southindia
-
అంతిమంగా సినిమా బతకాలి: మమ్ముట్టి
మలయాళ పరిశ్రమలో జస్టిస్ హేమా కమిటీ నివేదిక ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఈ నివేదికలో పేర్కొనడంతో ఇందుకు నైతిక బాధ్యత వహించి, ‘అమ్మ’ (అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్) అధ్యక్షుడు మోహన్‌లాల్‌తో పాటు కమిటీ సభ్యులందరూ రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే. కాగా హేమా కమిటీ నివేదికపై ఆల్రెడీ మోహన్‌లాల్ స్పందించారు. తాజాగా మరో అగ్రనటుడు మమ్ముట్టి ఈ అంశం గురించి సోషల్ మీడియాలో సుధీర్ఘమైనపోస్ట్ను షేర్ చేశారు. ఈపోస్ట్ సారాంశం ఈ విధంగా...⇒ ఓ సంస్థకు సంబంధించి ఒక విధానం ఉంటుంది. మొదట నాయకత్వం స్పందించిన తర్వాతే సభ్యులు మాట్లాడితే బాగుంటుంది. ప్రస్తుతం నేను ‘అమ్మ’లో సభ్యుడిని మాత్రమే. అందుకే నేను కాస్త ఆలస్యంగా స్పందిస్తున్నాను. ⇒సినిమా అనేది సమాజానికి ప్రతిబింబం. సమాజంలో జరుగుతున్న మంచి చెడులు సినిమాల్లోనూ ఉంటాయి. అయితే సినిమాలపై సమాజం దృష్టి చాలా దగ్గరగా ఉంటుంది. జరుగుతున్న ప్రతి అంశాన్ని గమనిస్తుంటారు. ఒక్కోసారి చిన్న అంశాలు కూడా పెద్ద స్థాయి చర్చలకు కారణమవుతుంటాయి. అందుకే ఇండస్ట్రీలో ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు జరగకుండా ఇండస్ట్రీ వాళ్ళు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ⇒ ఓ దురదృష్టకర సంఘటన (2017లో జరిగిన దిలీప్– భావనా మీనన్‌ల ఘటనను ఉద్దేశించి కావొచ్చు) జరిగిన నేపథ్యంలో ఇండస్ట్రీపై అధ్యయనం చేయాల్సిందిగా ప్రభుత్వం జస్టిస్ హేమా కమిటీని నియమించింది. మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా ఉండేలా ఆ నివేదికలో పేర్కొన్న సూచనలు, సలహాలు, పరిష్కారాలను స్వాగతిస్తున్నాం. అయితే ఈ అంశాలను అమలు చేయడానికి మలయాళ చిత్ర పరిశ్రమలో అన్ని అసోసియేషన్లు ఏకతాటి పైకి రావాలి. ఇక హేమా కమిటీ పూర్తి నివేదిక కోర్టులో ఉంది. కమిటీకి అందిన ఫిర్యాదులపైపోలీసులు నిజాయితీగా విచారణ చేస్తున్నారు. దోషులను కోర్టు శిక్షిస్తుంది. హేమా కమిటీ సిఫార్సులు అమ్మలయ్యేలా చట్టపరమైన కార్యాచరణ జరగాలి... అంతిమంగా సినిమా బతకాలి. -
పాఠాలు నేర్పినవారందరికీ ధన్యవాదాలు
హీరోయిన్గా పదిహేనేళ్ల విజయవంతమైన కెరీర్‌ని పూర్తి చేసుకుంటూ, ఇంకా అగ్రశ్రేణి హీరోయిన్ల జాబితాలో ఒకరిగా రాణిస్తుండటం అంటే అంత సులభమైన విషయం కాదు. ఈ లిస్ట్‌లో చాలా తక్కువమంది హీరోయిన్లు ఉంటారు. తాజాగా శ్రుతీహాసన్ పేరు ఈ లిస్ట్‌లో చేరింది. తండ్రి కమల్‌హాసన్ నటించిన ద్విభాషా (తమిళం, హిందీ) చిత్రం ‘హే రామ్’ (2000)లో చైల్డ్ ఆర్టిస్టుగా తొలిసారి స్క్రీన్‌పై కనిపించారు శ్రుతీహాసన్. చైల్డ్ ఆర్టిస్టుగా మరో సినిమా చేయలేదు కానీ.. ‘హే రామ్’ రిలీజైన తొమ్మిదేళ్లకు హిందీ చిత్రం ‘లక్’ (2009)తో కథానాయికగా కెరీర్‌ను ఆరంభించారు శ్రుతి.ఆ తర్వాత సూర్య ‘సెవెన్త్ సెన్స్’, ధనుష్ ‘త్రీ’, రామ్‌చరణ్ ‘ఎవడు’, అల్లు అర్జున్ ‘రేసుగుర్రం’ రవితేజ ‘క్రాక్’ .. ఇటీవల చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, ప్రభాస్ ‘సలార్: సీజ్ఫైర్’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించారు శ్రుతి. నటిగా–గాయనిగా–సంగీత దర్శకురాలిగా... ఇలా మల్టీ టాలెంట్‌తో దూసుకెళుతున్నారు శ్రుతీహాసన్. కథానాయికగా పదిహేనేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రుతీహాసన్ స్పందిస్తూ – ‘‘అప్పుడే పదిహేనేళ్లు పూర్తయ్యాయంటే నమ్మశక్యంగా లేదు.నేను పెరిగిన మ్యాజికల్ ఇండస్ట్రీలోనే ఇంతకాలం నేను ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా మిగతా జీవితాన్ని కూడా ఇండస్ట్రీతోనే ముడివేస్తాను. ఇండస్ట్రీలో నాకు అందమైన పాఠాలు నేర్పినవారందరికీ ధన్యవాదాలు. అలాగే నన్ను ఆదరించిన ప్రేక్షకులు, నా అభిమానులకు థ్యాంక్స్. వీళ్లే లేకపోతే నేను ఇలా ఉండేదాన్ని కాదు’’ అన్నారు. రజనీకాంత్ ‘కూలీ’, ప్రభాస్ ‘సలార్: శౌర్యంగాపర్వం’, అడవి శేష్ ‘డెకాయిట్’ చిత్రాల్లో నటిస్తున్నారు శ్రుతీహాసన్. -
రఘువరన్‌కు భిన్నంగా వారసుడు.. ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా?
నటుడు రఘువరన్ పేరు వినగానే విలక్షణమైన పాత్రలే గుర్తుకొస్తాయి. టాలీవుడ్‌తో పాటు దక్షిణాది చిత్రాల్లో ప్రతినాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బాలీవుడ్ చిత్రాలలోనూ రఘువరన్ తనదైన నటనతో ఆకట్టుకున్నారు. సినిమాల్లో నటించే సమయంలో నటి రోహిణిని పెళ్లాడారు. వీరిద్దరికీ ఓ కుమారుడు కూడా జన్మించారు. అతనికి రిషివరన్ అనే పేరు పెట్టారు. అయితే 2004లో వీరిద్దరు విడిపోయారు. ఆ తర్వాత చివరి రోజుల్లో ఆల్కహాల్‌కు బానిస అయిన రఘువరన్ 2008 మార్చి 19న కన్నుమూశారు.అయితే ప్రస్తుతం అతని కుమారుడు రిషి వరన్ తండ్రి బాటలోనే దూసుకెళ్తున్నాడు. 26 ఏళ్ల రిషివరన్ నటుడిగా కాకుండా సంగీతంలో రాణిస్తున్నాడు. సినిమాల్లో నటనకు బదులు రిషివరన్ సంగీత రంగంలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటికే అతను కొన్ని ఇంగ్లిష్ ఆల్బమ్‌లు రిలీజ్ చేశాడు. రఘువరన్‌కి సైతం సంగీతంపై కూడా చాలా ఆసక్తి ఉండేది. సినిమా అవకాశాలు పెరగడంతో నటనలో బిజీ అయిపోయాడు. ప్రస్తుతం రిషివరన్ తండ్రిలాగే కొడుకు కూడా సంగీతంలో కొనసాగుతున్నాడు.కాగా.. గతంలో రఘువరన్ ఎంతో ఇష్టంగా కంపోజ్ చేసి, పాడిన ఆరు పాటలను ఆయన మరణం తరువాత ఓ ఆల్బమ్‌గా తీసుకొచ్చారు. గతంలో రజనీకాంత్ చేతులమీదుగా ఈ ఆల్బమ్‌ను ఆయన భార్య రోహిణి, రిషి వరన్ అందుకున్నారు. ఏది ఏమైనా రఘువరన్ విలక్షణమైన నటనతో జనం మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. రఘువరన్ తన కెరియర్లో 150కు పైగా సినిమాలలో నటించారు. టాలీవుడ్లో శివ, బాషా ,పసివాడు ప్రాణం వంటి సినిమాలలో నటించి బాగానే పేరు సంపాదించిన రఘువరన్.. చివరిగా ఆటాడిస్తా సినిమాలో కనిపించారు. ఆయన మాజీ భార్య రోహిణి బాలనటిగా పరిచయమై ఆ తర్వాత కథానాయికగా, ఆపై క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా దక్షిణాది ప్రేక్షకులను అలరించింది. ఇప్పటికీ ఆమె సినిమాల్లో కొనసాగుతున్నారు. -
నిద్రలేని రాత్రులు గడిపా.. ఆ తెలుగు హీరోతో చేయాలనుంది: యానిమల్ బ్యూటీ
యానిమల్ చిత్రంతో ఒక్కసారిగా స్టార్ డమ్ సొంతం చేసుకున్న నటి త్రిప్తి డిమ్రీ. ఈ చిత్రంలో ఆమె నటనకు బాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలోనూ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. సందీప్ వంగా దర్శకత్వంలో వచ్చిన ఈ సూపర్ హిట్ చిత్రంలో జోయా పాత్రలో అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో త్రిప్తి ఒక్కసారిగా ఓవర్‌నైట్ స్టార్ అయిపోయింది. అంతే కాకుండా రణ్‌బీర్ కపూర్‌తో కెమిస్ట్రీ అదిరిపోయిందంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేశారు. కొందరైతే ఏకంగా మీరే మాకు నేషనల్ క్రష్ అంటూ పోస్టులు పెడుతున్నారు. అంతలా ఫేమ్ తెచ్చుకున్న భామ తర్వాత ఏ ప్రాజెక్ట్‌లో చేయనుందన్న విషయంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. సౌత్ సినిమాల్లో నటించనున్నట్లు వస్తోన్న వార్తలపై తాజా ఇంటర్వ్యూలో స్పందించారు. ఆ వివరాలేంటో తెలుసుకుందాం. త్రిప్తి మాట్లాడుతూ.. 'నేను ఇప్పటిదాకా సౌత్‌లో ఏ సినిమాకు సంతకం చేయలేదు. నాకు ఇక్కడ కూడా అవకాశాలు వస్తే బాగుంటుందని కోరుకుంటున్నా. దక్షిణాదిలో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించాలని ఉంది' అంటూ మనసులో మాటను బయట పెట్టేసింది ముద్దుగుమ్మ. అని తెలిపారు. ఆ తర్వాత యానిమల్ చిత్రం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. యానిమల్ విడుదలకు ముందు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపినట్లు చెప్పుకొచ్చింది. నా ప్రతిభకు ప్రశంసలు దక్కడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఇదిలా ఉండగా యానిమల్ తర్వాత త్రిప్తికి ఇన్‌స్టాలో ఫాలోయింగ్ భారీగా పెరిగింది. కాగా.. ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోయే సినిమాలో త్రిప్తి డిమ్రీని ఎంపిక చేయాలంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. -
స్టార్ హీరో కొత్త చిత్రం.. టైటిల్ ఫిక్స్!
మార్క్ ఆంటోనీ చిత్రం తర్వాత కోలీవుడ్ హీరో విశాల్ మరో చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా ఆయన చిత్రానికి సంబంధించి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి హరి దర్శకత్వం వహిస్తుండగా.. తాజాగా టైటిల్ ప్రకటించారు మేకర్స్. ఇంతకు ముందు హరి.. పూజై, తామిర భరణి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. ఈ మూవీని స్టోన్ బెంచ్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంతో హ్యాట్రిక్ సాధించడానికి డైరెక్టర్ హరి రెడీ అయిపోయారు. సాధారణంగా అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్ టైనర్ కథా చిత్రాల కేరాఫ్‌గా మారిన హరి.. ఈ సినిమా కూడా అలాంటి నేపథ్యంలోనే రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఇసుక మాఫియా నేపథ్యంలో సాగే యాక్షన్ కథా చిత్రమని యూనిట్ వర్గాలు పేర్కొన్నారు. దీనికి రత్నం అనే టైటిల్ ఖరారు చేసినట్లు తాజా సమాచారం. తాజాగా దీనికి సంబంధించి విడుదల చేసిన టీజర్లో నటుడు విశాల్ ఒక వ్యక్తి తలను నరికే సన్నివేశం ఉంది. ఈ ఒక్క సీన్ చూస్తేనే మరో పక్క కమర్షియల్ ఎంటర్టైనర్గా ఇది ఉంటుందని చెప్పవచ్చు. ఈ చిత్ర షూటింగ్‌ను కారైక్కుడి, తూత్తుక్కుడి, చైన్నె ప్రాంతాల్లో చిత్రీకరించినట్లు యూనిట్ వర్గాలు వర్గాలు తెలిపారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. దర్శకుడు గౌతమ్ మీనన్, సముద్రఖని, యోగి బాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. Well here it is finally, my 34th film. Happy to share THE FIRST LOOK of #RATHNAM, unleashing the combo with hari sir for the third time The action begins and looking forward to summer 2024 release. Hope u all like it. Hardwork never fails. God bless. Tamil -… pic.twitter.com/7tmHn0FrJV — Vishal (@VishalKOfficial) December 2, 2023 -
జవాన్ డైరెక్టర్ భారీ స్కెచ్.. ఆ ఇద్దరు స్టార్స్‌తో మూవీ!
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన చిత్రం జవాన్. ఈ ఏడాది విడుదలైన ఈ చిత్రంలో నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి వంటి సౌత్ సూపర్‌స్టార్స్ ఎక్కువగా నటించారు. దర్శకుడు కూడా తమిళనాడుకు చెందిన అట్లీ కావడం విశేషం. కాగా ఈ చిత్రం రూ.1100 కోట్లకు పైగా వసూలు చేసి బాక్సాఫీస్ హిట్‌గా నిలిచింది. (ఇది చదవండి: ఐదు భిన్నమైన గెటప్స్‌లో కనిపించనున్న కంగువ) ఇక కోలీవుడ్‌లో దళపతిగా అభిమానులు పట్టం కట్టిన నటుడు విజయ్ ఆ మధ్య నటించిన చిత్రం బిగిల్. అందులోనూ నయనతారనే హీరోయిన్ కావడం మరో విశేషం. ఈ చిత్రానికి అట్లీ దర్శకత్వం వహించగా.. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఇక జవాన్, బిగిల్ చిత్రాల్లో మరో కామన్ విషయం హీరోలు ద్విపాత్రాభినయం చేయడం. ఇప్పటివరకు అపజయం ఎరుగని దర్శకుడిగా అట్లీ నిలిచారు. కాగా ఆయన తదుపరి చిత్రం ఏంటనే విషయంపై ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది. దీనిపై తాజాగా ఒక ఆసక్తికరమైన వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. జవాన్ హీరో షారుక్ ఖాన్, బిగిల్ హీరో విజయ్‌తో ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారన్నదే లేటెస్ట్ టాక్. జవాన్ చిత్రంలో షారుక్‌ఖాన్‌తో కలిసి విజయ్ అతిథి పాత్రలో మెరవనున్నారనే ప్రచారం జరిగింది. కానీ అది వాస్తవం కాదని తెలిసిపోయింది. అయితే విజయ్‌తో కలిసి నటించడానికి తాను సిద్ధమని షారుక్ ఖాన్ జవాన్ చిత్రం సమయంలోనే వెల్లడించారు. అదేవిధంగా షారుక్ ఖాన్‌తో కలిసి నటించిన డానికి తాను సిద్ధమేనని విజయ్ కూడా అన్నారు. కాగా ఇటీవల ఒక ప్రముఖ హాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ తన దర్శకత్వంలో చిత్రం చేయడానికి ముందుకు వచ్చినట్లు అట్లీనే స్వ యంగా ఇటీవల ఓ భేటీలో పేర్కొన్నారు. ఈ చిత్రానికి కథను సిద్ధం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. దీంతో ఇది షారుక్ ఖాన్, విజయ్ కలిసి నటించిన చిత్రం అవుతుందనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి క్లారిటీ రావాలంటే కొద్ది కాలం ఆగాల్సిందే. అదేవిధంగా ఇది బాలీవుడ్ చిత్రం అవుతుందా? లేక హాలీవుడ్ చిత్రం అవుతుందా అన్నది కూడా తెలియాల్సి ఉంది. (ఇది చదవండి: పిల్లలు కావాలని హీరోను పెళ్లి చేసుకున్నా: స్టార్ హీరోయిన్) -
విదేశీ చిత్రంలో టాలీవుడ్ సీనియర్ నటి.. పోస్ట్ వైరల్!
దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న నటి రాధిక శరత్ కుమార్. డేరింగ్ అండ్ డాషింగ్ నటిగా 1978లో భారతీరాజా దర్శకత్వం వహించిన కిళక్కే పోగుమ్ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయ్యారు. ఆ చిత్రం విజయం తర్వాత నటిగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. (ఇది చదవండి: మెగా ఫోన్ పట్టనున్న రామ్ చరణ్ విలన్!) తమిళం, తెలుగు, మలయాళం, హిందీ ఇలా పలు భాషల్లో ప్రముఖ హీరోల సరసన కథానాయకిగా నటించి బహుభాషా నటిగా రాణించారు. ఆ తర్వాత కూడా క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి వివిధ రకాల పాత్రలో ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు. కాగా 2001 వివాహం చేసుకున్నారు. అలా తన 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో విజయాలను చూసిన రాధిక శరత్ కుమార్ నిర్మాతగాను కొన్ని చిత్రాలు చేశారు. అదే విధంగా సినిమాలు కూడా నిర్మిస్తున్నారు. తాజాగా స్వదేశీ భాషలను అధిగమించి ఫ్రెంచ్ చిత్రంలో నటించడం విశేషం. ప్రస్తుతం రాధిక శరత్ కుమార్ ఆ చిత్రంలో నటించడానికి ఫ్రాన్స్ దేశానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె ఆ చిత్ర షూటింగ్లో తన ఫొటోలను తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. అందులో తాను ఫ్రెంచ్ చిత్రంలో నటించడానికి ప్రోత్సహించిన తన భర్త శరత్ కుమార్‌కు కృతజ్ఞతలు చెప్పారు. ప్రస్తుతం రాధిక శరత్ కుమార్ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. (ఇది చదవండి: ఈ హీరోయిన్ని గుర్తుపట్టారా? నాలుగే సినిమాలు, టీమిండియా క్రికెటర్‌తో పెళ్లి!) View this post on Instagram A post shared by Radikaa Sarathkumar (@radikaasarathkumar) -
మళ్లీ మెగాఫోన్ పట్టనున్న ప్రముఖ నటి!!
నటిగా రోహిణి 1974లోనే బాలనటిగా తెరంగేట్రం చేశారు. తర్వాత కథానాయకిగా పలు చిత్రాల్లో నటించి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నారు. అంతే కాదు ఈమెలో మంచి డబ్బింగ్ కళాకారిణి, దర్శకురాలు కూడా ఉన్నారు. 2005లోనే చిన్న చిన్న ఆశై అనే చిత్రానికి దర్శకత్వం వహించారు.ఆ తరువాత ఒక డాక్యుమెంటరీ చిత్రం కూడా చేశారు. (ఇది చదవండి: కన్నీరు పెట్టుకున్న శోభ, యావర్.. నేడు షో టైమింగ్స్‌లో మార్పు) తాజాగా మరోసారి మెగా ఫోన్ పట్టడానికి సిద్ధమైనట్లు సమాచారం. యదార్థ ఘటనలతో ఇప్పటికే చాలా చిత్రాలు తెరకెక్కాయి. వాటిలో పలు చిత్రాలు విజయాన్ని సాధించాయి. జైభీమ్, సూరారై పోట్రు వంటి చిత్రాలు ఈ కోవలోకి వస్తాయి. కాగా ఆ మధ్య తమిళనాడునే ఉలిక్కిపడేలా చేసిన వాచ్ఛాత్తి హింసా సంఘటన ఇప్పుడు వెండితెరకెక్కనుంది. దీనికి నటి రోహిణి దర్శకత్వం వహించనున్నారని సమాచారం. కాగా దీనికి రచయిత ఆదవన్ దీక్షగా మాటలు,కథనం రాస్తున్నారు. ఇందులో జై భీమ్ చిత్రం ఫేమ్ లిజోమోల్ జోస్ ప్రధాన పాత్రను పోషించనున్నట్లు తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
నిద్రలోనూ అవే కలలు వస్తున్నాయి.. అయినా తప్పకుండా చేస్తా: రాఘవ లారెన్స్
ఇటీవలే చంద్రముఖి-2 సినిమాతో ప్రేక్షకులను అలరించిన కోలీవుడ్ స్టార్ రాఘవ లారెన్స్. ప్రస్తుతం ఎస్జే సూర్యతో కలిసి జగిర్తాండ డబుల్ ఎక్స్ చిత్రంలో నటిస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరక్కించారు. అయితే ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం దీపావళి కానుకగా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్లో రాఘవ లారెన్స్ మాట్లాడారు. చంద్రముఖి- 2 ఫ్లాప్ గురించి ఆయన స్పందించారు. (ఇది చదవండి: మరో సక్సెస్ఫుల్ హీరో వచ్చాడు – హీరో నాని ) రాఘవ మాట్లాడుతూ..'చంద్రముఖి -2 సినిమాకు నా డబ్బులు నాకు వచ్చేశాయి. జీవితంలో అన్నీ మనమే గెలవాలని లేదు కదా. గ్రూప్ డ్యాన్సర్ నుంచి డ్యాన్సర్ మాస్టర్ అయితే చాలని భావించా. అక్కడి నుంచే దర్శకుడిని, హీరోను అయ్యాను. నా గ్లామర్‌కు హీరో అవకాశాలు ఇవ్వడమే దేవుడిచ్చిన పెద్ద వరం. మళ్లీ అందులో ఫ్లాప్, హిట్ గురించి అస్సలు ఆలోచించకూడదు. 'జిగిర్తాండ డబుల్ ఎక్స్' డబ్బింగ్ పూర్తయ్యాక చూశా. ఇందులో మంచి స్టోరీ ఉంది. సినిమా హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది. ఎంత పెద్ద హీరో సినిమా చేసినా, డ్యాన్స్ చేసినా కథ లేకపోతే సినిమా ఆడదు. కంటెంట్ బలంగా ఉండాలంటే దర్శకుడు కూడా అంతే బలంగా ఉండాలి. కార్తీక్ సుబ్బరాజు విషయంలో నాకు ఎలాంటి డౌట్స్ లేవు.' అని అన్నారు. (ఇది చదవండి: అమర్‌దీప్‌కి ఎలిమినేషన్ భయం.. ఇలా అయిపోయాడేంటి?) అయితే కాంచన-4 ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు సార్.. అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానమిస్తూ.. అన్ని దెయ్యాల సినిమాలు తీసి మనశ్శాంతిగా ఉండటం లేదు. రాత్రి కూడా కలలో అవే గుర్తుకొస్తున్నాయి. దీంతో నా మైండ్ కాస్తా పిచ్చి పిచ్చిగా అయిపోయింది. కానీ ఏదో ఒక రోజు ఆ సినిమాను తప్పకుండా చేస్తా' అని అన్నారు. Any Muni Fans here ?🙋🏻🔥 #RaghavaLawrence pic.twitter.com/LEqbZCq2r1 — Anchor_Karthik (@Karthikk_7) October 10, 2023 -
ఇప్పుడు సౌత్‌పైనే అందరి దృష్టి.. ఆ స్టార్ హీరో విలన్ రోల్ చేస్తాడా.. !
ప్రస్తుతం బాలీవుడ్ సూపర్ స్టార్స్ కన్ను సౌత్ ఇండస్ట్రీపై పడింది. అగ్రనటులు సైతం దక్షిణాదిలో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. విలన్ క్యారెక్టర్లోనూ నటించేందుకు వెనుకాడడం లేదు. ఇప్పటికే సంజయ్‌దత్ శాండల్‌వుడ్ మూవీ కేజీఎఫ్–2లో విలన్‌గా నటించారు. నటుడు వివేక్ ఒబెరాయ్ వివేగం చిత్రంలో అజిత్‌కు విలన్‌గా నటించారు. అలాగే నటుడు జాకీష్రాఫ్ సైతం దక్షిణాది చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. తాజాగా సామాజిక మాధ్యమాల్లో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. నటుడు విజయ్ లియో చిత్ర షూటింగ్ పూర్తిచేసి త్వరలోనే మరో చిత్రానికి సిద్ధమవుతున్నారు. (ఇది చదవండి: కిందపడ్డ ఎంగిలి మెతుకులు తిన్న రైతుబిడ్డ.. బయటేమో మరోలా..) వెంకట్‌ప్రభు దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందులో భారీ తారాగణం నటించబోతున్నట్లు కోలీవుడ్ టాక్. ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంతో పాటు ఈ సంస్థ జయంరవి హీరోగా తనీఒరువన్- 2 చిత్రాన్ని నిర్మించనుంది. దీనికి మోహన్‌రాజా దర్శకత్వం వహించనున్నారు. అయితే ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఓ న్యూస్ తెగ వైరలవుతోంది. ఈ రెండు చిత్రాలలో ఒకదానిలో బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్‌ఖాన్‌ను విలన్‌గా నటింపజేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. విజయ్‌కు విలన్‌గా అమీర్‌ఖాన్‌ను నటింపజేసే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఇందులో నిజమెంతమనేది తెలియాల్సి ఉంది. అసలు ప్రతినాయకుడిగా నటించడానికి అంగీకరిస్తారా? అనేది గమనార్హం. అయితే లియో చిత్రంలో సంజయ్‌దత్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. (ఇది చదవండి: 'జవాన్' సినిమాను నిలబెట్టిన ఈ ఆరుగురు.. ఇప్పటి వరకు తీసిన సినిమాలు ఇవే) -
స్టార్ హీరో సినిమాకు ఓకే చెప్పిన విజయేంద్ర ప్రసాద్.. పాన్ ఇండియా రేంజ్లో!
టాలీవుడ్ బ్లాక్‌బస్టర్ చిత్రాలకు కథలు అందించిన రచయిత విజయేంద్రప్రసాద్. మగధీర, బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి ఆల్‌టైమ్ హిట్స్‌ను అందించారు. అయితే తాజాగా మరో స్టార్ హీరోకు కథను అందించేందుకు సిద్ధమయ్యారు. శాండల్‌వుడ్ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ నటిస్తున్న తాజా చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ పనిచేస్తున్నారు. టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తండ్రి ఆయన ఇప్పటి వరకు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో 25 చిత్రాలకు పైగా కథలను అందించారు. తాజాగా కన్నడ హీరో కిచ్చాకు సైతం కథ సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఈ విషయాన్ని సెప్టెంబర్ 2న కిచ్చా సుదీప్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ రివీల్ చేశారు. (ఇది చదవండి: అవార్డులు నాకు చెత్తతో సమానం.. స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్! ) కిచ్చా సుదీప్ కథానాయకుడుగా ప్రముఖ కన్నడ చిత్ర నిర్మాణ సంస్థ ఆర్సీ స్టూడియోస్ భారీ బడ్జెట్లో చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి ఆర్.చంద్రు దర్శకత్వం వహిస్తున్నారు. కిచ్చా సుదీప్ మరోసారి కబ్జా దర్శకుడు ఆర్ చంద్రుతో జతకట్టబోతున్నారు. ఈ ముగ్గురు కాంబినేషన్లో ఆర్సీ స్టూడియోస్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నట్లు అందులో పేర్కొన్నారు. ఈ ఏడాదిలో ఈ సంస్థ నిర్మించిన ఐదు చిత్రాలు వరుసగా తెరపైకి రాబోతున్నట్లు తెలిపారు. అదేవిధంగా కిచ్చ సుదీప్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రంలో పని చేయడానికి ప్రపంచ స్థాయి టెక్నీషియన్లను, నటీనటులను ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. (ఇది చదవండి: సలార్ రిలీజ్ ఆ నెలలోనే.. వైరలవుతున్న ట్వీట్!) -
మొన్న సెలవులు.. ఇప్పుడేమో ఏకంగా జైలర్ స్పెషల్ షోలు..!
సూపర్ స్టార్ రజినీకాంత్, తమన్నా జంటగా నటించిన తాజా చిత్రం జైలర్. నెల్సన్ దర్శకత్వంలో సన్ పిక్చర్ నిర్మించిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ, మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, బాలీవుడ్ స్టార్ నటుడు జాకీష్రాఫ్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, తెలుగు నటుడు సునీల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతమందించగా.. ఆగస్టు 10న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చేసింది. తొలిరోజే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తోంది. తొలి రోజే ఏకంగా రూ.52 కోట్లు రాబట్టింది. తమిళం, తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ మంచి టాక్‌తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో చెన్నైలో రిలీజ్ రోజే కొన్ని కంపెనీలు ఉద్యోగులకు సెలవులు ప్రకటించగా.. తాజాగా మరో కంపెనీ ముందడుగేసింది. (ఇది చదవండి: 'మీరు చేయకపోతే చాలామంది ఉన్నారని చెప్పాడు'.. క్యాస్టింగ్ కౌచ్‌పై బుల్లితెర నటి!) తాజాగా ర్యాపిడో సంస్థ రజినీకాంత్‌పై తమ అభిమానాన్ని చాటుకుంది. ముఖ్యమైన నగరాల్లో బైక్, ఆటో ట్యాక్సీ సేవలు అందించే ర్యాపిడో సంస్థ తమ డ్రైవర్లకు అదిరిపోయే న్యూస్ చెప్పింది. ర్యాపిడో ఆటో ట్యాక్సీ సేవలు అందించే కెప్టెన్స్ కోసం జైలర్ ప్రత్యేక షో వేయనున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని ర్యాపిడో సంస్థ స్వయంగా ప్రకటించింది. చెన్నైలో ఆగస్టు 12న కృష్ణవేణి థియేటర్లో కేవలం వారి కోసమే ప్రత్యేక స్క్రీనింగ్ వేయనున్నట్లు తెలిపింది. సంస్థ నిర్ణయంతో 500కు పైగా ర్యాపిడో ఆటో డ్రైవర్లకు తమ అభిమాన హీరో తలైవా జైలర్ చిత్రాన్ని చూసే అవకాశం దక్కింది. సంస్థ నిర్ణయం పట్ల ర్యాపిడో కెప్టెన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ర్యాపిడో సహ వ్యవస్థాపకుడు పవన్ గుంటుపల్లి వారి సేవలను కొనియాడారు. కాగా.. జైలర్ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో టికెట్స్ భారీగా బుకింగ్స్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ర్యాపిడో సంస్థ వారి కోసం ప్రత్యేక షో వేయనుంది. దీనికి సంబంధించిన ఫొటోలు సైతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. (ఇది చదవండి: జైలర్ కోసం జపాన్ నుంచి అభిమానులు) -
జైలర్ రిలీజ్.. ఆ సెంటిమెంట్ ఫాలో అవుతున్న తలైవా!
చిత్ర పరిశ్రమలో సెంటిమెంట్‌కు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే ఒక చిత్రం హిట్ అయితే.. అదే తరహాలోనే సెంటిమెంట్ ఫాలో అవుతుంటారు. అలా సెంటిమెంట్‌ను ఫాలో అయ్యేవారిలో తలైవా ముందుంటారు. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్, తమన్నా జంటగా నటించిన మరి కొద్దిగంటల్లో థియేటర్లలో సందడి చేయనుంది. (ఇది చదవండి: భోళా శంకర్ నిర్మాతలతో ప్రాణహాని.. పోలీసులకు ఫిర్యాదు) ఈ నేపథ్యంలోనే తలైవా తన సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారు. రజనీకాంత్ తన చిత్రం విడుదల సమయంలో హిమాలయాలకు వెళ్లేవారు. అదే సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ ఎప్పటిలాగే సినిమా రిలీజ్‌కు ముందు హిమాలయాలకు వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఆ మధ్య ఆరోగ్య సమస్యల కారణంగా కొంతకాలంగా హిమాలయాలకు వెళ్లలేదు. అలాంటిది జైలర్ చిత్రం రిలీజ్ కానుండడంతో రజనీకాంత్ హిమాలయాలకు వెళ్లినట్లు సమాచారం. గతంలో కూడా తలైవా ఇలాగే సినిమా విడుదలకు ముందు హిమాలయాలకు వెళ్లారు. సూపర్ స్టార్ అభిమానుల్లో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ప్రీమియర్ షోల టికెట్స్ అన్నీ అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. చెన్నై, బెంగళూరు నగరాల్లో ఏకంగా కొన్ని కంపెనీలు సెలవులు ప్రకటించడం ఆయనకు ఉన్న క్రేజ్ ఏంటో అర్థమవుతోంది. కాగా.. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, బాలీవుడ్ స్టార్ జాకీ ష్రాఫ్, తెలుగు నటుడు సునీల్, యోగిబాబు, రమ్యకృష్ణ, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తదితరులు ముఖ్యపాత్ర పోషించారు ఇదిలా ఉండగా జైలర్ చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ షోలకు అనుమతి ఇవ్వలేదు. అయితే కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతులు ఇవ్వడం మరో విశేషం. దీంతో ఆయన పలువురు సూపర్ స్టార్ అభిమానులు బెంగళూరుకు పరుగులు తీస్తున్నారు. కాగా జైలర్ చిత్రాలు చూడటానికి చైన్నెలోని ఒక ఐటీ కంపెనీ తమ ఉద్యోగులకు సెలవు ప్రకటించడం మరో విశేషం. (ఇది చదవండి: జైలర్‌కు 'తెలుగు' సెంటిమెంట్.. రజనీకాంత్‌కు అసూయ ఎందుకు? ) -
సైమా అవార్డ్స్- 2023.. రాజమౌళి చిత్రానికి 11 నామినేషన్స్!
సినీ ఇండస్ట్రీలో దక్షిణాదిలో అవార్డుల పండుగకు సర్వం సిద్ధమైంది. ప్రతిష్ఠాత్మక సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ - 2023లో పోటీపడే చిత్రాల జాబితా రిలీజ్ అయింది. అయితే అవార్డుల నామినేషన్స్‌లో టాలీవుడ్ బ్లాక్ బస్టర్, ఆస్కార్ అవార్డ్ దక్కించుకున్న ఆర్ఆర్ఆర్ మూవీ ఏకంగా 11 విభాగాల్లో స్థానం దక్కించుకుంది. ఆ తర్వాత స్థానంలో 10 విభాగాల్లో నామినేషన్స్‌తో సీతారామం చిత్రం నిలిచింది. (ఇది చదవండి: ఓటీటీకి వచ్చేసిన జగపతిబాబు మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) తెలుగులో ఉత్తమ చిత్రం కేటగిరిలో ఎన్టీఆర్, రామ్‌చరణ్, రాజమౌళి కాంబోలో తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్, సిద్ధు జొన్నలగడ్డ నటించిన డీజే టిల్లు, నిఖిల్ మిస్టరీ అడ్వెంచర్ ఫిల్మ్ కార్తికేయ-2, అడవి శేష్ మేజర్‌తో పాటు.. మరో బ్లాక్‌బస్టర్ మూవీ సీతారామం పోటీలో నిలిచాయి. తమిళంలో అత్యధికంగా 10 నామినేషన్స్ పొన్నియిన్ సెల్వన్-1 చిత్రానికి దక్కించుకుంది. ఆ తర్వాత కమల్‌హాసన్-లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో వచ్చిన విక్రమ్ 9 విభాగాల్లో నామినేషన్స్‌కు ఎంపికైంది . కన్నడలో రిషబ్ శెట్టి బ్లాక్ బస్టర్ హిట్ కాంతార, యశ్ యాక్షన్ మూవీ కేజీయఫ్-2 చిత్రాలకు 11 కేటగిరిల్లో నామినేషన్స్ దక్కాయి. మలయాళంలో ఈసారి ఆరు చిత్రాలు ఉత్తమ చిత్రం కేటగిరిలో పోటీపడుతున్నాయి. అమల్ నీరద్ దర్శకత్వంలో మమ్ముటి నటించిన భీష్మ పర్వం చిత్రానికి 8 నామినేషన్స్ రాగా, టోవినో థామస్ థల్లుమాల మూవీకి ఏడు నామినేషన్స్ వచ్చాయి. కాగా.. సౌత్ సినిమా ఇండస్ట్రీలో నిర్వహించే ప్రతిష్ఠాత్మక సైమా అవార్డ్స్- 2023) ఈవెంట్ ఈ ఏడాది సెప్టెంబరు 15, 16 తేదీల్లో దుబాయ్‌లో జరగనున్న సంగతి తెలిసిందే. (ఇది చదవండి: 'మేడ్ ఇన్ హెవెన్' లో ట్రాన్స్ వుమెన్.. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా?) #SIIMA2023 nominations are out. In Telugu RRR Directed by S.S Rajamouli Starring Jr.NTR & Ram Charan has 11 Nominations is leading while Sita Ramam Directed by Hanu Raghavapudi Starring Dulquer Salmaan & Mrunal Thakur with 10 Nominations is close Second. #NEXASIIMA #SIIMAinDubai pic.twitter.com/M3DsQ7btLQ — SIIMA (@siima) August 1, 2023 #SIIMA2023 Nominations. In Tamil Mani Ratnam’s Ponniyin Selvan:1 Starring Vikram, Trisha & Aishwarya Rai leads with 10 nominations while Lokesh Kanagaraj’s Vikram Starring Kamal Haasan, Vijay Sethupathi & Fahadh Faasil with 9 Nominations is close Second. #NEXASIIMA… pic.twitter.com/sXAxDz7cuk — SIIMA (@siima) August 1, 2023 #SIIMA2023 Nominations. In Kannada Kantara Directed by and Starring Rishab Shetty with 11 Nominations, while KGF Chapter 2 Directed by Prashanth Neel, Starring Yash with 11 Nominations are in top position. #NEXASIIMA #SIIMAinDubai pic.twitter.com/hWh4ZDrw0z — SIIMA (@siima) August 1, 2023 #SIIMA2023 Nominations. In Malayalam Bheeshma Parvam Directed by Amal Neerad Starring Mammootty is leading with 8 Nominations while Thallumaala Directed by Khalid Rahman & Starring Tovino Thomas and Kalyani Priyadarshan with 7 Nominations is close Second #NEXASIIMA #SIIMAinDubai pic.twitter.com/Va8wuh2PRW — SIIMA (@siima) August 1, 2023 -
నిత్యా మీనన్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఇక మిమ్మల్ని చూడలేనంటూ!
సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ నిత్యామీనన్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. తాను ఎంతగానో ప్రేమించే అమ్మమ్మ చనిపోయారు. ఈ విషయాన్ని నిత్యా తన ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు. అమ్మమ్మ, తాతయ్యతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసింది. ఇది చూసిన నిత్యా అభిమానులు ధైర్యంగా ఉండాలంటూ పోస్టులు పెడుతున్నారు. (ఇది చదవండి: నాన్న బాటలోనే రాణిస్తా.. సేవలు కొనసాగిస్తా..ఘట్టమనేని సితార) నిత్యా ఇన్‌స్టాలో రాస్తూ.. 'ఒక శకం ముగిసింది. మిమ్మల్ని చాలా మిస్సవుతున్నా. గుడ్ బై అమ్మమ్మ అండ్ మై చెర్రీమ్యాన్. ఇప్పటి నుంచి మరో కోణంలో చూసుకుంటా.' అంటూ ఎమోషనలైంది. కాగా.. అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన నటి నిత్యామీనన్. నితిన్ సరసన ఇష్క్ సినిమాతో గుర్తింపు దక్కించుకుంది. ఆమె తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళంలో దాదాపు 50కి పైగా చిత్రాల్లో నటించింది. తెలుగులో గుండెజారి గల్లంతయ్యిందే, జనతా గ్యారేజ్, 100 డేస్ ఆఫ్ లవ్, ఒక్క అమ్మాయి తప్ప, ఇంకొక్కడు లాంటి చిత్రాల్లో నటించింది. (ఇది చదవండి: జబర్దస్త్ అవినాష్ తల్లికి గుండెపోటు! స్టంట్స్ వేసిన వైద్యులు) View this post on Instagram A post shared by Nithya Menen (@nithyamenen) -
లోక్ సభ సీట్లు పెంపు..దక్షిణాది రాష్ట్రాలకు టోపీ!
-
PS2 Collections: రెండు రోజుల్లో వందకోట్లు.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పర్వం!
మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పొన్నియిన్ సెల్వన్-2. విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్య రాయ్, త్రిష ప్రధాన పాత్రలో నటించారు. ఈ మూవీని మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈనెల 28న విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల పరంగా దూసుకెళ్తోంది. (ఇది చదవండి: ఘనంగా పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2 యాంథెమ్ లాంఛ్) పొన్నియన్ సెల్వన్- 2 బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల మార్క్‌ను దాటేసింది. ఇండియాలో రెండో రోజు దాదాపు రూ.28.50 కోట్ల గ్రాస్ సాధించగా.. ప్రపంచవ్యాప్తంగా రూ.51 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. రిలీజైన తొలిరోజు రూ.38 కోట్ల రాబట్టిన ఈ చిత్రం రెండు రోజుల్లోనే 100 కోట్ల సాధించింది. (ఇది చదవండి: అవి వేసుకోవడం మన కల్చర్ కాదు.. సింగర్ చిన్మయి సంచలన కామెంట్స్!) కాగా.. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్-1 పాన్ ఇండియా రేంజ్లో సత్తా చూపించింది. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దాదాపు 450 కోట్లు వసూళ్లు చేసింది. ఈ చిత్రంలో శరత్ కుమార్, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. -
సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత!
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. శాండల్‌వుడ్ నటుడు, దర్శకుడు టపోరి సత్య కన్నుమూశారు. కిడ్నీ ఫెయిల్యూర్‌తో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆయన కోలుకోలేక తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు ఆయన మృతి సంతాపం తెలిపారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు సంతానం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో కుటుంబానికి ఆధారమైన టపోరి సత్య మృతి తీరని శోకాన్ని మిగిల్చింది. సత్య తల్లి మాట్లాడుతూ..' సత్య ఆసుపత్రిలో వారం రోజులు ఐసీయూలో ఉన్నారు. ఆయన ఎప్పుడూ సినిమాలకే అంకితమయ్యారు. నన్ను, నా కుటుంబాన్ని ఆదుకుంటానని సత్య మాటిచ్చాడు. అతని మరణం మమ్మల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.' అని కన్నీటి పర్యంతమయ్యారు. సత్య భౌతికకాయాన్ని బనశంకరిలోని ఆయన నివాసంలో అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నారు. ఇవాళ సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. కాగా.. యోగేష్, నందిత జంటగా నటించిన నంద లవ్ నందిత చిత్రంలో టపోరి సత్య విలన్‌గా నటించారు. 2008లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత మేళా అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం మరో సినిమా తీసేందుకు సిద్ధమయ్యారు. ఈ ఘటనతో కన్నడ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ఇటీవలే ఓ బుల్లితెర నటుడు సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. -
షకీలా గొప్పమనసు.. సంబంధం లేకపోయినా అండగా నిలిచింది!
సౌత్ ఇండస్ట్రీలో షకీలా పేరు తెలియని ఉండరేమో. అంతలా పేరు సంపాదించింది ఆమె. అయితే ఆమె ఎక్కువగా మళయాళ శృంగార చిత్రాలలో నటించింది. తమిళంలో ప్లేగర్ల్స్ అనే చిత్రంతో ఆమె సినీ కెరీర్ ప్రారంభించింది. అయితే ఈ సినిమాలో సిల్క్ స్మిత ప్రధాన కథానాయికగా నటించింది. ఆ తర్వాత కిన్నెర తుంబికళ్ అనే మళయాళం చిత్రంతో మొదటిసారిగా గుర్తింపు తెచ్చుకుంది. దాదాపు 110 సినిమాల్లో నటించిన షకీలా తమిళం, మళయాళం, తెలుగు, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించింది. ఒకప్పుడు దక్షిణ చిత్రసీమలో ఎక్కువ పారితోషికం తీసుకొన్న నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ఆ తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. షకీలా నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట దగ్గర కోటలో పెరిగింది. అయితే గత 15 ఏళ్ల నుంచి అడల్ట్ సినిమాలకు ఆమె దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలే చేస్తున్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. సమస్య ఉన్న చోటుకు వెళ్లి దాన్ని పరిష్కరించటానికి తన వంతు కృషి చేస్తున్నారు. తాజాగా షకీల ఓ అపార్ట్మెంట్ వాసులకు అండగా నిలిచారు. అసలేం జరిగిందంటే.. చెన్నైలోని చూలైమేడులో చిత్ర రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ఉంది. అందులో పెద్ద సంఖ్యలో కుటుంబాలు నివాసముంటున్నాయి. అయితే ఆ అపార్ట్మెంట్ యజమాన్యం వారి నుంచి అక్రమంగా మెయింటెన్స్ వసూలు చేస్తోంది. దాదాపు వారి నుంచి రూ.9 వేలు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అంత డబ్బులు కట్టలేమంటూ అపార్ట్మెంట్ వాసులు ఆందోళనకు దిగారు. దీంతో యాజమాన్యం వారిని ఇబ్బందులకు గురి చేస్తోంది. వారి అపార్ట్‌మెంట్‌కు మాత్రమే నీళ్లు రాకుండా నిలిపేసింది. ఈ చర్యలతో గత మూడు రోజుల నుంచి నరకయాతన అనుభవిస్తున్నారు. వేధింపులు భరించలేక వారంతా ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. అయితే ఈ విషయం తెలుసుకున్న షకీల అపార్ట్మెంట్ దగ్గరకు చేరుకున్నారు. నిరసన తెలుపుతున్న మద్దతుగా నిలిచారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. షకీలకు ఎలాంటి సంబంధం లేకపోయినా వారికి మద్దతుగా నిరసన చేయడం చూసిన నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. -
సూపర్ హిట్ కాంబినేషన్.. 37 ఏళ్ల తర్వాత మళ్లీ!
1986లో వచ్చిన చిత్రం లేడీస్ టైలర్ సినిమా మీకు గుర్తుందా? అప్పట్లో ఆ మూవీ ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, అర్చన జోడీగా నటించారు. ఈ సినిమాలో జంటగా నటించిన రాజేంద్రప్రసాద్, అర్చనల కెమిస్ట్రీని సినీ ప్రేక్షకులు అంత సులువుగా మరచిపోలేరు. అయితే ఇప్పుడేంటీ అనుకుంటున్నారా? అయితే మళ్లీ అదే జోడీ తెరపై సందడి చేయనుంది. దాదాపు 37 ఏళ్ల తర్వాత మరోసారి స్క్రీన్ పంచుకోబోతోంది ఈ జంట. రాజేంద్ర ప్రసాద్, అర్చన ప్రధాన పాత్రల్లో తాజాగా తెరకెక్కుతోన్న చిత్రం ‘షష్ఠి పూర్తి’. రూపేష్ కుమార్ చౌదరి, ఆకాంక్షా సింగ్ జంటగా పవన్ ప్రభ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. హీరోగా నటించడంతో పాటు రూపేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాాగ చెన్నైలోని సంగీతదర్శకుడు ఇళయరాజా స్టూడియోస్‌లో ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ఆరంభమైంది. తొలి సీన్‌కి ఇళయరాజా కెమెరా స్విచాన్ చేయగా.. నిర్మాత ఆర్బి చౌదరి క్లాప్ ఇచ్చారు. రూపేష్ కుమార్ చౌదరి మాట్లాడుతూ..'లేడీస్ టైలర్’ తర్వాత రాజేంద్రప్రసాద్, ఇళయరాజా కాంబినేషన్లో ‘ఆస్తులు అంతస్తులు, చెట్టు కింద ప్లీడర్, ఏప్రిల్ 1 విడుదల లాంటి మ్యూజికల్ హిట్స్ వచ్చాయి. చాలా ఏళ్ల తర్వాత ఈ లెజెండ్స్ కాంబినేషన్ రిపీట్ కాబోతోంది. అలాగే ‘లేడీస్ టైలర్’ తర్వాత రాజేంద్ర ప్రసాద్, అర్చన నటిస్తున్న చిత్రమిదే. ఈ సినిమాలో మొత్తం నాలుగు పాటలు ఉన్నాయి. ఈ మూవీ న్యూ ఏజ్ ఫ్యామిలీ డ్రామా. జూలైలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.' అని అన్నారు. #LadiesTailor duo #RajendraPrasad & #Archana reunited after 37 years for the film #Shastipoorthi "Shoot starts this month and release in August “ says @ActorRupesh An #Ilaiyaraaja musical#RupeshKumarChaudhary @aakanksha_s30 #PavanPrabha #ThotaTharrani @BrindhaGopal1… pic.twitter.com/nCNwXPp0sz — Phani Kandukuri (@phanikandukuri1) April 1, 2023 -
సౌత్ సినిమాల్లో ఇప్పటికీ అదే ధోరణి.. రాహుల్ దేవ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దక్షిణాది సినిమాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు నటుడు రాహుల్ దేవ్. ఇప్పటికీ వారు ఇంకా 1970-80ల్లో వచ్చిన ధోరణినే అనుసరిస్తున్నాయని అన్నారు. వారు చూపించేవి నిజ జీవితంలో జరగపోయినా.. దక్షిణాది సినిమాలు బాగానే నడుస్తున్నాయని రాహుల్ దేవ్ చెప్పారు. ఇటీవల ఆవ్న గ్యాస్‌లైట్ అనే క్రైమ్ థిల్లర్‌లో కనిపించారు. ఈ మూవీ ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. సారా అలీ ఖాన్, చిత్రాంగద సింగ్, విక్రాంత్ మాస్సే ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రాహల్‌ను.. బాలీవుడ్‌తో పోలిస్తే ఎక్కువ ప్రాంతీయ చిత్రాలలో నటించడంపై ప్రశ్నించారు. దీంతో రాహుల్ దేవ్ సౌత్ సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ తనను చాలా తక్కువగా ఉపయోగించుకుందని అన్నారు. అయితే టాలీవుడ్ పలు సూపర్‌హిట్ సినిమాల్లో నటించారు రాహుల్ దేవ్. రాహుల్ మాట్లాడుతూ.. 'సృజనాత్మకతను ఏ విధంగానైనా చెప్పొచ్చు. మీరు దక్షిణాది వైపు చూస్తే, వారి సినిమాలు బాగా ఆడుతున్నాయి, కానీ అవన్నీ 1970- 80ల చిత్రాల ధోరణినే ఇప్పటికీ ఫాలో అవుతున్నారు. అప్పటీ కథనే మళ్లీ చెబుతున్నారు. వారి డైలాగ్‌లు, నటీనటుల జీవితం కంటే పెద్దవి. కొన్ని ఓవర్ ది టాప్ యాక్షన్, ఫైట్ సీక్వెన్స్‌లు ఉన్నాయి. కానీ కథ పాతదే అయినా అదే కథను చెప్పే విధానం.. ప్రేక్షకులను మెప్పించడం చాలా ముఖ్యం. కాబట్టి కథను వ్యక్తీకరించిన విధానం, ఆడియన్స్ దానిని ఎలా రిసీవ్ చేసుకుంటారనేదే ముఖ్యం. అలాంటి పాత్రలు నాకు వస్తాయని ఆశిస్తున్నా'. అని అన్నారు. తన నటన జీవితంపై మాట్లాడుతూ..' ఓటీటీలతో ప్రస్తుత నటుడి నైపుణ్యం చాలా సహజంగా మారిపోయింది. ఉదాహరణకు నిజ జీవితంలో ఇద్దరు వ్యక్తులు మధ్య ఫైటింగ్ జరుగుతోంది. అందులో ఎవరిదీ తప్పు అని మనం నిర్ణయిస్తాం. అదే సినిమా విషయాకొనిస్తే అదే ఎక్కువమంది ఇష్టపడతారు. సినిమాల్లో అదే ఫైట్‌ను ఆ ధోరణితో చూడరు. అంటే సృజనాత్మకత ఒక వ్యక్తీకరణ మాత్రమే. ఇది మీరు ఏ విధంగానైనా వ్యక్తీకరించవచ్చు.' అని అన్నారు. కాగా.. ఛాంపియన్, ఓంకార, టోర్బాజ, రాత్ బాకీ హై వంటి చిత్రాలలో రాహుల్ నటించారు. ఇటీవల కిచ్చా సుదీప్తో కలిసి కన్నడ చిత్రం కబ్జాలో కూడా కనిపించారు. ఇందులో ఉపేంద్ర, శ్రియ శరణ్ కూడా నటించగా.. ఈ చిత్రం గత నెలలోనే విడుదలైంది. -
కాఫీకి పిలిచి రూమ్‌కు రమ్మన్నాడు: స్టార్ హీరోయిన్
బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. డర్టీ పిక్చర్, షేర్ని, కహాని’ వంటి సినిమాలతో ఫేమ్ సాధించింది. అయితే బాలీవుడ్ బ్యూటీ ప్రస్తుతం లేడీ ఓరియెంటెండ్ సినిమాలపైనే ఫోకస్ పెట్టింది. అయితే తాజాగా విద్యాబాలన్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన విద్యా బాలన్ క్యాస్టింగ్ కౌచ్ సంచలన కామెంట్స్ చేసింది. కెరీర్లో తనకెదురైన అనుభవాలను ఈ సందర్భంగా వివరించింది. విద్యాబాలన్ మాట్లాడుతూ.. ' దక్షిణాది సినిమాల్లో పని చేసేందుకు ప్రయత్నిస్తున్నా రోజులవి. ఓ యాడ్ ఫిల్మ్ కోసం డైరెక్టర్‌ను కలిసేందుకు చెన్నై వెళ్లా. అక్కడ కాఫీ షాప్‌లో మాట్లాడుకుందామని దర్శకుడితో చెప్పా. అయితే అతను నన్ను రూముకి వెళ్లి మాట్లాడుకుందామని అడిగాడు. అప్పుడే అతని ఆలోచన నాకర్థమైంది. అప్పుడే నేను గది లాక్ చేయకుండా కొంచెం తెరిచి ఉంచా. దీంతో ఆ దర్శకుడు ఏమీ మాట్లాడకుండా ఐదు మిషాల తర్వాత అక్కడ నుంచి వెళ్లిపోయాడు.' అంటూ చెప్పుకొచ్చింది నటి. ఆ సమయంలో తాను తెలివిగా వ్యవహరించడం వల్లే తప్పించుకున్నానని పేర్కొంది. అయితే ఆ దర్శకుడు ఎవరనేది మాత్రం వెల్లడించలేదు. ఇప్పటికీ ఆ సంఘటనను మర్చిపోలేకపోతున్నానని విద్యా బాలన్ చెబుతోంది. ఆ తర్వాత కూడా ఇలాంటి సంఘటనలు ఎదుర్కొన్నట్లు తెలిపింది. వాటితో మానసికంగా ఇబ్బందులు పడ్డానని.. బయట పడేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని వెల్లడించింది. ఆ సంఘటనతో దర్శకుడు సినిమా నుంచి తొలగించి.. బాడీ షేమింగ్ చేశారని వాపోయింది. కాగా.. 2005లో వచ్చిన ‘పరిణీత’ సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన భామ.. 2011 లో వచ్చిన ‘డర్టీ పిక్చర్’ సినిమాతో పాపులర్ అయింది. -
అడగ్గానే రిప్లై.. వివాదంలో ప్రముఖ నటుడు.!
కన్నుమ్ కన్నుమ్, విమల్ పులివాల్ వంటి కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించిన మరిముత్తుకు పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో ఆతను పూర్తిస్థాయి నటుడిగా మారిపోయాడు. జీవా, పరియేరుమ్ పెరుమాళ్, కొంబన్ వంటి పలు హిట్ చిత్రాల్లో నటించిన ఆయన ప్రస్తుతం సీరియల్స్‌లోనూ నటిస్తున్నారు. ముఖ్యంగా తిరుచెల్వం దర్శకత్వం వహించిన కౌంటర్-స్విమ్మింగ్ సీరియల్లో అతని పాత్ర మంచి గుర్తింపు వచ్చింది. అలా నటనలో దూసుకెళ్తున్న మరిముత్తు తాజాగా ఓ వివాదంలో ఇరుక్కున్నాడు. అంతే కాకుండా ప్రముఖ దర్శకులైన వసంత్, ఎస్.జె.సూర్య, మణిరత్నం, సీమాన్ వద్ద సహాయ దర్శకుడిగా కూడా పనిచేశాడు. సోషల్ మీడియాలో ఓ మహిళ నేను మీకు కాల్ చేయొచ్చా అంటూ ఓ క్యాప్షన్ పెట్టింది. అరకొర దుస్తులు ధరించిన ఫోటోను షేర్ చేసింది. ఈ పోస్ట్ చూసిన నటుడు మరిముత్తు వెంటనే ట్విటర్ ఖాతాలో రిప్లై ఇచ్చారు. అందులో ఏకంగా తన మొబైల్ నంబర్ కూడా పెట్టారు. ఇది చూసిన నెటిజన్స్ షాక్ తిన్నారు. ఆ తర్వాత నంబర్ ట్రూ కాలర్‌లో చెక్ చేశారు. ఆయనదే కావడంతో ప్రస్తుతం ఈ అంశం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. అయితే దీనిపై మరిముత్తు తనయుడు అఖిలన్ వివరణ ఇచ్చాడు. ఆ పోస్ట్ చేసింది మా నాన్న కాదని చెప్పారు. ఎవరో కావాలనే అలా చేశారని అన్నారు. మా నాన్న నంబర్ చాలామందికి తెలుసని.. అందుకే ఎవరో దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. తన వివరణ తర్వాత ఆ నకిలీ రికార్డును తొలగించారు. On behalf of @ActorMarimuthu (his official account) - The account that has commented with his phone number doesn’t belong to him and his phone number is out in the public for quite sometime and it has been misused here. I kindly request @Schumy_Official to remove this post 🙏🏾 — Akilan Marimuthu (@akilangm) February 26, 2023 -
సౌత్ సినిమాలపై రకుల్ కామెంట్స్.. నెటిజన్స్ ఫైర్
తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ గుర్తింపు దక్కించుకున్న బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్ సినిమాలతో బిజీగా మారిపోయింది. బాలీవుడ్లో ఆమె నటించిన చిత్రాలు ఛత్రివాలి, డాక్టర్ జి, 'థ్యాంక్ గాడ్', కట్ పుట్లి, రన్‌వే 34, అటాక్ విభిన్న పాత్రల్లో రకుల్ నటించింది. ప్రస్తుతం కమల్ హాసన్ మూవీ ఇండియన్- 2లో కనిపించనుంది. ఇదిలా ఉండగా తాజాగా రకుల్ చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి. గత కొద్ది రోజులుగా సౌత్ వర్సెస్ బాలీవుడ్ అంటూ వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల బాలీవుడ్ నటుడు సౌత్ సినిమాల్లో లాజిక్ ఉండదంటూ ఘాటు కామెంట్స్ చేశారు. రకుల్ మాట్లాడుతూ.. 'సోషల్ మీడియాలో ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తున్నారు. బాలీవుడ్, సౌత్ మూవీస్ రెండూ ఒకటే అని.. వాటిని వేర్వేరుగా చూడొద్దని హితవు పలికింది. దేశంలో ప్రతిభగల దర్శకులు ఉన్నారని.. వారు మంచి సినిమాలు చేయడం మనకే గర్వకారణం.' అంటూ చెప్పుకొచ్చింది. అయితే రకుల్ చేసిన కామెంట్స్‌పై నెటిజన్స్ మండిపడుతున్నారు. బాలీవుడ్ సినిమాలను సౌత్ చిత్రాలతో పోలుస్తుంటే కోపం వస్తోందా అని ప్రశ్నిస్తున్నారు. గతంలో దక్షిణాది చిత్రాలతోనే గుర్తింపు వచ్చిన విషయాన్ని మర్చిపోయావా అంటూ ట్రోల్ చేస్తున్నారు. కాగా..గతేడాది కేవలం బాలీవుడ్ చిత్రాల్లోనే రకుల్ నటించింది. -
సౌత్ సినిమాలు లాజిక్ లెస్.. బాలీవుడ్ నటుడు విమర్శలు
బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ కంటే సౌత్ సినిమాల్లో సీన్స్ ఊహకందని విధంగా ఉంటాయని ఎద్దేవా చేశారు. తెలుగు, తమిళం, కన్నడ చిత్రాల్లో కొన్ని సీన్స్ సంబంధం లేకుండా ఉంటాయన్నారు. అలాగే పాటలు కూడా ప్రేక్షకులు ఊహించని విధంగా ఉంటాయని విమర్శించారు. సౌత్ సినిమాల్లో అసలు లాజిక్ కొంచెం కూడా ఉండదన్నారు. సినిమాలు హిట్ అయినా కూడా స్క్రిప్ట్ తెరకెక్కించడంలో తప్పులు చేస్తారని అన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూకూ హాజరైన నసీరుద్దీన్ సౌత్ చిత్రాలపై విమర్శలు చేశారు. సౌత్ ఇండస్ట్రీలకు ఇది కొత్తేమీ కాదని నసీరుద్దీన్ అంటున్నారు. నసీరుద్దీన్ షా మాట్లాడుతూ..' తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో సినిమాలు హిట్ అయినా.. వాటిలో చాలా లాజిక్ లెస్ సీన్స్ ఉంటాయి. సినిమాల్లో కొన్ని సన్నివేశాలు ఊహకి అందని విధంగా ఉంటాయి. వాటిలో పిచ్చి పిచ్చి పాటలు ఒకటి. హిట్ సినిమాలు అయినా కనీసం లాజిక్ పాటించరు. చిత్రీకరణలో చాలా లోపాలు ఉంటాయని' ఘాటుగా విమర్శించారు. ఇది చూసిన నెటిజన్లు నసీరుద్దీన్ షాను ట్రోల్స్ చేస్తున్నారు. అయితే మరోవైపు హిందీ చిత్రాల కంటే దక్షిణాది చిత్రాలకు ప్రేక్షకులను ఎక్కువ ఆకట్టుకుంటున్నాయని నసీరుద్దీన్ చెప్పారు. దక్షిణాది చిత్రాలను చాలా కష్టపడి తీస్తారని.. హిందీ సినిమాల కంటే హిట్ అవుతాయనడంలో సందేహం లేదన్నారు. అయితే గత కొన్నేళ్లుగా బాలీవుడ్ చిత్రాలు అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాయి, అయితే 'కేజీఎఫ్', 'పుష్ప: ది రైజ్', కాంతార, 'ఆర్ఆర్ఆర్' వంటి సౌత్ చిత్రాలు హిందీ చిత్రాల బాక్సాఫీస్‌ను దాటేశాయి. కాగా.. నసీరుద్దీన్ షా.. ఆస్మాన్ భరద్వాజ్ దర్శకత్వం వహించిన 'కుట్టే'లో టబు, అర్జున్ కపూర్, రాధిక మదన్, కొంకణా సెన్శర్మ, కుముద్ మిశ్రా, శార్దూల్ భరద్వాజ్ కలిసి నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. అతను తదుపరి 'తాజ్-డివైడెడ్ బై బ్లడ్' పేరుతో రాబోయే హిస్టారికల్ డ్రామా సిరీస్‌లో అక్బర్ చక్రవర్తిగా కనిపించనున్నారు.