సాక్షి, సికింద్రాబాద్: సికింద్రాబాద్‌లో శనివారం ఉదయం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక తాడ్‌బండ్‌లో ఉన్న హోండా షోరూంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. భారీ స్థాయిలో మంటలు చెలరేగి చుట్టుపక్కల వ్యాపించాయి.
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment