సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలకు నగరం అతలాకుతలం అవుతోంది. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు వచ్చి చేరుతోంది. డ్రైనేజీ వ్యవస్థలు బాగా లేకపోవడంతో.. మురుగు నీరు ఇళ్లలోకి వచ్చి చేరుతోంది. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అల్వాల్ ప్రాంతంలో అయితే పరిస్థితి దారుణంగా ఉంది. ఇందుకు సంబంధించి ఫిర్యాదులు వెళ్తున్నా జీహెచ్‌ఎంసీ అధికారులు పట్టించుకోవట్లేదట. అందుకే ఓ సామాన్యుడు దూకుడు చర్యకు దిగాడు.
అల్వాల్ ప్రాంతంలో ఓ ఇంట్లోకి వాన నీటి కారణంగా పాము వచ్చిందట. దీంతో వాళ్లు GHMC అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే.. ఆరు గంటలు గడిచినా ఎలాంటి స్పందన రాకపోవడంతో సంపత్ కుమార్ అనే యువకుడికి ఓపిక నశించింది. అందుకే నేరుగా అల్వాల్ GHMC వార్డు ఆఫీసుకు పామును తీసుకొచ్చాడు.
టేబుల్ పై పామును పెట్టి నిరసన తెలిపాడు. పామును చూసి అధికారులు తలో దిక్కు పరుగులు తీశారు. మరి ఇంత ఘోరమా అంటూ ఆ యువకుడు అధికారులను నిలదీయడం.. ఓ వీడియో రూపంలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై అధికారుల స్పందన తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment