secundrabad
-
పజ్జన్నకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
ఢిల్లీ : సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ (పజ్జన్న) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. డెహ్రాడూన్ పర్యటనలో ఉన్న పద్మారావుకు గుండెపోటు వచ్చింది. దీంతో అప్రమత్తమైన అనుచరులు ఆయన్ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పలు వైద్య పరీక్షల అనంతరం డాక్టర్లు పజ్జన్న గుండెకు స్టంట్ వేశారు. దీంతో ఆయనకు ప్రాణాపాయం తప్పింది. -
పార్సీల నూతన సంవత్సర వేడుకల్లో.. వింటేజ్ కార్ల ప్రదర్శన!
పార్సీల నూతన సంవత్సర వేడుకలు సికింద్రాబాద్‌లో ఘనంగా జరుపుకున్నారు. గురువారం ఎంజీ రోడ్డులోని ఫైర్ టెంపుల్లో ప్రత్యేక పూజలు చేశారు.ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకుని పార్సీలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన వింటేజ్ కార్ల ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకుంది. – రాంగోపాల్‌పేట్ -
secunderabad: అయోధ్యకు బయలుదేరిన మొదటి ట్రైన్
సాక్షి, హైదరాబాద్: అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం అనంతరం దేశవ్యాప్తంగా ప్రజలు బాలరాముడి దర్శించుకోవటానికి భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అయోధ్యకి ప్రయాణికులతో మొదటి ట్రైన్ బయలుదేరింది. 1400 మంది ప్రయాణికులతో ఈ ట్రైన్ మొదలైంది. Flagged off special train to #Ayodhya from Secunderabad Railway station along with MLA Shri @kvr4kamareddy ji, MLA Shri @Dhanpal_Suranna ji, Shri @ShyamSunder_BJP ji and Senior leaders. #JaiShreeRam pic.twitter.com/32M624iMlv — Kontham Deepika BJP (@KonthamDeepika) February 5, 2024 అయోద్య రైలు కోసం రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అయోధ్య దర్శనం అనంతరం తిరిగి 9వ తేదీన మళ్ళీ సికింద్రబాద్‌కు ప్రత్యేక రైలు రానున్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. -
గూడ్స్ రైలు నుంచి విడిపోయిన బోగీలు
మహబూబ్‌నగర్: రన్నింగ్‌లో ఉన్న గూడ్స్ రైలు నుంచి బోగీలు విడిపోయిన సంఘటన వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండలంలోని ఆరేపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గురువారం ఉదయం కర్నూలు వైపు నుంచి సికింద్రాబాద్ వైపు ఓ గూడ్స్ రైలు వెళుతుండగా 11.15గంటల సమయంలో దానికి సంబంధించిన బోగీలు విడిపోయాయి. ఇది గమనించకపోవడంతో ఇంజన్ ఇంచార్జ్ రైలును అలాగే ముందుకు తీసుకెళ్లాడు. వెంటనే అప్రమత్తమైన గూడ్స్‌రైలు గార్డు వాకీ టాకీ ద్వారా లోకో పైలెట్‌కు సమాచారం అందించడంతో అప్రమత్తమయ్యారు. సుమారు నాలుగు కిలోమీటర్ల వరకు గూడ్స్ రైలు ముందుకు వెళ్లిపోయింది. వెంటనే ఇంజన్‌ను ట్రాక్‌పై వెనక్కి తీసుకొచ్చి బోగీలను జోడించుకుని 20 నిమిషాల్లో మళ్లీ ముందుకు బయల్దేరింది. ఘటన జరిగిన సమయంలో గుంటూరు, తుంగభద్ర రైళ్లు రావాల్సి ఉండగా.. ముందస్తు సమాచారంతో వాటిని కాసేపు నిలిపివేశారు. బోగీలకు మధ్య ఉన్న హెయిర్పంపు కప్ లింగ్ ఊడిపోవడంతోనే ఈ ఘటన చోటుచేసుకుందని రైల్వే అధికారులు పేర్కొన్నారు. -
సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు శుభవార్త
-
కారుమీద కూలిన భారీ వృక్షం
-
భారత ఫుట్‌బాల్ దిగ్గజం.. తెలంగాణ ముద్దుబిడ్డ అస్తమయం
భారత దిగ్గజ ఫుట్‌బాలర్, ఒలింపియన్.. తెలుగు బిడ్డ తులసీదాస్ బలరాం(87) గురువారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో మృతి చెందినట్లు కుటుంబసభ్యులు పేర్కొన్నారు. గతేడాది డిసెంబర్ 26న ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో జాయిన్ అయిన తులసీదాస్ బలరాం మూత్రం ఇన్ఫెక్షన్, ఉదర భాగం సంబంధిత వ్యాధితో బాధపడుతూ చికిత్స తీసుకున్నాడు. అయితే గురువారం ఉదయం పరిస్థితి విషమించి ఆయన కన్నుమూశారు. అంతర్జాతీయ స్థాయిలో ఫుట్‌బాల్ ఆడి దేశఖ్యాతిని పెంచిన తులసీదాస్ బలరాం తెలుగు ప్రాంతానికి చెందినవాడు కావడం మనకు గర్వకారణం. 1936, అక్టోబర్ 4న సికింద్రాబాద్‌లోని బొల్లారంలో జన్మించారు. తన కెరీర్లో జాతీయ జట్టుతో పాటు హైదరాబాద్, బెంగాల్‌లోని ఈస్ట్ బెంగాల్ ఫుట్‌బాల్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. దిగ్గజ ఫుట్‌బాలర్‌గా పేరు పొందిన తులసీదాస్ బలరారం 1962లో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో(Asian Games) గోల్డ్ మెడల్ గెలిచిన భారత ఫుట్‌బాల్ జట్టులో సభ్యుడు. అంతేకాదు 1960 రోమ్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత జట్టులోనూ బలరాం సభ్యుడిగా ఉన్నాడు. భారత ఫుట్‌బాల్ దిగ్గజాలు చునీ గోస్వామి, పీకే బెనర్జీలతో కలిసి తులసీదాస్ బలరాం ఎన్నో మ్యాచ్‌లు ఆడాడు. వీరి త్రయాన్ని హోలీ ట్రినిటీ(Holy Trinity) అని పిలిచేవారు. 1960 ఒలింపిక్స్‌లో భారత్ ఫుట్‌బాల్ జట్టు.. హంగేరీ, ఫ్రాన్స్, పెరులాంటి బలమైన జట్లు ఉన్న గ్రూప్‌లో ఉండడంతో గ్రూప్ ఆఫ్ డెత్‌గా అభివర్ణించారు. హంగేరీతో మ్యాచ్‌లో 2-1తో ఓటమి పాలైంది. అయితే మ్యాచ్‌లో తులసీదాస్ బలరాం గోల్ కొట్టి ఆధిక్యాన్ని తగ్గించగలిగాడు. జట్టులో ఎక్కువగా సెంటర్ ఫార్వర్డ్‌లో ఆడిన తులసీదాస్ బలరాం 1963లో ఆరోగ్య సమస్యలతో ఆటకు గుడ్‌బై చెప్పాడు. ఇక 1962లో తులసీదాస్ బలరాం అర్జున అవార్డు అందుకున్నాడు. తులసీదాస్ బలరాం సాధించిన పతకాలు, అవార్డులు ► ఆసియా క్రీడల్లో బంగారు పతకం: 1962 ► మెర్డెకా టోర్నమెంట్ రన్నరప్: 1959 ► ఈస్ట్ బెంగాల్ తరపున 1958లో IFA షీల్డ్ ట్రోఫీ ► హైదరాబాద్ తరపున సంతోష్ ట్రోఫీ(1956–57) ► బెంగాల్ తరపున సంతోష్ ట్రోఫీ: 1958–59, 1959–60, 1962–63 ► అర్జున అవార్డు: 1962 ► కలకత్తా ఫుట్‌బాల్ లీగ్ టాప్ స్కోరర్: 1961 #OnThisDay 🗓️ in 1962, the #BlueTigers 🐯 won gold 🥇 at the Asian Games, defeating the Republic of Korea 2-1 in the final🙌#BackTheBlue 💙 #IndianFootball ⚽ pic.twitter.com/APnOtTTWva — Indian Football Team (@IndianFootball) September 4, 2021 చదవండి: రికార్డుల్లోకెక్కిన పాక్ బ్యాటర్.. తొలి క్రికెటర్‌గా..! క్రికెట్ దేవుడితో 'రోలెక్స్'.. ఫోటో వైరల్ -
రూట్లు రెడీ.. నాగ్‌పూర్– సికింద్రాబాద్ మార్గంలో వందే భారత్ రైలు?
సాక్షి, కరీంనగర్: దేశ రైల్వే చరిత్రలోనే అత్యంత వేగవంతమైన రైలుగా పేరొందిన ‘వందే భారత్ రైలు’ను పూర్తిస్థాయిలో నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే సిద్ధమైంది. జనవరి 15వ తేదీన సికింద్రాబాద్– విశాఖపట్నం రైలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పట్టాలపైనా వందేభారత్ పరుగులు తీస్తుందా? అన్న సామాన్యుల అనుమానాలకు దక్షిణ మధ్య రైల్వే తెరదించింది. పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల జిల్లాలో రైల్వే లైను ఉంది. సిరిసిల్లకు రూటు ప్రగతిలో ఉంది. ఇటీవల దక్షిణ మధ్య రైల్వే అధికారులు వందేభారత్‌కు అనుగుణంగా ఈ రూట్లలో వేగాన్ని పెంచారు. పెద్దపల్లి– కరీంనగర్, కరీంనగర్– జగిత్యాల, జగిత్యాల–నిజామాబాద్ రూట్లలో ఈ రైలును నడపగలిగితే.. పొరుగున ఉన్న మహారాష్ట్రకు కేవలం మూడు నాలుగు గంటల్లోనే చేరుకునే వీలుంది. ముఖ్యంగా సిరిసిల్ల, జగిత్యాలలోని నేత, వలస కార్మికులకు ఇది ఎంతో అనువుగా ఉంటుంది. అన్ని డివిజన్లలో.. దక్షిణ మధ్యరైల్వే పరిధిలో మొత్తం ఆరు డివిజన్లు సికింద్రాబాద్, నాందేడ్, విజయవాడ, గుంటూరు, గుంతకల్, హైదరాబాద్ ఉన్నాయి. అన్ని రూట్లలోనూ గరిష్ట వేగంతో వెళ్లేలా ఇటీవలే రైల్వేలైన్లను ఆధునీకరించారు. విభజన అనంతరం సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్లు తెలంగాణలో ఉన్నాయి. వందేభారత్ రైలు గరిష్ట వేగం 160 నుంచి 180 కి.మీలతో ప్రయాణించగలదు. అందుకు అనుగుణంగా రైలు పట్టాల సామర్థ్యం పెరగాలి. దక్షిణ మధ్య రైల్వే ఇటీవల చేపట్టిన అప్‌గ్రేడేషన్ పనులతో ఇక్కడ గరిష్ట వేగం 130 కి.మీలకు చేరుకుంది. తెలంగాణలోని మూడు డివిజన్లలో వందే భారత్ రైలును నడపాల్సి వస్తే.. చాలా సెక్షన్లలో 130 కి.మీ గరిష్ట వేగంతో నడిపేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. గరిష్ట వేగం 130 కి.మీ.. కనిష్టవేగం 30.కి.మీ ఈ రైలును మూడు డివిజన్లలోని పలు సెక్షన్లను పరిశీలిస్తే.. సామర్థ్యాన్ని బట్టి వేగం మారుతోంది. ఖాజీపేట– బల్లార్షా సెక్షన్లో 130 కి.మీ గరిష్ట వేగంతో దూసుకెళ్లగలదని అధికారులు తెలిపారు. అదే సమయంలో అతి తక్కువగా మల్కాజిగిరి– మౌలాలి సెక్షన్లో కేవలం 30.కి.మీ స్పీడుకే పరిమితం కావడం గమనార్హం. అయితే, వేగంపై లైన్ అప్‌గ్రేడేషన్‌తోపాటు లెవెల్ క్రాసింగ్స్, రైల్ ట్రాఫిక్ కూడా ప్రభావం చూపుతుంది. అత్యాధునిక సౌకర్యాలు.. ఆటోమేటిక్ డోర్స్, స్మోక్ అలారం, సీసీ టీవీ కెమెరాలు, బయో వ్యాక్యూమ్ టాయ్‌లెట్స్, సెన్సార్‌తో పనిచేసే నల్లాలు, ఫుట్‌రెస్ట్‌లు వంటి ఆధునిక సదుపాయాలున్నాయి. మిగిలిన రైళ్లతో పోలిస్తే.. దీని నిర్వహణ పూర్తిగా భిన్నం. తొలి వందే భారత్ రైలు సర్వీసు 2019 ఫిబ్రవరి 15న ఢిల్లీ– వారణాసి మధ్య ప్రారంభమైంది. ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా మొత్తం ఏడు సర్వీసులు నడుస్తుండగా.. సికింద్రాబాద్– విజయవాడ మధ్య సర్వీసు ప్రారంభమైతే ఆ సంఖ్య ఎనిమిదికి చేరుకుంటుంది. దేశవ్యాప్తంగా దాదాపు 20కిపైగా ప్రాంతాల నడుమ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ నడపాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. అందులో హైదరాబాద్– తిరుపతి, హైదరాబాద్– బెంగళూరు, హైదరాబాద్– నాగ్‌పూర్ మార్గాలు ఉండటం విశేషం. రూటు స్పీడు ►సికింద్రాబాద్– బల్లార్షా 130 కి.మీ. ►ఖాజీపేట–కొండపల్లి 130 కి.మీ. ►సికింద్రాబాద్– ఖాజీపేట 130 కి.మీ. ►మానిక్‌నగర్– విరూర్ (3వలైన్) 110 కి.మీ. ►మందమర్రి– మంచిర్యాల కి.మీ(3వలైన్) 110 కి.మీ. ►మంచిర్యాల– పెద్దంపేట (3వలైన్) 100 కి.మీ. ►పెద్దంపేట– రాఘవపురం (3వ లైన్) 110 కి.మీ. ►రాఘవపురం– కొలనూరు–పొత్కపల్లి (3వలైన్) 90 కి.మీ. ►బిజిగిరి షరీఫ్– ఉప్పల్ (3వలైన్) 100 కి.మీ. ►పెద్దపల్లి– కరీంనగర్ 100 కి.మీ. ►కరీంనగర్– జగిత్యాల(లింగంపేట) 90 కి.మీ. ►జగిత్యాల(లింగంపేట)– నిజామాబాద్ 100 కి.మీ మేడ్చల్– మనోహరాబాద్ 110 కి.మీ మల్కాజిగిరి– మౌలాలి కార్డ్‌లైన్ సెక్షన్లలో 30 కి.మీ. ఈ ప్రాంతానికి ఎంతో మేలు ‘వందేభారత్’ రైలును బల్లార్షా– కాజీపేట మార్గంలో నడపాలి. నాగ్‌పూర్– సికింద్రాబాద్ మార్గంలో వందేభారత్ రైలు ప్రస్తుతం ప్రతిపాదనలో ఉంది. ఈ మార్గంలో రైలు వస్తే.. రామగుండం లేదా మంచిర్యా లకు హాల్టింగ్ కల్పిస్తే.. కోల్‌బెల్ట్ పారిశ్రామిక ప్రాంతాలు, ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. – కామని శ్రీనివాస్, సామాజిక కార్యకర్త రవాణా సదుపాయాలకు పెద్దపీట కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రవాణా సదుపాయాలకు, మౌలిక వసతులకు పెద్దపీట వేస్తుందనడానికి వందేభారత్ రైలే పెద్ద ఉదాహరణ. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ రైలు దేశంలోనే అత్యధిక వేగంతో వెళ్లడం విశేషం. భవిష్యత్తులో దేశంలోని ముఖ్యప్రాంతాలకు దీని సేవలు అందుబాటులోకి వస్తాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలకు సైతం త్వరలో దీని సేవలు అందుతాయి. – బండి సంజయ్, కరీంనగర్ ఎంపీ -
సంక్రాంతి కానుకగా వందే భారత్
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు ప్రజలకు సంక్రాంతి కానుకగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును కేంద్ర ప్రభుత్వం అందించనుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 8వ వందేభారత్ రైలును జనవరి 15న ఉదయం 10:00 గంటలకు ఢిల్లీ నుంచి వర్చువల్ వేదికగా పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి విశాఖపట్నం మధ్య సుమారు 8 గంటల్లో నడిచే ఈ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 10వ నంబర్ ప్లాట్‌ఫాం వద్ద జరుగనుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి హాజరుకానున్నారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రిల్లో ఆగనుంది. వాస్తవానికి వందేభారత్ రైలుకు పచ్చజెండా, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులకు శ్రీకారం, ఇతర అభివృధ్ధి పనుల నిమిత్తం ప్రధాని ఈ నెల 19న తెలంగాణకు రావాల్సి ఉంది. అయితే ప్రీ బడ్జెట్ భేటీల్లో భాగంగా అనేక వర్గాలతో గత కొన్ని రోజులుగా ప్రధాని స్వయంగా సంప్రదింపులు జరుపుతుండటం, త్వరలో జరగనున్న కేబినెట్ విస్తరణకు కసరత్తు నేపథ్యంలో పర్యటన వాయిదా పడినట్టు చర్చ జరుగుతోంది. పర్యటన వాయిదాపై పీఎం కార్యాలయం కిషన్‌రెడ్డి, రాష్ట్ర బీజేపీ నేతలకు బుధవారం సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. -
ప్రేమించిన అమ్మాయి దూరమవుతోందని...
సికింద్రాబాద్: ప్రేమించిన అమ్మాయి దూరం అవుతుందని భావించిన ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన సికింద్రాబాద్ జీఆర్పీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం.. మహబుబాబాద్ వెల్లికుదురు మండలం వావిలాలకు చెందిన దారావత్ సంతోష్(17) ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తుంటాడు. కొంత కాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నానని, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పాడు. 18 ఏళ్లు వయస్సు నిండిన తరువాత పెళ్లి చేస్తామని సంతోష్‌కు వారి తల్లిదండ్రులు నచ్చజెప్పారు. దీంతో సంతోష్ తీవ్ర మనస్తాపానికి గురై ఈ నెల 13న రాత్రి 10 గంటల సమయంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ హైదరాబాద్ ఎండ్ పిట్‌లైన్ వద్ద గుర్తు తెలియని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నాడు. మృతుని జేబులో లభ్యమైన సెల్‌ఫోన్ ఆధారంగా తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు) -
సికింద్రాబాద్‌లో అగ్గిరాజేశారు.. వందల కోట్ల ఆస్తి నష్టం!
ఆర్మీలో స్వల్పకాలిక సర్వీసుల పేరుతో వచ్చిన అగ్నిపథ్ పథకాన్ని నిరసిస్తూ గురువారం దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర ఆందోళన చేపట్టేందుకు ఎన్ఎస్యూఐ కార్యకర్తలు చేరుకున్నారు. అగ్నిపథ్‌ను రద్దు చేయాలంటూ స్టేషన్ ఆవరణలో నినాదాలు చేశారు. ఆ తర్వాత ఒకటో నంబరు ప్లాట్‌ఫారమ్‌పైకి చేరుకున్ని బయలుదేరేందుకు సిద్దంగా ఉన్న రైలు ఇంజను ఎదుట బ్యానర్లు పట్టుకుని నినాదాలు చేశారు. నిరసన కార్యక్రమం అంతా సవ్యంగా సాగిపోతుందనునే దశలో ఒక్కసారిగా అదుపు తప్పింది. అదుపు తప్పింది అప్పటి వరకు ప్రశాంతంగా ఆందోళన చేస్తున్న యువకుల్లో కొందరు అదుపు తప్పారు. రైల్వే ఆస్తులపై దాడులకు తెగబడ్డారు. దీంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఇదంతు ఉదయం 9 గంటల సమయంలో మొదలైంది. యువకుల ఆందోళను అదుపు చేసేంత రైల్వే బలగాలు అందుబాటులో లేకపోవడంతో ఒక్కసారిగా అదుపు తప్పిన ఆందోళన బీభత్సంగా మారిపోయింది. నిమిషాల వ్యవధిలోనే ఒకటో నంబరు నుంచి మూడో నంబరు ఫ్లాట్‌ఫారమ్ వరకు రణరంగంగా మారింది. అయోమయం ఓవైపు ఆవేశంలో ఉన్న యువకులు మరోవైపు వారిని కంట్రోల్ చేసే పరిస్థితి లేకపోవడంతో సికింద్రాబాద్ స్టేషన్ యుద్దక్షేత్రంగా మారిపోయింది. పార్సిల్ కార్యాలయంలోకి చొరబడిన యువకులు అక్కడ చేతికి అందిన వస్తువునుల బయటకు తీసుకువచ్చారు. రైల్వ పట్టాలపై వేసి తగుల బెట్టారు. ఇందులో ద్విచక్ర వాహనాలతో త్వరగా మండిపోయే స్వభావం ఉన్న వస్తువులు ఉండటంతో క్షణాల్లో స్టేషన్ ఆవరణలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఎక్కడ ఏం జరుగుతుందో తెలియిన అయోమయం నెలకొంది. దీంతో రైళ్లలో ఉన్న ప్రయాణిణులు గందరగోళానికి గురయ్యారు. ప్రయాణం స్టేషన్‌కు వచ్చిన వారు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈస్టుకోస్టుకు నిప్పు స్టేషన్లో దట్టమైన పొగలు అలుముకోవడం, మంటలు వ్యాపించడంతో ఇక ఆందోళనకు అడ్డే లేకుండా పోయింది. అరగంట పాటు స్టేషన్లో ఏం జరుగుతుందో తెలియకుండా పోయింది. దీంతో ఆందోళనకారులు మరింతగా రెచ్చిపోయారు. ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ఈస్టుకోస్టు ఎక్స్‌ప్రెస్‌కి నిప్పు పెట్టారు. ముఖ్యంగా ఆ రైలులో పార్సిల్ కౌంటర్ తెరిచే ఉంటంతో మంటలు త్వరగా వ్యాపించాయి. క్షణాల్లోనే ఇతర బోగీలకు చేరుకున్నాయి. దీంతో సికింద్రాబాద్ స్టేషన్ అంతా నల్లని దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఈ ఘటనలో ఈస్ట్‌కోస్టుతో పాటు అజంతా, ఒక ఎంఎంటీఎస్ రైలు బోగీలు మంటల్లో కాలిపోయాయి. అప్రమత్తం ఒక్కసారిగా చెలరేగిన ఆందోళనతో ఇటు రైల్వే అధికారులు, అటు రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు. సికింద్రాబాద్ స్టేషన్‌కు వచ్చే రైళ్లను ఎక్కడిక్కడే నిలిపేశారు. స్టేషన్లో ఉన్న ప్రయాణికులు ఇతరులను బయటకు పంపించారు. రాష్ట్ర పోలీసులు బలగాలను అక్కడికి రప్పించారు. అయితే అప్పటికే స్టేషన్లో భీతావహా వాతావరణ పరిస్థితి నెలకొంది. లాఠీఛార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చే పరిస్థితులు కూడా కనిపించకపోవడంతో ఆందోళన కారులకు పోలీసులు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే భారీ ఎత్తున నష్టం వాటిల్లింది. ఫర్నీచర్ ధ్వంసం ఒకటి నుంచి మూడో నంబరు వరకు ఫ్లాట్‌ఫారమ్స్‌పై భారీగా ఆస్తి నష్టం జరిగింది. స్టేషన్‌పై ఉన్న కేఫ్టేరియాలో కూడా ధ్వంసం అయ్యాయి. లైట్లు, సీసీ కెమెరాలు, చెత్త కుండీలు ఇలా ప్లాట్‌ఫారమ్‌పై కనిపించిన వస్తువులు ధ్వంసం అయ్యాయి. మరోవైపు స్టేషన్ బయట కూడా గందరగోళ పరిస్థితి నెలకొంది. ఆందోళనలకు బయపడిన ప్రయాణికులు కొందరు తమ వస్తువులను స్టేషన్ ఆవరణలోనే వదిలేసి బయటకు పరుగులు తీశారు. మరికొందరు తమ వాళ్లు తప్పిపోయారంటూ ఆందోళన చెందారు. చివరకు ఉదయం 10:30 గంటల సమయంలో పరిస్థితి అదుపులోకి వస్తోంది. అయితే ఈ ఘటనతో తమకు సంబంధం లేదని ఎన్ఎస్యూఐ ప్రటకించింది. టియర్‌గ్యాస్ పదిన్నర తర్వాత పోలీసుల బలగాలు భారీగా చేరుకున్నాయి. దీంతో పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. మరోవైపు స్టేషన్‌కు చేరుకున్న ఫైర్ ఫైటర్లు మంటలను అదుపు చేసే పనిలో ఉన్నారు. ఈ ఘటనలో గాయపడిన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ ఆందోళనలో ఇద్దరు మరణించినట్టు వార్తలు వస్తున్నాయ్. చదవండి: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత -
బోయిగూడ అగ్ని ప్రమాదం: ‘అది పేలడం వల్లే మంటలు వ్యాపించాయి’
సాక్షి, హైదరాబాద్: కార్యాలయాలు, పరిశ్రమలు, వ్యాపార సంస్థల్లో అగ్ని ప్రమాదాలు సంభవిస్తే మంటలు ఆర్పడానికి ఫైర్ ఎగ్ట్సింగ్విషర్స్ (మంటలు ఆర్పే పరికరం) వాడుతుంటారు. అయితే న్యూ బోయగూడలోని స్క్రాప్ దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాదం తీవ్రత పెరగడానికి ఇలాంటి ఫైర్ ఎగ్ట్సింగ్విషరే కారణమైందని పోలీసులు భావిస్తున్నారు. హైదరాబాద్ క్లూస్ టీమ్‌తో పాటు గాంధీనగర్ పోలీసులు ఘటనాస్థలి క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ నేపథ్యంలోనే క్లూస్ అధికారులు కీలక ఆధారాలను సేకరించిన పోలీసులకు అందించారు. వీటి ఆధారంగానే షార్ట్‌సర్క్యూట్ ద్వారా అగ్గి పుట్టి ఉండొచ్చని, ఫైర్ ఎగ్ట్సింగ్విషర్ కారణంగా విస్తరించిందని తేల్చారు. ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. సంబంధిత వార్త: బోయిగూడ అగ్ని ప్రమాదం: గోదాంలో ఉండేది 8 మందే.. ఆ నలుగురు ఎవరంటే! మంటలు మొదలైంది స్టెయిర్ కేస్ వద్దే... ఈ స్క్రాప్ గోదాం నుంచి బిహారీలు బస చేసిన మెజనైన్ ఫ్లోర్‌కు వెళ్లడానికి స్పెరల్ స్టెయిర్ కేస్ ఉంది. దీని పక్కనే ఓ స్విచ్‌బోర్డ్ ఉండగా, మంగళవారం రాత్రి దీని ఎదురుగా ట్రాలీ ఆటో ఆగింది. స్విచ్‌బోర్డ్ చుట్టూ వైర్లు ఉండటంతో పాటు అందులోని ఓ ఫ్యూజ్ కొట్టేసి ఉన్న అధికారులు గుర్తించారు. మిగిలిన ఫ్యూజుల్లో ఒక వైరు కాకుండా కొన్ని వైర్లను కలిపి సర్క్యూట్ ఏర్పాటు చేసినట్లు తేల్చారు. దీని ప్రకారం ఆ గోదాంలో తరచు ఫ్యూజ్ కొట్టేస్తూ ఉంటుందని నిర్ధారించారు. బుధవారం తెల్లవారుజామున జరిగిన షార్ట్‌సర్క్యూట్ కారణంగానే మంటలు అంటుకోవడంతో పాటు ఓ ఫ్యూజ్ కొట్టేసిందని భావిస్తున్నారు. అక్కడే పార్క్ చేసి ఉన్న ఆటోను పరిశీలించిన అధికారులు స్టెయిర్ కేస్ వైపు ఎక్కువగా, రెండో వైపు తక్కువగా కాలినట్లు తేల్చారు. దీని ఆధారంగానూ ఆస్టెయిర్ కేస్ వద్దే అగ్గిపుట్టినట్లు నిర్ధారిస్తున్నారు. బయటి వేడి ఎక్కువ కావడంతోనే... ఈ మంటలు సమీపంలోని స్క్రాప్‌కు అంటుకోవడంతో కాస్త విస్తరించాయి. ఆ సమీపంలోనే ఉన్న ఫైర్ ఎగ్ట్సింగ్విషర్ చుట్టూ మంటలు చేరేసరికి దాని ఉపరితల భాగం బాగా వేడెక్కింది. దీని ప్రభావంతో లోపల ఉండే వివిధ పౌడర్లు వ్యాకోచించడం, వాయువులుగా మారడం ప్రారంభమైంది. దీంతో పైన ఉన్న ఇనుప సిలిండర్‌ను పగులకొట్టకుంటూ ఆ వాయువులు బయటకు చొచ్చుకురావడంతో పేలుడు సంభవించింది. చదవండి: ఆర్ఆర్ఆర్ తొలి గెజిట్‌కు గ్రీన్‌సిగ్నల్.. 113 గ్రామాలు.. 1904 హెక్టార్లు దీని శబ్ధానికే ‘మృత్యుంజయుడు’ ప్రేమ్ లేచి సురక్షితంగా బయటపడ్డాడు. సాధారణంగా ఫైర్ ఎగ్ట్సింగ్విషర్ లోపల నుంచి కార్బన్డయాక్సైడ్ రావాలి. అయితే మంటల వేడి కారణంగా అందులోని పౌడర్లు వివిధ మార్పులు చెంది బయటకు చొచ్చుకువచ్చాయి. దీంతో అవి సమీపంలో ఉన్న మంటను గోదాం మొత్తం విస్తరించేలా చేశాయి. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన పేలుడు ఫైర్ ఎగ్ట్సింగ్విషర్కు సంబంధించిందని అధికారులు గుర్తించారు. వివిధ రకాలైన ఆధారాల సేకరణ... ఘటనాస్థలిలో అణువణువూ పరిశీలించిన పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు, క్లూస్ టీమ్ అధికారులు అనేక ఆధారాలను సేకరించారు. డీఆర్డీఓ ఆస్పత్రికి ప్రేమ్ తరలింపు గాంధీఆస్పత్రి: సికింద్రాబాద్ న్యూబోయిగూడ అగ్నిప్రమాదంలో గాయపడి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు ప్రేమ్‌ను కాంచన్‌బాగ్‌లోని డీఆర్డీఓ అపోలో ఆస్పత్రికి శుక్రవారం తరలించారు. బోయిగూడ ప్రమాదంలో 11 మంది సజీవ దహనం కాగా ప్రేమ్ ఒక్కడే ప్రాణాలతో బయటపడిన సంగతి విదితమే. 20 శాతం కాలిన గాయాలతో బాధపడుతున్న ప్రేమ్‌ను గాంధీ పాస్టిక్సర్జరీ విభాగ హెచ్ఓడీ ప్రొఫెసర్ సుబోధ్ కుమార్ నేతృత్వంలో వైద్యసేవలు అందించారు. వేడి పొగ పీల్చడంతో ఊపరితిత్తుల లోపలి భాగాలు ఇన్ఫెక్షన్కు గురైనట్లు భావించిన వైద్యులు పలుమార్లు ఎక్స్‌రేలు తీశారు. మరింత మెరుగైన వైద్యం అందించాలని భావించి డీఆర్డీఓ అపోలో ఆస్పత్రికి తరలించారు. -
బోయిగూడ అగ్ని ప్రమాదం: గోదాంలో ఉండేది 8 మందే.. ఆ నలుగురు ఎవరంటే!
సాక్షి, బన్సీలాల్‌పేట్: విధి ఒక విష వలయం. విషాద గాథలకు అది నిలయం. ఆ నలుగురు అమాయకులు బలి కావడం కాల వైచిత్రి. తామొకటి తలిస్తే దైవమొకటి తలిచిందన్నట్లు మృత్యువాత పడ్డారు. బుధవారం తెల్లవారుజామున న్యూ బోయగూడలోని స్క్రాబ్ గోదాంలో సంభవించిన అగ్ని ప్రమాదంలో పదకొండు మంది బిహార్ వలస కార్మికులు సజీవ దహనమైన విషయం విదితమే. వీరిలో నలుగురు అనుకోని పరిస్థితుల్లో ప్రాణాలు వదల డంతో కుటుంబీకులను తీవ్ర విషాదానికి గురి చేసింది. మృతుల కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. స్నేహితులను కలిసేందుకు వచ్చి.. స్క్రాబ్ గోదాంలో అనేక మంది పని చేస్తున్నా.. 8 మంది మాత్రమే గోదాం పైఅంతస్తులో రాత్రిపూట నిద్రిస్తుంటారు. ఈ క్రమంలో నగరంలోని అంబర్‌పేటలో పని చేస్తూ అక్కడే నివాసం ఉండే గొల్లుతో పాటు మరో ముగ్గురు తమ మిత్రులను కలిసేందుకు మంగళవారం రాత్రి న్యూ బోయగూడలోని శ్రావణ్ ట్రేడర్స్ స్క్రాబ్ గోదాంనకు వచ్చారు. అందరూ కలిసి భోజనం చేశారు. రాత్రి పొద్దుపోవడంతో వారితో పాటు ఈ నలుగురూ అక్కడే నిద్రించారు. ఆ నిద్రే వారి పాలిట శాపంగా మారింది. శాశ్వత నిద్రకు చేరువచేసింది. ప్రేమ్ మాత్రం.. ప్రమాద సమయంలో కిటికీలోంచి దూకి ప్రాణాలు దక్కించుకున్నాడు. బుధవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం ప్రభావంతో 3.50 గంటలకు సిలిండర్ పేలగా.. దాదాపు ఆరున్నర నిమిషాల తర్వాత అతడు భవనం సన్‌సైడ్ మీదికి దూకాడు. సిలిండర్ పేలుడు ధాటికి భవనం సమీపంలో ఉన్న ఓ శునకం గాయపడినట్లు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. వైద్యుల పర్యవేక్షణలో ప్రేమ్.. అగ్ని ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ప్రేమ్‌కు గాంధీ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. అతని శరీరంపై అయిన పది శాతం కాలిన గాయాల వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. బుధవారం రాత్రి నుంచే అతను సాధారణ పరిస్థితుల్లోనే ఉన్నాడని చెబుతున్నారు. వేడి పొగ పీల్చి ఉండటంతో దాని ప్రభావం అతని ఊపిరితిత్తుల లోపలి భాగంలో ఇన్ఫెక్షన్ రూపంలో ఉండొచ్చని వైద్యులు పేర్కొన్నారు. ఇది తెలియాలంటే కనీసం మరో మూడు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచి ఆపై పరీక్షలు చేయాలని వివరించారు. ఆప్యాయంగా.. ప్రేమగా.. వేర్వేరు చోట పని చేస్తున్నా వీరంతా ఆప్యాయంగా, ప్రేమగా మెలిగే వారు. సెలవులు, పండగలతో పాటు వీలున్నప్పుడల్లా కలుసుకునేవారు. మృత్యువు వీరి బంధాన్ని విడదీసింది. మిత్రులందరిని ఒకేసారి తీసుకెళ్లింది. ఈ దుర్ఘటన కార్మికులకు తీరని వేదనను మిగిల్చింది. ఏప్రిల్‌లో వివాహం.. అంతలోనే విషాదం.. వచ్చే నెల ఏప్రిల్‌లో గొల్లు విహహం జరగాల్సి ఉంది. దీంతో అతను సొంతూరు వెళ్లేందుకు రైల్వే టికెట్ కూడా బుక్ చేసుకున్నాడని, ఇంతలోనే మృత్యువు కబళించిందని స్నేహితులు విలపిస్తున్నారు. మంగళవారం రాత్రి ఆలస్యం కావడంతో అక్కడే ఉండి ఉదయం రావాలని మృతుని బంధువు చెప్పడంతో నిద్రించి ప్రాణాలమీదికి తెచ్చుకున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. కన్నీటి సుడుల మధ్య.. గాంధీ ఆస్పత్రి: న్యూ బోయగూడలో స్క్రాప్ దుకాణంలో బుధవారం సంభవించిన అగ్ని ప్రమాదంలో సజీవ దహనమైన 11 మంది బిహార్ వలస కార్మికుల మృతదేహాలను బంధువుల కన్నీటి సుడుల మధ్య గురువారం పాట్నాకు తరలించారు. అక్కడ నుంచి ప్రత్యేక వాహనాల్లో స్వస్థలాలకు పంపించారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్ దగ్గరుండి పర్యవేక్షించారు. మృతదేహాలకు గాంధీ ఆస్పత్రి మార్చురీలో బుధవారమే పోస్టుమార్టం పరీక్షలు పూర్తి చేశారు. ఎంబామింగ్ చేసి ఫ్రీజర్‌లో భద్రపరిచారు. వీటిని రెండు విడతలుగా అంబులెన్స్‌లో శంషాబాద్ విమానాశ్రయానికి తీసుకువెళ్లారు. కార్గో విమానాల్లో పాట్నాకు తరలించారు. ఉదయం 8 గంటలకు మొదటి విమానంలో ఆరు, మధ్యాహ్నం 2 గంటలకు రెండో విమానంలో అయిదు మృతదేహాలను తరలించారు. మృతుల బంధువులు కొందరు వీటితో వెళ్లారు. పాట్నా విమానాశ్రయం నుంచి ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనాల్లో మృతదేహాలకు స్వస్థలాలకు పంపారు. ప్రమాదానికి కారణాలు కనిపెట్టడంతో పాటు ఇతర ఆధారాల సేకరణ కోసం గురువారం ఘటనాస్థలిలో పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు దర్యాప్తు చేపట్టారు. కొన్ని నమూనాలు సేకరించామని వాటి విశ్లేషణ తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయని ఓ అధికారి పేర్కొన్నారు. -
బోయిగూడ అగ్ని ప్రమాదం: గురువారం ఉదయం మృతదేహాల తరలింపు
Latest Updates ► బోయిగూడ అగ్ని ప్రమాదంలో మరణించిన మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తైంది. ► బోయిగూడ అగ్ని ప్రమాదంలో మరణించిన మృతదేహాలను గురువారం స్వస్థలాలకు తరలించనున్నట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. పోస్టుమార్టం ప్రక్రియ పూర్తి కావడానికి ఈ రోజు సాయంత్రం అవుతుందని పేర్కొన్నారు. శంషాబాద్ విమానాశ్రయం గుండా 3 పాట్నాకు చెందిన విమానాలలో మృతదేహాలను తరలించనున్నట్లు వెల్లడించారు. ►బోయిగూడ అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాల గుర్తింపు జరుగుతోందని హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ తెలిపారు. గాంధీ మార్చురీలో ఇప్పటికే ఆరుగురి మృతదేహాలను గుర్తించినట్లు, మరో అయిదుగురి మృతదేహాలను గుర్తించాల్సి ఉందన్నారు. పోస్టుమార్టం ప్రక్రియలో మొత్తం నాలుగుటీమ్లు పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ మొత్తం వ్యవహారాన్ని హైదరాబాద్ కలెక్టర్, సీపీ సీవీ ఆనంద్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎయిర్ అంబులెన్స్ ద్వారా మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపించనున్నట్లు తెలిపారు. అగ్ని ప్రమాదంపై విచారణకు ప్రభుత్వం ఆదేశించిందని, అనధికరికంగా నిర్వహిస్తున్న స్క్రాప్ గోడౌన్లపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ►బోయిగూడ అగ్ని ప్రమాద స్థలానికి హోంమంత్రి మహమూద్ అలీ చేరుకున్నారు. బోయిగూడ ఘటనపై అధికారులతో విశ్లేషిస్తామని తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు జీహెచ్ఎంసీ, పోలీస్, అగ్నిమాపకశాఖ విజిలెన్స్ అధికారులతో సమావేశం కానున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో స్క్రాప్ గోడౌన్లు ఎన్ని ఉన్నాయో.. ఎలాంటి చర్యలు చేపట్టాలో చర్చిస్తామని పేర్కొన్నారు. జనావాసాల మధ్య గోడౌన్లు చాలా ఉన్నాయని, ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. చదవండి: బోయిగూడ అగ్ని ప్రమాదం.. సీఎం దిగ్భ్రాంతి.. రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా బోయిగూడలో 20కి పైగా స్క్రాప్ గోడౌన్లు కాగా బోయిగూడ ఘటనతో అధికారులు అలెర్ట్ అయ్యారు. అనుమతులు లేని టింబర్లపై అధికారులు దాడులు చేస్తున్నారు. కార్మికుల రక్షణ, సౌకర్యాలపై ఆరా తీస్తున్నారు. ఇక బోయిగూడలో 20కి పైగా స్క్రాప్ గోడౌన్లు ఉన్నట్లు అధికారుల గుర్తించారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. సమగ్ర విచారణ జరపాలి: రేవంత్ రెడ్డి సికింద్రాబాద్‌లోని బోయిగూడ అగ్ని ప్రమాదంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో 11 మంది కార్మికులు మృతిచెందడం అత్యంత బాధాకరమని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చదవండి: Hyderabad: భారీ అగ్నిప్రమాదం.. 11 మంది సజీవ దహనం ఎలాంటి సేఫ్టీ పరికరాలు లేవు: సీవీ ఆనంద్ సికింద్రాబాద్ బోయిగూడలోని టింబర్, స్క్రాప్ గోడౌన్లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ స్పందించారు. స్క్రాప్ గోడౌన్లో షార్ట్ సర్క్యూట్లో మంటలు వ్యాపించాయని. ఆ తర్వాత సిలిండర్ పేలుడు జరగడంతో దట్టమైన పొగ కమ్ముకుందని సీపీ ఆనంద్ తెలిపారు. ప్రమాద సమయంలో కార్మికులంతా నిద్రలో ఉన్నందున ప్రమాద తీవ్రత భారీగా పెరిగిందని పేర్కొన్నారు. గోడౌన్ విషయంలో నిబంధనలు పాటించలేదని, అందులో ప్రమాద నివారణ చర్యలు ఏమీలేవని చెప్పారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్యాస్ సిలిండర్ పేలినట్లు 100కు ఫోన్‌కాల్ వచ్చిందని చెప్పారు. సిలిండర్ పేలడంతోనే మంటలు ఎక్కువగా వ్యాపించాయన్నారు. ఇద్దరు యువకులు పైనుంచి దూకి ప్రాణాలు రక్షించుకున్నారని చెప్పారు. గాయాలైన వ్యక్తితో మాట్లాడితే పూర్తి సమాచారం వస్తుందని తెలిపారు. మృతులు బీహార్‌లోని చప్రా జిల్లాకు చెందినవారని వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. గోదాం యజమానికి అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ప్రమాదం జరిగిన గోడౌన్‌కు ఎంట్రీ, ఎగ్జిట్ ఒక్కటే ఉందన్నారు. అలాగే గోడౌన్లో ఎలాంటి సేఫ్టీ పరికరాలు కూడా లేవని సీవీ ఆనంద్ వివరించారు. మృతులంతా బిహార్‌లోని చప్రా జిల్లాకు చెందినవారని, ఇక్కడ పనిచేసే కార్మికులకు నెలకు రూ. 12 వేలను జీతంగా ఇస్తారని తెలిపారు. పూర్తి స్థాయి విచారణకు ఆదేశించాం: మంత్రి తలసాని బోయిగూడలో అగ్ని ప్రమాదం జరిగిన స్థలాన్ని మంత్రి శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ ఘటన బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాద ఘటనపై పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించామని తెలిపారు. పూర్తి వివరాలు తెలుస్తాయని అన్నారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా అదుకుంటామన్నారు. సాక్షి, హైదరాబాద్: బుధవారం తెల్లవారుజామన సికింద్రాబాద్ బోయిగూడలోని స్క్రాప్ గోడౌన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 11 మంది సజీవ దహనమయ్యారు. మరొకరు ప్రాణాలతో బయట పడ్డారు. సుమారు మూడు గంటలకు పైగా శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది 8 ఫైరింజన్లతో మంటలను ఆర్పివేశాయి. ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్, గవర్నర్ సంతాపం తెలిపారు. మృతుల కుంటుంబాలకు సీఎం కేసీఆర్ రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, ప్రధాని నరేంద్రమోదీ రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలను అగ్నిమాపక సిబ్బంది బయటకు తీశారు. మృతులంతా బీహార్‌కు చెందిన కూలీలుగా గుర్తించారు. మృతులను సికిందర్(40), బిట్టు(23), సత్యేందర్(35), గోలు(28), దామోదర్(27), రాజేశ్(25), దినేశ్(35), రాజు(25), చింటు(27), దీపక్(26), పంకజ్(26)గా గుర్తించారు. -
బోయిగూడ అగ్ని ప్రమాదం.. సీఎం దిగ్భ్రాంతి.. రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా
Hyderabad Fire Accident: సికింద్రాబాద్ బోయిగూడ టింబర్, స్క్రాప్ గోడౌన్లో జరిగిన అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదంలో బీహార్ కార్మికులు మరణించడంపై సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ఈ మేరకు అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. అలాగే బీహార్ వలస కార్మికుల మృతదేహాలను వారి వారి స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ సోమేష్ కుమార్‌ను సీఎం ఆదేశించారు. కాగా బోయిగూడలోని తుక్కు (స్క్రాప్) గోడౌన్లో బుధవారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. గోడౌన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి దట్టమైన పొగ కమ్ముకోవడంతో గోడౌన్ పైకప్పు కూలింది. ఈ ఘటనలో 11 మంది కార్మికులు సజీవ దహనమయ్యారు. మరొకరు ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 8 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతులంతా బిహార్‌కు చెందినవారుగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. అగ్ని ప్రమాద ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. చదవండి: Hyderabad: భారీ అగ్నిప్రమాదం.. 11 మంది సజీవ దహనం -
యూనివర్సల్ బేకరీ.. ఓ స్వీట్ మెమొరీ.. మూతపడటానికి కారణాలేమిటి?
బర్గర్ ప్రియులకు కేరాఫ్. ఫ్లమ్ కేక్ పేస్ట్రీ లవర్స్‌కు వన్‌స్టాప్. యూత్‌కి మహా క్రేజీగా వర్ధిల్లిన యూనివర్సల్ రెస్టారెంట్ అండ్ కన్ఫెక్షనరీ మూతపడింది. ఇది జరిగి 2 వారాలు కావస్తున్నా ఒకరి తర్వాత ఒకరుగా తెలుసుకుంటున్న నగరవాసులు యూనివర్సల్ బేకరీ జ్ఞాపకాలను నెమరేసుకుంటూనే ఉన్నారు. నగరంలో మున్నెన్నడూ లేని విధంగా ఒక ఫుడ్ జాయింట్ మూసివేత గురించి ట్విట్టర్లో స్పందిస్తుండడం విశేషం. సాక్షి, హైదరాబాద్: జంట నగరాల్లో యూనివర్సల్ బేకరీ అంటే తెలియని బర్గర్ ప్రియులు ఉండరు. సికింద్రాబాద్ మహాత్మా గాంధీ రోడ్డులోని దాదాపు ఏభై ఏళ్లకుపైగా చరిత్ర కలిగిన బేకరీ ఇది. ఇటీవల ఒక్కసారిగా మూతపడడంతో ఆ బేకరీ రుచులను దానితో ముడిపడిన పలు స్నేహాలు, అనుబంధాలను నగరవాసులు మరచిపోలేకపోతున్నారు. డైయిలీ రొటీన్... మహిళా కస్టమర్లు ఎక్కువగా కనపడని ఇరానీ ఫుడ్ జాయింట్స్‌కి భిన్నంగా ఈ బేకరీ తగినంత మంది మహిళా కస్టమర్లతో నిత్యం కళకళలాడేది. కళాశాల విద్యార్థులకు ఇక్కడి బర్గర్ ఒక డైలీ రొటీన్లో భాగం అంటే అతిశయోక్తి కాదేమో. అంతేకాక ఆ రోడ్డుకు షాపింగ్‌కి వెళ్లే వారికి యూనివర్సల్ తప్పనిసరి విజిటింగ్ ప్లేస్‌గా ఉండేది. పోటీని తట్టుకుని.. సన్నగా తరిగిన మటన్, టమాటాలు, ఉల్లిపాయలు, ఛీజ్ వగైరాలు మేళవించిన ఇక్కడి మటన్, చికెన్ బర్గర్లు అందరికీ అందుబాటు ధరలో రూ.50కే దొరికేవి. అసలైన హైదరాబాదీ బర్గర్‌కి సిసలైన చిరునామాగా ఉంటూ మూతపడే నాటికి కూడా పూర్తి స్థాయిలో కస్టమర్లతో కిటకిటలాడిన బేకరీ ఇది. అందుకే బర్గర్ కింగ్, మెక్ డొనాల్డ్స్, సబ్ వే లాంటి ఎన్నో రకాల ఆధునిక ఫుడ్ జాయింట్స్, కాఫీ షాప్స్ నగరంలో ఏర్పాటైనప్పటికీ యూనివర్సల్ బేకరీ తన క్రేజ్‌ను ఏ మాత్రం కోల్పోలేదు. చదవండి: కారు ప్రమాదంపై ట్విస్టుల మీద ట్విస్టులు మూతపడటానికి కారణాలేమిటి? హిమాయత్ నగర్లో ఏర్పాటు చేసిన యూనివర్సల్ బేకరీ స్వల్ప కాలంలోనే గత 2016లో మూతపడింది. సరైన పార్కింగ్ సౌకర్యం లేక అది మూతపడిందని, అయితే చాలా పాతదైన దాని మాతృసంస్థ కూడా తాజాగా మూతపడడానికి ప్రత్యేక కారణాలేవీ లేవని తెలుస్తోంది. ఈ బేకరీని ముగ్గురు భాగస్వాములు నిర్వహిస్తుండగా వీరంతా నగరానికి దూరంగా వెళ్లిపోవడం వారసులు ఇతరత్రా వ్యాపారాలతో బిజీ అయిపోవడం వల్ల నిర్వహణ కష్టమై ఈ బేకరీ బిజినెస్‌ను వదులుకున్నట్టు నిర్వాహకుల సంబంధీకులు చెబుతున్నారు. ఓ మధుర జ్ఞాపకం.. గొప్ప జ్ఞాపకం అంటూ యూనివర్సల్ బేకరీని గుర్తు చేసుకుంటున్నారు నగరవాసులు. ట్విట్టర్ వేదికగా మిస్ యూ యూనివర్సల్ అంటూ వీడ్కోలు పలుకుతున్నారు. అంతేకాదు తిరిగి బేకరీని తెరవాలంటూ విజ్ఞప్తులు కూడా చేస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో వస్తున్న స్పందన తమకు ఎంతో ఆనందానుభూతినిస్తోందని బేకరీ యజమానులు చెబుతున్నారు. యాభై ఏళ్ల అనుబంధం యూనివర్సల్ బేకరీ పెట్టిన దగ్గర నుంచీ రెగ్యులర్‌గా వెళ్లడం అలవాటు అయింది. దేశీ స్టయిల్ బర్గర్ అక్కడ ఉన్నట్టు ఇంకెక్కడా దొరికేది కాదు. క్వాలిటీ, క్వాంటిటీ, కాస్ట్... ఈ మూడింటిలోనూ బెస్ట్. జనరల్ బజారుకు వెళ్లి షాపింగ్ పూర్తి చేసుకుని ఆ బేకరీ దగ్గర లోనే కారు ఆపి స్నాక్స్ తినడం ఫ్యాక్స్ ఇంటికి తెచ్చుకోవడం అలవాటుగా మారిపోయింది. ఇప్పుడు ఆ బేకరీ తీసేశారు అంటుంటే ఏదో మిస్ అయిన ఫీలింగ్ కలుగుతోంది. – అనురాధారెడ్డి, ఇంటాక్ సంస్థ -
ఇద్దరు పిల్లలతో కలిసి సికింద్రాబాద్‌లో రైలు ఎక్కింది.. చెన్నైలో దిగలేదు..
సాక్షి, సికింద్రాబాద్: నగరం నుంచి చెన్నైకి రైలు ప్రయాణం ద్వారా వెళ్లాల్సిన ఓ మహిళ తన ఇద్దరు పిల్లలు అదృశ్యమైన ఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. చెన్నైలో ఉంటున్న లలిత (23), తన కుమారులు వీరా (07), ఆశిష్ (05)తో కొద్ది రోజుల క్రితం ఒక వివాహానికి హాజరయ్యేందుకు నగరానికి వచ్చారు. తిరిగి చెన్నై వెళ్లేందుకు ఈ నెల 22న ఉప్పుగూడ నుంచి ఆటోలో లలిత తన తల్లి కమ్లి ఇద్దరు పిల్లలతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. లలిత, ఆమె పిల్లలను చెన్నై ఎక్స్‌ప్రెస్ రైలు (ఎస్4–34) బోగీలో ఎక్కించిన కమ్లి సెండాఫ్ చేసి ఉప్పుగూడకు వెళ్లిపోయింది. మరుసటి రోజు చెన్నైలో దిగాల్సిన లలిత ఆమె పిల్లలు కనిపించకుండా పోయారు. లలిత ఆమె పిల్లలు అదృశ్యమయ్యారన్న సమాచారాన్ని ఆమె భర్త హరి ద్వారా తెలుపుకున్న ఆమె కుటుంబ సభ్యులు పలు చోట్ల వాకబు చేసినా ఆచూకీ లభించలేదు. ఆమె వద్ద ఉన్న సెల్‌ఫోన్ కూడా స్వచ్చాఫ్ రావడంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లలిత ఆమె పిల్లల ఆచూకీ కోసం దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: పేరు గొప్ప.. ఊరు దిబ్బ.. ‘గాంధీ’లో గిదేందీ! -
పేరు గొప్ప.. ఊరు దిబ్బ.. ‘గాంధీ’లో గిదేందీ!
పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నచందంగా మారింది. వివక్షకు నిలువుటద్దాన్ని తలపిస్తోంది. తెలంగాణ వైద్య ప్రదాయినిగా.. ప్రభుత్వ వైద్యరంగానికి పెద్ద దిక్కుగా ప్రసిద్ధి గాంచిన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి, మెడికల్ కాలేజీ దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. వైద్యుల నియామకాల్లో చిన్నచూపునకు గురవుతున్నాయి. ప్రధానమైన విభాగాల్లో వైద్యుల కొరత వేధిస్తోంది. దీంతో రోగులకు సేవల్లో జాప్యంతో పాటు వైద్య విద్యాబోధన కుంటుపడుతోంది. – గాంధీ ఆస్పత్రి గాంధీలోని 35 విభాగాల్లో 273 ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు మంజూరు కాగా ఖాళీగా 51 పోస్టులు ఉండటం గమనార్హం. ప్రధాన విభాగాలైన జనరల్ మెడిసిన్, గైనకాలజీ, పిడియాట్రిక్, అనస్తీషియా, న్యూరాలజీ, పిడియాట్రిక్ సర్జరీ, న్యూరో సర్జరీ, సీటీ సర్జరీ, కార్డియాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ, ఎస్పీఎం తదితర విభాగాల్లో వైద్యుల కొరత వేధిస్తోంది. అనస్తీషియా, బయోకెమిస్త్రీ విభాగాలకు ప్రొఫెసర్లే లేకపోవడం అత్యంత దయనీయం. 60 మంది ప్రొఫెసర్లకు గాను 56 మంది మాత్రమే ఉన్నారు. వైద్యవిద్యా బోధనలో కీలకపాత్ర పోషించే అసోసియేట్ ప్రొఫెసర్లు 74 మందికి కేవలం 51 మంది ఉన్నారు. 23 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 21 విభాగాల్లో 139 అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాల్సిన చోట 115 మంది మాత్రమే ఉండగా, 24 ఖాళీలు ఉన్నాయి. అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, సైకాలజీ, మైక్రోబయోలజీ, పెథాలజీ, సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఎస్పీఎం) వంటి నాన్క్లినికల్ విభాగాల్లో 59 మంది అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకుగాను ఎనిమిది ఖాళీగా ఉన్నాయి. శస్త్రచికిత్సల్లో జాప్యం శస్త్రచికిత్సలో కీలకమైన అనస్తీషియా విభాగంలో వైద్యుల కొరత పట్టి పీడిస్తోంది. కేటాయించిన మూడు ప్రొఫెసర్ పోస్టులతోపాటు ఒక అసోషియేట్, ఎనిమిది అసిస్టెంట్ పోస్టులకు మొత్తం 12 పోస్టులు గత కొన్నేళ్లుగా భర్తీ చేయకపోవడంతో పలు విభాగాల్లో జరగాల్సిన శస్త్రచికిత్సలు తరచూ వాయిదా పడుతున్నాయి. దీంతో నిరుపేద రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వైద్యుల కొరత, శస్త్రచికిత్సల జాప్యం కారణంగా ఆపరేషన్ థియేటర్ల వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయని ఓ వైద్యుడు ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. ముందుకు సాగని వైద్యవిద్య.. గాంధీ మెడికల్ కాలేజీలో వైద్యవిద్యా బోధనకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. కరోనా వైరస్ విజృంభణతో గాంధీని కోవిడ్ నోడల్ సెంటర్‌గా ఏర్పాటు చేయడంతో వైద్యవిద్య కుంటుపడింది. ఓ వైపు కరోనా, మరోవైపు వైద్యుల కొరతతో రెండేళ్లుగా చదువులు ముందుకు సాగలేదని ఓ వైద్యవిద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు. గత రెండేళ్లుగా రెగ్యులర్ వైద్యుల నియామకం చేపట్టకపోవడం, కాంట్రాక్టు పద్ధతిలో తీసుకున్న వైద్యులకు విద్యాబోధనలో అనుభవం లేకపోవడం, కేవలం రోగుల వైద్యసేవలకే పరిమితం కావడంతో వైద్యవిద్య మూలనపడింది. భర్తీ చేయాల్సిన పోస్టులివే.. గాంధీ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ మూడు కేటగిరీల్లో మొత్తం 51 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఆ వివరాలు ఇలా.. అనస్తీషియా– 12, జనరల్ మెడిసిన్– 5, నియోనెటాల్ పిడియాట్రిక్–1, రేడియాలజీ– 1, టీబీ అండ్ సీడీ – 2, సైకియాట్రిస్ట్– 3, కార్డియాలజీ– 1, నెఫ్రాలజీ –1, యూరాలజీ– 1, అనాటమీ–1, సైకాలజీ– 2, ఫార్మకాలజీ–1, ఫోరెన్సిక్ మెడిసిన్–1, మైక్రోబయోలజీ–1, పెథాలజీ–1, ఎస్పీఎం–2, గైనకాలజీ–4, పిడియాట్రిక్– 3, న్యూరాలజీ– 2, పిడియాట్రిక్ సర్జరీ– 2, న్యూరోసర్జరీ–1, సీటీ సర్జరీ– 3 పోస్టులతో పాటు మరో 8 నాన్క్లినికల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. -
జీహెచ్ఎంసీ కార్యాలయంలో అగ్ని ప్రమాదం.. లిఫ్ట్‌లో చిక్కుకున్న సిబ్బంది
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో బుధవారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. జీహెచ్ఎంసీ కార్యాలయంలోని మూడవ అంతస్తులో టాక్స్ సెక్షన్లో మంటలు చెలరేగాయి. కార్యాలయమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. భారీగా మంటలు చెలరేగడంతో ఆందోళనకు గురైన ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. మంటల్లో కార్యాలయంలోని పలు ఫైల్స్ దగ్ధమయ్యాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో లిఫ్ట్ నిలిచిపోవడంతో అందులో ఉన్నవారు కాపాడాలంటూ ఆర్తనాదాలు చేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 3 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకు వచ్చింది. టెర్రస్ పైన పలువురు చిక్కుకున్నారు. దట్టమైన పొగ కారణంగా కిందికి దిగలేని పరిస్థితి నెలకొనడంతో.. ఫైర్ సిబ్బంది వారిని దింపే ప్రయత్నం చేస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ముంచుకొస్తున్న థర్డ్ వేవ్.. అయినా వీడని నిర్లక్ష్యం.. 50% మించడం లేదు! -
Hyderabad Kidnap Case: చిన్నారి కిడ్నాప్ కేసు సుఖాంతం
-
మూడేళ్ల చిన్నారి కిడ్నాప్.. తెలిసిన వ్యక్తి పనే.. 9 గంటల్లోనే..
సాక్షి, రాంగోపాల్‌పేట్(హైదరాబాద్): ఇంటి ఎదుట ఆడుకుంటున్న మూడేళ్ల బాలికను కిడ్నాప్ చేసిన దుండగులను పోలీసులు తొమ్మిది గంటల్లోనే పట్టుకున్నారు. ఈ వ్యవహారంతో సంబంధమున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. రెజిమెంటల్ బజార్లో నివసించే శ్రీనివాస్, ఉమా దంపతులకు తరుణ్ (6), కీర్తన (3) ఉన్నారు. గురువారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో కీర్తనకు అన్నం పెట్టేందుకు తల్లి ఉమా కిచెన్‌లోకి వెళ్లగా చిన్నారి మొదటి అంతస్తు నుంచి కిందకు వచ్చింది. 10 నిమిషాలకు తల్లి వచ్చి చూసేసరికి పాప కనిపించ లేదు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసిన దర్యాప్తు చేశారు. శ్రీనివాస్ ఇంటికి కొద్ది దూరంలో ఇద్దరు యువకులు తచ్చాడినట్లు స్థానికులు తెలిపారు. ఓ మహిళ వీరిని ప్రశ్నించగా... సాయి కోసం వచ్చామని చెప్పడంతో పాటు అక్కడ కొందరు ఆ పేరున్న వాళ్లు ఉండటంతో తెలిసిన వారై ఉండవచ్చని ఆమె భావించింది. కాసేపటికి చిన్నారిని యాక్టివా వాహనంపై తమ మధ్య కూర్చోబెట్టుకుని వెళ్లడాన్ని గుర్తించిన ఎల్లోరా అనే వృద్ధురాలు పోలీసులకు తెలిపింది. వాళ్లు చిన్నారితో మాట్లాడుకుంటూ తీసుకుని వెళ్లినట్లు చెప్పింది. చదవండి: న్యూఇయర్ వేడుకలు.. గ్రాము కొకైన్ ధర.. బంగారం కంటే 3 రెట్లు ఎక్కువ దీంతో తెలిసిన వారే ఈ పని చేసి ఉంటారని భావించారు. రంగంలోకి దిగిన ఉత్తర మండలం టాస్క్‌ఫోర్స్, గోపాలపురం పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా ముందుకు వెళ్లి గాలింపు చేపట్టారు. రాత్రి 10 గంటలకు జీడిమెట్లలో నిందితుల ఆచూకీ గుర్తించి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో సూత్రధారి బాలిక కుటుంబానికి పరిచయస్తుడు. పాపకు మామ వరసైన వ్యక్తే కిడ్నాప్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. కాగా, మరో ఇద్దరు కిడ్నాప్ చేశారని, ఇంకొకరు బాలికను దాచిపెట్టడానికి సహకరించారని తేల్చారు. వ్యక్తిగత కారణాలతోనే బాలికను కిడ్నాప్ చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. చదవండి: ఆన్లైన్లో పరిచయం.. నీ కష్టాలు తీరుస్తా.. వ్యక్తిగత ఫొటోలు, రూ.5 వేలు పంపు.. -
సరఫరా చేయమంటే స్వాహా చేశారు.. రూ.1.35 కోట్లు గల్లంతు
సాక్షి, హైదరాబాద్: అమెజాన్ గోదాములకు చేర్చాల్సిన తమ సరుకును అమేజ్ సొల్యూషన్స్ సంస్థ కాజేసిందంటూ సికింద్రాబాద్‌కు చెందిన ఆనందిత్ సంస్థ నగర నేర పరిశోధన విభాగంలో (సీసీఎస్) ఫిర్యాదు చేసింది. ఈ మేరకు రెండు సంస్థలతో పాటు ఏడుగురిపై కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. సికింద్రాబాద్‌లోని సీటీసీ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఆనందిత్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కంప్యూటర్ విడి భాగాలు, ఉపకరణాల వ్యాపారం చేస్తుంటుంది. ఆన్లైన్ ద్వారానూ వ్యాపారం చేస్తున్న ఈ సంస్థకు అమెజాన్‌లో ‘ఏ1 ప్రైస్ ఏ1 ప్రొడక్ట్’ అనే డిస్ప్లే నేమ్ ఉంది. కస్టమర్ల డిమాండ్‌కు తగ్గట్టు ఆనందిత్ సంస్థ తమ ఉత్పత్తులను వివిధ ప్రాంతాల్లో ఉన్న అమెజాన్ గోదాములకు చేరుస్తుంటుంది. అక్కడ నుంచి ఈ సరుకు ఆర్డర్ ప్రకారం అమేజాన్ ద్వారా వినియోగదారులకు డెలివరీ అవుతుంది. తమ ఉత్పత్తులను నిర్ణీత ప్రమాణాలు, పరిమాణంతో ఉండే బాక్సుల్లో ప్యాక్ చేసే ఆనందిత్ సంస్థ వాటిపై షిప్మెంట్ లేబుల్‌ను అతికిస్తుంది. వీటిని ఈ సంస్థ నుంచి అమెజాన్ గోదాములకు చేర్చే బాధ్యతలను ఢిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే అమేజ్ సొల్యూషన్స్ చేపడుతోంది. ఈ సంస్థకు చెందిన ఉద్యోగులు ఆనందిత్ సంస్థ నుంచి ఆయా బాక్సులను సేకరించి భద్రంగా అమెజాన్ గోదాములకు చేరుస్తుంటారు. అమేజ్ సంస్థకు నగరానికి సంబంధించి ఉప్పల్‌లోని హెచ్ఎండీఏ లేఔట్లో ఉన్న గోదాము ద్వారా ఈ రవాణా జరుగుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్ మొదలు అమెజాన్ సంస్థ నుంచి ఆనందిత్‌కు ఈ–మెయిల్స్ రూపంలో వరుస ఫిర్యాదులు వస్తున్నాయి. ఆర్డర్ ప్రకారం సరుకు రావట్లేదని, వచ్చిన వాటిలోనూ కొంత తక్కువ ఉంటోదని దాని సారాంశం. మూడు నెలల పాటు వరుస ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఆనందిత్ సంస్థ లోతుగా ఆరా తీసింది. ఈ నేపథ్యంలోనే ఈ కాలంలో మొత్తం రూ.1.35 కోట్ల విలువైన 4262 బాక్సులు, సరుకు గల్లంతైనట్లు గుర్తించారు. అమేజ్ సొల్యూషన్స్ డైరెక్టర్ రోహిత్ అగర్వాల్ కనుసన్నల్లోనే ఇదంతా జరిగినట్లు అనుమానించారు. అక్కడ పని చేసే అనిల్, మనోజ్, కృష్ణ, శరణ్, కిరణ్ తదితరుల సాయంతో ఈ సరుకు మాయమవుతోందని, అదంతా ఎస్బీ కంప్యూటర్స్, ఆర్వెక్స్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్‌లతో పాటు అలీ మొబైల్స్‌కు చెందిన అలీలకు చేరుతున్నట్లు అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ మేరకు సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో ఆయా వ్యక్తులు, సంస్థలపై కేసు నమోదు చేశారు. దీన్ని సీ డివిజన్ సబ్–ఇన్స్పెక్టర్ మహ్మద్ మక్సూద్ అలీ నేతృత్వంలోని బృందం దర్యాప్తు చేస్తోంది. -
సికింద్రాబాద్ పార్క్‌లైన్ వద్ద గల యూనియన్ బ్యాంక్‌లో అగ్ని ప్రమాదం
-
ఆన్లైన్ పూజలు.. ఇంటికే ప్రసాదం
సాక్షి, హైదరాబాద్: వినాయక నవరాత్రులను పురస్కరించుకుని దేవాదాయ, తపాలాశాఖలు సంయుక్తంగా ఆన్లైన్ సేవలు, స్పీడ్‌పోస్టు ద్వారా ఇంటికే ప్రసాద పంపిణీకి శ్రీకారం చుడుతున్నాయి. ప్రయోగాత్మకంగా మొదట సికింద్రాబాద్ గణేశ్ టెంపుల్‌తో దీన్ని ప్రారంభిస్తున్నారు. కోవిడ్ ఆందోళన నేపథ్యంలో కొందరు భక్తులు దేవాలయాలకు వెళ్లేందుకు భయపడుతున్నారు. కానీ, ఏటా వినాయక ఉత్సవాల వేళ ఆలయంలో పూజలు చేయించుకునే సంప్రదాయాన్ని ఆచరించలేకపోతు న్నామన్న భావన వారిలో ఉంది. ఇలాంటి వారి కోసం ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. తపాలాశాఖ ఈ–షాప్ వెబ్సైట్ ద్వారా పేర్లు నమోదు చేసుకుంటే నవరాత్రి ప్రత్యేక పూజాదికాలను నిర్ధారిత రోజుల్లో వారి పేరుతో నిర్వహి స్తారు. కుంకుమ, అక్షింతలు, పొడి ప్రసాదాలను స్పీడ్ పోస్టు ద్వారా భక్తుల ఇళ్లకు పంపుతారు. సెప్టెంబరు 12న లక్ష భిల్వార్చన (రుసుము రూ.320), 14న సత్య గణపతి వ్రతాలు (రూ.620), 17న సిద్ధిబుద్ధి సమేత గణపతి కళ్యాణం (620), 10 నుంచి 19 వరకు సహస్ర మోదక గణపతి హోమాలు (620), 10 నుంచి 20 వరకు సర్పదోష నివారణ అభిషేకాలు (రూ.400) ఉంటాయని, ఆయా సేవలకు కనీసం రెండు రోజుల ముందు పేర్లు నమోదు చేసుకోవాలని అధికారులు వెల్లడించారు. -
ప్రయాణికులకు తీపికబురు.. ఉందానగర్– షాద్‌నగర్ రైల్వేలైన్ రెడీ
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్– మహబూబ్‌నగర్ మార్గంలో చేపట్టిన రైల్వేలైన్ల డబ్లింగ్, విద్యుదీకరణ ప్రాజెక్టులో భాగంగా ఉందానగర్ నుంచి షాద్‌నగర్ వరకు కీలకమైన 29.7 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. దీంతో హైదరాబాద్ నుంచి మహబూబ్‌నగర్, కర్నూలు, అనంతపురం, బెంగళూరు, కడప, తిరుపతి తదితర నగరాలకు రైళ్ల రాకపోకలు మరింత పెరిగే అవకాశం ఏర్పడింది. ప్రస్తుతం ఉందానగర్ నుంచి షాద్‌నగర్ వరకు పనులు పూర్తయ్యాయి. మిగిలిన సెక్షన్లో డబ్లింగ్, విద్యుదీకరణ పనులు వేగంగా జరుగుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్.రాకేష్ తెలిపారు. సికింద్రాబాద్–డోన్ సెక్షన్లో ప్రస్తుత సింగిల్ లైన్లో రద్దీ నివారణకు, సికింద్రాబాద్ నుంచి గొల్లపల్లి వరకు సరుకు రవాణా, ప్రయాణికుల రైళ్ల రవాణాకు ఈ లైన్ ఎంతో దోహదంచేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. గొల్లపల్లి–మహబూబ్‌నగర్ ప్రాజెక్టులో మిగిలిన పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. -
అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన మంత్రి తలసాని
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. కరోనా ఆంక్షలు ఉన్నా భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి దర్శనానికి తరలివస్తున్నారు. ఉదయం నుంచే అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తడంతో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దర్శనం చేసుకోవాలని అధికారుల సూచించారు.కాగా అమ్మవారికి ఆలయ కమిటీ ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంది. కాగా ఆలయ పరిసరాల్లో 200 సీసీ కెమెరాల తో నిఘా ఏర్పాటు చేసిన అధికారులు 2500 మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేశారు. ►ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బోనాల ఏర్పాట్లను సీపీ పర్యవేక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ►కాగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఉత్సవాల సందర్భంగా నేడు, రేపు ఆలయం సమీపంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆంక్షలు 25వ తేదీ తెల్లవారు జాము 4 గంటల నుంచి పూజలు పూర్తయ్యే వరకు, మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అమలులో ఉంటాయన్నారు. -
దర్భంగ కేసు’.. ఎవరీ ఇక్బాల్ ఖానా?
సాక్షి, హైదరాబాద్: దర్భంగ ఎక్స్‌ప్రెస్ దహ నానికి కుట్ర కేసుతో ఇక్బాల్ ఖానా పేరు దక్షిణాదిలో వెలుగులోకి వచ్చింది. ఉత్తరాది పోలీసులు, కేంద్ర నిఘా వర్గాలకు ‘సుపరిచితుడైన’ ఇతడే ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా(ఎల్ఈటీ) తరఫున పనిచేస్తూ మల్లేపల్లిలో నివసించిన అన్నదమ్ములు ఇమ్రాన్ మాలిక్, నాసిర్ మాలిక్‌లతో పాటు ఉత్తరప్రదేశ్‌కు చెందిన హాజీ, ఖఫీల్‌ను ఉగ్రవాదులుగా మార్చాడు. వీరి ద్వారానే దర్భంగా ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్ని ప్రమాదం సృష్టించడానికి కుట్రపన్నాడు. జాతీయ దర్యాప్తు సంస్థకు(ఎన్ఐఏ) మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఇక్బాల్ ఖానా నేపథ్యమిది.. ►ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ సమీపంలో ఉన్న ఖైరానా ప్రాంతానికి చెందిన ఇతడి అసలు పేరు మహ్మద్ ఇక్బాల్ మాలిక్. పుట్టుకతోనే కుడి కంటిలో లోపం ఉండటంతో ఇక్బాల్ ఖానాగా మారాడు. ►ఖైరానా ప్రధాన రహదారిపై కూరగాయల దుకాణం నిర్వహించే ఇక్బాల్‌కు ఆది నుంచి ధనార్జనపై ఆశ ఎక్కువగా ఉండేది. దీంతో తేలిగ్గా డబ్బు సంపాదించడానికి తమ ప్రాంతానికే చెందిన గోల్డ్ స్మగ్లర్ హాజీ అనీస్ ముఠాలో చేరాడు. ►1980 నుంచి బంగారం స్మగ్లింగ్ చేసిన ఈ గ్యాంగ్ 1990లో ఇక్బాల్ చేరిన తర్వాత మాదకద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణా కూడా ప్రారంభించింది. దీంతో ఖైరానా ప్రాంతానికి చెందిన మిగిలిన ముఠాలతో వైరం ఏర్పడింది. ►ఇక్బాల్ 1992లో యూపీలోని సహరన్‌పూర్‌కు చెందిన ముస్తారీ అనే యువతిని వివాహం చేసుకున్నాడు. 1993–94లో రెండుసార్లు ప్రత్యర్థి వర్గాలు ఇక్బాల్‌పై దాడి చేసి హత్య చేయడానికి ప్రయత్నం చేశాయి. ►మరోపక్క పోలీసు నిఘా కూడా ముమ్మరం కావడంతో 1995 జూన్‌లో పాక్‌కు మకాం మార్చిన ఇక్బాల్ అక్కడి లాహోర్‌లో ఉన్న బంధువుల ఇంట్లో ఆశ్రయం పొందాడు. కొన్నాళ్లకు భార్యతో పాటు ఇద్దరు కుమార్తెల్నీ అక్కడకు రప్పించుకున్నాడు. ►లాహోర్ చేరిన తొలినాళ్లలో ఇక్బాల్ ఎలాంటి కార్యకలాపాలకు పాల్పడలేదు. అక్కడి యతీంఖానా ప్రాంతంలో నివసించే ఐఎస్ఐ ఏజెంట్ తారిఖ్‌తో పరిచయం ఏర్పడిన తర్వాత స్మగ్లర్‌గా మారాడు. ►ఇక్బాల్ నేరచరిత్ర, ఖైరానా ప్రాంతంలో అతడికి ఉన్న పరిచయాలు, భారత్‌లో ఉన్న నెట్వర్క్ తెలుసుకున్న తారిఖ్ అతడి ద్వారా ఆయుధాలను అక్రమ రవాణా చేయించాడు. వీటిని ఖైరానాలో ఉన్న ఇక్బాల్ గ్యాంగ్ ఉత్తరాదిలో విక్రయించేది. ►1996 నుంచి భారీస్థాయిలో ఆయుధాల సరఫరా స్మగ్లింగ్ చేయాలని తారిఖ్–ఇక్బాల్‌లు భావించారు. అందుకోసం అప్పట్లో పాకిస్థాన్‌లో నివసించిన స్విస్ జాతీయుడు క్రిస్టోఫర్‌ను వాడుకున్నాడు. ►అతడి కార్‌వ్యాన్‌లో రహస్య అరలు ఏర్పాటు చేసి వాటిలో ఆయుధాలు మందుగుండు సామాగ్రి నింపారు. ఖర్చుల కోసం రూ.లక్ష ఇచ్చి భారత్‌కు పంపారు. ఆయుధాల డెలివరీ పూర్తయిన తర్వాత మరో రూ.35 వేల డాలర్లు ఇస్తామన్నారు. ►ఇతగాడిని ఢిల్లీ పోలీసులు 1996 ఫిబ్రవరి 17న అరెస్టు చేసి భారీస్థాయిలో ఆయుధాలు స్వాదీనం చేసుకున్నారు. క్రిస్టోఫర్‌కు సహకరిస్తున్న హసన్ పోద్దార్‌ను పట్టుకున్నారు. ►వీరి విచారణలోనే ఇక్బాల్ లాహోర్ కేంద్రంగా చేస్తున్న కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. అప్పటి నుంచి ఇతగాడు భారత ఏజెన్సీలకు మోస్ట్ వాంటెడ్‌గా మారాడు. 1999 తర్వాత ఐఎస్ఐకి మరింత సన్నిహితంగా మారాడు. ►భారత సైనిక రహస్యాలను అందించడానికి అవసరమైన ఏజెంట్లను రిక్రూట్ చేసుకోవడం ప్రారంభించాడు. ఇలా ఇతడి కోసం పనిచేస్తున్న ఖైరానావాసి సమయుద్దీన్ 2001 డిసెంబర్లో పట్టుబడ్డాడు. ►ఆ తర్వాత నుంచి భారత్‌కు నకిలీ కరెన్సీ సరఫరా, చెలామణి కోసం ఐఎస్ఐ ఇక్బాల్‌ను వాడుకుంది. ఏటా వందల కోట్ల నకిలీ కరెన్సీని తన అనుచరుల ద్వారా చెలామణి చేయించాడు. ► పెద్ద నోట్ల రద్దు తర్వాత ఐఎస్ఐ ఆదేశాల మేరకు ఇక్బాల్ మాలిక్ నకిలీ కరెన్సీ చెలామణి నుంచి ఉగ్రవాదుల రిక్రూట్మెంట్ వైపు మారాడు. తాజాగా లష్కరే తొయిబా కోసం కొందరిని రిక్రూట్ చేసి దేశ వ్యాప్తంగా విధ్వంసాలకు ప్లాన్ చేశాడు. -
దర్బాంగా ఎక్స్‌ప్రెస్ పేలుడు కేసులో ఉగ్రకుట్ర
-
హైదరాబాద్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు
-
రఘురామ కృష్ణరాజు కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులు
-
సికింద్రాబాద్ లో పీ జీ కాలేజీ విద్యార్థుల ఆందోళన
-
భారత్ అద్భుత విజయానికి 50ఏళ్ళు పూర్తి.. ఆంద్రా ఆర్మీ వేడుకలు
-
దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. తమ పరిధిలో 31 రైల్వేస్టేషన్లు మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. సరైన ఆదాయం, జనం రద్దీ లేని కారణంగా ఫిబ్రవరి 1 నుంచి 29 రైల్వేస్టేషన్లు మూసివేయాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. కాగా ఏప్రిల్ 1 నుంచి మరో రెండు స్టేషన్లు మూసివేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు సికింద్రాబాద్ పరిధిలో 16, గుంతకల్ పరిధిలో 3, నాందేడ్‌లో 1, గుంటూరులో 4, హైదరాబాద్‌లో 7 స్టేషన్లు మూతపడనున్నాయి. -
భారీ చోరి.. కేజీ బంగారు అభరణాలు స్వాహా
సాక్షి, రాంగోపాల్‌పేట్: సికింద్రాబాద్ పాట్ మార్కెట్లోని ఓ నగల దుకాణంలో భారీ చోరీ జరిగింది. వెంటిలేటర్ గ్రిల్‌ను తొలగించి షాపులోకి చొరబడిన దొంగలు భారీగా ఆభరణాలు ఎత్తుకెళ్లారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.పాట్ మార్కెట్‌కు చెందిన అనిల్ జైన్ అదే ప్రాంతంలో నేమిచంద్ జైన్ జ్యూవెలరీ పేరుతో బంగారం నగల దుకాణం నిర్వహిస్తున్నారు. శుక్రవారం తెల్లవారు జామున గుర్తుతెలియని వ్యక్తులు దుకాణం వెనుక వైపున ఉండే వెంటిలేటర్ గ్రిల్స్‌ను తొలగించి లోపలికి ప్రవేశించారు. అనంతరం 1200 గ్రాముల బంగారం ఆభరణాలు ఎత్తుకుని వెళ్లారు. మధ్యాహ్నం తర్వాత షాపునకు వచ్చిన యజమాని అనిల్‌జైన్ దుకాణంలోని వస్తువులు చెల్లాచెదురై ఉండటాన్ని గుర్తించాడు. షాపులో దొంగతనం జరిగిందని గుర్తించిన ఆయన పోలీసులకు సమాచారం అందించారు. మార్కెట్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు, ఏసీపీ వినోద్‌కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది ఆధారాలు సేకరించారు. ప్రత్యేక బృందాలతో గాలింపు షాపులో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా ఒకే వ్యక్తి లోపలికి వచ్చినట్లు రికార్డై ఉంది. రాత్రి పూట కావడంతో సీసీ పుటేజ్ స్పష్టంగా కనిపించడం లేదు. టాస్క్‌పోర్స్ పోలీసులతో పాటు, ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు పాత నేరస్తుల పనే అయి ఉంటుందని అనుమానిస్తున్నారు. -
నడి రోడ్డు మీద బీజేపీ నేతల కుమ్ములాట
సాక్షి, హైదరాబాద్ : సికింద్రాబాద్ బీజేపీలో అంతర్గత విభేదాలు తారాస్థాయి చేరాయి. నడి రోడ్డు మీదే బీజేపీ నేతలు ఘర్షనకు దిగారు. తార్నాక డివిజన్ అధ్యక్షుడు రాముపై శారదా మల్లేష్ దాడి చేశారు. దీంతో నేతలిద్దరు రోడ్డుపైనే ఘర్షణకు దిగారు. ఒకరినొకరు దూషించుకుంటూ హంగామా చేశారు. ఈ పంచాయితీ కాస్త బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఇంటికి చేరింది. ఇరువర్గాల కార్యకర్తలు భారీగా రామచంద్రరావు ఇంటికి చేరుకున్నారు. తార్నాక డివిజన్ లాలాపేట్‌లో జరిగిన బీజేపీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో తార్నాక డివిజన్ అధ్యక్షుడు రాము ప్రోటోకాల్ ప్రకారం తనను స్టేజీపైకి ఆహ్వానించలేదనే కోపంతోనే శారదా మల్లేష్ ఆ దాడికి దిగినట్లు తెలుస్తోంది. -
ఆలయం వద్ద పేలుడు
-
భవిష్యవాణి
-
తెలంగాణ డిప్యూటీ స్పీకర్‌కు కరోనా
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో కరోనా వైరస్ సాధారణ ప్రజలతోపాటు ప్రజా ప్రతినిధులను సైతం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ముఖ్యంగా టీఆర్ఎస్ నేతలను కరోనా వైరస్ వెంటాడుతోంది. ఇటీవల హోంశాఖ మంత్రి మమమూద్ అలీకి కరోనా సోకగా, తాజాగా తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ జరిగింది. మూడు రోజుల నుంచి జ్వరం గొంతునొప్పితో బాధపడుతున్న ఆయనకు వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహించారు. పద్మారావుతోపాటు మరో నలుగురు కుటుంబ సభ్యులు సైతం కోవిడ్ బారిన పడ్డారు. వీరంతా ప్రస్తుతం సికింద్రాబాద్‌లో హోం క్వారంటైన్లో ఉన్నారు. (తెలంగాణ హోంమంత్రికి కరోనా పాజిటివ్) తెలంగాణలో కరోనా బారిన పడుతున్న రాజకీయ నేతల సంఖ్య పెరుగుతోంది. టీఆర్ఎస్ పార్టీలో కరోనా సోకిన నేతల్లో పద్మారావు అయిదవ వ్యక్తి. ఇప్పటి వరకు టీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, గణేష్ గుప్తా, హోంమంత్రి మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మారావు కరోనా బారినపడ్డారు. ఈ నేపథ్యంలో చాలా మంది రాజకీయ నేతలు, ప్రజా ప్రతినిధుల ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఇక సోమవారం ఒక్కరోజే తెలంగాణలో 973 కొత్త కేసులు వెలుగు చూశాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 15 వేలు దాటింది. మొత్తం 15,394 కేసులు నమోదవ్వగా 253 మంది మృత్యువాతపడ్డారు. కరోనాతో కోలుకున్న వారి సంఖ్య 5,582 ఉండగా.. ప్రస్తుతం 9,559 యాక్టివ్ కేసులు ఉన్నాయి. (మళ్లీ లాక్డౌన్.. సిద్ధంగా ఉన్నారా?) -
కిక్కిరిసిన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్
-
సికింద్రాబాద్ వైన్స్ షాప్‌లో చోరీ
-
మార్చిలో గజ్వేల్‌కు.. కూ.. చుక్‌చుక్
సాక్షి, హైదరాబాద్ : సికింద్రాబాద్–గజ్వేల్ మధ్య నడపనున్న రైలు మార్చిలో పట్టాలెక్కబోతోంది. తొలుత పుష్పుల్ ప్యాసింజర్ సేవలను ప్రారంభించేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు ప్రారంభించింది. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసిన రైల్వే, రామాయపల్లి వద్ద 44వ నెంబర్ జాతీయ రహదారిపై వంతెన నిర్మాణ పనులు చేపట్టేందుకు సిద్ధమైంది. ఈనెల 20 నుంచి ఆ పనులు మొదలుకానున్నా యి. వాటిని రెండు నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యం గా పెట్టుకుంది. ఫిబ్రవరి చివరినాటికి ఆ పనులు పూర్తి చేసి మార్చి మొదటి వారంలో రైలును నడిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. స్టేషన్లు... ట్రాక్ సిద్ధం సికింద్రాబాద్‌తో కరీంనగర్‌ను రైల్వే లైన్ ద్వారా అనుసంధానించే మనోహరాబాద్–కొత్తపల్లి ప్రాజె క్టులో తొలి దశ పనులు దాదాపు పూర్తయ్యాయి. మనోహరాబాద్ స్టేషన్ నుంచి ఈ కొత్త లైన్ ప్రారం భమైంది. అక్కడికి 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న గజ్వేల్ పట్టణం వరకు పనులు పూర్తి చేయటం ప్రాజెక్టు తొలిదశ. ఇందులో మనోహరాబాద్ వద్ద కొత్త స్టేషన్ భవనం సిద్ధమైంది. ఆ తర్వాత నాచారం, అప్పాయిపల్లి, గజ్వేల్‌లలో స్టేషన్లు ఉంటా యి. జనవరి నాటికి పనులన్నీ పూర్తవుతాయి. జాతీయ రహదారిని కట్‌చేసి... ఇక ఈ 32 కిలోమీటర్ల మార్గంలో ఆరు రోడ్ ఓవర్ బ్రిడ్జీలు మూడు రోడ్ అండర్ బ్రిడ్జీ, నాలుగు చోట్ల పెద్ద వంతెన పనులు పూర్తయ్యాయి. ఇక నిజామాబాద్ మీదుగా సాగే 44వ నంబర్ జాతీయ రహదారిని రైల్వే లైన్ క్రాస్ చేసే చోట వంతెన నిర్మించాల్సి ఉంది. జాతీయ రహదారిని కట్ చేసి పని చేపట్టాల్సి ఉన్నందున అనుమతి కోసం వేచి చూడాల్సి వచ్చింది. ఈనెల 20 నుంచి అక్కడ పనులు చేసుకోవచ్చంటూ తాజాగా జాతీయ రహదారుల విభాగం అనుమతించడంతో పనులు చకచకా సాగనున్నాయి. ఫిబ్రవరిలో ట్రయల్ రన్ పూర్తి చేసి మార్చి తొలివారంలో ప్రారంభించనున్నట్లు అధికారులు చెప్పారు. -
సికింద్రాబాద్‌లో లారీ బీభత్సం
-
దుబాయ్‌లో ఉద్యోగం ఇప్పిస్తాని చెప్పి లాడ్జిలో..
సాక్షి, హైదరాబాద్ : దుబాయ్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ ఏజెంట్. పశ్చిమ గోదావరికి చెందిన ఓ యవతిని సికింద్రాబాద్‌కు రప్పించి లాడ్జికి తీసుకెళ్లాడు. అర్థరాత్రి దాటాక ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతి కేకలు వేయడంతో అనుమానం వచ్చి లాడ్జి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడుని రిమాండ్‌కు తరలించారు. -
సికింద్రాబాద్‌లో పోలీసుల హంగామా
-
ఆటోను ఢీకొట్టిన కారు,ఇద్దరికి గాయాలు
-
కాంగ్రెస్‌కు దూరంగా కార్తీకరెడ్డి!
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బండా కార్తీకరెడ్డి గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు, పార్టీకి దూరం ఉంటున్నారు. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలో జరుగుతున్న వేళ సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఆమె పార్టీకి అంటీముట్టనట్లుగా ఉంటుండటంతో కాంగ్రెస్‌పై ప్రభావం చూపే అవకాశముందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఆమె భర్త టీపీసీసీ కార్యదర్శి బండా చంద్రారెడ్డి మూడు దశాబ్దాలుగా, కార్తీకరెడ్డి 15 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో పని చేస్తున్నారు. అయినా ఆ పార్టీ అధిష్టానం ఎలాంటి గుర్తింపు ఇవ్వకపోవడంతో ఆమె ప్రస్తుతం మనస్తాపంతో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో 2014 ఎన్నికల్లో సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆ సమయంలో ప్రస్తుతం రాష్ట్రంలో అ«ధికార పార్టీ నుంచి ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా అవకాశం వచ్చినప్పటికీ పార్టీ జాతీయ నాయకత్వం జైరాం రమేష్, కొప్పుల రాజు వంటి నాయకులు స్వయంగా తార్నాకలోని కార్తీకరెడ్డి నివాసానికి వచ్చి కాంగ్రెస్‌ను వీడవద్దు, భవిష్యత్‌లో అవకాశాలు కల్పిస్తామని బుజ్జగించారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం సికింద్రాబాద్ నుంచి టికెట్ కోసం ఢిల్లీ వెళ్లి విశ్వప్రయత్నాలు చేశారు. అయినా అధిష్టానం అవకాశం కల్పించలేదు. పార్టీ కోసం ఎంతో కష్టపడి ఎక్కడా వెళ్లకుండా సంవత్సరాల తరబడి పార్టీని నమ్ముకుని ఉంటున్న తమకు అవకాశాలు కల్పించకుండా ఏనాడూ పార్టీకి పని చేయని వారికి, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి అవకాశాలు ఇచ్చిందని ఆమె తీవ్ర మనస్తాపంతో ఉన్నట్లు సమాచారం. ఇటీవల కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమావేశానికి సైతం కార్తీకరెడ్డి హాజరు కాలేదు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో తనదైన ముద్ర వేసుకున్న ఆమె పార్టీకి దూరంగా ఉంటే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. ఈ విషయంపై పార్టీ రాష్ట్ర నాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకోనుందో వేచి చూడాల్సిందే మరి. -
సికింద్రాబాద్ బరిలో కిషన్‌రెడ్డి!
సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై దిగ్భ్రాంతికి గురైన తెలంగాణ బీజేపీ నేతలు లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాదరణపై ఆశగా ఉన్నారు. శాసనసభ ఎన్నికల్లో మొత్తంగా ఏడు శాతం ఓట్లు సాధించిన బీజేపీ ఈసారి సిట్టింగ్ సీటైన సికింద్రాబాద్‌తోపాటు నగర ఓటర్లున్న మల్కాజిగిరి స్థానంపై ఆశలు పెట్టుకుంది. సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి పోటీ చేయడం దాదాపుగా ఖాయమైనట్టు తెలుస్తోంది.సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ తాను బరిలో ఉంటానని ప్రకటించినప్పటికీ పార్టీ నాయకత్వం కిషన్‌రెడ్డి వైపే మొగ్గు చూపినట్టు సమాచారం. అయితే, మంగళవారం ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ మరోసారి సమావేశమై తొలివిడత అభ్యర్థులపై తుది నిర్ణయం తీసుకోనుంది. 2004లో హిమాయత్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కిషన్‌రెడ్డి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2008లో నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తరువాత 2009, 2014లో అంబర్‌పేట స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018లో టీఆర్ఎస్ ప్రభంజనంలో ఓడిపోయిన ముఖ్యమైన నేతలలో ఆయన కూడా ఒకరు. సికింద్రాబాద్ లోక్‌సభ ఎన్నికల బరిలో నిలవాలని గతంలోనే కిషన్‌రెడ్డి ప్రణాళిక రచించుకున్నప్పటికీ శాసనసభ ఎన్నికలు ముందస్తుగా రావడంతో అంబర్‌పేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. బండారు దత్తాత్రేయ ఇక్కడి నుంచి నాలుగుసార్లు ఎంపీగా గెలుపొందారు. వాజ్‌పేయి, మోదీ హయాంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. సుదీర్ఘ అనుభవం ఉన్నప్పటికీ దత్తాత్రేయకు ఈసారి టికెట్ దక్కకపోవచ్చని, కిషన్‌రెడ్డి వైపే ఆ పార్టీ అధిష్టానం మొగ్గు చూపుతోందని బీజేపీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. ఇతర పార్టీల నేతలకు స్వాగతం..! ఇతర పార్టీల్లో టికెట్ ఆశించి భంగపడిన నేతలకు కూడా బీజేపీ స్వాగతం పలుకుతోంది. మహబూబ్‌నగర్ నుంచి టీఆర్ఎస్ లోక్‌సభాపక్షనేత ఏపీ జితేందర్‌రెడ్డికి ఆ పార్టీ టికెట్ దొరక్కపోవచ్చని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో టికెట్ ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా ఉంది. పెద్దపల్లి నుంచి కూడా ఒక ప్రధాన పార్టీ నేతకు టికెట్ దక్కనిపక్షంలో తమ వద్దకే చేరే అవకాశం ఉందని బీజేపీ భావిస్తోంది. నల్లగొండ, ఖమ్మం, భువనగిరి, ఆదిలాబాద్ తదితర స్థానాల నుంచి పోటీ చేసేందుకు బీజేపీ నుంచి ప్రముఖులెవరూ ఆసక్తి కనబరచడం లేదు. మల్కాజిగిరి నుంచి రాంచందర్‌రావు మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి న్యాయవాది, బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్‌రావును పోటీ చేయించేందుకు బీజేపీ నాయకత్వం మొగ్గు చూపుతోంది. రాంచందర్‌రావు 2018 శాసనసభ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి పోటీ చేసి రెండోస్థానంలో నిలిచారు. మల్కాజిగిరి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో మల్కాజిగిరి, సికింద్రాబాద్ కంటోన్మెంట్, ఎల్బీనగర్, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్ శాసనసభ స్థానాలు ఉన్నాయి. ఇవన్నీ జంటనగరాల పరిధిలో ఉండడంతో అర్బన్ ఓటర్లు మోదీ నాయకత్వంపై సానుకూల దృక్పథంతో ఓటు వేస్తారని బీజేపీ ఆశిస్తోంది. కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, చేవెళ్ల నుంచి జనార్దన్‌రెడ్డి, పెద్దపల్లి నుంచి ఎస్.కుమార్, జహీరాబాద్ నుంచి సోమాయప్ప స్వామీజీ, మహబూబ్‌నగర్ నుంచి శాంతికుమార్ పేర్లు దాదాపు ఖాయమైనట్టు తెలుస్తోంది. -
డాక్టర్ల నిర్లక్ష్యం..2నెలల చిన్నారి మృతి
-
సికింద్రాబాద్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం
సాక్షి, హైదరాబాద్ : సికింద్రాబాద్ క్లాక్ టవర్ వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బ్రేకులు విఫలం కావడంతో అదుపుతప్పి డివైడర్‌ను తాకుతూ జనాలపైకి దూసుకెళ్లింది. అటుగా వెళ్తున్న ఆటో , కార్లను ఢికొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. -
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో బాలుడు కిడ్నాప్
-
సికింద్రాబాద్ రైల్వే స్టేషల్లో బాలుడి కిడ్నాప్
సాక్షి, హైదరాబాద్ : అత్యంత భద్రత ఉండే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 7 ఏళ్ల బాలుడు కిడ్నాప్‌కు గురైయ్యాడు. గుర్తుతెలియని ఇద్దరు మహిళలు.. బిస్కెట్లు ఇప్పిస్తామని చెప్పి బాలుడిని ఎత్తుకెళ్లారు. బాలుడి కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కిడ్నాప్‌కు గురైన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదైయ్యాయని పోలీసుల తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని గాలింపు చర్యలు చేపట్టారు. -
హోండా షోరూంలో భారీ అగ్నిప్రమాదం
సాక్షి, సికింద్రాబాద్: సికింద్రాబాద్‌లో శనివారం ఉదయం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక తాడ్‌బండ్‌లో ఉన్న హోండా షోరూంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. భారీ స్థాయిలో మంటలు చెలరేగి చుట్టుపక్కల వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్టు తెలుస్తోంది. -
అతీత శక్తుల పేరుతో నకిలీ బాబా మోసం
-
సికింద్రాబాద్‌లో నకిలీ బాబా అరెస్టు
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ నకిలీ బాబాను పోలీసులు అరెస్టు చేశారు. ఇంట్లో ఉన్న బంగారానికి పూజలు చేస్తే రోగాలు నయమవుతాయంటూ పలువురి బంగారాన్ని కాజేసినట్టు బాధితులు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నకిలీబాబాపై నిఘా పెట్టిన వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి కిలోన్నర బంగారం, రూ. 3 లక్షల 50 వేలు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ బాబాగా చెలామణి అవుతున్న నిందితుడు నెల్లూరు జిల్లాకు చెందిన ఇస్మాయిల్‌గా గుర్తించారు. -
జూలై 9న మహంకాళి బోనాలు
హైదరాబాద్ : సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలను వచ్చే నెల 9, 10 తేదీల్లో నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. వివిధ శాఖల అధికారులతో బుధవారం నిర్వహించిన సమీక్షలో బోనాల ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమీక్షలో మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి పాల్గొన్నారు. -
బోయిన్‌పల్లిలో బాలికపై అత్యాచారం
హైదరాబాద్: నగరంలో దారుణ సంఘటన వెలుగుచూసింది. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఘటన నగరంలోని బోయిన్పల్లి ఆర్‌ఆర్‌నగర్‌లో బుధవారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న ఓ బాలిక(16)పై అదే ప్రాంతానికి చెందిన యువకుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న బోయిన్పల్లి పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. కాగా బాలిక ప్రియుడి స్నేహితుడే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
సికింద్రాబాద్‌లో నవమి సంబరాలు
-
అయ్యో! దొంగ ఎంత పనిచేశాడు..
సికింద్రాబాద్: నగరంలోని మారేడ్‌పల్లిలో మంగళవారం తెల్లవారుజామున దారుణం వెలుగుచూసింది. ఓ ఇంటికి దొంగతనానికి వచ్చిన దొంగ అక్కడ ఏమి దొరకకపోవడంతో.. ఆగ్రహానికి గురై ఆ ఇంటికే నిప్పు పెట్టాడు. దీంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఇది గుర్తించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
నోట్ల మార్పిడి ముఠా అరెస్ట్
సికింద్రాబాద్: పాత నోట్లును మార్పిడి చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. సికింద్రాబాద్ బేగంపేటలోని వెంకట్ రెసిడెన్సీలో బిల్డర్ యాదగిరి ఇంటిపై బేగంపేట పోలీసులు దాడులు చేశారు. పాత నోట్లను మార్పిడి చేస్తున్న 15 మంది సభ్యులున్న ముఠాను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారి నుంచి కోటి రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. -
ఆర్మీ కల్నల్ నయ్యర్ ఇంట్లో చోరీ
-
అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి..
ఇద్దరు స్నేహితుల దుర్మరణం l దూసుకెళ్లిన లారీ, అక్కడికక్కడే మృతి హైదరాబాద్: బోయిన్పల్లి నుంచి తాడ్బంద్కు వెళ్లే ప్రధాన రహదారి.. శనివారం మధ్యాహ్నం 2.45 గంటల సమయం.. ఒకే బైక్‌పై వెళుతున్న ముగ్గురు స్నేహితులు.. ఓ మూలమలుపు వద్ద బైక్ నియంత్రణ కోల్పోయి డివైడర్‌ను ఢీకొట్టడంతో వారు ముగ్గురూ అవతలి రోడ్డుపై పడ్డారు. అదే సమయంలో వేగంగా వచ్చిన ఓ లారీ వారిలో ఇద్దరిపై నుంచి దూసుకెళ్లింది. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో యువకుడు తీవ్ర గాయాల పాలయ్యాడు. వీకెండ్ కోసం వెళ్లి: మల్కాజ్గిరి దుర్గానగర్ బస్తీకి చెందిన రమాకాంత్ కుమారుడు అనిరు«ధ్(20) నారాయణ కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అనిరుధ్ ఇంటి దగ్గర్లోనే ఉండే కృష్ణ రెండో కుమారుడు విశ్వచారి.. సాయిసుధీర్ డిగ్రీ కాలేజీలో ఫస్టియర్ చదువుతున్నాడు. పక్కిం టివాళ్లు కావడం తో వీరికి మంచి స్నేహం ఉంది. అమీర్‌పేటకు చెందిన అఖిల్.. అనిరుధ్‌కు కాలేజీలో మిత్రుడు. ఇలా వీరి ముగ్గురి మధ్యా స్నేహబంధం ఏర్పడింది. వీకెండ్ రోజున సరదాగా గడిపేందుకు విశ్వచారి పెద్దమ్మ ఉండే ఫతేనగర్‌కు అనిరుధ్‌తో కలసి విశ్వచారి బస్సులో వచ్చాడు. ఆ తర్వాత అమీర్‌పేట లో అఖిల్‌ను కలుసుకున్నారు. అఖిల్ తన టీఎస్03 ఈఏ1993 నంబర్ గల యమహా ఎఫ్‌జెడ్‌పై అనిరుధ్, విశ్వచారితో కలసి దుర్గానగర్ బయలు దేరారు. బోయిన్పల్లి నుంచి తాడ్‌బంద్‌ను దాటే క్రమంలో తాడ్బంద్ బస్టాండ్ రాకముందు ఉండే మూలమలుపు వద్ద అతివేగంతో వచ్చిన వారి బైక్ నియంత్రణ కోల్పోయి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ముగ్గురు ఎగిరి అవతలి రోడ్డుపై పడ్డారు. అదే సమయంలో తాడ్బంద్ నుంచి బోయిన్పల్లి వైపు భారీ లోడ్‌తో వేగంగా వెళుతున్న లారీ వారి మీది నుంచి దూసుకెళ్లింది. అనిరుధ్, విశ్వచారి ఘటనాస్థలిలోనే మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన అఖిల్‌ను గాంధీ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పది నిమిషాల్లో వస్తానని .. ‘పది నిమిషాల్లో వస్తాను నాన్నా..’అంటూ 2.30 గం టల ప్రాంతంలో విశ్వచారి తండ్రి కృష్ణకు ఫోన్ చేసి చెప్పాడు. కుమారుడు రోడ్డు ప్రమాదంలో తనువు చాలించడంతో ఆ కుటుంబం తట్టుకోలేక పోతోంది. రమాకాంత్ కుటుంబానికి అనిరుధ్ ఒక్కడే కుమారు డు కావడంతో గారాభంగా పెంచారు. అతను మరణించిన వార్త విన్న ఆ కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరివల్లా కావడంలేదు. దీంతో దుర్గా నగర్లో విషాదఛాయలు అలుముకున్నాయి. హెచ్చరికలు లేని మూలమలుపు బోయిన్పల్లి నుంచి తాడ్బంద్కు వెళ్లే దారిలో ఉన్న ఈ మూలమలుపులో అనేక ప్రమాదాలు జరిగి పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఎటువంటి హెచ్చరికలు లేవు. ఈ మూలమలుపును విస్తరించాలని ప్రతిపాదనలు రూపొందించినా.. ఒకవైపు ముస్లింలకు చెందిన శ్మశానవాటిక, మరోవైపు రక్షణ శాఖ భూములు కావడంతో ఆ ప్రతిపాదన ముందుకు సాగడం లేదు. దీంతో రెండు జాతీయ రహదారులకు అనుసంధానంగా ఉన్న ఈ ప్రధాన రోడ్డులో ప్రమాదాలు సర్వసాధారణమయ్యాయి. -
ఇద్దరు విద్యార్థులపై దూసుకెళ్లిన లారీ
-
గోకుల్ బ్యాంకులో భారీ మోసం
-
మహిళా దొంగల హల్చల్
హైదరాబాద్: నగరంలోని సికింద్రాబాద్‌లో మహిళా దొంగలు హల్చల్ చేశారు. స్థానిక ప్రశాంత్‌నగర్‌లోని థియేటర్ సమీపంలో ఉన్న ఓ క్లీనిక్ పై దాడి చేసిన మహిళ దొంగలు పెద్ద ఎత్తున నగదు ఎత్తుకెళ్లారు. పెద్దనోట్లు రద్దవడంతో.. వాటిని బ్యాంకులో డిపాజిట్ చేయడానికి సిద్ధంగా ఉంచుకున్నదంపతులపై దాడి చేసిన దొంగలు, సొత్తు అపహరించుకెళ్లారు. దీంతో బాధితులు రాంగోపాలపురం పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రుణం కోసం బతికున్న తండ్రిని ‘చంపేసి’ ..!
సాక్షి, సిటీబ్యూరో: తండ్రి ఆస్తిపై రుణం తీసుకోవడానికి ఓ సుపుత్రుడు భారీ స్కెచ్ వేశాడు. బతికున్న తండ్రి చనిపోయినట్లు పత్రాలు సృష్టించడంతో పాటు స్నేహితుడిని స్థిరాస్తిని విక్రయిస్తున్నట్లు ఒప్పందం చేసుకున్నారు. వీరిద్దరితో పాటు మరో ఆరుగురితో కలిసి కథ నడిపి ఫైనాన్స్ సంస్థ నుంచి రూ.89 లక్షల రుణం తీసుకున్నాడు. వాయిదాలు చెల్లించకపోవడం అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో నిందితుడిని సీసీఎస్ పోలీసులు గురువారం అరెస్టు చేసినట్లు డీసీపీ అవినాష్ మహంతి తెలిపారు. సికింద్రాబాద్‌లోని కాకగూడ వాసవీనగర్‌కు చెందిన కె.వెంకటేశ్వరరావు కొన్నాళ్ళుగా మస్కట్‌లో ఉంటున్నారు. ఆయన కొడుకు కె.సుధాకర్ ఫార్మాసిస్ట్‌గా పనిచేస్తున్నాడు. కాకగూడలో తండ్రి ఇంటిపై కన్నేసిన సుధాకర్ దాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకోవాలని భావించాడు. దీనికోసం తన స్నేహితుడైన వరప్రసాద్‌తో పాటు రాజ్యలక్ష్మి, కిరణ్, వెంకట్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, కనకాంబరరావు, నాగేంద్రలతో కలిసి పథకం రచించాడు. ఇందులో భాగంగా తండ్రి వెంకటేశ్వరరావు చనిపోయినట్లు ఓ మరణ ధ్రువీకరణ పత్రాన్ని తయారుచేశారు. సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ బోర్డ్ దీన్ని జారీ చేసినట్లు నకిలీ పత్రాన్ని సృష్టించాడు. దీంతోపాటు ఇతర పత్రాలను సృష్టించిన సుధాకర్ వాసవీనగర్‌లో ఉన్న ఇంటిని తన స్నేహితుడు వరప్రసాద్‌కు విక్రయిుస్తున్నట్లు సేల్‌డీడ్ రూపొందించాడు. వీటి ఆధారంగా అంతా కలిసి మాగ్న ఫైనాన్స్ సంస్థ నుంచి రూ.89 లక్షల రుణం తీసుకున్నారు. వాయిదాలు చెల్లించడంలో విఫలం కావడం.. కంపెనీ ఆరా తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో కంపెనీ ప్రతినిధులు సీసీఎస్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఏసీపీలు జోగయ్య, కె. రామ్‌కుమార్ పర్యవేక్షణలో కేసు దర్యాప్తు చేసిన ఇన్స్పెక్టర్ బి. రవీందర్‌రెడ్డి గురువారం సుధాకర్‌ను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మిగిలిన ఏడుగురు నిందితుల కోసం గాలిస్తున్నారు. -
నేడు ఆలస్యంగా గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్
హైదరాబాద్: సికింద్రాబాద్–గోరఖ్‌పూర్ (12590) ఎక్స్‌ప్రెస్ నేడు (శుక్రవారం) ఆలస్యంగా బయలుదేరనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీనియర్ పీఆర్వో షకీల్ అహ్మద్ ఒక ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఉదయం 7.20కి బయలుదేరాల్సి ఉండగా, సాంకేతిక కారణాల వల్ల మూడు గంటలు ఆలస్యంగా ఉదయం 10.20కి బయలుదేరనున్నట్లు పేర్కొన్నారు. -
నాణ్యత లోపిస్తే సహించేది లేదు
సాక్షి,సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ చేపడుతున్న రోడ్ల మరమ్మతులు, గుంతల పూడ్చివేత తదితర పనుల్లో నాణ్యత లోపిస్తే సహించేది లేదని మునిసిపల్ వ్యవహారాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంజీ గోపాల్ అన్నారు. బుధవారం ఆయన జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్ రెడ్డితో కలిసి బేగంపేట్, సికింద్రాబాద్ సంగీత్ థియేటర్, కీస్ హై స్కూల్, చిలుకలగూడ, సీతాఫల్మండి, బౌద్దనగర్ తదితర ప్రాంతాల్లో రోడ్ల మరమ్మతులను పరిశీలించారు. ఇటీవలి భారీ వర్షాలకు నగరంలో 1200 ప్రాంతాల్లో 1,78, 973 మీటర్ల విస్తీర్ణంలో రహదారులు దెబ్బతిన్నాయి. వీటికి తాత్కాలికంగా, ప్రయాణానికి అనువుగా ఉండేలా ఇంజనీరింగ్ విభాగం గుంతల పూడ్చివేత కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే పనుల నిర్వహణపై ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతుండట, పత్రికల్లో కథనాలు వస్తుండటంతో ఆయన తనిఖీలు నిర్వహించారు. సికింద్రాబాద్‌లో రోడ్ల మరమ్మతులకు ఉపయోగిస్తున్న మెటల్ బి.టి, ఎమల్షన్ లను తగు పాళ్లలో మిక్సింగ్ చేసే అంశాన్ని తనిఖీచేశారు. కార్మికులు హ్యాండ్ గ్లౌజెస్ లేకుండా పనిచేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్ల మరమ్మతులలో నాణ్యత ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో ఉంచడంతో పాటు ఈ పనులను పర్యవేక్షించని ఇంజనీర్లపై అభియోగాలు నమోదు చేయాలని ఆదేశాలు జారీచేశారు. మరమ్మతుల సందర్భంగా రోలర్లను, కంప్రెషర్లను విధిగా ఉపయోగించి రోలింగ్‌ను పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. ప్రధాన మార్గాల్లో పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టడానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. నగరంలోని రోడ్లను శాశ్వత ప్రాతిపదికన నిర్మాణానికి టెండర్లను పిలిచి పనులను సాధ్యమైనంత త్వరగా చేపట్టాలన్నారు. రోడ్ల మరమ్మతులకు గాను 200లకుపైగా మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు గుంతలను పూడ్చివేయడం, అవసరమైన మార్గాల్లో రోడ్లను పుననిర్మించడం తదితర చర్యలు చేపట్టినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్ రెడ్డి వివరిం చారు. రోడ్ల మరమ్మతులను దీర్ఘకాలిక, మద్యంతర, స్వల్పకాలికంగా త్రిముఖ వ్యూహంతో చేపడుతున్నట్టు కమిషనర్ తెలిపారు. టెండర్ల ప్రక్రియ కొనసాగుతున్నందున ఈ లోపు దెబ్బతిన్న రోడ్లను ప్రయాణానికి అనువుగా ఉండేలా పనులను చేపడుతున్నామని, ప్రతిరోజు దాదాపు 1000కి పైగా గుంతలను పూడ్చివేస్తున్నట్లు తెలిపారు. తనిఖీల్లో జోనల్ కమిషనర్ జె.శంకరయ్య, సీఈ సుభాష్‌సింగ్, ఎస్ఈ కిషన్ , డిప్యూటీ కమిషనర్ విజయరాజు పాల్గొన్నారు. -
గాంధీ కాలేజీలో సందడి
గాంధీ ఆస్పత్రి: సికింద్రాబాద్ గాంధీ వైద్య కళాశాలలో నిర్వహిస్తున్న ఫెస్ట్ సందడిగా సాగుతోంది. వైద్య విద్యార్థులు శనివారం ఆటపాటలతో ఆనందంగా గడిపారు. గ్రీటింగ్ కార్డ్ మేకింగ్, నెయిల్ పెయింటింగ్ అంశాల్లో ప్రతిభ కనబరిచారు. -
నూతన కాంచీపురం బ్రాంచ్..
రాంగోపాల్‌పేట్: దుస్తులు శరీరానికి రక్షణతోపాటు అందాన్ని రెట్టింపు చేస్తాయని త్రిదండి శ్రీ మన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి అన్నారు. సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్్స షోరూంను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రక్షణ, అందాన్ని పెంచే సాంప్రదాయ కాంచీపురం సిల్క్ దుస్తుల షోరూంను ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయమని చెప్పారు. సంస్థ అధినేతలు ప్రసాద్, కల్యాణ్‌లు మాట్లాడుతూ మహిళల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన చీరల్ని అందుబాటులో ఉంచామన్నారు. తమవద్ద కాంచీపురం, ఆరాణి, బనారస్, ధర్మవరం, ఉప్పాడ, హ్యాండ్లూమ్ చీరలు లభ్యమవుతాయని తెలిపారు. డిజైనర్ ఫ్యాన్సీ, హ్యాండ్లూమ్, కుర్తీలు, వెస్ట్రన్ వేర్, రెడీమేడ్ డ్రెస్ మెటీరియల్ దుస్తులు అతి తక్కువ ధరలకు అందుబాటులో ఉంచినట్లు వారు వివరించారు. ఈ కార్యక్రమంలో గజల్ శ్రీనివాస్, సరస్వతి ఉపాసకులు దైవజ్ఞశర్మ పాల్గొన్నారు. -
ఏడాది చిన్నారిపై పైశాచికం
హైదరాబాద్: అభం శుభం తెలియని ఏడాది చిన్నారిపై ఓ కామాంధుడు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. దీంతో చిన్నారి పరిస్థితి విషమంగా మారింది. ఈ సంఘటన నగరంలోని సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం వెలుగు చూసింది. స్థానికంగా నివాసముంటున్న దీప్‌సింగ్ ఇంటి పక్కనే నివాసముంటున్న ఏడాది పాపపై అత్యాచారం చేశాడు. ఇది గుర్తించిన స్థానికులు నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు పట్టించారు. చిన్నారిని ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు గాంధీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. -
రైలు ప్రమాదంలో కాళ్లు కోల్పోయిన సలీమ్
-
పురాతన భవనాల కూల్చివేత
హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని శిథిలావస్థలో ఉన్న పురాతన భవనాలను అధికారులు కూల్చివేస్తున్నారు. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో ఈ ప్రాంతంలోని కూలిపోయే దశలో ప్రమాదకరంగా ఉన్న భవనాలను జీహెచ్ఎంసీ అధికారులు కొన్ని రోజులుగా కూల్చివేస్తున్నారు. గురువారం సర్కిల్-18 పరిధిలోని చిలకలగూడలో జేసీబీలతో పురాతన కట్టడాల కూల్చివేత ప్రారంభించారు. వారికి రెవెన్యూ, పోలీసు యంత్రాంగం సాయపడుతోంది. -
రెయిలింగ్ కూలి 5 కార్లు ధ్వంసం
హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో రెయిలింగ్ కూలి 5 కార్లు ధ్వంసం అయ్యాయి. గురువారం మధ్యాహ్నం భవనం రెయిలింగ్ కూలి పడటంతో కింద పార్కు చేసిన ఐదు కార్లు దెబ్బతిన్నాయి. కాంప్లెక్స్ నిర్వాహకులు అప్రమత్తమై పెచ్చులను తొలగించి, దెబ్బతిన్న కార్లను అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరుగలేదు. -
అడ్రస్ అడిగి గొలుసు లాక్కొని వెళ్లారు
హైదరాబాద్: నగరంలోని సికింద్రాబాద్ మార్కండేయ దేవాలయం వద్ద శుక్రవారం చైన్‌స్నాచింగ్ సంఘటన చోటు చేసుకుంది. అడ్రస్ అడుగుతున్నట్లు నటించి ఓ మహిళ మెడలోని మంగళసూత్రం లాక్కొని దుండగుడు పరారయ్యాడు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరో వైపు ఇంటి ముందు నిద్రిస్తున్న మహిళ మెడలోనుంచి గుర్తుతెలియని దుండగులు బంగారు ఆభరణాలను లాక్కెళ్లారు. ఈ ఘటన చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈశ్వరీబాయి నగర్లో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న కమలారాణి(48) ఇంటి ఎదుట నిద్రిస్తుండగా గుర్తుతెలియని దుండగులు ఆమె మెడలోని నాలుగు తులాల బంగారు ఆభరణాలను లాక్కెళ్లారు. దీంతో బాదితురాలు పోలీసులను ఆశ్రయించింది. సంఘటనా స్థలాన్ని నార్త్ జోన్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి పరిశీలించి వివరాలు సేకరించారు. -
బాలుడి కిడ్నాప్ కేసులో నిందితుడి అరెస్ట్
సికింద్రాబాద్: నగరంలో కలకలం సృష్టించిన బాలుడి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. కిడ్నాప్‌కు పాల్పడిన నిందితుడు వీరాచారిని బుధవారం అరెస్ట్ చేశారు. వివరాలు.. సికింద్రాబాద్ జనరల్ బజార్లో మంగళవారం 14 నెలల బాలుడు పృథ్వి కిడ్నాప్‌కు గురయ్యాడు. ఈ విషయం పై కేసు నమోదు చేసుకున్న మహంకాళి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి ఈ రోజు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా.. బాలుడి దూరపు బంధువు బాలాచారే ఈ కిడ్నాప్‌కు పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు అతన్ని విచారించగా రూ. 5 వేలకు బాబును అమ్మేసినట్లు తెలిపాడు. బాబు మెడలో ఉన్న బంగారు గొలుసును కూడా అమ్ముకున్నట్లు చెప్పాడు. మరింత సమాచారం కోసం పోలీసులు విచారణ చేపట్టారు. -
పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్: పదో విద్యార్థి ఆత్మహత్య పాల్పడ్డాడు. ఈ సంఘటన సికింద్రాబాద్‌లోని తుకారాంగేటు సాయినగర్‌లో చోటు చేసుకుంది. భాష్యం పబ్లిక్ స్కూల్లో రాజేష్(15) పదో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు రాజేష్ సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
సికింద్రాబాద్ లో అగ్ని ప్రమాదం
హైదరాబాద్: సికింద్రాబాద్ వారణాసి గూడలోని సాయి సంజీవని మెడికల్ షాపులో శుక్రవారం ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు స్థానికులు చెబుతున్నారు. మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో షాపులో ఉన్న మెడిసిన్స్, ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమయ్యాయి. సంఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంతో ఎంత నష్టం వాటిల్లిందనేది తెలియాల్సి ఉంది. -
నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ రాష్ర్ట సమితి(టీఆర్ఎస్) బహిరంగ సభ సందర్భంగా హైదరబాద్‌లో పోలీసులు సోమవారం ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పరేడ్ మైదానం సమీపంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయి. సాధారణ ప్రయాణికులు సురభి గార్డెన్ నుంచి జూబ్లీ బస్‌స్టేషన్, స్వీకార్ ఉపకార్ మీదగా వైఎంసీఏ వైపు వెళ్లాల్సి ఉంటుంది. వైఎంసీఏ నుంచి ఎస్బీహెచ్ కూడలి వైపు వెళ్లే వారిని క్లాక్ టవర్, జేబీఎస్ వైపు పంపుతారు. -
రైల్వే డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ మృతి
సికింద్రాబాద్ : దక్షిణ మధ్య రైల్వే ట్రాక్ 2 డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస రావు రైల్వే క్వార్టర్స్‌లో బుధవారం మృతి చెందారు. గుండెపోటుతో మరణించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆయన రైల్ నిలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు. రైల్వే లాన్సర్ కాలనీలోని 605/4 లో నివాసం ఉంటున్నాడు. శ్రీనివాస్ స్వస్థలం గుంటూరు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు శ్రీనివాస్ భార్యకు సమాచారం అందించారు. -
మోండా మార్కెట్ వద్ద వ్యక్తి దారుణ హత్య
హైదరాబాద్ : సికింద్రాబాద్ మోండా మార్కెట్ ప్రాంతంలో ఓ వ్యక్తిని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి జరిగింది. మార్కెట్ దగ్గరుండే సబ్‌స్టేషన్ దగ్గర వ్యక్తిని దుండగులు రాయితో కొట్టి చంపినట్టు తెలుస్తోంది. మృతుడు బాచుపల్లికి చెందిన చందూ(30)గా గుర్తించారు. ఇతడు బాచుపల్లిలో ఓ ఫార్మా కంపెనీ ఉద్యోగి అని సమాచారం. హత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. (రామ్‌గోపాల్‌పేట)