MX Player
-
అమెజాన్ చేతికి ఎంఎక్స్ ప్లేయర్
ఉచిత స్ట్రీమింగ్ ఓటీటీ ప్లాట్‌ఫాం ‘ఎంఎక్స్ ప్లేయర్’ను కొనుగోలు చేసినట్లు అమెజాన్ వెల్లడించింది. దాన్ని తమ కంటెంట్ స్ట్రీమింగ్ సర్వీస్ మినీటీవీలో విలీనం చేసి ‘అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్’ కింద ఒకే సర్వీసుగా మార్చినట్లు పేర్కొంది. అమెజాన్ యాప్, ప్రైమ్ వీడియో, ఫైర్ టీవీ, కనెక్టెడ్ టీవీల ద్వారా ఇది అందుబాటులో ఉంటుందని తెలిపింది.అమెజాన్, ఎంఎక్స్ ప్లేయర్ రెండు సర్వీసుల అనుసంధానం ఆటోమేటిక్‌గా జరుగుతుందని, దీనికోసం ఆయా యాప్‌లను రీఇన్‌స్టాల్ లేదా అప్‌గ్రేడ్ చేయనక్కర్లేదని వివరించింది. సెప్టెంబర్‌లో రెండు సర్వీసులను 25 కోట్ల మంది యూజర్లు వినియోగించుకున్నట్లు అమెజాన్ పేర్కొంది. అయితే, ఈ డీల్ విలువ ఎంతనేది మాత్రం కంపెనీ వెల్లడించలేదు. సర్వీసును ఉచితంగా కొనసాగేస్తూనే మరింత నాణ్యమైన కంటెంట్‌ను, మెరుగైన స్ట్రీమింగ్ అనుభూతిని అందించేందుకు ఈ డీల్ ఉపయోగపడగలదని అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ హెడ్ కరణ్ బేడీ తెలిపారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు ఆదరణ పెరుగుతుండడంతో కంపెనీలు ఇప్పటికే మార్కెట్ ఉన్న వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి.ఇదీ చదవండి: అనుకున్నదే జరిగింది.. వడ్డీలో మార్పు లేదు -
అమెజాన్ చేతికి ఎంఎక్స్ ప్లేయర్ ’అసెట్స్’
న్యూఢిల్లీ: టైమ్స్ ఇంటర్నెట్ గ్రూప్‌లో భాగమైన వీడియో ఎంటర్టైన్మెంట్ ప్లాట్‌ఫాం ఎంఎక్స్ ప్లేయర్‌కి చెందిన కొన్ని అసెట్స్‌ను అమెరికన్ టెక్నాలజీ దిగ్గజం అమెజాన్ కొనుగోలు చేయనుంది. ఇందుకోసం 80–100 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 664 కోట్లు – రూ. 830 కోట్లు) వెచ్చించనుంది. ఇందుకోసం ఒప్పందం కుదుర్చుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, లావాదేవీ ఇంకా పూర్తి కావాల్సి ఉందని పేర్కొన్నాయి. ఇది పూర్తయితే ఎంఎక్స్ ప్లేయర్లో పని చేసే కొందరు సీనియర్ ఉద్యోగులు అమెజాన్‌లో చేరనున్నట్లు వివరించాయి. సిమిలర్‌వెబ్ గణాంకాల ప్రకారం భారత్‌లో వినియోగంరీత్యా టాప్ 50 ఆండ్రాయిడ్ వీడియో ప్లేయర్స్, ఎడిటర్స్ యాప్ కేటగిరీలో ఎంఎక్స్ ప్లేయర్ టాప్ 3లో ఉంది. దీన్ని 2018లో టైమ్స్ ఇంటర్నెట్ కొనుగోలు చేసింది. -
ఓటీటీలో టాలీవుడ్ సైకలాజికల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ప్రాచీ టకర్, నేహా దేశ్‌పాండే, ప్రభాకర్ , కునల్, అభిలాష్ బండారి, రమ్య దినేష్ ప్రధాన పాత్రల్లో నటించిన సరికొత్త వెబ్ సిరీస్ ఎల్ఎస్డీ. ఈ సీరీస్‌కు శివ కోన దర్శకత్వం వహిస్తున్నారు. అనిల్ మోదుగ , శివ కోన సంయుక్తంగా నిర్మించారు. ఈ సిరీస్‌ను సైకలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కించారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. తాజాగా విడుదలైన ఎల్ఎస్డీ ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభిస్తోంది. మూడు జంటల మధ్య జరిగే ఆసక్తికరమైన సన్నివేశాలు, ఫారెస్ట్ ట్రిప్ ఆడియన్స్‌లో ఆసక్తి పెంచేస్తున్నాయి. ఈ సైకలాజికల్ థ్రిల్లర్‌లో ఆద్యంతం సస్పెన్స్ ఉన్నట్లుగా ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. డార్క్ కామెడీగా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఎమ్ఎక్స్ ప్లేయర్లో ఈ సిరీస్‌ను స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తెలుగు, హిందీ భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది. కాగా.. ఈ వెబ్ సిరీస్‌కు ప్రవీణ్ మని, శశాంక్ తిరుపతి సంగీతం అందిస్తున్నారు. -
ఆమె లీనమైపోయింది, అలా ఆ రొమాంటిక్ సీన్ ఈజీ అయింది
బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ ఆశ్రమ్ 3 (ఆశ్రమం). క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్‌లో ఇషా గుప్తా నటించగా ప్రకాశ్ జా దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం ఎమ్ఎక్స్ ప్లేయర్లో స్ట్రీమింగ్ అవుతోందీ సిరీస్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాబీ డియోల్ ఈ సిరీస్‌లోని అభ్యంతరకర సన్నివేశాలపై స్పందించాడు. 'మొదటి సారి అభ్యంతరకర సన్నివేశేంలో నటించడం కావడంతో నాకు చాలా భయమేసింది. ఇలా మరీ సన్నిహితంగా కలిసి నటించడం నాకిదే తొలిసారి. కానీ ఇషా చాలా ప్రొఫెషనల్. ఆమె పాత్రలో లీనమైపోవడంతో నాకు ఆమెతో కలిసి రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడం కొంత ఈజీ అయింది. అది స్క్రీన్‌పై కూడా సరిగ్గా వచ్చింది. ఇక ప్రతికూల పాత్రలో జనాలు నన్ను అంగీకరించినందుకు సంతోషంగా ఉంది. ఇక ముందు కూడా డిఫరెంట్ అండ్ ఛాలెంజింగ్ రోల్స్ చేయగలనన్న నమ్మకం వచ్చింది' అని చెప్పుకొచ్చాడు బాబీ డియోల్. చదవండి: హీరోయిన్ ఇంట్రస్టింగ్ పోస్ట్, తనతో ఉంది ఆ క్రికెటరే అంటున్న ఫ్యాన్స్ టీఆర్పీలో టాప్ సీరియల్.. కానీ నటులకు జీతాలివ్వట్లేదా? -
ఓటీటీలో సినిమా తీసిన అనకాపల్లి డైరెక్టర్
సాక్షి, మునగపాక (అనకాపల్లి): సినిమా రంగంపై ఆసక్తితో అందరిలా అతను భాగ్యనగరానికి పరుగులు తీయలేదు. తనకున్న పరిమిత వనరులను ఉపయోగించుకుని తొలుత ‘వేదన’, ‘ఓ మనస్సు కథ’, ‘మత్తు వదలరా’ వంటి పలు లఘు చిత్రాలను జీరో బడ్జెట్‌తో తీసి తన సత్తా నిరూపించుకున్నాడు. ఆపై ఓటీటీ చిత్రం వాడే–వీడు తీసి 7 లక్షలకుపైగా వీక్షకుల అభిమానం పొందాడు. వెండితెర వైపు అడుగులు వేస్తున్న వర్ధమాన దర్శకుడు కోరుకొండ గోపీకృష్ణ స్ఫూర్తిదాయక కథనం... మునగపాక గ్రామానికి చెందిన కోరుకొండ గోపీకృష్ణ చిన్నప్పటి నుంచి కళలపై ఆసక్తి చూపేవాడు. సాహిత్యంపై మక్కువతో పలు కవితలు, రచనలు చేశారు. వెయ్యికిపైగా సన్మాన పత్రాలు రాసి తన ప్రతిభ నిరూపించుకున్నాడు. కంప్యూటర్ పరిజ్ఞానంతో పుస్తకాలు రాసి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు నుంచి అభినందనలు అందుకున్నాడు. నూతన నటీ నటులతో వాడే–వీడు... తార క్రియేషన్స్ బ్యానర్‌పై నూతన నటీనటులతో వాడే–వీడు చిత్రానికి దర్శకత్వం వహించాడు. స్త్రీ లేనిదే ప్రతీ మగవాడి జీవితం శూన్యం. అదే స్త్రీ కారణంగా మగవాడి జీవితం శూన్యం కాకూడదనే ఇతి వృత్తాంతంతో సినిమా తీశాడు. హీరో హీరోయిన్లుగా సిరి, వెన్నెలను చిత్ర పరిశ్రమకు పరిచయం చేస్తూ.. స్థానిక కళాకారులు 15 మందితో సినిమా రూపొందించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో 24 రోజుల పాటు వాడ్రాపల్లి, కొండకర్ల ఆవ, తదితర ప్రాంతాల్లో చిత్రీకరించారు. అలరించిన పాటలు... వాడే–వీడు చిత్రంలోని పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలై ఉర్రూతలూగిస్తున్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాటలకు విశేష ఆదరణ వస్తోంది. సింగర్ కార్తీక్ పాడిన వెన్నెల సాంగ్ రంజింపచేస్తోంది. ఈస్ట్‌వెస్ట్ ఎంటర్ టైన్మెంట్స్ ఆధ్వర్యంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఎమ్ఎక్స్ ప్లేయర్లో ఈనెల 13న విడుదలైన చిత్రం అందరి నుంచి ప్రశంసలు అందుకుంటోంది. ఇప్పటి వరకు 7 లక్షలకు పైగా వీక్షించారు. ఐఎండీబీ 9 రేటింగ్ చేపట్టింది. తెర వెనుక... తారా క్రియేషన్స్ బ్యానర్‌పై వాడే–వీడు చిత్రానికి బ్రహ్మానందరెడ్డి, శ్రీపతి శివకుమార్ నిర్మాతలుగా, ఎంఎల్ రాజా మ్యూజిక్ డైరెక్టర్‌గా, కెమెరామెన్‌గా హేమవర్ధన్‌రెడ్డి వ్యవహరించారు. సింగర్ కార్తీక్, స్ఫూర్తి జితేందర్, లక్ష్మీ శ్రావణి తదితరులు పాటలు పాడారు. మాటల రచయితగా మునగపాకకు చెందిన విల్లూరి జగ్గప్పారావు, రచనా సహకారం సూరిశెట్టి రాము అందించారు. పరుచూరి అభినందన విశాఖ సినిమా షూటింగ్‌లకు అనువైన ప్రాంతం. కళాకారులను ప్రోత్సహించేందుకు ఇక్కడ అన్ని వనరులు ఉన్నాయి. విశాఖను అభివృద్ధి చేయాలన్న సీఎం జగన్మోహన్రెడ్డి కల నెరవేరే రోజులు కనిపిస్తున్నాయి. వాడే– వీడు సినిమా చూసిన రచయిత పరుచూరి అభినందించారని గోపాలకృష్ణ తెలిపాడు. చదవండి: సినీకార్మికుల సమ్మెపై మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు చైతూ డేటింగ్ గాసిప్స్.. అప్పుడు ‘మజిలీ’ బ్యూటీ.. ఇప్పుడు ‘మేజర్’ భామ -
సబ్స్క్రిప్షన్ల బాదుడు ఎక్కువైందా? ఈ ఫ్రీ ఓటీటీలపై లుక్కేయండి
కరోనా వచ్చిన తర్వాత ఓటీటీల వినియోగం బాగా పెరిగిపోయింది. కోవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న సమయంలో గడప దాటి బయటకు వెళ్లే అవకాశం లేకపోవడంతో థియేటర్లు మూతపడ్డాయి. దీంతో ఎంటర్టైన్మెంట్ కోసం జనాలు ఓటీటీలను ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నారు. దీంతో దొరికిందే ఛాన్స్ అనుకున్న ఓటీటీ సంస్థలు అందినకాడికి దండుకుంటున్నాయి. హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ 5 వంటి పెయిడ్ ఓటీటీలే కాకుండా ఉచితంగా లభించే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కూడా ఉన్నాయి. అవేంటో ఓ సారి చూసేద్దాం.. ఎమ్ఎక్స్ ప్లేయర్ ఉచితంగా లభిస్తుందంటున్నారు కాబట్టి ఇందులో పెద్దగా సినిమాలు, సిరీస్‌లు ఉండవేమో అనుకోకండి. ఇటీవలే కంగనా రనౌత్ లాకప్ షోను విజయవంతంగా రన్ చేసింది. ఆశ్రమ్ లాంటి స్పెషల్ వెబ్‌సిరీస్‌లు కూడా ఎమ్ఎక్స్ ప్లేయర్‌లోనే అందుబాటులో ఉన్నాయి. ఫ్రీ సర్వీస్ కాబట్టి మధ్యమధ్యలో ప్రకటనలు వస్తుంటాయి. జియో సినిమా ఇది కూడా ఓటీటీ ప్లాట్‌ఫామే. జియో యూజర్స్ దీన్ని ఉచితంగా వాడుకోవచ్చు. ఇందులో సినిమాలు మాత్రమే కాకుండా జియో టీవీ ద్వారా టీవీ ఛానెళ్లను, లైవ్ డిబేట్స్‌ను వీక్షించవచ్చు. ఇందులో కూడా యాడ్స్ వస్తాయి. టీవీఎఫ్ ప్లే ఇది కూడా ఫ్రీగా లభించే ఓటీటీ ప్లాట్‌ఫాం. ఇందులో యాస్పిరెంట్స్ సహా మరెన్నో సిరీస్‌లు అందుబాటులో ఉన్నాయి. ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ కావాలంటే వెంటనే దీన్ని డౌన్లోడ్ చేసుకుని లాగిన్ అయిపోండి. ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఇది ఎయిర్టెల్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. మీరు ఎయిర్టెల్ వినియోగదారులైతే మీ నంబర్‌తో లాగిన్ అయి ఇందులో కంటెంట్‌ను ఎంచక్కా చూస్తూ కాలక్షేపం చేయొచ్చు. వొడాఫోన్ ఐడియా మూవీస్ అండ్ టీవీ వొడాఫోన్ ఐడియా వినియోగదారులు ఈ ప్లాట్‌ఫాం ద్వారా బోలెడంత కంటెంట్‌ను ఉచితంగా చూసేయొచ్చు. మీ వొడాఫోన్ నంబర్‌తో లాగిన్ అయితే సరిపోతుంది. View this post on Instagram A post shared by MX Player (@mxplayer) View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) View this post on Instagram A post shared by Girliyapa (@girliyapa) చదవండి: జీటీవీ పాపులర్ సీరియల్ ‘ఖుర్బాన్ హువా’ నటి గురించి మీకీ విషయాలు తెలుసా? ఏమో, చనిపోతామేమో.. అని వీడియో, కొద్ది గంటలకే మృతి -
ఈవారం అలరించే సినిమాలు, సిరీస్‌లు ఇవే..
Upcoming Theater OTT Movies Web Series In June 1st Week 2022: థియేటర్ల వద్ద సినిమాల సందడి కొనసాగుతూనే ఉంది. బాలకృష్ణ 'అఖండ'తో మొదలైన మూవీ పండుగ మే 27న విడుదలైన 'ఎఫ్ 3' (F3)తో కంటిన్యూ అవుతోంది. ఈ నెలలో 'సర్కారు వారి పాట', 'ఎఫ్3' విజయంగా దూసుకుపోతున్నాయి. ప్రతి వారం ఓ కొత్త సినిమా ప్రేక్షకులను కచ్చితంగా పలకిస్తుండంగా.. జూన్ మొదటి వారంలో అలరించే సినిమాలు, సిరీస్‌లు ఏంటో లుక్కేద్దామా ! 1. మేజర్ డిఫరెంట్ కథలు, సినిమాలతో అలరించే అడవి శేష్ మేజర్ మూవీతో సందడి చేసేందుకు సిద్ధమయ్యాడు. 36/11 ఉగ్రదాడుల్లో ప్రజల ప్రాణాలు కాపాడి అమరుడైన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 9 ప్రధాన నగరాల్లో ప్రివ్యూలు వేసిన విషయం తెలిసిందే. 2. విక్రమ్ ముగ్గురు విలక్షణ నటులందరు కలిసి ఉర్రూతలూగించేందుకు వస్తుంది 'విక్రమ్'. లోకేష్ కనకరాజు దర్శకత్వంలో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలుగా నటిస్తున్న ఈ సినిమాలో సూర్య అతిథిగా మెరవబోతున్నాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన 'విక్రమ్' జూన్ 3న తమిళ, తెలుగు భాషల్లో సందడి చేసేందుకు రెడీ అయ్యాడు. 3. పృథ్వీరాజ్ బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో రాజ్‌పుత్ యోధుడు పృథ్వీరాజ్ చౌహాన్ వీరగాథ ఆధారంగా రూపొందిన చిత్రం 'పృథ్వీరాజ్'. ఇందులో 2017 మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ హీరోయిన్గా నటించింది. చంద్రప్రకాష్ ద్వివేది తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతోపాటు పలు దక్షిణాది భాషల్లో రిలీజవనుంది. ఓటీటీలో వచ్చే సినిమాలు, సిరీస్‌లు ఇవే.. 1. 9 అవర్స్ (వెబ్ సిరీస్)- డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జూన్ 2 2. జనగణమన (మలయాళం)- నెట్‌ఫ్లిక్స్, జూన్ 2 3. అశోకవనంలో అర్జున కల్యాణం- ఆహా, జూన్ 3 4. ది పర్ఫెక్ట్ మదర్ (వెబ్ సిరీస్)- నెట్‌ఫ్లిక్స్, జూన్ 3 5. సర్వైవింగ్ సమ్మర్ (వెబ్ సిరీస్)- నెట్‌ఫ్లిక్స్, జూన్ 3 6. ది బాయ్స్ (వెబ్ సిరీస్)- అమెజాన్ ప్రైమ్ వీడియో, జూన్ 3 7. ఆశ్రమ్ (హిందీ వెబ్ సిరీస్-సీజన్ 3)- ఎంఎక్స్ ప్లేయర్, జూన్ 3 8. బెల్ఫాస్ట్ (హాలీవుడ్)- బుక్ మై షో, జూన్ 3 చదవండి: రీల్స్‌తో 3 కోట్లు గెలవాలనుకుని చివరికీ ఏమయ్యారు.. -
నేరాలు చేసే 'బాబా నిరాలా' మళ్లీ వచ్చేస్తున్నాడు.. ఆసక్తిగా ట్రైలర్
Bobby Deol Ashram 3 Trailer Released And Streaming On MX Player: బాలీవుడ్ హీరో బాబీ డియోల్ బాబాగా నటించి మెప్పించిన వెబ్ సిరీస్ ఆశ్రమ్ (ఆశ్రమం). ఆగస్టు 28, 2020న విడుదలైన ఈ సిరీస్ మంచి ప్రేక్షకాదరణ పొందింది. తర్వాత అదే సంవత్సరం చాప్టర్ 2 పేరుతో నవంబర్‌లో 'ఆశ్రం 2'ను రిలీజ్ చేశారు. ఇప్పుడు తాజాగా ఈ వెబ్ సిరీస్ మూడో చాప్టర్ రానుంది. తాజాగా ఆశ్రమ్ మూడో చాప్టర్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఎమ్ఎక్స్ ప్లేయర్లో జూన్ 3 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు మేకర్స్. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్‌కు ప్రకాష్ జా దర్శకత్వం వహించారు. తనకు తాను దేవుడిగా ప్రచారం చేసుకుంటూ మహిళల దోపిడీ, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, రాజకీయాలను నియంత్రించే బాబా పాత్రలో బాబీ డియోల్ ఆకట్టుకున్నాడు. ఇందులో బాబా మరింత పవర్‌ఫుల్‌గా, తానే దేవుడన్నట్లుగా కనపించనున్నట్లు తెలుస్తోంది. 'నేనే దేవున్ని.. నిరాలా భగవాన్' అని బాబీ డియోల్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. ఆశ్రమ్ చాప్టర్ 2లో త్రిదా చౌదరీ హైలెట్‌గా నిలవగా.. ప్రస్తుతం వస్తున్న మూడో చాప్టర్లో బాలీవుడ్ బ్యూటీ ఇషా గుప్తా అలరించనుంది. మరీ ఇషా గుప్తా ఏమేరకు ఆకట్టుకోనుందో చూడాలి. ఇందులో అదితీ పోహంకర్, చందన్ రాయ్ సన్యాల్, దర్శన్ కుమార్, అనుప్రియా గోయెంకా, అధ్యాయన్ సుమన్, త్రిదా చౌదరీ, తుషార్పాండే తదితరులు నటిస్తున్నారు. చదవండి: సన్నీ డియోల్ తనయుడికి నిశ్చితార్థమంటూ వార్తలు.. ఇదిగో క్లారిటీ