చైతన్య రావ్, హెబ్బా పటేల్ జంటగా నటించిన కొత్త చిత్రం 'హనీమూన్ ఎక్స్ ప్రెస్'. తాజాగా ఎలాంటి ప్రకటన లేకుండానే ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేసింది. జూన్ 21న విడుదలైన ఈ సినిమాను న్యూ రీల్ ఇండియా బ్యానర్‌పై కేకేఆర్, బాలరాజ్ నిర్మించారు. రొమాంటిక్ కామెడీ కథాంశంగా దర్శకుడు బాల రాజశేఖరుని తెరకెక్కించారు. చైతన్య రావు, హెబ్బా పటేల్, తనికెళ్ల భరణి, సుహాసిని, అరవింద్ కృష్ణ, అలీ, సురేఖ వాణి, రవి వర్మ, తదితరులు నటించారు.
ప్రస్తుత సమాజంలో ప్రేమ, పెళ్లి, విడాకులు అనే కాన్సెప్ట్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. థియేటర్‌లో కాస్త పర్వాలేదు అనేలా ప్రేక్షకులను మెప్పించింది. అయితే, సడెన్‌గా 'హనీమూన్ ఎక్స్ ప్రెస్' ఓటీటీలోకి వచ్చేసి షాకిచ్చింది. సడెన్‌గా నేటి (ఆగస్ట్ 27) నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. చైతన్య రావు, హెబ్బా పటేల్ మధ్య వచ్చే సీన్స్ కాస్త నెగటివ్‌ను తెచ్చిపెట్టాయని చెప్పవచ్చు. అయితే, ఈ చిత్రానికి ఐఎండీబీలో 8.7 రేటింగ్ ఉన్నటం విశేషం.
కథేంటంటే..
వేరు వేరు మనస్తత్వాలు ఉన్న సోనాలి(హెబ్బా పటేట్), ఈషాన్(చైతన్య రావు) ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. పెళ్లి తర్వాత తొలి రాత్రి నుంచే వీరిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు మొదలవుతాయి. ముఖ్యంగా శృంగార జీవితాన్ని వీరిద్దరు ఆస్వాదించలేకపోతారు. కౌన్సిలింగ్ కోసం థెరపిస్ట్‌లను కలుస్తారు. అయినా ప్రయోజనం ఉండడు. ఓ సారి వీరిద్దరు కారులో వెళ్తుంటే.. ఓ వృద్ధ జంట(తనికెళ్ల భరణి, సుహాసిని) పరిచయమై హనీమూన్ ఎక్స్‌ప్రెస్(రిస్టార్ట్) గురించి చెబుతుంది.
ఆ రిసార్ట్‌కి వెళ్లిన తర్వాత వీరిద్దరి ఎదురైన అభువాలు ఏంటి? అసలు ఈ వృద్ధ జంట ఎవరు? హనీమూన్ ఎక్స్‌ప్రెస్ కాన్సెప్ట్ ఏంటి? ప్రేమ వివాహం చేసుకున్న సోనాలి, ఈషాన్ శృంగార జీవితం సరిగ్గా ఉండకపోవడానికి గల కారణం ఏంటి? రిసార్ట్‌లోకి వెళ్లిన తర్వాత వీరిలో వచ్చిన మార్పు ఏంటి? చివరకు వీరిద్దరు విడిపోయారా? ఒక్కటయ్యరా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment