alwal
-
ప్రజల కోసమే ఒక మెట్టు దిగా.. రాజకీయాల కోసం కాదు: రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాజీవ్ రహదారిపై ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. సికింద్రాబాద్‌లోని అల్వాల్ టిమ్స్ (TIMS) సమీపంలో సీఎం భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రాజీవ్ రహదారిపై 11 కిలోమీటర్ల పొడవుతో 6 లేన్లతో భారీ ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించనున్నారు. రూ. 2,232 కోట్లతో ఈ పనులను చేపట్టనున్నారు. ఈ కారిడార్ పూర్తయితే.. హైదరాబాద్ నుంచి సిద్దిపేట, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ వైపు వెళ్లే వారికి ప్రయాణం సులభం కానుంది. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. ఎలివేటేడ్ కారిడార్ పూర్తయితే మేడ్చల్ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. దీని ద్వారా మేడ్చల్, కుత్బుల్లాపూర్, కరీంనగర్, ఆదిలాబాద్ ప్రయాణం సులభతరం అవుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణతో ఈ ప్రాజెక్టు ఆలస్యమైందని రేవంత్ విమర్శించారు. ప్రజల అవసరాన్ని మర్చిపోయి గత ప్రభుత్వం కేంద్రంతో గిల్లికజ్జాలు పెట్టుకుని ప్రాజెక్టును పక్కనబెట్టిందని మండిపడ్డారు. తాము అధికారంలోకి రాగానే కేంద్రంతో మాట్లాడి సమస్యను పరిష్కరించామని చెప్పారు. ప్రధాని మోదీని, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసి ప్రాజెక్టు అవసరాన్ని వివరించామని చెప్పారు. చదవండి: 15 నుంచి తెలంగాణలో ఒంటిపూట బడులు భైముల కేటాయింపు, చాంద్రాయణగుట్ట రక్షణశాఖ భూముల లీజ్ రెన్యూవల్ చేయకుండా గత ప్రభుత్వం జాప్యం చేసిందన్నారు సీఎం రేవంత్. తమ ప్రభుత్వమే అధికారులతో సమీక్షించి రక్షణ శాఖకు భూములు అప్పగించామని తెలిపారు. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడంతో కేంద్రం రాష్ట్రానికి సహకరించిందన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ దిక్కుమాలిన విధానాలతో ప్రజలకు శిక్ష పడిందని దుయ్యబట్టారు. ‘ఈ ఎలివేటేడ్ కారిడార్ ఉత్తర తెలంగాణ అభివృద్ధికి ముఖద్వారం. ఉత్తర తెలంగాణ అభివృద్ధి చెందాలంటే ఎలివేటేడ్ కారిడార్ పూర్తవ్వాలి. ప్రజల అవసరాల కోసమే ఒక మెట్టు దిగా.. రాజకీయాల కోసం కాదు. అభివృద్ధి కోసం మెట్టు దిగడంలో తప్పు లేదు. బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్‌లో ఏదైనా ఒక శాశ్వత అభివృద్ధి చేశారా? ఈ నగరంలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది కాంగ్రెస్ పాలనలోనే. కేసీఆర్ హయాంలో గంజాయి, డ్రగ్స్, పబ్బులు తప్ప ఏం రాలేదు. అభివృద్ధి కోసం భవిష్యత్తులోనూ కేంద్రాన్ని అడుగుతూనే ఉంటాం. కేంద్రం సహకరించకపోతే కొట్లాడుతాం. ఈ నగరాన్ని అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చేస్తాం. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు. ఎన్నికలు ముగిశాక అభివృద్ధి మా లక్ష్యం. రాబోయే రోజుల్లో కంటోన్మెంట్ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేస్తాం. మా పోరాటం ఫలించిందని కేటీఆర్ అంటుండు.. ఏం పోరాటం చేసిండు. ట్విట్టర్లో పోస్టులు పెట్టుడా? మేం అనుమతులు తీసుకొస్తే ఆయన పోరాటం అని చెప్పుకుంటుండు.ఈ వేదికగా కేటీఆర్‌కు నేను సూచన చేస్తున్నా. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ఇందిరా పార్కు వద్ద కేటీఆర్ ఆమరణ దీక్ష చేయాలి. కేటీఆర్ చచ్చుడో అభివృద్ధికి నిధులు వచ్చుడో తేలే వరకు దీక్ష చేయాలి. ఆయన దీక్షకు దిగితే మా కార్యకకర్తలే ఆయన్ను కంచె వేసి కాపాడుతారు.’ అని రేవంత్ పేర్కొన్నారు. -
హైదరాబాద్ ఆల్వాల్ లో డీసీఎం వ్యాన్ బీభత్సం
-
Hyd: అల్వాల్‌లో డీసీఎం బీభత్సం.. బాలుడి మృతి
సాక్షి,హైదరాబాద్: సికింద్రాబాద్ అల్వాల్‌లో గురువారం మధ్యాహ్నం డీసీఎం వ్యాన్ బీభత్సం సృష్టించింది. స్థానికంగా ఉన్న ఓ సూపర్ మార్కెట్‌కు సరకులు తీసుకు వచ్చిన డీసీఎం వ్యాన్ పాదచారులపైకి దూసుకొచ్చింది. ఇదే సమయంలో తల్లితో నడుచుకుంటూ అటువైపు వెళుతున్న తిరుపాల్ (9)ని ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తిరుపాల్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. డీసీఎం వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదం తర్వాత వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదీ చదవండి.. నిర్మల్ జిల్లాలో దారుణం.. ప్రియురాలి హత్య -
మల్కాజిగిరి నియోజకవర్గం అల్వాల్ లో మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రచారం
-
Himaja Reddy: అల్వాల్‌లో షాప్ ఓపెనింగ్ చేసిన హిమజ (ఫోటోలు)
-
గద్దర్ అంత్యక్రియల్లో విషాదం
సాక్షి, హైదరాబాద్: ప్రజా గాయకుడు గద్దర్ అంత్యక్రియల్లో మరో విషాదం చోటు చేసుకుంది. కడసారి చూపు కోసం వచ్చిన అభిమానులతో ఆల్వాల్‌లోని గద్దర్ ఇంటి వద్ద తోపులాట జరిగింది. ఈ తోపులాటలో గద్దర్‌కు అత్యంత ఆప్తుడిగా పేరున్న జహీరుద్దీన్ అలీఖాన్ మృతి చెందారు. గద్దర్ కడసారి చూపు కోసం భారీగా అభిమానులు వచ్చారు. పోలీసులు వాళ్లను నియంత్రించలేకపోవడంతో తోపులాట జరిగింది. ఈ తోపులాటలో సియాసత్ ఉర్దూ ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్ కింద పడిపోయి ఉక్కిరి బిక్కిరి అయ్యారు. వెంటనే పక్కనే ఉన్న ప్రాథమిక చికిత్స కేంద్రానికి తరలించగా.. ఆయన చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. సియాసత్ ఉర్దూ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్. గద్దర్‌కు అత్యంత సన్నిహితుడు. గద్దర్ అంత్యక్రియలకు హాజరై.. ఎల్బీ స్టేడియం నుంచి పార్థివదేహంతో పాటే వాహనంలో ఆల్వాల్ ఇంటి వద్దకు చేరుకున్నారు. అయితే.. ఇంటి దగ్గర కిక్కిరిసిన జనం మధ్య ఆయన కింద పడిపోయారు. ఊపిరాడక అస్వస్థతకు గురయ్యారు. కార్డియాక్ అరెస్ట్‌తోనే జహీరుద్దీన్ మృతి చెందినట్లు తెలిపారు. -
ముగిసిన గద్దర్ అంత్యక్రియలు
►గద్దర్ అంత్యక్రియలు ముగిశాయి.. రాత్రి 8గంటల ప్రాంతంలో అధికారిక లాంఛనాలతో బౌద్ధ మత ఆచారంలో గద్దర్ అంత్యక్రియలు నిర్వహించారు. ► గద్దర్ అంత్యక్రియల్లో తోపులాట జరిగింది. ఈ తోపులాటలో గద్దర్‌కు అత్యంత ఆప్తుడిగా పేరున్న జహీరుద్దీన్ అలీఖాన్ మృతి చెందారు. ► బౌద్ధ ఆచారాల ప్రకారం గద్దర్ అంత్యక్రియలు.. ► గద్దర్ అంత్యక్రియలకు భారీగా తరలివచ్చిన జనం.. అభిమానులను అదుపుచేయలేక పోతున్న పోలీసులు.. ► గద్దర్ ఇంటికి చేరుకున్న సీఎం కేసీఆర్.. ఘనంగా నివాళులు అర్పించారు. గద్దర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ► అల్వాల్‌కి చేరుకున్న అంతిమ యాత్ర ► పార్టీలకు అతీతంగా అంతిమ యాత్రలో పాల్గొన్న నేతలు ► సికింద్రాబాద్ జేబీఎస్ బస్టాండ్‌కు గద్దర్ అంతిమయాత్ర చేరుకుంది. అశేష జనవాహిని మధ్య అంతిమయాత్ర కొనసాగుతోంది. ►మధ్యాహ్నం 2.30 నిమిషాల తరువాత సీఎం కేసీఆర్ గద్దర్ ఇంటికి చేరుకోనున్నారు. ►కాసేపట్లో మహా భోది విద్యాలయ లో గద్దర్ అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. పోలీసులు పాఠశాల ప్రాంగణానికి చేరుకున్నారు. రిహార్సల్ నేపథ్యంలో సెట్ రైట్ అయిన పోలీసులు. ప్రభుత్వ లాంచనాలతో మధ్యాహ్నం గద్దర్ అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. ►అమరవీరుల స్థూపం వద్దకు చేరుకున్న గద్ధర్ అంతిమ యాత్ర ► గద్దర్ అంతిమ యాత్రలో కళాకారులు, అభిమానులు భారీగా పాల్గొన్నారు. అంతిమ యాత్ర సందర్భంగా పోలీసులు అల్వాల్ భూదేవినగర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లిస్తున్నారు. ► గద్దర్ అంతిమ యాత్ర వాహానానికి జై బీం జెండాలతో పాటు బుద్దిడి పంచశీల జెండాలను జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాటు చేశారు. ►ఎల్బీ స్టేడియం నుంచి గద్దర్ అంతిమయాత్ర ప్రారంభమైంది. గన్‌పార్క్, అసెంబ్లీ, నెక్లెస్‌రోడ్‌లోని అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్మారక స్థూపం, ట్యాంక్‌బండ్, జేబీఎస్, తిరుమల మీదుగా అల్వాల్ చేరనుంది. గద్దర్ ఇంటివద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజా యుద్ధనౌక గద్దర్ మరణంతో తెలంగాణ పాట మూగబోయింది. పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా ఆయన మృతి పట్ల అందరూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సందర్శనార్థం ప్రస్తుతం గద్దర్ పార్థివదేహాన్ని ఎల్బీ స్టేడియంలో ఉంచారు. గద్దర్ పార్థివ దేహాన్ని ప్రముఖులు సందర్శించి నివాళులు ఘటించారు. ► అల్వాల్ భూదేవి నగర్‌లోని మహాభోది విద్యాలయంలో గద్దర్ అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. మహాభోధి విద్యాలయంలోని గ్రౌండ్ వెనకాల సమాధి కోసం చేస్తున్న ఏర్పాట్లను గద్దర్ కూతురు వెన్నెల దగ్గరుండి చూసుకుంటున్నారు. ఏర్పాట్లను డీసీపీ సందీప్‌రావు పరిశీలిస్తున్నారు. ►గద్దర్ పార్థివదేహానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాళులు అర్పించారు. ఆయనతోపాటు కాంగ్రెస్ తెలంగాణ ఇంచార్జ్ మానిక్ రావు థాక్రే, జానారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్లు అంజనీ కుమార్ యాదవ్, అజారుద్దీన్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు, బూర న్సయ్య గౌడ్, గరికపాటి నర్సింహరావు నివాళులు అర్పించారు, ►గద్దర్ అంతిమ యాత్ర వాహానాన్ని జీహెచ్ఎంసీ అధికారులు. సిద్ధం చేశారు. వాహానానికి జై బీం జెండాలతో పాటు బుద్దిడి పంచశీల జెండాలను ఏర్పాటు చేశారు. గద్దర్ పార్దివదేహానికి వీచ్ హనుమంతరావు నివాళులు అర్పించారు ►రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని ఖమ్మం సభలో దివించారు: వీహెచ్ ►గద్దర్ మరణం పట్ల రాహుల్ తన ఆవేదన తెలియజేశారు. ►గద్దర్ చనిపోయినా గద్దర్ కోరుకున్నట్లు గా రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు.. గద్దర్ చనిపోవడం బాధాకరం: మాజీమంత్రి జానారెడ్డి ► గద్దర్‌కు ఉన్న స్ఫూర్తి యువత నేర్చుకోవాలి. ►నేను హోం శాఖామంత్రిగా మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపిన్నప్పుడు గద్దర్ సూచనలు సేకరించాం. ►తన సూచనాలతోనే అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులను హైదరాబాద్‌కు రప్పించాం. ►మావోయిస్టులతో ప్రభుత్వం చర్చల్లో గద్దర్ మధ్యవర్తిత్వం వహించారు. ►అమరుల కుటుంబాలకు న్యాయం చేయాలని ఎన్నోసార్లు నన్ను ఆనాడు కలిశాడు ►గద్దర్ పార్థివ దేహానికి సుప్రీంకోర్టు మాజీ సీజే ఎన్వీరమణ నివాళులు అర్పించారు. గద్దర్ తన రూమ్ మెట్ అని, రిటైర్మెంట్ తర్వాత తనను రాజకీయాల్లో రావాలని గద్దర్ కోరారని చెప్పారు. ► ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ నివాళులు అర్పించారు. ►గద్దర్ పార్ధివదేహానికి తెలంగాణ విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాళులు అర్పించారు. ►ఎల్బీ స్టేడియంలో గద్దర్ పార్థివ దేహానికి టీపీసీ రేవంత్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే రాజయ్య, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ మండలి చైర్మన్ స్వామి గౌడ్, ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, తదితరులు నివాళులు అర్పించారు. ►నటుడు మోహన్ బాబు, బండ్ల గణేష్, మంచు మనోజ్, సింగర్ మధు ప్రియ గద్దర్‌కు నివాళులు అర్పించారు. ►అల్వాల్‌లోని గద్దర్ నివాసం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు అర్పిస్తారు. ►తెలంగాణ ఉద్యమంలో గద్దర్ కీలక పాత్ర పోషించారు. 74 ఏళ్ల వయసులో కూడా గోష్టిగొంగడితో సమాజాన్ని మేల్కొలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా: స్పీకర్ పోచారం ►గద్దర్ అంటే మెదక్.. మెదక్ అంటే ఉద్యమాలు: ఎమ్మెల్యే రఘునందన్ రావు ►వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని గద్దర్ కోరుకున్నారు. ►4 దశాబ్దాల ఆశయ సాధక కోసం పోరాటం చేసి.. దానికి దూరం అయ్యారు. ►గద్దర్ కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నా. గద్దర్ మృతి బాధాకరం: కిషన్ రెడ్డి గద్దర్ పార్ధివ దేహానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాళులు అర్పించారు. గద్దర్ మృతి బాధాకరమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సమస్యలపై తిరుగులేని పోరాటం చేసిన ఉద్యమకారుడని కొనియాడారు. తన గొంతు ద్వారా తెలుగు సమాజానికే కాకుండా యావత్ భారతదేశానికి రోల్‌మాడల్‌గా నిలిచారని ప్రశంసించారు. గద్దర్ అనారోగ్యంతో మృతి చెందడం ప్రతి ఒక్కరికి బాధ కలిగించిన విషయమని అన్నారు. ‘నాకు గద్దర్‌తో వ్యక్తిగతంగా మంచి సంబంధం ఉంది. నేను లేకున్నా మా ఇంటికి వచ్చి భోజనం చేసే వాళ్ళు. ఆయన ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ఉండాలి అని కోరుకున్నటువంటి వ్యక్తి. * ఆయన కలగన్న రాజ్యం రాకముందే స్వర్గస్తులయ్యారు. చివరి కోరిక తిరకముందే కాలం చెల్లించారు. గద్దర్ మనల్ని విడిచి వెళ్లిపోవడం దూరంగా మరి వెళ్లిపోవడం నిజంగా తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ సమాజాని, కవులు, కళాకారులకు, తెలంగాణ ఉద్యమకారులకు, మేధావులకు ఎంతో బాధాకరం. గద్దర్ ఆకస్మిక మృతికి భారతీయ జనతా పార్టీ తెలంగాణ వారి ఆత్మ శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం’ అని తెలిపారు సాక్షి, హైదరాబాద్: గద్దర్ అంతిమయాత్ర మధ్యాహ్నం 12 గంటలకు ఎల్బీనగర్ స్టేడియం నుంచి ప్రారంభం కానుంది. కళాకారులతో భారీ ర్యాలీగా గద్దర్ పార్థివదేహాన్ని తీసుకెళ్లనున్నారు. కళాకారులు, ఉద్యమకారులు, పలు రాజకీయ పార్టీ నేతలు ఈ అంతిమయాత్రలో పాల్గొననున్నారు. స్టేడియం నుంచి బషీర్‌బాగ్ చౌరస్తా, జగ్జీవన్‌రామ్ విగ్రహం మీదుగా.. గన్‌పార్క్ వైపు సాగనుంది. గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్దకు గద్దర్ పార్ధివ దేహం చేరుకోగా.. కాసేపు అక్కడ పాటలతో కళాకారులు నివాళులు అర్పించనున్నారు. అనంతరం అమరవీరుల స్థూపం నుంచి సికింద్రాబాద్ మీదుగా భూదేవినగర్‌లోని తన నివాసానికి చేరుకోనుంది. అల్వాల్్ మహాబోధి గ్రౌండ్స్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. -
GHMC ఆఫీస్ లో పాము
-
HYD: పట్టించుకోవట్లేదని పామును వదిలాడు
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలకు నగరం అతలాకుతలం అవుతోంది. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు వచ్చి చేరుతోంది. డ్రైనేజీ వ్యవస్థలు బాగా లేకపోవడంతో.. మురుగు నీరు ఇళ్లలోకి వచ్చి చేరుతోంది. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అల్వాల్ ప్రాంతంలో అయితే పరిస్థితి దారుణంగా ఉంది. ఇందుకు సంబంధించి ఫిర్యాదులు వెళ్తున్నా జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవట్లేదట. అందుకే ఓ సామాన్యుడు దూకుడు చర్యకు దిగాడు. అల్వాల్ ప్రాంతంలో ఓ ఇంట్లోకి వాన నీటి కారణంగా పాము వచ్చిందట. దీంతో వాళ్లు GHMC అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే.. ఆరు గంటలు గడిచినా ఎలాంటి స్పందన రాకపోవడంతో సంపత్ కుమార్ అనే యువకుడికి ఓపిక నశించింది. అందుకే నేరుగా అల్వాల్ GHMC వార్డు ఆఫీసుకు పామును తీసుకొచ్చాడు. టేబుల్ పై పామును పెట్టి నిరసన తెలిపాడు. పామును చూసి అధికారులు తలో దిక్కు పరుగులు తీశారు. మరి ఇంత ఘోరమా అంటూ ఆ యువకుడు అధికారులను నిలదీయడం.. ఓ వీడియో రూపంలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై అధికారుల స్పందన తెలియాల్సి ఉంది. -
సికింద్రాబాద్ అల్వాల్ లో కారు బీభత్సం
-
మేనరికపు పెళ్లి వల్లే పిల్లలకు అనారోగ్యం.. ఎంత పని చేశావ్ అమ్మా!
సాక్షి, అల్వాల్: కడుపున పుట్టిన ముగ్గురు బిడ్డలూ అల్పాయుష్షుతోనే కన్నుమూశారు. ప్రస్తుతం జన్మనిచిన కవలలూ అనారోగ్యానికి గురయ్యారు. మేనరికపు పెళ్లి కారణంగానే పిల్లలు ఆయుర్దాయం లేకుండా చనిపోతున్నారని ఆవేదనకు గురైంది ఆ తల్లి. భవిష్యత్‌లో తాను మాతృమూర్తిగా మనగలిగే పరిస్థితి ఉండదని భావించిన ఆమె పదిరోజుల వయసున్న పసికందులను ఇంటి ఆవరణలోని సంపులో పడేసి తానూ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖానాజీగూడ శివనగర్‌లో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లాకు చెందిన నర్సింగ్‌రావుకు మేనమామ కూతురు సంధ్యారాణితో 2012లో వివాహమైంది. 5 సంవత్సరాల అనంతరం ఇద్దరు కవల పిల్లలు జన్మించి అనారోగ్యంతో చనిపోయారు. 2018లో పుట్టిన కొద్ది రోజులకే కూతురు మరణించింది. అనంతరం ఈ నెల 11న ఇద్దరు కవల (మగ, ఆడ) పిల్లలు జన్మించారు. వీరు సైతం అనారోగ్యానికి గురయ్యారు. బాబుని కొంపల్లిలోని ఓ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. 14వ తేదీన ఇంటికి తీసుకువచ్చారు. పుట్టిన పిల్లలందరూ అనారోగ్యానికి గురవుతూ మృత్యువాత పడుతుండడం.. ఈ ఇద్దరు పసికందులు కూడా దక్కకుండాపోతారేమోనని భావించిన సంధ్యారాణి.. ఆదివారం రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో ఇంటి ఆవరణలో ఉన్న సంపులో వారిని పడేసి తాను కూడా ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో అర్ధరాత్రి సంధ్యారాణి కనిపించకపోడంతో కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటి పరిసరాలను పరిశీలిస్తూ సంపులో వెతకగా సంధ్యారాణి, ఇద్దరు పిల్లల మృతదేహాలు సంపులో కనిపించాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మేనరికపు పెళ్లి వల్లే పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారని భావించి ఈ ఘాతుకానికి పాల్పడుతున్నట్లు రాసి ఉన్న సూసైట్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా.. ఈ ఘటనపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చదవండి: Crime: ‘పిన్నమ్మా.. నాకు పెళ్లి చెయ్యవా?’ -
శెభాష్ జునియా! సాహస బాలికకు నేషనల్ బ్రేవరీ అవార్డు
సాక్షి, హైదరాబాద్ (అల్వాల్): ఆడపిల్ల అబల కాదు సబల అని నిరూపించింది అల్వాల్‌కు చెందిన జునియా ఈవ్లిన్. బాలిక జునియా ప్రదర్శించిన ధైర్య సాహసాలకు ఇండియన్ కౌన్సిల్ ఫర్ చైల్డ్ వెల్ఫేర్ (ఐసీసీడబ్యూ) సంస్థ ఏటా అందించే సాహస బాలల పురస్కారాన్ని అందజేసింది. గణతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జునియా ఈవ్‌లిన్‌కు ఈ నెల 17న ఢిల్లీలో పురస్కారాన్ని అందజేసింది. ప్రమాదం జరిగిన సమయంలో ఎలాంటి భయందోళనకు గురికాకుండా తనను తాను రక్షించుకొని తండ్రి, తమ్ముడిని కాపాడుకోవడంతోపాటు తోటివారిని రక్షించించి సాహస బాలల పురస్కారాన్ని అందుకుంది. వివరాలివీ... మచ్చబొల్లారంలో నివసించే జోసఫ్‌రాయ్, అభిజేర్‌ల కుమార్తె జునియా ఆవ్‌లిన్(14) అల్వాల్‌లోని సెయింట్ మైఖేల్ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. 2022 ఆగస్టు 15న జునియా తన తండ్రి, తమ్ముడితో కలిసి ఆర్టీసీ బస్సులో హైదరాబాద్ నుంచి నంద్యాలకు బయలుదేరింది. మార్గమధ్యలో బస్సు ప్రమాదానికి గురైంది. ఈ సమయంలో జునియా తలకు గాయమైంది. తండ్రి అపస్మారక స్థితికి చేరాడు. తమ్ముడు స్పృహ తప్పి పడిపోయారు. ఈ సమయంలో జునియా ధైర్యాన్ని కోల్పోకుండా తనను తాను రక్షించుకొని తండ్రి, సోదరుడికి సపర్యలు చేసి వారు స్పృహలోకి వచ్చేలా చేసింది. అనంతరం ఆటోలో ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించింది. మరో ప్రయాణికురాలు, ఇద్దరు చిన్నారులను బయటకు తీసుకురావడానికి ప్రయత్నించి సఫలం అయింది. అనంతరం ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్న జునియా తలకు అయిన గాయానికి మూడు కుట్లు వేశారు. ఈ నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఫర్ చైల్డ్ వెల్ఫేర్ సంస్థ ఏటా అందించే సాహస బాలల పురస్కారాన్ని జునియా ఈవ్‌లిన్‌కు అందజేసింది. తన కూతురి ధైర్య సాహసానికి గర్వపడుతున్నానని ఈ సందర్భంగా తండ్రి జోçసఫ్‌రాయ్ ఆనందం వ్యక్తం చేశారు. చదవండి: సికింద్రాబాద్ అగ్ని ప్రమాదం ఎఫెక్ట్.. ప్రభుత్వం కీలక నిర్ణయం! -
Medchal: పెళ్లై ఆరు నెలలు గడవకముందే యువకుడి ఆత్మహత్య
సాక్షి, మేడ్చల్: పెద్దలను ఒప్పించి మరీ ప్రేమ వివాహం చేసుకున్న ఓ యువకుడు పెళ్లైన ఆరు నెలలు తిరగకముందే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది. వనపర్తి జిల్లాకు చెందిన వినయ్ అనే వ్యక్తి ఓ యువతిని ప్రేమించాడు. ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. అనంతరం తన భార్యతో కలిసి హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని వెంకటాపురంలో కాపురం పెట్టాడు. దంపతుల మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ.. వినయ్ ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం రాత్రి వినయ్ ఇంటి నుండి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా వినయ్ ఫ్యానుకు ఉరేసుకొని విగత జీవిగా కనిపించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కి తరలించారు. కాగా అయిదు రోజుల క్రితమే వినయ్ ఆత్మహత్య చేసుకొని ఉండచ్చని పోలీసులు భావిస్తున్నారు. పెళ్లైన ఆరు నెలలకే యువకుడు ఆత్మహత్య చేసుకోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. వినయ్ ఆత్మహత్య విషయాన్ని పోలీసులు అతని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అయితే భార్య వేధింపుల కారణంగానే వినయ్ ప్రాణం తీసుకున్నాడని అతడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. కుటుబం సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: యువతి కిడ్నాప్ కేసు.. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు -
హైదరాబాద్ నుంచి విదేశాలకు డ్రగ్స్
అల్వాల్: హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలకు డ్రగ్స్‌ను కొరియర్ ద్వారా తరలిస్తున్న ఐదుగురు సభ్యుల అంతర్జాతీయ ముఠాను రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. వారివద్ద నుండి 9 కోట్ల రూపాయల విలువ చేసే 8.5 కేజీల సుడోపెడ్రిస్ అనే సింథటిక్ డ్రగ్‌ను స్వాధీనం చేసుకొన్నారు. రాచకొండ సీపీ మహేష్ భగవత్ వివరాలను మీడియాకు వెల్లడించారు. తమిళనాడుకు చెందిన రహీమ్, ఫరీద్, ఫైజల్ అనే వ్యక్తులు ప్రధాన సూత్రదారులుగా హైదరాబాద్, మహారాష్ట్ర కేంద్రాలుగా ఈ ముఠా కొనసాగుతోంది. సింథటిక్ డ్రగ్‌ను లుంగీల ప్యాకెట్ పేరుతో కొరియర్ ద్వారా ఇతర దేశాలకు సరఫరా చేస్తున్నారు. పక్కా సమాచారం ప్రకారం నాచారం పోలీసుల సహకారంతో మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు ఈ రాకెట్‌ను ఛేదించారు. ఈ డ్రగ్ ఒక కేజీ బహిరంగ మార్కెట్లో సుమారు కోటి రూపాయలకు విక్రయిస్తారన్నారు. రాబోయే కొత్త సంవత్సర వేడుకలను దృష్ట్రిలో పెట్టుకొని ఈ ముఠా విచ్చలవిడిగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు సీపీ తెలిపారు. -
‘బాలాపూర్’.. బలాదూర్!
అల్వాల్: నగరశివారులో ఉన్న బాలాపూర్ గణపతి మండపంలోని లడ్డూ వేలంపాటలో ఈసారి రూ.24.60 లక్షలు పలుకగా, అల్వాల్ కానాజీగూడ లడ్డూ దానిని బ్రేక్ చేసింది. కానాజీగూడకు చెందిన మరకత శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ మండపంలో లడ్డూను నగరానికి చెందిన డాక్టర్ తాళ్లూరు వెంకట్రావు, గీతప్రియ దంపతులు రూ.45,99,999కి దక్కించుకున్నారు. వెంకట్రావు విదేశాలలో లార్డ్ ఇన్స్టిట్యూషన్స్, లోక్ప్రదీప్ విద్యాసంస్థలను నిర్వహిస్తున్నారు. ఈ దంపతులు ఆ ఆలయానికి గత కొంతకాలంగా భక్తులుగా ఉన్నారు. గతేడాది కూడా వీరే రూ.17,81,999కు ఇక్కడి లడ్డూను దక్కించుకున్నారు. ఈసారి కూడా పలువురు వేలంపాటలో పాల్గొనగా, చివరికి వెంకట్రావు దంపతులే రికార్డు స్థాయిలో పాటపాడి లడ్డూను సొంతం చేసుకున్నారు. మరకత గణపతిపై అచంచల విశ్వాసం ఉందని, ఈ లడ్డూను దక్కించుకోవడం వల్ల తమకు మరింత మేలు జరుగుతుందన్న విశ్వాసం ఉందని వారు అన్నారు. వేలం ద్వారా వచ్చిన లడ్డూ ఆదాయాన్ని ఆలయ అభివృద్ధికి, నిత్యాన్నదానానికి ఉపయోగిస్తామని ఆలయ నిర్వాహకులు మోత్కూరు సత్యనారాయణశాస్త్రి తెలిపారు. -
పెంపుడు కుక్క చనిపోయిందని.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: పెంపుడు కుక్క చనిపోయిందని మనో వేదనతో డిగ్రీ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు... అల్వాల్ రిట్రిట్ కాలనీకి చెందిన లక్ష్మీ నారాయణ కుమారుడు విష్ణు నారాయణ (20) డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. సోమవారం రాత్రి అతను తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం విష్ణు గదిలో నుంచి బయటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు బలవంతంగా తలుపులు తెరిచి చూడగా సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు. తన కుమారుడు కొంత కాలంగా మనోవేదనతో బాధపడుతున్నాడని ఇటీవల పెంపుడు కుక్క చనిపోవడంతో తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడని ఈ కారణంగానే ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. విష్ణు నారాయణ రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: రైల్వే ట్రాక్‌పై ఇంజినీరింగ్ విద్యార్థి.. కాలేజీకి వెళ్తున్నానని చెప్పి.. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
పిచ్చికుక్కలు స్వైరవిహారం...20 మంది పై దాడి
సాక్షి, హైదరాబాద్/అల్వాల్: ఓల్డ్ అల్వాల్ ప్రెసిడెన్సీ కాలనీలో పిచ్చికుక్కలు స్వైరవిహారం చేశాయి. కుక్కల దాడిలో దాదాపు 20 మందికి పైగా కాలనీ వాసులు తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. బుధవారం రాత్రి కాలనీలో పాదచారులు, బయట ఆడుకుంటున్న చిన్నారులపై దాదాపు మూడు పిచ్చి కుక్కలు దాడి చేశాయి. ఫలితంగా కాలనీలో నివసించే వారితో పాటు అటుగా వెళ్తున్న పాదచారులు సైతం తీవ్ర గాయాల పాలయ్యారు. దాదాపు 20 మందికి పైగా కుక్కల దాడిలో గాయపడ్డారు. గాయత్రి అనే అయిదేళ్ల చిన్నారిపై పిచ్చి కుక్క విచుకుపడటంతో ఆమె ముఖంపై తీవ్ర గాయమై పెద్ద ఎత్తున రక్తస్రావం జరిగింది. కాలనీలో గురువారం ఉదయం వరకు పిచ్చికుక్కలు వీరంగం చేశాయి. దీంతో జీహెచ్ఎంసి సిబ్బంది కుక్కలను పట్టుకువెళ్లారు. కుక్కల బెడద తప్పేదెప్పుడు..? కుక్కల సంతాన నియంత్రణకు, ప్రజలు కుక్కకాట్ల బారిన పడకుండా ఉండేందుకు ఏటా దాదాపు రూ.10 కోట్లు జీహెచ్ఎంసీ ఖర్చు చేస్తున్నప్పటికీ, నగరంలో పిచ్చి కుక్కల బెడద తప్పడం లేదు. తాజాగా అల్వాల్ సర్కిల్ పరిధిలో కుక్కలు 20 మందిని కరవడంతో నగర ప్రజలు బెంబేలెత్తుతున్నారు. రెండేళ్ల క్రితం సైతం అమీర్‌పేటలో ఓ కుక్క దాదాపు 50 మందిని కరవడం తెలిసిందే. అప్పట్లో ఆ కుక్కకు రేబిస్ వ్యాధి ఉన్నట్లు బెంగళూర్‌లోని పరిశోధన సంస్థ వెల్లడించింది. తాజా ఘటనలోనూ పరీక్ష ఫలితాలు వెలువడితే కానీ దానికి రేబిస్ ఉందో, లేదో తెలియదు. కుక్కలకు సంతాన నిరోధక శస్త్రచికిత్సలు, రేబిస్ సోకకుండా వ్యాక్సిన్లు జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నప్పటికీ, ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అనుమానాలకు తావిస్తోంది. కుక్కల సంఖ్యను తగ్గించేందుకు ఏడాది క్రితం కొన్ని వార్డులను ఎంపిక చేసి ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టినట్లు ప్రకటించిన అధికారులు దాని ఫలితాలేమిటో వెల్లడించలేదు. వీధి కుక్కలను పట్టుకురావడం.. సంరక్షణ బాధ్యతల్ని సైతం ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించినట్లు పేర్కొన్నారు. అయినా నగరంలో కుక్కల బెడద తప్పడం లేదు. ఏటా ఎన్నో ఆపరేషన్లు చేసినట్లు చెబుతున్నా ఇప్పటికీ నగరంలో పది లక్షలపైనే వీధి కుక్కలున్నట్లు అంచనా. ప్రతినెలా నగరంలో 2వేల నుంచి 4వేల మంది వరకు కుక్కకాట్ల బారిన పడుతున్నారు. (చదవండి: ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో మజాక్ చేస్తే ఇట్లనే ఉంటది) -
Makeover Tips: టైమ్‌పాస్ కోసం చేరా.. 2 గంటలకు ఆరున్నర వేలు.. ఇలా చేస్తే
Makeover Tips: ఏ వేడుకకు ఏ డ్రెస్ వేసుకోవాలో సందర్భాన్ని బట్టి ఎంపిక చేసుకోవడం మనకు తెలిసిందే! అలాగే, ముఖం రోజంతా ఫ్రెష్‌గా కనిపించాలంటే ఏ మేకప్ వాడాలి?! కురులను కొంగొత్తగా సింగారించాలంటే ఏ స్టైల్‌ని ఫాలో అవ్వాలి?! అనే ప్రశ్నలకు సమాధానం రావాలంటే మేకప్ ఆర్టిస్ట్ గురించిన వెతుకులాట తప్పదు. టాప్ టు బాటమ్ లుక్ స్టైల్‌గా, సంప్రదాయంగా, సందర్భానుసారంగా అతివల కలలకు మెరుగులు దిద్దే మేకోవర్ ఆర్టిస్ట్ విమలారెడ్డి చెబుతున్న వివరాలివి.. ఇంజనీరింగ్ స్టూడెంట్స్‌కి ఆర్గానిక్ కెమిస్ట్రీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా క్లాసులు తీసుకున్న లెక్చరర్ విమలారెడ్డి హైదరాబాద్‌లోని అల్వాల్‌లో ఉంటున్నారు. ఎనిమిదేళ్లుగా మేకోవర్ ఆర్టిస్ట్‌గా ఈ రంగంలో రాణిస్తున్నారు. బ్రైడల్, సీజనల్, సెలబ్రిటీ మేకోవర్‌పై వర్క్ చేస్తున్న విమలారెడ్డి తన గురించిన విశేషాలే కాదు, మేకప్ అండ్ హెయిర్‌కి సంబంధించిన వివరాలనూ తెలియజేశారు. ‘‘లెక్చరర్‌గా ఉద్యోగం చేస్తున్న నేను పెళ్లయ్యాక ఆరు నెలలు ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది. ఆ సమయంలో పేపర్లో బ్యూటీ కోర్స్ ప్రకటన చూసి, టైమ్‌పాస్ కోసం వెళ్లి, చేరాను. ఆ తర్వాత తిరిగి లెక్చరర్ ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. ఏడేళ్ల క్రితం నాతోపాటు కోర్సు చేసిన అమ్మాయి ఓ పెళ్లి ఫంక్షన్లో సాయంగా ఉండమని కోరితే వెళ్లాను. రెండు గంటలు సాయం చేస్తే ఆరున్నర వేల రూపాయలు వచ్చాయి. దీంతో కొన్నాళ్లు టీచింగ్ చేస్తూనే బ్యుటీషియన్గానూ ఆర్డర్స్ మీద బ్రైడల్ మేకప్ చేస్తుండేదాన్ని. నాకు నచ్చిన టైమ్‌లో వర్క్ చేయచ్చు. ఆర్థికంగానూ బాగుందనిపించింది. దీంతో పూర్తిగా మేకోవర్‌నే వృత్తిగా మార్చుకొని ఈ రంగంలోకి వచ్చాను. నాకు పెన్సిల్ ఆర్ట్ అంటే చిన్నప్పుటి నుంచి ఇష్టం ఉండేది. ఆ ఆర్ట్ మేకప్‌లో నాకుబాగా సాయపడింది. పెళ్లితో పాటు ఇతర సెలబ్రేషన్స్, సెలబ్రిటీస్తోనూ వర్క్ చేయడం నచ్చింది. కొన్ని షూట్స్ వల్ల అవకాశాలు కూడా బాగా వచ్చాయి. ఇటీవల ‘గ్రే’ తెలుగు మూవీకి మేకప్ ఆర్టిస్ట్‌గానూ చేశాను. 2019లో మేకప్ కాంపిటీషన్లో పాల్గొని, గెలుపొందాను. అలాగే, మేకప్ అండ్ హెయిర్ స్టైల్స్‌కి సంబంధించిన క్లాసులూ తీసుకుంటున్నాను. కంటి మేకప్ యూనివర్సల్ సహజంగా కనిపించాలని, వేసవిలో కళ్ల వరకు మాత్రమే వాటర్‌ప్రూఫ్ మేకప్‌ని కోరుకునేవారున్నారు. పెదాలకు గ్లాసీ లిపిస్టిక్ వాడితే సరిపోతుంది. చాలావరకు మనవాళ్లందరికీ కళ్ల చుట్టూ, మూతిచుట్టూ, నుదుటిపైన కొద్దిపాటి నలుపు ఉంటుంది. వీటిని కవర్ చేసుకుంటే చాలు, ఎక్కువ మేకప్ లేకపోయినా చేయకపోయినా నీట్‌గా కనిపిస్తుంది. కళ్లు డల్‌గా కనిపించకుండా ఉండటానికి మస్కారా, లిప్‌స్టిక్ వేసుకుంటే చాలు ఫ్రెష్‌లుక్ కనిపిస్తుంది. చర్మరక్షణ ముఖ్యం పెళ్లి వంటి ముఖ్యమైన సందర్భాలు ఉన్నప్పుడు కొన్ని నెలల ముందే మమ్మల్ని సంప్రదిస్తుంటారు. వారి ఫొటోస్ మాకు పంపిస్తారు. వాళ్ల స్కిన్ టోన్ (ఆయిలీ, డ్రై, కాంబినేషన్ స్కిన్) ఏంటో కనుక్కొని అందుకు తగిన జాగ్రత్తలు చెబుతుంటాను. వాడాల్సిన ఫేస్‌వాష్, టోనర్, ఫేషియల్స్ గురించి మాత్రమే కాదు తీసుకునే ఆహారం, డెర్మటాలజిస్ట్‌ను కలవాల్సిన అవసరం, వ్యాయామాలు... దాదాపు 6 నెలల ముందే అన్నీ చెబుతాను. మాంసాహారం తగ్గించమని, జ్యూసులు, నీళ్లు, సలాడ్స్ ఎక్కువ తీసుకోమని చెబుతాను. అలాగే, లేట్ నైట్స్ ఆహారం తీసుకోవద్దని, ఆల్కహాల్, స్మోకింగ్ వంటి అలవాట్లు ఉంటే మానేయమని చెబుతుంటాను. నెలకు ఒకసారి రెడీ మేడ్ మాస్క్ అయినా వేసుకోమని సజెస్ట్ చేస్తాను. ఆరోగ్యం బాగుంటే చర్మం, జుట్టు కూడా బాగుంటుంది. అప్పుడు మేకోవర్ కూడా హెల్దీగా కనిపిస్తుంది. నాణ్యమైన ఉత్పత్తులు మేకప్, డ్రెస్, హెయిర్, జ్యువెలరీ .. ఇవన్నీ సెట్ చేయడానికి 3–4 గంటల సమయం పడుతుంది. మేకప్‌కి వాడే ప్రొడక్ట్స్ క్వాలిటీ బట్టి ధర ఉంటుంది. ఉపయోగించిన మేకప్ 12 నుంచి 16 గంటల వరకైనా తాజాగా ఉండే ఖరీదైన ప్రొడక్ట్స్ వచ్చాయి. వీటితో ఫినిషింగ్ మాత్రమే కాదు చర్మం కూడా బాగుంటుంది. కొన్ని ప్రొడక్ట్స్ ఉపయోగించినా మేకప్ చేసుకున్నట్టు తెలియదు. అంత నేచురల్‌గా ఉంటాయి. వేడుకల సమయాలను బట్టి మా వర్క్ ఉంటుంది. దీనిని అర్థం చేసుకునే కుటుంబం, పని పట్ల శ్రద్ధ, ఈ రంగంలో ఎదగాలన్న తపన ఉంటే ఈ రంగంలో ఎవరైనా రాణించవచ్చు’ అని వివరిస్తారు ఈ మేకోవర్ ఆర్టిస్ట్. – నిర్మలారెడ్డి నేటి మేకప్ ట్రెండ్స్ ►నేటి పెళ్లిళ్లలో చాలా వరకు వాటర్ ఫ్రూఫ్, గ్లాసీ, ట్రాన్స్పరెంట్ మేకప్ ఎక్కువ వాడుతున్నారు. ►పెళ్లి సమయంలో చమట పట్టే అవకాశం ఉంది. అలాగే, అప్పగింతలప్పుడు వారికి తెలియకుండానే ఏడ్చేస్తుంటారు. ►ఇలాంటప్పుడు మేకప్ చెదరకుండా, దాదాపు ఎనిమిది గంటల పాటు ఉండాలంటే వాటర్‌ఫ్రూఫ్ మేకప్ సరైన ఎంపిక అవుతుంది. ►నేచురల్‌గా హెల్దీ లుక్ కనిపించడంతో పాటు షైనీగా ఉండాలనుకునేవారు గ్లాసీ మేకప్‌ను ఎంచుకుంటారు. ►ట్రాన్స్పరెంట్ కూడా అలాంటిదే. లిప్‌స్టిక్ పెట్టుకొని తిన్నా, వేటికీ అంటుకోకుండా ఉంటుంది. ►వేసవిలో వీటిని ఎక్కువ కోరుకుంటారు. ►నార్మల్ కెమరాతో కాకుండా హెచ్డి కెమరా పిక్సల్ సైజ్ బాగుంటుంది. అలాగే, హెచ్డీ క్వాలిటీ మేకప్ కూడా ఉంది. ►చేతులతో ముఖాన్ని టచ్ చేయకుండా మెషిన్‌తో ప్రొడక్ట్స్ స్ప్రే చేస్తూ మేకప్ చేస్తాం. దీనిని ఎయిర్‌బ్రష్ మేకప్ అంటాం. ► చదవండి: Aishwarya Bhagyanagar: మూడు వందలకు పైగా డాన్స్ ప్రదర్శనలు.. అంతేకాదు చిత్రకారిణి కూడా! -
గరీబుకూ ..ఖరీదైన వైద్యం
సాక్షి, హైదరాబాద్: ఖరీదైన వైద్యసేవలు పూర్తిగా అందరికీ అందుబాటులోకి రావాలని, నిరుపేదలు దోపిడీకి గురికాకూడదనే ఆలోచనతో హైదరాబాద్ నలు దిక్కులా ప్రభుత్వ ఆధ్వర్యంలో అత్యాధునిక ఆసుపత్రులను నెలకొల్పుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. హెచ్ఎండీఏ పరిధిలో 1.64 కోట్ల జనాభా నివసిస్తోందని, అంతేకాక చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ జనాభా బాగా పెరుగుతోందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ నగరం మీద మాత్రమే వైద్య సేవల భారం మొత్తం పడకూడదనే ఉద్దేశంతో ఈ ఆసుపత్రులు నిర్మిస్తున్నామని వెల్లడించారు. తెలంగాణ వైద్య విజ్ఞాన సంస్థ (టిమ్స్) పేరుతో హైదరాబాద్ గడ్డిఅన్నారం, ఎర్రగడ్డ, అల్వాల్ ప్రాంతాల్లో నిర్మించనున్న మూడు ఆసుపత్రులకు సీఎం కేసీఆర్ మంగళవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా అల్వాల్‌లో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. అందుబాటులో ఖరీదైన వైద్య సేవలు ‘ఏ సమస్య వచ్చినా గాంధీకో, ఉస్మానియాకో, నీలోఫర్కో పరిగెత్తకుండా ఈ ఆసుపత్రుల నిర్మా ణం ద్వారా నగరానికి నలువైపులా (ఇప్పటికే గచ్చిబౌలిలో టిమ్స్ ఉంది) నిరుపేదలకు ఖరీదైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. కొత్త ఆసుపత్రు లతో కలిపి మొత్తం 6 వేలకు పైగా పడకలు అందుబాటులోకి వస్తున్నాయి. వీటిలో 1,000 నుంచి 1,500 వరకూ ఐసీయూ పడకలు ఉండేలా చూస్తున్నాం. నిమ్స్‌లో కూడా 2 వేల పడకలను పెంచుతు న్నాం. టిమ్స్‌లో అన్ని సేవలతో పాటు వందో, రెండు వందల పడకలతోనో ప్రత్యేకమైన ప్రసూతి కేంద్రం కూడా ఇక్కడే నిర్వహించినట్లైతే మళ్లీ వేరేచోటికి పోయే అవసరం రాదు. ఆరోగ్య శాఖ ఈ మేరకు చర్యలు తీసుకోవాలి..’అని సీఎం అన్నారు. పటిష్టమైన వైద్య వ్యవస్థతో తక్కువ నష్టం ‘మానవులు ఈ భూగోళం మీదకు 4 లక్షల ఏళ్ల క్రితం వచ్చారు. కానీ వైరస్‌లన్నీ మనుషులు రావడానికి 4 లక్షల ఏళ్ల క్రితమే వచ్చాయని ఎంటమాలజిస్టులు చెప్పారు. అవి ఎప్పుడెప్పుడు ప్రకోపం చెందుతాయో అప్పుడు వ్యాప్తి చెందుతాయి అని చెప్తే.. నేను బేజారై కరోనా అయిపోదా అంటే కరోనా తాతలు కూడా భవిష్యత్తులో రానున్నాయన్నారు. కాబట్టి కరోనా లాంటి వ్యాధులు మళ్లీ మళ్లీ విజృంభించే అవకాశాలున్నాయి. వైరస్లు లేకుం డా చేసే వ్యవస్థ లేదు. కానీ అవి వచ్చినప్పుడు ఎవరికైతే పటిష్టమైన వైద్య వ్యవస్థ ఉంటుందో వారు తక్కువ నష్టంతో బయటపడతారు. ఎక్కడైతే వైద్య వ్యవస్థ బాగా ఉండదో అక్కడ లక్షల మంది చనిపోతారు. విద్య, వైద్యం పేదలకు అందాలనేదే మా లక్ష్యం. వైద్య విద్య మీద బాగా దృష్టి పెట్టనున్నాం. కొత్తగా మరిన్ని వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నాం’ అని కేసీఆర్ తెలిపారు. టీకా సెంటర్‌గా హైదరాబాద్ ‘ఎక్కడెక్కడ నుంచో ఇక్కడకి వచ్చి తమ సంస్థలు పెట్టడానికి కంపెనీలు ఆసక్తి చూపిస్తుండడం వల్లే హైదరాబాద్‌లో 7 ఏళ్లలో 2.30 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం. వీటి ద్వారా 10–15 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. హైదరాబాద్‌లో 14 వేల ఎకరాల్లో ఫార్మాసిటీ, యూనివర్సిటీ తేనున్నాం. ప్రపంచంలోనే 33% టీకాలు తయారు చేసే సెంటర్ హైదరాబాద్..’అని సీఎం పేర్కొన్నారు. సంపద సృష్టిస్తున్నాం.. పేదలకు పంచుతున్నాం ‘మనది కొత్త రాష్ట్రం. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్ ఇవన్నీ ఎప్పటినుంచో పెద్ద రాష్ట్రాలుగా కొనసాగుతున్నాయి. కానీ మన తలసరి ఆదాయం వీటన్నింటినీ మించి నమోదైంది. సంపద సృష్టిస్తున్నాం.. పేదలకు పంచుతున్నాం. తెలంగాణ పచ్చబడాలె, ఇంకా ముందుకు పోవాలె. దేశానికి తలమానికంగా ఉండేలా మారాలె. దాని కోసం ఎంతధైర్యంగానైనా ముందుకు పోతాం. ఎవరితోనైనా పోరాడతాం..’అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, మహమూద్ అలీ, వేముల, సబిత, తలసాని, మల్లారెడ్డి, ఎంపీలు కేకే, సంతోశ్, ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, సాయన్న, మైనంపల్లి హన్మంతరావు, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. టిమ్స్ అంటే మామూలుగా ఏదో చిన్న దవాఖానా కట్టరు. ఇక్కడ 16 స్పెషాలిటీ, 15 సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు లభిస్తాయి. ఎయిమ్స్ తరహాలో టిమ్స్‌కు రూపకల్పన చేస్తున్నాం. వీటి ద్వారా నూటికి నూరు శాతం ప్రభుత్వ ఖర్చుతో పేదలకు కార్పొరేట్ వైద్యం అందుతుంది. కొందరు మత విద్వేషంతో మాట్లాడుతున్నారు.అన్ని మతాలు, కులాలని సమానంగా ఆదరించే గొప్ప దేశం మనది. ఈ సామరస్య వాతావరణం చెడిపోతే ఎటూ గాకుండా పోతాం. సామరస్యతను దెబ్బతీసే కేన్సర్ లాంటి జబ్బు మనల్ని పట్టుకుంటే చాలా ఇబ్బందులు పడతాం. ఇవాళ తెలంగాణలో కరెంటు పోతే వార్త. కానీ దేశంలో కరెంటు ఉంటే వార్త. ప్రధాని ప్రాతినిధ్యం వహించిన గుజరాత్లో కూడా రైతులు రోడ్ల మీదకు వచ్చి పోరాటం చేస్తున్నారు. కానీ ఏడేళ్ల క్రితం పుట్టిన పసికూన తెలంగాణ రాష్ట్రంలో రాత్రింబవళ్లు కష్టపడి 24 గంటల కరెంటు అన్ని రంగాలకూ ఇస్తున్నాం. – సీఎం కేసీఆర్ కులం, మతం పేరిట చిల్లర రాజకీయాలు ‘రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు (మంగళవారం) రాజకీయ సభలు జరుపుతున్నాయి. కానీ మనం కంటోన్మెంట్లో ఆరోగ్యానికి సంబంధించిన సభ పెట్టుకున్నాం. ఇదీ వాళ్లకు మనకూ ఉండే తేడా. ఇలాంటి పరిస్థితు ల్లో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్రం వచ్చాక మారిన పరిస్థితులు చూడాలి. ఫలానా వాళ్ళ షాపులో పూలు కొనొద్దు. ఫలానా వాళ్ల షాపులో ఇది కొనొ ద్దు. అది కొనొద్దు అని కొందరు మత విద్వేషంతో మాట్లాడుతున్నారు. దీనిపై ప్రజలుగా మీరు ఆలోచన చేయాలి. కొందరు కులం, మతం పేరిట చిల్లర మల్లర రాజకీయాలు చేస్తున్నారు. మతపిచ్చి అనేది ఏదో తాత్కాలికంగా మజా అనిపిస్తుంది. కానీ శాశ్వతంగా మన ప్రయోజనాలు దెబ్బతింటాయి. విదేశాల్లో పనిచేస్తున్న 13 కోట్ల మంది భారతీయుల్ని ఇలాగే వెనక్కి పంపిస్తే వారికి ఉద్యోగాలు ఎవరివ్వాలి? అందువల్ల అటువంటి సంకుచిత ధోరణులకు తెలం గాణలో ఆస్కారమివ్వొద్దు’ అని విజ్ఞప్తి చేశారు. -
అల్వాల్: పాజిటివ్ వచ్చిందని ప్రాణం తీసుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగిని
సాక్షి, అల్వాల్: కోవిడ్ పాజిటివ్ వచ్చిందన్న మానసిక వేదనతో సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అల్వాల్ ఏఎస్ఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాచలానికి చెందిన డి.అలేఖ్య (28) నగరంలో సాఫ్ట్వేర్ ఉద్యోగిని. అల్వాల్ కానాజీగూడలోని మానస సరోవర్ హైట్స్‌లో నివసిస్తోంది. ఈ నెల 21న అస్వస్థతకు గురవడంతో కరోనా నిర్ధారణ పరీక్షలు చేసుకోగా పాజిటివ్‌గా తేలింది. అప్పటినుంచి ఇంట్లోనే ఉంటూ చికిత్స పొందుతోంది. కుటుంబ సభ్యులతో సైతం ఫోన్లో మాట్లాడింది. రెండు రోజుల అనంతరం 23వ తేదీ సాయంత్రం ఫోన్ మాట్లాడకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనతో అలేఖ్య నివాసానికి వచ్చి పరిశీలించగా ఉరికి వేలాడుతూ కనిపించింది. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: మనిషి చర్మం, ప్లాస్టిక్‌పై ఒమిక్రాన్ ఎన్ని గంటలు సజీవంగా ఉంటుందో తెలుసా? -
Chain Snatcher: ఉమేష్ ఖతిక్‌ను ఇచ్చేదేలే
సాక్షి, హైదరాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్ పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. కర్ణాటకలోని బెంగళూరులో వరుసపెట్టి పంజా విసారాడు.. హైదరాబాద్‌కు చేరుకుని రెండు రోజుల్లో అయిదు చైన్ స్నాచింగ్స్ సహా ఎనిమిది నేరాలు చేశాడు.. చూడటానికి పక్కా సాఫ్ట్వేర్ ఉద్యోగిలా కనిపించే ఈ ఘరానా నేరగాడు ఉమేష్ ఖతిక్‌ను అప్పగించేది లేదని అహ్మదాబాద్ పోలీసులు స్పష్టం చేశారు. తెలంగాణ పోలీసులు ఇచ్చిన సమాచారంతో శనివారం తెల్లవారుజామున ఆ అధికారులు అక్కడే పట్టుకున్నారు. అతడిని తమకు అప్పగించాలంటూ ఇక్కడి పోలీసులు వెళ్లి కోరగా... తామే అరెస్టు చేస్తామని ఆపై పీటీ వారెంట్‌పై తీసుకువెళ్లండి అంటూ స్పష్టం చేశారు. దీంతో ఆదివారం రాత్రి తెలంగాణ పోలీసు బృందాలు తిరిగి పయనమయ్యాయి. నాలుగు గంటలకు పైగా నడక.. మంగళవారం మధ్యాహ్నం రైలులో నగరానికి చేరుకున్న ఉమేష్ నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని మెజిస్టక్ హోటల్లోని రూమ్ నెం.204లో బస చేశాడు. అక్కడే మధ్యాహ్న భోజనం చేసిన అతగాడు బయటకు వచ్చి కాలినడకన బయలుదేరాడు. దాదాపు నాలుగు గంటల పాటు వివిధ ప్రాంతాల్లో కాలినడకన సంచరించిన ఉమేష్ సాయంత్రం 5,30 గంటల ప్రాంతంలో మెహిదీపట్నం చేరుకున్నాడు. అక్కడి జిర్రా రోడ్లో మహ్మద్ సులేమాన్ నిర్వహిస్తున్న మొబైల్ దుకాణం వద్దకు వెళ్లాడు. అప్పటికి కొద్దిసేపటి ముందే తన యాక్టివా వాహనంపై సరుకు తీసుకువచ్చిన సులేమాన్ తన వాహనాన్ని దుకాణం ముందు పార్క్ చేశారు. అప్పటికే కస్టమర్లు ఎదురు చూస్తుండటంతో ఆ హడావుడిలో బండికి తాళం వేయడం మర్చిపోయిన ఆయన సరుకు తీసుకుని షాపు లోపలకు వెళ్లిపోయారు. చదవండి: Chain Snatcher: చైన్ స్నాచర్ ఉమేష్ ఖాతిక్ అరెస్ట్.. ఎంత దూరమైనా సరే.. అల్పాహారం తర్వాత మొదలుపెట్టి.. తాళంతో సహా ఉన్న సులేమాన్ ద్విచక్ర వాహనాన్ని గుర్తించిన ఉమేష్ దాన్ని తస్కరించాడు. అక్కడ నుంచి చెక్కర్లు కొడుతూ తాను ఉన్న హోటల్‌కు చేరుకున్నాడు. ఆ రాత్రి హోటల్లోనే ఉన్న ఉమేష్ బుధవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో అల్పాహారం చేసి అక్కడ నుంచి బయలుదేరాడు. ఎక్కడా ఎలాంటి రెక్కీలు చే యని అతగాడు నేరుగా అల్వాల్‌కు చేరుకున్నా డు. అక్కడ ఉదయం 10 గంటల నుంచి మొదలెట్టి మేడిపల్లిలో సాయంత్రం 4.30 వరకు వరుసపెట్టి నేరాలు చేశాడు. అక్కడి సంపూర్ణ హోట ల్ వద్ద వాహనం, సమీపంలోని చెంగిచర్ల చౌర స్తా సమీపంలో ఉన్న మేకల బాల్‌రెడ్డి ఫంక్షన్ హాల్ వద్ద తన జర్కిన్ విడిచిపెట్టాడు. అక్కడ నుంచి బస్సులో లక్డీకాపూల్‌కు చేరుకున్న ఉమేష్... ఆటోలో హోటల్‌కు చేరాడు. బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో హోటల్ ఖాళీ చేసి రైలులోనే అహ్మదాబాద్ చేరుకున్నాడు. హోటల్లో మరో వ్యక్తి ఫోన్ నంబర్... ఉమేష్ నాంపల్లిలోని మెజిస్టిక్ హోటల్లో బస చేస్తున్న సమయంలో తన ఫోన్ నంబర్ పొందుపరచలేదు. గుజరాత్‌లోని భావ్‌నగర్‌కు చెందిన చేతన్ రాథోడ్‌కు చెందిన నంబరును ఇచ్చాడు. గుర్తింపు కార్డుగా మాత్రం తన ఆధార్‌నే అందించాడు. సీసీ కెమెరాల ఆధారంగా ఉమేష్ కదలికలు తెలుసుకున్న పోలీసులు హోటల్ వరకు వచ్చాడు. రిజిస్టర్లో ఉన్న ఫోన్ నంబర్‌కు సంప్రదించగా ఉమేష్ ఎవరో తనకు తెలియదని చేతన్ చెప్పాడు. దీంతో ఆధార్ కార్డు ఆధారంగా ముందుకు వెళ్లిన పోలీసులు ఉమేష్ నేరచరిత్ర తెలుసుకున్నారు. సాంకేతిక ఆధారాలను బట్టి అతడు శుక్రవారం రాత్రి అతడు అహ్మదాబాద్‌లోని తన ఇంట్లోనే ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడ నుంచి బృందాలు వెళ్లేసరికి అతడు తప్పుకునే అవకాశం ఉందని భావించిన అధికారులు అహ్మదాబాద్ అధికారులను అప్రమత్తం చేశారు. శనివారం తెల్లవారుజామున ఆ ఇంటిపై దాడి చేసిన ఆ పోలీసులు ఉమేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. అప్పటికి దాదాపు 20 రోజులుగా బెంగళూరు అధికారులు అహ్మదాబాద్ పోలీసులతో టచ్‌లో ఉన్నారు. -
రోడ్డుపై ఐదు నెలల పిండం
సాక్షి, అల్వాల్: నడి వీధిలో ఐదు నెలల పిండం పడేసిన ఘటన మచ్చబొల్లారం అంజనపూరి కాలనీలో గురువారం వెలుగు చూసింది. అంజనపురి కాలనీలోని రహదారి పక్కన పడిఉన్న పిండాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించినా ఎలాంటి ఆధారం లభించలేదు. రాత్రి సమయంలో వేరే ప్రాంతం నుంచి తీసుకొచ్చి ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. -
రియల్టర్ విజయ్‌భాస్కర్‌రెడ్డి హత్య కేసులో కొత్త కోణం..తుపాకీ ఎక్కడ?
సాక్షి, అల్వాల్, రసూల్‌పుర: హైదరాబద్‌లోని తిరుమలగిరి ఠాణా పరిధిలోని పెద్ద కబేళా ఖాళీ స్థలంలో శవమై కనిపించిన రియల్టర్ తోట విజయ్‌భాస్కర్‌రెడ్డి హత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే వరుసకు సోదరుడయ్యే తోట నరేందర్‌రెడ్డి నాటు తుపాకీతో కాల్చి చంపినట్టు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. ఆర్థిక లావాదేవీలు టెంపుల్ అల్వాల్‌లోని శ్రీనివాసనగర్‌కు చెందిన తోట విజయ భాస్కర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. కొన్ని లావాదేవీలను ఇద్దరూ కలిసి, మరికొన్నింటిని ఎవరికి వారుగా చేసుకునే వారు. అయితే ఉమ్మడి కార్యకలాపాలకు సంబంధించి ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల్లో తేడాలు వచ్చాయి. దీంతో కొంత కాలంగా వీరి మధ్య మనస్పర్ధలు నడుస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఇటీవల ఆర్థిక ఇబ్బందుల్లో పడిన నరేందర్ వాటి నుంచి బయటపడటానికి, తనకు రావాల్సిన కమీషన్ డబ్బులు ఇవ్వాలంటూ భాస్కర్‌రెడ్డిపై ఒత్తిడి చేస్తున్నాడు. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది. కొన్ని రోజుల క్రితం ఓ నాటు తుపాకీని ఖరీదు చేసిన నరేందర్ దాన్ని తన ఇంటి వెనుక ఉన్న చెరువు సమీపంలో పాతి పెట్టాడు. ఆది వారం దీన్ని బయటకు తీసి తన వద్ద ఉంచుకున్నాడు. చదవండి: అమ్మ లొంగలేదని అమ్మాయిని బలిగొన్న కామాంధుడు పథకం ప్రకారం.. సోమవారం ఉదయం తాను కొనుగోలు చేస్తున్న ప్లాట్ రిజిస్ట్రేషన్ కోసం నగదుతో ఇంటి నుంచి కారులో బయలుదేరిన విజయ్‌భాస్కర్ రిజిస్ట్రేషన్ పూర్తయిన తరవాత శ్రీశైలం వెళ్లి దైవ దర్శనం చేసుకువస్తానంటూ ఇంట్లో చెప్పాడు. కొద్ది దూరంలో నివసించే నరేందర్‌ను తన కారులో ఎక్కించుకున్నాడు. నరేందర్‌రెడ్డి పథకం ప్రకారం విజయ్‌భాస్కర్‌రెడ్డిని పెద్ద కబేళా పక్కన ఉన్న ఖాళీ స్థలంలోకి తీసుకువెళ్లాడు. అక్కడ తనకు రావాల్సిన కమీషన్ ఇవ్వాలంటూ వాగ్వాదానికి దిగాడు. అదును చూసి వెనుక నుంచి తన వద్ద ఉన్న నాటు తుపాకీతో విజయ్‌భాస్కర్‌రెడ్డి తలలోకి కాల్చాడు. పుర్రెను చీల్చుకుంటూ దూసుకుపోయిన తూటా లోపలే ఉండిపోయింది. దీంతో ఆయన ముక్కు, చెవులు, నోటి నుంచి తీవ్ర రక్తస్రావమైంది. భాస్కర్‌రెడ్డి చనిపోయాడని నిర్ధారించుకున్న నరేందర్ అక్కడ నుంచి నగదును తీసుకుని పారిపోయాడు. కారులో రక్తం మడుగులో ఉన్న విజయ్‌భాస్కర్‌ను సోమవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో గుర్తించిన స్థానికులు తిరుమలగిరి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆయన అప్పటికే మరణించినట్లు గుర్తించారు. తుపాకీ ఎక్కడ? రంగంలోకి దిగిన పోలీసులు నరేందర్‌ను మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. అతడు నాటు తుపాకీని రహస్యంగా దాచినట్లు తేలడంతో దాని కోసం గాలిస్తున్నారు. మరోపక్క ఇతడికి ఎవరైనా సహకరించారా? అనే అంశాన్నీ ఆరా తీస్తున్నారు. బుధవారం నిందితుడి అరెస్టు ప్రకటించే అవకాశం ఉంది. విజయ్‌భాస్కర్‌రెడ్డి మృతితో శ్రీనివాసనగర్ ప్రాంతంలో విషాదఛాయలు అలముకొన్నాయి. ఈయనకు భ్యార్య, కుమారుడు, కుమర్తె ఉన్నారు. కుమారుడు ఇటీవల ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లాడని సన్నిహితులు పేర్కొన్నారు. -
అల్వాల్‌లో రియల్టర్ విజయ్ భాస్కర్‌రెడ్డి దారుణ హత్య
సాక్షి, హైదరాబాద్: అల్వాల్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి విజయ్ భాస్కర్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. తిరుమలగిరిలోని కారులో సోమవారం విజయ్ మృతదేహం లభ్యమైంది. కాగా సోమవారం ఉదయం 10 గంటలకు ఓ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కోసం పది లక్షల రూపాయలు తీసుకొని ఇంట్లో నుంచి వెళ్లాడు. మళ్లీ తిరిగి రాలేదు. ఈ క్రమంలోనే కారులోనే దుండగులు కత్తితో విజయ్ రెడ్డి మెడపై పొడిచి చంపారు. కాగా సోమవారం నాడు ఉదయం 11 గంటలకే విజయభాస్కర్ రెడ్డి హత్యకు గురయ్యారని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఫ్లాట్ రిజిస్ట్రేషన్ మద్యవర్తులే చంపినట్లు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భాస్కర్‌కు గత కొద్దిరోజులుగా ఆస్తి విషయంలో తన బంధువులతో గొడవలు జరుగుతున్నట్లు పోలీసులకు తెలియజేశారు. మృతుడి బంధువు తోట నరేందర్ రెడ్డి, మరో వ్యక్తి అబ్రహంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న తిరుమలగిరి పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. -
పగలంతా చిత్తు కాగితాలు ఏరుకుంటారు.. మధ్యలో వృత్తి మార్చి
సాక్షి అల్వాల్: చిత్తు కాగితాలు ఏరుకుంటూ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను అల్వాల్ పోలీసులు అరెస్టు చేశారు. వారివద్ద నుండి రూ. 10 లక్షల నగదు స్వాదీనం చేసుకున్నారు. సీఐ గంగాధర్ తెలిపిన మేరకు.. హస్మత్‌పేట్ అంజయ్యనగర్‌లో నివాసముండే సంతోష్‌కుమార్ ఇంట్లో ఈ నెల 14న చోరీ జరిగింది. రూ.18.50 లక్షలు దొంగలు ఎత్తుకెళ్లారు. పోలీసులు దర్యాప్తు చేస్తుండగా బుధవారం హస్మంత్‌పేట్‌లో అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. విచారణలో దొంగతనానికి పాల్పడినట్లు వెల్లడైంది. చదవండి: దళిత బంధుపై దాఖలైన 4 పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు గుల్బర్గకు చెందిన జ్యోతి(30), రూప (36)లు తుకారగేట్‌లోని మంగర్ బస్తీలో నివాసముంటున్నారు. ఉదయం పూట చిత్తుపేపర్లు ఏరుకోవడం, వెంట్రుకలకు స్టీల్ సామగ్రి ఇవ్వడం లాంటివి చేస్తున్నారు. మధ్యలో దొంగతనానికి పాల్పడుతున్నారు. హస్మత్‌పేట్‌లో దొంగతనానికి పాల్పడిన డబ్బులో కొంత జల్సాలకు ఉపయోగించారు. వారి నుంచి 10 లక్షల 7 వేల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
పెళ్లి చేసుకుందాం అన్నందుకు చున్నీని గొంతుకు బిగించి..
సాక్షి, అల్వాల్: ‘రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నాం. ఇక పెళ్లి చేసుకుందాం’ అని ఒత్తిడి చేసిన ప్రియురాలిని హతమార్చాడో యువకుడు. ఈ ఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. ఓల్డ్ అల్వాల్ సాయిబాబానగర్‌కు చెందిన సరస్వతి (19) బోయిన్‌పల్లిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. భూదేవినగర్‌కు చెందిన దీపక్ (20), సరస్వతి రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. తనను పెళ్లి చేసుకోవాలని దీపక్‌పై కొన్నాళ్లుగా ఆమె ఒత్తిడి తెస్తోంది. ఈ విషయంలో అతను దాటవేత ధోరణి ప్రదర్శిస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో.. సోమవారం తన స్నేహితుడికి ఫోన్ చేసి సరస్వతిని చంపేస్తున్నానంటూ చెప్పినట్లు తెలిసింది. జోక్ చేయవద్దన్న స్నేహితుడు ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పడంతో ఆయన పోలీసులకు చేరవేశారు. ఉదయం ఇంటి నుంచి బయిటికి వెళ్లిన సరస్వతి సాయంత్రమైనా తిరిగి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. వేగవంతంగా విచారణ.. ప్రేమికురాలిని చంపుతానని దీపక్ స్నేహితుడు చెప్పిన విషయం.. కనిపించకుండా పోయిన యువతి ఒక్కరే కావడంతో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రేమికులు తరచూ బీహెచ్ఈఎల్ క్వార్టర్స్ వెనుక ఉన్న రైల్వే ట్రాక్ వద్ద కలుసుకునే వారన్న విషయం కనుకొన్నారు. మంగళవారం తెల్లవారుజామున అక్కడికి వెళ్లి చూడగా సరస్వతి మృతదేహం కనిపించింది. చున్నీని గొంతుకు బిగించి హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో పోలీసులు తేల్చారు. వివాహం విషయంలో ఒత్తిడి వల్లే దీపక్ ఆమెను హతమార్చి ఉండవచ్చని తెలుస్తోంది. తమ కూతురిని హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు లక్ష్మణ్, లక్ష్మీదేవి డిమాండ్ చేశారు. దీపక్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
అప్పు తీర్చాలన్నందుకు.. ముగ్గురు కలిసి ఒంటరి మహిళను..
అల్వాల్: తీసుకున్న అప్పు తీర్చాలన్నందుకు ముగ్గురు కలిసి ఒంటరి మహిళను హత్య చేశారు. అంతేకాక నిందితులు ఆ హత్యను మరొకరిపై వెళ్లేలా పథకం చేశారు. అల్వాల్‌పోలీసులు తెలిపిన మేరకు..వెంకటాపురం లోతుకుంటలో నివసించే పూలమ్మ(40) దినసరి కూలిగా పనిచేసేది. భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటోంది. గతనెల 25వ తేదీన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో హత్యకు గురైంది. కేసు నమోదు చేసుకున్న అల్వాల్ పోలీసులు విచారణ చేపట్టారు. బాధితురాలితో సన్నిహితంగా ఉండే అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఎలాంటి ఆధారాలు లభించలేదు. స్థానికంగా ఉండే సీసీ కెమెరాలు, ఇతరులు తెలిపిన వివరాల ప్రకారం నిఘా పెట్టి నిందితులను అరెస్టు చేశారు. మృతురాలు పూలమ్మ వద్ద సాయిలు(50) మంజుల (40) వినోద(49)లు అప్పుతీసుకున్నారు.అప్పు తిరిగి ఇవ్వమంటు పూలమ్మ ఒత్తిడి పెంచడంతో ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ హత్య మరొకరిపై మోపేలా ప్రణాళిక చేసుకున్నారు. గత 25న రాత్రి పూలమ్మతో సన్నిహితంగా ఉండే వ్యక్తి వచ్చి వెళ్ళిన అనంతరం గుడిసె వెనుక బాగం నుండి పొడగాటి పదునైన గడ్డపారతో మంచంపై నిద్రిస్తున్న పూలమ్మ తలపై పొడవడంతో నిద్రలోనే పూలమ్మ మృతి చెందింది. హత్య చేసిన అనంతరం నిందితుడు సాయిలు ఊరికి వెళ్లాడు. ఉదయం పూలమ్మ మృతి చెందిన సమాచారం తెలియడంతో పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. గుడిసె లోపల గడియ పెట్టి ఉండడం, మృతురాలు మంచం పై పడి ఉండడం, హత్య స్థలంలోఎలాంటి అనుమానస్థితి లేకపోవడం పోలీసులకు హత్య కేసు చేదించడం సవాల్‌లుగా మారింది. చివరకు పూలమ్మ ఇంటి పక్కన ఉండే సాయిలు, వినోద, మంజులలు హత్య చేశారని తేలడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వమన్నందుకే హత్య చేసినట్లు పోలీసులకు తెలిపారు. నిందితులను అరెస్టు చేసి శనివారం రిమాండ్‌కు తరలించారు. కేసు విచారణలో అల్వాల్ పోలీసుల పనితీరును ఉన్నత అధికారులు అభినందించారు. -
రావి ఆకుపై వైఎస్సార్ చిత్రం
సాక్షి, అల్వాల్: తన అభిమాన నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి రూపాన్ని రావి ఆకుపై చిత్రించి అబ్బురపరిచాడు ఓ వ్యక్తి.. దివంగత నేత వైఎసరాజశేఖర్రెడ్డి జయంత్రి సందర్భంగా అల్వాల్‌కు చెందిన మెక్రో స్వర్ణకారుడు పూన ప్రదీప్ కుమార్ గురువారం రావి ఆకుపై వైఎస్సార్ చిత్రాన్ని రూపొందించి తన అభిమానాన్ని చాటుకున్నాడు -
దారుణం: కాళ్లు చేతులు కట్టేసి.. నోట్లో చీర కొంగు కుక్కి..
సాక్షి, అల్వాల్: నల్లాలు పని చేయడం లేదని ఇంట్లోకి పిలిచి ఇంటి యజమానురాలిని చార్జింగ్ కేబుల్‌తో కాళ్లు చేతులు కట్టేసి నోట్లో చీర కొంగు కుక్కి ల్యాప్‌టాప్ కేబుల్‌ను గొంతుకు బిగించి దారుణంగా హత్య చేసిన సంఘటన అల్వాల్ పరిధిలో గురువారం వెలుగులోకి వచి్చంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కానాజీగూడ సత్యసాయి కాలనీకి చెందిన మంగతాయారు(75) కుమారుల్లో ఒకరు ఆర్మీలో కల్నల్‌గా పనిచేస్తుండగా, మరొకరు అమెరికాలో ఉంటున్నారు. కుమార్తె ఆమె ఇంటికి సమీపంలోనే ఉంటోంది. మంగతాయారు కుమారుడు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో సమీపంలో ఉన్న సోదరికి ఫోన్ చేశాడు. కుమార్తె ఇంటికి వెళ్లి చూడగా తాళం వేసి ఉండటంతో చుట్టు పక్కల వాకాబు చేసినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు మంగతాయారు ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు. ఈ క్రమంలో మూడో అంతస్తులో అద్దెకు ఉంటున్న రాజేష్‌ను ప్రశి్నంచగా ముక్తసరిగా సమాధానం చెప్పి ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. దీంతో అనుమానం వచి్చన పోలీసులు అతడి ఇంట్లో గాలించగా బాత్రూమ్లో మంగతాయారు కాళ్లు చేతులు కట్టి పడేసి విగతజీవిగా పడిఉంది. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేస్తున్న రాజేష్‌కు గతంలో పలుమార్లు భార్యతో గొడవలు జరిగాయి. ఈ క్రమంలో మంగతాయారు జోక్యం చేసుకొని అతడిని మందలించిందని తెలిసింది. అయితే 10 రోజుల క్రితం అతడి భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతోపాటు రాజేష్‌కు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. దీంతో మానసికంగా కుంగిపోయిన రాజేష్ బుధవారం మధ్యాహ్నం ఇంటి టెర్రస్ పై మొక్కలు చూసేందుకు వెళ్తున్న మంగతయారును నల్లాలు పనిచేయడం లేదని ఇంట్లోకి పిలిచి ల్యాప్‌టాప్ కేబుల్ వైర్ గొంతుకు బిగించి దారుణంగా హత్య చేశాడు. మృతదేహాన్ని బాత్రూంలో పారవేశాడు. అనంతరం ఆమె చేతికి ఉన్న నాలుగు బంగారు గాజులను తీసుకొని వెళ్లి ప్రైవేటు ఫైనాన్స్‌లో కుదువపెట్టి డబ్బులు తీసుకొని అప్పులు తీర్చుకున్నాడు. రాత్రి వరకు ఏమీ తెలియనట్లు ఇంట్లోనే ఉన్నాడు. డబ్బుల కోసమే వృద్ధురాలిని హత్య చేశాడా మరేదైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: మణప్పురం సంస్థకు రూ.30 లక్షలు టోకరా మాజీ కార్పొరేటర్ దారుణ హత్య.. ఖండించిన సీఎం -
ఏం కష్టమొచ్చిందో.. బిడ్డను చంపి ఉరేసుకున్న తల్లి
సాక్షి, అల్వాల్: అసలే చిన్న కుటుంబం.. బతుకుదెరువు కోసం ఒడిశా రాష్ట్రం నుంచి వలస వచ్చి జీవనంసాగిస్తున్నారు. ఏ కష్టం వచ్చిందో.. బిడ్డను చంపిన తల్లి తానూ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ హృదయవిదారక సంఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం మయూర్భంజ్ జిల్లా బారిపాడకు చెందిన సుధేందుగిరి పాత అల్వాల్ భరత్‌నగర్‌లో నివాసముంటూ సిద్దిపేటలోని ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఎనిమిదేళ్ల కిత్రం బిష్ణుప్రియ(30)తో అతడి వివాహం జరిగింది. వీరికి మూడున్నర సంవత్సరాల కూతురు హ్రితిక ఉంది. ఈ నెల 22వ తేదీన సుధేందుగిరి యథావిధిగా ఉద్యోగానికి వెళ్లి రాత్రి ఇంటికి తిరిగి వచ్చాడు. కూతురు మృతి చెంది ఉండడం, బిష్ణుప్రియ ఉరివేసుకొని కనిపించడం గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. మొదట కూతురును చంపి తాను ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. సుధేందుపరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారిని చంపి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికులను కలిచివేసింది. చదవండి: రూ.30 లక్షలు డిమాండ్.. తీన్మార్ మల్లన్నపై కేసు ! హ్రితికతో బిష్ణుప్రియ (ఫైల్) -
విషాదం: కాసేపట్లో ఇంటికి చేరతామనగా
సాక్షి, అల్వాల్: మద్యం మత్తులో ఉన్న టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం పొట్ట కూటి కోసం పరాయి దేశం నుంచి వచ్చిన భార్యాభర్తల ఉసురుతీసింది. రోజంతా శ్రమించిన ఆ జంట రెండు నిమిషాల్లో ఇంటికి చేరతామనగా అర్ధంతరంగా తనువు చాలించింది. హృదయ విదారకమైన ఈ ఘటన ఆదివారం రాత్రి అల్వాల్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నేపాల్‌లోని డాంగ్ జిల్లా పప్పారి గ్రామానికి చెందిన రూమ్‌లాల్ బండారి (40) మీనాదేవి బండారి (35) ఏడేళ్ల క్రితం నగరానికి వలస వచ్చారు. వీరి బంధువు బలరామ్ సునార్ సైతం వీరితో కలిసే ఉంటున్నాడు. అల్వాల్ ప్రాంతంలోని దేవుని అల్వాల్ శివాలయం రోడ్డులో స్థిరపడిన ఈ ముగ్గురూ స్థానికంగా పాస్ట్‌ఫుడ్ సెంటర్ నడుపుతున్నారు. గత ఏడాది లాక్డౌన్లో వీరి వ్యాపారం మూతపడగా.. కొన్ని నెలలు స్వదేశానికి వెళ్లిపోయారు. ఇటీవలే తమ ఇద్దరు పిల్లల్ని తన తల్లిదండ్రుల వద్ద విడిచిపెట్టిన రూమ్‌లాల్ భార్య, బంధువుతో కలిసి తిరిగి అల్వాల్ వచ్చాడు. ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో తన వ్యాపారం ముగించుకున్న ముగ్గురూ నడుచుకుంటూ ఇంటికి తిరిగి వెళ్తున్నారు. దేవుని అల్వాల్ శివాలయం రోడ్డు మూల మలుపు వద్దకు వచ్చిన వీరిని వెనక నుంచి వేగంగా వచ్చిన టిప్పర్ అదుపు తప్పి వీరిపైకి దూసుకొచ్చింది. దీంతో భార్యాభర్తలు ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. కాస్త దూరంగా ఉన్న వీరి బంధువు మాత్రం ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. మరో రెండు నిమిషాల్లో ఇంటికి చేరతారనగా ప్రమాదం బారినడపటం, స్వదేశంలోని వీరి పిల్లలు అనాథలు కావడంతో ఇక్కడి బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ టిప్పర్‌ను నిర్లక్ష్యంగా నడిపాడని, మలుపు వద్ద ఎదురుగా వచ్చిన ప్యాసింజర్ ఆటోను తప్పించే ప్రయత్నం చేశాడని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే సడన్ బ్రేక్ వేయడం, లారీలో సగం మొరం లోడు ఉండటంతో అదుపుతప్పి ఎడమ వైపునకు పడిపోయిందని వివరిస్తున్నారు. ఫలితంగా రోడ్డు పక్కగా నడిచి వెళ్తున్న భార్యాభర్తలు మృత్యువాతపడ్డారని పేర్కొంటున్నారు. కేసు నమోదు చేసుకున్న అల్వాల్ పోలీసులు ఈసీఐఎల్‌లోని అశోక్‌నగర్‌కు చెందిన టిప్పర్ డ్రైవర్ కె.నర్సింహ్మను (59) అదుపులోకి తీసుకున్నారు. ఇతడికి డ్రంక్ డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించగా బీఏసీ కౌంట్ 165గా వచ్చింది. వయోభారంతో ఉన్న ఇతడి డ్రైవింగ్ లైసెన్స్ వివరాలను ఆరా తీయాలని అధికారులు నిర్ణయించారు. నర్సింహ్మను అరెస్టు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: తుపాకీ గురిపెట్టి.. కత్తితో బెదిరించి స్మార్ట్ఫోన్ల స్క్రీన్లపై ఎక్కువ సేపు కరోనా! -
భయం వద్దు.. ప్లాస్మాథెరపీ ఉంది!
అల్వాల్ (హైదరాబాద్): కరోనా బారినపడితే ఏదో అయిపోతుందనే భయం వద్దు. ఈ వైరస్‌కు ప్రస్తుతానికి మందులు లేకున్నా.. వైద్యులు తమకున్న అనుభవంతో, ప్లాస్మా థెరపీ వంటి వివిధ చికిత్స పద్ధతులతో రోగులను కోలుకునేలా చేస్తున్న తీరు అద్భుతం. గాంధీ వైద్యులు, నర్సింగ్ సిబ్బంది ధైర్యం చెబుతూ రోగులను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు’ అని చెప్పారు హైదరాబాద్‌లోని అల్వాల్ ప్రగతిశీల్ కాలనీకి చెందిన వంశీకృష్ణ. కరోనా వైరస్ బారినపడిన ఆయన ఇటీవలే గాంధీ ఆస్పత్రి నుంచి ఆరోగ్యవంతంగా ఇంటికి చేరుకున్నారు. వంశీకృష్ణ ఓ ప్రైవేటు సంస్థలో ఉన్నతోద్యోగి కాగా, ఆయన భార్య అడ్వకేట్. రాష్ట్రంలోనే ప్లాస్మా థెరపీ చికిత్స పొందిన మొదటి వ్యక్తి అయిన వంశీకృష్ణ గురువారం తన అనుభవాలను పంచుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే.. కంటికిరెప్పలా చూసుకున్నారు.. ‘ప్రతి గంటకు వైద్య సిబ్బంది ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునే వారు. సమయానికి మందు లు, ఆహారం ఇవ్వడంతో పాటు వ్యాయామం చేయించడం ద్వారా రోగిని సంపూ ర్ణ ఆరోగ్యవంతుడిని చేస్తున్నారు. ప్లాస్మా థెరపీ పొందిన నన్ను గాంధీ ఆస్పత్రి ఆర్ఎం డాక్టర్ రాజారావు కంటికిరెప్పలా చూసుకున్నారు. ఆయన స్వయంగా ప్రతి బాధితుని వద్దకు వెళ్లి క్షేమ సమాచారాలు అడిగే వారు. ధైర్యం నింపేవారు. రోగనిరోధక శక్తి బాగుంటే కరోనా నుంచి తేలిగ్గానే బయటపడొచ్చు. అనారోగ్యంతో బాధపడుతున్న మా అమ్మను చూడ్డానికి తరచూ ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లే క్రమంలో నాకు కరోనా వైరస్ సోకింది. దీంతో మే 11న నన్ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. నా భార్య, ఇద్దరు పిల్లలను ఆస్పత్రిలో క్వారంటైన్ చేశారు. మే 26న భార్యాపిల్లల్ని, 30న నన్ను వైద్యులు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఇంటికి పంపారు. ప్రస్తుత కరోనా సమయంలో, దాని చికిత్సకు నూతన ఒరవడిగా చెబుతున్న ప్లాస్మా థెరపీ చికిత్సను రాష్ట్రంలో పొందిన మొదటి వ్యక్తిని నేనే. కరోనా నుంచి చికిత్సానంతరం కోలుకున్న ఆరోగ్యవంతమైన వ్యక్తి రక్తం నుంచి ప్లాస్మా సేకరిస్తారు. దాన్ని వైరస్‌తో బాధపడుతున్న వారికి అందిస్తారు. ఆరోగ్యవంతుడి నుంచి తీసుకున్న రక్తం ద్వారా రోగికి వ్యాధిని జయించే శక్తి వస్తుంది. ఈ చికిత్స విధానంలో నేను కొద్దిరోజుల్లోనే కరోనా నుంచి బయటపడ్డాను’. ఇంటికొచ్చేసరికి ఇల్లు గుల్ల కరోనా బారినపడి.. చికిత్స పొంది, ఆరోగ్యంగా ఇంటికి చేరుకునే సరికి వంశీకృష్ణ ఇల్లు గుల్లయింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘ టన వివరాలు బాధితులు, పోలీసు లు తెలిపిన ప్రకారం.. గత నెల 11న వంశీకృష్ణకు కరోనా పాజిటివ్ రావడంతో ఆయనతో పాటు భార్య, ఇద్ద రు పిల్లలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడి క్వారంటైన్లో ఉంచిన వంశీకృష్ణ భార్యాపిల్లల్ని మే 26న ఇంటికి పంపారు. వారొచ్చేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూడగా బంగారం, నగదు, విలువైన సామగ్రి కనిపించలేదు. 10 తులాల బంగారం, రూ.30 వేలు, 2 ల్యాబ్టాప్లు, 3 ఐప్యా డ్లు చోరీ అయినట్టు గుర్తించి అదేరోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ఇంటి యాజమాని వంశీకృష్ణ చికిత్స పూర్తి చేసుకొని మే 30న ఇంటికి వచ్చారు. ఇంటికి సోలార్ ఫెన్సింగ్, సీసీ కెమెరాలు, ఆధునిక లాకింగ్ సదుపాయాలతో కట్టుదిట్టమైన రక్షణ ఏర్పాట్లున్నా కూడా దొంగతనం జరిగిన తీరు విస్తుగొలుపుతోంది. కాగా, ఘటన జరిగిన 8 రోజుల తరువాత ఈ నెల 4న అల్వాల్ పోలీసులు బాధితులకు ఎఫ్ఐఆర్ కాపీని అందచేశారు. -
అనారోగ్యంతో సీఎం బావ కన్నుమూత
అల్వాల్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రెండో సోదరి భర్త అనారోగ్యంతో శనివారం ఉదయం మృతి చెందారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మర్రిమడ్లకి చెందిన పర్వతనేని రాజేశ్వరరావు (84) హైదరాబాద్‌లోని అల్వాల్ మంగాపురం కాలనీలో నివాసం ఉంటున్నారు. సీఎం సోదరి, రాజేశ్వరరావు సతీమణి విమలాదేవి గతేడాది చనిపోయారు. సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 12 గంటలకు అల్వాల్ చేరుకుని రాజేశ్వరరావు పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. రాజేశ్వరరావు మరణవార్త తెలుసుకున్న మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు ఉదయమే అక్కడికి చేరుకుని రాజేశ్వరరావు పార్థివదేహం వద్ద నివాళులర్పించి కుటుంబసభ్యులను ఓదార్చారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్‌లు రాజేశ్వరరావు కుటుంబసభ్యులను పరామర్శించారు. మధ్యాహ్నం తిరుమలగిరి స్వర్గధామ శ్మశాన వాటికలో రాజేశ్వరరావు అంత్యక్రియలు జరిగాయి. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు అక్కడే ఉన్నారు. రాజేశ్వరరావు పార్థివదేహానికి కేసీఆర్ నివాళులు -
మట్టి మనిషి.. మహాకృషి
అల్వాల్: మట్టిలో పుట్టి.. మట్టిలో పెరిగి.. చివరికి మట్టిలోనే కలవడం మానవుడి జీవన పరిణామం. కృత్రిమ రసాయనాలు వాడకుండా కేవలం మట్టినే ఎరువుగా ఉపయోగించి పోషక విలువలు ఉన్న పంటలు పండిస్తు ప్రపంచానికే ఆదర్శ రైతుగా నిలుస్తున్న అల్వాల్‌కు చెందిన చింతల వెంకటరెడ్డిని భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించనుంది. కోటి పనులు కూటి కోసమే.. కానీ తినే ఆహారమే విషపూరితమైతే ఎలా అని భావించిన వెంకటరెడ్డి క్రిమి సంహారక మందులు ఉపయోగించకుండా కేవలం సేంద్రియ ఎరువులే వాడి పంటను పండించి బలవర్ధకమైన ఆహారం అందించాలనే లక్ష్యంతో తనకున్న వ్యవసాయ భూమిని పరిశోధక కేంద్రంగా మార్చి తానే ఓ శాస్త్రవేత్తగా నిరంతరం ప్రయోగాలు నిర్వహించి సఫలీకృతుడయ్యారు. పలు మార్లు పంటను పండించి నిస్సారంగా మారిన నేలను సారవంతంగా చేయడం కోసం తన పొలంలో 2 అడుగులు వెడల్పు, 4 అడుగుల లోతు, 380 అడుగుల పొడవు కందకం తవ్వారు. తవ్విన మట్టిని పొలం పైభాగంలో చల్లారు. పొలం పైభాగం మట్టిని తవ్విన కందకం పూడ్చడానికి వినియోగించారు. ఇలాంటి పద్ధతులు అవలంబించి ఖర్చు గణనీయంగా తగ్గించారు. సేంద్రియ విధానాలను పాటించి, అధిక దిగుబడులను సాధించారు. వెంకటరెడ్డి కనుగొన్న విధానాన్ని పంజాబ్, హరియాణా రాష్ట్రాలలో గోధుమ పంటకు అనుసరించి.. అధిక దిగుబడులను సాధించారు. అనంతరం వెంకటరెడ్డి లక్ష రూపాయల ఖర్చుతో అంతర్జాతీయ పేటెంట్ సాధించగలిగారు. మరోవంక వ్యవసాయంలో విశేష కృషి చేసిన వెంకటరెడ్డికి అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ హైదరాబాద్ సందర్శనకు వచ్చినప్పుడు నేరుగా మాట్లాడే అవకాశం దక్కింది. వ్యవసాయ శాస్త్ర వేత్తలు నార్మన్ బోర్లాగ్, ఎం.ఎస్ స్వామినాథన్లు వెంకటరెడ్డి వ్యవసాయంలో అనుసరిస్తున్న మెలకువలను అడిగి తెలుసుకున్నారు. విశేష కృషికి ఉత్తమ గుర్తింపు ⇒ రైతు సేవలను గుర్తించి ప్రోత్సహించడంలో ముందుండే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2006లో వెంకటరెడ్డికి ఆదర్శ రైతు పురస్కారాన్ని అందించి ప్రోత్సహించారు. ఆహార ఉత్పత్తిని పెంచడానికి ఆయన కృషిని ప్రశంసించారు. ⇒ సేంద్రియ ఎరువులను ఉపయోగించి వరి, గోధుమ, ద్రాక్ష పంటల దిగుబడి రెట్టింపు చేశారు వెంకటరెడ్డి. ⇒ దేనికీ పనికి రాని చెట్టు ఆకులను ఎరువుగా ఉపయోగించి పంట దిగుబడి పెంచడానికి కృషి చేస్తున్నారాయన. ⇒ నారు పోయడం, నాటు వేయడం, కలుపుతీయడం వంటి పనులు లేకుండా ఒకేసారి వరి, ఇతర ఆరు రకాల పంటలను సాగు చేసేందుకు వీలుగా ఓ యంత్రాన్ని తయారు చేసి వ్యవసాయ శాస్త్రవేత్తలకు వివరించారు. ఇందుకు పేటెంట్ హక్కు పొందడం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ⇒ ’దేశంలోని పలు వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు వెంకట్‌రెడ్డి వ్యవసాయ క్షేత్రానికి వచ్చి అధ్యయనం చేస్తుంటారు. ⇒ 1990లో మాజీ గవర్నర్ కుముద్‌బెన్ జోషి ద్రాక్ష తోటను సందర్శించి వెంకట్‌రెడ్డిని అభినందించారు. ⇒ ఐసీఎఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్) డైరెక్టర్ జనరల్ పరోడా, డైరెక్టర్ మిశ్రాలు వెంకటరెడ్డిని కలిసి వ్యవసాయ అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషి ప్రశంసించారు. భవిష్యత్ లక్ష్యాలు ఇవీ.. ⇒ భారత దేశం పంటలు ప్రపంచంలోనే గుర్తింపు పొందాలి. ⇒ తినే ఆహారంలో పోషక పదార్థాలే ఉండాలి. ⇒ రైతు వ్యవసాయ ఉత్పత్తి ఖర్చు, సమయం తగ్గించాలి. ⇒ తాను చేసే ప్రతి పరిశోధన భారతీయులకే సొంతం కావాలి. జీవన ప్రస్థానం ఇదీ.. 1950 డిసెంబర్ 22న అల్వాల్‌లో చింతల వెంకటరెడ్డి జన్మించారు. ప్రీ యూనివర్సిటీ కోర్సు (పీయూసీ) బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ చదివారు. స్వతహాగా రైతు కుటుంబం నుంచి వచ్చిన వెంకటరెడ్డి వ్యవసాయంపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించేవారు. ఆంధ్రపదేశ్ ద్రాక్ష రైతు అభివృద్ధి సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. జాతీయ పరిశోధన సంస్థ పుణే విభాగంలో సభ్యుడిగా ఉన్నారు. 1990లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్రాక్ష రత్న అవార్డు ప్రదానం చేసింది. ఆయన సేవలకు గుర్తింపుగా ఎన్నో అవార్డులు వచ్చాయి. దీంతోపాటు పద్మశ్రీ అవార్డు వరించడం పట్ల వెంకటరెడ్డి కుటుంబ సభ్యులు, స్నేహితులు, రైతు మిత్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయమంటే ప్రాణం.. రైతు బిడ్డగా జన్మించిన నేను వ్యవసాయాన్నే నమ్ముకున్నాను. పది మందికి ఆహారం అందించే రైతే అందరికన్నా మిన్నా. నేలను సారవంతంగా మార్చడానికి అనుసరించాల్సిన పద్ధతి, సేంద్రియ ఎరువులతోనే పంటను పండించి పోషక పదార్థాలున్న ఆహారాన్ని అందించాలన్నదే తన లక్ష్యం. భూమిలోనే అన్ని రకాల పోషక పదర్థాలు ఉన్నాయి. కృత్రిమంగా తయారు చేసిన రసాయన మందులు, ఎరువులు ఉపయోగించి సారవంతమైన నేలను పాడు చేయడంతోపాటు దానితో పండిన పంట సైతం విషతుల్యంగా మార్చుతున్నాం. రసాయన ఎరువులు వాడడం వలన రైతుకు పెట్టుబడి పెరగడంతో వ్యవసాయం భారంగా మారుతుంది. ఇకనైనా మన వ్యవసాయ పద్ధతి మారాలి. ఇందుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలి. భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించడంతో నా బాధ్యత మరింత పెరిగింది. – చింతల వెంకటరెడ్డి, రైతు (శాస్త్రవేత్త) -
ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన బస్సు: ఇద్దరి మృతి
సాక్షి, హైదరాబాద్: అల్వాల్ పోలీసు స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన బుధవారం కరీంనగర్ రాజీవ్ రహదారిపై జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. మృతి చెందిన యువకులు జగదీష్, శిరీష్‌గా గుర్తించారు. పుట్టినరోజు వేడుకలకు వెళ్లి వస్తుండగా హాకీంపేటలో నమస్తే తెలంగాణ కార్యాలయం సమీపంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. తూముకుంటలోని తమ బంధువుల ఇంటికి నుంచి తెల్లవారు జామున తమ పల్సర్ బైక్‌పై తిరిగి వెళ్తుండగా హాకీంపేట టర్నింగ్ వద్ద జగిత్యాలకు చెందిన పూజిత ట్రావెల్స్ బస్సు ఎదురుగా వచ్చి ఢీ కొట్టడంతో వారు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పోస్టుమర్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. -
అల్వాల్‌లో అమానుషం
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ సమీపంలోని అల్వాల్‌లో అమానుషమైన ఘటన చోటుచేసుకుంది. కారుకు అడ్డువచ్చాడని ఓ బాలుడిని క్రాంతి స్వరూప్ అనే వ్యక్తి తీవ్రంగా కొట్టాడు. బాలుడు బోరున విలపించినా కనికరం చూపకుండా దారుణంగా వ్యవహరించాడు. లిఫ్ట్‌లోకి తీసుకెళ్లి విక్షణారహితంగా బాదాడు. ఈ ఘటన అల్వాలోని సువర్ణ అపార్ట్మెంట్లో సోమవారం జరిగింది. క్రాంతి స్వరూప్ దుర్మార్గమంతా అపార్టమెంట్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. తీవ్ర గాయాల పాలైన బాలుడిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. క్రాంతి స్వరూప్‌పై బాలుడి తండ్రి సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
ప్రత్యూష అంత పిరికిది కాదు: కిషన్‌రావు
సాక్షి, హైదరాబాద్ : తన కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని అల్వాల్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డ వివాహిత ప్రత్యుష తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తన అల్లుడు శశికాంత్‌రావే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని, అతడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం కూకట్‌పల్లికి చెందిన కిషన్‌రావు కుమార్తె ప్రత్యుషకు అల్వాల్ న్యూ రెడ్డి ఎన్‌క్లేవ్‌కు చెందిన శశికాంత్‌రావు అలియాస్ రాముతో 2013లో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ.20 లక్షల నగదు, కిలో బంగారం కట్న కానుకలుగా ఇచ్చారు. వీరికి ఓ కుమార్తె. రెండేళ్ల క్రితం శశికాంత్ అదనపు కట్నం కోసం వేధించడంతో కిషన్‌రావు స్థలాన్ని అమ్మి రూ.50 లక్షలు ముట్టచెప్పాడు. అయితే మళ్లీ కొద్దిరోజులుగా భర్త నుంచి వేధింపులు అధికం కావడంతో ప్రత్యుష బుధవారం ఉదయం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే మృతురాలి తల్లిదండ్రులు మాత్రం తన కుమార్తెది హత్యేనని, ఆత్మహత్య కాదని చెబుతున్నారు. ఆరేళ్ల నుంచి తన కుమార్తెను వేధింపులకు గురి చేస్తున్నాడని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. శశికాంత్‌రావు గతంలో బినామీలు పేరుతో భూ కబ్జాలకు పాల్పడుతున్నాడని, ఎక్స్ సర్వీస్‌మెన్ కృష్ణారెడ్డి భూమిని లాక్కొని బెదిరింపులకు పాల్పడ్డాడని కిషన్‌రావు తెలిపాడు. ప్రత్యుష అనుమానాస్పద మృతితో పాటు, శశికాంత్‌రావు కబ్జాలపై పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ జరపాలని డిమాండ్ చేశారు. -
తగులబెట్టబోయి..
అల్వాల్ : నెల మామూళ్లు ఇవ్వనందుకు గోదాంపై పెట్రోల్‌పోసి నిప్పంటించిన యువకుడు ఆదే మంటల్లో గాయపడి ఆసుపత్రిలో ప్రాణపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అల్వాల్‌కు చెందిన శ్యామ్ స్థానిక జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయం సమీపంలో ఎంబి సౌండ్స్ పేరుతో శుభకార్యాలకు డెకరేషన్, లైట్లు, జనరేటర్లను అద్దెకు ఇచ్చే వ్యాపారం నిర్వహిస్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం గోదాంలో నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో అదే ప్రాంతానికి చెందిన నవీన్‌యాదవ్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. గాయపడిన నవీన్‌ను చికిత్స నిమిత్తం పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. మాముళ్లు ఇవ్వనందుకే: గోదాం యజమాని శ్యామ్ బాధితుడు నవీన్ యాదవ్ నెలకు రూ. 10 వేలు మామూళ్లు ఇవ్వాలని కొంతకాలంగా తనను వేధిస్తున్నాడని అందుకు అంగీకరించకపోవడంతో గోదామును తగులబెడతానని హెచ్చరించినట్లు యజమాని శ్యామ్ తెలిపారు. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం గోదాంలో పనిచేసే సంపత్తో పెట్రోల్ తెప్పించి గోదాంలోకి వెళ్లి నిప్పంటించి తలుపులు మూసి బయటివచ్చి నిలబడినట్లు తెలిపాడు. గోదాంలోని బ్యాటరీలు పేలడంతో మంటలు ఎగిసిపడి నవీన్‌పై పడడంతోనే గాయపడినట్లు తెలిపాడు. తనతోపాటు పలువురిని మాముళ్ల కోసం వేదిస్తున్నాడని పోలీసులు సైతం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. సంఘటనా స్థలాన్ని ఏసీపీ శ్రీనివాసరావు, సీఐ శ్రీకాంత్‌గౌడ్ పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇదిలా ఉండగా నవీన్‌యాదవ్‌పై గతంలోనూ పలు కేసులు నమోదయ్యాయని స్థానికంగా సెటిల్మెంట్లు, బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు అందాయని పోలీసులు తెలిపారు. -
చిన్నారిని చితకబాదిన ‘నారాయణ’ టీచర్!
సాక్షి, అల్వాల్: హోమ్‌వర్క్ చేయలేదని విద్యార్థిౖపె అధ్యాపకురాలు చేయి చేసుకుంది. దీంతో విద్యార్థి తలకు గాయమై ఆసుపత్రిపాలయ్యాడు. బాలల హక్కుల సంఘం సభ్యులు అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు.. అల్వాల్‌లో నివసించే శివకుమార్ కుమారుడు ఇషాక్ న్యూటన్(9) ఓల్డ్ అల్వాల్ చౌరస్తాలోని నారాయణ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. శనివారం పాఠశాలకు వెళ్లిన విద్యార్ధిని తరగతి గదిలో టీచర్ మహాలక్ష్మి హోమ్‌వర్క్ చేయలేదని చితకబాదింది. దీంతో విద్యార్ధికి తలకు గాయమై రక్తస్రావం కావడంతో దగ్గరిలోనే ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. అనంతరం తల్లి దండ్రులకు సమాచారం అందడంతో ఆసుపత్రికి వచ్చి పాఠశాల సిబ్బందిని నిలదీశారు. బాలల హక్కుల సంఘం ప్రతినిధి అచ్యుత్‌రావు విద్యార్ధి తండ్రి శివకుమార్‌ను సంప్రదించి వివరాలు తెలుసుకున్నాడు. అనంతరం అల్వాల్ పోలీసుకులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో పోలీసులు టీచర్‌పై 324, జూవైనల్ యాక్ట్ 75 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయమై ప్రిన్సిపల్ కళ్యాణి మాట్లాడుతూ.. విద్యార్ధిని ఉద్దేశపూర్వకంగా కొట్టలేదని జరిగిన దానికి తల్లి దండ్రులకు క్షమాపణలు తెలిపామన్నారు. పిల్లాడికి వైద్య ఖర్చులు భరించడంతో పాటు త్వరలో ఇలాంటి సంఘటనలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. విద్యార్థులను చితకబాదడం అమానుషమని, ఇది బాలల హక్కులను హరించడమేనని బాలల హక్కుల సంఘం ప్రతినిధి అచ్యుత్‌రావు అన్నారు. -
ఇద్దరు పిల్లలు సహా తల్లి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: నగరంలోని అల్వాల్‌లో దారుణం చోటు చేసుకుంది. స్థానిక గంగపుత్ర కాలనీలో నివాసముంటున్న స్వప్న(40) తన ఇద్దరు పిల్లలు గాయత్రి(17), మనోజ్(14)లకు ఎలకల మందు కలిపిన పాలు ఇచ్చి అనంతరం తాను తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఇది గుర్తించిన స్థానికులు వారిని 108 సాయంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఆత్మహత్యాయత్నం చేసుకున్నారని స్థానికులు భావిస్తున్నారు. -
ఆల్వాల్‌లో భారీ చోరీ
అల్వాల్: నగరంలోని అల్వాల్ పోలీసు స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. స్థానిక భూపతిరావునగర్(ఓల్డ్ అల్వాల్)లో ఓ ఇంట్లో సోమవారం రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇంట్లోకి చొరబడిన దొంగలు 33 తులాల బంగారు ఆభరణాలు, 2 కిలోల వెండి, రూ. 50 వేల నగదు చోరీ దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగిని పై అత్యాచార యత్నం
హైదరాబాద్: విధులు ముగించుకుని క్యాబ్‌లో వస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై అత్యాచార యత్నం జరిగింది. ఆల్వాల్ పీఎస్ పరిధిలో సోమవారం వేకువజామున ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగిని క్యాబ్‌లో ఇంటికి వెళ్తుండగా.. అదే సమయంలో కారులో ఉన్న క్యాబ్ సూపర్‌వైజర్‌తోపాటు డ్రైవర్ ఆమెపై లైంగిక దాడికి యత్నించారు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించటంతో ఇద్దరు నిందితులు పరారయ్యారు. దీనిపై బాధితురాలు ఆల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ మేరకు కేసు విచారణ చేపట్టి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని ఆల్వాల్ పీఎస్‌కు తరలించారు. అనంతరం కమిషనర్ కార్యాలయానికి తీసుకెళ్లి విచారణ జరుపనున్నట్టు సమాచారం. -
ఆ నేతలపై ఫిర్యాదు చేసినందుకు..
పంజగుట్ట: అధికార పార్టీ నేతల భూకబ్జాలపై ఫిర్యాదు చేసినందుకు తనపై దాడి చేశారని అల్వాల్‌కు చెందిన సాయి ప్రసాద్ ఆరోపించారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడుతూ టీఆర్ఎస్ గ్రేటర్ అధ్యక్షులు మైనంపల్లి హనుమంతరావు, నాయకుడు నక్కా ప్రభాకర్ అల్వాల్‌లో ఆక్రమించుకున్న స్థలంలో రెండు అంతస్థులకు అనుమతి తీసుకుని మరో రెండు అంతస్థులు అక్రమంగా కట్టిన భవనాలపై ఆర్టిఏ ద్వారా సమాచారం తీసుకుని జీహెచ్ఎంసీ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిర్యాదు చేశానన్నారు. దీంతో నక్కా ప్రభాకర్ అతని అనుచరులు తన ఇంటì కి వచ్చి తనపై దాడులు చేశారని, ఫిర్యాదు వాపస్ తీసుకోకపోతే చంపేస్తామని బెదిరించినట్లు తెలిపాడు. తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని కోరాడు. ఈ విశయమై పోలీస్‌స్టేషన్ లో ఫిర్యాదు చేశానని, త్వరలో హెచ్ఆర్సీని కూడా ఆశ్రయిస్తానని తెలిపారు. -
ముగ్గురు విద్యార్థినులు అదృశ్యం
హైదరాబాద్: స్కూలుకు వెళ్తున్నామంటూ ఇంటి నుంచి బయలుదేరి వెళ్లిన ముగ్గురు బాలికలు తిరిగి రాలేదు. ఈ ఘటన ఆల్వాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆల్వాల్, జవాహర్‌నగర్‌లకు చెందిన చెందిన సౌభాగ్య, నేహ, నిత్యఅనే విద్యార్థినులు సోమవారం స్కూలుకని చెప్పి వెళ్లారు. సాయంత్రం అయినా వారు తిరిగి రాలేదు. దీనిపై కుటుంబసభ్యులు పాఠశాలలో వాకబు చేయగా వారు స్కూలుకు రాలేదని తేలింది. ఈ మేరకు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరంతా బొల్లారంలోని త్రిశూల్ పాఠశాలలో పదో తరగతి చదువుకుంటున్నారు. -
చెరువులను తలపిస్తున్న ప్రధాన రహదార్లు
-
భర్త కోసం భార్య ఆందోళన
హైదరాబాద్: నగరంలోని ఆల్వాల్‌లోని అత్తింటి ముందు భర్త కోసం ఓ భార్య ఆందోళనకు దిగింది. ఆరు నెలల క్రితం మీనాక్షి, తిరుమల్ అనే ఇద్దరు యువతీ యువకులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఇపుడు భర్త తిరుమల్ ఇల్లు వదిలి పారిపోయాడు. ప్రేమించిన వాడిని నమ్ముకుని మీనాక్షి అందరినీ కాదని ఇల్లు వదిలి వచ్చేసింది. న్యాయం చేయమని అడిగితే సెటిల్ మెంట్ చేసుకోమని పోలీసులు సలహా ఇచ్చారని, తనకు న్యాయం జరగకపోతే అత్తింటి ముందు ఆత్మహత్య చేసుకుంటానని బాధితురాలు తెలిపింది. తిరుమల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. మూడు నెలలుగా మీనాక్షి ఇంటి అద్దె చెల్లించలేని స్థితిలో ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వేడి పాలు మీదపడి బాలుడి మృతి
అల్వాల్ : మూడేళ్ల పసి బాలుడు వేడి పాలు మీదపడి మృత్యువాత పడ్డాడు. ఎస్ఐ రఘురాములు తెలిపిన వివరాల ప్రకారం... మచ్చబొల్లారం గణేష్ నగర్లో నివసించే మల్లేష్ స్థానికంగా తోపుడు బండిపై లస్సీ విక్రయిస్తుంటాడు. శుక్రవారం నాడు రోజు మాదిరిగానే పాలు తీసుకువచ్చి వెడల్పాటి గిన్నెలో వేడి చేసి ఇంట్లో ఉంచాడు. మల్లేష్ కుమారుడు కౌశిక్ (3) ఇంట్లో ఆడుకుంటూ వేడి చేసిన పాలగిన్నె వద్ద పడిపోయాడు. దీంతో వేడి పాలు ఒంటి మీద పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
200 లీటర్ల నీలి కిరోసిన్ స్వాధీనం
అల్వాల్ (హైదరాబాద్) : అల్వాల్‌లోని ఓ గోదాముపై శనివారం ఎస్ఓటీ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన 200 లీటర్ల నీలి కిరోసిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒకరిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
అల్వాల్ లో కార్డాన్ సెర్చ్
అల్వాల్ (హైదరాబాద్) : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అస్మత్ పేట, అంజయ్య నగర్లలో పోలీసులు ఆదివారం ఉదయం కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. మల్కాజ్గిరి డీసీపీ రమా రాజేశ్వరి ఆధ్వర్యంలో 350 మంది పోలీసుల బృందం విస్తృత తనిఖీలు జరిపారు. ఈ తనిఖీల్లో 23మంది అనుమానితులను అదుపులోకి తీసుకోగా, సరైన పత్రాలు చూపించని 51 బైక్‌లు, 3 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే దొంగతనాలకు పాల్పడుతున్నారనే అనుమానంతో కొందరి నుంచి 20 గ్యాస్ సిలిండర్లు, ఓ సీపీయూ, రెండు మానిటర్లు స్వాధీనం చేసుకున్నారు. -
గొంతుపై కత్తి పెట్టి దోపిడీ
అల్వాల్ (హైదరాబాద్) : ఇద్దరు దుండగులు పట్టపగలే ఓ ఇంట్లోకి ప్రవేశించి మహిళ మెడపై కత్తి పెట్టి భారీ దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటన నగరంలోని అల్వాల్ సూర్యానగర్‌లో శనివారం మధ్యాహ్నం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పి.జయ(30) అనే మహిళ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఇద్దరు దుండగులు వచ్చి తలుపు తట్టారు. ఆమె తలుపు తీసిన వెంటనే ఒక దుండగుడు మెడపై కత్తి పెట్టగా, మరో దుండగుడు బీరువాలో ఉన్న లక్ష నగదును, పుస్తెలతాడు సహా 20 తులాల బంగారు ఆభరణాలను దోచుకుని పరారయ్యారు. ఈ పరిణామంతో షాక్‌కు గురైన గృహిణి జయను స్థానికంగా ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
అత్తవారింట నవ వధువు ఆత్మహత్య
అల్వాల్ (హైదరాబాద్): ఓ ప్రేమ జంట పెద్దల అంగీకారంతో రెండు నెలల క్రితమే పెళ్లి చేసుకుంది. ఇంతలోనే నవ వధువు అనుమానస్పద స్ధితితో అత్తవారింట్లో ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం....నిజామాబాద్ జిల్లా భోదన్‌కు చెందిన వెంకటేశ్వరరావు, మోహిణి దంపతుల కుమార్తె లాస్యప్రియ (26), కేరళకు చెందిన అభిషేక్ (27) నగరంలో ఎంబీఏ చదువుతూ ప్రేమలో పడ్డారు. పెద్దల అంగీకారంతో ఫిబ్రవరి 27న వివాహం చేసుకున్నారు. అల్వాల్‌లోని పంచశీల కాలనీలో కలసి ఉంటున్నారు. అయితే, బుధవారం ఉదయం లాస్య తాను నిద్రించిన గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని గమనించిన అభిషేక్ కుటుంబ సభ్యులు లాస్యప్రియ తండ్రికి ఫోన్ చేసి తెలిపారు. పంచశీల కాలనీకి చేరుకున్న లాస్యప్రియ తల్లిదండ్రులు తమ కుమార్తెను అభిషేక్ కుటుంబ సభ్యులే కారణమని ఆరోపిస్తూ అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న లాస్య ధైర్యవంతురాలని, ఆత్మహత్య చేసుకునేంత పిరికితనం లేదని పేర్కొన్నారు. వరకట్నం గురించి అభిషేక్ కుటుంబ సభ్యులు వత్తిడి తెచ్చేవారని ఈ క్రమంలోనే లాస్యను హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించి ఉంటారని ఆరోపించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆరుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్
హైదరాబాద్: నరంలోని అల్వాల్ పరిధిలోని మంగాపురం కాలనీలో పేకాట ఆడుతున్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. రోజూ పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారం మేరకు బుధవారం సాయంత్రం ఓ ఇంటిపై దాడి చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.26 వేలు, 4 బైకులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. -
నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి యత్నం
హైదరాబాద్: కూతురు వరుసైన నాలుగేళ్ల చిన్నారిపై ఓ దుర్మార్గుడు లైంగికదాడికి యత్నించాడు. పోలీసుల కథనం ప్రకారం....మహబూబ్‌నగర్‌కు చెందిన భాస్కర్ (28) అల్వాల్‌లో ఉంటూ కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. మనస్పర్థలు రావడంతో భార్య ఇతడిని విడిచిపెట్టి కొన్ని రోజుల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. కాగా, భాస్కర్ బుధవారం అన్నకూతురు వరుసయ్యే చిన్నారి (4)పై లైంగికదాడికి యత్నించాడు. చిన్నారి ఏడవడంతో తల్లి గమనించి కేకలు వేయడంతో విషయం బయట పడింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు భాస్కర్‌ను అరెస్ట్ చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు. (అల్వాల్ ) -
గురుప్రసాద్ ఇంట్లో పోలీసుల తనిఖీ
హైదరాబాద్: కన్నబిడ్డలను చంపి ఆత్మహత్య చేసుకున్న ప్రొఫెసర్ గురుప్రసాద్ కేసు విచారణలో భాగంగా బుధవారం అల్వాల్‌లోని ఆయన నివాసాన్ని, మేడ్చల్‌లోని ఓపెన్ ప్లాట్‌ను పోలీసులు తనిఖీ చేశారు. గురుప్రసాద్ ఇంట్లో నుంచి డైరీ స్వాధీనం చేసుకున్నారు. మొదట చిన్నారుల జాడ తెలియకపోవడంతో మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు ఇప్పుడు వారు హత్యకు గురికావడంతో హత్య కేసుగా సెక్షన్ మార్పు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలాగే, చిన్నారులను పూడ్చి పెట్టడానికి గొయ్యి తవ్విన కూలీల గురించి వాకబు చేస్తునానరు. గురుప్రసాద్ ఫోన్ కాల్స్ డేటాను కూడా పూర్తి స్థాయిలో విశ్లేషిస్తున్నారు. -
బాబుని రూ.లక్షకు అమ్మకానికి పెట్టిన తల్లి!
-
బాబుని అమ్మకానికి పెట్టిన తల్లి!
-
బాబుని రూ.లక్షకు అమ్మకానికి పెట్టిన తల్లి!
హైదరాబాద్: ఆల్వాల్ ప్రాంతంలో ఆర్థిక పరిస్థితుల కారణంగా ఓ తల్లి కన్న బిడ్డని అమ్మకానికి పెట్టింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం శైలజ అనే మహిళ చంకలో ఓ మగబిడ్డని పెట్టుకొని అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాబుని కిడ్నాప్ చేసి తీసుకువచ్చి ఉంటారని తొలుత స్థానికులు భావించారు. పోలీసులు రంగంలోకి దిగి శైలజను, ఆమె చేతిలోని బిడ్డను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను విచారించడంతో ఆర్థిక పరిస్థితుల కారణంగా బిడ్డను అమ్మకానికి పెట్టినట్లు తెలిపింది. ఆ తన బాబేనని చెప్పింది. తాను ఆల్వాల్ బొల్లారంలో ఉంటానని, తనను భర్త వదిలివేయడంతో బాబుని పోషించలేని పరిస్థితి ఏర్పడిందని శైలజ తెలిపింది. అందువల్ల ఒక బ్రోకర్ ద్వారా బాబుని లక్ష రూపాయలకు అమ్మడానికి సిద్ధపడినట్లు చెప్పింది. శైలజ చెప్పిన మాటల ఆధారంగా దీని వెనుక ఏదైనా ముఠా ఉందేమోన్న అనుమానంతో పోలీసులు ఆ కోణంలో పరిశోధన చేయడం మొదలుపెట్టారు. శైలజ మాట తీరు అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు వివిధ కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు. ** -
ఆల్వాల్‌లో దారుణం
-
అల్వాల్‌లో బయటపడ్డ పురాతన బావి
-
చిన్నారితో సహా భవనం పైనుంచి దూకి మహిళ ఆత్మహత్య
-
చిన్నారితో సహా భవనం పైనుంచి దూకి మహిళ ఆత్మహత్య
హైదరాబాద్ : హైదరాబాద్ అల్వాల్‌లో విషాదం చోటుచేసుకుంది.అదనపు కట్నం వేధింపులు భరించలేక ఐదు నెలల చిన్నారితో సహా తల్లి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన హైదరాబాద్ అల్వాల్ సీనియర్ సిటిజన్ కాలనీలో బుధవారం చోటుచేసుకుంది. మూడేళ్ల క్రితం త్రిశూల్నాథ్గౌడ్తో స్పందన వివాహాం జరిగింది. అయితే అదనపు కట్నం కోసం కొద్దికాలంగా అత్తా, ఆడపడుచు తో కలిసి భర్త స్పందనను వేధించటం మొదలుపెట్టారు. ఆదివారం సాయంత్రం తల్లిదండ్రుల వద్దకు వెళ్లి తిరిగివచ్చిన స్పందన భర్త వేధింపులు తాళలేక భవనంపై నుంచి దూకింది. అత్తింటి వేధింపుల వల్లే స్పందన ఆత్మహత్య చేసుకుందని బంధువులు ఆరోపిస్తున్నారు. అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. -
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గల్లంతు
కర్నూలు : కర్నూలు జిల్లాలో విషాదం నెలకొంది. జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు వాగులు, చెక్‌డామ్‌లు పొంగి పొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆటో లైటు వెలుతురులో వాగు దాటేందుకు ప్రయత్నిస్తూ .... నీటి ఉధృతికి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గల్లంతు అయ్యారు. గల్లంతు అయినవారిలో మూడు మృతదేహాలు లభించాయి. ఇంకా మూడు నెలల పసికందు కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గోనెగండ్ల మండలం అల్వాల గ్రామానికి చెందిన సుమారు యాభైమంది ఎమ్మిగనూరులో ఓ సభకు హాజరై ఇంటికి తిరిగి వస్తుండగా గత రాత్రి ఈ దుర్ఘటన జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడటంతో స్థానికంగా విషాదం నెలకొంది.