ఓటీటీలో 'తుఫాన్'.. పదిరోజుల్లోనే స్ట్రీమింగ్‌ | Vijay Antony Movie Toofan Streaming Now OTT | Sakshi
Sakshi News home page

ఓటీటీలో 'తుఫాన్'.. పదిరోజుల్లోనే స్ట్రీమింగ్‌

Published Fri, Aug 16 2024 9:37 AM | Last Updated on Fri, Aug 16 2024 10:53 AM

Vijay Antony Movie Toofan Streaming Now OTT

కోలివుడ్‌ హీరో విజయ్ ఆంటోని నటించిన లేటెస్ట్ మూవీ 'తుఫాన్'. ఆగస్టు 11న విడుదలైన ఈ చిత్రం ఇప్పడు ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి ప్రకటన లేకుండానే స్ట్రీమింగ్‌ అవుతుంది. విజయ్‌ మిల్టన్‌ తెరకెక్కించిన ఈ సినిమాని ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్‌పై కమల్‌ బోరా, డి.లలితా, బి.ప్రదీప్, పంకజ్‌ బోరా నిర్మించారు. ఈ సంస్థ గతంలో విజయ్ ఆంటోనీ హీరోగా రాఘవన్, హత్య సినిమాలను నిర్మించింది. సత్యరాజ్, శరత్‌ కుమార్, మేఘా ఆకాష్, మురళీ శర్మ, డాలీ ధనుంజయ వంటి స్టార్స్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద పర్వాలేదనిపించింది.

తుఫాన్ సినిమా విడుదలై వారం రోజులు కూడా పూర్తి కాలేదు. కానీ, అమెజాన్‌ ప్రైమ్‌లో సడెన్‌గా స్ట్రీమింగ్‌ అవుతుంది. అయితే, ప్రస్తుతం తమిళ్‌ వర్షన్‌ మాత్రమే అందుబాటులో ఉంది.  తమిళ్‌లో తుఫాన్‌ చిత్రాన్ని ఆగష్టు 2న విడుదల చేశారు. టాలీవుడ్‌లో ఆగష్టు 11న విడుదల చేశారు. ఈ క్రమంలోనే ముందుగా తమిళ్‌ వర్షన్‌ను ఓటీటీలో విడుదల చేసిన మేకర్స్‌ వచ్చే వారంలో తెలుగు వర్షన్‌ కూడా విడుదల చేయనున్నారని సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement