాల్గొంటున్నారు. అతిథులు కూడా తమ ఫ్యామిలీ ఫ్రెండ్ కోసం కానుకలు సైతం బహుకరిస్తున్నారు. బంధు మిత్రులు సపరివార సమేతంగా, తమ పెట్స్‌తో సహా అటెండ్ అవుతున్నారు. కొన్ని సందర్భాల్లో వేడుకల్లో భాగంగా పెట్స్ ర్యాంప్‌వాక్ వంటివి కూడా జోడిస్తున్నారు. సాక్షి, సిటీబ్యూరో: మన హృదయపు సింహాసశనమున శునకము తిష్ట వేసుకుని కూర్చుంది. ఒకప్పుడు కాపలా కాసే విశ్వసనీయ జంతువుగానే ఉన్నా తర్వాత నేస్తంగా మారి.. ఇప్పుడు సమస్తమైపోయింది. అందుకే దాని పుట్టిన రోజు మనకి పండుగ రోజులా చేస్తున్నారు. అందుతగ్గట్టే సిటీలో పెట్ బర్త్‌డే ఈవెంట్స్ సందడిగా జరుగుతున్నాయి. పెట్ ఫుడ్ తయారీకి పేరొందిన ‘లిలీస్ కిచెన్’ వెల్లడించిన సర్వేలో పెట్ డాగ్స్ బర్త్‌డేల పట్ల పెట్ ఓనర్స్‌లో ఆసక్తి బాగా పెరిగిందని తేలింది. దేశవ్యాప్తంగా తాజాగా నిర్వహించిన ఈ సర్వేలో 75 శాతం మంది పెట్స్ యజమానులు వాటి పుట్టినరోజు తప్పనిసరిగా జరుపుతున్నారని తేలింది. ఇందులో 58 శాతం మంది ‘హ్యాపీ బర్త్‌డే’ పాట కూడా పాడుతున్నామంటున్నారు. తమ కుటుంబంలో పెట్ కూడా ఒక భాగమని 41 శాతం మంది చెప్పగా, 14 శాతం మంద్రి మరింత ముందుకు వెళ్లి కన్నబిడ్డలతో సమానమని చెప్పారు. అంతా ఎంతో ప్రత్యేకం కేక్స్ నుంచి డ్రింక్స్ దాకా నగరంలో సిటీజనుల బర్త్‌డే వేడుకలు విలాసవంతంగా జరుగుతాయి. అయితే, తాము పెంచుకుంటున్న పెట్స్ కోసం కూడా భారీ స్థాయిలో ఖర్చు పెడుతుండడం విశేషం. అచ్చం తమ చిన్నారుల కోసం చేసినట్టే కేక్ కటింగ్, బెలూన్ డెకరేషన్, ప్రత్యేక థీమ్స్ వంటివి ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాదు.. ప్రత్యేకంగా రెస్టారెంట్స్, కాఫీషాప్స్ వంటి పార్టీ ప్లేస్‌లను ఈ ఈవెంట్స్ కోసం ఎంచుకుంటున్నారు. తమ పెట్‌కి ఆ రోజు డిఫరెంట్‌గా, వెరైటీగా వస్త్రధారణ చేస్తున్నారు. మొత్తమ్మీద ఒక పూర్తి ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్‌గా పెట్స్ బర్త్‌డే పార్టీస్ మారాయంటున్నారు గచ్చిబౌలిలో పెట్స్ కేఫ్ నిర్వహిస్తున్న రుచిర. కేక్స్ స్పెషల్ కూడా.. గతంలో పెట్‌కు పుట్టిన రోజు వేడుక చేయడం చాలా అరుదుగా ఉండేది. ఇప్పుడు బాగా పెరిగాయి. మా కేఫ్‌లోనే వారాని ఒకటైనా ఆ తరహా పార్టీ జరుగుతుంది. వీటిని పెట్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ లేకుండా పూర్తిగా ఆర్గానిక్ శైలిలో తయారయ్యే కేక్స్ వీటికి స్పెషల్. ఇక అతిథులుగా వచ్చే పెట్స్ కోసం చికెన్, మటన్, ఫిష్ వంటి ప్రత్యేక మెనూ ఉంటుంది. అలాగే డ్యాన్స్ ఫ్లోర్ కూడా రెడీ.– రుచిర, కేఫ్ డె లొకొ, పెట్స్ కేఫ్ -
కారులోనే పెట్
హిమాయత్‌నగర్: పెట్ కారులో ఉండగానే మరిచిపోయి ఓ యజమాని డోర్ క్లోజ్ చేశాడు. పెట్‌తో పాటు కీస్ కూడా కారులోనే మరిచిపోవడంతో... దాదాపు 20 నిమిషాలు పెట్ అందులోనే ఉక్కిరిబిక్కిరైంది. వివరాలు... నారాయణగూడలోని సూపర్ స్పెషాలిటీ వెటర్నరీ హాస్పిటల్‌కు ముసారాంబాగ్‌కు చెందిన కీర్తి తన పెట్‌ను తీసుకొచ్చింది. కిందికి దించితే అల్లరి చేస్తుందనే ఉద్దేశంతో కారులోనే ఉంచింది. అయితే కారు కీస్ కూడా లోపలే ఉండడంతో ఒక్కసారిగా ఆందోళనకు గురైంది. డోర్ తీసేందుకు స్థానికులు ప్రయ త్నించగా రాకపోవడంతో చివరకు పగలగొట్టారు. పెట్‌ను సురక్షితంగా బయటకు తీశారు. దీంతో కీర్తి ఊపిరి పీల్చుకుంది. -
నగరంలో పెరుగుతున్న ‘శునక బాధితులు’
సాక్షి, సిటీబ్యూరో: కుక్కలంటే సాధారణ జనం భయపడతారు. ఇవి కరిస్తే రేబిస్ సోకుతుందని ఆందోళన వెంటాడుతుంది. అయితే, ఇపుడు పోలీసులు కూడా భయపడాల్సిన రోజులొచ్చాయి. ఇందుకు రేబీస్ కారణం కాదు.. శునకాల చోరీలు.. హత్యలు.. వాటిపై దాడులు. ఇటీవల కుక్కలకు సంబంధించిన కేసులు పెరిగిపోతుండటంతో పోలీసులు వాటిని ఛేదించడానికి తలపట్టుకుంటున్నారు. తాజాగా కుషాయిగూడ పోలీసులు సైనిక్‌పురి నుంచి ఓ కుక్క చోరీ కావడంపై కేసు నమోదు చేశారు. దీని ఆచూకీ కనిపెట్టడానికి ఓ బృందాన్ని రంగంలోకి దింపి మరీ పట్టుకున్నారు. ఈ తరహా ‘కుక్కల కథలు’ ఎన్నో ఉన్నాయి. కుక్కను చంపినందుకు కేసు ఇటీవల వీధి, పెంపుడు కుక్కలపై చేయి చేసుకుంటున్న వాళ్లూ ఊచలు లెక్కపెట్టారు. పెంపుడు కుక్కను చంపిన వ్యక్తిపై ఘట్కేసర్ ఠాణా పరిధిలో ఈ ఏడాది జనవరిలో కేసు నమోదైంది. కొర్రెముల్ బాలాజీనగర్‌కు చెందిన జంతు ప్రేమికురాలు ప్రవల్లికకు జనవరి 13న సా యంత్రం రామశివ అనే వ్యక్తి ఫోన్ చేశారు. తాను పెంచుకుంటున్న కుక్క ‘టామీ’ని పక్కింటి యజమాని మహేష్ చంపేశాడంటూ వాపోయాడు. ఘటనాస్థలికి వెళ్ళిన ఆమె పరిశీలించగా కొన ఊపిరితో ఉన్న శునకం కనిపించింది. ఆమె మేడిపల్లిలోని ఓ ప్రైవేట్ పశువుల ఆస్పత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ టామీ కన్నుమూసింది. దీంతో ఆమె ఘట్కేసర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా బాధ్యుడిపై కేసు నమోదైంది. రోడ్డుపై వదిలేసినందుకు.. తిరుపతికి చెందిన తరుణ్‌తేజ కృష్ణనగర్‌లో ఉంటున్నారు. ఆయనకు రెండు పెంపుడు కుక్కలు ఉండగా ‘మోజీ’ని బోరబండకు చెందిన హరి, ఆకాష్ కోరిక మేరకు పెంచుకునేందుకు ఇచ్చారు. దీన్ని తీసుకువెళ్ళిన తర్వాత వారికి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. అది అందరినీ కరుస్తుండటంతో తిరిగి తరుణ్‌కు ఇచ్చేయాల్సింది. కానీ వీరిద్దరూ అలా చేయకుండా, ఆయనకు సమాచారం లేకుండా కావూరిహిల్స్ వద్ద మోజీని వదిలేశారు. ఆ కుక్కపై మమకారంతో ఆరా తీసిన తరుణ్‌కు విషయం తెలియడంతో ఆయన.. హరి, ఆకాష్‌లపై జూబ్లీహిల్స్ ఠాణాలో కేసు పెట్టారు. కుక్కను కొట్టాడని హత్యాయత్నం కుక్కను కొట్టిన పాపానికి ఓ వ్యక్తికి కత్తిపోట్లకు గురయ్యాడు. ఈ ఉదంతం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో మే 26న జరిగింది. ఫిల్మ్‌నగర్‌లో కొబ్బరిబొండాల వ్యాపారం చేసే శ్రీనివాస్‌కు సంతానం లేదు. ఆయన ఓ వీధికుక్కను చేరదీసి ‘సాయి’ అని పేరు పెట్టుకుని ముద్దుగా పెంచుకుంటున్నాడు. బాలసుబ్రహ్మణ్యం అనే స్థానికుడు ఈ కొబ్బరి బొండాల దుకాణం పక్క నుంచి వెళ్తుండగా ‘సాయి’ అతడి వెంటపడటంతో రాయితో కొట్టాడు. ఇది చూసి ఆగ్రహానికి లోనైన శ్రీనివాస్ తన చేతిలో ఉన్న కొబ్బరి బొండాలు నరికే కత్తితో బాలసుబ్రహ్మణ్యంపై దాడి చేశాసి తీవ్రంగా గాయపరిచాడు. క్షతగాత్రుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్రీనివాస్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గతంలోనూ ఎన్నో కేసులు ♦ మాధవపురికి చెందిన శ్రీపాదరావు పెంపుడు కుక్కల్లో ఒకటైన ర్యాట్ విల్లర్ జాతి శునకం వాకింగ్ చేస్తున్న అదే ప్రాంతంలో నివసించే విశ్రాంత కల్నల్ కె.వినోద్‌కుమార్‌ను కరిచింది. దీంతో ఆ కుక్క తనను చంపడానికి ప్రయత్నించిందంటూ వినోద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ♦ శంషాబాద్ మండలం సాతంరాయిలో ఫామ్‌హౌస్ ఉన్న న్యాయవాది బి.సుధాకర్‌రెడ్డి తన పెంపుడు కుక్కల్లో లాబ్రడార్, జర్మన్ షెప్పర్డ్‌లను ఎవరో చంపేశారని, దీనిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవట్లేదంటూ ఏకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ♦ బెంగళూరు వ్యక్తికి చెందిన రూ.3.5 లక్షల విలువ చేసే మేలుజాతి శునకం మీర్పేట్ టీచర్స్ కాలనీలోని ఓ సంస్థలో శిక్షణ పొందుతోంది. దీన్ని సంస్థకు చెందిన వ్యక్తి వాకింగ్‌కు తీసుకెళ్లగా వాహనం ఢీకొని చనిపోయింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న మీర్పేట్ పోలీసులు డాక్టర్ సాయంతో కుక్క కళేబరానికి పంచనామా, పోస్టుమార్టం కూడా చేయించారు. ♦ కర్మన్‌ఘాట్ హనుమాన్‌నగర్‌లో ఉండే కె.శ్రీనివాస్ జర్మన్ షెఫర్డ్ జాతి కుక్కను పెంచుకుంటున్నారు. లెనిన్‌నగర్‌కు చెందిన వారు దాన్ని చోరీ చేశారు. కేసు నమోదు చేసుకుని శునకం ఆచూకీ కనిపెట్టిన పోలీసులు చోరీ చేసిన ముగ్గురు బాలల్ని జువైనల్ హోమ్‌కు పంపారు. -
ఇంటికి చేరిన ‘టింగు’
కుషాయిగూడ: గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లిన పెంపుడు కుక్క (టింగు) ఎట్టకేలకు ఇంటికి చేరడంతో కథ సుఖాంతమయింది. కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సైనిక్‌పురికి చెందిన వంశీధర్ పెంపుడు కుక్క అపహరణకు గురైన విషయం తెలిసిందే. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే బోయిన్‌పల్లిలో చెత్త కుప్పల వద్ద కనిపించిన టింగును జగదీష్, మహేశ్ ఇద్దరు యువకులు చేరదీసి ఇంటికి తీసుకెళ్లారు. దీనిని గుర్తించిన మరో వ్యక్తి ఈ కుక్క విషయమై దినపత్రికల్లో వార్త వచ్చినట్లు చెప్పాడు. దీంతో సదరు యువకులు నేరుగా వంశీధర్ ఇంటికి వెళ్లి కుక్కను అప్పగించారు. మీడియా, పోలీసుల చొరవతోనే టింగు తిరిగి వచ్చిందని వంశీధర్ ఆనందం వ్యక్తం చేశాడు. -
పెంపుడు కుక్క చోరీ
కుషాయిగూడ: పెంపుడు కుక్క చోరీకి గురైన సంఘటన మంగళవారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. గుర్తు తెలియని యువకులు బైక్‌పై వచ్చి కుక్కను ఎత్తుకెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. కుక్క యజమాని ఫిర్యాదు మేరకు కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సైనిక్‌పురి సెకండ్ ఎవెన్యూలో ఉంటున్న వంశీచంద్ స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. కుక్కలపై అభిమానంతో అతను నాలుగు కుక్కలను పెంచుకుంటున్నాడు. సోమవారం ఉదయం వంశీధర్ వాకింగ్ వెళ్లిన సమయంలో బైక్‌పై వచ్చిన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు అతని ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారు. వారిలో ఒకరు గేటు ఓపెన్ చేసి ఇంట్లో ఉన్న కుక్కలకు ఏదో వాసన చూపించి పరుగు తీయడంతో కుక్కలు అతని వెంటే బయటికి వచ్చాయి. కొద్ది దూరం వెళ్లగానే వాటిలో ఓ కుక్కను బైక్‌పై తీసుకొని పరారయ్యారు. సాయంత్రం వరకు కుక్క ఇంటికి రాకపోవడంతో సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించిన వంశీచంద్ కుక్క చోరీకి గురైనట్లు గుర్తించి కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. సీసీ పుటేజీల ఆధారంగా నింధితులను త్వరలోనే పట్టుకుంటామని ఆయన పేర్కొన్నారు. -
పెట్ యువర్ స్ట్రెస్ అవే!
వాషింగ్టన్: పెంపుడు పిల్లులు, కుక్కలతో కాస్త సమయం వెచ్చిస్తే కాలేజీ విద్యార్థుల మానసిక స్థితి మెరుగవడంతోపాటు, వారిలో ఒత్తిడి స్థాయి తగ్గుతుందని వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధనల్లో తేలింది. పెంపుడు జంతువులతో గడిపే పది నిమిషాల సమయం కూడా ఎంతో ప్రభావం చూపిస్తుందని వాషింగ్టన్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పాట్రిషియా పెండ్రీ తెలిపారు. పెంపుడు జంతువులతో సమయం గడిపిన విద్యార్థుల్లో ఒత్తిడిని కలిగించే కార్టిజాల్ అనే హార్మోన్ ఉత్పత్తి గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు. ఇది ప్రయోగశాలల్లో కంటే నిజ జీవితంలో అనుసరిస్తే ఇంకా మంచి ఫలితాలుంటాయని తెలిపారు. ఈ మేరకు ప్రముఖ జర్నల్ ఏఈఆర్ఏ ఓపెన్‌లో వ్యాసం ప్రచురించారు. ‘పెట్ యువర్ స్ట్రెస్ అవే’ పేరిట యూనివర్సిటీ పరిశోధకులు 249 మంది కాలేజీ విద్యార్థులపై పరిశోధనలు నిర్వహించారు. ఈ 249 మంది విద్యార్థులను 4 గ్రూపులుగా విభజించారు. మొదటి గ్రూప్ సభ్యులకు 10 నిమిషాల పాటు పిల్లులు, కుక్కలతో సమయం గడిపేలా చూశారు. రెండో గ్రూప్ సభ్యులు మొదటివారిని చూస్తూ ఉండేలా ఏర్పాట్లు చేశారు. మూడో గ్రూప్ వాళ్లకు మొదటి గ్రూప్ సభ్యులు జంతువులతో సమయం గడుపుతున్న చిత్రమాలిక చూపించారు. నాలుగో గ్రూప్ సభ్యులను తమ వంతు వచ్చేవరకు వేచి ఉండమన్నారు. వాళ్లను అంతసేపు ఫోన్ వాడడం కానీ, చదవడం కానీ చేయవద్దన్నారు. ఇలా పరిశోధనల్లో పాల్గొన్న సభ్యుల నుంచి లాలాజలం నమూనాలను ఉదయం నుంచి సేకరించారు. ఇందులో జంతువులతో నేరుగా గడిపిన విద్యార్థుల లాలాజలంలో కార్టిజాల్ తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. విద్యార్థులు తమ పెంపుడు జంతువులతో సమయం గడపడాన్ని ఆనందిస్తారని తెలుçసు కానీ, ప్రయోజనం కూడా ఉంటుందని ఈ పరిశోధనల్లో తేలిందని పెండ్రీ తెలిపారు. దీంతో శారీరక ఒత్తిడిని కూడా జయించవచ్చన్నారు. -
బర్త్ డే: కేక్ తీసి సింహం ముఖానికి కొట్టాడు
అతను ఓ సింహాన్ని పెంచుకున్నాడు. ఆ సింహానికి పుట్టినరోజు చేయాలనుకున్నాడు. అందుకోసం స్నేహితులను కూడా పిలిచాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ, ఆ తర్వాత మూర్ఖంగా ప్రవర్తించాడు. పెంచుకుంటున్న సింహమే కదా? దాని పట్ల క్రూరంగా ప్రవర్తించాడు. హ్యాపీ బర్త్ డే టు యూ అంటూ తాను తెచ్చిన కేక్‌ను సింహం ముఖానికి కేసి కొట్టాడు. దాంతో ఆ సింహం అదిరిపదింది. ముఖానికి అంటిన కేక్‌ను దులుపుకుంటూ.. అసహనంగా కదిలింది. పెంపుడు సింహం ఇలా ఇబ్బంది పడుతుంటే.. సదరు యజమాని, అతని స్నేహితులు మాత్రం ఇదేదో వినోదమైనట్టు నవ్వుల్లో మునిగిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కుర్దీస్తాన్కు చెందిన ఓ వ్యక్తి ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. మూగజీవాల పట్ల క్రూరంగా ప్రవర్తించవద్దంటూ జంతుప్రేమికులు ఒకవైపు ఎంత మొత్తుకుంటున్నా.. కొందరు మాత్రం ఇలా మూర్ఖంగా ప్రవర్తించడంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జంతువుల పట్ల జాలి చూపండ్రా అంటూ.. సదరు కుర్దీస్తానీపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. -
కుక్క మృతికి కారణమైన ఆస్పత్రిపై ఫిర్యాదు
బంజారాహిల్స్: ఆస్పత్రి నిర్లక్ష్యంతో తన పెంపు డు కుక్క చనిపోయిందని తప్పుడు ప్రకటనలతో తమను మోసం చేసిన ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ కోరుతూ ఓ సినీ గేయరచయిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మణికొండ సెక్రటేరియెట్ కాలనీకి చెందిన గౌరీవందన సినిమాల్లో పాటలు రాస్తుంటారు. కొద్దిరోజులుగా ఆమె ఓ వీధికుక్కను పెంచుకుంటోంది. ఆ శునకానికి ముద్దుగా షైనీ అని పేరు పెట్టుకుంది. గత నెల 21న తన పెంపుడు కుక్క చొంగ కారుస్తుండటంతో వెబ్సైట్లో 24/7 వైద్యసేవలు అందుబాటులో ఉంటాయని ప్రకటన చూసిన ఆమె కుక్కను చికిత్స నిమిత్తం బంజారాహిల్స్‌రోడ్ నెం. 12, ఎమ్మెల్యే కాలనీలోని డాక్టర్ డాగ్ క్లినిక్‌కు తీసుకెళ్లింది. అదే రోజు రాత్రి డాక్టర్ కుక్కను పరీక్షించి మూడు ఇంజక్షన్లు చేశాడు. మరుసటి రోజు కుక్క ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో ఆమె మరోసారి ఆస్పత్రికి రాగా అక్కడ అందుబాటులో వైద్యులు లేరు. సిబ్బంది కూడా అందుబాటులో లేకపోవడంతో ఆస్పత్రి నిర్వాహకులను నిలదీసింది. అయినా వారినుంచి స్పందన కనిపించలేదు. ఆ మరుసటి రోజే కుక్క చనిపోయింది. మెరుగైన వైద్యం అందించి ఉంటే తన కుక్క బతికి ఉండేదని ఇందుకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ క్లినిక్ నిర్వాహకులపై శుక్రవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని ఇంతటితో వదిలి పెట్టేది లేదని ఎనిమల్ వెల్ఫేర్ అసోసియేషన్, స్టేట్ ఎనిమల్ వెల్ఫేర్ బోర్డు, వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణలో కూడా ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపింది. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పెట్.. హెల్త్.. ఫుడ్!
కుత్బుల్లాపూర్: హైటెక్ నగరం.. ఉరుకులు పరుగుల జీవనం.. ఉద్యోగం.. వ్యాపారం.. పని ఏదైనా క్షణం తీరిక లేకుండా పో తోంది. ఇంట్లో పెంచుకునే పెట్స్ హెల్త్, ఫుడ్, గ్రూమింగ్ ఇలా అన్ని అంశాలలో జాగ్రత్తలు తీసుకోవడానికి సరైన సమయం కేటాయించలేని పరిస్థితి. ఈ సమస్యలకు పరిష్కారం కోసం ‘పెట్ మంచ్’ డివైజ్‌ను రూపొందించారు. స్మార్ట్ పెట్.. ఫుడ్ డిస్పెన్సర్.. పెంపుడు జంతువులకు సరైన సమయంలో ఆహారం ఇవ్వకపోవడం వల్ల ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించారు తార్నాకకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు రాంవర్ధన్, నవ్య సుస్మిత, ప్రత్తిపాటి చైతన్య శేష మనోజ్‌లు. ఆ పరిస్థితులకు చెక్ పెట్టేందుకు ‘పెట్ మంచ్’ (స్మార్ట్ పెట్ ఫుడ్ డిస్పెన్సర్) డివైజ్‌కు రూపకల్పనకు శ్రీకారం చుట్టారు. తేలికపాటి మోటార్, వెయిట్– లెవల్ సెన్సార్, డిజిటల్ క్లాక్, ఓ డిస్పెన్సర్‌తో తొలుత బేసిక్ ‘పెట్ మంచ్’ పరికరాన్ని రూపొందించారు. డిజిటల్ క్లాక్‌లో టైమ్‌సెట్ చేసి డిస్పెన్సర్లో డాగ్ ఫీడ్‌ను ఉంచితే అనుకున్న సమయానికి బౌల్లో పడిపోతుంది. యాప్ ద్వారా రిమోట్ మానిటరింగ్.. డిస్పెన్సర్‌కు ఐఓటీ బేస్డ్ ట్రాన్స్‌మీటర్, రిసీవర్‌ను అమర్చడంతో పాటు పెట్ డాగ్ కాలర్‌కు వేరియబుల్ డివైజ్‌ను అమర్చి దాన్ని క్లౌడ్ ఇంటర్ఫేస్తో అనుసంధానం చేశారు. అలాగే యాప్‌ను రూపొందించి క్లౌడ్ ఇంటర్ఫేస్ ద్వారా వచ్చే సమాచారాన్ని యాప్ ద్వారా మొబైల్‌కు చేరవేసేలా తీర్చిదిద్దారు. పెట్ డాగ్‌కు ఎంత పరిమాణంలో ఫుడ్ ఇవ్వాలి, అది తిన్నదా లేదా, మళ్లీ ఎంత సమయంలో ఇవ్వాలి తదితర పనులు యాప్ ద్వారా చేయవచ్చు. ఇక పెట్ డాగ్ హైట్, వెయిట్‌ను అనుసరించి అది ఎంత బరువు ఉండాలి, అది తిన్న ఫుడ్‌కు ఎంత వర్కవుట్ చేయించాలి తదితర హెల్త్ మానిటరింగ్ అంశాలు నిరంతరం పరిశీలిస్తూ ఉంటుంది. దీంతో పెంపుడు కుక్క ఓబెసిటిని సైతం నియంత్రించవచ్చు. జాతీయ స్థాయి ప్రాజెక్ట్ ఎక్స్‌పోలో.. వీరు రూపొందించిన పెట్ మంచ్ డివైజ్ ఐఐటీ మద్రాస్ ఈ– సమ్మిట్‌లో వచ్చిన 600 ఎంట్రీల్లో టాప్– 8లో నిలిచింది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఐఐఎం బెంగళూర్ వారు నిర్వహించిన ‘ఇండియన్ ఇన్నోవేషన్ చాలెంజ్ అండ్ డిజైన్ కాంటెస్ట్’లో వచ్చిన 10,348 ఎంట్రీల్లో క్వార్టర్ ఫైనల్స్‌కు ఎంపికైన 346 ప్రాజెక్ట్‌ల్లో పెట్మంచ్ స్థానం సంపాదించింది. అదే విధంగా జాతీయ స్థాయిలో జరిగిన మరో నాలుగు ప్రాజెక్ట్ ఎక్స్‌పోలలో వరుసగా టాప్– 4లో నిలవడం విశేషం. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఇటీవల నగరానికి వచ్చిన సమయంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో వీరి డివైజ్‌ను చూసి అభినందించారు. మనుషులకు కూడా ఇలాంటి డివైజ్‌లు రూపొందిస్తే జనాభాలో అధిక శాతమున్న ఊబకాయులకు ప్రయోజనం చేకూరుతుందని చమత్కరించారు. త్వరలో మార్కెట్లోకి తీసుకొస్తాం.. దాదాపు రెండేళ్లుగా ఈ డివైజ్ రూపకల్పనకు సమష్టిగా కృషి చేశాం. సర్వేలో వచ్చిన సలహాలు, సూచనలతో ఇప్పటికే దీనిలో మార్పులూ చేర్పులూ చేశాం. ఇంకా ఈ పరికరానికి తుది రూపు ఇవ్వాల్సిఉంది. కేవలం శునకాలకే కాకుండా ఆవులు, గేదెలు, పెట్ బర్డ్స్‌కు సరిపోయేలా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. పెట్ మంచ్ డిస్పెన్సర్ రూ. 20 వేల నుంచి రూ.23 వేల లోపు ధరలో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కొద్ది నెలల్లో మార్కెట్లోకితీసుకొస్తాం. – రాంవర్ధన్, నవ్య సుస్మిత, చైతన్య శేష మనోజ్ -
వరుణ్ మృతికి హోంమంత్రే బాధ్యత వహించాలి
తూర్పుగోదావరి, అమలాపురం టౌన్: అమలాపురంలో పెంపుడు కుక్క తరమడం వల్ల భయంతో కాలువలో పడి మృతి చెందిన నెల్లి వరుణ్‌కుమార్ మృతికి రాష్ట్ర హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్పే బాధ్యత వహించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. అంతే కాకుండా అందుకు కారణమైన చినరాజప్ప సోదరుడు జగ్గయ్యనాయుడు భార్యపై హత్యాయత్నం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ పలు ప్రజా సంఘాలు అమలాపురంలో ఆర్డీవో కార్యాలయాన్ని సోమవారం ఉదయం ముట్టడించాయి. వరుణ్ మృతిపై న్యాయ పోరాట వేదిక పేరుతో ఆ ఆందోళన జరిగింది. దళిత, విద్యార్థి, యువజన సంఘాలతో పాటు పలు ప్రజా సంఘాల ప్రతినిధులు ఈ నిరసనలో పాల్గొన్నారు. ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా కూడా నిర్వహించారు. ఈ ఘటనపై హోం మంత్రి రాజప్ప ఎంత మాత్రం స్పందించకుండా కనీసం బాధిత కుటుంబాన్ని పరామర్శించకపోవడం దారుణమని దళిత బహుజన మహిళా శక్తి జాతీయ కన్వీనర్ కొంకి రాజామణి అన్నారు. వరుణ్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని సీపీఎం డివిజన్ కార్యదర్శి కారెం వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. వరుణ్ మృతికి కారణమైన పెంపుడు కుక్కను స్వాధీనం చేసుకోవాలని పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్.తిరుపతిరావు పేర్కొన్నారు. ఎమ్మెల్యేను నిలదీసిన ఆందోళనకారులు ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా జరుగుతున్న సమయంలో ఆ కార్యాలయానికి ఓ పని మీద వచ్చిన స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఆందోళనకారుల వద్దకు వచ్చి మాట్లాడారు. ఈ ఘటనపై తనకు ఎవరూ వినతి పత్రం ఇవ్వలేదని ఎమ్మెల్యే అనడంతో ఆందోళనకారులు అభ్యంతరం చెప్పారు. అదేమిటి సార్... మీ ఇంటికి సమీపంలోనే...మీ కాలనీలో ఈ ఘోరం జరిగినా మీరు స్పందించే తీరు ఇదా...? అంటూ నిలదీశారు. అనంతరం ఎమ్మెల్యే ఆందోళనకారుల డిమాండ్లను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ ధర్నా, ముట్టడి కార్యక్రమాల్లో జిల్లా సీపీఎం కార్యదర్శి కేఎస్ శ్రీనివాస్, వీసీకే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్, పౌరహక్కుల సంఘం జిల్లా కార్యదర్శి అమలదాసు బాబూరావు, ఐద్వా నాయకురాలు కుడుపూడి రాఘవమ్మ, రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మచ్చా నాగయ్య, పీడీఎం జిల్లా కన్వీనర్ దీపాటి శివప్రసాద్, సీఎస్సీ జిల్లా అధ్యక్షుడు జిల్లెళ్ల మనోహరం పాల్గొన్నారు. -
ఎంత ఘాటు ప్రేమయో...
‘100% లవ్’ సినిమాలో మహాలక్ష్మీ పాత్రలో చికెన్ లవర్‌గా తమన్నా కనిపించారు. రోజులో ఏదో ఓ టైమ్‌లో మహాలక్ష్మీ చికెన్ లాగించాల్సిందే. ఆ పాత్రలానే తమన్నా రియల్ లైఫ్‌లో కూడా బీభత్సమైన నాన్ వెజ్ లవర్ అట. కానీ కొన్ని రోజుల పాటు మాంసాహారం ముట్ట కూడదని ఒట్టు పెట్టుకున్నారట. ఎందుకూ..? ఏదైనా దేవుడికి మొక్కా? కాదు. పాత్ర కోసం ఫిట్‌నెస్‌లో భాగమైన డైటా? కాదు.. కాదు. మరి ఎందుకూ అంటే.. తను ప్రేమగా పెంచుకుంటున్న పెంపుడు కుక్క కోసమట. తమన్నా పెట్ పేరు పెబ్బల్. ఈ మధ్యన కొంచెం అస్వస్థతకు గురైయిందట. పెబ్బల్ అలా బాధపడుతుంటే చూడలేకపోయారట తమన్నా. పెంపుడు కుక్కపిల్ల త్వరగా కోలుకునేందుకు తనకు బాగా నచ్చినదానికి కొన్ని రోజుల పాటు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారట. దాంతో తనకు కొన్ని రోజుల పాటు మాంసాహారానికి దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నారు. ప్రస్తుతం తమన్నా చేస్తున్న సినిమాల విషయానికి వస్తే తెలుగులో ‘సైరా: నరసింహారెడ్డి’, తమిళంలో ‘దేవి 2’ చిత్రాలతో బిజీగా ఉన్నారు. -
యాక్షన్ ఎడ్వెంచర్ చిత్రంగా ఆల్ఫా
తమిళసినిమా: సూపర్ యాక్షన్ ఎడ్వెంచర్ చిత్రంగా ఆల్ఫా హాలీవుడ్ చిత్రం భారతీయ సినీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. మానవుడు, జంతువు అనే అసాధారణ స్నేహబంధంతో ఇంతకు ముందు వచ్చిన జంగిల్‌బుక్ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. అదే విధంగా అలాంటి మరో కోణంలో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రం ఆల్ఫా. ఇది చారిత్రక యాక్షన్ ఎడ్వెంచర్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందంటున్నారు చిత్ర వర్గాలు. ఇది ఒక యువకుడు, తోడేలు మధ్య మిత్రత్వం, వారు ఎదుర్కొనే సాహసాలు ఇతివృత్తంగా సాగే కథా చిత్రం. 20 వేల సంవత్సరాల క్రితం అడవి ప్రాంతాల్లో నివశించే జాతికి చెందిన కొందరు వారి జీవనాధారమైన వేటకు వెళతారు. అందులో ఒక కుర్రాడు తప్పిపోతాడు. ఆ కుర్రాడు ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు. అదే పరిస్థితిలో ఉన్న తోడేలు ఆ కుర్రాడికి తారస పడడం వారి మధ్య స్నేహబంధం ఏర్పడడం, అనంతరం ఎదురైన సమస్యలను ఎలా కలిసి ఎదుర్కొన్నారు? లాంటి పలు ఆసక్తికరమైన, ఉత్కంఠ భరితమైన సన్నివేశాలతో సాగే చిత్రం ఆల్ఫా. నాయకుడు లేనప్పుడు నువ్వే నాయకుడిగా మారాలి అన్న తండ్రి మాటల ప్రభావంతో తప్పిపోయిన ఆ కుర్రాడు ఎలా శత్రువులను ఎదుర్కొన్నాడు? లాంటి సాహసోపేతమైన సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. కొడి స్మిత్ మెక్ఫీ, లెఓనర్ వరేలా, జెన్స్హల్టెన్, జోహన్స్ హక్కర్ జోహన్సన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కథ, సహ నిర్మాత, దర్శకత్వం బాధ్యతలను ఆల్బర్ట్ హగ్స్ నిర్వహించారు. ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, ఆంగ్లం భాషల్లో సోనీ పిక్చర్స్ సంస్థ 24న భారీ ఎత్తున విడుదలకు సన్నాహాలు చేస్తోంది. -
ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు 8న పీఈటీ టెస్టు
సాక్షి, హైదరాబాద్: ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో భాగంగా ఆగస్టు 8వ తేదీన ఉదయం 5 గంటలకు పీఈటీ, ఈవెంట్స్ టెస్టు నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. బండ్లగూడలోని ఎక్సైజ్ అకాడమీలో ఈ పరీక్షలు ఉంటాయని పేర్కొంది. టెస్టులకు ఎంపికైన వారి జాబితాను వెబ్సైట్లో పొందవచ్చని సూచించింది. -
టెట్‌ను రద్దు చ్వేయాలంటూ పీఈటీ అభ్యర్థుల నిరసన
-
కలిసి తిన్నారని కాలితో తన్నిన సారు..
సాక్షి, అర్ధవీడు: స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పీఈటీ ఇద్దరు విద్యార్థుల పట్ల శుక్రవారం కర్కోటకంగా మారాడు. చేయని నేరానికి వారిని చితక బాదడంతో పాటు కులం పేరుతో దూషించాడు. బాధిత విద్యార్థులు నేరుగా పోలీసుస్టేషన్‌కు వెళ్లి జరిగిన అవమానాన్ని పోలీసుల ఎదుట చెప్పుకుని భోరున విలపించారు. వ్యాయామోపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత విద్యార్థుల కథనం ప్రకారం.. ఎనిబెర తేజస్సు (9వ తరగతి), పవన్ (8వ తరగతి)లు ఒకే ప్లేటులో భోజనం తింటున్నారు. పీఈటీ, వసతి గృహం కేర్‌టేకర్‌గా ఉన్న వినయ్‌కుమార్‌రెడ్డి విద్యార్థులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరూ ఒకే ప్లేటులో తింటున్నారు.. ప్లేట్లు ఏమయ్యాయంటూ కాలితో అన్నం ప్లేటును తన్నాడు. అంతటితో ఊరుకోకుండా కర్రతో చితకబాదాడు. చివరకు ఒక అడుగు ముందుకేసి కులం పేరుతో దూషించాడు. కర్రతో చితక బాదడంతో విద్యార్థుల పొట్ట, వీపుపై వాతలు పడ్డాయి. నేరుగా పోలీసుస్టేషన్‌కు వెళ్లిన విద్యార్థులు బాధిత విద్యార్థులు తమకు జరిగిన అన్యాయంపై నేరుగా పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. తమ పీఈటీ వినయ్‌కుమార్‌రెడ్డి అన్నం ప్లేటు తన్ని కర్రతో చితకబాది కులం పేరుతో దూషించాడని ఫిర్యాదు చేశారు. ఎస్ఐ సెలవులో ఉండటంతో విద్యార్థుల ఫిర్యాదును పోలీసులు పట్టించుకోలేదు. స్థానిక ఎస్హెచ్ఓపై బాధిత విద్యార్థుల బంధువులు పలు ఆరోపణలు చేస్తున్నారు. పాఠశాలలో వర్గపోరు గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయులు, సిబ్బంది మధ్య వర్గపోరు ఉంది. నిత్యం తమను వేధిస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులను చితకబాదిన వ్యాయామోపాధ్యాయుడు గతంలో తన కారును విద్యార్థులతో కడిగించడం వివాదాస్పదమైంది. పలు కుల సంఘాల నాయకులు ఎస్సీ కమిషన్‌కు కూడా ఆయనపై ఫిర్యాదు చేశారు. గురుకుల పాఠశాలల జిల్లా కోఆర్డినేటర్ లక్ష్మీశ్వరి సైతం విచారించి పీఈటీపై చర్యలకు ఆదేశించారు. అయినా అతడిపై చర్యలు తీసుకోకపోవడంతో కక్ష సాధింపు చర్యల్లో భాగంగా నిత్యం విద్యార్థులను కులం పేరుతో దూషిస్తున్నాడని విద్యార్థుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ప్రిన్సిపాల్ వనపాల్‌రెడ్డిని వివరణ కోరగా పీఈటీ వినయ్‌కుమార్‌రెడ్డి విద్యార్థులను తీవ్రంగా కొట్టినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. విద్యార్థులు పోలీసుస్టేషన్‌కు వెళ్లడంతో సర్ది చెప్పి వారిని వెనక్కి పిలిపించామని వివరించారు. పోలీసుస్టేషన్ ఎస్హెచ్ఓ కొండల్‌రావును వివరణ కోరగా విద్యార్థులు ఫిర్యాదు చేసేందుకు వచ్చారని, చిన్న పిల్లలు కావడంతో వెనక్కు పంపించామని తెలిపారు. -
మాట వినలేదని.. క్రికెటర్‌కు కత్తిపోట్లు!
సాక్షి, చెన్నై: తాను చెప్పినట్లు చేయలేదని ఓ జూనియర్ లెవల్ క్రికెటర్‌పై స్కూల్ టీచరే కత్తితో దాడి చేశాడు. ప్రస్తుతం ఆ బాధిత విద్యార్థి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన తమిళనాడు దిండిగల్ జిల్లా మనవాడిలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. దిండిగల్ జిల్లా పాయలానికి చెందిన హదికర్ రహ్మాన్(16) మనవాడిలోని ఆశ్రమ్ హయ్యర్ సెకండరీ స్కూల్లో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. అదే స్కూల్లో పన్నీర్‌సెల్వం ఫిజికల్ ఎడ్యూకేషన్ టీచర్‌గా పనిచేస్తున్నాడు. స్కూలు తరఫున క్రికెట్ ఆడే రహ్మాన్.. ప్రైవేట్ క్లబ్ టోర్నీల్లోనూ పాల్గొనేవాడు. కేవలం మన స్కూలు, మన ప్రాంతం తరఫున మాత్రమే క్రికెట్ ఆడాలని.. ప్రైవేట్ క్లబ్‌లకు ప్రాతినిధ్యం వహించొద్దని రహ్మాన్‌కు పీఈటీ వార్నింగ్ ఇచ్చాడు. కానీ రహ్మాన్ ప్రైవేట్ టోర్నీల్లోనూ పాల్గొనడంతో తీవ్ర ఆవేశానికి లోనైన పీఈటీ పన్నీర్‌సెల్వం మాట్లాడాలంటూ పిలిచాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో క్రికెటర్ రహ్మాన్ ఛాతీ, భుజం భాగాల్లో పొడిచాడు. చేతిలోని కత్తిని ఇతర టీచర్లు గుంజుకోగానే పీఈటీ పన్నీర్‌సెల్వం అక్కడి నుంచి పరారయ్యాడు. కాగా, తీవ్రంగా రక్తస్రావమవుతున్న విద్యార్థి రహ్మాన్‌ను కరూర్‌లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తనను తానే గాయపర్చుకుని పీఈటీ సైతం ఆస్పత్రిలో చేరి విద్యార్థి తనపై దాడి చేశాడని చెప్పడం గమనార్హం. స్కూలు యాజమాన్యం ఫిర్యాదు మేరకు పన్నీర్‌సెల్వంపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం. -
రండి.. దత్తత తీసుకోండి
సాక్షి, బెంగళూరు : మూడు రోజులుగా బెంగళూరులోని యశ్వంతపూర్‌లో పెట్ అడాప్షన్ అనే పెంపుడు కుక్కల ప్రదర్శన జరుగుతోంది. ఈ ప్రదర్శనకు వచ్చిన వీక్షకులు తమకు నచ్చిన పెంపుడు కుక్కలను దత్తత చేసుకుని ఇంటికి తీసుకెళుతున్నారు. ఈ ప్రదర్శన ఆదివారంతో ముగిసింది. పెడిగ్రీ, బెంగళూరు ఆప్షన్ టు అడాప్ట్, మెట్రో సంస్థలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. -
అసభ్య ప్రవర్తన.. పీఈటీకి దేహశుద్ధి
కరీంనగర్: అభం శుభం తెలియని చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించిన పీఈటీకి బాలిక బంధువులు దేహశుద్ధి చేశారు. ఈ ఘటన నగరంలోని శ్రీకృష్ణానగర్‌లో గురువారం వెలుగుచూసింది. ఆ వివరాలిలా ఉన్నాయి.. స్థానికంగా ఉన్న శ్రీసాయి హై స్కూల్లో మూడో తరగతి చదువుతున్న చిన్నారితో అదే పాఠశాలలో పీఈటీగా పని చేస్తున్న గోపి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయంపై విద్యార్థిని తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిని వెంటనే విధుల నుంచి తొలగించాలని బాధితురాలి తల్లదండ్రులు చేసిన ఫిర్యాదును పాఠశాల యాజమాన్యం పెడచెవిన పెట్టింది. దీంతో ఆగ్రహించిన విద్యార్థిని బంధవులు గురువారం పాఠశాలకు వచ్చి పీఈటీ గోపికి దేహశుద్ధి చేసి అతడిని పోలీసులకు అప్పగించారు. -
రాష్ట్రస్థాయి క్రీడలకు ఎంపికైన విద్యార్థి
పిట్లం : రాష్ట్రస్థాయి త్రోబాల్ క్రీడలకు పిట్లంలోని బ్లూబెల్స్ పాఠశాల విద్యార్థి ఎంపికైనట్లు పాఠశాల పీఈటీ ధర్మవీర్ తెలిపారు. బ్లూబెల్స్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న తరుణ్ అనే విద్యార్థి జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చగా రాష్ట్రస్థాయి త్రోబాల్ పోటీల్లో జిల్లా జట్టు నుంచి పోటీల్లో పాల్గొననున్నాడని ఆయన తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడంతో పాఠశాల నిర్వాహకులు నర్సింహా రెడ్డి, ప్రిన్సిపాల్, పీఈటీలు దవులత్, సుధాకర్, సుమలత, అధ్యాపక బృందం విద్యార్థిని అభినందించారు. -
మొబైల్ నుంచేపెట్ కి హాయ్ చెప్పండి..!
♦ క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా అందే ఫీడ్ ♦ ఏసర్ పాబో ప్లస్‌తో పెట్ ట్రాకింగ్ ♦ త్వరలో భారత్‌లో విడుదల హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెంపుడు జంతువునుఅన్ని సందర్భాల్లో వెంట తీసుకువెళ్లలేం. అలా అని అన్ని సమయాల్లోనూ తెలిసిన వాళ్ల ఇంట్లో ఉంచలేం. అలాంటప్పుడు ఇంట్లోనే వదిలి వెళ్లాల్సి వస్తుంది. అయినా మీ పెట్‌తో మొబైల్ నుంచే హాయ్ అంటూ మాట్లాడొచ్చు. అంతేకాదు ఆహారమూ వేయవచ్చు. పెట్‌ను ఆడించొచ్చు కూడా అని అంటోంది టెక్నాలజీ కంపెనీ ఏసర్. ఇందుకోసం పాబో ప్లస్ పేరుతో ఒక ప్రత్యేక పరికరాన్ని ఏసర్ అనుబంధ కంపెనీ అయిన పాబో రూపొందించింది. ఆన్‌డ్రాయిడ్, ఐఓఎస్ ఆధారిత స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్ పీసీ ఉంటే చాలు. నెట్ సహాయంతో పాబో ప్లస్‌కు ప్రపంచంలో ఎక్కడి నుంచైనా అనుసంధానం అవొచ్చు. ఇటీవలే బెర్లిన్‌లో జరిగిన ఐఎఫ్ఏ-2016 టెక్నాలజీ షోలో దీనిని ఆవిష్కరించారు. త్వరలో భారత్‌లో విడుదల చేసే ప్రయత్నాల్లో ఉన్నట్టు ఏసర్ ఇండియా కంజ్యూమర్ బిజినెస్ సీనియర్ డెరైక్టర్ చంద్రహాస్ పాణిగ్రాహి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. పాబో ప్లస్ ఇలా పనిచేస్తుంది.. పెంపుడు జంతువును పర్యవేక్షించే పరికర మే పాబో ప్లస్. ఇది వైఫైతో పనిచేస్తుంది. మొత్తం 8 మంది కనెక్ట్ అయి లైవ్ వీడియోను చూడొచ్చు. ఇలా అనుసంధానమైన వారు ప్రపంచంలో ఎక్కడి నుంచైనా తమ చేతిలోకి స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్ ద్వారా పెట్‌ను పలకరించొచ్చు. ఇందుకోసం పాబో ప్లస్‌లో స్పీకర్‌తోపాటు మైక్రోఫోన్‌ను ఏర్పాటు చేశారు. యజమాని కనపడకపోయినా గొంతు వింటే చాలు పెంపుడు జంతువుకు ఊరట లభిస్తుందని కంపెనీ అంటోంది. దీనికి ఉన్న కెమెరాతో 130 డిగ్రీల కోణంలో వీక్షించవచ్చు. వీడియోలు, ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లో ఒక క్లిక్ చేయగానే ఈ పరికరం నుంచి కొంత ఫీడ్ (ఆహారం) బయటకు వస్తుంది. దీనికి ఉన్న మోటరైజ్డ్ లేజర్ పాయింట్ గేమ్‌తో పెట్‌ను ఆడించొచ్చు. భారత్‌లో పాబో ప్లస్ ధర రూ.12-15 వేలు ఉండొచ్చు. ప్రపంచ వ్యాప్తంగా రూ.1,34,000 కోట్ల వ్యాపార అవకాశమని ఏసర్ చీఫ్ జేసన్ ఛెన్ అభిప్రాయపడ్డారు. యూఎస్‌లో అయితే చిన్న పిల్లల సంఖ్య కంటే పెంపుడు జంతువులు రెండు రెట్లు ఉంటాయని అన్నారు. -
ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయుల ఎంపిక
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాలో ఎనిమిది మంది ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయులను ఎంపికచేసినట్లు వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం జిల్లాశాఖ అధ్యక్ష, కార్యదర్శులు జగన్మోహన్గౌడ్, రాజవర్ధన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రశాఖ ఆధ్వర్యంలో యూ.శ్రీనివాసులు (మహబూబ్‌నగర్), సురేందర్‌రెడ్డి (వనపర్తి), జితేందర్ (మల్దకల్), ఎజ్కెల్ (మామిడిపల్లి), యాదయ్యగౌడ్ (కల్వకుర్తి), ఆంజనేయులు (జక్లెర్), మెర్సి ఫ్రెంచ్ (బాదేపల్లి), వి.శ్రీనివాసులు (అలంపూర్)లను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. వీరికి ఈనెల 12న హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించనున్న కార్యక్రమంలో సన్మానం చేయనున్నట్లు వారు తెలిపారు. -
హైస్కూల్లో బడి‘వాత’..!
కారేపల్లి హైస్కూల్లో విద్యార్థిని చితకబాదిన పీఈటీ గార్లొడ్డులో దండించిన ఉపాధ్యాయుడిపై డీఈఓకు ఫిర్యాదు కారేపల్లి: అల్లరి చే శాడని ఓ విద్యార్థిని పీఈటీ చితక బాదిన ఘటన మంగళవారం కారేపల్లి హైస్కూల్లో చోటు చేసుకుంది. బాధిత విద్యార్థి తెలిపిన వివరాల ప్రకారం..7వ తరగతి చదువుతున్న కానుగంటి సోమేష్ అనే విద్యార్థి అల్లరి చేశాడని పీఈటీ పవన్ కుమార్ బెత్తంతో వీపుపై వాతలు పడేలా చితకబాదాడు. సోమేష్ ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లి విషయాన్ని తల్లి స్వరూపకు చెప్పాడు. వీపుపై ఎర్రగా మూడు వాతలు తేలి ఉండడంతో..ఆమె విద్యార్థిని తీసుకొని విలేకరుల ఎదుట గోడు వెళ్లబోసుకుంది. పాఠాలు నేర్పుతారని బడికి పంపిస్తే..ఇలా వీపు పగులగొడతారా..? అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయమై పీఈటీ పవన్ కుమార్‌ను వివరణ కోరగా..మంగళవారం హైస్కూల్ గ్రౌండ్లోకి ఓ పాము వచ్చింది. దీంతో విద్యార్థులంతా దాని వెంటపడి గోలగోల చేశారు. ఈ క్రమంలో వీరిని నియంత్రించేందుకు కొంచెం తొందరపడ్డానని తెలిపారు. గార్లొడులో గ్రామస్తుల ఆందోళన ఏన్కూరు: గార్లొడ్డు ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి విద్యార్థి ధరావత్ బాలాజీ లెక్కలు సరిగ్గా చేయడం లేదని ఉపాధ్యాయుడు ప్రభాకర్ సోమవారం బెత్తంతో దండించాడు. బాలుడి పిరుదులపై గట్టిగా కొట్టడంతో వాతలు తేలాయి. పాఠశాల ముగిశాక ఏడేస్తూ ఇంటికొచ్చిన సదరు విద్యార్థి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. వారు, గ్రామస్తులు మంగళవారం ఉదయం పాఠశాల వద్దకు వచి..ఆందోళన చేశారు. సదరు ఉపాధ్యాయుడు రాకపోవడంతో డీఈఓ రాజేష్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాలతో ఎంఈఓకు జయరాజ్ వచ్చి వివరాలు సేకరించారు. -
కానిస్టేబుల్ పరీక్షలు విజయవంతం
ఎస్పీ విక్రమ్‌సింగ్ దుగ్గల్ వ్యాయామ ఉపాధ్యాయులకు సన్మానం ఆదిలాబాద్ క్రైం : జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో పదిహేను రోజులపాటు నిర్వహించిన కానిస్టేబుల్ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ విజయవంతంగా ముగిసిందని ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ అన్నారు. ఎంపిక ప్రక్రియ క్రమపద్ధతిలో నిర్వహించినందుకు వ్యాయామ ఉపాధ్యాయులకు అభినంధనలు తెలిపారు. శుక్రవారం స్థానిక పోలీసు పరేడ్ మైదానంలో వ్యాయామ ఉపాధ్యాయులు జి.మహేశ్, హరిచరణ్, శాస్త్రీ, భూమన్న, నాందేవ్, రవికుమార్, ఎన్.స్వామి, కృష్ణ, సత్యనారాయణ, శబ్బీర్, జె.రవీందర్లను శాలువాతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. చివరి రాత పరీక్ష కోసం 4221 మంది పురుషులు, 1117 మహిళా అభ్యర్థులు ఎంపికైనట్లు తెలిపారు. ఈ ప్రక్రియలో పోలీసు అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వర్తించారని పేర్కొన్నారు. వ్యాయామ ఉపాధ్యాయులు ఈ పరీక్షల నిర్వహణలో కీలక పాత్రపోషించారని తెలిపారు. బయోమెట్రిక్ విధానం ద్వారా ఆధార్‌కార్డు గుర్తింపు ప్రక్రియలో కంప్యూటర్ విభాగం అధికారులు ఎంతో కృషిచేశారని వివరించారు. పోలీసు కార్యాలయ అధికారులు, పోలీసు అధికారులను ప్రతీ ఒక్కరికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీలు జీఆర్ రాధిక, విజయ్‌కుమార్, పోలీసు అధికారులు ఉన్నారు. -
పర్వతగిరి హైస్కూల్ పీఈటీ పై వేటు
విద్యారణ్యపురి : మహబూబాబాద్ మండలం పర్వతగిరి జిల్లా పరిషత్ హైస్కూల్ పీఈటీ ప్రేమ్‌కుమార్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు డీఈవో రాజీవ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆ స్కూల్లో హెచ్ఎం సుభాష్, పీఈటీ ప్రేమ్‌కుమార్ నడు మ కొంత కాలంగా వివాదం నడుస్తుండగా డిప్యూటీ డీఈఓతో విచారణ జరిపించారు. ఈ మేరకు పీఈటీ ప్రేమ్‌కుమార్‌ను సస్పెన్షన్ చేసినట్లు డీఈవో తెలిపారు. ఇదిలా ఉండగా హెచ్ఎం సుభాష్‌ను గురువారం సస్పెం డ్ చేసిన విషయం విదితమే. -
పరీక్షలు విజయవంతం
ఎస్పీ విక్రమ్‌సింగ్ దుగ్గల్ వ్యాయామ ఉపాధ్యాయులకు సన్మానం ఆదిలాబాద్ క్రైం : జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో పదిహేను రోజులపాటు నిర్వహించిన కానిస్టేబుల్ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ విజయవంతంగా ముగిసిందని ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ అన్నారు. ఎంపిక ప్రక్రియ క్రమపద్ధతిలో నిర్వహించినందుకు వ్యాయామ ఉపాధ్యాయులకు అభినంధనలు తెలిపారు. శుక్రవారం స్థానిక పోలీసు పరేడ్ మైదానంలో వ్యాయామ ఉపాధ్యాయులు జి.మహేశ్, హరిచరణ్, శాస్త్రీ, భూమన్న, నాందేవ్, రవికుమార్, ఎన్.స్వామి, కృష్ణ, సత్యనారాయణ, శబ్బీర్, జె.రవీందర్లను శాలువాతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. చివరి రాత పరీక్ష కోసం 4221 మంది పురుషులు, 1117 మహిళా అభ్యర్థులు ఎంపికైనట్లు తెలిపారు. ఈ ప్రక్రియలో పోలీసు అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వర్తించారని పేర్కొన్నారు. వ్యాయామ ఉపాధ్యాయులు ఈ పరీక్షల నిర్వహణలో కీలక పాత్రపోషించారని తెలిపారు. బయోమెట్రిక్ విధానం ద్వారా ఆధార్‌కార్డు గుర్తింపు ప్రక్రియలో కంప్యూటర్ విభాగం అధికారులు ఎంతో కృషిచేశారని వివరించారు. పోలీసు కార్యాలయ అధికారులు, పోలీసు అధికారులను ప్రతీ ఒక్కరికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీలు జీఆర్ రాధిక, విజయ్‌కుమార్, పోలీసు అధికారులు ఉన్నారు. -
పీఈటీల పోస్టులు భ ర్తీ చేయాలి
పెగడపల్లి: మండలంలోని నంచర్ల, బతికపల్లి జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయులను భర్తీ చేయాలని ఆయా పాఠశాలల విద్యార్థులు కోరుతున్నారు. గతంలో ఆయా పాఠశాలలో పని చేసిన వ్యాయామ ఉపాధ్యాయులు ఏడాది క్రితం బదిలీపై Ðð ళ్లగా వారి స్థానంలో ఇతరులను నియమించలేదు. దీంతో ఏడాది నుంచి తాము ఆటలకు దూరమవుతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వ్యాయామ ఉపాధ్యాయులను భర్తీ చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. -
సైబర్ క్రైం పోలీస్ పేరుతో సింగరేణి ఉద్యోగికి బెదిరింపు'
రూ.30 వేలు ఇవ్వాలని డిమాండ్ బాధితుడి ఫిర్యాదుతో నిందితుడిపై కేసు కోల్‌సిటీ : తాను సైబర్ క్రైం పోలీసునంటూ గోదావరిఖనిలో ఓ పీఈటీ టీచర్ తప్పుడు ప్రచారం చేసుకుంటూ... ఓ సింగరేణి ఉద్యోగుడిని బెదిరించి రూ.30 వేలు డిమాండ్ చేశాడు. అనుమానంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చాకచక్యంగా నిందితుడిని పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. గోదావరిఖని వన్‌టౌన్ పోలీసులు, బాధితుడి తెలిపిన వివరాల ప్రకారం.. గోదావరిఖని తిరుమల్‌నగర్‌కు చెందిన ఎరుకల సంతోష్‌కుమార్ సింగరేణి ఆర్జీ–1 జీఎం కార్యాలయంలో కోఆర్డినేటర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. స్థానిక రమేశ్‌నగర్‌కు చెందిన ఎనగందుల రమేశ్ పట్టణంలోని పలు ప్రైవేట్ స్కూళ్ళల్లో పీఈటీగా పని చేస్తున్నాడు. మూడు రోజుల క్రితం సంతోష్‌కుమార్‌కు ఫోన్ చేసిన రమేశ్ తను సైబర్ క్రైం పోలీసునని పరిచయం చేసుకున్నాడు. ‘నీ మీద కేసయ్యింది... నీ కోసం తిరుగుతున్నాం... రూ.30 వేలు ఇస్తే పైఅధికారులకు చెప్పి కేసు లేకుండా చేస్తా... లేకుంటే నీకే నష్టం’ అంటూ బెదిరించాడు. అనుమానం వచ్చిన సంతోష్‌కుమార్ కరీంనగర్ స్పెషల్ బ్రాంచ్ పోలీస్ విభాగంలో పని చేస్తున్న తన బంధువుకు ఈ విషయం చెప్పాడు. డబ్బు కోసం ఆ వ్యక్తి ఇలా చేస్తున్నాడని తెలుసుకున్న సంతోష్ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మంగళవారం అడిగిన డబ్బులు ఇస్తానని రమేశ్‌ను, జీఎం ఆఫీస్ దగ్గరికి సంతోష్‌కుమార్ రప్పించాడు. రూ.30 వేలు లేవని, మూడు వేలు మాత్రం ఇస్తానని చెప్పడంతో రమేశ్ తీసుకున్నాడు. అదే సమయంలో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. -
భర్త కుక్కను వదిలేసి వచ్చాడని..
పెంపుడు కుక్కను భర్త తరిమేశాడని భార్య ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన గురువారం తమిళనాడులోని నమక్కల్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుక్కలను అమితంగా ప్రేమించే శాంతి అనే మహిళ 'కన్నీ' అనే కుక్కను కొన్నేళ్ల నుంచి పెంచుకుంటోంది. కన్నీని ఇంట్లో ఉంచుకోవడం ఇష్టం లేని ఆమె భర్త దాన్ని, కొత్తగా పుట్టిన కుక్కపిల్లను బయటకు తీసుకువెళ్లి వదిలేసి వచ్చాడు. దీంతో మనస్తాపం చెందిన మహిళ ఒంటికి నిప్పంటించుకుంది. దాదాపు 85 శాతం శరీరం కాలిపోయిందని, ప్రస్తుతం నమక్కల్ జిల్లా ఆసుపత్రిలో వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తాజాగా ఓ మెడికో విద్యార్ధి కుక్క మేడ మీది నుంచి పడేసిన ఘటన మరువకు ముందే ఈ ఘటన జరగడంతో జంతుప్రేమికులు దీనిని ఖండిస్తున్నారు. -
సిబ్బందికి కొత్త సౌకర్యం...
షాంఘై ః ఉద్యోగులనుంచి అధిక పనిని పొందాలంటే ఒక్కో కంపెనీ ఒక్కో సౌకర్యం కల్పిస్తుంటుంది. కొందరు ప్రత్యేక బోనస్ లు, ఇంక్రిమెంట్లు, టూర్లు, ఔటింగ్ ఇలా వారికి అప్పుడప్పుడు ఒత్తిడిని తగ్గించే కార్యక్రమాలను ఏర్పాటు చేసి, వారితో పని చేయించుకుంటాయి. కానీ ఓ చైనా కంపెనీ మాత్రం తన సంస్థలోని ఉద్యోగులు ఒత్తిడి లేకుండా చక్కగా పనిచేసేందుకు భిన్నంగా ఆలోచించింది. వారు తమ పెంపుడు జంతువులతోపాటు ఆఫీసులకు వచ్చే సౌకర్యం కల్పించింది. చైనా షాంఘై లోని ఇంటర్నెట్ మార్కెటింగ్ కంపెనీ తమ ఉద్యోగులు ఒత్తిడి లేకుండా పని చేసేందుకు కొత్త సౌకర్యాన్ని కల్పించింది. సిబ్బంది తమతోపాటు పెంపుడు జంతువుల్ని కూడా ఆఫీసుకు తెచ్చుకునే ఏర్పాటు చేసింది. వారిని ప్రోత్సహించేందుకు కల్పించిన కొత్త సౌకర్యంతో అద్భుత ఫలితాలు సాధించడంతోపాటు, సిబ్బంది హాయిగా, ఆనందంగా పనిచేయగల్గుతున్నట్లు యాజమాన్యం చెప్తోంది. కార్యాలయంలో పోటీ, డిమాండ్ సిబ్బందిని తీవ్రమైన ఒత్తిడికి గురిచేస్తోందని, అది వారి పనిపై ప్రభావం చూపిస్తుందని భయపడ్డ కంపెనీ అధిపతి జావో కాంగ్ చాంగ్.. వారు ఒత్తిడినుంచీ ఎలా రిలాక్స్ అవ్వగలరో పరిశోధించాడు. ముందుగా వారి ప్రొఫైల్స్ అధ్యయనం చేసి ఎక్కువశాతం ఉద్యోగుల ఇంట్లో పెంపుడు జంతువులు ఉన్నట్లు గమనించాడు. వాటిని తెచ్చుకొని మరీ ఆఫీసుకు రావచ్చంటూ ('బ్రింగ్ యువర్ పెట్ వర్క్ డే' ) ప్రత్యేక సౌకర్యాన్ని ప్రకటించాడు. యజమాని తీసుకున్న నిర్ణయం భారీ విజయాన్ని సాధించింది. ఉద్యోగులంతా ఎంతో రిలాక్స్ గా ఉండటంతోపాటు, ఒకరికొకరు సహాయ పడుతూ ఉత్సాహంగా టీమ్ వర్క్ చేస్తున్నారు. నేనుకూడా పెట్ లవర్ అని, పెంపుడు జంతువులను ఎక్కువ సమయం ఒంటరిగా వదిలి వచ్చిన తర్వాత పొందే ఆందోళన ఎంతటిదో తనకు స్వానుభవం ఉందని, అందుకే ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కొత్త ఏర్పాటు చేసినట్లు జావో చెప్తున్నాడు. సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి తన నిర్ణయాన్ని వివరించగా.. వారు ఆహ్వానించారని, కంపెనీ ఉత్పాదకత పెంచడంలో అదో అనధికారిక విధానంగా అమలు చేసినట్లు జావో వివరించాడు. ప్రస్తుతానికి పెట్స్.. సిబ్బందితోపాటు ఆఫీసులోనే తిరుగుతూ ఉంటాయని, భవిష్యత్తులో అవి ఆడుకునేందుకు, నిద్రపోయేందుకు వీలుగా ప్రత్యేక సౌకర్యాలను కల్పించే యోచనలో ఉన్నట్లు తెలిపాడు. జావో కాంగ్ చాంగ్ నూతన ఆలోచన విజయవంతమవ్వడంతో ఇప్పుడు ఇతర స్టార్ట్ అప్ కంపెనీలు సైతం అటుగా దృష్టి సారిస్తున్నాయి. -
వామ్మో.. ఈ మహిళకెంత డేర్..!
ఫ్లోరిడా: మొసలి అనగానే సాధారణంగా ఒళ్లంతా గగుర్పొడుస్తుంది. దాన్ని చూడ్డానికి కాస్తం భయంగా, ఎబ్బేట్టుగా ఉంటుంది. దాని నోటికి చిక్కితే ఎంత భయంకరంగా నమిలేస్తుందో తెలియని విషయం కాదు. అలాంటి మొసలిని ఎవరైనా పెంపుడు జంతువుగా పెట్టుకోవాలని చూస్తే.. అంతేకాదు ఎక్కడికంటే అక్కడికి తనతోపాటే బైక్ పై తీసుకొని వెళితే.. ఫ్లోరిడాలో ఇదే జరిగింది. మేరే థార్న్ అనే ఓ కుస్తీ పోరాట యోధురాలు (రెజ్లర్) ఏకంగా ఓ రాంబో అనే మొసలిని తన పెట్ యానిమల్ గా పెంచుకుంటోంది. తన బైక్‌కు అదనంగా మరో బైక్లాంటిదాన్ని తగిలించి దానిపై దాదాపు ఆరడుగుల పొడవున్న మొసలిని తీసుకెళుతుంది. ఎక్కడైనా ఖాళీ దొరికి కూర్చుంటే మొసలి ఎంతో ప్రేమగా ఆమెను ఆలింగనం కూడా చేసుకుంటుంది. ఆమె చెప్పే మాటలకు అది సరే అన్నట్లుగా కనురెప్పలు వాలుస్తుంటుంది. దీనిని పలువురు వ్యతిరేకించడంతోపాటు అటవీ శాఖ కమిషన్ అధికారులు కూడా అడ్డుచెప్పారు. ఒక వేళ ఆ మొసలిని పెంచుకోవాలనుకుంటే రెండున్నర ఎకరాల స్థలం ఉండాలని, దాన్ని ముందు ఏర్పాటుచేసుకొమ్మని తెలిపింది. కాగా, తాను మొత్తం నాలుగు మొసళ్లను పెంచడం ప్రారంభించానని, పరిస్థితులు అనుకూలించక మూడు చనిపోయాయని ప్రస్తుతం రాంబో మాత్రమే మిగిలిందని, అది ఆరడుగులు పెరుగుతుందని తాను కూడా అస్సలు ఊహించలేదని తెలిపింది. -
టీచర్ ని వేధిస్తున్న హెచ్ఎం
పిల్లలకు విద్యాబుద్దులు చెప్పాల్సిన ప్రధాన ఉపాధ్యాయుడు పక్కదారి పట్టాడు. మహిళా పీఈటీని లైంగికంగా వేధించుకుతింటున్నాడు. అతడి వేధింపులతో విసిగిపోయిన బాధితురాలు శుక్రవారం ఉన్నతాధికారికి ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి బాధిత వ్యాయామ ఉపాధ్యాయురాలు మీడియాకు వివరించిన వివరాలు ఇలా ఉన్నాయి.. కృష్ణా జిల్లా చాట్రాయి మండలం చనుబండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పి.రఘురామ్ మూడేళ్లుగా అదే పాఠశాలలో పనిచేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. చెప్పడానికి వీలుకాని రీతిలో అసభ్య పదజాలంతో హింసిస్తున్నాడు. దీంతో బాధిత ఉపాధ్యాయురాలు గతంలో జిల్లా విద్యాశాఖ అధికారికి, నూజివీడు ఉప విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేసింది. వారు సదరు కీచక ప్రధాన ఉపాధ్యాయుడిని పిలిచి మందలించారు. అయినా అతడి తీరులో మార్పు లేదు. దీంతో బాధితురాలు గ్రామ పెద్ద మనుషుల ముందు తన గోడు వెళ్లబోసుకుంది. వారు కూడా ప్రధాన ఉపాధ్యాయుడు రఘురామ్‌ను తీరు మార్చుకోవాలని సూచించారు. అయినా వేధింపులు ఆగలేదు. దీంతో బాధితురాలు శుక్రవారం నూజివీడు ఉప విద్యా శాఖ అధికారికి మరోమారు ఫిర్యాదు చేశారు. విచారణ తర్వాత చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. -
నేడు వరల్డ్ క్యాట్ డే
మ్యావ్.. వావ్! మ్యావ్.. మ్యావ్.. అంటూ అవి వంటింట్లో దూరితే ‘వామ్మో పాలు తాగేస్తుందేవ్’... అంటూ కంగారు పడిపోయే రోజులు పోయి... ‘క్యాట్ యూ ఆర్ సో క్యూట్’ అంటూ ఇల్లంతా పిల్లికి దాసోహం చేసే రోజులు వచ్చేశాయి. వనాలను హరించిన కాంక్రీట్ జంగిల్లో కరువైన సహజీవన సౌందర్యం కోసం తహతహలాడుతున్న నగరవాసి మార్జాలాలను మనసారా అక్కున చేర్చుకుంటున్నాడు. ఈ ‘చిరు’ జీవులతో ఆడుతూ పాడుతూ ఆనందాన్ని పోగు చేసుకుంటున్నాడు. ఇప్పుడు పిల్లులంటే భయానికి, పిరికితనానికి కాదు... ప్రేమను పంచే పెట్స్‌కి గుర్తు. నేడు వరల్డ్ క్యాట్ డే సందర్భంగా వాటి సంరక్షణ, పెట్లవర్స్ మాట ఇతర అంశాలపై కథనం. క్యాట్ కల్చర్ పెరిగింది బయటకు వెళ్లేటప్పుడు పిల్లి ఎదురొస్తే అపశకునం, ఉదయాన్నే పిల్లి మొహం చూడొద్దనే నమ్మకాలు తగ్గాయి. చాలామంది ఇళ్లలో పిల్లులను పెంచుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. శుభ్రంగా ఉండటం, వాటిని పెంచుకోవడంలో ఇబ్బందులు లేకపోవడం కూడా ఓ కారణం. సిటీలో ఒత్తుగా జుత్తున్న పర్షియన్ పిల్లులను పెంచుకునేందుకు ఇష్టపడుతున్నారు. వీటికి గ్రూమ్ చెయ్యటం చాలా ముఖ్యం. రెగ్యులర్ గ్రూమ్ చెయ్యటం వల్ల బయో-డెర్మా ఇబ్బందులను అధిగమించవచ్చు. - డాక్టర్ మురళీధర్ క్వైట్.. క్యూట్.. నా క్యాట్ నన్నే బాగా చూసుకుంటుంది. పొద్దున్నే వచ్చి ఆఫీసు టైంకు నిద్రలేపుతుంది. 15 ఏళ్ల నుంచి క్యాట్స్ని పెంచుకుంటున్నాను. ప్రస్తుతం ఉన్న పిల్లి పేరు ఫియోనా. మనం చూపించే కేర్ని బట్టి వాటి ప్రవర్తన ఉంటుంది. ఇవి కోజీగా ఉంటాయి. ఆడుతాయి... ముద్దుచేస్తాయి. న్యూసెన్స్ క్రియేట్ చెయ్యవు. హైజీన్‌గా ఉంటాయి. ఆహారం వేళకి పెడితే చాలు. ప్రత్యేక శిక్షణ అవసరం లేదు. - కిమ్ థామస్, డీజే పిల్లుల సంరక్షణ... పిల్లులు మాంసాహారాన్నే తింటుంటాయి. బయట దొరికే కమర్షియల్ ఫుడ్స్‌లో వాటికి కావాల్సినమాంసాహారం, ప్రొటీన్, మినరల్స్ అన్నీ సరైన మోతాదుల్లో మిక్స్ చేసి తయారు చేస్తారు. కమర్షియల్ ఫుడ్‌లో వాటికి స్నాక్స్, మీల్స్ అన్ని రకాల ఫుడ్ ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇంటి ఆహారం అయితే నాన్‌వెజ్ ఎక్కువ, తక్కువ రైస్‌తో ఫుడ్ పెట్టాలి. పిల్లి బరువుని బట్టి ఫుడ్ క్వాంటిటీ ఇవ్వాల్సి ఉంటుంది.ఇక చాలా మంది డ్రైఫ్రూట్స్ ఎక్కువగా ఆహారంగా ఇస్తుంటారు. దానికన్నా తాజా పళ్లతో కలిపి తగిన మోతాదులో మాత్రమే ఇవ్వటం మంచిది. వ్యాక్సినేషన్.. పిల్లులకు కూడా రేబిస్ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించాలి. పిల్లుల్లో 5 రకాల మేజర్ వైరల్ డిసీజెస్ వస్తుంటాయి. వాటన్నింటికీ వ్యాక్సిన్స్ ఉన్నాయి. అవి కూడా తప్పనిసరిగా ఇప్పించాలి. రోగ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. జాగ్రత్తగా చూసుకుంటే పిల్లి 15 ఏళ్లు వరకు బతుకుతుంది. ఇదీ సంగతి 2002 నుంచి ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ యానిమల్ వెల్ఫేర్ (ఐఎఫ్ఏడబ్ల్యూ) ఆగస్ట్ 8న వరల్డ్ క్యాట్ డేగా పరిగణించటం మొదలైంది.మనతో పాటు 9,500 ఏళ్లుగా సహజీవనం చేస్తున్న పిల్లులు ప్రపంచంలోనే పాపులర్ పెట్. పిల్లులను పెంచుకోవటం వల్ల ఆందోళన, ఒత్తిడి తగ్గించుకొని మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చనేది పరిశోధకుల మాట. -
పెంపుడు కుక్కకు దశదిన కర్మ
ఇండోర్: కుక్క (ఆడజాతి)ను ఎంతో ప్రేమతో పెంచుకుని కూతురిలా చూసుకున్నారు. ఈ పెంపుడు కుక్క చనిపోతే ఇంట్లో వ్యక్తి చనిపోయినట్టు బాధపడ్డారు. హిందూ సాంప్రదాయం ప్రకారం కుక్కకు అంత్యక్రియలు నిర్వహించి, దశదిన కర్మ చేయించారు. సన్నిహితులను పిలిచి 500 మందికి భోజనాలు పెట్టారు. అంతేగాక ఆ ఇంటి యజమాని కుమారుడు సాంప్రదాయం ప్రకారం క్షవరం చేయించుకుని నివాళులు అర్పించాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగింది. పప్పు చౌహాన్‌కు జర్మన్ షెపర్డ్ పింకీని పెంచుకున్నారు. చౌహాన్ దంపతులకు ఇద్దరు కుమారులుండగా, ఈ కుక్కను కూతురిలా చూసుకున్నారు. కాగా పక్షవాతంతో ఆ కుక్క ఇటీవల మరణించడంతో చౌహాన్ కుటుంబం ఎంతో బాధపడింది. హిందూ సాంప్రదాయం ప్రకారం కుక్కకు తుది సంస్కారాలు నిర్వహించి నివాళులు అర్పించారు. -
మమత బాటలోనే బెంగాల్ కాంగ్రెస్,సీపీఎం ఎంపీలు
-
హ్యాపీనెస్‌కి పెట్‌బడి
‘మా క్యూటీ తప్పిపోయిం’దంటూ పోలీస్‌స్టేషన్‌లో కంప్లయింట్ ఇస్తే.. ఆ క్యూటీ ఒక పెట్‌డాగ్ అని వెంటనే అర్థం చేసుకుని, ఆఘమేఘాలపై సదరు క్యూటీ గారిని పట్టి తెచ్చివ్వకపోతే ఠాణా పీకి పందిరి వేసినంత పనిచేసే వాళ్లు నగరంలో ఎందరో. ముచ్చటపడి పెంచుకుంటున్న శునకరాజం పరమపదిస్తే.. రోజుల తరబడి శోక సముద్రంలో మునిగిపోయేవాళ్లు, అంత్యక్రియలు సైతం నిర్వహించి, జ్ఞాపకార్థం సమాధులు నిర్మించే వారూ సిటీలో ఉన్నారు. అంతగా పెట్స్‌ని జీవన నేస్తాలుగా భావిస్తున్నవారు వాటి సంరక్షణ కోసం ఎంత వ్యయప్రయాసలైనా సిద్ధమంటున్నారు. నగరంలో నిర్వహిస్తున్న డాగ్షోస్...ఓనర్-పెట్ మధ్య బాండింగ్, వాటి ట్రైనింగ్ ప్రొసీజర్ ఇవన్నీ ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఉపకరిస్తున్నాయి . ‘కొన్నేళ్లుగా యజమానులు తమ ‘నేస్తా’లకు బెస్ట్ లైఫ్ అండ్ బెస్ట్ ఫుడ్‌ని అందించాలని కోరుకుంటున్నారు. ఆహారం, వసతి కోసం మనపైనే ఆధారపడే శునకాలకు సరైన ఫుడ్‌ని అందించడం, వాటిని ఆప్యాయంగా చూసుకోవడం మన బాధ్యతే’ అని మార్స్ ఇండియా (పెడిగ్రీ) డెరైక్టర్ శ్రీనితిన్ సూచిస్తున్నారు. ప్లై బాల్ కాంటెస్ట్, ఎడ్యుకేషన్ ఆన్ పెట్ కేర్, డాగ్స్‌ని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో నేర్పించే టిప్స్.. ఇవన్నీ డాగ్ షోలలో భాగమే. ఈ తరహా షోలకు విభిన్న రకాల జాతి శునకాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఉదాహరణకు హైదరాబాద్ కెనన్ క్లబ్ ఆదివారం మాదాపూర్ హైటెక్స్‌లో నిర్వహించిన డాగ్‌షోలో దేశం నలుమూలల నుంచి ఏకంగా 40 రకాల బీడ్స్ 300 వరకు పాల్గొన్నాయి. ఇక్కడ పెట్స్‌తో కలసి కుటుంబ సపరివారంగా బయట గడిపే అవకాశాన్ని ఈ డాగ్ షో ద్వారా కల్పించారు. ఈ సందర్భంగా డాగ్ ఓనర్స్‌తో ‘సిటీప్లస్’ ముచ్చటించినప్పుడు పెట్స్‌తో తమ అనుబంధాన్ని ఇలా పంచుకున్నారు. ..:: చల్లపల్లి శిరీష అదుంటే పం‘డాగే’... మా ఆయనకు పెట్స్ అంటే ప్రాణం. మా దగ్గర ‘జర్మన్ షెపర్డ్’ ఉంది. దాని పేరు ‘స్కై’. వాడు (స్కై) టవల్‌తో, ఫుట్‌బాల్‌తో భలే ఆడతాడు. స్కైకి ఇప్పుడు రెండున్నరేళ్లు. మేం ఏం తెచ్చుకున్నా వాడికీ తెస్తాం. పండక్కి మా బట్టల సంగతెలా ఉన్నా వాడికి మాత్రం కచ్చితంగా కొంటాం. - శ్రావణి , మలక్‌పేట ప్రైజ్‌లు తెచ్చే పెట్.. నా హనీ బ్రీడ్ పేరు ‘లాస ఆప్సో’. వాడికి మూడేళ్లు. రోజూ మమ్మల్ని నిద్ర లేపుతాడు. ఎవరైనా నన్ను ఎంత మంది పిల్లలంటే ముగ్గురని చెప్తాను. నాకు ఇద్దరు పిల్లలు. మూడోవాడు హనీగాడు. నా పిల్లలూ వాడిని ‘తమ్ముడూ’ అనే పిలుస్తారు. ఏది వండుకున్నా తొలి ముద్ద వాడికే. పెట్ షోస్‌లో 12 బెస్ట్ ప్రైజ్‌లు గెలుచుకున్నాడు. హీ ఈజ్ వెరీ క్రేజ్ అబౌట్ ఫొటోస్ అండ్ కెమెరా షూట్స్. - సునంద మిస్డ్ యూ మై డియర్... ప్రాజెక్ట్ పనిపై సిటీకి వచ్చా. నా ఫ్రెండ్ డాగ్ షో గురించి చెబితే ఇక్కడికొచ్చా. ఇన్ని రకాల బ్రీడ్స్‌ని ఒకే రూఫ్ కింద చూడటం తొలిసారి. మా హోం ప్లేస్‌కి వెళ్లాక ఇక్కడి ఫొటోలు, వీడియోలు నా ఫ్రెండ్స్‌కి చూపిస్తా. మా ఇంట్లోనూ పెట్ ఉంది. నౌ అయాం మిస్సింగ్ మై డాగీ!. - సబీనా, కాలిఫోర్నియా (యూ.ఎస్) -
ఊరించిన కిరణ్ జాగీరు.. ఉత్తర్వులివ్వని బాబు సర్కారు
అమలాపురం : అందివచ్చిన అవకాశం.. చేజారినట్టయింది. వ్యాయామోపాధ్యాయులు, భాషా పండితులను రెండేళ్లుగా ఊరిస్తున్న పదోన్నతులకు అంతరాయమేర్పడింది. రాష్ట్ర విభజనకు ముందు కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారు పదోన్నతులకు ఆమోదం తెలిపింది. అయితే రాష్ట్ర విభజన తరువాత పగ్గాలు చేపట్టిన చంద్రబాబు నాయుడి ప్రభుత్వం ఇప్పటి వరకు జీఓ జారీ చేయకపోవడంతో వారి ఆశలపై నీళ్లు జల్లినట్టయింది. జిల్లాలో సుమారు 125 మంది పీఈటీలు, 700 మంది భాషా పండితులు పదోన్నతులు పొందాల్సి ఉంది. ఉన్నత పాఠశాలల్లో పీఈటీలుగా పనిచేస్తున్న తమకు పీడీలుగా పదోన్నతులివ్వాలని రెండేళ్లుగా వారు కోరుతున్నారు. అలాగే జీఓ : 11, 12లలో సవరణలు చేసి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి ఇవ్వాలని భాషా పండితులు కోరుతున్నారు. పెరిగిన భారం పీఈటీల విషయానికి వస్తే.. గతంలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న పాఠశాలల్లో ఒక పీడీ, ఒక పీఈటీ లేదా ఇద్దరు పీఈటీలు ఉండేవారు. రేషనలైజేషన్‌తో ప్రభుత్వం రెండేళ్ల క్రితం జీఓ: 55 జారీ చేసింది. ఈ జీఓ వల్ల 800 మంది దాటి ఉన్న జిల్లా పరిషత్, ఎయిడెడ్ పాఠశాలల్లో మాత్రమే ఫిజికల్ డెరైక్టర్ (పీడీ), ఒక పీఈటీ ఉండాలి. దీంతో చాలా తక్కువ పాఠశాలల్లో మాత్రమే పీడీ, పీఈటీలు పనిచేస్తున్నారు. 500 మంది విద్యార్థులున్న పాఠశాలలకు పీడీలు, అంతకన్నా తక్కువ విద్యార్థులున్న పాఠశాలకు పీఈటీలు మాత్రమే ఉన్నారు. 500 మంది విద్యార్థులకు ఆటపాటలు నేర్పడం, విద్యార్థులను కట్టడి చేయడం తమకు తలకుమించిన భారంగా మారిందని పీఈటీలు గగ్గోలు పెట్టినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఇద్దరు, ముగ్గురు పీడీ, పీఈటీలు పనిచేస్తుంటే, అదే పని జెడ్పీ పాఠశాలల్లో ఒక్క పీడీయే చేయాల్సి వస్తోంది. సక్సెస్ స్కూళ్లలో కూడా ఇదే విధానం అమలు చేస్తున్నారు. ఉదాహరణకు కాకినాడ పీఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పీడీ, ఇద్దరు పీఈటీలు ఉండగా, ఇంచుమించు ఇదే స్థాయిలో విద్యార్థులున్న అమలాపురం బాలుర ఉన్నత పాఠశాలలో ఒక పీడీ మాత్రమే ఉన్నారు. ఇక భాషా పండితులది మరో బాధ. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ భాషా పండితులు సైతం పదోన్నతి కోసం పోరాటం చేస్తున్నారు. జీఓ: 11, 12ల వల్ల ఉద్యోగాల్లో చేరిన ఎస్జీటీలు ఎంఏ తెలుగు, ఇంగ్లీష్ పూర్తి చేసి భాషా పండితులుగా చేరి పదోన్నతులపై స్కూల్ అసిస్టెంట్లుగా జీతాలు పొందుతున్నారు. ఈ జీఓను సవరించి కేవలం భాషా పండితులకు మాత్రమే పదోన్నతులు కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
పెంపుడు జంతువుకు ‘అంతరిక్ష’ వీడ్కోలు..
హూస్టన్: మీకు అత్యంత ఇష్టమైన పెంపుడు జంతువు చనిపోయిందా.. దానికి వినూత్నరీతిలో వీడ్కోలు పలకాలనుకుంటున్నారా.. అయితే వాటి అస్థికల అవశేషాలను అంతరిక్షంలోకి పంపి ఘనమైన సెండాఫ్ ఇవ్వండి. ప్రైవేటు స్పేస్ ఫ్లైట్ కంపెనీ సెలెస్టిస్ మీకు ఈ అరుదైన అవకాశం కల్పిస్తోంది. అయితే ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. హూస్టన్‌కు చెందిన ఈ కంపెనీ ఇప్పటికే మనుషుల అస్థికలను అంతరిక్షంలోకి పంపుతోంది. ఇప్పుడు పెంపుడు జంతువులకు కూడా విస్తరించాలని నిర్ణయించింది. అయితే పెంపుడు జంతువుల అస్థికలను అంతరిక్షంలోకి పంపడానికి సుమారు రూ. 60 వేలు ఛార్జ్ చేస్తుంది సెలెస్టిస్. అదే చంద్రమండలం మీదకు పంపాలంటే రూ. 7.5 లక్షలు (12,500 డాలర్లు) వసూలు చేస్తుంది. -
పెట్‌తో సన్నిహితం!
డాక్టర్ సలహా నా వయసు 40 ఏళ్లు. ఈ గత ఆరు నెలలుగా దగ్గు, ఆయాసం వస్తున్నాయి. చర్మం మీద దద్దుర్లు కూడా వస్తున్నాయి. నాకు నా పెట్(కుక్కపిల్ల)ని ఒళ్లో పెట్టుకునే అలవాటు ఉంది. అది గోళ్లతో నా ఒంటి మీద గీకుతూ ఉంటుంది, దాని ముఖాన్ని నా ముఖం మీద ఆనిస్తూ ఉంటుంది. నా ఆరోగ్య సమస్యలకు ఈ అలవాటే కారణం కావచ్చా? నాకు గతంలో ఇలాంటి సమస్యలేవీ లేవు. ఏడాది కాలంగా పెట్ని పెంచుకోవడం మొదలు పెట్టాను. మా పెట్‌కి వ్యాక్సిన్లు వేయిస్తున్నాను. - ఎమ్. నీరజ, హనుమాన్ జంక్షన్ మీ సమస్యకు ఆస్త్మా కారణం కావచ్చు, ముందుగా బ్లడ్‌టెస్ట్ (హిమోగ్రామ్), ఎక్స్‌రే (ఛాతీ), లంగ్ ఫంక్షన్ టెస్ట్, ఈసిజి (టు డి ఎఖో), బిపి పరీక్షలు చేయాలి. ఈ పరీక్షల నివేదికలన్నీ నార్మల్‌గా ఉంటే అప్పుడు మీకు పెట్ కారణంగానే ఈ సమస్య వచ్చినట్లు అనుకోవాలి. పెట్స్‌తో సన్నిహితంగా మెలగడం వల్ల కొందరిలో హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్స్ వస్తాయి. దాంతో మీరు పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తాయి. ఈ విషయాన్ని నిర్ధారించుకోవడానికి మీరు కొంతకాలం పెట్స్‌కు దూరంగా ఉండి మార్పును గమనించాలి. కుక్కలు ఇంట్లో తిరుగుతుంటే వాటి నుంచి కొన్ని పరాన్నజీవులు మనుషుల్లోకి ప్రవేశిస్తాయి. ఇవి దేహంలో చాలా అవయాల మీద ప్రభావం చూపిస్తాయి. ముందుగా చిన్న సిస్ట్లు ఏర్పడి క్రమంగా అవి పెద్దవుతూ దేహంలో కొంత స్పేస్‌ని ఆక్రమిస్తాయి. ఏ అవయవంలో సిస్ట్ ఏర్పడితే ఆ అవయవం రోగగ్రస్తమవుతుంది. కొందరిలో లివర్ పెరగడం, జ్వరం రావడం, ఊపిరితిత్తుల్లో ఉంటే దగ్గు రావడం, మెదడులో ఏర్పడితే ఫిట్స్, తలనొప్పి రావడం, వాంతులు వంటి సమస్యలు వస్తుంటాయి. ఈ సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికే ముప్పు కలుగుతుంది. కుక్క పరిశుభ్రంగా లేకపోతే దాని నుంచి పరాన్న జీవులు మనిషి శరీరంలోకి ప్రవేశించడానికి అవకాశం మరీ ఎక్కువ. కుక్కల నుంచి సంక్రమించే ఇకైనో కోకస్ అనే పరాన్నజీవిని నివారించే వ్యాక్సిన్ ఏదీ ఇంతవరకు అందుబాటులోకి రాలేదు. - డాక్టర్ గోవర్ధన్, సీనియర్ ఫిజీషియన్ -
పీఈటీ వేధింపులపై విచారణ
ఆనందపురం, న్యూస్‌లైన్ : మండలంలోని శొంఠ్యాం హైస్కూల్లో ఓ విద్యార్థినిపై వ్యాయామోపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని వచ్చిన ఆరోపణలపై బుధవారం డిప్యూటీ డీఈఓ రేణుక విచారణ జరిపారు.పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై పీఈటీ బి. సత్యం లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనితో డిప్యూటీ డీఈవో విచారణ జరిపారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన ఆ విద్యార్థిని ప్రాక్టీస్ సరిగా చేయటం లేదని మందలించడంతో పాటు పీఈటీ చేయి చేసుకున్నట్టు, లైంగిక వేధింపులు జరగలేదని విచారణలో బయటపడిందని డిప్యూటీ డీఈఓ రేణుక తెలిపారు.