ముగ్గురు విద్యార్థినులు అదృశ్యం
Published Tue, Oct 4 2016 2:06 PM | Last Updated on Fri, Nov 9 2018 4:45 PM
హైదరాబాద్: స్కూలుకు వెళ్తున్నామంటూ ఇంటి నుంచి బయలుదేరి వెళ్లిన ముగ్గురు బాలికలు తిరిగి రాలేదు. ఈ ఘటన ఆల్వాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆల్వాల్, జవాహర్‌నగర్‌లకు చెందిన చెందిన సౌభాగ్య, నేహ, నిత్యఅనే విద్యార్థినులు సోమవారం స్కూలుకని చెప్పి వెళ్లారు. సాయంత్రం అయినా వారు తిరిగి రాలేదు. దీనిపై కుటుంబసభ్యులు పాఠశాలలో వాకబు చేయగా వారు స్కూలుకు రాలేదని తేలింది. ఈ మేరకు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరంతా బొల్లారంలోని త్రిశూల్ పాఠశాలలో పదో తరగతి చదువుకుంటున్నారు.
Advertisement
Advertisement