మార్క్ ఆంటోనీ చిత్రం తర్వాత కోలీవుడ్ హీరో విశాల్ మరో చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా ఆయన చిత్రానికి సంబంధించి క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి హరి దర్శకత్వం వహిస్తుండగా.. తాజాగా టైటిల్ ప్రకటించారు మేకర్స్. ఇంతకు ముందు హరి.. పూజై, తామిర భరణి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. ఈ మూవీని స్టోన్ బెంచ్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ చిత్రంతో హ్యాట్రిక్ సాధించడానికి డైరెక్టర్ హరి రెడీ అయిపోయారు. సాధారణంగా అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్ టైనర్ కథా చిత్రాల కేరాఫ్‌గా మారిన హరి.. ఈ సినిమా కూడా అలాంటి నేపథ్యంలోనే రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఇసుక మాఫియా నేపథ్యంలో సాగే యాక్షన్ కథా చిత్రమని యూనిట్ వర్గాలు పేర్కొన్నారు. దీనికి రత్నం అనే టైటిల్ ఖరారు చేసినట్లు తాజా సమాచారం.
తాజాగా దీనికి సంబంధించి విడుదల చేసిన టీజర్‌లో నటుడు విశాల్ ఒక వ్యక్తి తలను నరికే సన్నివేశం ఉంది. ఈ ఒక్క సీన్ చూస్తేనే మరో పక్క కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఇది ఉంటుందని చెప్పవచ్చు. ఈ చిత్ర షూటింగ్‌ను కారైక్కుడి, తూత్తుక్కుడి, చైన్నె ప్రాంతాల్లో చిత్రీకరించినట్లు యూనిట్ వర్గాలు వర్గాలు తెలిపారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. దర్శకుడు గౌతమ్ మీనన్, సముద్రఖని, యోగి బాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
Well here it is finally, my 34th film. Happy to share THE FIRST LOOK of #RATHNAM, unleashing the combo with hari sir for the third time
— Vishal (@VishalKOfficial) December 2, 2023
The action begins and looking forward to summer 2024 release. Hope u all like it. Hardwork never fails. God bless.
Tamil -… pic.twitter.com/7tmHn0FrJV
Comments
Please login to add a commentAdd a comment