తమిళనాట ట్విస్ట్‌ .. మంత్రి నెహ్రు ఇంట్లో ఈడీ సోదాలు | ED searches Tamil Nadu minister KN Nehru Homes | Sakshi
Sakshi News home page

తమిళనాట ట్విస్ట్‌ .. మంత్రి నెహ్రు ఇంట్లో ఈడీ సోదాలు

Published Mon, Apr 7 2025 9:39 AM | Last Updated on Mon, Apr 7 2025 10:07 AM

ED searches Tamil Nadu minister KN Nehru Homes

చెన్నై: తమిళనాడులో రాజకీయం హీటెక్కింది. మంత్రి కేఎన్‌ నెహ్రు, ఆయన కుమారుడు, లోక్‌సభ సభ్యుడు అరుణ్ నెహ్రూకు సంబంధించిన నివాసాల్లో తాజాగా ఈడీ సోదాలు నిర్వహించింది. దీంతో, ఇరు నేతల మద్దతుదారులు పెద్ద సంఖ్యలో వారి ఇళ్ల వద్దకు చేరుకున్నారు.

వివరాల ప్రకారం.. తమిళనాడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి కేఎన్‌ నెహ్రూ ఇళ్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సోమవారం తెల్లవారుజామునే ఈడీ అధికారులు.. నెహ్రుకు సంబంధించిన నివాసాలకు చేరుకున్నారు. అయితే, మంత్రి నెహ్రూ సోదరుడు ఎన్. రవిచంద్రన్ చెందిన రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ట్రూ వాల్యూ హోమ్స్‌(టీవీహెచ్‌)లో ఆర్థిక అవకతవకలకు జరిగినట్టు ఈడీ అధికారులు తెలిపారు. దానికి సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నాయి. టీవీహెచ్ 1997లో స్థాపించబడింది. రాష్ట్రంలో ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థగా గుర్తింపు ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement