ఓటీటీలో టాలీవుడ్‌ మూవీకి ఊహించని రెస్పాన్స్..! | Tollywood Movie Honeymoon Express Getting Huge Audience Response In OTT Platform, Deets Inside | Sakshi
Sakshi News home page

HoneyMoon Express OTT Response: ఓటీటీలో ట్రెండింగ్‌లోకి వచ్చేసిన హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌!

Published Tue, Aug 27 2024 5:31 PM | Last Updated on Tue, Aug 27 2024 5:58 PM

Tollywood Movie Gets Huge Audience response In Ott

చైతన్య రావ్, హెబ్బా పటేల్ జంటగా నటించిన చిత్రం 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్'. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కించిన ఈ మూవీ అభిమానులను ఆడియన్స్‌ను అలరిస్తోంది. జూన్‌ 21న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అభిమానులను పెద్దగా మెప్పించలేకపోయింది. తాజాగా ఈ మూవీ ఎలాంటి ప్రకటన లేకుండానే సడన్‌గా అమెజాన్‌ప్రైమ్‌లోకి వచ్చేసింది.

ఈ రోజు నుంచే అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ చిత్రానికి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. థియేటర్లలో పెద్దగా రాణించలేకపోయిన చిత్రం ఓటీటీ ప్రియులను తెగ ఆకట్టుకుంటోంది. ఒక్కరోజులోనే ఈ సినిమా ట్రెండింగ్‌లో వచ్చేసింది.  ప్రస్తుతం తరం ఎదుర్కొంటోన్న ప్రేమ, పెళ్లి, విడాకులు అనే కాన్సెప్టులతో బాల రాజశేఖరుని దర్శకత్వంలో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, సుహాసిని, అరవింద్ కృష్ణ, అలీ, సురేఖ వాణి, రవి వర్మ కీలక పాత్రల్లో నటించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement