ఉచిత స్ట్రీమింగ్ ఓటీటీ ప్లాట్‌ఫాం ‘ఎంఎక్స్ ప్లేయర్’ను కొనుగోలు చేసినట్లు అమెజాన్ వెల్లడించింది. దాన్ని తమ కంటెంట్ స్ట్రీమింగ్ సర్వీస్ మినీటీవీలో విలీనం చేసి ‘అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్’ కింద ఒకే సర్వీసుగా మార్చినట్లు పేర్కొంది. అమెజాన్ యాప్, ప్రైమ్ వీడియో, ఫైర్ టీవీ, కనెక్టెడ్ టీవీల ద్వారా ఇది అందుబాటులో ఉంటుందని తెలిపింది.
అమెజాన్, ఎంఎక్స్ ప్లేయర్ రెండు సర్వీసుల అనుసంధానం ఆటోమేటిక్‌గా జరుగుతుందని, దీనికోసం ఆయా యాప్‌లను రీఇన్‌స్టాల్ లేదా అప్‌గ్రేడ్ చేయనక్కర్లేదని వివరించింది. సెప్టెంబర్‌లో రెండు సర్వీసులను 25 కోట్ల మంది యూజర్లు వినియోగించుకున్నట్లు అమెజాన్ పేర్కొంది. అయితే, ఈ డీల్ విలువ ఎంతనేది మాత్రం కంపెనీ వెల్లడించలేదు. సర్వీసును ఉచితంగా కొనసాగేస్తూనే మరింత నాణ్యమైన కంటెంట్‌ను, మెరుగైన స్ట్రీమింగ్ అనుభూతిని అందించేందుకు ఈ డీల్ ఉపయోగపడగలదని అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ హెడ్ కరణ్ బేడీ తెలిపారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు ఆదరణ పెరుగుతుండడంతో కంపెనీలు ఇప్పటికే మార్కెట్ ఉన్న వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి.
ఇదీ చదవండి: అనుకున్నదే జరిగింది.. వడ్డీలో మార్పు లేదు
Comments
Please login to add a commentAdd a comment