
సాక్షి, హైదరాబాద్: పెంపుడు కుక్క చనిపోయిందని మనో వేదనతో డిగ్రీ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు... అల్వాల్ రిట్రిట్ కాలనీకి చెందిన లక్ష్మీ నారాయణ కుమారుడు విష్ణు నారాయణ (20) డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. సోమవారం రాత్రి అతను తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఉదయం విష్ణు గదిలో నుంచి బయటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు బలవంతంగా తలుపులు తెరిచి చూడగా సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు. తన కుమారుడు కొంత కాలంగా మనోవేదనతో బాధపడుతున్నాడని ఇటీవల పెంపుడు కుక్క చనిపోవడంతో తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడని ఈ కారణంగానే ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. విష్ణు నారాయణ రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: రైల్వే ట్రాక్‌పై ఇంజినీరింగ్ విద్యార్థి.. కాలేజీకి వెళ్తున్నానని చెప్పి..
ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com