tamil nadu
-
వాళ్ల కల హిందీయా.. కేంద్రంపై కమల్ హాసన్ విసుర్లు
ప్రముఖ నటుడు.. తమిళనాడు రాజకీయ నేత కమల్ హాసన్(Kamal Haasan) కేంద్రంలోని బీజేపీపై భగ్గుమన్నారు. హిందీయేతర రాష్ట్రాలపై బలవంతంగా భాషను రుద్దే ప్రయత్నం ఏమాత్రం సహించరానిదని.. అన్ని రాష్ట్రాలను హిందీ రాష్ట్రాలుగా మార్చేసి లబ్ధి పొందాలని బీజేపీ ప్రయత్నిస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారాయన.బుధవారం తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అధ్యక్షతన అఖిలపక్ష పార్టీల సమావేశం జరిగింది. ఈ భేటీకి మక్కల్ నీది మయ్యం తరఫున కమల్ హాసన్ పాల్గొన్నారు. జాతీయ విద్యా విధానం హిందీ భాషను తప్పించడంతో పాటు.. 1971 జనాభాల లెక్కల ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) చేపట్టాలని కేంద్రానికి వ్యతిరేకంగా డిమాండ్లతో ఈ భేటీలో ఓ తీర్మానం చేశారు. అనంతరం.. జరిగిన ఎంఎన్ఎం పార్టీ మీటింగ్‌లో కమల్ కీలక వ్యాఖ్యలు చేశారు.‘‘మన కల ఇండియా. కానీ వాళ్ల కల హిందీయా. బలవంతంగా హిందీని హిందీయేతర ప్రాంతాలకు రుద్దాలన్నదే వాళ్ల ప్రయత్నం. తద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారు. అది నెరవేరకుండా తమిళులంతా ఏకమై పోరాడాలి’’ అని పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారాయన. అయితే హిందీయా కామెంట్లు గతంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చేయడం గమనార్హం. 2019లో హిందీ దివస్ సందర్భంగా కేంద్ర మంత్రి అమిత్ షా.. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఉన్న ఏకైక భారతీయ భాష హిందీనేనని పేర్కొన్నారాయన. అయితే.. ఈ పోస్టుకి నాడు డీఎంకే అధ్యక్షుడిగా ఉన్న స్టాలిన్ కౌంటర్ ఇచ్చారు. ఇది ఇండియా అని.. హిందీయా కాదని కౌంటర్ పోస్ట్ చేశారు. ఇదిలా ఉంటే.. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన ద్వారా తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాల్లో పార్లమెంట్ స్థానాలు తగ్గుతాయంటూ తమిళనాడు కొంతకాలంగా చెబుతోంది. ఈ వ్యాఖ్యలను కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కొట్టిపడేశారు. అయినప్పటికీ దీనిపై పలు రాష్ట్రాల తమ ఆందోళనను వ్యక్తంచేస్తున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రలోని బీజేపీ, ఇతర రాష్ట్రాల్లోని పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై మరో ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్ (Vijay) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గిస్తుందదని.. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అంగీకరించమని ఓ ప్రకటనలో తెలిపారాయన. -
అపుడు అవహేళనలు.. ఇపుడు నెలకు లక్ష రూపాయలు
పట్టుదల, కష్టపడే తత్వం ఉంటే పెద్దగా చదువుకోకపోయినా నమ్ముకున్న రంగంలో ఉన్నత స్థాయికి ఎదగవచ్చని చెప్పటానికి తమిళనాడుకు చెందిన మహిళా రైతు పొన్నరాసి (Ponnarasi) విజయగాథే ఒక ఉదాహరణ. ఆమెకు 38 ఏళ్లు. నలుగురు పిల్లల తల్లి. వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరిగింది. పదో తరగతి మధ్యలో చదువు మానేసింది. పదేళ్లుగా పది ఎకరాల్లో మునగ తోట సాగు చేస్తూ.. తొలుత విత్తనాలు, ఆకులు, మొక్కలు అమ్ముతుండేది. పోటీ ఎక్కువై ఆదాయం తగ్గిపోయింది. వ్యవసాయ విశ్వవిద్యాలయం నిపుణులను కలిసి సలహా అడిగింది. విత్తనాలు, ఆకులు, మొక్కలు వంటి మునగ ముడి ఉత్పత్తులకు అంత విలువ లేదు. వాటికి విలువను జోడించి.. అంటే, ప్రాసెసింగ్ చేసి రూపం మార్చి.. అమ్మితే మంచి ఆదాయం వస్తుందని చెప్పారు. అదెలా చెయ్యాలో తెలీదు. పెద్దగా చదువు లేదు. అయినా, పట్టుదలతో ముందడుగు వేసి, శిక్షణ పొంది ధైర్యంగా ముందడుగు వేసింది. మునగ సాగు చేస్తూనే మునగ నూనె తదితర ఉత్పత్తులను తయారు చేసి విక్రయిస్తూ వ్యాపారవేత్తగా ఎదిగింది. నాణ్యతా ప్రమాణాలు పాటించటంతో దేశంలో వివిధ ప్రాంతాల నుంచే కాదు అమెరికా, సింగపూర్ వంటి అనేక ఇతర దేశాలకూ మునగ ఉత్పత్తుల్ని ఎగుమతి చేస్తోంది. ఏటా రూ. 12 లక్షలకు పైగా నికారదాయం సంపాదిస్తూ తోటి రైతులకు, మహిళలకు శిక్షణ కూడా ఇస్తోంది. అందుకే పొన్నరసికి ‘మునగ రాణి’ అని పేరొచ్చింది!తమిళనాడులోని దిండిగల్ ప్రాంతం మునగ సాగుకు పెట్టింది పేరు. అటువంటి రంగంలో నలుగురు బిడ్డల తల్లి అయిన మహిళా రైతు పొన్నరాసి సంచలనమే సృష్టించింది. ‘మా కుటుంబానికి ఉన్న పదెకరాల భూమిలో గత దశాబ్ద కాలంలో నేను మునగ తోట సాగు (Drumstick farming) చేస్తున్నాను. మునగ ఆకులు, విత్తనాలు, వేర్లు అమ్మేవాళ్లం. అయితే, ఈ పని చేసే రైతులు చాలా మంది ఉండటం వల్ల మార్కెట్ దారుణంగా పడిపోయింది. మునగ విత్తనాల కిలో ధర రూ. 5–10కి పడిపోయింది..’ అని ఎటువంటి సంక్షోభ పరిస్థితుల్లో తాను కొత్తగా ఆలోచించి ప్రాసెసింగ్‌లోకి అడుగు పెట్టిందీ పొన్నరాసి వివరించారు.అటువంటి దిక్కుతోచని పరిస్థితుల్లో కోయంబత్తూరు వెళ్లి, అక్కడి తమిళనాడు వ్యవసాయ కాలేజీలో డాక్టర్ జాన్ కెనడీ అనే శాస్త్రవేత్తను స్వయంగా కలిసి మాట్లాడటమే ఆమె జీవితాన్ని కొత్త మలుపు తిప్పింది. ‘పంటను పండించి, ఎక్కువ దిగుబడి తియ్యటం, పండించిన పంటను ముడి రూపంలో అలాగే ఎంతో కొంతకు అమ్ముకోవటం వల్ల డబ్బులు రావు. ప్రాసెసింగ్ చేసి మునగ నూనె ((Drumstick Oil), పొడి, సౌందర్య సాధనాలను అమ్మితే డబ్బులు వస్తాయి అని జాన్ కెనడీ సార్ చెప్పగా విన్నప్పుడు.. వ్యవసాయం గురించి అప్పటి వరకు నాకు ఉన్న అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. ఏం చేస్తే గట్టెక్కుతామో అర్ధమైంది..’ అన్నారామె.కిలో మునగ నూనె రూ. 5 వేలుకెనడీ చెప్పిన విషయాలు పొన్నరాసికి బాగా నచ్చాయి. అయితే వాటిని తయారు చేయటం ఎట్లా? ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్కునే క్రమంలో దిండిగల్ జిల్లాలోనే ఉన్న గాంధీ గ్రామ్ యూనివర్సిటీలో వ్యవసాయ విస్తరణాధికారులు శ్రీకుమారి, శరవణన్లను సంప్రదించింది. మునగ గింజల నుంచి నూనెను వెలికి తీసే పద్ధతులు, యంత్రాలకు సంబంధించిన విషయాలన్నిటినీ తెలుసుకుంది. మునగ గింజల నుంచి తీసే నూనె కిలో రూ. 5 వేలు పలుకుతుందని పొన్నరాసికి తెలిసింది అప్పుడే. కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల సహకారం కూడా తీసుకొని ముందడుగు వేసింది. ఆ విధంగా వ్యవసాయం తప్ప వ్యాపారం తెలియని ఆమె జీవితంలో 2019లో వ్యాపారఅధ్యాయం ప్రారంభమైంది.కరువును తట్టుకునే మూలనుర్ మునగమునగ మెట్ట పంట అయినప్పటికీ అన్ని రకాల మునగ విత్తనాలూ కరువును తట్టుకొని మంచి దిగుబడిని ఇవ్వలేవు. అందుకే పొన్నరాసి కరువును తట్టుకునే మూలనూర్ మునగ రకాన్ని సాగు చేస్తున్నారు. అంతే కాదు ఏడాదికి మూడు టన్నుల దిగుబడి ఇస్తుంది. ఈ రకం గింజల్లో నూనె శాతం కూడా ఎక్కువట. అయితే, మునగ విత్తనాల నుంచి నూనె తియ్యటం అంత తేలికేమీ కాదు. విత్తనంపైన పొరను తొలగించడానికి చాలా మంది కూలీలు అవసరం అవుతారు. యంత్రాల నిర్వహణ అనుభవం కూడా అవసరం.నూనె తీయటం ప్రారంభించబోయే లోగా తన చుట్టూ ఉన్న వారు ఏవేవో కామెంట్స్ చేసి ఆమె ఉత్సాహం మీద నీళ్లు చల్లేవారు. పదో తరగతి చదువు కూడా లేని దానివి ఏం చేస్తావులే అని ఎత్తి పొడుపు మాటలు అనేవారు. ‘వారి మాటల్ని నేను అసలు పట్టించుకునే దాన్ని కాదు. నా ద్విచక్రవాహనంపై నలుగురు పిల్లల్ని ఎక్కించుకొని ఎక్కడికంటే అక్కడకు వెళ్లి పనులు చక్కబెట్టుకునే దాన్ని. బంధువులు కూడా నా ఆర్థిక పరిస్థితి గురించి ఇంకా వేవేవో సూటిపోటి మాటలు అనేవారు..’ అని పొన్నరాసి గుర్తు చేసుకున్నారు. అయినా ఆమె వెనక్కి తగ్గలేదు. పట్టిన పట్టు విడవలేదు. ‘అక్క ఇంటా బయటా చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. అయితే, ఆత్మస్థయిర్యంతో అన్నీటినీ ఎదుర్కొంది. ఆమె మీద నమ్మకం ఉంచి మేం పనిచేస్తున్నాం అన్నారు పొన్నరాసి దగ్గర పనిచేసే మహిళ కలైరాసి. విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేయటం ఒక్కటే సరిపోదు. అవి నాణ్యతా ప్రమాణాలకు తగినట్టు ఉండేలా చూసుకోవటం కూడా ఒక సవాలే. తంజావూరులోని ఇండియన్ ఫుడ్ ఎడిబుల్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ (ఐఇఎఫ్ఇడి) అనే సంస్థ నుంచి తన ఉత్పత్తులకు నాణ్యతా సర్టిఫికెట్ తీసుకోవటంతో పొన్నరాసికి మార్కెట్లో మంచి పట్టు దొరికింది. ప్రమాణాలకు తగినట్లు విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేస్తున్న మహిళా రైతు, వ్యాపారవేత్తగా ఆమెకు ప్రభుత్వం నుంచి రూ. 2 లక్షల గ్రాంటు వచ్చింది. ఆ సొమ్ముతో పొలంలోనే ప్యాక్ హౌస్‌ను ఏర్పాటు చేసుకోగలిగింది. దాంతో ఆమె పని సులువైంది. అంతేకాదు, ఆ తర్వాత నుంచి మునగ ఆకులు, కాయలు, గింజలతో మొత్తం 36 రకాల ఉత్పత్తులను తయారు చేయటానికి వీలు దొరికింది. మునగ నూనెతో పాటు సబ్బులు, షాంపూలు, లిప్ బామ్స్ తయారీలో వాడేందుకు పొడిని.. సూప్ పౌడర్లు.. ఇటువంటివే ఎన్నో ఉత్పత్తుల్ని తయారు చేశారు. ‘ఆహారోత్పత్తులను స్వయంగా తయారు చేయిస్తాను. సౌందర్య సాధనాలను తయారు చేయించే పనులను మా తమ్ముడు చూసుకుంటున్నాడని ఆమె తెలిపారు.కస్టమర్ల సంఖ్య పెరిగే కొద్దీ, వారి అవసరాలను తెలుసుకొని అందుకు అనుగుణంగా కొత్త కొత్త ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ప్రతి ఏటా కనీసం పది రకాల కొత్త ఉత్పత్తులను అదనంగా చేర్చుతున్నారామె. తన సిబ్బంది ఇతి తమ పనిగా భావించి నిమగ్నమై పని చేయటం వల్ల పనులు సజావుగా చేయగలుగుతున్నానని చెబుతూ.. మునగ ఇడ్లీ పొడిని తయారు చేస్తే బాగుంటుందని మా దగ్గర పనిచేసే కలైరాసి చెప్పటంతోనే మొదలు పెట్టామని పొన్నరాసి సంతోషంగా చెప్పారు.ఫేస్బుక్, వాట్సప్..పొన్నరాసి గత ఆరేళ్లుగా అంకితభావంతో పనిచేయటం వల్ల ఏడాదికి రూ. 12 లక్షలకు పైగా నికరాదాయం పొందగలుగుతున్నారు. ఆమె దగ్గర మునగ ఉత్పత్తుల్ని కొనుగోలు చేసే వారి సంఖ్య లక్ష దాటిపోయింది. ఫేస్బుక్, వాట్సప్ గ్రూప్‌ల ద్వారా తెలుసుకొని కాంటాక్ట్ చేసిన వినియోగదారులకు తమ ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. అంతేకాదు, సోషల్ మీడియా ద్వారా ΄ పొన్నరాసి కృషి గురించి, మునగ ఉత్పత్తుల గురించి తెలుసుకున్న మలేషియా, సింగపూర్, అమెరికా, ఫ్రాన్స్, మస్కట్ వాసులు ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నారు.ఎన్ని ఎక్కువ ఉత్పత్తుల్ని ఆమె విక్రయిస్తున్నా అందులో బాగా అమ్ముడు పోయేవి మాత్రం.. మునగ విత్తనాలు, సూప్ పౌడర్లు, నూనె మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరగటం, పొన్నరాసి నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ ఉత్పత్తులు తయారు చేస్తుండటంతో మంచి వ్యాపారం జరుగుతోంది. త్రిచీ కలెక్టర్ పొన్నరాసికి బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డును ప్రదానం చేసి గౌరవించారు. దీంతో ఆమెకు ‘మునగ రాణి’ అని పేరొచ్చింది.చదవండి: కార్బన్ పాజిటివ్ పొలం.. అంటే తెలుసా?ఇప్పుడామె చాలా మంది రైతులకు, స్వయం సహాయక బృందాలకు మునగ ఉత్పత్తుల తయారీపై శిక్షణ ఇస్తూ, ఆర్థిక స్వావలంబన సాధించేందుకు తోడ్పడుతోంది. ‘ఎంబిఎ కాలేజీ వాళ్లు నన్ను పిలిచి వ్యవసాయాధిరిత వ్యాపార పాఠాలు చెప్పమని అడుగుతుంటే చాలా గర్వంగా ఉంది’ అని సంబర పడుతున్నారు పొన్నరాసి. సోషల్ మీడియాలో మెసేజ్‌లు పెట్టటం నాకు తెలిసేది కాదు. మా అమ్మాయి నేర్పించింది. ఫేస్బుక్లో మా ఉత్పత్తుల వివరాలు చూసి విదేశాల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. ఆ విధంగా ఫేస్బుక్, వాట్సప్ మా వ్యాపారానికి చాలా బాగా ఉపయగపడ్డాయి అని పొన్నరాసి సంబరంగా చెబుతున్నారు!ప్రచారాలను పట్టించుకోకూడదు..‘మహిళ బాధ్యతల విషయంలో సమాజం గందరగోళపరిచే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఒక మహిళ వ్యాపారం మొదలు పెట్టిందంటే, ఆమె తల్లిగా లేదా భార్యగా విఫలమైపోయిందని ప్రచారం జరుగుతుంటుంది. ఇటువంటి ప్రచారాలను పట్టించుకోకుండా మహిళలు తాము ఉన్న చోట నుంచి ముందడుగు వేయాలి. కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలి. ఆ తర్వాత తెలుస్తుంది మనం చేసిన పనుల వల్ల ఎంత ప్రయోజనం చేకూరిందో, ఆర్థికంగా ఎంత స్వయం సమృద్ధి సాధించామో. డిగ్రీలే చదివి వుండాలనేమీ లేదు. మన సంకల్పంతో పాటు నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవటం, సామర్ధ్యాన్ని మెరుగుపరచుకోవటం ముఖ్యం. – పొన్నరాసి, ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారిన మునగ రైతు, దుండిగల్, తమిళనాడు -
కరూర్ వైశ్యా బ్యాంక్ కొత్త శాఖలు..
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని పొద్దుటూర్‌తో పాటు తమిళనాడులో కొత్తగా ఆరు శాఖలను ప్రారంభించినట్లు ప్రైవేట్ రంగ కరూర్ వైశ్యా బ్యాంక్ వెల్లడించింది. ఇవి సేవింగ్స్, కరెంట్ అకౌంట్స్, డిపాజిట్లు, రుణాలు తదితర బ్యాంకింగ్ సర్వీసులను సమగ్రంగా అందిస్తాయని బ్యాంక్ తెలిపింది.2024–25లో కొత్తగా 35 శాఖలను ప్రారంభించినట్లు, మొత్తం బ్రాంచీల సంఖ్య 877కి చేరినట్లు వివరించింది. కస్టమర్లకు అనుకూలంగా ఉండేలా తమ మొబైల్ బ్యాంకింగ్ యాప్ కేవీబీ డిలైట్‌ను 150 పైచిలుకు ఫీచర్లతో మెరుగుపర్చినట్లు పేర్కొంది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం ఆఖరు నాటికి బ్యాంక్ మొత్తం వ్యాపార పరిమాణం రూ. 1,81,993 కోట్లకు చేరింది. తొమ్మిది నెలల కాలానికి నికర లాభం రూ. 1,428 కోట్లుగా నమోదైంది. -
డీలిమిటేషన్ హీట్.. యూటర్న్ తీసుకున్న స్టాలిన్
చెన్నై: నియోజకవర్గ పునర్వవ్యస్థీకరణపై రాజకీయ దుమారం కొనసాగుతున్న వేళ.. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin) కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో కొత్తగా పెళ్లైన జంటలను ఆలస్యంగా పిల్లలను కనాలని సూచించిన ఆయన.. ఇప్పుడు స్టాండ్‌పై యూటర్న్ తీసుకున్నారు. అందుకు నియోజకవర్గాల పునర్విభజన రాజకీయం వేడెక్కడమే కారణం. సోమవారం నాగపట్నంలో డీఎంకే నేత కుటుంబ వివాహ వేడుకకు హాజరైన సీఎం స్టాలిన్ మాట్లాడుతూ.. గతంలో కొత్తగా పెళ్లైన వాళ్లను పిల్లల విషయంలో కొంత సమయం తీసుకోవాలని నేనే చెప్పాను. ఫ్యామిలీ ప్లానింగ్ విషయంలో మనం విజయవంతం అయ్యాం కూడా. కానీ, ఇప్పుడు.. నియోజకవర్గాల పునర్విభజన(Delimitation)పై కేంద్రం కొత్త పాలసీలు తీసుకొస్తున్న వేళ అలా చెప్పను. కొత్తగా పెళ్లైన జంటలు వీలైనంత త్వరగా పిల్లలను కనండి. వాళ్లకు మంచి తమిళ పేర్లు పెట్టండి అని స్టాలిన్ అన్నారు. అయితే.. జనాభా ప్రతిపాదికన కేంద్రం నియోజకవర్గాలను పునర్విభజించబోతోందని స్టాలిన్ చెప్పడం ఇదేం కొత్త కాదు. ఇంతకు ముందూ ఆయన ఇలాగే మాట్లాడారు. అలా జనాభా ప్రకారం చూసుకుంటే.. తమిళనాడుకు 8 స్థానాలు తగ్గే అవకాశం ఉందని.. ఇది మరికొన్ని రాష్ట్రాలపైనా ప్రభావం చూపెడుతుందని ఆందోళన వ్యక్తం చేశారాయన.దేశ సంక్షేమం, ఆర్థిక అభివృద్ధిలో దక్షిణాది రాష్ట్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే.. కుటుంబ నియంత్రణ ద్వారా గత కొన్ని సంవత్సరాలుగా విజయం సాధించాయని అనుకుంటున్నాయి. రేపు ఒకవేళ జనాభా ప్రతిపాదికన గనుక కేంద్రం నియోజకవర్గాలను విభజిస్తే.. ఆ రాష్ట్రాలకే తీవ్ర నష్టం అని అంటున్నారాయన.అయితే స్టాలిన్ చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ(BJP) కౌంటర్ ఇచ్చింది. తమిళనాడు సీఎం వ్యాఖ్యలు నిరాశవాదంతో కూడుకున్నవని, నిజాయితీలేని రాజకీయాలకు సంకేతమని బీజేపీ అధికార ప్రతినిధి సీఆర్ కేశవన్ చెబుతున్నారు. జనాభాకు తగ్గట్లుగా హక్కులు ఉంటాయా? అని గతంలో మీ మిత్రపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని స్టాలిన్‌ను ఉద్దేశించి కేశవన్ అన్నారు. పాలనాపరమైన వైఫల్యాల నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఈ డ్రామాలని డీఎంకేపై మండిపడ్డారాయన. మరోవైపు.. డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగబోదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇదివరకే ఓ ప్రకటన చేశారు. -
తమిళనాట ‘విజయ్’ ట్విస్ట్.. పీకే కీలక ప్రకటన
సాక్షి, చైన్నె: తమిళనాట రాజకీయం ఆసక్తికరంగా మారింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పార్టీ పొత్తులు, కీలక నేతల పోటీ విషయంలో ఆసక్తి నెలకొంది. ఇక, సినీ నటుడు విజయ్ కొత్త పార్టీ స్థాపించి ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ నేత ప్రశాంత్ కిషోర్ కీలక ప్రకటన చేశారు.తమిళనాడులో 2026 ఎన్నికలలో విజయ్ తమిళగ వెట్రి కళగం అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ఎన్నికల ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. తమిళగ వెట్రి కళగం నేత విజయ్ రాజకీయ వ్యూహాలకు పదును పెట్టిన విషయం తెలిసిందే. ఆయన్ని సీఎం చేయడమే లక్ష్యంగా రంగంలోకి ప్రశాంత్ కిషోర్ దిగారు. గత వారం జరిగిన విజయ్ పార్టీ రెండో ఆవిర్భావ వేడుక వేదికపై ప్రశాంత్ కిషోర్ సైతం కూర్చున్నారు. ప్రత్యేక ప్రసంగం కూడా చేశారు.2026లో విజయ్ను సీఎం చేయడమే లక్ష్యంగా తన సహకారం, మద్దతును ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో తాజాగా ఓ తమిళ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు శనివారం వైరల్ అయ్యాయి. 2026 ఎన్నికలలో విజయ్ పార్టీ అన్నాడీఎంకేతో కలిసి ఎన్నికలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయన్న చర్చకు ముగింపు పలికే విధంగా ప్రశాంత్ కిషోర్ స్పందించారు. అన్నాడీఎంకేతో విజయ్ పొత్తు ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆయన ఒంటరిగానే ఎన్నికలను ఎదుర్కొంటారని, ఆ దిశగానే వ్యూహ రచనలు జరుగుతున్నట్టు పేర్కొన్నారు. ఒంటరిగానే తన బలాన్ని చాటి, అధికారం చేజిక్కించుకునే దిశగా ముందుకెళ్తున్నట్టు ప్రశాంత్ కిషోర్ పేర్కొనడం గమనార్హం. -
నా ప్రియమైన స్నేహితుడా.. మీ పోరాటం అసామాన్యం
చెన్నై: తమిళనాట రాజకీయాల్లో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. నటుడు, మక్కల్ నీది మయ్యమ్(MNM) పార్టీ అధినేత కమల్ హాసన్.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin)తో భేటీ అయ్యారు. ఈ విషయాన్ని ఎక్స్‌లో పోస్ట్ చేసిన కమల్.. మూడు భాషల పాలసీకి వ్యతిరేకంగా స్టాలిన్ పోరాడటాన్ని అభినందించారు.నూతన జాతీయ విద్యా విధానం(National Education policy)లో భాగంగా.. కేంద్రం తీసుకొచ్చిన మూడు భాషల పాలసీని తమిళనాడు సీఎం స్టాలిన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డీఎంకే-బీజేపీ మధ్య మాటల యుద్ధమే జరుగుతోంది. అయితే తమిళ భాషా పరిరక్షణకు స్టాలిన్ చేస్తున్న పోరాటం అసామాన్యమైందని కమల్ హాసన్ అంటున్నారు. ‘‘నా ప్రియమైన స్నేహితుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలిశా. తమిళనాడు, తమిళ భాష, తమిళ సంప్రదాయం అన్నివైపులా ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న వేళ.. డీఎంకే దిగ్గజాల పోరాటపటిమనే స్టాలిన్ కనబరుస్తున్నారు. తమిళనాడుకు ఓ కోటగా ఆయన రక్షణ కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన్ని అభినందిస్తూ.. ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నా’’ అని కమల్ ట్వీట్ చేశారు. అంతకుముందు.. நாளை பிறந்த நாள் காணும் மாண்புமிகு தமிழ்நாடு முதல்வர், திராவிட முன்னேற்றக் கழகத்தின் தலைவர், என்னுடைய அருமை நண்பர் திரு. மு.க. ஸ்டாலின் அவர்கள் நல்ல ஆரோக்யத்துடன், நீண்ட காலம் வாழ்ந்து மக்கள் பணியாற்ற வேண்டுமென இன்று நேரில் சந்தித்து வாழ்த்தினேன். தமிழக மக்களும், தமிழ்… pic.twitter.com/jsZ6AfgsQ3— Kamal Haasan (@ikamalhaasan) February 28, 2025ఎన్‌ఈపీను కమల్ హాసన్(Kamal Haasan) సైతం బహిరంగంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. తన ఎంఎన్ఎం పార్టీ వార్షికోత్సవ సమావేశంలో ప్రసంగిస్తూ.. ‘‘భాష కోసం గతంలో తమిళులం ప్రాణాలొదిలేశాం. ఆ విషయంలో మాతో ఆటలొద్దూ’’ అంటూ కేంద్రానికి హెచ్చరిక పంపారాయన. 👉ఇదిలా ఉంటే.. 2026 నుంచి అమల్లోకి రానుంది నూతన జాతీయ విద్యా విధానం(NEP). ఈ పాలసీలో ‘త్రిభాష’ను అమలు చేయాలని ఎన్డీయే ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఇది ప్రాంతీయ భాషలను అణచివేసే ప్రయత్నమని స్టాలిన్ ఆరోపిస్తున్నారు. అంతేకాదు.. ఎన్ఈపీ అమలు చేస్తేనే రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులను ఇస్తామని కేంద్రం బ్లాక్మెయిల్ చేస్తోందని.. అయినా తాము వెనక్కి తగ్గబోమని స్టాలలిన్ చెబుతున్నారు. 👉మరోవైపు ఈ ఆరోపణలను ఖండించిన కేంద్రం.. హిందీ అమలు తప్పనిసరేం కాదని చెబుతోంది. రాజకీయ లబ్ధి కోసమే తమిళనాడు ప్రభుత్వం, అక్కడి పార్టీలు ఎన్ఈపీపై అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడుతున్నాయి. మరోవైపు బీజేపీ తమిళనాడు చీఫ్ అన్నామలై.. డీఎంకే ప్రభుత్వానికి సవాళ్లు విసురుతున్నారు. అయితే త్రిభాషను వ్యతిరేకిస్తూ తమిళనాడు బీజేపీ నుంచి పలువురు రాజీనామాలు చేస్తుండడం గమనార్హం. 👉 2018, ఫిబ్రవరి 21వ తేదీన కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యమ్ పార్టీని మధురైలో స్థాపించారు. అప్పటి నుంచి ఏ ఎన్నికల్లోనూ ఆ పార్టీ ప్రభావం చూపెట్టలేకపోయింది. అయితే కిందటి ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమికి మద్ధతు ప్రకటించింది ఎన్ఎంఎం. కూటమి భాగస్వామి డీఎంకే తరఫున కమల్ హాసన్ ప్రచారంలో పాల్గొనగా.. అన్ని లోక్‌సభ స్థానాలను కూటమి క్లీన్ స్వీప్ చేసింది. దీంతో.. కమల్ హాసన్‌ను రాజ్యసభను పంపుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదీ చదవండి: భాషా యుద్ధం.. అనవసర భయమా? లేక.. -
బీజేపీ Vs స్టాలిన్: పోరాటానికి తమిళులు కలిసి రండి.. సీఎం పిలుపు
చెన్నై: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, తమిళనాడులో సీఎం స్టాలిన్ మధ్య మాటల యుద్ధం పీక్ స్టేజ్‌కు చేరుకుంది. హిందీ భాష విషయంలో కేంద్రంపై స్టాలిన్ నిప్పులు చెరుగుతున్నారు. ఇప్పటికే హిందీ కారణంగా 25 భారతీయ భాషలు కనుమరుగైపోతున్నాయని విమర్శించారు. తాజాగా మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. తమిళనాడుకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ప్రతీ పౌరుడు కదలిరావాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో వీడియోను షేర్ చేశారు.తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తాజాగా వీడియోలో మాట్లాడుతూ..‘ప్రస్తుతం తమిళనాడు రెండు ముఖ్యమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. అవి త్రిభాష విధానం అమలు ఒకటి అయితే, మరొకటి నియోజకవర్గాల పునర్విభజన అంశం. త్రిభాషా విధానాన్ని వ్యతిరేకించినందుకు మనకు రావాల్సిన నిధులను కేంద్రం నిలిపివేసింది. నియోజకవర్గాల విభజన తమిళనాడు ఆత్మగౌరవాన్ని ప్రభావితం చేస్తోంది. కేంద్రం తన ఇష్టానుసారం తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకించాల్సిన సమయం వచ్చింది. వీటికి వ్యతిరేకంగా పోరాడేందుకు రాష్ట్రంలోని ప్రతి పౌరుడు ముందుకు రావాలి. మన పోరాటాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని అందరినీ కోరుతున్నాను అంటూ వ్యాఖ్యలు చేశారు.ఇదే సమయంలో.. ఇప్పటికే కేంద్రం నిర్ణయాలను ఇప్పటికే పలు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. కర్ణాటక, పంజాబ్‌తో పాటు తెలంగాణ వంటి రాష్ట్రాలు సైతం దీనికి సంఘీభావం తెలిపాయి. తమిళనాడులో పార్లమెంటు నియోజకవర్గాలను తగ్గించబోమని చెబుతూనే.. ఇతర రాష్ట్రాల్లో పెంచమని హామీ ఇవ్వలేకపోతున్నారు. మా డిమాండ్ స్పష్టంగా ఉంది. జనాభా ప్రాతిపదికన మాత్రమే నియోజకవర్గాలు నిర్ణయించవద్దు. రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా జరిగే వాటిని తమిళనాడు ప్రతిఘటిస్తుంది. విజయం సాధిస్తుంది’ అని చెప్పుకొచ్చారు.అంతకుముందు కూడా కేంద్రంపై స్టాలిన్ సంచలన ఆరోపణలు చేశారు. హిందీ కారణంగా దేశంలో 25 ఉత్తర భారతీయ భాషలు కనుమరుగైపోతున్నాయని విమర్శించారు. భోజ్‌పురి, మైథిలీ, బుందేలీ, గర్వాలీ, కుమావోని, మాగాహి, మార్వారీ, మాల్వీ, ఛత్తీస్గఢి, సంథాలీ, అంజికా ఇలా అనేక భాషలు మనుగడ కోసం ఎదురుచూస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, బీహార్లు హిందీ రాష్ట్రాలు కావు. వాటి అసలు భాషలు గతంలో కలిసిపోయాయి. తమిళనాడుకు అలాంటి పరిస్థితి రాకూడదనే ప్రతిఘటిస్తున్నాం. జాతి, సంస్కృతిని నాశనం చేయడానికి భాషలపై దాడి చేస్తున్నారు’ అంటూ కామెంట్స్ చేశారు. ஒரே இலக்கு!தமிழ்நாடு போராடும்!தமிழ்நாடு வெல்லும்!#FairDelimitationForTN pic.twitter.com/zQ1hMIHGzo— M.K.Stalin (@mkstalin) February 28, 2025 -
పునర్విభజన పేచీ తేల్చేదెలా?
ఎప్పటినుంచో చర్చకొస్తున్న నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ అంశంపై ఎట్టకేలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నోరువిప్పారు. ఈ ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగబోదని హామీ ఇచ్చారు. దీనిపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని కూడా అన్నారు. ఏ విషయమైనా వివాదాస్పదమైనప్పుడు వెంటనే వివరణనిచ్చి సందేహాలను తొలగించటం ప్రభుత్వాల బాధ్యత. 2023 సెప్టెంబర్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా డీఎంకే నాయకురాలు కనిమొళి దీన్ని ప్రస్తావించారు. జనాభా ప్రాతిపదికన పునర్విభజన ప్రక్రియ అమలు చేస్తే దక్షిణాదికి, ముఖ్యంగా తమిళనాడుకు అన్యాయం జరుగుతుందని ఆమె తెలిపారు. ఆ సమస్యే తలెత్తదని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఇప్పుడు అమిత్ షా అయినా, గతంలో మోదీ అయినా అన్యాయం జరగబోదని వాగ్దానం చేస్తున్నారు. మంచిదే. మరైతే పునర్వి భజన ఎలా ఉండబోతోంది? ఏ ప్రాతిపదికన చేస్తారు? అది చెప్పనంత కాలమూ ఈ సంశయాలు సమసిపోవు. జనాభా ప్రాతిపదికనే తీసుకుంటే అన్యాయం జరుగుతుందన్నది దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న సందేహం. అందుకు ఇతరత్రా ప్రాతిపదికలు తీసుకోబోతున్నామని తేటతెల్లం చేసినప్పుడే అందరికీ స్పష్టత వస్తుంది. దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాది రాష్ట్రాలు చాలా అంశాల్లో సాపేక్షంగా వెనకబడి వున్నాయి. విద్య, వైద్యం, ఆర్థికం వగైరాల్లో దక్షిణాదిదే ముందంజ. ఇదంతా జనాభాను అదుపు చేయటం వల్లనే సాధ్యమైంది. 2011 జనాభా లెక్కల ప్రకారం బిహార్‌లో జనాభా పెరుగుదల రేటు 25 శాతంగావుంటే, కేరళలో అది 5 శాతం మాత్రమే. ఎన్నికలు జరిగినప్పుడల్లా బీజేపీ ‘డబుల్ ఇంజన్ సర్కారు’ను తెరపైకి తెస్తుంది. ఆ సంగతెలా వున్నా దేశానికి ‘గ్రోత్ ఇంజన్’ దక్షిణాది అని చెప్పవచ్చు. అందుకే పునర్విభజనపై ఉన్న సందేహాలను పారదోలటం అవసరం.జనాభా లెక్కల సేకరణ జరిగి గణాంకాలు వెల్లడైనప్పుడల్లా ఆ ప్రాతిపదికన నియోజకవర్గాల హద్దులు, చట్టసభల్లో స్థానాల సంఖ్య మార్చాలని రాజ్యాంగం నిర్దేశిస్తోంది. దానికి అనుగుణంగా 1951, 1961, 1971 సంవత్సరాల జనాభా లెక్కల ప్రాతిపదికన లోక్‌సభ, రాజ్యసభ, రాష్ట్రాల అసెంబ్లీల్లోని స్థానాల సంఖ్య మారుతూ వచ్చింది. నియోజకవర్గాల పరిధులు కూడా మారాయి. కానీ 1976లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దీనికి బ్రేక్ వేశారు. ఆత్యయిక స్థితి కొనసాగుతున్న వేళ 42వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి 2001 వరకూ పునర్విభజన ప్రక్రియను స్తంభింపజేశారు. అధిక జనాభా ఉన్న రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసి జనాభా పెరుగుదలను అరికడితే ఏ రాష్ట్రమూ స్థానాల సంఖ్యను కోల్పోకుండా ఉంటుందని ఆమె ప్రభుత్వం భావించింది. కానీ ఎప్పటిలా దక్షిణాది రాష్ట్రాలే జనాభా అదుపులో ముందున్నాయి. 2001లో తప్పనిసరై పునర్విభజన ప్రక్రియ మొదలెట్టినా అది కేవలం నియోజకవర్గాల పరిధుల్లో మార్పులకే పరిమితమైంది. స్థానాల సంఖ్య యథాతథంగా ఉండిపోయింది. దక్షిణాది రాష్ట్రాల ఆందోళనను దృష్టిలో ఉంచుకునే ఆ పనిచేశారు.జనాభా పెరుగుదల రేటులో అసమతౌల్యం చాలా సమస్యలకు దారితీస్తోంది. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్‌లో ఒక ఎంపీ సగటున 30 లక్షలమంది జనాభాకు ప్రాతినిధ్యం వహించాల్సి వుంటుంది. అదే తమిళనాడులో అయితే దాదాపు 18 లక్షలమంది జనాభాకు ప్రతినిధిగా ఉంటారు. అంటే పునర్విభజన ప్రక్రియ ప్రాతిపదిక అన్ని అంశాల్లోనూ సమతుల్యతను సాధించాల్సి వుంటుంది. 1977 నాటి లోక్‌సభలో ప్రతి ఎంపీ సగటున 10.11 లక్షల జనాభాకు ప్రాతినిధ్యంవహించారు. అయితే అన్ని నియోజకవర్గాలూ ఈ చట్రంలో ఇమిడే అవకాశం ఉండదు గనుక కాస్త అటూ ఇటూగా నిర్ణయించారు. జనాభా లెక్కల సేకరణలో ఇప్పటికే మనం నాలుగేళ్లు వెనకబడి వున్నాం. కానీ కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ అంచనా ప్రకారం ప్రస్తుత జనాభా దాదాపు 143 కోట్లు. ఈ జనాభాకు 1977 నాటి ప్రాతిపదికన ఎంపీ స్థానాలు నిర్ణయించాల్సివస్తే వాటి సంఖ్య ఇంచుమించు 1,400కు చేరుతుంది. దీని ప్రకారం యూపీ స్థానాల సంఖ్య (ఉత్తరాఖండ్ కలుపు కొని) 85 నుంచి మూడురెట్లు పెరిగి 250కి చేరుతుంది. బిహార్‌కు (జార్ఖండ్ కలుపుకొని) ప్రస్తుతం ఉన్న 25 స్థానాలూ 82కు చేరుతాయి. తమిళనాడుకు దాదాపు రెట్టింపు సీట్లు పెరిగి 39 నుంచి 76 అవుతాయి. కేరళకు మాత్రం ప్రస్తుతం ఉన్న 20 కాస్తా 36 అవుతాయి. నియోజకవర్గానికి 20 లక్షల జనాభా ఉండాలనుకుంటే మొత్తం స్థానాలు 707 అవుతాయి. కానీ అలా జరిగితే తమిళనాడు స్థానాల సంఖ్య ఇప్పుడున్న మాదిరే ఉండిపోతుంది. కేరళ మాత్రం రెండు స్థానాలు కోల్పోతుంది. యూపీ మాత్రం 126కు చేరుతుంది. మన నూతన పార్లమెంటు భవనం 888 మంది ఎంపీలు ఆసీనులు కావటానికి వీలుగా నిర్మించారు. ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగకుండా, ఉన్న స్థానాలు కోల్పోకుండా పునర్విభజన ఉంటుందని అమిత్ షా చెప్పటం ఊరట కలిగిస్తుంది. కానీ జమ్మూ, కశ్మీర్లో జరిగిందేమిటి? అక్కడ అసెంబ్లీ స్థానాలు (లద్దాఖ్ మినహా) 83 నుంచి 90కి చేరు కున్నాయి. కొత్తగా పెరిగిన 7 స్థానాల్లో హిందువులు అధికంగా వున్న జమ్మూకు 6 వస్తే, ముస్లింల ప్రాబల్యంవున్న కశ్మీర్‌కు ఒక్కటి మాత్రమే పెరిగింది. అందుకే కేవలం అన్యాయం జరగదన్న హామీ మాత్రమే సరిపోదు. పునర్విభజన ప్రక్రియకు ఇక ఎంతో సమయం లేదు గనుక దానికి అనుసరించే ప్రాతిపదికలేమిటో తేటతెల్లం చేయటం అవసరం. అది చేయనంత కాలమూ సందేహాలు ఉత్పన్నమవుతూనే ఉంటాయి. వాటిని అబద్ధాలుగా కొట్టిపారేసినంత మాత్రాన సమసిపోవు. -
TN Vs Centre: భాషా యుద్ధం.. ఇది ఈనాటిదేం కాదు!
జాతీయ విద్యా విధానం(National Education Policy 2020) అమలు విషయంలో.. తమిళనాడు వర్సెస్ కేంద్ర ప్రభుత్వం వ్యవహారం మరింత ముదురుతోంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తాజాగా సంచలన ఆరోపణలు చేయగా.. బీజేపీ అంతే ధీటుగా బదులిచ్చింది. బలవంతంగా హిందీ భాషను రుద్ది.. స్థానిక భాషలను కనుమరుగయ్యే స్థాయికి చేర్చారంటూ ఆరోపిస్తున్నారాయన. సోదరీసోదరీమణుల్లారా.. గత 100 సంవత్సరాల్లో ఎన్ని భాషలను హిందీ మింగేసిందో తెలుసా? భోజ్‌పురి, మైథిలీ, అవాదీ, బ్రజ్, బుంధేలీ, ఖుమావోని, మఘాహి, మార్వారీ, మాల్వీ, ఛత్తీస్‌ఘడీ, అంగిక, సంతాలి, హో, ఖారియా, ఖోర్థా, కుర్మాలీ, ముండారీ, కురుఖ్.. ఇలా పాతికకుపైగా నాశనం చేసింది. ఇంకోన్ని భాషలు తమ మనుగడ కోసం పోరాడుతున్నాయి. ఏకపక్షంగా హిందీని రాష్ట్రాలపై రుద్దేయాలన్న నిర్ణయం.. పురాతన భాషలను తుడిచి పెట్టేస్తోంది. ఉత్తర ప్రదేశ్, బీహార్లు హిందీకి గుండెకాయలు అని చెబుతుంటారు. కానీ, ఆ రాష్ట్రాల్లో అసలైన భాషలు అంతరించే స్థితికి చేరుకున్నాయి అని స్టాలిన్ పోస్ట్ చేశారు. హిందీ అమలు విషయంలో తమిళ రాజకీయ పార్టీలు చేస్తున్న విమర్శలు అర్థంలేనివని.. కేవలం 2026 ఎన్నికల్లో లాభం కోసమే పాకులాడుతున్నాయని కేంద్రం డీఎంకే ప్రభుత్వంపై మండిపడుతోంది. అయితే స్టాలిన్ ఈ విమర్శలను కూడా తిప్పికొట్టారు. తమిళనాడుకు మాత్రం ఆ నిర్ణయం(NEP) ఏవైపు దారి తీస్తుందో తెలుసని, అందుకే అమలు చేయబోమంటూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారాయన.My dear sisters and brothers from other states,Ever wondered how many Indian languages Hindi has swallowed? Bhojpuri, Maithili, Awadhi, Braj, Bundeli, Garhwali, Kumaoni, Magahi, Marwari, Malvi, Chhattisgarhi, Santhali, Angika, Ho, Kharia, Khortha, Kurmali, Kurukh, Mundari and… pic.twitter.com/VhkWtCDHV9— M.K.Stalin (@mkstalin) February 27, 2025ఇదిలా ఉంటే.. స్టాలిన్ ఆరోపణలను కేంద్రం తోసిపుచ్చింది. ఆయన(Stalin) వాదన అసంబద్ధంగా(Silly)గా ఉందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. తొలుత జాతీయ విద్యావిధానం అమలు చేస్తామని తమిళనాడు కూడా అంగీకరించిందని, ఆపై రాజకీయ లబ్ధి కోసమే యూటర్న్ తీసుకుందని మండిపడ్డారాయన. ఇక.. ఎన్ఈపీ అమలుకు సన్నద్ధంగా లేకపోవడం వల్లే తమిళనాడుకు వచ్చే రూ. 2,400 కోట్ల ఫండ్‌ను కేంద్రం ఆపేసిందన్న ఆరోపణలనూ మంత్రి ధర్మేంద్ర తోసిపుచ్చారు. ఎన్ఈపీ ప్రకారం రాష్ట్రాలు తమకు నచ్చిన భాషలను అమలు చేసే అవకాశం ఉందని, కానీ తమిళనాడు ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం అనవసరమైన రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు.హిందీ భాష అమలు విషయంలో కేంద్రం గనుక తమ రాష్ట్రంపై బ్లాక్‌మెయిల్‌కు పాల్పడితే.. మరో భాషా యద్ధానికి(Language War) సిద్ధమంటూ సీఎం స్టాలిన్, ఆయన తనయుడు.. డిప్యూటీ సీఎం ఉదయ్‌నిధి స్టాలిన్ కేంద్రాన్ని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాడు ఏం జరిగిందో ఓసారి పరిశీలిస్తే..అప్పటి నుంచే అనుమానాలుభారత రాజ్యాంగం ప్రకారం 15 ఏళ్లపాటు హిందీతో పాటు ఇంగ్లీష్‌ను అధికారిక ఉత్తర్వుల కోసం వినియోగించాలని కానిస్టిట్యూట్ అసెంబ్లీ నిర్ణయించింది. దీని ప్రకారం.. జనవరి 26, 1950 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. అయితే 1965లో ఆ గడువు పూర్తి కావడంతో.. హిందీయేతర రాష్ట్రాలు ఆందోళన బాట పట్టాయి. బలవంతంగా తమ రాష్ట్రాల్లో హిందీ భాషను అమలు చేస్తారేమో అని ఉద్యమాలు మొదలుపెట్టాయి. తమిళ సంప్రదాయాలతో పాటు భాషప్రతిపాదికన మద్రాస్ గడ్డపై ద్రవిడ ఉద్యమం జరిగింది. అలాంటి చోట హిందీ భాష ప్రవేశపెట్టడంపై దశాబ్దాల నుంచే వ్యతిరేక ఉద్యమం నడుస్తోంది. 1965లో తమిళనాడులో డీఎంకే ఆధ్వర్యంలో భారీ హిందీ భాష అమలు వ్యతిరేక ఉద్యమం జరగ్గా.. అది హింసాత్మక మలుపు తీసుకుంది. హిందీ భాష అమలును వ్యతిరేకిస్తూ.. ఎంతో మంది బలిదానం చేసుకున్నారు. ఈ పరిణామం కాంగ్రెస్‌ను తమిళనాడులో అధికార పీఠం నుంచి దించేయడానికి ఓ కారణమైంది. తమిళనాడులో రెండు భాషలే..సీఎన్ అన్నాదురై నేతృత్వంలోని తొలి డీఎంకే ప్రభుత్వం.. 1968లో తమిళనాడు కోసం ఓ విద్యావిధానాన్ని ప్రవేశపెట్టింది. అందులో ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం తమిళం, ఆంగ్లం మాత్రమే బోధించాలని ఉంది. అయితే అదే సమయంలో ఇందిరా గాంధీ హయాంలోని కేంద్ర ప్రభుత్వం కొఠారి కమిషన్(1964-66) నివేదిక ఆధారంగా తొలిసారి జాతీయ విద్యా విధానం ప్రవేశపెట్టింది. సమాన విద్యావకాశాలను ప్రొత్సహించడంతో పాటు జాతీయ సమైక్యతను ప్రతిబింబించేలా మూడు భాషల ఫార్ములాను ప్రవేశపెట్టాలని సదరు కమిషన్ సూచించింది. దీని ప్రకారం.. హిందీ, ఇంగ్లీష్‌తో పాటు స్థానిక భాషలను సూచించింది. అయితే ఆ టైంలోనూ హిందీ తప్పనిసరి కాదని కేంద్రం చెప్పినా.. ఆ విద్యావిధానాన్ని తమిళనాడు తీవ్రంగా వ్యతిరేకించింది.👉1968లో ఇందిరా గాంధీ హయాంలో మొదటి జాతీయ విద్యా విధానం ప్రవేశపెట్టబడింది. 14 ఏళ్లలోపు వారికి తప్పనిసరి విద్య, శాస్త్ర విజ్ఞాన రంగాలపై అవగాహన ద్వారా ఆర్థిక అభివృద్ధి, సమాన విద్యావకాశాలు, టీచర్లకు శిక్షణ.. ఇతర అంశాలతో కొఠారి కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ పాలసీని అమల్లోకి తెచ్చింది. ఇందులో మూడు భాషల విధానం తీసుకొచ్చింది కేంద్రం. 👉ఇక.. 1986లో రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న టైంలో మరోసారి ఎన్ఈపీ తెరపైకి వచ్చింది. ఈసారి మూడు భాషల అంశం లేకుండా.. కేవలం విద్యా ప్రమాణాలను మెరుగుపర్చడంతో పాటు అన్ని వయసుల వారికి విద్యను అందించడం మీదనే ఫోకస్ చేసింది.👉ముచ్చటగా మూడోసారి.. పీవీ నరసింహారావు హయాంలో ప్రవేశపెట్టారు. అయితే.. 1986 ఎన్ఈపీకే కొన్ని మార్పులుచేర్పులు చేశారు. సమకాలీన సవాళ్లను ప్రస్తావిస్తూ.. విద్యా వ్యవస్థను పటిష్టం చేయడంపై ఆయన దృష్టిసారించారు.ఇక.. దేశ విద్యా వ్యవస్థలో సంస్కరణలు తెచ్చే ఉద్దేశంతో.. 2020, జులై 29వ తేదీన జాతీయ విద్యా విధానాన్ని ఎన్డీయే ప్రభుత్వం ప్రకటించింది. తద్వారా 1986 జాతీయ విద్యా విధానాన్ని(ఇప్పుడు అమల్లో ఉన్నదే) సమూలంగా మార్చేసింది. జులై 29, 2020లో అప్పటి కేబినెట్ నూతన విద్యా విధానానికి ఆమోద ముద్ర వేసింది. ప్రస్తుతం 10+2గా ఉన్న బేసిక్ అకడమిక్ వ్యవస్థను.. 5+3+3+4గా మార్పు చేయడంతో పాటు పలు కీలక సంస్కరణలు తీసుకొచ్చింది. ఈ ఎన్ఈపీ ప్రకారం.. మూడు లాంగ్వేజ్ ఫార్ములా అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో హిందీ కూడా ఉంది. కానీ.. ఇది బలవంతపు నిర్ణయం కాదని కేంద్రం మొదటి నుంచి చెబుతోంది. రాష్ట్రాలు, రీజియన్లు, విద్యార్థులు తమకు నచ్చి భాషలను ఎంచుకునే వీలు ఉంటుందని చెబుతూ వస్తోంది. అయితే ఇది తమ మాతృభాషకు దొడ్డిదారిన ముప్పు కలిగించే ప్రయత్నమేనని తమిళనాడు అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ విధానం అమలు చేయబోమని చెబుతోంది. ఇక 2026లో ఈ విద్యావిధానం అమల్లోకి రానుంది. -
సద్గురు ఈవెంట్‌కు డీకే.. ఉలిక్కిపడ్డ కాంగ్రెస్
బెంగళూరు: మహా శివరాత్రి సందర్బంగా నిన్న(బుధవారం) కోయంబత్తూరులో జగ్గీ వాసుదేవ్(సద్గురు) నిర్వహించిన ఈవెంట్ కు కర్ణాటక డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ కీలక నేత డీకే శివ కుమార్ హాజరుకావడం ఆ పార్టీలో తీవ్ర ఆందోళన రేకెత్తించింది. ఆ ఈవెంట్ కు సద్గురుతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో డీకే శివకుమార్ స్టేజ్ షేర్ చేసుకున్నారు. దీనికి కర్ణాటక కాంగ్రెస్ తో పాటు జాతీయ కాంగ్రెస్ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావాజాలాలతో ఏర్పాటు చేసిన సద్గురు ఈవెంట్ కు డీకే శివ కుమార్ వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందనేది కాంగ్రెస్ ప్రశ్నగా ఉంది.దీనిపై ఏఐసీసీ సెక్రటరీ పీవీ మోహన్ తన సోషల్ మీడియా హ్యాండిల్ ‘ఎక్స్’లో తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. శివ కుమార్ ట్యాగ్ చేసి మరీ పీవీ మోహన్ వివరణ అడిగారు. కాంగ్రెస్ సీనియర్ రాహుల్ గాంధీని పదే పదే విమర్శించే వారి ఈవెంట్ వెళ్లడమే కాకుండా, అందుకు థాంక్యూ చెప్పడాన్ని ఇక్కడ పీకే మోహన్ ప్రశ్నించారు.రాహుల్ చెప్పేది అదే.. అలా ఉంటే పార్టీని వదిలేయండని..శివ కుమార్ టార్గెట్ చేస్తూ చేసిన పోస్ట్ పై పీకే మోహన్ వివరణ ఇచ్చారు. ‘ నేను ఇక్కడ ఎవర్నీ విమర్శించడం లేదు. శివ కుమార్ భావజాలంపై నా అభిప్రాయం ఏమిటో నేను చెప్పాను. జగ్గీవాసుదేవ్ భావజాలం.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ల భావజాలమే. దీనికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకం. మాది సెక్యులర్ పార్టీ. మా నాయకుడు రాహుల్ గాంధీ పదే పదే చెప్పేది కూడా అదే. ఎవరైనా ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉంటే పార్టీని వదిలేయొచ్చని చెబుతూనే ఉన్నారు. అదే నేను నా పోస్ట్ ద్వారా తెలియజేశాను’ అని పీకే మోహన్ పేర్కొన్నారు. Thanking for an invitation from someone who mocks RG, the hope of the nation&aligns with RSS’s narratives,while serving as a president of a secular party, it misleads party workers. It is Conviction rather than compromise ensures the party’s growth. Otherwise, it damages the core pic.twitter.com/x9hnxhbfF6— PV.MOHAN (@pvmohanINC) February 26, 2025 -
విజయ్-పీకే జోడి.. హిట్టయ్యేనా? (చిత్రాలు)
-
డీలిమిటేషన్‌తో ఒక్క సీటూ తగ్గదు
కోయంబత్తూరు: దామాషా విధానంలో చేపట్టే పునర్వ్యవస్థీకరణ వల్ల లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్య తగ్గదని హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. తమిళనాడుకే కాదు, ఏ ఒక్క దక్షిణాది రాష్ట్రానికి కూడా నష్టం జరగదని ఆయన కుండబద్దలు కొట్టారు. డీలిమిటేషన్ విషయంలో దక్షిణాది రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రధాని మోదీ వ్యవహరిస్తారని చెప్పారు. ఒక్క సీటు కూడా నష్టపోనివ్వరని మంత్రి హామీ ఇచ్చారు. పునర్వ్యవస్థీకరణ కారణంగా దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగదంటూ మోదీ ప్రభుత్వం ఇప్పటికే పార్లమెంట్లో ప్రకటించిందని ఆయన గుర్తు చేశారు. ఈ విషయంలో తమిళనాడు సీఎం స్టాలిన్ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. డీలిమిటేషన్ వల్ల తమిళనాడు లోక్‌సభ సీట్ల సంఖ్య 39 నుంచి 31కి తగ్గిపోతుందని సోమవారం సీఎం స్టాలిన్ వ్యాఖ్యానించడం, దీనిపై చర్చించేందుకు 5న అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేశామనడం తెల్సిందే. తమిళనాడుకు నిధుల మంజూరు విషయంలో కేంద్రం అన్యాయం చేస్తోందంటూ సీఎం ఎంకే స్టాలిన్ చేసిన ఆరోపణలను మంత్రి తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే స్టాలిన్ డీలిమిటేషన్‌తో నష్టం జరుగుతుందని చెబుతున్నారని ధ్వజమెత్తారు. బుధవారం అమిత్ షా కోయంబత్తూరులో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. తిరువణ్ణామలై, రామనా థపురంలలో పార్టీ కార్యాలయాలను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా కా ర్యకర్తలు, ప్రజలనుద్దేశించి మంత్రి ప్రసంగించారు. దేశ వ్యతిరేక ధోరణి పెరిగిందిరాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటంలో విఫలమైందంటూ అధికార డీఎంకేపై అమిత్ షా విరుచుకుపడ్డారు. తమిళనాడులో జాతి వ్యతిరేక ధోరణి గరిష్ట స్థాయికి చేరుకుందంటూ వ్యాఖ్యానించారు. 1998 బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు, ప్రధాన సూత్రధారి ఎస్ఏ బాషా అంతిమ యాత్రకు తమిళనాడు ప్రభుత్వం భద్రత కల్పించిందని విమర్శించారు. ‘రాష్ట్రంలో డ్రగ్స్ విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. మైనింగ్ మాఫియానే ఇక్కడ రాజకీయాలను నడిపిస్తోంది. శాంతిభద్రతల పరిస్థితి అధ్వానంగా ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఉంది. అవినీతిలో డీఎంకే మంత్రులంతా మాస్టర్స్ డిగ్రీ చేశారు. డీఎంకే నేతలపై ఉద్యోగాలను అమ్ముకున్న కేసులు, మనీలాండరింగ్ ఆరోపణలు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు, రూ.6 వేల కోట్ల కుంభకోణం కేసులున్నాయి. వీటిన్నిటినీ చూస్తే అవినీతికి పాల్పడిన వారికే డీఎంకే సభ్యత్వం ఇచ్చినట్లుగా కనిపిస్తోంది’అని అమిత్ షా వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతుండగా వాటిని పరిష్కరించడం మానేసిన సీఎం, ఆయన కుమారుడు ఉదయనిధి వారి దృష్టిని మళ్లించేందుకు ఇతర అంశాలను తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు.నిధులపై వాస్తవ గణాంకాలివీ..కేంద్రం నుంచి అందిన నిధులపై చేతనైతే సీఎం స్టాలిన్ వాస్తవాలను వెల్లడించాలని అమిత్ షా సవాల్ విసిరారు. ‘మోదీ ప్రభుత్వ హయాంలో పదేళ్ల వ్యవధిలో తమిళనాడుకు రూ.5,08,337 లక్షల కోట్ల నిధులందాయి. వీటికి తోడు, మౌలిక వనరుల అభివృద్ధి కోసం మరో 1.43 లక్షల కోట్లను అందజేశాం. అదే, యూపీఏ హయాంలో 2004–14 సంవత్సరాల మధ్య కాలంలో తమిళనాడుకు కేవలం రూ.1.52 లక్షల కోట్లే దక్కాయి. అయితే, మోదీ ప్రభుత్వం అన్యాయం చేసిందని మీరంటున్నారు. వాస్తవానికి రాష్ట్రానికి యూపీఏ హయాంలో, అప్పటి ప్రభుత్వం మీరు కూడా భాగస్వాములుగా ఉండగానే అన్యాయం జరిగింది’అని షా చెప్పారు. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో విద్యార్థినులకు భద్రత కరువైందని ఆరోపించారు. అక్రమ సారాయి విక్రయాలను వ్యతిరేకించిన కాలేజీ విద్యార్థులు దారుణ హత్యకు గురవుతున్నారన్నారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులో ఎన్డీయే ఘన విజయం సాధిస్తుందని, మహారాష్ట్ర, హరియాణాల్లో బీజేపీ సాధించిన గెలుపు కంటే ఇది మిన్నగా ఉంటుందన్నారు. -
#GETOUT: తమిళనాట పొలిటికల్ హీట్.. విజయ్, పీకే ప్లానేంటి?
చెన్నై: తమిళనాడులో రాజకీయం ఆసక్తికరంగా మారింది. నేడు సినీ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ మొదటి ఆవిర్భావ దినోత్సవం. ఈ నేపథ్యంలో చెన్నైలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు పార్టీ చీఫ్ విజయ్. ఈ కార్యక్రమానికి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ హాజరవుతున్నారు. దీంతో, తమిళ పాలిటిక్స్ రసవత్తరంగా మారింది.కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీని స్థాపించి ముందుకు సాగుతున్నారు. నేడు పార్టీ మొదటి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబోతున్నారు. చెన్నైలోని మామల్లపురంలో భారీ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు దాదాపు మూడు వేల మంది ముఖ్య నేతలు, కార్యకర్తలు హాజరుకానున్నారు. ఈ క్రమంలో పాస్‌లను సైతం అందించారు. ఇక తమిళనాడులో వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇతర పార్టీలతో పొత్తులపై, ప్రచార యాత్రలపై విజయ్ కీలకమైన ప్రకటన చేస్తారని సమాచారం. పార్టీ అధ్యక్షుడు నటుడు విజయ్ సహా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో పాటు టీవీకే ఇతర ముఖ్య నేతలు ఈ సభకు హాజరుకానున్నారు. దీంతో, వేదికపై నుంచి కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.தமிழக மக்களின் தலையெழுத்தை மாற்றப்போகும் கையெழுத்து ❤️#Getout #TVKForTN pic.twitter.com/3yAUgiQqZ7— Mʀ.Exᴘɪʀʏ (@Jana_Naayagan) February 26, 2025హాట్ టాపిక్ బ్యానర్..మరోవైపు.. టీవీకే పార్టీ ఆవిర్భావ వేడుక సందర్భంగా ఏర్పాటు చేసిన బ్యానర్లు అందరి దృష్టిని ఆకర్షించాయి. అందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మొత్తం 6 అంశాలను ప్రస్తావించారు. ఇలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శిస్తూ #GETOUT అనే హ్యాష్ ట్యాగ్‌ను చేర్చారు. ఈ బ్యానర్‌పై విజయ్ సంతకం కూడా చేశారు. అందులో మహిళల భద్రత, సంక్షేమానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఘటనలను ప్రస్తావిస్తూ ప్రభుత్వాలు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నాయని పేర్కొన్నారు. ఇక నియంతృత్వ పాలనను సాగిస్తూ ప్రజా గొంతులను అణిచివేయడం, ఓటు బ్యాంకుల కోసం కులమతాల పేరుతో ప్రజలను విడగొట్టడాన్ని కూడా ఈ పోస్టర్లో పేర్కొన్నారు. పాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఆర్భాటాలు చేస్తున్నారని ఆరోపించారు. నూతన విద్యా విధానం, త్రిభాషా సూత్రానికి వ్యతిరేకంగా పోరాడటానికి ప్రతిజ్ఞ చేద్దామని కూడా ఆ పోస్టర్లో ఉంది.அமைதியான அரசியலை உருவாக்கும் அமைதியான தலைவன்!#GetOut #vijay #tvk pic.twitter.com/AZQXVGVZZB— தமிழச்சி TVK (@tvkvijay_4tn) February 26, 2025 என் நெஞ்சில் குடி இறுக்கும்.... 🔥🥹#TVKForTN #TVKVijay @TVKVijayHQ #தமிழகவெற்றிக்கழகம்#இரண்டாம்_ஆண்டில்_தவெக#Getout pic.twitter.com/mFysxwb0IL— MASTER_JD_❤️🔥 (@badlucksarath12) February 26, 2025 -
భాషా యుద్ధానికి మేం సిద్ధం: తమిళనాడు సీఎం వార్నింగ్
చెన్నై: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చే త్రీ లాంగ్వేజ్ పాలసీకి తాము వ్యతిరేకమని మరోసారి స్పష్టం చేశారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. తమపై హిందీ బాషను బలవంతంగా రుద్దాలనే ప్రయత్నం జరుగుతోందని స్టాలిన్ మండిపడ్డారు. అవసరమైతే మరో భాషా యుద్ధానికి తమిళనాడు సిద్ధంగా ఉందని హెచ్చరించారు స్టాలిన్. కేంద్ర ప్రభుత్వం నూతన లాంగ్వేజ్ పాలసీపై మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా స్టాలిన్ ఘాటుగా స్పందించారు. ‘ మాపై హిందీని రుద్దాలనే యత్నం జరుగుతోంది. ఇది వద్దని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి చెబుతూనే ఉన్నాం. ఇందుకోసం మరో భాషా పోరాటానికైనా తమిళనాడు ప్రజలు సిద్ధం’ అని స్టాలిన్ పేర్కొన్నారు.మీది ద్వంద్వ వైఖరి.. కపట వైఖరి: అన్నామలైస్టాలిన్ వ్యాఖ్యలు చూస్తే ఆయనలో కపటత్వం కనబడుతోందన్నారు తమిళనాడు బీజేపీ చీఫ్ కె అన్నామలై. ఆయన కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చే లాంగ్వేజ్ పాలసీనే ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. అక్కడ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు థర్డ్ లాంగ్వేజ్ ను నేర్చుకునే అవకాశాన్ని నిరాకరిస్తున్నారు కానీ మరి తమిళనాడులో ప్రైవేటు స్కూళ్లలో వారి సహచరులు నడిపే సీబీఎస్ఈ స్కూళ్లలో థర్డ్ లాంగ్వేజ్ లేదా అని ప్రశ్నించారు.మరి థర్డ్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఎటువంటి పరిమితులు లేవని స్టాలిన్ సూచిస్తున్నారా?, మీరు థర్డ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవచ్చు. మీ పిల్లల్ని మీ సహచరులు నడిపే స్కూళ్లలో చేర్చి నేర్చుకోండి. ఇక్కడ డీఎంకేది ద్వంద్వ విధానం. ధనికుల పిల్లలకు ఒక రకంగా, పేదల పిల్లలకు ఒక రకంగా వ్యవరిస్తోంది. ఇది కపట ధోరణి’ అంటూ అన్నామలై ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. -
మధ్యాహ్న భోజన పథకానికి ఆద్యుడు ఆయనే
పిల్లలూ! ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం పూట విద్యార్థులకు భోజనం పెడతారన్న విషయం మీకు తెలుసా? పిల్లలు టిఫిన్ బాక్సులు తీసుకెళ్లకుండా, అక్కడ వండి, వడ్డించే అన్నాన్నే తింటారు. ఈ పద్ధతి చాలా బాగుంది కదా? మరి ఈ విధానాన్ని ఆలోచించింది, ఆచరణలోకి తెచ్చింది ఎవరో తెలుసా? తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, భారతరత్న (Bharat Ratna) కె.కామరాజ్. ఆయన గురించి తెలుసుకుందామా?కె.కామరాజ్ (K. Kamaraj) 1903 జులై 15న అప్పటి మద్రాసు రాష్ట్రంలోని విరుదుపట్టి అనే ప్రాంతంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు కుమారస్వామి, శివగామి అమ్మాల్. వారికి కంచి కామాక్షి అమ్మవారు ఇష్టదేవత. అందుకే పుట్టిన మగబిడ్డను ‘కామాక్షి’ అని, ‘రాజా’ అని పిలిచేవారు. చివరకు ఆ పేరు ‘కామరాజ్’గా స్థిరపడింది. ఆయనకు ఆరేళ్ల వయసు ఉండగానే ఆయన తాత, ఆ తర్వాత ఆయన తండ్రి మరణించారు. దీంతో కుటుంబం ఇబ్బందులు పడింది. అతికష్టమ్మీద చదువుకున్న కామరాజ్ 12వ ఏట చదువు మానేసి, తన మేనమామ నడిపే బట్టల దుకాణంలో పనికి వెళ్లడం మొదలుపెట్టాడు.అక్కడ ఉన్న సమయంలో స్థానికంగా ఉండే సమస్యలు, చుట్టుపక్కల జరిగే విషయాలను గమనిస్తూ తనకు తోచిన విధంగా ఇతరులకు సాయపడుతూ ఉండేవాడు. అప్పట్లో స్వాతంత్య్రోద్యమం మొదలవడంతో పలువురు ప్రముఖులు వచ్చి ఉపన్యాసాలు ఇచ్చేవారు. ఆ కార్యక్రమాలు వెళ్లే కామరాజ్ వారి ప్రసంగాలతో ఉత్తేజితుడయ్యేవాడు. బంకించంద్ర ఛటర్జీ, సుబ్రహ్మణ్య భారతి రాసిన పుస్తకాలను ఇష్టంగా చదివేవాడు. అనీ బీసెంట్ ‘స్వపరిపాలన’ ఉద్యమానికి ఆకర్షితుడయ్యాడు.ఆ తర్వాత 1921లో తొలిసారి కామరాజ్ మహాత్మాగాంధీని మదురైలో కలిశారు. ఆయన భావాలు, ఆలోచనలకు ఆకర్షితుడైన కామరాజ్ తను కూడా స్వాతంత్య్రోద్యమంలో పాల్గొనాలని నిశ్చయించుకున్నాడు. ఆ తర్వాత అనేక ఉద్యమాల్లో కీలకపాత్ర పోషించారు. కొన్ని సందర్భాల్లో పోలీసులు ఆయన్ని అరెస్టు చేసి, జైల్లో ఉంచారు. అలా సుమారు 3 వేల రోజులు కామరాజ్ జైల్లోనే గడిపారు. అయినా ఆయన ఏమాత్రం చలించలేదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మద్రాసు రాష్ట్రానికి మూడో ముఖ్యమంత్రిగా సేవలందించారు.ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే తమిళనాడు రాష్ట్రంలోని విద్యావిధానంలో సమూలమైన మార్పులు తీసుకొచ్చారు. పిల్లలు ఆకలితో పాఠాలు వినకుండా దేశంలోనే మొదటిసారిగా వారికి మధ్యాహ్న భోజనం (Midday Meal) అందించే ఏర్పాటు చేశారు. ప్రభుత్వ స్కూళ్లల్లో యూనిఫారం వేసుకునే విధానం సైతం ఆయనే అమల్లోకి తెచ్చారు. ఆయన అమలు చేసిన విధానాలను ఆ తర్వాత దేశమంతా అమలు చేశారు.ఇలా ఎన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నా కామరాజ్ మాత్రం చాలా నిరాడంబరంగా జీవించేవారు. ఆయన మరణించేనాటికి ఆయనకున్న ఆస్తి 130 రూపాయలు, రెండు జతల చెప్పులు, నాలుగు చొక్కాలు, ధోతీలు, కొన్ని పుస్తకాలు. ఆయన మరణాంతరం కేంద్ర ప్రభుత్వం ఆయనకు దేశ అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ ప్రకటించింది.చదవండి: నేను బాషా.. ఒక్కసారి రాస్తే 400 భాషల్లో రాసినట్టు!చూశారుగా! మామూలు స్థాయి నుంచి ఎదిగిన కామరాజ్, దేశానికి ఎన్ని సేవలందించారో! మీరు కూడా అలా అందరికీ ఉపయోగపడే పనులు చేసి పేరు తెచ్చుకోవాలి. -
నేను బాషా.. ఒక్కసారి రాస్తే 400 భాషల్లో రాసినట్టు!
మీకు ఎన్ని భాషలొచ్చు? తెలుగు, హిందీ, ఇంగ్లీషు.. ఇంకా? ఈ మూడేనా? నాలుగైదు భాషలు మాట్లాడేవారు మీ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా? మాట్లాడటం సరే, వాళ్లు ఆ భాషలు రాయగలరా? అసాధ్యం అనుకుంటున్నారా? ఆ అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపించాడు చెన్నైకి చెందిన మహమూద్ అక్రమ్. అతను ఎన్ని భాషల్లో రాయగలడో తెలుసా? అక్షరాలా 400 భాషలు. అంతేకాకుండా, సుమారు 46 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడు. ఈ ఘనతలతో అతను ఇప్పటికి మూడు ప్రపంచ రికార్డులు సాధించాడు.అక్రమ్ తండ్రి షిల్బీ మొళిప్పిరిన్. ఉద్యోగరీత్యా రకరకాల దేశాలు ప్రయాణించేవారు. ఆ సమయంలో అక్కడి స్థానిక భాష అర్థంకాక, వారితో మాట్లాడలేక ఇబ్బంది పడేవారు. దీంతో మెల్లగా ఆ భాషలు నేర్చుకోవడం మొదలుపెట్టి 16 భాషల్లో మాట్లాడే స్థాయికి వచ్చారు. తండ్రిని చూస్తూ పెరిగిన అక్రమ్ కూడా అలా రకరకాల భాషల మీద ఆసక్తి పెంచుకున్నాడు.. దాంతో తండ్రి అక్రమ్‌కు నాలుగేళ్ల వయసు నుంచే రకరకాల భాషల్లోకి పదాలు, వాటికి అర్థాలు నేర్పించేవారు. ఆరు రోజుల్లో మొత్తం ఇంగ్లీషు అక్షరాలు (English Letters) నేర్చుకున్న అక్రమ్, మూడు వారాల్లో తమిళంలోని 299 అక్షరాలను నేర్చేసుకుని ఆ చిన్నవయసులోనే అందర్నీ ఆశ్చర్యపరిచాడు.ఆరేళ్ల వయసొచ్చేసరికి తండ్రితో రకరకాల భాషల్లో మాట్లాడటమే కాకుండా తమిళ వాక్యాలను స్పష్టంగా చదవడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత రెండేళ్లలో మరో 50 భాషలు సాధన చేసి, వాటి మీద అవగాహన తెచ్చుకున్నాడు. కొడుకు ఆసక్తిని గమనించి, వివిధ భాషల పుస్తకాలు తెప్పించి, అతనికి ఇచ్చేవారు మొళిప్పిరిన్. కేవలం చదవడమే కాకుండా, ఆ భాషల్లో టైప్ చేయడం కూడా మొదలుపెట్టిన అక్రమ్, అతి చిన్నవయసులో వివిధ భాషలు టైప్ చేసి మొదటి ప్రపంచ రికార్డు సాధించాడు.10 ఏళ్ల వయసులో మన జాతీయ గీతం ‘జనగణమన’ను ఒక్క గంటలో 20 భాషల్లో రాసి రెండో ప్రపంచ రికార్డు సాధించాడు. 12 ఏళ్ల వయసు వచ్చేసరికి 400 భాషలు చదివి, రాసి, టైప్ చేస్తూ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. దీంతో మూడోసారి అతనికి ప్రపంచ రికార్డు సొంతమైంది. ఒక వాక్యాన్ని వీలైనన్ని ఎక్కువ భాషల్లో అనువాదం చేసే ప్రక్రియలో ఆరితేరిన అక్రమ్, అందుకుగానూ జర్మనీ దేశంలో ప్రతిష్టాత్మకమైన ‘జర్మనీ యంగ్ టాలెంట్ అవార్డు’ అందుకున్నాడు. అనువాదంలో అతని వేగం చూసి సీనియర్ అనువాదకులు సైతం ఆశ్చర్యపోయారు.చదవండి: డిస్నీని తలపించేలా... సరికొత్త థీమ్ పార్క్అయితే భాషల మీద ఇంత పట్టున్న అతనికి స్కూళ్ల నుంచి ప్రోత్సాహం రాలేదు. భాషల మీద కాకుండా కేవలం సబ్జెక్టుల మీదే దృష్టి పెట్టాలని అతణ్ని ఒత్తిడి చేశారు. దీంతో స్కూల్ మానేసి, ఓపెన్ స్కూల్ ద్వారా పరీక్షలు రాసి పాసయ్యాడు. ఆ తర్వాత అతని ప్రతిభ గుర్తించి, ఆస్ట్రియాలోని డనుబే ఇంటర్నేషనల్ స్కూల్ అతనికి స్కాలర్షిప్ ఇచ్చి మరీ తమ స్కూల్లో చేర్చుకుంది. ప్రస్తుతం అక్రమ్ యూకేలోని ఓపెన్ యూనివర్సిటీ నుంచి భాషావిభాగంలో ఒకేసారి రకరకాల డిగ్రీలు చేస్తున్నాడు. తన భాషా పరిజ్ఞానాన్ని మరింత విస్తరించుకోవాలన్న ఉత్సాహంతో ఉన్నాడు. -
ఉదయనిధి సవాల్.. అన్నామలై సై
అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు నుంచే తమిళనాడు రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య అప్పుడే సవాళ్ల పర్వం మొదలైంది. యువనేతలు ఉదయనిధి స్టాలిన్, అన్నామలై (annamalai) పరస్పరం సవాళ్లు విసురుకోవడం తమిళ రాజకీయాల్లో (Tamil Politics) హాట్‌టాపిక్‌గా మారింది. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని ఆరోపిస్తూ అన్నామలై చేసిన వ్యాఖ్యలకు ఉదయనిధి కౌంటర్ ఇచ్చారు. తన ఇంటిని ముట్టడిస్తామన్న అన్నామలైకు ఉదయనిధి బహిరంగ సవాల్ విసిరారు. ఈ చాలెంజ్‌ను స్వీకరిస్తున్నట్టు అన్నామలై ప్రకటించారు.చైన్నెలోని షెనాయ్నగర్లో గురువారం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో డీఎంకే యువనేత, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ (udhayanidhi stalin) పాల్గొన్నారు. పేద, మధ్య తరగతి వర్గాల సంక్షేమం లక్ష్యంగా ముందుకెళ్తున్న తమ ప్రభుత్వంపై కొంతమంది అనవసరంగా విమర్శలు చేస్తున్నారని.. అందరికీ అన్ని లక్ష్యంగా సాగుతున్న సీఎం స్టాలిన్‌పై (CM Stalin) నోటికి వచ్చింది మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తమిళనాడులో విద్య, ఉపాధికి అడ్డంకులు సృష్టించే విధంగా కేంద్రం సైతం కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. సీబీఎస్ఈ విద్యా సంస్థలన్నీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉన్నాయన్న విషయాన్ని గుర్తు చేశారు.తన ఇంటిని ముట్టడిస్తానని ప్రకటించిన అన్నామలైకు ఈ సందర్భంగా ఉదయనిధి స్టాలిన్ సవాల్ విసిరారు. ధైర్యం ఉంటే అన్నాసాలైలోకి అడుగు పెట్టమనండి అంటూ వ్యాఖ్యానించారు. ‘తొలుత అన్నా అరివాలయం అన్నారు. ఇప్పుడు మా ఇల్లు ముట్టడిస్తామంటున్నారు. ఇలాంటి బెదిరింపులకు నేను భయపడను. ఎక్కడికీ వెళ్లను, ఇంట్లోనే ఉంటా.. ధైర్యం ఉంటే రమ్మనండి’ అంటూ ఓపెన్ చాలెంజ్ చేశారు.అన్నాసాలైలో ఎక్కడికి రావాలి?ఉదయనిధి స్టాలిన్ సవాల్‌కు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై స్పందించారు. సేలంలో బీజేపీ నాయకుడి ఇంట్లో జరిగిన వివాహ వేడుకకు గురువారం ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. ఉదయనిధి స్టాలిన్ సవాల్‌ను స్వీకరిస్తున్నట్టు ప్రకటించారు. ‘ధైర్యం ఉంటే అన్నాసాలైకు రావాలని ఉదయనిధి అన్నారు. నేను సిద్ధంగా ఉన్నాను. చైన్నెలోని అన్నాసాలైలో ఎక్కడికి రావాలో ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌ను చెప్పమనండి. స్థలం, రోజు, సమయం చెబితే అక్కడికి ఒంటరి వెళ్లడానికి నేను రెడీగా ఉన్నాను’ అంటూ ప్రతి సవాల్ విసిరారు.క్షీణించిన శాంతిభద్రతలుకాగా, రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, మహిళలపై నేరాలు పెరిగాయని అన్నామలై ఆరోపించారు. ఈ విషయాన్ని లా అండ్ ఆర్డర్ ఏడీజీపీ సర్క్యులర్ ద్వారా వెల్లడించారని తెలిపారు. శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని ముఖ్యమంత్రి స్టాలిన్ అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. అసత్యాలు కట్టిపెట్టి శాంతిభద్రతల పరిరక్షణకు వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మరోవైపు సోషల్ మీడియాలోనూ బీజేపీ, డీఎంకే పార్టీల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ‘గెట్ అవుట్ మోదీ’ అంటూ డీఎంకే ప్రచారం మొదలెట్టగా, ‘గెట్ అవుట్ స్టాలిన్’ అంటూ బీజేపీ కౌంటర్ ఇచ్చింది.చదవండి: మన ట్వీట్లలో ఎవరు గెలిచారో చూద్దామా? -
మన ట్వీట్లలో ఎవరు గెలిచారో చూద్దామా? డీఎంకేకు బీజేపీ సవాల్
చెన్నై: అటు బీజేపీ ఇటు డీఎంకే. తమిళనాడు వేదికగా సాగుతున్న సోషల్ మీడియా రచ్చ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ‘నువ్వెంత అంటే నువ్వెంత’ అనే స్థాయిలో వారి సోషల్ మీడియా వార్ సాగుతోంది. దీనింతటికీ ‘గెట్ అవుట్ మోదీ’ అంటూ సోషల్ మీడియాలో డీఎంకే చేసిన హ్యాష్ ట్యాగ్ ప్రధాన కారణంగా నిలిచింది. గత కొద్దిరోజులుగా కేంద్రం, తమిళనాడు ప్రభుత్వం మధ్య మాటల యుద్దమే సాగుతోంది. హిందీ భాషను అమలు చేయడాన్ని డీఎంకే(DMK) వ్యతిరేకిస్తోంది. ఇది కాస్తా ఇరు పార్టీల మధ్య సోషల్ మీడియా వార్ కు దారి తీసింది. ఈ క్రమంలోనే డీఎంకే ఐటీ వింగ్ సోషల్ మీడియాలో ‘గెట్ అవుట్ మోదీ’ హ్యాష్ ట్యాగ్ ను కోడ్ చేసింది. దీనిపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. తమిళనాడు రాష్ట్ర బీజేపీ సైతం ‘ గెట్ అవుట్ స్టాలిన్’ పేరుతో హ్యాష్ ట్యాగ్ ను కౌంటర్ గా సోషల్ మీడియా(Social Media)లో వదిలింది. ఇరు పార్టీల ట్వీట్లకు సంబంధించి తమిళనాడు బీజేపీ(BJP) చీఫ్ కె అన్నామలై మాట్లాడుతూ.. ఈ రెండు హ్యాష్ ట్యాగ్ లను కోడ్ చేస్తూ ‘ఎవరు గెలిచారో చూసుకుందామా’ అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు డీఎంకేకు. ‘ మీరు గెట్ అవుట్ మోదీ’ హ్యాష్ ట్యాగ్ ను రాత్రి పూట్ రిలీజ్ చేశారు. ఆపై ఉదయం ఆరు గంటలకు ‘గెట్ అవుట్ స్టాలిన్’ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండింగ్‌లోకి తెచ్చాం. ఇక్కడ ఎవరు హ్యాష్ ట్యాగ్ ఎక్కువ రీచ్ అయ్యిందో చూద్దామా. ఇందుకోసం మీకున్న అన్ని వనరులను ఉపయోగించుకుండి. మన ఇద్దరి ట్వీట్లలో ఎవరిది ఎక్కవ ప్రజల్లోకి పోయిందో చూద్దాం’’ అంటూ డీఎంకే కు చాలెంజ్ విసిరారు అన్నామలై.For high handedness of one family, having a tainted cabinet, being an epicentre of corruption, turning a blind eye to lawlessness, turning TN into a haven for drugs & illicit liquor, mounting debt, dilapidated education ministry, precarious environment for women & children,… pic.twitter.com/VyD0BgPLfk— K.Annamalai (@annamalai_k) February 21, 2025 ఇదే సమయంలో తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైందన్నారు అన్నామలై. ప్రధానంగా పిల్లలకు భద్రత కల్పించడంలో డీఎంకే ప్రభుత్వం పూర్తిగా చతికిలబడిందన్నారు. కేంద్రం Vs తమిళనాడు.. సీఎం స్టాలిన్‌కు కేంద్రమంత్రి కౌంటర్ -
కేంద్రం Vs తమిళనాడు.. సీఎం స్టాలిన్‌కు కేంద్రమంత్రి కౌంటర్
ఢిల్లీ: గత కొద్దిరోజులుగా కేంద్రం, తమిళనాడు ప్రభుత్వం మధ్య మాటల యుద్దమే నడుస్తోంది. హిందీ భాష అమలు చేయడంపై కూడా నేతలు వాదించుకుంటున్నారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి ధరేంద్ర ప్రధాన్ సీఎం స్టాలిన్‌కు కౌంటరిచ్చారు. విద్యార్థులపై ఏ భాషనూ బలవంతంగా రుద్దడం లేదు అంటూ వ్యాఖ్యలు చేశారు.జాతీయ విద్యా విధానంపై కేంద్రమంత్రి ధరేంద్ర ప్రధాన్ తాజాగా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్బంగా ధర్మేంద్ర ప్రధాన్.. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-2020 భాషా స్వేచ్చ సూత్రాన్ని సమర్థిస్తుంది. విద్యార్థులపై బలవంతంగా ఏ భాషనూ బలవంతంగా రుద్దడం లేదు. విద్యార్థులు తమకు నచ్చిన భాషను నేర్చుకోవచ్చు. దాన్ని కొనసాగించేలా ఈ పాలసీ ఉంది. ఇదే సమయంలో విదేశీ భాషపై అతిగా ఆధారపడటం వల్ల విద్యార్థులు భాషాపరమైన మూలాలను తెలుసుకోకుండా పరిమితం చేసినట్లవుతుంది.తమిళనాడు ప్రభుత్వం కేవలం రాజకీయ కారణాల వల్లే కొత్త పాలసీని వ్యతిరేకిస్తోందన్నారు. ప్రగతిశీల సంస్కరణలను రాజకీయాలతో ముడిపెట్టవద్దని సూచించారు. అలాగే, 2022లోనే ప్రధాని మోదీ తమిళ భాష శాశ్వతం అనే వ్యాఖ్యలు చేసినట్టు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పటికైనా విద్యను రాజకీయం చేయడం వంటి పనులు మానుకోవాలని పేర్కొన్నారు.ఇక, అంతకుముందు ప్రధాని మోదీకి సీఎం స్టాలిన్ లేఖ రాశారు. సమగ్రశిక్షా పథకం కింద రాష్ట్రానికి రూ.2,152 కోట్ల నిధులను వెంటనే మంజూరు చేయాలని స్టాలిన్ కోరారు. జాతీయ విద్యా విధానం-2020ని పూర్తిగా అమలు చేసి త్రిభాషా విధానాన్ని ఆమోదించే వరకు తమిళనాడుకు సమగ్ర శిక్షా పథకం కింద నిధులు మంజూరు చేయమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ఇటీవల వెల్లడించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇది రాష్ట్రంలోని విద్యార్థులు, రాజకీయ పార్టీలు, ప్రజల మధ్య ఆవేదన, ఆక్రోశం కలిగించిందని తెలిపారు. తమిళనాడులో చాలాకాలంగా ద్విభాషా విధానమే ఉందన్నారు. దాన్ని ఆచరించడంలో రాష్ట్రం దృఢంగా ఉందని పేర్కొన్నారు. అధికారిక భాషా నిబంధన 1976లో పేర్కొన్న మేరకు అధికార భాషా చట్టం 1963 హెచ్ అమలు చేయడం నుంచి రాష్ట్రానికి మినహాయింపు కల్పించడాన్ని గుర్తు చేశారు.Highly inappropriate for a State to view NEP 2020 with a myopic vision and use threats to sustain political narratives. Hon’ble PM @narendramodi ji’s govt. is fully committed to promote and popularise the eternal Tamil culture and language globally. I humbly appeal to not… pic.twitter.com/aw06cVCyAP— Dharmendra Pradhan (@dpradhanbjp) February 21, 2025ఒక రాష్ట్రంలోని కాలపరిస్థితులను అనుసరించే విధానాలకు వ్యతిరేకంగా ఆ రాష్ట్రాన్ని నిర్బంధించడానికి, నిధులు అందించే వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చే ఇలాంటి ప్రయత్నం సమాఖ్య పాలనాతత్వాన్ని అతిక్రమించే చర్యగా పేర్కొన్నారు. సమగ్ర శిక్షా పథకం కింద నిధులు మంజూరు చేయకపోతే ఉపాధ్యాయులకు వేతనం, విద్యార్థులకు సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు దెబ్బతింటాయన్నారు. అందుకే నిధులు విడుదల చేయడానికి చర్యలు చేపట్టాలని కోరారు.ఇదిలాఉండగా.. ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యలపై ఉదయనిధి స్టాలిన్ మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం హిందీని రుద్దడం కొనసాగిస్తే, ప్రధాని తమిళనాడు పర్యటనకు వచ్చినప్పుడు 'గో బ్యాక్ మోదీ' కి బదులుగా 'గెట్ అవుట్ మోదీ' నినాదాలు ఎదుర్కోవలసి వస్తుందని ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల కారణంగా తమిళనాడులో రాజకీయం మరింత హీటెక్కింది. బీజేపీ నేతలు డీఎంకే నేతలపై మండిపడుతున్నారు. -
విజయ్ Y కేటగిరీ భద్రతపై రాజకీయ దుమారం
చెన్నై: అగ్రనటుడు, టీవైకే పార్టీ అధినేత విజయ్‌కు కేంద్రం ‘వై’ కేటగిరీ భద్రతను కేటాయించింది. రాజకీయాల్లో ఆయన క్రియాశీలకంగా మారడం, పైగా తరచూ జనాల్లోకి వెళ్తుండడంతో ఆయన ప్రాణాలకు ముప్పు కలగవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంతోనే హోం శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది.నటుడు, రాజకీయనేత అయిన విజయ్(Vijay)తో పాటు పలువురు ప్రముఖుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు తాజాగా కేంద్ర హోం శాఖకు నివేదికలు ఇచ్చాయి. ఇంటెలిజెన్స్ బ్యూరో(Intelligence Bureau) సూచనల మేరకు వాళ్లందరికీ ‘ఎక్స్, వై, జెడ్’ కేటగిరీల కింద ప్రత్యేక భద్రత కల్పించేందుకు కేంద్ర హోం శాఖ ముందుకు వచ్చింది. ఈ మేరకు ఫిబ్రవరి 13వ తేదీన ఓ నోటిఫికేషన్ కూడా రిలీజ్చేసింది. తాజా నిర్ణయంతో.. ఒకరు లేదా ఇద్దరు కమాండోలతో పాటు 8-11 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది విజయ్‌కు భద్రతగా ఉండనున్నారు. అయితే..ఈ వ్యవహారం(Vijay Security Row) తమిళనాట రాజకీయ విమర్శలకు దారి తీసింది. విజయ్‌కు రాష్ట్ర ప్రభుత్వమే ఇలాంటి భద్రత ఎందుకు కల్పించలేకపోయిందని బీజేపీ ప్రశ్నలు సంధించింది. ‘‘విజయ్ తమిళనాట ప్రజాదరణ ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి భద్రతకు ముప్పు పొంచి ఉందనే సమాచారం ఉన్నప్పుడు.. ఇక్కడి ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు. డీఎంకే ప్రభుత్వం ఆయనకు భద్రత కల్పించేందుకు ముందుకు రావొచ్చు కదా?’’ అని తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై ప్రశ్నించారు. దీనిపై డీఎంకే నుంచి బదులు రావాల్సి ఉంది.మరోవైపు.. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో విజయ్ను ప్రసన్నం చేసుకోవడానికి బీజేపీ ఆడుతున్న డ్రామా ఇదని అన్నాడీఎంకే(AIADMK) ఆరోపిస్తోంది. నిజాయితీగా విజయ్‌కు కేంద్రం భద్రతను ఇచ్చి ఉంటే ఫర్వాలేదు. కానీ, రాజకీయం కోసం చేసి ఉంటే మాత్రం.. తమిళనాడులో అలాంటి పాచికలు పారవు’’ అని అన్నాడీఎంకే నేత మునుస్వామి చురకలటించారు.కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌కు తమిళనాడులో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కిందటి ఏడాది ఫిబ్రవరిలో తమిళగ వెట్రి కజగం అనే పార్టీని ప్రకటించారు. రాష్ట్రంలో డీఎంకే, కేంద్రంలోని బీజేపీకి తన పార్టీ ప్రత్యామ్నాయమని ప్రకటించారాయన. ఆ మధ్య నిర్వహించిన ఓ బహిరంగ సభకు అశేషమైన స్పందన లభించింది కూడా. తరచూ జనాల్లో వెళ్తున్నారు కూడా. ఇక విజయ్ కదలికలను రాజకీయ వర్గాలు నిశితంగా పరిశీలిస్తూ వస్తున్నాయి. అలాగే.. మాజీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తోనూ ఆయన తరచూ భేటీ అవుతూ వస్తున్నారు. వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికలనే లక్ష్యంగా ఆయన టీవీకేను ముందుకు తీసుకెళ్తున్నారు.ఇదీ చదవండి: కళ్లు చెదిరిపోయేలా.. జయలలిత ఆస్తులు! -
జయలలిత వస్తువుల అప్పగింత షురూ!
సాక్షి, బెంగళూరు: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించిన ఆస్తి పత్రాలు, బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించే ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. కోర్టు ఆదేశాల మేరకు జయలలిత వస్తువులను తీసుకెళ్లేందుకు తమిళనాడు పోలీసులు, అధికారులు కర్ణాటక రాజధాని బెంగళూరుకు చేరుకున్నారు. జయలలితకు సంబంధించిన ఆస్తి పత్రాలు, 11,344 పట్టు చీరలు, 750 జతల పాదరక్షలు, గడియారాలు, 7,040 గ్రాముల బరువైన 468 రకాల బంగారు, వజ్రాభరణాలు, 700 కిలోల వెండి అభరణాలు, 250 శాలువాలు, 12 రిఫ్రిజిరేటర్లు, 10 టీవీసెట్లు, 8 వీసీఆర్‌లు, ఒక వీడియో కెమెరా, 4 సీడీ ప్లేయర్లు, 2 ఆడియో డెక్‌లు, 24 టూ ఇన్ వన్ టేప్రికార్డర్లు, 1,040 వీడియో క్యాసెట్లు, 3 ఐరన్ లాకర్లతోపాటు ఇతర విలువైన వస్తువులను కర్ణాటక అధికారులు న్యాయమూర్తి సమక్షంలో తమిళనాడు అధికారులకు అప్పగిస్తున్నారు. ఈ సందర్భంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ అప్పగింత ప్రక్రియ రెండు రోజుల్లో పూర్తికానుంది. జయలలిత బంధువులమంటూ దీప, దీపక్ అనే వ్యక్తులు గతంలో కర్ణాటక ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. జయలలితకు సంబంధించిన ఆభరణాలు, వస్తువులను తమకు అప్పగించాలంటూ వారు దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రత్యేక న్యాయస్థానం కొట్టివేసింది. అవన్నీ తమిళనాడు ప్రభుత్వానికే చెందుతాయని తేల్చిచెప్పింది. ఈ మేరకు 2024 ఫిబ్రవరి 19వ తేదీన ఆదేశాలు జారీ చేసింది. 2024 మార్చి 6, 7 తేదీల్లో వాటిని స్వాధీనం చేసుకునేందుకు అధికారిక బృందాన్ని ఏర్పాటు చేయాలని తమిళనాడు ప్రభుత్వానికి సూచించింది. అంతలోనే దీప, దీపక్ ప్రత్యేక కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. దీంతో జయలలిత వస్తువుల అప్పగింతపై గతేడాది మార్చి 5న హైకోర్టు స్టే విధించింది. ఆ తర్వాత దీప, దీపక్‌ల పిటిషన్‌ను కొట్టివేసింది. దాంతో ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాల మేరకు వస్తువుల అప్పగింత ప్రక్రియ ప్రారంభమైంది. అక్రమాస్తుల కేసులో దోషిగా తేలిన జయలలితకు స్పెషల్ కోర్టు 2014 సెప్టెంబర్ 27న నాలుగేళ్ల జైలు శిక్షతోపాటు రూ.100 కోట్ల జరిమానా విధించింది. -
రాజ్యసభకు కమల్ హాసన్?
చెన్నై, సాక్షి: సీనియర్ నటుడు కమల్ హాసన్ రాజ్యసభకు వెళ్లనున్నారనే చర్చ తమిళనాట జోరుగా నడుస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమికి మద్ధతు ప్రకటించిన ఆయన.. డీఎంకే అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో మొత్తం 39 సీట్లను కూటమి కైవసరం చేసుకుంది. దీంతో ఆయన్ను పెద్దల సభకు నామినేట్ చేయాలని డీఎంకే భావిస్తోందన్నది ఆ ప్రచార సారాంశం. ఈ ఏడాది జూన్‌లో రాజ్యసభ నుంచి ఆరు సీట్లు ఖాళీ కానున్నాయి. అయితే ఎన్నికల్లో మద్దతు ప్రకటించిన కమల్‌ను రాజ్యసభకు పంపే యోచనలో డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి స్టాలిన్ ఉన్నారట. తాజాగా.. బుధవారం తమిళనాడు మంత్రి పీకే శేఖర్‌బాబు కమల్ హాసన్ నివాసానికి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఈ ప్రచారం మరింత ఊపందుకుంది. మరోవైపు కమల్ పార్టీ మక్కల్ నీది మయ్యమ్(MNM) ప్రతినిధి మురళి అప్పాస్.. తమ పార్టీకి ఓ రాజ్యసభ సీటు దక్కబోతుందనే విషయాన్ని ధృవీకరించారు. అయితే అది ఎవరనేది పార్టీ అధ్యక్షుడు కమల్ హాసనే నిర్ణయిస్తారని తెలిపారాయన. శేఖర్‌బాబుతో కమల్ జరిపిన చర్చల సారాంశాన్ని ఆయన మీడియాకు వివరించేందుకు నిరాకరించారు.2018, ఫిబ్రవరి 21వ తేదీన కమల్ హాసన్ ఎన్ఎంఎం పార్టీని మధురైలో స్థాపించారు. అప్పటి నుంచి ఏ ఎన్నికల్లోనూ ఆ పార్టీ ప్రభావం చూపెట్టలేకపోయింది. 2019 సార్వత్రిక ఆయన పార్టీ పోటీ చేసినప్పటికీ. ఆశించిన ఫలితం సాధించలేకపోయింది. అయితే.. ఓటు షేర్ మాత్రం 3.72 శాతం దక్కించుకుంది. మరీ ముఖ్యంగా చెన్నై, కోయంబత్తూరు, మధురైలో భారీగా ఓట్లు పడ్డాయి. అయితే గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఆ పార్టీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేసినా.. ఒక్క సీటు గెలవలేకపోయింది. కోయంబత్తూరులో పోటీ చేసిన కమల్.. బీజేపీ అభ్యర్థి వనతిశ్రీనివాసన్ చేతిలో 1,728 ఓట్ల మెజారిటీలోఓటమి పాలయ్యారు. 2022 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసినా.. 140 స్థానాలకు ఒక్కటి కూడా గెలవలేకపోయింది. -
కరుణ్ నాయర్ సెంచరీ, దూబే మెరుపులు.. సెమీ ఫైనల్లో విదర్భ
రంజీ ట్రోఫీ 2024-25(Ranji Trophy)లో విదర్భ జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. క్వార్టర్ ఫైనల్-2లో తమిళనాడుతో తలపడ్డ విదర్భ భారీ విజయం సాధించింది. నాగ్‌పూర్‌లో మంగళవారం ముగిసిన మ్యాచ్‌లో ఏకంగా 198 పరుగుల తేడాతో గెలిచి సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది.కరుణ్ నాయర్ శతకంకాగా సొంత మైదానం విదర్భ క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్లో శనివారం టాస్ గెలిచిన అక్షయ్ వాడ్కర్ బృందం తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు అథర్వ టైడే(0), ధ్రువ్ షోరే(26)లతో పాటు వన్‌డౌన్ బ్యాటర్ ఆదిత్య ఠాక్రే(5) ఆకట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలో మిడిలార్డర్లో డానిశ్ మాలేవర్(75) అర్ధ శతకంతో రాణించగా.. కరుణ్ నాయర్(Karun Nair) శతక్కొట్టాడు.హర్ష్ దూబే హాఫ్ సెంచరీమొత్తంగా 243 బంతులు ఎదుర్కొన్న కరుణ్ 122 పరుగులు సాధించాడు. వీరిద్దరికి తోడుగా స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హర్ష్ దూబే(Harsh Dube) హాఫ్ సెంచరీ(69)తో మెరిశాడు. ఈ క్రమంలో విదర్భ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 353 పరుగులకు ఆలౌట్ అయింది. తమిళనాడు బౌలర్లలో సోనూ యాదవ్, విజయ్ శంకర్ మూడేసి వికెట్లు దక్కించుకోగా.. మొహమ్మద్ రెండు, అజిత్ రామ్, మొహమద్ అలీ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.తమిళనాడు బ్యాటర్లు విఫలంఅనంతరం బ్యాటింగ్‌కు దిగిన తమిళనాడుకు శుభారంభం లభించలేదు. ఓపెనర్లు మొహమద్ అలీ(4), నారాయణ్ జగదీశన్(22)తో పాటు.. సాయి సుదర్శన్(7), బూపతి కుమార్(0) విఫలమయ్యారు. ఈ క్రమంలో ఆండ్రీ సిద్దార్థ్(65) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేయగా.. హర్ష్ దూబే అతడిని పెవిలియన్‌కు పంపాడు.మిగతావాళ్లలో ప్రదోష్ పాల్(48), సోనూ యాదవ్(32) మాత్రం ఫర్వాలేదనిపించగా.. తమిళనాడు 225 పరుగులకు తమ తొలి ఇన్నింగ్స్ ముగించింది. విదర్భ బౌలర్లలో ఆదిత్య ఠాక్రే ఐదు వికెట్లతో చెలరేగగా.. యశ్ ఠాకూర్, నచికేత్ భూటే రెండేసి వికెట్లు, హర్ష్ దూబే ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.కెప్టెన్ రాణించినా..ఈ క్రమంలో 128 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన విదర్భ 272 పరుగులకు ఆలౌట్ అయింది. ఈసారి యశ్ రాథోడ్(112) శతకంతో చెలరేగగా.. హర్ష్ దూబే మరోసారి హాఫ్ సెంచరీ(64) సాధించాడు. ఇక తమిళనాడు బౌలర్లలో కెప్టెన్ సాయి కిషోర్ ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.అనంతరం 401 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన తమిళనాడు.. మంగళవారం నాటి ఆటలో భాగంగా 202 పరుగులకే కుప్పకూలింది. ప్రదోష్ పాల్(53), సోనూ యాదవ్(57) అర్ధ శతకాలతో రాణించగా.. మిగతా వాళ్లంతా కనీసం ఇరవై పరుగుల మార్కు కూడా అందుకోలేకపోయారు. విదర్భ బౌలర్లలో హర్ష్ దూబే, నచికేత్ భూటే మూడేసి వికెట్లతో చెలరేగి తమిళనాడు బ్యాటింగ్ ఆర్డర్‌ను కుదేలు చేశారు. మరోవైపు ఆదిత్య ఠాక్రే, అక్షయ్ వాఖరే చెరో వికెట్ తీశారు.సెమీస్ పోరులో ముంబైతోఈ నేపథ్యంలో 198 పరుగులతో తమిళనాడును చిత్తుచేసిన విదర్భ సెమీస్ చేరుకుంది. శతక వీరుడు కరుణ్ నాయర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా ఈ సీజన్లో విదర్భ ఇప్పటికి ఎనిమిదింట ఏడు విజయాలు సాధించడం విశేషం. ఇక విదర్భ ఫైనల్ బెర్తు కోసం ముంబైతో తలపడుతుంది. మరోవైపు.. సౌరాష్ట్రపై గెలుపొందిన గుజరాత్ కూడా సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. జమ్మూ కశ్మీర్- కేరళ జట్ల మధ్య మ్యాచ్‌లో విజేతతో గుజరాత్ అమీతుమీ తేల్చుకుంటుంది.చదవండి: శతక్కొట్టిన రహానే, చెలరేగిన శార్దూల్.. సెమీస్‌లో ముంబై119 ఏళ్ల రికార్డు బద్దలు: ప్రపంచంలోనే తొలి టెస్టు జట్టుగా ఐర్లాండ్ ఘనత -
మళ్లీ శతక్కొట్టిన కరుణ్ నాయర్.. ఈసారి..!
దేశవాలీ క్రికెట్లో విదర్భ ఆటగాడు కరుణ్ నాయర్ (Karun Nair) పరుగుల ప్రవాహం కొనసాగుతుంది. ఇటీవల ముగిసిన విజయ్ హజారే వన్డే ట్రోఫీలో (VHT) ఆకాశమే హద్దుగా చెలరేగిన కరుణ్.. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలోనూ (Ranji Trophy) అదే స్థాయిలో రాణిస్తున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో 7 ఇన్నింగ్స్‌ల్లో ఐదు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 779 పరుగులు చేసిన కరుణ్.. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో తమిళనాడుపై బాధ్యతాయుతమైన సెంచరీతో (122) మెరిశాడు.ఈ మ్యాచ్‌లో కరుణ్ శతక్కొట్టడంతో తొలుత బ్యాటింగ్ చేసిన విదర్భ 353 పరుగులకు ఆలౌటైంది. జట్టు కష్టాల్లో (44/3) ఉన్నప్పుడు బరిలోకి దిగిన కరుణ్.. దనిశ్ మలేవార్ (75), హర్ష్ దూబేతో (69) కలిసి ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. విదర్భ ఇన్నింగ్స్‌లో ఈ ముగ్గురూ మినహా ఎవరూ రాణించలేదు. అథర్వ తైడే 0, ధృవ్ షోరే 26, ఆధిత్య థాకరే 5, యశ్ రాథోడ్ 13, అక్షయ్ వాద్కర్ 24, భూటే 2, యశ్ ఠాకూర్ 2 పరుగులు చేసి ఔటయ్యారు. తమిళనాడు బౌలర్లలో సోనూ యాదవ్, విజయ్ శంకర్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. మొహమ్మద్ 2, అజిత్ రామ్, మొహమ్మద్ అలీ ఓ వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన తమిళనాడు మూడో రోజు తొలి సెషన్ సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. ప్రదోశ్ రంజన్పాల్ (51), సోనూ యాదవ్ (24) క్రీజ్‌లో ఉన్నారు. తమిళనాడు ఇన్నింగ్స్‌లో మొహమ్మద్ అలీ 4, ఎన్ జగదీశన్ 22, సాయి సుదర్శన్ 7, భూపతి కుమార్ 0, విజయ్ శంకర్ 22, ఆండ్రీ సిద్దార్థ్ 65, సాయికిషోర్ 7, మొహమ్మద్ 1 పరుగు చేసి ఔటయ్యారు. విదర్భ బౌలర్లలో ఆధిత్య ఠాకరే 4 వికెట్లు పడగొట్టగా.. యశ్ ఠాకూర్ 2, నిచికేత్ భూటే, హర్ష్ దూబే తలో వికెట్ దక్కించుకున్నారు. ప్రస్తుతం తమిళనాడు విదర్భ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 133 పరుగులు వెనుకపడి ఉంది.గతేడాది మొత్తం కొనసాగిన కరుణ్ హవాకరుణ్ గతేడాది మొత్తం ఫార్మాట్లకతీతంగా విశేషంగా రాణించాడు. మహారాజా ట్రోఫీతో కరుణ్ పరుగుల ప్రవాహం మొదలైంది. టీ20 ఫార్మాట్లో జరిగిన ఆ టోర్నీలో కరుణ్ 10 మ్యాచ్‌ల్లో 188.4 స్ట్రయిక్‌రేట్‌తో, 70 సగటున 490 పరుగులు చేశాడు. ఇందులో 4 అర్ద శతకాలు, ఓ శతకం ఉంది.కరుణ్ గత సీజన్ రంజీ సీజన్లోనూ రెచ్చిపోయి ఆడాడు. 17 ఇన్నింగ్స్‌ల్లో 40.58 సగటున 690 పరుగులు చేశాడు. ఇందులో 3 అర్ధ శతకాలు, 2 శతకాలు ఉన్నాయి.కరుణ్ గతేడాది కౌంటీ క్రికెట్లోనూ చెలరేగి ఆడాడు. 11 ఇన్నింగ్స్‌ల్లో 48.70 సగటున 487 పరుగులు చేశాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీ సహా మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.గతేడాది సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలోనూ కరుణ్ విధ్వంసం కొనసాగింది. ఈ టోర్నీలో కరుణ్ 6 ఇన్నింగ్స్‌ల్లో 177.08 స్ట్రయిక్‌రేట్‌తో 42.50 సగటున 255 పరుగులు చేశాడు. ఇందులో 3 అర్ద సెంచరీలు ఉన్నాయి.విజయ్ హజారే ట్రోఫీలో కరుణ్ ఫామ్ పతాకస్థాయికి చేరింది. ఈ టోర్నీలో కరుణ్ 7 ఇన్నింగ్స్‌ల్లో 389.50 సగటున, 124.04 స్ట్రయిక్‌రేట్‌తో ఐదు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 779 పరుగులు చేశాడు. -
తమిళనాడులో దారుణం.. చిత్తూరు మహిళపై లైంగిక దాడి యత్నం
చెన్నై: తమిళనాడులోని కోయంబత్తూరులో దారుణ ఘటన వెలుగు చూసింది. కదులుతున్న రైలులో గర్భిణిపై లైంగిక దాడి చేసేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. ఈ క్రమంలో సదరు మహిళ ప్రతిఘటించగా.. రైలు నుంచి ఆమెకు బయటకు తోసేశాడు. దీంతో, సదరు గర్భిణి తీవ్రంగా గాయపడగా.. ఆమెకు ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చిత్తూరుకు చెందిన రేవతి(36) తమిళనాడులో కుటుంబ సభ్యులతో ఉంటున్నారు. ప్రస్తుతం ఆమె నాలుగు నెలల గర్భిణి. ఈ క్రమంలో చిత్తూరులో ఉన్న ఆమె తన తల్లి వద్దకు వెళ్లిందుకు గురువారం ఉదయం 10:30 గంటల ప్రాంతంలో కోయంబత్తూరు-తిరుపతి ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కారు. బాధితురాలు రైలులోకి మహిళల కోచ్‌లో కూర్చుంది. తాను కోచ్‌లోకి ఎక్కిన సమయంలో ఆమె పాటుగా మరికొందరు మహిళలు కూడా ఉన్నారు.కాగా, రైలు జోలార్‌పేట రైల్వే స్టేషన్‌కు చేరుకోగానే కోచ్‌లో మహిళలు అందరూ దిగిపోగా రేవతి ఒక్కరే ఉన్నారు. ఆ స్టేషన్లోనే నిందితుడు హేమరాజ్(27) మహిళల కోచ్‌కి ఎక్కాడు. రైలు ప్రారంభమైన కొద్ది సెకన్లలోనే హేమరాజ్ కోచ్‌లోకి ప్రవేశించాడు. ఇక, కోచ్‌లోకి ఒంటరిగా ఉన్న రేవతిని నిందితుడు చూశాడు. కోచ్‌లో ఎవరూ లేకపోవడంతో ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. కానీ, రేవతి తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో, ఆవేశానికి లోనైన నిందితుడు.. రేవతిపై దాడి చేసి ఆమెను కదులుతున్న రైలులో నుంచి బయటకు తోసేశాడు. ఈ క్రమంలో రేవతి.. చేతులు, కాళ్లు, తలపై తీవ్ర గాయాలయ్యాయి.🚨A 4 month pregnant woman traveling alone in the ladies' compartment of the Coimbatore-Tirupati Intercity Express was molested and pushed out of the moving train near Vellore, Tamil Nadu. The suspect, Hemaraj has been arrested.pic.twitter.com/huAiRFEiKn— Trend_X_Now (@TrendXNow) February 7, 2025ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు రేవతిని వెల్లూరు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు. అనంతరం, బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హేమరాజ్‌ను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. గతంలో కూడా హత్య, దోపిడీ కేసులో అతన్ని అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. -
విద్యార్థినిపై టీచర్ల గ్యాంగ్‌రేప్.. తమిళనాడులో వెలుగు చూసిన దారుణం
చెన్నై: తమిళనాడులో దారుణ ఘటన చోటుచేసుకుంది. విద్యార్థులకు విద్యా బుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయులే కీచకులుగా మారిపోయారు. సభ్య సమాజం తల దించుకునేలా టీచర్లు వ్యవహరించారు. ఓ విద్యార్థినిపై ముగ్గురు ఉపాధ్యాయులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. దీంతో, ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో దారుణానికి ఒడిగట్టిన ముగ్గురు ఉపాధ్యాయులను పోలీసులు అరెస్ట్ చేశారు.వివరాల ప్రకారం.. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ప్రభుత్వ పాఠశాలలో మైనర్ విద్యార్థినిపై ముగ్గురు ఉపాధ్యాయులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో సదరు విద్యార్థిని గర్భం దాల్చింది. అసలు విషయం తన తల్లికి చెప్పడంతో ఆవేదన చెందిన ఆమె.. బిడ్డను గత నెల రోజులుగా పాఠశాలకు పంపించలేదు. స్కూలుకు సెలవు పెట్టించి అబార్షన్ కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఈ విషయం పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి తెలిసింది.ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. వెంటనే శిశు సంక్షేమ అధికారులను ఆశ్రయించారు. ఈ క్రమంలో బాధితురాలితో ఫిర్యాదు చేయించారు. దీంతో, బాలికను కృష్ణగిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం, రంగంలోకి దిగిన శిశు సంక్షేమ శాఖ అధికారులు.. దారుణ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. ఉపాధ్యాయులు చిన్నసామి(57), ఆర్ముగం(45), ప్రకాశ్(37)ను అరెస్ట్ చేశారు. ఇక, ఈ ఘటన చర్చనీయాంశంగా మారడంతో స్థానికులు ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు మరోవైపు.. ఈ ఘటన అనంతరం వారిని జిల్లా ఎడ్యుకేషన్ ఆఫీసర్ సస్పెండ్ చేస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు. ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో తమిళనాడులో వరుస లైంగిక దాడుల ఘటనలు స్టాలిన్ సర్కార్‌కు మచ్చ తెస్తున్నాయి. గత ఏడాది డిసెంబరు 23న అన్నామలై విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. దీంతో, ప్రతిపక్ష బీజేపీ నిరసనలు చేపట్టింది. స్టాలిన్ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది.Tamil Nadu | A 13-year-old girl student was allegedly sexually assaulted by three teachers at a government middle school in Krishnagiri district. The three teachers have been suspended by the District Education Officer (DEO) and arrested under various sections of the Protection…— ANI (@ANI) February 6, 2025 -
ఆయనో స్ట్రిక్ట్ ఐఏఎస్ ఆఫీసర్! మీనా పెళ్లిలో మాత్రం భావోద్వేగంతో..
సముద్రం సునామీగా ముంచెత్తి దాదాపు 6 వేల మందిని పొట్టనబెట్టుకుంది. అంతటి ప్రళయం నుంచి అదృష్టం కొద్దీ ప్రాణాలతో బయటపడినవాళ్లు కొందరే. అందులో రెండేళ్ల ఓ పసిప్రాణం కూడా ఉంది. పసికందుగా ఆమెను తన చేతుల్లోకి తీసుకున్న ఆ ఐఏఎస్ అధికారి.. ఇప్పుడు తండ్రి స్థానంలో ఆమెపై అక్షింతలు జల్లి దీవించి భావోద్వేగానికి లోనయ్యారు. హృదయాన్ని హత్తుకునే ఈ ఘటనలోకి వెళ్తే.. డిసెంబర్ 26, 2004 ముంచెత్తిన సునామీలో తమిళనాడుకు జరిగిన ప్రాణ, ఆస్తి నష్టం భారీగానే. నాగపట్టణంలో సహాయక చర్యలు పర్యవేక్షించే బాధ్యతను ప్రభుత్వం స్ట్రిక్ట్ ఆఫీసర్‌గా పేరున్న రాధాకృష్ణన్‌కు అప్పగించింది. అప్పుడు ఆయన తంజావూరు కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో.. డిసెంబర్ 28వ తేదీన కీచన్‌కుప్పం ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్న బృందాలకు.. శిథిలాల కింద ఓ పసికందు ఏడుపులు వినిపించాయి. దాదాపు రెండేళ్ల వయసున్న చిన్నారిని సురక్షితంగా బయటకు తీసి.. ఆస్పత్రికి తరలించారు. అదృష్టం కొద్దీ ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడింది. ఆ సునామీ నుంచి బయటపడిన అతిచిన్న వయస్కురాలు కూడా ఆమెనే!. అయితే ఆమె తల్లిదండ్రులు ఏమయ్యారో తెలియదు. అలాంటప్పడు చిన్నారి సంరక్షణ బాధ్యతలు ఎలా? అని అధికారులు ఆలోచన చేశారు.ఈలోపు.. విషయం తెలిసిన అప్పటి జిల్లా కలెక్టర్ రాధాకృష్ణన్-కృతిక దంపతులు ముందుకు వచ్చారు. ఆ చిన్నారికి మీనా అని పేరు పెట్టి.. అన్నై సత్య ప్రభుత్వ వసతి గృహంలో చేర్పించారు. అప్పటి నుంచి ఆమె సంరక్షణ మొత్తం ఆ జంటే చూసుకుంటూ వచ్చింది. ఈలోపు రాధాకృష్ణన్‌కు ట్రాన్స్ఫర్ అయ్యింది. అయితే మరో ప్రాంతానికి బదిలీ అయినప్పటికీ.. రాధాకృష్ణన్ జంట మీనా సంరక్షణ బాధ్యతను మరిచిపోలేదు. వీలు చిక్కినప్పుడల్లా ఆమె దగ్గరికి వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. అదే ఆశ్రమంలో సౌమ్య ఆమెకు బెస్ట్ ఫ్రెండ్ అయ్యింది. అలా.. ఏళ్లు గడిచిపోయాయి. సాధారణంగా 18 ఏళ్లు నిండిన తర్వాత.. వాళ్లకు ఆశ్రమంలో కొనసాగడానికి వీలు ఉండదు. ఆశ్రమంలో సౌమ్య, మీనాలకు మాత్రమే ఈ ఇబ్బంది ఎదురైంది. విషయం తెలిసి.. రాధాకృష్ణన్ ముందుకొచ్చారు. మీనా, సౌమ్య బాధ్యతలకు దాతల సహకారం తీసుకున్నారు. అలా.. వాళ్లిద్దరూ ఉన్నత చదువులు పూర్తి చేసుకున్నారు. అలా వాళ్లిద్దరికీ తండ్రికాని తండ్రిగా మారిపోయారు.రెండేళ్ల కిందట.. సౌమ్య ఓ టెక్నీషియన్‌ను వివాహం చేసుకుంది. ఆ వివాహానికి సౌమ్య తరఫున పెద్దగా రాధాకృష్ణన్ హాజరై ఆశీర్వదించారు. కిందటి ఏడాది సౌమ్య ఓ బిడ్డకు జన్మనిస్తే.. ఇంటికి పిలిపించుకుని మరీ మనవరాలిని దీవించారు. ఇక మీనా వయసు ఇప్పుడు 23 ఏళ్లు. నర్సింగ్ పూర్తి చేసుకుంది. మీనాను వివాహం చేసుకునేందుకు మణిమరన్ అనే బ్యాంక్ ఉద్యోగి ముందుకు వచ్చాడు. విషయం తెలిసి రాధాకృష్ణన్ సంతోషించారు. ఫిబ్రవరి 2వ తేదీన నాగపట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో మీనా-మణిమరన్ వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఆ వివాహ వేడుకకు సౌమ్య తన భర్త, కూతురితో హాజరైంది. ప్రస్తుతం రాధాకృష్ణన్ ప్రభుత్వంలో అదనపు చీఫ్ సెక్రటరీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దత్త పుత్రిక వివాహానికి స్వయంగా హాజరై తండ్రి స్థానంలో ఉండి తన బాధ్యతను నిర్వర్తించారు. ఆశ్రమంలో సౌమ్య-మీనాలు గడిపిన రోజులను, వాళ్ల స్నేహాన్ని, ఆశ్రమ నిర్వహణకు సహకరించిన సూర్యకళను ఆయన గుర్తు చేసుకున్నారు. అన్నింటికి మించి.. 2018లో గాజా తుపాన్ సమీక్ష కోసం వెళ్లినప్పుడు మీనా తనను ‘‘నాన్నా..’’ అని పిలవడాన్ని గుర్తు చేసుకుని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ఆ వివరాలను ఆయనే స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడం గమనార్హం. -
ఓ.. పరదేశి!
తమిళనాడు: యుద్ధంతో అట్టుడుకున్న ఉక్రెయిన్(Ukraine) దేశ యువతిని విల్లుపురం యువకుడు ప్రేమించి హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నాడు. వివరాలు.. విల్లుపురానికి చెందిన జయకుమార్ కుమారుడు ఉదయకుమార్ (30). ఇతను కోవైలో బీఈ చదువు పూర్తి చేసి ఆరు సంవత్సరాల క్రితం ఉన్నత చదువుల కోసం స్లోవేకియా దేశానికి వెళ్లారు. అక్కడ రెండేళ్లు చదువు పూర్తి చేసి ప్రముఖ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. అక్కడ తనతో పాటూ ఉద్యోగం చేస్తున్న ఉక్రెయిన్ దేశానికి చెందిన అనస్టాసియా (25)ను ప్రేమించాడు. తర్వాత వారు పెళ్లి చేసుకోవాలని భావించగా, ఇరు కుటుంబీకులు అందుకు అంగీకారం తెలిపారు. ఈ క్రమంలో ఆ దేశం నుంచి సొంత ఊరికి వచ్చిన ప్రేమ జంటకు సోమవారం విల్లుపురం సమీపంలో కంబియంపులియూర్ పెరుమాల్ ఆలయంలో హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. అమెరికా అమ్మాయితో..అదేవిధంగా తిరువన్నామలై జిల్లా చెయ్యారు తాలూకా అనక్కావూరుకు చెందిన భాస్కరన్ అమెరికాలోని ప్రైవేటు కంపెనీలో డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు. భార్య ఆదిరై, ఇద్దరు కుమారులతో టెక్సాస్‌లో నివసిస్తున్నారు. వీరి పెద్ద కుమారుడు అవి నాష్ నాసాలో సైంటిస్ట్‌గా ఉన్నారు. ఈయన ఆ ప్రాంతానికి చెందిన కేథరిన్ ఓసేవి అనే యువతిని ప్రేమించారు. వీరి ప్రేమకు ఇరు కుటుంబీకులు సమ్మతించడంతో విల్లుపురం జిల్లా సెంజిలో ఉన్న కులదేవత ఏకాంభరేశ్వరర్ ఆలయంలో, తమిళ సాంప్రదాయం ప్రకారం కనులపండువగా వీరి వివాహ వేడుక మంగళవారం సాగింది. -
పట్టపగలే యువతికి లైంగిక వేధింపులు
అన్నానగర్: గోపాలపురంలో నడుచుకుంటూ వెళ్తున్న యువతిని లైంగికంగా వేధించిన బాలుడిని పోలీసులు పట్టుకుని జువైనల్ జస్టిస్ కమిటీ ముందు హాజరు పరిచారు. చెన్నైలోని రాయపేట ప్రాంతానికి చెందిన షేర్ నాథ్ 31 సంవత్సరాల యువతి. 28వ తేదీ ఉదయం గోపాలపురం 2వ వీధిలోని తన ఇంటి నుంచి నడుచుకుంటూ వెళ్తున్నది. ఆ సమయంలో 15 ఏళ్ల బాలుడు సైకిల్‌పై వచ్చాడు. నడుచుకుంటూ వెళ్తున్న యువతి ఎదురుగా సైకిల్ ఆపి ఎవరూ ఊహించని సమయంలో హఠాత్తుగా లైంగిక వేధింపులకు పాల్పడి పారిపోయాడు. దీన్ని అస్సలు ఊహించని యువతి షాక్‌కు గురైంది. ఘటనపై వెంటనే రాయపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు పోలీసులు సీసీటీవీ ఫుటేజీని బట్టి బాలుడిని గుర్తించారు. షేర్‌నాథ్‌ను లైంగికంగా వేధించిన బాలుడిని పట్టుకుని విచారించగా.. ఆమెను లైంగికంగా వేధించినట్లు బాలుడు అంగీకరించాడు. అతడి నుంచి సైకిల్‌ను స్వాదీనం చేసుకున్నారు. అనంతరం పోలీసులు పట్టుకున్న బాలనేరస్తుడిని జువైనల్ జస్టిస్ కమిటీ ముందు హాజరుపరిచి ప్రభుత్వ అబ్జర్వేషన్ హోంకు అప్పగించారు. -
తానే దిద్దుకున్న బతుకు చిత్రం
బాల్యం పేదరికాన్ని పరిచయం చేసింది. చదువుకు దూరం చేసింది. అనివార్యంగా పెళ్లికి తలవంచాల్సి వచ్చింది. భర్త పట్టించుకోని ఇంటి బాధ్యతను మోయడానికి భుజాలనివ్వాల్సి వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా ఐదుసార్లు వదిలి వెళ్లాడు భర్త. ఇద్దరు పిల్లలను పోషించుకోవాలి. తనకు దూరమైన చదువును వారికివ్వాలి. అందుకోసం తానెంతయినా కష్టపడాలి. ఇదీ ఆమెకు జీవితం నిర్దేశించిన దారి. ఆ దారి ఆమెను దేశం ఎల్లలు దాటించింది. పరాయి దేశంలో ఆ భాషలు నేర్చుకుంది. చదువుకుంది. ఆ దేశపు మంత్రిత్వ శాఖలో ఉద్యోగంలో చేరింది. ఆ విధుల్లో ఏకైక మహిళ రషీదా బేగం షేక్ పరిచయం ఇది.బతుకు బడి రషీదా పుట్టింది తమిళనాడులో. ఆమె చిన్నప్పుడే తండ్రి ఆంధ్రప్రదేశ్, తిరుపతి జిల్లాలోని గూడూరుకి వచ్చి స్థిరపడ్డారు. రషీదా బాల్యం, చదువు గూడూరులోనే. ఆమె పాఠశాల చదువు పూర్తయ్యేలోపు తండ్రి పోవడంతో కష్టాలు మొదలయ్యాయి. క్లాసులో ఫస్ట్ ర్యాంకులో చదివిన రషీదకు టెన్త్ క్లాస్ హాల్ టికెట్ తెచ్చుకోవడానికి పాతిక రూపాయలు కష్టమయ్యాయి. చదువు విలువ తెలియని తల్లి కారణంగా రషీదా చదువాగిపోయింది. అడిగిన వారికిచ్చి పెళ్లి చేశారు. వ్యసనపరుడైన భర్త వదిలేసి పోవడంతో ఇద్దరు పిల్లలను పోషించుకోవడానికి వదిన సహాయంతో కువైట్‌కి వెళ్లింది. పిల్లలను అక్క దగ్గర వదిలి కువైట్‌లో ఉద్యోగంలో చేరిన రషీదా లక్ష్యం ఒక్కటే. బాగా డబ్బు సంపాదించాలి, పిల్లల్ని బాగా చదివించాలి. నెలకు నాలుగు వేల రూపాయల ఉద్యోగంతో మొదలైన ఆమె ప్రస్థానంలో ఆమె చేరిన మైలురాయి ఏమిటో తెలుసా? కువైట్ పబ్లిక్ రిలేషన్స్, ఫారిన్ అఫైర్స్ మినిస్ట్రీలో అఫిషియల్ ఫొటోగ్రాఫర్. ఇదేమీ సినిమా కథలా ఒక రీల్లో జరిగిపోలేదు. ఆమె ప్రయాణంలో ఒక్కొక్క అడుగూ చిట్టడవిలో దారి వెతుక్కుంటూ సాగింది. ఒక్కొక్క సంఘటన ఒక్కోపాఠం. భాష తెలియక యజమానురాలి ఆదేశం సరిగ్గా అర్థం కాకపోవడం, దాంతో ఆమెకు ఆగ్రహం కట్టలు తెంచుకోవడం, రషీద ఉన్న గది తలుపు వేసి రెండో రోజు వరకు తియ్యకపోవడం... ఇండియాకి వెళ్లిపోదామనిపించిన చేదు అనుభవం. పిల్లల్ని బాగా చదివించాలి... ఒక్కటే లక్ష్యం ఆమెను కువైట్‌లో కట్టిపడేసింది. ఇటాలియన్ వంటల పుస్తకంలోని బొమ్మల ఆధారంగా రకరకాల సలాడ్లు చేసి జీతం పెంచుకుంది.కష్టాల పాఠాలురషీదా ఓ రోజు పైకి ఎక్కి కిటికీలను తుడుస్తూ కాలు జారి పడిపోయింది. కాలుకు కట్టు కట్టించారు. ఆ ఒక్కరోజే రెస్ట్. రెండో రోజు చేతి కర్ర ఇచ్చి పని చేయమన్నారు. కాలికి కట్టు, కర్ర సాయంతో నడుస్తూ ఇంటి పనంతా చేయాల్సి వచ్చింది. చిమ్మ చీకటిలోనూ ఒక వెలుగురేఖ ప్రకాశిస్తుందనడానికి నిదర్శనం ఆ ఇంటి అమ్మాయి బ్యూటీషియన్ కావడం. ఆమెకు సహాయం చేస్తూ కోర్సు మొత్తం నేర్చుకుంది రషీదా. బ్యూటీషియన్‌గా పని చేసింది. ఒకరోజు అరబ్ వార్తాపత్రికలో మహిళలకు ఫొటోగ్రఫీలో శిక్షణ, ఉద్యోగం ప్రకటన ఆమెను కొత్త దారి పట్టించింది. ఆ ప్రకటనలో ఆమెకు అర్థమైంది మహిళ ఫొటో, కెమెరా బొమ్మ, జీతం అంకె మాత్రమే. కోర్సులో చేరి ఫొటోగ్రఫీ నేర్చుకుంది. డిగ్రీ ఉంటే ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని చెప్పారెవరో. ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ బీకామ్ చేసింది. ఇంగ్లిష్ మాట్లాడడంతోపాటు అరబ్బీ చదవడం, రాయడం కూడా నేర్చుకుంది. గవర్నమెంట్లో స్వీపర్ ఉద్యోగం అయినా చేస్తానని తెలిసిన వాళ్లందరినీ అడిగింది. కానీ ఆమె కోసం అఫిషియల్ ఫొటోగ్రాఫర్ ఉద్యోగం ఎదురు చూసింది. ఇప్పుడామె తనకంటూ మినిస్ట్రీలో ఒక అఫిషియల్ క్యాబిన్, పోలీస్ జాకెట్‌తో ఉన్నతస్థాయిలో ఉన్న విజేత. కొడుకులిద్దరూ ఆమె కోరుకున్నట్లే ఉన్నత చదువులు చదువుకుని ఉద్యోగాల్లో స్థిరపడ్డారు.విజేత లక్ష్యం రషీదా ప్రస్థానం పర్వత శిఖరం చేరిన తర్వాత అక్కడే ఆగిపోలేదు. పరాయి దేశంలో ఒంటరి మహిళకు ఎదురయ్యే కష్టాలను స్వయంగా అనుభవించింది. ఉపాధి కోసం బయటి ప్రాంతాలకు వెళ్లే వారికి మంచి దారి చూపించాలనుకుంది. ఉమెన్స్ థ్రైవ్ ఏపీ పేరులో స్వచ్ఛంద సంస్థను స్థాపించి మహిళలను శిక్షణనిస్తోంది. టైలరింగ్, బ్యూటీషియన్, ఇంగ్లిష్ చదవడం– మాట్లాడడం, కేక్ తయారీ, పెళ్లి మండపాల అలంకరణ వంటి పనుల్లో శిక్షణనిస్తోంది. అలాగే ఉజ్వల భవిష్యత్తు పేరుతో పాఠశాల పిల్లలకు కెరీర్ ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయోననే అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది. ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత ఇండియాకి వచ్చి పూర్తి స్థాయిలో మహిళలు, పిల్లల కోసం పని చేయాలనేదే తన లక్ష్యం అంటోంది రషీదా బేగం షేక్. ఇకిగాయ్ నేర్పించింది ఫొటోగ్రఫీతోపాటు ఫొటోషాప్ కోర్సు నేర్చుకోవడానికి వెళ్లినప్పటికి నాకు కీబోర్డ్ కాదు కదా, మౌస్ కదపడం కూడా రాదు. బ్యూటీషియన్‌గా కొనసాగమని సూచించారు. అప్పుడు నాకెంత ఉక్రోషం వచ్చిందంటే... ఆ మాట అన్న వారి నంబర్ బ్లాక్ చేసేశాను. ఏడాది తర్వాత వారికి ఒక ప్రోగ్రామ్‌కి ఫొటోగ్రాఫర్ అవసరం ఏర్పడినప్పుడు ఎంక్వయిరీ చేస్తే ఎవరో నా పేరు చెప్పారట. వాళ్ల ఈవెంట్ కోసం నన్నే పిలిచారు. మరొక సందర్భంలో నా దుస్తుల కారణంగా చిన్నచూపుకు గురవుతున్నానని తెలిసింది. నేను నేర్చుకున్న మరో పాఠం అది. జపాన్ పుస్తకం ఇకిగాయ్ ద్వారా చాలా తెలుసుకున్నాను. ఉమెన్స్ థ్రైవ్ కోర్సులో ఈ పుస్తకంలోని అంశాలను చేర్చాను. నన్ను నేను మలుచుకున్నట్లే సాటి మహిళలను తీర్చిదిద్దాలనేది నా ఆకాంక్ష. – రషీదా బేగం షేక్, ఫొటోగ్రాఫర్, మంత్రిత్వ శాఖ, కువైట్– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
చలో కారైకుడి
హీరో ప్రభాస్ తమిళనాడుకు వెళ్లారట. ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజి’ అనే పీరియాడికల్ యాక్షన్ డ్రామా చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఇమాన్వీ ఎస్మాయిల్ హీరోయిన్గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈ వారంలో తమిళనాడులో ప్రారంభం కానుందని తెలిసింది. కారైకుడి, మధురై లొకేషన్స్‌లో ప్రభాస్‌తో పాటు ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాల చిత్రీకరణను ప్లాన్ చేశారట. ఇక ఈ సినిమాలో ఓ బ్రాహ్మణ యువకుడి పాత్రలో ప్రభాస్ కనిపిస్తారని, సినిమాలో దేవీపురం అనే బ్యాక్‌డ్రాప్ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. -
డుం.. డుం.. డుం..
ప్రేమకు సరిహద్దులు లేవని నిరూపించింది తమిళనాడుకు చెందిన ఓ యువతి. మనసులు కలవడానికి భాషా, సంస్కృతులు అడ్డంకులు కాబోవని చాటింది. తాను ఇష్టపడిని పరదేశీయుడిని పెద్దల అనుమతితో వివాహం చేసుకుని వార్తల్లో నిలిచింది. వీరి ప్రేమపెళ్లిని అందరూ మెచ్చుకుంటూ, శుభాకాంక్షలు చెబుతున్నారు.సేలం : కోవైకు చెందిన మహిళ నెదర్లాండ్ దేశానికి చెందిన తన ప్రియుడిని కుటుంబ సభ్యుల సమ్మతితో పెళ్లి చేసుకుంది. కోవై జిల్లా పెరియ నాయకన్ పాలయానికి చెందిన ప్రమీలా.. నెదర్లాండ్ ఐటీ సంస్థలో పని చేస్తున్నారు. అక్కడ ఒక టీవీ ఛానల్లో పని చేస్తున్న స్టీన్హీస్ అనే యువకుడి తో ఆమెకు పరిచయం ఏర్పడింది. కొన్ని రోజులకు అది కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిశ్చయించారు. ఆ మేరకు ఇరు కుటుంబీకుల సమ్మతితో ప్రమీలాకు, నెదర్లాండ్ యువకుడికి కోవైలో తమిళ సాంప్రదాయం ప్రకారం వివాహం ఘనంగా జరిగింది. நெதர்லாந்து நாட்டு இளைஞரை காதலித்து தமிழ் பாரம்பரியப்படி தாலி கட்டி கரம் பிடித்த தமிழ் பெண்..#Coimbatore | #Netherland | #marriage | #TamilCulture pic.twitter.com/QPzEn6aPCY— Polimer News (@polimernews) January 20, 2025video credit To Polimer Newsచదవండి: పురుషుల కళాశాలలో చేరిన మొదటి స్త్రీ! -
విజయ భాస్కర్‌కు ఊరట
సాక్షి, చైన్నె: జస్టిస్ ఆర్ముగ స్వామి కమిషన్ నివేదికలో తన పేరు నమోదు విషయంగా మాజీ మంత్రి విజయ భాస్కర్ దాఖలు చేసిన పిటిషన్‌పై మధురై ధర్మాసనం స్పందించింది. ఆరోపణలలో ఆయన పేరును తొలగించే విధంగా సోమవారం ఆదేశాలను న్యాయమూర్తి జారీ చేశారు. వివరాలు.. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం మిస్టరీ నిగ్గు తేల్చేందుకు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ముగ స్వామి నేతృత్వంలో గత ప్రభుత్వం కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిషన్ కొన్ని సంవత్సరాల పాటూ విచారించి 2022లో డీఎంకే ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. ఈ నివేదికలో విజయ భాస్కర్‌పై ఆరోపణలు చేస్తూ కమిషన్ కొన్ని అంశాలను పొందు పరిచినట్టు సమాచారాలు వెలువడ్డాయి. తనను సాక్షిగా విచారించిన కమిషన్, ఆరోపణలలో తనపేరును చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ మఽద్రాసు హైకోర్టు మధురై ధర్మాసనాన్ని విజయ భాస్కర్ ఆశ్రయించారు. 2013 నుంచి 2021 వరకు ప్రజల చేత శాసన సభకు ఎన్నోకో బడిన తాను ఎనిమిదేళ్లుగా ఆరోగ్య మంత్రిగా పనిచేసినట్లు వివరించారు. అయితే ఆర్ముగ స్వామికమిషన్ జయలలిత మరణం విచారణలో తనను ఓ సాక్షిగా పిలిచి విచారించినట్టు పిటిషన్లో పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఆరోపణల వ్యవహారంలో తన పేరు ఉన్నట్టు సమాచారాలు వెలువడ్డాయన్నారు. తనకు ప్రజల్లో మంచి పేరు ఉందని, ఈ సమయంలో ఇలాంటి ఆరోపణలు మచ్చగా మారుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విచారణ వ్యవహరంలో తన పేరును ఆరోపణలలో పేర్కొనడాన్ని అంగీకరించ లేకున్నానని, ఆ కమిషన్ నివేదిక ఆధారంగా చార్జ్ షీట్లో వివరాలను పొందు పరిచే పనిలో ఉన్నారని వివరించారు. ఈ దృష్ట్యా, తన పేరును ఆ నివేదిక నుంచి తొలగించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈపిటిషన్ను న్యాయమూర్తి ఇలం దిరయన్ విచారించారు. వాదనల అనంతరం కమిటీ నివేదికలో ఉన్న విజయ భాస్కర్ పేరును తొలగించే విధంగా ఆదేశాలు ఇచ్చారు.ఉపాధ్యాయుడిపై పోక్సో కేసుతిరువొత్తియూరు: విద్యార్థినులపై లైంగికంగా వేధింపులకు పాల్పడిన ఉపాధ్యాయుడిని పోలీసులు పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. వివరాలు.. తిరుచ్చి జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థునులకు అదే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న అయ్యప్పన్ (52) లైంగిక వేధింపులు ఇచ్చినట్లు తెలిసింది. దీనిపై ఫిర్యాదు మేరకు జియాపురం పోలీస్ విచారణ చేపట్టారు. ఇందులో విద్యార్థునులకు అయ్యప్పన్ లైంగికంగా వేధింపులు ఇచ్చినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఉపాధ్యాయుడు అయ్యప్పన్‌ను పోక్సో చట్టం కింద పోలీసులు అరెస్టు చేశారు.ఐసీఎఫ్‌ను సందర్శించిన సంజయ్‌కుమార్ పంకజ్కొరుక్కుపేట: ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)ను రైల్వే బోర్డు (ప్రొడెక్షన్ యూనిట్) అడిషన ల్ మెంబర్ సంజయ్‌కుమార్ పంకజ్ సోమవారం సందర్శించారు. ఐసీఎఫ్ జనరల్ మేనేజర్ యు.సుబ్బారావు, ఇతర అధికారులతో కలసి ఐసీఎఫ్ వద్ద జరుగుతున్న వివిధ పనులు, ప్రాజెక్టుల గురించి, అమృత్ భారత్ కోచ్‌లు, విస్టాడోమ్ డైనింగ్ కార్, హైడ్రోజన్ రైలు, ఉత్పత్తిలో ఉన్న వివిధ ఉత్పత్తులను గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే అడ్వాన్సుడ్ వెల్డింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, బేసిక్ ట్రైనింగ్ సెంటర్‌ను ఆయన పరిశీలించారు. -
విమానాశ్రయాలలో భద్రత పెంపు
సాక్షి, చైన్నె: రాష్ట్రంలోని చైన్నెతోపాటూ ఇతర నగరాలలో ఉన్న విమానాశ్రయాలలో భద్రతను ఐదు అంచెలకు పెంచారు. విమానాశ్రయాలు, పరిసరాలలో 30వ తేదీ వరకు పలు రకాల నిబంధనలతో ఆంక్షలు విధించారు. ఈనెల 26వ తేదీన రిపబ్లిక్ డే వేడుకలను జరుపుకునేందుకు దేశం సిద్ధమవుతోంది. రాష్ట్రంలోనే వేడుకల ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పరిస్థిలలో రాష్ట్రవ్యాప్తంగా భద్రత ఏర్పాట్లపై పోలీసుల ఽఅధికారులు దృష్టి పెట్టారు. అదే సమయంలో చైన్నెలోని అంతర్జాతీయ విమానాశ్రయం, కోయంబత్తూరు, తిరుచ్చి, మదురై విమానాశ్రయాలలనూ భద్రతను కట్టుదిట్టం చేశారు.తూత్తుకుడి, సేలంలోని స్వదేశీ విమానాశ్రయాలను భద్రతా వలయంలోకి తీసుకొచ్చారు. విమానాశ్రయాలలో సాధారణంగా ఉన్న భద్రతతో పాటూ అదనంగా ఐదు అంచెల భద్రతను పెంచారు. ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీలు చేసినానంతరం అనుమతిస్తున్నారు. అలాగే చైన్నె, తిరుచ్చి, మదురై, కోయంబత్తూరు, తూత్తుకుడి, తిరునల్వేలి, విల్లుపురం తదిత ర రైల్వే స్టేషన్లను నిఘాపెంచారు. విమానశ్రయం పరిసరాలలో కేంద్ర బలగాలు, వెలుపల రాష్ట్ర పోలీసులు భద్రతా విధులలో ఉన్నారు. సందర్శకులకు ఆంక్షలు విధించారు. విమానాశ్రయం రన్ వే మార్గం జీఎస్టీ రోడ్డుకు ఆనుకుని ఉండటంతో ఈ మార్గంలో ప్రత్యేక భద్రత చర్యలు తీసుకున్నారు. అలాగే, రైల్వే స్టేషన్ల వద్ద సైతం భద్రతను పెంచారు.రిహార్సల్స్..మెరీనా తీరంలో రిపబ్లిక్ డే వేడుకల కసరత్తులు మొదలయ్యాయి. కామరాజర్ సాలైలో సోమవారం నుంచి రిహార్సల్స్ ప్రారంభమయ్యాయి. త్రివిధ దళాలు, ఎన్సీసీ క్యాడెట్లు, పోలీసు శాఖ, వివిధ కళాశాలల విద్యార్థులు రిహార్సల్స్ రూపంలో ఉదయాన్నే తమ ప్రదర్శనలు చేశారు. పోలీసులు, త్రివిధ దళాల కవాతులు అబ్బుర పరిచాయి. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ఈసారి వేడుకలలో పలు రాష్ట్రాల సంస్కృతులను చాటే విధంగా ప్రత్యేక ప్రదర్శనలు జరగనున్నాయి. ఈ రిహార్సల్స్ జరిగే సమయాలలో కామరాజర్ సాలై , పరిసరాలలో ఉదయాన్నే ట్రాఫిక్ మార్పులు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు, వాహనదారులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. -
పురుషుల కళాశాలలో చేరిన మొదటి స్త్రీ!
సమాజం దూరం పెట్టిన దేవదాసీ కుటుంబంలో పుట్టిన ముత్తులక్ష్మి రెడ్డి (muthulakshmi reddy) చిన్నప్పటి నుంచి ఆ వివక్షను చూస్తూ పోరాటశీలిగా మారారు. ఆమె ఎన్నో రకాలుగా తొలి యోధ: పురుషుల కళాశాలలో చేరిన మొదటి స్త్రీ, మద్రాసు ప్రభుత్వ వైద్యశాలలో మొదటి సర్జన్, మదరాసు కార్పొరేషన్లో మొదటి మహిళా కౌన్సిలర్, మద్రాసు (Madras) లెజిస్లేటివ్ కౌన్సిల్‌కి మొదటి ఉపాధ్యక్షురాలు; మద్రాసులో మొట్టమొదటి పిల్లల ఆసుపత్రినీ, దక్షిణాదిలో తొలి క్యాన్సర్ ఆసుపత్రినీ ప్రారంభించారు. ఆమె సేవలకు గాను 1956లో పద్మభూషణ్(Padma Bhushan) పురస్కారాన్ని అందుకున్నారు.1886 జూలై 30న ముత్తులక్ష్మి తమిళ ప్రాంతమైన పుదుక్కోటలో జన్మించారు. తండ్రి మహారాజా కళాశాలలో ప్రధానోపాధ్యాయులు కాగా, తల్లి దేవదాసీ నేపథ్యం గల మహిళ. బాలికలకు తమిళంలో మాత్రమే బోధించే పాఠశాలను కాదని, బాలుర పాఠశాలలో పోరాడి ప్రవేశం పొందింది చిన్నతనంలోనే! 1902లో వందమంది మెట్రిక్యులేషన్ పరీక్షకు హాజరవ్వగా కేవలం పది మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. అందులో ఒకే ఒక బాలిక ముత్తులక్ష్మి!కూతురి మనోగత మెరిగిన తండ్రి, పురుషులను మాత్రమే చేర్చుకునే మహారాజా కళాశాలలో దరఖాస్తు చేసి పుదుక్కోట రాజు మార్తాండ భైరవ తొండమాన్ సాయంతో ప్రవేశం సాధించారు. చుట్టూ మూసి ఉన్న కారులో ఆమె ప్రయాణించేది. మగపిల్లలకు కనిపించకుండా, ఉపాధ్యాయులకు మాత్రమే కనిపించేలా ప్రత్యేక ఏర్పాటు చేసి ఆమెను తరగతి గదిలో కూర్చోబెట్టేవారు. ఆ తర్వాత మహారాజా ఆర్థిక సాయంతో మద్రాసు వైద్యకళాశాలలో చేరడానికి 1907లో తండ్రితో కలిసి మద్రాసు వెళ్లారు. ‘ట్రిప్లికేన్ దాదా’గా ప్రాచుర్యం పొందిన డాక్టర్ ఎంసీ నంజుండరావు ఈ తండ్రీ కూతుళ్ళకు పరిచయమయ్యారు. ఆ ఇంటిలోనే సరోజినీనాయుడి పరిచయమూ కలిగింది. అలాగే మహాత్మా గాంధీ, అనిబిసెంట్ ప్రభావాలకీ లోనయ్యారు. మద్రాసు మెడికల్ కళాశాలలో ముత్తులక్ష్మి తొలి మహిళా విద్యార్థి కనుక రకరకాల వివక్ష ఉండేది. అయినా 1912లో బ్యాచిలర్ మెడిసిన్ (ఎంబీ) డిగ్రీని పొందారు. అదే ఏడాది ఎగ్మూర్ లోని గవర్నమెంట్ చిల్డ్రన్ హాస్పిటల్లో హౌస్ సర్జన్‌గా ఉద్యోగం జీవితం ప్రారంభించారు.పురుషాధిక్య సమాజాన్ని బాగా చవిచూసిన ముత్తులక్ష్మి వివాహం లేకుండా ఒంటరిగా జీవించాలనుకున్నారు. అయితే నమ్మకం కలిగించిన డాక్టర్ డీటీ సుందర రెడ్డిని 1914లో తన 28వ ఏట వివాహం చేసుకున్నారు. ఆమె ప్రైవేటు ప్రాక్టీస్‌తో పాటు, అవసరమైన ఇతర ఆసుపత్రులకు వెళ్లి వైద్యం చేసేవారు. బాలికల రక్షణ, విద్య; సురక్షితమైన ప్రసవం, మంచి ఆహారం, మహిళలకు ఉన్నత విద్య, సాంఘిక సంస్కరణ వంటివి ఆమెకు ఇష్టమైన విషయాలు. బాల్యవివాహాల నిర్మూలనకు పెద్ద ఎత్తున కృషి చేశారు. చదవండి: బామ్మకు స్వీట్ సర్ప్రైజ్ : 20 లక్షలకు పైగా వ్యూస్1926–30 మధ్యకాలంలో ఆమె విధాన సభకు ఉపాధ్యక్షులుగా సేవలందించారు. బాలికల వివాహ వయస్సు 16 సంవత్సరాలుగా ఉండాలని శాసన సభలో చర్చించడమే కాకుండా, 1928లో మహాత్మాగాంధీకి మూడు పేజీల ఉత్తరం రాశారు. దీనితో ఏకీభవిస్తూ గాంధీజీ తన ‘యంగ్ ఇండియా’ పత్రికలో వ్యాసం రాశారు. దేవదాసీ వ్యవస్థ అంతమొందాలని చట్టసభలలో పోరాడారు. ఈ పోరాటంలో తారసపడిన ప్రత్యర్థుల్లో కామరాజ్‌కు రాజకీయ గురువైన సత్యమూర్తి ఒకరు.చదవండి: ట్రంప్ విందుకి కాంచీపురం చీరకట్టులో నీతా అంబానీబాలికలకు, మహిళలకు 1931లో అనాథ శరణాలయం స్థాపించారు. అదే ‘అవ్వై హోమ్ అండ్ ఆర్ఫనేజ్’. తనకెంతో తోడ్పాటుగా ఉన్న చెల్లెలు 1923లో క్యాన్సర్‌తో మరణించడం ముత్తులక్ష్మికి పెద్ద విఘాతం. క్యాన్సర్ చికిత్సాలయం కోసం ఆమె ఆనాడే కంకణం కట్టుకున్నారు. తన కారును అమ్మి వేసి క్యాన్సర్ వ్యాధి అధ్యయనం కోసం కుమారుణ్ణి అమెరికా పంపారు. ఎంతోమంది నుంచి విరా ళాలు సేకరించి 1952లో దక్షిణ భారతదేశంలోనే తొలి క్యాన్సర్ ఆసుపత్రిని అడయార్‌లో అప్పటి ప్రధాని నెహ్రూ చేతుల మీదుగా ప్రారంభించారు. 1954 నుంచి సేవలు ప్రారంభించిన ఈ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ నేటికీ గొప్పగా సేవలందిస్తోంది. 1968 జూలై 22న కన్నుమూసిన ముత్తు లక్ష్మి సేవలు చిరస్మరణీయం.-డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ ఆకాశవాణి మాజీ ఉన్నతాధికారి -
రోడ్డుపై ఆంధ్ర జంట సిగపట్లు
తిరువళ్లూరు: భార్యను వదిలేసి మరో మహిళతో షికార్లు కొట్టడమే కాకుండా కోర్టుకు సైతం సంబంధిత మహిళ రావడంతో ఆగ్రహించిన భార్య తన భర్తతో పాటూ ఆ మహిళపై కూడా దాడికి యత్నించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. నడిరోడ్డుపై ఆంధ్ర దంపతుల సిగపట్టును చూడడానికి భారీగా జనం గుమికూడడంతో ట్రాఫిక్‌కు సైతం తీవ్ర అంతరాయం ఏర్పడింది. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా తిరువేళాంగాడు యూనియన్ వరదాపురం గ్రామానికి చెందిన సత్యకు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ప్రాంతానికి చెందిన మునీంద్రతో పదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి పిల్లలు సైతం ఉన్నారు. ఈక్రమంలో మునీంద్ర వ్యాపారం పెట్టడానికి సత్య తన 40 సవర్ల బంగారు నగలు, బ్యాంకులో తన పేరుపై పది లక్షల రుణాన్ని సైతం తీసి భర్త వ్యాపారం కోసం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ నగదుతో శ్రీకాళహస్తి ప్రాంతంలో మునీంద్ర సత్య కోళ్లపామ్ను ఏర్పాటు చేశాడు. కొన్నాళ్ల తరువాత బ్యాంకులో చెల్లించాల్సి వాయిదాను మునీంద్ర సరిగ్గా చెల్లించకపోవడంతో పాటు వ్యాపారం బాగా పుంజుకున్న క్రమంలో వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఇదే విషయంపై భార్యభర్త మధ్య వివాదం చెలరేగింది. మునీంద్ర విడాకులు కావాలని స్థానిక కోర్టుకు వెళ్లగా, తనకు విడాకులతో పాటూ నష్టపరిహారం, నగలు తిరిగి ఇప్పించాలని, బ్యాంకులో పొందిన రుణాన్ని సక్రమంగా తిరిగి చెల్లించేలా ఆదేశించాలని కోరుతూ సత్య తిరువళ్లూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై తిరువళ్లూరు కోర్టులో విచారణ సాగుతున్న నేపద్యంలో శనివారం మునీంద్ర, సత్య తదితర ఇద్దరు కోర్టుకు హాజరయ్యారు. వాయిదా ముగిసిన తరువాత ఇంటికి వెళ్లేక్రమంలో మునీంద్ర తనతో పాటు వచ్చిన మహిళతో ఆటోలో వెళ్లడాన్ని సత్య గుర్తించి ఆగ్రహానికి గురైంది. వెంటనే ఆటోలో భర్తను వెంబడించి ఇద్దరిపై దాడికి దిగింది. తన కుటుంబం నడిరోడ్డున పడడానికి కారణం నీవేనంటూ భర్తతో పాటు వచ్చిన మహిళపై సైతం దాడి చేసింది. దీంతో ఆటోలో వున్న మహిళ కిందికి దూకి పరుగులు పెట్టింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకుని సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు ఇద్దరిని పోలీసు స్టేషన్‌కు తరలించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. కాగా ఈ వ్యవహారాన్ని కొందరు వీడియో తీసి ఫేస్బుక్లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారిన క్రమంలో శనివారం రాత్రి పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది. -
మహా కుంభమేళా.. ‘కొబ్బరి’ ఆనంద హేల
సాక్షి, అమలాపురం/అంబాజీపేట: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజలు తరలివస్తున్న మహా కుంభమేళా (Maha Kubh Mela) గోదావరి జిల్లాల్లోని కొబ్బరి మార్కెట్‌కు (Coconut Market) పెద్ద వరమే అయింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్(Prayagraj) కేంద్రంగా జరుగుతున్న ఈ మహా కుంభమేళాకు వస్తున్న భక్తులు నదీ మాతకు అర్పించేందుకు కురిడీ కొబ్బరిని విరివిగా వినియోగిస్తుండడంతో దీనికి డిమాండ్ పెరిగి ధర రికార్డు స్థాయిలో పెరిగింది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఉత్పత్తయ్యే కురిడీ కొబ్బరి ఉత్తరాది రాష్ట్రాలకూ ఎగుమతి అవుతుంది. మహా కుంభమేళా కారణంగా ఎగుమతులు విపరీతంగా పెరిగాయి. దీంతో ఇప్పటివరకు అంతంతమాత్రంగా ఉన్న ఈ కురిడీ రకం ధర అనూహ్యంగా పెరిగింది. కొబ్బరి మార్కెట్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అంబాజీపేట (Ambajipeta) కొబ్బరి మార్కెట్లో కురిడీ కొబ్బరి వెయ్యి కాయల ధర రూ.17 వేల నుంచి రూ.20 వేల వరకూ ఉంది. పాతకాయలో గండేరా రకం వెయ్యి కాయల ధర రూ.20 వేలు వరకు పలుకుతోంది. దీనిలో గటగట రకం రూ.17,500 వరకూ ఉండగా, కొత్త కాయలో గండేరా రకం రూ.19 వేలు, గటగటా రకం రూ.16 వేలుగా ఉంది. కురిడీ కొబ్బరి మార్కెట్ చరిత్రలో గండేరా రకం వెయ్యి కాయలకు రూ.20 వేల ధర పలకడం ఇదే తొలిసారి. 2016లో వచ్చిన రూ.18 వేలు మాత్రమే ఇప్పటి వరకూ గరిష్ట ధరగా ఉంది. ఈ రికార్డుకు ఇప్పుడు బ్రేక్ పడింది.ఉత్తరాది రాష్ట్రాల్లో నదీమ తల్లికి భక్తులు నేరుగా కొబ్బరి కాయలు అర్పిస్తూ ఉంటారు. ఇప్పుడు మహాకుంభమేళా కారణంగా కురిడీ కొబ్బరికి డిమాండ్ పెరిగింది. దీనికితోడు కురిడీ కొబ్బరి అధికంగా తయారయ్యే తమిళనాడు, కేరళలో సైతం దీని లభ్యత తగ్గింది. ఈ రెండు కారణాలతో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి కురిడీ ఎగుమతి పెరిగింది. రోజుకు రూ.8 లక్షలు విలువ చేసే కురిడీ కొబ్బరి 20కి పైగా లారీల్లో ఎగుమతి అవుతోందని అంచనా. సాధారణ రోజుల్లో జరిగే ఎగుమతులకు కుంభమేళా ఎగుమతులు కూడా తోడవడం కురిడీ ధర పెరుగుదలకు కారణమైందని మార్కెట్‌వర్గాలు చెబుతున్నాయి.ఎనిమిదేళ్ల తరువాత మంచి ధర2016లో గండేరా రకానికి రూ.18 వేల ధర వచ్చింది. ఎనిమిదేళ్ల తరువాత కురిడీకి రూ.20 వేలు వచ్చింది. తమిళనాడు నుంచి ఉత్తరాదికి కురిడీ ఎగుమతులు తగ్గడం, కుంభమేళా కారణంగా డిమాండ్ వచ్చింది. గతం కన్నా మన ప్రాంతం నుంచి కూడా ఎగుమతులు తగ్గాయి. కానీ ధర పెరగడం వల్ల కురిడీకి మార్కెట్లో ఊహించని ధర వచ్చింది.– అప్పన శ్యామ్, కురిడీ వ్యాపారి, అంబాజీపేట -
చదువుకున్న సముద్రపు చేప
బావుల్లో ఉండిపోతారు కొందరు. తెలిసిన కుంటల్లోనే మునకలేస్తారు కొందరు.మహా అయితే చెరువు గురించి ఆలోచిస్తారు కొందరు.కాని అతి కొందరు మాత్రమేసముద్రాన్ని జయించాలనుకుంటారు. వృత్తిరీత్యా బెస్త కుటుంబంలో పుట్టిన సుభిక్ష ఇంగ్లిష్ లిటరేచర్ చదివి నగరంలో ఉద్యోగం చేసినాఎందుకు తన వృత్తిలోనే రాణించకూడదు అని ఆలోచించింది. అంతే... తానే చేపల వేటలో దిగి ‘సీఫుడ్ అంట్రప్రెన్యూర్’గా దేశాన్ని ఆకర్షిస్తోంది.సముద్రానికి కెరటాలతో అదిలించడం తెలుసు. వలల కొద్ధి చేపల్ని నింపి సిరులను అందించడం కూడా తెలుసు. ‘సముద్రం తల్లిలాంటిదే. మమకారం, కోపం రెండూ ఉంటాయి. భయభక్తులతో ఉంటే ఏది అడిగినా కాదనకుండా ఇస్తుంది’ అంటుంది సుభిక్ష. ఈ 23 ఏళ్ల అమ్మాయి తమిళనాడులోని తూత్తుకూడి సమీపంలో ఉన్న పెరియతలై అనే బెస్తపల్లె నుంచి ఇవాళ దేశాన్ని ఆకర్షిస్తోంది. మగవాళ్లకే పరిమితమైన చేపలు పట్టే విద్యలో ఆ అమ్మాయి రాణించడమే కాదు తన చదువును ఆ విద్యకు జత చేసి ఆదాయ మార్గాలను నిర్మిస్తోంది.ఒడ్డు నుంచి సముద్రానికి...మగవాళ్లు చేపలు పడతారు. వాటిని స్త్రీలు గట్టున కూచుని అమ్ముతారు. ఇదే ఆనవాయితీ. తరాలుగా ఇదే సాగుతోంది. సుభిక్ష తండ్రి కుమార్, అన్న లియాండర్ కూడా వాళ్లింట్లో సముద్రం మీద వేటకు వెళ్లి చేపలు తెస్తారు. తల్లి వాటి అమ్మకంలో సాయం చేస్తుంది. ‘నేనెందుకు చేపలు పట్టడానికి మీతో రాకూడదు?’ అని అడిగింది సుభిక్ష ఒకరోజు తండ్రిని. తండ్రి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే సుభిక్ష ఇంగ్లిష్ లిటరేచర్ చదివింది. ప్రయివేట్ బ్యాంకులో ఉద్యోగం కూడా చేస్తోంది. ఆడపిల్ల సౌకర్యంగా బతకాలంటే ఆమెలాంటి మార్గమే అందరూ సూచిస్తారు. ‘సముద్రంలో ఎంతో ఉంది. టెన్ టు ఫైవ్ జాబ్‌లో ఏముంది? నన్నొక ప్రయత్నం చేయనివ్వు నాన్నా’ అంది సుభిక్ష. అప్పటికే ఆ అమ్మాయికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉంది. మత్స్యకారుల జీవనాన్ని సరదాగా వీడియోల్లో చూపేది సుభిక్ష. ఇప్పుడు ఆ అమ్మాయి సిసలైన బెస్త జీవనంలోకి దిగింది.సముద్రంతో చెలగాటం...‘కోరమాండల్ తీరంలో సముద్రంతో దిగడం అంటేప్రాణాలతో చెలగాటమే’ అన్నాడు సుభిక్ష తండ్రి చివరకు ఒప్పుకుంటూ. మొదటిసారి తండ్రి, అన్నతో కలిసి ఫైబర్ బోట్లో చేపల వేటకు సుభిక్ష వెళ్లిన అనుభవం గగుర్పాటుకు గురి చేసేదే. ‘ఆకాశంలో చుక్కలు తప్ప వేరే ఏమీ కనిపించని చీకటి. పడవను కుదురుగా ఉంచకుండా ఎత్తెత్తి వేసే సముద్రం. మేము దాదాపు 20 కిలోమీటర్ల లోపలికి వెళ్లాం. అక్కడ ఏమైనా జరగొచ్చు. కాని ఆ సమయంలో చేపల వేటకు వెళ్లి వల విసరడం గొప్ప అనుభవం’ అంది సుభిక్ష. ఆ రోజు నుంచి నేటి వరకు అనేకసార్లు రాత్రి 1 గంటకు వేటకు వెళ్లి ఉదయం 10 గంటలకు తిరిగి రావడం సుభిక్షకు అలవాటుగా మారింది. ‘చేపలు పట్టడానికి ఏయే వలలు వాడాలి... ఏ వల వేస్తే ఏ రకం చేపలు పడతాయనేది తెలుసుకున్నాను. ఇంకా పల్లెపల్లెకు తిరిగి చేపల వేటలో మా పూర్వికుల అనుభవం తెలుసుకుంటున్నాను’ అంటుంది సుభిక్ష. ఆమె తన వేటను మొదలెట్టాక అదంతా వీడియోలు చేసేసరికి ప్రపంచానికి తెలిసిపోయింది.పెరిగిన వ్యాపారంచేపలు పడితే టోకున ఎక్స్‌పోర్టర్లకు అమ్మడం లేదా లోకల్‌గా అమ్మడం లేదా ఎండబెట్టి అమ్మడం తెలిసిన సంప్రదాయ పద్ధతికి భిన్నంగా సుభిక్ష తమ చేపలను ఊరగాయలుగా, పచ్చళ్లు, ఎండు చేపలుగా మార్చి వాటిని తన లేబుల్ కింద అమ్మకానికి పెట్టింది. సోషల్ మీడియా వల్ల వాటిని దేశ విదేశాల్లో కొంటున్నారు. అలా మెల్లగా సుభిక్ష ‘సీఫుడ్ అంట్రప్రెన్యుర్’గా మారింది. తండ్రి, అన్న ఈ పరిణామాలను స్వాగతిస్తున్నారు. ఊళ్లో అందరూ సుభిక్షను మెచ్చుకోలుతో చూస్తున్నారు. ‘చేపలంటేప్రొటీన్తో నిండిన రిచ్‌ఫుడ్. ప్రజలకు ఆ ఫుడ్‌ను అందించడానికి బెస్తలు ఎంత కష్టం చేస్తారో... ప్రమాదంలోకి వెళతారో లోకానికి చూపడమే నా లక్ష్యం. అలాగే మత్స్యకార స్త్రీలను మరింత ముందుకు తీసుకు వెళ్లడం కూడా’ అంటోంది సుభిక్ష. ఒకవైపు ఈ పని చేస్తూనే మరోవైపు మోడల్‌గా కూడా పని చేస్తోంది. సంప్రదాయ విద్యలని గౌరవిస్తూ ఆధునిక ధోరణులను పుణికి పుచ్చుకుంటూ ముందుకు సాగితే విజయం తథ్యం అని నిరూపించింది సుభిక్ష. -
కేరళ, తమిళనాడు తీరాలకు కల్లక్కడల్ ముప్పు
-
కేరళ, తమిళనాడుకు కల్లక్కడల్ ముప్పు
-
అభివృద్ధిని గవర్నర్ జీర్ణించుకోలేకున్నారు
చెన్నై: తమిళనాడు అభివృద్ధిని గవర్నర్ ఆర్ఎన్ రవి జీర్ణించుకోలేకపోతున్నారని సీఎం ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు. గవర్నర్‌గా ఆయన బాధ్యతలు చేపట్టాక తమిళనాడు అసెంబ్లీ కొన్ని విడ్డూరమైన ఘటనలకు వేదికగా మారిందన్నారు. శనివారం సీఎం స్టాలిన్ అసెంబ్లీలో మాట్లాడారు. జాతీయ గీతం బదులు తమిళనాడు రాష్ట్ర గీతాన్ని వినిపించినందుకు నిరసనగా గత వారం అసెంబ్లీలో ప్రసంగించకుండా గవర్నర్ వాకౌట్ చేయడాన్ని చిన్న పిల్లల చేష్టగా అభివర్ణించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 176 ప్రకారం అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ ప్రసంగించాల్సి ఉంటుందన్నారు. అయితే, ఆయన ఉద్దేశపూర్వకంగానే నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపించారు.2022లో తామిచి్చన ప్రసంగాన్ని గవర్నర్ రవి యథాతథంగా చదివారని, మూడేళ్ల నుంచి సంబంధం లేని సాకులు చూపుతూ తప్పించుకుంటున్నారని విమర్శించారు. అసెంబ్లీని, ప్రజల మనోభావాలను గౌరవించకుండా గవర్నర్ రాజకీయ ఉద్దేశాలతో వ్యవహరిస్తున్నారన్నారు. విధులను నిర్వర్తించని, తమిళ గీతాన్ని గౌరవించని గవర్నర్ తీరుపై సభ నిరసిస్తుందని తెలిపారు. సభలో ఇటువంటివి పునరావృతం కారాదని స్టాలిన్ పేర్కొన్నారు. -
పెరియార్‌కు వ్యతిరేకంగా సీమాన్ వ్యాఖ్యలు
సాక్షి, చైన్నె: ద్రావిడ సిద్ధంతకర్త పెరియార్‌కు వ్యతిరేకంగా నామ్ తమిళర్ కట్చి కన్వీనర్ సీమాన్ చేసిన వ్యాఖ్యలు రచ్చకెక్కాయి. ఆయన వ్యాఖ్యలను తందై పెరియార్ ద్రావిడ ఇయక్కం వర్గాలు సీమాన్ ఇంటిని ముట్టడించారు. కారు అద్దాలను పగుల కొట్టారు. వివరాలు.. నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో సమస్యలను కొని తెచ్చుకుంటున్న విషయం తెలిసిందే. అయితే, ఏమాత్రం తగ్గకుండా ఆయన తన దూకుడును ప్రదర్శిస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కడలూరులో జరిగిన కార్యక్రమంలో ద్రావిడ సిద్ధాంతకర్త పెరియార్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన ఈ సమాజానికి ఏమి చేశారోనని ప్రశ్నిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిని పెరియార్ మద్దతుదారులు, తందై పెరియర్ ద్రావిడ ఇయక్కం వర్గాలు తీవ్రంగా పరిగణించాయి. సీమాన్‌కు వ్యతిరేకంగా పలు చోట్ల ఆందోళనలకు దిగాయి. చైన్నె తిరువాన్మియూరులోని ఆయన నివాసాన్ని ఆ ఇయక్కం ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణన్ నేతృత్వంలో కార్యకర్తలు ముట్టడించారు. ఆయన ఇంటి వద్ద హంగామా చేయడమే కాకుండా కారు అద్దాలను పగుల కొట్టారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు నిరసన కారులను బలవంతంగా అరెస్టు చేశారు. గురువారం సీమాన్ పుదుచ్చేరిలో పర్యటించగా ఆయనకు వ్యతిరేకంగా అక్కడ కూడా నిరసనలు చోటు చేసుకున్నాయి. అయితే తన వ్యాఖ్యల విషయంలో సీమాన్ ఏమాత్రం తగ్గలేదు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌తో పెరియార్‌ను పోల్చవద్దని, వల్లలార్ తర్వాతే పెరియార్ అంటూ మరింతగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ పరిణామాలు మున్ముందు ఎలాంటి పరిస్థితులకు దారి తీయనున్నాయో అన్న ఉత్కంఠ తప్పడం లేదు. -
విజయ్ హజారే టోర్నీ బరిలో ప్రసిధ్ కృష్ణ, పడిక్కల్, సుందర్
బెంగళూరు: ‘అంతర్జాతీయ మ్యాచ్‌లు లేకుంటే ప్రతి ఒక్కరూ దేశవాళీల్లో ఆడాల్సిందే’ అని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అన్న మాటలను భారత ఆటగాళ్లు సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. ప్రతిష్టాత్మక ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో పరాజయం అనంతరం స్వదేశానికి తిరిగి వచ్చిన భారత ఆటగాళ్లలో పలువురు విజయ్ హజారే ట్రోఫీ వన్డే టోర్నమెంట్ నాకౌట్ మ్యాచ్‌ల్లో పాల్గొననున్నారు. ఈ టోర్నీలో భాగంగా గురువారం జరుగనున్న ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో రాజస్తాన్‌తో తమిళనాడు, హరియాణాతో బెంగాల్ తలపడనున్నాయి. వీటితో పాటు ఇక మీద జరగనున్న మ్యాచ్‌ల్లో పలువురు భారత స్టార్ ఆటగాళ్లు పాల్గొననున్నారు. ఇటీవల ఆ్రస్టేలియాలో పర్యటించిన ప్రసిధ్ కృష్ణ, అభిమన్యు ఈశ్వరన్, దేవదత్ పడిక్కల్, సుందర్ విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లు ఆడనున్నారు. ఆ్రస్టేలియాతో సిరీస్‌లో ఐదు మ్యాచ్‌ల్లోనూ ఆడిన కేఎల్ రాహుల్ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోనున్నాడు. అయితే ఆ తర్వాత ఈ నెలాఖరున తిరిగి ప్రారంభం కానున్న రంజీ ట్రోఫీ రెండో దశ మ్యాచ్‌ల్లో రాహుల్ పాల్గొనే అవకాశం ఉంది. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన స్టార్ ఆటగాళ్లు రేపటి నుంచి వారివారి రాష్ట్రాల జట్లతో కలవనున్నారు. తమిళనాడు జట్టు విజయ్ హజారే ట్రోఫీ సెమీఫైనల్‌కు చేరితే స్పిన్ ఆల్‌రౌండర్ సుందర్ బరిలోకి దిగనున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో మూడు మ్యాచ్‌లాడిన సుందర్ 114 పరుగులు చేసి 3 వికెట్లు పడగొట్టాడు. ఇక సిడ్నీ వేదికగా కంగారూలతో జరిగిన చివరి టెస్టులో మెరుగైన ప్రదర్శన చేసిన ప్రసిధ్ కృష్ణ కర్ణాటక జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.రంజీ ట్రోఫీలో నితీశ్ రెడ్డి...‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో అద్వితీయ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకట్టుకున్న ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి... రంజీ ట్రోఫీ రెండో దశ మ్యాచ్‌లు ఆడనున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో ఆంధ్ర జట్టు నాకౌట్ దశకు అర్హత సాధించలేకపోవడంతో అతడికి వన్డే టోర్నీలో ఆడే అవకాశం లేకుండా పోయింది. ఇక ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న రంజీ ట్రోఫీ రెండో దశలో పోటీల్లో ఆంధ్ర జట్టు మరో రెండు మ్యాచ్‌లు ఆడనుంది. వాటిలో నితీశ్ కుమార్ రెడ్డి పాల్గొననున్నాడు. మెల్బోర్న్ టెస్టులో ప్రతికూల పరిస్థితుల మధ్య చక్కటి సెంచరీతో సత్తా చాటిన నితీశ్ రెడ్డి... ఈ నెల 23 నుంచి పుదుచ్చేరితో, 30 నుంచి రాజస్తాన్‌తో ఆంధ్ర జట్టు ఆడే మ్యాచ్‌ల్లో బరిలోకి దిగనున్నాడు. గ్రూప్ ‘బి’లో భాగంగా ఆంధ్ర జట్టు ఆడిన 5 మ్యాచ్‌ల్లో మూడింట ఓడి, మరో రెండు మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకొని 4 పాయింట్లతో పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. -
రేపటి కోసం.. ఢిల్లీ, ముంబైలా కాదు రాజపాళ్యంలా..!
నా కోసం.. నా కుటుంబం.. అని ఆలోచనలో చేసే మనుషులు ఉన్న ఈ కాలంలో.. మన కోసం.. మన ఊరి కోసం.. రేపటి తరాల కోసం మంచి వాతావరణాన్ని అందించాలని ప్రతినబూనింది ఇక్కడో ఊరు. ఈ క్రమంలో ఆకట్టుకునే ప్రయత్నాలతో ముందుకు పోతోంది.రాజపాళ్యం.. తమిళనాడులో పశ్చిమ కనుమల్లో ఉండే ఓ పట్టణం. ఇక్కడ జనాభా రెండు లక్షలకు పైనే. మామిడి పండ్లకు, మరీ ముఖ్యంగా నాటు కుక్కలకు ఫేమస్ ఈ ప్రాంతం. అయితే ఈ మధ్య ‘2040 మిషన్’తో ఈ ప్రాంతం వార్తల్లోకి ఎక్కింది. అప్పటికల్లా కర్బన ఉద్గారాలను శూన్యస్థాయికి(zero carbon city) తీసుకొచ్చే వ్యూహాలు అమలు చేస్తోంది.కార్బన్ న్యూట్రల్ బై 2040 కార్యక్రమం కోసం అధికారులు నిర్వహించిన అవగాహన కార్యక్రమాలు సత్పలితాలను ఇస్తున్నాయి. అక్కడి జనాలు సోలార్ ఎనర్జీకి క్రమక్రమంగా అలవాటు పడుతున్నారు. పవన్ విద్యుత్‌కు పెద్ద పీట వేసే ప్రయత్నాల్లో అక్కడి అధికార యంత్రాంగం ఇప్పటికే తలమునకలైంది. పునరుత్పాదక విద్యుత్ కోసం పరిశ్రమలను ప్రోత్సహించాలని, అలాగే సీఎన్జీ బయో ప్లాంట్లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది.2021లో రాజపాళ్యం నుంచి 7 లక్షల టన్నుల కర్భన ఉద్గారాలు వెలువడ్డాయి. వాటిని జీరోకి తేవాలన్నదే మిషన్ 2040 ఉద్దేశం.పర్యావరణ ప్రయోజనాలుకార్బన్ ఉద్గారాలు తగ్గుముఖం పడతాయిగాలి నాణ్యత పెరుగుతుందిపచ్చదనం విస్తరిస్తుందిజల వనరులు సంరక్షణఆర్థిక ప్రయోజనాలుపునరుత్పాదకతో.. ఖర్చులు తగ్గుతాయిఉపాధి కల్పన, ఉద్యోగాలు దొరుకుతాయిRajapalayam leads small town India 🇮🇳 towards green future.The beautiful city of Rajapalayam in Tamil Nadu has developed a masterplan for a zero carbon city. It will inspire cities across India and the globe.Rajapalayam (200 000 inhabitants) plans to source enegy from solar,… pic.twitter.com/7yujcIimP5— Erik Solheim (@ErikSolheim) January 6, 2025సామాజిక లాభాలుప్రజారోగ్యంఆయుష్షు పెరిగే అవకాశంకమ్యూనిటీ ఎంగేజ్మెంట్అలాగే.. ప్రయాణాల కోసం సంప్రదాయ ఇంధనవనరుల మీద కాకుండా ఈ-బస్సులు, ఈ-వాహనాలను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు.. మొక్కల పెంపకంతో పాటు జలవనరులు కాలుష్యం బారినపడకుండా పరిరక్షించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆఖరికి.. పండుగలకు, ఇతర కార్యాక్రమాలకు ప్లాస్టిక్‌ను దూరంగా ఉంచుతూ వస్తున్నారు.కేవలం ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు మాత్రమే కాదు.. భవిష్యత్ తరాల కోసం పచ్చటి ప్రకృతిని అందిద్దాం అనే నినాదానికి అక్కడి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ఆధునీకరణలో భాగంగా తమ ఊరు ఏ ఢిల్లీ, ముంబైలాగో కాలుష్య నగరంగా మారాలని అక్కడి ప్రజలు ఆశించడం లేదు. రాజపాళ్యంలా ఉండి.. కాలుష్యరహిత ప్రాంతంగా దేశానికే ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నారు.సవాళ్లుకాస్త ఖర్చుతో కూడుకున్న వ్యవహారంసాంకేతికంగా అవరోధాలు ఎదురయ్యే అవకాశంపూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లేందుకు మరికొంత సమయంపారిశ్రామిక సహకారంపాటించడమే కాదు.. పర్యవేక్షణ కూడా సవాల్‌తో కూడున్నదే. కానీ, పచ్చటి భవిష్యత్తుతో దక్కే ఫలితం మాత్రం దీర్ఘకాలికమైంది. -
అవును.. నిందితుడు మా పార్టీ మద్దతుదారుడే: సీఎం స్టాలిన్
చెన్నై: అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై జరిగిన లైంగిక దాడి ఘటన తమిళనాట రాజకీయ దుమారం రేపుతోంది. అసెంబ్లీని సైతం దద్దరిల్లిపోయేలా చేసిన ఈ ఘటనపై బుధవారం ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందించారు. నిందితుడు తమ పార్టీ మద్దతుదారుడేనని ప్రకటించారాయన. అయితే..అసెంబ్లీ సమావేశాల్లో మూడో రోజు సీఎం స్టాలిన్(CM Stalin) మాట్లాడుతూ.. ‘‘అన్నా వర్సిటీ ఘటనలో నిందితుడు కేవలం డీఎంకే మద్దతుదారుడేనని, ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నట్లు పార్టీ సభ్యుడు ఎంతమాత్రం కాదు’’ స్పష్టత ఇచ్చారు. అంతేకాదు.. మహిళల భద్రతే ప్రాధాన్యంగా పని చేస్తున్న తమ ప్రభుత్వం.. నిందితుడికి రక్షణ కల్పించలేదని, భవిష్యత్తులోనూ కల్పించబోదని, పైగా అతనిపై గుండా యాక్ట్ ప్రయోగించామని ప్రకటించారు. అన్నా వర్సిటీ ఘటన.. ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్న తీరును సీఎం స్టాలిన్ తీవ్రంగా తప్పుబట్టారు.‘‘విద్యార్థినిపై లైంగిక దాడి(Sexual Assault) క్రూరమైన ఘటన. అయితే.. చట్ట సభ్యులు ఇవాళ ఈ అంశం మీద ఇక్కడ మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వాన్ని విమర్శించడమే అంతా పనిగా పెట్టుకున్నారు. బాధితురాలి తరఫు నిలబడి సత్వర న్యాయం చేకూర్చాలనే మా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సాధారణంగా.. ఘటన జరిగాక నిందితుడు తప్పించుకుంటేనో.. అరెస్ట్‌లో జాప్యం జరిగితేనో.. లేకుంటే నిందితుడ్ని రక్షించే ప్రయత్నాలు జరిగితేనో విమర్శలు వినిపిస్తాయి. కానీ, ఇక్కడ వీలైనంత త్వరగా అరెస్ట్ చేసినా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఇది రాజకీయ ప్రయోజనాల కోసం చేసే రాద్ధాంతం కాకపోతే ఇంకేంటి?’’ అని ప్రశ్నించారాయన. అన్నా వర్సిటీ(Anna University) ఘటనకు నిరసనగా ప్రతిపక్ష అన్నాడీఎంకే సభ్యులు నల్లదుస్తులతో అసెంబ్లీకి వచ్చారు. వాళ్లను ఉద్దేశిస్తూ సీఎం స్టాలిన్ తీవ్ర విమర్శలు గుప్పించారు.గతంలో ఇదే ప్రతిపక్ష అన్నాడీఎంకే అధికారంలో ఉండగా.. పొల్లాచ్చి లైంగిక దాడి కేసు సంచలనం సృష్టించింది. ఆ టైంలో ప్రభుత్వం ఏం చేసింది?.. ఆలస్యంగా స్పందించడంతో నిందితుడు పారిపోలేదా? అని ప్రశ్నించారాయన. ప్రతిపక్షాలంతా నిందితుడు ఎవరు? మీ పార్టీ వాడు కాదా అని ప్రశ్నిస్తున్నాయి. అవును.. అతను మా పార్టీ మద్దతుదారుడే. కానీ, సభ్యుడు మాత్రం కాదు. ఈ విషయాన్ని మేం ముందు నుంచే చెబుతున్నాం. అరెస్ట్ విషయంలోనూ ఎక్కడా రాజకీయ జోక్యం జరగలేదు. ఒకవేళ.. అలా జరిగిందని ఆధారాలు ఉంటే సిట్‌కు సమర్పించండి. దర్యాప్తు అయ్యేదాకా ఎదురుచూడడండి. అంతేగానీ స్వప్రయోజనాల కోసం చిల్లర రాజకీయాలు చేయొద్దు అని ప్రతిపకక్షాలను ఉద్దేశించి హితవు పలికారాయన. ఈ తరుణంలో అసెంబ్లీ నుంచి అన్నాడీఎంకే సభ్యులు వాకౌట్ చేశారు. ఇదిలా ఉంటే.. అన్నా వర్సిటీ ఉందంతంపై దాఖలైన ఓ పిటిషన్ విషయంలోనూ మదద్రాస్ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘‘అసలు మహిళల భద్రతపై ఎవరికీ అసలు చిత్తశుద్ధి లేదు. అన్నా యూనివర్సిటీ లైంగిక దాడి కేసును అంతా రాజకీయం చేస్తున్నారు. కేవలం వాళ్ల అవసరం వాడుకుంటున్నారు’’ అని వ్యాఖ్యానించింది. డిసెంబర్ 23వ తేదీన రాత్రి 8గం. ప్రాంతంలో క్యాంపస్‌లో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని(19) తన స్నేహితుడితో మాట్లాడుతుండగా.. దాడి చేసి ఆమెను బలవంతంగా పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశారు. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ఆందోళనకు దిగాయి. అదే సమయంలో.. క్యాంపస్‌కు దగ్గర్లో బిర్యానీ సెంటర్ నడిపే జ్ఞానేశ్వర్‌ను నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అతను డీఎంకే సభ్యుడంటూ ప్రతిపక్షాలు విమర్శలకు దిగాయి. మరోవైపు.. ఈ కేసులో ఇంకొంతమంది నిందితులు ఉన్నారని.. వాళ్లను రక్షించే ప్రయత్నం జరుగుతోందంటూ డీఎంకే ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి ప్రతిపక్షాలు.ఇదీ చదవండి: బీజేపీ నేత నోటి దురుసు! ఫలితంగా.. -
సింధు లోయ లిపిని పరిష్కరిస్తే 10 లక్షల డాలర్ల నజరానా
చెన్నై: శతాబ్ద కాలానికి పైగా అపరిష్కృతంగా మిగిలి పోయిన సింధు నదీ లోయ నాగరికత కాలం నాటి లిపిని పరిష్కరించిన వారికి 10 లక్షల డాలర్ల బహుమానం అందజేస్తామని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ప్రకటించారు. సింధూ నాగరికతను వెలుగులో వచ్చి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటైన మూడు రోజుల అంతర్జాతీయ సదస్సును ఆదివారం ఆయన చెన్నైలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్..ఒకప్పుడు విలసిల్లిన సింధు లోయ నాగరికతకు చెందిన లిపిని ఇప్పటి వరకు స్పష్టంగా ఎవరూ అర్థం చేసుకో లేకపోయారని పేర్కొన్నారు. లిపిని పరిష్కరించేందుకు ఇప్పటికీ పండితులు ప్రయత్ని స్తూనే ఉన్నారన్నారు. ఈ దిశగా కృషి చేసి, విజయం సాధించిన వ్యక్తులు, సంస్థలకు ప్రోత్సా హంగా 10 లక్షల డాలర్ల బహుమానం అందజేస్తామని ప్రకటించారు. -
‘అత్యాచారం కేసును రాజకీయం చేస్తున్నారు’
చెన్నై: తమిళనాడును కుదిపేసిన అన్నా యూనివర్సిటీ(Anna University) ఘటనపై ఆ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇంజనీరింగ్ విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటనకు సంబంధించి దాఖలైన ఓ పిటిషన్‌ను తాజాగా మద్రాస్ హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా.. ఈ ఘటనను రాజకీయం చేస్తున్నారని వ్యాఖ్యానించింది.ఘటనను నిరసిస్తూ చెన్నై వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని పట్టాలి మక్కల్ కట్చి(పీఎంకే) భావించింది. అయితే.. పోలీసులు అందుకు అనుమతి నిరాకరించారు. దీంతో పీఎంకే హైకోర్టు(High Court)ను ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం.. ‘‘అసలు మహిళల భద్రతపై ఎవరికీ అసలు చిత్తశుద్ధి లేదు. అన్నా యూనివర్సిటీ లైంగిక దాడి కేసును అంతా రాజకీయం చేస్తున్నారు. కేవలం వాళ్ల అవసరం వాడుకుంటున్నారు’’ అని వ్యాఖ్యానించింది.మరోవైపు..ఈ కేసులో ప్రజాగ్రహం పెల్లుబిక్కడంతో సిట్‌తో దర్యాప్తు చేయించాలని మద్రాస్ హైకోర్టు ఇదివరకే ఆదేశించింది కూడా.డిసెంబర్ 23వ తేదీన రాత్రి 8గం. ప్రాంతంలో క్యాంపస్‌లో విద్యార్థిని తన స్నేహితుడితో మాట్లాడుతుండగా.. దాడి చేసి ఆమెను బలవంతంగా పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశారు. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ఆందోళనకు దిగాయి. అదే సమయంలో..ఈ కేసులో నిందితుడిగా పేర్కొంటూ జ్ఞానేశ్వర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానికంగా బిర్యానీ వ్యాపారి అయిన జ్ఞానేశ్వర్.. అధికార డీఎంకే యువ విభాగానికి గతంలో పని చేశాడు. దీంతో రాజకీయంగానూ దుమారం రేగింది. విద్యా సంస్థలలోనూ విద్యార్దినులకు భద్రత కరువైందన్న ఆందోళనను ప్రతిపక్షాలు వ్యక్తంచేశాయి. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి, బీజేపీ అధ్యక్షుడు అన్నామలై(Annamalai), డీఎండీకే ప్రధాన కార్యదర్శిప్రేమలత విజయకాంత్, పీఎంకే నేతలు రాందాసు, అన్బుమణి రాందాసు వేర్వేరు ప్రకటనలో ఈ ఘటనను ఖండించారు. డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌తో పాటు పలువురు డీఎంకే నేతలతో జ్ఞానేశ్వర్ దిగిన ఫొటోలను వైరల్ చేస్తూ ప్రతిపక్షాలు విమర్శలకు దిగాయి.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఓ అడుగు ముందుకు వేసి ఘటనకు నిరసనగా కొరడాతో బాదుకున్నారు. ప్రభుత్వం కదిలేవరకు చెప్పులు వేసుకోనంటూ ప్రతిన బూనారు. మరోవైపు టీవీకే అధ్యక్షుడు, నటుడు విజయ్ కూడా కేసులో బాధితురాలికి సత్వర న్యాయం జరగాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజా మద్రాస్ హైకోర్టు రాజకీీయం చేస్తున్నారని వ్యాఖ్యానించడం గమనార్హం. -
జల్లికట్టు చిన్నారి పట్టు
‘జల్లికట్టు’ అంటే ఎద్దును లొంగదీసుకుని దాని కొమ్ములకున్న అలంకరణలను సొంతం చేసుకోవడం. జల్లికట్టు ఎద్దులకు ΄పౌరుషం ఎక్కువ. కొమ్ములకు వాడి ఎక్కువ. తమ మూపురాలను తాకనివ్వవు. అందుకే ఈ మనిషి–పశువు క్రీడ తరాలుగా తమిళనాడులో ఉంది. జల్లికట్టులో దించబోయే ఎద్దుకు తర్ఫీదు ఇస్తూ పదేళ్ల యజిని వార్తల్లోకి ఎక్కింది. రాబోయే సంక్రాంతికి యజిని.. ఎద్దు‘నన్బన్’ చాలా పెద్ద వార్తలనే సృష్టించనున్నాయి.రాబోయే‘΄పొంగల్’కి తమిళనాడులో జల్లికట్టు ధూమ్‌ధామ్‌గా జరగనుంది. మదురై, తంజావూరు, తిరుచిరాపల్లి తదితర ప్రాంతాల్లో ΄పొంగల్ నుంచి మొదలై వేసవి వరకు జల్లికట్టు పోటీలు జరుగుతూనే ఉంటాయి. అక్కడి పల్లెవాసులు కూడా వేలాదిగా వీటిలో పాల్గొంటారు. తమ ఎడ్లను తెచ్చి పాల్గొనేలా చేస్తారు. మన కోళ్ల పందేలకు కోడిపుంజులను తీర్చిదిద్దినట్టే ఇందుకై ఎడ్లనూ తీర్చిదిద్దుతారు. రైతు కుటుంబాల్లో తండ్రులు వారికి తోడు పిల్లలు ఈ పనిలో నిమగ్నమవుతారు. అలాంటి రైతు కూతురే పదేళ్ల వయసున్న యజిని.ఎద్దు– మనిషిమదురైలోని మంగులం అనే గ్రామంలో శ్రీనివాసన్ అనే రైతుకు రెండు ఎడ్లు ఉన్నాయి. వాటిలో ఒకదాన్ని జల్లికట్టులో పాల్గొనేలా చేస్తున్నాడు. ‘జల్లికట్టు’లో ‘జల్లి అంటే రెండు కొమ్ములకు అలంకరణ వస్త్రాలు ‘కట్టు’ అంటే కట్టడం. రెండు కొమ్ముల మధ్య వెండి లేదా బంగారు నాణేలు కూడా కడతారు. ఆటగాళ్లు పరిగెడుతున్న ఎద్దును తాకి, మూపురం పట్టి నెమ్మదించేలా చేసి ఆ అలంకరణలను, నాణేలను సొంతం చేసుకుంటారు. ఎన్ని సొంతం చేసుకుంటే అంత వీరుడిగా గుర్తింపు. అలాగే ఈ వీరులకు చిక్కకుండా వారి మీద కొమ్ము విసిరి తరిమికొడితే ఆ ఎద్దుకు అంతటి ఘనత. ‘మా ఎద్దు కూడా అంతటి గొప్పదే. చాలా మెడల్స్ సాధించింది’ అంటుంది యజిని.పాపకు స్నేహితుడుయజినికి ఐదేళ్లుండగా తండ్రి ఎద్దులను కొన్నాడు. వాటిలో ఒకదానికి యజిని‘నన్బన్’ (స్నేహితుడు) అనే పేరు పెట్టింది. రోజూ దానికి మేత వేయడం, నీళ్లు పెట్టడం, కబుర్లు చెప్పడం ఇదే పని. ‘నేను దగ్గరికి వెళితే ఏమీ చేయదు. పిలవగానే వచ్చేస్తుంది’ అంటుంది యజిని. గత మూడేళ్లుగా జల్లికట్టులో తండ్రితో పాటు నన్బన్ను తీసుకొని వెళుతోంది యజిని. ‘వాడివాసల్ (స్టార్టింగ్ పాయింట్) నుంచి మా నన్బన్ పరుగు అందుకోగానే చాలామంది ఆటగాళ్లు దాని మూపురం పట్టుకోవాలని, కొమ్ములు అందుకోవాలని ట్రై చేస్తారు. కాని మా నన్బన్ అందరి మీదా బుసకొట్టి దూరం పోయేలా చేస్తుంది. ఆట గెలిచాక బుద్ధిగా నా వెంట ఇంటికి వస్తుంది. ఆ ఎద్దు – ఈ ఎద్దు ఒకటేనా అన్నంత డౌట్ వస్తుంది’ అంటుంది యజిని.ట్రైనింగ్జల్లికట్టు కోసం ట్రైనింగ్ యజిని ఇస్తోంది తండ్రితో పాటు. జల్లికట్టులో పాల్గొనే ఎద్దును రోజూ వాకింగ్‌కి, స్విమ్మింగ్‌కి తీసుకెళ్లాలి. తడి నేలలో, మెత్తటి నేలలో కొమ్ములు గుచ్చి కొమ్ములు బలపడేలా చేయాలి. దీనిని ‘మన్ కుథల్’ అంటారు. ఇక మంచి తిండి పెట్టాలి. ఇవన్నీ యజిని చేస్తోంది. ‘నేను ఇంగ్లిష్ మీడియంలో చదువుకుంటున్నా. గవర్నమెంట్ జల్లికట్టు కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎద్దుకు ఎటువంటి అపాయం కలక్కుండా రూల్స్ పెట్టింది. అందుకే నన్బన్ను నేను ధైర్యంగా పోటీకి తీసుకెళ్తా’ అంటోంది యజిని. -
ఎన్ఐటీ తిరుచ్చి .. గ్లోబల్ అలుమ్ని మీట్ 2025
సాక్షి, చైన్నె: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ –తిరుచ్చి, అధికారిక పూర్వ విద్యార్థుల సంఘం నేతృత్వంలో ల్యాండ్ మార్క్ ఈవెంట్‌గా గ్లోబల్ అలుమ్ని మీట్ 2025 చైన్నె వేదికగా జరగనుంది. గిండి ఐటీసీ గ్రాండ్ చోళా వేదికగా జనవరి 4వ తేదీన ఈ మీట్ ఏర్పాటు చేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పూర్వ విద్యార్థులను ఒకచోట చేర్చే విధంగా కార్యక్రమానికి నిర్ణయించారు. 930 మందికి పైగా సీఈఓలు, 1,300 మందికి పైగా వివిధ సంస్థల వ్యవస్థాపకులు. సహ–వ్యవ స్థాపకులు, 48,000 మంది పూర్వ విద్యార్థుల డైనమిక్ నెట్‌వర్క్‌తో ఎన్ఐటీ తిరుచ్చి ఈ వేడుకకు నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో టాటా గ్రూప్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ ముఖ్య అతిథిగా, రాష్ట్ర ఐటీ మంత్రి డాక్టర్ పళనివేల్ త్యాగరాజన్ పాల్గొననున్నారు. ఈ వివరాలను సోమ వారం స్థానికంగా జరిగిన సమావేశంలో ఎన్ఐటీ తిరుచ్చి డైరెక్టర్ జి అఖిల ప్రకటించారు. అలాగే, ఈ మీట్బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రముఖులైన పూ ర్వ విద్యార్థులను ఒకే వేదిక మీదకు తీసుకు రావ డం, పభావవంతమైన సహకారాన్ని ప్రోత్సహించడానికి ఒక శక్తివంతంగా ఈ వేదిక మారనున్నట్టు వివరించారు. 2025లో అకడమిక్ ఎక్స లెన్స్, అత్యాధునిక పరిశోదన , క్రీడా సౌకార్యలు, వంటి వాటిని మెరుగు పరిచే దిశగా ప్రత్యేక కార్యాచరణలో ఉన్నామన్నారు. ఆవిష్కరణల కేంద్రం పరిశోధన– వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి, పూర్వ విద్యార్థుల– విద్యార్థుల మెంటర్షిప్కు అధికారిక వేదికను అందించడానికి, స్టార్టప్ ఎకో సిస్టమ్‌ను ప్రోత్స హించడానికి, ల్యాబ్‌ను అందించడంతో పాటు పరిశ్రమ నేతృత్వంలో ప్రాజెక్ట్‌లను పెంచడానికి ఈ మీట్ దోహదకరంగా ఉంటుందన్నారు. రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ హబ్ ప్లాట్‌ఫారమ్, గవర్నెన్స్ ఎంటర్ప్రెన్యూర్ షిప్ టాలెంట్ , స్టార్టప్ ఆలోచనలను పెంపొందించడంతో పాటూ పరిశోధన మరియు ఆవిష్కరణలను చేయడమే లక్ష్యంగా నిర్ణయించామన్నా రు. పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు కె మహాలింగం మాట్లాడుతూ, తమ పూర్వ విద్యార్థుల నెట్వర్క్ విస్తారమైనదని, ప్రపంచవ్యాప్తంగా నిష్ణాతులని, ఇందుకు తగిన మార్గదర్శకత్వం, వ్యాపారం, నిధులు, ఆలోచనల కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిచనున్నారు. -
కొరడాతో కొట్టుకున్న తమిళనాడు బీజేపీ చీఫ్
కోయంబత్తూర్/చెన్నై: తమిళనాడు బీజేపీ చీఫ్ కె.అన్నామలై వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. చెన్నైలోని ఓ కాలేజీ విద్యార్థినిపై లైంగిక దాడి కేసు విషయంలో డీఎంకే ప్రభుత్వం, రాష్ట్ర పోలీసుల వైఖరిని ఖండిస్తూ అన్నామలై కొరడాతో తనను తాను కొట్టుకున్నారు. శుక్రవారం కోయంబత్తూర్‌లోని తన నివాసం వెలుపల అన్నామలై పచ్చని ధోతీ ధరించి, చొక్కా లేకుండానే కొరడాతో పదే పదే కొట్టుకున్నారు. ఆయన చుట్టూ గుమికూడిన బీజేపీ కార్యకర్తలు లైంగిక దాడి బాధితురాలి ఎఫ్ఐఆర్ను పోలీసులు లీక్ చేయడాన్ని నిరసిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఇదే అంశంపై గురువారం అన్నామలై మీడియా సమావేశంలో పాదరక్షలను వదిలేశారు. తమిళనాడులో క్షీణిస్తున్న శాంతి భద్రతలకు డీఎంకే ప్రభుత్వమే కారణమని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేదాకా కాళ్లకు చెప్పులు వేసుకోనని ప్రతిజ్ఞ చేశారు. ఎన్నికల్లో డబ్బు పంచబోమని కూడా చెప్పారు. డీఎంకే ప్రభుత్వం పాల్పడిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా 48 రోజులపాటు ఉపవాసంతో ఉండి రాష్ట్రంలోని ఆరు ప్రముఖ మురుగన్ ఆలయాలను దర్శించుకుంటానని తెలిపారు. ఉత్తరం–దక్షిణ రాజకీయాలు బూచిగా చూపుతూ వాస్తవ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు డీఎంకే సర్కార్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. డీఎంకే రాజకీయాలు చూసి రోత పుడుతోందని అన్నామలై చెప్పారు. అన్నామలై వర్సిటీలో 19 ఏళ్ల విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన గుణశేఖరన్ పాతనేరస్తుడు. అతడు డీఎంకే వ్యక్తి కాబట్టే, పోలీసులు ఇప్పటిదాకా క్రిమినల్ కేసు నమోదు చేయలేదని ఆరోపించారు. పోలీసులు ఎఫ్ఐఆర్ను లీక్ చేయడం బాధితురాలిని అవమానించడం, ఆమె వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమేనన్నారు. అయితే, అన్నామలై చర్య నవ్వు తెప్పించేలా ఉందని డీఎంకే వ్యాఖ్యానించింది. TN-BJP president @annamalai_k ji whips himself as a mark of protest against the DMK govt for their 'apathy' in handling the case of the sexual assault of an Anna University student.He has vowed to walk barefoot until the DMK govt falls.Truly a fighter...👏🏻 pic.twitter.com/FD3FGgWKIu— Mr Sinha (@MrSinha_) December 27, 2024 -
అప్పటివరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
చెన్నై: తమిళనాడులోని అన్నా యూనివర్సిటీలో ఓ విద్యార్థినిపై లైంగికదాడి ఘటన ప్రకంపనలు రేపుతోంది. ఈ నేపథ్యంలో డీఎంకే అధికారం కోల్పోయేంత వరకు తాను చెప్పులు ధరించబోనంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై శపథం చేశారు. గురువారం ఆయన కోయంబత్తూర్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ డీఎంకే సర్కార్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అన్నా విశ్వవిద్యాలయ విద్యార్థిని లైంగిక వేధింపుల కేసుపై ప్రభుత్వం తీరు పట్ల ఆయన నిరసన వ్యక్తం చేశారు.డీఎంకే ప్రభుత్వాన్ని అధికారం నుంచి దించే వరకు తాను పాదరక్షలు ధరించనని.. చెప్పులు లేకుండానే నడుస్తానంటూ తేల్చిచెప్పారు. ఎన్నికల్లో గెలుపునకు ఎప్పటిలాగే డబ్బులు ఆశగా చూపమన్న అన్నామలై.. రూపాయి కూడా పంచకుండా ఎన్నికలకు వెళ్తామంటూ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో గెలుపు సాధించే వరకు చెప్పులు ధరించను’’ అని అన్నామలై స్పష్టం చేశారు.కాగా, చెడు అంతమైపోవాలంటూ తన నివాసంలో కొరడా దెబ్బలతో మురుగున్‌కు మొక్కు చెల్లించుకుంటానని చెప్పారు. రాష్ట్రంలోని ఆరు మురుగన్ క్షేతాలను దర్శించుకునేందుకు 48 గంటల పాటు ఉపవాస దీక్ష చేపట్టనున్నట్లు కూడా ఆయన తెలిపారు.#WATCH | During a press conference, Tamil Nadu BJP President K Annamalai removed his shoe and said, "From tomorrow onwards until the DMK is removed from power, I will not wear any footwear..."Tomorrow, K Annamalai will protest against how the government handled the Anna… https://t.co/Jir02WFrOx pic.twitter.com/aayn33R6LG— ANI (@ANI) December 26, 2024 ఇదీ చదవండి: వీడియో: కోడిగుడ్లతో బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై దాడి.. -
కీచకపర్వంపై విజయ్ దిగ్భ్రాంతి.. ఉదయ్‌నిధిపై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
చెన్నై: నగరం నడిబొడ్డున జరిగిన దారుణ ఘటన.. తమిళనాడును ఉలిక్కి పడేలా చేసింది. ప్రముఖ ప్రభుత్వ విద్యాసంస్థ వర్సిటీ క్యాంపస్‌లోనే ఓ ఇంజినీరింగ్ విద్యార్థినిపై లైంగిక దాడి జరిగింది. ఆమెతో ఉన్న స్నేహితుడిపై దాడి చేసి మరీ.. దగ్గర్లోని పొదల్లో లాక్కెళ్లి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ కీచకపర్వంతో విద్యార్థి లోకం భగ్గుమంది. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ రోడ్డెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన బాట పట్టింది. మరోవైపు ఈ ఘటనపై అగ్ర నటుడు, టీవీకే అధినేత విజయ్(TVK VIjay) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘చెన్నై అన్నా యూనివర్సిటీ క్యాంపస్‌లో జరిగిన ఘటన దిగ్భ్రాంతికి గురి చేసింది. నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారనే సమాచారం మాకు అందింది. అయితే ఈ కేసులో ఉన్నవాళ్లు ఎంతటివాళ్లైనా వదలిపెట్టకూడదు. బాధితురాలికి తక్షణ న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా.. சென்னை அண்ணா பல்கலைக்கழக வளாகத்திற்கு உள்ளேயே, மாணவி ஒருவர் பாலியல் வன்கொடுமைக்கு உள்ளாகி இருக்கும் செய்தி, மிகுந்த அதிர்ச்சியையும் வேதனையையும் அளிக்கிறது.மாணவியைப் பாலியல் வன்கொடுமை செய்தவர் கைது செய்யப்பட்டிருப்பதாகக் காவல் துறை தரப்பில் தெரிவிக்கப்பட்டிருந்தாலும் அவர் மீது…— TVK Vijay (@tvkvijayhq) December 25, 2024.. రాష్ట్రంలో మహిళల భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలి. అఘాయిత్యాలు జరుగుతున్న ప్రాంతాల్లో భద్రతను పెంచాలి. ఉమెన్ సేఫ్టీ కోసం మొబైల్ యాప్స్, స్మార్ట్ పోల్స్, ఎమర్జెన్సీ బటన్స్, సీసీ కెమెరాలు, టెలిఫోన్లను ఏర్పాటు చేయాలి. పబ్లిక్ ప్లేసుల్లో వాళ్ల కోసం కనీస వసతులు ఏర్పాట్లు చేయాలి. ప్రభుత్వ-ప్రవేట్ విద్యా సంస్థలను కూడా ఇందులో చేర్చాలి. బాధితులకు అవసరమైన న్యాయ సహాయం ప్రభుత్వమే అందించాలి. మానసికంగా ధైర్యంగా ఉంచేందుకు కౌన్సెలింగ్‌లాంటివి ఇప్పించాలి. వీటన్నింటి కోసం ప్రతీ ఏడాది నిర్భయ ఫండ్ నుంచి ఖర్చు చేయాలి. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం వెనకడుగు ఉండకూడదు. నిరంతరం ఈ వ్యవస్థను సమీక్షిస్తూ ఉండాలి’’ అని విజయ్ (Vijay) తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.మరోవైపు.. ప్రభుత్వ విద్యా సంస్థలో జరిగిన ఈ ఘటనపై ప్రతి పక్షాలు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నాయి . అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి, బీజేపీ అధ్యక్షుడు అన్నామలై(Annamalai), డీఎండీకే ప్రధాన కార్యదర్శిప్రేమలత విజయకాంత్, పీఎంకే నేతలు రాందాసు, అన్బుమణి రాందాసు వేర్వేరు ప్రకటనలో ఈ ఘటనను ఖండించారు. విద్యా సంస్థలలోనూ విద్యార్దినులకు భద్రత కరువైందన్న ఆందోళనను వ్యక్తంచేశారు. ఈ ఘటన సిగ్గుచేటు అని, నేరగాళ్లకు తప్పా, ఇతరులు ఎవ్వరికి ఈ ప్రభుత్వంలో కనీస భద్రత కరువైందని మండిపడ్డారు.కాగా ఉన్నత విద్యా మంత్రి కోవి చెలియన్ మాట్లాడుతూ, ఈ వ్యవహారాన్ని రాజకీయం చేయడం శోచనీయమన్నారు. నిందితులు కఠినంగా శిక్షించ బడుతారన్నారు. ఓ విద్యార్థినిపై జరిగిన ఈ దాడిని కూడా రాజకీయం చేయడం మంచి పద్ధతి కాదన్నారు.ShameOnYouStalinకాగా ఈ ఘటనకు సంబంధించి ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు జ్ఞానశేఖరన్.. క్యాంపస్ దగ్గర్లోనే ఓ బిర్యానీ సెంటర్ నడిపిస్తున్నాడు. అయితే అతనికి నేర చరిత్ర ఉండడంతో పాటు అధికార డీఎంకే పార్టీ కార్యకర్త కావడం ఈ వ్యవహారాన్ని సోషల్ మీడియాకు ఎక్కించింది. గతంలోనూ డిప్యూటీ సీఎం ఉదయ్‌నిధి స్టాలిన్‌తోపాటు మరికొందరు డీఎంకే పెద్దలతో నిందితుడు దిగిన ఫొటో ఒకటి వైరల్ అవుతోంది. అంతేకాదు.. డీఎంకే యువ విభాగం ప్రెసిడెంట్‌గానూ పని చేశాడనతను. నిందితుడు జ్ఞానశేఖరన్ అధికార డీఎంకే కార్యకర్త కావడంతో విషయాన్ని పక్కదోవ పట్టించి నిందితుడ్ని తప్పించే ప్రయత్నం జరుగుతోందని విద్యార్థులు అంటున్నారు. ఘటన తర్వాత బాధితురాలి దగ్గరకు ఎవరినీ వెళ్లనివ్వలేదని.. యూనివర్సిటీ అధికారులు కేసును పక్కదోవపట్టించే ప్రయత్నం చేస్తున్నారని కొందరు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు తోడు మరోవైపు.. పెరియాకుప్పం సముద్ర తీరంలో పిక్నిక్ వెళ్లిన కొందరు యువతులపై తప్పతాగిన ఆగంతకులు అనుచితంగా ప్రవర్తించారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. అయితే తమిళనాడులో మహిళలకు భద్రత కరువైందంటూ.. #ShameOnYouStalin హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.It has come to light that the accused in the Sexual Assault of a student at Anna University is a repeat offender and a DMK functionary.A clear pattern emerges from the number of such cases in the past:1. A criminal becomes close to the local DMK functionaries and becomes a… pic.twitter.com/PcGbFqILwk— K.Annamalai (@annamalai_k) December 25, 2024నిందితుడు జ్ఞానశేఖరన్ కాళ్లకు, చేతులకు దెబ్బలు తగిలి.. బ్యాండేజ్‌తో ఉన్న ఫొటో ఒకటి వైరల్ అవుతోంది. దీంతో డీఎంకే ప్రభుత్వం న్యాయం చేసిందని, గతం పొల్లాచ్చి కేసులో నిందితుడు పారిపోయినప్పుడు అన్నాడీఎంకే ప్రభుత్వం ఉందని.. ఆ సమయంలో బీజేపీ కూడా ఎలాంటి ప్రభుత్వ వ్యతిరేక నిరసలు చేయలేదని కొందరు డీఎంకే అనుకూల పోస్టులు పెడుతున్నారు. అయితే విక్షాలు దీన్ని ప్రభుత్వ జిమ్మిక్కుగా కొట్టి పారేస్తున్నాయి.இனி பெண்கள் மேல கை வைக்கனும்னு நினைச்சாலே இந்த ட்ரீட்மெண்ட் தான் நினைவுக்கு வரனும்.சிறப்பு மிகச் சிறப்பு🔥🔥 pic.twitter.com/wyswZSuEg1— ஜீரோ நானே⭕ (@Anti_CAA_23) December 25, 2024 డీఎంకే స్పందన ఇదిఈ ఆరోపణలను అధికార డీఎంకే ఖండించింది. ఒక నేతతో ఒకరు ఫొటో తీసుకుంటే సరిపోతుందా?. నేరం ఎవరు చేసినా చట్టం ఊరుకోదు. ఈ కేసులోనూ అంతే. ప్రతిపక్షాలకు డీఎంకేను విమర్శించడానికి ఏం దొరక్కట్లేదు. అందుకే శాంతి భద్రతల వంకతో నిత్యం విమర్శలు చేస్తోంది. మా పాలనలో నిజంగా.. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించి ఉంటే విమర్శించనివ్వండి. నిజంగా.. నిందితుడు తప్పించుకుని ఉంటే నిందించండి. అధికార పార్టీ ఎంపీనే అరెస్ట్ అయ్యి రెండు నెలలు జైల్లో ఉన్నారు. ఇక్కడే డీఎంకే పాలన ఎలా ఉంటుందో మీకు అర్థమై ఉండాలి. తప్పు ఎవరూ చేసినా మా ప్రభుత్వం.. శిక్ష పడేవరకు ఊరుకోదు అని డీఎంకే నేత శరవణన్ మీడియాకు తెలిపారు.నిఘా నీడలోని క్యాంపస్‌లోనే..చైన్నె నగరంలోని గిండి సమీపంలోని అన్నావర్సిటీ(Anna university) ఉంది. ఇక్కడే యూజీ, పీజీ హాస్టళ్లు సైతం ఉన్నాయి. ఈ పరిసరాలు ఎంతో ఆహ్లాదకరంగానూ ఉంటాయి. ప్రభుత్వ రంగ విద్యా సంస్థ కావడంతో ఈ పరిసరాలన్నీ సీసీ కెమెరాల నిఘాతో ఉంటాయి. దీనికి కూతవేటు దూరంలోనే ఐఐటీ మద్రాసు ఉంది. ఈ పరిసరాలన్నీ విద్యా సంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ఉండడంతో ఎల్లప్పుడూ భద్రత నీడలోనే ఉంటాయి. ఈ పరిస్థితులలో బుధవారం ఉదయం ఓ ఘటన కలకలం రేపింది.సోమవారం రాత్రి 8గం. టైంలో ఓ యువతి తన స్నేహితుడితో ఉండగా.. దాడి చేసి ఆమెను పొదల్లోకి లాక్కెల్లి అత్యాచారం చేశారు. 19 ఏళ్ల ఆ విద్యార్థిపై ఇద్దరు అగంతకులు ఈ చర్యకు పాల్పడినట్లు సమాచారం బయటకు వచ్చింది. దీంతో విద్యార్థులలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. నిందితులను పట్టుకోవాలని నినదిస్తూ ఆందోళనకు దిగారు. అయితే.. மாணவி பலாத்காரத்தை ஏன் போலீசார் மூடி மறைக்க முயல்கிறது.??கற்பழித்த திமுகக்காரனை காப்பாற்ற முயற்சித்த போலீசை வெச்சி செய்த மாணவர்கள்🤮#AnnaUniversity #ShameOnYouStalin pic.twitter.com/ZcAkYB6NWH— Sanghi Prince 🚩 (@SanghiPrince) December 25, 2024బుధవారం ఉదయాన్నే ఈ సమాచారం మీడియా చెవిన పడింది. దీంతో అన్ని మార్గాలను వర్సిటీ అధికారులు మూసి వేశారు. మీడియానూ లోనికి అనుమతించకుండా జాగ్రత్త పడ్డాయి. ఈ విషయం తెలిసి కొందరు విద్యార్థులు ఆందోళనను ఉధృతం చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు వాళ్లను బుజ్జగించారు. బాధితురాలి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో వాళ్లు శాంతించారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి దర్యాప్తు వేగాన్ని పెంచారు. యూనివర్సిటీ క్యాంపస్‌లో 30కు పైగా ఉన్న సీసీ కెమెరాలలోని దృశ్యాలను పరిశీలించారు. విధులలో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వద్ద విచారించారు. తమకు లభించిన సమాచారం మేరకు 37 ఏళ్ల జ్ఞానశేఖరన్‌ను అరెస్ట్ చేశారు.கேடுகெட்ட திராவிட model ஆட்சியில் !!திமுக காரனால் தொடர்ந்து சூறையாடப்பட்ட கல்லூரி பெண்களின் அவல நிலை ??#ShameOnYouStalin pic.twitter.com/LZcrftyckU— Yuvaraj Ramalingam (@YuvarajPollachi) December 26, 2024ఇదీ చదవండి: దుస్తులు మార్చుకుంటుండగా వీడియోలు తీసి.. -
మదురై అసిస్టెంట్ జైలర్ వేధింపులు..
అన్నానగర్: అసిస్టెంట్ జైలర్ వేధింపులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మదురై అరసరడిలోని సెంట్రల్ జైలులో బాలగురుసామి అనే వ్యక్తి అసిస్టెంట్ జైలర్‌గా పనిచేసేవాడు. కొన్నాళ్ల కిందట సెంట్రల్ జైలులో ఉన్న ఓ ఖైదీని కలవడానికి అతని భార్య పిటిషన్ దాఖలు చేసింది. ఆమెను పరిచయం చేసుకున్న అసిస్టెంట్ జైలర్ ఆమెతో పాటు వచ్చిన యువతిని లైంగికంగా వేధించాడు. ఆ మహిళ మదురై మహిళా పోలీస్ స్టేషన్లో ఈ విషయమై ఫిర్యాదు చేసింది.విచారణ నిమిత్తం తల్లి, కూతుళ్లు అసిస్టెంట్ జైలర్‌పై దాడికి పాల్పడిన విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీనిపై శాఖాపరమైన విచారణలు జరిపారు. బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు అసిస్టెంట్ జైలర్ బాలగురుస్వామిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. దీంతో బాలగురుసామిని సస్పెండ్ చేస్తూ మదురై జైళ్ల శాఖ డీఐజీ పళని ఆదేశాలు జారీ చేశారు. బాలగురుసామిని విచారించగా పలు రకాల సమాచారం బయటకు వచ్చింది. దీంతో అతడిని మదురై సెంట్రల్ జైలుకు తరలించారు. అమ్మాయిలను టార్గెట్ చేసి సాన్నిహిత్యం ప్రదర్శించి పలువురు మహిళలను అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిసింది. அவரு ஆபீசரா இருக்கலாம்.. அதுக்காக மகளை கேட்பாரா..? மத்திய சிறை உதவி ஜெயிலர் பாலகுருசாமி மீது வழக்குப்பதிவு pic.twitter.com/YMRXLMv97a— Mahalingam Ponnusamy (@mahajournalist) December 22, 2024 -
చచ్చుబడిపోయిన చేతులకు అభయ హస్తం..!
సమస్యల గురించి వినడమే తప్ప పరిష్కారాల గురించి అవగాహన లేని వయసులో సైన్స్‌పై అమిత ఆసక్తి పెంచుకున్నాడు తమిళనాడుకు చెందిన శివసంతోష్. ఆ ఆసక్తే ఆవిష్కరణకు బీజం వేసింది. 21 ఏళ్ల వయసులో రోబోటిక్స్ స్టార్టప్‌ను ప్రారంభించేలా చేసింది...హెల్త్‌కేర్, ఎనర్జీ ప్రొడక్షన్, ఏరోస్పేస్ రంగాలకు సంబంధించిన సవాళ్లను పరిష్కరించడానికి 21 ఏళ్ల శివసంతోష్ రోబోటిక్స్ స్టార్టప్ ‘మైక్రోమోటిక్’ను ప్రారంభించాడు. ‘లింబ్ మొబిలిటీ’ని పునరుద్ధరించడానికి డిజైన్ చేసిన ఈ తేలికపాటి వేరబుల్ మోటర్ సిస్టమ్ స్ట్రోక్, స్పైనల్ కార్డ్ ఇంజురీస్, సెరిబ్రల్ పాల్సీ, పార్కిన్స్ డిసీజ్...మొదలైన బాధితులకు ఉపయోగపడుతుంది. ఈ లింబ్ అసిస్ట్‌ను ఉపయోగించి కప్పులు, ప్లేట్లు, బ్యాగులు... మొదలైన వాటిని పట్టుకోవచ్చు. తీసుకెళ్లవచ్చు. రాయవచ్చు. టైపింగ్ చేయవచ్చు. ఫింగర్ మూమెంట్స్‌కు సంబంధించి ఎన్నో పనుల్లో లింబ్ అసిస్ట్ సహాయపడుతుంది.పుదుకొట్టై జిల్లా కీరమంగళం అనే చిన్న పట్టణంలో ఈ స్టార్టప్‌ను పప్రాభించడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. దీనికి శివ చెప్పే జవాబు...‘స్థానిక ఆవిష్కరణలను ప్రోత్సహించడం. మా ప్రాంతంలోని యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడం. ఇన్నోవేషన్ కోసం పెద్ద నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదని నిరూపించాలనుకున్నాను’ శివసంతోష్కు చిన్నప్పటి నుంచి సైన్స్ అంటే ఎంతో ఇష్టం. రకరకాల యంత్రాలు ఏ విధంగా పనిచేస్తాయో తెలుసుకోవాలనే ఆసక్తి ఉండేది. స్కూల్ ప్రాజెక్ట్‌లతో సైన్స్‌పై మరింత ఆసక్తి పెరిగింది. సైన్స్‌కు సంబంధించి రకరకాల పోటీలలో విజేతగా నిలిచేవాడు. ఈ నేపథ్యంలో తన ఆలోచనలు ఆవిష్కరణల చుట్టూ తిరిగేవి.‘కోవిడ్ మహమ్మారి టైమ్‌లో స్థానిక ఆసుపత్రుల కోసం ఆటోమేటిక్ శానిటైజర్ స్ప్రేయర్, యూవీ జెర్మిసైడ్ను డెవలప్ చేశాను. మరో వైపు శాటిలైట్ టెక్నాలజీ గురించి అధ్యయనం చేయడం మొదలు పెట్టాను’ అంటున్నాడు శివ. ఆ ఆసక్తి, అధ్యయనం అతడిని మరింత ముందుకు తీసుకెళ్లింది.మెకాట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా చేసిన శివసంతోష్ ప్రస్తుతం చెన్నైలోని అన్నా యూనివర్శిటీ–కేసీజీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో బీఈ చదువుతున్నాడు. తన స్టార్టప్ కోసం ఎక్కువ సమయం కేటాయించేందుకు శివసంతోష్కు కాలేజీ అనుమతి ఇచ్చింది.ఇంటిగ్రేటెడ్ సోలార్ సెల్స్‌తో మల్టీ యాక్సిస్ విండ్ టర్బైన్ను డెవలప్ చేయడంపై కూడా ఈ స్టార్టప్ కృషి చేస్తోంది. ‘డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు, ఎమర్జెన్సీ సమయాల్లో ఇళ్లు, వ్యాపారాలకు బ్యాకప్ పవర్‌కు సంబంధించి పవర్ జెనరేషన్‌కు ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది’ అంటున్నాడు శివసంతోష్."మూడు పదాలను నమ్ముకుంటే చాలు మనం ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి. అవి... ఎందుకు? ఏమిటి? ఎలా? సైన్స్‌పై ఆసక్తితో ఫ్యాన్ ఎలా తిరుగుతుంది? నుంచి విమానం ఎలా ఎగురుతుంది? వరకు ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. శాస్త్రీయ విషయాలపై లోతైన అవగాహన సమస్యల పరిష్కారానికి ఉపయోగపడుతుందని." చెబుతున్నాడు శివసంతోష్.(చదవండి: -
మరోసారి మతపరమైన వ్యాఖ్యలు చేసిన ఉదయనిధి స్టాలిన్
సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ గతేడాది వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పోలీసు కేసులు ఎదుర్కొన్న తమిళనాడు ఉప ముఖ్యమంత్రి, డీఎంకే పార్టీ యువనేత ఉదయనిధి స్టాలిన్ మరోసారి మతపరమైన వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో గురువారం జరిగిన క్రిస్మస్ కార్యక్రమంలో ఉదయనిధి మాట్లాడుతూ.. తనను తాను గర్వించదగిన క్రైస్తవుడిగా ప్రకటించుకున్నారు. తనకు అన్ని మతాలు సమానమని, మత సామరస్యానికి కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు. మతం పేరుతో విభజించేవారిని, విద్వేషాన్ని చిమ్మేవారికి తాను వ్యతిరేకమని స్పష్టం చేశారు. నాకు అన్ని మతాలు సమానం‘గత ఏడాది క్రిస్మస్ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు నేను క్రిస్టియన్‌నని సగర్వంగా చెప్పాను. ఇది పలువురు సంఘీలకు చిరాకు తెప్పించింది. ఈ రోజు మళ్లీ చెబుతున్నా. నేను గర్వించదగిన క్రైస్తవుడిని. నేను క్రిస్టియన్ని అని మీరు అనుకుంటే, క్రిస్టియన్ని. ముస్లింనని మీరు అనుకుంటే, ముస్లింను. హిందువు అనుకుంటే, నేను హిందువును. నాకు అన్ని మతాలు సమానం. అన్ని మతాలు మనకు ప్రేమను చూపించడమే నేర్పుతాయి’అని నొక్కి చెప్పారు.బీజేపీ–అన్నాడీఎంకే మధ్య రహస్య పొత్తుమతాన్ని రాజకీయ లబ్ది కోసం వాడుకునే వారు విద్వేషాలు, విభజనను వ్యాప్తి చేస్తున్నారని ఉపముఖ్యమంత్రి ఆరోపించారు. ‘ఇటీవల అలహాబాద్‌కు చెందిన ఓ న్యాయమూర్తి ఒక మతాన్ని కించపరిచేలా మాట్లాడటం చూశాం. ఆయన ముస్లింలపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. అలాంటి వ్యక్తి న్యాయమూర్తి పదవిలో ఉంటే ఆయన కోర్టులో న్యాయం ఎలా ఆశిస్తాం?’ అని ప్రశ్నించారు. ఆయనను తొలగించడానికి లోక్‌సభలో ప్రవేశపెట్టిన తీర్మానానికి కాంగ్రెస్, డీఎంకే ఎంపీలు సంతకాలు చేసినా, అన్నాడీఎంకే ఎంపీలు మాత్రం సంతకాలు చేయలేదన్నారు. ‘‘బీజేపీకి బానిసలుగా కొనసాగుతున్నారు కాబట్టే.. రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించిన న్యాయమూర్తిని తొలగించాలని కోరుతూ చేసిన తీర్మానానికి అన్నాడీఎంకే మద్ధతివ్వలేదు’’ అని అన్నాడీఎంకేను విమర్శించారు.చదవండి: మీరూ ఏదో ఒకరోజు సీఎం అవుతారుబీజేపీ–అన్నాడీఎంకే మధ్య రహస్య పొత్తు కొనసాగుతోందని, రాజ్యాంగ విలువల కంటే రాజకీయ విధేయతకే అన్నాడీఎంకే ప్రాధాన్యమిస్తోందని ఆయన ఆరోపించారు. కాగా, సనాతన ధర్మంపై గతేడాది ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెద్ద దుమారాన్నే రేపాయి. ఆయనపై చాలా చోట్ల పోలీసు కేసులు నమోదయ్యాయి. -
దైవ దర్శనానికి వెళ్లొస్తుండగా..
మైలార్‌దేవ్‌పల్లి: దైవ దర్శనం చేసుకుని కారులో ఇంటికి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు నగర వాసులు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. మృతుల కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం.. మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ బాబుల్‌రెడ్డి నగర్‌కు చెందిన పోతన్న (50), శ్రీరామ్‌నగర్ కాలనీకి చెందిన సీతారాం నాయక్ (49), ఆయన కుమారుడు చరణ్, శివకుమార్ గౌడ్లు ఈ నెల 16న శబరిమలై అయ్యప్ప స్వామి దర్శనానికి కారులో వెళ్లారు. అయ్యప్ప దర్శనం అనంతరం బుధవారం ఉదయం తిరిగి బయలుదేరారు. తమిళనాడు దేవదాయపట్టి సమీపంలో వీరు వస్తున్న కారు మరో వాహనాన్ని ఢీకొని పల్టీలు కొడుతూ రోడ్డు అవతల పడిపోయింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో పోతన్న, సీతారాం నాయక్‌లు అక్కడిక్కడే మృతి చెందారు. చరణ్, శివకుమార్‌లకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు మధురైలోని ఓ ఆస్పత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
రాజకీయం ‘అదిరింది’.. అమిత్ షాకు విజయ్ కౌంటర్
చెన్నై: బీఆర్ అంబేద్కర్‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే అమిత్ షా వ్యాఖ్యలకు ఇండియా కూటమి నేతలు కౌంటర్ ఇవ్వగా తాజాగా తమిళనాడు నేత, నటుడు విజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ షాను టార్గెట్ చేసి సంచలన ఆరోపణలు చేశారు.అమిత్ షా వ్యాఖ్యలపై తమిళగ వెట్రి కళగం నేత విజయ్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘అంబేడ్కర్ పేరు వింటే కొందరికి అలర్జీ. ఆయన సాటిలేని రాజకీయ మేధావి. స్వేచ్ఛా వాయువులు పీల్చిన భారత ప్రజలందరూ అంబేద్కర్‌ను గౌరవించారు. అంబేద్కర్ అనే పేరు వింటే మనసు, పెదవులకు సంతోషంగా ఉంటుంది. ఆయనను అవమానించడాన్ని సహించబోమంటూ కామెంట్స్ చేశారు. దీంతో, ఆయన బీజేపీనే టార్గెట్ చేసి ఇలా కామెంట్స్ చేశారని పలువురు చెబుతున్నారు.Our TVK President @tvkvijayhq strongly condemned the Union Home Minister Amit Shah for disrespecting Ambedkar, our ideological leader. He said such insults are unacceptable and expressed his disapproval on behalf of the Tamilaga Vettri Kazhagam 🙏🏼🔥 pic.twitter.com/SzKpJ05laV— velpparsuriya (@SuriyaCreation3) December 18, 2024ఇదిలా ఉండగా.. నటుడు విజయ్ తన రాజకీయ పార్టీ టీవీకే పార్టీ మొదటి ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా అంబేద్కర్ తన పార్టీ సైద్దాంతిక గురువు అని చెప్పుకొచ్చారు. మరోవైపు.. విజయ్ వ్యాఖ్యలపై తమిళనాడు బీజేపీ నేతలు మండిపడుతున్నారు. అంతకుముందు పార్లమెంట్ సమావేశాల సందర్బంగా అమిత్ షా క్షమాపణలు చెప్పాలంటూ విపక్షాలు నిరసనలకు దిగాయి. దీంతో, పార్లమెంటు ఉభయ సభలు బుధవారం దద్దరిల్లాయి. సభలోనే కాకుండా బయటా ప్రతిపక్షాలు నిరసనలు వ్యక్తం చేశాయి. అమిత్ షా రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండు చేసింది. అయితే కాంగ్రెస్ పార్టీనే ఇప్పటిదాకా అంబేడ్కర్‌ను అవమానిస్తూ వస్తోందని, తామే ఆయనను సంపూర్ణంగా గౌరవిస్తున్నామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.ఇదే సమయంలో తన వ్యాఖ్యలను కాంగ్రెస్ వక్రీకరించిందని అమిత్ షా వివరణ ఇచ్చారు. పదే పదే అంబేడ్కర్ పేరును జపించే బదులు.. ఏ దేవుడిని స్మరించుకున్నా ఏడు జన్మలదాకా స్వర్గ ప్రాప్తి లభించేదని అమిత్ షా మంగళవారం రాజ్యసభలో వ్యాఖ్యానించినట్లు కాంగ్రెస్ ఆరోపించింది. ఆ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. అయితే తమకు అంబేడ్కరే దేవుడని ఆ పార్టీ స్పష్టం చేస్తూ అమిత్ షా క్షమాపణలు చెప్పడంతోపాటు రాజీనామా చేయాలని లేదంటే ప్రధాని ఆయనను తొలగించాలని డిమాండు చేసింది. కాంగ్రెస్‌కు బుధవారం విపక్షాలు తోడవడంతో పార్లమెంటు దద్దరిల్లింది. మరోవైపు దేశవ్యాప్తంగా అమిత్ షాకు వ్యతిరేకంగా విపక్షాలు ఆందోళనలు నిర్వహించాయి. -
కోటీశ్వరుడిగా గుకేశ్.. ప్రైజ్‌మనీపై స్పందించిన వరల్డ్ చాంపియన్
కఠిన శ్రమ, అంకిత భావం ఉంటే ఎన్ని సవాళ్లు ఎదురైనా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చని దొమ్మరాజు గుకేశ్ నిరూపించాడు. పద్దెమినిదేళ్ల వయసులోనే ప్రపంచ చెస్ చాంపియన్‌గా అవతరించి నీరాజనాలు అందుకుంటున్నాడు. అయితే, గుకేశ్ ఈ ఘనత సాధించడంతో అతడి తల్లిదండ్రులు రజనీకాంత్, పద్మాకుమారిలది కీలక పాత్ర.కోటీశ్వరుడిగా గుకేశ్ఇక వరల్డ్ చాంపియన్‌గా గుకేశ్ రూ. 11.45 కోట్ల ప్రైజ్‌మనీ సొంతం చేసుకున్నాడు. అంతేకాదు.. తన విజయంతో జాతి మొత్తాన్ని గర్వపడేలా చేసిన ఈ గ్రాండ్ మాస్టర్‌కు తమిళనాడు ప్రభుత్వం ఏకంగా రూ. 5 కోట్ల నజరానా ప్రకటించింది. ఈ నేపథ్యంలో గుకేశ్ కోటీశ్వరుడైపోయాడు.నా తల్లిదండ్రులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు.. ఇకపైఈ విషయం గురించి గుకేశ్ మాట్లాడుతూ.. ‘‘ఈ ప్రైజ్‌మనీ నాకు ఎంత ముఖ్యమైనదో మాటల్లో చెప్పలేను. అయితే, డబ్బు ఒక్కటే ముఖ్యం కాదు. నిజానికి నేను చెస్ ఆడటం మొదలుపెట్టినపుడు మా కుటుంబం ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. నన్ను ఈ స్థాయికి చేర్చడానికి... నా తల్లిదండ్రులు ఆర్థికంగా, భావోద్వేగాలపరంగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు.అయితే, ఇప్పుడు కాస్త మేము సౌకర్యవంతంగా జీవించగలుగుతాం. ఇకపై వాళ్లు దేనికీ పెద్దగా చింతించాల్సిన అవసరం లేదు’’ అని పేర్కొన్నాడు. అంతేకాదు.. తనకు తెలిసింది కొంతేనని.. ఇంకా నేర్చుకోవాల్సి ఎంతో ఉందంటూ గుకేశ్.. ఎదిగే కొద్దీ ఒదిగి ఉంటానని చెప్పకనే చెప్పాడు.అప్పుడే మా అమ్మకు సంతోషంఇక తన తల్లి తనకు గొప్ప చదరంగ ఆటగాడిగా కంటే.. గొప్ప మనిషిగా గుర్తింపు వచ్చినపుడే ఎక్కువ సంతోషిస్తానని చెప్పిందని ఈ సందర్భంగా గుకేశ్ వెల్లడించాడు. కాగా ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకున్న నాలుగు రోజుల తర్వాత గుకేశ్ స్వదేశంలో అడుగు పెట్టిన విషయం తెలిసిందే. సింగపూర్ సిటీ నుంచి అతడు సోమవారం చెన్నైకి చేరుకున్నాడు.పుట్టి పెరిగి ఆటలో ఓనమాలు చేర్చుకున్న గడ్డపై విశ్వ విజేత హోదాలో గుకేశ్‌కు సోమవారం భారీ స్థాయిలో ఘన స్వాగతం లభించింది. అఖిల భారత చెస్ సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) ప్రతినిధులు, తమిళనాడు రాష్ట్ర అధికారులతో పాటు అతను చదువుకున్న వేలమ్మాల్ స్కూల్ విద్యార్థులు, వర్ధమాన చెస్ ఆటగాళ్లు పెద్ద సంఖ్యలో విమానాశ్రయంలో గుకేశ్‌కు వెల్కమ్ చెప్పారు. అతని ఫోటోలు, ఇతర చెస్ చిత్రాలతో అలంకరించి ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వాహనంలో ఈ యువ చాంపియన్ విమానాశ్రయం నుంచి ముందుగా తన ఇంటికి వెళ్లాడు. ఆపై వేలమ్మాల్ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నాడు. తల్లిదండ్రులు రజనీకాంత్, పద్మాకుమారి అతని వెంట ఉన్నారు. ఇక మంగళవారం గుకేశ్‌కు స్థానిక కలైవానర్ ఆరంగం ఆడిటోరియంలో ప్రత్యేక సన్మానం జరిగే అవకాశం ఉంది. ఇదే కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పాల్గొని ఇప్పటికే ప్రకటించిన రూ.5 కోట్ల బహుమతి పురస్కారాన్ని గుకేశ్‌కు అందించనున్నారు.తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం సహకారం వల్లే‘నాకు మద్దతు పలికిన అందరికీ కృతజ్ఞతలు. ఇలాంటి సహకారం నాకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. వరల్డ్ చాంపియన్‌గా నిలవడం చాలా గొప్పగా ఉంది. భారత ఆటగాడు మరోసారి విశ్వ విజేత కాగలిగాడు. నా ఈ విజయంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం సహకారం కూడా ఎంతో ఉంది. గత ఏడాది గ్రాండ్‌మాస్టర్స్ చెస్ టోర్నీ నిర్వహించి నాకు స్పాన్సర్షిప్ అందించడంతో పాటు అన్ని ఏర్పాట్లు చేశారు.అక్కడ గెలవడంతో క్యాండిడేట్స్ విజయానికి పునాది పడింది. ఇలాంటి సహకారం ఉంటే రాష్ట్రం నుంచి మరెంతో మంది ఆటగాళ్లు పైస్థాయికి చేరతారు. ఈ రోజు లభించిన స్వాగతాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. రాబోయే కొన్ని రోజులు కలిసి సంబరాలు చేసుకుందాం’ అని గుకేశ్ వ్యాఖ్యానించాడు.ఆయన సహకారం మరువలేనిదితన చాంపియన్‌షిప్ విజయంపై స్కూల్ విద్యార్థులు అడిగిన ప్రశ్నకు సమాధానిస్తూ... ‘చెస్‌లో విజయం అంటే బాగా ఆడితేనే సరిపోదు. ఎంతో మానసిక ఒత్తిడి ఉంటుంది. దానిని అధిగమించాలి. అందుకే మెంటల్ కండిషనింగ్ కోచ్ ప్యాడీ ఆప్టన్ సహకారం తీసుకున్నాను. ఆయనతో కలిసి పని చేయడం నాకు కలిసొచ్చింది’ అని వెల్లడించాడు. కాగా ఈఎన్టీ స్పెషలిస్ట్ అయిన గుకేశ్ తండ్రి కుమారుడి ప్రయాణంలో తోడుండేందుకు తన వృత్తిని త్యాగం చేయగా.. తల్లి పద్మాకుమారి ఉద్యోగం(మైక్రోబయాలజిస్ట్) చేస్తూ కుటుంబాన్ని పోషించారు. చదవండి: శెభాష్.. గండం నుంచి గట్టెక్కించారు! మీరే నయం -
కజకిస్థాన్ వధువు– తమిళ వరుడు
అన్నానగర్: అరియలూరు జిల్లా ముల్లుకురిచ్చి గ్రామానికి చెందిన రామచంద్రన్ కుమారుడు ప్రభాకరన్ (33). ఇతను మార్కిస్టు కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడు. గత 2 సంవత్సరాలుగా కజకిస్థాన్‌లోని విమానాశ్రయంలో ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అతడితో పాటు పనిచేసే కజకస్తాన్కు చెందిన షేక్మెదోవ్ కుమార్తె ఐ దానా(29)కు మధ్య పరిచయం ఏర్పడింది. చివరికి ఈ అది ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని తల్లిదండ్రులకు చెప్పారు. వివాహానికి ఇరు కుటుంబాలు పచ్చజెండా ఊపారు. తమిళ సంస్కృతి ప్రకారం ప్రభాకరన్ తమిళనాడులో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. దాని ప్రకారం ఐ దానా కుటుంబం అరియలూరుకు వచ్చింది. కాగా, మార్కిస్టు కమ్యూనిస్టు పార్టీ 24వ జిల్లా సదస్సు ఆదివారం కడలూరు జిల్లా పన్నాడంలోని ఓ ప్రైవేట్ హాలులో జరిగింది. ఈ సమావేశ వేదికపై పెళ్లికి ఏర్పాట్లు కూడా జరిగాయి. తమిళ సంçస్కృతి ప్రకారం వరుడు పట్టు పంచె, వధువు పట్టుచీరలో సమావేశ వేదికపైకి వచ్చారు. కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు వాసుకి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రభాకరన్, ఐ దానా కి తాళి కట్టారు. ఈ వేడుకకు బంధువులు, స్నేహితులు, పార్టీ సభ్యులు అందరూ హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. -
చెన్నైకి చేరుకున్న గుకేశ్.. వరల్డ్ చాంపియన్ భావోద్వేగం
ప్రపంచ చెస్ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ స్వదేశానికి తిరిగి వచ్చాడు. చదరంగ రారాజు హోదాలో తొలిసారి భారత్‌లో అడగుపెట్టాడు. ఈ వరల్డ్ చాంపియన్ సోమవారం ఉదయం చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నాడు.నాలో శక్తిని, స్థైర్యాన్ని నింపారుఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వ అధికారులు, జాతీయ చెస్ సమాఖ్య ముఖ్యులు, అభిమానులు గుకేశ్‌కు ఘన స్వాగతం పలికారు. సందర్భంగా... గుకేశ్ మాట్లాడుతూ.. ‘‘సొంతగడ్డ మీద తిరిగి అడుగుపెట్టడం సంతోషంగా ఉంది. మీ అభిమానం, మద్దతు చూసిన తర్వాత.. భారత్‌కు ఈ విజయం ఎంతటి గొప్ప అనుభూతిచ్చిందో నాకు మరింతగా అర్థమైంది. మీరంతా అత్యద్భుతం. నాలో శక్తిని, స్థైర్యాన్ని నింపారు’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో అభిమానులను ఆకర్షిస్తోంది. కాగా భారత్ తరఫున వరల్డ్ చెస్ చాంపియన్‌గా నిలిచిన రెండో ఆటగాడిగా పద్దెమినిదేళ్ల గుకేశ్ చరిత్రకెక్కాడు. చెన్నైకే చెందిన విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ ఘనత సాధించాడు. అంతేకాదు.. అత్యంత పిన్న వయసులోనే ప్రపంచ చాంపియన్ అయిన చెస్ ప్లేయర్‌గానూ రికార్డు సాధించాడు. సింగపూర్ సిటీలో ఇటీవల జరిగిన క్లాసికల్ ఫార్మాట్లో గుకేశ్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. డిఫెండింగ్ చాంపియన్‌ను ఓడించిడిఫెండింగ్ చాంపియన్, చైనా గ్రాండ్‌మాస్టర్ డింగ్ లిరెన్‌ను ఓడించి చాంపియన్ కిరీటాన్ని అందుకున్నాడు. 32 ఏళ్ల లిరెన్‌తో జరిగిన 14 గేమ్‌ల పోరులో 7.5–6.5 పాయింట్ల తేడాతో గెలిచి ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. 58 ఎత్తుల్లో లిరెన్ ఆట కట్టించి విజేతగా అవతరించాడుభారీ నజరానాఈ నేపథ్యంలో దొమ్మరాజు గుకేశ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక వరల్డ్ చాంపియన్‌గా ట్రోఫీతో పాటు గుకేశ్ 13 లక్షల 50 వేల డాలర్ల(రూ.11.45 కోట్లు) ప్రైజ్‌మనీ పొందాడు. ఇక తమ రాష్ట్రానికి గొప్ప పేరు తీసుకువచ్చిన గుకేశ్‌ను కొనియాడుతూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ భారీ నజరానా ప్రకటించారు. గుకేశ్‌కు రూ. ఐదు కోట్ల క్యాష్ రివార్డు అందచేస్తామని తెలిపారు. చదవండి: WPL 2025 Auction: ఆశ్చర్యం.. అనూహ్యం.. వారిపై కోట్ల వర్షం! వీరికి మొండిచేయి#WATCH | Chennai, Tamil Nadu: World Chess Champion #GukeshD says, "I am very glad to be here. I could see the support that and what it means to India...You guys are amazing. You gave me so much energy..." pic.twitter.com/iuFXDiLcjx— ANI (@ANI) December 16, 2024 -
#MenToo: మరో భార్యా బాధితుడి బలవన్మరణం
సేలం: అతుల్ సుభాష్ ఘటన తర్వాత.. ఆ తరహా భార్యాబాధితుల ఉదంతాలు ఒక్కొక్కటిగా తెర మీదకు వస్తున్నాయి. తాజాగా.. భార్య వేధింపులతో ఓ భర్త, తన తల్లిదండ్రులతో సహా బలవన్మరణానికి పాల్పడ్డాడు. తమిళనాడు నామక్కల్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.వివాహం జరిగిన ఐదు నెలలకే వేరు కాపురం పెట్టాలని భార్య గొడవ చేసి పుట్టింటికి వెళ్లిపోవడంతో భర్త ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా, ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడం తట్టుకోలేక తల్లిదండ్రులూ ఆత్మహత్య చేసుకుని మరణించిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఎరుమపట్టి సమీపంలో ఉన్న ఎ.వాళవంది గ్రామానికి చెందిన సెల్వరాజ్ (55) పెయింటర్, ఇతని భార్య పూంగొడి (50) కూలీ కార్మికురాలు. వీరి కుమారుడు సురేంద్రన్(28) వంట కార్మికుడు. ఇతనికి వేట్టంపాడికి చెందిన స్నేహ అనే యువతితో ఐదు నెలల క్రితం వివాహం జరిగింది.వేరు కాపురం చిచ్చుఈ స్థితిలో స్నేహ పెళ్లయినప్పటి నుంచే వేరు కాపురం పెట్టాలని భర్తను డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంగా భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడు గొడ వలు జరిగేవి. అదే విధంగా శనివారం కూడా సురేంద్రన్, స్నేహల మధ్య గొడవ చోటు చేసుకుంది. దీంతో స్నేహ అలిగి తన పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో తీ వ్ర ఆవేదన చెందిన సురేంద్రన్ ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దిగ్భ్రాంతి చెందిన తల్లిదండ్రులు కుమారుడి మృతి తట్టుకోలేక వారు కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఒకరి తర్వాత ఒకరు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.ముగ్గురి ఆత్మహత్యఈ స్థితిలో ఆదివారం ఉదయం ఆ ఇంటి నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో సందేహించిన ఇరుగుపొరుగు వారు వెళ్లి చూడగా ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడి ఉండడం చూసి దిగ్భ్రాంతి చెందారు. సమాచారం అందుకున్న ఎరుమపట్టి పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అదేవిధంగా నామక్కల్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ ఆకాష్ జోసి, నల్లిపాళయం ఇన్స్పెక్టర్ యువరాజ్, పోలీసులు అక్కడికి వచ్చి ముగ్గురి మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపంచనామా నిమిత్తం నామక్కల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు పాల్పడిన సురేంద్రన్ సెల్ఫోన్లో పోలీసులు స్వాధీనం చేసుకుని పరిశీలించగా, అందులో ఆత్మహత్యకు ముందు సురేంద్రన్ వీడియో తీసి ఉండడం తెలిసింది. ఆ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని స్నేహ, వారి కుటుంబసభ్యుల వద్ద విచారణ జరుపుతున్నారు. పెళ్లయిన ఐదు నెలలకే కుమారుడు, తల్లి, తండ్రి బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర శోకాన్ని నింపింది.ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
అతలాకుతలం
తూత్తుకుడి, తిరునల్వేలి (నైల్లె), తెన్కాశి జిల్లాలను వర్షాలు ముంచెత్తాయి. నగులు, వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. రిజర్వాయర్లు నిండుకుండగా మారడంతో ఉబరి నీటిని విడుదల చేశారు. తామర భరణి నది మహోగ్రంగా ప్రవహిస్తుండడంతో తీర గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. వందలాది గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. వేలాది గృహాలలోని ప్రజలు వరద నీటిలో చిక్కుకుని బిక్కుబిక్కుమంటున్నారు. కొన్నిచోట్ల సాయం అందడం లేదంటూ ప్రజలలో ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో మంత్రులు, అధికారులు పరుగులు తీస్తున్నారు.సాక్షి, చైన్నె: గత ఏడాది మిచాంగ్ తుపాన్ చైన్నె నగరం, శివారు ప్రాంతాలను ముంచేసిన విషయం తెలిసిందే. చైన్నె తేరుకునేలోపు ఉపరితల ఆవర్తనం రూపంలో తూత్తుకుడి, తిరునల్వేలి, తెన్కాశి నీట మునిగాయి. ఈ ఏడాది ఈశాన్య రుతు పవనాలు వచ్చి రాగానే చైన్నైపై ప్రభావాన్ని చూపించింది. ఆ తదుపరి ఫెంగల్ తుపాన్ రూపంలో వర్షం పడ్డప్పటికీ, విల్లుపురం, కడలూరు జిల్లాలు పూర్తిగా, కళ్లకురిచ్చి, తిరువణ్ణామలై జిల్లాల కొంత మేరకు తీవ్ర కష్టాలను ఎదుర్కొన్నాయి. పొరుగున ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరికి కూడా పెను నష్టం తప్పలేదు. ఈ పరిస్థితుల్లో తీవ్ర అల్పపీడనం తీరాన్ని దాటేసినా, ఉపరితల ఆవర్తనం రూపంలో తూత్తుకుడి, తిరునల్వేలి, తెన్కాశి జిల్లాలను గత రెండు రోజులుగా వర్షం ముంచెత్తుతూ వస్తోంది. శుక్రవారం కూడా వర్షాలు కొనసాగడంతో ఆ జిల్లాల ప్రజలు ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టలేని పరిస్థితులలో కాలం గడుపుతున్నారు. నగరం, పట్టణం, గ్రామం అంటూ ఎటు చూసినా నీళ్లే అన్నట్లుగా పరిస్థితి మారింది. వాగులు, వంకలు, నదులు పొంగి పొర్లుతున్నాయి. పాపనాశం, మణిముత్తారు, అడవి నయనార్ తదితర రిజర్వాయర్లు అన్ని నిండాయి. ఉబరి నీటి ఉధృతి గ్రామాల మీదుగా సాగుతున్నాయి.అనేక గ్రామాల మధ్య సంబంధాలు తెగాయి. తూత్తుకుడి, తిరునల్వేలి, తెన్‌కాశిలలో పదివేలకు పైగా గృహాలను వరదలు చుట్టుముట్టి ఉన్నాయి.తామర భరణి ఉగ్రరూపంతెన్కాశి జిల్లా కడయనల్లూరు సమీపంలోని చొక్కం పట్టి గ్రామంలోని అయ్యనార్ ఆలయానికి వెళ్లిన 100 మంది భక్తులు కురుప్పానది రిజర్వాయర్ గేట్ల ఎత్తివేతతో చిక్కుకున్నారు. వీరిలో 31 మందిని అతి కష్టం మీద రక్షించారు. మరో 60 మందికి పైగా ఆలయంలోనే బిక్కు బిక్కుమంటూకాలం గడుపుతున్నారు. లక్ష క్యూ సెక్కులకు పైగా నీటితో తామర భరణి నది ఉగ్రరూపం దాల్చడంతో కురుక్కుతురై మురుగన్ ఆలయం నీట మునిగింది. పాపనాశం వద్ద తామర భరణిలో కొట్టుకెళ్తున్న ఓ వృద్ధుడిని పోలీసులు రక్షించారు.తిరుచ్చి లాల్గుడి శిరువయలూరుకు చెందిన శివ శక్తి అనే యువకుడు వరదలో గల్లంత్తయ్యాడు. కుట్రాలం జలపాతం వరదలలో ఆరేళ్ల వయస్సు కలిగిన ఓ మగ ఏనుగు మరణించిన స్థితిలో కొట్టుకు వచ్చింది. ఇక్కడ నీటి ఉధృతి మరింతగా పెరగడంతో దుకాణాలన్ని ఆగమేఘాలపై తొలగించారు. పనప్పారై వద్ద వాగులలో మరణించిన స్థితిలో పలు ఆవులు కొట్టుకు వచ్చాయి. అనేక చోట్ల చెట్లు, కొండ చరియలు విరిగి పడడంతో వాహన దారులకు ఇబ్బంది తప్పడం లేదు. తామర భరణి మరింత ఉగ్రరూపం దాల్చే అవకాశాలతో తీర గ్రామాలలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, శిబిరాలకు తరలిస్తున్నారు. మంత్రులు నెహ్రూ, మూర్తి, గీతాజీవన్, అనితారాధాకృష్ణన్ తదితరులతో పాటు అధికారులు సహాయక పనుల వేగవంతం చేయించారు. కొన్ని చోట్ల సాయం అందడం లేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వందలాది ఎకరాలలో అరటి పంట దెబ్బతిన్నాయి. మరెన్నో వందలాది ఎకరాలలో ఇతర పంటలను వరదలు ముంచేశాయి. ఇక తిరునల్వేలిలో 760 మంది గర్భిణులను ముందు జాగ్రత్తగా ఆస్పత్రిలో చేర్పించారు.ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులలో 468 మంది డయాలసిస్ రోగులను ముందుగానే చేర్పించి చికిత్స అందిస్తున్నారు. తిరుచెందూరు సమీపంలోని కున్నకాయల్ పరిసరాలు దీవులుగా మారాయి. ఈ మూడు జిల్లాలలో అధిక ప్రభావం ఉండగా, మధ్యాహ్నం నుంచి వర్షం కన్యాకుమారి, విరుదునగర్ జిల్లాలకు సైతం విస్తరించింది. విరుదునగర్ జిల్లా శివకాశి సమీపంలోని విశ్వానందం పెరియార్ కాలనీకి చెందిన గణేశన్ భార్య రాజేశ్వరి (32), కుమారుడు దర్శన్ (5) వర్షపు నీటితో నిండిన గొయ్యిలోపడి మరణించారు. వర్షాల నేపథ్యంలో పలు జిల్లాలో అర్ధ సంవత్సర పరీక్షలను వాయిదా వేసి, జనవరిలో నిర్వహించేందుకు విద్యాశాఖ కసరత్తు చేపట్టింది. ఇక, కడలూరులో తెన్ పైన్నె నది మళ్లీ ఉధృతంగా ప్రవహిస్తుండడంతో తీర గ్రామాల ప్రజలలో ఆందోళన పెరిగింది. చైన్నె శివారులోని చెంబరంబాక్కం రిజర్వాయర్ నుంచి నీటి ఉధృతి పెరగడంతో శ్రీపెరందూరు – కాంచీపురం మార్గంలో స్తంభించింది. అలాగే, చైన్నె శివారులలోని పలు రిజర్వాయర్ల నుంచి ఉబరి నీటి విడుదలతో మనలి, మీంజూరు, బర్మానగర్ పరిసరాలు జలదిగ్బధంలో చిక్కాయి. మధురవాయల్ సమీపంలో కూవం నదిలో కొట్టుకు వెళుతున్న కారును, డ్రైవర్‌ను స్థానికులు అతి కష్టం మీద రక్షించారు.సీఎం పర్యవేక్షణ..దక్షిణ తమిళనాడులోని జిల్లాలో మూడవ రోజుగా కురుస్తన్న వర్షాలపై సీఎం స్టాలిన్ దృష్టి పెట్టారు. తీవ్ర ప్రభావం ఎదుర్కొన్న మూడు జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. స్టేట్ ఎమర్జెన్సీ సెంటర్ నుంచి సహాయ పనులను సీఎం పర్యవేక్షించారు. అధికారులతో సమావేశమయ్యారు. జిల్లా మానిటరింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. జలాశయాలు, రిజర్వాయర్‌లోని నీటిమట్టం, ఉబరి నీటి విడుదల గురించి ఆరా తీశారు. ప్రజలకు సహాయకాలను విస్తృతం కావాలని, నష్టం తీవ్రత మీద దృష్టి పెట్టి, సమగ్ర వివరాలను తెలియజేయాలని ఆదేశించారు. మంత్రులు నెహ్రూ, కేకేఎస్ఎస్ఆర్ రామచంద్రన్, గీతా జీవన్, అనితా రాధాకృష్ణన్, స్పీకర్ అప్పా వు తదితరుల నేతృత్వంలో సాగుతున్న సహాయకాల వివరాలను సేకరించారు. జిల్లాకు ఒక డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలను రంగంలోకి దించి సాయం విస్తృతం చేయించారు. అదేసమయంలో ఆదివారం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం బయలు దేరనుడడం, ఇది కూడా తమిళనాడు తీరం వైపుగా పయనించనున్న నేపథ్యంలో అన్ని జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న ఆదేశాలు జారీ చేశారు. ముందుస్తు చర్యలు విస్తృతం చేసి సిద్ధం చేసి పెట్టుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో మంత్రులు దురై మురుగన్, ఐఏఎస్ అధికారులు రాజేష్ లఖానీ, మణి వాసన్, పి. అముదా, అపూర్వ, సత్యప్రద సాహూ తదితరులు పాల్గొన్నారు. -
తమిళనాడు: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. పలువురు మృతి
చెన్నై: తమిళనాడులో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రైవేటు ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం కారణంగా చిన్నారి సహా ఏడుగురు మృతిచెందగా.. మరో 20 మంది అస్వస్థతకు గురైనట్టు సమాచారం. అయితే, షార్ట్ సర్య్కూట్ కారణంగానే మంటలు చెలరేగినట్టు పోలీసులు వెల్లడించారు.వివరాల ప్రకారం.. తమిళనాడులోని దిండిగుల్లో ఉన్న ప్రైవేటు ఆసుపత్రిలో గురువారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్య్కూట్ కారణంగా మొదట ఆసుపత్రి భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు చెలరేగాయి. అనంతరం, భవనం మొత్తానికి వ్యాపించాయి. ఈ క్రమంలో ఆసుపత్రి సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ టెండర్స్ మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించగా రెండు గంటల తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి.అగ్ని ప్రమాదం కారణంగా ఆసుపత్రి భవనం మొత్తం దట్టమైన పొగ అలుముకుంది. దీంతో, ఆసుపత్రిలో ఉన్న రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అగ్నిప్రమాదం కారణంగా ఏడుగురు మృతిచెందగా.. మరో 20 మంది అస్వస్థతకు గురయ్యారు. మృతుల్లో ఒక చిన్నారి, ఇద్దరు మహిళలు ఉన్నట్టు పోలీసులు తెలిపారు.ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు 30 మంది రోగులు ఉన్నట్టు ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే గాయపడిన, అస్వస్థతకు గురైన రోగులను 50 అంబులెన్స్‌ల సాయంతో ఇతర ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన ఆసుపత్రి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.#TamilNadu : #HospitalFireAt least 6 people, including a child and 3 women died and 6 others were injured, after a #fire broke out at a four-story private Hospital in #Dindigul on Thursday night.Reportedly the victims succumbed to suffocation caused by the thick #smoke that… pic.twitter.com/2Iac9Qt5Gh— Surya Reddy (@jsuryareddy) December 12, 2024 -
క్రయోజనిక్ ఇంజిన్ 20 పరీక్ష సక్సెస్
సూళ్లూరుపేట: సీఈ20 క్రయోజనిక్ ఇంజన్లో సంక్లిష్టమైన ప్రక్రియను దాటడం ద్వారా మళ్లీ స్టార్ చేయడానికి వీలుండే వ్యవస్థల అభివృద్ధిలో మరో ముందడుగు వేశామని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) గురువారం ప్రకటించింది. భవిష్యత్తు ప్రయోగాలకు ఈ పరీక్ష ఎంతగానో దోహదపడుతుందని ఇస్రో పేర్కొంది. నాజిల్ ఏరియా నిష్పత్తి 100 శాతం ఉండేలా సముద్ర ఉపరితల స్థాయిలో హాట్ టెస్ట్‌లో సీఈ20 క్రయోజనిక్ ఇంజన్‌ను నవంబర్ 29న విజయవంతంగా పరీక్షించామని ఇస్రో గురువారం వెల్లడించింది. తమిళనాడులోని మహేంద్రగిరిలో ఉన్న ఇస్రో వారి ప్రొపల్షన్ కాంప్లెక్స్ ఈ పరీక్షకు వేదికైంది. ఎల్వీఎం మార్క్–3 రకం రాకెట్లో పైభాగానికి తగు శక్తిని అందివ్వడంలో సీఈ20 ఇంజన్ సాయపడుతుంది. 19 టన్నుల థ్రస్ట్‌ను అందించే పరీక్షలో ఈ ఇంజన్ నెగ్గింది. ఇప్పటికే ఎల్వీఎం2 ఆరు ప్రయోగాల్లో ఈ ఇంజన్ అద్భుతంగా పనిచేసింది. ‘‘గగన్‌యాన్ మిషన్‌కు కావాల్సిన 20 టన్నుల థ్రస్ట్ స్థాయిని అందించేందకు ఈ ఇంజన్ అర్హత సాధించింది. భవిష్యత్తులో సీ32 స్టేజ్‌లో పేలోడ్ పరిమాణాన్ని పెంచేందుకు ఉపయోగపడే 22 టన్నుల థ్రస్ట్‌ను అందించే కార్యక్రమాల్లోనూ ఈ ఇంజన్‌ను ప్రయోగాత్మకంగా వాడొచ్చు’’అని ఇస్రో పేర్కొంది. మళ్లీ ఇంజన్‌ను రీస్టార్ చేసేందుకు అవసరమయ్యే బహుళధాతు ఇగ్నైటర్ సామర్థ్యాన్నీ విజయవంతంగా పరీక్షించారు. ‘‘సముద్రమట్టం స్థాయిలో సీ20 ఇంజన్‌కు సవాళ్లు ఎదురవుతాయి. నాజిల్ పెద్దదిగా ఉండటంతో 50 ఎంబార్ స్థాయిలో విపరీతమైన శక్తి బయటకు వెలువడుతుంది. దీంతో ఇంజన్ సమీపంలో అత్యంత ఉష్ణం జనించడంతోపాటు పెద్దస్థాయిలో కంపనాలు మొదలై ఆ నాజిల్ దెబ్బతినే ప్రమాదముంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకు వినూత్న ‘నాజిల్ ప్రొటెక్షన్ సిస్టమ్’ను ఉపయోగించాం’’అని ఇస్రో పేర్కొంది. -
ఇల వైకుంఠం శ్రీరంగం
శ్రీరంగనాథుని దేవాలయానికి సంబంధించి మరే దివ్యదేశానికి లేని ప్రత్యేకతలు కొన్ని ఉన్నాయి. ఈ దివ్యక్షేత్రం 156 ఎకరాల విస్తీర్ణం కలిగి ఉంది. ఇక్కడ ఉన్నన్ని ్ర΄ాకారాలు, గోపురాలు, మండ΄ాలు, సన్నిధానాలూ మరే దేవాలయంలోనూ లేవు. దేశంలోని అతి పెద్ద దేవాలయాలలో ఒకటిగా దీనిని పేర్కొనవచ్చు. శ్రీరంగనాథుని దేవాలయానికి సంబంధించిన చాలా విషయాలు ‘పెరియ’ అనే విశేషణంతో కూడుకుని ఉన్నాయి. ‘పెరియ’ అంటే పెద్ద అని అర్థం. ఉదాహరణకు ఈ దేవాలయాన్ని ‘పెరియకోయిల్’ అని, స్వామివారిని ‘పెరియపిరాట్టి’ అని, శ్రీరంగాన్ని ‘పెరియ అరంగం’ అని, దేవాలయంలో వాయించే మంగళ వాద్యాలను ‘పెరియ మేళమ్’ అని, స్వామివారికి నివేదించే వంటకాలను ‘పెరియ అవసరం’ అని, నివేదనకు తయారు చేసిన పిండి వంటలను ‘పెరియ పణ్యారం’ అనీ వ్యవహరిస్తారు. స్వామివారి వాహనమైన గరుత్మంతుని ‘పెరియ తిరువడి’ అని అంటారు. స్వామివారికి పిల్లనిచ్చిన విష్ణుచిత్తుల వారిని ‘పెరియాళ్వారు’ అన్న పేరుతో పిలుస్తున్నారు. స్వామివారి వాహనమైన గరుత్మంతుని ‘పెరియ తిరువడి’ అని అంటారు. స్వామివారికి పిల్లనిచ్చిన విష్ణుచిత్తుల వారిని ‘పెరియాళ్వారు’ అన్న పేరుతో పిలుస్తున్నారు.ఆళ్వార్లు కీర్తించిన నూట ఎనిమిది దివ్య దేశాలలో శ్రీరంగం ప్రధానమైనది. శ్రీరంగమే భూలోక వైకుంఠమని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సర్వేశ్వరుడు స్వయంగా వ్యక్తమైన ఎనిమిది క్షేత్రాలలోప్రధానమైనది శ్రీరంగం. వైష్ణవ పుణ్యక్షేత్రాలుగా వినుతికెక్కిన ‘నాల్గు మండపాల’లో శ్రీరంగం ఒకటి. ఉభయ కావేరుల మధ్య అమరిన సుందర ద్వీపం శ్రీరంగం. కావేరి, కొళ్ళడం అనే రెండు నదులు శ్రీరంగానికి పూలదండలా ఇరువైపులా కొంతదూరం ప్రవహించి తిరిగి ఒకటిగా కలుస్తున్నాయి. తిరుచిరాపల్లికి ఎనిమిది కిలోమీటర్ల దూరాన ఉన్న ఈ క్షేత్రానికి చేరుకోవడానికి రైలు, రోడ్డు సదుపాయాలున్నాయి.శ్రీరంగనాథుని దేవాలయం చాలా ప్రాచీనమయింది. ఈనాడు మనం చూసే ఆలయానికి అంకురార్పణ 7వ శతాబ్దంలో జరిగింది. చోళ, పాండ్య, నాయక రాజులు దేవాలయానికి మరమ్మతులు, విస్తరణలు జరిపారు. పదమూడు అంతస్తులు గల ఈ రాజగోపురం 236 అడుగుల ఎత్తులో ఆసియాఖండంలోనే అత్యంత ఎత్తయిన గోపురంగా గుర్తించబడింది. ఈ నూతన రాజగోపురం ఆలయానికి దక్షిణ ద్వారంగా అమరి ఉంది.ఈ ఆలయంలో ఉన్న పుష్కరిణులలో ప్రధానమైనది చంద్ర పుష్కరిణి. ఆలయప్రాకార ఆవరణలలో నున్న గోపురాలు జీవకళ ఉట్టిపడే శిల్పాలతో ఆలయానికి అలంకారాలై ఉన్నాయి. దేవాలయానికి ఉన్న సప్తప్రాకారాలు సప్తలోకాలకు సంకేతాలుగా ఉన్నాయి. ప్రణవాకార విమానం కింద ఉన్న గర్భాలయంలో శ్రీరంగనాథుడు ఐదు తలలతో పడగెత్తి ఉన్న ఆదిశేషుని పాన్పుపై శయనించి కుడి చేత్తో తన శిరస్సు చూపిస్తూ అన్ని లోకాలకూ తనే నాధుడునని చెప్తున్నట్టున్నారు. ఎడమ చేతితో పాదాలను చూపుతూ శరణన్న వారిని రక్షిస్తానని అభయమిస్తున్నారు. మూలమూర్తికి కొంచెం దిగువున ఉన్న ఒక పీఠంపై ఉత్సవమూర్తి చతుర్భుజుడై ఉన్నారు. వారిని ‘నంబెరుమాళ్ళు’ అని అంటారు.ఉత్సవమూర్తి పై కుడి చేతితో ప్రయోగ చక్రాన్ని ధరించి ఉండగా కింది కుడిహస్తం అభయ ముద్రలో ఉంది. శంఖాన్ని పైఎడమ చేతిలోను, కింది చేతితో గదను ధరించి అందమైన చిరునవ్వు మోముతో శోభాయమానంగా దర్శనమిస్తున్నారు.గర్భాలయానికున్న ప్రదక్షిణ మార్గాన్ని ‘తిరువాణ్ణాళి’ అని, దానికి ముందున్న మంటపాన్ని రంగ మంటపమనీ, గాయత్రీ మంటపమని వ్యవహరిస్తారు. ఈ మంటపంలో నున్న 24 బంగారు స్తంభాలూ, గాయత్రీ మంత్రంలో ఉన్న 24 అక్షరాలకు సంకేతాలని పెద్దలు చె΄్తారు. వీటిని ‘తిరుమణ్ణాత్తూణ్’ అని అంటారు. స్వామివారు ప్రసాదాలు ఆరగించే మంటపానికి చందన మంటపమని పేరు. గర్భాలయానికి బయట ఉన్నప్రాకారంలో ద్వారపాలకులు, యాగశాల, సేన మొదలియార్ల సన్నిధి, పగల్ పత్తు మంటపం, చిలుకల మంటపం, కణ్ణ¯Œ సన్నిధి ఉన్నాయి.మూడవప్రాకారంలో స్వర్ణమయంగా ఉన్న ధ్వజస్తంభం, డోలోత్సవ మంటపం, వైకుంఠ ద్వారం చూడవచ్చును. నాల్గవప్రాకారంలో బ్రహ్మాండమైన గరుడ సన్నిధి ఉంది. 12 అడుగుల ఎత్తులో మూలస్థానానికి దూరంగా స్వామి వారి పిలుపు కోసం వేచి ఉన్నట్లు అయిదు అడుగుల ఎత్తయిన పీఠంపై గరుడాళ్వారు కూర్చుని ఉన్నారు. ఈప్రాకారంలో ఆళ్వార్ల సన్నిధానాలు చాలా ఉన్నాయి. ధన్వంతరికి ప్రత్యేక సన్నిధానం ఉండడం ఇక్కడ ఒక విశేషం. అయిదవప్రాకారంలో ఆండాళ్ళ సన్నిధి, శ్రీరంగనాచ్చియార్ల సన్నిధానం, దానికి ఎదురుగా కంబర్ మండపం, ఉన్నాయి. ఈప్రాకారంలో ముఖ్యమైన కట్టడం వేయికాళ్ళ మండపం.ఈ ఆలయానికి సంబంధించిన మరో విశేషం, ఆలయ విమానగోడలపై చిత్రితమై ఉన్న విష్ణుపురాణం, 108 దివ్యదేశాలకు సంబంధించిన దృశ్యాల వివరణ తెలుగు లిపిలో ఉండడం గమనార్హం. ఉగాది మొదలయిన పండుగలను చాంద్రమానం ప్రకారంగా జరుపుకుంటున్నారు.ఈ క్షేత్రంలో మరో ప్రత్యేకత స్వామి వారికి జరిగే సుప్రభాత సేవలో పాల్గొనేవారు తరతరాలుగా ఒకే కుటుంబానికి చెందిన వారై ఉండడం ఒక విశేషం. వీరిని ‘శ్రీపాదం వోర్’ అని అంటారు.శ్రీరంగక్షేత్రంలో సంవత్సరంలో నాలుగు బ్రహ్మోత్సవాలు జరుపుతున్నారు. శ్రీరంగంలో నిత్యమూ ఉత్సవ సంరంభమే. ఉత్సవాల సమయంలో శ్రీరంగం అల వైకుంఠపురాన్ని తలపింపజేస్తుంది.శ్రీరంగనాచ్చియార్లకు స్వామివారి ఉత్సవాలైన తర్వాత సంబరాలు జరుపుతారు. భక్తులు స్వామివారి ఉత్సవాల వైభవాన్ని తిలకించి శ్రీరంగేశ పాదార్చనతో పులకించిపోతారు. శ్రీరంగాన్ని ఒక్కసారి దర్శిస్తే 108 దివ్యక్షేత్రాలను దర్శించినంత పుణ్యం దక్కుతుందని భక్తుల విశ్వాసం. – స్వాతీభాస్కర్ -
బ్రేకప్ చెప్పిన ప్రియురాలు..వేరే వ్యక్తితో..
సేలం: తిరుపూర్‌లో సహజీవనాన్ని బ్రేకప్ చేయడంతో ఆవేశపడి నడి రోడ్డుపై ప్రేయసిని కత్తితో పొడిచిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతని స్నేహితుడి కోసం గాలిస్తున్నారు. వివరాలు.. తిరుపూర్ కుమార్ నగర్‌లోని కొత్త బస్టాండ్‌కు వెళ్లే 60 అడుగుల రోడ్డులో సోమవారం సాయంత్రం ఇద్దరు యువతులు సెల్ఫోన్లో మాట్లాడుతూ స్కూటర్‌పై రోడ్డు పక్కన నిలిచి ఉన్నారు. అప్పుడు ఆ మార్గంలో హెల్మెట్ ధరించిన ఇద్దరు యువకులు బైక్‌పై వచ్చారు. బైక్‌పై వెనుక కూర్చుని ఉన్న ఒక యువకుడు అకస్మాత్తుగా బైక్ దిగి రోడ్డు పక్కన నిలిచి ఉన్న వారిలో ఒక యువతిని కత్తితో ఇష్టం వచ్చినట్లు పొడిచి, అక్కడి నుంచి వచ్చిన బైక్‌లోనే పరారయ్యాడు. సమాచారం అందుకుని హుటాహుటిన అక్కడికి చేరుకున్న వెస్ట్ పోలీసులు ఆ యువతిని తిరుపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసుల విచారణలో.. తిరుపూర్ కల్లంకాడు ప్రాంతానికి చెందిన శరణ్య (29) అని తెలిసింది. ఆమెకు బంధువు ఒకరితో ఏడేళ్ల క్రితం వివాహమై, ఒక బిడ్డ కూడా ఉన్నట్టు సమాచారం. భర్త మృతి చెందిన తర్వాత ఆమె అవినాశిలో ప్రింటింగ్ పని చేస్తున్న కార్మికుడు రమేష్ (33)తో సహజీవనం చేస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం శరణ్య 60 అడుగుల రోడ్డులో ఉన్న ఒక సంస్థలో సూపర్వైజర్గా పని చేస్తోంది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ స్థితిలో గత 11 నెలలుగా శరణ్య, రమేష్‌తో బ్రేకప్ చేసి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. రమేష్‌కు తెలియకుండా శరణ్య వేరే చోటుకు నివాసం మార్చి పిల్లలతో ఉంటూ వస్తోంది. ఈ స్థితిలో సోమవారం రమేష్ తీవ్ర ఆవేశంతో తన స్నేహితుడు భూపతితో కలిసి అక్కడికి వచ్చి శరణ్యను కత్తితో పొడిచి, పరారైనట్లు తెలిసింది. దీంతో పోలీసులు రమేష్‌ను అరెస్టు చేసి, పారిపోయిన భూపతి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. -
అనుమానాస్పద స్థితిలో దంపతుల మృతి
సేలం : పల్లడంలో అనుమానాస్పద రీతిలో భార్య, భర్త మృతి చెందగా ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. తిరుపూర్ జిల్లా పల్లడం సమీపంలో చిన్నకరై లక్ష్మీ నగర్లో కోడి మాంసం దుకాణం నడుపుతున్న వ్యక్తి సిలంబరసన్ (38). ఇతని భార్య అకిలాండేశ్వరి (28). వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఈ స్థితిలో సోమవారం ఎప్పటిలాగే పనులు ముగించుకుని రాత్రి ఇంటిలో సిలంబరసన్ కుటుంబంతో నిద్రించారు. మంగళవారం ఉదయం నిద్రలేచిన కుమార్తెకు ఉరి వేసుకుని వేలాడుతూ తండ్రి, కత్తులతో నరికిన స్థితిలో రక్తపు మడుగులో తల్లి మృతదేహాలుగా పడి ఉండడం చూసి బోరున విలపించింది. సమాచారం అందుకుని హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న సహాయక పోలీసు సూపరింటెండెంట్ సురేష్ అధ్యక్షతన పోలీసులు దంపతుల మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపంచనామా నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి ఫోరెన్సిక్ నిపుణులను రప్పించి ఆధారాలను సేకరించారు. భార్యను హత్య చేసి తర్వాత భర్త ఆత్మహత్య చేసుకున్నాడా లేక వేరే ఏదైనా కారణం ఉందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. తల్లిదండ్రులను ఒక్కసారిగా కోల్పోయి అనాథలై విలపిస్తున్న పిల్లలను చూసి గ్రామస్తులు కంటతడి పెడుతున్నారు. ఇదే ప్రాంతంలో ఇటీవల తల్లి, తండ్రి, కుమారుడు దారుణ హత్యకు గురైన సంఘటన మరువక ముందే భార్య, భర్త అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. -
కలవనూ లేదు చూడనూ లేదు!
అసెంబ్లీలో అదానీ పవర్ వివాదాన్ని మంగళవారం పీఎంకే తెర మీదకు తెచ్చింది. అయితే అదానీని తాను కలవనూ లేదు.. ఇంత వరకు చూడనూ లేదంటూ సీఎం స్టాలిన్ స్పష్టం చేశారు. ఆయన వివరణతో ఏకీభవించని పీఎంకే సభ్యులు వాకౌట్ చేశారు. ఇక సాత్తనూరు డ్యాం గేట్ల ఎత్తి వేత వ్యవహారం సభలో దుమారాన్ని రేపింది. అన్నాడీఎంకే సభ్యులు, మంత్రుల మధ్య మాటల యుద్దం సాగింది. చివరకు సీఎం వర్సెస్ ప్రధాన ప్రతి పక్ష నేత మధ్య మాటల తూటాలు పేలాయి.సాక్షి, చైన్నె : అసెంబ్లీ సమావేశం మంగళవారం ఉదయం ప్రారంభం కాగానే, స్పీకర్ అప్పావు సంతాప తీర్మానం తీసుకొచ్చారు. కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ మృతికి సంతాపం తెలుపుతూ రెండు నిమిషాలు సభ్యులు మౌనం పాటించారు. అనంతరం ప్రశ్నోత్తరాలు జరిగాయి. తిరువణ్ణామలై కొండ మీద ఈ ఏడాది కూడా మహాదీపం వెలుతుందని ఓ సభ్యుడి ప్రశ్నకు హిందూ, ధర్మాదాయ శాఖ మంత్రి శేఖర్‌బాబు సమాధానం ఇచ్చారు. వృథా అవుతున్న నీటిని పరిరక్షించే విధంగా వెయ్యి చెక్ డ్యాంలను నిర్మించబోతున్నామని, తమ శాఖకు మరింత నిధులు అవసరం ఉందని నీటి పారుదల శాఖమంత్రి దురై మురుగన్ మరో సభ్యుడి ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.తమిళ తాతగా పిలవబడే యూవీ స్వామినాథన్ జయంతి రోజైన ఫిబ్రవరి 19వ తేదీని ఇలక్కియ మరుమలర్చి నాల్గా ( సాహిత్య పునర్జీవన దినోత్సవం)గా ప్రకటించాలని అన్నాడీఎంకే సభ్యుడు కేపీ మునుస్వామి చేసిన విజ్ఞప్తికి సీఎం స్టాలిన్ స్పందిస్తూ ఆచరణలో పెడుతున్నామని ప్రకటించారు. రోడ్ల మీద స్వైర విహారం చేస్తున్న ఆవులు, పశువులు, వీధి కుక్కల కట్టడికి ప్రత్యేక చర్యలు చేపట్టనున్నామని నగరాభివృద్ధి శాఖమంత్రి కేఎన్ నెహ్రూ మరో సభ్యుడికి ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు. కోయంబత్తూరు కార్పొరేషన్ పరిధిలో రోడ్ల అభివృద్ధికి రూ. 300 కోట్లు కేటాయించామని ప్రకటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సభ్యుడుసెల్వపెరుంతొగై స్పందిస్తూ, తన నియోజకవర్గం పరిధిలో తరచూ కొన్ని ప్రాంతాలు వర్షాలతో వర ముంపునకు గురి అవుతున్నాయని, ఇందుకు త్వరితగతిన శాశ్వత పరిష్కారం చూపించాలని విన్నవించడంతో పరిశీలిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మళ్లీ తాను పోటీ చేయాలా? వద్దా? అన్నది మంత్రి చేతిలోనే ఉందంటూ ఈ సందర్భంగా సెల్వ పెరుంతొగై చమత్కరించారు.వాటర్ వార్ఫెంగల్ తుపాన్ సమయంలో సాత్తనూరు డ్యాంను రాత్రికి రాత్రే తెరవడంతో తెన్ పైన్నె నది ఉప్పొంగి విల్లుపురం, కడలూరు జిల్లాలోని వందలాది గ్రామాలను జలదిగ్భంధంలో ముంచేసినట్టుగా ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారం అసెంబ్లీకి చేరింది. 2024–25 సంవత్సరానికి గాను అదనపు వ్యయం వ్యవహారంలో దాఖలైన అను బంధ బడ్జెట్ చర్చ సమయంలో అన్నాడీఎంకే సభ్యుడు తంగమణి సాత్తనూరు డ్యాంను తెరమీదకు తెచ్చారు. రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ముందు జాగ్రత్తలు తీసుకోకుండా సాత్తనూరు డ్యాంను హడావుడిగా తెరిచేయడంతోనే వందలాది గ్రామాలు, వేలాది మంది ప్రజలు జలదిగ్బంధంలో చిక్కారని ధ్వజమెత్తారు.ఆహారం, నీళ్ల కోసం ప్రజలు అలమటించాల్సి వచ్చిందని మండి పడ్డారు. ఈ సమయంలో మంత్రి కేకేఎస్ఎస్ఆర్ రామచంద్రన్ ఎదురు దాడికి దిగారు. అన్నాడీఎంకే హయాంలో చడీ చప్పుడు కాకుండా చెంబరం బాక్కం రిజర్వాయర్‌ను తెరిచినట్లుగా సాత్తనూరు డ్యాంను తాము తెరవ లేదని, ఐదుసార్లు హెచ్చరికలు జారీ చేసిన అనంతరం గేట్ల ద్వారా నీటిని విడుదల చేశామన్నారు. కేకేఎస్ఎస్ ఆర్.. ఐదు సార్లుమశ్రీచ్చరిరకలు ఇచ్చినానంతం సాత్తనూరు లో డ్యాం నీటి విడుదల చేశారు. చెంబరంబాక్కం రిజర్వాయర్ అని, అయితే, సాత్తనూరు డ్యాం అన్నది మంత్రి గుర్తెరగాలని ఈసందర్భంగా ప్రధాన ప్రతిపక్ష నేత, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి ఎదురు ప్రశ్నలను సందించారు. పరస్పరం వాగ్వివాదంచోటు చేసుకోవడంతో అన్నాడీఎంకే సభ్యులతో మంత్రులు కేకేఎస్ఎస్ఆర్, ఎంసుబ్రమణియన్, శేఖర్‌బాబు, అన్బరసన్ ఎదురుదాడి చేస్తూ వ్యాఖ్యల తూటాలను పేల్చడంతో సభ లో గందరగోళం నెలకొంది. అదే సమయంలో ఈ వ్యవహారానికి ముగింపుపలికే విధంగా సీఎం స్టాలిన్ స్పందించారు. అదే సమయంలో పళణి స్వామి సైతం వ్యాఖ్యల స్వరాన్ని పెంచారు. చెంబరం బాక్కం నుంచి సెకనుకు 29 వేల గణపుటడుగుల నీటిని మాత్రమే విడుదల చేయడానికి వీలుందని, అయితే, ఇతర ప్రాంతాలలోని వందలాది చెరువులు తెగడంతో ఆ నీరు అడయార్‌లో ఉధృతంగా ప్రవహించి గతంలో చైన్నె మునకు పరిస్థితులు దారి తీశాయని పళణి స్వామి వివరణ ఇచ్చారు. ఎన్ని అడుగుల నీళ్లు, ఎంత శాతం నీళ్లు ప్రవహించాయన్నది ముఖ్యం కాదని, ఎవరి అనుమతితో గేట్లను తెరిచారో అన్నది ముఖ్యం అని ఈసందర్భంగా సీఎం స్టాలిన్ వ్యాఖ్యలు చేశారు. చెంబరం బాక్కం గేట్ల ఎత్తివేతలో మానవ తప్పిదం జరిగిందా..? లేదా 250 మందికి పైగా మరణానికి నీటి విడుదల కారణం కాదా? అన్న ప్రశ్నలను సంఽధించడంతో డీఎంకే, అన్నాడీఎంకే మధ్య సభలో పెద్ద వారే సాగింది. సభ వాగ్వాదం, అరుపులు కేకలు సాగడంతో సీనియర్ మంత్రి దురై మురుగన్ రంగంలోకి దిగి ఇక, చాలు ఈ రచ్చ అంటూ పరిస్థితి గడిలో పెట్టే ప్రయత్నం చేశారు.వివరణ ఇవ్వాలని..ప్రశ్నోత్తరాల అనంతరం పీఎంకే శాసన సభా పక్ష నేత జికే మణి అదానీ పవర్ ప్రస్తావనను తెర మీదకు తెచ్చారు. అదానీ పవర్‌తో ఒప్పందాల గురించి స్పష్టమైన వివరణ ఇవ్వాలని పట్టుబట్టారు. ఇందుకు సీఎం స్టాలిన్ స్వయంగా సమాధానం ఇచ్చారు. ఈ వ్యవహరాన్ని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. అస్సలు అదానీని తాను ఎన్నడూ కలవ లేదని, చూడనూ లేదని స్పష్టం చేశారు. సౌరశక్తి విద్యుత్ విషయంగా ఇప్పటికే మంత్రి స్పష్టమైన వివరణ ఇచ్చారని గుర్తు చేశారు. ఇది వరకు ఈ వ్యవహారంపై పీఎంకే నేతలు బయట తీవ్ర ఆరోపణలు గుప్పించారని, ఇప్పుడేమో తమరు ప్రశ్నలు సంధిస్తున్నారని జీకే మణినిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. అదానీని తాను చూడనూ లేదు, కలవను లేదని స్పష్టం చేస్తున్నానని, ఆయన కూడా తనను కలవ లేదని వివరణ ఇచ్చారన్నారు. అదే సమయంలో ఈ వ్యవహారంలో పార్లమెంట్ జాయింట్ కమిటీ విచారణకు పీఎంకే, బీజేపీ సిద్ధమా...? అని సవాల్ చేశారు. ప్రతి పక్షాలన్నీ ఉభయ సభలలో జాయింట్ కమిటీ కోసం పట్టుబడుతున్నాయని, ఈ విషయంపై నిర్ణయం తీసుకోవడంలో ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. ముందు ఇందుకు సమాధానం ఇవ్వండీ అని నిలదీశారు. అదే సమయంలో సీఎం స్టాలిన్ సరైన వివరణ ఇవ్వలేదంటూ పీఎంకే సభ్యులు సభ నుంచి వాకౌట్ చేసి బయటకు వచ్చేశారు. ఇదిలా ఉండగా పార్లమెంట్ జాయింట్ కమిటీ విచారణకు పీఎంకే మద్దతు ఇస్తున్నట్టు ఆ పార్టీ అధ్యక్షుడు అన్బుమణి రాందాసు ఓ ప్రకటన ద్వారా పేర్కొనడం గమనార్హం. -
తల్లి రైల్వే కూలీ.. బిడ్డకు పవర్ లిఫ్టింగ్‌లో బంగారు పతకం
రష్యాలో జరిగిన డబ్ల్యూపీపీఎల్ వరల్డ్ కప్ పవర్ లిఫ్టింగ్‌లో బంగారు పతకం సాధించి ప్రశంసలు అందుకుంటోంది కస్తూరి రాజమూర్తి. కస్తూరి కథ చాలామంది విజేతలతో పోల్చితే భిన్నమైనది. కస్తూరి తల్లి తిరువణ్ణామలై రైల్వేస్టేషన్లో పోర్టర్. తల్లి పెద్ద పెద్ద బ్యాగులు, సూటుకేసులు మోస్తుంటే ఆసక్తిగా చూసేది. తల్లికి సహాయంగా తాను కూడా చిన్న చిన్న బరువులు మోసేది. ఈ కష్టం ఊరకే పోలేదు. వెయిట్ లిఫ్టింగ్‌పై ఆసక్తి పెంచుకునేలా, పతకాలు గెలుచుకునేలా చేసింది.‘గెలుస్తాను అనుకోలేదు’ అంటుంది కస్తూరి రష్యాలో వెయిట్ లిఫ్టింగ్‌లో బంగారు పతకం గెలుచుకోవడం గురించి. ఎందుకంటే ఆమెను ఓటమి కంటే గెలుపు పలకరించిన సందర్భాలే ఎక్కువ. పోటీలో బరువు ఎత్తబోతున్నప్పుడు మా అమ్మ రైల్వేస్టేషన్లో బ్యాగులు ఎత్తి నెత్తి మీద మోసే దృశ్యాన్ని గుర్తు చేసుకున్నాను. మా అమ్మే నాకు స్ఫూర్తి. మరిన్ని పతకాలు గెలుచుకోవాలనుకుంటున్నాను. ఎలాంటి కష్టాలు లేకుండా అమ్మను చూసుకోవాలనుకుంటున్నాను’ అంటుంది కస్తూరి.తిరువణ్ణామలై ప్రాంతంలోని చెయ్యార్ అనే చిన్న గ్రామంలో పుట్టి పెరిగిన కస్తూరి అనుకోకుండా వెయిట్ లిఫ్టింగ్‌పై ఆసక్తి పెంచుకుంది. కొత్తూర్పురంలో స్థానిక ఇన్‌స్ట్రక్టర్ల దగ్గర వెయిట్‌లిఫ్టింగ్‌లో శిక్షణ తీసుకుంది. ఇల్లు వదిలి వేరే ఊళ్లో శిక్షణ తీసుకోవడానికి తల్లిదండ్రులు మొదట ఒప్పుకోకపోయినా కస్తూరి పట్టుదల చూసి ఆ తరువాత ఒప్పుకోక తప్పింది కాదు.కొత్తగా పరిచయం అయిన ఆట అయినప్పటికీ ఏడాదిలోపే జిల్లా పోటీలో 36 పతకాలు గెలుచుకుంది. వీసా కోసం దరఖాస్తు చేసుకోవడానికి డబ్బులు లేకపోవడంతో యూరప్‌లో పోటీ పడే అవకాశాన్ని కోల్పోయింది. ఇండియన్ పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్ సహకారంతో రష్యాలోని నోవోసిబిర్క్స్ వరల్డ్‌కప్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలో పాల్గొంది. 75 కేజీల విభాగంలో డెడ్‌లిఫ్ట్ చేసింది.తాజాగా.... ఒలింపిక్ వెయిట్‌లిఫ్టింగ్ ట్రైనింగ్ కోసం తమిళనాడు స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి కస్తూరికి ఫోన్ కాల్ వచ్చింది. అయితే ఈ కాల్ కస్తూరిని పెద్దగా సంతోష పరిచినట్లు లేదు. ‘ముందు నాకు ఉద్యోగం కావాలి. మా కుటుంబం మొత్తం అమ్మపైనే ఆధారపడింది. నాన్న అనారోగ్యంగా ఉన్నారు. మా అక్కాచెల్లెళ్లు ఉద్యోగాల కోసం వెదుకుతున్నారు. నా కుటుంబం ఆర్థికంగా బాగుండి, సంతోషంగా ఉంటేనే నేను ఆటలపై బాగా దృష్టి కేంద్రీకరించగలుగుతాను’ అంటోంది కస్తూరి రాజమూర్తి. -
స్కాలర్షిప్
ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులకు.. ‘మీ పిల్లలు కూడా ఇంజినీర్లు కావచ్చు’ అనే నినాదంతో స్కాలర్షిప్, అవార్డుల కార్యక్రమాన్ని సుమంగళ స్టీల్ సంస్థ బుధవారం నిర్వహించింది. చైన్నెలో జరిగిన కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి అన్బల్ మహేష్, సుమంగళ స్టీల్ చైర్మన్ రాజేంద్రన్ సభానాయగం 19 మంది అవార్డులను, విద్యా ఖర్చుగా రూ.లక్ష చొప్పున స్కాలర్షిప్లు, ల్యాప్‌టాప్‌లు వంటివి విద్యార్థులకు అందజేశారు.– సాక్షి, చైన్నె -
బిగ్‌షార్ట్స్ సీజన్ – 3 విజేతల ప్రకటన
తమిళసినిమా: సినిమా రంగంలో ప్రతిభకు కొరత లేదు. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో వినూత్న ప్రయత్నాలు చేయడానికి ఈ తరం రెడీగా ఉంది. అయితే అలాంటి వారికి ప్రోత్సాహం ఉంటే అద్బుతాలు చేయడానికి యువతరం సిద్ధం. అలాంటి వారిని ప్రోత్సహించే విధంగా మూవీ బఫ్, టర్మెరిక్ సంస్థలు బిగ్‌షార్ట్స్ పేరుతో షార్ట్ ఫిలింస్ పోటీలను నిర్వహిస్తున్నారు.ఇప్పటికే రెండు సీజన్లను నిర్వహించిన ఈ సంస్థలు తాజాగా బిగ్‌షార్ట్స్ సీజన్ 3 విన్నర్, రన్నర్ల జాబితాను బుధవారం వెల్లడించారు. దీనికి సంబందించిన ప్రకటనను మీడియాకు విడుదల చేశారు. అందులో నెల్లియన్ కరుప్పయ్య దర్శకత్వం వహించిన బీ లక్ కుట్టిపయ్య అనే షార్ట్ ఫిలిం ప్రథమ బహుమతిని గెలుచుకుంది. అందుకు గానూ ఆ దర్శకుడు కూ.5 లక్షల నగదు బహుమతిని గెలుచుకోవడంతో పాటు, టెర్మెరిక్ మీడియా సంస్థ నిర్మించనున్న చిత్రాల కథా చర్చలో పాల్గొనే అవకాశాన్ని, శిక్షణ నిచ్చే అవకాశాన్ని పొందారు. అదేవిధంగా ఈ పోటీల్లో మొదటి రన్నర్ అప్‌గా అన్బుడెన్ అనే షార్ట్ ఫిలిం నిలిచింది. దీనికి విఘ్నేశ్ వడివేల్ దర్శకత్వం వహించారు.రెండవ రన్నర్ అప్‌గా రెండు అనే షార్ట్ ఫిలిం నిలిచింది. దీనికి పవన్ అలెక్స్ దర్శకత్వం వహించారు. కడవులే అనే షార్ట్ ఫిలిం మూడవ రన్నర్ అప్ అవార్డును గెలుచుకుంది. దీనికి బాలభారతీ దర్శకత్వం వహించారు. బాలాజీ నాగరాజన్ దర్శకత్వం వహించిన ది స్పెల్ అనే షార్ట్ ఫిలిం నాలుగవ రన్నరప్‌గా నిలిచింది. వీటిలో తొలి రన్నర్‌గా నిలిచిన షార్ట్ ఫిలిం రూ.3 లక్షల నగదు బహుమతిని, రెండవ రన్నర్ అప్‌గా నిలిచిన షార్ట్ ఫిలింకు రూ.2 లక్షల నగదు బహుమతి గెలుచుకున్నాయి. మూడు, నాలుగ స్థానాల్లో నిలిచిన షార్ట్ ఫిలింస్ తలా రూ.30 వేల విలువైన వోచర్లను గెలుచుకున్నాయి. కాగా ఈ అవార్డుల కార్యక్రమానికి దర్శకుడు ఎస్యు.అరుణ్‌కుమార్, హలితా షమీమ్, కార్తీక్ సుబ్బరాజ్, ఆర్కే.సెల్వ, పిలోమిన్రాజ్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, ఛాయాగ్రహకుడు తేనీ ఈశ్వర్, విశ్లేషకుడు శ్రీధర్ పిళ్లై జ్యూరీ సభ్యులుగా వ్యవహరించారు. -
ఇళయరాజా సంగీతంలో తిరుక్కురల్
తమిళసినిమా: తిరువళ్లువర్ సామాజిక అంశాలతో రాసిన ప్రముఖ గ్రంథం తిరుక్కురల్. ఇది వాసికెక్కిన తమిళుల ప్రాచీన గ్రంథం. అలాంటి తిరుక్కురల్ ఇప్పుడు సినిమాగా తెరకెక్కుతోంది. ఇంతకు ముందు దివంగత మాజీ ముఖ్యమంత్రి కామరాజర్ జీవిత చరిత్రను కామరాజ్ పేరుతో రూపొందించిన రమణా కమ్యునికేషన్స్ అధినేత ఏజే.బాలకృష్ణన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందించడంతో పాటు రెండు పాటలను రాయడం విశేషం. కాగా ఇందులో వళ్లువర్గా కలైచోళన్, వాసూకిగా నటి ధనలక్ష్మి నటిస్తుండగా, పాండియన్ రాజాగా ఓఏకే సుందర్, నక్కీరర్గా దర్శకుడు సుబ్రమణియ శివ, పుల్వర్ పెరుంతలైచందన్గా కొట్టాచ్చి నటిస్తున్నారు. వీరితో పాటు గుణబాబు, పాటినికుమార్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సెంబూర్ కె.జయరాజ్ కథ, కథనం, సంభాషణలు అందిస్తున్న ఈ చిత్రానికి ఎడ్విన్ సహాయ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. కాగా తిరుక్కురల్ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోందని యూనిట్ వర్గాలు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. -
డిసెంబర్ నాకు స్పెషల్
తమిళసినిమా: సెంటిమెంట్స్ అనేవి అందరికీ ఉంటాయి. సినిమారంగంలో కాస్త ఎక్కువ అనే చెప్పాలి. ఇక నమ్మకాలు కూడా ఉంటాయి. అందుకు ఒక్కొక్కరికీ ఒక్కో కారణం ఉంటుంది. ఏదైనా కలిచిరావడమే అల్టిమేట్ కారణం అవుతుంది. నటి రష్మిక మందన్నా కూడా అలాంటి నమ్మకం ఉందంటోంది. పుష్ప చిత్రంతో నేషనల్ క్రష్‌గా మారిన ఈ బ్యూటీ ఇప్పుడు తెలుగు, తమిళం చిత్రాల్లో నటిస్తున్నా, ఎక్కువగా బాలీవుడ్ చిత్రాలపై కాన్సట్రేషన్ పెడుతుందనే ప్రచారం జోరందుకుంది. అందుకు కారణం అక్కడ వరుసగా చిత్రాలు అంగీకరించడమే కావచ్చు. ఇకపోతే ఈమె నటుడు అల్లు అర్జున్‌కు జంటగా నటించిన పుష్ప – 2 చిత్రం గురువారం ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి రానుంది. ఈ చిత్ర ప్రమోషన్‌కు యూనిట్‌తో పాటు రష్మిక మందన్నా కూడా బాగానే కష్టపడింది. తెలుగు రాష్ట్రాలతో పాటు, తమిళ నాడు, కర్ణాటక, కేరళా, ముంబాయ్ అంటూ ప్రచారానికి తెగ తిరిగేసింది. కారణం ఈ చిత్రంపై ఆమె పెట్టుకున్న నమ్మకం అలాంటిదట. ఇకపోతే ఇటీవల రష్మిక మందన్నా ఒక వీడియోను సామాజిక మాధ్యమంలో విడుదల చేసింది. అందులో డిశంబర్ నెల తనకు చాలా ప్రత్యేకం అని పేర్కొంది.పుష్ప చిత్రం డిశంబర్ నెలలోనే విడుదలయ్యిందని, ఆ తరువాత హిందీ చిత్రం యానిమల్ కూడా డిశంబర్‌లోనే తెరపైకి వచ్చిందని ఈ రెండు చిత్రాలు బ్లాక్ బస్టర్‌గా నిలిచాయని చెప్పింది. ఇక ప్రపంచ వ్యాప్త సినీ అభిమానులు ఎదురు చూస్తున్న పుష్ప–2 చిత్రం కూడా డిసెంబర్ 5వ తేదీన విడుదల కావడం సంతోషంగా ఉందనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేసింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. కాగా తాజాగా నటి రష్మిక మందన్నా నటుడు ధనుష్ కథానాయకుడిగా, టాలీవుడ్ స్టార్ నటుడు నాగార్జున ప్రధాన పాత్రను పోషిస్తున్న కుబేర చిత్రం, హిందీలో సల్మాన్‌ఖాన్ సరసన సికిందర్ అనే చిత్రంలోనూ నటిస్తున్నారు. కాగా ఈమె ఉమెన్స్ సెంట్రిక్ కథా పాత్రలో నటించిన గర్ల్ ఫ్రెండ్ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. కాగా ఇటీవల ఈ అమ్మడు వాణిజ్య ప్రకటనలలోనూ నటించడం మొదలెట్టారు. -
ప్రోమో షూట్ రద్దు?
తమిళసినిమా: నటుడు శివకార్తికేయన్ కథానాయకుడిగా వరుస విజయాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అయలాన్, మావీరన్, ఇటీవల విడుదలైన అమరన్ చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. కాగా తాజాగా మరో మూడు చిత్రాలో బిజీగా ఉన్నారు. అందులో ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తదుపరి డాన్ చిత్రం ఫేమ్ సిబి.చక్రవర్తి దర్శకత్వంలో ఒక చిత్రం చేయనున్నారు. అదేవిధంగా మహిళా దర్శకురాలు సుదా కొంగర దర్శకత్వంలో తన 25వ చిత్రంలో శివకార్తీకేయన్ నటించడానికి సిద్ధం అవుతున్నారు. పురనానూరు పేరుతో తెరకెక్కనున్న దీన్ని డాన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనుంది. కాగా ఈ చిత్ర షూటింగ్‌ను బచ్చే ఏడాది జనవరిలో ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్న సమాచారం. కాగా అందులో భాగంగా బుధవారం ఈ చిత్రానికి సంబంధించిన ప్రోమో షూట్ చేయడానికి రెడీ అయినట్లు, అయితే దర్శకురాలు సుధా కొంగర, నటుడు శివకార్తికేయన్ మధ్య విభేదాలు తలెత్తడంతో ప్రోమో షూట్ రద్దు అయినట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.ప్రోమో షూట్‌కు వచ్చిన శివకార్తికేయన్ పుల్ గడ్డంతో ఉండడంతో దాన్ని తీయమని దర్శకురాలు సుధా కొంగర చెప్పడంతో ముందుగా ఇలానే ఉండాలని చెప్పారుగా అని శివకార్తికేయన్ చెప్పారని, అయితే పరుత్తివీరన్‌లో కార్తీ మాదిరి ఉంటే ఎలా అని దర్శకురాలు సుధాకొంగర అనడంతో టెన్షన్ అయిన శివకార్తికేయన్ షూటింగ్ స్పాట్ నుంచి వెవెళ్లిపోయినట్లు టాక్ స్ప్రెడ్ అవుతోంది. అయితే ఈ వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించి మళ్లీ త్వరలోనే ప్రోమో షూట్ నిర్వహించనున్నట్లు తెలిసింది. అయితే ఇందులో నిజం ఎంత అన్నది తెలియాల్సి ఉంది. కాగా ఈ చిత్రం ద్వారా నటి శ్రీలీల కోలీవుడ్‌కు పరిచయం కానున్నారనే ప్రచారం జోరుగానే సాగుతోంది. అదే విధంగా ఇందులో నటుడు జయంరవి ప్రతినాయకుడిగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి జీవీ.ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
హిందీ నేర్చుకుంటున్నందుకు...నన్ను హేళన చేశారు: నిర్మల
న్యూఢిల్లీ: తమిళనాడులో స్కూలుకెళ్లే రోజుల్లో హిందీ నేర్చుకునే విద్యారి్థనిగా అవమానాలను ఎదుర్కొన్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. లోక్‌సభలో మంగళవారం బ్యాంకింగ్ చట్ట సవరణ బిల్లుపై ఆమె హిందీలో మాట్లాడుతుండగా ప్రతిపక్ష సభ్యులు అడ్డుకున్నారు. దాంతో ఆమె తన చిన్ననాటి ఘటనలను గుర్తు చేసుకున్నారు. ‘‘తమిళనాడులో హిందీ నేర్చుకునే వారికి అడ్డంకులు సృష్టించారు. తమిళ గడ్డపై పుట్టి, ఉత్తర భారత భాష నేర్చుకోవడమేంటని అడ్డుకునే వారు. నేను మదురై వీధుల్లో వెళ్తుండగా హేళనగా మాట్లాడేవారు’’ అని చెప్పారు.‘‘ఇష్టమైన భాషను నేర్చుకునే స్వేచ్ఛ, హక్కు నాకు లేవా? తమిళనాడు మన దేశంలో భాగం కాదా? హిందీ నేర్చుకోకుండా నన్ను అడ్డుకోవడం నిర్బంధం కాదా?’’ అని ప్రశ్నించారు. హిందీ, సంస్కృతాలను విదేశీ భాషలుగా పరిగణించడం తగదన్నారు. హిందీని బలవంతంగా రుద్దుతున్నామంటూ విమర్శించే వారు తన ప్రశ్నలకు సమాధానమివ్వాలన్నారు. ‘‘తమిళ భాషను ప్రధాని మోదీ ఐరాస దృష్టికి తీసుకెళ్లారు. ఇలా ఇంకెవరైనా చేయగలిగారా? మోదీ ప్రసంగాల్లో తరచూ తమిళ భాషను ప్రస్తావిస్తారు. అదీ తమిళులకు మేమిచ్చే గౌరవం! డీఎంకేతో పొత్తు పెట్టుకునే పారీ్టకి చెందిన ప్రధానులెవరైనా ఇలా చేశారా?’’ అని కాంగ్రెస్‌ను ఉద్దేశించి నిర్మల దుయ్యబట్టారు. -
మంత్రిపై బురదజల్లిన వరద బాధితులు..
చెన్నై: ఫెంగల్ తుపాను తమిళనాడులో బీభత్సం సృష్టించింది. తుపాన్ కారణంగా ఇప్పటికే పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. భారీగా ఆస్తి నష్టం జరిగింది. వరద నీటికి ధాటికి పలు ప్రాంతాల్లో వాహనాలు కొట్టుకుపోయిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.మరోవైపు.. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోని వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక, భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలను పరామర్శించేందుకు వెళ్లిన మంత్రికి చేదు అనుభవం ఎదురైంది. ఆగ్రహంతో ఉన్న ప్రజలు.. సదరు మంత్రిపైనే బురద చల్లారు. దీంతో, ఈ ఘటన తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.తమిళనాడు అటవీ శాఖ మంత్రి కె. పొన్ముడి సోమవారం విల్లుపురం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కొన్నారు. తుపాన్ సమయంలో తమకు సహాయక చర్యలు అందలేదని ఎవరూ పట్టించుకోలేదని మండిపడ్డారు. ఇదే సమయంలో మంత్రి, ఆయన కుమారుడి సికామణిపై స్థానికులు బురదజల్లారు. దీంతో.. మంత్రి, సిబ్బంది చేసేదేమీలేక అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.This is the current state of affairs in Tamil Nadu. The CM and the Deputy Chief Minister were busy taking photos in the streets of Chennai while the city received very little rain and did not bother to keep track of the happenings beyond Chennai. The DIPR behaves like the media… pic.twitter.com/DvZN3UT1f0— K.Annamalai (@annamalai_k) December 3, 2024 ఇక, ఈ ఘటనపై తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై స్పందించారు. వీడియోను ట్విట్టర్లో షేర్ చేస్తూ.. తమిళనాడులో ప్రస్తుత పరిస్థితి ఇది. చెన్నై వీధుల్లో సీఎం, ఉపముఖ్యమంత్రి ఫొటోలు దిగుతూ బిజీగా ఉన్నారు. చెన్నైకి బయట ఘటనలను ట్రాక్ చేయడానికి డీఐపీఆర్.. డీఎంకే మీడియా విభాగంలా ప్రవర్తిస్తుంది. వాస్తవాల నుండి ప్రజలను మళ్లించడానికి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అవినీతితో కూరుకుపోయిన డీఎంకే ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. ప్రజల నిరసన తారాస్థాయికి చేరుకుంది. అందుకే ఇలాంటి దాడులు చేస్తున్నారు. ఇది కేవలం శాంపిల్ మాత్రమే అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
ఫెంగల్ తుఫాన్ బీభత్సం.. సీఎం స్టాలిన్‌కు ప్రధాని ఫోన్
చెన్నై: ఫెంగల్ తుఫాన్ తమిళనాడులో అపార నష్టాన్ని మిగిల్చింది. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి, తమిళనాడులోని విల్లుపురం, సేలం, కడలూరు, కళ్లకురిచ్చి, తిరువణ్ణామలై జిల్లాలో పెను విలయాన్ని మిగిల్చింది. కుండపోతగా వర్షంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. ఈ వరదలకు ఊర్లకు ఊర్లో మునిగిపోయాయి.తాజాగా వరదలపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు ప్రధానమత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఫోన్ చేసి మాట్లాడారు. రాష్ట్రంలోని వర్షాలు, వరద పరిస్థితిపై ప్రధాని ఆరా తీశారు.కేంద్రం నుంచి అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రానికి సహాయ, సహకారాలు అందిస్తామని తెలిపారు.ఇక ఉత్తర తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో భారీ వర్షాల కారణంగా వరదలు పోతెత్తాయి. వంతెనలు, రోడ్లు నీట మునిగాయి. భారీ విస్తీర్ణంలో పంట పొలాలు ధ్వంసమయ్యాయి. అనేక గ్రామాలు నీట మునిగి ఉన్నాయి. సాయం కోసం గ్రామీణ జనం ఎదురుచూస్తున్నారు. మరోవైపు సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌తోపాటుగా మంతరులు బాధిత ప్రాంతాలలో పర్యటిస్తున్నారు.తిరువణ్ణామలై మహా దీపం కొండపై నుంచి మట్టి చరియలు, బండరాళ్లు కొట్టుకు వచ్చి ఆదివారం రాత్రి ఇళ్లపై పడిన విషయం తెలిసిందే. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ఈ శిథిలాల కింద చిక్కుకున్నారు. వీరిని ప్రాణాలతో రక్షించేందుకు ప్రయత్నిచినా.. ఫలితం లేదు. సోమవారం రాత్రి మృతదేహాలుగా వారంతా బయట పడ్డారు.మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్ పుదుచ్చేరి వద్ద బలహీనపడి వాయుగుండంగా మారిందని వాతావరణశాఖ ప్రకటించింది. మంగళవారం అరేబియన్ సముద్రంలో ప్రవేశించే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. -
తమిళనాడులో భారీ వర్షాలు.. కొట్టుకుపోతున్న కార్లు, బస్సులు (ఫొటోలు)
-
తమిళనాడులో విషాదం.. ఒకే కుటుంబంలో ఏడుగురు మృతి!
చెన్నై: ఫెంగల్ తుపాన్ కారణంగా తమిళనాడులో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కొండచరియలు విరిగి పడిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతిచెందారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.వివరాల ప్రకారం.. ఫెంగల్ తుపాన్ ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా పలు చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. కాగా, సోమవారం మధ్యాహ్నం తిరువణ్ణామలైలో దేవాలయం వద్ద ఉన్న నివాసంపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు వ్యక్తులు మరణించారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రెస్య్కూ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.TODAY, LANDSLIDE HITS #Tiruvannamalai, Tamil Nadu, India 🇮🇳 (Dec 02, 2024)Rescue operations are ongoing to locate 7 missing people trapped in a landslide, with thick rocks and debris hindering efforts.#TNRains | #cyclon pic.twitter.com/XehTWMa5df— Weather monitor (@Weathermonitors) December 2, 2024ఇదిలా ఉండగా.. వర్షాల కారణంగా ఇప్పటికే తమిళనాడులో కొండచరియలు విరిగిపడిన విషయం తెలిసిందే. ఆదివారం సాయంత్రం కొండచరియలు విరిగిపడటంతో అందులో కొందరు చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు.. తుపాన్ కారణంగా తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. పలు చోట్ల వరదల ధాటికి బస్సులు, కార్లు కొట్టుకుపోతున్నాయి. ఇప్పటికీ పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. 🌊🇮🇳MASSIVE FlOODS HITS KASARAGOD.(DECEMBER 02, 2024)Siriyā Highway inundated in Kasargod, as Cyclone Fengal brings heavy rains to Northern Kerala, India.#Keralarains | #CycloneFengal pic.twitter.com/FneXAdKvGq— Weather monitor (@Weathermonitors) December 2, 2024Current situation: Arasur Main Road, Chennai-Trichy National Highway, flooded. Traffic halted due to severe waterlogging.India 🇮🇳 #CycloneFengal #ChennaiRains pic.twitter.com/ReArSN5ZYh— Weather monitor (@Weathermonitors) December 2, 2024 -
‘ఫెంగల్’ తడాఖా.. వరదల్లో కొట్టుకుపోతున్న బస్సులు, కార్లు..
చెన్నై: ఫెంగల్ తుపాన్ కారణంగా తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో వాగులు, చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద చేరుకుంది. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. భారీ వరదకు రోడ్డుపై నిలిపిన వాహనాలు కొట్టుకుపోతున్నాయి. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో బస్సులు, కార్లు వరదల్లో కొట్టుకుపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాల ప్రకారం.. ఫెంగల్ తుపాను ప్రభావంతో తమిళనాడు అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భారీ వరదకు రోడ్డుపై నిలిపిన వాహనాలు కొట్టుకుపోతున్నాయి. పుదుచ్చేరి, విల్లుపురం, తిరువన్నామలై, ధర్మపురి జిల్లాలపై ఈ తుఫాన్ ప్రభావం అధికంగా ఉంది. రోడ్లపై నీరు ప్రవహిస్తుండటంతో చాలా ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ఇక, కృష్ణగిరి జిల్లాలో వరద ధాటికి బస్సులు, కార్లు వరదల్లో కొట్టుకుపోయాయి. వరదల్లో ఇళ్లు సైతం నీటి మునిగాయి. వరద నీటిలో పాములు కనిపించడం ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. Scary visuals coming from Uthangarai, Krishnagiri district. Once in a lifetime historic rains of 500mm recorded. Super rare to see such numbers in interiors. Why slow moving cyclones are always dangerous. #CycloneFengal #Tamilnadu #Floods #Krishnagiri pic.twitter.com/K8Jla22VUc— Chennai Weatherman (@chennaisweather) December 2, 2024ఇదిలా ఉండగా.. తుపాన్ కారణంగా భారీ వర్షాల నేపథ్యంలో తమిళనాడు, పుదుచ్చేరిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించారు అధికారులు. ఇక, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇండియన్ ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి.Cyclone Fengal Wreaks Havoc Along India’s Coast, Three DeadThe storm made landfall near Puducherry & unleashed torrential rains and winds, sparking severe flooding across Tamil Nadu, & submerging streets, homes, and businesses as well as leaving thousands displaced. pic.twitter.com/dyAOtrQQd4— COMMUNITY EARTH RADIO🌎 (@COMM_EARTH) December 2, 2024మరోవైపు.. తుపాన్ ప్రభావం తాజాగా కర్ణాటక మీద కూడా చూపిస్తోంది. కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో బెంగళూరు, హసన్, మాండ్యా, రామనగర జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ విధించింది. అలాగే, ఉడిపి, చిక్మంగ్లూర్, చిక్బల్లాపూర్ జిల్లాలకు ఆరెంట్ అలర్ట్ విధించారు వాతావరణ శాఖ అధికారులు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. Remnant of Cyclone Fengal - WML has moved on from Bengaluru to further West #BengaluruRains #KarnatakaRainsParts of South Interior Karnataka districts of Tumakuru, Ramanagara & Mandya have got heavy rains from this & the action will now shift to Malenadu & Coastal Karnataka… https://t.co/oKb0uzIyqW pic.twitter.com/bdCYdYA8dC— Karnataka Weather (@Bnglrweatherman) December 2, 2024