ఓటీటీకి థ్రిల్లర్ వెబ్ సిరీస్‌.. రానా చేతుల మీదుగా ట్రైలర్ | Kollywood Thriller Web Series Trailer Released By Rana Daggubati | Sakshi
Sakshi News home page

Web Series Trailer: ఓటీటీకి థ్రిల్లర్ వెబ్ సిరీస్‌.. తెలుగు ట్రైలర్ చూశారా?

Published Wed, Oct 16 2024 4:36 PM | Last Updated on Wed, Oct 16 2024 4:43 PM

Kollywood Thriller Web Series Trailer Released By Rana Daggubati

నవీన్ చంద్ర, ముత్తు కుమార్, నందా, శ్రిందా, మనోజ్ భారతీ రాజా కీలక పాత్రల్లో తెరకెక్కించిన థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్నేక్స్ అండ్ ల్యాడర్స్.  నలుగురు  పిల్లల చుట్టూ తిరిగే కథాంశంతో ఈ థ్రిల్లర్‌ సిరీస్‌ను రూపొందించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్‌ ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఈనెల 18 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.

ఈ నేపథ్యంలో తెలుగు ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ విషయాన్ని రానా తన ట్విటర్‌లో షేర్ చేశారు. కాగా.. వెబ్ సిరీస్‌ తమిళంతోపాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ ఈ సిరీస్‌కు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌కు భరత్ మురళీధరన్, అశోక్ వీరప్పన్, కమలా అల్కెమిస్ దర్శకత్వం వహించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement