ghmc office
-
పార్కింగ్ అడ్డాగా సైక్లింగ్ ట్రాక్!
హైదరాబాద్: నగరాన్ని మరింత అందంగా తీర్చిదిద్దడంతో పాటు ప్రజల కోసం రోడ్ల పక్కన ఫుట్‌పాత్‌లు, సైక్లింగ్ ట్రాక్‌లను జీహెచ్ఎంసీ అధికారులు నిర్మిస్తున్నారు. ప్రధాన రోడ్డుకు ఇరువైపులా సైకిల్ ట్రాక్‌లను అభివృద్ధి చేసి నగర వాసులకు అందుబాటులోకి తీసుకురావాలని ఎన్నికలకు ముందు హడావుడిగా పనులు చేపట్టారు. ఇదే క్రమంలో ఎల్బీనగర్ పరిధిలో చేపట్టిన సైకిల్ ట్రాక్ నిర్మాణాన్ని కాంట్రాక్టర్ మధ్యలోనే నిలిపివేశాడు. అసంపూర్తిగా ఉన్న ఈ సైక్లింగ్ ట్రాక్ వాహనాల అక్రమ పార్కింగ్‌కు అడ్డాగా మారింది. ఉన్నతాధికారులు త్వరగా పనులు పూర్తి చేసి ప్రజలకు ఈ ట్రాక్‌ను అందుబాటులోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు. ► ఎల్బీనగర్ నియోజకవర్గంలోని ఇన్నర్ రింగ్ రోడ్డుకు ఇరువైపులా నాగోలు నుంచి ఎల్బీనగర్ వరకు సైకిల్ ట్రాక్ నిరి్మంచాలని నిర్ణయించిన అధికారులు 8 నెలల క్రితం పనులు ప్రారంభించారు. ► రోడ్డు పక్కన ఉన్న దుకాణాలను తొలగించి ఫుట్‌పాత్‌కు వాహనాలు వెళ్లే రోడ్డు మధ్య సుమారు పది అడుగుల వెడల్పులో ట్రాక్ నిర్మాణం మొదలు పెట్టారు. నాగోలు నుంచి ఆదర్శనగర్ వరకు, ఎల్బీనగర్ శివగంగ కాలనీ దగ్గర కొంత మేరకు పనులు చేసిన కాంట్రాక్టర్ మధ్యలో ఆపేశాడు. ► గత ప్రభుత్వంలో పనులు మొదలెట్టిన కాంట్రాక్టర్ ఇప్పడు చేయకపోవడంతో ఎక్కడిక్కడే నిలిచిపోయి. అర్ధంతరంగా పనులు నిలిపివేసి ప్రజా ధనాన్ని వృథా చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ► సైకిల్ ట్రాక్ పూర్తిగా ఉపయోగంలోకి రాక పోవడంతో కొంత మంది అక్కడ తమ వాహనాలను నిలుపుకుంటూ పార్కింగ్ స్ధలాలుగా ఉపయోగించుకుంటున్నారు. ►జీహెచ్ఎంసీ, పోలీస్ అధికారులు పట్టించుకోక పోవడంతో కోట్లది రూపాయలతో నిరి్మంచిన సైకిల్ ట్రాక్ అక్రమ పార్కింగ్‌కు అడ్డగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ► అధికారుల నిర్లక్ష్యం వల్ల అసలు ప్రారంభించకుండానే ట్రాక్ ధ్వంసమయ్యే ప్రమాదం ఉందంటున్నారు. ► కాంట్రాక్టర్‌కు సకాంలో బిల్లులు రాకపోవడంతోనే పనులను పూర్తి చేయడం లేదని తెలుస్తోంది. ► సైక్లింగ్ ట్రాక్ పనులను కాంట్రాక్టర్ ► నిలిపి వేయడంతో ఈ పనులు అసలు పూర్తవుతాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ► జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తయ్యేందుకు చర్యలు తీసుకొని సైక్లింగ్ ట్రాక్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు. -
యాంకర్ తో వీహెచ్ సరదా ముచ్చట్లు
-
హైదరాబాద్ జిహెచ్ఎంసీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత
-
GHMC ఆఫీస్ లో పాము
-
HYD: పట్టించుకోవట్లేదని పామును వదిలాడు
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలకు నగరం అతలాకుతలం అవుతోంది. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు వచ్చి చేరుతోంది. డ్రైనేజీ వ్యవస్థలు బాగా లేకపోవడంతో.. మురుగు నీరు ఇళ్లలోకి వచ్చి చేరుతోంది. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అల్వాల్ ప్రాంతంలో అయితే పరిస్థితి దారుణంగా ఉంది. ఇందుకు సంబంధించి ఫిర్యాదులు వెళ్తున్నా జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవట్లేదట. అందుకే ఓ సామాన్యుడు దూకుడు చర్యకు దిగాడు. అల్వాల్ ప్రాంతంలో ఓ ఇంట్లోకి వాన నీటి కారణంగా పాము వచ్చిందట. దీంతో వాళ్లు GHMC అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే.. ఆరు గంటలు గడిచినా ఎలాంటి స్పందన రాకపోవడంతో సంపత్ కుమార్ అనే యువకుడికి ఓపిక నశించింది. అందుకే నేరుగా అల్వాల్ GHMC వార్డు ఆఫీసుకు పామును తీసుకొచ్చాడు. టేబుల్ పై పామును పెట్టి నిరసన తెలిపాడు. పామును చూసి అధికారులు తలో దిక్కు పరుగులు తీశారు. మరి ఇంత ఘోరమా అంటూ ఆ యువకుడు అధికారులను నిలదీయడం.. ఓ వీడియో రూపంలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై అధికారుల స్పందన తెలియాల్సి ఉంది. -
డ్రోన్ కెమెరాలతో సెర్చ్ ఆపరేషన్
-
డెక్కన్ మాల్ ఫైల్ ఎక్కడ?.. కూల్చివేతపై సస్పెన్స్!
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లో డెక్కన్ మాల్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించి.. రెండు మృతదేహాలను గుర్తించారు. మంటలు పూర్తిగా చల్లారకపోవడంతో.. డ్రోన్ కెమెరా ద్వారా పర్యవేక్షణ చర్యలు చేపట్టారు అధికారులు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నాం తర్వాత బిల్డింగ్ వెనక రెండు మృత దేహాలను గుర్తించినట్లు తెలుస్తోంది. ఇక ఘోర ప్రమాదానికి కారణమైన బిల్డింగ్ కూల్చివేతపై అనుభవం కలిగిన ఏజెన్సీని జీహెచ్ఎంసీ సంప్రదించినట్లు సమాచారం. అయితే కూల్చివేత విషయంలో ఇంకా క్లారిటీ రాకపోగా.. బిల్డింగ్ ఫైల్ విషయంలో ఇవాళ పెద్ద హైడ్రామానే నడిచింది. డెక్కన్ మాల్ బిల్డింగ్‌కు సంబంధించిన ఫైల్ విషయంలో జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అధికారుల మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ‘ ఫైల్ మా దగ్గర లేదంటే మా దగ్గర లేద’ని అధికారులు వాదులాడుకున్నారు. అయితే.. ఈ అక్రమ భవనంపై ఇప్పటికే నోటీసులు ఇచ్చామని ఓ వర్గం చెప్పడం గమనార్హం. మరోవైపు ఆ ఫైల్ దొరికితేనే.. కూల్చివేతకు సంబంధించి ఓ నిర్ణయం తీసుకోనున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. మరోవైపు ఫైల్‌తో సంబంధం లేకుండా.. భవన కూల్చివేతకు సంబంధించి ఒక స్కెచ్ జీహెచ్ఎంసీ అధికారులు తయారు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. కాబట్టి.. కూల్చివేతపై ఇవాళే ఓ స్పష్టత రావొచ్చని భావిస్తున్నారు. ఇక.. బిల్డింగ్ కూల్చివేతపై నగరానికే చెందిన మాలిక్ ట్రేడింగ్ అండ్ డీమాలిషన్ సంస్థ ప్రతినిధులతో జీహెచ్ఎంసీ ఇప్పటికే సంప్రదింపులు జరిపింది. బిల్డింగ్ కూల్చడం, వ్యర్థాల తొలగింపు అంశాలను పరిశీలించారు ఇంజినీర్లు. బిల్డింగ్ హైట్, ఆకారం, లోపల గదుల ఆధారంగా డిమాలిషన్ చేయడానికి ప్లానింగ్ రూపొందిస్తున్నారు. పరిస్థితులను బట్టి మూడు, నాలుగు రోజుల్లో కూల్చడం పూర్తవుతుందని ఏజెన్సీ నిపుణులు చెప్తున్నారు. ఈ క్రమంలో.. జీహెచ్ ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులతో యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. అయితే.. కూల్చివేతతో చుట్టుపక్కల భవనాల పరిస్థితిపై ఈ ఉదయం ఆందోళన వ్యక్తం కాగా.. జీహెచ్ఎంసీ నుంచి దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. -
జీహెచ్ఎంసీ కార్యాలయంలో అగ్ని ప్రమాదం.. లిఫ్ట్‌లో చిక్కుకున్న సిబ్బంది
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో బుధవారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. జీహెచ్ఎంసీ కార్యాలయంలోని మూడవ అంతస్తులో టాక్స్ సెక్షన్లో మంటలు చెలరేగాయి. కార్యాలయమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. భారీగా మంటలు చెలరేగడంతో ఆందోళనకు గురైన ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. మంటల్లో కార్యాలయంలోని పలు ఫైల్స్ దగ్ధమయ్యాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో లిఫ్ట్ నిలిచిపోవడంతో అందులో ఉన్నవారు కాపాడాలంటూ ఆర్తనాదాలు చేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 3 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకు వచ్చింది. టెర్రస్ పైన పలువురు చిక్కుకున్నారు. దట్టమైన పొగ కారణంగా కిందికి దిగలేని పరిస్థితి నెలకొనడంతో.. ఫైర్ సిబ్బంది వారిని దింపే ప్రయత్నం చేస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ముంచుకొస్తున్న థర్డ్ వేవ్.. అయినా వీడని నిర్లక్ష్యం.. 50% మించడం లేదు! -
GHMC: ఆస్తుల ధ్వంసం, మేయర్ ఆగ్రహం, బీజేపీ కార్పొరేటర్లపై కేసు
సాక్షి, బంజారాహిల్స్: బీజేపీ కార్పొరేటర్లు తమ అనుచరులతో కలిసి జీహెచ్ఎంసీ ఆస్తులను ధ్వంసం చేయడం హేయమైన చర్య అని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. ప్రజాప్రతినిధులుగా ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రజాస్వామ్య పద్ధతిలో అనేక మార్గాలు ఉన్నప్పటికీ మన కార్పొరేషన్ ఆస్తులను మనమే ధ్వంసం చేయడం సరికాదన్నారు. బంజారాహిల్స్‌లోని మేయర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేయర్ విజయలక్ష్మి మాట్లాడారు. ప్రజాప్రతినిధులుగా ఉండి ప్రజల ఆస్తిని ధ్వంసం చేయడంపై బీజేపీ కార్పొరేటర్లు ఆత్మపరిశీలన చేసుకోవాలని, రాజ్యాంగ పరమైన పదవిలో ఉండి ఇలాంటి దాడులకు పాల్పడితే ప్రజలకు వ్యవస్థలపై నమ్మకం పోతుందన్నారు. చదవండి: GHMC: రణరంగంగా మారిన మేయర్ చాంబర్.. తనను కలిసేందుకు అనుమతి ఇచ్చినప్పటికీ రాకపోవడంపై బీజేపీ కార్పొరేటర్లు సమాధానం ఇవ్వాలన్నారు. ఆ విషయాన్ని కూడా రాజకీయం చేస్తూ ఇలాంటి దాడులకు పాల్పడటం సరికాదన్నారు. జీహెచ్ఎంసీ అధికారులు, కార్పొరేటర్లు ప్రజా సమస్యలపై స్పందించి వెంటనే పరిష్కరించటంలో రాజీపడటం లేదన్నారు. తాను నగరంలో భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో లోతట్టు ప్రాంతాలు సందర్శించి అధికారులను, ప్రజలను అప్రమత్తం చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఎల్బీనగర్ జోన్‌లోని సరూర్‌నగర్ ప్రాంతం ఎక్కువ ముంపునకు గురైన సందర్భంలో వెల్ఫేర్ అసోసియేషన్, కార్పొరేటర్లు, అధికారులతో సమీక్ష చేసి తాత్కాలిక, శాశ్వత పరిష్కార చర్యలు తీసుకున్నామని తెలిపారు. కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో జూన్ 29న వర్చువల్ ద్వారా జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా కార్పొరేటర్లు విన్నవించిన సమస్యలను పరిష్కరించినట్లు స్పష్టం ఆమె స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ దృష్ట్యా జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించలేకపోతున్నామని, ఈ విషయం బీజేపీ కార్పొరేటర్లకు తెలిసినప్పటికీ కావాలనే దాడి చేశారని అన్నారు. కార్పొరేటర్లు సహా 20 మందిపై కేసు ఖైరతాబాద్: జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కుర్చీలు, పూల కుండీలు, టేబుల్, అద్దాలను ధ్వంసం చేయడంతో బీజేపీ కార్పొరేటర్లు సహా 20 మందిపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఇరాన్ సదస్సుకు మేయర్‌కు ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: ఇరాన్‌లోని ముషాద్‌నగరంలో ‘భూ సంబంధిత, ఆర్థిక విధానాలు, మున్సిపల్ పాలన బాధ్యతలు’ అంశంపై నవంబర్ 27 నుంచి 30 వరకు నిర్వహించే సదస్సుకు హాజరుకావాలని మేయర్ బొంతు రామ్మోహన్‌ను ఇరాన్ కాన్సులేట్ జనరల్ మహ్మద్ హెగ్బిన్ ఘోమి కోరారు. హెగ్బిన్ ఘోమి శుక్రవారం మేయర్‌తో జీహెచ్ఎంసీ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఇరాన్ లోని ఇస్ఫాన్లో నవంబర్ 22, 24ల్లో జరిగే ఇస్ఫాన్డే ఉత్సవాలకూ మేయర్‌ను ఆహ్వానించారు. మేయర్ రామ్మోహన్ మాట్లాడుతూ, హైదరాబాద్, ఇరాన్ దేశాల మధ్య శతాబ్దాలుగా చారిత్రక, సాంస్కృతిక బంధం ఉందన్నారు. హైదరాబాద్‌లో ఇరాన్ సంస్కృతి, జీవన విధానం బలంగా ఉందని, చివరి నిజాం ఉస్మాన్ అలీఖాన్ హయాంలో ఇది మరింత బలోపేతంగా ఉండేదన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నందున ప్రభుత్వం నుంచి అనుమతి పొందాల్సి ఉందన్నారు. హెగ్బిన్ ఘోమికి చార్మినార్‌ను బహూకరించి దుశ్శాలువతో మేయర్ రామ్మోహన్ çసన్మానించారు. -
జీహెచ్ఎంసీ కార్యాలయంలో అగ్నిప్రమాదం
సాక్షి, హైదరాబాద్ : ఖైరతాబాద్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయంలో అగ్నిప్రమాదం ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేవలం కంప్యూటర్ సెక్షన్లోనే మంటలు చెలరేగడం పలు అనుమానాలకు తావిస్తోంది. వివరాల్లోకి వెళితే... జీహెచ్ఎంసీ కార్యాయంలోని మొదటి అంతస్తులో మంగళవారం ఉదయం మంటలు చెలరేగగా, ఈ ప్రమాదంలో అకౌంట్ సెక్షన్ మొత్తం పూర్తిగా దగ్దం అయ్యింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. మేయర్ బొంతు రామ్మోహన్ ఆరా మరోవైపు అగ్నిప్రమాద ఘటనపై మేయర్ బొంతు రామ్మోహన్ ఆరా తీశారు. ఘటనా స్థలానికిచేరుకున్న ఆయన ప్రమాదానికి గురైన భవనాన్ని పరిశీలించారు. ప్రమాదంపై పోలీస్ కేసు నమోదు చేయాలని జోనల్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఒకే కాంప్లెక్స్‌లో పలు సర్కిల్ కార్యాలయాలతో ఇరుకుగా ఉన్న జోనల్ కార్యాలయం నుంచి సర్కిల్ కార్యాలయాలను ఆయా ప్రాంతాల్లో పూర్తయిన భవనాలకు తరలించాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ అగ్నిప్రమాదం వెనుక ఏమైనా కుట్రదాగివుందా? లేదా ప్రమాదవశాత్తు జరిగిందా? అన్నది పోలీసుల విచారణలో తేలాల్సి వుంది. -
గ్రేటర్ పరిస్థితులపై కాంగ్రెస్ ధర్నా..అరెస్ట్
హైదరాబాద్ : నగరంలో రోడ్లు, నాలాల దుర్భర పరిస్థితికి టీఆర్ఎస్ సర్కారే కారణమంటూ కాంగ్రెస్ నేతలు జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట గురువారం ధర్నాకు దిగారు. యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ..హైదరాబాద్ నగరమంతా స్లమ్‌గా మారిపోయిందన్నారు. రోడ్లు, కాలనీలు జలమయమైనా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరాన్ని సుందరంగా మారుస్తామన్న ప్రభుత్వ ప్రణాళిక ఏమైందని ? అనిల్ ప్రశ్నించారు. ఆందోళన చేస్తున్న పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. దీంతో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. -
ఏసీబీ వలలో జీహెచ్ఎంసీ అధికారి
సికింద్రాబాద్: సికింద్రాబాద్ (సర్కిల్-18) జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఆడిటర్(గణాంకాధికారి)గా పనిచేస్తున్న నిత్యానంద్ లంచం తీసుకుంటూ...శనివారం సాయంత్రం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. రెజిమెంటల్‌బజార్‌కు చెందిన ఉమాదేవి, పద్మావతి ఇరువురు అక్కాచెల్లెల్లు. వారసత్వంగా వారి తల్లిదండ్రుల గృహం ఇరువురు అక్కాచెల్లెల్లకు వచ్చింది. సదరు గృహాన్ని గిఫ్ట్ డీడ్ చేసుకున్న ఉమాదేవి, పద్మావతి గృహం పేరు మార్పిడి కోసం జీహెచ్ఎంసీ కార్యాలయంలోని పన్నుల విభాగంలో నిత్యానంద్‌ను సంప్రదించారు. పేరుమార్పిడి కోసం ఆయన డబ్బు డిమాండ్ చేయడంతో ఉమాదేవి ఎసీబీ అధికారులను సంప్రదించింది. వారు ముందస్తు వ్యూహం మేరకు ఉమాదేవికి రూ. 2000 నగదును ఇచ్చి పంపించారు. ఏసీబీ అధికారుల సూచన మేరకు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో నిత్యానంద్ చాంబర్‌కు చేరుకున్న ఉమాదేవి వెంటతెచ్చుకున్న డబ్బును అప్పగించింది. అప్పటికే జీహెచ్ఎంసీ కార్యాలయంలో మాటువేసి ఉన్న ఏసీబీ డీసీపీ అశోక్‌కుమార్ బృందం దాడి చేసి నిత్యానంద్ తీసుకున్న లంచం డబ్బును స్వాధీనం చేసుకుని ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. పలు ఫైళ్లను, ల్యాప్‌టాప్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. రాత్రి వరకు కార్యాలయంలో ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా ఇదే కార్యాలయంలో శానిటరీ ఇన్స్పెక్టర్గా పనిచేసిన కృపాదానంను గత మే 11న ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రెండు నెలలలోపే ఇరువురు అధికారులు ఏసీబీ వలలో చిక్కడం జీహెచ్ఎంసీ కార్యాలయంలో కలకలం సృష్టించింది. -
ఆర్టీసీ బస్సు బీభత్సం
హైదరాబాద్ : నగరంలోని లిబర్టీలో గల జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద ఓ ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. గురువారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. జీహెచ్ఎంసీ ఆఫీస్ మీదుగా ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి రెండు కార్లపైకి దూసుకెళ్లి డివైడర్ ఎక్కేసింది. ఈ ప్రమాదంలో రెండు కార్లు ధ్వంసం అయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ప్రజానేతల మహాభి షేకం..
ప్రజాపోరులో తుది విజేతల ‘గ్రేటర్’ మహోత్సవం గురువారం ఉత్సాహంగా జరిగింది. అవకాశంలో ‘సగం’ అందిపుచ్చుకున్న మహిళా కార్పొరేటర్లతో సహా నూతనంగా ఎన్నికైన 150 మంది కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ కార్యాలయంలో ప్రమాణస్వీకారం చేశారు. టీఆర్ఎస్ కార్పొరేటర్లు తొలుత ఆ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్లో మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు. అక్కడి నుంచి బస్సుల్లో బల్దియా కార్యాలయానికి చేరుకున్నారు. ఈ ఉత్సవానికి ఆయా పార్టీల మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు హాజరయ్యారు. నిన్నటి దాకా బోసిపోయిన జీహెచ్ఎంసీ కార్యాలయం ఒక్క సారిగా కార్పొరేటర్లు, పార్టీల నాయకులు, కార్యకర్తలతో కళకళ లాడింది. ఉదయం 11 గంటలకు కౌన్సిల్ హాలులో కార్పొరేటర్లంతా నాలుగు భాషల్లో ప్రమాణ స్వీకారం చేశారు.మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక అనంతరం ఒకరినొకరు అభినందనలు చెప్పుకున్నారు. - సాక్షి, సిటీబ్యూరో సమస్యల ‘బండ’ను తొలగిస్తా.. జూబ్లీహిల్స్: నిన్నటిదాకా సాధారణ యువకుడిగా బోరబండ వాసులకు తెలిసిన వ్యక్తి బాబా ఫసియుద్దీన్ నేడు కార్పొరేటర్‌గా.. మహానగర డిప్యూటీ మేయర్‌గా ఎన్నిక కావడం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బోరబండ డివిజన్ నగరం నడిబొడ్డున ఉన్నా అన్నివిధాలా వెనుకబడిన ప్రాంతం. మురికివాడలు, ఇరుకు గల్లీలతో ‘సమస్యల బండగా’ పేరుమోసింది. ఇప్పుడు ఈ ప్రాంత బాగోగులు చురుకైన యువ నాయకుడి చేతుల్లో ఉందని ఇక్కడివారు భావిస్తున్నారు. డిప్యూటీ మేయర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన బాబాను అభినందనలతో ముంచెత్తుతున్నారు. ఇంత హడావుడిలోను ఆయన గురువారం ‘సాక్షి’తో ముచ్చటించారు. తన ప్రాధాన్యతలు, చేయాల్సిన కార్యక్రమాలు వివరించారు. ఆ వివరాలు బాబా మాటల్లోనే.. ‘కలలో కూడా ఊహించని గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ పదవి లభించడం సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, పార్టీ ముఖ్యనేతలకు కృతజ్ఞతలు. డిప్యూటీ మేయర్ పదవి నా బాధ్యతను మరింత పెంచింది. ఇక నా డివిజన్లో చాలా సమస్యలు ఎదురు చూస్తున్నాయి. చిరకాలంగా పెండింగ్‌లో ఉన్న బోరబండలో పోలీస్‌స్టేషన్ నిర్మాణం, బస్‌స్టేషన్, జూనియర్ కాలేజీ, సిటీ బస్‌ల సంఖ్య పెంపు, బస్సులను ఎంఎంటీఎస్‌తో అనుసంధానం, అన్నానగర్ జేఎన్ఎన్యూఆర్ఎం పథకం కింద నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించడం ఇందులో ఉన్నాయి. పలు బస్తీల్లో కమ్యూనిటీహాళ్ల నిర్మాణం, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ, మురుగు, మంచినీటి సమస్యల పరిష్కారం నేను చేయాల్సిన ప్రధాన విధులు. బోరబండ నుంచి హైటెక్ సిటీ వైపు ప్రస్తుతమున్న రవాణా సౌకర్యాలు మరింత పెంచేందుకు కృషి చేస్తాను. కట్టుబొట్టులో సంప్రదాయం సిటీబ్యూరో: కొత్త కార్పొరేటర్లు సంప్రదాయ దుస్తుల్లో నూతనుత్తేజంతో జీహెచ్ఎంసీ కార్యాలయానికి తరలివచ్చారు. టీఆర్ఎస్ కార్పొరేటర్లంతా తెలంగాణ భవన్ నుంచి ప్రత్యేక బస్సుల్లో కొందరు, సొంత వాహనాల్లో మరి కొందరు రాగా...ఎంఐఎం కార్పొరేటర్లు కూడా దారుస్సలాం నుంచి జీహెచ్ఎంసీకి వచ్చారు. హస్తినాపురం కార్పొరేటర్ పద్మ నాయక్ సంప్రదాయక గిరిజన (లంబాడ) దుస్తుల్లో హాజరయ్యారు. ఎంఐఎం కార్పొరేటర్లు పురుషులు షేర్వాణీలోను, మహిళలు బురఖాలోను వచ్చారు. మేయర్‌తో పాటు పలువురు కార్పొరేటర్లు తమ కుటుంబ సభ్యులు, ముత్రులతో హాజరయ్యారు. ఈ అనందం చెప్పలేనిది.. మొదటిసారి ఓటు హక్కు వచ్చింది. నా ఓటు నాకే వేసుకోవడం చెప్పలేనంత అనందం కలిగించింది. చిన్న వయసులో.. చదువుతున్నప్పుడేగా కార్పొరేటర్‌గా అవకాశం రావడం మరిచిపోలేని అనుభూతి. ఇప్పుడు కార్పొరేటర్‌గా ఎన్నికై జీహెచ్ఎంసీలో అడుగు పెట్టడం.. అనుభవజ్ఞులతో కలిసి కూర్చోవడం చెప్పలేనంత సంతోషంగా ఉంది. - ఫహెద్ బిన్ అబ్దుల్ సమద్, ఉప్పుగూడ ఎంఐఎం కార్పొరేటర్ చాలా సంతోషంగా ఉంది తొలిసారిగా కార్పొరేటర్‌గా ఎన్నిక కావడం సంతోషంగా ఉంది. టీఆర్ఎస్ గాలీలో కాంగ్రెస్ పార్టీ పక్షాన విజయం సాధించడం మరింత అనందం కలిగించింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే సమస్యలపై గట్టిగా మాట్లాడేందుకు అవకాశం ఉంటుంది. ప్రజల పక్షాన నా గొంతు వినిపిస్తాను. - శాంతి, నాచారం కాంగ్రెస్ కార్పొరేటర్