ఓటీటీలో టాలీవుడ్ సైకలాజికల్ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? | Tollywood web series LSD Trailer Out Today Release On This Date | Sakshi
Sakshi News home page

LSD Trailer: ఓటీటీకి సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Published Wed, Jan 31 2024 8:57 PM | Last Updated on Wed, Jan 31 2024 9:07 PM

Tollywood web series LSD Trailer Out Today Release On This Date - Sakshi

ప్రాచీ టకర్, నేహా దేశ్‌పాండే, ప్రభాకర్ , కునల్, అభిలాష్ బండారి, రమ్య దినేష్ ప్రధాన పాత్రల్లో నటించిన సరికొత్త వెబ్ సిరీస్  ఎల్ఎస్‌డీ. ఈ సీరీస్‌కు శివ కోన దర్శకత్వం వహిస్తున్నారు. అనిల్ మోదుగ , శివ కోన సంయుక్తంగా నిర్మించారు. ఈ సిరీస్‌ను సైకలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కించారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. 

తాజాగా విడుదలైన ఎల్‌ఎస్‌డీ ట్రైలర్‌కు ఆడియన్స్‌ నుంచి మంచి స్పందన లభిస్తోంది. మూడు జంటల మధ్య జరిగే ఆసక్తికరమైన సన్నివేశాలు, ఫారెస్ట్‌ ట్రిప్‌ ఆడియన్స్‌లో ఆసక్తి పెంచేస్తున్నాయి. ఈ సైకలాజికల్ థ్రిల్లర్‌లో ఆద్యంతం సస్పెన్స్‌ ఉన్నట్లుగా ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. డార్క్ కామెడీగా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్‌ ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. ఎమ్ఎక్స్ ప్లేయర్‌లో ఈ సిరీస్‌ను స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తెలుగు, హిందీ భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది. కాగా.. ఈ వెబ్ సిరీస్‌కు  ప్రవీణ్ మని, శశాంక్ తిరుపతి సంగీతం అందిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement