80–100 మిలియన్ డాలర్ల డీల్
న్యూఢిల్లీ: టైమ్స్ ఇంటర్నెట్ గ్రూప్‌లో భాగమైన వీడియో ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాట్‌ఫాం ఎంఎక్స్ ప్లేయర్‌కి చెందిన కొన్ని అసెట్స్‌ను అమెరికన్ టెక్నాలజీ దిగ్గజం అమెజాన్ కొనుగోలు చేయనుంది. ఇందుకోసం 80–100 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 664 కోట్లు – రూ. 830 కోట్లు) వెచ్చించనుంది. ఇందుకోసం ఒప్పందం కుదుర్చుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
అయితే, లావాదేవీ ఇంకా పూర్తి కావాల్సి ఉందని పేర్కొన్నాయి. ఇది పూర్తయితే ఎంఎక్స్ ప్లేయర్‌లో పని చేసే కొందరు సీనియర్ ఉద్యోగులు అమెజాన్‌లో చేరనున్నట్లు వివరించాయి. సిమిలర్‌వెబ్ గణాంకాల ప్రకారం భారత్‌లో వినియోగంరీత్యా టాప్ 50 ఆండ్రాయిడ్ వీడియో ప్లేయర్స్, ఎడిటర్స్ యాప్ కేటగిరీలో ఎంఎక్స్ ప్లేయర్ టాప్ 3లో ఉంది. దీన్ని 2018లో టైమ్స్ ఇంటర్నెట్ కొనుగోలు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment