నూతన కాంచీపురం బ్రాంచ్..
రాంగోపాల్‌పేట్: దుస్తులు శరీరానికి రక్షణతోపాటు అందాన్ని రెట్టింపు చేస్తాయని త్రిదండి శ్రీ మన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి అన్నారు. సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్‌్స షోరూంను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రక్షణ, అందాన్ని పెంచే సాంప్రదాయ కాంచీపురం సిల్క్ దుస్తుల షోరూంను ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయమని చెప్పారు.
సంస్థ అధినేతలు ప్రసాద్, కల్యాణ్‌లు మాట్లాడుతూ మహిళల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన చీరల్ని అందుబాటులో ఉంచామన్నారు. తమవద్ద కాంచీపురం, ఆరాణి, బనారస్, ధర్మవరం, ఉప్పాడ, హ్యాండ్లూమ్ చీరలు లభ్యమవుతాయని తెలిపారు. డిజైనర్ ఫ్యాన్సీ, హ్యాండ్లూమ్, కుర్తీలు, వెస్ట్రన్ వేర్, రెడీమేడ్ డ్రెస్ మెటీరియల్ దుస్తులు అతి తక్కువ ధరలకు అందుబాటులో ఉంచినట్లు వారు వివరించారు. ఈ కార్యక్రమంలో గజల్ శ్రీనివాస్, సరస్వతి ఉపాసకులు దైవజ్ఞశర్మ పాల్గొన్నారు.