నటుడు రఘువరన్ పేరు వినగానే విలక్షణమైన పాత్రలే గుర్తుకొస్తాయి. టాలీవుడ్‌తో పాటు దక్షిణాది చిత్రాల్లో ప్రతినాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బాలీవుడ్ చిత్రాలలోనూ రఘువరన్ తనదైన నటనతో ఆకట్టుకున్నారు. సినిమాల్లో నటించే సమయంలో నటి రోహిణిని పెళ్లాడారు. వీరిద్దరికీ ఓ కుమారుడు కూడా జన్మించారు. అతనికి రిషివరన్ అనే పేరు పెట్టారు. అయితే 2004లో వీరిద్దరు విడిపోయారు. ఆ తర్వాత చివరి రోజుల్లో ఆల్కహాల్‌కు బానిస అయిన రఘువరన్ 2008 మార్చి 19న కన్నుమూశారు.
అయితే ప్రస్తుతం అతని కుమారుడు రిషి వరన్ తండ్రి బాటలోనే దూసుకెళ్తున్నాడు. 26 ఏళ్ల రిషివరన్ నటుడిగా కాకుండా సంగీతంలో రాణిస్తున్నాడు. సినిమాల్లో నటనకు బదులు రిషివరన్ సంగీత రంగంలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటికే అతను కొన్ని ఇంగ్లిష్ ఆల్బమ్‌లు రిలీజ్ చేశాడు. రఘువరన్‌కి సైతం సంగీతంపై కూడా చాలా ఆసక్తి ఉండేది. సినిమా అవకాశాలు పెరగడంతో నటనలో బిజీ అయిపోయాడు. ప్రస్తుతం రిషివరన్ తండ్రిలాగే కొడుకు కూడా సంగీతంలో కొనసాగుతున్నాడు.
కాగా.. గతంలో రఘువరన్ ఎంతో ఇష్టంగా కంపోజ్ చేసి, పాడిన ఆరు పాటలను ఆయన మరణం తరువాత ఓ ఆల్బమ్‌గా తీసుకొచ్చారు. గతంలో రజనీకాంత్ చేతులమీదుగా ఈ ఆల్బమ్‌ను ఆయన భార్య రోహిణి, రిషి వరన్ అందుకున్నారు. ఏది ఏమైనా రఘువరన్ విలక్షణమైన నటనతో జనం మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. రఘువరన్ తన కెరియర్లో 150కు పైగా సినిమాలలో నటించారు. టాలీవుడ్‌లో శివ, బాషా ,పసివాడు ప్రాణం వంటి సినిమాలలో నటించి బాగానే పేరు సంపాదించిన రఘువరన్.. చివరిగా ఆటాడిస్తా సినిమాలో కనిపించారు. ఆయన మాజీ భార్య రోహిణి బాలనటిగా పరిచయమై ఆ తర్వాత కథానాయికగా, ఆపై క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా దక్షిణాది ప్రేక్షకులను అలరించింది. ఇప్పటికీ ఆమె సినిమాల్లో కొనసాగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment