పెంపుడు కుక్కను భర్త తరిమేశాడని భార్య ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన గురువారం తమిళనాడులోని నమక్కల్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుక్కలను అమితంగా ప్రేమించే శాంతి అనే మహిళ 'కన్నీ' అనే కుక్కను కొన్నేళ్ల నుంచి పెంచుకుంటోంది. కన్నీని ఇంట్లో ఉంచుకోవడం ఇష్టం లేని ఆమె భర్త దాన్ని, కొత్తగా పుట్టిన కుక్కపిల్లను బయటకు తీసుకువెళ్లి వదిలేసి వచ్చాడు.
దీంతో మనస్తాపం చెందిన మహిళ ఒంటికి నిప్పంటించుకుంది. దాదాపు 85 శాతం శరీరం కాలిపోయిందని, ప్రస్తుతం నమక్కల్ జిల్లా ఆసుపత్రిలో వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తాజాగా ఓ మెడికో విద్యార్ధి కుక్క మేడ మీది నుంచి పడేసిన ఘటన మరువకు ముందే ఈ ఘటన జరగడంతో జంతుప్రేమికులు దీనిని ఖండిస్తున్నారు.
భర్త కుక్కను వదిలేసి వచ్చాడని..
Published Fri, Jul 8 2016 2:24 PM | Last Updated on Sat, Sep 29 2018 4:26 PM
Advertisement
Advertisement