Chaitanya Rao
-
ఓటీటీలో టాలీవుడ్ మూవీకి ఊహించని రెస్పాన్స్..!
చైతన్య రావ్, హెబ్బా పటేల్ జంటగా నటించిన చిత్రం 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్'. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కించిన ఈ మూవీ అభిమానులను ఆడియన్స్‌ను అలరిస్తోంది. జూన్ 21న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అభిమానులను పెద్దగా మెప్పించలేకపోయింది. తాజాగా ఈ మూవీ ఎలాంటి ప్రకటన లేకుండానే సడన్‌గా అమెజాన్ప్రైమ్లోకి వచ్చేసింది.ఈ రోజు నుంచే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ చిత్రానికి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. థియేటర్లలో పెద్దగా రాణించలేకపోయిన చిత్రం ఓటీటీ ప్రియులను తెగ ఆకట్టుకుంటోంది. ఒక్కరోజులోనే ఈ సినిమా ట్రెండింగ్‌లో వచ్చేసింది. ప్రస్తుతం తరం ఎదుర్కొంటోన్న ప్రేమ, పెళ్లి, విడాకులు అనే కాన్సెప్టులతో బాల రాజశేఖరుని దర్శకత్వంలో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, సుహాసిని, అరవింద్ కృష్ణ, అలీ, సురేఖ వాణి, రవి వర్మ కీలక పాత్రల్లో నటించారు. -
ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌పై హెబ్బా పటేల్ 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్'
చైతన్య రావ్, హెబ్బా పటేల్ జంటగా నటించిన కొత్త చిత్రం 'హనీమూన్ ఎక్స్ ప్రెస్'. తాజాగా ఎలాంటి ప్రకటన లేకుండానే ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేసింది. జూన్ 21న విడుదలైన ఈ సినిమాను న్యూ రీల్ ఇండియా బ్యానర్‌పై కేకేఆర్, బాలరాజ్ నిర్మించారు. రొమాంటిక్ కామెడీ కథాంశంగా దర్శకుడు బాల రాజశేఖరుని తెరకెక్కించారు. చైతన్య రావు, హెబ్బా పటేల్, తనికెళ్ల భరణి, సుహాసిని, అరవింద్ కృష్ణ, అలీ, సురేఖ వాణి, రవి వర్మ, తదితరులు నటించారు.ప్రస్తుత సమాజంలో ప్రేమ, పెళ్లి, విడాకులు అనే కాన్సెప్ట్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. థియేటర్లో కాస్త పర్వాలేదు అనేలా ప్రేక్షకులను మెప్పించింది. అయితే, సడెన్‌గా 'హనీమూన్ ఎక్స్ ప్రెస్' ఓటీటీలోకి వచ్చేసి షాకిచ్చింది. సడెన్‌గా నేటి (ఆగస్ట్ 27) నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. చైతన్య రావు, హెబ్బా పటేల్ మధ్య వచ్చే సీన్స్ కాస్త నెగటివ్‌ను తెచ్చిపెట్టాయని చెప్పవచ్చు. అయితే, ఈ చిత్రానికి ఐఎండీబీలో 8.7 రేటింగ్ ఉన్నటం విశేషం.కథేంటంటే..వేరు వేరు మనస్తత్వాలు ఉన్న సోనాలి(హెబ్బా పటేట్), ఈషాన్(చైతన్య రావు) ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. పెళ్లి తర్వాత తొలి రాత్రి నుంచే వీరిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు మొదలవుతాయి. ముఖ్యంగా శృంగార జీవితాన్ని వీరిద్దరు ఆస్వాదించలేకపోతారు. కౌన్సిలింగ్ కోసం థెరపిస్ట్‌లను కలుస్తారు. అయినా ప్రయోజనం ఉండడు. ఓ సారి వీరిద్దరు కారులో వెళ్తుంటే.. ఓ వృద్ధ జంట(తనికెళ్ల భరణి, సుహాసిని) పరిచయమై హనీమూన్ ఎక్స్‌ప్రెస్(రిస్టార్ట్) గురించి చెబుతుంది. ఆ రిసార్ట్‌కి వెళ్లిన తర్వాత వీరిద్దరి ఎదురైన అభువాలు ఏంటి? అసలు ఈ వృద్ధ జంట ఎవరు? హనీమూన్ ఎక్స్‌ప్రెస్ కాన్సెప్ట్ ఏంటి? ప్రేమ వివాహం చేసుకున్న సోనాలి, ఈషాన్ శృంగార జీవితం సరిగ్గా ఉండకపోవడానికి గల కారణం ఏంటి? రిసార్ట్‌లోకి వెళ్లిన తర్వాత వీరిలో వచ్చిన మార్పు ఏంటి? చివరకు వీరిద్దరు విడిపోయారా? ఒక్కటయ్యరా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
హెబ్బా పటేల్ ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ ఎలా ఉందంటే..?
టైటిల్: హనీమూన్ ఎక్స్ప్రెస్నటీనటులు: చైతన్య రావు, హెబ్బా పటేల్, తనికెళ్ల భరణి, సుహాసిని, అరవింద్ కృష్ణ, అలీ, సురేఖ వాణి, రవి వర్మ, తదితరులునిర్మాతలు: కేకేఆర్, బాలరాజ్ రచన, దర్శకత్వం : బాల రాజశేఖరునిసంగీతం: కళ్యాణి మాలిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : ఆర్ పి పట్నాయక్ఎడిటింగ్ : ఉమా శంకర్ జి (యు ఎస్ ఎ), శ్రీ కృష్ణ అత్తలూరివిడుదల తేది: జూన్ 21, 2024కథేంటంటే.. వేరు వేరు మనస్తత్వాలు ఉన్న సోనాలి(హెబ్బా పటేట్), ఈషాన్(చైతన్య రావు) ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. పెళ్లి తర్వాత తొలి రాత్రి నుంచే వీరిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు మొదలవుతాయి. ముఖ్యంగా శృంగార జీవితాన్ని వీరిద్దరు ఆస్వాదించలేకపోతారు. కౌన్సిలింగ్ కోసం థెరపిస్ట్‌లను కలుస్తారు. అయినా ప్రయోజనం ఉండడు. ఓ సారి వీరిద్దరు కారులో వెళ్తుంటే.. ఓ వృద్ధ జంట(తనికెళ్ల భరణి, సుహాసిని) పరిచయమై హనీమూన్ ఎక్స్‌ప్రెస్(రిస్టార్ట్) గురించి చెబుతుంది. ఆ రిసార్ట్‌కి వెళ్లిన తర్వాత వీరిద్దరి ఎదురైన అభువాలు ఏంటి? అసలు ఈ వృద్ధ జంట ఎవరు? హనీమూన్ ఎక్స్‌ప్రెస్ కాన్సెప్ట్ ఏంటి? ప్రేమ వివాహం చేసుకున్న సోనాలి, ఈషాన్ శృంగార జీవితం సరిగ్గా ఉండకపోవడానికి గల కారణం ఏంటి? రిసార్ట్‌లోకి వెళ్లిన తర్వాత వీరిలో వచ్చిన మార్పు ఏంటి? చివరకు వీరిద్దరు విడిపోయారా? ఒక్కటయ్యరా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. ప్రస్తుతం విడాకులు అనేది చాలా సింపుల్ మ్యాటర్ అయిపోయింది.చిన్న చిన్న విషయాల్లో గొడవపడి విడిపోతున్నారు. భార్యకు నచ్చినట్లుగా భర్త, భర్తకు నచ్చినట్లుగా భార్య ప్రవర్తించకపోవడంతో గొడవలు మొదలవుతున్నాయి. ఒకరికొకరు సరిగ్గా అర్థం చేసుకుంటే కాపురంలో గొడవలే ఉండవు. ఈ పాయింట్‌తోనే హనీమూన్ ఎక్స్‌ప్రెస్‌ని తెరకెక్కించాడు దర్శకుడు బాల రాజశేఖరుడు. డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ బాగుంది. కానీ అనుకున్న పాయింట్‌ని తెరపై చూపించడంలో పూర్తిగా సఫలం కాలేదు. స్క్రీప్‌ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సింది. చాలా చోట్ల కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాడు. కథ ప్రారంభం కాస్త ఆసక్తికరంగా ఉన్నా.. ప్రేమ, పెళ్లి, శోభనం ఇదంతా చాలా సినిమాటిక్‌గా అనిపిస్తుంది. వృద్ధ జంట ఎంట్రీ తర్వాత అసలు కథ ప్రారంభం అవుతుంది. హనీమూన్ ఎక్స్‌ప్రెస్ గేమ్ గురించి వివరించిన తర్వాత ఏదో జరగబోతుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో కలుగుతుంది. రిసార్ట్‌లోకి వెళ్లిన అక్కడ వచ్చే ట్విస్ట్ కథపై మరింత ఆసక్తిని పెంచుతుంది. అయితే ఆ ట్విస్ట్ తర్వాత క్లైమాక్స్ ఏంటో ఈజీగా అర్థం అవుతుంది. సెకండాఫ్‌లో వచ్చే కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు యూత్‌ని ఆకట్టుకున్నా..ఫ్యామిలీ ఆడియన్స్‌కి కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. బడ్జెట్ ప్రాబ్లమో ఇంకేదో కానీ.. చాలా సన్నివేశాలు చుట్టేశారనే ఫీలింగ్ కలుగుతుంది. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా స్క్రీన్‌ప్లే బలంగా రాసుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది.ఎవరెలా చేశారంటే.. ఈషాన్ పాత్రకు చైతన్యరావు న్యాయం చేశాడు. డీసెంట్ ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. హెబ్బా పటేల్ అందాల ప్రదర్శన ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నటన కంటే ఎక్స్ఫోజింగ్పైనే ఎక్కువ శ్రద్ధ పెట్టారు. సీనియర్ నటులు తనికెళ్ల భరణి, సుహాసిని డిఫరెంట్ పాత్రల్లో మెరిశారు. వారిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు కొంతవరకు ఓవరాక్షన్‌గా అనిపించినా.. నవ్వుకోవచ్చు. అలీ కనిపించేది ఒక సీన్లో అయినా..నవ్వించే ప్రయత్నం చేశాడు. అరవింద్ కృష్ణ, సురేఖ వాణి, రవి వర్మతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాకేంతికంగా ఈ సినిమా జస్ట్ ఒకే. కల్యాణీ మాలిక్ అందించిన పాటలు సినిమాకు ప్లస్ అయ్యాయి. నేపథ్యం సంగీతం ఓకే. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఎన్ని కోట్లు పెట్టినా అది ఉంటేనే థియేటర్లకు వస్తారు: టాలీవుడ్ డైరెక్టర్
చైతన్య రావ్, హెబ్బా పటేల్ జంటగా నటించిన తాజా చిత్రం 'హనీమూన్ ఎక్స్ ప్రెస్;. ఈ చిత్రాన్ని న్యూ రీల్ ఇండియా బ్యానర్‌పై కేకేఆర్, బాలరాజ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను రొమాంటిక్ కామెడీ కథాంశంగా దర్శకుడు బాల రాజశేఖరుని తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 21న థియేటర్లలో సందడి చేయనుంది. తాజాగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టాలీవుడ్ రచయిత విజయేంద్రప్రసాద్, ప్రసాద్ సంస్థల అధినేత రమేష్ ప్రసాద్ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు.విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. 'హనీమూన్ ఎక్స్ ప్రెస్ మూవీ దర్శకుడు బాల మంచి డైరెక్టర్. హాలీవుడ్ లో మూవీస్ చేశాడు. ఇప్పుడు తెలుగులో దర్శకుడిగా అడుగుపెడుతున్నాడు. అతనితో పాటు టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్'అని అన్నారు. కేఎల్ ప్రసాద్ మాట్లాడుతూ..'హనీమూన్ ఎక్స్ ప్రెస్ సినిమా కంటెంట్ చాలా ఇన్నోవేటివ్‌గా ఉంది. ఈతరం ప్రేక్షకులు బాగా ఇష్టపడే సినిమా. చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్' చెప్పారు.దర్శకుడు బాల రాజశేఖరుని మాట్లాడుతూ..'హనీమూన్ ఎక్స్ ప్రెస్ సినిమాకు నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వారివల్లే హనీమూన్ ఎక్స్ ప్రెస్‌ను మీ ముందుకు తీసుకొస్తున్నాం. ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ప్రసాద్ ల్యాబ్స్నే సెలెక్ట్ చేసుకున్నా. ఎందుకంటే ఇది మన తెలుగు సినిమా లెగసీని కొనసాగిస్తున్న ప్లేస్. ఈ సినిమా యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ అందరికీ నచ్చేలా రూపొందించాం. ఎన్ని కోట్ల రూపాయల సినిమా అయినా కంటెంట్ బాగుంటేనే ప్రేక్షకులు చూస్తారు. థియేటర్‌కు వెళ్లాక ఒక ప్రేక్షకుడిని మెప్పించేది కంటెంట్ మాత్రమే. మంచి రొమాంటిక్ కామెడీ మూవీగా హనీమూన్ ఎక్స్ ప్రెస్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మా సినిమాకు మీ ఆదరణ దక్కుతుందని కోరుకుంటున్నా' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, సుహాసిని, అరవింద్ కృష్ణ, అలీ, సురేఖ వాణి, రవి వర్మ కీలక పాత్రలు పోషించారు. -
ఫాదర్స్ డే స్పెషల్.. ఓటీటీలో తెలుగు మూవీ డైరెక్ట్ రిలీజ్
ఓటీటీలోకి మరో తెలుగు సినిమా నేరుగా రిలీజ్ కానుంది. ఫాదర్స్ డే కానుకగా స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించడంతో పాటు పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇందులో '30 వెడ్స్ 21' వెబ్ సిరీస్‌తో పాపులర్ అయిన చైతన్య రావు ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఏ ఓటీటీలో రిలీజ్ కానుందనేది ఇప్పుడు చూద్దాం.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. అవి ఏంటంటే?)షార్ట్ ఫిల్మ్ యాక్టర్‌గా కెరీర్ మొదలు పెట్టిన చైతన్య రావు.. ఆ తర్వాత పలు సినిమాల్లో సహాయ పాత్రలు చేశాడు. రీసెంట్ టైంలో మాత్రం హీరోగా.. షరతులు వర్తిస్తాయి, అన్నపూర్ణ స్టూడియో, పారిజాత పర్వం తదితర చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించాడు. రీసెంట్గా 'పారిజాత పర్వం' మూవీతో వచ్చాడు. ఇది ఆహా జూన్ 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది. దీనికి రెండు రోజుల గ్యాప్‌లోనే అంటే జూన్ 14 నుంచి 'డియర్ నాన్న' ఇదే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.'డియర్ నాన్న' కథ విషయానికొస్తే.. మెడికల్ షాప్ నడిపే తండ్రి (సూర్య) కొడుకుని ఫార్మసిస్ట్ చేయాలనుకుంటాడు. కానీ కొడుకు (చైతన్యరావు) చెఫ్ కావాలని కల కంటాడు. ఇలా భిన్న మనస్తత్వాల కారణంగా తండ్రికొడుకులు ఎలాంటి సంఘర్షణ ఎదుర్కొన్నారు. చివరకు ఏం తెలుసుకున్నారు అనేదే పాయింట్. మూవీ బాగుంటే ఈ వీకెండ్ 'డియర్ నాన్న' బెస్ట్ ఆప్షన్ అవుతుందేమో!(ఇదీ చదవండి: Pihu Review: ఓటీటీలోనే బెస్ట్ చైల్డ్ మూవీ.. కానీ చూస్తే భయపడతారు!) -
ఫన్నీగా, రొమాంటిక్‌గా ‘హనీమూన్ ఎక్స్ ప్రెస్’టీజర్
చైతన్య రావ్, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న సినిమా "హనీమూన్ ఎక్స్ ప్రెస్". ఈ చిత్రాన్ని న్యూ రీల్ ఇండియా బ్యానర్ పై కేకేఆర్, బాలరాజ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాని ప్రయోగాత్మకంగా ఫ్యూచరిస్టిక్ రొమాంటిక్ కామెడీ గా దర్శకుడు బాల రాజశేఖరుని రూపొందించారు. హనీమూన్ ఎక్స్ ప్రెస్ సినిమా ఈ నెల జూన్ 21న వరల్డ్ వైడ్ థియేటర్లలో రిలీజ్ అవుతుంది.ఈ నేపథ్యంలో చిత్ర టీజర్ ను అమల అక్కినేని విడుదల చేశారు. ఈ సందర్భంగా అమల అక్కినేని మాట్లాడుతూ, “యాక్టింగ్, స్క్రీన్ ప్లే రైటింగ్ లో ప్రొఫెసర్ గా బాల అమెరికాలో చాలా కాలం పనిచేశారు. అమెరికాలో ఉన్న, ఆయనకు ఏదో ఒకరోజు తెలుగు సినిమాకు దర్శకత్వం వహించాలని ఉండేది. ఆయన కల ఈ హనీమూన్ ఎక్స్‌ప్రెస్ సినిమాతో నెరవేరినందుకు సంతోషంగా ఉంది. టీచింగ్ ఒక బాధ్యత అయితే ఫిల్మ్ మేకింగ్ మరో సవాలు లాంటిది. మా అన్నపూర్ణ కాలేజ్ ఫాకల్టీలు, స్టాఫ్, స్టూడెంట్స్ ను బాల హనీమూన్ ఎక్స్ ప్రెస్ మూవీ టీమ్ లోకి తీసుకున్నందుకు సంతోషంగా ఉంది. సినిమా టీజర్ ఫన్నీగా, రొమాంటిక్ గా ఉంది. ఈ రోజు సమాజంలోని రొమాంటిక్, వివాహ బంధాలను గురించి ఒక బలమైన కథను చూపించబోతున్నట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది. ఈరోజు పరిస్థితులకు అద్దం పట్టేలా ఉండే సబ్జెక్ట్ ఇది. ఈ నెల జూన్ 21న, హనీమూన్ ఎక్స్ ప్రెస్ సినిమా రిలీజ్ అవుతుంది. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా ని ఆదరించి, విజయాన్ని అందిస్తారని కోరుకుంటున్నాను. బాల, ఆయన టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను,” అన్నారు. మంచి రొమాంటిక్ కామెడీ మూవీగా హనీమూన్ ఎక్స్ ప్రెస్ తెరకెక్కించామని, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆట్టుకుంటుందని దర్శకుడు బాల రాజశేఖరుని అన్నారు. -
హనీమూన్ ఎక్స్‌ప్రెస్: టైటిల్ సాంగ్ రిలీజ్
చైతన్య రావు, హెబ్బా పటేల్ హీరో, హీరోయిన్ గా నటించిన చిత్రం "హనీమూన్ ఎక్స్‌ప్రెస్". ఎన్ ఆర్ ఐ ఎంటర్టైన్మెంట్స్ (యు ఎస్ ఎ) సమర్పణలో న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై కె.కె.ఆర్, బాల రాజ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. తనికెళ్ల భరణి, సుహాసిని ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి బాల రాజశేఖరుని దర్శకుడు. కళ్యాణి మాలిక్ సంగీతం అందించారు.ఇప్పటికే హనీమూన్ ఎక్స్‌ప్రెస్ చిత్రం నుంచి మూడు పాటలు విడుదలై ఆకట్టుకున్నాయి. ఆదివారం నాడు ఈ చిత్రంలోని టైటిల్ ట్రాక్‌ను దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "దర్శకుడు బాల నాకు బాగా కావాల్సిన మనిషి. అమెరికాలో చాలా మందికి సినిమా గురించి శిక్షణ ఇచ్చి తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌లో డీన్ గా పనిచేశాడు.ఇప్పుడు సొంత డైరెక్షన్ లో హనీమూన్ ఎక్స్‌ప్రెస్ అనే మంచి టైటిల్ తో చిత్రాన్ని నిర్మించారు. పాప్ సింగర్ స్ఫూర్తి జితేందర్ ఈ టైటిల్ పాటను స్వరపరచి ఆలపించింది. సాంగ్ బాగుంది. మా దర్శకుడు బాలకు, సినిమాలోని నటీనటులకు అందరికి శుభాకాంక్షలు, ఈ చిత్రం మంచి విజయం సాధించాలి" అని కోరుకున్నారు. -
హనీమూన్ ఎక్స్‌ప్రెస్: 'క్యూట్‌గా స్వీట్‌గా' సాంగ్ వచ్చేసింది..
చైతన్యా రావు, హెబ్బా పటేల్ ‘క్యూట్‌గా... స్వీట్‌గా...’ అంటూ పాట పాడుకున్నారు. ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ చిత్రం కోసమే ఇలా పాడుకున్నారు. చైతన్యా రావు, హెబ్బా పటేల్ జంటగా రూపొందిన చిత్రం ఇది. ఎన్ఆర్ఐ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో బాల రాజశేఖరుని దర్శకత్వంలో కేకేఆర్, బాల రాజ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలోని ‘క్యూట్‌గా... స్వీట్‌గా...’ అంటూ సాగే పాటను హీరో అడివి శేష్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాట స్వీట్‌గా ఉంది. సినిమా హిట్టవ్వాలన్నారు. చిత్ర సంగీతదర్శకుడు కల్యాణీ మాలిక్ స్వరపరిచిన ఈ సాంగ్‌కు కిట్టూ విస్సాప్రగడ సాహిత్యం అందించగా దీపు పాడారు. ‘‘ఇదొక మంచి మ్యూజికల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ’’ అని బాల రాజశేఖరుని అన్నారు. -
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ సినిమా వచ్చేసింది. మిడిల్ క్లాస్ బ్యాక్‌డ్రాప్‌తో తీసిన చిన్న మూవీ కావడంతో పెద్దగా హడావుడి లేకుండానే మార్చిలో థియేటర్లలోకి వచ్చింది. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది కానీ జనాలకు సరిగా రీచ్ కాలేదు. ఇప్పుడు సైలెంట్‌గా ఓటీటీ ఎంట్రీ ఇచ్చేసింది. ఇంతకీ ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది?(ఇదీ చదవండి: నటుడు చందు ఆత్మహత్య.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన భార్య)చైతన్యరావు, భూమి శెట్టి జంటగా నటించిన సినిమా 'షరతులు వర్తిస్తాయి'. తెలంగాణ నేపథ్యంగా దీన్ని తెరకెక్కించారు. ప్రస్తుత సమాజంలో చైన్ సిస్టమ్ బిజినెస్ వల్ల మిడిల్ క్లాస్ వాళ్ల జీవితాలు ఎలా అతలాకుతలం అవుతున్నాయో ఇందులో చూపించారు. మార్చి 15న థియేటర్లలో రిలీజ్ కాగా, రెండు నెలల తర్వాత ఇప్పుడు ఆహా ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది. ఈ వీకెండ్ టైమ్ పాస్ చేయాలనుకుంటే దీనిపై ఓ లుక్కేయండి.కథేంటంటే?చిరంజీవి (చైతన్య రావు) తండ్రి లేని మిడిల్ క్లాస్ కుర్రాడు. ఫ్యామిలీతో కలిసి బతుకుతుంటాడు. విజయశాంతి (భూమిశెట్టి)ని ప్రేమిస్తాడు. కులాలు వేరు కావడంతో పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకుంటాడు. ఇతడు ఉండే ఏరియాలో చాలామంది చైన్ సిస్టమ్ తరహా బిజినెస్‌లో జాయిన్ అవుతుంటారు. చిరంజీవికి మాత్రం దీనిపై నమ్మకముండదు. కానీ ఇతడి భార్య ఇందులో డబ్బులు పెట్టేస్తుంది. ఇది చిరంజీవికి తెలిసేలోపు సదరు కంపెనీ బోర్డు తిప్పేస్తుంది. మరి రోడ్డున పడ్డ కుటుంబం కోసం చిరంజీవి ఏం చేశాడు? చివరకు ఏమైందనేదే స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి సుహాస్ లేటెస్ట్ హిట్ మూవీ.. మూడు వారాల్లోనే స్ట్రీమింగ్) -
Paarijatha Parvam Review: ‘పారిజాత పర్వం’ మూవీ రివ్యూ
టైటిల్: పారిజాత పర్వంనటీనటులు: సునీల్, శ్రద్ధా దాస్, చైతన్య రావు, మాళవిక సతీశన్, వైవా హర్ష, శ్రీకాంత్ అయ్యంగార్, సురేఖ వాణి, సమీర్, గుండు సుదర్శన్ , గడ్డం నవీన్, జబర్దస్త్ రోహిణి తదితరులునిర్మాతలు : మహీధర్ రెడ్డి, దేవేష్రచన, దర్శకత్వం: సంతోష్ కంభంపాటిసంగీతం: రీఎడిటర్: శశాంక్ వుప్పుటూరివిడుదల తేది: ఏప్రిల్ 19, 2024‘పారిజాత పర్వం’ కథేంటంటే?చైతన్య(చైతన్య రావు) దర్శకుడు కావాలని హైదరాబాద్ వస్తాడు. తన స్నేహితుడు(వైవా హర్ష)ని హీరోగా పెట్టి ఓ సినిమాను తెరకెక్కించాలనేది అతని కల. దాని కోసం కథతో నిర్మాతల చుట్టూ తిరుగుతాడు. కానీ కొంతమంది కథ నచ్చక రిజెక్ట్ చేస్తే.. మరికొంతమంది హీరోగా అతని స్నేహితుడిని పెట్టడం ఇష్టంలేక రిజెక్ట్ చేస్తుంటారు. చివరకు చైతన్యనే నిర్మాతగా మారి సినిమా తీయాలనుకుంటాడు. డబ్బు కోసం ప్రముఖ నిర్మాత శెట్టి(శ్రీకాంత్ అయ్యంగార్) భార్య(సురేఖ వాణి)ను కిడ్నాప్ చేయాలనుకుంటారు. మరోవైపు బారు శ్రీను -పారు(శ్రద్ధాదాస్) గ్యాంగ్ కూడా శెట్టి భార్యనే కిడ్నాప్ చేసేందుకు స్కెచ్ వేస్తారు. మరి ఈ ఇద్దరిలో శెట్టి భార్యను కిడ్నాప్ చేసిందెవరు? అసలు బారు శ్రీను ఎవరు? అతని నేపథ్యం ఏంటి? చైతన్య, బార్ శ్రీను ఎలా కలిశారు? శెట్టి భార్యను కిడ్నాప్ చేయమని బార్ శ్రీను గ్యాంగ్‌కి చెప్పిందెవరు? వాళ్ల ప్లాన్ ఏంటి? చివరకు చైతన్య సినిమా తీశాడా? లేదా? అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. ఎలా ఉందంటే.. సినిమా తీయడం ఓ కళ. ప్రేక్షకుడిని నవ్వించో, భయపెట్టో.. ఏదో ఒకటి చేసి రెండున్నర గంటల పాటు థియేటర్స్‌లో కూర్చోబెట్టడం ఆషామాషీ వ్యవహారం కాదు. సినిమాలో సమ్‌థింగ్ స్పెషల్ ఉంటేనే ప్రేక్షకుడు థియేటర్‌కి వస్తాడు. రొటీన్ కథనే మరింత రొటీన్‌గా చూపిస్తానంటే ఎందుకు వస్తాడు? ఈ విషయం తెలిసి కూడా పారిజాత పర్వం తెరకెక్కించాడు దర్శకుడు సంతోష్ కంభంపాటి.క్రైమ్ కామెడీ జోనర్లో సెఫెస్ట్ కాన్సెప్ట్ అయిన కిడ్నాప్ డ్రామానే కథగా మలుచుకొని.. రొటీన్ ట్విస్టులతో సాదాసీదాగా కథనాన్ని నడిపించాడు. ఫన్, సస్పెన్స్, థ్రిల్..వీటిల్లో ఏ ఒక్కటి కూడా ప్రేక్షకుడికి పూర్తిగా అందించలేకపోయాడు. కథ ప్రారంభం కాస్త ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చైతన్య సినిమా కష్టాలను చూపిస్తూనే బారు శ్రీను నేపథ్యాన్ని పరిచయం చేయడం కాస్త కొత్తగా అనిపిస్తుంది. అయితే ఆ తర్వాత కథ అస్సలు ముందుకు సాగదు. చెప్పిన కథనే మళ్లీ చెప్పడం..వచ్చిన సీన్లే మళ్లీ రావడంతో ఫస్టాఫ్ సాగదీతగా అనిపిస్తుంది. వైవా హర్ష పంచులతో పాటు హీరోయిన్ కారు డ్రైవింగ్ సీన్లు కాస్త నవ్విస్తాయి.అసలు కథంతా(కిడ్నాప్) సెకండాఫ్‌లోనే మొదలవుతుంది. అయితే కిడ్నాప్ కోసం రెండు టీమ్‌లు చేసే ప్లాన్ మొదలుకొని..చివరి సీన్ వరకు కథనం రొటీన్‌గా సాగుతుంది. చాలా చోట్ల లాజిక్ మిస్ అయ్యారు. కన్ఫ్యూజన్ డ్రామా సరిగా వర్కౌట్ కాలేదు. కిడ్నాప్ తర్వాత ఏం జరుగుతుందనేది ఈజీగా అర్థమైపోతుంది. పేలవమైన స్క్రీన్‌ప్లే, రొటీన్ ట్విస్టులతో కథను సాగదీశాడు. ఈ చిత్రానికి కొనసాగింపు ఉంటుందని ప్రకటించడమే ప్రేక్షకుడికి పెద్ద ట్విస్ట్.ఎవరెలా చేశారంటే.. నటన పరంగా చైతన్యకు వంక పెట్టలేం కానీ ఆయన ఎంచుకుంటున్న కథలే రొటీన్ ఉంటున్నాయి. ఇందులోనూ ఆయన రొటీన్ పాత్రే పోషించాడు. సునీల్‌కి మంచి పాత్రే లభించింది. కానీ అటు విలన్‌గాను, ఇటు కమెడియన్‌గానూ పూర్తిగా మెప్పించలేకపోయాడు. కొన్ని చోట్ల మాత్రం తనదైన కామెడీతో నవ్విస్తాడు. పార్వతిగా శ్రద్ధాదాస్ తనదైన నటనతో ఆకట్టుకుంది. తెరపై అందంగాను కనిపించింది. హీరో ఫ్రెండ్‌గా వైవా హర్ష పండించే కామెడీ బాగుంది. ఇక చైతన్య లవర్‌గా మాళవికా సతీశన్ తన పాత్ర పరిధిమేర చక్కగా నటించింది. వైవా హర్షకు, ఆమె మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, సురేఖ వాణితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సినిమాలో నటించిన ఆర్టిస్టుల నుంచి తనకు కావల్సిన నటనను దర్శకుడు సరిగా రాబట్టుకోలేకపోయాడనే చెప్పాలి. ఇక సాంకేతికంగా సినిమా పర్వాలేదు. రీ అందించిన సంగీతం పర్వాలేదు. పాటలు కాస్త డిఫరెంట్‌గా ఉన్నాయి. నేపథ్య సంగీతం జస్ట్ ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -
‘తెప్పసముద్రం’ మూవీ రివ్యూ
టైటిల్: తెప్పసముద్రంనటీనటులు: చైతన్య రావు, అర్జున్ అంబటి, కిశోరి దాత్రక్, రవిశంకర్ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సతీష్ రాపోలునిర్మాత: నీరుకంటి మంజులా రాఘవేందర్ గౌడ్నిర్మాణ సంస్థ: శ్రీమణి ఎంటర్‌టైన్‌మెంట్స్సంగీతం: : పి.ఆర్ సినిమాటోగ్రఫీ: శేఖర్ పోచంపల్లిఎడిటర్: సాయిబాబు తలారివిడుదల తేది: ఏప్రిల్ 19, 2024‘తెప్పసముద్రం’ కథేంటంటే..తెలంగాణలోని తెప్పసముద్రం అనే గ్రామంలో తరచు స్కూల్ పిల్లలు మాయం అవుతుంటారు. వారిని ఎవరు కిడ్నాప్ చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారనే విషయాన్ని ఛేదించడానికి ఎస్సై గణేష్(చైతన్య రావు) ప్రయత్నిస్తుంటాడు. క్రైమ్ మిర్రర్ రిపోర్టర్‌గా పని చేస్తున్న ఇందు(కిశోరి ధాత్రిక్) కూడా ఈ మిస్సింగ్ కేసు గురించి వివరాలు సేకరిస్తూ ఉంటుంది. ఇందుని ప్రాణంగా ప్రేమించే ఆటో డ్రైవర్ విజయ్(అర్జున్ అంబటి) కూడా తప్పిపోయిన పిల్లల కోసం వెతుకుతుంటాడు. మరోవైపు ఎస్సై గణేశ్ తండ్రి లాయర్ విశ్వనాథ్(రవిశంకర్) కూడా తన దగ్గరకు ట్యూషన్ వచ్చే పిల్లలు తప్పిపోవడంతో..ఈ మిస్సింగ్ కేసును ఛేదించడానికి తనవంతు ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో గజా చేసే గంజాయి దందా బయటపడుతుంది. ఈ కేసులో విజయ్‌తో పాటు అతని స్నేహితులను అరెస్ట్ చేస్తాడు గణేష్. ఆ సమయంలోనే పిల్లల కిడ్నాప్‌కి సంబంధించిన విషయంలో విస్తుపోయే నిజం ఒకటి తెలుస్తుంది. ఆ నిజం ఏంటి? తప్పిపోయిన పిల్లలు ఏమయ్యారు? ఎస్సై గణేష్ ఈ కేసును ఛేదించాడా లేదా? సైకో కిల్లర్‌ని చంపిందెవరు? చివరకు లాయర్ విశ్వనాథ్ తీసుకున్న కఠిన నిర్ణయం ఏంటి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలను తెరకెక్కించడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఇలాంటి సినిమాల్లో ఒక్కసారి ట్విస్ట్ తెలిస్తే.. సినిమాపై ఆసక్తి పోతుంది. అలా అని ట్విస్ట్ చెప్పకుండా ఉంటే ఎంగేజ్ చేద్దామంటే.. కథనం ఆసక్తికరంగా సాగాలి. ప్రేక్షకుడికి క్యూరియాసిటీని పెంచాలి. అద్భుతమైన స్క్రీన్‌ప్లే ఉండాలి. అలా అయితే ఆ సినిమా విజయం సాధిస్తుంది. ఈ విషయంలో తెప్ప సముద్రం కొంతవరకు సఫలం అయింది.చిన్నారులను హత్య చేసే సైకో కిల్లర్ ఎవరనేది చివరి వరకు తెలియకుండా సస్పెన్స్ కొనసాగిస్తూ ఆసక్తికరంగా కథననాన్ని నడిపించాడు దర్శకుడు. కథగా చూస్తే ఇది రొటీన్ చిత్రమే. ఓ సైకో.. చిన్నారులపై అత్యాచారానికి పాల్పడుతూ.. వారిని హత్య చేయడం, చివరకు అతన్ని కనిపెట్టి అంతమొందించడం.. సింపుల్‌గా చెప్పాలంటే తెప్పసముద్రం కథ ఇంతే. కానీ దర్శకుడు దాని చుట్టు అల్లుకున్న సన్నివేశాలు.. స్క్రీన్‌ప్లే కథపై ఆసక్తిని కలిగించేలా చేశాయి. అసలు హంతకుడు ఎవరనేది చివరివరకు కనిపెట్టలేం. ప్రతి పాత్రపై అనుమానం కలిగేలా కథనం సాగుతుంది. ఈ సినిమాలోని మెయిన్ పాయింట్ తెలంగాణాలో సంచలనం సృష్టించిన ‘హాజీపూర్ ఘటనను గుర్తు చేస్తోంది. రొటీన్ లవ్‌స్టోరీగా సినిమా ప్రారంభం అవుతుంది. తన ప్రేమ విషయాన్ని హీరోయిన్‌కి చెప్పడానికి హీరో భయపడడం.. ఆమెకు తెలియకుండానే ఆమె పేరుమీద డొనేషన్ ఇవ్వడం.. ఆ విషయం తెలిసి హీరోని హీరోయిన్ ప్రేమించం..ఫస్టాఫ్ ఇలా రొటీన్‌గా సాగుతుంది. వరుస హత్యలపై ఎస్సై గణేష్ చేసే ఇన్వెస్టిగేషన్‌ని కథపై ఆస్తకిని పెంచుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేస్దుంది. సెకండాఫ్ అంతా ట్విస్టులతో సాగుతుంది. సీరియల్ కిల్లర్ ఎవరనేది తెలిసిన తర్వాత ప్రేక్షకులు ఒకింత షాక్‌కి గురవుతారు. ఆ తర్వాత కిల్లర్ బాల్యం నుంచి హత్య వరకు ప్రతిది డిటెయిల్డ్గా చెప్పడంతో కాస్త సాగదీసినట్లుగా అనిపిస్తుంది. చివరిలో దర్శకుడు ఇచ్చిన మెసేజ్ కూడా అందరిని ఆలోచింపజేస్తుంది. ఎవరెలా చేశారంటే..ఆటోడ్రెవర్, హీరోయిన్ లవర్‌గా అర్జున్ అంబటి చక్కగా నటించాడు. డ్యాన్స్ తో పాటు ఉన్నంతలో యాక్షన్ సీన్స్ కూడా బాగానే చేశాడు. క్రైమ్ రిపోర్టర్ ఇందుగా కిశోరి దాత్రిక్ తన పాత్ర పరిధిమేర నటించి మెప్పించింది. ఎస్సై గణేశ్‌గా చైతన్య రావు అద్భుతంగా నటించాడు. చైతన్య రావు గతంలో ఈ తరహా పాత్రను పోషించలేదు. లాయర్ విశ్వనాథ్ గా రవిశంకర్‌తో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధిమేర నటించారు. పి.ఆర్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు ఆకట్టుకుంటాయి. చివర్లో వచ్చే పెంచల్ దాస్ రాసి, పాడిన "నా నల్లా కలువా పువ్వా" సాంగ్ గుండెను బరువెక్కిస్తుంది.ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి -
Theppa Samudram: కంటతడి పెట్టిస్తున్న పెంచల్ దాస్ పాట
చైతన్య రావు, అర్జున్ అంబటి హీరోలుగా, కిశోరి దాత్రక్ హీరోయిన్ గా రవిశంకర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం తెప్ప సముద్రం. సతీష్ రాపోలు దర్శకత్వంలో బేబీ వైష్ణవి సమర్పణలో శ్రీమణి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నీరుకంటి మంజులా రాఘవేందర్ గౌడ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి పి. ఆర్ సంగీత దర్శకుడు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ఏప్రిల్ 12న ప్రేక్షకుల ముందు రాబోతుంది. ఈ చిత్రం నుంచి పెంచల్ దాస్ రాసి, పాడిన "నా నల్లా కలువా పువ్వా" సాంగ్ విడుదల చేశారు మేకర్స్. కొంతమంది మృగాల చేతిలో అమ్మాయిలు ఎలా బలైపోతున్నారో వారికోసం కుటుంబం పడుతున్న బాధలు, రోదనలు ఈపాటలో మనసుని కదిలించేలా చూపించారు. సాంగ్ ఆద్యంతం చాలా ఎమోషనల్ గా సాగింది. -
Sharathulu Varthisthai: ‘షరతులు వర్తిస్తాయి’ రివ్యూ
టైటిల్ : షరతులు వర్తిస్తాయి నటీనటులు: చైతన్య రావ్, భూమి శెట్టి, నంద కిషోర్, సంతోష్ యాదవ్, దేవరాజ్ పాలమూరు, పద్మావతి, వెంకీ మంకీ, శివ కల్యాణ్, మల్లేష్ బలాస్త్, సీతా మహాలక్ష్మి, పెద్దింటి అశోక్ కుమార్, సుజాత తదితరులు నిర్మాణ సంస్థ: స్టార్ లైట్ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ దర్శకత్వం: కుమారస్వామి (అక్షర) బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ - ప్రిన్స్ హెన్రీ మ్యూజిక్ - అరుణ్ చిలువేరు, సరేష్ బొబ్బిలి (పన్నెండు గుంజల) సినిమాటోగ్రఫీ - ప్రవీణ్ వనమాలి, శేఖర్ పోచంపల్లి ఎడిటింగ్ - సీహెచ్ వంశీ కృష్ణ, గజ్జల రక్షిత్ కుమార్ విడుదల తేది: మార్చి 15, 2024 కథేంటంటే.. చిరంజీవి(చైతన్య రావు) ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు. నాన్న చనిపోవడంతో కుటుంబ బాధ్యతను తానే తీసుకుంటాడు. నీటిపారుదల శాఖలో క్లర్క్ ఉద్యోగం చేసుకుంటూ.. చెల్లి, తమ్ముడిని చదివించడానికి కష్టపడుతుంటాడు. అతని స్కూల్‌మేట్ విజయశాంతి అలియాస్ విజయ(భూమి శెట్టి)ని చిన్నప్పటి నుంచే ప్రేమిస్తాడు. విజయ కూడా అతన్ని ప్రేమిస్తుంటుంది. కష్టకాలంలో ఆర్థిక సహాయం చేసి తోడుగా నిలుస్తుంది. వీరిద్దరి ప్రేమ విషయం ఇంట్లో తెలియడంతో పెళ్లి కూడా చేస్తారు. సాఫీగా సాగిన వీరి జీవితంలోకి చైన్ సిస్టమ్ బిజినెస్ వచ్చి నాశనం చేస్తుంది. కొంత డబ్బు కట్టి మీ తరపున నలుగురిని జాయిన్ చేయిస్తే బోలెడు డబ్బు వస్తుందంటూ ఆశపెట్టి.. ఊరందిరితో డబ్బులు కట్టిస్తారు. ఆ ఏరియా లీడర్, వచ్చే ఎన్నికల్లో కార్పోరేటర్‌గా నిలబడాలనుకునే శంకరన్న భరోసా ఇవ్వడంతో చాలా మంది డబ్బులు కట్టడమే కాకుండా వారి తరపును మరో నలుగురిని జాయిన్ చేయింస్తారు. చిరంజీవికి తెలియకుండా తన భార్య, తల్లి కూడా ఈ బిజినెస్ కోసం డబ్బులు కడతారు. ఇలా పెద్ద మొత్తంలో డబ్బులు చేసిన మోసగాళ్లు..రాత్రికి రాత్రే బోర్డు తిప్పేస్తారు. అసలు ఆ భోగస్ కంపెనీ ఎవరిది? శంకరన్నని ముందు పెట్టి ఎందుకు డబ్బులు వసూలు చేశారు? తన డబ్బులు కూడా పోయాయని తెలిసిన తర్వాత చిరంజీవి ఏం చేశాడు? భర్తకు తెలియకుండా డబ్బులు ఇచ్చి మోసపోయిన విజయశాంతి చివరకు ఏం చేసింది? కార్పోరేషన్ ఎన్నికలకు ఈ మోసానికి గల సంబంధం ఏంటి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ఇదొక మధ్యతరగతి కుటుంబానికి చెందిన కథ. ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కష్టాలు ఎలా ఉంటాయి? అలాంటి వాళ్లు మోసానికి గురైతే ఎలాంటి పరిస్థితి ఎదురవుతుంది? తదితర విషయాలను కళ్లకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు కుమార్. గొలుసు కట్టు మోసం అనేది తరచూ వార్తల్లో వింటుంటాం. డబ్బు ఆశతో ఒక్కొక్కరు నలుగురిని జాయిన్ చేయించడం.. అలా పెద్ద మొత్తంలో జనాన్ని చేర్పించిన తర్వాత బోర్డు తిప్పేసి పరారైతే.. ఆ కుటుంబాల ఎలా బాధపడతాయి అనే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. అచ్చమైన తెలంగాణ పల్లెటూరి నేపథ్యంతో కథ ప్రారంభం అవుతుంది. ఫస్టాప్ చిరంజీవి, విజయ లవ్ స్టోరీ, వారి కుటుంబాల పరిస్థితి, మిడిస్ క్లాస్ ఫ్యామిలీల కష్టాల చుట్టూ తిరుగుతుంది. పెళ్లి తర్వాత అత్తాకోడళ్ల మధ్య జరిగే గొడవలు.. వాట్సాప్ స్టేటస్లు.. అటు తల్లికి ఇటు భార్యకి చిరంజీవి సర్దిచెప్పించే తీరు..ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. డబ్బు ఆశ చూపుతూ గోల్డెన్ ప్లేట్ అనే చిట్ కంపెనీ రావడం..దానికి శంకరన్న మద్దతు తెలపడంతో ఏదో జరుగుతుందనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఇంటర్వెల్ సీన్ ఎమోషనల్‌గా ఉంటూనే సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో కథనం నెమ్మదిగా సాగుతూ..ఒక పాయింట్ చుట్టే తిరుగుతుంది. ఫస్టాఫ్‌లో వర్కౌట్ అయిన ఎమోషన్.. సెకండాఫ్‌లో కాలేదు. ఎన్నికలకు సంబంధించిన ఎపిసోడ్ అంతగా ఆకట్టుకోదు. క్లైమాక్స్ రొటీన్‌గా ఉంటుంది. ఎవరెలా చేశారంటే.. మధ్యతరగతి యువకుడు చిరంజీవి పాత్రలో చైతన్య రావు ఒదిగిపోయాడు. సినిమా మొత్తాన్ని తన భుజాన వేసుకొని నడిపించాడు. మిడిల్ క్లాస్ గృహిణిగా,భూమి శెట్టి మెప్పించింది. హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. నంద కిషోర్, , వెంకీ మంకీ, శివ కల్యాణ్, మల్లేష్ బలాస్త్, సీతా మహాలక్ష్మి, పెద్దింటి అశోక్ కుమార్‌తో పాటు మిగిలిన నటీనటులంతా తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి సీన్ తెరపై చాలా నేచురల్‌గా కనిపించింది. తెలంగాణలోని పలు జలయశయాలని కూడా తెరపై చక్కగా చూపించారు. నేపథ్య సంగీతం పర్వాలేదు. పాటలు బాగున్నాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. ఎలాంటి కమర్షియల్ ఆడంబరాలకు వెళ్లకుండా చాలా సహజంగా మధ్యతరగతి మనుషుల కథను చెప్పిన దర్శకుడిని మాత్రం అభినందించాల్సిందే. -
‘షరతులు వర్తిస్తాయి’ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుక (ఫొటోలు)
-
మధ్యతరగతి షరతులు
చైతన్యా రావు, భూమి శెట్టి జంటగా నటించిన చిత్రం ‘షరతులు వర్తిస్తాయి’. కుమారస్వామి దర్శకత్వంలో నాగార్జున సామల, శ్రీష్ కుమార్ గుండా, డా. కృష్ణకాంత్ చిత్తజల్లు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుకలో హీరో చైతన్యా రావు మాట్లాడుతూ– ‘‘షరతులు వర్తిస్తాయి’ ట్రైలర్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. దిగువ మధ్య తరగతి, మధ్యతరగతి వాళ్ల జీవితాల్లో ఉండే సంతోషాలు, బాధలు, భావోద్వేగాలతో ఈ సినిమా కథనం ఉంటుంది. ఇందులో చిరంజీవి పాత్రలో నేను, విజయశాంతి పాత్రలో భూమి శెట్టి నటించాం. ప్రేక్షకులందరూ చూడాల్సిన చిత్రం ఇది’’ అన్నారు. ‘‘ఓ మంచి పాయింట్‌కు కమర్షియల్ హంగులు జోడించి ఈ సినిమా తీశాం. ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన చిత్రం’’ అన్నారు కుమారస్వామి. ‘‘ఏషియన్ ఫిలిమ్స్, సురేష్‌ప్రోడక్షన్స్ మా సినిమాను రిలీజ్ చేస్తున్నాయి. ఇప్పటికి 60 థియేటర్స్ కన్ఫార్మ్ అయ్యాయి’’ అన్నారు డా. కృష్ణకాంత్ చిత్తజల్లు. ‘‘కరీంనగర్ నేపథ్యంలో సాగే ఈ సినిమా కోసం తెలంగాణ యాస నేర్చుకున్నా’’ అన్నారు భూమి. నటుడు సంతోష్ యాదవ్ మాట్లాడారు. -
షరతులు వర్తిస్తాయి మంచి చిత్రంగా నిలవాలి
చైతన్యా రావు, భూమి శెట్టి జంటగా కుమారస్వామి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘షరతులు వర్తిస్తాయి’. నాగార్జున సామల, శ్రీష్ కుమార్ గుండా, డా. కృష్ణకాంత్ చిత్తజల్లు నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో దర్శకుడు వేణు ఊడుగుల, మామిడి హరికృష్ణ అతిథులుగా పాల్గొన్నారు. ఈ వేదికపై ముఖ్య అతిథి ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘బలగం’ కంటే ఎక్కువగా తెలంగాణ నేటివిటీ ఈ సినిమాలో ఉంది. సాంగ్, టీజర్ బాగున్నాయి. ఇదొక మంచి సినిమా కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘సహజమైన కథా కథనాలతో, కొంత సినిమాటిక్ లిబర్టీని తీసుకుని ప్రేక్షకులకు నచ్చే అంశాలతో ఈ సినిమాను తీశారు’’ అన్నారు హరికృష్ణ. ‘‘నేను కరీంనగర్ వాసిని. పరిశ్రమలో నటుడిగా ఎదిగి మళ్లీ కరీంనగర్ వెళ్లి సినిమా షూటింగ్ చేయడం ఒక అఛీవ్‌మెంట్‌లా ఫీలవుతున్నాను’’ అన్నారు చైతన్య. ‘‘సినిమాలో మంచి కంటెంట్ ఉంది’’ అన్నారు కుమారస్వామి. ‘‘సమాజంలోని ఓ సమస్య పరిష్కారానికి హీరో ఎలా ముందుకు వచ్చాడన్నదే ఈ చిత్రకథ’’ అన్నారు డా. కృష్ణకాంత్ చిత్తజల్లు. -
తెలంగాణ పల్లె గొంతులో డిఫరెంట్ పెళ్లి పాట.. మీరు విన్నారా?
చైతన్య రావు, భూమి శెట్టి జంటగా నటించిన సినిమా 'షరతులు వర్తిస్తాయి'. కుమారస్వామి(అక్షర) దర్శకుడు. స్టార్ లైట్ స్టూడియోస్ బ్యానర్‌పై నాగార్జున సామల, శ్రీష్ కుమార్, డాక్టర్ కృష్ణకాంత్ నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే 'పన్నెండు గుంజల పందిర్ల కిందా' అని సాగే పెళ్లి పాటని ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల రిలీజ్ చేశారు. తెలంగాణ పల్లెగొంతుతో ఉన్న ఈ సాంగ్, డిఫరెంట్‌గా ఉంటూ ఆకట్టుకుంటోంది. (ఇదీ చదవండి: రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్న తెలుగు స్టార్ హీరోయిన్) -
ఇది కనులు కల గన సాధ్యమా...
‘నిజమా.. ఇది కనులు కల గన సాధ్యమా..’ అంటూ ప్రేమ పాట పాడుకున్నారు చైతన్యా రావు, హెబ్బా పటేల్. ఈ ఇద్దరూ జంటగా నటించిన ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ చిత్రంలోని పాట ఇది. ఎన్ఆర్ఐ ఎంటర్టైన్మెంట్స్ (యుఎస్ఎ) సమర్పణలో న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్పై కేకేఆర్, బాలరాజ్ నిర్మించారు. బాల రాజశేఖరుని దర్శకుడు. ఈ చిత్ర సంగీతదర్శకుడు కల్యాణీ మాలిక్ స్వరపరచి, సునీతతో కలిసి పాడినన ‘నిజమా...’ పాటను దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ విడుదల చేశారు. ఈ సందర్భంగా రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ– ‘‘నిజమా..’ పాట చాలా మెలోడియస్గా ఉంది. లొకేషన్స్ బాగున్నాయి. కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ చిత్రం మంచి విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘రామ్‌గోపాల్ వర్మగారితో ‘బ్యూటీ ఆఫ్ ఫ్యాషన్, ఆట’ అనే రెండు హాలీవుడ్ చిత్రాలకు పనిచేశాను. నేను దర్శకుడు కావడానికి ‘శివ’ చిత్రం స్ఫూర్తి. త్వరలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు బాల రాజశేఖరుని. -
నా స్నేహితుడి సినిమా హిట్ అవ్వాలి: ఆర్జీవీ
చైతన్య రావు, హెబ్బా పటేల్ జంటగా నటించిన చిత్రం "హనీమూన్ ఎక్స్‌ప్రెస్". ఈ చిత్రానికి బాల రాజశేఖరుని దర్శకత్వం వహిస్తున్నారు. న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై కేకేఆర్, బాలరాజ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఫుల్ రొమాంటిక్ కామెడీగా తెరకెక్కించనున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్. టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ చేతుల మీదుగా 'నిజమా' అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. అనంతరం రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. 'నా స్నేహితుడు బాల దర్శకత్వం వహించిన హనీమూన్ ఎక్స్‌ప్రెస్ చిత్రంలోని 'నిజమా' పాటను ఇప్పుడే చూశా. పాటను చాలా బాగా చిత్రీకరించారు. నేను విడుదల చేయడం ఇంకా సంతోషంగా ఉంది. కొత్త కాన్సెప్ట్‌తో వస్తోన్న ఈ చిత్రం మంచి విజయం సాధించాలి" అని అన్నారు. దర్శకుడు బాల రాజశేఖరుని మాట్లాడుతూ.. "రామ్ గోపాల్ వర్మతో బ్యూటీ ఆఫ్ ప్యాషన్, ఆట అనే రెండు చిత్రాలకు పని చేశా. ఆయన చిత్రాలు మా లాంటి దర్శకులకు మంచి స్ఫూర్తి. శివ చిత్రం నాకు దర్శకుడు అవటానికి మంచి స్ఫూర్తినిచ్చింది. ఈరోజు హనీమూన్ ఎక్స్‌ప్రెస్ చిత్రంతో దర్శకుడిగా ఆయన పక్కన ఉన్నా. హనీమూన్ ఎక్స్‌ప్రెస్ చిత్రం మంచి రొమాంటిక్ కామెడీ చిత్రం. రామ్ గోపాల్ వర్మ మా చిత్రంలోని మొదటి పాట లిరికల్ వీడియోని విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేస్తాం" అని తెలిపారు. కాగా.. ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, సుహాసిని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కళ్యాణి మాలిక్ సంగీతం అందిస్తున్నారు. -
కామెడీ ఎక్స్‌ప్రెస్
చైతన్యారావు, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’. ఎన్ఆర్ఐ ఎంటర్టైన్మెంట్స్, న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై బాల రాజశేఖరుని దర్శకత్వంలో కేకేఆర్, బాల రాజ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను హీరో నాగార్జున విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘వినోదాత్మకంగా సందేశంతో కూడిన ఈ చిత్రం విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘లాస్ ఏంజెల్స్‌లో ఉంటూ ఎన్నో హాలీవుడ్ చిత్రాలకు పని చేశాను. కానీ తెలుగు సినిమా చేయాలనేది నా కల. నాగార్జున, అమలగార్ల ్రపోత్సాహంతో టాలీవుడ్లో అరంగేట్రం చేశాను. మా సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేసిన నాగార్జునగారికి ధన్యవాదాలు’’ అన్నారు బాల రాజశేఖరుని. తనికెళ్ల భరణి, సుహాసిని కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: కళ్యాణీ మాలిక్, నేపథ్యసంగీతం: ఆర్పీ పట్నాయక్. -
కిడ్నాప్ చేయడం ఓ కళ
చైతన్యా రావు, సునీల్, శ్రద్ధా దాస్, మాళవికా సతీశన్ ముఖ్య తారలుగా రూపొందుతున్న చిత్రం ‘పారిజాత పర్వం’. కిడ్నాప్ ఈజ్ ఏన్ ఆర్ట్ అనేది ట్యాగ్ లైన్ (కిడ్నాప్ చేయడం అనేది ఓ కళ). సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో మహిధర్ రెడ్డి, దేవేష్ నిర్మిస్తున్న ఈ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదలయ్యాయి. ఒక పోస్టర్లో చైతన్యా రావు, సునీల్, శ్రద్ధా దాస్, శ్రీకాంత్ అయ్యంగార్లు చేతిలో గన్‌తో, ఇతర పాత్రలు ఆశ్చర్యంగా చూస్తున్నట్లు కనిపించారు. ఇంకో పోస్టర్లో శ్రద్ధా దాస్ చేతిలో గన్‌తో స్టయిలిష్‌గా కనిపించారు. -
‘కీడా కోలా’ మూవీ రివ్యూ
టైటిల్: కీడా కోలా నటీనటులు: చైతన్య మందాడి, రాగ్ మయూర్, బ్రహ్మానందం, జీవన్ కుమార్, తరుణ్ భాస్కర్, విష్ణు, రవీంద్ర విజయ్ తదితరులు నిర్మాతలు: కె.వివేక్ సుదాంశు, సాయి కృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్ నండూరి, శ్రీపాద నందరాజ్, ఉపేంద్ర వర్మ సమర్పణ: రానా దగ్గబాటి దర్శకత్వం: తరుణ్ భాస్కర్ సంగీతం: వివేక్ సాగర్ సినిమాటోగ్రఫీ: ఏజే అరోన్ ఎడిటింగ్ : ఉపేంద్ర వర్మ విడుదల తేది: నవంబర్ 3, 2023 కథేంటంటే.. వాస్తు(చైతన్య రావు)కి నత్తి ఉంటుంది. చిన్నప్పుడే పెరెంట్స్ చనిపోవడంతో తాత వరదరాజు(బ్రహ్మానందం)తో కలిసి ఉంటాడు. వాస్తు స్నేహితుడు కౌశిక్ అలియాస్ లంచం(రాగ్ మయూర్)ఓ లాయర్. ఈ ముగ్గురికి డబ్బు చాలా అవసరం. డబ్బు సంపాదించడం కోసం ప్లాన్ చేస్తున్న క్రమంలో కీడాకోలా(శీతల పానీయం)బాటిల్లో బొద్దింక కనిపిస్తుంది. వెంటనే లాయర్ కౌశిక్‌కి ఓ ఆలోచన వస్తుంది. ఈ బొద్దింకను చూపించి కీడా కోలా కంపెనీ యజమాని నుంచి డబ్బులు డిమాండ్ చేయాలని ప్లాన్ వేస్తాడు. యజమానికి ఫోన్ చేసి రూ. 5 కోట్లు డిమాండ్ చేస్తాడు. మరోవైపు వీధి రౌడీ జీవన్(జీవన్ కుమార్) తనకు జరిగిన అవమానంతో.. ఎలాగైన కార్పోరేటర్ కావాలనుకుంటారు. 20 ఏళ్ల తర్వాత జైలు నుంచి విడుదలైన తన అన్న నాయుడు(తరుణ్ భాస్కర్)తో తన కోరిక ఏంటో చెబుతాడు.దాని కోసం రూ. కోటి వరకు ఖర్చు అవుతుందని భావించి.. డబ్బు కోసం ఓ కుట్ర పన్నుతారు. ఆ కుట్ర ఏంటి? వాస్తు గ్యాంగ్, నాయుడు గ్యాంగ్ ఎలా కలిశాయి? కీడాకోలాలో బొద్దింక ఎలా పడింది? ఈ రెండు గ్యాంగులతో ఆ కంపెనీ యజమాని(రవీంద్ర విజయ్) కుదుర్చుకున్న ఒప్పందం ఏంటి? చివరకు చేసిందేంటి? తదితర విషయాలు తెలియాలంటే థియేటర్స్‌లో ‘కీడా కోలా’ చూడాల్సిందే. ఎలా ఉందంటే.. తరుణ్ భాస్కర్ గత సినిమాలు(పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది) చూస్తే.. వాస్తవికతకు దగ్గరగా అనిపిస్తాయి. అలాంటి పాత్రల్ని, కొన్ని సన్నివేశాలను నిజ జీవితంలో ఎక్కడో చూసిన ఫీలింగ్ కలుగుతుంది. కానీ వాటికి పూర్తి భిన్నంగా తెరకెక్కించిన చిత్రం కీడా కోలా. లాజిక్స్‌ని పక్కకి పెట్టి కేవలం నవ్వించడమే టార్గెట్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు. ఇదొక రోటీన్ క్రైమ్ కామెడీ చిత్రం. కానీ తరుణ్ కథను నడిపించిన తీరు, మాటలు, పాత్రలకు పెట్టిన మాడ్యులేషన్ కారణంగా డిఫరెంట్‌గా అనిపిస్తుంది. కథ పెద్దగా ఉండదు కానీ..నవ్వించే సీన్లకు కొదవ ఉండదు. వాస్తు, లంచం పాత్రలని పరిచయం చేస్తూ కోర్టు సన్నివేశంతో కథను ప్రారంభించాడు దర్శకుడు. ఆ తర్వాత వెంటనే జీవన్ గ్యాంగ్‌ని పరిచయం చేసి.. ఈ రెండు గ్యాంగుల పరిస్థితి ఏంటి? ఎలా వ్యవహరిస్తారనే క్లారిటీని మొదట్లోనే ఇచ్చాడు. ఆ ఏరియా కార్పోరేటర్ జీవన్ పోస్టర్ని డిజైన్ చేసిన సీన్‌తో నవ్వులు ప్రారంభం అవుతాయి. నాయుడి పాత్ర ఎంట్రీ తర్వాత కథలో వేగం పెరుగుతుంది. శ్వాసమీద ధ్యాస, రోజుకు గంట ఇంగ్లీష్ అంటూ నాయుడు పాత్ర పండించే కామెడీ థియేటర్స్‌లో నవ్వులు పూయిస్తాయి. అసలు కథను పక్కకి పెట్టి సరదా సన్నివేశాలతో ఫస్టాఫ్‌ని ముగించేశాడు. ఇక సెకండాఫ్‌లో కథనం ఊహకు తగ్గట్టుగానే సాగుతుంది. అయితే పార్ట్ పార్టులుగా వచ్చే సీన్లు నవ్విస్తాయి. కీడా కోలా యాడ్‌లో నటిస్తూ హీరోగా గెటప్ శ్రీను చేసే కామెడీ ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత కథ లాగినట్లు అనిపిస్తుంది. రెండు గ్యాంగ్‌ల మధ్య వచ్చే ‘ సరెండర్ ’ సీన్ కడుపుబ్బా నవ్విస్తుంది. షూటర్స్ లోపాలు, బొమ్మతో నాయుడు ప్రేమాయణం.. ఇవన్నీ ఆకట్టుకున్నా.. చెప్పుకోదగ్గ కథ లేదనే వెలితిమాత్రం ఉంటుంది. ఎవరెలా చేశారంటే.. తరుణ్ భాస్కర్లో మంచి నటుడు ఉన్నాడు. గతంలో పలు చిత్రాల్లోనూ ఈ విషయాన్ని నిరూపించుకున్నాడు. ఇక ఇందులో ఓ డిఫరెంట్ రోల్ ప్లే చేశాడు. నాయుడు పాత్రలో ఆయన పండించిన కామెడీ సినిమాకు ప్లస్ అయింది. పైకి నవ్విస్తూనే..అంతర్లీనంగా మంచి సందేశం ఇచ్చే పాత్ర తనది. వాస్తు పాత్ర కోసం చైతన్య రావు పడిన కష్టం తెరపై కనిపించింది. లాయర్ లంచం పాత్రకి రాగ్ మయూర్ న్యాయం చేశాడు. ‘మ్యాడ్’ఫేమ్ విష్ణు తనదైన కామెడీతో నవ్వించాడు. తాతగా బ్రహ్మానందం పాత్ర వీల్ ఛైర్‌కే పరిమితం అయినా.. సందర్భానుసారం నవ్విస్తుంది. జీవన్ కుమార్, రవీంద్ర విజయ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. ఇక తరుణ్ గత సినిమాల మాదిరే కీడా కోలా కూడా సాంకేతిక పరంగా ఉన్నతంగా ఉంది. ఏజే అరోన్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. వివేక్ సాగర్ నేపథ్య సంగీతం సినిమాకు చాలా ప్లస్ అయింది. పాటలు కథలో భాగంగా అలా వచ్చిపోతాయి. తరుణ్ భాస్కర్ డైలాగ్స్ నవ్వులు పూయిస్తాయి. బూతులు వాడాల్సిన చోట పాటలు వినిపించి.. సెన్సార్ వాళ్లకు పని తగ్గించాడు. ఎడిటర్ పనితనం బాగుంది. సినిమా నిడివి(రెండు గంటలు)తక్కువగా ఉండడం సినిమాకు కలిసొచ్చింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘వాస్తు’ కోసం బాగా ప్రాక్టీస్ చేశా! : చైతన్యా రావు
చైతన్యా రావు, బ్రహ్మానందం, రాగ్ మయూర్, తరుణ్ భాస్కర్, విష్ణు, జీవన్, రవీంద్ర విజయ్, రఘురామ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కీడా కోలా’. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రానా సమర్పణలో కె. వివేక్ సుధాంశు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీపాద్ నిర్మించిన ఈ చిత్రం నవంబరు 3న రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో ఓ కీల్ రోల్ చేసిన చైతన్యా రావు మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో టూరెట్ సిండ్రోమ్ (నత్తిగా మాట్లాడటం, మాట్లాడుతున్నప్పడు మధ్యలో ఆగడం)తో ఇబ్బందిపడే వాస్తు పాత్ర చేశాను. మనకు ఓ సమస్య ఉన్నప్పటికీ, అందరిలానే మాములు జీవితం గడపొచ్చనేది నా పాత్రలో ఉన్న సందేశం. యూ ట్యూబ్ వీడియోలు, హాలీవుడ్ సినిమాలు చూసి వాస్తు పాత్రకు ప్రాక్టీస్ చేసుకుని ఆడిషన్‌కు వెళ్లాను’’ అని అన్నారు. -
'షరతులు వర్తిస్తాయి' లాంటి సినిమాలను ఆదరించాలి: త్రివిక్రమ్
చైతన్య రావు, భూమి శెట్టి జంటగా నటించిన చిత్రం 'షరతులు వర్తిస్తాయి'. కుమార స్వామి ( అక్షర ) దర్శకత్వం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్టార్ లైట్ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున్ సామల,శ్రీష్ కుమార్ గుండా,డా. కృష్ణకాంత్ చిత్తజల్లు నిర్మించారు. ఈ మూవీ ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్ని ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్ మాట్లాడుతూ...మనుషులు ఉన్నంత కాలం కుటుంబాలు ఉంటాయని.. కుటుంబాలు ఉన్నంతకాలం సమస్యలు ఉంటాయని.. అందుకే చాలా కుటుంబాలు కొన్ని షరతుల మధ్యన జీవిస్తూ ఆనందంగా ఉంటున్నాయి తెలిపారు. కుటుంబ విలువలను తెలియజేసే ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు థియేటర్లలో చూసి ప్రోత్సహించాలని కోరారు. మంచి కథతో ముందుకు వచ్చిన దర్శకుడు కుమార స్వామి (అక్షర) అలాగే చిత్ర యూనిట్ సభ్యులను అభినందించారు. ప్రస్తుతం మధ్య తరగతి కుటుంబాలలో ఉంటున్న సమస్యను దర్శకుడు కళ్ళకు కట్టినట్టు చిత్రీకరించారు’అని అన్నారు తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ. ఒక మంచి ఉద్దేశంతో ఈ సినిమా తీశాం. ప్రేక్షకులను కచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నాం’అని దర్శకుడు కుమార స్వామి అన్నారు.