నటుడు రఘువరన్ పేరు వినగానే ఆయన విలక్షణమైన పాత్రలు ముందుగా మన మనసులో గుర్తొస్తాయి. ఏ పాత్రల్లోలోనైనా పరకాయ ప్రవేశం చేసి.. జనాన్ని మెప్పించడంలో మేటి అనిపించుకున్నారు. దక్షిణాదిలో అన్ని భాషల్లో రఘువరన్ నటించారు. కొన్ని హిందీ చిత్రాలలోనూ రఘువరన్ తనదైన నటనతో ఆకట్టుకున్నారు. విలక్షణ నటునిగా జనం మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. చివరి రోజుల్లో ఆల్కహాల్‌కు బానిస అయిన రఘువరన్ 2008 మార్చి 19న కన్నుమూశారు. ఇవాళ రఘువరన్ వర్ధంతి సందర్భంగా ఆయన భార్య, నటి రోహిణి మొల్లేటి తన భర్తను తలుచుకున్నారు. ఆయనకు నివాళులర్పిస్తూ ట్విటర్ ద్వారా ఫోటోను పంచుకున్నారు.
రోహిణితో పెళ్లి
కాగా.. నటి రోహిణితో రఘువరన్ వివాహం 1996లో జరిగింది. వారిద్దరికీ రిషి వరుణ్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. అయితే 2004లో వీరిద్దరు విడిపోయారు. విడిపోవడానికి గల కారణాలను రోహిణి అప్పట్లో బయటపెట్టింది. రఘువరన్ తాగుడు ముందు తాను.. తన కొడుకు ఓడిపోయామని రోహిణి అప్పట్లో వెల్లడించింది. రఘువరన్ ఎంతో ఇష్టంగా కంపోజ్ చేసి, పాడిన ఆరు పాటలను ఆయన మరణం తరువాత ఓ ఆల్బమ్‌గా తీసుకొచ్చారు. గతంలో రజనీకాంత్ చేతులమీదుగా ఈ ఆల్బమ్‌ను ఆయన భార్య రోహిణి, తనయుడు రిషి వరన్ అందుకున్నారు. ఏది ఏమైనా రఘువరన్ విలక్షణమైన నటనతో జనం మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.
రఘువరన్ తన కెరియర్లో 150కు పైగా సినిమాలలో నటించారు. మంచి పేరు సంపాదియడమే కాకుండా ఎక్కువగా సక్సెస్ మెజారిటీని అందుకున్నారు. తెలుగులో పాటు ఇతర భాషలలో కూడా రఘువరన్ మంచి పేరు సంపాదించారు. టాలీవుడ్‌లో శివ, బాషా ,పసివాడు ప్రాణం వంటి సినిమాలలో నటించి బాగానే పేరు సంపాదించిన రఘువరన్.. చివరిగా ఆటాడిస్తా సినిమాలో కనిపించారు. కాగా.. ఆయన మాజీ భార్య రోహిణి బాలనటిగా పరిచయమై ఆ తర్వాత కథానాయికగా, ఆపై క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా దక్షిణాది ప్రేక్షకులను అలరించింది. ఇప్పటికీ విభిన్నమైన పాత్రల్లో రోహిణి మెప్పిస్తున్నారు.
— Rohini Molleti (@Rohinimolleti) March 19, 2024
Comments
Please login to add a commentAdd a comment