ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ సినిమా వచ్చేసింది. మిడిల్ క్లాస్ బ్యాక్‌డ్రాప్‌తో తీసిన చిన్న మూవీ కావడంతో పెద్దగా హడావుడి లేకుండానే మార్చిలో థియేటర్లలోకి వచ్చింది. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది కానీ జనాలకు సరిగా రీచ్ కాలేదు. ఇప్పుడు సైలెంట్‌గా ఓటీటీ ఎంట్రీ ఇచ్చేసింది. ఇంతకీ ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది?
(ఇదీ చదవండి: నటుడు చందు ఆత్మహత్య.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన భార్య)
చైతన్యరావు, భూమి శెట్టి జంటగా నటించిన సినిమా 'షరతులు వర్తిస్తాయి'. తెలంగాణ నేపథ్యంగా దీన్ని తెరకెక్కించారు. ప్రస్తుత సమాజంలో చైన్ సిస్టమ్ బిజినెస్ వల్ల మిడిల్ క్లాస్ వాళ్ల జీవితాలు ఎలా అతలాకుతలం అవుతున్నాయో ఇందులో చూపించారు. మార్చి 15న థియేటర్లలో రిలీజ్ కాగా, రెండు నెలల తర్వాత ఇప్పుడు ఆహా ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది. ఈ వీకెండ్ టైమ్ పాస్ చేయాలనుకుంటే దీనిపై ఓ లుక్కేయండి.
కథేంటంటే?
చిరంజీవి (చైతన్య రావు) తండ్రి లేని మిడిల్ క్లాస్ కుర్రాడు. ఫ్యామిలీతో కలిసి బతుకుతుంటాడు. విజయశాంతి (భూమిశెట్టి)ని ప్రేమిస్తాడు. కులాలు వేరు కావడంతో పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకుంటాడు. ఇతడు ఉండే ఏరియాలో చాలామంది చైన్ సిస్టమ్ తరహా బిజినెస్‌లో జాయిన్ అవుతుంటారు. చిరంజీవికి మాత్రం దీనిపై నమ్మకముండదు. కానీ ఇతడి భార్య ఇందులో డబ్బులు పెట్టేస్తుంది. ఇది చిరంజీవికి తెలిసేలోపు సదరు కంపెనీ బోర్డు తిప్పేస్తుంది. మరి రోడ్డున పడ్డ కుటుంబం కోసం చిరంజీవి ఏం చేశాడు? చివరకు ఏమైందనేదే స్టోరీ.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి సుహాస్ లేటెస్ట్ హిట్ మూవీ.. మూడు వారాల్లోనే స్ట్రీమింగ్)
Comments
Please login to add a commentAdd a comment