సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో బుధవారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. జీహెచ్ఎంసీ కార్యాలయంలోని మూడవ అంతస్తులో టాక్స్ సెక్షన్లో మంటలు చెలరేగాయి. కార్యాలయమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. భారీగా మంటలు చెలరేగడంతో ఆందోళనకు గురైన ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. మంటల్లో కార్యాలయంలోని పలు ఫైల్స్ దగ్ధమయ్యాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.
దీంతో లిఫ్ట్ నిలిచిపోవడంతో అందులో ఉన్నవారు కాపాడాలంటూ ఆర్తనాదాలు చేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 3 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకు వచ్చింది. టెర్రస్ పైన పలువురు చిక్కుకున్నారు. దట్టమైన పొగ కారణంగా కిందికి దిగలేని పరిస్థితి నెలకొనడంతో.. ఫైర్ సిబ్బంది వారిని దింపే ప్రయత్నం చేస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: ముంచుకొస్తున్న థర్డ్ వేవ్.. అయినా వీడని నిర్లక్ష్యం.. 50% మించడం లేదు!
Comments
Please login to add a commentAdd a comment