Priya Bhavani Shankar
-
'బ్లాక్' సినిమా రివ్యూ (ఓటీటీ)
థియేటర్ అంటే భారీ బడ్జెట్ సినిమాలు.. ఓటీటీ అంటే థ్రిల్లర్ మూవీస్ అనేది ప్రస్తుతం ట్రెండ్. అందుకు తగ్గట్లే డిఫరెంట్ కథలతో తీస్తున్న థ్రిల్లర్స్.. భాషతో సంబంధం లేకుండా ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. అలా కొన్నిరోజుల క్రితం స్ట్రీమింగ్‌లోకి వచ్చిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ 'బ్లాక్'. అమెజాన్ ప్రైమ్‌లో ఉన్న ఈ మూవీ ఎలా ఉంది? ఏంటనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: 'పుష్ప 3'.. అసలు ఉన్నట్టా? లేనట్టా?)కథేంటి?వసంత్ (జీవా), అరణ్య (ప్రియా భవానీ శంకర్) భార్యభర్తలు. వీకెండ్ సరదాగా గడుపుదామని బీచ్ పక్కన తాము కొన్న కొత్త విల్లాలోకి వెళ్తారు. ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఇంకా పూర్తిగా పనులు జరగకపోవడం వల్ల వీళ్లు తప్పితే మరెవరు అక్కడ ఉండరు. పగలంతా బాగానే ఉంటుంది కానీ ఎప్పుడైతే రాత్రి అవుతుందో విచిత్రమైన సంఘటనలన్నీ జరుగుతుంటాయి. భయపడి పారిపోదామని ఎంత ప్రయత్నించినా.. తిరిగి తిరిగి అక్కడికి వస్తుంటారు. మరోవైపు తమ ఎదురుగా ఉన్న విల్లాలో ఎవరో ఉన్నారని అనిపిస్తుంది. వెళ్లి చూస్తే అచ్చుగుద్దినట్లు తమలాంటి ఇద్దరు వ్యక్తులే కనిపిస్తారు. ఇంతకీ వాళ్లెవరు? ఇలా జరగడానికి కారణమేంటి అనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా ఏదైనా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటే మూవీస్ చూద్దామనుకునే వాళ్లకు 'బ్లాక్' నచ్చేస్తుంది. 1964లో సినిమా ఓపెన్ అవుతుంది. తన ఫ్రెండ్, అతడి ప్రేయసికి మనోహర్ (వివేక్ ప్రసన్న).. బీచ్ దగ్గర్లోని తన విల్లాలో ఉంచి, తర్వాతి రోజు ఉదయం పెళ్లి చేయాలనుకుంటాడు. కానీ అనుకోని కొన్ని సంఘటనల వల్ల వాళ్లిద్దరినీ ఎవరో చంపేస్తారు. కట్ చేస్తే స్టోరీ 60 ఏళ్ల తర్వాత అంటే ప్రస్తుతానికి వస్తుంది.వసంత్, ఆరణ్య.. వాళ్లిద్దరి ప్రవర్తన, మనస్తత్వాలు ఇలా సీన్స్ వెళ్తుంటాయి. కాకపోతే ఇవి రొటీన్‌గా ఉంటాయి. ఎప్పుడైతే వీళ్లిద్దరూ విల్లాలోకి అడుగుపెడతారో విచిత్రమైన సంఘటనలన్నీ జరుగుతుంటాయి. తమలాంటి ఇద్దరు వ్యకులు వీళ్లకు కనిపించడంతో సస్పెన్స్ క్రియేట్ అవుతుంది. అలా హారర్, సూపర్ నేచురల్ ఎలిమెంట్ ఏదో ఉందనే ఉత్కంఠ కలుగుతుంది. చీకటి ప్రదేశం కారణంగా ప్రతిసారీ తాము వివిధ కాలాల్లోకి (టైమ్ లైన్) ముందుకు వెనక్కి వెళుతున్నామని వసంత్ తెలుసుకోవడం, చీకటి ప్రదేశం కారణంగానే వసంత్-ఆర్యం ఒకరికొకరు దూరమవడం.. చివరకు ఎలా కలుసుకున్నారనేది సినిమా.(ఇదీ చదవండి: కవలలకి జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్)సినిమా చూస్తున్నంతసేపు థ్రిల్లింగ్‌గా ఉంటుంది. కాకపోతే అలా జరగడానికి వెనకున్న కారణాన్ని బయటపెట్టే సీన్ మాత్రం పేలవంగా ఉంటుంది. ఏదో ఫిజిక్స్ క్లాస్ చెబుతున్నట్లు వేగంగా చూపించేశారు. దీంతో సగటు ప్రేక్షకుడికి సరిగా అర్థం కాదు. క్లైమాక్స్ కూడా ఏదో హడావుడిగా ముగించేసిన ఫీలింగ్ కలుగుతుంది. సినిమా రెండు గంటల్లోపే ఉండటం ప్లస్ పాయింట్.ఎవరెలా చేశారు?సినిమాలో జీవా, ప్రియా భవానీ శంకర్ పాత్రలు మాత్రమే కనిపిస్తాయి. వీళ్లిద్దరూ ఆయా పాత్రల్లో ఆకట్టుకున్నారు. వాస్తవానికి, ఊహలకు మధ్య నలిగిపోయే వ్యక్తిగా జీవా వేరియషన్స్ చూపించాడు. వివేక్ ప్రసన్నతో పాటు మిగిలిన వాళ్లది అతిథి పాత్రలే. టెక్నికల్ విషయాలకొస్తే డైరెక్టర్ కేజీ సుబ్రమణి తీసుకున్న కాన్సెప్ట్ బాగుంది. కాకపోతే స్క్రిప్ట్‌లో లాజిక్స్ సరిగా ఎష్టాబ్లిష్ చేసుంటే బాగుండేది అనిపించింది. శామ్ సీఎస్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు చాలా పెద్ద ప్లస్. కొన్ని సీన్లను బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగా ఎలివేట్ చేసింది. మిగిలిన డిపార్ట్మెంట్స్ తమ వంతు న్యాయం చేశారు. ఓవరాల్‌గా చూసుకుంటే ఓటీటీలో థ్రిల్లర్ మూవీ ఏదైనా చూద్దామనుకుంటే 'బ్లాక్' ట్రై చేయొచ్చు. ప్రస్తుతానికి తమిళ ఆడియో మాత్రమే అందుబాటులో ఉంది. సబ్ టైటిల్స్ ఉన్నాయి.-చందు డొంకాన(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' హౌస్‌లో ఉండలేనంటూ కన్నీళ్లతో బయటకొచ్చిన శోభా శెట్టి) -
'జీబ్రా' సినిమా రివ్యూ
యంగ్ హీరో సత్యదేవ్ లేటెస్ట్ మూవీ 'జీబ్రా'. బ్యాంక్ టెక్నో థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో దీన్ని తీశారు. 'పుష్ప'లో జాలిరెడ్డిగా చేసిన ధనంజయ, 'బాహుబలి' సత్యరాజ్, సత్య, సునీల్, ప్రియా భవానీ శంకర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ట్రైలర్‌తోనే ఓ మాదిరి అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా (నవంబర్ 22) ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చింది. మరి ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?సూర్య (సత్యదేవ్).. హైదరాబాద్‌లోని 'బ్యాంక్ ఆఫ్ ట్రస్ట్' అనే బ్యాంక్‌లో సేల్స్ రిలేషన్షిప్ మేనేజర్. మరో బ్యాంకులో పనిచేసే స్వాతి (ప్రియా భవానీ శంకర్)తో ప్రేమలో ఉంటాడు. ఓ రోజు స్వాతి.. బ్యాంకులో పనిచేస్తూ చిన్న పొరపాటు చేస్తుంది. దీంతో ఓ అకౌంట్లో డిపాజిట్ కావాల్సిన రూ.4 లక్షలు మరో అకౌంట్లో పడతాయి. ఆ వ్యక్తి ఆ డబ్బుల్ని ఖర్చు చేసేస్తాడు. దీంతో స్వాతి.. సూర్యని సాయం అడుగుతుంది. చిన్న మతలబు చేసిన సూర్య.. ఆ డబ్బులు రిటర్న్ వచ్చేలా చూస్తాడు. స్వాతిని సమస్య నుంచి బయటపడేస్తాడు. కానీ సదరు వ్యక్తి అకౌంట్లో నుంచి రూ.5 కోట్లు మాయమవుతాయి. ఈ మొత్తం సూర్యనే కొట్టేసాడని, ఆదిత్య దేవరాజ్ (డాలీ ధనంజయ) అనే డాన్ ఇతడి వెంట పడతాడు. 4 రోజుల్లో రూ.5 కోట్లు తిరిగివ్వాలని లేదంటే చంపేస్తానని బెదిరిస్తాడు? మరి సూర్య ఆ డబ్బులు తిరిగి ఇచ్చాడా? దాని కోసం ఏమేం చేశాడనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ‘మెకానిక్ రాకీ’ మూవీ రివ్యూ)ఎలా ఉందంటే?షేర్ మార్కెట్, స్కామ్ అనగానే చాలామందికి 'స్కామ్ 1992' వెబ్ సిరీస్ గుర్తొస్తుంది. లేదంటే మొన్నీమధ్యనే తెలుగులో వచ్చిన 'లక్కీ భాస్కర్' సినిమా గుర్తొస్తుంది. పనిచేస్తున్న బ్యాంకులోనే డబ్బు కొట్టేసి, దొరక్కుండా ఎలా తప్పించుకున్నాడు అనే కాన్సెప్ట్‌తో తీసిన 'లక్కీ భాస్కర్' అద్భుతమైన హిట్. మరీ ఒకేలా అని చెప్పలేం గానీ అలాంటి ఓ పాయింట్‌తోనే తీసిన మూవీ 'జీబ్రా'. అందులో డబ్బు కొట్టేసి హీరో ఎవరికీ దొరకడు. ఇందులో మాత్రం హీరో ఓ తప్పు చేశాడు. కానీ ఎవరో చేసిన మరో తప్పు వల్ల విలన్‌కి దొరికిపోతాడు.హీరో సూర్య చేతిలో ఓ గిఫ్ట్ బాక్స్ చూపించే సీన్‌తో సినిమా మొదలవుతుంది. కట్ చేస్తే కథ ఆరు రోజులు వెనక్కి వెళ్తుంది. సూర్య, అతడి తల్లి, అతడి ప్రేయసి స్వాతి.. ఇలా ఒక్కో పాత్రని పరిచయం చేస్తూ కథలోకి వెళ్లిపోతాం. కాసేపటికే తనకో సమస్య వచ్చిందని స్వాతి.. హీరో సాయం కోరుతుంది. మనోడుతో చాలా తెలివితో బ్యాంకులో లూప్ హోల్స్ ఉపయోగించి ఆ సమస్య తీరుస్తాడు. కానీ ఇక్కడే ఊహించని సమస్య మరొకటి వస్తుంది. రూ.4 లక్షలతో స్కామ్ చేస్తే రూ.5 కోట్ల కనిపించకుండా పోవడం అనేది సూర్య మెడకి చుట్టుకుంటుంది. ఇక్కడ కథలో మరో కీలక పాత్ర ఎంట్రీ ఇస్తుంది. అదే ఆదిత్య దేవరాజ్ అలియాస్ డాలీ.. పెద్ద పెద్ద గుండాలనే శాసించే ఇతడికి రూ.5 కోట్లు అనేది పెద్ద విషయం కాదు. కానీ ఆ డబ్బు కోసం హీరోని ఎందుకు 4 రోజులు పాటు పరిగెత్తించాడనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.కథ పరంగా ఇది అర్థమయ్యేది కాదు. ఎందుకంటే బ్యాంక్ అంటే చాలామందికి డబ్బులు డిపాజిట్ చేయడం, విత్ డ్రా చేసుకోవడం మాత్రమే తెలుసు. కానీ బ్యాంక్ సిస్టమ్‌లోనూ ఎన్ని లూప్ హోల్స్ ఉంటాయనేది ఈ మూవీలో క్లియర్‌గా చూపించారు. సంస్థలో పనిచేసే హీరోనే డబ్బు కొట్టేయడం, దానికి తనతో పాటు పనిచేస్తున్న వ్యక్తుల సాయం తీసుకోవడం ఇవన్నీ కూడా భలే థ్రిల్లింగ్‌గా ఉంటాయి. ఎప్పటికప్పుడు సూర్యకి సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయి. కానీ ఒక్కో దాన్ని నుంచి చాకచక్యంగా తప్పించుకోవడం కూడా కన్విన్సింగ్‌గా ఉంది.చెస్‌లో మంత్రి, గుర్రం, ఏనుగు, భటులు ఇలా చాలా ఉంటాయి. ఈ సినిమాలో చెస్ గేమ్‌లా అనిపిస్తుంది. ఇందుకు సంబంధించిన మెటాఫర్స్, డ్రస్సు కలర్స్ మీరు సినిమాలో చూడొచ్చు. అన్నీ ప్లస్సులేనా మైనస్సులు ఏం లేవా అంటే కచ్చితంగా ఉన్నాయి. ఇంటర్వెల్ తర్వాత డాలీ తన కొడుక్కి తన ఫ్లాష్ బ్యాక్ చెబుతాడు. ఇది కాస్త ల్యాగ్, రొటీన్ అనిపిస్తుంది. ఐటమ్ సాంగ్‌ని కావాలనే ఇరికించినట్లు అనిపిస్తుంది.ఎవరెలా చేశారు?సూర్య పాత్రలో సత్యదేవ్ ఆకట్టుకున్నాడు. డిఫరెంట్ టైంలో డిఫరెంట్ ఎమోషన్స్ ఇతడి రోల్లో కనిపిస్తాయి. డాలీ అలియాస్ ఆదిత్య దేవరాజ్‌గా చేసిన ధనంజయ పాత్రకు మంచి ఎలివేషన్లు పడ్డాయి. ఒకానొక దశలో హీరో సత్యదేవ్ కంటే ఇతడి పాత్ర బాగుందనిపిస్తుంది. సత్య సిట్చుయేషనల్ కామెడీ సూపర్. డాలీని ఇరిటేట్ చేసే మదన్ గుప్తాగా సునీల్ కనిపిస్తాడు. రోల్ బాగుంది కానీ మెయిన్ లీడ్స్ వల్ల ఇతడి పాత్ర డౌన్ అయినట్లు అనిపిస్తుంది. బాబాగా చేసిన సత్యదేవ్, స్వాతిగా చేసిన ప్రియా భవానీ శంకర్.. ఎవరికి వాళ్లు పూర్తి న్యాయం చేశారు.టెక్నికల్ విషయాలకొస్తే రైటింగ్‌కి నూటికి 90 మార్కులు వేసేయొచ్చు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కథకు తగ్గట్లు ఉంది. సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది. కొన్నిచోట్ల గ్రాఫిక్స్ మాత్రం తేలిపోయింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ చూసేవాళ్లకు ఇది నచ్చదు. డిఫరెంట్ థ్రిల్లర్స్, అందులోనూ బ్యాంక్ స్కామ్ తరహా థ్రిల్లర్స్ ఇష్టపడేవాళ్లకు 'జీబ్రా' నచ్చేస్తుంది. అంతా బాగానే ఉంది కానీ 'లక్కీ భాస్కర్' రిలీజైన కొన్నిరోజుల తర్వాత థియేటర్లలోకి రావడం దీనికి ఓ రకంగా మైనస్.రేటింగ్: 2.75/5- చందు డొంకాన(ఇదీ చదవండి: ముందు 20 ఏళ్ల గురించి మీకు తెలీదు.. చిరుతో బాండింగ్‌పై బన్నీ) -
‘జీబ్రా’ క్లైమాక్స్ వరకు ఆ విషయం తెలియదు: సత్యదేవ్
‘ఇప్పుడు బ్యాంక్ వ్యవస్థ అంతా డిజిటల్ అయ్యింది. అక్కడ క్రైమ్ చేయడం అంత ఈజీ కాదు. బ్యాంక్ లో పని చేసే వాళ్లకి తప్పితే సామాన్యులకు అక్కడ జరిగే తప్పులు తెలియవు. దర్శకుడు ఈశ్వర్ కార్తిక్ గతంలో బ్యాంక్ లో పని చేశారు. ఆయన చూసిన ఇన్సిడెంట్స్ తో పాటు ఇంకొన్ని ట్రూ ఇన్సిడెంట్స్ తో ‘జీబ్రా’ సినిమాను తెరకెక్కించాడు. ఏటీఎం లో డబ్బులు తీసినప్పుడు ఓ సౌండ్ తో డబ్బులు బయటికి వస్తాయి. ఆ సౌండ్ వెనుక ఏం జరుగుతుందనేదే ఈ సినిమా. కామన్ ఆడియన్స్ అందరికీ కనెక్ట్ అవుతుంది’ అన్నారు హీరో సత్యదేవ్. కన్నడ స్టార్ హీరో డాలీ ధనంజయ హైలీ, సత్యదేవ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జీబ్రా’. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్, జెన్నిఫర్ పిషినాటో హీరోయిన్లుగా నటించారు. నవంబర్ 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో సత్యదేవ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ జీబ్రా..బ్లాక్ అండ్ వైట్ కి మెటాఫర్. బ్లాక్ మనీ, వైట్ మనీ చుట్టూ జరిగే కథ ఇది. అలాగే చివరి వరకూ ఎవరు మంచి ఎవరు చెడు అనేది తెలీదు. ప్రతిఒక్కరిలో గ్రే ఉంటుంది. అందుకే టైటిల్ ఫాంట్ కి గ్రే పెట్టి, సినిమాకి జీబ్రా అనే టైటిల్ పెట్టారు. నాకు స్క్రిప్ట్ పంపినప్పుడే అదే టైటిల్ తో వచ్చింది. అలాగే నాలుగు భాషల్లో రిలీజ్ అవుతున్న సినిమా ఇది. అన్ని రకాలుగా జీబ్రా టైటిల్ యాప్ట్.→ ఈ కథ విన్నప్పుడు మైండ్ బ్లోయింగ్ గా అనిపించింది. ఇంత గొప్ప కథ మనదగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా చేయాలని విన్నపుడే ఫిక్స్ అయ్యాను. సినిమా రిలీజైన తర్వాత ఆయన రైటింగ్, డైరెక్షన్ కి చాలా మంచి పేరు వస్తుంది.→ ఇందులో నేను బ్యాంకర్ని. ధనుంజయ గ్యాంగ్ స్టర్.. మా రెండు ప్రపంచాలు ఎలా కలిశాయనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. పుష్పలో జాలీ రెడ్డి పాత్ర తనకి మంచి పేరు తీసుకొచ్చింది. ఇందులో గ్యాంగ్ స్టర్ పాత్రలో చాలా మంచి శ్వాగ్ ఉంటుంది. కంప్లీట్ డిఫరెంట్ గాచేశాడు. ఈ సినిమాతో మన తెలుగు ప్రేక్షకులు ఇంకా దగ్గరవుతాడు. సినిమా కన్నడ లో కూడా రిలీజ్ అవుతుంది, అక్కడ తనకి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అక్కడ కూడా సినిమా బాగా ఆడుతుంది.→ నాకు కామన్ మ్యాన్ రోల్స్ ఇష్టం. ఇందులో ఆ కామన్ మ్యాన్ కనెక్ట్ నచ్చింది. ఇందులో లుక్ మారుస్తున్నాను. బ్యాంకర్ రోల్ ఇప్పటివరకూ చేయలేదు. అది ఇంట్రస్టింగ్ గా అనిపించింది. ఇప్పటివరకూ దాదాపు సీరియస్ రోల్స్ చేశాను. దాన్ని బ్రేక్ చేద్దామని దర్శకుడు ఈశ్వర్ కూడా భావించారు. ఇందులో చాలా కొత్త సత్యదేవ్ ని చూస్తారు. కామన్ మ్యాన్ విన్ అనేది అందరికీ కనెక్ట్ అయ్యే పాయింట్.→ ప్రస్తుతం 'ఫుల్ బాటిల్' అనే సినిమా చేస్తున్నాను. అది అవుట్ అండ్ అవుట్ ఫన్ ఫిల్మ్. వెంకటేష్ మహా తో ఓ సినిమా ఉంటుంది. చాలా గ్రేట్ స్టొరీ కుదిరింది. -
తప్పులు దిద్దుకుని జీబ్రా చేశాను : ఈశ్వర్ కార్తీక్
సత్యదేవ్, డాలీ ధనంజయ హీరోలుగా, ప్రియా భవానీ శంకర్, జెన్నీఫర్ పిక్కీనాటో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘జీబ్రా’. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో ఎస్ఎన్ రెడ్డి, ఎస్. పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈశ్వర్ కార్తీక్ మాట్లాడుతూ–‘‘ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత 32 కంపెనీల్లో ఉద్యోగం చేశాను. అయితే నా ఇష్టం సినీ రంగంవైపు ఉందని గ్రహించి సినిమాల్లోకి వచ్చాను. కీర్తీ సురేష్‌గారితో ‘పెంగ్విన్ ’ సినిమా తీశాను. ఆ మూవీ రిలీజ్ తర్వాత నా రచన నుంచి ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో గ్రహించి, తప్పులు దిద్దుకుని ‘జీబ్రా’ చేశాను. ఫైనాన్షియల్ క్రైమ్స్ నేపథ్యంతో ఈ చిత్రం ఉంటుంది. నేను బ్యాంకు ఉద్యోగిగా చేసిన సమయంలో అక్కడ జరిగే కొన్ని తప్పులను గమనించాను. ఆ అనుభవాలను కూడా ఈ సినిమాలో చెప్పే ప్రయత్నం చేశాను. సత్యదేవ్, ధనంజయగార్లు బాగా నటించారు. సత్యరాజ్, ప్రియభవానీ పాత్రలూ ఆసక్తిగా ఉంటాయి. రవి బస్రూర్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. నిర్మాతలు బాగా సపోర్ట్ చేశారు. త్వరలో నా కొత్త చిత్రం ప్రకటిస్తాను’’ అన్నారు. -
పెద్ద హీరో, 55 రోజులు నటించా కానీ..: హీరోయిన్
కళ్యాణం కమనీయం సినిమాతో ప్రియా భవానీ శంకర్ టాలీవుడ్‌కు పరిచయమైంది. అయితే, ఒక పెద్ద హీరో సినిమాలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఈ చెన్నై బ్యూటీ తాజాగా పంచుకుంది. స్కిన్ షోకు దూరంగా ఉంటూనే అవకాశాలను గోల్డెన్ ఛాన్స్‌లు దక్కించుకుంటున్న ప్రియా న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించి ఆపై తమిళ బుల్లితెరపై సీరియల్స్‌లో మెప్పించింది. అక్కడ వచ్చిన గుర్తింపుతో సినిమాల్లో కూడా భారీగానే ఆఫర్లు అందుకుంది. 'మేయాద మాన్'తో ఎంట్రీ ఇచ్చిన ప్రియ భవానీ శంకర్ కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్గా రాణిస్తుంది. డీమాటీ కాలనీ –2, ఇండియన్– 2,రత్నం,భీమా వంటి సినిమాలతో మెప్పించిన ఈ బ్యూటీ ఇప్పుడు కోలీవుడ్ స్టార్ జీవాతో కలిసి బ్లాక్ చిత్రంలో నటించింది.ప్రస్తుతం పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్న ఈమె తనకు జరిగిన ఒక చేదు అనుభవం గురించి ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ ఒక పెద్ద హీరో సరసన నటించే అవకాశం రావడంతో ఎంతో ఇష్టపడి ఆ చిత్రంలో 55 రోజుల పాటు నటించినట్లు చెప్పారు. ఎండనక వాననకు ఎంతో శ్రమించి నటించినట్లు చెప్పారు. షూటింగ్ పూర్తి అయిన తరువాత డబ్బింగ్ చెప్పడానికి వెళ్లగా షాక్ అయ్యానన్నారు. అయితే, ఆ సినిమాలో తన పాత్ర కేవలం 5 నిమిషాల కంటే తక్కువగానే ఉంది. దీంతో తనకు చెప్పిన కథ ఏమిటి, తనతో చేసిన షూటింగ్ అంతా ఏమైంది అని ఆ చిత్ర దర్శకుడిని అడగ్గా అదంతా మ్యూజిక్‌లో వస్తుంది చూడండి అని చెప్పారన్నారు. దీంతో ఆ చిత్ర హీరోకు ఫోన్ చేసి విషయం చెప్పానన్నారు. దీంతో ఆయన తానూ 135 రోజులు షూటింగ్ చేశానని, తన సన్నివేశాలే లేవని చెప్పారని నటి ప్రియభవానీ శంకర్ పేర్కొన్నారు. అయితే ఆమె ఏ చిత్రం గురించి చెప్పారు? ఆ దర్శకుడు ఎవరు అన్నది మాత్రం చెప్పలేదు. -
ఓటీటీలో హారర్ మూవీ.. నిద్రలేని రాత్రి కోసం సిద్ధమా?
బ్లాక్‌బస్టర్ హారర్ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. అరుళ్ నిధి, ప్రియ భవానీ శంకర్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం డీమాంటి కాలనీ 2. ఇది 2015లో వచ్చిన హిట్ మూవీ డీమాంటి కాలనీకి సీక్వెల్‌గా తెరకెక్కింది. అజయ్ ఆర్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళనాట ఆగస్టు 15న విడుదలై దాదాపు రూ.55 కోట్లు రాబట్టింది. దీంతో అదే నెల 23న తెలుగులో రిలీజ్ చేయగా ఇక్కడ మిశ్రమ స్పందన అందుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించారు. ఈ నెల 27 నుంచి జీ5లో తమిళ, తెలుగు భాషల్లో అందుబాటులో ఉండనున్నట్లు వెల్లడించారు.సినిమా విషయానికి వస్తే..క్యాన్సర్‌తో పోరాడుతున్న సామ్ రిచర్డ్ (సర్జానో ఖలీద్)ను డెబీ (ప్రియ భవానీ శంకర్) ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. అతడిని క్యాన్సర్ నుంచి కోలుకునేలా చేస్తుంది. కానీ, అంతలోనే సామ్ ఆత్మహత్య చేసుకుంటాడు. అతడి ఆత్మహత్య వెనక కారణం తెలియక మానసికంగా సతమతమవుతుంది. అసలేం జరిగిందో తెలుసుకోవాలని ప్రయత్నాలు మొదలుపెడుతుంది. ఈ క్రమంలో సామ్ చదివిన ఓ పుస్తకమే అతడి చావుకు కారణమని, ఈ తరహాలోనే పలువురూ మరణించారని తెలుసుకుంటుంది. తర్వాత ఏం జరిగింది? వరుస చావులకు చెక్ పెట్టేందుకు ఆమె ఏం చేసింది? ఈ పుస్తకానికి, డిమాంటి కాలనీకి ఉన్న లింకేంటి? అన్నది తెలియాలంటే ఓటీటీలో చూడాల్సిందే! View this post on Instagram A post shared by ZEE5 Tamil (@zee5tamil) చదవండి: హైదరాబాదీగా అలా అనడం కరెక్ట్ కాదు: హీరో సుదీప్ -
హారర్ థ్రిల్లర్ డీమాంటీ కాలనీ-2 రివ్యూ.. ఆడియన్స్‌ను భయపెట్టిందా?
టైటిల్: డీమాంటీ కాలనీ-2నటీనటులు: ప్రియాభవానీ శంకర్, అరుల్ నిధి, ఆంటి జాస్కెలైన్, త్సెరింగ్ దోర్జీ, అరుణ్‌పాండియన్, ముత్తుకుమార్, మీనాక్షి గోవిందరాజన్, సర్జానో ఖలీద్, అర్చన రవిచంద్రన్ తదితరులుదర్శకుడు: అజయ్ ఆర్ జ్ఞానముత్తునిర్మాతలు: విజయ సుబ్రహ్మణ్యన్, ఆర్సీ రాజ్కుమార్నిర్మాణసంస్థలు: బీటీజీ యూనివర్సల్, వైట్ నైట్స్ ఎంటర్టైన్మెంట్సంగీతం - సామ్ సీఎస్సినిమాటోగ్రఫీ - హరీశ్ కన్నన్ఎడిటర్ - కుమరేశ్ డివిడుదల తేదీ: ఆగస్టు 23(తెలుగు)హారర్ థ్రిల్లర్ మూవీస్ అంటే ఆడియన్స్ ఎక్కువగా ఆదరిస్తారు. ఈ జానర్లో వచ్చే చిత్రాలకు కొదవే లేదు. ఏ ఇండస్ట్రీ అయినా ఇలాంటి సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్‌బేస్ ఉంటుంది. అందుకే ఇలాంటి కథలపై డైరెక్టర్స్ ఎక్కువగా ఫోకస్ పెడుతుంటారు. అలా 2015లో వచ్చిన తమిళ హారర్ థ్రిల్లర్ డీమాంటీ కాలనీ అద్భుతమైన విజయం సాధించింది. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత ఆ చిత్రానికి సీక్వెల్‌గా డీమాంటీ కాలనీ-2 తీసుకొచ్చారు. ప్రియా భవానీ శంకర్, అరుల్ నిధి జంటగా నటించారు. ఇప్పటికే తమిళంలో రిలీజైన ఈ చిత్రాన్ని టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఈనెల 23న రిలీజవుతోన్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రీమియర్ షో వేశారు. అజయ్ ఆర్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన డీమాంటీ కాలనీ 2 అభిమానులను ఎంతమేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం. అసలు కథేంటంటే..తాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన సామ్ ఆత్మహత్యకు పాల్పడటాన్ని అతని భార్య డెబీ (ప్రియా భవానీ శంకర్) జీర్ణించుకోలేదు. భర్త ఎందుకలా మరణించాడో తెలుసుకోవాలని ఆరాతీయడం ప్రారంభిస్తుంది. అదే సమయంలో ఆరేళ్లకు ఒకసారి లైబ్రరీలోని పుస్తకం చదవడానికి వెళ్లిన వ్యక్తులందరూ ఆత్మహత్య చేసుకున్నారని తెలుస్తుంది. దీంతో ఆ మరణాలు ఆపేందుకు డెబీ ప్రయత్నాలు స్టార్ట్ చేస్తుంది. ఆ సమయంలో శ్రీనివాస్ (అరుళ్ నిధి), అతని కవల సోదరుడు రఘునందన్ (అరుళ్ నిధి) గురించి కూడా తెలుస్తుంది. వాళ్ల ప్రాణాలు కూడా ప్రమాదంలో ఉన్నాయని తెలుసుకున్న డెబీ.. ఆ ఇద్దరు అన్నదమ్ములను డెబీ, తన మావయ్య రిచర్డ్ (అరుణ్ పాండియన్)తో కలిసి కాపాడిందా? వీరికి టిబెట్ నుంచి వచ్చిన బౌద్ధ సన్యాసులు ఎలా సాయపడ్డారు? తన భర్త కోరికను డెబీ నెరవేర్చిందా? శ్రీనివాస్‌ను రఘునందన్ ఎందుకు చంపాలని అనుకున్నాడు? అనే విషయాలు తెలుసుకోవాలంటే డీమాంటీ కాలనీ-2 చూడాల్సిందే.ఎలా ఉందంటే..హారర్ థ్రిల్లర్‌కు సీక్వెల్‌గా వచ్చిన డీమాంటీ కాలనీ 2. ప్రీక్వెల్‌ను బేస్ చేసుకుని ఈ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు డైరెక్టర్ అజయ్ ఆర్ జ్ఞానముత్తు. అందుకే డీమాంటీ కాలనీ చూసిన వారికైతే సీక్వెల్ కాస్తా ఈజీగా అర్థమవుతుంది. ఇక ఈ స్టోరీ విషయానికొస్తే డీమాంటీ అనే ఇంటి చుట్టే తిరుగుతుంది. ఇక హారర్ సినిమాలంటే సస్పెన్స్‌లు కామన్ పాయింట్. ఫస్ట్ పార్ట్‌లో సినిమా ప్రారంభంలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడటం, అతని ఆత్మతో మాట్లాడేందుకు భార్య చేసే ప్రయత్నాలు కాస్తా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి.సెకండాఫ్ వచ్చేసరికి ఇందులోకి డీమాంటీ కాలనీ పాత్రలను తీసుకొచ్చిన తీరు ఆడియన్స్‌కు థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. డీమాంటీ కాలనీకి వెళ్లాకే అసలు కథ మొదలవుతుంది. ముఖ్యంగా హారర్ సీన్స్‌లో తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీని డైరెక్టర్ చూపించారు. కథ మధ్యలో సర్ప్రైజ్లు కూడా ఆడియన్స్‌ను మెప్పిస్తాయి. కథలో ప్రధానంగా ఆత్మతో పోరాడే సీన్స్ మరింత ఆసక్తిగా మలిచారు జ్ఞానముత్తు. ఈ హారర్ సినిమాలో బుద్ధిజం స్పిరిచువాలిటీ హైలెట్. టిబెటియన్ యాక్టర్‌తో సన్నివేశాలు అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ చిత్రాన్ని హారర్‌తో పాటు అన్నదమ్ముల మధ్య గొడవలు, సవతి చెల్లెలు లాంటి పాత్రలతో ఎమోషన్స్ పండించాడు. క్లైమాక్స్ విషయానికొస్తే ఆడియన్స్‌ను అద్భుతమైన థ్రిల్లింగ్‌కు గురిచేశాడు. విజువల్స్, సౌండ్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. చివర్లో పార్ట్-3 పై ఇచ్చిన హింట్‌తో మరింత క్యూరియాసిటీని పెంచేశాడు జ్ఞానముత్తు.ఎవరెలా చేశారంటే..ప్రియా భవానీ శంకర్ తన పాత్రలో ఒదిగిపోయింది. ముఖ్యంగా హారర్ సీన్స్‌లో హావభావాలు అద్భుతంగా పండించింది. అరుని నిధి ద్విపాత్రాభినయంతో అదరగొట్టేశాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల ఫరిధిలో మెప్పించారు. ఇక సాంకేతికత విషయానికొస్తే.. గ్రాఫిక్స్, సౌండ్ ఫర్వాలేదనిపించాయి. సామ్ సీఎస్ బీజీఎం ఈ చిత్రానికి హైలెట్. హరీష్ కన్నన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌లో కాస్తా ట్రిమ్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. ఓవరాల్‌గా హారర్ జానర్ ఇష్టపడేవారికి ఫుల్ ఎంటర్టైనర్ మూవీ. -- పిన్నాపురం మధుసూదన్, సాక్షి వెబ్‌డెస్క్ -
‘డెమోంటే కాలనీ 2’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
-
ప్రియుడితో పెళ్లి ప్రకటించిన టాప్ హీరోయిన్
కమలహాసన్ ఇండియన్ –2 సినిమాలో మెరిసిన నటి ప్రియా భవానీ శంకర్ తాజాగా శుభవార్త చెప్పారు. త్వరలో తన ప్రియుడితో కలిసి ఏడు అడుగులు వేస్తున్నట్లు ప్రకటించింది. గోపీచంద్ భీమా సినిమాతో పాటు సంతోష్ శోభన్‌తో కల్యాణం కమనీయం అనే సినిమాలో నటించిన ఈ చెన్నై బ్యూటీ నాగచైతన్య ధూత వెబ్ సిరీస్‌తో తెలుగు వారికి బాగా దగ్గరైంది. ఇప్పటికే ధనుష్, విశాల్, శింబు, కార్తి వంటి స్టార్ హీరోలతో ఆమె కలిసి నటించింది. ఆగష్టు 15న డీమాంటీ కాలనీ 2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది.మెసేజ్ చేసినా లింక్ పెట్టేశారు: ప్రియా భవానీ శంకర్ప్రియా భవానీ శంకర్ తాజాగా తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రాజ్ అనే వ్యక్తితో తాను పదేళ్ల నుంచి రిలేషన్లో ఉన్నానని ఓపెన్ అయింది. సినీ పరిశ్రమలోకి రాక ముందునుంచే రాజ్‌తో ప్రేమలో ఉన్నట్లు ఆమె తెలిపింది. అయితే, ప్రియుడితో డేటింగ్‌పై ఆసక్తి చూపుతున్న ఈ బ్యూటీ పెళ్లి గురించి మాత్రం ఆలోచించడం లేదనే ప్రచారం జరిగింది. దీంతో వారిద్దరూ విడిపోయారంటూ ఇప్పటికే ఎన్నోసార్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాను చాలామంది హీరోలతో కలిసి నటించడం వల్ల ఏదైనా సందర్భంలో వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబితే వెంటనే తప్పుగా ప్రచారం చేశారని చెప్పింది. వారితో రిలేషన్లో ఉన్నానంటూ కూడా కామెంట్ చేశారని గుర్తుచేసుకుంది. లక్కీగా ఇప్పుడు వారందరికీ పెళ్లి అయిపోయిందని సరదాగా చెప్పుకొచ్చింది. ఒకవేళ కళాశాల చదువు పూర్తి అయిన తరువాత పెళ్లి ప్రపోజల్ వచ్చి ఉంటే రాజ్‌తో ఈ పాటికే జరిగి ఉండేదన్నారు. కాగా వచ్చే ఏడాది పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. తన ప్రియుడు రాజ్ గురించి చెబుతూ తన జీవితంలోకి రాజ్ రావడంతోనే అదృష్టం అని పేర్కొన్నారు. తను లేకపోతే తాను ఇప్పటికీ ఒక మధ్య తరగతి కుటుంబ యువతిగానే మిగిలిపోయేదాన్నని అన్నారు. రాజ్ అందించిన ప్రోత్సాహమే తనను ఈ స్థాయికి చేర్చిందనే అభిప్రాయాన్ని నటి ప్రియాభవానీ శంకర్ వ్యక్తం చేశారు. -
భారతీయుడు 2 ఫ్లాప్.. నా వల్లే అంటున్నారు: హీరోయిన్
భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారతీయుడు 2 మూవీ బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. భారతీయుడు సినిమా అద్భుతంగా ఉంటే దాని సీక్వెల్ దరిదాపుల్లో కూడా లేదని పలువురూ విమర్శించారు. ఈ మూవీ విడుదలైనప్పుడు తనను తీవ్ర స్థాయిలో విమర్శించారంటోంది హీరోయిన్ ప్రియ భవానీ శంకర్.ముందే తెలిస్తే..హీరోయిన్ ప్రియ మాట్లాడుతూ.. నా కెరీర్లో నేను సంతకం చేసిన భారీ బడ్జెట్ చిత్రం ఇండియన్ 2. ఈ మూవీ ఒప్పుకోగానే నాకు ఎన్నో ఛాన్సులు వచ్చాయి. పెద్ద సినిమాలు చేస్తేనే హీరోయిన్గా భావిస్తున్నారు. ఇకపోతే ఫ్లాప్ అవుతాయని ముందే తెలిస్తే ఎవరైనా సరే సినిమాలు ఎందుకు చేస్తారు? టెక్నీషియన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ సినిమా హిట్టవ్వాలనే కష్టపడతారు.వర్కవుట్ కాకపోతే..అందరూ ఇష్టంగా కష్టపడి పని చేసినప్పుడు అది వర్కవుట్ కాకపోతే చాలా బాధేస్తుంది. ఇండియన్ 2 హిట్ అవదని తెలిసినా సరే దాన్ని నేను వదులుకోకపోయేదాన్ని. కమల్ -శంకర్ సర్ కాంబినేషన్లో మూవీని ఎవరు వద్దనుకుంటారు? కానీ జనాలు నన్ను మాటలతో వేధిస్తున్నారు. అందుకు బాధగా ఉంది. మీ అంచనాలు అందుకోలేకపోయినందుకు సారీ..ఒక్కరే కారణం కాదుసినిమా వైఫల్యం ఒక్కరి మీదే ఆధారపడదు. ఎన్నో కారణాలు ముడిపడి ఉంటాయి. కానీ నేనే కారణమంటే మనసుకు బాధేస్తోంది అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ప్రియ భవానీ శంకర్ 'డీమాంటి కాలనీ' సినిమాలో యాక్ట్ చేసింది. ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. -
హారర్... థ్రిల్
అరుళ్ నిధి, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన తమిళ చిత్రం ‘డీమాంటీ కాలనీ 2’. అజయ్ ఆర్. జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు. విజయ సుబ్రహ్మణ్యన్, ఆర్.సి.రాజ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టులో విడుదల కానుంది. రాజ్ వర్మ ఎంటర్టైన్మెంట్– శ్రీ బాలాజీ ఫిలింస్ తెలుగులో విడుదల చేస్తున్నాయి. ఈ చిత్రం ట్రైలర్‌ను దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ రిలీజ్ చేసి, ‘ట్రైలర్ ఆసక్తిగా ఉంది.సినిమా హిట్టవ్వాలి’ అన్నారు. కాగా అజయ్ ఆర్. జ్ఞానముత్తు దర్శకత్వంలో వచ్చిన ‘డీమాంటీ కాలనీ’కి సీక్వెల్‌గా ‘డీమాంటీ కాలనీ 2’ రూపొందింది. ‘‘హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ఇది. డీమాంటీ ఇంట్లో అనూహ్యమైన ఘటనలు జరుగుతుంటాయి. ఆ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు వెళ్లిన వారు చనిపోతుంటారు. ఇంతకీ ఆ ఇంట్లో ఉన్న ఆ శక్తి ఏంటి? చివరగా వెళ్లినవారు ఎలా ప్రాణాలు కాపాడుకున్నారు?’ అనేది ‘డీమాంటీ కాలనీ 2’లో ఆసక్తిగా ఉంటుంది’’ అన్నారు మేకర్స్. -
Indian 2 Review: ‘భారతీయుడు 2’ మూవీ రివ్యూ
టైటిల్: భారతీయుడు 2(ఇండియన్ 2)నటీనటులు: కమల్ హాసన్, ఎస్.జె.సూర్య, ప్రియా భవానీ శంకర్, కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్,సముద్రఖని, బాబీ సింహ, బ్రహ్మానందం తదితరులునిర్మాణ సంస్థ: లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్నిర్మాత: సుభాస్కరన్ కథ, దర్శకత్వం: ఎస్.శంకర్‌సంగీతం: అనిరుధ్ రవిచందర్ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్సినిమాటోగ్రఫీ: రవి వర్మన్‌విడుదల తేది: జులై 12, 2024కమల్ హాసన్ నటించిన బెస్ట్ చిత్రాల్లో ‘భారతీయుడు’ ఒకటి. శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ 1996లో విడుదలై బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. దాదాపు 28 ఏళ్ల తర్వాత ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘భారతీయుడు 2’ వచ్చింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచేసింది. దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘భారతీయుడు 2’(Bharateeyudu 2 Review) పై భారీ హైప్ క్రియేట్ అయింది.భారీ అంచనాల మధ్య నేడు(జులై 12) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. భారతీయుడు 2 కథేంటంటే..చిత్ర అరవిందన్(సిద్దార్థ్), హారతి(ప్రియాభవాని శంకర్) ఇంకో ఇద్దరు స్నేహితులు కలిసి సోషల్ మీడియా వేదికగా అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటారు. రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు చేసే అన్యాయాలపై వీడియోలు చేసి బార్కింగ్ డాగ్స్ అనే పేరుతో య్యూట్యూబ్, ఫేస్బుక్ ఇతర సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో షేర్ చేస్తుంటారు. వారి చుట్టు జరిగిన కొన్ని సంఘటనలు చూసి చలించిపోయిన అరవిందన్.. మళ్లీ భారతీయుడు వస్తే బాగుంటుందని భావిస్తాడు. కమ్‌బ్యాక్ ఇండియా(Comeback India) హ్యాష్‌ట్యాగ్‌తో సేనాపతి(కమల్ హాసన్) మళ్లీ ఇండియా రావాలని పోస్టులు పెడతారు. అవికాస్త వైరల్ అయి.. చైనీస్ తైపీలో ఉన్న సేనాపతి అలియాస్ భారతీయుడుకి చేరతాయి. దీంతో సేనాపతి తిరిగి ఇండియా వస్తాడు. ఈ విషయం తెలుసుకున్న సీబీఐ అధికారి ప్రమోద్(బాబీ సింహా).. అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తాడు. కానీ భారతీయుడు గెటప్స్ మారుస్తూ అవినీతికి పాల్పడిన వారిని దారుణంగా హత్య చేస్తుంటారు. భారతీయుడు ఇచ్చిన పిలుపుతో దేశంలోని యువత కూడా అవితీనికి వ్యతిరేకంగా పని చేస్తుంటుంది. ఈ క్రమంలో అరవిందన్ ఫ్యామిలీలో ఓ విషాదం చోటు చేసుకుంటుంది. దానికి కారణంగా భారతీయుడే అని అరవిందన్‌తో సహా అందరూ నిందిస్తారు. అసలు అరవిందన్ ఇంట్లో చోటు చేసుకున్న ఆ విషాదం ఏంటి? దానికి భారతీయుడు ఎలా కారణం అయ్యాడు? కమ్‌బ్యాక్ ఇండియా అని భారతీయుడిని ఆహ్వానించిన యువతే.. గోబ్యాక్ ఇండియా అని ఎందుకు నినదించారు? సామాన్యులకు సైతం భారతీయుడుపై ఎందుకు కోపం పెరిగింది? రియల్ ఎస్టేట్ పేరుతో అక్రమంగా భూములను స్వాధీనం చేసుకుంటూ వేలకోట్లు సంపాదించిన సద్గుణ పాండ్యన్(ఎస్ జే సూర్య)..సేనాపతిని చంపేందుకు వేసిన ప్లాన్ వర్కౌంట్ అయిందా? సీబీఐ అధికారులకు దొరికిన సేనాపతి..వారి నుంచి ఎలా తప్పించుకున్నాడు? అసలు సేనాపతి టార్గెట్ ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసే అంటెండర్ దగ్గర నుంచి ఆర్డర్ లిచ్చే అధికారుల వరకు లంచం అనే మాట ఎలా నాటుకుపోయిందో ‘భారతీయుడు’లో కళ్లకు కట్టినట్లు చూపించాడు శంకర్. ఆ సినిమా విడుదలై ఏళ్లు గడుస్తున్నా.. ఆ కథ, అందులోని పాత్రలు మనకు అలా గుర్తిండిపోతాయి. అలాంటి సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ అంటే..కచ్చితంగా అంచనాలు ఓ రేంజ్లో ఉంటాయి. అయితే ఆ అంచనాలకు తగ్గట్లుగా భారతీయుడు 2ని తీర్చిదిద్దలేకపోయాడు శంకర్. స్టోరీ లైన్ మాత్రమే కాదు చాలా సన్నివేశాలు ‘భారతీయుడు’చిత్రాన్నే గుర్తు చేస్తాయి. అయితే అందులో వర్కౌట్ అయిన ఎమోషన్ ఇందులో మిస్ అయింది. ప్రతి సీన్ సినిమాటిక్‌గానే అనిపిస్తుంది కానీ.. ఎక్కడ కూడా రియాల్టీగా దగ్గరగా ఉండదు. స్క్రీన్‌ప్లే కూడా చాలా రొటీన్‌గా ఉంటుంది. పార్ట్ 3 కోసమే అన్నట్లుగా కథను సాగదీశారు. కొన్ని సీన్లు చూస్తే నిజంగానే ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహించారా అనే అనుమానం కలుగుతుంది. భారతీయుడులో అవినీతికి పాల్పడిన వారిని సేనాపతి చంపుతుంటే మన రోమాలు నిక్కబొడుచుకుంటాయి. కానీ ఇందులో మాత్రం అలాంటి సీన్లను కూడా చాలా చప్పగా తీసేశాడు. సినిమా నిడివి( 3 గంటలు) కూడా మైనస్సే. కొన్ని సీన్లను తొలగించి.. నిడివిని తగ్గిస్తే బాగుండేది (తొలగించడానికి ఒక్క సీన్ లేదనే పార్ట్ 3 ప్లాన్ చేశామని ఓ ఇంటర్వ్యూలో శంకర్ చెప్పారు..కానీ సినిమా చూస్తే సాధారణ ప్రేక్షకుడు సైతం కట్ చేయాల్సిన సీన్ల గురించి చెప్పగలడు). ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా అంతగా ఆకట్టుకోలేదు. భారతీయుడు సినిమాలాగే ఈ కథ కూడా మొత్తం లంచం చుట్టే తిరుగుతుంది. సినిమా ప్రారంభ సీన్‌తోనే ఆ విషయం అర్థమైపోతుంది. అవినీతికి వ్యతిరేకంగా చిత్ర అరవిందన్ గ్యాంగ్ చేసే పోరాటం కాస్త ఆసక్తికరంగా అనిపించినప్పటికీ.. అవినీతి జరిగే సీన్లను బలంగా చూపించలేకపోయాడు. ఇక సేనాపతి ఎంట్రీ సీన్‌తో కథపై ఆసక్తి పెరుగుతుంది. కానీ ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత..కథనం రొటీన్‌గా సా..గూ..తూ.. చిరాకు తెప్పిస్తుంది. తరువాత ఏం జరుగుతందనే విషయం ముందే తెలిసిపోవడంతో.. కథపై అంత ఆసక్తి కలగదు. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా సింపుల్‌గానే ఉంటుంది. ఇక సెకండాఫ్‌లో కథ మరింత సాగదీతగా అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో మర్మకళను ఉపయోగించి సీక్స్ ఫ్యాక్‌తో కమల్ చేసే యాక్షన్ సీన్ బాగుంటుంది. కానీ ఆ తర్వాత వచ్చే ఛేజింగ్ సీన్ అయితే సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ముగింపులో పార్ట్ 3 స్టోరీ ఎలా ఉంటుందో చూపించారు. అది కాస్త ఆసక్తికరంగానే అనిపిస్తుంది. అవినీతిని అంతం చేయాలంటే అది మొదట మన ఇంటి నుంచే ప్రారంభించాలని యూత్‌కి ఇచ్చిన మెసేజ్ మాత్రం బాగుంది. ఎవరెలా చేశారంటే..వైవిధ్యమైన పాత్రలు పోషించడం కమల్ హాసన్‌కు కొత్తేమి కాదు. ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోతుంటాడు. సేనాపతి పాత్రలో కమల్ ఒదిగిపోయాడు. రకరకాల గెటప్స్‌లో కనిపిస్తూ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. యాక్షన్ సీన్స్ కూడా అదరగొట్టేశాడు. అయితే ఆయన గొంతే ఒక్కో చోట ఒక్కోలా వచ్చింది. సిక్స్ ఫ్యాక్స్‌తో కమల్ చేసే యాక్షన్ సీన్‌కి థియేటర్లో ఈళలు పడతాయి.ఇక హీరో సిద్ధార్థ్‌కి మంచి పాత్ర దక్కింది. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసే చిత్ర అరవిందన్ పాత్రకు న్యాయం చేశాడు. ఎమోషన్ సీన్లలో అదరగొట్టేశాడు. సిద్ధార్థ్ స్నేహితురాలికిగా ప్రియా భవానీ శంకర్ ఆకట్టుకుంది. సిద్ధార్థ్ ప్రియురాలు దిశగా నటించిన రకుల్‌కి ఈ చిత్రంలో ఎక్కువగా స్క్రీన్ స్పేస్ లభించలేదు. సినిమా మొత్తంలో రకుల్ మూడు, నాలుగు సీన్లలో మాత్రమే కనిపిస్తుంది. సీబీఐ అధికారి ప్రమోద్‌గా బాబీ సింహా ఉన్నంతగా బాగానే నటించాడు. వ్యాపారీ సద్గుణ పాండ్యన్‌గా ఎస్ జే సూర్యకి పార్ట్ 3లోనే ఎక్కువ నిడివి ఉన్నట్లు ఉంది. ఇందులో కేవలం మూడు సీన్లలో కనిపించి వెళ్తాడు. ఏసీబీ అధికారిగా సముద్రఖనితో పాటు మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. టెక్నికల్‌గా సినిమా పర్వాలేదు.అనిరుధ్ రవిచందర్ నేపథ్య సంగీతం యావరేజ్‌గా ఉంది. ఇక పాటలు గురించి మాట్లాడుకోవద్దు. ఒక్కటి కూడా గుర్తుంచుకునే విధంగా లేవు. రవి వర్మన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సినిమాలో సాగదీత సన్నివేశాలు చాలా ఉన్నాయి. వాటిని మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.(Bharateeyudu 2 Telugu Movie Review)-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
'భారతీయుడు 2' ఆడియో లాంచ్ (ఫొటోలు)
-
‘రత్నం’ మూవీ రివ్యూ
టైటిల్ : రత్నంనటీనటులు: విశాల్, ప్రియా భవానీ శంకర్, మురళీ శర్మ, గౌతమ్ మీనన్, సముద్రఖని, యోగిబాబు తదితరులునిర్మాణ సంస్థలు: జీ స్టూడియోస్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్దర్శకత్వం: హరిసంగీతం: దేవీ శ్రీ ప్రసాద్విడుదల తేదిఫ: ఏప్రిల్ 26, 2024‘భరణి’, ‘పూజా’సినిమాల తర్వాత మాస్ యాక్షన్ హీరో, పురుచ్చి దళపతి విశాల్, యాక్షన్ డైరెక్టర్ హరి కాంబినేషన్లో తెరకెక్కిన హ్యాట్రిక్ మూవీ ‘రత్నం’. కార్తికేయన్ సంతానం ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్‌ని ప్రేక్షకులను నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ గ్రాండ్‌గా చేయడంతో ‘రత్నం’పై టాలీవుడ్‌లోనూ భారీ హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(ఏప్రిల్ 26) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే..చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన రత్నం(విశాల్) చిత్తూరు మార్కెట్లో పని చేస్తుంటాడు. చిన్నప్పుడు ఓ సారి అదే మార్కెట్‌కు చెందిన పన్నీర్ సామి(సముద్రఖని)ని చంపేందుకు వచ్చిన ఓ మహిళను కత్తితో చంపేస్తాడు. తన ప్రాణాలను కాపాడడనే సానుభూతితో రత్నాన్ని తనవద్దే ఉంచుకుంటాడు పన్నీర్. కొన్నాళ్లకు పన్నీర్ ఎమ్మెల్యే అవుతాడు. అతని తోడుగా ఉంటూ నియోజకవర్గంలో ఎలాంటి అన్యాయం జరగకుండా చూస్తాడు రత్నం. ఓ సారి నీట్ పరీక్ష రాసేందుకు చిత్తూరు వచ్చిన మల్లిక(ప్రియా భవానీ శంకర్)ని చూసి, ఫాలో అవుతాడు. అదే సమయంలో అమెను చంపేందుకు లింగం(మురళీ శర్మ) గ్యాంగ్ చిత్తూరు వస్తుంది. వారి నుంచి మల్లికను కాపాడమే కాదు, దగ్గరుండి మరీ పరీక్ష రాయిస్తాడు. అసలు మల్లిక ఎవరు? ఆమెకు రత్నంకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? లింగం మనుషులు ఆమెను ఎందుకు వెంబడిస్తున్నారు? రత్నం తల్లి రంగనాయకమ్మ ఎలా చనిపోయింది? లింగం నేపథ్యం ఏంటి? మల్లిక కుటుంబానికి వచ్చిన సమస్యను తీర్చే క్రమంలో రత్నంకు తెలిసిన నిజం ఏంటి? ఆ నిజం తెలిసిన తర్వాత రత్నం ఏం చేశాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. మాస్ సినిమాలను డిఫరెంట్‌గా తెరకెక్కించడంలో డైరెక్టర్ హరి స్పెషలిస్ట్. నాన్ స్టాప్ యాక్షన్‌తో కథనాన్ని పరుగులు పెట్టిస్తాడు. అందుకే సింగంతో పాటు దానికి కొనసాగింపుగా వచ్చిన చిత్రాలన్నీ తెలుగులోనూ మంచి విజయం సాధించాయి. రత్నం కూడా అదే తరహాలో తెరకెక్కించాడు. కావాల్సినంత యాక్షన్‌తో కథనాన్ని పరుగులు పెట్టించాడు. కానీ కథలో మాత్రం కొత్తదనం మిస్ అయింది. యాక్షన్ సీన్స్‌తో పాటు ప్రతి సన్నివేశం రొటీన్‌గానే అనిపిస్తుంది. హీరో, హీరోయిన్ల పాత్రల మధ్య ఉన్న సంబంధాన్ని మాత్రం కాస్త కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. కాని అది ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించలేకపోయింది. 1994లో ఆంధ్ర-తమిళనాడు సరిహద్దులో జరిగే బస్సు దోపిడి సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత కథంతా చిత్తూరు మార్కెట్ చుట్టూ తిరుగుతుంది. రత్నం చైల్డ్ ఎపిసోడ్ తర్వాత కథ వెంటనే 2024లోకి వెళ్లిపోతుంది. అక్కడ నుంచి అసలు కథ ప్రారంభం అవుతుంది. హీరో.. హీరోయిన్ చూసి ఎక్కడో చూసినట్లు భావించడం.. ఆమెను ఫాలో అవుతూ.. లింగం గ్యాంగ్ నుంచి కాపాడడం.. ఇలా ప్రతీ సన్నివేశం రొటీన్‌గానే అనిపిస్తుంది. మధ్య మధ్య యోగిబాబు వేసే కామెడీ పంచులు మినహా ఫస్టాఫ్ అంతా రొటీన్‌గానే సాగుతుంది. హీరోయిన్ విషయంలో దర్శకుడు ఇచ్చిన ట్విస్ట్ కన్విసింగ్‌గా అనిపించడు. దీంతో సెకండాఫ్ అంతా మరింత రొటీన్ సాగుతు బోర్ కొట్టిస్తుంది. కథనం పరుగులు పెట్టినట్లే అనిపిస్తుంది కానీ..ఎక్కడా ఆసక్తిని రేకెత్తించదు. కొన్ని యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ రొటీన్‌గా ఉంటుంది. ఎవరెలా చేశారంటే.. వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ అటు కోలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో విశాల్. ఆయన నుంచి ఓ యాక్షన్ సినిమా వస్తుందంటే ఆ క్రేజే వేరే లెవల్లో ఉంటుంది. ఈ జానర్ సినిమాల్లో విశాల్ మరింత రెచ్చిపోయి నటిస్తాడు. రత్నంలోనూ అలానే నటించాడు. ఎప్పటిమాదిరే కథంతా తన భుజానా వేసుకొని నడిపించాడు. యాక్షన్ సీన్స్‌తో పాటు ఎమోషన్ సీన్స్‌లోనూ చక్కగా నటించాడు. మల్లిక పాత్రకు ప్రియా భవానీ శంకర్ న్యాయం చేసింది. కథంతా ఆమె పాత్ర చుట్టే తిరుగుతుంది. లింగంగా మురళీ శర్మ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు.ఎమ్మెల్యే పన్నీర్‌గా సముద్రఖనీ తన పాత్ర పరిధిమేర బాగానే నటించాడు. హీరో స్నేహితుడు మూర్తిగా యోగిబాబు వేసే పంచులు, కామెడీ బాగా వర్కౌట్ అయింది. హరీశ్ పేరడీ, గౌతమ్ మీనన్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక విషయాలకొస్తే.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకు ప్లస్ పాయింట్. పాటలతో పాటు కొన్ని చోట్ల అదిరిపోయే బీజీఎం అందించాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
చెబుతావా రత్నం
విశాల్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రత్నం’. హరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటించారు. కార్తికేయన్ సంతానం నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న తెలుగు, తమిళ్లో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని శ్రీ సిరి సాయి సినిమాస్ బ్యానర్‌పై తెలుగులో సీహెచ్ సతీష్ కుమార్, కె. రాజ్‌కుమార్ విడుదల చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘చెబుతావా..’ అంటూ సాగే పాటని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాటకు శ్రీమణి సాహిత్యం అందించగా, సింధూరి విశాల్ పాడారు. ‘‘యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘రత్నం’. ‘చెబుతావా..’ పాట మెలోడియస్గా, ఎమోషనల్‌గా సాగుతుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
సీరియల్ నుంచి సినిమాల్లోకి.. ఇప్పటికీ అలాగే!
బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయం అయిన కథానాయికల్లో ప్రియ భవానీశంకర్ ఒకరు. 2017లో మేయాదమాన్ చిత్రం ద్వారా కథానాయకిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం విజయం సాధించడంతో ఆమెకు అవకాశాలు వరుస కట్టాయి. ఆ తరువాత నటించిన కడైకుట్టి సింగం, మాన్స్టర్ వంటి చిత్రాల సక్సెస్ ఈ అమ్మడిని స్టార్ హీరోయిన్ చేశాయి. ఇకపోతే తమిళంతో పాటు తెలుగులోనూ అవకాశాలు రావడంతో ప్రియాభవానీ శంకర్ బహుభాషా నటిగా రాణిస్తున్నారు. ఇటీవల ఈమె గోపీచంద్ సరసన నటించిన తెలుగు చిత్రం భీమా విడుదలై మంచి వసూళ్లనే సాధించింది. ప్రస్తుతం ఆమె చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. నటనతో పాటు రెస్టారెంట్ బిజినెస్‌తో బాగానే సంపాదిస్తున్నారు. ఎక్కువగా పద్ధతిగానే కనిపించే ప్రియ చాలామటుకు ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉంటుంది. తన షేర్ చేసే ఫోటోల్లో కూడా ఎక్కడా అతి అనిపించదు. అందుకే చాలామంది ఆమెను ఆరాధిస్తున్నారు. నేచురల్ బ్యూటీ అని పొగిడేస్తున్నారు. ఇకపోతే ఈమె నటించిన డీమాంటీ కాలనీ– 2 చిత్రం విడుదల కావాల్సి ఉండగా విశాల్ సరసన నటించిన రత్నం చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాల్లో ఉంది. వీటితో పాటు శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ కథానాయకుడిగా నటిస్తున్న ఇండియన్– 2 చిత్రంలోనూ ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. View this post on Instagram A post shared by Priya BhavaniShankar (@priyabhavanishankar) చదవండి: దేశంలో నాలాగే ఒంటరిగా చాలామంది ఉన్నారు.. తప్పుగా రాయకండి: మీనా -
ఇప్పుడు ఆ పరిస్థితి లేదు: హీరో గోపీచంద్
‘‘భీమా’ పక్కా కమర్షియల్ ప్యాక్డ్ మూవీ. నేను చేసిన భీమా పాత్రలో చాలా ఇంటెన్సిటీ ఉంటుంది. ప్రేమ, ఎమోషన్స్, రొమాన్స్.. ఇలా అన్ని అంశాలున్నాయి. ఈ కథలో సెమీ ఫ్యాంటసీ ఎలిమెంట్‌ని హర్ష అద్భుతంగా చూపించాడు. ప్రతి యాక్షన్ సీక్వెన్స్‌లో అద్భుతమైన భావోద్వేగం ఉంటుంది. సినిమా చూసి బయటికి వచ్చాక ప్రేక్షకుల మనసులో భీమా నిలిచిపోతాడనే నమ్మకం ఉంది’’ అని హీరో గోపీచంద్ అన్నారు. ఎ. హర్ష దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా, ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘భీమా’. కేకే రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం ఈ 8న విడుదలవుతోంది. ఈ సందర్భంగా గోపీచంద్ పంచుకున్న విశేషాలు. ► ‘భీమా’ సహనిర్మాత శ్రీధర్‌గారు కోవిడ్ సమయంలో దర్శకుడు హర్షని నాకు పరిచయం చేశారు. అప్పుడో కథ చెప్పాడు హర్ష.. కథ బావుంది కానీ ఆ సమయంలో చేయకూడదని అనిపించింది. పోలీస్ నేపథ్యంలో ఏదైనా వైవిధ్యమైన కథ ఉంటే చెప్పమన్నాను. ఎనిమిది నెలలు గ్యాప్ తీసుకొన్న హర్ష ఆ తర్వాత వచ్చి ‘భీమా’ కథ చెప్పాడు. చాలా బాగా నచ్చడంతో ఓకే చెప్పాను. ► నేను గతంలో పోలీసు పాత్రలు చేశాను. ‘గోలీమార్’లో డిఫరెంట్ కాప్. ‘ఆంధ్రుడు’ లవ్ స్టోరీ నేపథ్యంలో నడుస్తుంది కానీ దాని నేపథ్యం పోలీసు కథే. ‘శౌర్యం’ కూడా భిన్నమైన కథ. ఈ మూడు చిత్రాలకు పూర్తి వైవిధ్యమైన పోలీస్ పాత్రని ‘భీమా’లో చేశాను. ఈ పోలీసు కథలో సెమీ ఫ్యాంటసీ ఎలిమెంట్ చాలా కొత్తగా ఉంటుంది.. అదే నాకు చాలా ఆసక్తిని కలిగించింది. హర్ష కన్నడలో చాలా అనుభవం ఉన్న దర్శకుడు. ‘భీమా’ని అద్భుతంగా తీశాడు.. స్క్రీన్ ప్లే చాలా ఆసక్తిగా ఉంటుంది. ► ‘భీమా’ పరశురామ క్షేత్రంలో జరిగే కథ. ట్రైలర్లో చూపించినట్లు అఘోరాలు, కలర్ ప్యాలెట్, నేపథ్య సంగీతం వల్ల ‘అఖండ’ సినిమాతో పోలుస్తున్నారు. కానీ, ఇది పూర్తిగా వైవిధ్యమైన కథ. ఈ సినిమాలో శివుని నేపథ్యం ఉంది. పైగా సినిమా కూడా మహా శివరాత్రికి వస్తోంది. అయితే దీన్ని మేం ముందుగా ప్లాన్ చేయలేదు.. అలా కలిసొచ్చింది. శివుని ఆజ్ఞ అనుకుంటాను. ► నిర్మాత రాధామోహన్, నా కాంబినేషన్లో ‘పంతం’ (2018) సినిమా వచ్చింది. అప్పటి నుంచి ఆయన, నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. ‘పంతం’ వాణిజ్య పరంగా సక్సెస్ అయినా ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ కాలేదు. కానీ, ‘భీమా’తో తప్పకుండా హిట్ సాధిస్తామనే నమ్మకం ఉంది. ఈ సినిమాని చాలా గ్రాండ్‌గా నిర్మించారాయన. ► మా నాన్న (డైరెక్టర్ టి. కృష్ణ)తో పాటు ఆ తరంలోని దర్శకులు జనాలతో మమేకం అయ్యేవారు. అలా ప్రజల సాధక బాధకాలు, సమస్యలు తెలుసుకుని కథ రాసుకుని, సామాజిక బాధ్యతతో సినిమాలు తీసి హిట్ సాధించేవారు. కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. శంకర్‌గారి లాంటి ఒకరిద్దరు దర్శకులు తప్ప మిగిలిన వారు సమాజం, ప్రజల నేపథ్యంలో కథలు రాయడం లేదు. సొసైటీ బ్యాక్‌డ్రాప్‌ని ఎంచుకుని సరైన విధానంలో తెరపై చూపించగలిగితే ఇప్పటికీ ప్రేక్షకులు బ్రహ్మాండంగా ఆదరిస్తారు. దర్శకత్వం అనేది చాలా కష్టమైన పని.. అందుకే నాకు ఆ ఆలోచన లేదు. ► చిత్ర పరిశ్రమలో దాదాపు 22 ఏళ్ల ప్రయాణం నాది.. ఇన్నేళ్ల జర్నీ హ్యాపీగా ఉంది కానీ నటుడిగా పూర్తిగా సంతృప్తి పడటం లేదు. ఒక నటుడికి సంతృప్తి అనేది ఎప్పటికీ ఉండదు.. ఎప్పటికప్పుడు కొత్తగా చేయాలనే తపన ఉంటుంది. ప్రభాస్, నేను కలిసి సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాం. కానీ, ఆ చాన్స్ రాలేదు.. వస్తే మాత్రం తప్పకుండా నటిస్తాం. ప్రస్తుతం శ్రీను వైట్లగారి దర్శకత్వంలో నేను చేస్తున్న సినిమా 30 శాతం పూర్తయింది. ఆ తర్వాత బీవీఎస్ఎన్ ప్రసాద్, బాపినీడుగార్లతో ఓ చిత్రం, యూవీ క్రియేషన్స్‌లో ఓ సినిమా చేయాల్సి ఉంది. -
‘భీమా’ డిఫరెంట్ కాప్ స్టోరీ..ఫాంటసీ ఎలిమెంట్స్ కొత్తగా ఉంటాయి: గోపీచంద్
‘ఇప్పటికే నేను పలు సినిమాల్లో పోలీసు పాత్రలు చేశాను. గోలీమార్ డిఫరెంట్ కాప్ స్టోరీ. ఆంధ్రుడు లవ్ స్టొరీ మీద నడుస్తుంది కానీ దాని నేపధ్యం పోలీసు కథే. శౌర్యం కూడా భిన్నమైన కథ. ఈ మూడు చిత్రాలకు పూర్తి వైవిధ్యమైన పాత్ర భీమా. లాంటి పోలీసు కథలో సెమీ ఫాంటసీ ఎలిమెంట్ చాలా కొత్తగా ఉంటుంది. అదే నాకు చాలా ఆసక్తిని కలిగించింది. ప్రేక్షకులకు కూడా నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అన్నారు హీరో గోపీచంద్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘భీమా’. ఈ సినిమాకి ఎ హర్ష దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె కె రాధామోహన్ లావిష్ గా నిర్మించారు. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటించారు. మార్చి 8న మహాశివరాత్రి సందర్భంగా ఈ చిత్రం రీలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా గోపీచంద్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► కోవిడ్ టైమ్‌లో దర్శకుడు హర్ష నాకొక కథ చెప్పారు. అది బాగుంది కానీ ఇలాంటి సమయంలో వద్దనిపించింది. పోలీసుకి సంబధించి ఏదైనా డిఫరెంట్ కథ ఉంటే చెప్పమన్నాను. ఎనిమిది నెలలు గ్యాప్ తీసుకొని భీమా 'కథ' చెప్పారు. కథ, భీమా క్యారెక్టరైజేషన్ చాలా నచ్చింది. అలా కథలోని సెమీ ఫాంటసీ ఎలిమెంట్ కూడా చాలా నచ్చింది. అలా భీమా మొదలైయింది. ► భీమా కమర్షియల్ ప్యాక్డ్ మూవీ. భీమా పాత్రలో చాలా ఇంటన్సిటీ ఉంటుంది. ప్రేమ, ఎమోషన్స్, రోమాన్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. సినిమా చూసి బయటికి వచ్చాక భీమా ప్రేక్షకుడి మనసులో నిలబడిపోతాడనే నమ్మకం ఉంది. ఈ కథలో సెమీ ఫాంటసీ ఎలిమెంట్ ని దర్శకుడు చాలా అద్భుతంగా బ్లెండ్ చేశాడు. ప్రతి యాక్షన్ సీక్వెన్స్ లో అద్భుతమైన ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్ కి ప్రేక్షకులు నచ్చుతుందనే నమ్మకం ఉంది. ► ఈ చిత్రాన్ని చాలా మంది 'అఖండ' తో పోలుస్తున్నారు. కానీ ఆ కథతో దీనికి ఎలాంటి సంబంధం లేదు. అఘోరాలు, కలర్ పాలెట్, మ్యూజిక్ వల్ల అలా అనిపించవచ్చు ఏమో కానీ భీమా పూర్తిగా డిఫరెంట్ స్టొరీ. అయితే నిజంగా 'అఖండ' పోలిస్తే మంచిదేగా (నవ్వుతూ). భీమా పరశురామక్షేత్రంలో జరిగే కథ. అందుకే అలాంటి నేపధ్యం తీసుకున్నాం. ► హర్ష చాలా అనుభవం వున్న దర్శకుడు. చాలా అద్భుతంగా తీశాడు. చాలా ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే చేశాడు. చాలా గ్రిప్పింగ్ గా ఉంటుంది, మలుపులు, సెమీ ఫాంటసీ ఎలిమెంట్స్ చాలా కొత్తగా ఉంటాయి. ఇందులో హీరో క్యారెక్టర్ పేరు భీమా. ఈ కథకు అదే పేరు యాప్ట్ అని టైటిల్ గా పెట్టడం జరిగింది. ► ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మల పాత్రలు సినిమాలో చాలా కీలకంగా ఉంటాయి. కథకు కావాల్సిన పాత్రలు. పాత్రలకు ఒక పర్పస్ ఉంటుంది. ► రవిబస్రూర్ మ్యూజిక్ సినిమాకు మరింత ప్లస్ అయింది. ట్రైలర్ లో మ్యూజిక్ అద్భుతంగా ఉంది. దానికి మించి సినిమాలో ఉంటుంది. మంచి మ్యూజిక్ ఇవ్వాలనే అంకితభావంతో పని చేశాడు. ► ప్రస్తుతం శ్రీను వైట్ల గారితో ఓ సినిమా చేస్తున్న. ముఫ్ఫై శాతం షూటింగ్ పూర్తి అయ్యింది. తర్వాత ప్రసాద్ గారితో ఒక సినిమా ఉంటుంది. రాధతో ఒక కథ వర్క్ జరుగుతోంది. అది యూవీ క్రియేషన్స్ లో ఉంటుంది. -
Priya Bhavani Shankar: క్యూట్ అందాలతో కుర్రకారు మనసు దోచేస్తున్న ప్రియా భవానీ (ఫొటోలు)
-
గల్లీ సౌండుల్లో భీమా
గోపీచంద్ హీరోగా నటించిన చిత్రం ‘భీమా’. ఎ.హర్ష దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ హీరోయిన్లు. కేకే రాధామోహన్ నిర్మించిన ‘భీమా’ మార్చి 8న రిలీజ్ కానుంది. రవి బస్రూర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘గల్లీ సౌండుల్లో..’ అంటూ సాగే రెండో పాటని విడుదల చేశారు. రవి బస్రూర్, సంతోష్ వెంకీ రాసిన ఈ పాటను సంతోష్ వెంకీ పాడారు. ‘‘గోపీచంద్ పాత్ర గురించి చెప్పే ట్రాక్ ఇది. ఈ పాట మాస్‌ని అల రించేలా ఉంటుంది’’ అన్నారు మేకర్స్. -
18 ఏళ్లకే లవ్‌లో పడ్డ బ్యూటీ.. ప్రియుడికి బర్త్‌డే విషెస్
టీవీ యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత హీరోయిన్గా కొనసాగుతోంది ప్రియభవానీ శంకర్. ఈమె కథానాయకిగా నటించిన డీమాంటి కాలనీ 2 త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. అదే విధంగా కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఇండియన్–2 చిత్రంలోనూ ప్రియా భవానిశంకర్ నటించింది. అదేవిధంగా విశాల్ హీరోగా నటిస్తున్న 43వ చిత్రంలోనూ ఈమె యాక్ట్ చేస్తుంది. ప్రేమలో మునిగి తేలుతున్న బ్యూటీ ఇకపోతే ఈమె ప్రేమ గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూనే ఉంది. దానిపై గతంలోనే క్లారిటీ ఇచ్చేసిందీ బ్యూటీ. తాను 18 ఏళ్ల వయసులోనే ప్రేమలో పడ్డానంటూ బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఉన్న ఫొటోలను తరచూ నెట్టింట పోస్ట్ చేస్తోంది. తాను ప్రేమిస్తున్న వ్యక్తి పేరు రాజ్‌వేల్ అని కూడా చెప్పేసింది. శనివారం తన బాయ్‌ఫ్రెండ్ పుట్టినరోజు సందర్భంగా అతనితో క్లోజ్‌గా ఉన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. సరదాలు, గొడవలు, ఏడుపులు.. అందులో ప్రియా భవానిశంకర్.. 'ఇక్కడున్న అబ్బాయి నాకు మంచి ఫ్రెండ్. మేము కలిసి నవ్వుకుంటాం, గొడవ పడుతాం, ఏడుస్తాం, తరచూ విడిపోతాం. రాజ్‌వేల్ తప్పుడు లిరిక్స్‌ను కూడా ఎంతో గట్టిగా ధైర్యంగా పాడుతుంటాడు. మేమిద్దరం వేర్వేరు భావాలు కలిగిన వాళ్లం. అయినప్పటికీ అతను నన్ను ఎప్పుడూ సంతోష పరుస్తుంటాడు. అతనితో నేను ప్రేమగా, జాలీగా ఉంటాను. అతడు తోడుంటే ఏ సమస్యలూ లేనట్లు ప్రశాంతంగా అనిపిస్తుంది. సాయంత్రం సంధ్యా వేళల్లో అతనితో ప్రశాంతంగా కూర్చొని సూర్యుడిని చూస్తూ నా మనసులోని కష్టాలను చెప్పుకోగలుగుతాను. ఈ జీవితానికి అది చాలు. కడవరకు ఆనందంగా గడిపేస్తాను..' అని ఎమోషనలైంది హీరోయిన్. View this post on Instagram A post shared by Priya BhavaniShankar (@priyabhavanishankar) చదవండి: ఫిలింఫేర్ అవార్డ్స్.. యానిమల్, 12th ఫెయిల్ చిత్రాలకు అవార్డ్స్ పంట -
సౌత్‌లో ఈ బ్యూటీనే ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ హీరోయిన్!
కెరీర్ ప్రారంభంలో పక్కింటి అమ్మాయి ఇమేజ్ పొందిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత రూట్ మార్చింది. మోడ్రన్‌గా మారిపోయింది. మెల్లమెల్లగా ఎదుగుతూ టాప్ హీరోయిన్ రేంజుకి చేరుకుంది. ఇప్పటివరకు చెప్పింది హీరోయిన్ ప్రియా భవాని శంకర్ గురించే. మొదట్లో న్యూస్ రీడర్‌గా పనిచేసింది. అనంతరం సీరియల్స్‌లో నటించింది. అక్కడ తానెంటో నిరూపించుకుని.. సినిమాల్లోకి వచ్చింది. స్వతహాగా ప్రియా భవాని శంకర్.. ఇంజినీరింగ్ స్టూడెంట్. కానీ గ్లామర్ రంగాన్ని ఎంచుకుంది. (ఇదీ చదవండి: న్యూ ఇయర్ స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 25 సినిమాలు) 2017లో 'మేయాద మాన్' చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'కడైకుట్టి సింగం' తదితర చిత్రాల్లో నటించింది. ఎక్కువగా హోమ్లీ పాత్రలు చేసే ప్రియా భవాని శంకర్.. లారెన్స్‌తో కలిసి 'రుద్రన్' అనే సినిమాని గతేడాది చేసింది. ఇందులో అందాలను కాస్త ఎక్కువగానే చూపించింది. అలానే లిప్‌లాక్ సీన్స్‌లోనూ నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే కేవలం తమిళ వరకు మాత్రమే పరిమితమైపోకుండా తెలుగులోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో ఉంది. గతేడాది సంక్రాంతికి 'కల్యాణం కమనీయం' సినిమాలో హీరోయిన్గా చేసింది. పెద్దగా కలిసిరాలేదు. డిసెంబరులో నాగచైతన్య 'దూత' వెబ్ సిరీస్‌లో మంచి పాత్ర చేసింది. ఇకపోతే గతేడాది ఐదు మూవీస్ చేసిన ఈ బ్యూటీ.. 2024లో ఏకంగా 5-6 సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించనుంది. దీనిబట్టి చూస్తే ఈమెని ట్రెండింగ్ హీరోయిన్ అనొచ్చేమో! (ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన సుడిగాలి సుధీర్ లేటెస్ట్ మూవీ) View this post on Instagram A post shared by Priya BhavaniShankar (@priyabhavanishankar) -
కోబ్రా ఎందుకు ఫ్లాప్ అయిందో అర్థం కాలే: దర్శకుడు
డీమాంటి కాలనీ చిత్రంతో దర్శకుడుగా పరిచయమయ్యాడు అజయ్ జ్ఞానముత్తు. ఈ సినిమా సక్సెస్‌తో చిత్త పరిశ్రమ దృష్టిని తనవైపు మరల్చుకున్నాడు. ఆ తర్వాత నయనతార- విజయ్ సేతుపతిలను హీరోహీరోయిన్లుగా పెట్టి తీసిన ఇమైకా నొడిగల్ సినిమా సూపర్ సక్సెస్ అయింది. అయితే ఆ తర్వాత విక్రమ్ కథానాయకుడిగా నటించిన కోబ్రా చిత్రం డిజాస్టర్‌గా మారింది. తాజాగా ఈయన డీమాంటి కాలనీ – 2 సినిమాను డైరెక్ట్ చేశాడు. ఇది ఆయన తొలిసారిగా దర్శకత్వం వహించిన డీమాంటి కాలనీకి సీక్వెల్ కావడం గమనార్హం. బీటీజీ యూనివర్సల్ సంస్థ అధినేత బాబి బాలచంద్రన్ సమర్పణలో జ్ఞానముత్తు పట్టరై, వైట్ నైట్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మించిన ఈ చిత్రంలో అరుళ్‌నిధి, ప్రియా భవాని శంకర్ జంటగా నటించిన ఇందులో నటుడు అరుణ్ పాండియన్, నటి మీనాక్షి గోవిందరాజన్, ముత్తుకుమార్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. శ్యామ్ సీఎస్ సంగీతాన్ని అందించిన ఈ హారర్, థ్రిల్లర్ కథా చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం చైన్నెలోని వీఆర్ మాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు మాట్లాడుతూ.. తన గత చిత్రం కోబ్రా ప్లాప్ అయిందని, అయితే ఎందుకది ఫ్లాప్ అయిందో అర్థం కాక నిరాశతో ఉన్నప్పుడు నటుడు అరుళ్ నిధి వచ్చి జరిగినదాన్ని మర్చిపోండి మనం మళ్లీ సినిమా చేద్దామని భుజం తట్టి ప్రోత్సహించారన్నాడు. అప్పటి నుంచి నేటి వరకు ఆయన తన వెన్నంటే ఉన్నారన్నాడు. ఇలాంటి మంచి వ్యక్తులు తన చుట్టూ ఉండటం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపాడు. ఈ చిత్రం ద్వారా తన తండ్రిని నిర్మాతను చేయాలన్న కోరిక నెరవేరిందన్నాడు. చదవండి: బిగ్‌బాస్ 7 టైటిల్ ముద్దాడిన రైతుబిడ్డ.. ఆ బలమైన కారణాల వల్లే విజయం.. -
స్టార్ హీరో కొత్త చిత్రం.. టైటిల్ ఫిక్స్!
మార్క్ ఆంటోనీ చిత్రం తర్వాత కోలీవుడ్ హీరో విశాల్ మరో చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా ఆయన చిత్రానికి సంబంధించి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి హరి దర్శకత్వం వహిస్తుండగా.. తాజాగా టైటిల్ ప్రకటించారు మేకర్స్. ఇంతకు ముందు హరి.. పూజై, తామిర భరణి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. ఈ మూవీని స్టోన్ బెంచ్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంతో హ్యాట్రిక్ సాధించడానికి డైరెక్టర్ హరి రెడీ అయిపోయారు. సాధారణంగా అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్ టైనర్ కథా చిత్రాల కేరాఫ్‌గా మారిన హరి.. ఈ సినిమా కూడా అలాంటి నేపథ్యంలోనే రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఇసుక మాఫియా నేపథ్యంలో సాగే యాక్షన్ కథా చిత్రమని యూనిట్ వర్గాలు పేర్కొన్నారు. దీనికి రత్నం అనే టైటిల్ ఖరారు చేసినట్లు తాజా సమాచారం. తాజాగా దీనికి సంబంధించి విడుదల చేసిన టీజర్లో నటుడు విశాల్ ఒక వ్యక్తి తలను నరికే సన్నివేశం ఉంది. ఈ ఒక్క సీన్ చూస్తేనే మరో పక్క కమర్షియల్ ఎంటర్టైనర్గా ఇది ఉంటుందని చెప్పవచ్చు. ఈ చిత్ర షూటింగ్‌ను కారైక్కుడి, తూత్తుక్కుడి, చైన్నె ప్రాంతాల్లో చిత్రీకరించినట్లు యూనిట్ వర్గాలు వర్గాలు తెలిపారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. దర్శకుడు గౌతమ్ మీనన్, సముద్రఖని, యోగి బాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. Well here it is finally, my 34th film. Happy to share THE FIRST LOOK of #RATHNAM, unleashing the combo with hari sir for the third time The action begins and looking forward to summer 2024 release. Hope u all like it. Hardwork never fails. God bless. Tamil -… pic.twitter.com/7tmHn0FrJV — Vishal (@VishalKOfficial) December 2, 2023 -
శృతిహాసన్ స్టన్నింగ్ పోజులు.. పూనమ్ బజ్వా హాట్ లుక్స్!
►గోల్డ్ డ్రెస్‌లో శృతిహాసన్ స్టన్నింగ్ పోజులు ►బ్లూ కలర్ డ్రెస్సులో పూనమ్ బజ్వా హాట్ లుక్స్ ►ఎల్లో శారీలో ప్రియా భవానీశంకర్ హోయలు ►కలర్‌ఫుల్ డ్రెస్‌లో నిహారిక స్మైలీ లుక్స్ ►ఫుల్‌గా చిల్ అవుతోన్న ఆదా శర్మ ►గ్లామర్‌తో కవ్విస్తోన్న మీనాక్షి చౌదరి View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Priya BhavaniShankar (@priyabhavanishankar) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan)