death aniversary
-
Vikram Sarabhai: భారత అంతరిక్ష పరిశోధనలకు ఆద్యునిగా..
విక్రమ్ సారాభాయ్ పేరు విన్నంతనే మనకు ‘ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్’ రూపంలో స్ఫురణకు వస్తారు. ఈరోజు (డిసెంబరు 30) విక్రమ్ సారాభాయ్ వర్థంతి. భౌతిక శాస్త్రవేత్తగా, ఖగోళ శాస్త్రవేత్తగా దేశానికి ఎంతో సేవ చేసిన ఆయన 1971, డిసెంబరు 30న కన్నుమూశారు. శాస్త్రవేత్తగా ఆయన అందించిన సహకారం మరువలేనిది. విక్రమ్ సారాభాయ్ పలు విషయాలపై పరిశోధన పత్రాలు రాయడమే కాకుండా ఎన్నో సంస్థలను కూడా స్థాపించారు. భారతదేశ అంతరిక్ష పరిశోధనలకు, దేశ అణుశక్తి అభివృద్ధికి ఆయన చేసిన కృషి ఎన్నటికీ మరువలేనిది.కేంబ్రిడ్జ్ నుండి పట్టా పొంది..1919, ఆగస్టు 12న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జన్మించిన విక్రమ్ సారాభాయ్.. అంబాలాల్ సారాభాయ్, సరళా సారాభాయ్‌ల కుమారుడు. ఆయన 1937లో ఇంగ్లాండ్‌లోని కేంబ్రిడ్జ్ నుండి ట్రిపోస్ డిగ్రీని అందుకున్నారు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో భారతదేశానికి తిరిగి వచ్చిన విక్రమ్ సారాభాయ్(Vikram Sarabhai) మరో శాస్త్రవేత్త శివరామన్ పర్యవేక్షణలో పరిశోధనలు సాగించడం మొదలుపెట్టారు.86 శాస్త్రీయ పరిశోధనా పత్రాలువిక్రమ్ సారాభాయ్ తన జీవితంలో మొత్తం 86 శాస్త్రీయ పరిశోధనా పత్రాలను రాశారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, సంస్కృతికి సంబంధించిన 40 సంస్థలను స్థాపించారు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ఆయన చేసిన కృషికిగాను మరణానంతరం ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ ప్రకటించింది. విక్రమ్ సారాభాయ్ పేరు మీద పలు సంస్థలు తెరుచుకున్నాయి. చంద్రయాన్ మిషన్(Chandrayaan Mission)కు చెందిన ల్యాండర్‌ను కూడా విక్రమ్ ల్యాండర్ అని పిలుస్తారు.పరిశోధనలు సాగాయిలా..విక్రమ్ సారాభాయ్ తన మొదటి పరిశోధనా కథనాన్ని టైమ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కాస్మిక్ రేంజ్ పేరుతో ప్రచురించారు. 1940-45 మధ్య కాలంలో సీవీ రామన్ సారధ్యంలో కాస్మిక్ రేంజ్‌పై పరిశోధనలు చేశారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత కేంబ్రిడ్జ్‌కి తిరిగి వెళ్లిన విక్రమ్ సారాభాయ్ ఉష్ణమండల అక్షాంశాలలో కాస్మిక్ కిరణాలపై తన పరిశోధనను పూర్తి చేసి డాక్టరేట్ పొందారు.అనంతరం భారత్‌కు తిరిగివచ్చి, కాస్మిక్ రేడియేషన్, రేడియో ఫిజిక్స్(Radio Physics)లపై పలు పరిశోధనలు సాగించారు.అసాధారణ ప్రతిభ కలిగిన వ్యక్తిగా..ఇంటర్‌ప్లానెటరీ స్పేస్, సౌర ఈక్వటోరియల్ రిలేషన్స్, జియోమాగ్నెటిజంపై కూడా ఆయన పరిశోధనలు చేశారు. విక్రమ్ సారాభాయ్ పరిశోధనలను సైద్ధాంతిక భౌతిక శాస్త్రం, రేడియో భౌతిక శాస్త్రం పరిధిలోకి తీసుకువచ్చారు. ఆయన తన పరిశోధనలకు ఇండియన్ అటామిక్ ఎనర్జీ కమిషన్ నుండి ఆర్థికసాయం అందుకున్నారు. భారతదేశపు మొట్టమొదటి మార్కెట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఆపరేషన్ రీసెర్చ్ గ్రూప్ స్థాపనలో కూడా ప్రధాన పాత్ర పోషించారు. అతనితో పనిచేసిన చాలా మంది శాస్త్రవేత్తలు ఆయనను కృషీవలునిగా పేర్కొంటారు. తాను కన్న కలలను నిజం చేసుకున్న అసాధారణ ప్రతిభ కలిగిన వ్యక్తిగా విక్రమ్ సారాభాయ్ని గుర్తిస్తారు.ఆర్థికాభివృద్దిలో అంతరిక్షశాస్త్ర భాగస్వామ్యంప్రముఖ శాస్త్రవేత్త హోమీ జహంగీర్ భాభాను భారత అణువిద్యుత్ ప్లాంట్‌లో పనిచేయడానికి ప్రేరేపించినది.. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వాన్ని ఒప్పించింది విక్రమ్ సారాభాయ్నే. ఆయన కృషి, చొరవలతోనే ఇస్రో స్థాపితమయ్యింది. డాక్టర్ హోమీ జహంగీర్ భాభా తర్వాత, విక్రమ్ సారాభాయ్ ఇండియన్ అటామిక్ ఎనర్జీ కమిషన్ ఛైర్మన్ అయ్యారు. డాక్టర్ సారాభాయ్ కేవలం విజ్ఞాన శాస్త్రానికే కాకుండా సమాజం, ఆర్థికాభివృద్ధిలో దాని భాగస్వామ్యానికి రూపకల్పన చేశారు. అంతరిక్ష శాస్త్రం సాయంలో కమ్యూనికేషన్, వాతావరణ శాస్త్రం, సహజ వనరుల అన్వేషణ సాగించవచ్చని తెలిపారు. భారతదేశంలో శాటిలైట్ టెలివిజన్ ప్రసారాల అభివృద్ధి విక్రమ్ సారాభాయ్ ప్రోత్సహించిన రాకెట్ టెక్నాలజీ కారణంగానే సాధ్యమయ్యింది.ఇది కూడా చదవండి: Year Ender 2024: ఎన్నటికీ మరువలేని రెండు దుర్ఘటనలు -
అంబేద్కర్‌కు వైఎస్ జగన్ నివాళులు
సాక్షి,తాడేపల్లి:రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ నివాళులర్పించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం(డిసెంబర్6) జరిగిన కార్యక్రమంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వైఎస్ జగన్.ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ అంబేద్కర్ స్ఫూర్తి ఎల్లవేళలా సమాజానికి మార్గదర్శకంగా నిలిచేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఆయన జీవితం అందరికీ ఆదర్శనీయమని కొనియాడారు. విజయవాడలోని స్వరాజ్ మైదానంలో ప్రపంచంలోనే ఎత్తైన అంబేద్కర్ గారి సామాజిక న్యాయ మహాశిల్పాన్ని తమ హయాంలో ఏర్పాటు చేసిన విషయాన్ని వైఎస్ జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కమార్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్,మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, నెడ్ క్యాప్ మాజీ ఛైర్మన్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
నిజ్జర్‌కు కెనడా పార్లమెంటు నివాళి
న్యూఢిల్లీ: ఖలిస్తానీ తీవ్రవాది హర్దీప్సింగ్ నిజ్జర్ మృతి చెంది ఏడాది గడిచిన సందర్భంగా మంగళవారం కెనడా పార్లమెంటు నివాళులరి్పంచింది. హౌస్ ఆఫ్ కామన్స్‌లో సభ్యులు మౌనం పాటించారు. ఖలిస్తానీ టైగర్ ఫోర్స్ (కేటీఎఫ్) అధినేత నిజ్జర్ గత ఏడాది జూన్ 18న కెనడాలోని బ్రిటిష్ కొలంబియా గురుద్వారా ఎదుట జరిగిన కాల్పుల్లో హతమాయ్యాడు. భారత ప్రభుత్వం ప్రకటించిన టెర్రిరిస్టుల జాబితాలో నిజ్జర్ పేరు ఉంది. నలుగురు భారతీయులు నిజ్జర్ హత్య కేసులో నిందితులుగా ఉన్నారు. నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ప్రమేయం ఉందని కెనడా ఆరోపిస్తోంది. అప్పటినుంచి ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. 1997లో నకిలీ పాస్‌పోర్ట్‌పై నిజ్జర్ కెనడాకు వెళ్లాడు. శరణార్థిగా కెనడా పౌరసత్వాన్ని కోరాడు. ఇది తిరస్కరణకు గురైంది. అనంతరం తాను కెనడాకు రావడానికి సహాయపడ్డ మహిళను నిజ్జర్ వివాహమాడి మరోమారు పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోగా.. మళ్లీ తిరస్కరణకు గురైంది. అయితే నిజ్జర్ హత్యకు గురైన వెంటనే కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడెయూ అతను కెనడా పౌరుడని పార్లమెంటులో చెప్పారు. నిజ్జర్ కేటీఎఫ్ కోసం నియామకాలు చేసుకొని.. వారికి శిక్షణ ఇస్తున్నాడని భారత భద్రతా సంస్థలు పేర్కొన్నాయి. నిజ్జర్‌కు కెనడా పార్లమెంటు నివాళి అరి్పంచడంపై వాంకోవర్‌లోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. 1985లో ఎయిర్ ఇండియా కనిష్క విమానంలో ఖలిస్తానీ తీవ్రవాదులు బాంబులు అమర్చడంతో 329 ప్రాణాలు కోల్పోయారు. వారి స్మృత్యర్థం ఈనెల 23న (విమాన ఘటన 39 ఏళ్లు) సంస్మరణ సభ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. -
సుశాంత్ వర్ధంతి.. వెక్కివెక్కి ఏడ్చిన బుల్లితెర నటి!
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పేరు బాలీవుడ్లో తెలియనివారు ఉండరు. ఎంఎస్ ధోని చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అయితే ఊహించని విధంగా 2020లో ముంబయిలోని తన నివాసంతో సూసైడ్ చేసుకున్నారు. ఇవాళ అతని నాలుగో వర్ధంతి సందర్భంగా పలువురు బాలీవుడ్ ప్రముఖులు సుశాంత్‌కు నివాళులర్పించారు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. సుశాంత్ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, అతని సోదరి శ్వేతా సింగ్ కీర్తి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమానికి సుశాంత్ సన్నిహితురాలు, సహనటి క్రిస్సన్ బారెట్టో కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుశాంత్‌ను తలుచుకుని బోరున విలపించారు. అతనికి ఇలా జరిగి ఉండాల్సింది కాదంటూ వెక్కివెక్కి ఏడ్చారు. సుశాంత్ తనతో ప్రతి చిన్న విషయంలోనూ ఎప్పుడు చాలా సంతోషంగా, ఉత్సాహంగా ఉండేవాడని అన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. సుశాంత్.. ఎంఎస్ ధోని మూవీతో పాటు డ్రైవ్, చిచోరే, కేదార్నాథ్, దిల్ బేచారా లాంటి సినిమాల్లో నటించారు. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
విలక్షణ నటుడు, తన మాజీ భర్తను తలచుకున్న రోహిణి.. పోస్ట్ వైరల్!
నటుడు రఘువరన్ పేరు వినగానే ఆయన విలక్షణమైన పాత్రలు ముందుగా మన మనసులో గుర్తొస్తాయి. ఏ పాత్రల్లోలోనైనా పరకాయ ప్రవేశం చేసి.. జనాన్ని మెప్పించడంలో మేటి అనిపించుకున్నారు. దక్షిణాదిలో అన్ని భాషల్లో రఘువరన్ నటించారు. కొన్ని హిందీ చిత్రాలలోనూ రఘువరన్ తనదైన నటనతో ఆకట్టుకున్నారు. విలక్షణ నటునిగా జనం మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. చివరి రోజుల్లో ఆల్కహాల్‌కు బానిస అయిన రఘువరన్ 2008 మార్చి 19న కన్నుమూశారు. ఇవాళ రఘువరన్ వర్ధంతి సందర్భంగా ఆయన భార్య, నటి రోహిణి మొల్లేటి తన భర్తను తలుచుకున్నారు. ఆయనకు నివాళులర్పిస్తూ ట్విటర్ ద్వారా ఫోటోను పంచుకున్నారు. రోహిణితో పెళ్లి కాగా.. నటి రోహిణితో రఘువరన్ వివాహం 1996లో జరిగింది. వారిద్దరికీ రిషి వరుణ్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. అయితే 2004లో వీరిద్దరు విడిపోయారు. విడిపోవడానికి గల కారణాలను రోహిణి అప్పట్లో బయటపెట్టింది. రఘువరన్ తాగుడు ముందు తాను.. తన కొడుకు ఓడిపోయామని రోహిణి అప్పట్లో వెల్లడించింది. రఘువరన్ ఎంతో ఇష్టంగా కంపోజ్ చేసి, పాడిన ఆరు పాటలను ఆయన మరణం తరువాత ఓ ఆల్బమ్‌గా తీసుకొచ్చారు. గతంలో రజనీకాంత్ చేతులమీదుగా ఈ ఆల్బమ్‌ను ఆయన భార్య రోహిణి, తనయుడు రిషి వరన్ అందుకున్నారు. ఏది ఏమైనా రఘువరన్ విలక్షణమైన నటనతో జనం మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. రఘువరన్ తన కెరియర్లో 150కు పైగా సినిమాలలో నటించారు. మంచి పేరు సంపాదియడమే కాకుండా ఎక్కువగా సక్సెస్ మెజారిటీని అందుకున్నారు. తెలుగులో పాటు ఇతర భాషలలో కూడా రఘువరన్ మంచి పేరు సంపాదించారు. టాలీవుడ్లో శివ, బాషా ,పసివాడు ప్రాణం వంటి సినిమాలలో నటించి బాగానే పేరు సంపాదించిన రఘువరన్.. చివరిగా ఆటాడిస్తా సినిమాలో కనిపించారు. కాగా.. ఆయన మాజీ భార్య రోహిణి బాలనటిగా పరిచయమై ఆ తర్వాత కథానాయికగా, ఆపై క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా దక్షిణాది ప్రేక్షకులను అలరించింది. ఇప్పటికీ విభిన్నమైన పాత్రల్లో రోహిణి మెప్పిస్తున్నారు. pic.twitter.com/HBy7RE5eCr — Rohini Molleti (@Rohinimolleti) March 19, 2024 -
వైఎస్సార్ 14వ వర్థంతి: డాలస్‌లో రక్తదాన శిబిరం
దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతి సందర్బంగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైఎస్సార్సీపీ శ్రేణులు వివిధ కార్యక్రమాలు చేపట్టారు. అమెరికాలోని డాలస్ నగరంలో ప్రవాసాంధ్రులు మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి ఘన నివాళులర్పించారు. వైఎస్సార్ వర్ధంతిని పురస్కరించుకుని అమెరికాలోని టెక్సాస్‌లో బ్లెడ్ డ్రైవ్ నిర్వహించారు. డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ యూఎస్ఏ ఆధ్వర్యంలో డాలస్ నగరంలో అమెరికన్ రెడ్ క్రాస్ సంస్థ సహాయంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రతీ సంవత్సరం రాజన్నను స్మరించుకుంటూ ఈ శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు వైఎస్సార్ సభ్యులు తెలిపారు. ఈ రక్త దాన శిబిరంలో వైఎస్సార్ అభిమానులు, డాలస్ వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, ప్రవాసులు పాల్గొని విజయవంతం చేశారు. ప్రతీ సంవత్సరం బ్లడ్ డ్రైవ్ ఏర్పాటు చేయటం పట్ల అమెరికన్ రెడ్ క్రాస్ ప్రతినిధులు వైఎస్సార్ అభిమానులను ప్రశంసించారు. ఈ సందర్భంగా జన హృదయ నేత ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను, ఆయన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ప్రవాసులు ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అన్ని వర్గాల వారికి కుల, మత , పేద ధనిక పార్టీలకు అతీతంగా అందాయని అన్నారు. ఎంత మంది సీఎం లు పాలించిన కూడా, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒక్కరే చనిపోయిన తర్వాత కూడా ప్రజల గుండెల్లో కొలువైనారని, నిజమైన అమరత్వం అంటే ఇదే అని పలువురు కొనియాడారు. (చదవండి: అమెరికాలోని ఓ రహదారికి భారత సంతతి పోలీస్ పేరు!) -
మై డియర్ కోహినూర్...
దిలీప్ కుమార్–సైరాభాను వేరు వేరు పేర్లు కావు. ఒకే నామం. వారిది ఆదర్శ దాంపత్య బంధం. దిలీప్ సాబ్–సైరాభానుల ఆన్–స్క్రీన్, ఆఫ్–స్క్రీన్ కెమిస్ట్రీ ‘ఆహా’ అనిపిస్తుంది. 78 ఏళ్ల వయసులో సైరాభాను తన డెబ్యూ ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌తో నెటిజనుల దృష్టిని ఆకట్టుకుంది. తొలి పోస్ట్‌లో భర్తను జ్ఞాపకం చేసుకొని, అతడికి ఇష్టమైన ఉర్దూ ద్విపదలను ఉటంకించింది. ఈ పోస్ట్‌కు నెటిజనులు ‘వహ్వా’ అంటున్నారు. ‘నేను సాహెబ్ అని ఎప్పుడూ పిలుచుకునే వ్యక్తి ఈరోజుకీ నాతోనే ఉన్నాడు. నాతోపాటే నడుస్తున్నాడు’ అంటూ దిలీప్ కుమార్ వర్థంతి సందర్భంగా తన మనసులోని మాట రాసింది. ఆమె పోస్ట్ చేసిన దిలీప్ కుమార్‌కు నచ్చిన కవితాపంక్తులు... ‘నాకు ప్రియమైన వ్యక్తి గాఢమైన నిద్రలో ఉన్నాడు. నా ప్రపంచం నిశ్చలనంగా మారిపోయింది. మేలుకోవాల్సిందిగా అతడిని ప్రార్థిస్తున్నాను. అతడి మెలకువతో నా ప్రపంచం మళ్లీ చలనశీలం అవుతుంది’ -
‘నెహ్రూ వారసత్వం దీపస్తంభం వంటిది’
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని నెహ్రూ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఘనంగా నివాళులర్పించారు. నెహ్రూ వారసత్వం దీపస్తంభంలా నిలిచిపోతుందని, భారతదేశ ఆదర్శం, స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలను ప్రకాశింప జేస్తుందని రాహుల్ పేర్కొన్నారు. నెహ్రూ దూరదృష్టి, విలువలు ఎల్లప్పుడూ మనకు మార్గదర్శకాలుగా నిలుస్తాయని ట్వీట్ చేశారు. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, రాహుల్ తదితరులు శనివారం శాంతివన్‌లోని నెహ్రూ స్మారకాన్ని సందర్శించి పుష్పాంజలి ఘటించారు. ‘మన మాజీ ప్రధాని నెహ్రూకు వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నా’అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. -
డా సి.నారాయణరెడ్డి కవిత్వం అజరామరం..
మహాకవి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి కవిత్వం అజరామరమైనదని వక్తలు శ్లాఘించారు. డా సినారె 4వ వర్ధంతిని పురస్కరించుకొని తెలంగాణ సారస్వత పరిషత్తు, వంశీ - డా సినారె విజ్ఞాన పీఠం, కేతవరపు పౌండేషన్, సంతోషం ఫిలిం న్యూస్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం జరిగిన అంతర్జాల సదస్సులో సారస్వత పరిషత్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షోపన్యాసం చేస్తూ.. డా సినారె పండితులలో పండితుడు, కవులకే కవి, పరిశోధకులకే పరిశోధకుడు అన్నారు.. సినారె శబ్ద పుష్టి, శబ్ద సిద్ధి అనితర సాధ్యమని తెలిపారు. తెలుగు సాహిత్యాన్ని బోధించడంలో ఆయన ఆదర్శప్రాయులని అన్నారు. సారస్వత పరిషత్తు అధ్యక్షునిగా పరిషత్తును పునరుజ్జీవింప చేశారు. ప్రముఖ సినీ గీత కర్త భువనచంద్ర మాట్లాడుతూ సినారె అనే మహావృక్షం నీడలో వేలమంది విద్యార్థులు భాషా సాహిత్య విజ్ఞాన దాహార్తిని తీర్చుకుని సేదదీరారని అన్నారు. అటు సామాన్య రైతు కుటుంబంలో జన్మించి అనితరసాధ్యమైన కృషితో అత్యున్నత స్థానం అందుకున్న సినారె తరాలకు తరగని స్ఫూర్తి ప్రదాత అని వివరించారు. అందమైన, అర్థవంతమైన తెలుగు పలుకులను ప్రయోగించే శక్తి సినారె స్వంతమని అన్నారు. వంశీ రామరాజు స్వాగత ప్రసంగం చేస్తూ డా సి.నారాయణరెడ్డి ప్రోత్సాహంతో 50 ఏళ్లుగా వంశీ గణనీయమైన రీతిలో సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న దని, వేగేశ్న సేవా సంస్థ ద్వారా అనాధలను ఆదరించి, చదివించి ఉన్నత స్థానంలో నిలుపుతున్నామని తెలిపారు. కేతవరపు రాజ్యశ్రీ సినారె నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుని ఆచరణలో పెట్టామన్నారు.. సురేష్ కొండేటి "సంతోషం ఫిలిం న్యూస్" మాట్లాడుతూ పత్రికా రచయితగా సినారె నుంచి ప్రోత్సాహం, స్ఫూర్తిని పొందామన్నారు. రసమయి స్థాపకులు డా ఎమ్ కె రాము "సినారె కవిత-- లయాత్మక" అనే అంశం పైన, డా వి ఎల్ నరసింహారావు "సినారె సినీగీతాలు పైన" డా ఎం కె పద్మావతి దేవి "డా సినారె కవితా దర్శనం - చారిత్రక కావ్యాలు- స్త్రీ పాత్ర చిత్రణ" పైన, డా సందినేని రవీందర్ "సినారె గేయనాటికల పైన" ప్రసంగించారు.. తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రధానకార్యదర్శి డా జుర్రు చెన్నయ్య కార్యక్రమాన్ని నిర్వహించారు.. డాలస్(అమెరికా)లో ఉన్న ప్రముఖ హృద్రోగ నిపుణుడు డాక్టర్ శ్రీనివాస రెడ్డి ఆళ్ళ, లండన్‌లో ఉన్న అమెరికన్ తెలుగు అసోసియేషన్ సాహిత్య విభాగం అధ్యక్షురాలు సింగిరెడ్డి శారద కూడా తమ ప్రసంగాలలో డా సినారె సాహిత్య, సాంస్కృతిక విశిష్టతను ప్రస్తావించారు. -
పన్నుల వ్యవస్థలో విప్లవాత్మకం... జీఎస్టీ
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వ్యవస్థ ప్రవేశపెట్టడంతో పన్నుల భారం తగ్గిందని, దీనితో సరళతర పన్ను వ్యవస్థలో పన్నులు చెల్లించే వారి సంఖ్య దాదాపు రెట్టింపై 1.24 కోట్లకు పెరిగిందనీ ఆర్థిక మంత్రిత్వశాఖ సోమవారం వెల్లడించింది. ఆర్థికశాఖ మాజీ మంత్రి అరుణ్‌జైట్లీ మొదటి వర్ధంతి సందర్భంగా ఆర్థికశాఖ పలు ట్వీట్స్ చేసింది. దాదాపు 17 రకాల స్థానిక లెవీలు, 13 సెస్‌ల ఉపసంహరణలతో 2017 జూలై 1న జీఎస్టీ వ్యవస్థ ప్రారంభమైనప్పుడు బాధ్యతల్లో ఉన్న నరేంద్రమోదీ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా అరుణ్‌జైట్లీ ఉన్న సంగతి తెలిసిందే. ఆయన వర్ధంతి సందర్భంగా ఆర్థికశాఖ తాజా ట్వీట్స్ సారాంశాన్ని పరిశీలిస్తే... ► జీఎస్టీ ప్రవేశపెట్టకముందు అమల్లో ఉన్న బహుళ పరోక్ష పన్నుల వ్యవస్థ– వ్యాల్యూయాడెడ్ ట్యాక్స్ (వీఏటీ), ఎక్సైజ్, అమ్మకపు పన్ను వాటికి సంబంధించిన ఇతర చార్జీల వల్ల దేశ పౌరులపై అధిక పన్ను భారం ఉండేది. 31 శాతం వరకూ ఉన్న అధిక స్థాయి పన్ను రేటు ధరలపై ప్రభావం చూపేది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి పోయింది. తాజా వస్తు,సేవల పన్ను విధానం అటు వినియోగదారుకు అటు పన్ను చెల్లింపుదారుకూ స్నేహపూర్వకమైంది. ► జీఎస్టీకి ముందు అధిక పన్ను భారం వల్ల ఈ చట్రంలోకి రావడానికి వెనుకడుగు వేసే పరిస్థితి. అయితే సరళతర జీఎస్టీ వ్యవస్థలో పన్ను భారం తగ్గింది. దీనితో పన్ను చెల్లింపుదారు బేస్ కూడా పెరిగింది. ► జీఎస్టీ తొలినాళ్లలో అసెస్సీల సంఖ్య 65 లక్షలయితే, ఇప్పుడు ఈ సంఖ్య 1.24 కోట్లను దాటింది. ► జీఎస్టీ అమల్లో అరుణ్‌జైట్లీ పాత్ర కీలకమైనది. భారత్ పన్నుల వ్యవస్థలో జీఎస్టీ ఒక చరిత్రాత్మక సంస్కరణ. అప్పట్లో వివిధ రాష్ట్రాలు విధించే విభిన్న పన్ను రేట్లు తీవ్ర వ్యయ భరితంగా ఉండేవి. ప్రజలు పన్నులు చెల్లించే స్థాయికి రేట్లను జీఎస్టీ తగ్గించింది. అప్పట్లో రెవెన్యూ న్యూట్రల్ రేటు 15.3 శాతం అయితే, దానితో పోల్చితే ఇప్పుడు జీఎస్టీ రేటు 11.6 శాతానికి తగ్గింది. ► రూ.40 లక్షల వరకూ వార్షిక టర్నోవర్ ఉన్న వ్యాపారాలపై ఇప్పుడు జీఎస్టీ మినహాయింపు ఉంది. ప్రారంభంలో ఇది రూ.20 లక్షలుగా ఉండేది. దీనికితోడు రూ.1.5 కోట్ల వరకూ టర్నోవర్ ఉన్న ఒక కంపెనీ కాంపోజిషన్ స్కీమ్ కింద కేవలం ఒక శాతం పన్నును మాత్రమే చెల్లించే వెసులుబాటు ఉంది. ► జీఎస్టీ అమల్లోకి రావడంతోటే అనేక వస్తువులపై పన్ను రేట్లను తగ్గించడం జరిగింది. 28 శాతం పన్ను శ్లాబ్‌లో ఉన్న దాదాపు 230 వస్తువుల్లో దాదాపు 200 వస్తువులను తక్కువ స్లాబ్స్ రేట్లలోకి మార్చడం జరిగింది. హౌసింగ్ రంగాన్ని 5 శాతం శ్లాబ్‌లో ఉంచగా, చౌక గృహాలకు సంబంధించి జీఎస్టీ రేటును ఒక శాతానికి తగ్గింది. ► జీఎస్టీకి సంబంధించిన ప్రాసెస్ అంతా పూర్తిగా ఆటోమేటెడ్ చేయడం మరో విషయం. ప్రస్తుతం 50 కోట్ల రిటర్న్స్‌ను ఆన్లైన్లో దాఖలు చేయడం జరిగింది. 313 కోట్ల ఈ–వే బిల్లులు జనరేట్ అయ్యాయి. స్థిరంగా పెరుగుతున్న రెవెన్యూ 2017 జూలై 1వ తేదీ అర్థరాత్రి నుంచీ భారత పన్నుల వ్యవస్థలో చరిత్రాత్మక మార్పు. ఒకే మార్కెట్‌గా భారత్ ఆవిర్భవించింది. బహుళ పన్ను వ్యవస్థకు తెరపడింది. ప్రస్తుతం 480 వస్తువులు పన్ను రహిత లేదా 5 శాతంలోపు పన్ను రేట్లలో ఉన్నాయి. 221 వస్తువులు 12 శాతం రేటు వద్ద, 607 వస్తువులు 18 శాతం రేటు వద్ద ఉండగా, కేవలం 29 వస్తువులు మాత్రమే 28% రేటు వద్ద ఉన్నాయి. ఆయా సడలింపుల నేపథ్యంలో పన్ను గడచిన మూడేళ్లలో పన్ను బేస్ పెరిగింది. 2017–18 తొమ్మిది నెలల్లో (జూలై–మార్చి) సగటు రెవెన్యూ రూ.89,700 కోట్లు. 2018–19లో నెలకు సగటు రెవెన్యూ 10% పెరిగి మొత్తంగా ఆదాయాలు రూ.97,100 కోట్లకు చేరాయి. 2019–20లో ఈ ఆదాయం ఏకంగా రూ.1,02,000కోట్లకు ఎగసింది. రేట్ల తగ్గింపు, పలు సడలింపులు ఇస్తున్నప్పటికీ, జీఎస్టీ స్థిరంగా పెరుగుతూ వస్తున్న విషయం గమనార్హం. కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో, జీఎస్టీ భారం తగ్గడానికి ప్రభుత్వం మరికొన్ని సడలింపులు ప్రవేశపెట్టింది. – అరుణ్‌జైట్లీ వర్ధంతి సందర్భంగా రాసిన ఒక ఆర్టికల్‌లో ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ -
నిస్వార్థ సేవకుడు వర్ధెల్లి బుచ్చిరాములు
సూర్యాపేట: తాను పట్టిన ఎర్రజెండాను విడనాడకుండా చనిపోయేంత వరకు పార్టీ కోసం, ప్రజల కోసం పనిచేసిన స్వార్థం లేని నాయకుడు వర్ధెల్లి బుచ్చిరాములు అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పబ్లిక్ క్లబ్లో సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుచ్చిరాములు ప్రథమ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా జూలకంటి మాట్లాడుతూ, తన జీవితానంతా పేదల కోసం ధారపోసిన కమ్యూనిస్టు యోధుడు బుచ్చిరాములు అని, నమ్మిన సిద్ధాంతం కోసం ఏనాడూ రాజీపడని వ్యక్తి అని కొనియాడారు. సమసమాజ స్థాపనకు నాటి సాయుధ పోరాటం నుంచి నేటి తెలంగాణ ఉద్యమం వరకు పోరాడిన ఏకైక వ్యక్తిగా నిలిచారన్నారు. రాజకీయాల్లో విలువలు తగ్గుతున్నా, తాను నమ్మిన సిద్ధాంతాలకే కట్టుబడి సమాజసేవకు పాటుపడ్డారని కొనియాడారు. బహుజన రాజ్యాధికారం సాధించేందుకు పునాది వేసి పోరాటాలు నడిపారన్నారు. బీఎన్, ధర్మభిక్షం, నల్లా రాఘవరెడ్డిలు తొలితరం పోరాట నాయకులుగా కొనసాగితే .. రెండోతరాని కి బుచ్చిరాములు నాయకత్వం వహించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బుచ్చిరాములు కుమారుడు, సాక్షి ఎడిటర్ వర్ధెల్లి మురళి, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
జగ్జీవన్ రాంకు నివాళులు అర్పించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి : బాబు జగ్జీవన్ రాం వర్దంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీస్‌లో నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మిథున్ రెడ్డి, వైవి. సుబ్బారెడ్డి, చీఫ్ విప్ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జోహార్.. వైఎస్సార్
దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా శుక్రవారం జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్, వైఎస్సా ర్సీపీ నాయకులు, అభిమా నులు మహానేతకు నివా ళులర్పించారు. వైఎస్సార్ విగ్రహాలకు, చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. -
డాగ్స్ ప్రేమికులు
♦ డాగ్స్‌ని కన్నబిడ్డల్లా పెంచుతున్న దంపతులు ♦ పుట్టిన రోజు వేడుకులతో సంబురాలు ♦ మరణించిన శునకానికి వర్ధంతి మొయినాబాద్: వారికి డాగ్స్(శునకాలు) అంటే ఎంతో ఇష్టం... ఎంత ఇష్టమంటే వాటిని కన్నబిడ్డల్లా చూసుకునేలా.. వాటికి పుట్టని రోజు పండుగలు నిర్వహించే విధంగా.. అంతే కాదు చనిపోయిన కుక్కకు వర్ధంతి కూడా చేసేంత ప్రేమవారిది. హైదరాబాద్ నగరానికి చెందిన డాక్టర్ మోహన్, బిజయాదేవి దంపతులు. ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు మోహన్ చేవెళ్ల మండలంలోని ఆలూరు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య అధికారిగా పనిచేస్తుండగా బిజయాదేవి మొయినాబాద్ మండల పశువైద్యాధికారిగా పనిచేస్తున్నారు. వీరు మొయినాబాద్‌లోనే సొంత ఇళ్లు నిర్మించుకుని గత రెండు సంవత్సరాల క్రితంనుంచి ఇక్కడే ఉంటున్నారు. వీరికి శునకాలు అంటే చాలా ఇష్టం. గత పది సంవత్సరాలుగా వాటిని పెంచుతున్నారు. వీరికి పిల్లలు లేకపోవడంతో వాటినే కన్నబిడ్డల్లా చూసుకుంటున్నారు. ప్రస్తుతం వీరి ఇంట్లో నాలుగు శునకాలు వున్నాయి. వాటికి సీజర్, త్రెక్సీ, శాండి, కిట్టు పేర్లు పెట్టారు. వీటిక ప్రతి రోజు పాలు, పెరుగు, బిస్కెట్లు, చికెన్ రైస్ పెడతారు. వారానికోసారి స్నానం చేయిస్తారు. ఇలా వీటికోసం ప్రతి నెల రూ.10 వేల వరకు ఖర్చుపెడుతున్నారు. అయితే వాటిని ఎవరైనా కుక్కలు అని అంటే మాత్రం వారు తట్టుకోలేరు. పేరు పెట్టి పిలవాలని చెబుతారు. గత నెలలో పుట్టిన రోజు వేడుక మోహన్, బిజయాదేవిల ఇంట్లో ఉన్న శునకాలకు ప్రతి సంవత్సరం పుట్టిన రోజు వేడుకలు నిర్వహిస్తారు. ఇటీవలే జూన్ 2న త్రెక్సీ అనే శునకం పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. కేక్ కట్‌చేసి చుట్టుపక్కల ఉన్న శునకాలన్నింటికి భోజనం పెట్టి విందు ఏర్పాటు చేశారు. అదే విధంగా 2010లో చనిపోయిన శునకానికి ప్రతి సంవత్సరం జూన్ 29న వర్ధంతి నిర్వహిస్తున్నారు. మనుషులు జరుపుకే విధంగానే వాటికి అన్ని వేడుకలు నిర్వహిస్తూ ఈ జంతుప్రేమికులు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇతరులు ఇంటికి రావాలంటే భయం... మోహన్, బిజయాదేవిల ఇంటికి ఎవరైనా కొత్తగా వెళ్లాలంటే భయపడతారు. మనిషి బయట కనిపించగానే శునకాలు పెద్దగా అరుస్తాయి. దీంతో ఎవరూ అటు వైపు వెళ్లే సహసంకూడా చేయరు. అయితే కొత్తగా మొదటి సారి ఇంటికి వచ్చి వాటిని మచ్చిక చేసుకుంటే మాత్రం తరువాత ఎప్పుడెళ్లినా తమ విశ్వాసాన్ని ప్రదర్శిస్తాయి. వారి ఇంట్లో అద్దెకు ఉండే ముగ్గురు విద్యార్థులు సైతం ఈ శునకాలతో సన్నిహితంగా ఉంటారు. మా బిడ్డల్లా చూసుకుంటున్నాంః మోహన్, వైద్యాధికారి నేను చర్లపల్లి జైళ్లో డాక్టర్‌గా పనిచేసే సమయంలో అక్కడ త్రెస్సీ అనే డాగ్ ఉండేది. దాన్ని చాలా ప్రేమగా చూసుకునేవాళ్లం. 2010 జూన్ 29న అది మరణించింది. నా భార్య సొంత బిడ్డను కోల్పోయినంత బాధపడింది. ఆ తరువాత మళ్లీ అలాంటి డాగ్నే తీసికొచ్చి పెంచుతున్నాం. ఇలా ఇప్పుడు మొత్తం నాలుగు డాగ్స్‌ని పెంచుతున్నాం. వాటిని మా సొంత బిడ్డల్లా చూసుకుంటున్నాం. అన్ని వేడుకలు, పండుగలు వాటితోనే జరుపుకుంటున్నాం. -
'ఉద్యమ నిర్దేశకుడు జయశంకర్ సార్'
సిద్ధిపేట జోన్ (మెదక్): తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి కేసీఆర్ సారధిగా వ్యవహరించినప్పటికీ ఉద్యమ నిర్దేశకుడు మాత్రం దివంగత ప్రొఫెసర్ జయశంకరే అని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. జయశంకర్ నాలుగో వర్ధంతిని పురస్కరించుకుని ఆదివారం మెదక్ జిల్లా సిద్దిపేటలోని మస్తానాబాద్ చౌరస్తాలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రొఫెసర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం జయశంకర్ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ నిర్వహించారు. తన జీవితం మొత్తాన్ని తెలంగాణ ప్రజలకు అంకితం చేసిన గొప్పమనిషి జయంశంకర్ సార్ అని మంత్రి కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఓయూ రిజిస్ట్రార్ సురేష్, ఆర్డీవో ముత్యం రెడ్డి, మెదక్ జెడ్పీ వైస్ చైర్మన్ సారయ్య, సిద్దిపేట డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరెడ్డి, జేఏసీ రాష్ట్ర ప్రతినిధి, ఆర్ అండ్ బీ ఈఈ బాల్‌నర్సయ్య, రాష్ట్ర ఉన్నత విద్యామండలి సభ్యుడు పాపయ్య, ఓఎస్డీ బాల్‌రాజు తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా వైఎస్ రాజారెడ్డి వర్ధంతి
- నివాళులర్పించిన జగన్, కుటుంబ సభ్యులు కడప: దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి తండ్రి వైఎస్ రాజారెడ్డి వర్ధంతిని వైఎస్సార్ జిల్లా పులివెందులలో శనివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక లయోలా డిగ్రీ కళాశాల రోడ్డులో ఉన్న వైఎస్ రాజారెడ్డి ఘాట్ వద్ద వైఎస్సార్ సీపీ అధినేత, ఏపీ శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. వైఎస్ వివేకానందరెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, డాక్టర్ ఎస్.పురుషోత్తమరెడ్డి తదితరులు జగన్‌తో కలిసి కొవ్వొత్తులు వెలిగించి కొద్దిసేపు మౌనం పాటించారు. వైఎస్ జయమ్మ, వైఎస్ జార్జిరెడ్డి సమాధుల వద్ద కూడా నివాళులర్పించారు. అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, కుమార్తె షర్మిల, కోడలు వైఎస్ భారతిరెడ్డి, దివంగత వైఎస్ జార్జిరెడ్డి సతీమణి భారతమ్మ, వైఎస్ సోదరుడు వైఎస్ సుధీకర్‌రెడ్డి, సోదరి విమలమ్మ, వైఎస్ మేనత్తలు కమలమ్మ, రాజమ్మ, వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ, ప్రముఖ చిన్నపిల్లల వైద్యుడు ఇసీ గంగిరెడ్డి, ఆయన సతీమణి డాక్టర్ సుగుణమ్మ, కడప ఎంపీ అవినాష్‌రెడ్డి తల్లి లక్షుమ్మ, సతీమణి సమత, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి తదితరులు రాజారెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించారు. ప్రత్యేక ప్రార్థనలు : పులివెందులలోని బాకరాపురంలో ఉన్న వైఎస్సార్ ఆడిటోరియంలో వైఎస్ కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తొలుత వైఎస్ రాజారెడ్డి చిత్రపటం వద్ద జగన్డ్, విజయమ్మ నివాళులర్పించారు. -
నాలుగేళ్లయినా మానని గాయం
ప్రజల కోసం ప్రతి క్షణం పరితపించిన నాయకుడు వైఎస్ రాజశేఖరెడ్డి. ఆ ప్రజల సంక్షేమం కోసం వారి వద్దకు వెళ్తూ నాలుగేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు... మన కళ్ల ముందునుంచి దూరమయ్యారు. కోట్లాది మందిని కన్నీటి సంద్రంలోకి నెట్టి తాను కానరాని లోకాలకు చేరుకున్నారు. సెప్టెంబర్ 2, 2009 రచ్చబండ కార్యక్రమానికి శ్రీకారం బేగంపేట ఎయిర్‌పోర్టులో సిద్ధంగా హెలికాప్టర్ చిత్తూరు జిల్లా అనుపల్లికి సంక్షేమ సారథి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రయాణం నాలుగేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు హెలికాప్టర్ ఎక్కుతూ 'సాక్షి టీవీ'తో మహానేత వైఎస్ఆర్ మాట్లాడిన చివరి మాటలివి... ''ముందు చెప్పకుండా ఈ రోజు ఉదయం ఐదు గంటలకే నేను ఏ గ్రామానికి వెళ్తున్నానో చెప్పాను. సెక్యూరిటీ ఏర్పాట్లు చేయాలి కాబట్టి అంత అడ్వాన్సు నోటీసు ఇచ్చాను. ఆయా గ్రామాలకు వెళ్లినప్పుడు అక్కడున్న సమస్యలేంటో ప్రజలతో నేరుగా ఇంటరాక్షన్ అవుతాను. ముందే నేను ఎక్కడికెళ్తున్నానో చెబితే అక్కడ ఏమైనా తప్పులున్నా సరిచేసుకుంటారు. అలాంటి అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వానికి సంబంధించిన అన్ని అంశాలూ సరిగా పనిచేస్తున్నాయా, కరువు సమస్యలు ఏమైనా ఉన్నాయా, పనులు లేకపోవడం గానీ, మంచినీళ్లు, పశుగ్రాసం లాంటి సమస్యలున్నాయా, రేషన్ కార్డులు, ఇళ్లు లేనివాళ్లు ఎవరైనా ఉన్నారా అనేవి చూస్తాను. ఇందిరమ్మ పథకంలో అందరికీ ఇళ్లు మంజూరు చేశాం. ఇంకా కానివారు ఎవరైనా ఉన్నారా, కట్టుకోడానికి ఏమైనా ఇబ్బందులున్నాయా చూస్తా. బీదవాళ్లలో ఏ ఒక్కరికీ రేషన్ కార్డులు లేకుండా ఉండకూడదు. పెన్షన్లు రానివాళ్లు ఎవరైనా ఉన్నారా.. అలాగే ఒకరికే రెండు పెన్షన్లు రావడం లాంటివి ఉన్నాయా అనేవి నేరుగా తెలుసుకోడానికి ఈ కార్యక్రమం చేపడుతున్నా'' ఇక ఆ తర్వాత ఆయన గొంతు వినిపించలేదు. ఆయనా కనిపించలేదు. కోట్ల మందిని కన్నీటి సాగరంలో ముంచి దివికేగిపోయారు రాజన్న. ఉదయం హెలికాప్టర్లో బయల్దేరిన రాజన్న... ఎంతకూ గమ్యం చేరకపోయేసరికి రాష్ట్రమంతా తల్లడిల్లిపోయింది. ఆయన క్షేమంగా తిరిగి రావాలని పూజలు, ప్రార్థనలు చేసిన వారెందరో. కోట్ల మంది ప్రార్థనలు, పూజలను విధి పట్టించుకోలేదు. మహానేత ప్రయాణించిన హెలికాప్టర్‌ను పావురాల గుట్ట కబళించింది. పేద ప్రజల పెన్నిధిని మనకు దూరం చేసింది. దట్టమైన మేఘాలు కమ్ముకున్న ఆ వేళ.. ప్రయాణం మానుకోమని అంతా రాజశేఖరరెడ్డికి సూచించారు. ప్రజల కోసం అనుక్షణం పరితపించే ఆయన.. వాతావరణం కాదు జనం అనుగ్రహం ముఖ్యమని నమ్మారు. ప్రయాణం మానుకోమని ఎందరు వారించినా సున్నితంగా తిరస్కరిస్తూ బేగంపేట విమానాశ్రయానికి బయల్దేరారు. కానీ ఆ హెలికాప్టర్ గమ్యం చేరలేదు. పావురాల గుట్ట మహానేతను కబళించింది. నల్లమల అడవుల్లోని పావురాల గుట్ట కొండ మీద హెలికాప్టర్ కుప్పకూలింది. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డితో పాటు పైలట్, కో పైలట్, భద్రతాధికారి, కార్యదర్శి.. అంతా మరణించారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా రాజశేఖర్ రెడ్డి సాగించిన పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సువర్ణ యుగాన్ని చూసింది. నాడు ఏ సమస్య ఎదురైనా ఆదుకునేందుకు రాజన్న ఉన్నాడులే అని జనం నమ్మారు. రాజన్న అంటేనే కొండంత అండ అన్నారు. తన ఐదేళ్ల పాలనలో అనుక్షణం ప్రజల కోసం రాజశేఖరుడు పరితపించారు. ప్రజల మేలు కోసం ఎందాకైనా వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అన్నదాత ఆనందంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని నమ్మిన మహానేత వ్యవసాయాన్ని పండగ చేశారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో ఉచిత విద్యుత్ అందించి రైతుల ఇళ్లో వెలుగులు నింపారు. పావలా వడ్డీతో మహిళలను లక్షాధికారులను చేశారు. ఫించన్లిచ్చి ఎంతో మంది వృద్ధులకు పెద్ద కొడుకయ్యాడు. మహానేత పాలనలో ఎంతో ధైర్యంగా బతికారు బడుగు, బలహీనవర్గాల ప్రజలు. అందుకే ఆ సంక్షేమ సారధి పదికాలాలు పదవిలో ఉండాలని జనం ఆకాంక్షించారు. ఆశీర్వదించారు. కాని ఏనాడైతే మహానేత ఇక లేడని తెలిసిందో పేద గుండెలు తల్లడిల్లిపోయాయి. ప్రజానేత లేని ఈ లోకంలో తాము ఉండలేమన్నారు. రాజన్న లేడని ఆగిపోయిన పేద గుండెలెన్నో. ఏ గాయాన్నైనా మాన్చే గొప్ప శక్తి కాలానికి ఉంటుందంటారు. కాని మహానేత కానరాని లోకాలకేగి నాలుగేళ్లు గడుస్తున్నా ఆ గాయం ఇప్పటికీ అలానే ఉంది.