షరతులు వర్తిస్తాయి మంచి చిత్రంగా నిలవాలి  | Sharathulu Varthistayi Movie Teaser Launch | Sakshi
Sakshi News home page

షరతులు వర్తిస్తాయి మంచి చిత్రంగా నిలవాలి 

Published Sun, Feb 4 2024 12:49 AM | Last Updated on Sun, Feb 4 2024 12:49 AM

Sharathulu Varthistayi Movie Teaser Launch - Sakshi

భూమి శెట్టి, చైతన్యా రావు, ‘దిల్‌’ రాజు

చైతన్యా రావు, భూమి శెట్టి జంటగా కుమారస్వామి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘షరతులు వర్తిస్తాయి’. నాగార్జున సామల, శ్రీష్‌ కుమార్‌ గుండా, డా. కృష్ణకాంత్‌ చిత్తజల్లు నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఈ సినిమా టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో దర్శకుడు వేణు ఊడుగుల, మామిడి హరికృష్ణ అతిథులుగా పాల్గొన్నారు. ఈ వేదికపై ముఖ్య అతిథి ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ– ‘‘బలగం’ కంటే ఎక్కువగా తెలంగాణ నేటివిటీ ఈ సినిమాలో ఉంది.

సాంగ్, టీజర్‌ బాగున్నాయి. ఇదొక మంచి సినిమా కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘సహజమైన కథా కథనాలతో, కొంత సినిమాటిక్‌ లిబర్టీని తీసుకుని ప్రేక్షకులకు నచ్చే అంశాలతో ఈ సినిమాను తీశారు’’ అన్నారు హరికృష్ణ. ‘‘నేను కరీంనగర్‌ వాసిని. పరిశ్రమలో నటుడిగా ఎదిగి మళ్లీ కరీంనగర్‌ వెళ్లి సినిమా షూటింగ్‌ చేయడం ఒక అఛీవ్‌మెంట్‌లా ఫీలవుతున్నాను’’ అన్నారు చైతన్య. ‘‘సినిమాలో మంచి కంటెంట్‌ ఉంది’’ అన్నారు కుమారస్వామి. ‘‘సమాజంలోని ఓ సమస్య పరిష్కారానికి హీరో ఎలా ముందుకు వచ్చాడన్నదే ఈ చిత్రకథ’’ అన్నారు డా. కృష్ణకాంత్‌ చిత్తజల్లు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement