
వైభవ్, చరణ్ పేరి, రితికా సింగ్, ఆకాంక్ష సింగ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన టాలీవుడ్ వెబ్ సిరీస్ బెంచ్ లైఫ్. ఈ వెబ్ సిరీస్‍కు మానస శర్మ దర్శకత్వం వహించారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిహారిక కొణిదెల నిర్మించారు. ఐటీ ఇండస్ట్రీలో ఉద్యోగులకు ఎదురయ్యే ఇబ్బందులను కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది.
ఐటీరంగంలో బెంచ్‌పై ఉండడం అనే మాటలు తరచుగా వింటుంటాం. ఆ సబ్జెక్ట్‌నే వెబ్ సిరీస్‌గా ఆవిష్కరించారు. ట్రైలర్‌లో డైలాగ్స్, సీన్స్ చూస్తుంటే ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ సెప్టెంబర్ 12 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు దాదాపు ఏడు భాషల్లో ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీలివ్‌లో ఈ సిరీస్ ప్రసారమవ్వనుంది. ఇందులో రాజేంద్ర ప్రసాద్, తనికెళ్ల భరణి, నయన్ సారిక, వెంకటేష్ కీలక పాత్రలు పోషించారు. ఈ సిరీస్‌కు పీకే దండి సంగీతమందించారు.
Comments
Please login to add a commentAdd a comment