పెద్ద హీరో, 55 రోజులు నటించా కానీ..: హీరోయిన్‌ | Priya Bhavani Shankar Comments On Her Throwback Story With Star Hero Movie, Deets Inside | Sakshi
Sakshi News home page

పెద్ద హీరో, 55 రోజులు నటించా కానీ..: హీరోయిన్‌

Published Thu, Oct 17 2024 1:21 PM | Last Updated on Thu, Oct 17 2024 1:51 PM

Priya Bhavani Shankar Comments On Her Throwback Story

కళ్యాణం కమనీయం సినిమాతో  ప్రియా భవానీ శంకర్ టాలీవుడ్‌కు పరిచయమైంది. అయితే, ఒక పెద్ద హీరో సినిమాలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఈ చెన్నై బ్యూటీ తాజాగా పంచుకుంది. స్కిన్ షోకు దూరంగా ఉంటూనే అవకాశాలను గోల్డెన్‌ ఛాన్స్‌లు దక్కించుకుంటున్న ప్రియా న్యూస్‌ రీడర్‌గా కెరీర్ ప్రారంభించి ఆపై తమిళ బుల్లితెరపై సీరియల్స్‌లో మెప్పించింది. అక్కడ వచ్చిన గుర్తింపుతో  సినిమాల్లో కూడా భారీగానే ఆఫర్లు అందుకుంది. 'మేయాద మాన్'‌తో  ఎంట్రీ ఇచ్చిన ప్రియ భవానీ శంకర్ కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తుంది. డీమాటీ కాలనీ –2, ఇండియన్‌– 2,రత్నం,భీమా వంటి సినిమాలతో మెప్పించిన ఈ బ్యూటీ ఇప్పుడు  కోలీవుడ్ స్టార్ జీవాతో కలిసి  బ్లాక్ చిత్రంలో నటించింది.

ప్రస్తుతం పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్న ఈమె తనకు జరిగిన ఒక చేదు అనుభవం గురించి ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ ఒక పెద్ద హీరో సరసన నటించే అవకాశం రావడంతో ఎంతో ఇష్టపడి ఆ చిత్రంలో 55 రోజుల పాటు నటించినట్లు చెప్పారు. ఎండనక వాననకు ఎంతో శ్రమించి నటించినట్లు చెప్పారు. షూటింగ్‌ పూర్తి అయిన తరువాత డబ్బింగ్‌ చెప్పడానికి వెళ్లగా షాక్‌ అయ్యానన్నారు. అయితే, ఆ సినిమాలో తన పాత్ర కేవలం 5 నిమిషాల కంటే తక్కువగానే ఉంది. 

దీంతో తనకు చెప్పిన కథ ఏమిటి, తనతో చేసిన షూటింగ్‌ అంతా ఏమైంది అని ఆ చిత్ర దర్శకుడిని అడగ్గా అదంతా మ్యూజిక్‌లో వస్తుంది చూడండి అని చెప్పారన్నారు. దీంతో ఆ చిత్ర హీరోకు ఫోన్‌ చేసి విషయం చెప్పానన్నారు. దీంతో ఆయన తానూ 135 రోజులు షూటింగ్‌ చేశానని, తన సన్నివేశాలే లేవని చెప్పారని నటి ప్రియభవానీ శంకర్‌ పేర్కొన్నారు. అయితే ఆమె ఏ చిత్రం గురించి చెప్పారు? ఆ దర్శకుడు ఎవరు అన్నది మాత్రం చెప్పలేదు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement