
‘‘నా కెరీర్లో ‘ఏనుగు’ బిగ్గెస్ట్ సినిమా. తెలుగు, తమిళంలో ఒకేసారి రిలీజ్ అవుతుంది. ఇందులో మంచి ఎమోషనల్ కంటెంట్‌తో పాటు ఫ్యామిలీ వాల్యూస్‌ని చూపించారు హరి. అందరూ తప్పుకుండా కనెక్ట్ అవుతారు’’ అని హీరో అరుణ్ విజయ్ అన్నారు. హరి దర్శకత్వంలో అరుణ్ విజయ్, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన చిత్రం ‘యానై’. వేదిక కారన్‌పట్టి, ఎస్. శక్తివేల్ నిర్మించిన ఈ తమిళ చిత్రం ‘ఏనుగు’ పేరుతో తెలుగులో రానుంది.
జగన్మోహిని సమర్పణలో సీహెచ్ సతీష్ కుమార్ తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ని హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు.‘‘ఈ సినిమాలో ప్రస్తుత సమాజంలో ఉన్న సమస్యలని వినోదాత్మకంగా చూపిస్తూ, మంచి సందేశం ఇచ్చాం’’ అన్నారు హరి. ‘‘మా సినిమా చూసిన ప్రేక్షకులు హ్యాపీగా బయటకు వస్తారు’’ అన్నారు సీహెచ్ సతీష్ కుమార్. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
చదవండి: లేడీ ఓరియంటెడ్ మూవీస్, ఒక్కరితో కాదు ఇద్దరు, ముగ్గురితో!
డ్రగ్స్ కేసులో హీరోయిన్ సోదరుడు.. పార్టీ లోపలి వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment