kanchipuram
-
ట్రంప్ విందుకి కాంచీపురం చీరకట్టులో నీతా అంబానీ..! ఏకంగా 22 ఏళ్ల నాటి..
అమెరికా 47వ అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ప్రమాణ స్వీకారోత్సవం మరికొద్ది గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే.ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు ఏర్పాటు చేసిన విందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్(Reliance Foundation chairperson) నీతా అంబానీ హాజరయ్యారు. ఈ వేడుకలో ప్రపంచంలోని అతిపెద్ద పారిశ్రామికవేత్తలు, ప్రపంచ వ్యాపార ప్రముఖులు, ట్రంప్ మంత్రివర్గంలోని నామినేటెడ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ ప్రైవేట్ డిన్నర్లో నీతా అంబానీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా నలుపురంగు కాంచీపురం(Kanchipuram) చీరకట్టులో కనిపించారు. ఈ ప్రపంచ వేదికపై భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని నీతా తన ఆహార్యంతో అందంగా ప్రతిబింబించారు. నీతా ధరించిన ఈ చీరకు, మెడలోని హారానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అవేంటో చూద్దామా..!. ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఈ నలుపు రంగు కాంచీపురం చీరను డిజైన్ చేశారు. భారతీయ సాంప్రదాయ కళా నైపుణ్యానికి నివాళిగా నిలిచే ఈ అందమైన చీరను నేసింది జాతీయ అవార్డు గ్రహీత బి. కృష్ణమూర్తి. ఆయన సహకారంతోనే మనీష్ మల్హోత్రా అందంగా డిజైన్ చేశారు. ఈ చీర కాంచీపురం దేవలయాల వివరాలు, వాటి కథను ప్రతిబింబిస్తుంది.భారతదేశ ఆధ్యాత్మికతకు, సాంస్కృతికి నిలువెత్తు నిదర్శనం ఈ చీర. ఇక ఈ చీరకు సరిపోయేలా పూర్తినెక్ని కవర్ చేసేలా ఫుల్ హ్యండ్స్ ఉన్న వెల్వెట్ బ్లౌజ్‌ని ఎంచుకంది. ఇది నీతాకి అక్కడ చలిని తట్టుకునేందుకు ఉపకరిస్తుంది. అతిరథ మహరథులు విచ్చేసే ఈ వేదికను నీతా ఆధునికతతో కూడిన సంప్రదాయన్ని మిళితం చేసి ఫ్యాషన్‌కి సరికొత్త అర్థం ఇచ్చారు. హైలెట్‌గా 200 ఏళ్ల నాటి లాకెట్టు..ఈ అందమైన సంప్రదాయ చీరకు తగ్గట్టుగా చిలుక ఆకారంలో ఉండే అరుదైన 200 ఏళ్ల నాటి పురాతన లాకెట్టు(Pendant)ని ధరించింది. ఈ పురాతన కుందన టెక్కిక్తో తీర్చిదిద్దిన హారం రాయల్టీని హైలెట్ చేసింది. ఈ నెక్లెస్‌ని పచ్చలు, మాణిక్యాలు, వజ్రాలు, ముత్యాలతో రూపొందించారు.(చదవండి: ట్రంప్ క్యాండిల్ లైట్ డిన్నర్లో స్టైలిష్‌గా ఉషా వాన్స్ దంపతులు..!) -
కాంచీపురం చీరతో మైమరిపిస్తున్న త్రిష..!
తెలుగు, తమిళ భాషల్లో అగ్ర కథానాయికగా ఇప్పటికీ వరుస సినిమాలతో సౌత్ ఇండియాలో సందడి చేస్తున్న నటి త్రిష. వయసు పెరుగుతున్న కొద్దీ తరగని అందంతో యువతను మంత్రముగ్ధులను చేస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన వర్షం సినిమా ద్వారా హీరోయిన్ గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో దాదాపు అందరు స్టార్ హీరోలతో సినిమాలు చేసి మెప్పించింది. సుమారు రెండు దశాబ్ధాలుగా స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. ఇటీవల స్టార్ హీరో విజయ్ నటించిన లియో సినిమాలో తళ్లుక్కున మెరిసింది త్రిష. నిజం చెప్పాలంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆమె క్రేజీ తగ్గలేదు. వరుస సినిమాలతో బిజీగా ఉందామె. ఈ నేపథ్యంలో ఆమెకు స్టార్డమ్ తెచ్చిపెట్టడంలో ఉపయోగపడేది ఆమె ధరించే దుస్తులనే చెప్పాలి. సినిమాలో ఎలా ఉన్నా బయట ఎక్కడ కనిపించిన ఆరు గజాల చీరతో సంప్రదాయ మహిళలా కనిపించి ఈజీగా మనుసులను దోచుకుంటుంది. ఏ వేడుక ఫంక్షన్ అయినా అందుకు తగ్గట్టు ఆమె చీరలు ఉంటాయనే చెప్పాలి. ఈ సారి ఏకంగా కాంచీవరం చీరతో స్టన్నింగ్ లుక్‌తో మైమరిపోస్తోంది! టాలీవుడ్ నటి త్రిష కృష్ణన్ ఏ వేడుకలో అయినా ఆమె సంప్రదాయ చీరలో ప్రత్యేక ఆకర్ణణగా కనిపిస్తారు. అంతెందుకు ఇటీవల ఓ అవార్డు ఫంక్షన్లో కూడా జాడే అనే బ్రాండ్‌కి సంబంధించని ఎంబ్రాయిడర్ లేస్ బార్డర్ చీరలో తళుక్కుమన్నారు. ఈసారి మరింత స్టన్నింగ్ లుక్‌లో అభిమానులను ఆశ్చర్యపరిచే రీతీలో కాంజీవరం చీరతో మైమరిపించారు. సాముద్రిక పట్టు చీరపై కాంచీపుర పట్టు కళాత్మకత ఉట్టిపడేలా అందంగా ఉంది. ఆ చీర నారింజ పట్టీ బార్డర్‌తో క్లిష్టమైన మీనాకారి జరీ వీవ్లు ఉన్నాయి. ప్లేయిన్ కలర్ జాకట్ ఆ చీరకు మంచి లుకింగ్ తెచ్చిపెట్టింది. అది కూడా షార్ట్ హ్యాండ్ బ్లౌజ్‌తో చూస్తే సింపిల్‌గా ఉన్నా..చీర హెవీ వర్క్ దాన్ని భర్తీ చేసేలా అదిరిపోయింది. అలాగే ఈ కాంచీవరం చీరల అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు దాని స్టయిలే వేరు. అందుకు తగ్గట్టుగా త్రిష ధరించిన పచ్చ రాళ్లతో కూడిన నెక్లస్ ఒక జత బ్యాంగిలిస్, డాంగ్లింగ్ చెవిపోగులు సరిగ్గా మ్యాచ్ అయ్యాయి. మేకప్ కూడా పెద్దగా లేకుండా నేచురల్ లుక్‌లో ముగ్దమనోహరంగా కనిపించింది. అలాగే పెదాలు కూడా నేచురల్‌గా కనిపించే లిప్‌స్టిక్ రంగుతో జాగ్రత్త పడింది. చీర కట్టుకోవడమే గాక అందుకు తగ్గట్టు మేకప్ ఉంటే ఆ చీర లుక్ అదుర్స్ అన్నంత రేంజ్లో ఉంటుంది. సహజత్వం ఉట్టిపడేలా మేకప్ ఉంటే..ఏ సంప్రదాయ పట్టు చీర అయినా దాని అందం పదింతలు అవుతుంది అనేందుకు ఇదే ఉదాహరణ. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కెర్లు కొడుతోంది. ఇంకెందుకు ఆలస్యం త్రిష మాదిరి లుక్‌లో కనిపించేందుకు ట్రై చేయండి మరీ..! View this post on Instagram A post shared by Pothys (@pothysofficial) (చదవండి: లెహంగా లుక్కే వేరు! ధరిస్తే ఏ వేడుకైనా గ్రాండ్‌గా వెలిగిపోవాల్సిందే!) -
Kanchipuram: కాంచీపురంలో ఎన్కౌంటర్.. ఇద్దరు రౌడీషీటర్లు హతం
సాక్షి, చెన్నై: తమిళనాడులోకి కాంచీపురంలో ఇద్దరు రౌడీ షీటర్లను ఎన్కౌంటర్ చేశారు పోలీసులు. దీంతో, ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కాగా, నిందితులు పోలీసులపై దాడికి యత్నించగా కారణంగానే ఎన్కౌంటర్ జరిగిందని అధికారులు చెబుతున్నారు. వివరాల ప్రకారరం.. చెన్నైలోని కాంచీపురంలో బుధవారం తెల్లవారుజూమున ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు రౌడీలను కాంచీపురం పోలీసులు కాల్చి చంపారు. కాంచీపురం రైల్వే బ్రిడ్జి సమీపంలో పోలీసు సిబ్బందిని నరికివేయడానికి ప్రయత్నించగా.. వారు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎన్కౌంటర్లో రఘువరన్ మరియు కరుప్పు హసన్ మరణించారు. కాగా, మరో రౌడీ షీటర్ ప్రభ హత్య కేసులో వీద్దరిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. #WATCH | Tamil Nadu: Two history sheeters were killed in an encounter near Kanchipuram New railway station Kanchipuram District. Police were in search of them in connection with the murder of a history-sheeter Prabha. Yesterday, Prabha was killed in a revenge attack. Police were… pic.twitter.com/F67mr3hcTH — ANI (@ANI) December 27, 2023 అయితే, ప్రముఖ రౌడీ శరవణన్ అలియాస్ ప్రభాకరన్ (35)ను చంపిన కేసులో రఘువరన్, ఆసన్ (అలియాస్ కరుప్పు హసన్) నిందితులుగా ఉన్నారు. ఈ ఇద్దరు కాంచీపురం కొత్త రైల్వే బ్రిడ్జి సమీపంలో తలదాచుకున్నట్లు పోలీసులకు సమాచారం తెలిసింది. దీంతో, బుధవారం తెల్లవారుజామున వీరిద్దరిని అరెస్ట్ చేసేందుకు వెల్లతురై నేతృత్వంలోని స్పెషల్ ఫోర్స్ పోలీసులు అక్కడికి వెళ్లగా.. నిందితులు తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులపై దాడికి పాల్పడ్డారు. తమ వద్ద ఉన్న కొడవలి కత్తితో దాడి చేయడంతో ఏఎస్ఐ రామలింగం, కానిస్టేబుల్ శశికుమార్ గాయపడ్డారు. காஞ்சிபுரத்தில் நேற்று (26.12.2023) பட்டப்பகலில் ரவுடி ஒருவர் பட்டப்பகலில் ஓட ஓட வெட்டி கொலை செய்யப்பட்ட சிசிடிவி காட்சிகள் #Kanchipuram #DinakaranNews pic.twitter.com/cBajQRTeht — Dinakaran (@DinakaranNews) December 27, 2023 అనంతరం, వీరిని లొంగిపోవాలని పోలీసులు ఎంత హెచ్చరించినా వినిపించుకోలేదు. కత్తితో దాడులు చేస్తున్న క్రమంలో తమ ఆత్మ రక్షణ కోసం పోలీసులు ఫైరింగ్ చేశారు. పోలీసులు మూడు రౌండ్లు కాల్పులు జరపగా.. ఇద్దరు రౌడీలు అక్కడికక్కడే మరణించారు. ఇద్దరి మృతదేహాలను కాంచీపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన పోలీసులు చికిత్స నిమిత్తం కాంచీపురం సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ప్రభాకరన్‌పై 30కి పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. -
కాంచీపురంలో ఘోర ప్రమాదం
చెన్నై: తమిళనాడు కాంచీపురం జిల్లాలో ఇవాళ ఘోరం జరిగింది. కురువిమలైలోని ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు సజీవ దహనం కాగా, మరో ఐదుగురు తీవ్రగాయాలతో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మరికొంత మందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండడంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగేలా కనిపిస్తోంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే ఫైర్, పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో పాతిక మంది పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలు, ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం అందాల్సి ఉంది. ఇదీ చదవండి: ఏకం అయ్యేందుకే ఆశ పడుతున్నా! -
స్నేహితుడి పీకపై కత్తి.. మృగవాంఛ తీర్చుకున్నారు
కాంచీపురం: బ్రిటిష్ కాలంనాటి చట్టాలు.. త్వరగతిన శిక్షలు పడకపోవడం దేశంలో నేరాలు పెరిగిపోవడానికి కారణం అవుతున్నాయని మేధావులు మొత్తుకుంటున్నారు. అయినా చట్టాల సవరణలో జాప్యం కొనసాగుతూ వస్తోంది. ప్రత్యేకించి మహిళలపై నేరాల విషయంలో మృగాల చేష్టలకు అడ్డుకట్ట పడలేకపోతోంది. తాజాగా.. తమిళనాడు కాంచీపురం ఘోరం జరిగింది. స్నేహితుడి ఎదుటే ఓ అమ్మాయిపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు కొందరు దుండగులు. గురువారం సాయంత్రం బెంగళూరు-పుదుచ్చేరి హైవేలో ఈ ఘటన చోటు చేసుకుంది. సాయంత్రం ఏడు గంటల సమయంలో.. తన స్నేహితుడితో ఓ ప్రైవేట్ స్కూల్ జాగా వద్ద యువతి మాట్లాడుతూ ఉంది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఐదుగురు వాళ్లను చుట్టుముట్టారు. స్నేహితుడి పీకపై కత్తి పెట్టి.. చెప్పిన మాట వినకపోతే చంపి పాతేసి వెళ్లిపోతామని ఇద్దరిని బెదిరించారు. ఆపై ఒకరి తర్వాత మరొకరు యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై మద్యం సేవించేందుకు వాళ్లు పక్కకు వెళ్లగానే.. స్నేహితురాలితో బైక్ మీద తప్పించుకున్నాడు ఆ యువకుడు. బంధువుల సాయంతో యువతిని ఆస్పత్రిలో చేర్పించి.. పోలీసులను ఆశ్రయించాడు. చీకటి ఉండడంతో నిందితులను గుర్తించలేనని చెప్పిన బాధితురాలు.. వాళ్లలో ఒకడిని మరొకడు విమల్ అని పిలిచాడని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. ఆ స్టేట్మెంట్ ఆధారంగా.. ఘటన స్థలానికి ఆనుకుని ఉండే విపాడు గ్రామానికి చెందిన విమల్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించారు పోలీసులు. దీంతో నిందితుడు మద్యం మత్తులో నేరానికి పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. అతని ద్వారా మిగతా నలుగురు నిందితులను ట్రేస్ చేసి అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా.. ఆపై జ్యూడీషియల్ కస్టడీకి తరలించారు. -
షాకింగ్ వీడియో: బస్సు ఫుట్‌బోర్డు నుంచి పట్టుతప్పి..
వైరల్: రన్నింగ్ బస్సు నుంచి పట్టుతప్పి రోడ్డున పడ్డ ఓ పిలగాడి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో.. కొందరు విద్యార్థులు, ఇతరులు ప్రమాదకర పరిస్థితుల్లో ఫుట్‌బోర్డు ప్రయాణం చేస్తున్నారు. అయితే.. అంతమందితో వేగంగా వెళ్తున్న బస్సు నుంచి హఠాత్తుగా పట్టుతప్పి కిందపడిపోయాడు ఆ స్టూడెంట్. కాస్తుంటే బస్సు వెనుక చక్రం కిందకు వెళ్లిపోయేవాడే. వెనుక కూడా ఏం వాహనాలు రాకపోవడంతో.. అదృష్టవశాత్తూ పిలగాడు ప్రాణాలతో బయటపడగలిగాడు. ఈ ఘటనను బస్సును బైక్‌పై ఫాలో అవుతూ వస్తున్న యువకులు వీడియో తీసినట్లు తెలుస్తోంది. సెంథిల్ కుమార్ అనే వ్యక్తి తమిళనాడులో కాంచిపురం జిల్లాలో ఈ ఘటన జరిగినట్లు మొదటగా ట్వీట్ చేశాడు.ఆ తర్వాత పలువురు తమ తమ అభిప్రాయాలతో ఈ ట్వీట్‌ను వైరల్ చేస్తుండడం విశేషం. Nothings changed except politicians’ bureaucrats’ wealth pic.twitter.com/tm1sOoKrQs — Indians Amplifying Suffering(IAS) (@ravithinkz) August 30, 2022 చాలాచోట్ల విద్యాసంస్థల రూట్లలో తక్కువ బస్సులు నడిపిస్తూ విమర్శలు ఎదుర్కొంటున్నాయి ప్రభుత్వాలు. అయితే.. అత్యుత్సాహంతో కొందరు యువకులు హెచ్చరికలను పట్టించుకోకుండా ఫుట్‌బోర్డ్ ప్రయాణాలు చేయడం కూడా తరచూ చూస్తుంటాం. ఫుట్‌బోర్డు ప్రయాణం నేరం మాత్రమే కాదు.. ప్రాణాల మీదకు తీసుకొస్తుంది కూడా!. ఇదీ చదవండి: వద్దురా సోదరా.. ఒకే బైక్‌పై ఏడుగురు -
పెట్రోల్ ధరలతో అల్లాడుతున్నారా? ఈ ఆఫర్ మీకోసమే!
చెన్నె: పెట్రోల్, డీజిల్ ధరలు అడ్డూఅదుపు లేకుండా పెరుగుతున్నాయి. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో రూ.110కి లీటర్ పెట్రోల్ చేరువయ్యింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో రూ.115 నుంచి 118 వరకు చేరుకుంది. ధరలు ఇలా పెరుగుతుండడంతో పేద, మధ్య తరగతి ప్రజలు వాహనాల వినియోగం తగ్గించేస్తున్నారు. అత్యవసరం.. ముఖ్యమైన పనులకే వాహనాలను వినియోగిస్తున్నారు. అయితే ఓ కంపెనీ బంపర్ ఆఫర్ అందించింది. లీటర్ పెట్రోల్ ఉచితంగా అందిస్తామని ప్రకటించింది. ఎందుకు? ఏమిటి? ఎక్కడో తెలుసుకోండి! చదవండి: స్విమ్మింగ్‌పూల్‌లో రాసలీలలు: రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన డీఎస్పీ తమిళనాడులోని కాంచీపురం జిల్లా ఉతిరామేరూర్‌లో శ్రీరామ్ వాహన ఫైనాన్స్ సంస్థ ఈ ఆఫర్ ప్రకటించింది. ప్రజలందరూ తమ ఆధార్, పాన్ కార్డుల జిరాక్స్ సమర్పిస్తే చాలు లీటర్ పెట్రోల్ ఉచితంగా అందిస్తామని తెలిపింది. ఈ ఆఫర్‌కు అనూహ్య స్పందన లభించింది. ప్రజలు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకోవడానికి ఎగబడ్డారు. కంపెనీ కార్యాలయానికి ఆధార్, పాన్ కార్డు పత్రాలతో బారులుతీరారు. అయితే పత్రాలు ఇచ్చిన వారందరికీ ఆ కంపెనీ కొన్ని షరతులు విధించినట్లు తెలుస్తోంది. తమ కంపెనీలోనే వాహనాల ఫైనాన్స్ చేసుకోవాలనే నిబంధన విధించినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్నారు. పెట్రోల్‌పై పన్నును రూ.3 తగ్గించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. చదవండి: కుర్రాళ్ల కన్నా రఫ్ఫాడిస్తున్న తాత.. ఈ వీడియో చూడండి ఆధార్, పాన్ కార్డు జిరాక్స్ ఇచ్చేందుకు ఎగబడ్డ ప్రజలు (ఫొటో: IndiaToday) -
నేరాల సంఖ్య తగ్గాలంటే..?
లలితాపరా భట్టారికా స్వరూపాన్ని చూడడానికి ఏ కాంచీపురమో, శృంగేరీయో వెళ్ళక్కరలేదు, అప్పుడే పుట్టిన తన పిల్లలకు పాలు ఇస్తున్న కుక్కలో కనబడుతుంది. తన్నుకు పోవడానికి వచ్చిన గద్దనుంచి రక్షించడానికి పిల్లలను రెక్కల కింద దాచిని కోడిపెట్ట కళ్ళల్లో ఆ మాతృత్వం, లలితా పరా భట్టారికా తత్త్వం కనబడుతుంది. ఆ మాతృత్వానికున్న విశేషం ఏమిటో నిజంగా పరమేశ్వరుడు ఎలా సృజించాడో అర్థం చేసుకున్న నాడు ప్రతి స్త్రీలో నిబిడీకృతమై ఉన్న మాతృత్వాన్ని చూడవచ్చు. ‘‘కన్నుదోయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావనచేత మరలువాడు..‘‘ అంటారు పోతన గురించి. ఇంత పరమ పవిత్రమైన అమ్మవారి విభూతిని సంతరించుకున్న తల్లి–అని ఆమె పాదాలను చూసి నమస్కారం చేసి తప్పుకుంటాడు తప్ప అన్యమైన భావనలు మనసులో పొంగే అవకాశమే ఉండదు. మాతృత్వం చేత స్త్రీ పట్టాభిషేకాన్ని పొందింది. ఈ జాతిలో అన్యభావనలు, అనవసర విషయాలు ఎప్పుడు ప్రబలుతాయి? మన సంస్కృతిని ఉపదేశం చేయనప్పుడు, కావ్యాలు, పురాణాల్లో ఎంతో గొప్పగా చెప్పబడిన స్త్రీ వైశిష్ట్యాన్ని ప్రబోధం చేయడం ఆగిపోయినప్పుడు... నేర మనస్తత్వం పెరుగుతుంది. మన శాస్త్రాల్లోని మంచి మాటలు, స్త్రీలను గౌరవిస్తూ వేదాలు చెప్పిన విషయాలు మనం మన పిల్లలకు చెప్పగలిగినప్పుడు, చెప్పినప్పుడు అసలు నేరాల సంఖ్య ఇలా అయితే ఉండదు. ఆమె చదువుకుందా లేదా అన్నదానితో సంబంధం ఉండదు. అవసరమయితే తన ప్రాణాన్ని ఇస్తుంది. అది పురుషుడివల్ల వశం కాదు. ఒకసారి తన ముగ్గురు బిడ్డలు, భరత్‌తో కలిసి ఒక సాధారణ ప్యాసింజరు రైలనుకుని వేరొక రైలెక్కిన నిరక్షాస్యురాలయిన ఒక పేద స్త్రీ. విషయం తెలుసుకుని దిగిన తరువాత చూసుకుంటే ఒక బిడ్డ లోపలే ఉండిపోయాడని తెలిసి.. ప్రాణాలకు తెగించి అప్పుడే బయల్దేరిన రైలువెంట పరుగులు తీస్తున్నది. ఛస్తావని అందరూ చివరకు భర్తకూడా హెచ్చరిస్తున్నా లెక్క చేయకుండా ప్లాట్‌ఫారమ్ మీద పరుగులు తీస్తుంటే చూసిన రైల్వే అధికారి ఒకరు రైలును ఆపించి బిడ్డను తల్లికి చేర్చారు. బిడ్డను తీసుకొచ్చేలోగా ఆమె స్పృహ తప్పింది. తరువాత బిడ్డను తడిమి చూసుకుని ఆమె పడ్డ ఆనందం మాటల్లో చెప్పనలవికాదు. అది కేవలం తల్లికే సాధ్యమయిన విశిష్ట లక్షణం. ఒక ప్రత్యేకమైన యాగం చేస్తే పితృరుణం తీరుతుంది. కానీ మాతృరుణం అలా తీరేది కాదని వేదం చెప్పింది. అందుకే దేశంలో ఒక సత్సంప్రదాయం ఉంది. సన్యాసం తీసుకుని పీఠాధిపత్యం పొందిన తరువాత ఆయనను చూడడానికి పూర్వాశ్రమంలోని తండ్రి వెడితే... మిగిలిన అందరిలాగే దర్శించుకుని నమస్కారం చేసి రావాల్సి ఉంటుంది. అంతే తప్ప మరో ఏర్పాటేదీ ఉండదు. అదే తల్లి కనబడిందనుకోండి. అప్పటిదాకా కూర్చుని ఉన్న పీఠాధిపతి లేచి నిలబడాలి. తల్లి అన్న మాటకు సన్యాసాశ్రమంలో కూడా అంత గౌరవం ఇచ్చింది శాస్త్రం. పరమాత్ముడంతటివాడు కూడా అంత విలువనిస్తాడు. స్త్రీ విషయంలో సాష్టాంగ నమస్కారానికి కూడా మినహాయింపు ఇచ్చింది శాస్త్రం. ఇంత గౌరవం, ఇంత ప్రాధాన్యత ఆమెపట్ల మాత్రమే ప్రకాశిస్తాయి. అది పురుషుని శరీరం విషయంలో అలా ప్రకాశించదు. -
తమిళనాడులో బాంబు పేలుడు, ఇద్దరు మృతి
సాక్షి, చెన్నై : రాష్ట్రంలో లష్కరే తోయిబా తీవ్రవాదులు చొరబడ్డ సమాచారంతో తమిళనాడులో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో కాంచీపురం జిల్లా తిరుప్పోరూర్ సమీపంలోని మానామది ఆలయం వద్ద ఆదివారం జరిగిన పేలుడులో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే... ఆలయ కొలనులో పూడికతీత పనుల్లో ఈ పేలుడు సంభవించింది. అయితే ఆదివారం కావడంతో ఆ పనులకు విరామం ఇచ్చారు. గ్రామానికి చెందిన సూర్య అనే యువకుడితో పాటు అతడి స్నేహితులు ఆ కొలనుకు వెళ్లారు. అక్కడ ఓ బాక్స్ లభించడంతో దానిని ఆలయం వద్దకు తీసుకొచ్చారు. దానిని తెరిచేందుకు మిత్రులు ఐదుగురు తీవ్రంగానే ప్రయత్నించారు. ఈ సమయంలో పెద్ద శబ్దంతో ఆ బాక్స్ పేలడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తీవ్రంగా గాయపడ్డ సూర్యతో పాటు మరో వ్యక్తి కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ పేలుడు దాటికి ఆలయం వద్ద గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. సమాచారం అందుకున్న చెంగల్పట్టు, మహాబలిపురం డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, బాంబ్, డాగ్‌స్కా్వడ్‌లు రంగంలోకి దిగాయి. ఆ బాక్సు ఎక్కడి నుంచి వచ్చింది. దానిని ఆలయం కొలను వద్దకు తీసుకొచ్చి పడేసింది ఎవరు అన్న అనుమానాలు బయలు దేరాయి. దీంతో కాంచీపురం పరిసరాల్లో వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. కాగా చొరబడ్డ తీవ్రవాదులు కోయంబత్తూరులో తిష్టవేసి ఉన్నట్టుగా స్పష్టమైన సమాచారం రావడంతో అక్కడ జల్లెడ పట్టి ఉన్నారు. అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారించి పంపుతున్నారు. ఇందులో ముగ్గురి వద్ద మాత్రం కొన్ని గంటల పాటు విచారణ సాగినా, చివరకు వారిని వదలి పెట్టారు. ఈ నేపథ్యంలో ఆదివా రం క్రైస్తవులు ప్రార్థనల నిమిత్తం పెద్ద సంఖ్యలో చర్చిలకు తరలి రావడం ఆనవాయితీ. దీంతో ముష్కరులు ఏదేని కుట్రలు చేసి ఉన్నారా అన్న ఉత్కంఠ, ఆందోళన తప్పలేదు. రంగంలోకి కమాండో బలగాలు... శ్రీలంకలో క్రైస్తవ ఆలయాన్ని టార్గెట్ చేసి పేలుళ్లు సాగిన దృష్ట్యా, అక్కడి నుంచి వచ్చిన తీవ్రవాదులు ఇక్కడి ఆలయాల్ని గురి పెట్టారా అన్న ఆందోళన తప్పలేదు. దీంతో కోయంబత్తూరు, నీలగిరి జిల్లాల్లోని చర్చిలను వేకువజాము నుంచి పోలీసు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కమాండో బలగాలను సైతం రంగంలోకి దించారు. అణువణువు తనిఖీలు చేశారు. బాంబ్ స్క్వాడ్ల తనిఖీలతో పాటు ఆయా ఆలయాల వద్ద మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేశారు. అందర్నీ తనిఖీలు చేసినానంతరం అనుమతించారు. ఎనిమిది గంటల నుంచి నాలుగు గంటల పాటు సాగిన ప్రార్థనలు సాగడంతో అప్పటి వరకు పోలీసులు మరింత అప్రమత్తంగా, డేగ కళ్ల నిఘాతో వ్యవహరించారు. కోయంబత్తూరు– తిరుప్పూర్ మార్గంలో అయితే, తనిఖీలు మరీ ముమ్మరం చేయడంతో వాహనచోదకులకు తంటాలు తప్పలేదు. చెన్నైతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రధాన చర్చిలే కాదు, ఇతర ఆలయాల వద్ద సైతం తనిఖీలు సాగాయి. ప్రత్యేక భద్రతను కల్పించారు. తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నా, చొరబడ్డ తీవ్రవాదుల జాడ కానరాని దృష్ట్యా, జల్లెడ పట్టే విషయంలో ఏ మాత్రం పోలీసులు తగ్గడం లేదు. అలాగే, కేరళలో పట్టుబడ్డ అబ్దుల్ వద్ద విచారణ జరిపేందుకు కోయంబత్తూరు నుంచి ప్రత్యేక బృందం బయలుదేరి వెళ్లింది. అతగాడి సాయంతోనే ఆరుగురు తీవ్రవాదులు కోయంబత్తూరులోకి ప్రవేశించి ఉండడం గమనార్హం. తుపాకీతో యువతి.. రామనాథపురంలోనూ తనిఖీలు ముమ్మరంగా సాగుతున్న విషయం తెలిసిందే. తమకు అందిన సమాచారం మేరకు ఉచ్చిపులి గ్రామంలోని వినాయక ఆలయం వీధిలో ఓ ఇంటిపై పోలీసులు గురి పెట్టారు. ఆ ఇంట్లో తనిఖీలు జరపగా ఓ తుపాకీ బయటపడింది. ఆ ఇంట్లో వల్లి అనే మహిళ మాత్రమే ఉంటున్నది. విచారణలో ఆమె టైలరింగ్ చేస్తుండడమే కాకుండా, ఆమె భర్త ఓ కేసులో పుళల్ జైల్లో ఉన్నట్టు తేలింది. దీంతో వల్లిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. -
మళ్లీ 40 ఏళ్ల తర్వాతే దర్శనం
కాంచీపురం అత్తివరదరాజస్వామి తిరిగి కోనేటిలోకి వెళ్లిపోయారు. మళ్లీ 40ఏళ్లకే ఆయన భక్తులకు దర్శమిస్తారు. 48రోజుల్లో దాదాపు 2కోట్లమంది అత్తివరదర్ పెరుమాళ్‌ని దర్శించుకున్నారని అంచనా. కాంచీపురం అత్తి వరదరాజస్వామి మళ్లీ కోనేటి ప్రవేశం చేశారు. 48రోజుల పాటు భక్తులకు దర్శనమిచ్చి... కోనేటి గర్భంలోకి వెళ్లిపోయారు. మళ్లీ 40ఏళ్లకు బయటకు వస్తారు. ఈ 48 రోజుల్లో తొలి 38 రోజులు శయనస్థితిలోనూ, మిగిలిన 10 రోజులు నిలబడినట్లు భక్తులకు దర్శనమిచ్చారు అత్తివరదర్ పెరుమాళ్. దక్షిణాపథంలోని ఏకైక మోక్షపురంగా ప్రసిద్దిగాంచిన కంచిలో ఉన్న వెయ్యికి పైగా ఆలయాల్లో శ్రీ వరదరాజ స్వామి దేవాలయం ఒకటి. 108 దివ్య తిరుపతులలో ఒకటిగా ఈ క్షేత్రం విరాజిల్లుతుంది. ఈ ఆలయంలోనే బంగారు, వెండి బల్లులు ఉంటాయి. వరదరాజస్వామి విగ్రహాం అత్తిచెక్కతో నిర్మితమైంది. 9 అడుగుల పొడవు ఉండే ఈ విగ్రహాన్ని బ్రహ్మదేవుడు ఆదేశంతో దేవశిల్పి విశ్వకర్మ రూపొందించినట్టు పురాణాలు చెబుతున్నాయి. 16వ శతాబ్దంలో కాంచీపురంపై జరిగిన మహమ్మదీయుల దండయాత్రలో కంచి దేవాలయం దోపిడీకి గురైందని, ఆ సమయంలో విగ్రహాన్ని కాపాడేందుకు వెండి పెట్టెలో పెట్టి ఆనంద పుష్కరిణిలో నీరాళి మండపం పక్కన అడుగుభాగంలో భద్రపరిచారని పెద్దలు చెబుతారు. పరిస్థితులు చక్కబడ్డాక పుష్కరిణిలో దాచిపెట్టిన విగ్రహ ఆనవాళ్లు తెలియకపోవడంతో.. గర్భాలయంలో వేరొక దివ్యమూర్తిని ప్రతిష్ఠించారు. మూలవిరాట్ లేకపోవడంతో వేరే విగ్రహాన్ని ప్రధాన ఆలయంలో ప్రతిష్టించారు. కొన్నాళ్ల తర్వాత కోనేరు ఎండిపోవడంతో వెండి పెట్టెలోని ప్రధాన విగ్రహం బయటపడింది. అత్తితో చేసిన ఆ విగ్రహం ఎన్నో ఏళ్లు నీటిలో ఉన్నా చెక్కచెదరకపోవడంతో దానిని తిరిగి ప్రతిష్టించారు. 48 రోజులపాటు క్రతువులు నిర్వహించి మళ్లీ కోనేటిలో భద్రపరిచారు. కాలానుగుణంగా ఇదే సంప్రదాయంగా మారింది. అప్పటినుంచి కోనేరులో భద్రపరిచిన విగ్రహాన్ని 40 ఏళ్లకోసారి తీసి 48 రోజులపాటు పూజలు చేసి మళ్లీ కోనేరులో భద్రపరుస్తున్నారు. 1854 నుంచి ఇలా చేస్తున్నట్లు ఆధారాలున్నాయి. ఈ ఏడాది జూలై 1 నుంచి ఆగస్ట్ 17 వరకూ ఈ మహాక్రతువు నిర్వహించారు. జూలై 1 నుంచి సుమారు రెండు కోట్లమంది భక్తులు అత్తివరదరాజస్వామిని దర్శించుకున్నారు. సాధారణ భక్తులతోపాటు వివిధ రంగాల ప్రముఖులు పెరుమాళ్ సేవలో పాల్గొన్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, మాజీ ప్రధాని దేవేగౌడ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, సూపర్‌స్టార్ రజనీకాంత్ దంపతులు, నటి నయనతార తదితరులు అత్తివరదరాజ్ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చదవండి: 40 ఏళ్లకోసారి దర్శనం.. పోటెత్తిన భక్తులు -
‘నీ అంతుచూస్తా..నీ పని అయిపోయింది’
చెన్నై : ‘మోసం చేయడానికే ఇక్కడికి వచ్చావా? నీ అంతుచూస్తా. అసలు నువ్వేమైనా చెక్ చేస్తున్నావా? చాలా మంది పాసులు లేకుండానే లోపలికి వెళ్తున్నారు. వీఐపీలు వస్తే వీరిని చూస్తూ అలాగే ఉండిపోవాలా? సీనియర్ ఐపీఎస్ అధికారులు, ముఖ్యమైన మంత్రులు వస్తున్నారు. నీ పని అయిపోయిందిక. నువ్వు ఈరోజే సస్పెండ్ అవుతావు. ఏం జరుగుతుందో చూస్తా. మీకు చాలా పొగరు. మీ ఐజీ ఎక్కడ. ఇక్కడికి రమ్మను. సారీ ఎందుకు చెబుతున్నావు’ అంటూ కాంచీపురం కలెక్టర్ ఓ ఎస్సైపై మండిపడ్డారు. అనుమతి లేకున్నా వీఐపీ లైన్లలో సాధారణ భక్తులను దర్శనానికి ఎలా అనుమతిస్తావని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా పోలీసుల తీరే ఇంత అంటూ రాష్ట్ర పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటన తమిళనాడులోని కాంచీపురం జిల్లా అత్తివరదరాజ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో చోటుచేసుకుంది. కాగా ఎంతో ప్రాశస్త్యం కలిగి ఉన్న అత్తివరదరాజు స్వామి ఆలయాన్ని భక్తుల దర్శనార్థం ప్రతీ 40 ఏళ్లకు ఒకసారి తెరుస్తారన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్వామి వారిని దర్శించుకునేందుకు లక్షలాది సంఖ్యలో భక్తులు పోటెత్తుతున్నారు. అదే విధంగా వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు, ముఖ్యమంత్రులు కూడా ఆలయానికి విచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తులను అదుపుచేయడం అక్కడ ఉన్న సిబ్బందికి కష్టతరంగా మారింది. అదే విధంగా రద్దీ కారణంగా భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఓ వృద్ధ జంట చాలా సేపటి వరకు వేచి చూసినా దేవుడి దర్శనం కాలేదు. దీంతో అక్కడే బాధ్యతలు నిర్వర్తిస్తున్న రమేశ్ అనే ఎస్సై(తిరువళ్లూరు జిల్లా) వారిని వీఐపీ లైన్లోకి అనుమతించారు. ఈ విషయాన్ని గమనించిన కాంచీపురం జిల్లా కలెక్టర్ రమేశ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షమించమని అడిగినప్పటికీ శాంతించక ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో కలెక్టర్‌పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో స్పందించిన కలెక్టర్.. ప్రజల క్షేమం కోసమే తాము, పోలీసులు కలిసి పనిచేస్తామని, ఆరోజు రద్దీ వల్ల భక్తులు, వీఐపీలు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో మాత్రమే అలా అన్నానని వివరణ ఇచ్చారు. కాగా పోలీసు ఉన్నతాధికారులు మాత్రం కలెక్టర్ ప్రవర్తించిన తీరును విమర్శిస్తున్నారు. -
ఆలయంలో తొక్కిసలాట.. ముగ్గురు మృతి
సాక్షి, చెన్నై : కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ ఆలయంలో అపశ్రుతి చోటు చేసుకుంది. భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో నలుగురు భక్తులు మృతిచెందారు. తొక్కిసలాటలో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన నారాయణమ్మ ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడు ప్రభుత్వం మృతుల ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల ఎక్స్ గ్రేషియాను ప్రకటించింది. నలబై ఏళ్లకు ఒకసారి దర్శనమిచ్చే అత్తివరదర్ స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. భక్తులు ఒకరినొకరు తోసుకుంటూ గుడి పైపు దూసుకొచ్చారు. దీంతో పలువురు సొమ్మసిల్లి పడిపోయారు. రంగంలోకి దిగిన పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. (చదవండి : 40 ఏళ్లకోసారి దర్శనం.. పోటెత్తిన భక్తులు) కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ ఆలయంలో కొలువైన అత్తివరదర్ స్వామి 40 ఏళ్లకోసారి దర్శనమివ్వటం ఆనవాయితీగా వస్తోంది. తాజాగా అత్తివరదర్ స్వామి దర్శన కార్యక్రమాన్ని తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ పూజాది లాంఛనాలతో ప్రారంభించగా... గత 18 రోజులుగా స్వామి దర్శనం కోసం భక్తులు వస్తూనే ఉన్నారు. దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివస్తున్న భక్తులతో ఆలయం జనసంద్రంగా మారింది. -
కాంచీపురంలో టీటీడీ చైర్మన్ దంపతులు
సాక్షి, చెన్నై: తమిళనాడులోని కాంచీపురం అత్తి వరదర్ స్వామి ఆలయాన్ని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు మంగళవారం దర్శించుకున్నారు. టీటీడీ తరపున సుబ్బారెడ్డి దంపతులు స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ పర్యటనలో వారితో పాటు టీటీడీ ఉన్నతాధికారులు, వేదపండితులు కూడా ఉన్నారు. వీరు స్వామివారి ప్రత్యేక పూజలను దగ్గరుండి తిలకించారు. -
40 ఏళ్లకోసారి దర్శనం.. పోటెత్తిన భక్తులు
-
40 ఏళ్లకోసారి దర్శనం.. పోటెత్తిన భక్తులు
సాక్షి, కాంచీపురం: నలబై ఏళ్లకు ఒకసారి దర్శనమిచ్చే కాంచీపురంలోని అత్తివరదర్ స్వామి కోసం భక్తులు పోటెత్తారు. ఇక్కడి వరదరాజ పెరుమాళ్ ఆలయంలో కొలువైన అత్తివరదర్ స్వామి 40 ఏళ్లకోసారి దర్శనమివ్వటం ఆనవాయితీగా వస్తోంది. తాజాగా అత్తివరదర్ స్వామి దర్శన కార్యక్రమాన్ని తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ పూజాది లాంఛనాలతో ప్రారంభించగా... గత 15 రోజులుగా స్వామి దర్శనం కోసం భక్తుల వస్తూనే ఉన్నారు. దేశం నకుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివస్తున్న భక్తులతో ఆలయం జనసంద్రంగా మారింది. ఇప్పటికే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, పలువురు ప్రముఖులతోపాటు లక్షలాది భక్తులు దర్శించుకున్నారు. తమిళులకు శుభంగా భావించి శుక్ర, శనివారాల్లో భక్తులు లక్షలాదిగా తరలిరావడంతో వరదరాజ పెరుమాళ్ ఆలయ పరిసరాలతోపాటు కాంచిపురంలో తిరుమాడ వీధులు జనంతో కిటకిటలాడుతున్నాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వాహకులు, పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
కంచి ఆలయంలో పోలీసుల దాష్టీకం
-
కంచిలో విషాదం
సాక్షి, చెన్నై: కాంచీపురంలో అత్తి వరదరాజ స్వామి ఆలయం వద్ద మహిళా పోలీస్ దాడి చేయడంతో రాజమండ్రికి చెందిన ఓ యువకుడు దుర్మరణం పాలవగా.. పోలీసుల ఓవరాక్షన్ కారణంగా ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. కాంచీపురంలో అత్తి వరదరాజ స్వామి దర్శన మహోత్సవం కనులపండువగా సాగుతోంది. స్వామి దర్శనం కోసం రాజమండ్రికి చెందిన శక్తి ఆకాశ్ అనే యువకుడు తల్లి నాగేశ్వరితో కలిసి సోమవారం కాంచీపురం వెళ్లాడు. బుధవారం వరదరాజ స్వామిని దర్శంచుకున్న తర్వాత శక్తి ఆకాశ్ ఆలయంలో ఉన్న మూలవిరాట్ విగ్రహాన్ని సెల్ఫోన్లో ఫొటో తీసే ప్రయత్నం చేశాడు. దీనిని గమనించిన మహిళా పోలీస్ అడ్డుకుని లాఠీతో అతడి తలపై బలంగా కొట్టింది. దీంతో ఆకాశ్ స్పృహ తప్పి పడిపోయాడు. చికిత్స నిమిత్తం అతడిని ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడు. పోలీసుల తీరుతో ఆటోడ్రైవర్ ఆత్మాహుతి భక్తుల తాకిడి అధికంగా ఉండటంతో కాంచీపురంలో వాహనాల రాకపోకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. కాంచీపురం కరుసపేటకు చెందిన కుమార్ అనే ఆటో డ్రైవర్ పాస్ తీసుకుని భక్తులను ఆలయానికి తరలిస్తున్నాడు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి ఆటోను ఆలయం వద్దకు అనుమతించలేదు. దీంతో పోలీసులకు, ఆటోడ్రైవర్ కుమార్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో కుమార్ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని మృతి చెందాడు. అతడు మంటల్లో కాలిపోతున్నా పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోయారు. -
కాంచిపురంలో భారీ అగ్ని ప్రమాదం
-
దారుణమైన యాక్సిడెంట్.. మహిళ మృతి!
సాక్షి, చెన్నై : కాంచీపురంలో జరిగిన రోడ్డు ప్రమాదం కొద్దిసేపట్లోనే వైరల్ అయింది. లారీ బీభత్సం సృష్టించడంతో ఓ మహిళ నుజ్జునుజ్జు అయింది. వివరాలు.. రద్దీగా ఉన్న ప్రాంతంలో బస్సు కోసం ఎదురుచూస్తున్న వారిపైకి లారీ దూసుకొచ్చింది. దీంతో బస్సుకు, లారీకి మధ్యలో ఓ మహిళ ఇరుక్కుపోయింది. అక్కడకిక్కడే ఆ మహిళ మృతి చెందింది. అయితే లారీ చక్రాల కింద పడ్డ మరో వ్యక్తి మాత్రం చావు నుంచి బయటపడ్డాడు. ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. -
ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి
సాక్షి, చెన్నై : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాంచిపురం సెయ్యరు సమీపంలో లారీ, వ్యాన్ ఢీకొనడంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, 31 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులంతా ఓకే గ్రామానికి చెందినవారిగా సమాచారం. కాంచీపురంలోని ఓ వేడుకకు వెళ్లి వస్తుండగా ఈ దుర్ఘటన సంభవించింది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. లారీ అతివేగంగా వచ్చి వ్యాన్‌ను ఢికొట్టడంతో వ్యాన్ నుజ్జునుజ్జయింది. వ్యాన్‌లో ఉన్న వారికి ఊపిరి ఆడకపోవడంతో ఆరుగురులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు త్వరగా స్పందించడంతో మృతుల సంఖ్య తగ్గినట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చెరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టామని పోలీసులు పేర్కొన్నారు. -
విధుల్లో కానిస్టేబుల్.. క్షణాల్లో దూసుకొచ్చిన బస్సు
చైన్నై : తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్‌ను అతివేగంగా దూసుకొచ్చిన ఓ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్‌తో పాటు రోడ్డు పక్కన నిల్చున్న మరో ఇద్దరు కూడా తీవ్ర గాయాలపాలయ్యారు. గుడువాంజేరి పట్టణంలోని ఓ కూడలి వద్ద శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా నడిరోడ్డుపై నిల్చుని డ్యూటీ చేస్తున్న కానిస్టేబుల్‌ను బస్సు ఢీకొడుతున్న చిత్రాలు కూడలిలో ఉన్న సీసీటీవీలో నమోదయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అతివేగమే ఇంతటి ప్రమాదానికి కారణమైందని పోలీసులు తెలిపారు. కాగా, క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. -
విషాద పర్యటన
సేలం: కాంచీపురం జిల్లాలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందగా, ఆరుగురు గాయపడ్డారు. వివరాలు.. చెన్నైలోని మన్నడి ప్రాంతంలోని బోర్కర్ మర్చెంట్ వీధికి చెందిన తొమ్మిది మంది యువకులు దీపావళి సెలవుల్లో పర్యాటనకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఓ ఇన్నోవా కారులో శనివారం ఉదయం చెన్నై నుంచి ఏలగిరి పర్యాటనకు బయలుదేరారు. కారులో సజావిక్ (25), రియాజ్ (20), ఫైసల్ (24) యాకూప్ (25), ఆసిఫ్ (21), ఇంతియాజ్ (23), ముహ్మద్ యాసిఫ్, ఇన్సాద్ ఇర్ఫాన్ (25), ఇన్సా (25) ఉన్నారు. వీరంతా స్నేహితులు. వారిలో ఫైసల్ కారును నడిపాడు. కారును ఢీకొన్న లారీలు.. కారు వేలూరు వైపుగా కాంచీపురం సమీపం చెన్నై– బెంగళూరు జాతీయ రహదారిలోని చిన్నయ్యన్ సత్రం వద్ద వెళుతోంది. యువకులంతా ఆనందంగా పాటలు పాడుకుంటూ వెళుతున్నాడు. అప్పుడు వెనుకనే వస్తున్న ఓ లారీ అకస్మాత్తుగా వేగం పెంచి కారును ఢీకొంది. దీంతో అదుపుతప్పిన కారు రోడ్డు డివైడర్‌ను దాటి అవతలి రోడ్డుపై ఎక్కింది. అదే సమయంలో వేలూరు నుంచి చెన్నైకు వెళ్తున్న కంటైనర్ లారీ వేగంగా కారును ఢీకొంది. దీంతో కారు నుజ్జునుజ్జై కారులోని సలీం కుమారుడు సజావిక్ (25), రియాజ్ (20), కారు నడిపిన ఫైసల్ (24) సంఘటనా స్థలంలోనే దుర్మణం చెందారు. ఇంకా యాకూప్ (25), ఆసిఫ్ (21), ఇంతియాజ్ (23), ముహ్మద్ యాసిఫ్, ఇన్సాద్ ఇర్ఫాన్ (25), ఇన్సా (25) తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల విచారణ.. సమాచారంతో డీఎస్పీ బాలసుబ్రమణియన్, తాలూకా సీఐ వెట్రిసెల్వన్, పోలీసులు రెండు ఆంబులెన్స్‌లు, రెండు అగ్నిమాపక వాహనాల్లో సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కాంచీపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను కూడా అదే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాంచీపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. ప్రమాదంలో మృతి చెందిన ఫైసల్ తమ్ముడు ఆసిఫ్. ప్రమాద విషయం తెలియడంతో చెన్నై నుంచి ఆ యువకుల కుటుంబీకులు కాంచీపురానికి చేరుకున్నారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల రోదనలతో ఆస్పత్రి దద్దరిల్లింది. -
చెన్నైకి రెండో విమానాశ్రయం
సాక్షి ప్రతినిధి, చెన్నై : చెన్నైకి మరో విమానాశ్రయం ‘అక్కడ...కాదు ఇక్కడే’ అంటూ నాలుగేళ్లకు పైగా జరుగుతున్న చర్చకు దాదాపు తెరపడినట్లే. కాంచీపురం సెయ్యూరులో ఎట్టకేలకూ రెండువేల ఎకరాల స్థలాన్ని తమిళనాడు ప్రభుత్వం ఎంపిక చేసింది. ఎయిర్‌పోర్టు చుట్టూ ఏరోసిటీ ఏర్పాటుకు విమానయానశాఖ సమాయత్తం కావడం ద్వారా రెండో ఎయిర్‌పోర్టు సమాచారాన్ని ఖరారు చేసింది. విమాన చార్జీలు మధ్యతరగతి వారికి సైతం అందుబాటులోకి రావడం, విమాన సంస్థలు అనేక రాయితీలతో మరింతగా ఆకర్షించడంతో చెన్నై ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల రాకపోకల సంఖ్య భారీగా పెరిగిపోయింది. ప్రయాణికుల సంఖ్యను అనుగుణంగా విమానాల సేవలను విస్తరించారు. పైగా డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులు మీనంబాక్కంలనే ఉన్నాయి. ప్రయాణం అంటే దాదాపుగా అందరికీ లగేజీ తప్పనిసరి కార్గోలో సైతం రద్దీ పెరిగిపోయింది. లగేజీని అప్పగించాలన్నా, డెలివరీ తీసుకోవాలన్నా గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని ప్రయాణికులు కొంతకాలంగా ఫిర్యాదులు చేస్తున్నారు. రెండో ఎయిర్‌పోర్టును ఏర్పాటు చేయకతప్పదనే పరిస్థితులు నెలకొన్నాయని కేంద్రం అభిప్రాయపడింది. ఈ ఆలోచన వచ్చిన తరువాత మీనంబాక్కం ఎయిర్‌పోర్టును ఆనుకునే ఉన్న ప్రాంతాలైన పొళిచ్చూరు, అనకాపుత్తూరు, పమ్మల్, కౌల్బజార్లలోని నివాసప్రాంతాలను ఖాళీ చేయించి విస్తరించాలని తీర్మానించింది. ఆయా ప్రాంతాల్లోని ప్రజలు ఇళ్లను వదిలి వెళ్లిపోయేందుకు విముఖత వ్యక్తం చేయడంతో ఈ ప్రయత్నాన్ని ప్రభుత్వం విరమించింది. మరో ప్రయత్నంగా మధురాంతకం, ఉత్తరిమేరూరు ప్రాంతాలను పరిశీలించి 1500 ఎకరాలను విమానయానశాఖ అధికారులు ఎంపికచేశారు. అయితే కొన్ని కారణాలవల్ల రెండో ప్రయత్నానికి కూడా స్వస్తిపలికారు. ఇక ఆ తరువాత చెన్నైకి సుమారు 50 కిలోమీటర్ల దూరంలోని శ్రీపెరంబుదూరును పరిశీలించారు. తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండిలో 1250 ఎకరాలు ఎంపికచేసి విరమించారు. మొత్తం మీద ఐదోప్రయత్నంగా కాంచీపురం జిల్లా మధురాంతకం సమీపం సెయ్యూరు తాలూకాలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఇందుకోసం రెండువేల ఎకరాలను రెవెన్యూ అధికారులు ఎంపిక చేశారు. ఈ రెండువేల ఎకరాల్లో మూడు పెద్ద గ్రామాలు, రెండు కుగ్రామాలు ఉన్నాయి. అరప్పోడు, ఆయకున్రం గ్రామాల పేర్లను మాత్రమే అధికారులు బైటపెట్టారు. ఇక్కడ విమానాశ్రయం ఏర్పడినట్లయితే సెయ్యూరు నుంచి చెన్నైకి రెండుగంటలు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. సర్వే నంబర్ల ప్రకారం రెండువేల ఎకరాల కొలతలకు ఎంపీపీ పుస్తకాన్ని జిల్లా అధికారులకు అప్పగించారు. సర్వే ముగిసిన తరువాతనే స్థల సేకరణ పనులను ప్రారంభిస్తారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో ప్రయివేటు, ప్రభుత్వ స్థలాలు కూడా కలిసి ఉన్నాయి. సెయ్యూరు పరిసరాలు ఓఎంఆర్, జీఎస్టీ రహదారులను కలుపుకుని ఉన్నందున చెన్నైకి సులభంగా చేరుకోవచ్చు. అయితే దూరం ఎక్కువగా ఉండటం ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేయవచ్చు. బెంగళూరు విమానాశ్రయంతో పోల్చుకుంటే నగరం సరిహద్దుల నుంచి 35 కిలోమీటర్లు, హైదరాబాద్ విమానాశ్రయంతో పోలిస్తే 27 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే చెన్నై నగరం నుంచి 100 కిలోమీటర్ల దూరంలో సెయ్యూరు ఉంది. సెయ్యూరు–చెన్నై మధ్య ఎక్స్‌ప్రెస్ హైవే ఏర్పాటు చేస్తేనే విమానప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దూరాన్ని దృష్టిలో ఉంచుకుని సెయ్యూరులో అంతర్జాతీయ విమానాశ్రయం, మీనంబాక్కంను అంతరాష్ట్ర (డొమెస్టిక్) విమానాశ్రయంగానూ తీర్చిదిద్దాలని అధికారులు ఆలోచిస్తున్నారు. అలాగే ఎయిర్‌పోర్టు కోసం ఎంపిక చేసిన ప్రాంత పరిసరాల్లో ఏరోసిటీ ఏర్పాటుకు విమానయానశాఖ సన్నాహాలు చేస్తోంది. -
తమిళనాడు: వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న సింగర్ మనో
-
డిఫెన్స్ ఎక్స్పోను సందర్శించిన ప్రధాని మోదీ
సాక్షి, చెన్నై : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెన్నైలో జరుగుతున్న డిఫెన్స్ ఎక్స్పోను గురువారం సందర్శించారు. అంతకు ముందు అదే ప్రాంగణంలో 2.90 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 685 ఎగ్జిబిషన్ స్టాల్స్‌తో ఏర్పాటు చేసిన వివిధ దేశాల ఎగ్జిబిషన్ ఆయన ప్రారంభించారు. కాగా ప్రధాని మోదీ ఉదయం 9.20 గంటలకు ప్రత్యేక విమానంలో చెన్నై పాత విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి...ప్రధానికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మహాబలిపురం, అక్కడి నుంచి కారులో డిఫెన్స్ ఎక్స్పో మైదానానికి విచ్చేశారు. ఇక అక్కడి కార్యక్రమాలను ముగించుకుని మరలా చెన్నై విమానాశ్రయానికి వస్తారు. అక్కడి నుంచి కారులో చెన్నై అడయారు కేన్సర్ ఇన్స్టిట్యూట్ వజ్రతోత్సవ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఢిల్లీకి తిరిగి వెళతారు. రాష్ట్రంలో కావేరీపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు, నల్లజెండాలతో నిరసన తెలుపుతున్న తరుణంలో ప్రధాని పర్యటనకు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ప్రధాని ప్రత్యేక భద్రతా దళం అధికారులు నిన్నే చెన్నైకి చేరుకుని భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ప్రధాని ప్రారంభించబోయే ప్రదర్శనశాలకు కిలోమీటర్ పరిధిలో ఏర్పాటు చేసిన హెలిపాడ్‌ను తనిఖీ చేశారు. వివిధ హోదాల్లోని రెండువేల మంది పోలీసు అధికారులతోపాటు 60 ప్రత్యేక కమాండోలను రంగంలోకి దించారు. అలాగే డిఫెన్స్ ఎక్స్‌పోలో భాగంగా కేంద్ర రక్షణశాఖ ఆధ్వర్యంలో నిన్న (బుధవారం) నిర్వహించిన విన్యాసాలు అబ్బురపరిచాయి. కాంచీపురం జిల్లా మహాబలిపురం సమీపం తిరువిడందై ఈసీఆర్ రోడ్డులో సుమారు 250 ఎకరాల విస్తీర్ణంలో రూ.480 కోట్లతో కేంద్ర రక్షణశాఖ భారీఎత్తున డిఫెన్స్ ఎక్స్‌పోకు రూపకల్పన చేసింది. కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఎక్స్పోను ప్రారంభించారు. దేశ విదేశాలకు చెందిన డిఫెన్స్ ఎక్స్పో భాగస్వామ్యులు, సందర్శకుల రాకతోనూ, వారి వాహనాలతోనూ ఐదు కిలోమీటర్ల మేర ఈసీఆర్ నిండిపోయింది. 47 దేశాలకు చెందిన యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, నౌకలు, ఫిరంగులు ఈ డిఫెన్స్ ఎక్స్‌పోలో భాగస్వామ్యులై తమ దేశ ప్రతిభను చాటాయి. యుద్ధవిమానాలు, హెలికాప్టర్లు ఆకాశంలో చక్కర్లు కొడుతూ గుండెలదరగొట్టాయి, తలకిందులుగా ఎగురుతూ పొగలు చిమ్ముతూ చేసిన విన్యాసాలు అబ్బురపరిచాయి. అలాగే యుద్ధ ఫిరంగుల విన్యాసాలు అదరగొట్టాయి. కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్‌తోపాట 167 దేశాలకు చెందిన ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అధికారులు తిలకించారు. ఈ ఎక్స్పో 14వ తేదీ వరకు నాలుగురోజులపాటు కొనసాగుతుంది. -
సారీ చెబుతారా స్వామి?
సాక్షి ప్రతినిధి, చెన్నై: అనేక వివాదాలకు నిలయమైన కాంచీపురం మఠం చుట్టూ మరో వివాదం ముసురుకుంది. తమిళులు అత్యంత గౌరవంగా భావించే ‘తమిళ్‌తాయ్ వాళ్తు’(త మిళతల్లిని కీర్తిస్తూ ప్రార్దన)ను కాంచీపురం పీఠం శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి అగౌరవపరిచారనే ఆరోపణలు రాష్ట్రంలో ఆందోళనలకు దారితీసాయి. స్వామిపై పోలీసులకు ఫిర్యాదు, తమిళులకు స్వామి క్షమాపణ చెప్పితీరాలనే డిమాండ్‌తో ప్రజలు, భాషాభిమాన సంఘాల వారు స్వామి చిత్రపటాలను ప్రదర్శిస్తూ గురువారం ఆందోళనలు నిర్వహించారు. కాంచీపురం మఠం మేనేజర్ శంకరరామన్ హత్య, ఇందులో కిరాయి గూండాల ప్రేమయం, అందులో జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతి పాత్ర, చెన్నై మందవల్లిలోని ఒక వ్యక్తి ఇంటిపై కిరాయిగూండాల దాడి ఇలా అనేక వివాదాలు మఠాన్ని చుట్టుముట్టాయి. ఇద్దరు స్వాములను పోలీసులు అరెస్ట్ చేసి జైల్లోకూడా పెట్టారు. సంవత్సరాల తరబడి సాగిన ఈ కేసులో స్వాములిద్దరూ నిర్దోషులుగా బైటపడ్డారు. ఇదిలా ఉండగా, తమిళుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా చోటుచేసుకున్న ఒక సంఘటన తాజా వివాదానికి కారణమైంది. అసలు విషయం ఏమిటంటే...బీజేపీ సీనియర్ నేత హెచ్ రాజా తండ్రి రాసిన పుస్తకావిష్కరణ కార్యక్రమం ఈనెల 23వ తేదీ చెన్నైలో జరిగింది. తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్, రాష్ట్ర మంత్రులతోపాటూ విజయేంద్ర సరస్వతి స్వామి సైతం పాల్గొన్నారు. తమిళనాడు ఆనవాయితీ ప్రకారం నిర్వాహకులు సభా కార్యక్రమ ప్రారంభంలో తమిళ్‌తాయ్ వాళ్తు గీతాన్ని ఆలపించారు. ఈ సమయంలో అందరూ లేచినిలబడగా స్వామి మాత్రం కళ్లుమూసుకుని కూర్చుండిపోయారు. ఆ తరువాత జనగణమణ జాతీయ గీతాన్ని ఆలపించినపుడు స్వామి లేచినిలబడ్డారు. దీంతో తమిళ్‌తాయ్ వాళ్తును స్వామి అవమానించారంటూ అదేరోజున విమర్శలు వచ్చాయి. డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షులు స్టాలిన్ సహా పలు రాజకీయ పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. కొందరు భాషాభిమానులు స్వామిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా రాయపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ వివాదం చిలికి చిలికి గాలీవానగా మారగూడదన్న ఉద్దేశంతో శంకరమఠం నిర్వాహకులు బుధవారం వివరణ ఇచ్చారు. కార్యక్రమాల ప్రారంభంలో దైవప్రార్థ నాగీతాలను ఆలపించినపుడు స్వామి ధ్యానముద్రలో ఉండటం ఆనవాయితీఅని, జాతీయగీతం సమయంలో దేశభక్తికి కట్టుబడి స్వామి లేచి నిలుచున్నారని తెలిపారు. తమిళ్‌తాయ్ వాళ్తును సైతం దైవ ప్రార్థనగా స్వామి భావించడం వల్లనే ధాన్యంలో కూర్చుండిపోయారేగానీ తమిళతల్లిని కించపరిచే ఆలోచన కాదని వివరించారు. అయితే ఈ వివరణకు శాంతించని ఆందోళనకారులు స్వామి క్షమాపణ చెప్పాల్సిందేనని గురువారం రాష్ట్రవ్యాప్తంగా అనే జిల్లాల్లో పోరాటాలు చేశారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో కాంచీపురంలోని శంకరమఠంను పలు రాజకీయ పార్టీలు, పలు ప్రజా సంఘాలకు చెందిన మహిళలు ముట్టడించారు. స్వామికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మఠంలోకి జొరబడే ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకుని సుమారు వంద మందిని అరెస్ట్ చేశారు. తమిళర్ దేశీయ మున్నని, తమిళర్నల పేరియక్కం, తమిళ్ పులిగళ్ తదితర పార్టీల వారు గురువారం ఉదయం 9.30 గంటలకు రామేశ్వరంలోని కంచికామకోటి శంకరమఠాన్ని ముట్టడించారు. స్వామికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో మఠం నిర్వాహకులు ఆందోళనకారులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయేంద్ర సరస్వతిపై క్రమశిక్షణ చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తంజావూరులోని అన్ని విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు నిరసన ప్రదర్శన చేశారు. అలాగే కోయంబత్తూరులో పవర్ హౌస్ వద్ద స్వామికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. జాతీయగీతానికి లేచినిలబడిన స్వామి తమళ్తాయ్ వాళ్తుకు కూర్చునే ఉండిపోవడం తమిళనాడు ప్రభుత్వాన్ని, తమిళ భాషను అవమానించడమేనని విమర్శలు చేశారు. తమిళభాషను కంచి స్వామి అవమానించినందుకు మీ రక్తం ఉడికిపోవడం లేదా అంటూ ప్రముఖ సినీదర్శకులు భారతిరాజా గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ప్రజలను ప్రశ్నించారు. ఈ గొడవలు ఇలా జరుగుతుండగానే జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతి స్వాములు కంచిలోని వస్పీతనర్ మఠంలో కూర్చుని భక్తులను ఆశీర్వదించారు. ఇదిలా ఉండగా, కొందరు వ్యక్తులు ఉద్దేశ్యపూర్వకంగా కంచిస్వామికి వ్యతిరేకంగా పోరాటాలకు రెచ్చగొడుతున్నారని కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ ఆరోపించారు. కాంచీపురం మఠం వారు తమిళాన్ని కించపరిచే చర్యలకు ఎంతమాత్రం పాల్పడరని అన్నారు. కంచిమఠం వారు వివరణ ఇచ్చినా రెచ్చగొడుతున్నది ఎవరో ప్రజలకు తెలుసని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, కంచి స్వామి చర్యలను రాష్ట్ర మంత్రులు సెల్లూరు రాజూ, పాండియరాజన్ సమర్థించగా కడంబూరు రాజా ఖండించారు. స్వామి పట్ల కొందరు సానుకూలంగా స్పందిస్తుండగా మరికొందరు పంతం పడుతున్నారు. దర్శకులు భారతిరాజా మరింత పరుషమైన వ్యాఖ్యలతో ప్రజలను ప్రశ్నించడం గమనార్హం. అయితే స్వామి ఇంతవరకు నోరుమెదపలేదు. ఇంతకూ స్వామి క్షమాపణలు చెబుతారా లేకుంటే వివాదం ఎలా సమసిపోతుందనే ప్రశ్న తలెత్తింది. -
కాంచీపురం ఆలయ పూజారిపై కేసు
కాంచీపురం: తమిళనాడులోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం కాంచీపురంలోని ఏకాంబరేశ్వర ఆలయంలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఇంటి దొంగలే ఆలయ బంగారం దోచేయటంతో పోలీసులు మోసాన్ని ఛేదించి విచారణ జరుపుతున్నారు. ఇక్కడి ఏకాంబరేశ్వర ఆలయంలోని స్వామి, అమ్మవార్లకు బంగారు నగలు చేయించాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. నగలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ స్తపతి, ఆలయ మేనేజర్, నగ తయారీదారులకు ఆరు కిలోల బంగారాన్ని అందించారు. తర్వాత కొత్త బంగారు నగలు చేసి స్వామివార్లకు అలంకరించారు. అయితే ఇటీవల పోలీసుల తనిఖీలలో రెండు పంచలోహ విగ్రహాలు పట్టుబడ్డాయి. దీనిపై విచారణ జరపగా ఈ విగ్రహాలు ఏకాంబరేశ్వర స్వామి ఆలయంలోనివని తేలింది. దీంతో లోతుగా దర్యాప్తు చేయగా పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆలయంలోని కొందరు పంచలోహ విగ్రహాల స్థానంలో నకిలీ విగ్రహాలను పెట్టి అసలు విగ్రహాలను బయట విక్రయించినట్లు తేలింది. అంతేకాక స్వామివార్ల నగలు కూడా నకిలీవని తేలింది. అసలు బంగారాన్ని స్వాహా చేసి నకిలీ గిల్డ్ నగలను స్వామివార్లకు అలంకరించినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో పోలీసులు స్తపతి, ఆలయ మేనేజర్, నగల తయారీదారు సహా తొమ్మిదిమందిపై కేసు నమోదు చేసి మంగళవారం అరెస్టు చేశారు. ప్రఖ్యాత ఆలయంలో స్వామివారి పంచలోహ విగ్రహాలు, నగలు స్వాహా చేయటం తమిళనాట కలకలం సృష్టిస్తోంది. -
బాత్రూమ్స్ కట్టిన త్రిష
కాంచీపురం (తమిళనాడు) : నటి త్రిష బాత్రూమ్స్ కట్టారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా కాంచీపురం జిల్లాలోని నెమలి గ్రామంలో నాలుగు మరుగుదొడ్లను నిర్మించేందుకు తన వంతు సాయం చేశారు త్రిష. సిమెంట్‌ను తన చేతులతో కలిపిన త్రిష.. ఇటుకలను వరుసలో పెట్టి నిర్మాణ పనులను ప్రారంభించడం విశేషం. త్రిష యునెస్కోకు భారత్ తరఫున అంబాసిడర్‌గా ఉన్న విషయం తెలిసిందే. మరుగుదొడ్ల నిర్మాణంపై మాట్లాడిన త్రిష.. స్వచ్ఛ భారత్‌కు తన వంతు సాయం అందించడం ఆనందంగా ఉందని అన్నారు. -
నటుడు, డీఎంకే నేత ఇంటిపై బాంబుదాడి
సాక్షి, చెన్నై: సీనియర్ నటుడు, డీఎంకే నేత రాధా రవి ఇంటిపై సోమవారం సాయంత్రం కొందరు గుర్తుతెలియని దుండగులు బాంబులతో దాడికి పాల్పడ్డారు. ఈ బాంబు దాడిలో రవి సోదరుడు కుమార్ (55) గాయపడ్డట్లు సమాచారం. ఈ ఘటన తమిళనాడు డీఎంకే నేతలలో కలకలం రేపింది. ఆ వివరాలిలా ఉన్నాయి.. ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు కంచీపురంలోని డీఎంకే నేత రవి ఇంటిపై దాడికి ప్లాన్ చేశారు. ఈ క్రమంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు స్కూటర్‌పై రవి ఇంటికి రాగా, మూడో నిందితుడు ఇంటి చుట్టుపక్కల వారి కదలికలను గమనించాడు. స్కూటర్ దిగిన ఇద్దరు వ్యక్తులు రాధా రవి ఇంటి ఆవరణలోకి చొరబడి క్రూడ్ బాంబులను విసిరారు. ఓ బాంబును ఇంటి ముందు విసిరిన తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. కాగా, దుండగుల బాంబు దాడిలో నటుడు రవి సోదరుడు కుమార్ (55) గాయపడగా, చికిత్స నిమిత్తం ఆయనను ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. సీసీటీవీలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. -
కాలం కలిసిరాక.. బిచ్చగాడిలా...
-
నిత్యానంద శిష్యులకు పోలీస్ హెచ్చరిక
-
భక్తుల చెంతకే భగవంతుడు
- రేపటి నుంచి అహోబిలేశుడి పార్వేట మహోత్సవాలు - 33 గ్రామాల్లో 45 రోజుల పాటు స్వామివారి పర్యటన - పెళ్లి పిలుపునకు గ్రామాలకు తరలివస్తున్న భగవంతుడు ఆళ్లగడ్డ : తన కల్యాణోత్సవానికి పరిసర ప్రాంతాల్లోని గ్రామాల వారిని ఆహ్వానించడంలో భాగంగా శ్రీ అహోబిలేశుడు చేపట్టే పార్వేట మహోత్సవం సోమవారం ప్రారంభం కానుంది. పార్వేట మహోత్సవ పూర్వపరాల్లోకి వెళ్తే.. కర్ణాటక రాష్ట్రం మేల్కోటెలో జన్మించిన కిడాంబి చళ్లపిళ్లై శ్రీనివాసాచార్యులు కాంచీపురంలో వేదాంత కాలక్షేపం చేస్తున్న సమయంలో శ్రీలక్ష్మినరసింహస్వామి కలలో సాక్షాత్కరించి అహోబిలం చేరుకోవాలని చెప్పారు. స్వామి ఆజ్ఞానుసారం ఆయన క్షేత్రం చేరగానే వృద్ధ సన్యాసి రూపంలో దర్శనమిచ్చి శ్రీనివాసాచార్యులకు సన్యాసాన్ని అనుగ్రహించారు. సాక్షాత్తు దేవదేవుడి చేతుల మీదుగా సన్యాసాన్ని స్వీకరించిన శ్రీనివాసాచార్యులు ‘ఆదివన్ శఠగోప యతీంద్ర మహాదేశికన్ ’ అనే సన్యాస ఆశ్రమ నామాన్ని స్వీకరించి ‘శ్రీ అహోబిల మఠం’ ను స్థాపించి మెట్టమెదటి పీఠాధిపతి అయ్యారు. అప్పుడు స్వామివారు పీఠాధిపతులవారితో ‘గ్రామే గ్రామే చగత్వాపద చరణ యో ... మాంగృహీత్వ (భక్తుల చెంతకే భగవండుడు అన్న విధంగా గ్రామ గ్రామాలకు నన్ను వేంచేయింపజేసి బక్తులకు మోక్ష మార్గాన్ని కల్పించండి) అని ఉపదేశించారు. స్వామి ఆజ్ఞ మేరకు ప్రథమ పీఠాధిపతి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని ఉత్సవ పల్లకిలో కొలువుంచి గ్రామాలకు చేరుకోవడంతో పాటు ఊరేగింపుగా అక్కడి వీధుల్లో సంచరిస్తూ ప్రత్యేకంగా నిర్మించిన తెలుపులపై కొలువుంటూ బక్తులకు ఆశ్వీర్వాదాలు అందజేసే ‘పార్వేట’ మహోత్సవాలకు శ్రీకారం చుట్టినట్లు చరిత్ర కథనం. వేటగాడిలా... నిత్యం పట్టువస్త్రాలు, వజ్రవైడూర్యాలతో దర్శనమిచ్చే శ్రీ లక్ష్మీనరసింహస్వాములు పార్వేట మహోత్సవాల్లో భాగంగా అమ్మవారు లేకుండా ఒంటరిగా తలపాగా మాత్రమే చుట్టుకుని వేటగాడి ఆకారంలో భక్తులకు దర్శనమిస్తారు. స్వామి ఇలా వేటగాడి రూపంలో సంచరించడంతో గ్రామానికి ఎల్లప్పుడు ఆయన రక్షణ ఉంటుందని ప్రజలు నమ్ముతారు. పార్వేటలో భాగంగా స్వామివారు ఏ ఊరికి వెళ్తే ఆ రోజు అక్కడ తిరునాల జరుగుతుంది. ఇలా 45 రోజులపాటు ఈ పార్వేట సాగుతుంది. స్వామి తిరిగి కొండెక్కేవరకు పాదుకలే సర్వస్వం పార్వేట ఉత్సవాల్లో భాగంగా సుమారు మండలం రోజులకు పైగా స్వామివారి గ్రామాల్లో తిరుగుతూ భక్తులను ఆశీర్వదించెందుకు కొండ దిగుతారు. అయితే తిరిగి కొండెక్కేవరకు క్షేత్రంలో అహోబిలేశుడి పాదుకలున్న శఠగోపం ఆలయంలో ఉంచుతారు. ఈ శఠానికి నిత్యం ప్రాతఃకాలంలో అన్ని రకాల పూజలు నిర్వహించి కొలువుంచి పరమ పవిత్రంగా కొలుస్తుంటారు. స్వామి తిరిగి కొండెక్కేవరకు అహోబిలంలో మూలవిరాట్‌ను దర్శించుకునే బక్తులకు శఠారు పెట్టడం జరగదు. కేవలం తీర్థ ప్రసాదాలు మాత్రమే అందజేయడం ఆనవాయితీ. ఇప్పటికి కూడా స్వామికి అర్చకులు బావి నీరుతో కట్టెల పొయ్యిపై చేసిన నైవేద్యాన్ని మాత్రమే నివేదిస్తారు. ఇలా స్వామి ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి దాదాపు రాత్రి పొద్దుపోయిన తరువాతే వెళ్తారు. రుద్రవరం మండలం ఆలమూరు, లింగందిన్నె గ్రామాలకు చెందిన బోయిలు కాళ్లకు చెప్పులు లేకుండా చీకట్లో, ముళ్ల పొదల్లోనే స్వామి పల్లకీని మోసుకెళ్తారు. ఇలా స్వామివారి పార్వేట ఆళ్లగడ్డ, రుద్రవరం, ఉయ్యాలవాడ మండలాల్లోని 33 గ్రామాల్లో సాగుతుంది. కొండదిగిన రోజునుంచి తీరిక లేకుండా గ్రామ గ్రామాన తిరిగి బక్తులకు దర్శన భాగ్యము కల్పించి 45 రోజుల అనంతరం రుద్రవరం నుంచి స్వామి పల్లకి కొండ(అహోబిలం) ఎక్కుతుంది. ఉత్సవాలు సాగేది ఇలా.. ఎగువ అహోబిలంలో కొలువైన జ్వాల నరసింహస్వామిని సంక్రాంతి పర్వదినం రోజు దిగువ అహోబిలం తీసుకు వస్తారు. పదవ క్షేత్రం దిగువ అహోబిలంలో కొలువైన ప్రహ్లాదవరదస్వామితో కలిపి కొలువుంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. స్వాములకు ఎదురుగా అన్నం రాసిగా పోసి అన్నకూటోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా 45 రోజులపాటు సాగే పార్వేట ఉత్సవాల్లో స్వాములకు సరిపడా ఆహారాన్ని ఇద్దరు ఉత్సవ మూర్తులకు అర్పిస్తారు. అనంతరం పార్వేట ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. ఈప్రాంత ప్రజలు చేసుకున్న పుణ్యం : కీడాంబి వేణుగోపాలన్, అహోబిలం దేవస్థాన ప్రధానార్చకులు ప్రపంచంలో ఎక్కడా ఏ స్వామి ఇవ్వని కానుకను శ్రీఅహోబిల లక్ష్మీనరసింహస్వామి పార్వేట ఉత్సవాల ద్వారా ప్రజలకు అందిస్తారు. స్వయంగా భక్తుని చెంతకే భగవంతుడు వెళ్లి దర్శన భాగ్యం కల్పించే కార్యక్రమానికి ఈ ఉత్సవాలు వేదికగా నిలుస్తాయి. -
నూతన కాంచీపురం బ్రాంచ్..
రాంగోపాల్‌పేట్: దుస్తులు శరీరానికి రక్షణతోపాటు అందాన్ని రెట్టింపు చేస్తాయని త్రిదండి శ్రీ మన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి అన్నారు. సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్్స షోరూంను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రక్షణ, అందాన్ని పెంచే సాంప్రదాయ కాంచీపురం సిల్క్ దుస్తుల షోరూంను ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయమని చెప్పారు. సంస్థ అధినేతలు ప్రసాద్, కల్యాణ్‌లు మాట్లాడుతూ మహిళల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన చీరల్ని అందుబాటులో ఉంచామన్నారు. తమవద్ద కాంచీపురం, ఆరాణి, బనారస్, ధర్మవరం, ఉప్పాడ, హ్యాండ్లూమ్ చీరలు లభ్యమవుతాయని తెలిపారు. డిజైనర్ ఫ్యాన్సీ, హ్యాండ్లూమ్, కుర్తీలు, వెస్ట్రన్ వేర్, రెడీమేడ్ డ్రెస్ మెటీరియల్ దుస్తులు అతి తక్కువ ధరలకు అందుబాటులో ఉంచినట్లు వారు వివరించారు. ఈ కార్యక్రమంలో గజల్ శ్రీనివాస్, సరస్వతి ఉపాసకులు దైవజ్ఞశర్మ పాల్గొన్నారు. -
బాపుగారి బొమ్మ సందడి
బంజారాహిల్స్, బాలాన గర్: కాంచిపురం వీఆర్కే సిల్క్్స సిటీలో తమ షోరూమ్‌లు విస్తరిస్తోంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్.2, కూకట్‌పల్లిలోని కేపీహెచ్‌బీ కాలనీలో నెలకొల్పిన రెండు షోరూమ్‌లను సినీ నటి ప్రణీత శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రణీత వివిధ రకాల పట్టు చీరలు ధరించి సందడి చేశారు. తనకు పట్టు చీరలంటే ఎంతో ఇష్టమని, మగువలు మెచ్చే అన్ని రకాల సిల్క్, పట్టు చీరలు ఆకర్షణీయమైన డిజైన్లలో ఒకే చోట లభించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో షోరూం ఎండీ రాజేందర్‌కుమార్ పాల్గొన్నారు. -
కాంచీపురంలో కరెన్సీ గణనాధుడు
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం
-
లోయలోపడిన కారు : ఐదుగురి మృతి
చెన్నై : తమిళనాడులో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాంచీపురం జిల్లా కల్పాకం సమీపంలో కారు లోయలో పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. ఆ విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.... క్షతగాత్రుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అనంతరం కారులోని మృతదేహలను బయటకు తీశారు. మృతదేహలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హ్యాండ్బ్లూమ్
కాంచీపురం, ధర్మవరం, బెనారస్... ఈ పేర్లు వినపడగానే మన కు గుర్తుకొచ్చేది చీరలే. ఆ ప్రాంతాల ఉత్పత్తులన్నీ ఇప్పడు ఒక్కచోట చేరాయి. చీరలు మాత్రమే కాదు, చుడీదార్స్, మిడ్డీస్, లేడీస్ యాక్ససరీస్ని కూడా ప్రదర్శనలో ఉంచారు. హిమాయత్ నగర్ టీటీడీ కళ్యాణమండపంలో ‘జాతీయ సిల్క్ వస్త్ర ప్రదర్శన’ శనివారం ప్రారంభమయింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు దక్షిణ, ఉత్తరాది రాష్ట్రాల నుంచి తెచ్చిన విభిన్న డిజైన్లు ఇక్కడ కొలువుదీరాయి. దాదాపు 70 మంది డిజైనర్ల అత్యుత్తమమైన డిజైన్లు ఇక్కడ ఉన్నాయి. సంప్రదాయ పట్టు చీరలతో పాటు ప్రింటెడ్, నెటెడ్, కాటన్ శారీస్ ఆకట్టుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికుల ఉత్పత్తులకు సరైన మార్కెట్‌ను ఏర్పాటు చేసి తద్వారా వారికి ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ఈ ప్రదర్శను ఏర్పాటు చేశారు. ఇవే కాదు... పెరల్స్, గోల్ట్ కోటెడ్ జ్యువెలరీ, లెదర్ బ్యాగ్స్, డ్రైప్రూట్స్ కూడా అందుబాటులోనే ఉన్నాయి. ఈ నెల 23 వరకు కొనసాగే ఈ ఎక్స్‌పోలో ధరల రేంజ్ రూ.500- రూ.15,000. -
చెన్నపట్టుణం చిరునామా!
చెన్నై సెంట్రల్ - తెలుగువారి కబుర్లు మొదట్లో మా తాతగారు కాంచీపురంలో ఒక ఆసామి దగ్గర పనిచేసేవారు. 1911లో కింగ్ జార్జి - 5, చెన్నపట్టణానికి వచ్చినప్పుడు, ఆయనను పట్టు శాలువాతో సత్కరించి మన సంప్రదాయాన్ని నిలబెట్టాలనుకున్నారు. ఆ శాలువా నేసే బాధ్యత మా తాతగారైన నల్లి చిన్నస్వామి చెట్టికి అప్పచెప్పారు. ఆయన... ఒక ప్రాంతాన్ని ప్రపంచానికి పరిచయమయ్యేలా చేశారు. అరణ్యాన్ని సుందర సంపద వనంలా మార్చారు. కింగ్‌జార్జి - 5 కి పట్టు శాలువా కప్పిన తాతకు మనుమడయ్యారు. ఎం.ఎస్.సుబ్బులక్ష్మి దగ్గర నుంచి అందరు గాయనీమణులకు కొంగుబంగారమయ్యారు. అనేక పుస్తకాలు రచించారు... అనేక సంగీత సంస్థలకు విరాళాలిచ్చారు. ఇస్తూనే ఉన్నారు. తాతగారు నల్లి చిన్నస్వామిచెట్టి ప్రారంభించిన నల్లి సిల్క్స్ను సుమారు 60 ఏళ్లుగా ఒంటిచేత్తో అందనంత ఎత్తుకు తీసుకెళ్లిన నల్లి కుప్పుస్వామి వంశీయులు సాక్షాత్తు తెలుగువారు. చెన్నైకి పేరు తీసుకురావడం వెనుక ఉన్న విషయాల గురించి ఆయన చెప్పారు. అతిథిని పట్టు శాలువాతో సత్కరించడం భారతీయుల సంప్రదాయం. చెన్నపట్టణం ఒక కుటుంబం ద్వారా ఆ ఘనత దక్కించుకుంది. మన సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసింది. తరతరాలుగా ఎన్నో జంటలను తన ముహూర్తం పట్టు చీరల ద్వారా ఒకటి చేస్తోంది. ఇంతటి ఘన కీర్తికి కారణం కాంచీపుర వాసులైన ‘నల్లి’ కుటుంబీకులు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగువారిగా అడుగుపెట్టి, చెన్నపట్టణానికి సేవ చేసిన తెలుగు కుటుంబం నల్లి వారిది. ఒకప్పుడు సరస్సులతో నిద్రాణంగా, పేదరికంతో ఉన్న టి.నగర్ కి ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకువచ్చారు. కోట్లాది రూపాయల వ్యాపారం జరిగేంత ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లారు. పట్టువస్త్రాలు, రత్నాలు, వజ్రాలు, బంగారు నగల వ్యాపారానికి రాజధానిని చేశారు. చెన్నపట్టణంలో టి.నగర్‌ను అతి పెద్ద వ్యాపార కేంద్రంగా మలచిన ఘనత వారిది. ఇంత ఘనత వెనుక ఉన్న వ్యక్తి డా. నల్లి కుప్పుస్వామి చెట్టి. తాతగారు నల్లి చిన్నస్వామి చెట్టి, తండ్రి నారాయణ స్వామి చెట్టి గార్ల నుంచి ఈ అతి పెద్ద బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకుని వారిని మరపిస్తూ పట్టు చీరల వ్యాపారాన్ని విజయవంతంగా నడిపిస్తున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... మొదట్లో మా తాతగారు కాంచీపురంలో ఒక ఆసామి దగ్గర పనిచేసేవారు. 1911లో కింగ్ జార్జి - 5, చెన్నపట్టణానికి వచ్చినప్పుడు, ఆయనను పట్టు శాలువాతో సత్కరించి మన సంప్రదాయాన్ని నిలబెట్టాలనుకున్నారు. ఆ శాలువా నేసే బాధ్యత మా తాతగారైన నల్లి చిన్నస్వామి చెట్టికి అప్పచెప్పారు. అనుకోకుండా జార్జి పట్టాభిషేకం అదే సమయంలో జరుగుతూండటం బాగా కలిసి వచ్చింది. తాతగారు కొరొనేషన్ బార్డర్‌తో శాలువా నేశారు. అందులో కెమికల్ డై వాడారు. అలా వాడిన మొట్టమొదటి వ్యక్తి మా తాతగారే. ఆ రంగులను వాడడానికి అందరూ జంకుతున్న సమయంలో మా తాతగారు ఉపయోగించడం ఆ రోజుల్లో సంచలనమే. ఈ రంగుల వల్ల పట్టుకి మెరుపు పోతుందని వారంతా భావించారు. అలా పట్టు రంగంలో విప్లవం తీసుకువచ్చిన ఘనత తాతగారిది. కాంచీపురంలో మెయిన్ రోడ్డు దగ్గర స్వయంగా పట్టుచీరల దుకాణం ప్రారంభించారు. బస్సు దిగిన వారంతా తాతగారి షాపులో పట్టు చీరలు కొనుక్కుని వెళ్లేవారు. కొన్నాళ్ల తర్వాత పట్టు చీరలను చెన్నపట్టణంలో అమ్మడం ప్రారంభించారు. చెన్నపట్టణంలో చీరలకు డిమాండ్ పెరగడంతో, 1928 నాటికి కాంచీపురం విడిచి, చెన్నపట్టణం రావడానికి నిశ్చయించుకున్నారు. చెన్నపట్టణం ముఖద్వారంగా ఉన్న మాంబళం రైల్వేస్టేషన్ దగ్గర శాశ్వతంగా ఒక దుకాణం తీసుకుని, చీరల వ్యాపారం ప్రారంభించారు. 1939 లో రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో, చెన్నపట్టణం మీద బాంబు వేస్తారనే వదంతులు వ్యాపించడంతో కొన్ని వందల కుటుంబాలు చెన్నపట్టణం విడిచిపెట్టి వెళ్లిపోయాయి. 21 రోజుల పాటు అందరికీ నల్లి వారి షాపు అందుబాటులో ఉండి, ఆ కష్టకాలంలో ఆదుకోవడంతో, వ్యాపారంలో నల్లి అగ్రస్థానాన నిలిచింది. మా తాతగారు టి నగర్ వచ్చినప్పుడు ఒకసారి ఒక నక్క మా తలుపు తట్టిందట. అటువంటి అరణ్యాన్ని సంపదలవనంగా మార్చిన ఘనత ఆయనది. తాతగారి తరవాత నాన్నగారు నారాయణస్వామి చెట్టి, ఆ తరవాత నేను వారసత్వం అంది పుచ్చుకున్నాను. నేను చెన్నై వచ్చేనాటికి అమ్మ పొత్తిళ్లలో ఉన్నాను. అలా పెరిగి పెద్దవాడనై ఇప్పుడు వ్యాపారంలో నిలబడ్డాను. దేశవిదేశాలలో మా షోరూమ్‌లు ప్రారంభించాను. అయితే ఇంకా ఏదో చేయాలనే తపన ఉండటంతో, సంగీత సాహిత్యాలకు, సమాజసేవకు కూడా పాటుపడుతున్నాను. విద్యాసంస్థలు స్థాపించాను. పెళ్లిళ్లకు పూర్తిస్థాయి వస్త్రాలు అందించిన మొట్టమొదటి షాపు మాది కావడం మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. కస్టమర్ల గురించి వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని ఎంతో ఆప్యాయంగా వారి చేత కొనిపించడం నాన్న నారాయణస్వామిచెట్టి దగ్గర నుంచి నేర్చుకున్నాను. నాన్నగారు బ్రాంచీలు ప్రారంభించడానికి సుముఖత చూపలేదు. అయినప్పటికీ కస్టమర్ల విశ్వాసాన్ని దృఢంగా సంపాదించుకున్నారు. 750 కోట్ల టర్నోవర్. నా 15వ ఏట బోర్డ్ ఎగ్జామ్స్ రాసిన మరుసటిరోజునే నాన్నగారి అకాల మరణంతో నేను నల్లి బాధ్యతలు తీసుకోవలసి వచ్చింది. నాన్నగారు ఏర్పాటుచేసిన మంచి టీమ్ కారణంగా ఏ ఇబ్బందీ లేకుండా వ్యాపారం సాగించగలిగాను. నా మీద ఆర్కె మిషన్ స్కూలు ప్రభావం బాగా ఉంది. సంప్రదాయ పద్ధతుల నుంచి ఆధునిక తరాలకు అనుగుణంగా వస్త్రాలు తయారుచేయించడం ప్రారంభించాను. 1985 వరకు ఒకే బ్రాంచిగా ఉన్న నల్లి, సింగపూర్, అమెరికాలలో కలిపి 30 బ్రాంచీల స్థాయికి ఎదిగింది. 85 సంవత్సరాలుగా నిజాయితీకి మారుపేరుగా నిలబడింది. మాకు ఎందరు పోటీ వచ్చినా మా సంస్థకు మాత్రం డిమాండ్ దగ్గలేదు. నేటికీ నేను ఉదయాన్నే షాపుకి వెళ్లి అకౌంట్స్ చూసుకుంటాను. క్వాలిటీ విషయంలో అస్సలు రాజీపడను. మా చిన్నప్పుడు కృష్ణగానసభలో జరిగే కచేరీలు ఇంటి దగ్గర నుంచి వినేవాడి ని. ఎంఎస్‌సుబ్బులక్ష్మి వంటివారికి అభిమానినయ్యాను. పానగల్ పార్క్‌లో రేడియోలో నుంచి వచ్చే వార్తలు వినేవాడిని. ఒకసారి కృష్ణగాన సభ సెక్రటరీ నా దగ్గర 1000 రూపాయల అప్పు తీసుకుని, తిరిగి ఇవ్వడానికి వచ్చినప్పుడు నేను తిరస్కరించాను. సంగీతం పట్ల అది నా బాధ్యత అన్నాను. అలా మా ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఏటా మార్గళిలో చెన్నైలో జరిగే సంగీత ఉత్సవాలలో యేటా నా వంతుగా ఎంతో కొంత ఇస్తుంటాను. చాలా సభలకు అధ్యక్షుడిగా ఉన్నాను. నాకు టి నగర్ ఇంత పేరుప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది. నేను టి. నగర్ మీద పుస్తకం రాసి నా ఋణం తీర్చుకున్నాను. ఇంకా ఇతర పుస్తకాలు కూడా రచించాను. విద్యాసంస్థలు స్థాపించాను. నా జీవితం టినగర్లోనే ప్రారంభమైంది, ఇక్కడే అభివృద్ధి చెందాను. నన్ను, టి. నగర్‌ని విడివిడిగా చూడలేను. సమయపాలన, క్రమశిక్షణ, నాణ్యత... ఇవి నేను పాటించే సూత్రాలు. సంభాషణ: డా. పురాణపండ వైజయంతి, సాక్షి, చెన్నై ఫొటో: వన్నె శ్రీనివాసులు -
క్యాంపస్ అంబాసిడర్, వికాస్ శ్రీ వాస్తవ - ఐఐఐటీడీఎం - కాంచీపురం
ఇంజనీరింగ్ డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్‌లో విద్యార్థులను తీర్చిదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం దేశంలో ఏర్పాటు చేసిన సంస్థ.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ - కాంచీపురం. ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ సెకండియర్ చదువుతున్న వికాస్ శ్రీ వాత్సవ తన క్యాంపస్ కబుర్లను చెబుతున్నారిలా... భోజనం.. ప్రధాన సమస్య.. ఐఐఐటీడీఎంను 2007లో ఏర్పాటు చేశారు. మొత్తం 51 ఎకరాల వైశాల్యంలో క్యాంపస్ ఉంటుంది. కొన్ని నిర్మాణాలు ఇంకా ఇప్పటికీ పూర్తి కాలేదు. ఇక్కడ ప్రధాన సమస్య.. ఫుడ్. ఆహారం అసలు బాగోదు. మంచి క్యాంటీన్ కూడా లేదు. విద్యార్థులంతా చాలా స్నేహంగా ఉంటారు. తరగతి గదులు, లేబొరేటరీలు, సెమినార్ హాల్స్, మెషిన్స్, అకడమిక్ బ్లాక్స్, లైబ్రరీ అత్యుత్తమ స్థాయిలో ఉన్నాయి. ప్రత్యేకంగా డిజైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్‌లో విద్యార్థులను నిష్ణాతులుగా తీర్చిదిద్దేలా కరిక్యులం ఉంటుంది. ఫ్రెండ్లీ ఫ్యాకల్టీ ఫ్యాకల్టీ అకడమిక్ సందేహాలను నివృత్తి చేస్తారు. అదేవిధంగా ప్రాజెక్టులలోనూ సహాయమందిస్తారు. ఇంటర్న్‌షిప్, మినీ ప్రాజెక్ట్స్ విషయంలో వీరిచ్చే గెడైన్స్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఇక క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ అంత గొప్పగా ఏమీ లేవు. ఎందుకంటే ముందే చెప్పినట్లుగా ఇన్స్టిట్యూట్ ఏర్పడి కొంతకాలమే అవుతుంది. నా కోర్సు పూర్తయ్యాక యూఎస్‌లో ఎంఎస్ చేయాలనుకుంటున్నా. -
ప్రచార బాట
రాష్ట్ర ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఎన్నికల ప్రచారానికి రెడీ అయ్యారు. సోమవారం నుంచి ఏప్రిల్ ఐదో తేదీ వరకు తొలి విడతగా సుడిగాలి పర్యటన చేయనున్నారు. కాంచీపురం జిల్లా తేరడి నుంచి తన ఎన్నికల ప్రచారానికి జయలలిత శ్రీకారం చుట్టనున్నారు. కొలిక్కిరాని దృష్ట్యా, 40 స్థానాల బరిలో తమ అభ్యర్థుల్ని జయలలిత ప్రకటించా రు. దీంతో ఆయా అభ్యర్థులు తమ నియోజకవర్గం పరిధుల్లో ఓటర్లను ఆకర్షించడం లక్ష్యంగా ఉరకలు పరుగులు తీస్తున్నారు. తమ అభ్యర్థుల గెలుపు లక్ష్యంగా ఓట్ల వేటకు ఆ పార్టీ అధినేత్రి, సీఎం జయలలిత సిద్ధం స్వయంగా పర్యటించనున్నారు. సోమవారం నుంచి ఎన్నికల ప్రచార బాట పట్టనున్నారు. కాంచీపురం తేరడి నుంచి ఈ ప్రచారానికి ఆమె శ్రీకారం చుట్టనున్నారు. పర్యటన సాగేది ఇలా...: ఏప్రిల్ ఐదో తేదీ వరకు సాగనున్న తొలి విడత ప్రచారంలో భాగంగా 13 లోక్ సభ నియోజక వర్గాల్లో ఆమె పర్యటించనున్నారు. రోడ్ షోలు, బహిరంగ సభల రూపంలో ప్రచారం సాగనుంది. ఒక రోజు విరామం, మరో రోజు ప్రచారం అన్నట్టుగా పర్యటన సాగనున్నది. అధినేత్రి జయలలిత తమ జిల్లా నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నడంతో కాంచీపురం నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. చెన్నై - కాంచీపురం మార్గాన్ని అన్నాడీఎంకే జెండాలు,తోరణాలతో ముంచెత్తారు. ఆమె పర్యటన సాగే ప్రాంతాల్లో భద్రతను పెంచారు. వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. మార్చి 4: శ్రీ పెరంబదూర్ నియోజకవర్గం పరిధిలోని మీనంబాక్కం జైన్ కళాశాలలో బహిరంగ సభ మార్చి 6: నాగపట్నం నియోజకవర్గం అవరిత్తిడల్, మైలాడుదురై నియోజకవర్గం సెంబనర్ కోయిల్ యూనియన్ కాళహస్తికాపురం. మార్చి 9: కన్యాకుమారి నియోజకవర్గం నాగర్ కోయిల్ నాగరాజ తిడల్. మార్చి 11: చిదంబరం నియోజకవర్గం చిదంబరం తేరు వీధి మార్చి 13: ఈరోడ్ నియోజకవర్గం సిత్తోడి జంక్షన్, తిరుప్పూర్ నియోజకవర్గం అన్నానగర్, పెరుమానల్లూరువీధి. మార్చి 15: కళ్లకురిచ్చి నియోజకవర్గం ఆర్కాడు మిల్, ఉలగన్కాత్తాన్, చిన్నసేలం మార్చి 18: రామనాథపురం నియోజకవర్గం రాజభవన్, రామనాథపురం మార్చి 19: తిరుచ్చి నియోజకవర్గం తొలూర్ ఉలవరన్ సంత. మార్చి 21 : విరుదునగర్ నియోజకవర్గం కురుక్కు పాదై, శివకాశి - విరుదునగర్ జంక్షన్. శివగంగై నియోజకవర్గం గాంధీ విగ్రహం, కారైక్కుడి మార్చి 23: పుదుచ్చేరి నియోజకవర్గం ఏఎఫ్‌టీ మైదానం కడలూరు రోడ్డు, ఉప్పళం మార్చి 25: దిండుగల్ నియోజకవర్గం అంగువాలాస్ క్రీడా మైదానం, పళిని రోడ్డు. మార్చి 28: వేలూరు నియోజకవర్గం కాట్టిక్కొలై, ఇడయాన్ గాడి, అనైకట్టు పంచాయతీ యూనియన్ ఏప్రిల్ 1: తూత్తుకుడి నియోజకవర్గం అన్నానగర్ మెయిన్ రోడ్డు ఏప్రిల్ 1 : తేని నియోజకవర్గం బైపాస్‌రోడ్డు తేని నగరం ఏప్రిల్ 5: తెన్కాశి నియోజకవర్గం ఉత్తర మాడ వీధి శంకరన్ కోయిల్‌తో ప్రచారం ముగుస్తుంది. సాక్షి, చెన్నై : లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే మిగతా పార్టీలకంటే వేగంగా దూసుకెళ్తోంది. ఇప్పటికే ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు తమ తమ నియోజకవర్గాల్లో తిష్ట వేసి ఎన్నికల పనులు వేగవంతం చేస్తూ, ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. -
శంకర్రామన్ హత్య కేసులో నేడు తుది తీర్పు
-
శంకర్రామన్ హత్య కేసులో నేడు తుది తీర్పు
కాంచీపురంలోని వరదారాజ పెరుమాళ్ ఆలయం మేనేజర్ శంకర్రామన్ హత్య కేసుకు సంబంధించిన పుదుచ్చేరి జిల్లా కోర్టు బుధవారం ఉదయం 11.00 గంటలకు తన తీర్పును వెలువరించనుంది. శంకర్రామన్ హత్య కేసులో కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతి సహా 23 మంది ఆ కేసులో నిందితులుగా ఉన్నారు. వారంతా ఇప్పటికికే పుదుచ్చెరి చేరుకున్నారు. శంకర్రామన్ హత్య కేసులో కోర్టు తీర్పు నేడు వెలువడనున్న నేపథ్యంలో దేశ ప్రజలంతా ఆసక్తితో ఎదురు చేస్తున్నారు. 2004లో సెప్టెంబర్3న కాంచీపురంలోని వరదాజ పెరుమాళ్ ఆలయం మేనేజర్ శంకర్రామన్ ఆలయ ప్రాంగణంలో అత్యంత దారుణంగా హత్య కావించబడ్డారు. దాంతో ఆ హత్య దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఆ హత్యలో కంచి పీఠాధిపతులు పాత్ర ఉందని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో కంచి పీఠాధిపతులు జయేంద్ర, విజయేంద్ర సరస్వతులతోపాటు పలువురిపై వివిధ సెక్షన్ల కింద నిందితులుగా కేసులు నమోదుయ్యాయి. కంచీపురం జిల్లాలోని చెంగల్పట్లు కోర్టు ఈ కేసు విచారణ చేపట్టింది. అయితే శంకరామన్ హత్య కేసు స్వేచ్ఛగా, నిష్పక్షపాతమైన విచారణ తమిళనాడులో సాధ్యం కాదని జయేంద్ర సరస్వతి అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దాంతో శంకర్రామన్ హత్య కేసును సుప్రీంకోర్టు పుదుచ్చేరి జిల్లా సెషన్స్ కోర్టుకు బదిలి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి పుదువై కోర్టు 9 సంవత్సరాల పాటు 189 మంది సాక్షులను విచారించారు. విచారణ పూర్తి కావటంలో ఈ హత్య కేసుకు సంబంధించిన తీర్పును పుదుచ్చేరి జిల్లా కోర్టు జడ్జి బుధవారం వెలువరించనున్నారు.