
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని నెహ్రూ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఘనంగా నివాళులర్పించారు. నెహ్రూ వారసత్వం దీపస్తంభంలా నిలిచిపోతుందని, భారతదేశ ఆదర్శం, స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలను ప్రకాశింప జేస్తుందని రాహుల్ పేర్కొన్నారు. నెహ్రూ దూరదృష్టి, విలువలు ఎల్లప్పుడూ మనకు మార్గదర్శకాలుగా నిలుస్తాయని ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, రాహుల్ తదితరులు శనివారం శాంతివన్‌లోని నెహ్రూ స్మారకాన్ని సందర్శించి పుష్పాంజలి ఘటించారు. ‘మన మాజీ ప్రధాని నెహ్రూకు వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నా’అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment