Nehru
-
రాహుల్ గాంధీకి ప్రధాని మ్యూజియం లేఖ
న్యూఢిల్లీ: దేశ తొలి ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ రాసిన లేఖలను, మరికొన్ని పత్రాలను వెనక్కి ఇచ్చేయాలంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని, ప్రధానమంత్రి సంగ్రహాలయం కోరింది. సోనియా గాంధీ వాటిని తీసుకెళ్లారని.. వాటిని తిరిగి ఇచ్చేయాలంటూ మ్యూజియం సభ్యుడొకరు ఆయనకు లేఖ రాశారు.2008 యూపీఏ పాలనలో.. అప్పటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ అప్పటి పీఎంఎంఎల్(Prime Ministers' Museum and Library) డైరెక్టర్ అనుమతితో ఆ పత్రాలన్నింటిని తీసకెళ్లారు. అయితే వాటిని ఇప్పుడు వెనక్కి ఇవ్వాలంటూ పీఎంఎంఎల్ సభ్యుడు రిజ్వాన్ ఖాద్రి, రాహుల్‌కు లేఖ రాశారు. ఒకవేళ ఒరిజినల్ లేఖలు ఇవ్వడం ఇష్టంలేని తరుణంలో ఫొటోకాపీలు లేదంటే డిజిటల్ కాపీలైనా ఇవ్వాలని కోరారు.అయితే ఈ పత్రాల గురించి నెహ్రూ కుటుంబాన్ని కోరడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని మ్యూజియం వార్షిక సమావేశం జరిగింది. అందులో.. నెహ్రూ సంబంధిత లేఖలు, ఇతరత్రా పేపర్లు కనిపించకుండా పోవడంపై చర్చ జరిగింది. చారిత్రకంగా అవి ఎంతో ప్రాధాన్యం పత్రాలుగా అభిప్రాయపడుతూ.. వాటిని ఎలాగైనా వెనక్కి రప్పించాలని పీఎంఎంఎల్ మండలి నిర్ణయించింది. ఈ విషయంలో అవసరమైతే న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలని భావించింది. ఈ మేరకు.. సెప్టెంబర్‌లో సోనియా గాంధీని కోరుతూ ప్రధాని మ్యూజియం ఓ లేఖ రాసింది. అయితే ఆమె నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో.. ఇప్పుడు రాహుల్ గాంధీకి మరో లేఖ రాసింది. నెహ్రూ ప్రధానిగా ఉన్న టైంలో పలు కీలక పత్రాలు సైతం.. ఆ సేకరణలో ఉన్నట్లు పీఎంఎంల్ భావిస్తోంది. అలాగే.. ఎడ్విన్ మౌంట్‌బాటెన్, అల్బర్ట్ ఐన్‌స్టీన్, జయప్రకాశ్ నారాయణ్, పద్మజా నాయుడు, విజయలక్ష్మి పండిట్, అరుణా అసఫ్ అలీ, బాబు జగ్జీవన్ రామ్, గోవింద్ వల్లభ్ పంత్ లాంటి ప్రముఖలతో నెహ్రూకు మధ్య జరిగిన ఉత్తర-ప్రత్యుత్తరాలు ఆ కలెక్షన్స్‌లో ఉన్నాయి.నెహ్రూ దస్తూరితో ఉన్న ఈ లేఖలను 1971లో నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీలో(ఇప్పుడదే ప్రధానుల మ్యూజియంగా మారింది) భద్రపరిచారు. అయితే యూపీఏ హయాంలో వాటిని సుమారు 51 బాక్సుల్లో సోనియా గాంధీ నివాసానికి తరలించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. పీఎంఎంల్ మండలి కాలపరిమితి ఈ నవంబర్లోనే ముగియాల్సి ఉంది. అయితే ఆఖరి నిమిషంలో.. ఆ కాలపరిమితిని మరో రెండు నెలలు పొడిగించడం గమనార్హం.ఇదీ చదవండి: ‘తప్పులు కప్పిపుచ్చుకోవడానికే నెహ్రూ పేరు వాడుకుంటున్నారు’ -
ఒకే సీటుపై మూడు సార్లు పోటీకి దిగిన మూడో ప్రధానిగా మోదీ!
యూపీలోని వారణాసి పార్లమెంట్ స్థానం నుంచి మూడోసారి నామినేషన్ దాఖలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ.. దేశ తొలి ప్రధాని నెహ్రూ, వాజ్‌పేయిల రికార్డును సమం చేశారు. ఈ మాజీ దివంగత ప్రధానులిద్దరూ ఒకే లోక్‌సభ నుంచి ఎన్నికల్లో పోటీ చేసి భారీ ఓట్లతో విజయం సాధించారు. ఇప్పుడు మోదీ కూడా ఒకే లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయడం ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పారు.పండిట్ నెహ్రూ 1951, 1957, 1962లో మూడుసార్లు ప్రయాగ్‌రాజ్ జిల్లాలోని ఫుల్పూర్ సీటుకు ఎంపీగా ఉన్నారు. మూడుసార్లు ప్రధానిగా దేశ పగ్గాలను చేపట్టారు. భారతరత్న పండిట్ అటల్ బిహారీ వాజ్‌పేయి లక్నో నుంచి ఐదుసార్లు ఎంపీగా ఉన్నప్పటికీ, 1996, 1998, 1999లో ఎంపీ అయిన తర్వాత ప్రధాని పదవిని చేపట్టారు. తాజాగా నరేంద్ర మోదీ 2014, 2019లో వారణాసి ఎంపీగా ఎన్నికయ్యారు. రెండు పర్యాయాలు ఆయన నేతృత్వంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. వారణాసి నుంచి మూడోసారి నామినేషన్ దాఖలు చేయడం ద్వారా, ఒకే లోక్‌సభ స్థానం నుంచి వరుసగా మూడుసార్లు ఎన్నికల్లో పోటీ చేసిన ఘనత దక్కించుకున్నారు.భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో 14 మంది ప్రధానులు దేశాన్ని పాలించారు. వారిలో తొమ్మిది మంది ఉత్తరప్రదేశ్‌కు చెందినవారే కావడం విశేషం. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ నుంచి మొదలైన ఈ ట్రెండ్ నరేంద్ర మోదీ వరకూ వచ్చింది. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధి, చౌదరి చరణ్ సింగ్, రాజీవ్ గాంధీ, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, చంద్రశేఖర్, అటల్ బిహారీ వాజ్‌పేయి యూపీలోని వివిధ స్థానాల నుండి ఎన్నికలలో గెలిచి పార్లమెంటుకు చేరుకున్నారు. -
నెహ్రూ జాకెట్ సాహిత్యం
నెహ్రూ గారిని నిలదీయడం ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయిందిగాని నిజానికి ఆయనను నిలదీయాల్సింది నెహ్రూ జాకెట్‌ను ఎందుకు పాప్యులర్ చేశావయ్యా అని. రచయితలు, కవులు, విమర్శకులు మున్ముందు రోజులలో లాల్చీ పైజమా ధరించడమేగాక నెహ్రూ జాకెట్‌ను కూడా తగిలించారంటే గనక చచ్చినట్టు వారు సాహిత్యకారులుగా మన దేశంలో చలామణి అవుతారని ఆయన ఊహించి ఉండడు. ఎరిగిన సాహిత్యకారులు అడపా దడపా ఆ అదనపు వస్త్రాన్ని ధరించినా తాము సాహిత్యకారులమే అని తప్పక నిరూపించుకోవాలనుకునే వారికి మాత్రం నెహ్రూ జాకెట్ కవచ కుండలం. పూర్వం రోజులలో కొందరు సాహితీ తాపసులు పెన్నును బుగ్గకు పెట్టుకుని, నుదుటిని నింగి వంక ఎత్తి పెట్టి ఫొటో దిగి, పుస్తకం వెనుక వేసుకోవడం వల్ల వారు రచయితలని, కవులని నమ్మాల్సి వచ్చేది. మరికొందరు టెలిఫోన్ రిసీవర్‌ను చెవి దగ్గర పెటుకొన్న ఫొటోను పుస్తకం వెనుక వేయడం వల్ల అమ్మో వీరు రచయితలేస్మీ అనుకోకుండా ఉండలేకపోయేవారం. ‘మానవతా... ఎక్కడమ్మా నీ చిరునామా?’ అని గూగుల్ మేప్స్ లేని కాలంలో ఎవరు పై అడ్రస్ అడుగుతూ కవిత్వం రాసినా వారు కవులు కాకుండాపోలేదు. ఇక ఏ కాలంలో అయినా ఎల్.ఎస్.వి.శేషాచలం, మునవర్తి సుబ్రహ్మణ్యం, విక్టర్ మనోహర్, ప్రొఫెసర్ చారులత వంటి ప్రముఖ విమర్శకులు ఉంటారు కనుక వారు ముందు మాట రాసి వదిలారంటే– ఎందుకొచ్చిన గొడవ అని నోరు మెదపక అట్టి రచయితలను రచయితలే అనుకోవడమూ కద్దు. ఏదేని ఒక శాఖ కలిగిన రాష్ట్రమంత్రితో, ఏదేని ప్రాదేశిక ఇన్ కమ్టాక్సు కమిషనర్‌తో, లేదంటే స్థానిక వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్‌తో... ఈ ముగ్గురితో కాని కనీసం వీరిలో ఇద్దరితో కాని ఫొటోలు దిగి, ఫేస్బుక్లో పెట్టి, ఇక మమ్మల్ని సాహిత్యకారులం కాదు అనంటే తంతాం అనేవారు ఉన్నారంటే నోరు నొక్కుకోవాల్సిన పని లేదు. జీవితంలో అక్షరమ్ముక్క రాయకపోయినా రాసే వాళ్లందరి ఫోన్ నంబర్లు కలిగి ఉండటమే కాదు వారికి కాల్ చేసి ‘ఏవోయ్ ఎలా ఉన్నావ్’ అనిగానీ, ‘నమస్కారమండీ... టిఫినయ్యిందా’ అనిగానీ అడగ్గలిగే చనువు ఉన్నందుకు కనీసం డజను మంది తెలుగునాట ప్రముఖ సాహిత్యకారులుగా చలామణి అవుతున్నారంటే గుండె పొంగే సంగతి. ‘శుంఠల్లారా... ఇదా మీ ప్రతాపమూ... నన్ను గనక కళ్లకు గంతలు గట్టి ఢిల్లీలో ఏమూల వదిలినా నేరుగా సాహిత్య అకాడెమీ ఆఫీసుకు చేరుకోగలను’ అనేవారి ప్రదక్షిణ పటిమ వారికి ఇస్తున్న అతిశయం అంతా ఇంతా కాదు. ‘అడుగడుగున నుడి ఉంది’, ‘అక్షర రశ్మీ జయతు’, ‘మనమంతా కలం కులం’... వాట్సప్ గ్రూప్‌లను స్థాపించి, ఒక దానిలో నూట పదహారుకు తక్కువ కాకుండా సభ్యులను చేసి, అడ్మిన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఏకైక హోదా వల్ల సాహిత్య దశా దిశను నిర్దేశించాలని కన్నీళ్లతో తపన పడేవారెందరో మన హృదయాలను చెమ్మగిల్ల చేస్తున్నారు. ఈ యొక్క వాట్సప్ గ్రూప్‌లలో ప్రతి ఒక్క కవిత, వ్యాఖ్యకు మరువక లైక్ కొట్టేవారిని దృష్టిలోకి తీసుకుని మాసాంతంలో వారికో అవార్డు బహూకరించడం మరో విశిష్ట ప్రోత్సాహక ప్రోత్సహితం. జూమ్‌లో స్లాట్ బుక్ చేసి, కార్డు డిజైన్ చేయగల వనరులు కలిగినవారు వారానికి పది మందిని సాహితీ సమాలోచనంలో ముమ్మరం చేయడం చూస్తే ఏమిచ్చి వీరి రుణం తీర్చుకోగలం అనిపిస్తుంది. గుర్తు తెలియని విదేశాలకు వెళ్లి స్థానిక గాంధీనగర్ అసోసియేషన్ స్థాయి సాహితీ సమ్మేళనంలో పాల్గొని రుజువు పత్రంతోనూ, తెల్లవాళ్లతోనూ ఫొటోలు దిగి బెదురు, బెరుకు పుట్టించే వారిది స్వీయ విమానచార్జీలు భరించగలిగే స్థాయి. సాహిత్యం అంటే అందరికీ ఇష్టం. పాఠకులుగా ఉత్తమ సాహిత్యాన్ని ఇష్టపడేవారూ సృజన కారులుగా ఉత్తమ సాహిత్యసృష్టికి పెనుగులాడేవారూ ఎప్పుడూ ఉంటారు. ఈ ఇద్దరూ ప్రతి ప్రాంతంలో, భాషలో, దేశంలో తమ తమ సాహిత్యాన్ని గౌరవ భంగం కలగకుండా కాపాడుకుంటూ వస్తారు. అలాగే ప్రతి సందర్భంలో, ప్రతి సన్నివేశంలో ఈ సాహిత్యంలో భాగం కావాలని నిజాయితీగా అభిలషించేవారూ ఉంటారు.వీరి ప్రయత్న శుద్ధి, సృజన సామర్థ్యం, విడదీయలేని స్వభావం ఇవ్వవలసిన గుర్తింపు ఇస్తూనే ఉంటాయి. వీరు కాక ఔత్సాహిక పాఠకులు, ఔత్సాహిక సాహితీ సేవకులూ ఉంటారు. వీరు తమను తాము సాహితీకారులుగా భావించుకుని కార్యాచరణలో దిగడమూ, సాహిత్యానికి ప్రతినిధులుగా మారడం నేటి సోషల్ మీడియా కాలంలో విస్తృతమైంది. సాహిత్యం ఇచ్చే గుర్తింపు ఆనందాన్ని, ఆత్మసంతృప్తిని కలిగించడమేగాక ఏదో ఒక ఊతం దొరికింది కదా అనుకునేలా చేయడం ఇందుకు కారణం. ఇవన్నీ ఉండాల్సినవే. ఉండతగ్గవే. కాకుంటే శ్రుతి మించి అసలు కొంత, కొసరు మరింతగా మారడం నేటి దుఃస్థితి. వాస్తవానికి రెండు రాష్ట్రాలలోని చిన్న ఊళ్లలో ఉంటూ మంచి కవిత్వాన్ని, కథను రాస్తున్న యువతరం ఎందరో ఉన్నారు. అలాగే ఏళ్లకేళ్లు తమ మానాన తాము రాసుకుంటూ పాఠకుల గౌరవం పొందినవారూ ఉన్నారు. వీరంతా పి.ఆర్. చేయకపోవచ్చు. తమను తాము ముందుకు నెట్టుకోకపోవచ్చు. అంతమాత్రాన రాష్ట్ర, జాతీయస్థాయి వేదికల మీద వీరు కనపడాల్సిన పనిలేదు అనుకోరాదు. అదే సమయంలో పరిచయ సామర్థ్యమే సాహితీ సామర్థ్యంగా చెల్లుబాటయ్యే వారు అట్టి వేదికల మీద పదే పదే సాహితీ ముఖాలుగా కనిపించడాన్నీ ఉపేక్షించాల్సిన పని లేదు. ‘సత్యముతో పని ఏల, మిడియోకర్లతో కలిసి నడిచి ప్రయోజనాలు పొందితే పోలా’ అనుకునే నిజ సాహితీకారులదీ ఈ దోషం. కళ్లు మూత. ఏమైనా మాట్లాడే సందర్భం వస్తుంది. అభినయ సాహిత్యకారులూ కొంచెం నెమ్మదించండి! -
Birthday Special: ‘వాజపేయి ప్రధాని కావడం తథ్యం’.. నెహ్రూ ఎందుకలా అన్నారు?
నేడు (డిసెంబరు 25) దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి జన్మదినం. ఆయన ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. మరోవైపు వాజపేయి అద్భుతమైన ప్రసంగాలకు, ఇతరులను ఆకట్టుకునే సామర్థ్యానికి ప్రతీకగా నిలిచారు. అందరినీ కలుపుకొని పోయేవిధంగా రాజకీయాలు నడుపుతూ, ప్రత్యర్థులను కూడా తన వెంట తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. వాజపేయి వాక్చాతుర్యం, తర్కం ముందు ఎవరూ నిలబడలేకపోయేవారని చెబుతుంటారు. ఆయన జన్మదినమైన డిసెంబర్ 25న దేశంలో సుపరిపాలన దినోత్సవంగా జరుపుకుంటారు. అటల్ బిహారీ వాజపేయి 1924 డిసెంబర్ 25న మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జన్మించారు. హిందీ, సంస్కృతం, ఆంగ్లం, రాజనీతి శాస్త్రంలో విద్యాభ్యాసం చేశారు. ఒకప్పుడు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, జనతా పార్టీలో కొనసాగిన అటల్ బిహారీ వాజపేయి భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులలో ఒకరు. ఐక్యరాజ్యసమితిలో హిందీలో ప్రసంగించిన ప్రపంచంలోనే మొదటి వ్యక్తిగా వాజపేయి ఘనత సాధించారు. వాజపేయి మొదటి నుంచి తన ప్రసంగాలతో ఇతరులను అమితంగా ప్రభావితం చేసేవారు. దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ కూడా వాజపేయి ప్రసంగాలకు ప్రభావితమయ్యారు.. ఏదో ఒకరోజు అటల్జీ ప్రధాని అవుతారని నెహ్రూ అన్నారు. వాజపేయి ప్రతి ప్రసంగంలోనూ ఆయనలోని కవి మేల్కొనేవాడు. ఒకప్పుడు భారత రాజకీయాల్లోని పలుపార్టీలు భారతీయ జనతా పార్టీకి దూరంగా మసలేవి. బీజేపీ నేతలపై తీవ్ర విమర్శలు చేసేవి. అయితే వాజపేయి దీనికి భిన్నమైన గుర్తింపు దక్కించుకున్నారు. ప్రత్యర్థులు కూడా ఆయనను విమర్శించడానికి భయపడేవారు. వాజపేయి హిందుత్వవాదాన్ని బహిరంగంగా సమర్థించారు. విమర్శకుల నోరు మూయించడంలో సమర్థుడైన నేతగా నిలిచారు. వాజపేయి 2018, ఆగస్టు 16న కన్నుమూశారు. ఇది కూడా చదవండి: గుడ్‌బై 2023: సుఖోయ్-30.. మిరాజ్-2000 ఢీకొన్న వేళ.. -
ఆయనకు చరిత్ర తెలుసని అనుకోను: రాహుల్‌గాంధీ
ఢిల్లీ: రాజ్యసభలో సోమవారం జమ్మకశ్మీర్‌కు సంబంధించి రెండు కీలక బిల్లులకు ఆమోదం లభించింది. అయితే ఆ టైంలో చర్చ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ తొలి ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూపై, గత కాంగ్రెస్ పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలపై నెహ్రూ మనవడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ‘‘పండిట్ నెహ్రూ తన జీవితాన్ని ఈ దేశానికి అంకితమిచ్చారు. దేశ ప్రజల కోసం ఏళ్ల తరబడి జైల్లో ఉన్నారు. అమిత్‌షాకు చరిత్ర తెలియదు. తెలుసుకుంటారని కూడా నేను అనుకోను. అందుకే పదే పదే దాన్ని తిరగరాస్తూనే ఉన్నారు’’ అని రాహుల్ కౌంటర్ ఇచ్చారు. దేశంలో నెలకొన్న ప్రధాన సమస్యల నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే భాజపా ఇలాంటి ఆరోపణలు చేస్తోందని రాహుల్ అన్నారు. ‘‘కుల గణన, నిరుద్యోగం, దేశంలోని ధనమంతా ఎవరి చేతుల్లో ఉంది.. ఇవన్నీ ప్రధాన అంశాలు. వీటిపై చర్చించేందుకు బీజేపీ భయపడుతోంది. అందుకే వీటి నుంచి పారిపోతోంది’’ అని రాహుల్ ఎద్దేవా చేశారు. రాజ్యసభలో జమ్ము కశ్మీర్ బిల్లులపై చర్చ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. ‘‘కేవలం ఒకేవ్యక్తి పొరపాటు వల్ల భారత్‌లో జమ్ముకశ్మీర్ భాగం కావడం ఆలస్యమైంది’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సైతం భగ్గుమంది. ఇదిలా ఉంటే.. జమ్ముకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ), జమ్ముకశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) బిల్లులకు కేంద్రం రూపం తెచ్చింది. కశ్మీరీ శరణార్థుల నుంచి ఇద్దరిని, పాక్ ఆక్రమిత కశ్మీర్ నిర్వాసితుల నుంచి ఒకరిని శాసనసభకు నామినేట్ చేసేందుకు, కొన్ని వర్గాలకు రిజర్వేషన్ ఇచ్చేందుకు ఈ బిల్లులు వీలు కల్పిస్తాయి. లోక్‌సభ కిందటి వారమే ఈ బిల్లుల్ని ఆమోదించగా.. రాజ్యసభలో సోమవారం దాదాపు నాలుగు గంటల చర్చ తర్వాత ఆమోదం లభించింది. తర్వాతి దశలో రాష్ట్రపతి ఆమోదంతో ఈ బిల్లులు చట్టంగా మారనున్నాయి. -
పీఓకే అంశంలో నెహ్రూది హిమాలయమంతటి తప్పిదం: అమిత్ షా
జమ్ము కశ్మీర్: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) అంశంలో మాజీ ప్రధాని నెహ్రూపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా మండిపడ్డారు. పీవోకే సమస్యకు నెహ్రూదే బాధ్యత అంటూ నిప్పులు చెరిగారు. పీవోకే విషయంలో నెహ్రూ చేసింది చిన్న తప్పు కాదు.. హిమాలయమంతటి తప్పిదమని ధ్వజమెత్తారు. దేశంలో చాలా భూభాగాన్ని నెహ్రూ వదిలివేశారని తప్పుబట్టారు. జమ్ము కశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) బిల్లు-2023, జమ్ము కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2023పై పార్లమెంట్లో అమిత్ షా ప్రసంగించారు. #WATCH | Union Home Minister Amit Shah says, "Two mistakes that happened due to the decision of (former PM) Pandit Jawaharlal Nehru due to which Kashmir had to suffer for many years. The first is to declare a ceasefire - when our army was winning, the ceasefire was imposed. If… pic.twitter.com/3TMm8fk5O1 — ANI (@ANI) December 6, 2023 మాజీ ప్రధాని నెహ్రూ రెండు భారీ తప్పులు చేశారని షా అన్నారు. మొదటిది కాల్పుల విరమణ చేయడం కాగా రెండోది.. మన అంతర్గత పీఓకే అంశాన్ని ఐరాసకు తీసుకువెళ్లి నెహ్రూ మరో తప్పిదం చేశారని అమిత్ షా చెప్పారు. అప్పట్లో కాల్పుల విరమణ మరో మూడు రోజులు చేయకుండా ఉంటే.. పీఓకే ఇప్పుడు జమ్ముకశ్మీర్‌లో భాగంగా ఉండేదని తెలిపారు. పీఓకే ఎప్పటికైనా భారత్‌దే అని షా పునరుద్ఘాటించారు. కాగా.. నెహ్రూ గురించి అమిత్ షా మాట్లాడుతుంటే.. సభ నుంచి కాంగ్రెస్ వాకౌంట్ చేసింది. ప్రస్తుతం పీఓకేకు 24 అసెంబ్లీ సీట్లు కేటాయిస్తున్నట్లు షా పేర్కొన్నారు. గతంలో జమ్మూలో 37 సీట్లు ఉండగా, ఇప్పుడు 43 ఉన్నాయని స్పష్టం చేశారు. కశ్మీర్లో గతంలో 46 సీట్లు ఉండగా.. ప్రస్తుతం 47 స్థానాలు ఉన్నాయి. పీఓకేకు 24 సీట్లు కేటాయించామని అమిత్ షా స్పష్టం చేశారు. ఇదీ చదవండి: పీఓకేపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు -
4 రాష్ట్రాలను తాకే ఏకైక జిల్లా ఏది? ‘స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా’ ఎందుకయ్యింది?
దేశంలోని ప్రతి రాష్ట్రంలో అనేక జిల్లాలు ఉన్నప్పటికీ, భౌగోళిక ప్రత్యేకతల విషయానికి వస్తే, ఉత్తరప్రదేశ్‌లోని ఆ జిల్లా పేరు ఖచ్చితంగా వినిపిస్తుంది. యూపీలోని సోన్‌భద్ర జిల్లా అనేక ప్రత్యేకతలను కలిగివుంది. విస్తీర్ణం పరంగా ఉత్తరప్రదేశ్‌లోని రెండవ అతిపెద్ద జిల్లా సోన్‌భద్ర. నిజానికి సోన్‌భద్ర భారతదేశంలోని ఒక ప్రత్యేకమైన జిల్లా. ఇది నాలుగు రాష్ట్రాల సరిహద్దులను తాకుతుంది. ఈ ప్రత్యేకత కారణంగా పోటీ పరీక్షలలో సోన్‌భద్ర జిల్లాకు సంబంధించిన ప్రశ్నలను అడుగుతుంటారు. సోన్‌భద్ర యూపీలో ఉన్నప్పటికీ దాని సరిహద్దులు మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌లను తాకుతాయి. సోన్‌భద్ర మైనింగ్ గనుల పరంగానే ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడి కైమూర్ కొండలలో ఖనిజాలు పెద్ద మొత్తంలో లభిస్తాయి. సోన్‌భద్ర ప్రాంతంలో బాక్సైట్, సున్నపురాయి, బొగ్గు, బంగారం కూడా లభ్యమవుతుంది. 1989కి ముందు సోన్‌భద్ర యూపీలోని మీర్జాపూర్ జిల్లాలో ఉండేది. అయితే 1998లో దీనిని వేరు చేసి సోన్‌భద్ర అనే పేరు పెట్టారు. ఇక్కడ ప్రవహించే నది కారణంగా ఈ ప్రాంతానికి సోన్‌భద్ర అనే పేరు వచ్చింది. ఇక్కడ సోన్ నది ప్రవహిస్తుంది. ఈ జిల్లాలో కన్హర్, పంగన్లతో పాటు రిహాండ్ నది కూడా ప్రవహిస్తుంది. సోన్‌భద్ర జిల్లా వింధ్య , కైమూర్ కొండల మధ్య ఉంది. ఇక్కడి అందమైన దృశ్యాలు ఇట్టే ఆకట్టుకుంటాయి. పండిట్ నెహ్రూ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ జిల్లాలోని ప్రకృతి అందాలను చూసి, ఈ ప్రాంతానికి ‘స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా’ అనే పేరు పెట్టారు. సోన్‌భద్రలో అడుగడుగునా పచ్చదనం, అందమైన పర్వతాలు కనిపిస్తాయి. ఇక్కడి నదుల ప్రవాహం కనువిందు చేస్తుంది. ఇక్కడ పలు పవర్ ప్లాంట్లు ఉన్నకారణంగా ఈ ప్రాంతాన్ని పవర్ క్యాపిటల్ అని కూడా పిలుస్తారు. ఇది కూడా చదవండి: ఆ బాబాలు ఏం చదువుకున్నారు? -
‘జో నెహ్రూ’ ఎవరు? ఇందిర, సోనియా, ప్రియాంకలకు ఏమి బహూకరించారు?
స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ రాజకీయ వారసత్వం అమితమైన ఆసక్తిని కలిగిస్తుంటుంది. ఆ మధ్య చరిత్రకారుడు రామచంద్ర గుహ మాట్లాడుతూ ‘జవహర్లాల్ నెహ్రూ ఎదుర్కొన్న సవాళ్లను ఆధునిక భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు ఎప్పుడూ ఎదుర్కోలేదనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. నెహ్రూ దేశానికి సారధ్యం వహించే సమయంలో దేశం ఒక జాతిగా దాని సొంత కాళ్లపై కూడా నిలబడలేని స్థితిలో ఉన్నదన్నారు. జవహర్లాల్ నెహ్రూ దేశ తొలి ప్రధానిగా అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రజాస్వామ్యం, నైతికత, లౌకికవాదం, సోషలిజం మొదలైనవాటిని దేశంలో పెంపొందించేదుకు నెహ్రూ కృషి చేశారని చెబుతారు. అయితే నెహ్రూ వ్యక్తిత్వానికి సంబంధించిన అంశాలు, వ్యక్తిగత సంబంధాలు, అభిరుచులు, ఇష్టాలు, అయిష్టాలు చాలావరకూ తెరమరుగునే ఉన్నాయి. నెహ్రూకు గాలిపటాలు ఎగురవేయడం అంటే చాలా ఇష్టం. ఈ అభిరుచి అతనికి ఇంగ్లాండ్‌లోని హారో, కేంబ్రిడ్జ్లలో ఉంటున్నప్పుడు ఏర్పడింది. అదేవిధంగా నెహ్రూకు న్యాయశాస్త్రం చదవడమంటే ఏ మాత్రం ఇష్టం లేకపోయినా, తండ్రి కోరిక మేరకు లా పూర్తిచేసి, న్యాయవాదిగా మారారు. జవహర్లాల్ నెహ్రూకి సంబంధించి బయటి ప్రపంచానికి అంతగా తెలియని కొన్ని అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జవహర్లాల్ నెహ్రూను కేంబ్రిడ్జ్‌లోని ట్రినిటీ కాలేజీలో అతని సహవిద్యార్థులు ‘జో నెహ్రూ’ అని పిలిచారు. దీనికి కారణం అలా పిలవడం చాలా సులభమని వారు భావించేవారు. నెహ్రూను పూర్తి పేరుతో పిలవడం వారికి కష్టంగా అనిపించేదట. హారో, కేంబ్రిడ్జ్‌లో చదువుతున్నప్పుడు నెహ్రూకు గాలిపటం ఎగురవేయడమనేది ఒక క్రీడగా పరిచయం అయ్యింది. గాలిపటాలపై నెహ్రూకు మక్కువ మరింతగా పెరిగి, వాటిని బాగా ఎగురవేయగలిగే నైపుణ్యం సంపాదించారు. ఈ నేపధ్యంలో నెహ్రూ భారతదేశం నుండి మంచి గాలిపటాలను తెప్పించుకుని, వాటి ఎగురవేస్తూ ఆనందం పొందేవారు. నెహ్రూ తన తండ్రి ఒత్తిడి మేరకు న్యాయశాస్త్రం చదివారు. నిజానికి నెహ్రూ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి ఆర్థిక శాస్త్రం చదువుకోవాలనుకున్నారు. తనను లాయర్‌గా మార్చినందుకు నెహ్రూ తన తండ్రిపై తరచూ పలు ఆరోపణలు చేసేవాడు. గాంధీజీ మరణానంతరం నెహ్రూ చేసిన ‘మన జీవితాల్లో వెలుగులు ఆరిపోయాయి’ అనే ప్రసంగం ఆయన చేసిన ప్రముఖ ప్రసంగాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఈ ప్రసంగాన్ని ఆయన ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా చేయడం విశేషం. జైలులో ఉన్నప్పుడు జవహర్లాల్ నెహ్రూ తన కుమార్తె ఇందిర వివాహానికి లేత గులాబీ ఖాదీ చీరను నేశారు. ఆ తర్వాత సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ కూడా తమ తమ పెళ్లిళ్లలో అదే ధరించారు. నెహ్రూకు పెంపుడు జంతువులంటే చాలా ఇష్టం. ఆయన తన ఇంటిలో పెద్ద సంఖ్యలో వివిధ రకాల పెంపుడు జంతువులను పెంచేవారు. వీటిలో ఒక పాండా కూడా ఉండేది. జవహర్లాల్ నెహ్రూ తన వస్త్రధారణలో జాకెట్, షేర్వానీ, క్యాప్ ధరించి కనిపించేవారు. ఈ లుక్ నెహ్రూకు అపారమైన ప్రజాదరణను తెచ్చిపెట్టింది. ఈ లుక్ ఎంత పాపులర్ అయ్యిందంటే చివరికి అది నేషనల్ డ్రెస్ కోడ్లా మారింది. నెహ్రూ ప్రభావంతో ఘనా అధ్యక్షుడు క్వామే న్క్రుమా, ఇండోనేషియా అధ్యక్షుడు సుహార్తో, చైనా నేత మావో కూడా నెహ్రూ తరహాలో దుస్తులను ధరించేందుకు ఇష్టపడేవారట. 1963 అక్టోబర్‌లో ప్లేబాయ్ పత్రిక జవహర్లాల్ నెహ్రూను ఇంటర్వ్యూ చేసింది. ఈ పత్రికలో తన గురించి లోతైన కథనాలు ప్రచురితమయ్యాయని నెహ్రూ భావించారు. నెహ్రూ తన సోదరి విజయలక్ష్మి పండిట్‌ను నయన్ అని పిలిచేవారు. ఆమె అతనికి అత్యంత నమ్మకస్తురాలని చెబుతుంటారు. నెహ్రూ తన తల్లి, భార్య భార్యకు మించి విజయలక్ష్మి పండిట్‌తో ఓపెన్‌గా మాట్లాడేవారట. ఇది కూడా చదవండి: నేతాజీకి అండగా నిలిచిన మహిళా సేనాని ఎవరు? -
అమేథీతో గాంధీ- నెహ్రూ కుటుంబానికున్న సంబంధం ఏమిటి?
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో అమేథీ నుంచి పోటీ చేస్తారని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కొత్త చీఫ్ అజయ్ రాయ్ ప్రకటించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఇదే స్థానంలో బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. 1967లో ఏర్పడిన అమేథీ.. నాటి నుంచి కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉంది. గత నాలుగు సంవత్సరాలుగా 1970-1990వ దశకాల ప్రారంభంలో మినహా, నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన వారు లేదా వారి విధేయులు ఈ నియోజకవర్గంలో గెలుపొందుతూ వస్తున్నారు. అమేథీతో నెహ్రూ-గాంధీ కుటుంబానికి గల దశాబ్దాల నాటి సంబంధం గురించి ఇప్పుడు తెలుకుందాం. సంజయ్ గాంధీ (1980–81) గాంధీ-నెహ్రూ కుటుంబంలో అమేథీ లోక్‌సభ నుంచి పోటీ చేసిన తొలి వ్యక్తి సంజయ్ గాంధీ. ఎమర్జెన్సీ ముగిసిన వెంటనే జరిగిన 1977 లోక్‌సభ ఎన్నికల్లో సంజయ్ అమేథీ నుంచి పోటీ చేశారు. అయితే జనాభా నియంత్రణ కోసం సంజయ్ చేపట్టిన బలవంతపు స్టెరిలైజేషన్ కార్యక్రమం కారణంగా అతను ఘోరమైన ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. నాటి ఎన్నికల్లో జనతా పార్టీకి చెందిన రవీంద్ర ప్రతాప్ సింగ్ విజయం సాధించారు. సంజయ్ గాంధీ తిరిగి 1980 లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేసి, ఎంపీ అయ్యారు. అయితే 1981లో జరిగిన విమాన ప్రమాదంలో సంజయ్ మరణించారు. అమేథీ ఎంపీగా స్వల్పకాలమే పనిచేశారు. రాజీవ్ గాంధీ (1981–1991) సంజయ్ మరణంతో రాజీవ్ గాంధీ క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1981 మే 4న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ఇందిరా గాంధీ తన చిన్న కుమారుని పేరును అమేథీ అభ్యర్థిగా ప్రతిపాదించారు. సమావేశానికి హాజరైన కాంగ్రెస్ సభ్యులందరూ ఈ సూచనను ఆమోదించారు. అనంతరం రాజీవ్ అమేథీ నుంచి తన అభ్యర్థిత్వాన్ని దాఖలు చేశారు. రాజీవ్ నాటి ఉప ఎన్నికలో అఖండ విజయాన్ని సాధించారు. లోక్‌దళ్ అభ్యర్థి శరద్ యాదవ్‌పై 2 లక్షలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. రాజీవ్ 1981 ఆగస్టు 17న అమేథీ నుంచి ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. దీని తరువాత కూడా రాజీవ్ 1984, 1989,1991లో అమేథీ నుండి గెలిచారు. దాదాపు దశాబ్దం పాటు ఈ సీటును నిలబెట్టుకున్నారు. 1991లో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం రాజీవ్ గాంధీని హత్య చేసిన తర్వాత అమేథీలో తిరిగి ఉప ఎన్నిక జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థి సతీష్ శర్మ విజయం సాధించారు. 1996 ఎన్నికల్లోనూ ఆయన తన విజయాన్ని పునరావృతం చేశారు. ఇది కూడా చదవండి: నకిలీ టీచర్లకు ప్రమోషన్లు.. దర్జాగా విద్యార్థులకు పాఠాలు.. 14 ఏళ్ల ముసుగు తొలగిందిలా! సోనియా గాంధీ (1999–2004) 1999లో రాజీవ్ గాంధీ సతీమణి సోనియా గాంధీ అమెథీ నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పుడు ఇక్కడి జనం నెహ్రూ-గాంధీ కుటుంబానికిచెందిన చెందిన నేతకు మరోసారి ఓటు వేశారు. అయితే అదే స్థానం నుంచి ఆమె మరోమారు ఎన్నికల బరిలోకి దిగలేదు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో సోనియా స్వయంగా రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయగా, రాహుల్ గాంధీ అమేథీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. రాహుల్ గాంధీ (2004-2019) రాహుల్ తన తొలి ప్రయత్నం(2004)లోనే అమేథీ నుంచి గెలుపొందారు. 2009లో 3.70 లక్షల ఓట్ల భారీ తేడాతో తిరిగి ఎన్నికయ్యారు. 2014లో కూడా రాహుల్ ఇక్కడి నుంచే గెలిచారు. అయితే నాడు అతని ప్రత్యర్థి స్మృతి ఇరానీ అతనికి గట్టి పోటీనిచ్చారు. అయితే స్మృతి ఇరానీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌ను ఓడించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ మళ్లీ అమేథీలో సత్తా చాటుతారని కాంగ్రెస్ భావిస్తోంది. రాహుల్ ఇటీవల చేపట్టిన భారత్ జోడో యాత్ర, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం ఇందుకు కలసివస్తాయనే అంచనాలున్నాయి. ఇది కూడా చదవండి: కళలతో కోట్లు.. వీరి టర్నోవర్ చూస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే..! -
‘హార్మోనియం’ను నెహ్రూ, ఠాగూర్ ఎందుకు వ్యతిరేకించారు? రేడియోలో 3 దశాబ్దాల నిషేధం వెనుక..
హార్మోనియం.. భారతదేశంలో ప్రసిద్ధి చెందిన సంగీత వాయిద్య పరికరం. ఇది నిజంగా భారత దేశానికి చెందినదేనా? అనే సందేహం చాలామందిలో దశాబ్దాలుగా ఉంది. అయితే కొందరు ఇది భారతీయులదేనని గాఢంగా నమ్ముతుంటారు. 1900ల ప్రారంభంలో స్వాతంత్ర్య పోరాటం ఊపందుకున్నప్పుడు భారతీయ శాస్త్రీయ సంగీతానికి హార్మోనియం అనువైనదా కాదా అనే చర్చ జరిగింది. మహాత్మా గాంధీ చేపట్టిన స్వదేశీ ఉద్యమంలో పలువురు హార్మోనియం భారతీయులది కాదంటూ వ్యతిరేకించారు. 1940లో ఆల్ ఇండియా రేడియో పాశ్చాత్య సంగీత విభాగ అధిపతి అందించిన కథనానికి స్పందనగా దాదాపు మూడు దశాబ్దాలపాటు ‘ఆకాశవాణి’లో హార్మోనియం నిషేధించారు. ఈ నిషేధం 1971లో పాక్షికంగా ఎత్తివేశారు. అనంతర కాలంలో ఈ నిషేధాన్ని పూర్తిగా తొలగించారు. ఫ్రెంచ్ ఆవిష్కర్త హార్మోనియం పేటెంట్ హార్మోనియం 1700లలో ఐరోపాలో ఆవిర్భవించింది. అనేక మార్పులకు లోనైన తర్వాత ఇది భారతదేశానికి చేరువయ్యింది. దీని మొదటి నమూనాను కోపెన్హాగన్ విశ్వవిద్యాలయానికి చెందిన ఫిజియాలజీ ప్రొఫెసర్ క్రిస్టియన్ గాట్లీబ్ క్రాట్జెన్స్టెయిన్ రూపొందించారని చెబుతారు. దీని తరువాత హార్మోనియంలో అనేక మార్పులు వచ్చాయి. 1842లో అలెగ్జాండ్రే డెబెన్ అనే ఫ్రెంచ్ ఆవిష్కర్త హార్మోనియం డిజైన్‌కు పేటెంట్ పొంది, దానికి 'హార్మోనియం' అని పేరు పెట్టారు. హార్మోనియంను 19వ శతాబ్దం చివరలో పాశ్చాత్య వ్యాపారులు, మిషనరీలు భారతదేశానికి తీసుకువచ్చారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వెబ్సైట్ ప్రకారం భారతీయ చేతి వాయిద్యంగా మారిన హార్మోనియంను 1875లో కోల్‌కతాలో ద్వారకానాథ్ ఘోష్ రూపొందించారు. అన్ని రాగాలను సరిగ్గా పలికించలేదని.. 1915 నాటికి భారతదేశం హార్మోనియంల రూపకల్పనలో అగ్రగామిగా మారింది. అలాగే ఈ వాయిద్యం భారతీయ సంగీతంలో అంతర్భాగంగా మారింది. హార్మోనియంలో 12 స్వరాలు, 22 శృతులను పలికించవచ్చని చెబుతారు. అయితే భారతీయ శాస్త్రీయ సంగీత విద్వాంసులలోని ఒక విభాగం హార్మోనియం అన్ని రాగాలను సరిగ్గా పలికించలేదని, అన్ని శాస్త్రీయ స్వరాలను పరిపూర్ణంగా పలికించే సామర్థ్యాన్ని కలిగి లేదని ఎత్తి చూపింది. దీని గురించి ప్రఖ్యాత హార్మోనియం ప్లేయర్ రవీంద్ర కటోటి మాట్లాడుతూ పరిమితి అనేది విశ్వవ్యాప్త వాస్తవం. ప్రతి స్వరానికి, ప్రతి పరికరానికి దాని పరిమితులు ఉంటాయన్నారు. ఠాగూర్ వాదన ఇదే.. హార్మోనియం భారతీయమా కాదా, ఇది భారతీయ సంగీతానికి సరిపోతుందా లేదా అనే చర్చ నడుస్తున్నప్పుడు బహుముఖ ప్రజ్ఞాశాలి, నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ వాయిద్య పరికరం భారతీయతకు సరిపోదన్నారు. ఇది గమకాలను పలికించలేదన్నారు. ఈ నేపధ్యంలోనే ఆకాశవాణిలో హార్మోనియంను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఒక సాహితీవేత్త కోల్‌కతాలోని ఆల్ ఇండియా రేడియోకి లేఖ రాశారు. ఆల్ ఇండియా రేడియో పాశ్చాత్య సంగీత విభాగం అధిపతి జాన్ ఫోల్డ్స్ భారతీయ శాస్త్రీయ సంగీతానికి ఎంతో అవసరమైన మైక్రోటోన్ల విషయంలో హార్మోనియం మ్యూట్‌గా ఉందని తన కథనాలలో వివరించారు. కంట్రోలర్ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్గా ఉన్న లియోనెల్ ఫీల్డెన్.. ఫోల్డ్స్ వాదనతో ఏకీభవించారు. దీంతో 1940, మార్చి 1న ఆల్ ఇండియా రేడియో హార్మోనియంను నిషేధించింది. స్వాతంత్య్రానంతరం కూడా.. సంగీత విద్వాంసుడు అభిక్ మజుందార్ ఈ అంశం గురించి మాట్లాడుతూ.. కళా చరిత్రకారుడు ఆనంద్ కుమారస్వామి, స్వాతంత్ర్య సమరయోధునిగా జవహర్లాల్ నెహ్రూ కూడా హార్మోనియం భారతీయతకు చెందినది కాదన్నారు. స్వాతంత్య్రానంతరం కూడా ఈ వాయిద్య పరికరంపై నిషేధం కొనసాగిందని, సమాచార ప్రసార శాఖ మంత్రి బివి కేస్కర్, విద్వాంసుడైన గాయకుడు విఎన్ భత్ఖండే విద్యార్థి దీనికి కారణమని తెలిపారు. ఇది కూడా చదవండి: మూత్రం ఆపుకోలేని పిల్లాడిపై పోలీసుల ప్రతాపం.. జైలుకు తరలించి.. -
అణుబాంబు ఆవిష్కర్తకు భారత పౌరసత్వం.. నెహ్రూ ఆఫర్‌ను తిరస్కరించిన ఓపెన్‌హైమర్!
ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ రూపొందించిన ‘ఓపెన్‌హైమర్’ సినిమా విడుదల అయిన నేపధ్యంలో అమెరికన్ శాస్త్రవేత్త రాబర్ట్ జె ఓపెన్‌హైమర్ జీవితం గురించి తెలుసుకోవానే ఆసక్తి పలువురిలో నెలకొంది. ఇటీవలే విడుదలైన ఒక పుస్తకంలో ప్రముఖ శాస్త్రవేత్త రాబర్ట్ ఓపెన్హైమర్కు భారత్‌తో ముడిపడి ఒక విషయం చర్చనీయాంశంగా మారింది. భారత దివంగత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ.. శాస్త్రవేత్త రాబర్ట్ ఓపెన్హైమర్కు భారత పౌరసత్వం ఆఫర్ చేశారనే విషయం ఆ పుస్తకంలో ఉంది. ఈ పుస్తకాన్ని ప్రముఖ భారతీయ పార్సీ రచయిత భక్తియార్ కే దాబాభాయి భారత శాస్త్రవేత్త హోమీ భాభా జీవితం ఆధారంగా రచించారు. రెండవ ప్రపంచయుద్ధం ముగిశాక.. ఈ పుస్తకంలో అమెరికా శాస్త్రవేత్త రాబర్ట్ జె ఓపెన్‌హైమర్- హోమీ బాబాల స్నేహానికి సంబంధించిన ప్రస్తావన కూడా ఉంది. ‘హోమీ జే భాభా: ఏ లైఫ్’ పేరుతో భక్తియార్ కే దాదాభాయి రాసిన ఈ పుస్తకంలో ‘రెండవ ప్రపంచయుద్ధం ముగిశాక రాబర్ట్ జె ఓపెన్‌హైమర్‌ను భాభా కలుసుకున్నారు. అనంతరం వీరిద్దరూ మంచి స్నేహితులుగా మారారు. భాభా మాదరిగానే రాబర్ట్ జె ఓపెన్‌హైమర్ కూడా గౌరవమర్యాదలతో మెలిగిన వ్యక్తి. రాబర్ట్ జె ఓపెన్‌హైమర్ సంస్కృత భాషను కూడా నేర్చుకున్నారు. దీనితో పాటు ఆయనకు లాటిన్, గ్రీకు భాషలు కూడా వచ్చు’ అని పేర్కొన్నారు. బాంబు తయారీ వరకే తన బాధ్యత.. బీబీసీ తెలిపిన వివరాల ప్రకారం రాబర్ట్ జె ఓపెన్‌హైమర్ తయారు చేసిన అణుబాంబును రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్‌లోని హీరోషిమా, నాగసాకిలో ప్రయోగించారు. అయితే అంతటి శక్తిమంతమైన బాంబు తయారు చేయడం తగినది కాదని రాబర్ట్ జె ఓపెన్‌హైమర్‌పై విమర్శలు వచ్చాయి. దీనికి ఆయన సమాధానమిస్తూ బాంబు తయారు చేయడం వరకే తన బాధ్యత అని, దానిని ఎలా వినియోగించాలనే దానిపై నిర్ణయం తీసుకోవడంతో తనకు సంబంధం లేదన్నారు. తాను అమెరికా విడిచిపెట్టబోనంటూ.. అయితే ఆ తరువాత రాబర్ట్ జె ఓపెన్‌హైమర్ తన వైఖరిని మార్చుకున్నారు. దీనికిమించిన శక్తివంతమైన హైడ్రోజన్ బాంబు తయారీని వ్యతిరేకించారు. ఈ నేపధ్యంలో అతనికి అమెరికా ప్రభుత్వం నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యింది. అప్పటివరకూ అతని ఇచ్చిన రక్షణ వ్యవస్థను కూడా తొలగించారు. ఆ పుస్తకంలో పేర్కొన్న వివరాల ప్రకారం సరిగ్గా అదే సమయంలో నాటి భారత ప్రధాని నెహ్రూ.. శాస్త్రవేత్త రాబర్ట్ జె ఓపెన్హైమర్కు భారత పౌరసత్వం ఇవ్వజూపారు. అయితే ఆయన దీనిని తిరస్కరించారు. అమెరికాలో తనపై వచ్చిన ఆరోపణలన్నింటి నుంచి విముక్తి కలిగేవరకూ తాను అమెరికా విడిచిపెట్టబోనని ఓపెన్‌హైమర్ స్వయంగా నెహ్రూకు తెలియజేశారట. రాబర్ట్ జె ఓపెన్‌హైమర్ అమెరికా దేశభక్తుడైనందున కూడా ఈ ఆఫర్ తిరస్కరించారని కూడా నిపుణులు చెబుతుంటారు. ఇది కూడా చదవండి: పోలీసు నిర్లక్ష్యంతోనే జాహ్నవి మృతి?.. ఆలస్యంగా ఆధారాలు వెలుగులోకి.. -
'ప్రతీకార చర్య..' నెహ్రూ మ్యూజియం పేరు మార్పుపై జైరాం రమేశ్ ఫైర్..
ఢిల్లీ:నెహ్రూ మెమోరియల్ మ్యూజియం పేరు మార్పుపై ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేశ్ విమర్శించారు. నెహ్రూ మ్యూజియం ప్రపంచ మేధోసంపత్తికి నిలయంగా ఉందని అన్నారు. అనేక పుస్తకాలకు,59 ఏళ్ల చరిత్రకు సాక్ష్యంగా ఉందని చెప్పారు. ఈ చర్య ప్రతీకారంతో కూడినదని ఆరోపించారు. 'భారతదేశ రూపశిల్పి పేరును, వారసత్వాన్ని రూపుమాపడానికి కావాల్సినవన్నీ ప్రధాని చేస్తున్నారు. సామాన్యుడు అభద్రతా భావంతో బతికేలా చేయడమే విశ్వగురువుగా అనాలా?' అని ప్రశ్నించారు. గురువారం ప్రత్యేకంగా నిర్వహించిన సమావేశంలో నెహ్రూ మెమోరియల్ మ్యూజియం పేరును ప్రధానమంత్రి మ్యూజియం అండ్ సొసైటీగా కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమక్షంలో పేరు మార్చారు. తొలి ప్రధాని నెహ్రూ అధికారిక భవనాన్నే మ్యూజియంగా మార్చేశారు. దీనికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షుడు కాగా.. రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఇదీ చదవండి:మత మార్పిడి నిరోధక చట్టాన్ని వెనక్కి తీసుకోనున్న కర్ణాటక ప్రభుత్వం -
విలువల్లోనూ పట్టువిడుపులు!
వాజ్‌పేయిని ‘భావోద్వేగాల ఒంటరితనంలో నిరాశ్రయుడైన పురుష బాలకుడి’గా అర్థం చేసుకున్నారు అభిషేక్ చౌధరి. అటల్ సంక్లిష్టమైన వ్యక్తిగత జీవితానికి అది తగిన వివరణ కాగలదా? వాజ్‌పేయిని ‘విలువల్లోనూ పట్టువిడుపులు పాటించే మనిíషి’ అంటారాయన. 2002లో గోవాలో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో కేంద్ర కేబినెట్ సహచరుల అభీష్టానుసారం ఆనాటి గుజరాత్ ముఖ్యమంత్రి చేత రాజీనామా చేయించలేక పోవడానికి ఈ పట్టువిడుపుల స్వభావం నుంచే మనం సమాధానాన్ని రాబట్టుకోవాలా? ‘మహాత్ముడి మరణాన్ని అటల్ అస్సలేమాత్రం మానవాళికి సంభవించిన తీవ్రమైన నష్టంగా పరిగణించనే లేదు’ అని చౌధరి రాశారు. అయితే యౌవనానంతర దశలో పరిణతి కలిగిన నాయకుడిగా తన పూర్వపు ధోరణికి భిన్నంగా అటల్ బిహారీ వాజ్‌పేయి మారిపోయారు. అటల్ బిహారీ వాజ్‌పేయి గురించి మనకు తెలుసనే అనుకుంటాం. నిజంగానే మనకు తెలుసా? ఎందరికో ఆయన ఆరాధ్యులు. చాలామందికి ఆయనొక మంచి ప్రధాని కూడా. ఇక ఆయన వాగ్ధాటికైతే మంత్రముగ్ధులు కానివాళ్లెవరు! అయిన ప్పటికీ, ఆయనేమిటో పూర్తిగా మనకు తెలుసా? వాజ్‌పేయి ఛాయ వెనుక ఉన్న వాజ్‌పేయి గురించి మనకు తెలుసా? ఇటీవల విడుదలైన వాజ్‌పేయి జీవిత చరిత్రలో మనకు తెలి యని, మనం ఊహించని ఎన్నో అంశాలు ఉన్నాయి. అవి మాత్రమే కాదు, ఆయన గురించి కచ్చితమైనవిగా మనం ఇప్పటివరకూ భావిస్తూ వస్తున్న కొన్ని కథనాలకు రుజువులు లేవని ఆ పుస్తకం ద్వారా తెలుస్తుంది. సంప్రదాయబద్ధం కాని వాజ్‌పేయి వ్యక్తిగత జీవితాన్ని కూడా పుస్తకం స్పృశించింది. ఆయనను బాగా ఎరిగిన వాళ్లు సైతం వాజ్‌పేయిలోని ఈ అసంప్రదాయపరత్వాన్ని ఎక్కడా బయట పెట్టలేదు. తాజాగా అభిషేక్ చౌధరి రాసిన ‘వాజ్‌పేయి: ది అసెంట్ ఆఫ్ ది హిందూ రైట్ 1924–1977’ అనే పుస్తకంలోని విశేషాలు ఇవన్నీ. రెండు సంపుటాల ప్రయత్నంలోని మొదటి భాగం ఇది. రెండో భాగం డిసెంబరులో రానుంది. వాజ్‌పేయి ఆహార ప్రియులనీ, విలాసజీవుడనీ మనం విన్నాం. ‘భంగ్ ఆయనకు ప్రీతికరమైనది. తగు మోతాదుల్లో సేవించేవారు’. ‘చైనా వంటల్ని అదే తన జీవితేచ్ఛ అన్నట్లుగా ఆరగించేవారు’. న్యూయార్క్‌లో ఉన్నప్పుడు రాత్రి క్లబ్బులు ఆయన్ని రంజింప జేశాయి. ఆ అనధికార సందర్శనలలో ఒకటీ అరా పెగ్గులు మనసారా గ్రోలేవారు. చౌధరి అనడం అటల్ తన యౌవనంలో ముస్లిం వ్యతిరేకి అని. ‘జీవిక కోసం భారతదేశాన్ని ఎంపిక చేసుకున్న ముస్లింలను దేశ ద్రోహులుగానే చూడాలని అటల్ వాదించేవారు’ అని రాశారు. అటల్ ‘రాష్ట్రధర్మ’ పత్రికకు రాసిన ఒక వ్యాసంలో ముస్లింలను ‘ఫిప్త్ కాలమిస్ట్‌లు’ (ఆశ్రయమిచ్చిన దేశంలో ఉంటూనే ఆ దేశానికి వ్యతి రేకంగా పోరాడేవారు) అని పేర్కొన్నారు. యౌవనానంతర దశలో మాత్రం తన పూర్వపు ధోరణికి పూర్తి భిన్నంగా ఆయన మారి పోయారు. అది నిజం. ఆ మార్పు ఎంత గొప్పదో చెప్పే వెల్లడింపులు కొన్ని ఈ పుస్తకంలో ఉన్నాయి. మహాత్మా గాంధీ పట్ల వాజ్‌పేయి వైఖరిని గురించి చెబుతూ, ‘మహాత్ముడి మరణాన్ని అటల్ అస్సలు ఏమాత్రం మానవాళికి సంభవించిన తీవ్రమైన నష్టంగా పరిగణించనే లేదు. అటల్ రాసిన అనేక వ్యాసాలు దేశ విభజనకు కారకుడిగా మహాత్ముడినే బాధ్యుడిని చేశాయి. నీతి కాని రీతిలో ముస్లింలను గాంధీజీ సంతృప్తిపరిచే ప్రయత్నం చేయడం అన్నది ఆయన్ని హత్య చేసేంతగా పర్యవసాన పరిణా మాలను విషతుల్యం చేసిందని అటల్ విమర్శించారు’ అని అభిషేక్ రాశారు. ఇదేమైనా నిందను సంకేతిస్తోందా? కావచ్చు. వాజ్‌పేయి గురించి బాగా ప్రచారంలో ఉన్న కొన్ని కథనాల్లో అసలు నిజమే లేదనీ, అవి కేవలం అపోహలేననీ ఈ పుస్తకం తేల్చే స్తుంది. 1971 భారత్–పాక్ యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోయిన డిసెంబర్ 16వ తేదీ నాడు ఇందిరాగాంధీని దుర్గాశక్తిగా అటల్ కీర్తించారని ఒక కథనం. అయితే అది నిజం కాదని, ‘ఆ సాయంత్రం అటల్ పార్లమెంటులోనే లేరు. అప్పుడు ఆయన ఏదైనా ప్రయాణంలో గానీ, లేదా స్వల్ప అస్వస్థతతో గానీ ఉండి ఉండాలి’ అని అభిషేక్ రాశారు. అలాగే, అటల్ గురించి నెహ్రూ గొప్పగా భావించేవారనీ, ఆయనను భావి భారత ప్రధానిగా గుర్తించేవారనీ ఒక ప్రచారం ఉంది. అది అబద్ధం కాదు. అయితే మునుపు మనకు తెలియని విషయం ఒకటి కూడా ఈ పుస్తకంలో ఉంది. తొలినాళ్లలో అటల్‌పై నెహ్రూ అభిప్రాయం ఇంకోలా ఉండేదని! మొదట్లో ఆయన వాజ్ పేయిని ‘అత్యంత అభ్యంతరకరమైన వ్యక్తి’గా భావించారు. ‘జమ్మూలో మితిమీరిన తెంపరితనాన్ని ప్రేరేపిస్తున్నాడు’, ‘అతడిని జమ్మూలోకి అడుగుపెట్టనివ్వకండి’ అని నెహ్రూ తన క్యాబినెట్ కార్యదర్శి విష్ణు సహాయ్ని కోరినట్లు ఈ పుస్తకం చెబుతోంది. స్వాతంత్య్రోద్యమంలో వాజ్‌పేయి పాత్ర లేదన్న కాంగ్రెస్ వాదనను కూడా రచయిత కొట్టిపారేశారు. ‘గ్వాలియర్‌లో జరిగిన క్విట్ ఇండియా నిరసనల్లో వాజ్‌పేయి పాల్గొన్నారన్నది నిజం’. మరీ ముఖ్యంగా, బ్రిటిష్ వారికి అటల్ సమాచారం చేరవేస్తుండేవాడు అని ‘బ్లిట్జ్’ పత్రిక కలిగించిన ప్రేరేపణ పచ్చి అబద్ధం.’ మిమ్మల్ని ఆశ్చర్యపరచగల మరికొన్ని ముఖ్యమైన వివరాలు కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి. బాల్యంలో వాజ్‌పేయి పేద విద్యార్థి. స్కూల్లో చాలా అరుదుగా మాత్రమే ఆయనలోని ప్రతిభ బయట పడేది. ‘పాంచజన్య’ పత్రిక మాత్రం ఆయన్ని ఆకాశానికెత్తింది. అటల్ ఎప్పుడూ తరగతిలో రెండో స్థానంలో నిలవలేదని రాసింది. ఆయనకు ఎల్ఎల్బి డిగ్రీ ఉందన్న మాటలో కూడా నిజం లేదు. నిజానికి, ‘అటల్ లా డిగ్రీ చదువును మధ్యలోనే వదిలేశారు.’ శ్రోతల్ని కట్టిపడేసే వక్తగా ప్రసిద్ధి చెందిన మనిషి, తన తొట్టతొలి స్కూల్ డిబేట్లో ఘోరంగా ఓడిపోయాడని తెలుసుకోవడం నన్ను ఆహ్లాదపరిచింది. ‘అతడి కాళ్లు చల్లబడ్డాయి. తడబడటం మొదలు పెట్టాడు. ప్రసంగ పాఠం మర్చేపోయాడు. అదొక అవమానకరమైన అనుభవం. సాటి విద్యార్థుల ఆనాటి వెక్కిరింతల్ని జీవితాంతం ఆయన గుర్తుచేసుకుంటూనే ఉన్నారు’. వాజ్‌పేయిని ‘భావోద్వేగాల ఒంటరితనంలో నిరాశ్రయుడైన పురుష బాలకుడి’గా అర్థం చేసుకున్నారు పుస్తక రచయిత. అటల్ సంక్లిష్టమైన వ్యక్తిగత జీవితానికి అది తగిన వివరణ కాగలదా? వాజ్ పేయిని ‘విలువల్లోనూ పట్టువిడుపులు పాటించే మనిíషి’ అంటా రాయన. 2002లో గోవాలో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో కేంద్ర కేబినెట్ సహచరుల అభీష్టానుసారం ఆనాటి గుజరాత్ ముఖ్యమంత్రి చేత రాజీనామా చేయించలేకపోవడానికి ఈ పట్టువిడుపుల స్వభావం నుంచే మనం సమాధానాన్ని రాబట్టు కోవాలా? రెండవ సంపుటి కూడా మొదటి సంపుటం మాదిరిగానే అనేక విశేషాలతో కూడి ఉన్నట్లయితే 1977–2004 మధ్య వాజ్‌పేయి గురించిన సత్యాలను తెలుసుకోడానికి నేను ఎక్కువ కాలం వేచి ఉండలేను. అది ఉత్తమ భాగం అవుతుంది. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
‘నెహ్రూ వారసత్వం దీపస్తంభం వంటిది’
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని నెహ్రూ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఘనంగా నివాళులర్పించారు. నెహ్రూ వారసత్వం దీపస్తంభంలా నిలిచిపోతుందని, భారతదేశ ఆదర్శం, స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలను ప్రకాశింప జేస్తుందని రాహుల్ పేర్కొన్నారు. నెహ్రూ దూరదృష్టి, విలువలు ఎల్లప్పుడూ మనకు మార్గదర్శకాలుగా నిలుస్తాయని ట్వీట్ చేశారు. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, రాహుల్ తదితరులు శనివారం శాంతివన్‌లోని నెహ్రూ స్మారకాన్ని సందర్శించి పుష్పాంజలి ఘటించారు. ‘మన మాజీ ప్రధాని నెహ్రూకు వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నా’అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. -
నెహ్రూ హిందువు కాదంటారా?
నెహ్రూ నిజంగానే హిందువులకు వ్యతిరేకిగా ఉన్నారా? ఆయన జీవితాన్ని తరచి చూసిన ఏ సత్యాధ్యయనమైనా వంచనాపూరితమైన ఈ దుష్ప్రచారాన్ని బహిర్గతం చేస్తుంది. రామాయణ, మహాభారత, భగవద్గీతల పట్ల నెహ్రూకు ఉన్న ప్రీతి, గౌరవ ప్రపత్తులకు సాక్ష్యాల వెల్లువలు ఆయన రచనల్లో కనిపిస్తాయి. గుడిలో ప్రదక్షిణాలు చేసే హిందువు కాదు నెహ్రూ. కానీ హిందూ ఆధ్యాత్మికత, మార్మికతలపై ప్రగాఢమైన ఆసక్తులతో పెరిగారు. హిమాలయాలు, గంగానది భారతీయ నాగరికతకు ఉయ్యాలలు అని నెహ్రూ చేసిన అభివర్ణన మనల్ని వాటి దివ్యత్వంలో ఓలలాడిస్తుంది. దురదృష్టవశాత్తూ నెహ్రూ హిందువని సంఘ్ పరివార్, కాంగ్రెస్ రెండూ మరిచిపోయాయి. తప్పుడు సమాచారానికి విస్తృత ప్రచారం కల్పించడంలో బీజేపీలోని కేంద్రీకృత సోషల్ మీడియా కమ్యూనికేషన్ వ్యవస్థ ఎంతో సమర్థంగా పని చేస్తుంటుందని ఢిల్లీ కాలేజీలో పాఠాలు చెబుతుండే నా మిత్రుడొకరు అన్నారు. ‘‘ఢిల్లీ నుంచి పంపిన సమాచారం వేలాది వాట్సాప్ గ్రూపుల ద్వారా దేశం మొత్తానికి చేరుతుంది. ఉదాహరణకు, నేనొకసారి బిహార్‌లోని నా గ్రామస్థులు కొందరిని...‘విద్య వల్ల నేను ఆంగ్లేయుడిని, సంస్కృతి వల్ల మహమ్మదీయుడిని, యాదృచ్ఛికంగా మాత్రమే హిందువును’ అని ఒక నాయకుడు చెప్పుకున్నారని అంటారు. ఆ నాయకుడెవరో మీకు తెలుసా?’ అని అడిగాను. ఆ ప్రశ్నకు తటాలున వచ్చిన సమా ధానం: ‘నెహ్రూ’! భారతదేశ తొలి ప్రధాని నెహ్రూ అంటే గిట్టని హిందూ జాతీయవాద రాజకీయ పార్టీ ‘హిందూ మహాసభ’ 1950లో తొలి సారి, ‘‘నెహ్రూ విద్య చేత ఆంగ్లేయుడు. సంస్కృతి చేత మహమ్మ దీయుడు. యాదృచ్ఛికంగా మాత్రమే హిందువు’’ అని విమర్శించింది. తదనంతర కాలంలో ఆ మాటను నెహ్రూను ద్వేషించేవారంతా నెహ్రూకే ఆపాదించి, స్వయంగా ఆయనే తన గురించి ఆ విధంగా చెప్పుకొన్నట్లు ప్రచారంలోకి తెచ్చారు. గత ఏడాది ప్రారంభంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ, ‘‘యాదృచ్ఛికంగా మాత్రమే తాము హిందువులమని చెప్పుకున్న వారి వారసులు తమను తాము హిందువులమని చెప్పు కోకూడదు’’ అని రాహుల్ గాంధీపై చురకలు వేయడంతో ఉద్దేశ పూర్వకమైన ఆ ఆపాదింపునకు పునరుద్ధరణ జరిగినట్లయింది. సుసంపన్న భారత ఆనవాళ్లు నెహ్రూ నిజంగానే హిందువులకు వ్యతిరేకిగా ఉన్నారా? ఆయన జీవితాన్ని తరచి చూసిన ఏ సత్యాధ్యయనమైనా వంచనాపూరితమైన ఈ దుష్ప్రచారాన్ని బహిర్గతం చేస్తుంది. నెహ్రూ రాసిన ‘గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ’ (1934), ‘యాన్ ఆటోబయాగ్రఫీ’ (1936), ‘ద డిస్క వరీ ఆఫ్ ఇండియా’ (1946) మూడూ ప్రభావశీలమైనవి. డిస్కవరీ ఆఫ్ ఇండియా కారాగార వాసంలో రాసిన ఒక క్లాసిక్. (బ్రిటిష్ వాళ్లు ఆయన్ని 14 సార్లు జైలుకు పంపారు. 3,259 రోజులు కటకటాల వెనుక గడిపారు.) ఆయన ప్రసంగ సంకలనాలు, వ్యాసాలు, లేఖలు (పక్షానికొకసారి ముఖ్యమంత్రులకు ఆయన రాసిన లేఖలే ఐదు భారీ సంపుటాలు అయ్యాయి!) ... ఇవన్నీ కూడా ఇస్లాం, ఇతర బాహ్య ప్రభావాల చేత సుసంపన్నమైనదిగా నెహ్రూ భావించిన భారతదేశం తాలూకూ ప్రాచీన హిందూ నాగరికత సార్వత్రికత, సమగ్రతలతో నిండి ఉన్నవే. రామాయణ, మహాభారత, భగవద్గీతల పట్ల నెహ్రూకు ఉన్న ప్రీతి, గౌరవ ప్రపత్తులకు సాక్ష్యాల వెల్లువలు ఆయన రచనల్లో కనిపి స్తాయి. వేదాలు, ఉపనిషత్తులు, తదితర గ్రంథాలలోని మన రుషుల జ్ఞానం, భక్తియుగంలోని సాధువులు, కవులు, సంఘ సంస్కర్తలు; రామకృష్ణ పరమహంస, స్వామీ వివేకానంద, మహర్షి అరబిందో, ఆధునిక కాలంలో జాతీయతా భావం మేల్కొనేందుకు దోహదపడిన ఇతర హిందూ తాత్విక మహర్షుల గొప్పదనాన్ని నెహ్రూ రచనలు దర్శింపజేస్తాయి. ఇక తన గురువు, హిందూ మతబోధనలతో జీవిత మార్గాన్ని ఏర్పరచిన మహాత్మాగాంధీపై ఆయనకున్న గురి ఎంతటిదో తెలిసిందే. నెహ్రూ తన చివరి సంవత్సరాలలో ఉపనిషత్తులపై చర్చించడానికి తరచు తనను కలిసేందుకు వచ్చేవారని భారత రాష్ట్రపతి (1962–67), హిందూ తాత్వికతపై ప్రశంసలు పొందిన అనేక పుస్తకాలకు రచయిత అయిన ఎస్.రాధాకృష్ణన్ ఒక సందర్భంలో వెల్లడించారు. ఆలోచనల ప్రతిధ్వనులు నెహ్రూ ప్రాపంచిక దృక్పథానికి, ఆయన కాలం నాటి కొందరు జనసంఘ్ హిందూ నాయకుల దృష్టి కోణానికి మధ్య స్పష్టమైన సారూప్యాన్ని కూడా మనం చూడవచ్చు. ఉదాహరణకు, బీజేపీ తన సైద్ధాంతిక మార్గదర్శిగా పరిగణించే పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రంథం ‘ఇంటెగ్రల్ హ్యూమనిజం’... పెట్టుబడిదారీ, కమ్యూనిస్టు వ్యవస్థలను విడిచిపెట్టి భారతదేశం సమగ్ర అభివృద్ధి మార్గాన్ని అనుసరించాలన్న నెహ్రూ ఆలోచనను ప్రతిధ్వనిస్తుంది. నెహ్రూ మాదిరిగానే దీన్‌దయాళ్ కూడా మన ప్రాచీన సంస్కృతిలో మంచిది ఏదో దానిని తీసుకుని, అందులోని చెడును రూపుమాపడానికి సంసి ద్ధమవడాన్ని గర్వంగా భావించాలని చెప్పారు. ఆయన ఇలా రాశారు: ‘‘మనం మన ప్రాచీన సంస్కృతిలోని ప్రత్యేకతను గుర్తించకపోలేదు. అలాగని మనం పురావస్తు శాస్త్రజ్ఞులం కాలేము. విస్తారమైన ఈ పురావస్తు మ్యూజియానికి సంరక్షకులం కావాలన్న ఉద్దేశం కూడా మనకు లేదు. మన సమాజంలో విలువలను, జాతీయ ఐక్యతను పెంపొందించడానికి అవసరమయ్యే కొన్ని సంస్కరణలైతే చేయాలి. అందుకోసం కొన్ని సంప్రదాయాలకు స్వస్తి చెప్పాలి’’. నెహ్రూకు, ఆర్ఎస్ఎస్, జనసంఘ్, మోదీ–పూర్వపు బీజేపీ లలోని నెహ్రూ విమర్శకులకు మధ్య తీవ్రమైన కొన్ని విభేదాలు ఉండొచ్చు. వాటిని దాచేయలేం. కానీ ఇప్పుడు నెహ్రూపై మనం చూస్తున్న క్రూర, విషపూరితమైన దూషణలు అప్పుడు లేవు. 1964 మేలో ఆయన మరణించినప్పుడు పార్లమెంటులో అటల్ బిహారీ వాజ్‌పేయి... ‘‘తన ముద్దుల యువరాజు దీర్ఘ నిద్రలోకి కనురెప్పలు వాల్చడంతో భరతమాత శోక సముద్రంలో మునిగిపోయింది’’ అని ఘనంగా నివాళులు అర్పించారు. నెహ్రూను శ్రీరామచంద్రుడితో పోలుస్తూ, ‘‘వాల్మీకి గాథలో కనిపించే గొప్ప భావనలు మనకు పండిట్జీ జీవితంలో లభిస్తాయి’’ అన్నారు. ‘‘రాముడిలా నెహ్రూ కూడా అసాధ్యమైన, అనూహ్యమైన వాటికి రూపకర్త. ఆయన వ్యక్తిత్వ బలం, ఆ చైతన్యం, మనోస్వేచ్ఛ; ప్రత్యర్థికి, శత్రువుకు సైతం స్నేహ హస్తం చాచే గుణం, ఆ పెద్ద తరహా, ఆ గొప్పతనం బహుశా భవి ష్యత్తులో కనిపించకపోవచ్చు’’ అని నివాళులు అర్పించారు. ఆర్ఎస్ఎస్ రెండవ చీఫ్ ‘గురూజీ’ గోల్వాల్కర్... నెహ్రూ దేశభక్తిని, మహోన్నతమైన ఆదర్శవాదాన్ని కొనియాడుతూ, ఆయనకు ‘భరత మాత గొప్ప పుత్రుడి’గా హృదయపూర్వక అంజలులు ఘటించారు. భారతదేశంలో పార్లమెంటరీ వ్యవస్థకు బలమైన పునాది వేసినందుకు ఎల్.కె. అద్వానీ తరచు నెహ్రూను ప్రశంసించేవారు. 2013లో ఆయన తన బ్లాగులో, ‘‘నెహ్రూ లౌకికవాదం హైందవ పునాదులపై ఆధార పడి ఉంది’’ అని విశ్లేషించారు. అలాగే, తీవ్ర మనో వేదనతో నెహ్రూ అకాల మరణం చెంద డానికి కారణం అయిన (1962 చైనా దురాక్రమణ యుద్ధంలో) భారత్ పరాజయం తర్వాత నెహ్రూ ఆర్ఎస్ఎస్, జనసంఘ్లను తిరిగి అంచనా వేయడం ప్రారంభించారనేందుకు కొన్ని ఆధారాలు ఉన్నాయి. తన మరణానికి కొద్ది వారాల ముందు జర్నలిస్టుల బృందంతో జరిపిన సంభాషణలో కమ్యూనిస్టు అనుకూల వార్తా పత్రిక అయిన ‘ది పేట్రియాట్’ ప్రతినిధి జనసంఘ్‌ను ‘జాతీయ వ్యతిరేక పార్టీ’ అనడంతోనే నెహ్రూ ఆ ప్రతినిధిని వారించారు. ‘‘కాదు, జనసంఘ్ దేశభక్త పార్టీ’’ అని బదులిచ్చారు. దురదృష్టవశాత్తూ నెహ్రూ హిందుత్వాన్ని జనసంఘ్, కాంగ్రెస్ రెండూ మరిచిపోయాయి. బదులుగా అవి తమ మధ్య ఉన్న వ్యత్యా సాన్ని నిరంతరంగా ఆరున్నరొక్క రాగం తీస్తున్నాయి. ఏదేమైనప్పటికీ భారతీయ నాగరికతను యుగయుగాలుగా నిలబెట్టిన ప్రత్యేక లక్షణం ‘సమన్వయాన్ని సాధించగల సామర్థ్యం’, ‘వ్యతిరేకతల్ని పరిష్కరించు కోవడం’, ‘ఒక కొత్త కలయిక’ అని వారు గుర్తుంచుకోవాలి. రెండు ధ్రువాలుగా విడిపోతున్న నేటి ప్రమాదకర కాలానికి... జాతి ప్రయోజ నాల కోసం ‘సంవాదం’ (సంభాషణ) ద్వారా ‘సమన్వయం’ సాధించిన నెహ్రూ ఆదర్శప్రాయులు. సుధీంద్ర కులకర్ణి వ్యాసకర్త మాజీ ప్రధాని వాజ్‌పేయి సహాయకులు (‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో) -
పండిట్ నెహ్రూ, ఇందిరమ్మ రికార్డులను ఎవరు తిరగరాస్తారు!
దేశంలో ఒక ప్రధాని వరుసగా పదేళ్లు అధికారంలో ఉండడం గొప్ప విషయంగా మారిన రోజులివి. 2004లో అనూహ్య పరిస్థితుల్లో కాంగ్రెస్ తరఫున ప్రధాని అయిన డా.మన్మోహన్ సింగ్ అధికారంలో ఉండగా జరిగిన ఎన్నికల్లో పార్టీ బలం పెరిగాక రెండోసారి ప్రధానిగా ప్రమాణం చేసి పదేళ్లు ఆ పదవిలో ఉన్నారు. ఆయన తర్వాత బీజేపీ నేత నరేంద్ర మోదీ.. డా.మన్మోహన్ మాదిరిగా రెండోసారి ఎన్నికల్లో గెలిచి ప్రధానిగా ఇప్పుడు 9 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు. ఊహించని పరిణామాలు జరగకపోతే మన్మోహన్ జీ మాదిరిగానే 21వ శతాబ్దంలో వరుసగా పదేళ్లు భారత ప్రధానిగా పని చేసిన రికార్డును మోదీ సమం చేస్తారు. వీరిద్దరి కంటే ముందు వరుసగా ఎక్కువ కాలం ప్రధాని పదవిలో ఎవరెవరు ఉన్నారో పరిశీలిద్దాం. లాంగ్ రికార్డ్ నెహ్రూదే స్వతంత్ర భారతంలో అత్యధిక కాలం పదవిలో కొనసాగిన రికార్డు తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూది. భారత రాజ్యాంగం అమలులోకి రావడానికి 2 ఏళ్ల 4 నెలల ముందు అంటే–1947 ఆగస్ట్ 15న ప్రధానిగా ప్రమాణం చేసిన నెహ్రూజీ 1964 మే 27న కన్నుమూసే వరకూ పదవిలో కొనసాగారు. ఆయన దేశ ప్రధానిగా 16 ఏళ్ల 286 రోజులు పదవిలో ఉండి సృష్టించిన రికార్డును ఈరోజుల్లో తిరగరాయడం కష్టమేనని రాజకీయ పండితులు భావిస్తున్నారు. నెహ్రూ మరణానంతరం తాత్కాలిక ప్రధాని గుల్జారీలాల్ నందా 13 రోజుల పాలన తర్వాత కాంగ్రెస్ తరఫున ప్రధాని అయిన లాల్ బహదూర్ శాస్త్రీ 1966 జనవరి 11న గుండెపోటుతో మరణించడంతో ఆయన పదవిలో ఉన్నది ఏడాది 216 రోజులే. శాస్త్రీ జీ తర్వాత మళ్లీ తాత్కాలిక ప్రధానిగా 13 రోజుల జీఎల్ నందా సర్కారు దిగిపోయాక 1966 జనవరి 11న తొలిసారి ప్రధాన మంత్రి పదవి చేపట్టిన నెహ్రూ జీ కుమార్తె ఇందిరాగాంధీ వరుసగా 1967, 1971 ఎన్నికల్లో కాంగ్రెస్‌ను విజయపథంలో నడిపించారు. ఇందిరమ్మ 1977 మార్చి ఎన్నికల్లో పార్టీ ఓడిపోయే వరకూ పదవిలో కొనసాగారు. తండ్రి తర్వాత కుమార్తెదే రికార్డు: ఇందిరమ్మ వరుసగా 11 ఏళ్ల 59 రోజులు ప్రధానిగా అధికారంలో కొనసాగి, తండ్రి నెహ్రూ తర్వాత ఎక్కువ కాలం పదవిలో కొనసాగిన రికార్డు స్థాపించారు. 1980 జనవరి 14న చివరిసారి ప్రధాని అయిన ఇందిరమ్మ 1984 అక్టోబర్ 31న హత్యకు గురికావడంతో ఆమె చివరి పదవికాలం 4 ఏళ్ల 291 రోజులకే ముగిసింది. ఇందిరమ్మ వారసుడిగా అధికారంలోకి వచ్చిన ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ 1984 డిసెంబర్ లోక్ సభ ఎన్నికల తర్వాత రెండోసారి ప్రధానిగా ప్రమాణం చేశారు. కాని క్లిష్ట రాజకీయ పరిణామాల కారణంగా ప్రధానిగా ఆయన కొనసాగిన మొత్తం కాలం 5 ఏళ్ల 32 రోజులే. రాజీవ్ తర్వాత ప్రధానులైన వి.పి.సింగ్, చంద్రశేఖర్ లలో ఏ ఒక్కరూ ఏడాది పాటు ప్రధానిగా కొనసాగలేకపోయారు. వారి తర్వాత ప్రధాని అయిన కాంగ్రెస్ అధ్యక్షుడు పీవీ నరసింహారావు మరుసటి ఎన్నికల వరకూ దాదాపు ఐదేళ్లు అధికారంలో ఉన్నారు. కమల సారథ్యం 1990లో దేశంలో బీజేపీ బలపడిన క్రమంలో ఈ పార్టీ అగ్రనేత అటల్ బిహారీ వాజపేయి మొదటిసారి 1996లో ప్రధానిగా ప్రమాణం చేసి మెజారిటీ లేక రెండు వారాలకే దిగిపోవాల్సివచ్చింది. ఆయన తర్వాత ప్రధానులైన జనతాదళ్ నేతలు హెచ్డీ దేవెగౌడ, ఐకే గుజ్రాల్ లలో ఏ ఒక్కరూ కూడా ఏడాది కాలం పదవిలో కొనసాగలేకపోయారు. 1998, 1999 పార్లమెంటు మధ్యంతర ఎన్నికల తర్వాత వరుసగా రెండుసార్లు బీజేపీ నేతగా ప్రధాని అయిన వాజపేయి ఈ రెండు సార్లు కలిపి మొత్తం 6 ఏళ్ల 64 రోజులు అధికారంలో ఉన్నారు. చదవండి: భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం: సుస్థిరత నుంచి సుస్థిరతకు! వాజపేయి పదవీకాలాన్ని డా.మన్మోహన్, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ.. ఇద్దరూ దాటేశారు. ప్రధానిగా మోదీ వచ్చే ఏడాది మే నెలలో పదేళ్లు పూర్తిచేసుకుని మన్మోహన్ రికార్డును సమం చేసే అవకాశాలు సుస్పష్టమే. అయితే, వరుసగా 11 సంవత్సరాల 59 రోజులు ప్రధాని పదవిలో కొనసాగిన (నెహ్రూ తర్వాత రెండో రికార్డు) ఇందిరాగాంధీ రికార్డును దాటిపోయే అవకాశం బీజేపీ రెండో ప్రధానికి 2024 లోక్ సభ ఎన్నికల ఫలితాలు కల్పిస్తాయా? అనే విషయం ఏడాదిలో తేలిపోతుంది. -విజయసాయిరెడ్డి, రాజ్యసభ సభ్యులు, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు -
Tamil Nadu: అధికార డీఎంకేలో భగ్గుమన్న వర్గపోరు.. మంత్రి Vs ఎంపీ!
తిరుచ్చి వేదికగా అధికార డీఎంకే వర్గపోరు రచ్చకెక్కింది. పార్టీలో కీలకంగా ఉన్న ఇద్దరు నేతలకు చెందిన మద్దతు దారుల మధ్య బుధవారం ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ప్రొటోకాల్ ప్రకారం తమ నేతకు విలువ ఇవ్వడం లేదంటూ ఎంపీ శివ అనుచరులు మంత్రి నెహ్రూకు వ్యతిరేకంగా తొలుత నల్ల జెండాలను ప్రదర్శించడం వివాదానికి దారి తీసింది. దీంతో పోలీస్ స్టేషన్లోకి చొరబడి మరీ ఎంపీ అనుచరులను మంత్రి వర్గీయులు చితక్కొట్టారు. సాక్షి, చెన్నై: డీఎంకేలో నగరాభివృద్ధి శాఖ మంత్రిగా, పారీ్టలో సీనియర్ నేతగా కేఎన్ నెహ్రూ మంచి గుర్తింపు పొందారు. ఇక, ఎంపీ శివ ఢిల్లీ వేదికగా డీఎంకే రాజకీయాల్లో కీలక నేతగా ఉన్నారు. ఈ ఇద్దరు తిరుచ్చికి చెందిన వారే. ఇదే జిల్లా నుంచి మరో మంత్రిగా అన్బిల్ మహేశ్ కూడా ఉన్నారు. మంత్రుల మధ్య ఎలాంటి విభేదాలు లేకున్నా, మంత్రి నెహ్రూ, ఎంపీ తిరుచ్చి శివ మాత్రం ఉప్పు..నిప్పులా వ్యవహరిస్తున్నారు. నిరసనతో మొదలై.. తిరుచ్చిలో బుధవారం పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, కొత్త భవనాల నిర్మాణాలకు శంకు స్థాపనలు, నిర్మాణాలు పూర్తి చేసుకున్న వాటికి ప్రారంభోత్సవాలు పెద్దఎత్తున జరిగాయి. ఈ కార్యక్రమాల్లో మంత్రి నెహ్రూ బిజీ అయ్యారు. అయితే ఈ కార్యక్రమాలకు ఎంపీ తిరుచ్చి శివను ఆహ్వానించక పోవడాన్ని ఆయన వర్గీయులు తీవ్రంగా పరిగణించారు. అదే సమయంలో తిరుచ్చి కంటోన్మెంట్‌లోని ఎంపీ శివ ఇంటికి సమీపంలోని ఓ క్రీడా మైదానం ప్రారంభోత్సవానికి ఉదయాన్నే మంత్రి నెహ్రూ వచ్చారు. ఈ సమయంలో శివ వర్గీయులు నల్ల జెండాలను ప్రదర్శించి నిరసన తెలియజేయడం వివాదానికి ఆజ్యం పోసింది. శివ వర్గీయులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ ప్రా రంబోత్వవాన్ని ముగించుకుని మంత్రి నెహ్రూ తిరుగు ప్రయాణంలో ఉండగా, ఆయన మద్దతుదారులు రెచ్చి పోయారు. తిరుచ్చి శివ ఇంటి ముందు ఆగి ఉన్న కారు, రెండు ద్విచక్ర వాహనాలు, ఇంటి ముందు ఉన్న వస్తువులు, ఫర్నీచర్ ధ్వంసం చేయడంతో వివాదం ముదిరింది. మంత్రి కళ్లెదుటే ఈ దాడులు జరగడం గమనార్హం. అంతటితో వదిలి పెట్టక నేరుగా మంత్రి మద్దతుదారులు పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ భద్రతా విధుల్లో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు మాత్రమే ఉన్నారు. 100 మందికి పైగా వచ్చిన మంత్రి మద్దతుదారులు లోనికి చొరబడి వీరంగం సృష్టించారు. తిరుచ్చి శివ వర్గీయులపై దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ శాంతికి గాయాలు కావడంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు. ఎంపీ శివ ఇంటి వద్ద పోలీసు భద్రతను పెంచారు. పోలీసు స్టేషన్లోకి చొరబడి దాడులకు పాల్పడిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. పార్టీ నాయకుల వీరంగంపై సీఎం స్టాలిన్ సమాధానం చెప్పాలని అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళణి స్వామి డిమాండ్ చేశారు. தேர்தலுக்கு முன்னாடியே போலீஸ் ஸ்டேசனுக்கு லஞ்சம் குடுத்த @KN_NEHRU வை அமைச்சரா ஆக்குனா ஸ்டேசன்ல இதான் நடக்கும். pic.twitter.com/XezvEN06DW — Savukku Shankar (@Veera284) March 15, 2023 నెల్లైలోనూ వివాదం.. తిరుచ్చిలో ఇద్దరు కీలక నేతల మద్దతు దారుల మధ్య వార్ చోటు చేసుకుంటే, తిరునల్వేలిలో మేయర్, జిల్లా కార్యదర్శి మధ్య సమరం రాజధానికి చెన్నైకు చేరింది. తిరునల్వేలి కార్పొరేషన్ మేయర్ శరవణన్, జిల్లా పార్టీ కార్యదర్శి అబ్దుల్ వకాబ్ మధ్య వివాదంతో ఆ కార్పొరేషన్ డీఎంకే చేజారే పరిస్థితి నెలకొంది. అబ్దుల్ వకాబ్ మద్దతుగా 30 మందికి పైగా కార్పొరేటర్లు మేయర్ శరవణన్‌కు వ్యతిరేకంగా తిరుగు బావుట ఎగుర వేశారు. మేయర్‌ను తప్పించాలని నినాదిస్తూ చెన్నైకు బుధవారం ప్రయాణమయ్యారు. మా«ర్గంమధ్యలో తిరుచ్చిలో మంత్రి కేఎన్ నెహ్రూను కలిసి కొందరు కార్పొరేటర్లు వినతి పత్రం సమరి్పంచారు. గురువారం చెన్నైలోని డీఎంకే కార్యాలయంలో మేయర్‌పై ఫిర్యాదు చేయనున్నారు. ఐదుగురికి పార్టీ నుంచి ఉద్వాసన పార్టీ నాయకులు, కార్యకర్తలు పరస్పరం దాడుల నేపథ్యంలో పోలీసు స్టేషన్లోకి చొరబడి వీరంగం సృష్టించిన వారిపై డీఎంకే అధిష్టానం కన్నెర్రజేసింది. తిరుచ్చి కార్పొరేటర్లు ముత్తసెల్వం, విజయ్, రాందాసు, యూనియన్ నేత దురై రాజ్, ఉపనేత తిరుపతిని పార్టీ నుంచి తాత్కాలికంగా తొలగిస్తున్నట్లు డీఎంకే కార్యాలయం ప్రకటించింది. దీంతో ఈ ఐదుగురు పోలీసు స్టేషన్లో లొంగి పోయారు. పోలీస్ స్టేషన్లోకి చొరబడి ప్రత్యర్థులపై జరిపిన దాడికి పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ వీరంతా పోలీసులకు లొంగిపోయినట్లు వెల్లడించారు. వీరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదైనట్లు తెలిపారు. -
రాహుల్ స్పీచ్‌లు చూసి వాళ్లు భయంతో వణికిపోతున్నారు: సీఎం స్టాలిన్
చెన్నై: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ప్రశంసల వర్షం కురిపించారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. భారత్ జోడో యాత్రలో రాహుల్ స్పీచ్‌లు చూసి కొందరు భయంతో వణికిపోతున్నారని అన్నారు. ఆయన ప్రసంగాలు చూస్తుంటే జవహర్లాల్ నెహ్రూ గుర్తుకు వస్తున్నారని కొనియాడారు. నేహ్రూ, గాంధీల వారసులు మాట్లాడుతుంటే గాడ్సే భక్తులకు మండుతోందని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ తన స్పీచ్‌లలో ఎన్నికలపరమైన రాజకీయాల గురించి మాట్లాడటం లేదని, సిద్ధాంతపరమైన రాజకీయాల గురించే ప్రస్తావిస్తున్నారని స్టాలిన్ పేర్కొన్నారు. ఈ ప్రసంగాలు చూసి కొన్ని పార్టీలు భయపడుతున్నాయన్నారు. భారత తొలి ప్రధాని నెహ్రూ నిజమైన ప్రజాస్వామ్యవాది అని స్టాలిన్ అన్నారు. కానీ ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని విస్మరిస్తోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ సంస్థలను అమ్మెస్తోందని, పార్లమెంటులో ప్రతిపక్షాలు మాట్లాడటానికి కూడా అనుమతించకుండా గొంతు నొక్కుతోందని మండిపడ్డారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో భారత్-చైనా బలగాల ఘర్షణ విషయంపై చర్చ జరపాలని ప్రతిపక్షాలు పట్టుబట్టగా బీజేపీ నిరాకరించింది. సభ్యులు సభలో ఆందోళనలు చేయడంతో రోజూ వాయిదాల పర్వాన్నే కొనసాగించింది. ఈ నేథ్యంలోనే శీతాకాల సమావేశాలను ఆరు రోజులు ముందుగానే ముగించింది. చదవండి: మోదీ ప్రజాదరణ, అమిత్ షా వ్యూహాలు.. 2022లోనూ తిరుగులేని బీజేపీ! -
జాతి పండగకు జేజేలు
సాక్షి, హైదరాబాద్: భారత స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా నగరంలోని అబిడ్స్ జీపీఓ సర్కిల్ నెహ్రూ విగ్రహం వద్ద మంగళవారం ఉదయం 11 గంటలకు సామూహిక జాతీయ గీతాలాపన జరగనుంది. కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కానున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఉద్యోగులతో పాటు కళాశాల విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గోనున్నారు. జీపీఓ సర్కిల్ వద్ద స్వాతంత్య్ర సమరయోధుల చిత్ర పటాలు ప్రదర్శించనున్నారు. రంగురంగుల బ్యానర్లు, గీతాలాపన చేయడానికి మైక్ ఏర్పాట్లు చేశారు. గోల్కొండ కోటలో జాతీయ పతాకంతో కళాకారుడి ఆనంద హేల సామూహిక గీతాలాపన ఏర్పాట్లను సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ పరిశీలించారు. ట్రాఫిక్ నిబంధనలు, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట జీఏడీ కార్యదర్శి శేషాద్రి, అడిషనల్ డీజీపీ జితేందర్, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఉన్నత విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, కార్యదర్శి వాకాటి కరుణ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ అమయ్ కుమార్, సిటీ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తదితరులు ఉన్నారు. ర్యాలీ నిర్వహిస్తున్న అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధ్యాపకులు తిరంగా సంబరం తరంగమై ఎగిసింది. నగరం అంగరంగ వైభవంగా మెరిసింది. మువ్వన్నెల జెండా వజ్రోత్సవంలా మురిసింది. స్వాతంత్య్ర శోభ వెల్లివిరిసింది. ఇళ్లు, వీధులు, వాహనాలపై త్రివర్ణ పతాకాలు సమున్నతంగా ఆవిష్కృతమయ్యాయి. సోమవారం నగరంలో స్వాతంత్య్ర దినోత్సవ సంబురాలు అంబరమంటాయి. ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్ ప్రాంతాల్లో భారీ జెండాలతో బైక్ ర్యాలీలు, కారు ర్యాలీలు జోరుగా సాగాయి. భారీ జాతీయ జెండా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాతబస్తీలో జాతీయ జెండాలతో ఉత్సాహంగా ముస్లిం మహిళలు వజ్రోత్సవాల్లో భాగంగా ప్రతి పది మీటర్లకు ఒకటి చొప్పున ఏర్పాటు చేసిన పతాకాలు చూడముచ్చగా కనువిందు చేశాయి. సంజీవయ్య పార్క్ సమీపంలో జాతీయ జెండాలతో వింటేజ్ కార్లతో చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. అబిడ్స్ మొజంజాహీ మార్కెట్ వేదికగా అతి పొడవైన జాతీయ జెండాతో చేసిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కళాశాలు, స్కూళ్లలో వేడుకలు ఆనందోత్సాహాలతో సాగాయి. కళాకారులు దేశభక్తి ఉట్టిపడేలా తయారైన విధానం అందరినీ ఆకట్టుకుంది. ట్యాంక్‌బండ్‌పై త్రివర్ణ పతాకాలతో ర్యాలీ నగరంలోని చారిత్రక కట్టడాలు, ప్రభుత్వ భవనాలతో పాటు నలుమూలలా వ్యాపించి ఉన్న కార్పొరేట్ ఆఫీసుల్లో, ఐటీ కంపెనీల్లో, విద్యా సంస్థల్లో 75 వసంతాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గోల్కొండ కోట వేదికగా ఘనంగా సాంస్కృతిక కార్యక్రమాలతో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈసారి స్వాతంత్య్ర దినోత్సవాల్లో నగర యువత ఆసక్తిగా పాల్గొని సందడి చేశారు. వజ్రోత్సవాల్లో భాగంగా నగరానికి చెందిన మైక్రో ఆరి్టస్టు కృష్ణ ఉట్ల బియ్యపు గింజపై జాతీయ జెండాను రూపొందించారు. చిన్న పరిమాణంలో ఉండే బియ్యపు గింజపై అశోక చక్రం, మూడు వర్ణాలతో ఉన్న జాతీయ జెండాను వేసి దేశభక్తిని చాటుకున్నాడు. – సాక్షి, సిటీబ్యూరో (చదవండి: దేశాన్ని విచ్ఛిన్నం చేసే రాజకీయ శక్తులను అడ్డుకోవాలి) -
నెహ్రూ టు నరేంద్ర
భారత స్వాతంత్య్ర సమరం, స్వాతంత్య్రం వచ్చిన సందర్భం, రెండో ప్రపంచ యుద్ధానంతర పరిణామాలు, ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణం, ప్రపంచ పరిస్థితులు కలసి భారత ప్రధానమంత్రి పదవికి రూపురేఖలను ఇచ్చాయి. దేశంలో బ్రిటిష్ వలస వాసనలు, మారిన రాజకీయ తాత్త్వికతలను అవగతం చేసుకుంటూ, అవి తెచ్చిన సమస్యలను అధిగమిస్తూ దేశాన్ని పునర్నిర్మాణం చేసే గురుతర బాధ్యతను మన ప్రధానులు నిర్వహించారు. 1947 నుంచి 2022 వరకు భారతీయులు 14 మంది ప్రధానుల పాలనను వీక్షించారు. ఒక్కొక్క ప్రత్యేకతతో ఒక్కొక్క ప్రధాని చరిత్ర ప్రసిద్ధులయ్యారు. 1947–1977 ప్రథమ ప్రధాని జవాహర్లాల్ నెహ్రూ. 16 ఏళ్ల 286 రోజుల నెహ్రూ పాలనా కాలమే ఇప్పటికి వరకు రికార్డు. తరువాత ఆయన కుమార్తె ఇందిరాగాంధీ హయాం 11, 4 సంవత్సరాలతో రెండో స్థానంలో నిలిచారు. రెండు పర్యాయాలు ప్రధానిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ మూడో స్థానంలో నిలుస్తారు. లాల్ బహదూర్‌శాస్త్రి (19 నెలలు), గుల్జారీలాల్ నందా (రెండు పర్యాయాలు ఆపద్ధర్మ ప్రధాని, 27 రోజులు), రాజీవ్‌గాంధీ, పీవీ నరసింహారావు (ఐదేసి సంవత్సరాలు) ప్రధాని పదవిలో ఉన్నారు. మొత్తంగా 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఒక్క కాంగ్రెస్ పార్టీ ప్రధానులే దాదాపు 56 ఏళ్లు ఆ పదవిలో ఉన్నారు. భారత్‌కు స్వాతంత్య్రం ఇవ్వాలన్న నిర్ణయం తరువాత ఏర్పడిన జాతీయ ప్రభుత్వానికి (1946) నాయకత్వం వహించినవారు నెహ్రూయే. ఆపై 1947 ఆగస్ట్ 15 నుంచి స్వతంత్ర భారత తొలి ప్రధాని. దేశ విభజన నాటి నెత్తుటి మరకలు ఆరకుండానే 1947 అక్టోబర్‌లో పాకిస్తాన్ తో యుద్ధం చేయవలసి వచ్చింది. రాజ్యాంగ రచన, అలీన విధానం, పంచవర్ష ప్రణాళికలు, ఐఐటీలు, భారీ నీటిపారుదల పథకాలు, భారీ పరిశ్రమలు ఆయన హయాం ప్రత్యేకతలు. 1962లో ఆయన పాలనలోనే చైనాతో యుద్ధం జరిగింది. అది చేదు ఫలితాలను మిగిల్చింది. 1964 లో నెహ్రూ మరణంతో లాల్ బహదూర్‌శాస్త్రి ప్రధాని అయ్యారు. 1965లో పాకిస్తాన్ తో యుద్ధం వచ్చింది. ఆ యుద్ధంలో ఓడిన పాకిస్తాన్ తో శాంతి ఒప్పందం మీద సంతకాలు చేయడానికి తాష్కెంట్ (సోవియెట్ రష్యా) వెళ్లిన శాస్త్రి అక్కడే అనుమానాస్పద పరిస్థితులలో మరణించారు. జైజవాన్ జై కిసాన్ ఆయన నినాదమే. తరువాత 1966లో ఇందిరాగాంధీ ప్రధాని అయ్యారు. ఇందిర పాలన అంటే కొన్ని వెలుగులు, ఎక్కువ చీకట్ల సమ్మేళనం. ఆమె బ్యాంకులను జాతీయం చేశారు. రాజభరణాలు రద్దు చేశారు. 1969 నాటి రాష్ట్రపతి ఎన్నికలో ఆమె నిర్వహించిన విధ్వంసక భూమికతో కాంగ్రెస్ చీలిపోయింది. పార్టీ నిర్ణయించిన నీలం సంజీవరెడ్డిన ఓడించి, తాను నిలబెట్టిన వీవీ గిరిని ‘ఆత్మ ప్రబోధం’ నినాదంతో గెలిపించిన అపకీర్తి ఆమెది. 1971లో ఇందిర కూడా పాకిస్తాన్ తో యుద్ధం చేశారు. ఆ యుద్ధ ఫలశ్రుతి భారత్ గెలుపు, బంగ్లాదేశ్ ఆవిర్భావం. ఇందిర హయాంకు మకుటాయమానమైనది 1974 నాటి పోఖ్రాన్ అణపరీక్ష (స్మైలింగ్ బుద్ధ). దీనితో భారత్ ప్రపంచంలోనే అణుపాటవం ఉన్న ఆరోదేశంగా ఆవిర్భవించింది. 1975లో అత్యవసర పరిస్థితిని ప్రకటించిన ఇందిర చరిత్రలో తన స్థానాన్ని తానే చిన్నబుచ్చుకున్నారు. అలా కాంగ్రెస్‌కు ఒక ప్రత్యామ్నాయాన్ని సృష్టించి పెట్టిన ఘనత కూడా ఆమెదే. అత్యవసర పరిస్థితి ఎత్తివేసిన తరువాత 1977లో జనతా పార్టీ ఏర్పడింది. అందులో భారతీయ జనసంఘ్ భాగస్వామి అయింది. ద్వంద్వ సభ్యత్వం కారణంగా జనతా పార్టీని వీడిన జనసంఘ్ సభ్యులు 1980లో భారతీయ జనతా పార్టీని స్థాపించారు. భారత రాజకీయాలలో జాతీయ స్థాయి పార్టీగా కాంగ్రెస్‌కు ఉన్న స్థానాన్ని కూలదోసిన పార్టీగా బీజేపీ ఎదగడం చరిత్ర. జనతా పార్టీ, ప్రభుత్వం కుప్ప కూలిపోవడంతో 1980లో మధ్యంతర ఎన్నికలు జరిగి ఇందిర మళ్లీ ప్రధాని అయ్యారు. ఇది కూడా చరిత్రలో ఒక అనూహ్య ఘట్టమే. అత్యవసర పరిస్థితి తరువాత ఘోరంగా ఓడిపోయిన పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. రెండో దశ ఏలుబడిలో ఆమె చేసిన సాహసోపేత నిర్ణయం అమృత్సర్ స్వర్ణాలయం మీద ఆపరేషన్ బ్లూ స్టార్, పేరిట సైనిక చర్య. కానీ అది సాహసం కాదు, దుస్సాహసమేనని చరిత్ర రుజువు చేసింది. ఆ చర్య నుంచి వచ్చిన ప్రతీకార జ్వాలకే ఆమె 1984లో ఆహుతయ్యారు. అంగరక్షకులే కాల్చి చంపారు. ఇందిర భారత తొలి మహిళా ప్రధానిగానే కాదు, హత్యకు గురైన తొలి ప్రధానిగా కూడా చరిత్రకు ఎక్కారు. 1977–1980 ఈ కొద్దికాలంలోనే భారతదేశం ఇద్దరు ప్రధానులను చూసింది. ఒకరు మొరార్జీ దేశాయ్, మరొకరు చౌధురి చరణ్‌సింగ్. నెహ్రూతో, ఇందిరతో ప్రధాని పదవికి పోటీ పడిన మొరార్జీ దేశాయ్ జనతా పార్టీ గెలిచిన తరువాత ప్రధాని పదవిని చేపట్టారు. స్వాతంత్య్ర సమరస్ఫూర్తి, గాంధేయవాదం మూర్తీభవించిన ప్రధాని ఆయన. వరసగా పది కేంద్ర బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఘనత ఉన్న మొరార్జీ ప్రధానిగా రెండు సంవత్సరాల నాలుగు నెలలు మాత్రమే పదవిలో ఉన్నారు. జనతా పార్టీ పతనమే ఇందుకు కారణం. ద్వంద్వ సభ్యత్వం, రాజ్ నారాయణ్ రగడ, మాజీ జనసంఘీయుల నిష్క్రమణ వంటి కారణాలు ఆయన రాజీనామాకు దారి తీశాయి. తరువాత చౌదరి చరణ్‌సింగ్ ప్రధాని అయ్యారు. ప్రధానిగా పార్లమెంట్‌కు వెళ్లకుండా రాజీనామా చేసిన ప్రధానిగా మిగిలారు. భారత్‌కు సంకీర్ణ ప్రభుత్వాలు తప్పవన్న సంకేతం ఈ కాలం ఇచ్చింది. 1984–1996 ఇందిర హత్య తరువాత ఆమె పెద్ద కుమారుడు రాజీవ్‌గాంధీ ప్రధాని అయ్యారు. తల్లి హత్యతో ప్రధాని పదవిని అధిష్టించిన రాజీవ్, మాజీ ప్రధానిగా తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో హత్యకు గురయ్యారు. షాబోనో కేసు, హిందువుల కోసం అయోధ్య తలుపులు తెరవడం, భోపాల్ విషవాయువు విషాదం, బోఫోర్స్ తుపాకుల అవినీతి వ్యవహారం ఆయన హయాంలోనే జరిగాయి. కమ్యూనికేషన్ వ్యవస్థ బలోపేతానికి ఆయన కృషి ఆరంభించారు. రాజీవ్ మంత్రివర్గంలోనే ఆర్థిక, రక్షణ శాఖలను నిర్వహించిన విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ బోఫోర్స్ వ్యవహారంతో కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు చేసి, జనతాదళ్ కూటమి బలంతో ప్రధాని పదవిని చేపట్టారు. ఉపప్రధాని దేవీలాల్‌తో వీపీ సింగ్‌కు విభేదాలు తీవ్రమైనాయి. అలాంటి సందర్భంలో సింగ్ మండల్ కమిషన్ నివేదికను బయటకు తీశారని చెబుతారు. ఎల్‌కె అడ్వాణిని అయోధ్య రథం మీద నుంచి దించడంతో వీపీ సింగ్‌ను ప్రధాని పదవి నుంచి బీజేపీ దించివేసింది. సింగ్ తరువాత చంద్రశేఖర్ కాంగ్రెస్ ‘బయటి నుంచి మద్దతు’తో ప్రధాని అయ్యారు. చంద్రశేఖర్ సమాజ్‌వాదీ జనతా పార్టీ మైనారిటీ ప్రభుత్వం బడ్జెట్‌ను కూడా ఆమోదింప చేయలేకపోయింది. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడడానికి ఈ ప్రభుత్వం బంగారాన్ని కుదువ పెట్టవలసి వచ్చింది. చంద్రశేఖర్ తరువాత తెలుగువారు పీవీ నరసింహారావు ప్రధాని అయ్యారు. ఆర్థిక సంస్కరణల ద్వారా దేశాన్ని ఒక తీవ్ర సంక్షోభం నుంచి బయటపడవేసిన వారు పీవీ. కానీ అయోధ్య వివాస్పద కట్టడం ఆయన హయాంలోనే కూలింది. మైనారిటీ ప్రభుత్వమే అయినా ఐదేళ్ల పాటు అధికారంలో కొనసాగిన ఘనత పీవీ ప్రభుత్వానికి ఉంది. 1996–2004 ఒక రాజకీయ సంక్షుభిత దేశంగానే భారత్ కొత్త మిలీనియంలోకి అడుగు పెట్టింది. కాంగ్రెస్ ప్రభను కోల్పోతుండగా, బీజేపీ బలపడుతున్న కాలమది. అలాగే హంగ్ యుగం కూడా. ఏ పార్టీకి మెజారిటీ రాని పరిస్థితి చిరకాలం కొనసాగింది. 1996లో జరిగిన ఎన్నికలలో అతి పెద్ద మెజారిటీ సాధించిన పార్టీగా బీజేపీ అవతరించింది. కానీ హంగ్ లోక్‌సభ ఏర్పడింది. వాజపేయి తొలిసారి 1996 మే 16 న ప్రధానిగా ప్రమాణం చేశారు. 1996 జూన్ 1 న రాజీనామా చేశారు. తరువాత హెచ్డి దేవెగౌడ ప్రధాని అయ్యారు. కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలతో యునైటెడ్ ఫ్రంట్ ఏర్పడింది. సీతారాం కేసరి నాయకత్వంలోని కాంగ్రెస్ యథాప్రకారం బయట నుంచి మద్దతు ఇచ్చింది. కానీ 11 మాసాలకే ఆయన ప్రభుత్వం పడిపోయింది. దేవెగౌడ వారసునిగా ఇందర్‌కుమార్ గుజ్రాల్ పదవీ స్వీకారం చేశారు. విదేశ వ్యవహారాలలో దిట్ట అయిన గుజ్రాల్ కూడా 11 మాసాలు మాత్రమే అధికారంలో ఉన్నారు. ఇరుగు పొరుగు దేశాలతో భారత్ సంబంధాల గురించి గుజ్రాల్ సిద్ధాంతం పేరుతో ఒక విధానం ప్రసిద్ధమైంది. 1998లో మళ్లీ మధ్యంతర ఎన్నికలను దేశం ఎదుర్కొనవలసి వచ్చింది. ఈసారి చాలా పార్టీలు బీజేపీ వెనుక నిలిచాయి. నేషనల్ డెమాక్రటిక్ అలయెన్స్ కూటమి ఏర్పడి, వాజపేయి ప్రధాని అయ్యారు. కూటమిలో భాగస్వామి అన్నా డీఎంకే మద్దతు ఉపసంహరించుకొనడంతో ఒక్క ఓటుతో ప్రభుత్వం కూలిపోయింది. 1999లో మళ్లీ ఉప ఎన్నికలు జరిగి ఎన్ డీఏ విజయం సాధించింది. వాజపేయి ప్రధానిగా ప్రమాణం చేశారు. కొద్ది నెలలు మినహా పూర్తి సమయం అధికారంలో కొనసాగారు. తన పదమూడు మాసాల పాలనలోనే వాజపేయి పోఖ్రాన్ 2 అణుపరీక్ష జరిపించారు. మూడోసారి ప్రధాని అయినప్పుడు పాకిస్తాన్ తో కార్గిల్ సంఘర్షణ జరిగింది. లాహోర్ బస్సు దౌత్యం వంటి ప్రయత్నాలు కూడా జరిగాయి. 2004–2022 2004లో జరిగిన ఎన్నికలలో మళ్లీ కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ అధికారంలోకి వచ్చింది. పీవీ నరసింహారావు మంత్రివర్గంలో ఆర్థికమంత్రి, ఆర్థిక సంస్కరణల శిల్పి డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధాని అయ్యారు. 2009 ఎన్నికలలో కూడా మళ్లీ యూపీఏ గెలిచి ఆయనే ప్రధాని అయ్యారు. యూపీఏ మొదటి దశ సజావుగానే సాగినా, రెండో దశ అవినీతి ఆరోపణలను మూటగట్టుకుంది. 2014 ఎన్నికలలో బీజేపీ ఘన విజయం సాధించి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. 2019లో జరిగిన ఎన్నికలలో మరొకసారి మోదీకే భారతీయులు పట్టం కట్టారు. ముప్పయ్ ఏళ్ల తరువాత తిరుగులేని మెజారిటీ సాధించిన పార్టీగా 302 సీట్లు బీజేపీ సాధించింది. కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370 అధికరణాన్ని మోదీ ప్రభుత్వం రద్దు చేసింది. గిరిజన మహిళ ద్రౌపది ముర్మును భారత రాష్ట్రపతిగా ఎంపిక చేసిన ఘనతను కూడా బీజేపీ దక్కించుకుంది. – డా. గోపరాజు నారాయణరావుఎడిటర్, ‘జాగృతి’ (చదవండి: మహాత్మా మన్నించు..) -
లక్ష్యం ఒక్కటే దారులు వేరు!
నెహ్రూ స్వతంత్ర భారత తొలి ప్రధాని. రాజేంద్ర ప్రసాద్ తొలి రాష్ట్రపతి. ఇద్దరు పని చేస్తున్నది ఒకే లక్ష్యంతోనే అయినా ఇద్దరి భావాలు, సిద్దాంతాలు వేరుగా ఉండేవి. నెహ్రూ ఆధునికం అయితే రాజేంద్ర ప్రసాద్ సంప్రదాయం. అయితే ఈ మాటల్ని మనం ఉన్నవి ఉన్నట్లుగా కాకుండా వారిలోని వైరుధ్యానికి ఓ తేలికపాటి పోలికగా మాత్రమే తీసుకోవాలి. అర్ధరాత్రి కొట్టగానే కదా దేశానికి స్వాతంత్య్రం వచ్చింది.. 1947 ఆగస్టు 15న! భారత్ సంకెళ్లు తెగిపోయాయి. ఇప్పుడిక భారత్ తనేమిటో ప్రపంచ దేశాలకు చూపించుకోవాలి. స్వాతంత్య్రం సంపాదించుకుని, స్వాతంత్య్రంతో ఏమీ చేయకపోతే ఎలా! వలస పాలకులు భారత ప్రజా గర్జనకు పక్షుల్లా ఎగిరిపోయాక, భారత్ స్వేచ్ఛా విహంగమై నెహ్రూ, రాజేంద్రల భుజాలపై వాలింది. దేశ భవిష్యత్తును ఇక నిర్మించవలసింది, నిర్ణయించవలసిందీ ప్రధానంగా వాళ్లిద్దరే. ధ్వనించని మెత్తటి చిరు నవ్వులా ఉండేవారు డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్. గాంధీజీ ఆదర్శాల నుంచి తెచ్చుకున్న గుణం అది. నెహ్రూకు తోడ్పాటుగా ఉండేందుకు ఆ స్వభావం ఆయనకెంతో తోడ్పడింది. నెహ్రూతో విభేదించేవారు. అయితే ఆ విభేదం.. ఐక్యతతోనే! ఇది సాధ్యమేనా? సాధ్యం చేసుకున్నారు కనుకనే నెహ్రూ, రాజేంద్ర గొప్ప నాయకులుగా, పాలనకు నమ్మకమైన స్తంభాలుగా నిలబడ్డారు. అభిప్రాయ భేదాలు సాధారణంగా ప్రధాని చెప్పినదానికి రాష్ట్రపతి కాదనేదేమీ ఉండదు. రాష్ట్రపతి కాదనరు కదా అని ఆయన అభిప్రాయం తీసుకోకుండా ప్రధానీ ఏమీ చెయ్యరు. నెహ్రూ, రాజేంద్ర కూడా సఖ్యతగానే ఉన్నారు. అయితే స్వీయ విశ్వాసాలు, సిద్ధాంతాల దగ్గరికి వచ్చేటప్పటికి వారికి అభిప్రాయ భేదాలు వచ్చేవి. దేశం అభివృద్ధి చెందడానికి శాస్త్ర, సాంకేతిక నైపుణ్యాలు అవసరం అని నెహ్రూ బలంగా నమ్మేవారు. ప్రార్థనా స్థలాలకంటే పరిశ్రమలు, పాఠశాలలు ముఖ్యం అనేవారు. రాజేంద్ర ప్రసాద్ అందుకు భిన్నమైన నమ్మకాలను కలిగి ఉండేవారు. దేశ పురోభివృద్ధికి పరిశ్రమలు, శాస్త్ర పరిజ్ఞానాలు అవసరమే అయినా.. సంస్కృతీ సంప్రదాయాలను, మత విశ్వాసాలను విస్మరించడానికి లేదని రాజేంద్ర ప్రసాద్ భావించేవారు. ఈ రెండు దారులు వేటికవి సాగుతున్నంత వరకు వాళ్లిద్దరి మధ్య ఘర్షణ తలెత్తలేదు. ఓ సందర్భంలో మాత్రం ఆ రెండు దారులు ఒకదాన్ని ఒకటి దాటవలసి వచ్చింది! ఆ సందర్భం.. సోమనాథ ఆలయ ప్రారంభోత్సవం! ఆలయ పునరుద్ధరణ గుజరాత్‌లోని సోమనాథ ఆలయం క్రీ.శ. 1వ శతాబ్దం నాటిది. కాలక్రమంలో ఆలయం శిథిలమైపోగా, ఆ శిథిలాలపైనే క్రీ.శ.649 లో రెండో ఆలయాన్ని నిర్మించారు. క్రీ.శ.722లో అరబ్బులు సింధు ప్రాంతంలో బలపడ్డాక జరిగిన దాడులలో ఆలయం ధ్వంసమయింది. చాళుక్యులు వచ్చాక ఆలయ పునరుద్ధరణ జరిగింది. 1026లో మహమ్మద్ ఘజనీ దండయాత్రలో సోమనాథ ఆలయం మళ్లీ దెబ్బతినింది. 1114లో హిందూ రాజులు ఆలయాన్ని పునరుద్ధరించారు. తర్వాత 1299లో అల్లా ఉద్దీన్ ఖిల్జీ ఆలయంపై పడి శివలింగాన్ని ముక్కలు ముక్కలు చేశాడు. 1331లో జునాఘడ్ రాకుమారుడు తిరిగి అక్కడ లింగ ప్రతిష్ఠ చేశాడు. 1459లో మహమ్మద్ బేగ్దా ఆ శివలింగాన్ని తొలగించి, ఆలయాన్ని మసీదుగా మార్చేశాడు. 1783లో ఇండోర్ మహారాణి అహల్యాబాయి మసీదు స్థానంలో తిరిగి సోమనాథ ఆలయాన్ని పునర్నిర్మించారు. శత్రువుల బారిన పడకుండా లింగప్రతిష్ఠను భూగర్భంలో జరిపించారు. కాలగమనంలో ఆలయం శిథిలమవుతూ వచ్చింది. నెహ్రూ వెళ్లొద్దన్నారు! దేశానికి స్వాతంత్య్రం వచ్చాక 1951లో ఈ ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమాల ప్రారంభోత్స వానికి అధ్యక్షత వహించవలసిందిగా అందిన ఆహ్వానాన్ని రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ స్వీకరించారు. అది తెలిసి నెహ్రూ పరోక్షంగా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. భారత సమాజంలో ప్రార్థనా స్థలాల ప్రాముఖ్యంపై నెహ్రూ–రాజేంద్రల మధ్య భిన్నమైన వాదనలు బహిరంగంగానే వినిపిస్తూ ఉన్న సమయం అది. అలాంటి కార్యక్రమానికి రాష్ట్రపతి వెళ్లకూడదని నెహ్రూ అభిప్రాయం. వెళ్లడమే సరైనదని రాజేంద్ర వాదన. ‘ఏమైనా ఈ సమయంలో ఇలాంటి మత పరమైన అభివృద్ధికి దేశాధినేతలను ప్రాధాన్యం ఇవ్వడం తగదు. దానికింకా ఎంతో సమయం ఉంది. సరే ఎలాగూ అధ్యక్షతకు అంగీకరించారు కనుక అలాగే కానివ్వండి’ అని నెహ్రూ ఆ తర్వాత రాజేంద్రతో అన్నట్లు ‘పిలిగ్రిమేజ్ టు ఫ్రీడమ్’ పుస్తకంలో రచయిత కె.ఎం. మున్షీ రాశారు. (చదవండి: శతమానం భారతి: నవ భారతం) -
చైతన్య భారతి నెహ్రూ యోగా గురువు
స్వామి కువలయానంద ప్రసిద్ధ యోగా గురువు. ఆయన అసలు పేరు జగన్నాథ గణేశ గుణే. 1883 ఆగస్టు 30న జన్మించారు. ఆయన యోగా గురువు మాత్రమే కాదు. యోగా పరిశోధకులు కూడా. కువలయానంద ప్రధానంగా యోగా శాస్త్రీయ పునాదులపై తన మార్గదర్శక పరిశోధనకు పేర్గాంచారు. 1920లో యోగాపై పరిశోధన ప్రారంభించి, 1924లో యోగా అధ్యయనం కోసం ‘యోగా మీమాంస’ అనే పుస్తకాన్ని ప్రచురించారు. స్వామి కువలయానంద గుజరాత్ రాష్ట్రంలోని ధబోయ్ గ్రామంలో సంప్రదాయ కర్హడే బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. కువలయానంద తండ్రి శ్రీ గణేశ గుణే ఉపాధ్యాయులు. తల్లి సరస్వతి గృహిణి. పేద కుటుంబం కావడంతో ప్రభుత్వ, ప్రైవేట్ స్వచ్ఛంద సంస్థలపై వారు కొంతకాలం ఆధారపడవలసి వచ్చింది. కువలయానంద చదువు కోసం కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది. అయినప్పటికీ ఆయన 1903లో మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులయ్యారు. బరోడా కాలేజీలో చదువుకోవడానికి స్కాలర్షిప్ పొందారు. కువలయానంద విద్యార్థి రోజుల్లో శ్రీ అరబిందో, లోకమాన్య తిలక్ వంటి రాజకీయ నాయకుల వల్ల ప్రభావితమయ్యారు. ఆయన జాతీయ భావవాదం, దేశభక్తి ఉద్వేగం ఆయన తన జీవితాన్ని మానవాళి సేవకు అంకితం చేయడానికి ప్రేరేపించాయి. ఈ సమయంలోనే జీవితాంతం బ్రహ్మచర్యం పాటించేందుకు ప్రతిజ్ఞను తీసుకున్నాడు. 1916 నుండి 1923 వరకు ఉన్నత పాఠశాల, కళాశాల విద్యార్థులకు భారతీయ సంస్కృతిపై పాఠాలు బోధించారు. అందులో యోగా అంతర్లీనమై ఉండేది. యోగాలో కువలయానంద మొదటి గురువు బరోడాలోని జుమ్మదాడ వ్యాయామశాల ప్రొఫెసర్ రాజారత్న మాణిక్‌రావు. 1919లో కవలయానంద నర్మదా నది ఒడ్డున బరోడా సమీపంలోని మల్సార్లో స్థిరపడిన బెంగాలీ యోగి పరమహంస మాధవదాస్ను కలిశారు. మాధవదాస్ మార్గదర్శకత్వంలో కువలయానందకు యోగా క్రమశిక్షణ అలవడింది. కువలయానంద ఆధ్యాత్మికంగా ఆదర్శవాది అయినప్పటికీ, అదే సమయంలో కఠినమైన హేతువాది. కాబట్టి యోగా ప్రభావాల శాస్త్రీయతలపై పరిశోధనలు జరిపారు. 1930ల నాటికే కువలయానంద భారతదేశంలో యోగావంటి శారీరక విద్యను వ్యాప్తి చేయడానికి ఒక మార్గంగా యోగా ఉపాధ్యాయుల సమూహాలకు శిక్షణ ఇచ్చారు. ఆయన దగ్గర యోగాలో శిక్షణ పొందిన వారిలో జవహర్లాల్ నెహ్రూ కూడా ఒకరు! 1929 లో నెహ్రూ కువలయానందను కలవడం జరిగింది. ఆయనతో పరిచయం ఆయ్యాకే నెహ్రూకు యోగాపై గురి ఏర్పడింది. 1931 నుంచీ నెహ్రూ క్రమం తప్పకుండా యోగా సాధన చేస్తూ వచ్చారు. కువలయానంద తన 82 ఏళ్ల వయసులో 1966 ఏప్రిల్ 18న మరణించారు. (చదవండి: సామ్రాజ్య భారతి.. 1876/1947) -
Rajiv Gandhi వర్ధంతి.. ఆ దుర్ఘటనే రాజకీయాల్లోకి లాక్కొచ్చింది
వెబ్‌డెస్క్ స్పెషల్: భారత దేశ ఆరవ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి నేడు(మే 21). భారత దేశానికి అత్యంత పిన్నవయస్కుడైన ప్రధాని కూడా(40). 1991, మే 21వ తేదీన జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో దుర్మరణం పాలయ్యారు ఆయన. అప్పటికి ఆయన వయసు 46 సంవత్సరాలు. అయితే తాత, దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ.. రాజీవ్ రాజకీయాల్లోకి రావాలని ఏనాడూ కోరుకోలేదట!. మరి రాజీవ్‌ను రాజకీయాల్లోకి లాగిన పరిస్థితులు ఏంటో చూద్దాం. ► రాజీవ్ గాంధీ.. 1944 అగష్టు 20న బాంబేలో జన్మించారు. ఇందిర-ఫిరోజ్ గాంధీలు తల్లిదండ్రులు. ఆయన బాల్యమంతా తాత నెహ్రూతో పాటే ఢిల్లీలోని తీన్‌మూర్తి హౌజ్‌లో గడిచింది. ఆపై డెహ్రూడూన్‌లోని వెల్హమ్ స్కూల్, డూన్ స్కూల్స్‌లో చదువుకున్నాడు. ► రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి రావడం అన్యమనస్కంగానే జరిగిపోయింది. వాస్తవానికి తన మనవడు రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి రావాలని నెహ్రూ ఏనాడూ కోరుకోలేదట. ► బాగా చదువుకుని రాజీవ్ పైలెట్ అవ్వాలని కోరుకున్నాడు నెహ్రూ. ఆయన కోరికకు తగ్గట్లే.. రాజీవ్ చదువులు కొనసాగాయి. కానీ, పరిస్థితులు బలవంతంగా రాజీవ్‌ను రాజకీయాల్లోకి దింపాయని ఇందిరా గాంధీ సైతం పలు ఇంటర్వ్యూల్లో ప్రస్తావించారు కూడా. ► రాజీవ్ పైచదువులు.. కేంబ్రిడ్జిలోని ట్రినిటీ కాలేజీ, లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీలో చదివారు. మెకానికల్ ఇంజినీరింగ్ చేశారాయన. ► కేంబ్రిడ్జిలో చదువుతున్నప్పుడే సోనియా మైనో(సోనియా గాంధీ)తో పరిచయం ఏర్పడింది. 1968లో వీళ్ల వివాహం జరిగింది. ► ఇంగ్లండ్ నుంచి భారత్‌కు చేరుకున్నాక.. ఢిల్లీ ఫ్లైయింగ్ క్లబ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పాస్ కావడంతో పాటు కమర్షియల్ పైలెట్ లైసెన్స్ కూడా దక్కించుకున్నారు రాజీవ్ గాంధీ. తద్వారా డొమెస్టిక్ నేషనల్ కెరీర్లో ఆయన పైలెట్ కాగలిగారు. ► 1983లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో సోదరుడు సంజయ్ గాంధీ దుర్మరణం పాలయ్యాడు. అప్పటిదాకా జనాల్లోకి రావడం ఇష్టడని రాజీవ్ గాంధీ.. బలవంతంగా బయటకు రావాల్సి వచ్చింది. ఇది ఇందిరా గాంధీకి కూడా ఇష్టం లేదని చెప్తుంటారు కొందరు సీనియర్ కాంగ్రెస్ నేతలు. ► ఇందిరా గాంధీ హత్య తర్వాత.. పార్టీ శ్రేణుల మద్ధతు, సీనియర్ల అండతో 1984లో రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టారు. ► 1984లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో.. 508 స్థానాలకు గానూ ఏకంగా 401 సీట్లు దక్కించుకుంది రాజీవ్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ. ► కేవలం 40 ఏళ్ల వయసులో దేశానికి ప్రధాని బాధ్యతలు చేపట్టారు రాజీవ్ గాందీ. ఆ ఘనతను ఇప్పటివరకు ఎవరూ చెరిపేయలేకపోయారు. ► టెలిఫోన్లు, కంప్యూటర్లు ఈయన హయాంలోనే భారత్‌లో ఎక్కువ వాడుకలోకి వచ్చాయి. ఫాదర్ ఆఫ్ ఐటీ అండ్ టెలికాం రెవల్యూషన్ ఆఫ్ ఇండియా అని రాజీవ్ గాంధీని ప్రశంసిస్తుంటారు. ► రాహుల్, ప్రియాంక.. రాజీవ్‌గాంధీ-సోనియాగాంధీల సంతానం. ► తమిళనాడు శ్రీపెరంబుదూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో.. ఎల్టీటీఈ జరిపిన ఆత్మాహుతి దాడిలో రాజీవ్ గాంధీ మరణించారు. రాజీవ్ గాంధీ తర్వాత.. యూపీకి చెందిన జనతాదళ్ నేత విశ్వనాథ్ ప్రతాప్ సింగ్(వీపీ సింగ్) ప్రధాని అయ్యారు. -
మన తొలి ప్రభుత్వం అలా ఏర్పడింది.. ఆయన ప్రధానైతే కథ వేరేలా.. !
ఈ సువిశాల భారతం ఒకే ప్రభుత్వం కింద ఉన్న కాలం చరిత్రలో తక్కువే. క్రీస్తుపూర్వమో, మధ్య యుగాలలోనో కొంతకాలం కొంతమంది మన పాలకులు మొత్తం భారతావనిని పాలించే అవకాశం దక్కించుకున్నారు. అప్పుడు కూడా కొన్ని భూభాగాలు చక్రవర్తులో, పాదుషాలో వారి అధీనంలో లేవు. అయినా యావద్భారతావనిని వారు ఏలారని అనుకోవచ్చు. కొన్ని శతాబ్దాల క్రితం భారతదేశం కోల్పోయిన ఆ అవకాశం మళ్లీ 1946లోనే వచ్చింది. తాత్కాలిక ప్రాతిపదికనే కావచ్చు, అప్పుడే భారత దేశానికి భారతీయులతో కూడిన ప్రభుత్వం కొలువైంది. ఇది చరిత్రలో అపురూపం. రాజకీయ ఏకత్వానికి ఆధునిక యుగంలో అదే తొలి అడుగు. కొద్దినెలలే అయినా ఆ తాత్కాలిక సంకీర్ణం అఖండ భారతాన్ని పాలించిందన్న విషయం ప్రత్యేకమైనదే. కానీ రక్తపాతాల మధ్య భారత విభజన పనిని పూర్తి చేసినదీ ఆ ప్రభుత్వమే. రెండో ప్రపంచ యుద్ధం తరువాత తన వలస దేశాలలో యూనియన్ జాక్‌ను అవనతం చేయాలని ఇంగ్లండ్ నిర్ణయించుకుంది. ఎంత ఇష్టం లేకపోయినా అలా వదులుకోవలసిన దేశాలలో భారత్ మొదటిది. దీనికి తొలిమెట్టు పాలనా వ్యవహారాలలో బ్రిటిష్ ప్రభుత్వం పక్కకు తొలగి, జాతీయ సంకీర్ణ ప్రభుత్వాన్ని ప్రతిష్ఠించడమే. బ్రిటిష్ ఇండియా ఏర్పాటు చేస్తున్న ఇలాంటి ప్రభుత్వంలో భాగస్వాములు కావలసిందని వైస్రాయ్ లార్డ్ ఆర్చిబాల్డ్ వేవెల్ 1946 జూలై 22న భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు జవహర్లాల్ నెహ్రూకు, ముస్లింలీగ్ నేత మహమ్మద్ అలీ జిన్నాకు లేఖలు రాశాడు. ఆ ప్రభుత్వంలో 14 శాఖలు ఉంటాయనీ, ఆరు కాంగ్రెస్‌కు, ఐదు లీగ్‌కు, మైనారిటీలకు మూడు వంతున ఇవ్వాలని నిర్ణయించినట్టు కూడా అదే లేఖలో వివరించాడు వేవెల్. ముఖ్యమైన శాఖల విషయంలో కాంగ్రెస్, లీగ్‌ల మధ్య సమతౌల్యం పాటిస్తామనీ చెప్పాడు. కానీ ఈ ప్రతిపాదనను ఆ ఇద్దరూ నిరాకరించారు. భారత కార్యదర్శి సలహా మేరకు వేవెల్ ముస్లింలీగ్‌ను పక్కన పెట్టి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 1946 ఆగస్ట్ 12న కాంగ్రెస్‌ను ఆహ్వానించాడు. అదే సమయంలో తన ప్రతిపాదనలు ఏమైనప్పటికీ వాటిని జిన్నాతో చర్చించే అధికారం కూడా అప్పగించాడు వేవెల్. నెహ్రూ జిన్నాతో చర్చించారు. కానీ ప్రయోజనం కనిపించలేదు. మరొక పక్క మత కల్లోలాలు తీవ్రమవుతున్నాయి. నెహ్రూను తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు పిలిచి తప్పు చేశానేమోనని వేవెల్ శంకించడం మొదలుపెట్టాడు. తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుతో దేశంలో తిరుగుబాటు వస్తుందేమోనని బ్రిటిష్ ప్రధాని క్లెమెంట్ అట్లీ భయపడ్డాడు. కొన్ని ముందు జాగ్రత్త చర్యలు కూడా వైస్రాయ్ వేవెల్ తీసుకున్నాడు. ఇన్ని పరిణామాల తరువాత 1946 సెప్టెంబర్ 2న కాంగ్రెస్ తాత్కాలిక ప్రభుత్వంలో భాగస్వామి అయింది. ఈ ప్రభుత్వంలో చేరేవారిని అంతకు ముందే ఆవిర్భవించిన భారత రాజ్యాంగ పరిషత్ నియమించింది. భారత రాజ్యాంగ పరిషత్‌లో 389 మంది సభ్యులకు అవకాశం కల్పించారు. ఇందులో 292 మందిని 11 ప్రావిన్సుల శాసనసభల ప్రజా ప్రతినిధులు ఎన్నుకున్నారు. 93 మంది సంస్థానాల ప్రతినిధులు. మరొక నలుగురు ఢిల్లీ, అజ్మీర్–మార్వాడా, కూర్గ్, బ్రిటిష్ బలూచిస్తాన్ల నుంచి వచ్చిన సభ్యులు. 1946 ఆగస్ట్ నాటికి 11 ప్రావిన్స్‌ల చట్టసభలకు ఎన్నికలు జరిగాయి. అంటే 292 స్థానాలు. ఇందులో కాంగ్రెస్ 208 స్థానాలు గెలిచింది. ముస్లింలీగ్ 73 స్థానాలు గెలిచింది. హిందువులు ఆధిక్యం ఉన్నచోట కాంగ్రెస్, ముస్లింలు ఎక్కువగా ఉన్న చోట లీగ్ ప్రధానంగా గెలిచాయి. రాజ్యాంగ పరిషత్‌కు ఎన్నికైనా, ముస్లిం లీగ్ కాంగ్రెస్‌కు సహకరించడానికి నిరాకరించింది. చదవండి: రెస్టారెంట్ విచిత్ర షరతు.. ఫైర్ అవుతున్న నెటిజన్లు! తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు ఒక విస్తృత ధ్యేయాన్ని నిర్వర్తించడానికి ఏర్పాటు చేశారు. విభజన ప్రక్రియను సజావుగా సాగించి, అధికార బదలీని వేగవంతం చేయడానికి అది ఏర్పాటైందన్నది నిజం. బ్రిటిష్ ప్రభుత్వం విన్నపం మేరకు కాంగ్రెస్ ఇందులో చేరడానికి అంగీకరించింది. మరోవైపు ముస్లింల కోసం వేరొక రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పాటు చేయాలని లీగ్ కొత్త కోర్కెను తెర మీదకు తెచ్చింది. రాజ్యాంగ పరిషత్‌లో మెజారిటీ కాంగ్రెస్‌దే కాబట్టి, కాంగ్రెస్ అంటే హిందువుల సంస్థ అనే లీగ్ నిశ్చితాభిప్రాయం కాబట్టి లీగ్ ఈ గొంతెమ్మ కోర్కె కోరింది. తమతో కలసి పనిచేయడానికి లీగ్ నిరాకరించినందున పార్టీకే చెందిన 12 మందిని కాంగ్రెస్ ఎంపిక చేసింది. వీరిలో ముగ్గురు ముస్లింలు. తరువాత మనసు మార్చుకున్న ముస్లిం లీగ్ అక్టోబర్ 26న తాత్కాలిక ప్రభుత్వంలో చేరింది. కానీ తమ మంత్రులు నెహ్రూకు జవాబుదారీగా ఉండబోరని షరతు పెట్టింది. ముగ్గురు ముస్లిం లీగ్ సభ్యులకు అవకాశం కల్పించడానికి వీలుగా ముగ్గురు కాంగ్రెస్ వారు రాజీనామా చేశారు. వారు శరత్చంద్ర బోస్, సయ్యద్ అలీ జహీర్, షఫత్ అహ్మద్ ఖాన్. తాత్కాలిక ప్రభుత్వంలోని కార్యనిర్వాహక విభాగానికి వైస్రాయ్ కార్యనిర్వాహక మండలి అనుబంధంగా పని చేస్తుంది. తాత్కాలిక ప్రభుత్వానికి ఉపాధ్యక్షుడిగా (అధ్యక్షుడు వైస్రాయ్), జవహర్లాల్ నెహ్రూ ఎంపికయ్యారు. విదేశ వ్యవహారాలు, కామన్వెల్త్ శాఖలు ఆయన దగ్గరే ఉన్నాయి. ఇంకా వల్లభ్‌భాయ్ పటేల్ (హోం, సమాచార, ప్రసార శాఖలు), బల్దేవ్ సింగ్ (రక్షణ), డాక్టర్ జాన్ మత్తయ్ (పరిశ్రమలు, రవాణా), సి. రాజాజీ (విద్య, కళలు), సిహెచ్ భాభా (పనులు, గనులు, విద్యుత్), బాబూ రాజేంద్ర ప్రసాద్ (ఆహారం, వ్యవసాయం), అసఫ్ అలీ (రైల్వే), జగ్జీవన్ రావ్ (కార్మిక), ముస్లిం లీగ్ నుంచి లియాఖత్ అలీ ఖాన్ (ఆర్థిక), టిటి చుంద్రిగర్ (వాణిజ్యం), అబ్దుర్ రబ్ నిష్తార్ (కమ్యూనికేషన్లు), గజాన్ఫార్ అలీ ఖాన్ (ఆరోగ్యం), జోగీంద్రనాథ్ మండల్ (న్యాయం. ఈయన తరువాత పాకిస్తాన్ ప్రభుత్వంలో అదే శాఖను నిర్వహించి, తరువాత భారత్ వచ్చారు). భారత్‌లో తొలిసారి భారతీయులతో ఏర్పడిన సంకీర్ణం ఏర్పాటులో గాంధీజీ పాత్ర ఏమిటి? కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నెహ్రూ ఎంపిక కావాలన్న తన ఆకాంక్షను 1946 ఏప్రిల్ 20న గాంధీజీ వ్యక్తం చేశారు. అప్పటికే జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎక్కడ లేని ప్రాముఖ్యం వచ్చింది. స్వతంత్ర భారతదేశ ప్రధానిగా కాంగ్రెస్ అధ్యక్షుడే ఎన్నికవుతాడు. నిజానికి ఆ పదవిని తాను కూడా ఆశించానని మౌలానా అబుల్‌కలాం ఆజాద్ తన జీవిత చరిత్రలో రాసుకున్నారు. కానీ ఈ ఇద్దరినీ కాకుండా 15 ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలకు గాను 12 సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌ను ఎన్నుకున్నాయి. మిగిలిన మూడు కమిటీలు ఓటు చేయలేదు. ఈ సంగతి స్వయంగా గాంధీజీయే నెహ్రూకు చెప్పారు. రెండో స్థానం నెహ్రూకు ఆమోదయోగ్యం కాదనీ గాంధీయే చెప్పడంతో పటేల్ నెహ్రూకు అనుకూలంగా రంగం నుంచి తప్పుకున్నారు. తాత్కాలిక ప్రభుత్వం 1947 ఆగస్ట్ 15 వరకు పనిచేసింది. గాంధీజీ కోరుకున్నట్టు నెహ్రూ ప్రధానమంత్రి అయ్యారు. రాజ్యాంగ పరిషత్ 1949 నవంబర్ 26 నాటికి రాజ్యాంగ నిర్మాణం పూర్తి చేసింది. 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అదే సంవత్సరం సర్దార్ పటేల్ కన్నుమూశారు. మరి...ఆయనను ప్రధానిని చేసి ఉంటే? - డా. గోపరాజు నారాయణరావు చదవండి: Unknown Facts About China: చైనా గుట్టు రట్టు చేసే.. 20 షాకింగ్ నిజాలు! -
జలియన్‌వాలాబాగ్ దురంతం: ఒక జాతి ఆత్మను తాకిన తూటా..
1919 ఏప్రిల్ 13: ఆ రోజు జరిగిన నెత్తుటికాండను అంచనా వేయడంలో నాటి ప్రపంచం, విఖ్యాత మేధావులు అవమానకరంగా విఫలమయ్యారు. కాలమే చెప్పింది, మానవాళి చరిత్రలో అదెంత బీభత్సమో! అదే జలియన్‌వాలాబాగ్ దురంతం. అది భారతీయ ఆత్మ మీద దాడి. ఆ కాల్పులలో 379 మంది చనిపోయారని ప్రభుత్వం చెప్పింది. మృతుల సంఖ్య 1500 వరకు ఉంటుందని నాటి భారతీయుల వాదన. ఈ ఘటన మీద విచారణకు నియమించినదే విలియం హంటర్ కమిషన్. సాక్షులను ఢిల్లీ, అహ్మదాబాద్, బొంబాయి, లాహోర్లకు పిలిచారు. లాహోర్‌లోని అనార్కలీ బజార్లో ఉన్న టౌన్‌హాలు అందుకు వేదిక. 1919 నవంబర్ 19న అక్కడికే వచ్చి వాంగ్మూలం ఇచ్చాడు జనరల్ రెజినాల్డ్ ఎడ్వర్డ్ హ్యారీ డయ్యర్. నిరాయుధుల మీద 90 మంది సైనికుల చేత కాల్పులు జరిపించినవాడు ఇతడే. చాలా ఆలస్యంగా ఘటన వివరాలు బయటకు వచ్చాయి. జాతీయ కాంగ్రెస్ కూడా విచారించింది. తుపాకీ గుళ్లకు బలైన వాళ్లలో ఏడుమాసాల పసిగుడ్డు సహా 42 మంది చిన్నారులూ ఉన్నారని మదన్మోహన్ మాలవీయ చెప్పారు. ప్రభుత్వం లెక్క కూడా దీనికి దగ్గరగానే ఉంది. ఇక వెలుగు చూడని అంశాలూ ఎన్నో! 1919 ఆఖర్లో ఓ రోజు నెహ్రూ అమృత్సర్ నుంచి ఢిల్లీ వరకు ప్రయాణించారు. రాత్రి బండి. ఆయన ఎక్కిన బోగీ దాదాపు నిండిపోయి ఉంది. ఒక్క బెర్త్, అదీ అప్పర్ బెర్త్, ఖాళీగా ఉంది. ఎక్కి నిద్రపోయారు. తెల్లవారుతుంటే తెలిసింది, ఆ బోగీలో ఉన్నవారంతా సైనికాధికారులని. అప్పటికే వాళ్లంతా పెద్ద పెద్ద గొంతులతో మాట్లాడుకుంటున్నారు. ఒకడు మరీ పెద్ద గొంతుతో, కటువుగా మాట్లాడుతున్నాడు. అతడు అంత బిగ్గరగా చెబుతున్నవి, అప్పటికి దేశాన్ని కుదిపేస్తున్న అమృత్సర్, జలియన్‌వాలాబాగ్ అనుభవాలే. అసలు ఆ పట్టణమంతా తనకి ఎలా దాసోహమైందో చెబుతున్నాడు. తిరుగుబాట్లూ, ఉద్యమాలూ అంటూ అట్టుడికినట్టుండే పంజాబ్ తన ప్రతాపంతో ఎలా మోకరిల్లిందో వర్ణిస్తున్నాడు. ముదురు ఊదారంగు చారల దుస్తులలో ఉన్నాడతడు. మొదటి ప్రపంచ యుద్ధంలో పదిలక్షల మంది భారతీయులు పోరాడారు. 60వేల మంది చనిపోయారు. యుద్ధం తరువాతైనా ఏదో ఒరుగుతుందని ఎదురుచూశారు. ఏం లేకపోగా, అణచివేత ఎక్కువయింది. అందుకే ఒక తిరుగుబాటు మనస్తత్వం వచ్చింది. రాజ్యాంగ సంస్కరణలు జరుగుతాయన్న ఆశ మధ్య తరగతిలో ఉంది. అంటే స్వయంపాలనకు అవకాశం. దీని గురించి ప్రజలు మాట్లాడుకోవడం ఆరంభించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఇది బాగా ఉండేది. ఇక పంజాబ్‌లో అయితే మొదటి ప్రపంచ యుద్ధం కోసం రకరకాల పేర్లతో తమ యువకులను సైన్యంలో చేర్చుకున్న సంగతి గుర్తు చేసుకుంటున్నారు. అదే కాకుండా కామగాటమారు నౌక ఉదంతం, అనంతర పరిణామాలు వారిని బాధిస్తున్నాయి. ప్రపంచ యుద్ధం నుంచి తిరిగి వచ్చిన సైనికులు గతంలో మాదిరిగా లేరు. దేశదేశాల సైనికులతో కలసి పనిచేసి ప్రపంచ జ్ఞానంతో వచ్చారు. దశాబ్దాలుగా భారతీయ సైనికులకు జరుగుతున్న అన్యాయం పట్ల గుండె మండిపోతోంది. అలాంటి సందర్భంలో రౌలట్ చట్టం వచ్చింది. ఎలాంటి విచారణ, ఆరోపణ లేకుండానే ఎవరినైనా అరెస్టు చేసే అధికారం ఈ చట్టంతో అధికారులకు వచ్చింది. దేశమంతా ఆగ్రహోదగ్రమైంది. మితవాద కాంగ్రెస్ నాయకులకు కూడా ఆవేశం వచ్చింది. రౌలట్ చట్టాన్ని తీసుకురావద్దని గాంధీజీ కోరారు. ఆ చట్టానికి వ్యతిరేకత తెలియచేయడానికి సత్యాగ్రహ సభ పేరుతో ఉద్యమం ప్రారంభించారు. పంజాబ్ మరీ ఉద్రేకపడింది. ఫలితం జలియన్‌వాలాబాగ్. పంజాబ్‌కూ మిగిలిన దేశానికీ మధ్య బంధం తెగిపోయింది. సైనిక శాసనం నడుమ చిన్న వార్త కూడా రావడం లేదు. ఆ దురంతం జరిగిందని తెలుసు. అది ఎంత ఘోరంగా ఉందోనని దేశంలో గుబులు. సైనిక శాసనం ఎత్తేశారు. దీనితో కాంగ్రెస్ నాయకులు వెల్లువెత్తారు. పండిట్ మదన్మోహన్ మాలవీయ, స్వామి శ్రద్ధానంద నాయకత్వంలో పునరావాస కార్యక్రమం ప్రారంభించారు. వాస్తవాల సేకరణ పనిలో మోతీలాల్, చిత్తరంజన్‌దాస్ ఉన్నారు. దాస్‌కు సహాయకుడు నెహ్రూ (నెహ్రూ స్వీయచరిత్ర, 1936 నుంచి). పది నుంచి పదకొండు నిమిషాలు సాగిన కాల్పులే. కానీ ఆ తుపాకుల నెత్తుటి చరిత్ర అంతటా ప్రతిధ్వనిస్తూనే ఉంది. దీనితో పాటు ఆనాటి ఆర్తనాదాలు కూడా. కాల్పులు జరపకుండా జనం అక్కడ నుంచి వెళ్లిపోవడానికి అవకాశం ఉన్నా అలా చేయని సంగతిని హంటర్ కమిషన్ ముందు జనరల్ డయ్యర్ ఒప్పుకున్నాడు. ఎందుకు? అలా చేస్తే వాళ్లు తనను చూసి నవ్వుతారన్న అనుమానం. ఇంకా ఎక్కువ మందిని చంపాలంటే మిషన్ గన్లే ఉపయోగించేవాడినని అన్నాడు. గాయపడిన వాళ్ల సంగతి పట్టించుకోవడం తన పని కాదనీ అన్నాడు. ఆ ఘట్టం గురించి చెబుతున్నప్పుడు ‘బీభత్సమైనది’ అనేవాడు. ‘ది బుచర్ ఆఫ్ అమృత్సర్: జనరల్ రెజినాల్డ్ డయ్యర్’ పేరుతో నీజెల్ కోలెట్ రాసిన జీవితకథలో విస్తుపోయే విషయాలు ఉన్నాయి. తాను ఎంత చట్టవిరుద్ధంగా ప్రవర్తించాడో డయ్యర్కూ తెలుసు. అందుకే ఘటన జరిగిన రెండుమూడు రోజులు కథనాలు మార్చి వినిపించాడు. కానీ పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఓడ్వయ్యర్ నుంచి మద్దతు లభించింది. తరువాత చాలామంది బ్రిటిష్ ప్రముఖులు గొప్ప పని చేశాడని పొగడ్తలతో ముంచెత్తారు. స్వర్ణదేవాలయం పెద్దలు జనరల్ డయ్యర్‌ను ‘గౌరవ సిక్కు’ను చేశారు (రిచర్డ్ కావెండిష్, హిస్టరీ టుడే వాల్యూమ్ 59, ఇష్యూ 4, ఏప్రిల్ 2009). 1920 జూలై 8న బ్రిటిష్ పార్లమెంట్ ప్రభువుల సభలో చర్చ జరిగింది. ఎక్కువమంది డయ్యర్‌ను సమర్థించారు. యుద్ధ వ్యవహారాల కార్యదర్శి విన్స్టన్ చర్చిల్ మాత్రం అది బ్రిటిష్ విధానం కాదని అన్నాడు. హంటర్ కమిషన్ తీవ్ర విమర్శలతో డయ్యర్‌ని ఆ ఏడాదే ఉద్యోగం నుంచి తొలగించి ఇంగ్లండ్ పంపేశారు. అయినా ‘బాగ్ హీరో’గా ‘మార్నింగ్ పోస్ట్’ అనే బ్రిటిష్ పత్రిక తన నిధితో డయ్యర్‌ను సత్కరించదలిచింది. ఇంగ్లండ్ పత్రికలు సరే, బ్రిటిష్ ఇండియా నుంచి ‘కలకత్తా స్టేట్స్‌మన్’, ‘మద్రాస్ మెయిల్’ వంటి పత్రికలూ నిధి సేకరించాయి. మొత్తం 28,000 పౌండ్లు. కానీ అది తీసుకోవడానికి డయ్యర్ నిరాకరించాడు. అప్పటికే అతనిలో అభద్రతాభావం పేరుకుపోయింది. పైగా ఆర్టియోసెరిలోసిస్ వ్యాధి. చిన్నపాటి ఉద్వేగానికి గురైనా చావు తప్పదు. అంతేకాదు, బాగ్ ఘటన పేరుతో తాను మళ్లీ ప్రపంచానికి గుర్తుకు రావడం ఇష్టం లేదన్నాడు. బ్రిస్టల్ పట్టణం శివార్లలో ఎవరికీ పట్టనట్టు ఉండే సోమర్సెట్ కుగ్రామంలోని చిన్న కొండ మీద కట్టిన కాటేజ్‌లో భార్య అనీతో కలసి రహస్యంగా జీవించాడు. అక్కడే 1927 జూలై 23న చనిపోయాడు. మొదట గుండెపోటు వచ్చింది. అప్పుడు కూడా అతడు బాగ్ గురించే ప్రస్తావించాడంటారు జీవితకథ రాసిన కోలెట్. డయ్యర్‌కు రెండుసార్లు అంత్యక్రియలు జరిగాయట. మొదట అతని స్వగ్రామంలో, మళ్లీ సైనిక లాంఛనాలతో. అలా ముగిసింది అతని జీవితం. ఆరోజు రైలు ప్రయాణంలో నెహ్రూ చూసిన ఆ ఊదారంగు చారల దుస్తులలో ఉన్న వ్యక్తి ఢిల్లీలో దిగిపోయాడు. లాహోర్‌లో ఏర్పాటు చేసిన విచారణ సంఘం ముందు హాజరై వస్తున్నాడు. అతడే జనరల్ డయ్యర్. - డా. గోపరాజు నారాయణరావు -
నెహ్రూ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు..
సాక్షి, హైదరాబాద్: మాజీ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గురించి మాట్లాడే అర్హత మంత్రి జగదీశ్వర్ రెడ్డికి లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. మాజీ ప్రధానిపై మంత్రి జగదీశ్వర్ రెడ్డి చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద స్పందిస్తూ.. దేశ ప్రయోజనాల కోసం తన సొంత ఆస్తులను ధారాదత్తం చేసిన నెహ్రూపై మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడంపై మండిపడ్డారు. నెహ్రూ లాంటి గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిని, క్యారెక్టర్ లేని జగదీశ్వర్ రెడ్డి విమర్శించడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. జగదీశ్వర్ రెడ్డి ఎంటో తనకు బాగా తెలుసునని, త్వరలో అతని బండారం మొత్తం బయటపెడతానని ఆయన హెచ్చరించారు. పవర్ మంత్రి అయిన జగదీవ్వర్ రెడ్డికి ఒంట్లో పవరే లేదని ఆయన ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్‌కు విస్కీలో సోడా కలిపే వ్యక్తి కూడా మాజీ ప్రధానిని విమర్శించడం ఏంటని ప్రశ్నించారు. తాము తిట్టడం మొదలు పెడితే తట్టుకొని, బయట తిరగగలిగే దమ్ముందా అని సవాల్ విసిరారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే మంత్రి అవినీతి మొత్తం బయటికి తీస్తామని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ వద్ద చెంచాగిరి చేసే వ్యక్తి, మహా నేత నెహ్రూని విమర్శించడం విడ్డూరమని పేర్కొన్నారు. మద్యం మత్తులో పవర్ మంత్రి ఎక్కడ సంతకం పెడతాడో తనకే తెలీదని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జగ్గారెడ్డి మాట్లాడుతూ.. కాంట్రాక్టర్లకు లబ్ది చేకూర్చేందుకే ప్రాజెక్ట్‌ను చేపట్టారని, ప్రాజెక్ట్ నిర్వహణలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు. -
అప్పటినుంచే ఆర్బీఐపై కేంద్రం పెత్తనం!
న్యూఢిల్లీ: కేంద్రం–రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మధ్య ఇటీవలి ఘర్షణాత్మక వైఖరి తాజాది కాదనీ... మొదటి నుంచీ ఆర్బీఐపై కేంద్రం పెత్తనం కొనసాగిందని పేరుతెలపడానికి ఇష్టపడని ఒక ఉన్నతస్థాయి అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. దేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కాలం నుంచీ ఇలాంటి ధోరణి ఉందని ఆయన విశ్లేషించారు. ఆర్బీఐ స్వయంప్రతిపత్తిని కేంద్రం కాలరాస్తోందంటూ తాజాగా నిరసనలను ఎదుర్కొం టున్న మోడీ ప్రభుత్వానికి తాజా విశ్లేషణలకు కొంత ఊరటకలిగించేవే. ఉన్నత స్థాయి అధికారి కథనం ప్రకారం– కేంద్రం బ్యాంకులు స్వయం ప్రతిపత్తి ఉండాలని నాటి ప్రధానమంత్రి నెహ్రూ పేర్కొన్నా రు. అయితే అది కేంద్రం నిర్దేశాలకు అనుగుణంగా ఉండాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ఒక ప్రతిపాదనకు సంబంధించి తన ఆర్థిక మంత్రి టీటీ కృష్ణమాచారివైపు తొలి ప్రధాని నిలబడ్డంతో, అప్పటి ఆర్బీఐ నాల్గవ గవర్నర్ బెనగల్ రామ రావ్ 1957లో తన పదవికి రాజీనామా చేశారు. అటు తర్వాత కాలాల్లో గవర్నర్లుగా వచ్చిన ఎన్సీ సేన్‌గుప్తా, కేఆర్ పురి, దువ్వూరి సుబ్బారావుల వంటివారూ ప్రభుత్వ విధానాలతో పొసగని పరిస్థితులను ఎదుర్కొన్నారని ఉన్నతాధికారి పేర్కొన్నారు. -
ఆ ట్రెండ్ సెట్ చేసింది మోదీనే!
భారత ప్రధాని నరేంద్ర మోదీ తనకు పంపించిన మోదీ జాకెట్లు ఎంతో సౌకర్యవంతంగా ఉన్నాయంటూ దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ చేసిన ట్వీట్ నెటిజన్ల మధ్య పెద్ద చర్చకే దారి తీసింది. నెహ్రూ మార్కు జాకెట్లను మోదీ జాకెట్ అని సంబోధించడమేంటని కొందరు విరుచుకు పడుచుతుంటే మరికొంత మంది మాత్రం మోదీ వల్లే వాటికి ప్రత్యేకత సంతరించిందని మరికొందరు వాదిస్తున్నారు. కాగా ఈ విషయంపై జేడ్‌బ్లూ లైఫ్‌స్టైల్ ఇండియా ఎండీ బిపిన్ చౌహాన్ స్పష్టతనిచ్చారు. ‘నిజానికి వీటిన బంధ్గాలా అంటారు. ఒకప్పుడు నెహ్రూ, సర్దాన్ వల్లభబాయ్ పటేల్ వీటిని విరివిగా ధరించేవారు. ముఖ్యంగా నెహ్రూజీ బ్లాక్, హాఫ్ వైట్ షేడ్ జాకెట్లు మాత్రమే ధరించేవారు. అయితే గత కొన్నేళ్లుగా వివిధ రంగుల జాకెట్లు ధరిస్తూ.. మోదీజీ ఓ కొత్త ట్రెండ్ సృష్టించారు. వాటిని ప్రస్తుతం మోదీ జాకెట్లు అనే పిలుస్తున్నాం. మన ప్రధాని తరపున దక్షిణ కొరియా అధ్యక్షుడికి ఆ కోట్లు పంపింది మేమేనని’ చౌహాన్ పేర్కొన్నారు. మోదీ అంటే ఖాకీ నిక్కరు మాత్రమే.. మూన్ జే ఇన్ ట్వీట్‌పై స్పందించిన కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా.. ‘ మన ప్రధాని చాలా మంచి పనిచేశారు. కానీ ఆ వస్త్రాల పేరు మార్చకుంటే బాగుండేది. నాకు తెలిసి వాటిని నెహ్రూ జాకెట్లు అంటారు. కానీ ఇపుడు మోదీ జాకెట్లు అని పిలవడం చూస్తుంటే.. 2014 ముందటి భారత్ చరిత్రను మార్చివేసేలా ఉన్నారంటూ’ పేర్కొన్నారు. ’ మీరు మాట్లాడింది తప్పు. అవి నెహ్రూ జాకెట్లు. మాకైతే మోదీ అంటే ఖాకీ నిక్కరు మాత్రమే గుర్తుకు వస్తుంది’ అంటూ మరో నెటిజన్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. Prime Minister @narendramodi of India sent me some gorgeous garments. These are modernized versions of traditional Indian costume, known as the ‘Modi Vest’, that can also be worn easily in Korea. They fit perfectly. pic.twitter.com/3QTFIczX6H — 문재인 (@moonriver365) October 31, 2018 It’s really nice of our PM to send these but could he not have sent them without changing the name? All my life I’ve known these jackets as Nehru jackets & now I find these ones have been labelled “Modi Jacket”. Clearly nothing existed in India before 2014. https://t.co/MOa0wY37tr — Omar Abdullah (@OmarAbdullah) October 31, 2018 Mr. President, You are wrong. This is not Modi Vest, this is Nehru jacket. Modi is no Nehru, can never be one. If anything Modi, that is Khaki Nikkar. https://t.co/8DrZ8b1RVM — Ashok Swain (@ashoswai) October 31, 2018 -
అప్పుడాయన పొగిడారు కానీ.. ఇప్పుడైతేనా?
న్యూఢిల్లీ: అది 70వ దశకం. అటల్జీ విదేశాంగ మంత్రిగా ఉన్నారు. ఢిల్లీలోని సౌత్ బ్లాక్‌లో నెహ్రూ చిత్రపటం కనబడలేదు. వెంటనే కల్పించుకున్న అటల్.. దాన్ని అక్కడే తిరిగి పెట్టాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ విషయాన్ని పార్లమెంటు భేటీలోనూ ప్రస్తావించారు. ‘కాంగ్రెస్ మిత్రులు ఇది నమ్మకపోవచ్చు. సౌత్ బ్లాక్‌లో నేను వెళ్లే దారిలో నెహ్రూ చిత్రపటం ఉండేది. కానీ అకస్మాత్తుగా అది కనబడకుండా పోయింది’ అంటూ సభలో ప్రస్తావిం చారు. ‘సిబ్బందిని అడిగాను. ఆ పటం ఏదని. వారి నుంచి సమాధానం రాలేదు. తర్వాత మళ్లీ దాన్ని ఆ స్థానంలోనే పెట్టారు’ అన్నారు. దీంతో సభ ఒక్కసారిగా చప్పట్లతో మారుమోగింది. ఇతరుల విమర్శలనూ స్వీకరించే గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తి నెహ్రూ అంటూ పొగిడారు అటల్జీ. ‘విన్స్టన్ చర్చిల్, నెవిలే చాంబర్లీన్‌ల వ్యక్తిత్వాలు కలబోసిన వ్యక్తి నెహ్రూజీ అని ఓ సారి విమర్శించాను. దానికి ఆయన ఏమాత్రం కలత చెందలేదు. సాయంత్రం ఆయన్ను కలసినపుడు చాలా బాగా మాట్లాడావని పొగిడారు. ఇప్పుడలాంటి విమర్శలు చేస్తే నాతో మాట్లాడటమే మానేస్తారు’ అన్నారు. -
‘గాంధీజీ.. జిన్నాను ప్రధాని చేయాలనుకున్నారు’
పనాజి : మహ్మద్ అలీ జిన్నాను గనుక ప్రధాని చేసి ఉంటే అవిభాజ్య భారత్ ముక్కలయ్యేది కాదని బౌద్ధ గురువు దలైలామా అన్నారు. గోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో బుధవారం జరిగిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించారు. ఈ క్రమంలో తప్పులు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటూ ఓ విద్యార్థి ఆయనను ప్రశ్నించారు. ప్రతీ ఒక్కరు జీవితంలో ఎప్పుడో ఒకసారి తప్పు చేస్తారన్న దలైలామా.. ఇందుకు భారత మాజీ ప్రధాని జవహర్ లాల్ వంటి గొప్ప వ్యక్తులు కూడా అతీతం కాదంటూ సమధానమిచ్చారు. ‘మహ్మద్ అలీ జిన్నాను ప్రధాని చేయాలని మహాత్మా గాంధీ భావించారు. కానీ అందుకు నెహ్రూ ఒప్పుకోలేదు. తాను ప్రధాని అవ్వాల్సిందేనంటూ పట్టుబట్టారు. ఒకవేళ నెహ్రూ గనుక ఆ తప్పు చేయకపోయి ఉంటే జిన్నా ప్రధాని అయ్యేవారు. భారతదేశం.. భారత్, పాకిస్తాన్‌గా విడిపోయేది కాదు. అయినా తప్పులు జరగడం సహజం’ అని దలైలామా వ్యాఖ్యానించారు. -
నెహ్రూ హయాం నుంచే అవిశ్వాసం
-
‘స్వాతంత్య్రోద్యమంలో గాంధీ, జిన్నా సమానం’
అలీగఢ్: భారత స్వాతంత్య్ర పోరాటంలో గాంధీ, నెహ్రూలతో సమానంగా మొహమ్మద్ అలీ జిన్నా కృషి చేశారని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రవీణ్ నిషాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జిన్నా పేరిట బీజేపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. మతం, కులం ప్రాతిపదికన ప్రజలను విడదీసేందుకు ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. మరోవైపు, ఢిల్లీలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి స్పందిస్తూ జిన్నాను భారత్ ఎప్పుడూ దిగ్గజ నాయకుడిగా భావించలేదన్నారు. జిన్నా పేరిట బీజేపీ కృత్రిమ సమస్యను సృష్టించిందని ఆరోపించారు. ఇదిలా ఉండగా అలీగఢ్ వర్సిటీలో విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరో రెండు రోజులు తరగతులకు హాజరుకాబోమని వారు తేల్చి చెప్పారు. -
నెహ్రూ విగ్రహంపై నల్లరంగు
బుర్ద్వాన్: పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు బుర్ద్వాన్ జిల్లా కట్వా పట్టణంలో దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ విగ్రహానికి దుండగులు నలుపు రంగు పూశారు. శనివారం ఉదయం ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమివ్వడంతో వారు విచారణ ప్రారంభించారు. బీజేపీ కార్యకర్తలే ఈ చర్యకు పాల్పడ్డారని కాంగ్రెస్ నేతలు ఆరోపించగా, దీంతో తమకు సంబంధమే లేదని బీజేపీ స్పష్టం చేసింది. -
రంగంలోకి సీబీఐ
సాక్షి, చెన్నై: డీఎంకే నేత, మాజీ మంత్రి కేఎన్ నెహ్రూ సోదరుడు, పారిశ్రామిక వేత్త రామజయం హత్య కేసు విచారణకు సీబీఐ రంగంలోకి దిగింది. ఐదేళ్ల అనంతరం ఈ కేసు సీబీఐకు చేరడంతో విచారణలో పురోగతి లభిస్తుందన్న ఆశాభావం ఆ కుటుంబంలో నెలకొంది. డీఎంకే మాజీ మంత్రిగా, తిరుచ్చిలో కీలక నేతగా ఉన్న కేఎన్ నెహ్రూ సోదరుడు రామజయం 2012 మార్చి 29న హత్యకు గురయ్యారు. వాకింగ్‌కు వెళ్లిన ఆయన్ను గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చడం అప్పట్లో సంచలనం సృష్టించింది. రాజకీయ కారణాలతో ఈ హత్య జరిగినట్టుగా ఆరోపణలు వచ్చినా, ఇంత వరకు ఆధారాలు ఏ మాత్రం చిక్కలేదు. స్థానిక పోలీసులు చేతులెత్తేయడంతో విచారణ సీబసీఐడీకి అప్పగించారు. ఐదేళ్లుగా సీబీసీఐడీ కాలం నెట్టుకొచ్చినా, ఫలితం శూన్యం. ఇంతవరకు ఈ కేసులో ఏ ఒక్కర్నీ అరెస్టు చేయలేదు. ఇంకా చెప్పాలంటే, కేసులో పురోగతి శూన్యం. పలు కోణాల్లో తాము విచారిస్తున్నామని సీబీసీఐడీ పేర్కొంటూ వచ్చారు. కేఎన్ నెహ్రూ రాజకీయ వ్యవహారాల్లో రామజయం కీలకం కావడంతో పథకం ప్రకారం ఈహత్య జరిగి ఉండొచ్చన్న సంకేతాలు బయలుదేరాయి. అధికార పక్షం ప్రమేయంతో ఈ పథకం సాగి ఉండొచ్చన్న అనుమానాలు సాగాయి. 2014లో రామజయం సతీమణి లత మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనంను ఆశ్రయించక తప్పలేదు. కేసులో పురోగతి శూన్యం అని, విచారణ సీబీఐకు అప్పగించాలని విన్నవించారు. మూడేళ్లుగా సీబీసీఐడీ వర్గాలు వాయిదాల పర్వంతో విచారణను సాగించారు. చివరకు సీబీసీఐడీ చర్యలు కోర్టుకే ఆగ్రహాన్ని తెప్పించాయి. సీబీసీఐడీ అసమర్థతపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు విచారణను సీబీఐకు అప్పగిస్తూ ఇటీవల తీర్పు ఇచ్చింది. దీంతో సీబీఐ వర్గాలు కేసును తమ గుప్పెట్లోకి తీసుకున్నాయి. నివేదిక అప్పగింత : కోర్టు ఆదేశాలతో సీబీసీఐడీ వర్గాలు కేసును సీబీఐకు అప్పగించక తప్పలేదు. ఐదేళ్లుగా తాము సాగించిన విచారణలో వెలుగు చూసిన అంశాలు, సేకరించిన సమాచారాలు, పలువురి వద్ద వాంగ్మూలాలు వాటితో కూడిన పది వేల పేజీలతో కూడిన నివేదికను, సీడీలు తదితర వాటిని రెండు రోజుల క్రితం చెన్నైలోని సీబీఐ కార్యాలయంలో అప్పగించారు. దీంతో కేసు విచారణ నిమిత్తం సీబీఐ ఇన్స్పెక్టర్ రామచంద్రన్ నియమితులయ్యారు. ఆ కేసు వివరాలను తన గుప్పెట్లోకి తీసుకున్న రామచంద్రన్ పరిశీలించే పనిలో పడ్డారు. గురువారం రాత్రి తిరుచ్చి చేరుకున్న ఆయన శుక్రవారం నుంచి విచారణ మొదలెట్టారు. సీబీసీఐడీ అప్పగించిన వివరాల పరిశీలన ఓ వైపు సాగిస్తూనే, మరో వైపు రామజయం హత్యకు గురైన ప్రదేశం, పరిసరాల్లో ఆయన అక్కడికి వెళ్లి ఆరా తీశారు. అక్కడున్న వారితో ఆయన మాట్లాడారు. అయితే, ఐదేళ్ల క్రితం అక్కడ నిర్మానుష్య ప్రదేశంగా ఉన్న ప్రాంతం, ప్రస్తుతం నిర్మాణాలతో నిండి ఉండడం గమనార్హం. ఇక, విచారణను పలు కోణాల్లో వేగవంతం చేసి, త్వరితగతిన ముగిస్తామన్న ధీమాను రామచంద్రన్ బృందం వ్యక్తం చేయడం విశేషం. -
నెహ్రూ ఇంట.. బాల్యం దయనీయం!
పొదల్లో పడిన బంతిని తెచ్చుకుందామంటే కమాండో అడ్డుకున్నాడు. బయటికెళ్లి ఆడుకుందామంటే చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ వద్దన్నాడు. తాజ్‌మహల్ చూద్దామంటే.. కుదరదని కేర్ టేకర్ తేల్చేశాడు. ఇష్టమైన ఐస్‌క్రీమ్‌ను తినబోతే.. ఆయా అడ్డుకుంది. స్కూలుకైనా వెళ్దామనుకుంటే.. టీచర్లే ఇంటికి వస్తున్నారు. బయట స్వేచ్ఛగా ఆడుకుంటున్న చిన్నారులను చూసి.. తాము బంగారు పంజరాల్లో చిలకలమని ఆ అన్నా చెల్లెళ్లు ఎన్నోసార్లు బాధపడ్డారు.- సాక్షి, బాలల దినోత్సవ ప్రత్యేకం నవంబరు 14.. జాతీయ బాలల దినోత్సవం. భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు పిల్లలంటే ఎంతో ఇష్టం. అందుకే, ఆయన జయంతిని దేశమంతా బాలల దినోత్సవంగా జరుపుకొంటాం. ఇదంతా అందరికీ తెలిసిన విషయమే. చిన్నారులను ఎంతో ప్రేమించే నెహ్రూ ఇంట్లో వారసులు మాత్రం వారి బాల్యాన్ని అందరిలా ఆస్వాదించలేకపోయారు. ఇందిరాగాంధీ, రాహుల్, ప్రియాంకా బాల్యం భారంగా, దయనీయంగా గడిచింది. నెహ్రూ కుటుంబ వారసులైన కారణంగా తమ ప్రమేయం లేకుండానే వీరు ఉగ్రవాదులకు లక్ష్యంగా మారిపోయారు. వీరి జీవితాలకు సంబంధించిన పలు విషాదకర సంఘటనలను బాలల దినోత్సవం సందర్భంగా మీకోసం అందిస్తున్నాం. ఇందిరా, రాహుల్, ప్రియాంకాగాంధీల గురించి మునుపెన్నడూ వినని విషయాల గురించిన సమాచారం ఇది. స్వాతంత్య్ర సంగ్రామం కాలంలో జవహర్లాల్ నెహ్రూ పలుమార్లు జైలు జీవితం అనుభవించారు. ఈ సమయంలో ఆయన తన గారాలపట్టి ఇందిరాగాంధీకి దూరంగా ఉండాల్సి వచ్చింది. అందుకే, ఆ దూరం తెలియనివ్వకుండా తన కూతురుకు తరచుగా ఉత్తరాలు రాస్తుండేవారు. నెహ్రూ జైలుకు వెళ్లిన ప్రతీసారి.. నాన్న ఆరోజు ఇంటికి రారని చిన్నారి ఇందిర చాలా బాధపడేవారు. ముఖ్యంగా నెహ్రూ అరెస్ట వార్త తెలుసుకున్న రోజు ఎంత బాధపడేవారో.. ఆయన జైలు నుంచి విడుదలవుతున్నారని తెలిసి అంతే సంతోషపడేవారు. కానీ, మిగిలిన కుటుంబ సభ్యులు తోడుగా ఉండటం ఆమెకు కాస్త ఉపశమనంగా ఉండేది. ఈ విషయంలో ఇందిర మనవలు, మనవరాళ్ల పరిస్థితి మరీ దిగజారిందనే చెప్పాలి. భారంగా రాహుల్, ప్రియాంకల బాల్యం..! ఘనమైన రాజకీయ వారసత్వం, రాజకుటుంబం. వారికేం? నోట్లో బంగారు చెంచాలు పెట్టుకుని పుట్టారు అని అనుకుంటుంది దేశమంతా. కానీ, వారి గురించి ఈ లోకానికి తెలియని కొన్ని నిజాలెన్నో ఉన్నాయి. వాస్తవానికి వారి బాల్యం మనమనుకున్నంత స్వేచ్ఛగా గడిచిపోలేదు. స్థితిమంతుల కుటుంబం, వారసత్వంగా ప్రధాని పగ్గాలు చేపడుతుండటంతో వీరికి శత్రువులూ అదేస్థాయిలో పెరుగుతూ వచ్చారు. 1984లో ఆపరేషన్ బ్లూస్టార్ తరువాత వీరి కుటుంబ సభ్యులంతా ఉగ్రవాదులకు లక్ష్యంగా మారారు. ఇందిరాగాంధీ హత్య జరిగినపుడు రాహుల్ వయసు 14 ఏళ్లు, ప్రియాంకాకు 12 సంవత్సరాలు. వీరు కూడా ఉగ్రవాదులకు లక్ష్యంగా మారడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎంతగా అంటే.. వీరికి సంబంధించిన ప్రతీ విషయాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తేగానీ, అనుమతించేవారుకాదు అధికారులు. ఇద్దరినీ స్కూలు మాన్పించారు. టీచర్లే ఇంటికి వచ్చి పాఠాలు చెప్పేవారు. సినిమాలు, షికార్లు, ఆటపాటలు అన్నీ బంద్. అందరి పిల్లల్లా మైదానంలో కాకుండా ఇంటిలో వీరిద్దరే ఆడుకునేవారు. మొత్తానికి పంజరంలో చిలకల్లా కట్టుదిట్టమైన రక్షణ వ్యవస్థలో వీరి బాల్యం గడిచిపోయింది. రాహుల్ గాంధీ అలియాస్ రౌల్ విన్సీ! రాజీవ్ గాంధీ ప్రధానిగా పగ్గాలు చేపట్టాక. రాహుల్ డిగ్రీలో చేరాడు. అది మధ్యలో ఉండగానే.. రాజీవ్‌గాంధీ ఎల్టీటీఈ ఉగ్రవాదుల దాడిలో చనిపోయాడు. దీంతో రాహుల్ చదువును విదేశాల్లో కొనసాగించాడు. తమిళపులులు లండన్‌లోనూ హాని తలపెట్టవచ్చన్న అనుమానంతో రాహుల్‌ను అమెరికా పంపారు. ఫ్లోరిడాలోని రోలిన్స్ కాలేజీలో డిగ్రీ పూర్తిచేశాడు. అక్కడ రాహుల్‌గాంధీ అంటే ఎవరో అతని క్లాస్‌మేట్స్‌కి తెలియదు. ఎందుకంటే.. భద్రతా కారణాల వల్ల భారత ప్రభుత్వం రాహుల్‌గాంధీ పేరును రౌల్ విన్సీగా మార్చింది. ఈ విషయం ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్‌కి తప్ప ఇంకెవరికీ తెలియదు. నెహ్రూ సేవలకు గుర్తుగా బాలల దినోత్సవం దేశవ్యాప్తంగా జరుపుకొంటున్నా.. ఆయన ఇంట బాలలు ఎదుర్కొన్న పరిస్థితులు నిజంగా దురదృష్టకరం. -
తీర్పు ఎలాగున్నా గెలుపు బీజేపీదే
జాతిహితం ప్రపంచ జిహాదీ ఉగ్రవాదం పెంపొంది, మితవాద ముస్లింల పట్ల ప్రపంచవ్యాప్తంగా అనుమానాస్పద దృష్టి పెరుగుతుండటంతో ముస్లింలకు బహుభార్యత్వం, అధిక సంతాన స్వేచ్ఛ ఇచ్చారనే వాదన మెజారిటీలో ప్రతిధ్వనించడం మొదలైంది. మోదీ–షాలు రాజకీయ లబ్ధి కోసం వాటికి సంతోషంగా ఆజ్యం పోశారు. ముస్లిం మహిళల హక్కులకు సంబంధించిన ఉదారవాద సామాజిక సంస్కరణగా ఎవరికైనా కనబడే మూడు తలాక్‌లపై వారు తమ రాజకీయ ఇంద్రజాలంతో ఏకాభిప్రాయాన్ని రుద్దగలుగుతున్నారు. ముస్లిం మహిళలకు మూడు తలాక్‌లతో విడాకులిచ్చే పద్ధతిని నిషేధించా లని నేడు సాగుతున్న ఉద్యమం మేధోపరంగా, తాత్వికంగా రెండు భిన్న శిబిరాలుగా చీలిపోయింది (ఇక్కడ ‘‘రాజకీయ’’ అనే పదాన్ని నేను జాగ్ర త్తగా ఆలోచించే మినహాయించాను). ఆ సమస్య, సుప్రీం కోర్టు విచారణలు లేదా అలవాటుగా సాగే టీవీ ‘‘చర్చల’’లో వెల్లడయ్యేదానికంటే మరింత సంక్లిష్టమైనది కావడమే అందుకు కారణం. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఆ రెండు శిబిరాలకు దూరంగా ఉండటమే, ఈ సమస్య ఎంత సంక్లిష్టమైనదన డానికి కొట్టవచ్చినట్టు కనిపించే ఉదాహరణ. అవన్నీ ఒకే పక్షాన ఉన్నాయి. బీజేపీ లాంటి కొందరు సామాజిక సంస్క రణకు ఒక కారణం దొరికిందని, ఏడు దశాబ్దాల ‘‘సంతృప్తిపరచే విధానా నికి’’ స్వస్తి పలకాలని అనాలోచిత సమరోత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. కాగా మరికొందరు తక్కువ చేసి చూపే కపటత్వంతో ముస్లిం మహిళలకు సమాన హక్కులను కల్పించే మార్పు అనివార్యత గురించి మాట్లాడుతున్నారు. ప్రధాన స్రవంతికి చెందినవారు ఎవరూ దీన్ని వ్యతిరేకించలేని స్థితిలో ఉన్నారు. ఇది అతిశయీకరించడం, లేదా అతిగా సరళీకరించడం, లేదా ఆ రెండూ కొంత కొంత కలసి ఉండటం కావచ్చు. కానీ మూడు తలాక్‌ల సమస్య ఇప్పుడు పాకిస్థాన్, కశ్మీర్ లేదా అవినీతిలాంటి సమస్యగా మారిపోయింది. వాటిలాగే ఈ సమస్యపై కూడా ఏకాభిప్రాయ సాధనను మీరు దాటవేయ లేరు. తయారుచేసినదే అనండి లేదా దొడ్డిదోవన సాధించినదే అనండి లేదా తప్పించుకోలేనిదే అనండి కానీ ఏకాభిప్రాయం అవసరం. అదే నేటి రాజకీ యాలకు సంబంధించిన వాస్తవికత. కపిల్ సిబల్ ముస్లిం మితవాద సంస్థ లకు ప్రాతినిద్యం వహిస్తున్నప్పుడల్లా కాంగ్రెస్ నేతలు ఎంతగా సంకోచిస్తుం టారో మీరే గమనించండి. బీజేపీ, ఆర్ఎస్ఎస్ల తాత్విక, భావజాల విజయం ఉదారవాద (వామపక్షాలు సహా) ప్రధాన స్రవంతి ఈ సమస్యపై వెను కకు తగ్గింది. దీనిపై ఏమైనా ప్రశ్నించే పనిని.. మార్పును వ్యతిరేకించలేని నిర్లక్ష్య ధోరణిగల అతివాద ‘‘ఉదారవాదుల’’ చిన్న బృందానికి వదిలి పెట్టేశారు. మూడు తలాక్‌ల పద్ధతి కొనసాగింపునకు మద్దతు పలకడానికి వారు సాహసించనూ లేరు. ఉద్దేశపూర్వకమైన దురుద్దేశంతోనే బీజేపీ తన ప్రాధాన్యాలను తప్పుగా ఎంచుకుంటున్నదని ఆ పార్టీని ఆక్షేపించడం మాత్ర మే వారు చేస్తారు. బీజేపీ/ఆర్ఎస్ఎస్ దాన్ని లెక్కచేయవు, లెక్క చేయాల్సిన అవసరమూ లేదు. అది వారు ఇటీవలి కాలంలో సాధించిన అతి పెద్ద భావ జాల, తాత్విక విజయం. అందుకు వారు సంబరపడుతున్నారు. 17 కోట్ల బలీ యమైన మైనారిటీ తమను ఎప్పుడూ ఓడిస్తూనే ఉన్నా, ప్రతిపక్షం దాని కోసమే రాజకీయంగా సరైనదైన, వివేకవంతమైన సంస్కరణ విషయంలో ఏకీభవించక తప్పని పరిస్థితిని కల్పించారు. సుప్రీం కోర్టు ఏమని తీర్పు చెప్పినా, నేటి మూడు తలాక్‌ల సమస్య హిందూ మితవాదులకు విజయమే. ఒక్క ఈ విజయం కోసమే ఆర్ఎస్ఎస్ పెద్దలు... నరేంద్ర మోదీ, అమిత్ షాలకు తమ హిందూ యోధులలో అత్యు న్నత స్థానాన్ని కట్టబెట్టవచ్చు. ప్రధానిగా అటల్ బిహారీ వాజ్‌పేయి నెహ్రూ వాద పదజాలంలో సమ్మిళితత్వాన్ని నిర్వచించి, దానికి కట్టుబడ్డారు. అందు వల్లనే ఆయన పట్ల ఆర్ఎస్ఎస్ పెద్దల దృష్టి అనుమానాస్పదత నుంచి ధిక్కారం వరకు విస్తరించి ఉండేది. ప్రతి ఒక్కరిని కలుపుకొని పోవాలి, ఏ సామాజిక గ్రూపులలో దేనికీ భంగం కలిగించరాదు, లోపలి నుంచే మెల్లగా మార్పు దానికదే రానివ్వండి అనే వైఖరిని ఆయన అవలంబించారు. మరో విధంగా చెప్పాలంటే, భావజాలాన్ని, ఓట్ల రాజకీయాలనూ పరిపాలనకు దూరంగా ఉంచడం. అందువల్లనే ఆర్ఎస్ఎస్, హిందూ మితవాదం ఆయన ప్రభుత్వాన్ని నిజమైన బీజేపీ ప్రభుత్వంగా చూడలేదు. అది సరైనదే. మోదీ, అమిత్ షాలు వారికి నిజమైన బీజేపీ ప్రభుత్వాన్ని ఇచ్చారు. ముస్లిం శిక్షా స్మృతిలోని చట్టాలను సంస్కరించడం, ప్రత్యేకించి వివాహం, విడాకుల అంశాలను సంస్కరించడం హిందూ మితవాదులకు ఓ మనో జాఢ్యంలాగా పట్టుకుంది. అందుకు కారణాలు ఆరు దశాబ్దాల క్రితం జరిగిన ఘటనలలో ఉన్నాయి. నెహ్రూ జనాకర్షణ అత్యున్నత స్థాయిలో ఉన్న అప్పట్లో హిందూ శిక్షాస్మృతి బిల్లులను నెగ్గించుకొచ్చేశారు. స్వతంత్ర భార తంలో అవే ఇంతవరకు అత్యంత విస్తృతమైన, ఆహ్వానించదగిన, రాజకీయీ కరించిన సామాజిక సంస్కరణలు. నాటి ఆ శాసనం, కుటుంబ చట్టాలలోనే మహిళలకు రాజ్యాంగపరమైన సమానత్వాన్ని ఇచ్చి, హిందూ సమాజంలోని అతి చెడు సంప్రదాయాలను అంతమొందించింది. కాలక్రమేణా, అది హిందువులలోని మెజారిటీకి ఎంతో మేలును కలుగజేసింది, వివాహం, వార సత్వం, దత్తత, వితంతు పునర్వివాహం, మోనోగమీ (ఒకే భార్య ఒకే భర్త)పై మరింత మెరుగైన చట్టాలు రావడానికి దారితీసింది. దాన్ని హిందువులు చాలావరకు ఆమోదించారు. అరవైల మధ్యకే రాజకీయ సమస్యగా అది అంతర్ధానమైపోయింది. నెహ్రూనే బీజాలు వేశారా? ఆ కాలం నాటి చర్చలను చదివితే, కాంగ్రెస్‌లోని మితవాదులు ఆ చట్టాన్ని వ్యతిరేకించారని తెలుస్తుంది. ఆనాటి నెహ్రూవాద లౌకికవాద హయాంలో ఆ వ్యతిరేకత స్వల్పమైనదిగానే లెక్కలోకి వచ్చింది. ఆ చర్చలో ఓటమిపాలైన వారు కడుపు మంటతోనూ, ఆ గాయాల మచ్చలతోనూ మిగిలిపోయారు. కాలక్రమేణా పాత ‘‘సాంప్రదాయక’’ రివాజులను పునరుద్ధరించాలన్న మితవాద డిమాండు అంతరించిపోయింది. కానీ, హిందూ శిక్షాస్మృతి బిల్లు ‘‘అమృతం’’ అయితే, మరి దాన్ని మన ముస్లిం సహోదరులకు ఎందుకు నిరాకరిస్తున్నట్టు? అది ‘‘విషం’’ అయితే దాన్ని మా హిందువులతోనే ఎందుకు మింగిస్తున్నారు? అనే వాదన మిగిలిపోయింది. ఇది, నేను చిన్న పట్టణంలో ఆరేళ్ల పిల్లాడిగా ఉండగా బడి ఎగ్గొట్టి మరీ చూసిన మొదటి ఎన్నికల సభలో (జనసంఘ్‌ది) విన్న వాక్యానికి కచ్చితమైన అనువాదం. కాలక్రమేణా ఈ భయాన్ని పెంచి మరింత పెద్ద భయాలను రేకెత్తిం చారు. ముస్లింలకు ఎక్కువ మంది భార్యలను అనుమతించి, ఎందరినైనా స్వేచ్ఛగా కనమన్నారని వ్యాఖ్యానించారు. ‘మనం హిందువులు’’ కుటుంబ నియంత్రణ పాటిస్తుండగా(ముస్లిం భర్తలు తమ నలుగురు భార్యలతో) ‘‘మేం ఐదుగురం, మాకు పాతికమంది (పిల్లలు)’’ అంటున్నారని 2002 సెప్టెంబర్‌లో నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా సుప్రసిద్ధమైన వ్యాఖ్య చేశారు. ప్రపంచ జిహాదీ ఉగ్రవాదం పెంపొంది, ప్రపంచవ్యాప్తంగానే మిత వాద ముస్లింల పట్ల అనుమానాస్పద దృష్టి పెరుగుతుండటంతో ఈ వాదన మెజారీటీలో ప్రతిధ్వనించడం ప్రారంభమైంది. మోదీ–షా బీజేపీ, తమకు ముందటి వాజపేయి–అద్వానీలకు భిన్నంగా రాజకీయ లబ్ధి కోసం వీటికి ఆజ్యం పోయడానికి సంతోషంగా వాడుకున్నారు. ‘‘స్మశానం, కబ్రిస్థాన్’’ అనేది ఈ వ్యూహపు అత్యంత ప్రభావశీలమైన పోలిక అయింది. ఇది వారి రాజకీయ ఐంద్రజాలిక శక్తిని చాటుతుంది. సాధారణమైన వారికెవరికైనా ముస్లిం మహిళల హక్కులకు సంబంధించిన ఉదారవాద సామాజిక సంస్క రణగా కనబడే దానిపై వారు.. ముస్లిం విద్వేషాన్ని ప్రయోగించి నేడు ఏకా భిప్రాయాన్ని రుద్దగలుగుతున్నారు. ఇది నెహ్రను తిట్టిపోసే కాలం. కాబట్టి నేడు ఇలా లౌకికత్వాన్ని పున ర్నిర్వచించడానికి బీజాలను వేసినది ఆయనేనా అని అడుగుదాం. తన రాజ కీయ ప్రతిష్టను ప్రయోగించి సామాజిక, కుటుంబ సంస్కరణలను కేవలం మెజారిటీపైనే రుద్ది, మిగతా మైనారిటీలను వారి సొంత మత పెద్దలకు లేదా అంతర్గత సంస్కరణ ఉద్యమాలకు వదిలిపెట్టేశారా? కైస్తవ, సిక్కు,ముస్లిం మతాల నుంచి... స్త్రీజననాంగ విచ్ఛేదానికి (ఎఫ్‌జీఎం) పాల్పడే దావూదీ బోరాల వంటి చిన్న మత శాఖల వరకు అన్నీ ఆ సంస్కరణ ఉద్యమాల్లో చాలా వాటిని పాశవికంగా అణచివేశాయి. హిందువులలోని బహు భార్య త్వాన్ని నిషేధించగలిగిన లౌకికవాద పార్లమెంటు ఎఫ్‌జీఎంను ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద (ఉదా‘‘కు తీవ్ర గాయాలు చేయడానికి చెందిన 320 సెక్షన్) తీవ్ర నేరంగా లేదా హత్యా ప్రయత్నంగా ప్రకటించలేక పోయిందా? నెహ్రూ వారసుల నిర్వాకం నెహ్రూ ఆ పని ఎందుకు చేయలేకపోయారనే దానిపై చాలానే విశ్లేషణ జరి గింది. హిందువులను విభజించి, మైనారిటీలను ‘‘సంతృప్తిపరచి’’ ఆయన ఓటు బ్యాంకు రాజకీయాలకు పునాదులను వేశారని విమర్శకులంటారు. నెహ్రూలోని దేశవిభజనానంతర ఆదర్శవాదం, అపరాధ భావన అందుకు కారణమని ఆయన అభిమానుల వాదన. ఆయనే గనుక ముస్లిం శిక్షాస్మృతిలో మార్పులను రుద్ది ఉంటే మరింతమంది పాకిస్తాన్‌కు తరలి పోవడం కొనసా గేదని, వారికి భరోసాలను కల్పించడంలో భాగంగానే ఆ స్వేచ్ఛలను ఇవ్వాల్సి వచ్చిందని వారి వాదన. ఆయనకున్న మేధస్సు, నైతిక ఆధిపత్యం లేదా దృఢమైన లౌకికతత్వం ఆయన వారసులకు లేవు. మైనారిటీలను సంతృప్తిపరచడం అనే ఈ భావ నను వారు మరింత బలోపేతం చేశారు. ఇందిరాగాంధీ, బాబాలు, సాధు వులు, తాంత్రికులు, యోగులను చేరదీశారు. షా బానో కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన ఉదారవాద తీర్పును తోసిపుచ్చడానికి రాజీవ్‌గాంధీ చట్టాన్ని వెనక్కు తిప్పారు. ఆ తర్వాత గాభరాతో అతి దిద్దుబాటుకు పాల్పడి అయో ధ్యలో శిలాన్యాస్‌ను అనుమతించారు. 1989 ఎన్నికల ప్రచారంలో రామ రాజ్యాన్ని సైతం వాగ్దానం చేశారు. ముస్లిం వ్యతిరేకమైనదంటూ పోటాను (ఉగ్రవాద నిరోధక చట్టం) రద్దుచేసి యూపీఏ దీన్ని మరో స్థాయికి తీసు కుపోయింది. 26/11 ముంబై ఉగ్రదాడులు ఆర్ఎస్ఎస్ కుట్రేనని ప్రకటించే తమ నేతలను అదుపు చేయడంలో విఫలమైంది. నెహ్రూలోని లౌకికవాదా నికి నైతికత్వపు మెరుపు ఉండేది. ఆయన వారసులకు అది లేదు. ఆయన పార్టీ, ప్రత్యేకించి 1985 నుంచి లౌకికవాదాన్ని పూర్తిగా రాజకీ యాలను దట్టించి అందించింది. జిన్నా తర్వాత భారత ముస్లింలు ఏ ముస్లిం నూ తమ నేతగా విశ్వసించలేదని, ‘‘లౌకికవాద’’ హిందూనేతలే వారికి నేతృ త్వం వహించసాగారనీ, వారి ఓట్లను, వారి జీవన నాణ్యతను కూడా తమ సొంతంగానే భావించారనీ గతంలో నేను రాశాను. లోతుగా విశ్లేషిస్తే మోదీ, షాలు ఆ రాజకీయ భావనను హతమార్చి, సమాధి చేశారనో లేదా దహనం చేశారనో తేలుతుంది. twitter@shekargupta శేఖర్ గుప్తా -
నెహ్రూకు మొండిచేయి
మోకాలొడ్డిన పార్టీ సీనియర్లు రెంటికీ చెడ్డ రేవడిగా జ్యోతుల ఆయన అనుచరుల్లో అయోమయం సాక్షి ప్రతినిధి, కాకినాడ : మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు సంబంధించి ఎలాంటి మార్పులు, చేర్పులు చోటుచేసుకోలేదు. జిల్లా నుంచి కేబినెట్లో ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మంత్రివర్గంలో యథాతథంగా కొనసాగనుండడంతో కొత్తవారికి నో ఛా¯Œ్స బోర్డు పెట్టేశారు. శనివారం అర్ధరాత్రి వరకూ మంత్రి వర్గ విస్తరణౖపై కసరత్తు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాలో పాతవారిని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో మంత్రి పదవి కోసం ఆశావహులు ఎక్కువగా ఉండటం, సామాజిక సమీకరణల నేపథ్యంలో కొత్తగా ఎవరికి ఇచ్చినా తేనెపుట్టను కదిలించినట్టవుతుందన్న ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. మెట్ట ప్రాంతంలో తలపండిన రాజకీయ నాయకులుగా ముద్ర పడిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు చంద్రబాబు మొండిచేయి చూపించారు. వైరి వర్గమే కొరివి పెట్టిందా...? చిరకాల కోరికైన మంత్రి పదవి ఈసారి కూడా నెహ్రూకు దూరమైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగిన నెహ్రూ మంత్రి పదవి కోసమే టీడీపీలోకి ఫిరాయించినట్టు చెప్పుకుంటూ వచ్చారు. విస్తరణలో బెర్త్ ఖాయమని అనుచరులు విస్తృతమైన ప్రచారం కూడా చేసుకున్నారు. నియోజకవర్గం నుంచి ముఖ్య అనుచరులతోపాటు పలువురు పార్టీ కార్యకర్తలు, శ్రేణులు కూడా శనివారం విజయవాడ తరలివెళ్ళారు. తీరా చంద్రబాబు వద్ద సీ¯ŒS రివర్స్ అయింది. గతంలో టీడీపీలో ఉన్నప్పటి నుంచీ నెహ్రూకు రాజకీయంగా వైరి వర్గంగా ఉన్న యనమల రామకృష్ణుడు తెర వెనుక జరిపిన మంత్రాంగం ఫలితంగానే నెహ్రూ ఆశలు ఆవిరయ్యాయని పలువురు భావిస్తున్నారు. నమ్మి టిక్కెట్ ఇచ్చి, ఎమ్మెల్యేను చేసిన వైఎస్సార్ పార్టీని కాదని ప్రలోభాలతో పార్టీ ఫిరాయించినా చివరకు ఫలితం దక్కలేదని నెహ్రూ వర్గం డీలా పడింది. అధిష్టానానికి నమ్మిన బంటుగా ఉన్న ఉప ముఖ్యమంత్రి చినరాజప్పను మార్చి అదే సామాజిక వర్గానికి చెందిన నెహ్రూకు మంత్రి పదవి కట్టబెడతారని విస్త్రృతమైన ప్రచారం జరిగింది. కానీ రాజప్పను కదిపి నెహ్రూకు పట్టం కడితే పార్టీ శ్రేణుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని బాబు వెనుకడుగు వేశారు. కాపు సామాజిక వర్గం నుంచి నెహ్రూ, రామచంద్రాపురం నుంచి ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, క్షత్రియ సామాజిక వర్గం నుంచి పిఠాపురం ఎమ్మెల్యే వర్మ, ఎస్సీ సామాజిక వర్గం నుంచి గొల్ల పల్లి సూర్యారావు, కమ్మ సామాజిక వర్గం నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి మంత్రి పదవులు ఆశించారు. సామాజిక సమతూకంలో భాగంగా ఒకిరికి ఇచ్చి మరొకరికి ఇవ్వకపోతే కొత్త సమస్యలు వచ్చిపడతాయని యనమల తదితర నాయకులు సూచించడంతో విస్తరణలో జిల్లా నుంచి ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండా పూర్వ స్థితినే కొనసాగించారు. పార్టీని కాదనుకుని రెండు పార్టీలు మారి నిన్నగాక మొన్న తిరిగి వచ్చిన నెహ్రూకు మంత్రి పదవి ఇస్తే సీనియర్లు ఏమైపోతారని నెహ్రూ వ్యతిరేకవర్గం గట్టి వాదనను వినిపించింది. ప్యాకేజీ పాత్ర ఎంత...? పార్టీ ఫిరాయించిన సందర్భంలోనే నెహ్రూకు మంత్రి పదవి విషయంలో చంద్రబాబు నిర్ధిష్టమైన హామీ ఏమీ ఇవ్వలేదన్న వాదన ఉంది. పార్టీ మారడం వెనుక ప్యాకేజీయే కీలకపాత్ర పోషించిందని అప్పట్లో ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు మంత్రి వర్గ విస్తరణలో నెహ్రూకు స్థానం లభించలేదంటున్నారు. నెహ్రూతో పాటు వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీకి ఫిరాయించిన పలువురు ఎమ్మెల్యేలకు స్థానం దక్కినప్పటికీ నెహ్రూకు దక్కకపోవడంతో ఆయన వర్గం తీవ్ర నిరాశ నిస్పృహకు లోనయ్యారు. ఈ పరిణామాలు పార్టీలో ఎక్కడకు దారితీస్తాయన్నది వేచి చూడాల్సిందే. -
నెహ్రూ తప్పిదం వల్లే కశ్మీర్లో ఉగ్రవాదం
కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఆరోపణ న్యూఢిల్లీ: కశ్మీర్‌లోని పాక్ ప్రాయోజిత ఉగ్రవాదానికి తొలి ప్రధాని నెహ్రూ తప్పిదాలతో మొదలై 60 ఏళ్లుగా సాగిన తప్పిదాలే కారణమని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఆరోపించారు. ‘కశ్మీర్ అంశాన్ని అప్పటి హోం మంత్రి పటేల్‌కు వదిలిపెట్టి ఉంటే భారత ఉపఖండ చరిత్ర మరో విధంగా ఉండేది’ అని అన్నారు. భారత సర్జికల్ దాడులు, పెద్దనోట్ల రద్దు.. పాక్ ప్రాయోజిత ఉగ్రవాద నిరోధంలో నిర్ణయాత్మక చర్యలన్నారు. నోట్ల రద్దుతో ఉగ్రవాద కార్యకలాపాలు 60 శాతం, టెర్రరిస్టులకు పాక్ హవాలా మార్గంలో అందిస్తున్న నిధులు 50 శాతం తగ్గాయన్నారు. భారత నకిలీ కరెన్సీని ముద్రిస్తున్న పాక్‌లోని రెండు ప్రెస్సులు మూతపడ్డాయని తెలిపారు. -
ఇందిర.. నా సోదరి!
అలీనోద్యమం జోరుగా నడుస్తున్న రోజులవి.. భారత రాజధాని ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ ఏడో అలీనోద్యమ సదస్సుకు వేదికగా నిలిచింది. వందకు పైగా దేశాధినేతలు, పరిశీలకులు పాల్గొన్న ఈ సదస్సులో ఫిడెల్ క్యాస్ట్రో చర్య.. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని ఇరుకున పెట్టేసింది. అప్పటివరకూ అలీనోద్యమానికి చైర్మన్‌గా వ్యవహరించిన క్యాస్ట్రో... ఢిల్లీ సదస్సులో ఆ బాధ్యతలను ప్రధాని ఇందిరాగాంధీకి అప్పగించాలి. ‘‘నా సోదరికి ఈ బాధ్యతలు అప్పగించడం నాకు ఆనందం కలిగిస్తోంది’’ అని క్యాస్ట్రో ప్రకటించారు. వేదికపైనే ఉన్న ఇందిర అధికార దండం (న్యాయమూర్తుల వద్ద ఉండే కలప సుత్తి లాంటిది)ను అందుకునేందుకు దగ్గరకు వచ్చారు. చేయి చాచారు. కానీ క్యాస్ట్రో వైపు నుంచి అసలు కదలిక లేదు. చేతిలో దండం అలాగే ఉంది. రెండోసారి చేయి చాచినా.. స్పందన లేదు. క్యాస్ట్రో ముఖంలో చిరునవ్వు కనిపిస్తోంది కానీ దండం మాత్రం చేతులు దాటి రావడం లేదు. ఏం చేయాలబ్బా అని ఇందిర తటపటాయిస్తున్న సమయంలో క్యాస్ట్రో హఠాత్తుగా ముం దుకు కదిలారు. ఇందిరను రెండు చేతులతో గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. అదే సమయంలో అధికార దండాన్ని ఆమె చేతుల్లో పెట్టాడు. ఈ పరిణామంతో ఇందిర ఒకింత షాక్‌కు గురైనా... ఆ వెంటనే తేరుకుని... చిరునవ్వులు చిందిస్తూ నిలబడిపోరుుంది. ఈలోపు... విజ్ఞాన్ భవన్ మొత్తం చప్పట్లతో మారుమోగిపోరుుంది. అలిగిన అరాఫత్ 1983లో ఢిల్లీలో జరిగిన అలీనోద్యమ సదస్సులో మరో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. పాలస్తీనా విమోచనోద్యమ నేత యాసర్ అరాఫత్ ఏదో ఒక విషయమైన అలక వహించారు. సదస్సు నుంచి వాకౌట్ చేసేందుకు సిద్ధమయ్యారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి నట్వర్ సింగ్‌కు ఆ విషయం తెలిసింది. ఆతిథ్య దేశంగా భారత్‌కు చెడ్డపేరు వస్తుందని, వెంటనే ఆ విషయాన్ని ప్రధాని ఇందిరకు తెలియజేశారు. అరాఫత్‌ను సముదారుుంచాలని సూచించారు. వెంటనే ఇందిర రంగంలోకి దిగారు. క్యాస్ట్రోను వెంటబెట్టుకుని అరాఫత్ దగ్గరకు వచ్చారు. ఆ తర్వాత సంభాషణ ఇలా సాగింది... క్యాస్ట్రో: మిత్రమా.. ఇందిర నీ స్నేహితురాలేనా? అరాఫత్: మిత్రమా... ఇందిరాగాంధీ నా పెద్దక్కతో సమానం. ఆమె కోసం ఏమైనా చేస్తా క్యాస్ట్రో: అరుుతే మంచి తమ్ముడి మాదిరిగా... సదస్సులో పాల్గొను అంతే... అరాఫత్ తన వాకౌట్ ఆలోచనలన్నింటినీ పక్కనబెట్టేశారు. సదస్సులో పాల్గొన్నారు. నెహ్రూ మెచ్చిన సాహసి.. 1960లో ఐక్యరాజ్యసమితి సమావేశంలో పాల్గొనేందుకు భారత ప్రధాని నెహ్రూ న్యూయార్క్ వెళ్లారు. ఆ సందర్భంలో క్యాస్ట్రోను స్వయంగా వెతుక్కుంటూ వెళ్లి మరీ కలిశారు. ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని.. ‘ప్రపంచంలోనే అత్యంత సాహసిని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది’ అన్నారు. అప్పుడు క్యాస్ట్రో 34 ఏళ్ల కుర్రాడు!! -
నెహ్రూ తాతకు వందనం
మలికిపురం : మాజీ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూకు మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురంలోని వివేకానంద కాన్వెంట్ విద్యార్థులు వినూత్న రీతిలో నివాళులర్పించారు. నెహ్రూజీ పుట్టిన రోజును పురస్కరించుకొని సోమవారం ఆయన చిత్రాన్ని రంగులతో సుందరంగా తీర్చిదిద్దారు. ఆ చిత్రం చుట్టూ కూర్చుని వందనాలు సమర్పించి, ఆయన పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. -
బాలల నేస్తం చాచా నెహ్రూ
నవంబరు 14 బాలల దినోత్సవం సందర్భంగా... కాలేజీలో నెహ్రూను జో అని పిలిచేవారు.అత్యధిక కాలంపాటు ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తిగా నెహ్రూ రికార్డును ఇప్పటివరకు ఎవరూ అధిగమించలేకపోయారు.బాలలందరికీ ఉచిత, నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలన్న ఆదేశసూత్రాలు నెహ్రూ ప్రతిపాదనలే! పంచవర్ష ప్రణాళికల రూపకర్త నెహ్రూనే. ఆ ప్రణాళికలలో విద్యకు అధిక మొత్తాన్ని కేటాయించింది ఆయనే. సాహస బాలల పురస్కారాన్ని బాలల దినోత్సవం రోజునే అందజేయడం ఆనవాయితీ.నవంబర్ 14 చిన్నారులందరూ బాగా గుర్తుంచుకునే రోజు. ఎందుకంటే ఆరోజు బాలల దినోత్సవం కాబట్టి. మన దేశ మొట్టమొదటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజును బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నామని అందరికీ తెలిసిందే. ఇంతకూ నెహ్రూకు, బాలలకు సంబంధం ఏమిటి? నెహ్రూ పుట్టినరోజును మాత్రమే బాలల దినోత్సవంగా జరుపుకోవడానికి కారణమేమిటో చూద్దామా? జవహర్లాల్ నెహ్రూ నేటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్ నగరంలో 1889 నవంబర్ 14న జన్మించారు. ఆయన తండ్రి మోతీలాల్ నెహ్రూ. తల్లి స్వరూపరాణి. మోతీలాల్ గొప్ప న్యాయవాది, మంచి పేరున్న రాజకీయవేత్త. వీరిది బాగా కలిగిన కుటుంబం కావడం వల్ల నెహ్రూ, ఆయన తోబుట్టువులు చిన్నప్పటి నుంచి మంచి వస్త్రధారణతో, పాశ్చాత్య పోకడలతో ఆధునికంగా కనపడేవారు. వీరికి హిందీ, సంస్కృతం బాగా వచ్చు. పదిహేను సంవత్సరాల వయసులో నెహ్రూ ఉన్నత చదువులకోసం ఇంగ్లండ్ వెళ్లి, అక్కడి ప్రతిష్ఠాత్మకమైన ట్రినిటీ కళాశాలలో, ఆ తర్వాత కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. కొడుకు కూడా తనలాగే న్యాయవాది కావాలన్న ఆకాంక్షతో మోతీలాల్ నెహ్రూను పట్టుబట్టి మరీ న్యాయశాస్త్రం చదివించారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చదువుకునేటప్పుడే నెహ్రూ మానసికంగా ఎంతో వికాసాన్ని పొందారు. ప్రపంచ రాజకీయాలపట్ల అవగాహన పెంచుకున్నారు. న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయడం కోసం స్వదేశానికి తిరిగి వచ్చిన నెహ్రూను గాంధీజీ నాయకత్వంలోని స్వాతంత్య్రోద్యమం అమితంగా ఆకట్టుకుంది. దాంతో ధనార్జన కోసం న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయడానికి బదులు సాటి ఉద్యమకారులతో కలసి స్వాతంత్య్ర సముపార్జన కోసం పోరాడేందుకే ఆయన మనసు మొగ్గు చూపింది. ఆంగ్లేయులపై పోరాటానికి నడుంకట్టారు. కొడుకు రాజకీయప్రవేశాన్ని మోతీలాల్ మొదట కొంత వ్యతిరేకించారు. పెళ్లి చేస్తేనయినా మారతాడేమోననే ఆశతో కమలా కౌల్ అనే యువతితో వివాహం జరిపించారు. అయితే తండ్రి ఆశను అడియాసలు చేస్తూ, వివాహానంతరం కూడా నెహ్రూ స్వాతంత్య్రపోరాటంలోనే కాలం గడుపుతుండటంతో ఆయనలోని నిబద్ధతను గుర్తించి ప్రోత్సహించారు. అంతేకాదు, కుమారునితోబాటు తాను కూడా స్వాతంత్య్రోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు మోతీలాల్. స్వాతంత్య్ర పోరాటంలో గాంధీ అడుగుజాడలలో నడిచారు జవహర్లాల్. తనతోబాటు ఎంతోమంది యువకులను జాతీయోద్యమం వైపు మళ్లేలా చేశారు. ఫలితంగా ఆంగ్లేయులు నెహ్రూను తొమ్మిదేళ్లపాటు జైలులో ఉంచారు. జైలుకు వెళ్లేటప్పటికి నెహ్రూ కుమార్తె ఇందిరా ప్రియదర్శిని చాలా చిన్నది. జైలు జీవితం గడిపేటప్పుడు కూడా నెహ్రూ ఊరికే కూచోలేదు. గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ అనే గ్రంథ రచన చేశారు. ఆయనలోని పోరాటపటిమ, కార్యదక్షత, సహనశీలత, అభ్యుదయ దృక్పథం, అద్భుతమైన ఆలోచనా సరళి, వీటన్నింటితోబాటు నాయకత్వ లక్షణాలు ఇవన్నీ కలిపి నెహ్రూను స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి ప్రధానిని చేశాయి. 1964లో జబ్బుతో చనిపోయేవరకు ఆయన ప్రధాని పదవిలో కొనసాగారు. నెహ్రూ కోటుకు గులాబీ పువ్వు చిన్నారి ప్రియదర్శినికి సుద్దులు చెబుతూ జైలు నుంచే నెహ్రూ ఎన్నో ఉత్తరాలు రాశారు. ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉండే ఆ ఉత్తరాలు ఆ తర్వాతి కాలంలో లేఖాసాహిత్యంలో అగ్రస్థానం సంపాదించుకున్నాయి. చిన్న వయసులోనే భార్య చనిపోయినా, నెహ్రూ మళ్లీ పెళ్లి చేసుకోలేదు. తల్లి లేని లోటు తెలియకుండా కుమార్తెను ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేశారు. తన కుమార్తెనే కాదు, చుట్టుపక్కల పిల్లలను కూడా చేరదీసేవారు. ప్రేమగా లాలించేవారు. అందుకే అందరూ ఆయన్ను చాచా (బాబాయ్) అని పిలిచేవారు. ఓసారి నెహ్రూకు ఓ పాఠశాల వార్షికోత్సవంలో ఓ చిన్నారి గులాబీపువ్వును ఇచ్చింది. ఆ పువ్వును తీసుకుని ఆయన తన కోటుకు అలంకరించుకున్నారు. దాంతో ఆ చిన్నారి మొహం ఆనందంతో వెలిగిపోయింది. అప్పటినుంచి ఆయన కోటుకు గులాబీని అలంకరించుకోవడం మొదలు పెట్టారు. బాలల పట్ల నెహ్రూకు ఉన్న ప్రేమను చూసి, 1964లో ఆయన మరణానంతరం నెహ్రూ పుట్టిన రోజును బాలల దినోత్సవంగా జరుపుకోవడం మొదలు పెట్టారు. - బాచి -
ఆ వ్యాఖ్యలు కుట్రపూరితం: జైపాల్ రెడ్డి
హైదరాబాద్: భారత ప్రథమ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూపై కేంద్ర మంత్రి రవిశంకర్‌ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు కుట్రపూరితమైనవని కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి అన్నారు. జాతి గర్వించదగ్గ దిగ్గజం సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ అని, ఆయన్ను పొగుడుతూ నెహ్రూను నిందించటం అన్యాయమని తెలిపారు. ఇదంతా ఆర్ఎస్ఎస్ చేస్తున్న కుట్రేనని దుయ్యబట్టారు. ఆర్ఎస్ఎస్ అంటే రూమర్స్ప్రెడింగ్ సొసైటీ అని ఎద్దేవా చేశారు. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో ఆర్ఎస్ఎస్ వాళ్లు బ్రిటిష్ వారికి తొత్తులుగా వ్యవహరించారని విమర్శించారు. నెహ్రూ, పటేల్ ఇద్దరూ కలసి దాదాపు పదేళ్లు జైలు జీవితం గడిపినా ఇద్దరి మధ్యా ఏనాడూ అభిప్రాయ భేదాలు తలెత్తలేదని తెలిపారు. వారిద్దరూ కాంగ్రెస్ పార్టీకి రెండు కళ్లలాంటి వారని అభివర్ణించారు. కాశ్మీర్ విషయంలో బీజేపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ మద్దతునిస్తుందని జైపాల్‌రెడ్డి వివరించారు. -
నెహ్రూ అనుచరుల జులం!
– అంతర్గత విభేదాలతో కల్వర్టు తొలగించే యత్నం – అడ్డుకున్న అపార్టుమెంట్ వాసులకు బెదిరింపులు – బాధితులకు అండగా నిలబడిన ఎమ్మెల్యే వంశీ మోహన్ రామవరప్పాడు : ఒక అపార్టుమెంట్‌కు చెందిన కల్వర్టును మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ (నెహ్రూ) అనుచరులు శుక్రవారం అర్ధరాత్రి దౌర్జన్యంగా కూల్చేందుకు యత్నించడం వివాదాస్పదమైంది. ఎనికేపాడు బీవీరావు కల్యాణ మండపం సమీపంలోని పవన్ క్లాసిక్ అపార్టుమెంట్ వాసులు రాకపోకలు సాగిచేందుకు కాలువపై నిర్మించుకున్న కల్వర్టును నెహ్రూ అనుచరులు పది మంది పొక్లెయిన్‌తో ధ్వంసం చేయడానికి యత్నించారు. అక్కడికి వచ్చిన అపార్టుమెంట్వాసులను అడ్డుకుంటే అంతు చూస్తామంటూ బెదిరించారు. పొక్లెన్తో కల్వర్టుకు రెండు వైపులా ఉన్న గోడలను ధ్వంసం చేశారు. కల్వర్టరు తొలగిస్తే అపార్టుమెంట్లో ఉంటున్న 57 కుటుంబాలు రాకపోకలు సాగించడం కష్టమని అపార్టుమెంట్ వాసులు అడ్డుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య వాగ్వివాదం జరిగింది. చివరకు నెహ్రూ అనుచరులు వెనుక్కు తగ్గారు. అంతర్గత విభేదాలే కారణమా? నెహ్రూ టీడీపీలో చేరకముందు ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడుపై విమర్శల వర్షం కురిపించారు. నెహ్రూ టీడీపీలో చేరాక ఆ ఇంటర్వ్యూ వీడియో ఫేస్బుక్, వాట్సప్‌లో హల్చల్ చేస్తోంది. ఆ వీడియోను వపన్ క్లాసిక్ అపార్టుమెంట్ బిల్డరు ఫేస్బుక్లో షేర్ చేసి కామెంట్ పెట్టడంతో కల్వర్టు ధ్వంసానికి నెహ్రూ అనుచరులు ప్రయత్నించారన్న ప్రచారం జరుగుతోంది. తమ నేత టీడీపీలో చేరిన తరువాత అపార్టుమెంట్ ఎదురుగా శుభాకాంక్షలు తెలుపుతూ పెద్ద పెద్ద బ్యానర్లు, హోర్డింగ్ ఏర్పాటు చేయాలని నెహ్రూ అనుచరులు బిల్డర్‌కు హుకుం జారీచేసినా అతను నిర్లక్ష చేశారన్న ప్రచారం జరుగుతోంది. అపార్టుమెంట్ నిర్మించేటప్పుడు బిల్డర్‌ను నెహ్రూ డబ్బు డిమాండ్ చేశారని, అయితే డబ్బు ఇవ్వనందున ఇలా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మరి కొందరు విమర్శిస్తున్నారు. చంద్రబాబుకు ఫిర్యాదుచేస్తా : ఎమ్మెల్యే వంశీ తన నియోజకవర్గంలో నెహ్రూ వర్గం చేసిన అరాచకాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే వంశీ శనివారం ఎనికేపాడు వచ్చి అపార్టుమెంట్వాసులతో మాట్లాడారు. అంతర్గత విభేదాల కారణంగానే నెహ్రూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వంశీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన అరాచకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తామన్నారు. లారీ డ్రైవర్లే కూల్చారు : అన్నే చిట్టిబాబు ఈ ప్రాంతంలో నెహ్రూకు సొంత గోదాములు ఉన్నాయని నెహ్రూ అనుచరుడు, కానూరు మాజీ సర్పంచి అన్నే వేణుగోపాల కృష్ణమూర్తి (చిట్టిబాబు) పేర్కొన్నారు. వాటి వద్దకు లారీలు వెళ్లకుండా అపార్టుమెంట్ వాసులు, బిల్డరు తమ కార్లు అడ్డంగా నిలిపి దారి ఇవ్వడం లేదన్నారు. ఈ రోడ్డును నెహ్రూ రూ.1.50 కోట్లతో అభివృద్ధిచేశారని పేర్కొన్నారు. దారికి కార్లు అడ్డుపెట్టవద్దని ఎన్నిసార్లు చెప్పినా విననందునే నివిసిగిపోయిన లారీ డ్రైవర్లు కల్వర్టును ధ్వంసం చేశారని చెప్పారు. రోడ్డును ఆక్రమించి చేపట్టిన నిర్మాణంపై సీఆర్డీఏ అధికారులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. -
అనుకరించటమే గొప్ప పొగడ్త!
ఏ పనినైనా అందంగా చేస్తారు కొంతమంది. ఎవరినైనా పొగడాలనుకుంటే ఆ విషయాన్ని నోటితో చెప్పనక్కరలేదు. ఎన్నో విధాలుగా ప్రకటించవచ్చు. నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెపితే అలాగా! అని అనిపిస్తుంది. అది చాలా పేలవమైన పద్ధతి. అది ఎవైరనా చెయ్యగలిగింది. దాని ప్రభావం అంతగా ఉండక పోవచ్చు. అది అతి మామూలు ఇష్టం. మీరింతటి గొప్ప వారు, అంతటి గొప్పవారు. మీరంటే నాకెంతో ఇష్టం. మీరంటే నాకు చచ్చేంత అభిమానం. మీకోసం ప్రాణాలనైనా ఆర్పిస్తాను. ఇటువంటి మాటలను తరచుగా వింటూ ఉంటాం. అవి పెదిమల నుండి వచ్చినవని తెలిసి పోతూనే ఉంటుంది. మీరు మాట్లాడుతూ ఉంటే తన్మయులమై పోతామండీ. మీ అభిరుచి చాలా గొప్పదండి! ఇలా పొగడే వారు కనపడుతూనే ఉంటారు. ఇవి నిజమైన పొగడ్తలేనా? ఇది తన ఇష్టాన్ని, గొప్పతనాన్ని ప్రకటించటం మాత్రమే. నాకు లడ్డు అంటే ఇష్టం, నాకు మల్లెపూలు అంటే ఇష్టం, నాకు తెలుపంటే ఇష్టం అని చెప్పిన దానికి నాకు నువ్వంటే ఇష్టం అని చెప్పిన దానికి పెద్ద తేడా లేదు. ఆ విధంగా చెప్పటం మనుషుల విషయంలో సరిపోదు. పసిపిల్లలని అనునయించేప్పుడు అప్రయత్నంగా పెద్దవాళ్ళు కూడా వాళ్ళలాగానే ముద్దుమాటలు మాట్లాడుతూ ఉంటారు. దానితో వాళ్ళు తమతో సమశ్రుతికి రావటం జరుగుతుంది. తనలాగా ప్రవర్తించే పిల్లలన్నా, మనవలు మనవరాళ్లన్నా తాతలకి, నాయనమ్మలకి ఇష్టం ఎక్కువ ఉండటం గమనించవచ్చు. దానికి కారణం వాళ్ళు తమని అనుకరిస్తూ ఉండటమే. అతి సన్నిహితత్వం గాని, ఇష్టం గాని ఉంటేనే కదా అనుకరించేది. తనలాగా ప్రవర్తిస్తున్నారంటే తనంటే ఇష్టం ఉందని, లేదా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఉందని అర్థం. కారణం ఇది అని సరిగా అర్థం కాకపోయినా అంతరాంతరాల్లో సహజాతంగా అందరికి తెలుస్తుంది. ఒకప్పుడు జాతికి ఆదర్శప్రాయులు హీరోలు ఇటువంటి వారు ఉండేవారు. తరువాతి కాలంలో చలనచిత్ర నటులు తెర మీదనే కాక నిజజీవితంలో కూడా హీరోలయి పోయారు. వాళ్ళు ఎటువంటి వస్త్రాలు, నగలు ధరిస్తే అటువంటివే ధరించటం, కేశాలంకరణ కూడా అదే విధంగా చేసుకోవటం వాళ్ళు ఉపయోగించిన ఊతపదాలనే ఉపయోగించటం ... ఒకటేమిటి అన్ని విధాలా వాళ్ళ లాగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటారు చాలా మంది, ముఖ్యంగా యువతరం. దీనికి కారణం ఆ వ్యక్తి అంటే ఉన్న అభిమానం. ఒక్క చెవికి కుండలం, మెడలో పెద్దపెద్ద పూసలు, పూలచొక్కాలు, పిలకలు, పోనీ టైల్స్‌తో తమలో ఆ ప్రతిభ లేకపోయినా ఆ వ్యక్తుల పట్ల ఉన్న ఇష్టాన్ని ప్రకటించే వాళ్ళని మనం చూస్తూనే ఉన్నాం. చీరలకి, గాజులకి, నగలకి ఆ చిత్రం పేరో, నటి పేరో పెట్టటం ఒక వ్యాపార రహస్యం. చిన్నతనంలో బడికి వెళ్ళటం మొదలు పెట్టిన కొత్తల్లో, ఇల్లు దాటి బయటికి అడుగుపెట్టి, కొత్తలోకం చూడటం మొదలవుతుంది. టీచర్ ఆదర్శంగా కనపడుతుంది. ఆ టీచర్ లాగా మాట్లాడటం, నడవటం, ప్రవర్తించటం మొదలు పెడతారు. ఆ టీచర్ పట్ల ఉన్న ఇష్టం లేదా గౌరవం వాళ్ళని ఆ విధంగా అనుకరించేట్టు చేస్తోంది. ఆ వయసులో పిల్లలవి స్వచ్ఛమైన మనసులు కనుక ఆ విధంగా వెంటనే ప్రకటిస్తారు. నెహ్రూ గారు కోటుకి గులాబీ పువ్వు పెట్టుకునే వారని ఆయన అభిమానులందరు ఆ రోజుల్లో కోటుకి గులాబీ పువ్వుని పెట్టుకునేవారు. భావకవిత్వాభిమానులందరూ కృష్ణశాస్త్రిగారి లాగా జులపాలు, లాల్చీ, బెంగాలీ పంచెకట్టుతో కనపడేవారు. చూడగానే చెప్పేయచ్చు వాళ్ళు భావకవులని. లాల్ బహదుర్ శాస్త్రి గారు ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు చాలా మంది సోమవారం రాత్రి భోజనం మానేశారు. అది ఆయన పట్ల ఉన్న అభిమానం లేక గౌరవం. ఇంటికి రాగానే పుస్తకాల సంచీ పక్కన పెట్టి వాళ్ళ తాతగారు కూర్చునే కుర్చీలో కూర్చుని ఆయన చేతికర్రని చేత పుచ్చుకుని అందరినీ అదమాయిస్తూ, గదమాయించటం మొదలు పెట్టింది చిట్టి. అప్పటివరకు గట్టిగా మాట్లాడేది కూడా కాదు. బళ్ళో వేస్తే నోరు విప్పక పోతే ఎట్లా అని భయపడ్డారు కూడా. మొదట్లో అట్లాగే ఉండేది. కానీ రెండోక్లాసులోకి వచ్చాక విపరీతంగా మారింది. మాట్లాడటం కాదు, వాగటం ఎక్కువయింది. ప్రతి మాటకి ముందు వెనక అండర్ స్టాండ్ అనటం, తను మాట్లాడేప్పుడు ఇంకెవరైనా మాట్లాడుతుంటే సెలైన్స్ అని గట్టిగా అనటం అందరికీ వింతగా అనిపించింది. ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకోవటానికి స్కూల్‌కి వెళ్లినప్పుడు సీతకి అంటే చిట్టితల్లికి అర్థమయ్యింది కారణం, మాట్లాడుతూ కళ్ళు చికిలించటం, ముక్కు ఎగపీల్చటం, మాటిమాటికి జుట్టు సరిచేసుకోవటం ... అన్నీ క్లాస్ టీచర్ లక్షణాలే. ఆవిడంటే తన కిష్టమని ఎన్నో మారులు చెప్పింది కూడా. అందుకే అప్రయత్నంగా అలా ఉండాలని ప్రయత్నం చేసింది. చిన్నతనంలో ప్రతివారికి అమ్మ, నాన్న ఆదర్శం. వాళ్ళు చేసే పనులన్నీ అద్భుతంగా కనిపిస్తాయి. ఎప్పటికైనా వాళ్ళలాగా ఉండాలనుకుంటారు. అందుకని వాళ్ళని అనుకరిస్తారు. పెద్దల చెప్పులు వేసుకోవటం, వాళ్ళ బట్టలు కట్టుకోవటం వాళ్ళ లాగా మాట్లాడటం, నటించటం అందులో భాగాలే. తాము ఏ విధంగా అవాలనుకుంటారో దానినే అనుకరిస్తూ ఉంటారు. అందుకనే పిల్లల ఆటలని గమనిస్తే వాళ్ళ అభిరుచులు, ఆదర్శాలు అర్థమవుతాయి. కొంతమంది తోటివారిని చేర్చి నేను టీచర్, మీరు నేను చెప్పినట్టు వినాలి అంటూ అంటారు. వీళ్ళు ఉపాధ్యాయ వృత్తిలో రాణించ గలుగుతారు. మరి కొంతమంది మీకు ఇంజెక్షన్ ఇస్తాను రా, అంటూంటారు. వీళ్ళు వైద్యవృత్తి పట్ల మక్కువ ఉన్న వాళ్ళు అని గుర్తించవచ్చు. అభిమానం ఉందని నోటితో చెప్పనక్కర లేదు. అనుకరిస్తే అదే బాగా అర్థమవుతుంది. వాస్తవానికి అదే అసలైన అభిమానం, నిజమైన పొగడ్త. ప్రవర్తన వల్ల ఫలానావారి అభిమానులు అని అర్థం అవుతుంది. - డా. ఎన్. అనంతలక్ష్మి -
గాంధీ, నెహ్రూ, వాజేపేయి చేయలేదా?
న్యూఢిల్లీ: ఆప్ అధికార ప్రతినిధి అశుతోష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ మాజీ మహిళాశిశు సంక్షేమశాఖ మంత్రి సందీప్ కుమార్ కు చెందిన ఓ అభ్యంతరకర వీడియో బయటకు రావడంపై శుక్రవారం ఆయన స్పందించారు. సందీప్ చేసింది తప్పేమీ కాదని వెనకేసుకొచ్చారు. శృంగారం మానవ లక్షణం అని సందీప్ ను సమర్ధించే ప్రయత్నం చేశారు. సందీప్ వివాదంపై అశుతోష్ తన బ్లాగ్ లో వివరణ ఇచ్చారు. దేశంలో పెద్ద పెద్ద నాయకులు కూడా సామాజిక బాధ్యతలను మరిచి ప్రవర్తించిన ఘటనలు ఉన్నాయని వివాదాస్పదంగా మాట్లాడారు. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, వాజ్ పేయిలు కూడా ఇతర స్త్రీలతో సంబంధాలు పెట్టుకున్నారనే వార్తలు వచ్చాయని చెప్పారు. అయితే వారు రాజకీయంగా ఏ విధంగానూ నష్టపోలేదని అన్నారు. నెహ్రూ తనతో పాటు పనిచేసే మహిళలతో వివాహేతర సంబధాలు కలిగి ఉన్నారనే పుకార్లు షికార్లు చేశాయని చెప్పారు. ఎడ్వినా మౌంట్ బాటెన్ తో నెహ్రూకు ఉన్న అనుబంధం గురించి అప్పట్లో విపరీతమైన చర్చ జరిగేదని బ్లాగ్ లో రాశారు. 1910లో గాంధీజీ సర్లా చౌదరితో అనుబంధాన్ని పెంచుకున్నారని.. ఆమె రవీంద్రనాథ్ ఠాగూర్ కు దూరపు బంధువని చెప్పారు. సర్లా తన ఆత్మకు భార్య అని గాంధీజీనే స్వయంగా చెప్పారని తెలిపారు. దీంతో సీ రాజగోపాలాచారి మిగిలిన పార్టీ సీనియర్ నేతలు ఈ విషయంలో జోక్యం చేసుకుని గాంధీజీ ఆమెను వదలివేసేలా చేశారని అన్నారు. ఆ తర్వాతి రోజుల్లో బ్రహ్మచర్యాన్ని పరీక్షించుకునేందుకు యువతులతో కలిసి గాంధీజీ నిద్రించారని చెప్పారు. నెహ్రూ ఈ విషయంపై గాంధీతో మాట్లాడినా ఆయన వినలేదని తెలిపారు. అటల్ బీహారీ వాజ్ పేయి ఆర్ఎస్ఎస్ సంప్రదాయాలను పాటిస్తూ వివాహం చేసుకోలేదని చెప్పారు. పార్లమెంటులో తాను బ్యాచిలర్ నే కానీ బ్రహ్మచారిని మాత్రం కాదని ఆయనే ప్రకటించారని గుర్తుచేశారు. వాజ్ పేయి బహిరంగంగానే కళాశాల స్నేహితురాలితో కలిసి తిరిగారని.. అప్పుడు ఎవరూ ఆయనకు అడ్డుచెప్పలేదని అన్నారు. సోషలిస్టు లీడర్ రామ్ మనోహర్ లోహియా, జార్జ్ ఫెర్నాండెస్, చైనీస్ లీడర్ మావో జె డాంగ్ ల జీవితాలను కూడా అశుతోష్ ఉదాహరణగా పేర్కొన్నారు. -
నెహ్రూ, సర్దార్ పటేల్ ను కూడా ఉరితీశారా!
సాక్షాత్తు కేంద్ర మానవ వనరుల మంత్రి ప్రకాశ్ జవదేకర్ చరిత్ర విషయంలో నాలుక కర్చుకున్నారు. భగత్ సింగ్, రాజ్ గురుతోపాటు నేతాజీ సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, పండిట్ జవహర్ లాల్ నెహ్రూ కూడా బ్రిటిష్ పాలకులు ఉరితీశారని ఆయన తప్పులు ఒప్పజెప్పారు. మధ్యప్రదేశ్ లోని చింద్వారాలో సోమవారం జరిగిన ఓ బహిరంగ సభలో జవదేకర్ మాట్లాడారు. '1857లో ప్రారంభమైన స్వాతంత్ర్య సమరం 90 ఏళ్ల అనంతరం బ్రిటిష్ వాళ్లను వెళ్లగొట్టడంతో ముగిసింది. బ్రిటిష్ పాలకులు ఉరితీసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్, సర్దార్ పటేల్, పండిట్ (నెహ్రూ), భగత్ సింగ్, రాజ్ గురు వంటి స్వాతంత్ర్య పోరాటయోధులకు మనం ఈనాడు జోహార్లు అర్పిస్తున్నాం' అని పేర్కొన్నారు. దేశంలోని విద్యాశాఖ వ్యవహారాలను చూసే జవదేకర్ తన ప్రసంగంలో చారిత్రక వాస్తవాలను తప్పుగా ఉటంకించారు. నిజానికి భారత ప్రథమ ప్రధాని నెహ్రూ సహజ కారణాలతో 1964లో 74 ఏళ్ల వయస్సులో మరణించారు. భారత ప్రథమ కేంద్ర హోమంత్రి పటేల్ 1950లో 75 ఏళ్ల వయస్సులో ప్రాణాలు విడిచారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం మిస్టరీగా మిగిలిపోగా.. భగత్ సింగ్, రాజ్ గురులను మాత్రం బిటిష్ సర్కారు ఉరితీసింది. భారత 70వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు తిరంగా యాత్రను సోమవారం చింద్వారాలో ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి జవదేకర్ మాట్లాడుతూ చరిత్రను విషయంలో నాలుక కర్చుకున్నారు. -
హేరామ్!
‘మహాత్మ’ గాంధీ (78), భారత జాతిపిత పూర్తిపేరు : మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ జననం : 2 అక్టోబర్ 1869 జన్మస్థలం : పోర్బందర్ (గుజరాత్) తల్లిదండ్రులు : కరమ్‌చంద్ గాంధీ, పుత్లీబాయ్ తోబుట్టువులు : లక్ష్మీదాస్, గోకిబెన్ కర్సన్దాస్ చదువు : న్యాయశాస్త్రం భార్య : కస్తూర్బా (వివాహం: 1883 మే) సంతానం : హరిలాల్, మణిలాల్, రామ్‌దాస్, దేవదాస్ ఒక అతివాది తన దారికి అడ్డమని చెప్పి పిస్తోలు తీసి దండం పెడుతూనే మహాత్మాగాంధీని గుండెల్లో కాల్చాడు! అలా చేసినవాడిపై ఆగ్రహించాలి. ‘ఎందుకిలా చేశావ్’ అని అరవాలి. కానీ గాంధీజీ అహింసావాది. చనిపోతూ కూడా అతడిని ద్వేషించలేదు. ‘హే రామ్!’ అంటూ ఒరిగిపోయారు. ఇది 1948 జనవరి 30న జరిగిన ఘాతుకం. ఇప్పుడు మళ్లీ అదే అతివాదం... 2016 ఆగస్టు 5న దారికి అడ్డంగా ఉందని చెప్పి మహాత్మాగాంధీ ప్రతిమను కాళ్లూ చేతులు విరగ్గొట్టి ఏట్లో పడేసింది! 69 ఏళ్ల క్రితం ఒక అర్ధరాత్రి మనకు స్వాతంత్య్రం వచ్చింది. 69 ఏళ్ల తర్వాత మరో అర్ధరాత్రి పాలకవాదం మనకు తలవంపులు తెచ్చింది. ఆనాటిది.. ఎ ప్రైడ్ఫుల్ మిడ్నైట్. ఈనాటిది.. ఎ షేమ్‌ఫుల్ మిడ్నైట్. గాంధీజీకి జరిగిన ఈ ఘోర అవమానానికి ప్రాయశ్చిత్తంగా, ప్రక్షాళనగా... ఈ స్వాతంత్య్ర దినోత్సవాన.. ఆయన జీవితచరిత్రను మళ్లీ ఒకసారి మననం చేసుకుందాం. 1947. ఆగస్టు 14-15. అర్ధరాత్రి. దేశానికి స్వాతంత్య్రం వచ్చింది! నెహ్రూ మాట్లాడుతున్నారు పార్లమెంటు హాల్లో. కొద్ది క్షణాల్లో ఆగస్టు 15 రాబోతుండగా... ‘ట్రిస్ట్ విత్ డెస్టినీ’ మొదలైంది. తొలి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రసంగం.. ట్రిస్ట్ విత్ డెస్టినీ. తల్లి కునుకు తీస్తున్నప్పుడు మేల్కొని కేరింతలు కొడుతున్న బిడ్డను కనిపెట్టుకుని ఉండే రెప్పలకు ఆహ్వానం అన్నారు నెహ్రూ. గాంధీజీ అక్కడ లేరు! వగచిన యుగం అంతరించి, జాతి ఆత్మ వికసించిన ఈ నడిరేయిలో మళ్లీ ఒక ఒట్టుపెట్టుకుందాం.. యావత్ మానవాళి క్షేమం కోసం కట్టుబడి ఉంటామని.. అన్నారు నెహ్రూ. గాంధీజీ అక్కడ లేరు! ఈ తొలి క్షణాలలో మన భావాలు జాతిపిత బాపూజీని అభిషేకించాలి. భారతీయాత్మకు బాహ్య స్వరూపమైన బాపూజీ మనకొక సందేశం... అన్నారు నెహ్రూ. గాంధీజీ అక్కడ లేరు. సమరయోధుడు, శాంతి యోధుడు.. దేశానికి స్వాతంత్య్రాన్ని తెచ్చిపెట్టిన మహాత్ముడు.. దేశ ఆవిర్భావ క్షణాలలో ఢిల్లీలో లేకుండా ఎక్కడ ఉన్నట్లు? కలకత్తాలో! హిందూ ముస్లింల మధ్య రాజుకున్న మత కలహాల జ్వాలల్ని చల్లార్చే కర్తవ్య దీక్షలో నిమగ్నమై ఉన్నారు ఆయన! స్వాతంత్య్రాన్ని ఆస్వాదించడం కన్నా, శాంతి సామరస్యాలను పునరుద్ధరించడం ముఖ్యం అని భావించారు బాపూజీ. ఇలాంటి వ్యక్తి ఉంటారా?! ఇవాళ భారత స్వాతంత్య్ర దినం. 70వ ఇండిపెండెన్స్ డే. 68 ఏళ్ల క్రితం బాపూజీ తన 78వ యేట ఒక అతివాది పేల్చిన బులెట్లకు నేలకొరిగారు. స్వతంత్ర భారతదేశపు తొలి ఉలికిపాటు అది. గాంధీ హత్య వార్త వినగానే ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ - ‘ఇంతటి మహావ్యక్తి ఈ భూమి మీద నడిచాడా! మన మధ్య జీవించాడా అని భావితరాల వారు ఆశ్చర్యపోతారు’ అని వ్యాఖ్యానించారు. ఆయన జీవితమే... ఆయన సందేశం దేశ విభజనకు ముందు, తర్వాత... దేశంలో చెలరేగిన మత కలహాలు గాంధీజీని ఎంతో అశాంతికి గురి చేశాయి. స్వాతంత్య్రానికి ముందు ఏడాది 1946లో ఆయన హిందూ ముస్లిం అల్లర్లలో శాంతి పునఃస్థాపనకు కలకత్తాలో పాదయాత్ర చేస్తున్నారు. ‘బెంగాలీ ప్రజలకు సందేశం ఇవ్వండి’ అని పాత్రికేయులు అడిగారు. ఆరోజు గాంధీజీ మౌనవ్రతం. ఒక పలక మీద బెంగాలీ లిపిలో ‘అమార్ జీబనీ అమార్ బానీ’ అని రాశారు. ‘నా జీవితమే నా సందేశం’ అని దాని అర్థం. సత్యం, అహింస అనే ఆదర్శాలను ఆయుధాలుగా చేసుకున్న మహనీయుని జీవితం కేవలం సందేశం మాత్రమే అవుతుందా? దిక్సూచి కూడా అయింది. అగ్రరాజ్యాలు సైతం నేడు గాంధీ మార్గాన్ని అనుసరిస్తున్నాయి! ఇరవై ఏళ్ల దక్షిణాఫ్రికా ఉద్యమం గాంధీజీ జీవితానికి ఉద్యమ స్వరూపం తప్ప మరో రూపం లేదు. వేరే రూపు రేఖలూ లేవు. ఈ భారతీయుడి జీవితం ఇంగ్లండ్‌లో మొదలైంది. దక్షిణాఫ్రికాలో పదును తేలింది. భారత్‌లో కదం తొక్కింది. సముద్రయానం హిందువులకు నిషిద్ధం. నిషేధాన్ని ధిక్కరించి ‘లా’ చదవడం కోసం 1888లో ఇంగ్లండు వెళ్లారు గాంధీజీ! మూడేళ్లు లండన్‌లో ఉండి వచ్చారు. ముంబైలో ‘లా’ ప్రాక్టీస్ పెట్టారు. 1893లో దక్షిణాఫ్రికాలో ఒక భారతీయ ముస్లిం కంపెనీ దావాలో వాదించడానికి జూనియర్ లాయర్‌గా వెళ్లే అవకాశం వస్తే డర్బన్ బయల్దేరి వెళ్లారు. అలా వెళ్లడం వెళ్లడం దక్షిణాఫ్రికాలో 21 ఏళ్లు (1893-1914) గడిపారు. దక్షిణాఫ్రికాలో అనుభవాలు, అవమానాలు, పరాజయాలు ఆయన్ని ఓ ఉద్యమ శిల్పంలా చెక్కాయి! ముప్పై ఏళ్ల స్వదేశీ ఉద్యమం 1914లో దక్షిణాఫ్రికా నుంచి తిరుగు ప్రయాణమై, మధ్యలో కొన్నాళ్లు లండన్‌లో ఉండి, అక్కడ ఆరోగ్యం క్షీణించడంతో 1915లో గాంధీజీ ఇండియా చేరుకునే నాటికి.. ఇక్కడ స్వాతంత్య్ర కాంక్ష ఉద్ధృత రూపం దాలుస్తూ ఉంది. గాంధీజీ ఏడాది పాటు దేశమంతా తిరిగారు. మొదట శాంతి నికేతన్ వెళ్లి ఠాగూర్ని కలుసుకున్నారు. తర్వాత గుజరాత్ వచ్చారు. అహ్మాదాబాద్‌లో సబర్మతీ నదీ తీరాన ఒక ఆశ్రమం నిర్మించుకున్నారు. ఇండియాలో కూడా దక్షిణాఫ్రికాలోని పరిస్థితులే! తెల్లవాళ్లు, నల్లవాళ్లు. ప్రజావ్యతిరేక నిర్ణయాలు. ప్రభుత్వంపై ఉద్యమకారుల ఆగ్రహాలు! బీహార్‌లోని చంపారన్ జిల్లాలో నీలిమందు పండించే పేద రైతుల పట్ల తెల్లజాతి యజమానులు అనుసరిస్తున్న దోపిడి విధానంపై ప్రతిఘటనతో 1917లో భారత్‌లో మొదలైన గాంధీజీ ఉద్యమ జీవితం.. రౌలత్ చట్టం, జలియన్‌వాలా బాగ్ ఉదంతం, సహాయ నిరాకరణ, ఖిలాఫత్ ఉద్యమం, చౌరాచౌరీ ఘటన, సంపూర్ణ స్వరాజ్య తీర్మానం, ఉప్పు సత్యాగ్రహం, రౌండ్ టేబుల్ సమావేశాలు, ఆమరణ నిరాహార దీక్ష .. వంటి వాటితో 1932 నాటికి భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రధాన అధ్యాయం అయింది! 1933లో గాంధీజీ సబర్మతి నుంచి మహారాష్ట్రలోని వార్ధా వచ్చి అక్కడ సేవాగ్రాం పేరుతో ఆశ్రమం నెలకొల్పారు. అక్కడే శాశ్వత నివాసం ఏర్పరచుకున్నారు. హరిజన్ వార పత్రిక స్థాపించారు. హరిజనోద్ధరణ కార్యక్రమం చేపట్టారు. ఖాదీ ఉద్యమం ప్రారంభించారు. తర్వాత రాజకీయ ఉద్యమం. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం. బ్రిటిష్ వాళ్లు వెళ్లిపోయారు. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చింది. అప్పటికి గాంధీజీ వయసు 77 ఏళ్లు. 1917 నుంచి 1947 వరకు 30 ఏళ్లు గాంధీజీ ఉద్యమ జీవితం గడిపారు. మౌంట్ బాటన్ ప్లాన్ 1945 నాటికి బ్రిటిష్ ప్రభుత్వానికీ, భారత జాతీయ కాంగ్రెస్‌కు మధ్య చర్చలు ఒక కొలిక్కి వచ్చాయి. ‘మౌంట్‌బాటన్ ప్లాన్’ తయారైంది. ఆ ప్రకారం 1947లో బ్రిటిష్ ఇండియా విభజన జరిగి ఇండియా, పాకిస్థాన్ అనే రెండు స్వతంత్ర రాజ్యాలు మత ప్రాతిపదికన ఏర్పాటయ్యాయి. అయితే విభజనకు ముందు, తర్వాత కూడా కొన్ని నెలల పాటు రెండు ప్రాంతాలలో మతకల్లోలం చెలరేగింది. గాంధీజీ ఈ విభజనను వ్యతిరేకించారు. కల్లోలాన్ని చల్లబరిచేందుకు ఆయన కలకత్తా, ఢిల్లీలలో నిరాహార దీక్షలు చేపట్టారు కూడా. అటు, ఇటు.. ప్రజలు, ప్రభుత్వాలు సద్దుమణిగే సమయంలో మహాత్మాగాంధీ హత్యకు గురయ్యారు. గాంధీజీ మరణం జాతిని దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే మహాత్ముడికి మరణం అనేది ఉంటుందా?! ఉండదు. మానవాళి గాంధీమార్గంలో నడుస్తున్నంత కాలం ఏ తరంలోనైనా మహాత్ముడు జీవించి ఉన్నట్లే. మహాత్మాగాంధీ - మరికొన్ని విశేషాలు గాంధీజీ పేరు ఐదుసార్లు నామినేట్ అయినా ఆయనకు నోబెల్ శాంతి బహుమతి రాలేదు! గాంధీజీ దక్షిణాఫ్రికాలో ప్రారంభించిన పౌరహక్కుల ఉద్యమం నాలుగు ఖండాలకు, 12 దేశాలకు విస్తరించింది! గాంధీజీ అంతిమ యాత్ర 8 కి.మీ. పొడవున సాగింది! గాంధీ ఏ దేశానికి వ్యతిరేకంగా పోరాడారో ఆ దేశమైన బ్రిటన్ ఆయన చనిపోయిన 21 ఏళ్ల తర్వాత ఆయన గౌరవార్థం తపాలా బిళ్లను విడుదల చేసింది. గాంధీజీ తన ఉద్యమ జీవిత కాలం మొత్తం మీద రోజుకు 18 కిలోమీటర్ల చొప్పున నడవడమో ప్రయాణించడమో చేశారు. అది ప్రపంచాన్ని రెండుసార్లు చుట్టి వచ్చినంత దూరం. బోయర్ యుద్ధంలో గాంధీజీ డచ్చివాళ్లపై పోరాడుతున్న బ్రిటన్‌కు మద్దతుగా క్షతగాత్రులకు సేవలు అందించారు. అప్పుడే ఆయనలో అహింసా బీజాలు నాటుకున్నాయి. టాల్‌స్టాయ్, ఐన్‌స్టీన్, హిట్లర్ వంటి ప్రసిద్ధులతో గాంధీజీ ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపారు. ఆపిల్ కంపెనీ సీఈవో, స్టీవ్ జాబ్స్ గాంధీజీ అభిమాని. అచ్చు గాంధీజీ ధరించిన గుండ్రటి కళ్లజోడు లాంటివే ఆయన స్మృత్యర్థం జాబ్స్ వాడేవారు. గాంధీజీ ఇంగ్లిష్ మాట తీరు ఐరిష్ యాసతో ఉండేది. బాల్యంలో ఒక ఐరిష్ టీచర్ దగ్గర పాఠాలు నేర్చుకోవడమే అందుకు కారణం. దేశంలో 50కి పైగా ప్రధాన రహదారులు, విదేశాలలో దాదాపు 50 వరకు రోడ్లు గాంధీజీ పేరు మీద ఉన్నాయి. జాతి వివక్షకు వ్యతిరేకంగా గాంధీజీ తన అహింసా ఉద్యమ ప్రచారానికి ఫుట్‌బాల్ ఆటను ప్రోత్సహించారు. దక్షిణాఫ్రికాలో ఫుట్‌బాల్ క్లబ్బుల స్థాపనకు చొరవ చూపారు. జాతిపిత జలసమాధి! విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో అధికారులు నీళ్లల్లో పడేసిన గాంధీ విగ్రహాన్ని వెతికి బుడమేరు కాలువ నుంచి బయటకు తీస్తున్న దృశ్యం. -
ఆడపిల్ల భారం అనుకున్నారు..
మూడోసారీ ఆడపిల్లే పుట్టిందని ఆ తల్లిదండ్రులు ఆమెను వదిలించుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట మండలం కొర్ర తండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన నెహ్రూ, పద్మ దంపతులకు ఇప్పటికే ఇద్దరు కుమార్తెలున్నారు. మూడో కాన్పులో నెల క్రితం ఆడపిల్ల పుట్టింది. పేద కుటుంబమైనందున పోషించే స్తోమత లేక ఆ దంపతులు మూడో కుమార్తెను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న ఐసీడీఎస్ అధికారులు గురువారం ఆ శిశువును జిల్లా కేంద్రంలోని శిశువిహార్ తరలించారు. -
నెహ్రూ జాతినిర్మాణ కార్యక్రమంపై అమిత్ షా విమర్శలు
పుణె: జవహర్ లాల్ నెహ్రూ జాతీయ నిర్మాణ కార్యక్రమం దేశంలోని విలువలను నిర్మూలించి, విదేశాలనుంచి ఆలోచనలను అరువు తెచ్చుకునే విధాన మని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా విమర్శించారు.దీన దయాల్ ఉపాధ్యాయ ప్రతిపాదించిన సిద్ధాంతమే దేశంలో విలువలను కాపాడగలదని పేర్కొన్నారు.దీన్ దయాల్ జీవిత చరిత్ర 'రాష్ట్ర్ర ద్రష్ట' ను పుణెలో ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దీన దయాల్ సిద్ధాంతాల పునాదులపైననే జన సంఘ్ నిర్మాణం,బీజేపీ స్థాపన జరిగిందని షా తెలిపారు. విభిన్న భావజాలమున్న వ్యక్తుల త్యాగాల ఫలితంగా దేశానికి స్వతంత్రం వస్తే గొప్ప తనాన్ని కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుందని ఆయన పేర్కొన్నారు.దీన్ దయాల్ సిద్ధాంతాలకు కట్టుబడి ఆయన ఆశయ సాధనకు బీజేపీ కృషి చేస్తోందని షా అన్నారు. -
నెహ్రూకు ఘన నివాళి
విజయవాడ: స్వతంత్ర భారతదేశ తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ వర్ధంతిని పురస్కరించుకొని ఆంధ్రాభవన్ లో ఆయన చిత్ర పటానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పత్రికా సమావేశంలో ఎన్. నరహరిశెట్టి మాట్లాడుతూ నెహ్రు సేవలను కొనియాడారు. తొమ్మిదేళ్లు జైల్లో ఉన్నా కుంగిపోకుండా 'గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ' , 'ది డిస్కవరీ ఆఫ్ ఇండియా' లతో పాటు తన జీవిత చరిత్రను రాసిన నెహ్రూను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఆర్ధిక సంస్కరణలను ప్రవేశపెట్టి ప్రపంచంలోనే భారతదేశానికి గుర్తింపును తెచ్చారని కొనియాడారు. ఆయన కాలంలోనే భారీ ఆనకట్టలు, తాగునీటి ప్రాజెక్టులు, కుటీర పరిశ్రమలు, జలవిద్యుత్, అణుశక్తిని వినియోగించడం లాంటి కార్యక్రమాలు చేపట్టారని గుర్తుచేశారు. దేశ ఆర్థికాభివృద్ధిలో నెహ్రూ తనదైన ముద్ర వేశారని అన్నారు. ఇందులో పీసీసీ కార్యదర్శి నాంచారయ్య, లీగల్ సెల్ చైర్మన్ మహావిష్ణు తదితరులు పాల్గొన్నారు. -
మహాత్మా గాంధీ,తిలక్ లు లౌకిక వాదానికి వ్యతిరేకులు
ముంబై: ఇటీవల రాజస్థాన్ లోని పాఠ్యపుస్తకాల్లో ప్రథమ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ కు సంబంధించిన వివాదం ఇంకా మరచిపోకముందే మరో వివాదం మొదలైంది. ముంబై యూనివర్సిటీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లర్నింగ్ బుక్స్ లో ఉన్న అంశాలు మరోసారి వివాదాస్పదమయ్యాయి. నెహ్రూకు సంబంధించిన విషయాలను వదిలేశారు. మహాత్మా గాంధీ, బాలగంగాధర తిలక్ లను లౌకిక వాదానికి వ్యతిరేకమని పాఠ్య పుస్తకాల్లో ఉంది. యూనివర్సిటీకి చెందిన సివిక్స్, పాలిటిక్స్ డిపార్ట్ మెంట్ ఈ బుక్కును సంకలనం చేసింది. ఇటీవల రాజస్థాన్ లోని ఎనిమిదవ తరగతి పాఠ్యపుస్తకాల్లో జవహర్ లాల్ నెహ్రూకు సంబంధించి వివాదాస్పద అంశాలు ఉండంటం పట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. కాషాయీకరనలోభాగంగానే ఇదంతా జరుగుతుందని ఆరోపించింది. -
అపూర్వం, అద్వితీయం!
సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని సభ్యులందరికీ, ప్రజలందరికీ సుబోధకంగా జలవనరుల విధానాన్ని వివరించడం మనస్ఫూర్తిగా స్వాగతించవలసిన ఆధునిక ప్రక్రియ. భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ మాదిరి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సైతం స్వాప్నికుడు. స్వప్న సాకారం కోసం తుదివరకూ పోరాడే వజ్ర సంకల్పం ఆయనది. అందుకు నిదర్శనం తెలంగాణ రాష్ట్రమే. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ సారథ్యంలో పద మూడేళ్లపాటు సాగిన ఉద్యమానికి ప్రధాన ప్రాతిపదికలైన మూడు అంశాలలో ఒకటి నీరు. తక్కిన రెండు: నిధులు, నియామకాలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ నిధులు తెలంగాణలోనే ఖర్చవుతాయి కనుక నిధులు దారి మళ్లుతున్నాయన్న బాధ లేదు. నియామకాలకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నెలకొల్పిన తర్వాత పద్ధతి ప్రకారం నియామకాలు జరుగుతాయన్న విశ్వాసం కలిగింది. గ్రూప్-2 పరీక్షలు నిర్వహించేందుకు జరుగుతున్న సన్నాహాలు యువతలో ఆశలు నింపుతున్నాయి. గురువారంనాడు శాసనసభలో కేసీఆర్ ఆవిష్కరించిన జలదృశ్యం తెలం గాణ రాష్ట్రం ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి అన్యాయాలు జరిగినట్టు చెబుతూనే పాత ప్రభుత్వాలు డిజైన్ చేసిన ప్రాజెక్టులను సవరించవలసిన అవసరాన్ని వివరించేం దుకు అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు ముఖ్యమంత్రి. పాత ప్రభుత్వాలు రూపొందించిన ప్రాజెక్టుల ఆకృతిని ఎందుకు మార్చవలసి వచ్చిందో, మార్చకపోతే జరిగే నష్టం ఏమిటో, మార్చడం వల్ల వచ్చే అదనపు ప్రయోజనం ఏమిటో సవివరంగా విడమరచి చెప్పారు. ఒక రకంగా ఇది కేసీఆర్ హృదయావిష్కారం. కొన్ని మాసాల కిందట జర్నలిస్టుల అక్రెడిటేషన్ కమిటీ నివేదికను సమర్పించేందుకు ముఖ్యమంత్రిని కలిసినప్పుడు నాతో పాటు మరికొందరు సీనియర్ జర్నలిస్టులకు ఈ పవర్ పాయింట్ ప్రజెం టేషన్లో చాలా భాగం చూపించారు. హరిత తెలంగాణ నిర్మాణం చేయాలన్న తపనతో ఈ అంశంపైన ముఖ్యమంత్రి లోతుగా అధ్యయనం చేస్తున్నారని అప్పుడే అర్థం చేసుకున్నాం. ధారాళంగా, ప్రస్ఫుటంగా, అద్భుతంగా మాట్లాడటమే కాకుండా సంక్లిష్ట మైన అంశాలను సామాన్య ప్రజలకు సైతం అర్థమయ్యే రీతిలో చెప్పగల శక్తి కేసీఆర్‌కి ఉన్నదనే ది జగద్విదితం. అపారమైన పరిజ్ఞానం, అసాధారణమైన ధారణశక్తి ఆయనది. సుదీర్ఘ ఉద్యమంలో ఆయన తెలంగాణకు సంబంధించిన సమస్త సమాచారం తెలుసుకున్నారు. తెలంగాణను పట్టిపీడిస్తున్న సమస్యలకు పరిష్కారాలను తనకు తోచిన విధంగా సిద్ధం చేసుకున్నారు. ఇప్పుడు అవకాశం వచ్చింది కనుక వాటిని అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. పార్లమెంటులో కానీ ఏ రాష్ట్ర అసెంబ్లీలో కానీ మునుపెన్నడూ జరగని విధంగా అత్యంత క్లిష్టమైన సాగునీటి విధానంపైన పవర్ పాయింట్ ప్రజంటేషన్ (దృశ్య ప్రదర్శన)ను ఒక ముఖ్యమంత్రి స్వయంగా నిర్వహించడం ఇదే ప్రథమం. దాదాపు అన్ని తెలుగు న్యూస్ చానళ్లూ ప్రత్యక్ష ప్రసారం చేయడం వల్ల కొన్ని లక్షల మంది ప్రజలు ఈ కార్యక్రమాన్ని చూసి ఉంటారు. తమ ప్రాంతానికి సాగు నీరు తెచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రభుత్వం ఎటువంటి వ్యూహం అమలు చేయాలనుకుంటున్నదో అర్థం చేసుకొని ఉంటారు. సాగునీటి విధానాన్ని ఇంత విపులంగా వివరించినందుకు ముఖ్యమంత్రిని అభినందించ వలసిన ప్రతిపక్షాలు ఆక్షేపించడం విడ్డూరం. సభలో ఉండి జలదృశ్యాన్ని తిలకించి ఏమైనా సందేహాలు ఉన్నా, సలహాలు ఉన్నా తెలియజేస్తే ప్రజా స్వామ్యబద్ధంగా ఉండేది. ఎంఐఎం, బీజేపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్, వామపక్ష సభ్యులను ఈ విషయంలో అభినందించాలి. వారు సభలో కూర్చొని సమర్ప ణను తిలకించారు. ప్రశ్నలు అడిగారు. జవాబులు పొందారు. కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీలు కురచ మనస్తత్వాన్ని ప్రదర్శించాయి. చట్టసభల ప్రతిష్ఠకు భంగం వాటిల్లిందంటూ లేనిపోని రాద్ధాంతం చేయడం అనవసరం. అధిక ప్రసంగం. నిజానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని సభ్యులందరికీ, ప్రజలంద రికీ సుబోధకంగా జలవనరుల విధానాన్ని వివరించడం మనస్ఫూర్తిగా స్వాగతించవలసిన ఆధునిక ప్రక్రియ. పరిష్కారం ప్రధానం తెలంగాణలో సాగునీటి సౌకర్యం ఉన్న విస్తీర్ణం 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు 20 లక్షల ఎకరాలు ఉంటే ఇప్పుడు 19 లక్షల ఎకరాలు మాత్రమే ఉన్నదని చెబుతూ ఈ దుస్థితికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులే కారకు లంటూ నిందించిన కేసీఆర్ సాగునీటి సౌకర్యం ఉన్న నేల విస్తీర్ణాన్ని కోటి ఎకరాలకు విస్తరించేందుకు తాను సంకల్పించిన ప్రాజెక్టుల వివరాలు జలదృశ్య ప్రదర్శనలో కళ్లకు కట్టారు. సాధ్యాసాధ్యాల గురించి అనుమానాలు రావడం సహజం. గతానుభవం ఉన్నది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా మొదలు పెట్టిన 20 వేల సాగునీటి ప్రాజెక్టులలో సగానికి పైగా న్యాయ స్థానా లలో మగ్గుతున్నాయి. తక్కినవాటిలో సగం నిధులు లేక కునారిల్లుతు న్నాయి. పూర్తయిన ప్రాజెక్టులలో సైతం నీరు లేదు. ప్రస్తుతం శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలలో నీరు అడుగంటింది. గోదావరి నదిపైన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు అనేక బ్యారేజీలు నిర్మించిన కారణంగా తెలంగాణకు గోదావరి నీరు వచ్చే ఆశలు ఆవిరైపో యాయి. ప్రాణహిత, ఇంద్రావతి నదులపైనే తెలంగాణ ప్రజలు ఆధారపడవ లసిన పరిస్థితి. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ఆకృతిని మార్చి వేసి, ఆయకట్టును పెంచివేసిన కారణంగా వ్యయం సహజంగానే పెరుగుతుంది. భారీ ప్రాజెక్టు ప్రతిపాదనలను అనుమానంతో చూసే అలవాటు ఉన్నవారికి వాటిలో అవినీతి పెనుభూతం కనిపిస్తుంది. మొదట ఆదిలాబాద్ జిల్లాలోని తమ్మడిహెట్టి వద్ద ఆనకట్ట కట్టి, ప్రాణహిత నుంచి నీటిని ఎల్లంపల్లి బ్యారేజీకి ఎక్కించాలనీ, అక్కడి నుంచి దిగువ మానేరు ద్వారా ఆయకట్టుకు నీరందించాలనీ ప్రతిపా దించారు. పునరాకృత (రీడిజైన్డ్) ప్రాజెక్టుల ప్రకారం కాళేశ్వరం దిగువన మేడిగడ్డ వద్ద గోదావరి నుంచి ఎల్లంపల్లికి నీరు మళ్లించాలి. ఎల్లంపల్లి దిగువన ఎత్తిపోతల సామర్థ్యాన్నీ, జలాశయాల విస్తృతినీ, ఆయకట్టునూ పెంచాలని సంకల్పం. రంగారెడ్డి జిల్లాను మినహాయించి మెదక్, నిజామాబాద్, నల్లగొండ జిల్లాలలో ఆయకట్టు పెంచుతారు. కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో ప్రతిపా దించిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కింద 16.4 లక్షల ఎకరాల విస్తీర్ణం ఆయకట్టు కిందికి వస్తుందని భావించారు. కొత్త డిజైన్ కారణంగా ఆయకట్టు 20 లక్షల ఎకరాలకు పెరుగుతుంది. మారిన డిజైన్లూ, పెరిగిన మోటార్ల సంఖ్యా లెక్కలోకి తీసుకుంటే కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి 607 మెగావాట్ల విద్యుచ్ఛక్తి అవసరమని ప్రవీణుల అంచనా. తెలంగాణలో నీరు కావాలంటే ఎత్తిపోతలు అనివార్యం. విద్యుచ్ఛక్తి వినియోగాన్నీ, వ్యయాన్నీ తగ్గించుకోవడానికి ప్రఖ్యాత ఇంజనీరు టి. హనుమంతరావు చేస్తున్న సూచనలు పరిశీలిస్తే మంచిది. ఈ సందర్భంగా కొన్ని విమర్శలూ, కొన్ని సందేహాలూ వినిపించాయి. తమ్మిడిహెట్టి ఆనకట్ట ఎత్తును 152 మీటర్ల నుంచి 148 మీటర్లకు తగ్గించేందుకు అంగీకరించడం ద్వారా తెలంగాణ ప్రజల ప్రయోజనాలను మహారాష్ట్రకు కేసీఆర్ తాకట్టు పెట్టారన్నది కాంగ్రెస్ పార్టీ విమర్శ. దీన్ని పెద్దగా పట్టించుకోనక్కర లేదు. ఇచ్చిపుచ్చుకునే ధోరణి లేకపోతే అంతర్రాష్ట్ర వివాదాలలో మునిగితేలు తున్న ప్రాజెక్టులు ఎప్పటికీ పూర్తి కావు. వంశధార ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్, ఒరిస్సాల మధ్య ఏడు దశాబ్దాలుగా నలుగుతోంది. హిరమండలం జలాశ యాన్నీ, కాలువలనీ వందల కోట్లు ఖర్చు చేసి నిర్మించుకున్నప్పటికీ వినియో గించుకోలేని దుస్థితి. ఆదివాసీ గ్రామాలున్న మూడువేల ఎకరాల భూమి ముంపునకు గురి అవుతుందంటూ ప్రాణహిత ప్రాజెక్టుకు మహారాష్ట్ర అడ్డుపెడు తూనే ఉంది. ప్రాణహిత ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ప్రస్తుత మహారాష్ట్ర ముఖ్య మంత్రి ఫడ్నవిస్ ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న రోజుల్లో ధర్నాలు చేశారు. అటు వంటి వ్యక్తిని ప్రాజెక్టు నిర్మాణానికి ఒప్పించడం విశే షం. తమ్మిడిహెట్టి ఎత్తు 148 మీటర్లకు తగ్గించడం వల్ల నష్టం మూడు టీఎంసీల నీరు మాత్రమేననీ, ఆ కొర వను 180 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న జలాశయంలో ఎక్కడైనా పూరించు కోవచ్చుననీ, మేడిగడ్డ నుంచి నీరు తీసుకోవచ్చునంటూ టి. హనుమంతరావు వెలిబుచ్చిన అభిప్రాయం సమంజసమే. మహారాష్ట్రతో పడిన పీటముడి విడిపో యినందుకు సంతోషించాలి. ఇప్పుడు మహారాష్ట్రకు తెలంగాణ ప్రజల ప్రయోజ నాలు తాకట్టు పెట్టారంటూ గొడవ చేస్తున్నవారు ఆల్మట్టి, బాబ్లీ బ్యారేజీలు నిర్మిస్తున్నప్పుడు ఏమిచేశారన్న ప్రశ్నకు సమాధానం చెప్పవలసి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాలు జలదృశ్యం ప్రదర్శన ప్రారంభిస్తూ కేసీఆర్ చెప్పిన అంశాలకు ఆంధ్రప్రదేశ్ చెబు తున్న అభ్యంతరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. తెలంగాణకు 954 టీఎంసీల గోదావరి నీరు, 299 టీఎంసీల కృష్ణ నీరూ, 75 టీఎంసీల వరద నీరూ కేటాయించారనీ, ఈ వివరాలు కేంద్ర మంత్రుల బృందానికి సమర్పిం చామనీ కేసీఆర్ వెల్లడించారు. తెలంగాణకు గోదావరి నీటి కేటాయింపు ఇంత వరకూ జరగలేదంటూ తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్కె జోషీ జనవరి 24న గోదావరి నది నిర్వాహక మండలికి సమర్పించిన పత్రం గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాధికారులు గుర్తు చేస్తున్నారు. గోదావరి జలాల కేటాయింపుల విషయంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య అంగీకారం కుద రాలి లేదా ట్రిబ్యునల్ నిర్ణయం తీసుకోవాలి. ఈ రెండూ జరగలేదు. శ్రీశైలం జలాశయం నుంచి 90 టీఎంసీల నీటిని పాలమూరు-రంగారెడ్డి ప్రాజె క్టుకు విని యోగించవచ్చునంటూ హైకోర్టు అనుమతించిందని ముఖ్యమంత్రి చెప్పడాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాధికారులు తప్పు పడుతున్నారు. కేసీఆర్ పనిలో పనిగా ఆంధ్రప్రదేశ్‌లో పట్టిసీమ ప్రాజెక్టు నిర్మించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అభినందించారు. గోదావరికి, కృష్ణలకు ఒకేసారి వరదలొస్తూ ఉంటాయి. అలాంటిది గోదావరి వరద నీటిని వరదలో ఉన్న కృష్ణానదికి తరలించే (జలాశయం లేని) ప్రాజెక్టుపైన రూ. 1,600 కోట్లు వృథా చేయడాన్ని కేసీఆర్ మెచ్చుకోవడం ఆశ్చర్యం. జలదృశ్యం ఒక అపూర్వమైన అనుభవం. భారీ ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పనుల స్థాయినీ, ఖర్చుల తబ్శీళ్లనూ, సాఫల్యవైఫల్యాలనూ ఆరు మాసాలకు ఒకసారి ఇంతే విపులంగా, గ్రాఫిక్స్, పట్టి కలు, చిత్రాల సహితంగా చట్టసభలలో సమర్పిస్తే పాలనా వ్యవస్థ చేస్తున్న కృషి గురించి సభ్యులకూ, టీవీలలో సభాకార్యక్రమాలు వీక్షించే సామాన్య ప్రజలకూ తేలికగా అర్థం అవుతుంది. ప్రసార మాధ్యమాలను సద్వినియోగం చేసుకొని పారదర్శకత పాటించడంలో, ప్రగతికి సంబంధించి ప్రజలకు తాజా సమాచారం అందించడంలో కొత్త పుంతలు తొక్కినట్టు అవుతుంది. రాజకీయ నాయకులకు కొత్త ఒరవడి సృష్టించినట్టు అవుతుంది. అవినీతికి అతీతంగా, ప్రజల ప్రయోజ నాలే పరమావధిగా, జవాబుదారీతనం ప్రదర్శిస్తూ పరిపాలించిన తొలి ముఖ్య మంత్రిగా చరిత్రలో నిలిచిపోయే సువర్ణావకాశం కేసీఆర్‌కు అందుబాటులో ఉన్నది. - కె.రామచంద్రమూర్తి సాక్షి, ఎడిటోరియల్ డైరెక్టర్ -
ప్రశ్నించే గొంతే బలమైన ప్రతిపక్షం!
తెలంగాణ రాష్ట్రంలో బలమైన ప్రశ్నించే గొంతు ఎవరిది కానుందని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రశ్నించే గొంతుక కోసం రాష్ట్ర ప్రజలు, విద్యావంతులు, తెలంగాణవాదులు ఆసక్తిగా గమనిస్తున్నారు. రోజు రోజుకు టీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా ఎదుగుతుండటం, ప్రతిపక్షాలు కూడా అదే స్థాయిలో బలహీనపడటంతో ఈ చర్చ తెలంగాణలో మరింత విస్తృ తంగా సాగుతోంది. స్వాతంత్య్రం వచ్చి ఐదేళ్లు గడిచిన తర్వాత 1952లో జరిగిన ప్రప్రథమ సాధారణ ఎన్నికల్లో మళ్లీ ప్రధాన మంత్రిగా నెహ్రూ ఎన్నికైనప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ప్రతిపక్షంగా చాలా బలహీనంగా ఉండేది. ప్రతిపక్షాలు బలహీ నంగా ఉంటే ప్రభుత్వాలు తప్పిదాలు చేస్తాయని, నాయకు లకు గర్వం తలకెక్కుతుందని అప్పట్లో ప్రధానమంత్రి నెహ్రూ వ్యాఖ్యానించారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అనివార్యంగా ఆత్మను కూడ పక్కనపెట్టి కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. అది వ్యక్తిగతంగా తనకు ఇష్టం లేక పోయినా, రాజకీయంగా అనివార్యమై ఆ పనులు చేసినట్లు నెహ్రూ అనేక పర్యాయాలు తన ఉపన్యాసాల్లో, రచనల్ల్లో పేర్కొన్నారు. బలమైన ప్రతిపక్షం లేనప్పుడు తనమీద తానే విమర్శనాత్మక వ్యాసాలను పత్రికల్లో కలం పేరుతో నెహ్రూ రాశారు. ప్రశ్నించే హక్కుతోనే న్యాయం పొందగలమని ఎన్నో సందర్భాల్లో నిరూపితమైంది. ఏ ప్రభుత్వానికైనా ప్రశ్నించే గొంతుక ఉంటేనే ప్రజాస్వామ్యం పదికాలాలపాటు బతుకు తుందని తరచుగా ప్రొఫెసర్ హరగోపాల్, జస్టిస్ సుదర్శన్ రెడ్డి, కె.రామచంద్రమూర్తి సైతం చెబుతుంటారు. ప్రజలం దరూ ప్రశ్నించకపోవచ్చు కానీ పౌర సమాజానికి ప్రాతినిథ్యం వహించే శక్తి కలిగిన వ్యక్తులు, సంస్థలు వారి ముందుకు రావాల్సిన చారిత్రాత్మక అవసరం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది. ప్రభుత్వం గుప్పిస్తున్న హామీలు అమోఘం అనీ, అవి ప్రజల జీవితాలను మౌలికంగానే మారుస్తాయని అనుకోవడంలో ఏమాత్రం తప్పులేదు. కానీ వాటి అమలుపైనే ఉత్కంఠ, ఆసక్తి నెలకొని ఉన్నాయి. వీటిని అధిగమిస్తారా.. అధిగమించారా అన్నది ప్రభుత్వ బాధ్యతే. ప్రశ్నించే గొంతు లేకపోవడంతో అధికార వికేంద్రీ కరణకు బదులు, కేంద్రీకరణకు దారితీస్తోంది. అయితే ప్రశ్నించే గొంతు అవసరమే కానీ ఆ గొంతు తన ఉనికి చాటుకునేందుకు కాకుండా రాజ్యాంగ విలువలకి, వ్యక్తి స్వేచ్ఛకు. ప్రజాస్వామ్యానికి సంకేతంగా పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. - జి. రాజు, సామాజిక కార్యకర్త, మహబూబ్‌నగర్ మొబైల్: 9000797618 -
గాంధీ, నెహ్రూ, అంబేడ్కర్‌లది ఏకాభ్రిపాయం
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, బీఆర్ అంబేడ్కర్లకు వేర్వేరు సైద్దాంతిక భావాలున్నా... దేశ పురోగతిపై మాత్రం ఏకాభిప్రాయంతో ఉండేవారని సాహిత్య అకాడెమీ అధ్యక్షుడు విశ్వనాథ్ తివారీ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన సెమినార్లో ప్రసంగిస్తూ... భావజాలాలపై చర్చించుకునేవారని, దేశాభివృద్ధి విషయంలో ఉమ్మడి లక్ష్యంతో సాగేవారని ఆయన గుర్తు చేశారు. -
'ఆ రోజు అంబేద్కర్‌తో నెహ్రూ ఏం చెప్పారంటే..'
అహ్మదాబాద్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అధికారాన్ని అస్సలు కోరుకోలేదని బిహార్ గవర్నర్ రామ్ నాథ్ కోవింద్ అన్నారు. హిందూ కోడ్ బిల్లులో మార్పులు చేసేందుకు నెహ్రూ కేబినెట్ అంగీకరించపోవడంతో ఆయన తన న్యాయశాఖమంత్రిత్వ బాధ్యతలకు రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారని చెప్పారు. 'కుటుంబ ఆస్తిలో హిందూ అమ్మాయిల హక్కులు ఇవ్వాలని మీరు చెప్పిన ఆలోచనను అమలు చేసేందుకు దేశం సిద్దంగా లేదని అంబేద్కర్‌తో జవహార్ లాల్ అన్నారు. ఆ సమయంలో అంబేద్కర్ స్పందిస్తూ మనం న్యాయశాఖ ద్వారా ఆ పని చేసి తీరాలి. ఎందుకంటే ఇప్పుడు భారత్ స్వతంత్ర దేశం. అలా చేసి ప్రజల్లో ఒక మంచి అవగాహన కల్పించడం మన బాధ్యత అని చెప్పారు. అయినా, నెహ్రూ వెనక్కి వెళ్లారు. అంబేద్కర్ రాజీనామా చేశారు. వ్యక్తుల చేతిలో నుంచి అధికారాన్ని తీసుకొని సమాజానికి అందించాలనేదే అంబేద్కర్ అసలైన లక్ష్యం' అని ఆయన చెప్పారు. -
నేతాజీ కుమార్తె సంచలన వ్యాఖ్యలు
-
నేతాజీ కుమార్తె సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: అజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు, జాతీయ నేత నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1945 ఆగస్ట్ 18న విమాన ప్రమాదంలో చనిపోయారనే విషయాన్ని నమ్ముతున్నట్లు ఆయన కుమార్తె అనితా బోస్ (73) ప్రకటించారు. స్వాతంత్ర్య పూర్వమే ప్రపంచవ్యాప్తంగా ఎంతో బలమైన నాయకుడిగా ఎదిగిన తన తండ్రి నేతాజీ భారత్ తిరిగొస్తే, నెహ్రూకు మంచి బలమైన ప్రత్యామ్నాయంగా మారి ఉండేవారని ఆమె వ్యాఖ్యానించారు. జపాన్‌లోని రెంకోజీ దేవాలయంలో ఉంచిన నేతాజీ అస్థికలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని అనితా బోస్ డిమాండ్ చేశారు. బోస్ 119వ జయంతి సందర్భంగా మీడియాతో తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ వ్యవహారంలో ప్రధాని ప్రయత్నాల పట్ల అనితా బోస్ హర్షం వ్యక్తం చేశారు. అయితే ఈ మిస్టరీకి ఇప్పటికైనా ముగింపు పడుతుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేశారు. తండ్రికి సంబంధించి ప్రత్యేక జ్ఞపకాలేవీ లేకపోయినప్పటికీ, ఆయన గొప్పదనం గురించి తల్లి ఎపుడూ చెబుతూ ఉండేవారన్నారు. భారతదేశం స్వాతంత్ర్యం కోసం సర్వం త్యాగం చేసిన వ్యక్తి అని అనితా బోస్ కొనియాడారు. కొన్ని సమస్యలపై నెహ్రుకు, తన తండ్రికి అభిప్రాయాలు ఒకేలా ఉన్నా, విబేధాలు కూడా ఉన్నాయన్నారు. ముఖ్యంగా మత ఘర్షణలు, మతాధిపత్యం లేని రాజకీయ వ్యవస్థను ఇద్దరూ అభిలాషించారని తెలిపారు. అలాగే పారిశ్రామికీకరణను ఇద్దరూ కోరుకున్నా, పాకిస్తాన్ విషయంలో మాత్రం చాలా తేడాలున్నాయని ఆమె చెప్పారు. బోస్ బతికుంటే రాజకీయాల్లో క్రీయాశీల పాత్ర పోషించేవారని, నెహ్రూకు ప్రత్యామ్నాయంగా కచ్చితంగా ఉండేవారని వ్యాఖ్యానించారు. పొరుగుదేశం పాకిస్తాన్‌తో సంబంధాలు మెరుగ్గా ఉండేలా ప్రయత్నించి, విజయం సాధించి వుండేవారని తెలిపారు. తన జీవితాన్ని దేశానికి అంకితం చేసిన ఒక వ్యక్తి, దేశానికి, రాజకీయాలకు, తన కుటుంబానికి సంబంధం లేకుండా ఒక బాబాగా ఎక్కడో పర్వతాల్లో బతికి ఉంటారనే విషయాన్ని ఎలా నమ్ముతామని అనితా బోస్ ప్రశ్నించారు. ఆయన బతికుంటే అందరికీ సంతోషమే కానీ, పర్వతాల్లో గుమనామి బాబా సంచరిస్తున్నారంటూ మతి లేని ప్రచారం చేయడం నేతాజీ ప్రతిష్టకే భంగకరమన్నారు. అలాగే దేశం కోసం జీవితాన్ని అర్పించిన వ్యక్తి మరణం వివాదాస్పద కావడం బాధ కలిగించిందన్నారు. దేశ ప్రజలు తన తండ్రిని ఆ వివాదం ద్వారా గుర్తు పట్టడం విచారించాల్సిన విషయమని అనితా బోస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో భారత్, జపాన్ ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలన్నారు. ప్రత్యేక నిపుణులతో అస్థికలకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించి నిజాలను నిగ్గు తేల్చాలని కోరారు. దశాబ్దాలుగా ఇంత అగౌరవమైన చర్చ జరుగుతున్నా జపాన్ ఈ నిజాలను బయట పెట్టకపోవడం ఆ దేశానికే అవమానకరమని చురకలంటించారు. కాగా నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించి భారత ప్రభుత్వం వద్ద ఉన్న కొన్ని రహస్య పత్రాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. బోస్ 119వ జయంతి సందర్భంగా ఈ నెల 23వ తేదీన (శనివారం) బహిర్గతం చేయనున్నారు. ఈ నేపథ్యంలో జరిగే కార్యక్రమానికి బోస్ కుటుంబ సభ్యులు, కొందరు నాయకులు హాజరవుతారని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి మహేశ్ శర్మ గురువారం తెలిపారు. ఈ నేపథ్యంలో నేతాజీ కుమార్తె అనిత వ్యక్తం చేసిన అభిప్రాయాలకు ప్రాధాన్యత ఏర్పడింది. మరి కొద్దిగంటల్లో ప్రభుత్వం వివరాలు బయటపెట్టనున్న తరుణంలో ఏడు దశాబ్దాలుగా ఉత్కంఠను రాజేసిన మిస్టరీకి ఇక తెరపడనుందా.. వేచి చూడాల్సిందే. -
గాంధీ, నెహ్రూ, ఇందిర గ్రేట్..!
సదస్సులో ఆఫ్రికా నేతల ప్రశంసలు న్యూఢిల్లీ: ఇండియా- ఆఫ్రికా ఫోరం సదస్సులో పలువురు ఆఫ్రికా అగ్ర దేశాల అధినేతలు జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధానులు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీలపై ప్రశంసల వర్షం కురిపించడం విశేషం. భారత్- ఆఫ్రికాల మధ్య సత్సంబంధాలకు ఆ ముగ్గురు నేతలు చేసిన కృషిని, ఆఫ్రికా, ఇండియాల మధ్య చరిత్రాత్మక సంబంధాలను తమ ప్రసంగాల్లో వారు గుర్తు చేశారు. ‘దాదాపు శతాబ్ద కాలంగా ఆఫ్రికా, భారత్‌లను ఐక్యంగా ఉంచుతున్న బంధాలను, ఆ విషయంలో ఇద్దరు దార్శనిక ప్రధానులైన జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీలు చూపిన చొరవను ఈ సందర్భంగా గుర్తుచేసుకోవడం అవసరం’ అని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమా పేర్కొన్నారు. 1955లో జరిగిన ప్రఖ్యాత బాండుంగ్ సదస్సులో, అనంతరం అలీనోద్యమంలో నెహ్రూ పోషించిన పాత్రను జుమా గొప్పగా ప్రశంసించారు. ఆఫ్రికా - ఇండియా డెవలప్మెంట్ కోఆపరేషన్ ఏర్పాటులో, ఆఫ్రికా దేశాల స్వాతంత్య్రోద్యమాల్లో ఇందిరాగాంధీ అందించిన సహకారం మరవలేనిదన్నారు. అహింసా విధానంలో వలసపాలనకు అంతం పలికే ఉద్యమానికి గాంధీ, నెహ్రూలు నేతృత్వం వహించారని జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే పేర్కొన్నారు. భారత జాతీయ కాంగ్రెస్‌ను గొప్ప పార్టీగా ముగాబే అభివర్ణించారు. ఆఫ్రికాలో వలస పాలనకు వ్యతిరేకంగా నెహ్రూ, తన తాత కలిసి పనిచేశారని మొరాకో రాజు మొహమ్మద్6 గుర్తు చేశారు. -
అర్ధరాత్రే ముహూర్తం ఎందుకు?!
మనదేశానికి 1947 ఆగస్టు 14వ తేదీ చివరి ఘడియల్లో, 15 తేదీ ప్రారంభ ఘడియల్లో స్వాతంత్య్రం వచ్చింది. అంటే ఆ అర్ధరాత్రి బ్రిటిష్ నుండి మనదేశానికి అధికార బదిలీ జరిగింది. మన రాజ్యాంగ అసెంబ్లీ మన పాలనాధికారాన్ని స్వీకరించింది. మరి ఇదంతా ఆ అర్ధరాత్రే ఎందుకు జరిగినట్లు? 14వ తేదీన కాని, 15వ తేదీ ఉదయం కాని ఎందుకు జరగన ట్లు అనే ప్రశ్నలు సహజంగానే తలెత్తుతాయి. ఇలా జరగటం వెనుక చాలా ఆసక్తికరమైన వ్యవహారం చోటుచేసుకుంది. 1947 ఆగస్టు 15న భారతీయులకు అధికార బదిలీ జరుగుతుందని బ్రిటిష్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అయితే భారతీయులకు అందునా హిందువులకు విశ్వాసాలు, నమ్మకాలు ఎక్కువ. గ్రహాలస్థితిగతులు మానవజీవితంపై ప్రభావం చూపుతాయనే బలమైన విశ్వాసం మరీ ఎక్కువ. అందుకే ప్రతి శుభకార్యానికి ముందేకాక కొన్నింటి ప్రారంభాలకు, రాకపోకలకు కూడా శుభఘడియల కోసం తిథి, నక్షత్రాలు చూస్తుంటారు. ఇలాంటి నమ్మకాలున్న ఢిల్లీలోని ఆనాటి కొందరు జాతీయ నాయకులకు ఆగస్టు 15 మంచిదేనా అని తెలుసుకోవాలనిపించింది. వెంటనే అక్కడి పండితులను సంప్రదించారు. ఆగస్టు 15 శుక్రవారం చతుర్ధశి. పైగా రాత్రి ఏడున్నర గంటల తరువాత అమావాస్య కనుక ఆ రోజు మంచిది కాదని పండితులు స్పష్టం చేశారు. 14వ తేదీ ఎంతో శుభదినమని తెలిపారు. ఆ తరువాత 17వ తేదీ మంచిదన్నారు. దీంతో ఈ సమస్య నుండి ఎలా బయటపడాలో ఆ ప్రముఖులకు అంతుపట్టలేదు. పోనీ 14వ తేదీనే అధికార మార్పిడి జరిపిద్దామా అంటే ఆ రోజు లార్డ్ మౌంట్‌బాటన్ కరాచీలో పాకిస్తాన్‌కు అధికార మార్పిడి కార్యక్రమంలో ఉంటారు. ఆ రోజు రాత్రికి కాని ఆయన ఢిల్లీకి బయలుదేరరు. పైగా ఆగస్టు 15న భారత్‌కు స్వాతంత్య్రమని బ్రిటిష్ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రకటించింది. ఈ సంకట స్థితిపై తర్జనభర్జనలు జరుగుతున్న సమయంలో ప్రముఖ చరిత్రకారుడు, మలయాళ పండితుడు, హిందూమతాచారాలు, సాంప్రదాయాలపై విస్తృతమైన, లోతైన పరిజ్ఞానం కలిగిన కె.ఎం.పణిక్కర్ ఒక పరిష్కారం సూచించారు. పణిక్కర్ పరిష్కారం ప్రకారం రాజ్యాంగ సభ 14వ తేదీ రాత్రి 11 గంటలకు సమావేశమవుతుంది. సరిగ్గా 12 గంటలు కొట్టగానే బ్రిటిష్ ప్రభుత్వం నుండి అధికారాన్ని స్వీకరిస్తుంది. దీంతో బ్రిటిష్ ప్రభుత్వం ముందుగానే ప్రకటించిన ట్లు ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్య్ర ప్రదానం చేసినట్లవుతుంది. అధికార మార్పిడి జరిగే ఆ ఘడియలు గ్రహస్థితులను సంతృప్తి కలిగించేవి, బ్రిటిష్ ప్రభుత్వానికి తేదీలను మార్చాల్సిన అవసరం లేనివి కావటంతో ఆ పరిష్కారం అందరికి ఆమోదయోగ్యమైంది. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విశేషమేమిటంటే శుభ దినాన ఏర్పడిన పాకిస్తాన్ ఆ తరువాత 20 ఏళ్లకు రెండుదేశాలుగా విడిపోవడం. రాజ్యాంగ సభలో చర్చించకుండానే మౌంట్‌బాటన్ నియామకం! అంతకుముందు 1947 జులై 31వ తేదీన రాజ్యాంగ నిర్ణయ సభలో 1947 ఆగష్టు 14వ తేదీ అర్ధరాత్రి జరగనున్న కార్యక్రమంపై సభాధ్యక్షుడు డాక్టర్ రాజేంద్రప్రసాద్ ఒక ప్రకటన చేశారు. ఆ రాత్రి 12గంటల సమయానికి ముందు సభానాయకుడు జవహర్లాల్ నెహ్రూ వైస్రాయ్ భవనానికి వెళ్లి భారత గవర్నర్ జనరల్‌గా లార్డ్ మౌంట్‌బాటన్ నియామక సిఫారసును తెలియజేసి ఆమోదించవలసిందిగా లార్డ్ మౌంట్‌బాటన్‌ను కోరతారని ఆ ప్రకటనలో తెలియజేశారు. ఆ తరువాత కొద్ది క్షణాలకు మహావీర్ త్యాగి అనే సభ్యుడు లేచి మౌంట్‌బాటన్‌కు గవర్నర్ హోదా గురించి ఈ సభ ఏనాడూ చర్చించలేదని, ఆయన భారత గవర్నర్ జనరల్ కావడాన్ని ఏనాడూ సభ అంగీకరించడం కానీ, ఆ మేరకు సభ తీర్మానం ఆమోదించడం కానీ చేయనందున ఆయనను గవర్నర్ జనరల్‌గా ఈ సభ ఆహ్వానించాలని కోరడం నుండి సభను మినహాయించాలని కోరారు. అందుకు ఈ విషయాన్ని ఒక తీర్మాన రూపంలో సభ ముందుంచుతానని సభాధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ తెలుపగా చాలామంది సభ్యులు లేచి వద్దు, వద్దంటూ ఆ విషయం అధ్యక్షుని నిర్ణయానుసారమే జరగాలని కోరారు. ఆ విధంగా రాజ్యాంగ నిర్ణయసభలో చర్చ, అంగీకారం, తీర్మానం లేకుండానే భారత గవర్నర్ జనర ల్గా లార్డ్ మౌంట్‌బాటన్ పదవీ స్వీకారం చేశారు. అధికార బదిలీ జరిగిన తీరు ఇక 1947 ఆగష్టు 14 అర్ధరాత్రి బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం నుండి భారత్ అధికార బదిలీలు జరిగిన కార్యక్రమ తీరు ఇలా ఉంది. ఆ రాత్రి 11 గంటలకు రాజ్యాంగ నిర్ణయ సభ సమావేశం ప్రారంభమయింది. సభాధ్యక్షుడు బాబూ రాజేంద్రప్రసాద్ ప్రసంగించారు. ఆ తరువాత అర్ధరాత్రి సరిగ్గా 12 గంటలు కొట్టగానే అధికార బదిలీ జరిగినట్లుగా సభ్యులంతా చేయవలసిన ప్రతిజ్ఞాపాఠంపై సభా నాయకుడు జవహర్లాల్ నెహ్రూ తీర్మానం ప్రతిపాదించారు. దానిని సభాధ్యక్షుడు ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది. మరికొన్ని క్ష ణాలలో 12గంటలు కొట్టగానే సభాధ్యక్షునితో సహా సభ్యులంతా నిల్చుని అధ్యక్షుడు ప్రతిజ్ఞాపాఠంలోని ఒక్కో వాక్యాన్ని చదవుతుండగా సభ్యులు దానిని హిందీ, ఇంగ్లీషులలో పునరుచ్ఛాటన చేశారు. ఆ తరువాత భారత పరిపాలనాధికారాన్ని రాజ్యాంగ నిర్ణయ సభ స్వీకరించింది. అలాగే ఆగష్టు 15నుండి భారత గవర్నర్ జనరల్‌గా లార్డ్ మౌంట్‌బాటన్ ఉండాలన్న సిఫారసును సభ ఆమోదించింది. ఈ విషయాన్ని మౌంట్‌బాటన్‌కు సభానాయకుడు నెహ్రూ తెలియపరుస్తారని సభాధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ ప్రకటించారు. మరుక్షణం సభకు భారత జాతీయ పతాకాన్ని హన్స్మెహతా సమర్పించారు. అలాగే ఈ అధికార బదిలీని పురస్కరించుకుని భారత్‌లోని చైనా రాయబారి డాక్టర్ చిన్ ల్యున్ లో రచించిన గేయాన్ని కృతజ్ఞతాపూర్వకంగా సభ ఆమోదించింది. ఆ తరువాత ‘సారే జహాసే అఛ్ఛా హిందుస్తాన్ హమారా’ గేయంలోని మొదటి కొన్ని పంక్తులను, జనగణమనలోని ప్రారంభ వాక్యాలను సుచేతాకృపలానీ ఆలాపించారు. ఆ వెంటనే సభ 15వ తేదీ ఉదయం 10గంటలకు వాయిదా పడింది. ఇదీ ఆ రాత్రి మనకు అధికార బదిలీ జరిగిన తీరు. - కె.ఎస్.ఎన్. ప్రసాద్ అర్ధరాత్రి అధికారం... ఉదయం పతాకావిష్కరణ 15వ తేదీ ఉదయం 10గంటలకు గవర్నర్ జనరల్ మౌంట్‌బాటన్ రాజ్యాంగ నిర్ణయ సభా ప్రవేశం చేశారు. సమావేశం ప్రారంభమవగానే భారత స్వాతంత్య్రం సందర్భంగా వివిధ దేశాధిపతులు, ప్రభుత్వాధినేతల నుండి శుభ సందేశాలు వినిపించారు. గవర్నర్ జనరల్, సభాధ్యక్షుల ప్రసంగాలు పూర్తయ్యాక సభా భవనం (నేటి పార్లమెంట్ భవనం)పై భారత జాతీయ పతాక ఆవిష్కరణకు గవర్నర్ జనరల్ మౌంట్‌బాటన్ సంకేతమిచ్చారు. మరుక్షణమే తుపాకీలు పేల్చిన శబ్దం వినిపించింది. ఆ వెంటనే పార్లమెంట్ భవనంపై జాతీయ పతాక ఆవిష్కరణ జరిగింది. సభ మరుసటి రోజు ఉదయం 10 గంటలకు వాయిదా పడింది. ఇదీ మన స్వతంత్ర భారత పాలనాధికారం మొదలైన తీరు. ఆదిలోనే హంసపాదు ఈ సందర్భంగా ఒక ఆశ్చర్యకరమైన సంఘటన గుర్తు చేసుకోవాల్సి ఉంది. 14వ తేదీ అర్ధరాత్రి వైస్రాయ్ భవనానికి నెహ్రూ వె ళ్లి భారత గవర్నర్ జనరల్‌గా నియామక సిఫారసును మౌంట్‌బాటన్‌కు తెలియజేశారు. ఆ తరువాత తన మంత్రిమండలి సభ్యుల పేర్లున్న జాబితా గల ఒక కవర్‌ను ఆయనకు నెహ్రూ అందజేశారు. సందర్శకులంతా వెళ్లాక మౌంట్‌బాటన్ ఆ కవర్‌ను విప్పగా అందులో ఏమీ లేదు! వట్టి ఖాళీ కవర్ దర్శనమిచ్చి ఆయనను ఆశ్చర్యపరిచింది. ఆ కవర్‌ను సిద్ధం చేసినవారెవరో అందులో జాబితా పత్రాన్ని పెట్టడం మర్చిపోయారు. ఇదొక తమాషా సంఘటనలా అనిపించినా ఆదిలోనే హంసపాదు అన్న చందంగా నెహ్రూ గారి హయాం ప్రారంభమైంది. -
నేతాజీ ఉంటే మన చరిత్ర మరోలా...
-
నేతాజీ ఉంటే మన చరిత్ర మరోలా...
బోస్ మరణించినట్టు రూఢిగా తెలిసి ఉంటే నెహ్రూ ఆయన కుటుంబంపై నిఘా ఎందుకు పెట్టినట్టు? బోస్ నాడు బతికే ఉంటే, ఆయనను ఎక్కడకు తీసుకెళ్లారు? ఎక్కడ మరణించాడు? నిజం...మిత్రదేశాలతో సంబంధాలను దెబ్బతీస్తుందనే అధికారిక వివరణ తప్ప మరేమీ మనకు తెలియదు. - ఎం.జె. అక్బర్, సీనియర్ సంపాదకులు కాలం ఆనాడు బోస్ పక్షాన ఉంది. ఆయనే ఉండి ఉంటే జాతీయస్థాయి ప్రతిపక్ష కూటమికి అయస్కాంతమై నిలిచేవాడు. 1962 సార్వత్రిక ఎన్నికల నాటికి కాంగ్రెస్‌ను తుడిచిపెట్టేసేవాడు. అదే జరిగితే భారత్‌పై చైనా దాడి చేసి ఉండేదా? చెప్పలేం. స్వతంత్ర భారత చరిత్ర మరోవిధంగా ఉండేదనేది మాత్రం నిస్సందేహం. ఇంటెలిజెన్స్ సంస్థలుగా పిలిచే గూఢచార సంస్థలు మహా ఇంటెలిజెంటే కాదు, నిగూఢ మైనవి కూడా. రహస్య సమాచారం పేరిట ప్రభుత్వాలు ప్రధాన వ్యక్తి లేదా సమస్య మరణించేంత వరకు మూడు లేదా నాలు గు దశాబ్దాలపాటూ ఫైళ్లను దాచేస్తాయి. అతి కొన్ని సందర్భాల్లో అలా దాచేసిన పత్రాలు బెడిసికొడతాయి. మృతులను మేల్కొల్పుతాయి. అనుభవిస్తున్న అధికారం మూల్యాన్ని చెల్లించి మరీ సంపాదించినదని గుర్తు చేయడానికి మేక్బెత్ విందులో ప్రత్యక్షమైన బాంకో దెయ్యంలా సుభాష్ చంద్రబోస్ హఠాత్తుగా ఇప్పుడు తెరపైకి వచ్చాడు. భారత జాతీయ సైన్యపు (ఐఎన్ఏ) సుప్రసిద్ధ నేత బోస్ పయనిస్తున్న విమానం 1945 ఆగస్టు 18న తైపీలో కూలిపోయిందన్న వార్త యుద్ధకాలపు మబ్బు తెరల మధ్య నుంచి వెలువడింది. అప్పటి నుంచీ ఆయన ఏమయ్యారనే విషయంపై... ‘మృతి’, ‘అదృశ్యం’ అనే రెండు కథనాలు వినిపిస్తూనే ఉన్నాయి. అందులో మొద టిది అధికార వర్గాలు కోరుకున్నది కాగా, రెండోది ప్రజల ఆకాంక్ష. ఒక ఘటనపై వ్యాఖ్యానంలో ఇలాంటి నాటకీ యమైన సంఘర్షణ ఎందుకు? అది అర్థం కావాలంటే 1945 నాటి పరిస్థితులను అర్థం చేసుకోవాలి. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ లొంగిపోయిన తర్వాత సరిగ్గా మూడు రోజులకు బోస్ విమానం కూలి పోయింది. అమెరికా, సోవియట్ యూనియన్, బ్రిట న్లతో కూడిన యునెటైడ్ నేషన్స్ జర్మనీ, జపాన్, ఇటలీ లతో కూడిన యాక్సిస్ శక్తులపై విజయాన్ని లాంఛ నంగా ఇంకా ప్రకటించుకోవాల్సి ఉంది. భారత్ కూడా విజయం సాధించిన యూఎన్ కూటమి భాగస్వామే. కానీ భారత ప్రజలను సంప్రదిం చలేదని గాంధీ బ్రిటన్ సాగిస్తున్న యుద్ధానికి కాంగ్రెస్ మద్దతును ఉపసంహరించారు. కానీ చట్టబద్ధ భారత ప్రభుత్వమైన బ్రిటిష్ రాజ్ నేతృత్వంలోని భారత సేనలు ఆ యుద్ధంలో పాల్గొన్నాయి. అవి ఆఫ్రికాలో జర్మనీకి వ్యతి రేకంగా, ఆగ్నేయ ఆసియాలో జపాన్‌కు వ్యతిరేకంగా పోరాడాయి. అధికారికంగా కాంగ్రెస్ వైఖరి యుద్ధానికి వ్యతిరేకం. అయినా అది బ్రిటిష్ యుద్ధ ప్రయత్నాలను దెబ్బతీయడం, తిరుగుబాటు లేవదీయ డం చేయలేదు. 1939లో గాంధీతో, కాంగ్రెస్‌తో తెగదెం పులు చేసుకున్న బోస్ ఆ పని చేశాడు. నాటి భారతీయుల, ప్రత్యేకించి యువతరం ఆలోచ నలను బోస్ గొప్పగా ప్రభావితం చేశాడు. అసాధారణ మైన రీతిలో 1941లో ఆయన కలకత్తా నుంచి, బెంగాల్ నుంచి తప్పించుకుని అఫ్ఘానిస్థాన్, మధ్య ఆసియాల మీదుగా బెర్లిన్‌కు చేరారు. అక్కడ బోస్ ఆక్సిస్ శక్తుల అధినాయకులతో సమావేశమయ్యారు. జలాంతర్గామి లో రహస్యంగా జపాన్‌కు పయనించి, అక్కడ బందీలు గా ఉన్న భారత సైనిక పటాలాలను కనీవినీ ఎరుగని రీతిలో సంఘటితం చేసి భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేశారు. 1857 నాటి ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రా మం పీడకలలు ఇంకా వెన్నాడుతున్న బ్రిటిష్ పాలకు లకు ఆ తదుపరి ఈ ‘తిరుగుబాటు’ కంటే ఎక్కువగా ఆగ్రహం కలగజేసింది మరేమీ లేదు. భారత్‌లో బ్రిటిష్ పాలన సైన్యం విధేయతపైనే ఆధారపడి ఉంది. ఆ విధేయతకు తూట్లు పడితే బ్రిటిష్ సామ్రాజ్యమే విచ్ఛిన్న మైపోతుందని వారికి తెలుసు. యుద్ధం తర్వాత జరిగిన బొంబాయి నావికాదళం తిరుగుబాటులో బోస్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. నావికా తిరుగుబాటు భారతదేశంలో బ్రిటిష్ వలస పాలన అంతానికి నాంది పలికింది. యుద్ధంలో ఐఎన్ఏ ఓడిపోయి ఉండొచ్చు. కానీ అది ఒక సువర్ణాధ్యాయంగా నమోదైన మరింత పెద్ద విజయాన్ని సాధించింది. బోస్ వంటి యుద్ధ వీరుడ్ని శతాబ్ద కాలంగా నాటి భారతదేశం చూసి ఎరుగదు. 1946లో ఐఎన్ఏ సైన్యాన్ని రాజద్రోహ ఆరోపణపై విచారించినప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడిక క్కడ ప్రజా తిరుగుబాట్లు చెలరేగాయి. భారతీయుల దృష్టిలో వారు ద్రోహులు కారు, అమరజీవులు. నాడు బ్రిటిష్‌వారు దేశాన్ని విడిచివెళ్లడానికి సిద్ధమే. కానీ వారికి ఇక్కడ అమలు చేయాల్సిన పథకాలున్నా యి. బోస్ దేశంలోలేకపోవడమనే సాధారణాంశం ప్రాతి పదికగా ఆసక్తికరమైన రాజకీయ కుమ్మక్కు జరిగింది. బోస్ బ్రిటిష్ వారికి బద్ధ శత్రువు. కాంగ్రెస్ మచ్చిక చేయడానికి వీలైనదిగా ఉండేది. కానీ బోస్ అలాం టివాడు కాడు. ఆయన భారత జాతీయ సైన్యంలో హిందువులు, ముస్లింలు, సిక్కులను ఉత్తేజకరమైన రీతిలో ఐక్యం చేసి, వారికి నేతృత్వం వహించాడు. ఐఎన్ఏ బోస్ కలలుకన్న భారతావనికి నమూనా అనేది స్పష్టమే. కాబట్టి ఆయన ముస్లిం లీగ్‌కు అక్కర్లేదు. బోస్ నాడు భారత్‌లో ఉండి ఉంటే దేశ విభజనను తీవ్రంగా వ్యతిరేకించేవాడు. బోస్ తమ సంస్థలోకి తిరిగి రావడం కాంగ్రెస్‌కు ఇష్టంలేదనే ది స్పష్టమే. ఎందుకంటే ఆయనే వస్తే వారు నాయకునిగా కోరుకుంటున్న జవహర్లాల్ నెహ్రూకు పోటీదారు అవుతారు. బోస్ చనిపోయాడని రూఢియైతే బోస్ కుటుం బంపై నెహ్రూ నిఘాను ఎందుకు కొనసాగించారు? 1957లో జపాన్ పర్యటనకు వెళ్లినప్పుడు నెహ్రూ ఎందుకు అంతగా గాభరా పడ్డారు? ఆయన గాబరా పడ్డట్టు ఆధార పత్రాలు ఉన్నాయి. బోస్ బతికే ఉంటే, ఆయనను ఎక్కడకు తీసుకె ళ్లారు? ఆయన ఎక్కడ మరణించాడు? నిజమేమిటో మనకు తెలియదు. ఆ నిజం, మిత్రదేశాలతో సంబం ధాలను దెబ్బతీస్తుందనే అధికారిక వివరణ తప్ప మరేమీ మనకు తెలియదు. ఆ మిత్ర దేశాల్లో బ్రిటన్ ఒకటనేది తథ్యం. ఎందుకంటే బోస్‌కు వ్యతిరేకంగా మన ఇంటెలిజెన్స్ బ్యూరో ఆ దేశ గూఢచార సంస్థతో చేయి కలిపింది. స్టాలిన్ నేతృత్వంలోని సోవియట్ రష్యా సంబం ధాలు దెబ్బతింటాయన్న ఆ రెండో మిత్ర దేశమనే గుసగుస కూడా ఉంది. 1945లో అది బ్రిటన్‌కు మిత్ర దేశం. బోస్ పాశ్చాత్తాపమెరుగని ఫాసిస్టని స్టాలిన్ ప్రచారం చేసినట్టనిపిస్తుంది. ఏదేమైనా రహస్య ఫైళ్లు బయటపడేవరకు ఆ విషయం మనం ఇదమిత్థంగా తేల్చి చెప్పలేం. రాజకీయ కలన గణితం అంత సరళమైందేమీ కాదు. నెహ్రూ బోస్కంటే ఎనిమిదేళ్లు చిన్నవాడు. కాలం ఆయన పక్షాన ఉంది. ఆయన లేదా ఆయన పార్టీ 1952లో బెంగాల్, ఒరిస్సాలలో అధికారాన్ని గెలుచు కునేది. బోస్, జాతీయస్థాయి ప్రతిపక్ష కూటమి ఏర్పా టుకు అయస్కాంతమై నిలిచేవాడు. 1957 నాటికి కాం గ్రెస్‌ను గట్టి దెబ్బ తీసి ఉండేవాడు. 1962 సార్వత్రిక ఎన్ని కల నాటికి దాన్ని తుడిచిపెట్టేసేవాడు. అదే జరిగితే భారత్‌పై చైనా దాడి చేసి ఉండేదా? చెప్పలేం. స్వతంత్ర భారత చరిత్ర మరోవిధంగా ఉండేదనేది మాత్రం నిస్సందేహం. -
నెహ్రూ విధానాలకు తూట్లు: కాంగ్రెస్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రణాళికా సంఘం పేరును నీతి ఆయోగ్‌గా మార్చడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. దీని వెనుక నెహ్రూ, కాంగ్రెస్ వ్యతిరేక విధానమే కనిపిస్తోందని ఆ పార్టీ పేర్కొంది. నిజంగా సంస్కరణలు తీసుకురావాలన్న ఉద్దేశంతో ప్రణాళికా సంఘం పేరును యోజనా ఆయోగ్ నుంచి నీతి ఆయోగ్‌గా మార్చితే తమకు అభ్యంతరం లేదని, అయితే ప్రభుత్వ ఉద్దేశం వేరుగా ఉందని కాంగ్రెస్ ప్రతినిధి అభిషేక్ సింఘ్వి గురువారం ట్వీటర్లో పేర్కొన్నారు. మరో కాంగ్రెస్ నేత మనీశ్ తివారీ కూడా ఈ నిర్ణయంపై మండిపడ్డారు. నెహ్రూ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఈ చర్యకు పాల్పడిందని ఆయన విమర్శించారు. 1950లో ఏర్పాటైన ప్రణాళికా సంఘం పేరు మార్చడాన్ని ఇతర విపక్షాలు కూడా తప్పుబట్టాయి. ప్రభుత్వ నిర్ణయంపై సీపీఎం నాయకుడు సీతారాం ఏచూరి తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. దీనివల్ల రాష్ట్రాలపై వివక్ష చూపే అవకాశం ఉంటుందని, అలాగే కార్పొరేట్ సంస్థలకు మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ప్రణాళికా సంఘాన్ని మార్చి కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయడం వల్ల ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతుందని సీపీఐ సీనియర్ నేత గురుదాస్ దాస్‌గుప్తా అభిప్రాయపడ్డారు. -
ఆదేశాల్లోపదనిసలు..!
నాగార్జునసాగర్ డ్యామ్ నిర్మాణ పనులను పరిశీలించడం ప్రధానమంత్రి నెహ్రూకు ఎంతో ఇష్టం అని చెప్పుకున్నాం కదా. కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఒకసారి నెహ్రూ డ్యామ్ చూడడానికి వచ్చారు. ‘కండలను కరగదీస్తూ బండలను విసురుతున్న’ శ్రామికులను పారవశ్యంగా చూస్తున్నారు. ‘మీ దినసరి కూలీ ఎంత?’ అని అడిగారు. ‘ముప్పావలా’ అని చెప్పారు. ‘మంచి మొత్తమే’ అన్నారట బ్రహ్మానందరెడ్డి. ఆ మాటకు నొచ్చుకున్న శ్రామికులు ముఖ్యమంత్రి మీద కలబడ్డంత పని చేశారట. రోజు కూలీని రూపాయి పావలా చేయమని నెహ్రూ ఆదేశించడంతో కార్మికులు ‘బ్రహ్మానంద’పడ్డారట! అప్పట్లో పాలకుల తీరు ఇప్పుడు హాస్యంగా అన్పించడం సహజం. ఇప్పుడు సాధారణంగా భావిస్తోన్న అంశాలు భవిష్యత్తులో నవ్వు తెప్పిస్తాయేమో! ఈ నేపథ్యంలో నిజాంల హయాంలో కొన్ని ఆదేశాలను గుర్తు చేసుకుందాం! తప్పు చేసిన మేలు! నిజాం హయాంలో కూడా ఉపాధి కోరుకునేవారి పేర్లను నమోదు చేసుకునే విధానం ఉండేది. అలా నమోదు చేసుకున్న వారు రేపటి ఉద్యోగాలకు ‘అభ్యర్థులు’! వీళ్లకు పని చెప్పే వారు. జీతం గీతం ఉండేది కాదు. ఉద్యోగం ఖాళీ కాగానే ఇచ్చేవారు. అభ్యర్థుల్లో ఒకరు రాసిన ‘నోట్ ఫైల్’ అపార్థానికి దారితీసేదిగా తప్పుల తడకగా ఉండడాన్ని మొదటి సాలార్జంగ్ గమనించారు. సదరు ‘రచయిత’కు పది రూపాయల జరిమానా విధిస్తూ, జీతంలోంచి మినహాయించుకోవాలని ‘నోట్ ఫైల్’పై ఆదేశించారు. ‘అభ్యర్థి’కి జీతభత్యాలు లేనందువలన జీతంలో మినహాయించుకోలేమని సాలార్‌జంగ్‌కు తిరుగు టపాలో ఆ తప్పుల తడక చేరింది! ‘అయితే వాడిని ఏదో ఒక ఉద్యోగంలో నియమించి జరిమానా వసూలు చేయండి’ అని మరొక ఆదేశం జారీ అయింది! కాదనేందుకు నిజాం ఎవరు?! ఫలక్‌నుమా ప్యాలెస్‌లో నివసించిన ఆరవ నిజాం మహబూబ్ అలీఖాన్ మహా ఉదారుడు! వృద్ధుడైన ఆయన వ్యక్తిగత సేవకుడు తన అనారోగ్యాన్ని, ఈతి బాధలను ప్రభువుకు చెప్పుకున్నాడు. ఇతడికి నెలకు ఎనిమిది రూపాయల పెన్షన్‌ను జీవితాంతం ఇవ్వండి అని ఆదేశాలు ఇచ్చారు. ఆ మేరకు ఉత్తర్వు సిద్ధమైంది. నిజాం సంతకం చేయడమే తరువాయి. ఎనిమిది అనే సంఖ్య దగ్గర లేఖకుని పొరపాటు వలన సున్నా చేరి ‘80’గా మారింది. క్లర్క్ క్షమాపణలు చెప్పాడు. మరో కాపీ తెస్తానన్నాడు. ‘విశ్వాసుడైన ఆ సేవకునికి రూ.80 ఇవ్వాలని రాసిపెట్టి ఉంటే కాదనడానికి మనమెవ్వరం?’ అన్నాడు నిజాం! ఆ సేవకుడు జీవితాంతం రాజభోగాలు అనుభవించాడు! పోలీసు కమిషనర్‌కు ఫైన్! ఆరవ నిజాం దగ్గర నవాబ్ సహాబ్ జంగ్ హోం మంత్రి. అక్బర్జంగ్ సిటీ పోలీస్ కమిషనర్. ఏదో విషయమై సిటీ పోలీస్ కమిషనర్ హోం మంత్రితో వాదులాడాడు. నీ పని ఇలా ఉందా అనుకున్నాడేమో ఒక రూపాయి జరిమానా విధించాడు. అక్బర్జంగ్ సహజంగానే అప్సెట్ అయ్యాడు. తనకు విధించిన శిక్ష గురించి నిజాంకు మొరపెట్టుకున్నాడు. మరుసటి రోజు సహాబ్ జంగ్ నిజాం సందర్శనకు వె ళ్లినపుడు ‘కమిషనర్ నా విశ్వాసపాత్రుడు, హితైషుడు. అటువంటి వ్యక్తికి జరిమానా విధిస్తారా’ అన్నాడు. అయ్యో అలాగా అని నిజాంకు క్షమాపణ చెప్పాడు సహాబ్ జంగ్. తన నిర్ణయాన్ని పునఃపరిశీలిస్తాన ని అన్నాడు. ఆఫీసుకు వచ్చి సంబంధిత ఫైల్ తెప్పించుకున్నాడు. జరిమానాలో సగం చెల్లింపు జరిగింది. సంబంధిత వ్యక్తిని అర్ధరూపాయి చెల్లించనివ్వండి’ అని రాశారు! ‘బల్లె’ ఇంక్రిమెంట్! ఆరవ నిజాం మహబూబ్ అలీఖాన్ (1866-1911) ఉదారుడు. విద్యాధికుడు. వేటగాడు. అశ్వికుడు. ఆయన స్థాపించిన ‘నిజాం స్కాలర్షిప్ ట్రస్ట్’ సహాయంతో కవికోకిల సరోజినీ నాయుడు ఇంగ్లండ్‌లో చదువుకున్నారు. అదలా ఉంచితే.. ఆరవ నిజాం సైన్యాధికారి నవాబ్ అఫ్సర్ జంగ్. ఈయన కింద ‘రిసాల్దార్ మేజర్’గా రెహమాన్‌ఖాన్ అనే వ్యక్తి బల్లెపు పోటుగాళ్ల మూడవ దళంలో పనిచేసేవాడు. పురానీ హవేలీలో నివసించే ఆరవ నిజాంను సందర్శించేందుకు వెళ్లే అఫ్సర్జంగ్కు అశ్వికుడైన రెహమాన్‌ఖాన్ పైలట్! ఓ పర్యాయం నిజాం నివసించే ప్యాలెస్ ప్రాంగణంలో రెహమాన్‌ఖాన్ గుర్రంపై స్వారీచేస్తున్నాడు, వాయువేగంగా! గుర్రపు వేగానికి పొడవాటి తెల్లటి గడ్డం గాలిలో నైరూప్య చిత్రాలను చూపుతోంది! ‘సెలయేళ్లుగా ప్రవహిస్తోన్న తెల్లటి గడ్డా’న్ని నిజాం తన భవంతి నుంచి చూసి అబ్బురపడ్డాడు! రెహమాన్‌ఖాన్ గడ్డం పోషణకు ఆజీవన పర్యంతం నెలకు పదిరూపాయల ఇంక్రిమెంట్‌ను మంజూరు చేస్తూ ఉత్తర్వు జారీ చేశారు! రెహమాన్‌ఖాన్ తన గడ్డాన్ని ప్రేమగా నిమురుకున్నాడు, చివరి శ్వాస వరకూ! ప్రెజెంటేషన్: పున్నా కృష్ణమూర్తి -
బుల్లి చాచాజీ
ఇక్కడున్న బోసి నవ్వుల చాచాజీని చూశారా? ఎంత ముద్దొస్తున్నాడో కదూ. ఈ బుడ్డోడి వయసులో నెహ్రూజీ కూడా ఇలాగే ఉండేవారేమో! బాలల దినోత్సవ శోభంతా వీడి బోసి నవ్వులోనే కనిపిస్తోంది. ఇంతకీ ముద్దులమూట ఎవరనుకున్నారు? మన అల్లు అర్జున్ గారాల పట్టి అయాన్. చిల్ట్రన్స్ డే సందర్భంగా కొడుకుకి ఇలా చాచాజీ గెటప్ వేసి, ఆ స్టిల్‌ని తన ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు బన్నీ. ఇప్పట్నుంచే కొడుక్కి ఇలా గెటప్పుల్ని అలవాటు చేస్తున్నాడన్నమాట. అంటే... భవిష్యత్తులో ఈ చిన్నోడు ఇంకెన్ని గెటప్పుల్లో దర్శనమిస్తాడో చూడాలి. -
పటేల్ గిరీ!... పావురంపై గురి?
సాంఘిక శాస్త్రం నెహ్రూ 125వ జయంతి పేరుతో కాంగ్రెస్ పార్టీ ఒక అంతర్జాతీయ సెమినార్‌ను ప్రకటించింది. ఈ సెమినార్లో పాల్గొనడానికి దేశ, విదేశాలలోని ఎందరెందరో ప్రముఖులకు ఆహ్వానాలందాయి. కానీ, ఈ దేశ ప్రధానమంత్రిని మాత్రం పిలవలేదు. ఎందుకంటే, ప్రధానమంత్రి భారతీయ జనతా పార్టీ వ్యక్తి. నెహ్రూను కాంగ్రెస్ పార్టీ ఆస్తిగా భావిస్తున్నారు, కనుక పిలవలేదు. ఒక ప్రపంచ స్థాయి నాయకునికి, విశ్వమానవ ప్రేమికునికి ఇంత సంకుచితంగా నివాళి ఘటిస్తారా? ‘‘పటేల్.... ఈ మాట తెలుగువాళ్లకు చిరపరిచితం. తెలంగాణ ప్రాంతంలోని గ్రామాధికారి. ఆంధ్ర ప్రాంతంలో మునసబుకు సమాంతరం. తెలంగాణ ప్రాం తం చిరకాలం రాచరికవ్యవస్థలో మగ్గిన కారణంగా, ఫ్యూడల్ దోపిడీకి, పెత్తనా నికి, దాష్టీకానికి ప్రతీకగా పటేల్ అనేమాట నిలిచిపోయింది. అందుకే ఈ వ్యవస్థ రద్దయినప్పుడు ప్రజల నుంచి హర్షామోదాలు వ్యక్తమైనాయి. ఈ దేశా న్ని కాంగ్రెస్‌పార్టీ పరిపాలించిన కాలంలో కొంత నిర్లక్ష్యానికి గురైన జాతీయో ద్యమ నాయకుడు సర్దార్ పటేల్ స్మృతికి ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం విశేషంగా ప్రాధాన్యమిస్తున్నది. ఈ విషయంపై ప్రచార మాధ్యమాల్లో విస్తృతంగా చర్చ కూడా నడుస్తున్నది. ఈ సందర్భంగా సర్దార్ పటేల్ పేరు వింటున్నప్పుడు మన పాత పటేల్ కూడా గుర్తుకొస్తున్నాడు. అంతమాత్రాన ఆ పటేల్‌కూ, ఈ పటేల్‌కూ ఏదో సంబంధం ఉన్నట్టు కాదు. అస్సలు లేదు. ఉండకూడదు. పావురం... అంటే కపోతం, శాంతికి చిహ్నం. దేశ తొలిప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూకు, పావురానికీ ఎంతో అనుబంధం. చిత్రకారులు గీసిన నెహ్రూ చిత్తరువుల్లో ఆయన ఎదపై ఎర్రగులాబీ ఎంత స్ఫుటంగా ఉంటుందో ఆయన చేతుల్లో ఎగరబోతున్న పావురం కూడా అంతే ప్రస్ఫుటంగా ఉంటుంది. శాంతిదూతగా పేరుగాంచిన నెహ్రూకు బ్రాండ్ అంబాసిడర్ పావురం. పావురం అంటే ప్రేమ అనే అర్థం కూడా ఉంది. జయంతి సందర్భంగా మళ్లీ నెహ్రూ మీద సాగుతున్న చర్చను చూస్తూవుంటే ఈ దేశంమీద, ప్రజలమీద, ప్రజాస్వామ్యం మీద, లౌకికభావనమీద ఆయనకున్న పావురం(ప్రేమ) కూడా గుర్తుకొస్తున్నది. పటేల్‌కూ, పావురానికి ఏమైనా పోలికవుందా? ఏమీ లేదు. ఫ్యూడల్ పటేల్‌కు, శాంతికపోతానికి వైరుధ్యం ఉంది. ఫ్యూడల్ పటేల్ అణచివేతకు గుర్తు, శాంతికపోతం స్వేచ్ఛకు సంకేతం. సర్దార్ పటేల్‌కూ, జవహర్లాల్ నెహ్రూకు ఏమైనా వైరుధ్యం ఉందా? ఏమీలేదు. పోలిక ఉంది. ఇద్దరూ శిఖర సమానులైన జాతీయోద్యమనేతలు. నవభారత నిర్మాణానికి పునాదులు వేయ డంలో ఒకరికొకరు చేదోడువాదోడుగా కలసి పనిచేసినవారు. అభిప్రాయాల్లో భేదాలున్నాయి. ఆలోచనల్లో తేడాలున్నాయి. నెహ్రూ ఉదారవాది, పటేల్ మిత వాది. నెహ్రూ సంపూర్ణ లౌకికవాది. పటేల్‌కు మెజారిటీ హిందువులపట్ల కొంత సానుభూతి. నెహ్రూ సౌమ్యుడు, సంప్రదింపుల ద్వారా సమస్యల పరిష్కారాన్ని కోరుకునేవాడు. అవసరమైతే కఠినంగా వ్యవహరించడానికి వెనుకాడనితత్వం పటేల్‌ది. ఈ మాత్రం భిన్నాభిప్రాయాలు, భిన్న ఆలోచనలు కాంగ్రెస్‌పార్టీలో స్వాతంత్య్ర పోరాటకాలం నుంచీ ఉన్నాయి. మితవాద ధోరణుల నుంచి, మార్క్సిస్టు ఆలోచనా స్రవంతుల వరకూ ఎన్నో పాయలు కలసి ప్రవహించిన గంగానదిలా సాగింది కాంగ్రెస్ ప్రయాణం. ఉమ్మడి లక్ష్యాలను సమష్టిగానే కాంగ్రెస్‌పార్టీ సాధించింది. భిన్నాభిప్రాయాలు ఏనాడూ శత్రువైరుధ్యాలుగా మారలేదు. నెహ్రూ చనిపోయి యాభయ్యేళ్లయింది. సర్దార్ పటేల్ అంతకుముందే చని పోయారు. ఇంతకాలానికి ఇప్పుడు నెహ్రూ వర్సెస్ పటేల్ అనే రచ్చ బయ ల్దేరింది. ప్రస్తుత రాజకీయపార్టీల స్వార్థప్రయోజనాలకోసం ఈ రచ్చ అవసర మైంది. సర్దార్ పటేల్‌ను భారతీయ జనతాపార్టీ బహిరంగంగా కబ్జా చేసింది. నెహ్రూను ప్రస్తుత కాంగ్రెస్ నాయకత్వం కుటుంబ ఆస్తిగా ప్రకటించుకుంటోం ది. నెహ్రూ 125వ జయంతి పేరుతో కాంగ్రెస్‌పార్టీ ఒక అంతర్జాతీయ సెమినా ర్ను ప్రకటించింది. ఈ సెమినార్లో పాల్గొనడానికి దేశ, విదేశాలలోని ఎంద రెందరో ప్రముఖులకు ఆహ్వానాలందాయి. కానీ, ఈ దేశ ప్రధానమంత్రిని మాత్రం పిలవలేదు. ఎందుకంటే, ప్రధానమంత్రి భారతీయ జనతాపార్టీ వ్యక్తి. నెహ్రూను కాంగ్రెస్ పార్టీ ఆస్తిగా భావిస్తున్నారు, కనుక పిలవలేదు. ఒక ప్రపంచ స్థాయి నాయకునికి, విశ్వమానవ ప్రేమికునికి ఇంత సంకుచితంగా నివాళి ఘటి స్తారా? బీజేపీ-ఆరెస్సెస్‌లతో కూడిన సంఘ్ పరివార్ భావజాలానికీ, నెహ్రూ భావజాలానికీ సాపత్యం కుదరదు. నెహ్రూ లౌకికవాదం, ఉదారవాదం, సోష లిస్టు స్నేహం వగైరాల పొడ సంఘ్ పరివార్‌కు గిట్టదు. దేశంలో బీజేపీ ప్రధాన రాజకీయపక్షంగా ఎదిగిన నేపథ్యంలో సంఘ్ పరివార్‌కు ఒక జాతీయహీరో కావాలి. జాతీయోద్యమంలో దాని భావజాలానికి ఒక ప్రతీక కావాలి. ఒక మస్కట్ కావాలి. నెహ్రూ కాంగ్రెస్ మస్కట్‌గా మారాడు. మహాత్మాగాంధీని కబ్జా చేయడం సాధ్యంకాదు. ఆయన భావజాలం కూడా సంఘ్ పరివార్‌కు సరి పడేది కాదు. అలాగని విస్మరించనూలేదు. అందుకే ఆయన బోధించిన అనేకా నేక అంశాల్లో ఒకటైన పారిశుధ్యాన్ని తీసుకొని ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమాన్ని ప్రకటించారు. ఇంతటితో పారిశుధ్య ప్రచారక్ పాత్రకు మహాత్ముడు పరిమితం. జాతీయోద్యమం నుంచి తమకు కావలసిన హీరోను సర్దార్‌పటేల్ రూపంలో సంఘ్ పరివార్ చాలాకాలం కిందటే కనిపెట్టింది. నెహ్రూ భావజాలాన్నీ, తద్వారా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడం కోసం దశాబ్దం క్రితం నుంచే పటేల్‌ను పక్కకు తీసే కార్యక్రమాన్ని పరివార్ చేపట్టింది. నెహ్రూ స్థానంలో పటేల్ తొలి ప్రధాని అయివున్నట్లయితే దేశ భవిష్యత్తు గొప్పగా ఉండేదనే అభిప్రాయాన్ని అది ప్రచారంలో పెట్టింది. బాబ్రీమసీదు విధ్వంసం అనంతరం బీజేపీ నాయ కుడు అద్వానీకి అభినవ సర్దార్ అనే బిరుదును కూడా ఇచ్చేశారు. ఇప్పుడు ఏకంగా గుజరాత్లో 200 మీటర్ల ఎత్తయిన పటేల్ విగ్రహాన్ని ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్నారు. తప్పేమీలేదు. ఒక జాతీయోద్యమ నాయకునికి ఘనమైన స్మృతి చిహ్నాన్ని నెలకొల్పడం స్వాగతించదగ్గదే. కానీ ఒక పెద్దగీతను చిన్న బుచ్చడం కోసం మరో పెద్ద గీత గీయాలన్న సూత్రం స్ఫూర్తితో ఈ భారీ విగ్ర హం ద్వారా నెహ్రూ స్థాయిని తగ్గిస్తామనుకుంటే మాత్రం జనం నవ్వుకుం టారు. ఒకటి రెండు సందర్భాలలో పటేల్ హిందూ అనుకూలవైఖరి తీసుకు న్నారు. మహాత్మాగాంధీ హత్యతో ఆరెస్సెస్‌పై నిషేధం విధించిన పటేల్ ఆ సంస్థ ఇకనుంచి తాము సాంస్కృతిక కార్యక్రమాలకే పరిమితమవుతామని ప్రక టించిన వెంటనే నిషేధాన్ని ఎత్తివేశారు. కొన్ని సందర్భాల్లో నెహ్రూ ఉదారవాద విధానాలను బహిరంగంగానే వ్యతిరేకించారు. ఇలాంటి కొన్ని సంఘటనలను భూతద్దంలో చూసుకున్న పరివార్ కాంగ్రెస్ పార్టీ పటేల్‌ను తమ హీరోగా క్రమ క్రమంగా తెరమీదకు తెచ్చింది. ఆ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. ఇక సర్దార్ పటేల్ కాషాయ హీరో. మస్కట్ మాత్రమే సర్దార్ పటేల్. మస్తిష్కం నిండా ఫ్యూడల్ పటేల్. పరిపాలనలో పటేల్గిరీ ఛాయలు కనబడుతున్నాయి. చరిత్ర పుస్తకాల్లో మతభావాలు ప్రవేశించబోతున్నాయి. ప్రత్యామ్నాయాలు లేకుండానే ప్రణాళికా సంఘాల్లాంటివి (నెహ్రూ ఛాయలు) రద్దయిపోతున్నాయి. మహా రాష్ర్ట ప్రభుత్వం బలనిరూపణ సందర్భంగా ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసిన తీరు మనకు కనిపించింది. కశ్మీర్ వంటి సున్నిత రాష్ర్టంలో హిందువును ముఖ్యమంత్రిని చేయాలనే తెంపరితనం కనబడుతున్నది. ఆలోచనల మీద నిఘా వేస్తున్నారు. అభిప్రాయాలకు కాపలా కాస్తున్నారు. ఆడ-మగ స్నేహంపై ఆంక్షలు పెడుతున్నారు. ‘మోరల్ పోలీసింగ్‘ మొదలైంది. ఇదంతా ఏరకమైన పటేల్ గిరీ? సర్దార్ పటేల్ గిరీ మాత్రం కాదు. ఇప్పుడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఇమేజ్‌పై పరోక్ష యుద్ధం జరుగు తున్నది. ఆ ఇమేజ్ మాటున ఉన్న అసలు వ్యక్తిని ఒక్కక్షణం స్ఫురణకు తెచ్చు కుందాం. నెహ్రూ తొలి భారత ప్రధాని. పదిహేడేళ్లపాటు ఆయన ప్రధానిగా ఉన్నారు. అంతకుముందు స్వాతంత్య్ర పోరాటంలో మరో పదిహేడేళ్లు జైల్లో ఉన్నారు. జైలు జీవితాన్ని ఆయన చరిత్ర పరిశోధనకు అంకితం చేశారు. భారత దేశచరిత్ర, సంస్కృతితో పాటు ప్రపంచదేశాలు- వాటి పరిణామాలను విస్తృ తంగా అధ్యయనం చేశారు. జైల్లో ఉండగానే ఆయన రాసిన గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ, డిస్కవరీ ఆఫ్ ఇండియా వంటి గ్రంథాలు ప్రసిద్ధ చరిత్రకారులు రాసిన పాఠ్యపుస్తకాలకు దీటుగా గౌరవాన్ని పొందాయి. భారతదేశ చరిత్రను ప్రత్యేక శ్రద్ధాసక్తులతో ఆయన పరిశోధించారు. తొలినాటి షోడశ మహాజనపద గణరాజ్యాలనూ, వాటి ప్రజాస్వామిక లక్షణాలను సంభ్రమాశ్చర్యాలతో తిలకిం చాడు. రాజేంద్రచోళుడు ఆగ్నేయాసియాను జయించకముందే, కనిష్కుడు సెంట్రల్ ఆసియాను పాలించకముందే మనదేశంలో వర్ధిల్లిన బౌద్ధం యావత్తు ఆసియాఖండంలో గురుపీఠం సాధించిన వైనాన్ని ఆనందోద్వేగాలతో పరిశీలిం చాడు. అనేకజాతులు, అనేకభాషలు, అనేక సంస్కృతులు, అనేక తెగలు, పొంత నలేని ఆచారవ్యవహారాలు, ఎంత వైవిధ్యభరితమైన దేశం? అయినా, సహస్ర భిన్నాంశాలను కలుపుతూ ఏదో అంతర్వాహిని ప్రవహిస్తున్నది. ఆ అంతర్వా హినిలో భారతీయ ఆత్మను నెహ్రూ సందర్శించాడు. భిన్న జాతుల ప్రదేశంగా ఉన్న భారతదేశాన్ని ఒక భారతజాతిగా నిర్మించడానికి నెహ్రూకు చరిత్ర అధ్య యనం ఉపకరించింది. ఈ అధ్యయనం పర్యవసానమే నెహ్రూ ఉదారవాదం, లౌకికవాదం, ప్రాపంచిక దృక్పథం. నెహ్రూ పరిపాలనాకాలంలో కొన్ని పొరపాట్లు జరిగి ఉండవచ్చు. చైనా యుద్ధం, షేక్ అబ్దుల్లా అరెస్ట్ వంటి కొన్ని తప్పిదాలకు నెహ్రూ కారకుడే. అయితే వాటన్నిటినీ మించి వెనుకబడిన ఈ వ్యవసాయక దేశాన్ని ఆధునిక భారత్‌గా అడుగులు వేయించిన వ్యక్తి నెహ్రూ. భారతదేశంతోపాటు వలస పాలన నుంచి విముక్తి పొందిన అనేక దేశాలు ప్రజాస్వామ్య ప్రయోగంలో విఫలమైనప్పటికీ భారత్ మాత్రం అగ్రశ్రేణి ప్రజాస్వామ్యంగా వర్ధిల్లగలిగిం దంటే అది నెహ్రూ చలవే. నాజర్, సుకర్ణో. టిటో వంటి నేతలను కలుపుకుని నెహ్రూ ప్రారంభించిన అలీనోద్యమం మరో ప్రపంచయుద్ధం జరగకుండా నిరోధించిందనడంలో సందేహంలేదు. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో భార తీయ పెట్టుబడిదారి వర్గం రైల్వేలు, ఉక్కుపరిశ్రమలు వంటి భారీ పరిశ్రమలను స్థాపించేంత బలంగా లేదు. అందుకే భారీ పరిశ్రమలను ఆయన ప్రభుత్వ రంగంలో ప్రారంభిస్తూ మిశ్రమ ఆర్థికవ్యవస్థను నిర్మించారు. ఈ ప్రభుత్వరంగ సంస్థలే భవిష్యత్తులో ఒక బలమైన మధ్యతరగతి ఆవిర్భావానికి కారణమైన విషయం మరువరాదు. ఇప్పటికీ దేశంలో ప్రతిష్టాత్మక సంస్థలుగా వెలుగొందు తున్న ఐఐటీలు, ఐఐఎమ్‌లూ నెహ్రూ మానసపుత్రికలే. అణ్వస్త్ర రంగంలో, అంతరిక్ష రంగంలో దేశం సాధించిన విజయాలూ నెహ్రూ దూరదృష్టి ఫలితాలే. మతాలుగా, జాతులుగా, ప్రాంతాలుగా ఈ దేశం విచ్ఛిన్నం కాకుండా ఒక భారతజాతిగా అజేయంగా నిలబడిందంటే అందుకు కారణం నెహ్రూ అవలంబించిన ఉదారవాద, లౌకిక విధానాలే. మేరు పర్వతం లాంటి నెహ్రూ వ్యక్తిత్వాన్ని మరుగుజ్జుగా చూపడం ఎవరికీ సాధ్యమయ్యే పనికాదు. -
పీఆర్సీ వర్తింపజేయాలి
విద్యుత్ ఇంజనీర్ల అసోసియేషన్ విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: విద్యుత్ శాఖ ఉద్యోగులకు 2014 వేతన సవరణ (పీఆర్సీ) వర్తింపజేయాలని తెలంగాణ విద్యుత్ ఇంజనీర్ల అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. పది ప్రధాన డిమాండ్లను ప్రస్తావిస్తూ అసోసియేషన్ అధ్యక్షుడు నెహ్రూ, ప్రధాన కార్యదర్శి భాస్కర్ ఆధ్వర్యంలో టీఎస్జెన్కో చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ ప్రభాకర్‌రావుకు మెమోరాండం సమర్పించారు. కీలకమైన విభాగాలన్నింటా తెలంగాణ ఇంజనీర్లను నియమించాలని.. సీమాంధ్ర ఇంజనీర్లను అప్రాధాన్య విభాగాల్లో సర్దుబాటు చేయాలని అందులో కోరారు. జెన్కో విద్యుత్ ప్లాంట్లకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని.. అసిస్టెంట్ ఇంజనీర్ల నియామకం చేపట్టాలని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో జెన్కో, ట్రాన్స్‌కో, డిస్కమ్ ఉద్యోగులకు మెడికల్ పాలసీని వర్తింపజేయాలని, జెన్కో ఇంజనీర్లకు కొత్త క్వార్టర్ల నిర్మాణం చేపట్టాలని, పాల్వంచలో జెన్కో ఉద్యోగుల కాలనీకి నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు. -
‘హవ్’ హమ్ హైద్రాబాదీ!
హైద్రాబాదీ షాయరీలు (కవితా గోష్టులు) ఆహ్లాదకరమైనవి. దక్కనీ భాషలో షాయరీ పాడుతోంటే ప్రేక్షకులు తెరలు తెరలుగా కడుపుబ్బ నవ్వేవారు! ఈ వాతావరణంలో పిల్లలు హైద్రాబాద్‌లోనే పుట్టిపెరుగుతున్నారు. అప్పుడప్పుడూ సకుటుంబంగా ఉత్తరాది బంధువుల దగ్గరకు వెళ్లేవారం. దేశ విభజనలో భాగంగా పంజాబ్ రెండు భాగాలైనప్పటికీ పంజాబ్ నా స్వరాష్ట్రం కదా! పంజాబ్‌లో, ఢిల్లీలో నివసించే బంధువులతో పిల్లలు మాట్లాడేప్పుడు వారి నోటి వెంట హైద్రాబాదీ పదాలు అసంకల్పితంగా వచ్చేవి. ‘ఇది తీసుకో’ అని ఉత్తరాది వాళ్లు అన్నారనుకోండి, ‘వద్దు’ అనదలచుకున్న మా పిల్లలు ‘నక్కో’ అనేవారు! తోటి పిల్లలు ఫక్కున నవ్వేవారు! వారి దృష్టిలో అది మోటు పదం! వద్దు అనాలంటే ‘న’ లేదా ‘నహీ’ అనాలి! ఏకీచ్ అంటే మోటు.. ఏక్హీ అనాలి! మీరు మోటుగా మాట్లాడతారు, సంస్కారం లేదు అని పిల్లలను వెక్కిరించేవారు! నా దృష్టిలో హైద్రాబాదీలతో పోలిస్తే ఉత్తరాదివారికి సగం కూడా కల్చర్ లేదు! లేదంటే వింటారా! ‘నై బోలేతో సున్తే క్యా’! ‘నై బోలేతో సున్తే నై’ ! ‘వద్దంటే వినదు/వినరు’ అనే అర్థం వచ్చే పై మకుటంతో దక్కనీ షాయరీ సిటీలో ప్రాచుర్యంలో ఉండేది. అందులోని అనేక చరణాల్లో కొన్ని... కర్నే కొ జో కామా హైసొ / చేయాల్సిన పనులన్నీ జైసేకే వైసే హీచ్ హై / ఎక్కడివక్కడే ఉన్నాయి నై కర్నేకె కామా కర్రై/ చేయకూడని పనులు చేస్తున్నావు నై బోలేతో సున్తేనై / వద్దంటే వినడం లేదు ఉమర్కె పీఛే మత్ భాగో / వయసు వెనుక పరుగెత్తొద్దు గయేసీ జవానీ ఆతీనై / పోయిన వయసు రాదు మేకప్ గీకప్ నక్కో/మేకప్ గీకప్ వద్దు నైబోలేతో సున్తేనై /వద్దంటే వినడం లేదు అచ్ఛే అచ్ఛే డ్రామే దేఖో / మంచి మంచి నాటకాలు చూడు కిత్తా కిత్తా సమ్ఝాయా/ ఎంతెంతగా నచ్చచెప్పా గంధే ఫిల్మే మత్ దేఖో/ పాడు సినిమాలు చూడొద్దని నై బోలేతో సున్తేనై / వద్దంటే వినడం లేదు సంజీవరెడ్డి మామా ! సమైక్యరాష్ట్రం ఏర్పడిన కొత్తలో నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు! హైకోర్టు అన్యాపదేశంగా చేసిన వ్యాఖ్యకు స్పందనగా పదవికి రాజీనామా చేయసారు, ప్రధాని నెహ్రూకు చెప్పకుండా! అటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఉండగా విమర్శించడం అంత తేలిక కాదు కదా! సర్వార్ దండా అనే మషూర్ కవి ‘సంజీవరెడ్డి మామా’ అనే షాయరీ రాసారు. విన్నవారు పొట్ట చెక్కలయ్యేలా నవ్వే అనేక చరణాల్లో ఒక చరణం.. పోలీస్ కి డైరీ మె/ పోలీసుల డైరీలో దండె కి షాయిరీ మె/దండె కవిత్వంలో న ఫుల్ స్టాఫ్ న కామా/ఫుల్స్టాప్ ఉండదు కామా ఉండదు సంజీవ్ రెడ్డి మామా/సంజీవరెడ్డి మామా ఓల్డ్ సిటీలో నేటికీ పాడుకునే ఒక ‘నక్కొ’ నుడికారం పూపీ సాస్ నక్కొ/మేనత్త అత్తగా వద్దు భతీజీ బాబు నక్కొ/సోదరుడి కూతురు కోడలుగా వద్దు బందీ సౌకాన్ నక్కొ/పని మనిషి సవతిగా వద్దు ఘర్ మె సాలా నక్కొ/బావమరిది ఇంట్లో వద్దు కతిల్ పితల్ కా సాజ్ నక్కొ/ఇత్తడి ఆభరణాలు వద్దు బూఢే మరద్ కి రాజ్ నక్కొ/ముసలి వాడితో సంసారం వద్దు ఆహ్లాదకరమైన దక్కనీ సారస్వత వాతావరణంలో పెరిగిన పిల్లలు ఉత్తరాది వారి దృష్టిలో మోటు మనుషులు! ఉత్తరాది వారు హిందీ లేదా ఉర్దూలో మాట్లాడతారు. ఒక ఉత్తరాది వ్యక్తికి హైద్రాబాదీకి జరిగిన సంభాషణను ఆరోజుల్లో హైద్రాబాదీలు హాస్యంగా చెప్పుకునేవారు! ఒక ఉత్తరాది వ్యక్తి హైద్రాబాదీ పిల్లవాడిని అడుగుతున్నాడు ‘ ఈ రోడ్డు హైద్రాబాద్‌కు పోతుందా?’ పిల్లవాడు ‘హవ్ (అవును)’ అన్నాడు. ‘హవ్’ అని నీచంగా మాట్లాడావు నువ్వు అన్నాడు పెద్దాయన. మరేమనాలి సార్ అన్నాడు పిల్లవాడు. ‘జీ హా’ అనాలి అన్నాడు. అంటే ‘హవ్’ నీచమైన పదం అన్నమాట అన్నాడు పిల్లవాడు. పెద్దాయన ‘హవ్’ అన్నాడు! ఇంతటి హాస్యం ఉన్న దక్కనీ.. ఉర్దూ కంటే లేక హిందీ కంటే తక్కువ ఎలా అవుతుంది? అసలు దక్కనీ భాషే ఈ రెండు భాషలకూ మాతృక. ఆ చారిత్రక వైనం మరోసారి.. -
‘గాంధీ’ల చేతిలో నెహ్రూ పత్రిక ఖూనీ
యూపీఏ హయాంలో జరిగిన వాటితో పోల్చినపుడు ‘నేషనల్ హెరాల్డ్’ పత్రిక కుంభకోణం లెక్కలోకి రాదు. సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా భూ కుంభకోణం కూడా వందల కోట్లు పలికినదే. ‘నేషనల్ హెరాల్డ్’ అనే పత్రికను ఆసరా చేసుకుని సోనియా, రాహుల్ సాగించిన కుంభకోణం ఐదు వేల కోట్ల రూపాయలే. కానీ ఇది జవహర్లాల్ నెహ్రూ స్ఫూర్తినీ, ఆయన జ్ఞాపకాలను ‘గాంధీ’ల నాయకత్వంలోని నేటి కాంగ్రెస్ ఎంత కించపరుస్తున్నదో భారత జాతి గమనించేటట్టు చేసింది. సెప్టెంబర్ 9, 1937న లక్నోలో నెహ్రూ ‘నేషనల్ హెరాల్డ్’ ఆంగ్ల పత్రికను నెలకొల్పారు. భారత జాతీయ కాంగ్రెస్ వాణిని వినిపించడమే విధానంగా తీసుకున్న ‘నేషనల్ హెరాల్డ్’ తొలి సంపాదకుడు ఆయనే. 1938లో కోటంరాజు రామారావు సంపాదకుడి బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి ప్రధానిగా బాధ్యతలు చేపట్టే వరకు కూడా నెహ్రూ పాలక మండలి అధ్యక్షునిగా పని చేశారు. క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో వచ్చిన ఆంక్షల కారణంగా 1942-45 మధ్య పత్రిక మూత పడింది. 1946లో మళ్లీ ప్రచురణ ప్రారంభించినపుడు మానికొండ చలపతిరావు (ఎంసీ) సంపాదకత్వ బాధ్యత తీసుకున్నారు. అప్పటి నుంచి 1978లో మరోసారి మూతపడే వరకు ఎంసీ ఆ స్థానంలో కొనసాగారు. ఆ విధంగా ఈ పత్రికతో తెలుగువారికి ఉన్న అనుబంధం బలమైనది. హిందీలో ‘నవజీవన్’, ఉర్దూలో ‘క్వామి ఆవాజ్’ పేర్లతో ఇదే పత్రికను వెలువరించారు. అత్యవసర పరిస్థితి తరువాత కాంగ్రెస్ ఒడిదుడుకులు ఎదుర్కొన్నపుడు(1977-79) ఈ పత్రిక మూతపడినా, మళ్లీ ప్రచురణ సాగించింది. అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్న నేషనల్ హెరాల్డ్ 1986లో మరోసారి ఆగిపోయే పరిస్థితి వచ్చింది. కానీ అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ ఆదుకున్నారు. 1998లో ల క్నో శాఖ మూతపడింది. ఆ శాఖ తీర్చవలసిన బకాయిల కోసం కోర్డు ఆదేశం మేరకు కొన్ని ఆస్తులను వేలం వేశారు. పదేళ్ల తరువాత ఏప్రిల్ 1, 2008 నుంచి, అంటే యూపీఏ పాలనలోనే నేషనల్ హెరాల్డ్ ఢిల్లీ ప్రచురణ కూడా నిలిచిపోయింది. అప్పటి సంపాదకుడు టీవీ వెంకటాచలం. రూ. 90.25 కోట్ల అప్పు (ఎక్కువ ఉద్యోగుల బకాయిలు)భారంతో ఆ పత్రిక కుంగిపోయింది. 2011లో మరోసారి దీనిని తెరిపించాలని ప్రయత్నాలు జరిగాయి. ఈ ప్రయత్నాలకు స్వయంగా రాహుల్ అడ్డుపడ్డారని చెబుతారు. ఈ మధ్యలో రాహుల్, సోనియా నేషనల్ హెరాల్డ్ ఆస్తులను దుర్వినియోగం చేయడానికి కుట్ర పన్నారని బీజేపీ నాయకుడు డాక్టర్ సుబ్రమణియం స్వామి ఢిల్లీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జరిగిన పరిణామాలను చూస్తే ‘గాంధీ’లు నెహ్రూ కలల పత్రికను చిదిమివేయడానికి ఎంత పథకం పన్నారో సులభంగానే అర్థమవుతుంది. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) సంస్థ నేషనల్ హెరాల్డ్ (ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ) పత్రికను నిర్వహించేది. పత్రిక మూతపడినా 2010లో కూడా ఏజేఎల్ పని చేసింది. గాంధీ కుటుంబానికి విశ్వాసపాత్రుడు మోతీలాల్ ఓరా ఏజేఎల్ పాలక మండలి చైర్మన్. రాహుల్‌గాంధీ, మరో కాంగ్రెస్ ప్రముఖుడు ఆస్కార్ ఫెర్నాండెజ్ డెరైక్టర్లు. ఆ సంవత్సరంలోనే ఏజేఎల్ స్థానంలో మరో పాలక మండలి ఆవిర్భవించింది. దాని పేరు యంగ్ ఇండియన్ లిమిటెడ్. ఇందులో సభ్యులు వేరెవరో కాదు, ఓరా, రాహుల్, ఫెర్నాండెజ్లే. ఈ కొత్త మండలి ఎందుకు? పత్రికను తిరిగి ప్రచురిస్తామని ఈ మండలి ప్రకటించినా, అది జరగలేదు. అయితే ఏజేఎల్ చెల్లించవలసిన రూ. 90 కోట్ల బకాయిలు వసూలు చేయడానికి కొత్త మండలి హక్కును పొందింది. ఈ అప్పులు తీర్చడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మోతీలాల్ ఓరా (పార్టీ కోశాధికారి) రూ. 90.25 కోట్లు అప్పుగా ఇచ్చారు. ఇదే కాకుండా, బహదూర్షా జఫార్ మార్గంలో (ఢిల్లీ) ఉన్న నేషనల్ హెరాల్డ్ భవంతినీ, ప్రింటింగ్ యంత్రాన్ని అద్దెకు ఇచ్చారు. దాని మీద వచ్చే అద్దెను ఒక ప్రైవేటు సంస్థ వసూలు చేస్తున్నది. ఆ సంస్థలో ప్రధాన సభ్యులు సోనియా, రాహుల్. అందుకే ఈ కేసులో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని పేర్కొంటూ ఢిల్లీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సోనియా, రాహుల్‌లకు నోటీసులు జారీ చేశారు. ఆగస్టు ఏడున వీరు కోర్టుకు హాజరు కావాలి. ఢిల్లీలోని భవంతితో సహా ఈ పత్రిక పేర లక్నో, భోపాల్, ఇండోర్, ముంబై, పంచకులా (చండీగఢ్), పాట్నాలలో ఉన్న స్థిరాస్థుల విలువ దాదాపు రూ. 5000 కోట్లు. చివరికి కాంగ్రెస్‌పార్టీ ఏజేఎల్‌కు తాను ఇచ్చిన రుణాన్ని రద్దు చేసి, ఈ ఆస్తులను యంగ్ ఇండియన్ లిమిటెడ్ పరం చేసింది. ఈ వివాదం నుంచి బయటపడతామని సోనియా భృత్యులు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. కానీ అదంత సులభం కాదు. కల్హణ -
తొలి లోక్‌సభ సభ్యుని వానప్రస్థం!
న్యూఢిల్లీ: ఆయనది ఏడు దశాబ్దాల రాజకీయ జీవితం. స్వాతంత్య్రానంతరం 1952లో కొలువుదీరిన తొట్టతొలి లోక్‌సభకు ఎంపికై, ఇప్పుడు కూడా పార్లమెంటు సభ్యునిగా కొనసాగుతున్న అరుదైన రికార్డు ఆయన సొంతం. అంతేనా... నెహ్రూ మొదలుకుని, ఇందిరా గాంధీ, రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ... ఇలా ఆ కుటుంబంలోని అన్ని తరాల నేతలతోనూ కలిసి పని చేసిన ఘనత ఆయనది. ఆయనే రాజ్యసభ సభ్యుడు రిషాంగ్ కీషింగ్ (95). ప్రస్తుత పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారిలో అత్యంత వృద్ధుడు కూడా అయిన కీషింగ్, రాజకీయాల నుంచి ఇక రిటైరవనున్నట్టు తాజాగా ప్రకటించారు. దేశ రాజకీయాల్లో చాలా ఉత్థాన పతనాలను చూశానని, ఇక తప్పుకోవాలని అనుకుంటున్నానని అన్నారు. రిటైరయ్యాక తోట పనికి సమయం కేటాయించాలనుకుంటున్నారట! ఆయన రాజ్యసభ పదవీకాలం ఏప్రిల్‌తో ముగియనుంది. సోషలిస్ట్ పార్టీ టికెట్‌పై 1952లో లోక్‌సభకు ఎన్నికైన కీషింగ్, నెహ్రూ ఆహ్వానం మేరకు 1962లో కాంగ్రెస్‌లో చేరారు. అప్పటి నుంచి కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారు. ఆయన మణిపూర్ సీఎంగా కూడా పనిచేశారు. -
సినీ ‘మహాప్రస్థానం’
ఎటు వెళ్తున్నాడో.. ఎందుకు వెళ్తున్నాడో తెలియదు. కాకినాడ నుంచి కలకత్తాకు చేరాడు. కడుపు నింపుకునేందుకు పనికోసం తిరిగాడు. చిత్రరంగంలో బాయ్‌గా కుదిరాడు. అలా మొదలైన ఆయన పయనం సినిమా నిర్మించే స్థాయికి చేరుకుంది. జగత్కిలాడీలు, తాతా మనవుడు, ఇంట్లోరామయ్య.. వీధిలో కృష్ణయ్య తదితర హిట్ చిత్రాలను అందించారు. చెన్నై నుంచి తెలుగు సినీ పరిశ్రమ నగరానికి తరలివ చ్చినప్పుడు ఫిల్మ్‌నగర్‌లో తొలిగా ఇల్లు కట్టి నూతన చిత్ర సామ్రాజ్యానికి బాటలు వేశారు. ఆయనే కోటిపల్లి రాఘవ. నూటొక్క ఏళ్ల కుర్రాడు. ఆయన అంతరంగ ఆవిష్కరణే ఈ వారం లెజెండ్. ఆ సినీ‘మహా’ప్రస్థానం ఆయన మాటల్లోనే.. కాకినాడ దగ్గర ఉన్న పల్లెటూరు కోటిపల్లి మాది. నాన్న నారాయణస్వామి. రైతు. నాకు ఇద్దరు చెల్లెళ్లు. నలుగురన్నదమ్ములు. నాకు చదువు అబ్బలేదు. దీంతో రెండో తరగతిలోనే ఒక రోజు బడి ఎగ్గొట్టి కాకినాడకు వచ్చి దొంగలబండి (టిక్కెట్ లేకుండా రెలైక్కడం) ఎక్కేశాను. అది ఏ ఊరుకెళ్తుందో.. నేనెక్కడికి వెళ్లదలుచుకున్నానో తెలియదు. చివరకు అది ఓ పెద్ద స్టేషన్లో ఆగింది. రైలు దిగి ఊళ్లోకెళ్లాను. కడుపులో ఆకలి తప్ప జేబులో అణా బిళ్ల కూడా లేదు. అలా నడుస్తూ ఒక పెద్ద గేటు దగ్గరకు వెళ్లాను. పని కోసం గేటు తోస్తోంటే గూర్ఖా బెదిరించాడు. అతనితో వాదిస్తుండగానే ఎవరో ఒకాయన పిలిచాడు. లోపలికి వెళ్లాను. ‘ ఏంకావాలి’ అని అడిగాడు. ‘పని కోసం వచ్చా’నన్నాను. ‘ట్రాలీ లాగుతావా’ అని అడిగాడు. ‘లాగుతాన’న్నా. పని దొరికింది. కొన్ని రోజుల తర్వాత తెలిసింది. నేను కలకత్తాలో రైలు దిగానని. మోతీలాల్ చమేరియా స్డూడియోలో పని చేస్తున్నాని... ఆ స్టూడియోలో ‘రాజాహరిశ్చంద్ర’ అనే మూకీ చిత్రాన్ని షూటింగ్ చేస్తున్నారని. ఆ సినిమా విడుదలైంది. మంచి పేరు వచ్చింది. ఆ రోజుల్లోనే ‘భక్తప్రహ్లాద’, ‘భీష్మ’ వంటి మూకీ చిత్రాలు కలకత్తాలో రూపొందాయి. ఆ సమయంలో బాంబేలో టాకీ చిత్రం తెరకెక్కింది. అది ‘ఆలంఅరా’. అప్పటికి కలకత్తాకు వచ్చి చాలా రోజులే అయింది. నేను పని చేసిన స్టూడియోలోనే నెల జీతం రూ.10 తీసుకొని మరో రెలైక్కాను. విజయవాడకు చేరుకున్నాను. బాయ్‌గా పని చే శాను... ఆ రోజుల్లో విజయవాడలో మారుతీ సినిమా టాకీస్ ఒక్కటే ఉండేది. ఆ టాకీస్‌లో తెరపై కనిపించే మూకీ చిత్రాలకు కథ, కథనం అయి నడిపించే కస్తూరి శివరావు వద్ద పనికి కుదిరాను. ఆయనకు సినిమా కాపీలు అందించడం నా పని. అర్ధణా, అణా చొప్పున నా అవసరాన్ని బట్టి డబ్బులిచ్చేవారు. 1930-32లో ఇక్కడ టాకీల యుగం ప్రారంభమైంది. దాంతో విజయవాడ నుంచి మద్రాసుకు బయలుదేరాను. ఆ రోజుల్లో బలరామయ్య, మీర్జాపురం రాజా వంటి వాళ్లు నిర్మాతలుగా వెలుగొందుతున్నారు. మీర్జాపురం రాజావారు ‘గొల్లభామ’, ‘కీలుగుర్రం’ సినిమాలు తీశారు. సీహెచ్ నారాయణరావు దర్శకత్వంలో ‘భీష్మ’ టాకీ చిత్రం వచ్చింది. కృష్ణవేణి హీరోయిన్గా ‘గొల్లభామ’ సినిమా విడుదలైంది. ఆ సినిమాలు తీస్తున్న రోజుల్లో లైట్లు మోయడం దగ్గర నుంచి అన్ని రకాల పనులు చేశాను. బహుశా సినిమా పరిశ్రమలో నేను చేయని పని అంటూ లేదు. అప్పటికే కస్తూరి శివరావు ప్రముఖ నిర్మాత బలరామయ్య దగ్గర చేరారు. అల్వాల్ పేట్‌లోని శోభనాచల స్టూడియోలో నేను ఉండేవాన్ని. వాహిని స్టూడియో, ప్రగతి స్టూడియో, నెఫ్ట్యూన్ స్టూడియో... ఇలా ఒకటెనక ఒకటి కొత్త స్టూడియోలు ఏర్పడ్డాయి. ఏ స్టూడియోలో పని ఉంటే అక్కడికి వెళ్లి చేశాను. క్రమంగా స్టంట్ మాస్టర్నయ్యాను. ఒక్క రూపాయి కూలీతో.. అక్కినేని, కన్నాంబలు హీరో, హీరోయిన్లుగా ‘పల్నాటి యుద్ధం’ సినిమా తీస్తున్న రోజుల్లో ఆ సినిమా దర్శకుడు రామబ్రహ్మం గుండెపోటుతో చనిపోయాడు. ఆ సినిమాకు సహాయ దర్శకుడిగా పని చేస్తున్న ఎల్వీ దర్శకత్వంలోనే మిగిలిన చిత్రం పూర్తి అయింది. ఆ సినిమా హిట్టయ్యింది. అప్పటికి ఎన్టీరామారావు నాటకాల్లో బాగా నటిస్తున్నాడు. అలా నటిస్తున్న రోజుల్లోనే ఎల్వీప్రసాద్ దృష్టిలో పడ్డాడు. ఎల్వీ ప్రసాద్ ‘మనదేశం’ సినిమా కోసం ఎన్టీరామారావును మద్రాసుకు పిలిపించాడు. ‘రామారావు అని ఓ కుర్రాడు వస్తాడు తీసుకురాపో’ అని నన్ను మద్రాస్ సెంట్రల్ స్టేషన్‌కు తరిమారు. వెళ్లి చేతిలో ‘రామారావు’ అనే పెద్ద అక్షరాలతో ఓ బోర్డు పట్టుకొని నించున్నా. వచ్చాడు. నాలుగో నెంబర్ బస్సెక్కి ఇద్దరం ఆల్వార్పేటకు చేరుకున్నాం. ‘మన దేశం’ సినిమాలో ఎన్టీరామారావుకు కానిస్టేబుల్ పాత్ర ఇచ్చారు. నేను కూడా అదే పాత్రలో నటించాను. ఉదయం నుంచి సాయంత్రం వరకు లెఫ్ట్ రైట్ కొట్టే సరికి బూట్లు కరుచుకొని ఇద్దరి కాళ్లకు పుండ్లు పడ్డాయి. ఆ రోజు కూలీ ఒక్క రూపాయి తీసుకొని నాతో పాటు బీఏ సుబ్బారావు గుడిసెకు వచ్చాడు. ఆ రాత్రి అక్కడే పడుకున్నాం. మరుసటి రోజు ఆల్వార్పేట్లోనే ఓ గుడిసె అద్దెకు ఇప్పించాను. నెలకు రూ.5. అంత అద్దె భరించడం తన వల్ల కాదన్నాడు. మ్యూజిక్ డెరైక్టర్ టీవీ రాజును జత చేశాను. చెరి సగం భరిస్తూ ఆ గుడిసెలో ఉన్నాడు. నెహ్రూతో చర్చలు... చిత్రపరిశ్రమలో ఒక స్థానం లభించింది. ఎంజీఆర్, శివాజీగణేషన్, కెఆర్ రామస్వామి, ఎన్టీరామారావు, అక్కినేని వంటి వాళ్లందరితో కలిసి పని చేశాను. బీఆర్ పంతులు ‘వీరపాండ్య కట్టబమ్మన్’ సినిమా తీశాడు. ఆయన దగ్గర ప్రొడక్షన్ మేనేజర్‌గా చేరి క్రమంగా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్‌గా ఎదిగాను. ఆ రోజుల్లోనే షమ్మీకపూర్, మలాసిన్హా నటించిన ‘దిల్ తేరా దివాన్’ తమిళ అనువాద చిత్రానికి పని చేశాను. అప్పుడు న్యూయార్క్ ఎంజీఎం స్టూడియో వాళ్లు ‘టార్జాన్ గోస్ టూ ఇండియా’ తీశారు. మైసూర్లో షూటింగ్. ఆ సినిమాకు అన్నీ నేనే అయి పూర్తి చేశాను. ఆ సంస్థే 1952లో ‘భవానీ జంక్షన్’ సినిమా కోసం నా సహాయం కోరింది. ఢిల్లీ రైల్వేస్టేషన్లో షూటింగ్. ప్రధానమంత్రి నెహ్రూ అనుమతి కావాలి. ఆ సినిమాలో నటించేందుకు అప్పటి ప్రముఖ హాలీవుడ్ హీరోయిన్ అవాగాడ్కర్ సహా చిత్ర యూనిట్ అంతా మద్రాస్ వచ్చారు. నేను నెహ్రూ దగ్గరకెళ్లాను. స్క్రిప్టు అందజేశాను. అది చదివి ఆయన నిరాకరించారు. పాకిస్తాన్‌కు అనుకూలంగా ఉన్న ఆ సినిమా ఇండియాలో తీయడానికి వీల్లేదన్నారు. దాంతో వాళ్లు పాకిస్తాన్‌కు వెళ్లిపోయారు. అప్పటి వరకు వాళ్లతో కలిసి పని చేసినందుకు ఎంజీఎం స్టూడియో నాకు 20 వేల డాలర్లు ఇచ్చింది. 30 సినిమాలు తీసి.. కె. బాలచందర్ రచించిన ‘మేజర్ చంద్రకాంత్’ను తెలుగులో ఏకాంబరేశ్వర్రావును భాగస్వామిగా పెట్టుకొని ‘సుఖదుఃఖాలు’ పేరుతో తీశాను. ఎస్వీరంగారావు హీరోగా నటించారు. ఆ తర్వాత వాణిశ్రీ, కృష్ణలతో ‘జగత్ కిలాడీలు’తీశాను. హిట్ అయింది. వరుసగా ‘జగజ్జెట్టీలు’,‘జగజ్జెంత్రీలు’ తీశాను. డబ్బులు బాగా వచ్చాయి. ఆ తర్వాత దాసరి దర్శకత్వంలో ‘తాత మనువడు’ నిర్మించాను. 400 రోజులు ఆడింది. మా యూనిట్లో అసిస్టెంట్ డెరైక్టర్‌గా పనిచేసిన కోడి రామకృష్ణ ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’కు పూర్తిస్థాయి దర్శకత్వం చేశాడు. ఆ సినిమా 600 రోజులు ఆడింది. నిర్మాతగా 30 సినిమాలు తీశాను. ‘అంకితం’ నా ఆఖరి సినిమా. ఫిల్మ్‌నగర్‌లో తొలి ఇల్లునాది.. ఎన్టీరామారావు, అక్కినేనిలతో మొదటి నుంచి మంచి స్నేహం ఉంది. కానీ వాళ్లతో సినిమాలు తీయలేదు. ఎన్టీఆర్ ఎప్పుడు కాల్షీట్ అడిగినా ఇస్తానన్నారు. నా ‘సుఖదుఃఖాలు’ సినిమాకు హీరోగా నటించాలని అక్కినేనిని అడిగాను. ఆయన నా వైపు కోపంగా చూసి ‘నన్ను పెట్టి సినిమాలు తీసే స్థాయికి ఎదిగావా’ అని అన్నారు. అప్పటి నుంచి ఆయననే కాదు ఎన్టీఆర్‌ను కూడా అడిగేందుకు సాహసించలేదు. మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తెలుగు సినిమా హైదరాబాద్‌కు తరలి వచ్చింది. అప్పుడు ఫిల్మ్‌నగర్ ఓ అడవి. ఆ అడవిలో మొట్టమొదటి ఇల్లు నాది. వ్యక్తిగత వివరాలు... పేరు : కోటిపల్లి రాఘవ పుట్టిన తేదీ : 9 డిసెంబర్, 1913 సొంత ఊరు : కోటిపల్లి, కాకినాడ అమ్మా,నాన్న : నాగమ్మ, నారాయణస్వామి భార్య : హంస కొడుకు : ప్రతాప్ కూతురు : ప్రశాంతి అవార్డులు : అక్కినేని జీవిత సాఫల్య పురస్కారం, రఘుపతి వెంకయ్య సహా పలు అవార్డులు -
కలలో రాక్షసులు కనిపిస్తున్నారా?
హిమాలయాలకు, వింధ్యపర్వతాలకు మధ్యగా అప్పటి ఆర్యావర్తనం (ఆర్యుల భూభాగం) ఎక్కడ ఉండేదో మన దేశపటంలో నువ్వు చూశావు. అది బాల చంద్రాకారంగా ఉన్నట్లు కనిపిస్తుంది. అందుకే ఆర్యావర్తానికి ఇందుదేశమని పేరు వచ్చింది. ఇందు దేశమే హిందూదేశమయింది. రామాయణం పుట్టిన చాలాకాలానికి మహాభారతం పుట్టింది. అది రామాయణం కంటే పెద్ద గ్రంథం. దానిలో చెప్పింది ఆర్యద్రావిడ యుద్ధం కాదు. ఆర్యుల మధ్య ఏర్పడిన కుటుంబకలహమే భారతకథ. భారతంలో చెప్పిన కథలు, ధర్మాలు ఇన్నీ అన్నీ కావు. అవి చాలా అందంగా, గంభీరంగా ఉంటాయి. వీటి అన్నిటికంటే గొప్పదైన భగవద్గీత అనే మహాగ్రంథం మహాభారతంలో ఉన్న కారణాన అది మనకందరికీ ప్రియతమమైనది అయింది. వేల సంవత్సరాల క్రితమే మన దేశంలో ఇలాంటి గొప్ప గ్రంథాలు పుట్టాయి. మహానుభావులే వీటిని రాసి ఉంటారు. ఈ గ్రంథాలు పుట్టి ఇంతకాలం గడిచినా వాటి గురించి తెలుసుకోని పిల్లలు, ప్రయోజనం పొందని పెద్దలు అంటూ ఉండరు. నెహ్రూ ఇందిరకు రాసిన లేఖలోనుంచి కలలో రాక్షసులు కనిపిస్తున్నారా? స్వప్నలిపి ...ఇదో కలల నిఘంటువు కలలు అనేవి తీసిపారేయదగినవి కాదని, వాటికంటూ నిర్దిష్టమైన అర్థం ఉందని కలలను లోతుగా అధ్యయనం చేసిన నిపుణులు అంటారు. వారు చెప్పే దాని ప్రకారం కల అంటే ఏమిటో కాదు...మన అంతః చేతనలోని వ్యక్తిగత ఉత్తరం. పదాలకు నిఘంటువు ఉన్నట్లే కలల అంతరార్థాలను తెలుసుకోవడానికి కూడా నిఘంటువు ఉంది. దాని ప్రకారం మీ కలకు అర్థం ఇది... స్వప్న తాత్పర్యం మీకో దురలవాటు ఉంటుంది. సపోజ్... మద్యపానం అనుకోండి. ఆ వ్యసనం మిమ్మల్ని అన్ని రకాలుగా బాధ పెడుతుంది. మీలో అంతర్మథనం మొదలవుతుంది. తాగడం మానేయాలని మొదటి రోజు అనుకుంటారు. రెండోరోజు మానేస్తారు. మూడోరోజు మాత్రం ముఖం మాడ్చేస్తారు. ‘ఏదో మిస్ అయింది’ అనుకుంటారు. మళ్లీ మందు కొడతారు. మళ్లీ బాధపడతారు. మానాలనుకోవడం, మానలేకపోవడం ఎన్నోసార్లు జరుగుతుంటుంది. మిమ్మల్ని కలలో వెంటాడుతున్న ఆ రాక్షసుడు ఎవరో కాదు... అలాంటి ఓ వ్యసనం! ఆ రాక్షసుడికి బలవుతారా? సంహరిస్తారా? అనేది మీ సంకల్పబలం మీద ఆధారపడి ఉంటుంది. పోస్ట్‌కార్డ్‌లు అమ్మేవాడు! తెలిసిన వ్యక్తి- తెలియని విషయం వయసులో ఉన్నప్పుడు మంచి ఆర్టిస్ట్ కావాలనుకున్నాడు. సన్నిహితులు, స్నేహితులు ‘ఆడి’ పేరుతో పిలిచేవారు. తల్లి చనిపోయిన తరువాత వియన్నాలో పోస్ట్‌కార్డులు అమ్మి తన అవసరాలకు కావలసిన డబ్బు సంపాదించేవాడు. చదువును హైస్కూల్‌తోనే ఆపేశాడు. హిట్లర్ అనగానే జర్మనీ, జర్మనీ అనగానే హిట్లర్ గుర్తుకువస్తారు. కానీ హిట్లర్ పుట్టింది ఆస్ట్రియాలో! హిట్లర్ తల్లి బ్రెస్ట్ క్యాన్సర్‌తో చనిపోయింది. మొదటి ప్రపంచ యుద్ధకాలంలో హిట్లర్ జర్మనీ సైన్యంలో పనిచేశాడు. తన ధైర్యసాహసాలకు పురస్కారం కూడా లభించింది. హిట్లర్ నిద్రలేమితో బాధపడేవాడు. కొన్ని సందర్భాల్లో పగలు నిద్ర పోతుండేవాడు. ఆర్ట్ స్కూల్లో హిట్లర్ ప్రవేశ దరఖాస్తు తిరస్కరణకు గురైంది. హిట్లర్ మద్యం ముట్టేవాడు కాదు. శాకాహారి. హిట్లర్‌కు బ్లేడ్లు అంటే భయం. రక్తతులాభారం! ఆదర్శం పువ్వులు, కరెన్సీ, బెల్లం...రకరకాల తులాభారాల గురించి మనం విని ఉన్నాం. ఇప్పుడు ఈ జాబితాలో ‘రక్తతులాభారం’ పేరు కూడా చేర్చవచ్చు. ఇదేమి తులాభారం? అని ఆశ్చర్యపడిపోతున్నారా? అయితే మీరు నందా... సుదీప్ కుమార్ నందా గురించి తెలుసుకోవాల్సిందే. అన్నదానం మహాదానం...అని మనం అనుకుంటాంగానీ గుజరాత్ ఐఏయస్ అధికారి సుదీప్ కుమార్ నందాకు మాత్రం రక్తదానం మహాదానం. ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన రక్తదానం చేయడమే కాదు, దాని ఆవశ్యకతను గురించి ప్రజలను చైతన్యవంతం చేస్తున్నాడు. రక్తదానం గురించి బొత్తిగా తెలియని వారు కూడా సుదీప్ మాటల ప్రభావంతో ఆయన బాటలో నడవడం ప్రారంభించారు. తాజా సంగతి ఏమిటంటే... రక్తదానం విషయంలో ఎందరికో ఆదర్శంగా నిలిచిన సుదీప్ కుమార్‌ను ఆయన అభిమానులు సరికొత్త రీతిలో సన్మానించారు. గుజరాత్‌లోని కల్ల గ్రామంలోని 513 మంది 79 లీటర్ల రక్తాన్ని దానంగా ఇచ్చి ‘రక్త తులా సన్మాన్’ నిర్వహించారు.