నటుడు, డీఎంకే నేత ఇంటిపై బాంబుదాడి | Bomb attack at DMK leader Ravi | Sakshi
Sakshi News home page

నటుడు, డీఎంకే నేత ఇంటిపై బాంబుదాడి

Published Tue, Dec 5 2017 12:19 PM | Last Updated on Tue, Dec 5 2017 1:27 PM

Bomb attack at DMK leader Ravi - Sakshi

సాక్షి, చెన్నై: సీనియర్ నటుడు, డీఎంకే నేత రాధా రవి ఇంటిపై సోమవారం సాయంత్రం కొందరు గుర్తుతెలియని దుండగులు బాంబులతో దాడికి పాల్పడ్డారు. ఈ బాంబు దాడిలో రవి సోదరుడు కుమార్ (55) గాయపడ్డట్లు సమాచారం. ఈ ఘటన తమిళనాడు డీఎంకే నేతలలో కలకలం రేపింది. ఆ వివరాలిలా ఉన్నాయి.. ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు కంచీపురంలోని డీఎంకే నేత రవి ఇంటిపై దాడికి ప్లాన్ చేశారు.

ఈ క్రమంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు స్కూటర్‌పై రవి ఇంటికి రాగా, మూడో నిందితుడు ఇంటి చుట్టుపక్కల వారి కదలికలను గమనించాడు. స్కూటర్ దిగిన ఇద్దరు వ్యక్తులు రాధా రవి ఇంటి ఆవరణలోకి చొరబడి క్రూడ్ బాంబులను విసిరారు. ఓ బాంబును ఇంటి ముందు విసిరిన తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. కాగా, దుండగుల బాంబు దాడిలో నటుడు రవి సోదరుడు కుమార్ (55) గాయపడగా, చికిత్స నిమిత్తం ఆయనను ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. సీసీటీవీలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement